Ayush Sharma
-
ఓటీటీకి వచ్చేస్తోన్న జగపతిబాబు మూవీ.. ఎక్కడ చూడాలంటే?
జగపతి బాబు, ఆయుష్ శర్మ, సుశ్రీ మిశ్రా కీలక పాత్రల్లో నటించిన చిత్రం రుస్లాన్. ఈ సినిమాకు కరణ్ దర్శకత్వం వహించారు. ఫుల్ యాక్షన్ చిత్రంగా రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. అయితే ఆశించిన స్థాయిలో ప్రేక్షుకలను మెప్పించలేకపోయింది. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరెకెక్కించిన ఈ చిత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. కేవలం రూ.2.70 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది.తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలైన ఐదు నెలల తర్వాత ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ విషయాన్ని కలర్స్ సినీప్లెక్స్, జియో సినిమా వెల్లడించాయి. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశాయి. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతి బాబు పోలీసుపాత్రలో కనిపించారు. Cinemalloki vachi undakapothe, kachitanga Super Cop ayyevadni… Ipudunna Super Coplu lagaa law & order ni gadagadaladinchevadni… em antaaru?#Ruslaan on April 26th 2024. pic.twitter.com/MORfsfu3D2— Jaggu Bhai (@IamJagguBhai) March 17, 2024 Witness the LION in his hunting mode! 🦁 21st September raat 8 baje dekhiye #Ruslaan ka World Premiere, sirf Colors Cineplex aur @JioCinema Par.#RuslaanOnColorsCineplex #RuslaanOnJioCinema #WorldPremiere #ColorsCineplex #JioCinema pic.twitter.com/OxsBZzIv66— Colors Cineplex (@Colors_Cineplex) September 17, 2024 -
పైసా సంపాదన లేదు.. అయినా సల్మాన్ చెల్లితో పెళ్లి చేశారు!
బాలీవుడ్‌లోని బడా కోటీశ్వరుల్లో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. ఎప్పుడూ సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడే ఇతడికి వేలకోట్ల ఆస్తులున్నాయి. కానీ అతడి చెల్లి అర్పితఖాన్కు పెళ్లి చేసేటప్పుడు మాత్రం బావ సంపాదిస్తున్నాడా? లేదా? అని కూడా చూసుకోలేదు. చెల్లిని గుండెలో పెట్టి చూసుకుంటే చాలనుకున్నాడు. అలా లవ్ బర్డ్స్ అర్పిత ఖాన్, ఆయుశ్ శర్మ పెద్దలను ఒప్పించి 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారు. అమ్మాయిని ఎలా పోషిస్తావు? అయితే అర్పితను పెళ్లాడే సమయానికి ఆయుశ్ ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నాడట! ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'నేను అర్పితను ప్రేమిస్తున్నానని చెప్పగానే అమ్మానాన్న షాకయ్యారు. నువ్వు ఏ పనీ చేయడం లేదు.. పైసా సంపాదించట్లేదు.. పెళ్లికి మాత్రం సిద్ధమయ్యావు. పైగా ఆమె ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి. మరి పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయిని ఎలా పోషిస్తావు? అని అడిగారు. నేనేం పోషించను.. అంతా మీరే చూసుకోవాలని చెప్పాను. అమ్మ తెగ కంగారు ప్రేమలో పడింది నువ్వు, పెళ్లి చేసుకునేది నువ్వు.. కానీ మీ బిల్లులు మాత్రం నేను కట్టాలా? అని నాన్న చిన్నగా కోప్పడ్డాడు. తర్వాత ఆయన రిలాక్స్ అయ్యాడు కానీ అమ్మ మాత్రం తెగ కంగారుపడిపోయింది. ఎందుకంటే నాదేమో పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ (కాంగ్రెస్ కీలక నేత పండిత్ సుఖ్ రామ్ మనవడే ఆయుశ్).. తనదేమో సినిమా బ్యాక్‌గ్రౌండ్. ఎలాగోలా వారిని ఒప్పించి సల్మాన్ ఖాన్ ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేశాను. కంగారు పడొద్దని సల్మాన్ భరోసా అప్పుడు నాన్న.. 'మేమంతా హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో నివసిస్తాం.. ఒకవేళ తప్పని పరిస్థితులు ఎదురైతే నువ్వు అక్కడికి రాగలవా?' అని అర్పితను అడిగాడు.. అందుకు సల్మాన్.. ఆయుశ్ ఎక్కడంటే అర్పిత అక్కడే ఉంటుంది. ఈ విషయంలో మీరేం కంగారుపడకండి అని భరోసా ఇచ్చాడు' అని తెలిపాడు. ఆయుశ్-అర్పిత జంటకు అయత్ అనే కూతురు, అఖిల్ శర్మ అనే కుమారుడు సంతానం. చదవండి: ఎంతగానో ప్రేమిస్తే.. నన్ను మోసం చేశాడు.. ప్రతిరోజూ ఏడుపే! -
ప్రగ్యా జైస్వాల్‌కు భలే ఛాన్స్
‘కంచె’ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ భలే లక్కీ చాన్స్ కొట్టేశారు. హిందీ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్గా నటించే అవకాశాన్ని పొందారు ప్రగ్యా. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘అంతిమ్’. ఇందులో సల్మాన్ బావమరిది ఆయుష్ శర్మ విలన్‌గా నటిస్తున్నారు. సల్మాన్‌కి జోడీగా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. ఆల్రెడీ చిత్రీకరణ కూడా ప్రారంభించారామె. ఈ సినిమాతో పాటు బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలోనూ హీరోయిన్గా చేస్తున్నారు ప్రగ్యా. రెండు పెద్ద ప్రాజెక్ట్స్‌తో ఈ ఏడాదిని సూపర్‌గా ఆరంభించారు ప్రగ్యా జైస్వాల్. చదవండి: రాజమౌళి-మహేష్ మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా! -
ఆఖరిది ఆరంభం
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మంచి జోరు మీదున్నారు. కరోనా లాక్డౌన్ వల్ల కొన్ని నెలల పాటు షూటింగ్‌కి దూరంగా ఉన్న సల్మాన్ ఇప్పుడు స్పీడు పెంచారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ‘రాధే’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసిన ఆయన వెంటనే ‘అంతిమ్’ (ఆఖరిది) సినిమా షూట్లో జాయిన్ అయిపోయారు. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ సిక్కు పోలీసాధికారిగా నటిస్తున్నారు. ఈ సినిమాలోని సల్మాన్ ఖాన్ లుక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ‘అంతిమ్’ సెట్స్‌లో తీసిన ఒక వీడియోను సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ భర్త ఆయుష్ శర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సిక్కుల తలపాగా ధరించి, ఫార్మల్ డ్రెస్‌లో కూరగాయల మార్కెట్ సెట్లో నడుస్తున్న కండల వీరుడి లుక్ అదుర్స్ అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
‘అంతిమ్’ ఫస్ట్‌లుక్.. సరికొత్త గెటప్‌లో సల్మాన్
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తదుపరి చిత్రం ‘అంతిమ్’. ఈ సినిమాలోని సల్మాన్ ఖాన్ ఫస్ట్‌లుక్‌ను ఆయన బావ ఆయుష్ శర్మ(అర్పిత ఖాన్ శర్మ భర్త) గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. షూటింగ్ సెట్స్‌లోని ఓ సన్నివేశాన్ని ఆయుష్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘అంతిమ్ ప్రారంభమైంది.. భాయ్స్ అంతిమ్ ఫస్ట్‌లుక్’ అనే హ్యాష్ ట్యాగ్‌ను జత చేశాడు. అయితే ఈ సినిమాలో ఆయుష్ శర్మ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సల్మాన్ సిక్కు పోలీసు ఆఫీసర్‌గా సరికొత్త గెటప్‌తో ప్రేక్షకులను ఆలరించానున్నాడు. ఈ వీడియోలో భాయిజాన్ సిక్కుగా తనదైన స్టైల్లో నడుస్తు కనిపించాడు. (చదవండి: ప్లేట్లు నేలకేసి కొట్టిన హీరో సోదరి!) నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ‘అంతిమ్’ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మరాఠి క్రైం ముల్షీ ప్యాట్రన్ అడాప్షన్ నేపథ్యంలో సాగనుంది. కాగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ‘రాధే’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది రంజాన్‌కు విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. లాక్డౌన్ ఎత్తివేయడంతో ఇటీవల షూటింగ్ సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. దక్షిణ కోరియా వెటరన్ రిమేక్‌లో తెరకెక్కుతున్న ‘రాధే’లో సల్మాన్‌కు జోడిగా హీరోయిన్ దిశ పటానీ నటిస్తున్నారు. అంతేగాక రణ్‌దీప్ హుడా, జాకీర్ శ్రఫ్లు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. (చదవండి: రాహుల్ లేకపోతే బిగ్‌బాస్ చూడం!) -
మేనకోడలిపై ముద్దులు కురిపించిన సల్మాన్..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు పిల్లలంటే ఎంతో ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్యూలో పిల్లలు కావాలి.. కానీ భార్య వద్దూ అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. కాగా పిల్లలపై భాయిజాన్‌కు ఉన్న ప్రేమను చూసి ఆయన చెల్లెలు అర్పితా ఖాన్ అన్నయ్య కోసం తన కూతురు(అయాత్)ను దత్తత ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం అన్నయ్య పుట్టిన రోజు నాడే అయాత్కు జన్మనివ్వాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే సల్మాన్ బర్త్ డే(డిసెంబర్ 27)న ఆడబిడ్డకు జన్మనిచ్చి బహుమతిగా ఇచ్చారు ఆర్పితా దంపతులు. (బావకు బహుమతి ఇవ్వాలనే ఇలా...) స్టార్ అంబాసిడర్, స్మార్ట్‌ఫోన్ గెల్చుకునే చాన్స్ View this post on Instagram We love you Mamu @beingsalmankhan A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on Mar 7, 2020 at 3:06am PST తాజాగా కోడలు అయాత్పై భాయిజాన్ ముద్దుల వర్షం కురిపిస్తూ.. చిన్నారితో ఆడుకుంటున్న వీడిమోను ఆర్పితా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సల్మాన్ తన ముద్దుల కోడలికి పదే పదే ముద్దులు పెడుతూ.. తనతో ఆడుకుంటున్న ఈ వీడియోకు అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు. ‘వావ్.. అయాత్ ఎంత ముద్దుగా ఉంది’, ‘మామకు కోడలంటే ఎంత ఇష్టమో’ అంటూ నెటిజన్లు హార్ట్ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. కాగా భాయాజాన్కు కూడా చెల్లలు అర్పితా అంటే కూడా చాలా ఇష్టం. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మనవడు ఆయుష్ శర్మతో ఆర్పితా వివాహం 2014లో జరిగింది. చెల్లెలి పెళ్లిని సల్మాన్ హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిపించాడు. ఇక అర్పిత సల్మాన్ సొంత చెల్లెలు కాదన్న సంగతి తెలిసిందే. సల్మాన్ తల్లిదండ్రులు ఆమెను దత్తత తీసుకున్నారు. -
బావకు బహుమతి ఇవ్వాలనే ఇలా...
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లెలు అర్పితా-అయుష్ దంపతులు డిసెంబర్ 27న రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే భాయిజాన్ పుట్టిన రోజునే ఈ దంపతులకు కూతురు జన్మించడం విశేషం. దీంతో కుటుంబ సభ్యులంతా సంతోషంతో ఉబ్బితబ్బిబైపోతున్నారు. ఈ విషయం గురించి సల్మాన్ బావ(అర్పిత భర్త) అయుష్ శర్మ చెబుతూ.. ‘సల్మాన్ బర్త్ డే రోజే నా కూతురు అయాత్ను భూమి మీదకు తీసుకురావాలనుకున్నాను. ఇది పూర్తిగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఆయన పుట్టిన రోజు కానుకగా నా కూతురు అయాత్ను బహుమతిగా ఇవ్వడం సంతోషంగా ఉంది’ అని చెప్పాడు. ‘అర్పిత డిసెంబర్ చివరి వారంలో కానీ జనవరి మొదటి వారంలో కానీ డెలివరి కానున్నట్లు డాక్టర్లు చెప్పారు. ఈ విషయం చెప్పగానే సల్మాన్ భాయ్ ఎంతో సంబరపడి తనకు ఆ బిడ్డను బహుమతిగా ఇవ్వమని కోరాడు. ఇక అప్పుడే మేము గట్టిగా నిర్ణయించుకున్నాం. సల్మాన్ బర్త్ డే నాడే అర్పితకు డెలివరి చేయాలని డాక్టర్లను కోరాను’ అని తెలిపాడు. ఇక తన బర్త్‌డే రోజునే మేనకోడలు కూడా పుట్టిన సందర్భంగా సల్మాన్ ఖాన్.. ‘ఈ అందమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్న నా మేనకోడలు అయాత్కు స్వాగతం. నా పుట్టిన రోజు కానుకగా కుటుంబమంతటికీ అందమైన బహుమతిని ఇస్తున్న అర్పిత, అయుష్లకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా అర్పితా ఖాన్ వివాహం 2014లో ఆయుష్ శర్మతో హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి సందర్భంగా దాదాపు రూ.16 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను సల్మాన్ చెల్లెలికి బహుమతిగా ఇచ్చాడు. ఇక అర్పిత సల్మాన్ సొంత చెల్లెలు కాదన్న సంగతి తెలిసిందే. సల్మాన్ తల్లిదండ్రులు ఆమెను దత్తత తీసుకున్నారు. View this post on Instagram Welcome to this beautiful world Ayat. You’ve brought a lot of happiness into our lives. May you touch everyone’s life with a lot of love and joy A post shared by Aayush Sharma (@aaysharma) on Dec 29, 2019 at 11:27pm PST -
సల్మాన్ బావ... కత్రినా చెల్లి!
ఇండియా–మయన్మార్ బోర్డర్ పరిసర ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు సల్మాన్‌ఖాన్ బావ ఆయుష్ శర్మ. ఆయుష్కు తోడుగా కత్రినా కైఫ్ చెల్లెలు ఇసాబెల్లా కైఫ్ కూడా వెళ్లనున్నారు. ఓ సినిమా కోసం ఇద్దరూ ఇలా తోడయ్యారు. ఈ చిత్రానికి కరణ్ భూతాని దర్శకత్వం వహిస్తారు. ‘‘కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాం. ఇందులో నేను ఆర్మీ ఆఫీసర్‌గా నటించబోతున్నాను. ఈ పాత్ర కోసం ఫిజికల్‌గా బాగా కష్టపడుతున్నాను. ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు ఆయుష్ శర్మ. ఈ సంగతి ఇలా ఉంచితే.. బాలీవుడ్లో ఇసాబెల్లాకు ఇది రెండో చిత్రం. ఇంతకు ముందు ‘టైమ్ టు డ్యాన్స్’ అనే సినిమా కమిట్ అయ్యారామె. ఇది చిత్రీకరణలో ఉండగానే రెండో సినిమాకి అవకాశం తెచ్చుకోగలిగారు. -
భాయ్ భరోసా భయపెట్టింది
‘‘ప్రేక్షకులు కొత్త నటులను రిసీవ్ చేసుకోవడానికి టైమ్ పడుతుంది. కానీ సల్మాన్ భాయ్ మమ్మల్ని పరిచయం చేయడం వల్ల ఆయన ఫ్యాన్స్ చూస్తారు అనే నమ్మకం ఉంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరూ చూసే చిత్రం చేశాం’’ అని ఆయుష్ శర్మ అన్నారు. బావమరిది ఆయుష్ శర్మ, వరీనా హుసేన్‌ను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ సల్మాన్ ఖాన్ నిర్మించిన చిత్రం ‘లవ్ యాత్రి’. అభిరాజ్ మినావల్ దర్శకుడు. ఈ చిత్రం అక్టోబర్ 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆయుష్ మాట్లాడుతూ – ‘‘ఆడియన్స్ ఎప్పుడు మా సినిమా చూస్తారా? అని ఎగై్జటింగ్‌గా ఉంది. సల్మాన్ భాయ్ బ్యానర్ వాల్యూకు తగ్గట్టుగా మంచి లవ్‌స్టోరీతో వస్తున్నాం. సినిమాలో హీరోయిన్ని ఒప్పించుకోవడానికి కొన్ని నెలలే పట్టింది కానీ సల్మాన్ సోదరి అర్పితాను లవ్‌లో పడేయటానికి నాలుగేళ్లు పట్టింది. హైదరాబాద్‌కి, నాకు మంచి అనుబంధం ఉంది. నా పెళ్లి ఇక్కడే జరిగింది. సౌత్ సినిమాలు మంచి కంటెంట్‌తో వస్తున్నాయి. వెంకటేశ్, రామ్‌చరణ్, అఖిల్ తెలుసు. ఈ మధ్యకాలంలో నేను చూసిన తెలుగు సినిమాల్లో ‘అర్జున్ రెడ్డి పెళ్లి చూపులు’, తమిళ ‘తేరి, మెర్సల్’ నచ్చాయి’’ అన్నారు. ‘‘మాకు భాయ్ (సల్మాన్) ఇచ్చిన భరోసా భయపెట్టింది. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలనే లక్ష్యంతో సినిమా చేశాం. అంతా బాగానే ఉంది కానీ టైటిల్ వివాదమైంది. ‘లవ్ రాత్రి’ అని పెట్టకూడదన్నారు. దాంతో ‘లవ్ యాత్రి’ అని మార్చాం’’ అన్నారు హీరోయిన్ వరీనా హుసేన్. -
నిరసన సెగ : లవ్‌యాత్రిగా మారిన సల్మాన్ టైటిల్
న్యూఢిల్లీ : సల్మాన్ ఖాన్ సొంత నిర్మాణ సంస్ధ తెరకెక్కిస్తున్న లవ్‌రాత్రి మూవీ టైటిల్ మారింది. ఈ టైటిల్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందనే ఆందోళనల నేపథ్యంలో మూవీ పేరును లవ్‌యాత్రిగా మార్చారు. సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మను హీరోగా లాంఛ్ చేస్తూ ఈ సినిమా రూపొందుతోంది. ఆయుష్‌తో పాటు వరీనా హుస్సేన్ బాలీవుడ్‌కు లవ్యాత్రితో పరిచయమవుతున్నారు. నూతన టైటిల్‌తో పాటు మూవీ కొత్త పోస్టర్‌ను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. మారిన టైటిల్‌ను ఉద్దేశిస్తూ ఇది స్పెల్లింగ్ మిస్టేక్ కాదు అని కూడా సల్మాన్ క్యాప్షన్ ఇచ్చారు.కాగా లవ్‌రాత్రి టైటిట్ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని ఓ అడ్వకేట్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈనెల 12న బిహార్‌లోని ముజఫర్‌పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ సహా ఏడుగురు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో టైటిల్ వివాదానికి తెరదించాలని సల్మాన్‌ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గతంలో దీపికా పడుకోన్, రణ్‌వీర్‌సింగ్‌ల పద్మావతి టైటిల్‌పైనా రచ్చ జరగడంతో పద్మావత్‌గా సినిమా టైటిల్‌ను మార్చడంతో వివాదం సమసిపోయిన సంగతి తెలిసిందే. -
‘కత్రినాతో కలిసి నటించను’
సాక్షి, ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌తో కలిసి నటించేందుకు సల్మాన్ ఖాన్ బావ, లవ్‌రాత్రి మూవీ హీరో ఆయుష్ శర్మ విముఖత వ్యక్తం చేశారు. సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆయుష్ శర్మ సరసన నటించేందుకు కత్రినా కైఫ్ నిరాకరించిందని గతంలో వార్తలు రాగా తాజాగా ఈ భామతో నటించేందుకు హీరో ఆయుష్ కూడా ఆసక్తి చూపలేదు. కొన్ని ప్రత్యేక కారణాలతో కత్రినాతో తాను పనిచేయలేనని ఓ ఎంటర్టైన్మెంట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ బావ ఆయుష్ శర్మ స్పష్టం చేశారు. కాగా సల్మాన్, కత్రినా కైఫ్‌ల మధ్య సన్నిహిత బంధం ఉందని బాలీవుడ్లో ప్రచారం సాగడంతో పాటు వారి ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌తో పాటు ఆఫ్‌స్ర్కీన్‌లో వారిద్దరి మధ్య సాన్నిహిత్యంపై గుసగుసలు వినిపించాయి. అయితే కత్రినా రణ్‌బీర్ కపూర్‌తో డేటింగ్లో ఉండటంతో 2008 నుంచి వీరి బంధానికి తెరపడిందని చెబుతారు. రణ్‌బీర్‌తో డేటింగ్‌కు కత్రినా కైఫ్ దూరం కావడంతో తిరిగి బాలీవుడ్ కండలవీరుడికి ఈ భామ చేరువైందనే ప్రచారం సాగుతోంది. టైగర్ జిందా హైతో గత ఏడాది నుంచి ఆన్‌స్ర్కీన్ బంధంతో వీరిద్దరూ సన్నిహితులు కాగా వచ్చే ఏడాది భారత్ మూవీలోనూ సల్మాన్, కత్రినా అభిమానులకు కనువిందు చేయనున్నారు. -
సల్మాన్ ఖాన్ బావకు బీజేపీ టికెట్?
సాక్షి, న్యూఢిల్లీ: సల్మాన్ ఖాన్ బావ ఆయూష్ శర్మ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ మీద పోటీచేసే అవకాశం కనిపిస్తోంది. సల్మాన్ సోదరి అర్పిత భార్త అయిన ఆయూష్ శర్మ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశముందని కథనాలు వస్తున్నాయి. ఆయూష్ శర్మ తండ్రి అనిల్ శర్మ తాజాగా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లోని వీరభద్రసింగ్ ప్రభుత్వంలో కీలక కేబినెట్ మంత్రిగా కొనసాగుతున్న అనిల్ శర్మ కాంగ్రెస్‌కు ఝల్క్ ఇచ్చి తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మాజీ సమాచార శాఖ మంత్రి సుఖ్రామ్ కుమారుడైన అనిల్ శర్మ వీరభద్రసింగ్‌కు నమ్మకమైన కుడిభుజం. ఆయనే కమలం గూటికి చేరడం కాంగ్రెస్ పార్టీని షాక్ గురిచేసింది. బీజేపీలో చేరిన తనకు మాండీ టికెట్‌ను పార్టీ అధినాయకత్వం ఖాయం చేసిందని అనిల్ శర్మ స్పష్టం చేశారు. అదే సమయంలో మీ కుమారుడు ఆయూష్‌కు కూడా టికెట్ లభించే అవకాశముందా? అని మీడియా ప్రశ్నించగా.. అది బీజేపీ నాయకత్వం నిర్ణయించాల్సి ఉందని చెప్పారు. తనకు, తన కొడుకు ఆయూష్‌కు టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నాకే.. ఆయన బీజేపీ గూటికి చేరినట్టు కథనాలు వస్తున్నాయి. -
సల్మాన్ ఖాన్ కు అల్లుడు
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇంట్లో మరోసారి పండుగ వాతావరణం కనిపించనుంది. సల్మాన్ ముద్దుల చెల్లెలు అర్పితాఖాన్ బుధవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించిన అర్పిత భర్త అయుష్, 'మా రాకుమారుడు వచ్చేశాడు. మా నిరీక్షణ ముగిసింది. మా చిన్నారి రాకుమారుడు అహిల్ వచ్చేశాడు' అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా అర్పితా, ఆయుష్ లతో పాటు సల్మాన్ కుటుంబ సభ్యులకు కూడా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. Our Prince has arrived https://t.co/iz1BcVLjem — Aayush Sharma (@aaysharma) 30 March 2016 -
అదిరె.. కళ్లు చెదిరె..
అంగరంగ వైభవంగాసల్మాన్ఖాన్ సోదరి వివాహం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఘనంగా వేడుక అర్పితాఖాన్, ఆయుష్ శర్మ జంటను ఆశీర్వదించిన అతిథులు హాజరైన అమితాబ్, రజనీకాంత్, ఆమిర్, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, కత్రినా సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ సోదరి అర్పితాఖాన్ వివాహం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. బాలీవుడ్ తారల సందడితో హైదరాబాద్‌లోని చారిత్రక తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ మరింత మెరిసిపోయింది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన ప్యాలెస్‌లో అంతకంటే ముచ్చటగా తయారైన పెళ్లి జంట అందరినీ ఆకట్టుకుంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు వివాహ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. పెళ్లి కుమారుడు ఆయుష్ శర్మ బ్యాండ్ బాజాలతో గుర్రంపై బారాత్‌గా పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు. వధువు తండ్రి సలీంఖాన్, తల్లి సల్మాఖాన్, సోదరులు సల్మాన్‌ఖాన్, అర్బాజ్‌ఖాన్, సొహేల్ఖాన్ ఇతర కుటుంబ సభ్యులు వరుడికి ఘన స్వాగతం పలికారు. అనంతరం పంజాబీ సంప్రదాయ పద్ధతిలో అర్పిత, ఆయుష్ శర్మ వివాహం జరిగింది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, అగ్రనటులు ఆమిర్‌ఖాన్, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, కత్రినాైకైఫ్, కాజల్, కరణ్ జోహార్, బాబాసెహగల్తో పాటు క్రికెటర్ అజారుద్దీన్ వంటి సుమారు 250 మంది ప్రముఖులు ఈ వివాహానికి తరలివచ్చారు. ప్రత్యేక ఆహ్వానితులంతా వధూవరులను ఆశీర్వదించారు. వారందరికీ సల్మాన్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. నిజాం వంటకాలతో విందు పెళ్లి విందులో నిజాం వంటకాలను అతిథులంతా పసందుగా ఆరగించారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని 101 సీట్ల డైనింగ్హల్లో దక్కన్ బిర్యానీ, హలీమ్, పత్తార్కా ఘోష్, డబల్కా మీఠా తదితర వంటకాలు వడ్డించారు. విందు అనంతరం ప్రసిద్ధ కళాకారుల కళా ప్రదర్శనలు కొనసాగాయి. పంజాబ్‌కు చెందిన ప్రముఖ గాయకుడు మైకా, యోయో హోనిసింగ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఫలక్‌నుమాలో సందడి అర్పిత వివాహం సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలోని ఫలక్‌నుమా ప్రాంతంలో పెళ్లి సందడి నెలకొంది. ఉదయం నుంచే సల్మాన్ ఖాన్ బంధుమిత్రులు, అతిథుల రాకతో హడావుడిగా మారింది. మీడియాను ప్యాలెస్ ప్రధాన గేటు వద్దే నిలిపివేశారు. దీంతో వారంతా ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సివచ్చింది. మద్యాహ్నం రెండు గంటల ప్రాంత ంలో సల్మాన్ ఖాన్ ప్యాలెస్‌కు చేరుకున్నారు. వివాహానంతరం రాత్రి ఎనిమిది గంటలకు ఇద్దరు ఫొటోగ్రాఫర్లు, ఇద్దరు వీడియో గ్రాఫర్లను అనుమతించారు. ఇక భారీ సంఖ్యలో అభిమానులు కూడా ప్యాలెస్ వద్దకు రావడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు నానా అవస్థలు పడ్డారు. రంగురంగుల విద్యుల్లతలతో ఫలక్‌నుమా ప్యాలెస్ జిగేల్మంది. బుధవారం పెళ్లి విందుతో వివాహ వేడుక ముగియనుంది. ఫూట్‌పాత్‌పై నుంచి ప్యాలెస్ వరకు.. దిక్కుమొక్కు లేక రోడ్డు పక్కన పూట్పాత్పై లభించిన అనాథ బాలికను అల్లారుముద్దుగా యువరాణిలా పెంచింది సల్మాన్ ఖాన్ కుటుంబం. ఇప్పుడు ఆ అమ్మాయి కోసమే కోట్లు కుమ్మరించి మరీ చారిత్రక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వివాహం జరిపించింది. యాక్సిడెంట్లో తల్లి మృతి చెందడంతో అనాథగా రోడ్డుపక్కన పడి ఉన్న బాలిక అర్పితను సల్మాన్‌ఖాన్ తండ్రి సలీమ్‌ఖాన్ అక్కున చేర్చుకున్నారు. ఆమెను దత్తత తీసుకుని యువరాణిలా పెంచారు. అర్మితకు తన వివాహం ప్యాలెస్‌లో జరగాలని కోరిక. దీంతో ఆమె కోరికను తీర్చేందుకే సల్మాన్ కుటుంబం సుమారు రూ. 2 కోట్లు ఖర్చుచేసింది. ఆరు నెలల క్రితమే ఫలక్‌నుమా ప్యాలెస్‌ను బుక్ చేశారు. ఇక ముంబైలోని కార్టర్రోడ్డులో సుమారు రూ. 16 కోట్ల విలువైన మూడు పడక గదుల ఫ్లాట్‌ను సల్మాన్‌ఖాన్ తన సోదరికి పెళ్లి బహుమతిగా ఇచ్చారు. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్లో అర్పిత డిగ్రీ చదివారు. ఇటీవలే ఆమె సొంతంగా ఓ ఫ్యాషన్ లేబుల్‌ను లాంచ్ చేసింది. -
హైదరాబాద్ చేరుకున్న ఆయుష్ శర్మ
-
అర్పితా టేస్ట్...
సల్మాన్‌ఖాన్ చెల్లెలు అర్పితాఖాన్ ఢిల్లీకి చెందిన తన బాయ్‌ఫ్రెండ్ ఆయుష్ శర్మను వచ్చే ఏడాది పెళ్లాడనుంది. ఈ పెళ్లి హైదరాబాద్‌లో జరగనుండటం విశేషం. హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం ఫలక్‌నుమా ప్యాలెస్‌ను అర్పితా తన పెళ్లి వేదికగా ఎంపిక చేసుకుంది. ఆమె కోరిక మేరకు సల్మాన్ కుటుంబ సభ్యులు ఫలక్‌నుమా హోటల్ యాజమాన్యంతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు సమాచారం.