
సల్మాన్ ఖాన్ కు అల్లుడు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంట్లో మరోసారి సందడి వాతావరణం కనిపించనుంది. సల్మాన్ ముద్దుల చెల్లెలు అర్పితాఖాన్ బుధవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఇంట్లో మరోసారి పండుగ వాతావరణం కనిపించనుంది. సల్మాన్ ముద్దుల చెల్లెలు అర్పితాఖాన్ బుధవారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించిన అర్పిత భర్త అయుష్, 'మా రాకుమారుడు వచ్చేశాడు. మా నిరీక్షణ ముగిసింది. మా చిన్నారి రాకుమారుడు అహిల్ వచ్చేశాడు' అంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా అర్పితా, ఆయుష్ లతో పాటు సల్మాన్ కుటుంబ సభ్యులకు కూడా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Our Prince has arrived https://t.co/iz1BcVLjem
— Aayush Sharma (@aaysharma) 30 March 2016