‘అంతిమ్’‌ ఫస్ట్‌లుక్‌.. సరికొత్త గెటప్‌లో సల్మాన్‌ | Aayush Sharma Released Salman Khan Antim First Look | Sakshi
Sakshi News home page

‘అంతిమ్’‌ ఫస్ట్‌లుక్‌.. సరికొత్త గెటప్‌లో భాయిజాన్‌

Published Thu, Dec 10 2020 10:56 AM | Last Updated on Thu, Dec 10 2020 12:33 PM

Aayush Sharma Released Salman Khan Antim First Look - Sakshi

ముంబై: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ తదుపరి చిత్రం ‘అంతిమ్‌’. ఈ సినిమాలోని సల్మాన్‌ ఖాన్‌ ఫస్ట్‌లుక్‌ను ఆయన బావ ఆయుష్ శర్మ(అర్పిత ఖాన్‌ శర్మ భర్త) గురువారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. షూటింగ్‌ సెట్స్‌లోని ఓ సన్నివేశాన్ని ఆయుష్‌ తన ఇన్‌స్టా‍లో షేర్‌ చేస్తూ.. ‘అంతిమ్‌ ప్రారంభమైంది.. భాయ్స్‌ అంతిమ్‌ ఫస్ట్‌లుక్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేశాడు. అయితే ఈ సినిమాలో ఆయుష్‌ శర్మ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సల్మాన్‌ సిక్కు పోలీసు ఆఫీసర్‌గా సరికొత్త గెటప్‌తో ప్రేక్షకులను ఆలరించానున్నాడు. ఈ వీడియోలో భాయిజాన్‌ సిక్కుగా తనదైన స్టైల్‌లో నడుస్తు కనిపించాడు. (చదవండి: ప్లేట్లు నేలకేసి కొట్టిన హీరో‌ సోదరి!)

నటుడు, దర్శకుడు మహేశ్‌ మంజ్రేకర్‌ ‘అంతిమ్’‌ను తెరకెక్కిస్తున్నాడు.  ఈ సినిమా మరాఠి క్రైం ముల్షీ ప్యాట్రన్‌ అడాప్షన్‌ నేపథ్యంలో సాగనుంది. కాగా ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ ‘రాధే’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది రంజాన్‌కు విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో ఇటీవల షూటింగ్‌ సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. దక్షిణ కోరియా వెటరన్‌ రిమేక్‌లో తెరకెక్కుతున్న ‘రాధే’లో సల్మాన్‌కు‌ జోడిగా హీరోయిన్‌ దిశ పటానీ నటిస్తున్నారు. అంతేగాక రణ్‌దీప్‌ హుడా, జాకీర్‌ శ్రఫ్‌లు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. (చదవండి: రాహుల్ లేక‌పోతే బిగ్‌బాస్ చూడం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement