Seema Khan Changes Instagram Name After Reports Of Divorce From Sohail Khan - Sakshi
Sakshi News home page

Seema Khan Instagram Name: ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి భర్త పేరును తొలగించిన నటి

Published Sat, May 21 2022 12:43 PM | Last Updated on Sat, May 21 2022 3:18 PM

Seema Khan Changes Instagram Name After Reports Of Divorce From Sohail Khan - Sakshi

సల్మాన్‌ ఖాన్‌ తమ్ముడు సోహైల్‌ ఖాన్‌తో విడిపోయిన అనంతరం సీమా ఖాన్‌ తన అత్తింటి పేరును తొలగించింది. ఇప్పటికే ఈ స్టార్‌ కపుల్‌ విడాకుల విషయం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. 24 ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్‌బై చెబుతూ ఈ జంట ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. విడాకుల కోసం ముంబై ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్న వారం రోజుల అనంతరం సీమా ఖాన్‌ తన భర్త పేరును ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి తొలగించింది.


గతంలో సీమా ఖాన్‌గా ఉన్న ఆమె ఇప్పుడు 'సీమాకిరణ్‌ సజ్‌దేహ్‌' పేరుతో ఇన్‌స్టా అకౌంట్‌ పేరును మార్చుకుంది. దీనికి సంబంధించిన వార్తలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా 1998లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సోహైల్‌ ఖాన్‌-సీమా ఖాన్‌లు 24ఏళ్ల వివాహం అనంతరం విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. గతంలోనూ సల్మాన్‌ ఖాన్‌ మరో  తమ్ముడు అర్భాజ్‌ ఖాన్‌ సైతం మలైకా అరోరాతో విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా సోహైల్‌ ఖాన్‌ కూడా విడాకులు తీసుకోనుండటం ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement