
గతేడాది కరోనా కారణంగా దీపావళి పండగ సెలబ్రెషన్స్‌ను ఎవరు అంతగా జరుపుకోలేకపోరు. ఇక ఈ ఏడాది పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఈ దివాళిని రెట్టింపు సంతోషంతో జరుపుకున్నారు. ఇక సినీ తారల సందడి అయితే మామూలుగా లేదు. తమ కుటుంబాలతో కలిసి పూజలు, టాపాసులు పేల్చి ఘనంగా ఈ దీవాళిని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ‘భాయిజాన్’ సల్మాన్ ఖాన్ కూడా తన కుటుంబ సభ్యులు, రూమార్డ్ గర్ల్‌ఫ్రెండ్ లూలియా వాంటూర్లుతో కలిసి పండగను సెలబ్రెట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలో నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
చదవండి: స్టార్ హీరోలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు
సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ముంబైలోని తన నివాసంలో దీపావళి వేడుకలను ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో సల్మాన్ ఖాన్ అతడి రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ లూలియా వాంటూర్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సల్మాన్ ఖాన్ బ్లాక్ టీ షర్ట్, డెనిమ్ జీన్స్‌లో సింపుల్‌గా కనిపించగా..లూలియా వాంటూర్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ఎంబ్రాయిడరీ డిజైన్‌తో రూపొందించిన అనార్కలీ షూట్, బంగారు ఆభరణాలు ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ వేడుకకు డేవిడ్ ధావన్-కరుణ ధావన్ దంపతులు కూడా హజరయ్యారు. వారితో సల్మాన్ ఖాన్ గేటు దగ్గర నుంచి స్వాగతం పలికి వారితో కాసేపు ముచ్చటించాడు.
చదవండి: ఆ స్టార్ హీరో వల్లే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు: టబు
Comments
Please login to add a commentAdd a comment