Sohail Khan And Seema Khan File For Divorce After 24 Years Of Marraige, Details Inside - Sakshi
Sakshi News home page

Sohail Khan Divorce: హాట్‌టాపిక్‌గా మారిన సల్మాన్‌ ఖాన్‌ తమ్ముడి విడాకులు

Published Fri, May 13 2022 3:46 PM | Last Updated on Fri, May 13 2022 8:06 PM

Sohail Khan And Seema Khan File For Divorce After 24 Years Of Marraige - Sakshi

సల్మాన్‌ ఖాన్‌ తమ్ముడు సోహైల్‌ ఖాన్‌ విడాకుల విషయం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఎంతో అన్యోనంగా ఉండే సోహైల్‌ ఖాన్‌- సీమా ఖాన్‌లు పెళ్లయిన 24ఏళ్ల అనంతరం విడిపోయేందుకు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ముంబై ఫ్యామిలీ కోర్టుకు చేరుకున్న ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసుకోవడం బీటౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే వీరి విడాకులకు గల కారణాలు ఏంటన్నది ఇంకా తెలియలేదు. 

కాగా 1998లో సోహైల్‌ ఖాన్‌- సీమా ఖాన్‌లు ఇంట్లోంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి నిర్వాన్‌, యోహాన్‌ పిల్లలు. గతంలో 2017లోనే వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నారు అని వార్తలు హల్‌చల్‌ చేయగా సీమా వాటిని ఖండించింది. ఏ బంధంలో అయినా గొడవలు సహజమని, తమకు అన్నింటి కంటే తమ పిల్లలే చాలా ముఖ్యమని పేర్కొంది. తాజాగా ఈ జంట విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం బీటౌన్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement