Iulia Vantur
-
రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్‌తో సల్మాన్ దీపావళి సంబరాలు
గతేడాది కరోనా కారణంగా దీపావళి పండగ సెలబ్రెషన్స్‌ను ఎవరు అంతగా జరుపుకోలేకపోరు. ఇక ఈ ఏడాది పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఈ దివాళిని రెట్టింపు సంతోషంతో జరుపుకున్నారు. ఇక సినీ తారల సందడి అయితే మామూలుగా లేదు. తమ కుటుంబాలతో కలిసి పూజలు, టాపాసులు పేల్చి ఘనంగా ఈ దీవాళిని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ ‘భాయిజాన్’ సల్మాన్ ఖాన్ కూడా తన కుటుంబ సభ్యులు, రూమార్డ్ గర్ల్‌ఫ్రెండ్ లూలియా వాంటూర్లుతో కలిసి పండగను సెలబ్రెట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలో నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. చదవండి: స్టార్ హీరోలపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ముంబైలోని తన నివాసంలో దీపావళి వేడుకలను ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ హాజరయ్యారు. ఈ వేడుకల్లో సల్మాన్ ఖాన్ అతడి రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ లూలియా వాంటూర్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సల్మాన్ ఖాన్ బ్లాక్ టీ షర్ట్, డెనిమ్ జీన్స్‌లో సింపుల్‌గా కనిపించగా..లూలియా వాంటూర్ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయింది. ఎంబ్రాయిడరీ డిజైన్‌తో రూపొందించిన అనార్కలీ షూట్, బంగారు ఆభరణాలు ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఈ వేడుకకు డేవిడ్ ధావన్-కరుణ ధావన్ దంపతులు కూడా హజరయ్యారు. వారితో సల్మాన్ ఖాన్ గేటు దగ్గర నుంచి స్వాగతం పలికి వారితో కాసేపు ముచ్చటించాడు. చదవండి: ఆ స్టార్ హీరో వల్లే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు: టబు -
పెళ్లిపై స్పందించిన సల్మాన్ ప్రియురాలు!
ముంబై: బాలీవుడ్ కండవీరుడు సల్మాన్ ఖాన్ ప్రియురాలిగా ప్రచారంలో ఉన్న లులియా వంతూర్ తన వివాహ విషయంపై స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, మీరు త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారా అని అడగ్గా.. ఒక్కసారిగా పెద్దగా నవ్వి ఈ విషయాన్ని దాటేశారు. ఆ తర్వాత ‘వివాహం మాత్రమే కాకుండా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనుషులు ఒకరిపై ఒకరికి ఎలాంటి భావనలు కలిగి ఉంటారు. వారు ఎంతకాలం కలిసి గడుపుతారన్న విషయం ముఖ్యమైనది. అందువల్ల కొన్ని సంబంధాలకు కొంత సమయం ఇవ్వాలన్నది నా అభిప్రాయం’ అని చెప్పుకొచ్చారు. (పిల్లల నుంచే నేర్చుకుంటున్నా: నటుడు) అంతేగాక ఈ మధ్య ఆమె తల్లిదండ్రులు తనని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని పదే పదే అడగడం ప్రారంభించారని కూడా చెప్పారు. ‘వారు అడిగిన మరుసటి రోజే నేను పెళి చేసుకోవచ్చు. కానీ ఆ పెళ్లి నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. ఒకవేళ ఈ సమాధానం నా తల్లిదండ్రులు వింటే వారు ఇక దీనిపై నన్ను ప్రశ్నించరనే అభిప్రాయపడుతున్నాను’ అని తెలిపారు. కాగా లులియా వంతూర్, సల్మాన్ ఖాన్లు కొంతకాలంగా పన్వెల్‌లోని తమ ఫామ్‌హౌజ్‌లో సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే భాయిజాన్, లులియాను పెళ్లి చేసుకుబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పటీ వరకు భాయిజాన్ ఈ విషయంపై స్పష్టతను ఇవ్వలేదు. ఇక తన పెళ్లెప్పుడు అని అడిగినప్పుడల్లా తనకు పెళ్లి వద్దు కానీ.. పిల్లలు కావాలంటూ తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు సమాధానం చెప్పకనే చెప్పాడు. చిరు చిత్రంలో సల్మాన్?.. ఇదిగో క్లారిటీ -
బై.. బై సల్మాన్
న్యూఢిల్లీ : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రుమేనియా అందాల తార లులియా వాంటర్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త ఏడాది కాలంగా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. సల్లు భాయ్ అభిమానులు కూడా ఈ విషయం తెలిసి పండగ చేసుకున్నారు. ఇంతలో ఏమైదో ఏమో.. కొన్నాళ్లుగా ఈ జంట గురించి ఎక్కడా ఒక్కటంటే ఒక్కవార్త కూడా బయటకు రాలేదు. ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్ ప్రియురాలు.. లులియా వాంటర్ మళ్లీ రుమేనియాకు వెళ్లిపోయిందని తెలుస్తోంది. అయితే లులియా ఎందుకు రుమేనియా వెళ్లిందనేదానిపై స్పష్ట లేదు. ఒకరు బ్రేకప్ అంటే.. మరొకరు లులియా వీసా సమయం ముగిసింది..అని ఇంకొకరు అదేం లేదు షూటింగ్‌లు అని తలా ఓ మాట చెబుతున్నారు. తాను రుమేనియా వెళ్లినట్లు లులియానే శుక్రవారం ప్రకటించారు. ఫ్లయిట్టలో ప్రయాణిస్తున్న ఒక ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి..ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే హఠాత్తుగా ఎందుకు వెళుతున్నాదీ చెప్పలేదు. కానీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం చట్టాలు వల్లే వెళ్లాల్సి వస్తోంది.. వీసా గడువు ముగిసింది.. జీవితం బాగుంది.. ప్రేమను పొందాను.. అని ఫొటో కింద పోస్ట్ చేశారు. ’టైగర్ చిందాహై‘ చిత్రం షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్- మాజీ ప్రియురాలు కత్రీనా కైఫ్‌ల మధ్య మళ్లీ ప్రేమ మొగ్గతొడిగిందనే వార్తలు కొంతకాలంగా బీ టౌన్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ కారణం వల్లే లులియా రుమేనియా వెళ్లిపోయిందని బీ టౌన్ వర్గాల కథనం. Sometimes u have no choice, u have to follow the rules so fly baby, fly 😀 #visa #expire #rules #respect #travel #enjoy #lifeisgood #love #blessed # A post shared by Iulia Vantur Official Account (@vanturiulia) on Oct 12, 2017 at 5:23pm PDT -
సల్మాన్ గర్ల్ ఫ్రెండ్.. తొలిసారిగా.!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సినిమాలతోనే కాదు లవ్ ఎఫైర్స్‌తో కూడా ఎప్పుడు వార్తల్లో ఉంటూ ఉంటాడు. తను పాల్గొనే ప్రతి పబ్లిక్ ఫంక్షన్స్‌కు తన గర్ల్ ఫ్రెండ్స్‌ను వెంట తీసుకురావటం సల్మాన్‌కు అలవాటు. అందుకే ఆయన గర్ల్ ఫ్రెండ్స్‌కు కూడా మీడియాలో ఫుల్ పబ్లిసిటీ వచ్చేస్తోంది. సల్మాన్ గర్ల్ ఫ్రెండ్‌గా ఇండియన్ మీడియాకు సుపరిచితురాలైన రొమానియన్ మోడల్ లులియా వాంటుర్. తాజాగా ఈ ఇంగ్లీష్ మోడల్ ఇండియన్ ర్యాంప్ మీద వేడి పుట్టించింది. లాక్మీ ఫ్యాషన్ వీక్ 2017లో లులియా సందడి చేసింది. సమ్మర్ కలెక్షన్స్‌ను ర్యాంప్‌పై ప్రజెంట్ చేసిన ఈ బ్యూటి ఈవెంట్‌కే స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. బ్లాక్, గోల్డ్ కలర్స్‌తో డిజైన్ చేసిన డ్రస్ వేసుకొని తొలిసారిగా ఇండియన్ ర్యాంప్ దర్శనమిచ్చి బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. -
‘సల్మాన్‌కు నా ప్రేమనంతా ఇచ్చేస్తా’
ముంబయి: ‘ఆయన పుట్టిన రోజునాడు నా ప్రేమనంతా ఇవ్వడంతోపాటు, గౌరవాన్ని కూడా ఇచ్చేస్తాను’ అంటూ ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ గర్ల్ప్రెండ్గా వార్తల్లో చెక్కర్లు కొడుతున్న రష్యన్ భామ లులియా వాంతుర్ చెప్పింది. ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య ఉన్న రొమాంటిక్ సంబంధాన్ని గురించి సల్మాన్ ఎలాంటి ప్రకటనలు చేయనప్పటికీ లులియా మాత్రం అప్పుడు సల్మాన్ పేరును నేరుగా ప్రస్తావిస్తూ వార్తల్లో నిలుస్తోంది. సోమవారం రాత్రి సాన్ సూయి స్టార్ డస్ట్ అవార్డు కార్యక్రమానికి రెడ్ కార్పెట్ స్వాగతం అందుకున్న ఈ అమ్మడు సల్మాన్‌కు త్వరలోనే మంచి బహుమతి ఇస్తానని చెప్పింది. ఈ నెల (డిసెంబర్) 27న కండల వీరుడు సల్మాన్ 51 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా పుట్టిన రోజున సల్మాన్‌కు ఏ బహుమతి ఇస్తున్నారంటూ అక్కడి మీడియా ప్రశ్నించగా తొలుత కాస్తంత సిగ్గుపడినట్లు చేసిన ఈ భామ అనంతరం ‘ఆ రోజు నా మొత్తం ప్రేమను, గౌరవాన్ని సల్మాన్‌కు ఇచ్చేస్తాను’ అంటూ చెప్పింది. ఆ రోజు ప్రత్యేకమైన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించగా.. చాలా తెలివిగా సమాధానం చెప్పింది. ఆరోజు అందరం కలిసే వేడుక జరుపుకుంటామని కెమెరాకు పోజివ్వకుండానే వెళ్లిపోయింది. మరో విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమంలో సల్మాన్ కూడా ఉన్నాడు. ఆయన ముందే బాడీగార్డ్ చిత్రంలో తేరి మేరి ప్రేమ్ కహానీ అనే పాటను కూడా లులియా వినిపించి అబ్బురపరిచింది. -
మేం లవర్స్ కాదుగానీ..!
బాలీవుడ్ బ్రాహ్మచారి సల్మాన్ ఖాన్ ప్రియురాలిగా ప్రచారం కావడంతో ఆమె చుట్టూ మీడియా చాలా చక్కర్లు కొట్టింది. కానీ, లులియా వంటూర్ ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. సల్మాన్-లులియా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని, ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని కథనాలు కూడా వచ్చాయి. అయినా ఆమె పెద్దగా స్పందించిన దాఖలా లేదు. కానీ, తాజాగా ఈ రొమేనియన్ సుందరి నోరువిప్పింది. మీడియాతో మాట్లాడింది. సహజంగానే.. 'మీరు సల్మాన్‌తో డేటింగ్ చేస్తున్నారా? ఆయనను ఎప్పుడు పెళ్లిచేసుకుంటారు?' అంటూ మీడియా ఆరాతీసింది. తాజాగా 'స్పై' మ్యాగజీన్‌తో ముచ్చటించిన ఈ అమ్మడు.. సల్మాన్, తాను స్నేహితులం మాత్రమేనని చెప్పింది. మీరు సల్మాన్‌తో డేటింగ్ చేస్తున్నారా? అని అడిగితే.. లేదని సమాధానమిచ్చింది. 'మేం స్నేహితులమంటే స్నేహితులమే.. అంతకుమించి మా మధ్య ప్రేమ లేదు' అని తెలిపింది. తమ మధ్య ఉన్న స్నేహం గురించి వివరిస్తూ 'కొన్ని మంచి సమయాల్లో మంచి విషయాలు జరుగుతుంటాయి. కానీ మిగతావన్నీ వదంతులే' అని పేర్కొంది. సల్మాన్, లులియా చాలా వేడుకల్లో కలిసి కనిపించారు. లడఖ్‌లో సల్మాన్ సినిమా షూటింగ్ సందర్భంగా.. సల్మాన్, లులియ కలిసి దలైలామాను కలిశారు. సల్మాన్ సోదరి ఆర్పితాఖాన్ పుట్టినరోజు వేడుకలోనూ ఈ ఇద్దరు జంటగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లోనే కాదు.. లులియా స్వదేశమైన రొమేనియాలోనూ లులియా మిసెస్ సల్మాన్ ఖాన్‌గా మారబోతున్నట్టు కథనాలు వచ్చాయి. లులియా మాత్రం ఇప్పటికీ తమ మధ్య ఉన్నది స్నేహమేనంటూ ముగించింది. -
'షాక్.. సల్మాన్ ప్రేయసి కాదట.. ఫ్రెండేనట'
ముంబయి: తమ మధ్య ఉన్న బంధాన్ని ఇప్పటికే వీధివీధిన కోడై కూస్తున్న మీడియాకు బాలీవుడ్ కండల వీరు, మోస్ట్ లేట్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ గర్ల్ ప్రెండ్, రొమేనియా సుందరి లులియా అవాక్కయ్యే విషయం చెప్పింది. వారిద్దరి మధ్య ఉంది ప్రేమ పూర్వక సంబంధం కాదంట. స్నేహ పూర్వక సంబంధమేనట. 'మేం స్నేహితులం ఎప్పటికీ స్నేహితులం అంతే. మా మధ్య ఇంకేం లేదు' అంటూ ఈ రొమేనియన్ బ్యూటీ నోరు విప్పింది. ఓ మేగజిన్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె 'మేం ప్రేమికులం కాదు.. స్నేహితులం. స్నేహితులు అంటే స్నేహితులమంతే. ప్రేమ కాదు. మీరు ఏవైతే వింటున్నారో అవన్నీ ఊహాగానాలే' అని ఆమె చెప్పేసింది. ఇటీవల సల్మాన్ ఖాన్, లులియా వంతూరు తో కలిసి 14వ బౌద్ధమత గురువును కలిశారు. 'ట్యూబ్ లైట్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నఈ సూపర్ స్టార్ సల్మాన్ టిబెటన్ ఆధ్యాత్మిక బౌద్ధమత గురువు దలైలామాతో సమావేశ మయ్యారు. దాంతో ఇక సల్మాన్ ఈ రొమేనియా భామతో సెట్టయిపోయినట్లేనని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పటికే అదే విషయం గురించి మాట్లాడుతుండగా అదేం లేదంటూ ఆమె వివరణ ఇచ్చింది. -
ఈ పోస్ట్ పెళ్లి గురించేనా..?
బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాల మీద కన్నా సల్మాన్ ఖాన్, లులియా వాంటూర్ల పెళ్లి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినిమా ఫంక్షన్స్‌తో పాటు పలు ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా వీళ్లిద్దరు కలిసి కనిపించటంతో ఈ ఏడాది సల్మాన్ ఖాన్ పెళ్లి ఖాయం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై సల్మాన్‌తో పాటు లులియా కూడా క్లారిటీ ఇవ్వటంతో ఈ రూమర్స్‌కు తెరపడినట్టే అనుకున్నారు. కానీ తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో లులియా చేసిన ఓ పోస్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. 'దేవుడే మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనకు కావల్సింది, సరైన సమయంలో మనకు అందిస్తాడు'. అని రాసి ఉన్న ఫోటో ఇమేజ్ను పోస్ట్ చేసింది లులియా. ఈ కామెంట్ లులియా, తన పెళ్లిని ఉద్దేశించే చేసినట్టుగా భావిస్తున్నారు ఫ్యాన్స్. సరైన సమయంలో సల్మాన్‌తో తన పెళ్లి ఉంటుందని లులియా హింట్ ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు. క్లారిటీ ఇచ్చినట్టుగానే ఇచ్చి మరోసారి కన్య్ఫూజ్ చేసిన లులియా ఈ రూమర్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి. Start a new week #goodthoughts #Godisgreat #lifeisgood #noquestion #nodemand #norush #noexpectations #enjoythemoment #love #life #havefaith A photo posted by Iulia Vantur Official Account (@vanturiulia) on May 23, 2016 at 1:42am PDT -
ఇంకా పెళ్లి చేసుకోలేదు: సల్మాన్ ప్రేయసి
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ త్వరలోనే తన ప్రియురాలు, రొమేనియా బ్యూటీ లులియా వంటూర్ ను పెళ్లిచేసుకోనున్నట్లు ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే ఈ వదంతులపై టీవీ నటి లులియా స్పందించింది. సల్మాన్ తో వివాహం అంటూ వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. పెళ్లి చేసుకోవడానికి తాను ఇప్పుడు సిద్ధంగా లేదని, తనకు పెళ్లిపై తొందరేం లేదంటూ కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పేసింది. లులియ- సల్మాన్ పెళ్లి వచ్చే డిసెంబర్లో జరగనుందని, ఈమేరకు సల్మాన్ కుటుంబం ఏర్పాట్లు కూడా చేసుకుంటుందని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వదంతులకు సమాధానం చెప్పాలని భావించిన లులియా తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని విషయాలు పేర్కొంది. గతంలో తనకు పెళ్లయిందని వస్తున్న వార్తల్లో నిజంలేదని, తనకు అసలు పెళ్లి జరగలేదని స్పష్టంచేసింది. అయితే కొన్ని రోజుల కింద ప్రీతిజింటా వివాహ రిసెస్పన్ లో లులియా, సల్మాన్ తల్లి చేతి పట్టుకుని తిరుగుతూ సందడి చేసిన విషయం తెలిసిందే. వదంతులపై రియాక్ట్ అవ్వాల్సిందేమీ లేదని, ఇప్పట్లో వెడ్డింగ్ డ్రెస్ లో కనిపించాలని ఉవ్విళ్లూరడం లేదన్నట్లు తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో సల్మాన్ ప్రేయసి లులియా వంటూర్ రాసుకొచ్చింది. -
పెళ్లిపై లులియా కూడా స్పందించింది!
బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్‌ను తాను పెళ్లాడబోతున్నట్టు ఎడతెరిపి లేకుండా వస్తున్న కథనాలపై రొమేనియన్ టీవీ నటి లులియా వంటుర్ ఎట్టకేలకు స్పందించింది. తనకు గతంలోనే పెళ్లయిందని, రొమేనియన్ స్టార్ హీరోను తాను పెళ్లాడనని వచ్చిన వార్తలనూ ఆమె తోసిపుచ్చింది. ఇప్పుట్లో తను పెళ్లికి తొందరపడటం లేదని స్పష్టం చేసింది. 'ప్రియమైన మిత్రులారా! వదంతులపై స్పందించాల్సిన అవసరం లేదని ఇప్పటివరకు భావించాను. కానీ ఇప్పుడు స్పష్టం చేస్తున్నాను. నాకు గతంలో ఎప్పుడూ పెళ్లి కాలేదు. అదే సమయంలో నేను త్వరలోనే పెళ్లి చేసుకోవడానికి ఉవ్విళ్లూరడం లేదు' అని లులియ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పేర్కొంది. మరోవైపు పెళ్లి వార్తలపై సల్మాన్ ఖాన్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. తాను పెళ్లి చేసుకోవాలని భావించినప్పుడు పెళ్లి చేసుకుంటానని, అప్పుడు ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులందరికీ తెలియజేస్తానని సల్మాన్ స్పష్టం చేశాడు. లులియ-సల్మాన్ పెళ్లి వచ్చే డిసెంబర్లో జరగనుందని, ఈమేరకు సల్మాన్ కుటుంబం ఏర్పాట్లు కూడా చేసుకుంటుందని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
సల్మాన్ పెళ్లి డేట్ ఇదేనా?!
ఔను! బాలీవుడ్ ముదురు బ్రహ్మచారి సల్మాన్‌ఖాన్ పెళ్లికి ఒప్పేసుకున్నాడు. ఎంతోకాలంగా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న రొమేనియన్ ప్రియురాలు లులియా వంటూర్ను ఆయన పెళ్లాడబోతున్నాడు. తన తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు ఈ ఏడాది చివరినాటికి తన బ్రహ్మచర్యానికి నీళ్లు వదులబోతున్నాడు. ఇలా వస్తున్న కథనాల పరంపరలో తాజాగా సల్మాన్ ఖాన్ పెళ్లి తేదీ కూడా ఫిక్సయినట్టు వినిపిస్తోంది. డిసెంబర్ 27, 2016న ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడని తాజాగా ఓ బాలీవుడ్ వెబ్సైట్ వెల్లడించింది. డిసెంబర్ 27న సల్మాన్ 51వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. అదే సందర్భంలోనే ఆయన పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించినట్టు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. సల్మాన్ పెళ్లి తేదీ వార్తలపై ఆయన గానీ, ఆయన కుటుంబంగానీ ఏమీ స్పందించలేదు. ఈ వార్తలను ధ్రువీకరించలేదు. మరోవైపు సల్మాన్-లులియా జంటగా కనిపిస్తున్న ఫొటోలు ఈ మధ్య దినపత్రికల్లో, వెబ్సైట్లలో బాగా హల్చల్ చేస్తున్నాయి. ప్రీతి జింటా వెడ్డింగ్ రిసెప్షన్‌కి ఈ ప్రేమజంట కలిసి వెళ్లి తొలిసారి పబ్లిక్కు కనిపించిన సంగతి తెలిసిందే. -
ఆయన ప్రియురాలికి ఇప్పటికే పెళ్లయిందా!
బాలీవుడ్లోనే అత్యంత ముదురు బాహ్మచారి సల్మాన్ ఖాన్. ఆయన పెళ్లి గురించి నిత్యం కథనాలు రావడం పరిపాటే. అదిగో సల్మాన్ పెళ్లి, ఇదిగో సల్మాన్ పెళ్లి అంటూ ఎన్ని కథనాలు వచ్చినా ఈ కండలవీరుడు మాత్రం తన వివాహం గురించి ఏమీ క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ, ఇటీవల మాత్రం 'బజరంగీ భాయ్‌జాన్' పెళ్లి ఖాయమని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకొని.. తన బ్యాచిలర్ జీవితానికి సల్మాన్ గుడ్ బై చెప్తాడని ఆ వర్గాలు అంటున్నాయి. సల్మాన్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొన్నందుకు అతని అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉందని ఇటీవల కథనాలు వచ్చాయి. ఈ కథనాలకు బలం చేకూరుస్తూ.. సల్మాన్-లులియా వంటుర్ ఇటీవల కలిసి మీడియాకు పోజులిచ్చారు. ప్రీతిజింటా పెళ్లివిందులో ఈ జంట కలిసి వచ్చి హల్చల్ చేసింది. దీంతో ఈ ఇద్దరి పెళ్లి ఖాయమని ఘంటాపథంగా చెప్పేశారు బాలీవుడ్ గాసిప్ రాయుళ్లు. ఈ నేపథ్యంలో చాలాకాలంగా సల్మాన్‌తో డేటింగ్ చేస్తున్న లులియా వంటూర్ గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోడల్ అయిన లులియా గతంలో రొమేనియన్ సూపర్ స్టార్ మారిసయ్ మోగాను పెళ్లాడింది. నాలుగేళ్ల తర్వాత వీళ్ల పెళ్లి పెటాకులైంది. ఈ దంపతులు విడిపోవడానికి కారణాలు ఏమిటన్నది మాత్రం తెలియదని ఓ బాలీవుడ్ న్యూస్ వెబ్సైట్ తెలిపింది. ఈ కథనంపై సల్మాన్ గానీ, లులియాగానీ స్పందించలేదు. కానీ ఈ ఏడాది చివర్లో మాత్రం వీరిద్దరి పెళ్లి ఖాయమని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ( మాజీ భర్తతో లులియా ఫొటోలు) మాజీబ -
సల్మాన్ అధికారికంగా ప్రకటిస్తాడట!
ముంబై: తన పెళ్లిగోల మీద ఇంతవరకు పెదవి విప్పకుండా మౌనంగా ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు ఒక ప్రకటన చేయనున్నాడట. తన విదేశీప్రియురాలు, రష్యా మోడల్ లులియా వంతూర్ ప్రేమకథ స్టోరీలకు త్వరలోనే శుభం కార్డు వేయనున్నాడట ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. తమ బాంధవ్యాన్ని అధికారికంగా ప్రకటించి, లులియాను అందరికీ పరిచయం చేయనున్నట్టు సమాచారం. అదీ బాలీవుడ్ సుందరి వెడ్డింగ్ రిపెప్షన్ లో. డీఎన్ఎ కథనం ప్రకారం సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా వివాహ రిసెప్షన్ లో సల్మాన్ ఖాన్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నాడని తెలుస్తోంది. సల్మాన్ అధికారికంగా లులియాను సినీ పరిశ్రమకు, స్నేహితులకు పరిచయం చేయనున్నట్టు సమాచారం. ఈ మధ్య లులియా సల్మాన్ , ఆయన కుటుంబ సభ్యులతో ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి చేయడం విశేషంగా మారింది. ఈ ఏడాది చివరలో ఆమెను సల్మాన్ పెళ్లి చేసుకోవడం ఖాయమనే వార్త బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇటీవలే దంపతులుగామారిన ప్రీతి , జీన్ గుడెనఫ్ బి- టౌన్ పెద్దలు, స్నేహితులకు ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియాకు చేరుకున్న ఈ జంట ఢిల్లీలోని ప్రేమ మందిరం తాజ్ మహల్ దగ్గర సందడి చేసింది. -
వాళ్లిద్దరూ క్లోజ్ అయినందుకు.. ఆమె ఉడికిపోతోంది?
ముంబై: బాలీవుడ్ ప్రేమపక్షులు ఎప్పుడు కలుసుంటారో, ఎప్పుడు విడిపోతారో, ఏ గూటికి చేరుతారో.. అంతా మాయ. ఈ కోవలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ చేరారు. కెరీర్ ఆరంభంలో కత్రినా.. సల్మాన్‌కు దగ్గరయ్యాక ఆమె దశ తిరిగింది. సల్మాన్ తన ఇతర ప్రియురాళ్ల మాదిరే కత్రినాకు సినిమా అవకాశాలు ఇప్పించాడని బాలీవుడ్ వర్గాల కథనం. కొన్నేళ్లు సవ్యంగా సాగిన వీరి బంధం తర్వాత విడిపోయింది. సల్మాన్‌కు దూరమయ్యాక కత్రినా మరో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్‌కు దగ్గరైంది. అయితే రణబీర్‌తో కూడా ప్రేమ ఎక్కువ రోజులు సాగలేదు. రణబీర్, కత్రినా పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చినా, ఏమైందో కానీ ఇద్దరూ ప్రేమకు కటీఫ్ చెప్పారు. కాగా కత్రినా మళ్లీ సల్మాన్‌తో క్లోజ్‌గా ఉంటున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెప్పుకొంటున్నాయి. కొత్త విషయం ఏంటంటే కత్రినా కైఫ్ వల్ల సల్మాన్ ప్రియురాలు, రుమేనియా బ్యూటీ లులియా వంటుర్ అభద్రతాభావానికి గురవుతోందట. కత్రినాకు సల్మాన్ మళ్లీ దగ్గరకావడంతో ఆమె అసంతృప్తిగా ఉందని బాలీవుడ్ వర్గాలు చెప్పాయి. లులియా ఈ విషయంపై సల్మాన్‌ను నిలదీసిందని, ఇద్దరి మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగినట్టు సమాచారం. కత్రినాకు సాయం చేయడం తనకు ఇష్టం లేదని, ఇది తనకు ఆందోళన కలిగిస్తోందని సల్మాన్‌కు లులియా తెగేసి చెప్పిందట. అయితే కత్రినా విషయంలో ఆందోళన వద్దని, మన రిలేషన్ కొనసాగుతుందని లులియాకు సల్మాన్ హామీ ఇచ్చినట్టు సమాచారం. సల్మాన్, లులియాను పెళ్లి చేసుకోబోతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా మారిన రిలేషన్స్ వల్ల ఏం జరుగుతుందే కాలమే చెబుతుంది. -
హల్చల్ చేస్తున్న లులియా- సల్మాన్ ఫోటో
ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, ప్రియురాలు లులియా వాంటర్ సన్నిహితంగా ఉన్నఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. రొమేనియన్ ముద్దుగుమ్మ లులియా, సల్మాన్ ను ముద్దాడుతున్న ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. దుబాయ్ లో వీళ్లిద్దరు కలిసినపుడు ఈ ఫోటో చిక్కినట్టు సమాచారం. ఈ మధ్య సల్మాన్ ఖాన్ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడనే వార్తల నేపథ్యంలో ఈ ఫోటో ఆసక్తికరంగా మారింది. ఇటీవల చాలా సందర్భాలలో సల్మాన్, లులియా కలిసి దర్శనమిచ్చిన వార్తల్లో నిలిచారు. మరోవైపు రొమానియన్ రియాల్టీ షోలో లులియా పాల్గొన్న వీడియోనొక దాన్ని సల్మాన్ ట్విట్టర్లో షేర్ చేశాడు. అంతేకాదు.. తనకు కూడా ఇలాంటి షో చేయాలని ఉందని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఇక నేను పెళ్ళి చేసుకునేది అనుమానమే. ఆ వయసు దాటేసాను. కానీ పిల్లల్ని కనాలని ఉంది.. ఇద్దరు ముగ్గురు పిల్లలు కావాలని ఓ ఇంటర్యూలో చెప్పాడు. కాగా టాప్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినా కథ మాత్రం పెళ్ళి పీటల దాకా వెళ్ళలేదు. ప్రసుతం రోమానియా నటి లులియా వాంటర్ తో సల్మాన్ డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు ఉన్నా, సల్మాన్ ఇంకా ధృవీకరించలేదు. -
గర్ల్‌ఫ్రెండ్‌తో సల్మాన్ నిశ్చితార్థం?
ఎన్నాళ్లుగానో కాపాడుకుంటూ వస్తున్న బ్యాచ్‌లర్ జీవితానికి భజరంగీ భాయిజాన్ త్వరలోనే స్వస్తి చెప్పనున్నారా? వచ్చే ఏడాది సల్మాన్‌ఖాన్ ఓ ఇంటివాడు కాబోతున్నారా? అంటే ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న వార్తలు అవుననే అంటున్నాయి. 49 ఏళ్ల ఈ కండల వీరుడు తన గర్ల్‌ఫ్రెండ్, రొమెనియన్ టీవీ నటి, హోస్ట్ లులియా వంటుర్‌తో ఎంగెజ్మెంట్ చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. లులియా వంటుర్ కూడా అస్పష్టంగానైనే ఇదే విషయమై ట్విట్టర్లో ఆనందం పంచుకున్నది. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టు ట్వీట్ చేసింది. 'లా.. లా.. లా.. సచ్ ఏ బ్యూటీఫుల్ లైఫ్.. హృదయంలోని ఎన్నో అందమైన ఊసులను పంచుకోబోతున్నాం' అంటూ లులియా ట్విట్టర్లో పేర్కొంది. అంతేకాకుండా ఆమె వ్యక్తిగత పబ్లిసిటీ అధికారి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సల్మాన్-లులియా మధ్య నిశ్చితార్థం జరిగిందని, వచ్చే సంవత్సరం వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చెప్పారు. ఈ పెళ్లి సంబంధించిన ట్వీట్లను ఆమె తన స్వస్థలం బుచరెస్ట్కు చేరకుండా ఫిల్టర్ చేయడం కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నది. ఆ వార్తలు పుకార్లే! అయితే, గతంలో కూడా పలుమార్లు సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి పెళ్లి మీడియాలో, ఆన్లైన్లో వార్తలు వచ్చాయి. అదే తరహాలో ఈ వార్తలు కూడా నిజం కాదని, లులియతో తన అన్న సల్మాన్‌కు నిశ్చితార్థం అయిందని వచ్చిన వార్తలు పుకార్లేనని చెల్లెలు అర్పితాఖాన్ పేర్కొంది. -
న్యూ గాళ్ ఫ్రెండ్!
సినిమాలతో పాటు ఎప్పటికప్పుడు గాళ్‌ఫ్రెండ్స్‌ను అప్డేట్ చేయడంలో సల్మాన్‌ఖాన్‌తో ఎవరూ పోటీపడలేరేమో! అప్పుడెప్పుడో ఐశ్వర్యారాయ్, ఆ మధ్య కత్రినా, తరువాత జాక్వెలిన్ ఫెర్నాండజ్‌తో రొమాన్స్ చేసిన ఈ బ్యాచిలర్ లిస్ట్‌లో ఇప్పుడు మరో భామ చేరింది. చెల్లి అర్పితాఖాన్ పెళ్లి సందర్భంగా ఈ విషయం వెలుగు చూసింది. ‘ఓ తేరీ’లో చేసిన ఐలియా వంచూర్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేదట సల్మాన్. ఆ అమ్మాయిని తెచ్చి ఫ్యామిలీ మెంబర్స్, అర్పిత క్లోజ్ ఫ్రెండ్స్‌కు పరిచయం చేశాడట. -
రుమేనియా బ్యూటితో సల్మాన్ పెళ్లి
బ్యాచిలర్ లైఫ్ తో విసిగెత్తిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఈ సంవత్సరం చివర్లో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిపారు. ఇండియా టుడే సదస్సులో పాల్గొన్న సల్మాన్.. గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న రుమేనియా బ్యూటి లులియా వాంటర్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు అన్నారు. గత కొద్దికాలంగా పెళ్లిపై దృష్టి మరలిందన్నాడు. కొద్ది రోజులుగా నిట్టూర్పులతో జీవితం గడుస్తోందని.. ఇక నిట్టూర్పులకు ముగింపు పలకాలని అనుకుంటున్నట్టు సల్మాన్ వెల్లడించారు. మానవత్వం అంటే ఇష్టమని.. ఇస్లాం, క్రైస్తవ మతాలను నమ్ముతాను.. నా తండ్రి ముస్లిం.. తల్లి హిందువు.. రెండవ తల్లి కాథలిక్.. బావ పంజాబీ.. అయితే ఈసారి మా ఇంట్లోకి బయట నుంచి కోడల్ని తీసుకురావాలనుకుంటున్నానని సల్మాన్ చమత్కరించారు. ఎంతోమంది హీరోయిన్లతో సల్మాన్ కు అఫైర్ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాను లవర్ కంటే మంచి ఫ్రెండ్ గా సరిపోతానని సల్మాన్ తెలిపారు.