ఇంకా పెళ్లి చేసుకోలేదు: సల్మాన్ ప్రేయసి | Attention Salmaniacs, alleged girlfriend Iulia Vantur is not in a hurry to get married | Sakshi
Sakshi News home page

ఇంకా పెళ్లి చేసుకోలేదు: సల్మాన్ ప్రేయసి

Published Sun, May 22 2016 11:03 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఇంకా పెళ్లి చేసుకోలేదు: సల్మాన్ ప్రేయసి - Sakshi

ఇంకా పెళ్లి చేసుకోలేదు: సల్మాన్ ప్రేయసి

న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ త్వరలోనే తన ప్రియురాలు, రొమేనియా బ్యూటీ లులియా వంటూర్ ను పెళ్లిచేసుకోనున్నట్లు ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే ఈ వదంతులపై టీవీ నటి లులియా స్పందించింది. సల్మాన్ తో వివాహం అంటూ వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. పెళ్లి చేసుకోవడానికి తాను ఇప్పుడు సిద్ధంగా లేదని, తనకు పెళ్లిపై తొందరేం లేదంటూ కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పేసింది. లులియ- సల్మాన్ పెళ్లి వచ్చే డిసెంబర్‌లో జరగనుందని, ఈమేరకు సల్మాన్ కుటుంబం ఏర్పాట్లు కూడా చేసుకుంటుందని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో వదంతులకు సమాధానం చెప్పాలని భావించిన లులియా తన ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని విషయాలు పేర్కొంది. గతంలో తనకు పెళ్లయిందని వస్తున్న వార్తల్లో నిజంలేదని, తనకు అసలు పెళ్లి జరగలేదని స్పష్టంచేసింది. అయితే కొన్ని రోజుల కింద ప్రీతిజింటా వివాహ రిసెస్పన్ లో లులియా, సల్మాన్ తల్లి చేతి పట్టుకుని తిరుగుతూ సందడి చేసిన విషయం తెలిసిందే. వదంతులపై రియాక్ట్ అవ్వాల్సిందేమీ లేదని, ఇప్పట్లో వెడ్డింగ్ డ్రెస్ లో కనిపించాలని ఉవ్విళ్లూరడం లేదన్నట్లు తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో సల్మాన్ ప్రేయసి లులియా వంటూర్ రాసుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement