ఆయన ప్రియురాలికి ఇప్పటికే పెళ్లయిందా! | who Iulia Vantur was married to before she met Salman Khan | Sakshi
Sakshi News home page

ఆయన ప్రియురాలికి ఇప్పటికే పెళ్లయిందా!

Published Mon, May 16 2016 5:33 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఆయన ప్రియురాలికి ఇప్పటికే పెళ్లయిందా! - Sakshi

ఆయన ప్రియురాలికి ఇప్పటికే పెళ్లయిందా!

బాలీవుడ్‌లోనే అత్యంత ముదురు బాహ్మచారి సల్మాన్‌ ఖాన్‌. ఆయన పెళ్లి గురించి నిత్యం కథనాలు రావడం పరిపాటే. అదిగో సల్మాన్ పెళ్లి, ఇదిగో సల్మాన్ పెళ్లి అంటూ ఎన్ని కథనాలు వచ్చినా ఈ కండలవీరుడు మాత్రం తన వివాహం గురించి ఏమీ క్లారిటీ ఇవ్వడం లేదు. కానీ, ఇటీవల మాత్రం 'బజరంగీ భాయ్‌జాన్‌' పెళ్లి ఖాయమని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకొని.. తన బ్యాచిలర్‌ జీవితానికి సల్మాన్‌ గుడ్‌ బై చెప్తాడని ఆ వర్గాలు అంటున్నాయి.

సల్మాన్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకొన్నందుకు అతని అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉందని ఇటీవల కథనాలు వచ్చాయి. ఈ కథనాలకు బలం చేకూరుస్తూ.. సల్మాన్‌-లులియా వంటుర్‌ ఇటీవల కలిసి మీడియాకు పోజులిచ్చారు. ప్రీతిజింటా పెళ్లివిందులో ఈ జంట కలిసి వచ్చి హల్‌చల్ చేసింది. దీంతో ఈ ఇద్దరి పెళ్లి ఖాయమని ఘంటాపథంగా చెప్పేశారు బాలీవుడ్‌ గాసిప్‌ రాయుళ్లు.

ఈ నేపథ్యంలో చాలాకాలంగా సల్మాన్‌తో డేటింగ్ చేస్తున్న లులియా వంటూర్‌ గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మోడల్ అయిన లులియా గతంలో రొమేనియన్‌ సూపర్ స్టార్‌ మారిసయ్ మోగాను పెళ్లాడింది. నాలుగేళ్ల తర్వాత వీళ్ల పెళ్లి పెటాకులైంది. ఈ దంపతులు విడిపోవడానికి కారణాలు ఏమిటన్నది మాత్రం తెలియదని ఓ బాలీవుడ్ న్యూస్ వెబ్‌సైట్ తెలిపింది. ఈ కథనంపై సల్మాన్ గానీ, లులియాగానీ స్పందించలేదు. కానీ ఈ ఏడాది చివర్లో మాత్రం వీరిద్దరి పెళ్లి ఖాయమని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి.  

                                             ( మాజీ భర్తతో లులియా ఫొటోలు)

మాజీబ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement