ఈ పోస్ట్ పెళ్లి గురించేనా..? | lulia post after statement clarifying about marriage | Sakshi
Sakshi News home page

ఈ పోస్ట్ పెళ్లి గురించేనా..?

Published Tue, May 24 2016 12:15 PM | Last Updated on Mon, Sep 4 2017 12:50 AM

ఈ పోస్ట్ పెళ్లి గురించేనా..?

ఈ పోస్ట్ పెళ్లి గురించేనా..?

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాల మీద కన్నా సల్మాన్ ఖాన్, లులియా వాంటూర్ల పెళ్లి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సినిమా ఫంక్షన్స్తో పాటు పలు ప్రైవేట్ కార్యక్రమాలకు కూడా వీళ్లిద్దరు కలిసి కనిపించటంతో ఈ ఏడాది సల్మాన్ ఖాన్ పెళ్లి ఖాయం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై సల్మాన్తో పాటు లులియా కూడా క్లారిటీ ఇవ్వటంతో ఈ రూమర్స్కు తెరపడినట్టే అనుకున్నారు.

కానీ తాజాగా తన ఇన్స్స్టాగ్రామ్లో లులియా చేసిన ఓ పోస్ట్ మరోసారి వార్తల్లో నిలిచింది. 'దేవుడే మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనకు కావల్సింది, సరైన సమయంలో మనకు అందిస్తాడు'. అని రాసి ఉన్న ఫోటో ఇమేజ్ను పోస్ట్ చేసింది లులియా.

ఈ కామెంట్ లులియా, తన పెళ్లిని ఉద్దేశించే చేసినట్టుగా భావిస్తున్నారు ఫ్యాన్స్. సరైన సమయంలో సల్మాన్తో తన పెళ్లి ఉంటుందని లులియా హింట్ ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు. క్లారిటీ ఇచ్చినట్టుగానే ఇచ్చి మరోసారి కన్య్ఫూజ్ చేసిన లులియా ఈ రూమర్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

Start a new week #goodthoughts #Godisgreat #lifeisgood #noquestion #nodemand #norush #noexpectations #enjoythemoment #love #life #havefaith

A photo posted by Iulia Vantur Official Account (@vanturiulia) on

May 23, 2016 at 1:42am PDT

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement