మేం లవర్స్ కాదుగానీ..! | Iulia Vantur comments on Salman Khan | Sakshi
Sakshi News home page

మేం లవర్స్ కాదుగానీ..!

Published Thu, Aug 25 2016 4:39 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

మేం లవర్స్ కాదుగానీ..! - Sakshi

మేం లవర్స్ కాదుగానీ..!

బాలీవుడ్‌ బ్రాహ్మచారి సల్మాన్‌ ఖాన్‌ ప్రియురాలిగా ప్రచారం కావడంతో ఆమె చుట్టూ మీడియా చాలా చక్కర్లు కొట్టింది. కానీ, లులియా వంటూర్ ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదు. సల్మాన్‌-లులియా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని, ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని కథనాలు కూడా వచ్చాయి. అయినా ఆమె పెద్దగా స్పందించిన దాఖలా లేదు.

కానీ, తాజాగా ఈ రొమేనియన్ సుందరి నోరువిప్పింది. మీడియాతో మాట్లాడింది. సహజంగానే.. 'మీరు సల్మాన్‌తో డేటింగ్ చేస్తున్నారా? ఆయనను ఎప్పుడు పెళ్లిచేసుకుంటారు?' అంటూ మీడియా ఆరాతీసింది. తాజాగా 'స్పై' మ్యాగజీన్‌తో ముచ్చటించిన ఈ అమ్మడు.. సల్మాన్‌, తాను స్నేహితులం మాత్రమేనని చెప్పింది. మీరు సల్మాన్‌తో డేటింగ్ చేస్తున్నారా? అని అడిగితే.. లేదని సమాధానమిచ్చింది. 'మేం స్నేహితులమంటే స్నేహితులమే.. అంతకుమించి మా మధ్య ప్రేమ లేదు' అని తెలిపింది. తమ మధ్య ఉన్న స్నేహం గురించి వివరిస్తూ 'కొన్ని మంచి సమయాల్లో మంచి విషయాలు జరుగుతుంటాయి. కానీ మిగతావన్నీ వదంతులే' అని పేర్కొంది.

సల్మాన్‌, లులియా చాలా వేడుకల్లో కలిసి కనిపించారు. లడఖ్‌లో సల్మాన్‌ సినిమా షూటింగ్‌ సందర్భంగా.. సల్మాన్, లులియ కలిసి దలైలామాను కలిశారు. సల్మాన్ సోదరి ఆర్పితాఖాన్‌ పుట్టినరోజు వేడుకలోనూ ఈ ఇద్దరు జంటగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లోనే కాదు.. లులియా స్వదేశమైన రొమేనియాలోనూ లులియా మిసెస్‌ సల్మాన్‌ ఖాన్‌గా మారబోతున్నట్టు కథనాలు వచ్చాయి. లులియా మాత్రం ఇప్పటికీ తమ మధ్య ఉన్నది స్నేహమేనంటూ ముగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement