గర్ల్ఫ్రెండ్తో సల్మాన్ నిశ్చితార్థం? | Has Salman Khan Finally Lost His Bachelor Tag? | Sakshi
Sakshi News home page

గర్ల్ఫ్రెండ్తో సల్మాన్ నిశ్చితార్థం?

Published Mon, Oct 19 2015 7:00 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

Has Salman Khan Finally Lost His Bachelor Tag?

ఎన్నాళ్లుగానో కాపాడుకుంటూ వస్తున్న బ్యాచ్లర్ జీవితానికి భజరంగీ భాయిజాన్ త్వరలోనే స్వస్తి చెప్పనున్నారా? వచ్చే ఏడాది సల్మాన్ఖాన్ ఓ ఇంటివాడు కాబోతున్నారా? అంటే ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న వార్తలు అవుననే అంటున్నాయి. 49 ఏళ్ల ఈ కండల వీరుడు తన గర్ల్ఫ్రెండ్, రొమెనియన్ టీవీ నటి, హోస్ట్ లులియా వంటుర్తో ఎంగెజ్మెంట్ చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. లులియా వంటుర్ కూడా అస్పష్టంగానైనే ఇదే విషయమై ట్విట్టర్లో ఆనందం పంచుకున్నది.


కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టు ట్వీట్ చేసింది. 'లా.. లా.. లా.. సచ్ ఏ బ్యూటీఫుల్ లైఫ్.. హృదయంలోని ఎన్నో అందమైన ఊసులను పంచుకోబోతున్నాం' అంటూ లులియా ట్విట్టర్లో పేర్కొంది. అంతేకాకుండా ఆమె వ్యక్తిగత పబ్లిసిటీ అధికారి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సల్మాన్-లులియా మధ్య నిశ్చితార్థం జరిగిందని, వచ్చే సంవత్సరం వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చెప్పారు. ఈ పెళ్లి సంబంధించిన ట్వీట్లను ఆమె తన స్వస్థలం బుచరెస్ట్కు చేరకుండా ఫిల్టర్ చేయడం కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నది.


ఆ వార్తలు పుకార్లే!
అయితే, గతంలో కూడా పలుమార్లు సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి పెళ్లి మీడియాలో, ఆన్లైన్లో వార్తలు వచ్చాయి. అదే తరహాలో ఈ వార్తలు కూడా నిజం కాదని, లులియతో తన అన్న సల్మాన్కు నిశ్చితార్థం అయిందని వచ్చిన వార్తలు పుకార్లేనని చెల్లెలు అర్పితాఖాన్ పేర్కొంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement