engaged
-
తెలుగులో 'నాని'తో ఒకే ఒక సినిమా.. ప్రియుడితో మలయాళ బ్యూటీ పెళ్లి (ఫోటోలు)
-
ఫిలిం ఫైనాన్స్ బంగారు బాబు కొడుకు నిశ్చితార్థ వేడుకలో ప్రముఖులు సందడి (ఫొటోలు)
-
సీరియల్స్‌లో కలిసి నటించి ఆపై ఏడడుగుల బంధంతో ఒక్కటి కానున్న జంట (ఫోటోలు)
-
వైభవంగా నటుడి రోకా వేడుక, రణబీర్, కరీనా,సైఫ్, సందడి (ఫొటోలు)
-
'బిగ్‌బాస్' ఫేమ్ సోనియా ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ (ఫొటోలు)
-
మురళీమోహన్ మనవరాలితో కీరవాణి కొడుకు పెళ్లి...ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
వేడుకగా హీరో నారా రోహిత్ నిశ్చితార్థం (ఫొటోలు)
-
హీరో నారా రోహిత్‌తో నిశ్చితార్థం.. ఈ హీరోయిన్ ఎవరంటే? (ఫొటోలు)
-
అక్కినేని ఫ్యామిలీతో కలిసిపోయిన శోభిత.. ఎంగేజ్మెంట్ లేటెస్ట్ (ఫొటోలు)
-
ట్రిపుల్ ఎయిట్...ఎంగేజ్డ్
‘‘నా తనయుడు నాగచైతన్య నిశ్చితార్థం శోభితా ధూళిపాళ్లతో ఈ రోజు (గురువారం) ఉదయం 9 గంటల 42 నిమిషాలకు జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మా కుటుంబంలోకి ఆమెను సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ఈ నూతన జంటకు శుభాకాంక్షలు. ప్రేమ, సంతోషాలతో వీరి జీవితాలు నిండిపోవాలని కోరుకుంటున్నాను.8.8.8.. (ఎనిమిదో తేదీ... ఎనిమిదో నెల... 2024ని కూడితే ఎనిమిది) అనంతమైన ప్రేమకు నాంది.. శోభితా, నాగచైతన్య’’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేసి, నాగచైతన్య–శోభితల నిశ్చితార్థం ఫొటోలను షేర్ చేశారు అక్కినేని నాగార్జున. అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం హైదరాబాద్‌లోని అక్కినేని నాగార్జున ఇంట్లో జరిగింది. కాగా చైతన్య–శోభిత ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.అడివి శేష్ నటించిన ఓ చిత్రానికి సంబంధించిన హౌస్‌పార్టీలో నాగచైతన్య, శోభితాలకు తొలిసారి పరిచయం ఏర్పడిందని, అది ప్రేమగా మారిందని టాక్. ‘జోష్’తో హీరోగా ప్రయాణం మొదలుపెట్టి, ఇప్పుడు చేస్తున్న ‘తండేల్’ వరకూ నాగచైతన్య కెరీర్ గురించి అందరికీ తెలిసిందే. ఇక శోభితా ధూళిపాళ్ల విషయానికొస్తే... ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో వేణుగోపాల్ రావు, శాంతాకామాక్షి దంపతులకు జన్మించారు. ఆమెది బ్రాహ్మణ కుటుంబం.2013లో ఫెమీనా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ విజేతగా నిలిచారామె. ఆ తర్వాత ‘రామన్ రాఘవ్ 2.ఓ’తో నటిగా శోభిత ప్రయాణం హిందీలో మొదలైంది. ‘బార్డ్ ఆఫ్ బ్లడ్, మేడ్ ఇన్ హెవెన్, ది నైట్ మేనేజర్’ వంటి హిందీ వెబ్ సిరీస్‌ల ద్వారానూ పాపులర్ అయ్యారు. 2018లో వచ్చిన అడివి శేష్ హిట్ ఫిల్మ్ ‘గూఢచారి’లో ఓ లీడ్ రోల్లో నటించారు శోభిత. ‘మేజర్’లోనూ ఓ ముఖ్య పాత్ర చేశారు. హాలీవుడ్ ఫిల్మ్ ‘మంకీ మ్యాన్’లోనూ నటించారు. ఇక 2017లో నాగచైతన్య–సమంత పెళ్లి చేసుకున్న విషయం, 2021లో విడిపోయిన విషయం తెలిసిందే. -
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం..? (ఫోటోలు)
-
‘నన్ను పెళ్లాడతావా’.. స్వర్ణంతో పాటు ఎంగేజ్మెంట్ రింగ్ కూడా (ఫొటోలు)
-
Shine Tom Chacko Engagement: లేటు వయసులో పెళ్లికి రెడీ అయిన దసరా విలన్.. ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
Aishwarya-Umapathy Engaged: ఘనంగా హీరో అర్జున్ కుమార్తె ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
చిన్ననాటి స్నేహితురాలితో సీఎస్కే స్టార్ తుషార్దేశ్ పాండే ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
ఎట్టకేలకు గర్ల్‌ఫ్రెండ్‌తో అమెజాన్ ఫౌండర్ ఎంగేజ్మెంట్
న్యూఢిల్లీ: బిలియనీర్, 59 ఏళ్ల అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఎప్పటినుంచో చెట్టాపట్టాలేసుకున్న తిరుగుతున్న వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారని పేజ్ సిక్స్ నివేదించింది. ఈ వార్తలను వారు ధృవీకరించినట్లు కూడా పేర్కొంది. 500 మిలియన్ డాలర్ల విలువైన లగ్జరీ యాచ్ ‘కోరు’లో ఆమెకు ప్రపోజ్ చేశాడు బెజోస్. ఖరీదైన డైమండ్ ఉంగరంతో ఉన్న లారెన్ ఫోటోలు వైరల్‌గా మారాయి . 20 క్యారెట్ల హార్ట్ షేప్‌లో ఉన్న ఈ డైమండ్ రింగ్ విలువ సుమారు 2.5 మిలియన్ డాలర్లని అంచనా. (రిలయన్స్ షాక్: ఉద్యోగాలు ఫట్; రానున్న కాలంలో వేలాది కోతలు!) ఈ లవ్‌బర్డ్స్ ప్రస్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఫ్రాన్స్‌లో ఉన్నారు. స్టార్-స్టడెడ్ పార్టీకి ఖరీదైన బోటులో కేన్స్‌కు చేరుకున్నారు. భార్యతో విడాకుల తర్వాత,గత కొంత కాలంగా తన గర్ల్ఫ్రెండ్నుపెళ్లి చేసుకోబోతున్నాడనే ప్రచారం సాగుతున్నసంగతి తెలిసిందే. మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ సాంచెజ్, బెజోస్ 2018 నుంచే డేటింగ్లో ఉన్నారు. కాగా 25ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ భార్య మెకెంజీ స్కాట్‌తో 2019లో బెజోస్ విడాకులు తీసుకున్నాడు. బెజో, మెకెంజీ నలుగురు పిల్లలున్నారు. అటు శాంచెజ్ కూడా తన భర్త పాట్రిక్ వైట్ సెల్ నుండి విడాకులు తీసుకుంది. శాంచెజ్, వైట్ సెల్ జంటకు ఎల్లా , ఇవాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
Aaliyah Kashyap: డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
ఆ నేత ఎంగేజ్మెంట్ రోజే.. భారీ మెజార్టీతో పార్టీ గెలుపు
ఎంగేజ్మెంట్ రోజునే ఓ నాయకుడి పార్టీ కూడా ఘన విజయం సాధించడం అనేది అత్యంత అరుదైన సందర్భం. అలాంటి అరుదైన ఘటన ఆప్ నేత దక్కించుకున్నాడు. అసలేం జరిగిందంటే.. న్యూఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో ఆప్ నాయకుడు రాఘవ్ చద్ధా, నటి పరిణీతి చోప్రాతో ఎంగేజ్మెంట్ శనివారం జరిగనుంది. ఇదే రోజు ఆయన పార్టీ కూడా భారీ మెజార్టీతో గెలిచింది. దీంతో తనకు ఈ రోజు మరింత ప్రత్యేకమని ఆనందంగా చెబుతున్నారు రాఘవ్ చద్దా. ఈ ఫంగ్షన్కి దంపతుల కుటుంబ సభ్యులు, సన్నిహితుల తోసహా 150 మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఈ వేడుకకు పరిణీతి కజిన్ గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా కూడా హాజరుకానున్నారు. సరిగ్గా ఈ రోజే జలంధర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఈ మేరకు రాఘవ్ చద్దా ట్విట్టర్ వేదికగా..ఈ రోజు నాకు మరింత ప్రత్యేకమైనది మాత్రమే గాక మంచి జ్ఞాపకం కూడా. నా తల్లి ఇల్లు లాంటి జలంధర్‌లో ఈ రోజు ఆప్ మంచి ఘన విజయ సాధించింది. అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, మే 10 జరిగిన జలంధర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో చతుర్ముఖ పోటీ జరిగింది. ఆప్‌లోకి మారిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సుశీల్ కుమార్ రింకూ కాంగ్రెస్‌కు చెందిన కరమ్‌జిత్ కౌర్‌పై 58 వేల ఆధిక్య ఓట్లతో విజయం సాధించారు.అని ట్వీట్ చేశారు. అయితే ఈ కరమ్‌జిత్ కౌర్ ఈ ఏడాది జనవరిలో భారత్ జోడో యాత్రలో మరణించిన సంతోష్ చౌదరి భార్య. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ విజయాన్ని అపూర్వమైనది అని పేర్కొన్నారు. అంతేగాదు పంజాబ్‌లో భగవంత్ మాన్ ప్రభుత్వం మంచిగా పని చేయడం వల్లే తాము గెలిచామని అన్నారు కేజ్రీవాల్. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. మేము రాజకీయాల్లోకి వచ్చి పనిచేసేందుకు ప్రజలను ఓట్లు అడుగుతాం. మేము మా పని చేశాం, తమ వెంట ప్రజలు ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు మా బాధ్యతను, విశ్వాసాన్ని మరింత పెంచాయన్నారు. అలాగే పంజాబ్‌ని మరింతగా అభివృద్ధి చేసేందుకు మరింతగా కష్టపడతాం అని భగవంత్ మాన్ అన్నారు. (చదవండి: ఇది సంతృప్తి చెందాల్సిన సమయం కాదు!: శశి థరూర్) -
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ఎంగేజ్మెంట్ (ఫొటోలు)
-
పెళ్లి పీటలు ఎక్కబోతున్న భారత క్రికెటర్ (ఫోటోలు)
-
అతడికి 19.. ఆమెకు 56.. పెళ్లికి సిద్ధమైన జంట
బ్యాంకాక్: ప్రేమ గుడ్డిది, దానికి వయసు, పరిధి, దూరం వంటి వాటితో సంబంధం ఉండదు అనే డైలాగులు చాలా సినిమాల్లో వినే ఉంటాం. దానిని థాయ్‌లాండ్‌కు చెందిన ఓ జంట నిజం చేసి చూపుతోంది. ఇద్దరి మధ్య 37 ఏళ్ల వయసు తేడా ఉంది. అయినప్పటికీ.. 19 ఏళ్ల యువకుడు, 56 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆమెతో నిశ్చితార్థం సైతం చేసుకున్నాడటా! ప్రస్తుతం వారి ప్రేమ, పెళ్లి అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారింది. ఉత్తర థాయ్‌లాండ్‌లోని సఖోన్ నఖోన్ రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల వుతిచాయ్ చంతరాజ్ అనే యువకుడు, 56 ఏళ్ల వయసు ఉన్న జన్లా నమువాన్గ్రాక్ అనే మహిళను పెళ్లి చేసుకోబోతున్నాడు. అతని 10 ఏళ్ల వయసున్నప్పుడు ఆమెను కలిశాడు. ఇరువురు ఇరుగుపొరుగు ఇంట్లోనే ఉండేవారు. ఈ క్రమంలో ఇంటిని శుభ్రం చేసేందుకు తనకు సాయం చేయమని వుతిచాయ్ని కోరేది మహిళ. ఇలా.. చిన్న చిన్న పనుల్లో సాయంగా ఉంటుండంతో ఇరువురి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 37 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ గత రెండేళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారు. ‘రెండేళ్లుగా జల్నాతో ఉంటున్నాను. ఒకరు హాయిగా జీవించేలా చేయొచ్చని నా జీవితంలో తొలిసారి తెలుసుకున్నా. పాడైపోయిన ఆమె ఇంటిని చూశాను. ఆ తర్వాత ఆమెకు మంచి జీవితం అందించాలని ఆలోచించాను. ఆమె చాలా కష్టపడి పని చేసే వ్యక్తి, నిజాయితీగా ఉంటుంది. ఆమెను నేను ఆరాధిస్తాను.’ అని పేర్కొన్నాడు. మరోవైపు.. వయసులో తేడా పట్ల వారు ఆందోళన చెందటం లేదు. ఇంటర్వ్యూలు, బహిరంగంగా తమ బంధాన్ని వెల్లడించటంలో ఎలాంటి ఇబ్బందులు పడటం లేదు. నగరంలో బయటకి వెళ్లినప్పుడు చేతులు పట్టుకుని, ముద్దులు పెట్టుకుంటూ సరదాగా కనిపిస్తున్నారు కూడా. అయితే.. జల్నా తన భర్తతో విడిపోయింది. ఆమెకు ముగ్గురు 30 ఏళ్లకుపైగా వయసున్న పిల్లలు ఉన్నారు. వుతిచాయ్ తనలో యువతిననే ఆలోచన కలిగించాడని చెబుతోంది. ‘వుతిచాయ్ నాకు ఒక సూపర్ హీరో. ప్రతి రోజు నాకు సాయం చేస్తాడు.అతను పెద్దవాడయ్యాక మా ఇరువురి మధ్య భావాలు మొదలయ్యాయి.’ అని పేర్కొంది జల్నా. త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: వీడియో: చెంప దెబ్బకు డెలివరీబాయ్ ఇచ్చిన రియాక్షన్.. మరీ వయొలెంట్‌గా ఉందే! -
సాయిగణేష్‌తో నిశ్చితార్థమైన యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, ఖమ్మం జిల్లా: ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌తో నిశ్చితార్థం జరిగిన యువతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి మనస్థాపంతో ఉన్న యువతి విజయ ఇవాళ మధ్యాహ్నం ఖమ్మంలో సాయి గణేష్ నిర్మించాలనుకున్న బీజేపీ పార్టీకి సంబంధించిన దిమ్మె స్థలంలో అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్థానికులు వెంటనే గమనించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. చదవండి: తెలంగాణ సీఎస్‌పై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వచ్చే నెల 4వ తేదీ సాయి గణేష్, విజయ వివాహం జరగాల్సి ఉంది. ఈ నెల 14వ తేదీ ఖమ్మం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సాయి గణేష్.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించగా అక్కడ ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయి గణేష్ మృతి చెందాడు. ఆ తర్వాత సాయి గణేష్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.. సాయి గణేష్ మృతికి కారణమైన మంత్రి అజయ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో కూడా నడుస్తోంది. -
హీరో ఆది పినిశెట్టితో హీరోయిన్ నిక్కీ గల్రానీ నిశ్చితార్థం (ఫొటోలు)
-
అంగరంగ వైభవంగా నిఖిల్‌గౌడ నిశ్చితార్థం
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ నిశ్చితార్థం బెంగళూరులో ఘనంగా జరిగింది. దీనికి పార్టీ నేతలతో పాటు నిఖిల్ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్లో నిఖిల్, రేవతిల నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు అన్ని పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు హాజరయ్యారు. దాదాపు 4 నుంచి 5 వేల మంది ఈ వేడుకలో పాల్గొన్నారు. వేలాదిమంది అతిథులు, బంధువులు మధ్య నిఖిల్, రేవతిల నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. పెళ్లికి కూడా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ తెలుగుచిత్ర సీమకు కూడా సుపరిచితుడే. నాలుగేళ్ల క్రితం జాగ్వార్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు. తదనంతర కాలంలో కర్ణాటక ఎన్నికలలో మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి జేడీఎస్ అభ్యర్థిగా పోటీచేసి స్వతంత్ర అభ్యర్థి అయిన సుమలతా అంబరీష్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం సినిమాలపైన దృష్టిపెట్టిన నిఖిల్ ఇప్పుడు పెళ్లితో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. -
పెళ్లిపీటలు ఎక్కనున్న మరో క్రికెటర్
సాక్షి, న్యూఢిల్లీ: క్రికెటర్లు ఒక్కొక్కరూ వివాహానికి సిద్ధమైపోతున్నారు. గత వారం ఐపీఎల్ 11 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగిన బౌలర్ సందీప్ శర్మ తన స్నేహితురాలిని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. తాజాగా మరో ఆటగాడు పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమయ్యాడు. ఇదే ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన నితిశ్ రాణా త్వరలో ఓ ఇంటి వాడుకాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు సాచి మర్వాతో ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో నితిశ్ రాణాకు తన స్నేహితురాలు సాచిన మార్వాకు నిశ్చితార్థం జరిగింది. అతి తక్కువమంది సన్నిహితులు, స్నేహితుల మధ్య ఇరు కుటుంబాలకు చెందిన వారు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోల్‌కతా నైట్ రైటర్స్ తన అధికారిక ట్విటర్ ద్వారా కొత్త జంట ఫొటోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. Congratulations to #Knight @NitishRana_27 & @saachimarwah7! 👫♥ The #KKR family wishes both of you a lifetime of joy & happiness on your engagement! 💍 pic.twitter.com/TbEpq9IQtf — KolkataKnightRiders (@KKRiders) June 11, 2018 -
కామన్వెల్త్ గేమ్స్‌లో మధుర క్షణం
-
కామన్వెల్త్ వేదికగా ఎంగేజ్మెంట్.. వైరల్
గోల్డ్ కోస్ట్ : ప్రేమ ఎప్పుడు, ఎక్కడ పుడుతుందో చెప్పలేం. ప్రేమను గెలుపించుకున్న ఆనందం ఒకరిదైతే.. తన మనసుకు నచ్చినవాడే ఎదురొచ్చి ప్రపోజ్ చేస్తే ఆ సంతోషమే వేరు. ప్రస్తుతం అస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో ఇలాంటి మధుర క్షణం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ క్రీడాకారులు తమ సత్తా చాటుతూ పతకాల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు ఆ దేశానికి చెందిన ఇద్దరు బాస్కెట్ బాల్ ప్లేయర్స్ కామన్వెల్త్ గేమ్స్‌ను తమ జీవితాల్లో మరచిపోలేని వేడుకకు వేదికగా చేసుకున్నారు. బాస్కెట్ బాల్ పురుషుల జట్టుకు చెందిన జామెల్ అండర్సన్, ఆ దేశ బాస్కెట్ బాల్ మహిళల జట్టుకు చెందిన జార్జియా జోన్స్‌కి ప్రపోజ్ చేశాడు. బాస్కెట్ బాల్ విభాగంలో కామెరూన్ జట్టుపై విజయం సాధించిన అనంతరం ఇంగ్లండ్ జట్టు సభ్యుడు అండర్సన్ తన గర్ల్‌ఫ్రెండ్ జోన్స్‌కి మోకాలిపై కూర్చోని సినిమా సీన్లను తలపించేలా.. తన ప్రేమ విషయాన్ని తెలిపాడు. అతడి లవ్ ప్రపోజల్‌కు జోన్స్ ఒకే చెప్పగానే అండర్సన్ తోటి క్రీడాకారుల సమక్షంలో ఆమెకు ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగి ఉద్వేగానికి లోనయ్యాడు. తన తోటి క్రీడాకారులు చేసిన ఏర్పాట్ల వల్లే ఇంత చక్కగా తన గర్ల్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేయగలిగానని అండర్సన్ తెలిపాడు. వీరి నిశ్చితార్థంతో మైదానంలో సందడి వాతావరణం నెలకొంది. కామన్వెల్త్ వేదికగా జరిగిన వీరి ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫొటోలు, వీడియోను ఇంగ్లండ్ బాస్కెట్‌బాల్ టీమ్ తమ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు క్రీడాకారులు వీరికి బెస్ట్ విషెస్ చెబుతున్నారు. -
పాప్ సంచలనం ఎంగేజ్మెంట్ అయిపోయిందా?
మాంచెస్టర్: అమెరికన్ సింగర్, పాప్ సంచలనం, అరియానా గ్రాండే (23) మాంచెస్టర్ మాక్ మిల్లర్ ల ఎంగేజ్మెంట్ అయిపోయిందనే పుకార్లు ఇపుడు పాప్ వరల్డ్ లో షికార్లు చేస్తున్నాయి. వన్ లవ్ మాంచెస్టర్ కచేరీలో ఆమె వేలికి రింగ్ మెరవడంతో ఈ లవ్‌బర్డ్స్ కు నిశ్చితార్ధం అయిపోయిందనే పుకార్లు వ్యాపించాయి. జూన్ 4 న వన్ లవ్ మాంచెస్టర్ బెనిఫిట్ షోలో, వీరిద్దరు వేదికపై "ది వే" , "డాంగ్" అనే డ్యూయట్స్‌ను ఆలపించారు. ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానం లో నిర్వహించిన ఈ కచేరీలో ఇతర అనేక పాప్ స్టార్లు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. అలాగే గ్రాండే తాను మిల్లర్ తో డేటింగ్ చేస్తున్నట్టు గత ఏడాదే ప్రకటించింది. ఇది ఇలా ఉంటే బాధితుల సహాయార్ధం అరియానా నిర్వహించిన కన్సర్ట్ భారీ విజయాన్ని సాధించింది. కార్యక్రమం ఆద్యంతం అధిక భావోద్వేగాలతో సాగింది. ముఖ్యంగా యువ అభిమానులతో కలిసి పోలీసు కలిసి ఆడి పాడిన సంఘటనపై సోషల్ మీడియా హోరెత్తింది. సిటీ ఐక్యతకు చిహ్నంగా నిలిచిన ఈ కార్యక్రమంపై ట్విట్టర్లో అభినందనల వెల్లువ కురిసింది. ప్రజలకు ఏకంలో్ చేయడంలో పాప్ మ్యూజిక్ శక్తిని ప్రదిర్శించిందన్న కమెంట్లు వెల్లువెత్తాయి. అంతేకాదు ఈ కన్సర్ట్ సగటున 10.9 మిలియన్ ప్రేక్షకులు వీక్షించగా, 14.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. అలాగే ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధికులు వీక్షించిన టీవీ కార్యక్రమంగా నిలిచింది. కాగా మాంచెస్టర్ విషాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మాంచెస్టర్ జరిగిన విషాద సంఘటన పట్ల ప్రేమతో స్పందించాలని అభిమానులకు విజ్ఞప్తి చేసిన అరియానా, ఇలా సేకరించిన నిధులను బాధిత కుటుంబాలకు అందచేస్తామని ప్రకటించారు. దాదాపు 2 మిలియన్ల డాలర్లను సేకరించాలని లక్ష్యంతో అరియానా కచేరి నిర్వహించారు. మాంచెస్టర్ లోని మ్యూజిక్ కన్సర్ట్ లో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడిలో పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. . I don't wanna take away from the amazing event we've just witnessed... but is ariana engaged ?!?! 😱😱 #OneLoveManchester pic.twitter.com/RqY09tXddy — Francesca (@ryanhawley_) June 4, 2017 -
మరో రెండు రోజుల్లో కోహ్లి నిశ్చితార్థం!
-
మరో రెండు రోజుల్లో కోహ్లి నిశ్చితార్థం!
ముంబై: గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలుతున్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి-బాలీవుడ్ నటి అనుష్క శర్మలు మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో న్యూఇయర్ వేడుకల్ని సెలబ్రెట్ చేసుకోబోతున్న ఈ జంట.. జనవరి 1వ తేదీన నిశ్చితార్థం చేసుకునే యోచనలో ఉన్నారు. 2017లో జీవితంలో స్థిరపడాలని భావిస్తున్న విరాట్-అనుష్కలు.. కొత్త ఏడాది ఆరంభపు కానుకగా నిశ్చితార్థాన్ని చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు ఉత్తరాఖండ్‌లోని నరేంద్ర నగర్‌లోని హోటల్ ఆనందాలో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి అనుష్క శర్మ తరపున కొంతమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరుకాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ ఏర్పాట్లలో ఇరు కుటుంబాల పెద్దలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై విరాట్ కోహ్లి కానీ, అనుష్క శర్మ కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. నూతన సంవత్సరం సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి-బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఉత్తరాఖండ్ విహారానికి బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట... శనివారం ఉత్తరాఖండ్ ఎయిర్ పోర్ట్‌ల దర్శనిమిచ్చింది. ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ముగిసి విరాట్ కోహ్లికి కావాల్సిన విశ్రాంతి దొరకడంతో ప్రియురాలు అనుష్కతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకోనున్నాడు. దీనిలో భాగంగానే ఈసారి ఆ జంట ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని న్యూఇయర్ వేడుకలకు ఎంచుకుంది. గతేడాది నూతన సంవత్సర వేడుకల్ని విరాట్-అనుష్కలు విదేశాల్లో జరుపుకున్నారు. -
త్వరలో ఓ ఇంటివాడు కానున్న రెజ్లర్
న్యూఢిల్లీ: భారతీయ రెజ్లర్ యోగేశ్వర్ దత్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. కాంగ్రెస్ నాయకుడు జై భగవాన్ శర్మ కుమార్తె శీతల్ ను యోగేశ్వర్ వివాహాం చేసుకోనున్నాడు. ఆదివారం సాయత్రం ఓ ప్రైవేటు పార్టీలో ఇరువురికి పెద్ద సమక్షంలో నిశ్చితార్ధం జరిగింది. ఈ కార్యక్రమానికి కొద్దిమంది సన్నిహితులనే ఆహ్వానించారు. భారతీయ రెజ్లింగ్ ఫౌండేషన్(ఐడబ్ల్యూఎఫ్) చైర్మన్ బ్రిజ్ భూషణ్ శరణ్, కొందరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు నిశ్చితార్ధానికి హాజరైనట్లు తెలిసింది. వచ్చే ఏడాది జనవరి 16న శీతల్, యోగేశ్వర్ ల వివాహం జరనుంది. -
త్వరలో... డెరైక్టర్ వెడ్స్ డాక్టర్
క్రిష్.. తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు కావల్సిన వినోదాన్ని ఇస్తున్నారు. రమ్య.. ఓ డాక్టర్‌గా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇద్దరి వృత్తులూ భిన్నమైనప్పటికీ చేస్తున్నది మాత్రం సేవే. ఈ ఇద్దరూ ఒకింటివాళ్లు కాబోతున్నారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల ట్రిడెంట్ హోటల్లో శనివారం క్రిష్-రమ్యల నిశ్చితార్థం జరిగింది. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో నటిస్తున్న నందమూరి బాలకృష్ణ తన సతీమణి వసుంధరతో విచ్చేసి శుభాకాంక్షలు అందజేశారు. క్రిష్ తీసిన ‘వేదం’లో నటించిన అల్లు అర్జున్ హాజరయ్యా రు. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, హీరో రానా తదితరులు ఈ వేడుకలో పాల్గొని, కాబోయే దంపతులకు శుభాకాంక్షలు అందజేశారు. ఆగస్ట్ 8న తెల్లవారుజాము రెండు గంటల ఇరవైఎనిమిది నిముషాలకు క్రిష్-రమ్యల వివాహ వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. -
యువ క్రికెటర్ నిశ్చితార్థం!
కోల్ కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ప్రాతినిథ్యం వహించిన యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ త్వరలో ఇంటివాడు కోబోతున్నాడు. గత కొంతకాలంగా ఐపీఎల్లో విరామం లేకుండా గడిపిన సూర్యకుమార్.. తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడు. దీనికి సంబంధించి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే వధువుకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడికాలేదు. -
పురుషులు 50శాతం, స్త్రీలు 39శాతం మాత్రమే
భారత కార్మికుల్లో పని విషయంలో మహిళలు పురుషులతో పోలిస్తే కాస్త వెనుకబడే ఉన్నారంటున్నాయి తాజా పరిశోధనలు. పనిచేసే చోట ఏభై శాతం మంది పురుషులతో పోలిస్తే కేవలం 39 శాతం మహిళలు మాత్రమే పూర్తిగా విధుల్లో నిమగ్నమౌతున్నారని సర్వేలు చెప్తున్నాయి. డేల్ కార్నెగీ ట్రైనింగ్ ఇండియా విడుదల చేసిన లెక్కల ప్రకారం భారత పురుషులు 50 శాతం మంది విధుల్లో కొనసాగుతుంటే కేవలం 39 శాతం మంది మహిళలు మాత్రమే విధుల్లో కొనసాగుతున్నారని తేల్చి చెప్పింది. అయితే ఇక్కడ కూడా నియామకాలతోపాటు ప్రతి విషయంలోనూ లింగ వివక్ష లక్ష్యంగా ఉంటోందని, ప్రమోషన్ల దగ్గర నుంచీ మహిళలకు కనిపించని అడ్డు గోడలు ప్రతి స్థాయిలోనూ ఎదురౌతూనే ఉన్నాయని సర్వేలు చెప్తున్నాయి. ఇటువంటి కారణాలతోనే విధులను మధ్యలోనే వదిలేసి వెళ్ళేవారి శాతం ఎక్కువగా ఉంటోందని డీసీటీఐ ఛైర్ పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ పల్లవి ఝా తెలిపారు. భారత మహిళలు తరచుగా కార్యాలయాల్లోని పురుష సహచరులతోపాటు... చాలా సందర్భాల్లో పై అధికారుల వివక్షకు గురౌతున్నారని డీసీటీఐ లెక్కలు చెప్తున్నాయి. అయితే ఉత్పాదకత విషయంలో మహిళలు వెనుకబడుతున్నారన్న భ్రమలో కంపెనీలు ఉండటమే కాక, అంచనాలకు మించి వారినుంచి ఆశించడం ఇందుకు కారణమౌతోందని, ముఖ్యంగా సంస్థలు మహిళల నుంచి ఎంత పని తీసుకోగలం, వారి అభివృద్ధికి ఎటువంటి ప్రోత్సాహం అందించగలం అన్నదానిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండటం అవసరమని ఝా తెలిపారు. వివిధ హోదాల్లోని మహిళలను పరిశీలిస్తే... సీ సూట్ (సీనియర్ ఎగ్జిక్యూటివ్) స్థాయిలో మహిళలు అత్యధికంగా 63 శాతం వరకు ఉంటున్నారని, సంస్థాగత పరిపాలనా స్థాయిలో 42శాతం మంది ఉండగా... న్యాయవాదులు, ఇంజనీర్లు వంటి ఇతర ప్రోఫెషనల్ ఉద్యోగాల్లో కేవలం 18 శాతం మంది మాత్రమే విధుల్లో కొనసాగుతున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇదిలా ఉంటే బీపీవోల్లో మాత్రం మహిళా ఉద్యోగుల శాతమే ఎక్కువగా ఉంటోందని, వారిలోని ప్రతిభను ఖాతాదారులను ఆకట్టుకునేందుకు ఆయా కంపెనీలు వినియోగించుకుంటున్నాయని డీసీటీఐ అధ్యయనాల్లో నిర్థారించారు. -
నిశ్చితార్థం రోజే యువకుడి ఆత్మహత్య
జమ్మికుంట : నిశ్చితార్థం రోజు ఓ యువకుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జమ్మికుంటలో ఆదివారం జరిగింది. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో రామగుండం జీఆర్పీ ఇన్చార్జి ఎస్సై బషీరొద్దీన్ వివరాలు వెల్లడించారు. వీణవంక మండం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి చంద్రమౌళి(26) దూరవిద్యావిధానంలో డిగ్రీ చదువుతూ హైదరాబాద్‌లో సీసీ కెమెరాలు బిగించే పనులు చేస్తున్నాడు. కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు చంద్ర మౌళికి వివాహం చేయాలని నిర్ణయించారు. ఆదివారం నిశ్చితార్థానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. శనివారం సాయంత్రం చంద్రమౌళి కొత్త బట్టలు తెచ్చుకునేందుకు హన్మకొండ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. రాత్రి వరకు ఇంటికి రాలేదు. ఆదివారం తెల్లవారుజామున జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. స్థానికంగా లభించిన ఆధారాలతో పోతిరెడ్డిపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నట్లు జీఆర్పీ ఇన్చార్జి ఎస్సై తెలిపారు. బంధువులకు మృతదేహన్ని అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
హాజల్ కీచ్ తో యువీ నిశ్చితార్థం!
ముంబై: టీమిండియా వన్డే వరల్డ్ కప్ హీరో, ప్లే బాయ్ యువరాజ్ సింగ్ త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యువరాజ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడన్నవార్తలకు దాదాపు ఫుల్ స్టాప్ పడినట్లే కనబడుతోంది. దీపావళి రోజున యువీ వివాహ శుభవార్త చెబుతాడని అభిమానులు ఎదురు చూపులు నిజం కాబోతున్నాయి. గత కొంతకాలంగా బ్రిటీష్ నటి హాజల్ కీచ్ తో ప్రేమాయణ సాగిస్తున్నయువీ.. ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. వీరద్దిరి నిశ్చితార్థం బాలిలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వారి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హజల్ ఓ ఉంగరంతో దర్శనమివ్వడం కూడా దీనికి మరింత బలం చేకూరుస్తోంది. ఇటీవల హర్భజన్ సింగ్‌తో జరిపిన ట్వీట్స్ ద్వారా తన పెళ్లిపై ఊహాగానాలకు తెర తీశాడు యువీ. ముందుగా తను భజ్జీకి శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఇక ఇప్పుడు ఎలాంటి దూస్రాలు వేయకు మిత్రమా.. లైన్‌కు కట్టుబడి ఉండు’ అని సరదాగా ట్వీట్ చేశాడు. దీనికి వెంటనే స్పందించిన భజ్జీ ‘నీవు కూడా లైన్లోకి రా.. ‘స్ట్రెయిట్’గా ఆడు.. పుల్, కట్ ఆడకు’ అని నర్మగర్భంగా స్పందించాడు. యువీ కూడా వెంటనే సమాధానమిస్తూ.. ‘యెస్.. మిస్టర్ హర్భజన్.. దీపావళి నుంచి నేరుగానే ఆడబోతున్నాను’ అని ముగించాడు. దీంతో యువరాజ్ పెళ్లికి సిద్ధమవుతున్నట్లు అప్పుడే వార్తలు చోటు చేసుకున్నాయి. ఇక దీపావళి పండుగ వెళ్లిపోవడం.. వారి ఫోటోలు కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. -
గర్ల్‌ఫ్రెండ్‌తో సల్మాన్ నిశ్చితార్థం?
ఎన్నాళ్లుగానో కాపాడుకుంటూ వస్తున్న బ్యాచ్‌లర్ జీవితానికి భజరంగీ భాయిజాన్ త్వరలోనే స్వస్తి చెప్పనున్నారా? వచ్చే ఏడాది సల్మాన్‌ఖాన్ ఓ ఇంటివాడు కాబోతున్నారా? అంటే ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న వార్తలు అవుననే అంటున్నాయి. 49 ఏళ్ల ఈ కండల వీరుడు తన గర్ల్‌ఫ్రెండ్, రొమెనియన్ టీవీ నటి, హోస్ట్ లులియా వంటుర్‌తో ఎంగెజ్మెంట్ చేసుకుంటున్నట్టు తెలుస్తున్నది. లులియా వంటుర్ కూడా అస్పష్టంగానైనే ఇదే విషయమై ట్విట్టర్లో ఆనందం పంచుకున్నది. కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్టు ట్వీట్ చేసింది. 'లా.. లా.. లా.. సచ్ ఏ బ్యూటీఫుల్ లైఫ్.. హృదయంలోని ఎన్నో అందమైన ఊసులను పంచుకోబోతున్నాం' అంటూ లులియా ట్విట్టర్లో పేర్కొంది. అంతేకాకుండా ఆమె వ్యక్తిగత పబ్లిసిటీ అధికారి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సల్మాన్-లులియా మధ్య నిశ్చితార్థం జరిగిందని, వచ్చే సంవత్సరం వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చెప్పారు. ఈ పెళ్లి సంబంధించిన ట్వీట్లను ఆమె తన స్వస్థలం బుచరెస్ట్కు చేరకుండా ఫిల్టర్ చేయడం కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నది. ఆ వార్తలు పుకార్లే! అయితే, గతంలో కూడా పలుమార్లు సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి పెళ్లి మీడియాలో, ఆన్లైన్లో వార్తలు వచ్చాయి. అదే తరహాలో ఈ వార్తలు కూడా నిజం కాదని, లులియతో తన అన్న సల్మాన్‌కు నిశ్చితార్థం అయిందని వచ్చిన వార్తలు పుకార్లేనని చెల్లెలు అర్పితాఖాన్ పేర్కొంది. -
మార్చి 4న మనోజ్ నిశ్చితార్థం
హైదరాబాద్: కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ నిశ్చితార్థం తేదీ ఖరారైంది. తన స్నేహితురాలు ప్రణతిరెడ్డితో మనోజ్‌కు పెళ్లి కుదిరిన సంగతి తెలిసిందే. ఈ వేడుక మార్చి 4న హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్లో ఉదయం 10.30 గంటలకు జరగనుంది. మంచు కుటుంబ సభ్యులు ఇప్పటికే అందరినీ ఆహ్వానించే పనిలో ఉన్నారు. టాలీవుడ్‌లోని నటీనటులు, ప్రముఖ రాజకీయ నాయకులను ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. ఈ వేడుకను తెలుగు సంప్రదాయ పద్ధతుల్లోనే చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నట్టు మంచు మనోజ్‌కు అత్యంత సన్నిహితుడు ఒకరు.. చెప్పారు. మొదట మనోజ్ ఇంట్లో పూజ నిర్వహిస్తారు. తరువాత హోటల్లో ఉంగరాలు మార్చుకుంటారని ఆయన తెలిపారు. ప్రణతి రెడ్డి బిట్స్ పిలానిలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అంతేకాకుండా మంచు విష్ణు భార్య విరానికాకు క్లాస్మేట్ అనే విషయం తెలిసిందే -
ప్రియ ఇన్ లవ్!
పాలక్కడ్‌లో పుట్టి... బెంగళూరులో పెరిగిన బ్లాక్ బ్యూటీ ప్రియమణి ఇన్నాళ్లకు మనసులో మాట బయటపెట్టింది. అది కూడా చెప్పీ చెప్పనట్టు... తెలిసీ తెలియనట్టు! మలయాళం, కన్నడంలో టీవీ రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ సెక్సీ భామ... తాను ఎంగేజ్డ్ అని చెప్పేసింది. అది ఎవరన్నది ఇప్పుడే బయట పెట్టనని... అయితే తన బాయ్‌ఫ్రెండ్ స్లాట్ మాత్రం ఖాళీ లేదని చెప్పి ఎందరో పురుష పుంగవుల మనసును నిర్దాక్షిణ్యంగా విరిచేసింది! పైగా... అతనెవరో అందరికీ తెలుసని ఆఖర్లో ఓ ట్విస్ట్ ఇచ్చి... ఆలోచనల్లో పడేసింది తెలివిగా! ఇప్పటి వరకు ప్రియ ఎఫైర్లపై రకరకాల రూమర్లు వైరస్‌లా పాకేశాయి. ఈ స్టేట్మెంట్తో వాటి ఫ్లో తగ్గించిందీ చిన్నది! -
ముహూర్తం కుదిరింది
తమిళ సినిమా, న్యూస్‌లైన్: నటి నజ్రియా వివాహ నిశ్చితార్థం శనివారం మధ్యాహ్నం కేరళలోని తిరువనంతపురంలోని తాజ్ హోటల్లో జరిగింది. నేరం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన మలయాళ భామ నజ్రియా నజీమ్. ఆ మధ్య నయ్యాండి చిత్రంలో తన పొట్ట చూపించారంటూ నానా రభస చేసిన ఈ బ్యూటీ రాజారాణి, తదితర చిత్రాల్లో నటించింది. మలయాళ దర్శకుడు ఫాజిల్ కొడుకు, నటుడు పాహత్ పాజిల్‌తో ప్రేమ పెళ్లికి బాటలు వేసింది. వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివాహ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి ఆగస్టు 21న తిరువనంతపురంలోని కళాకూట్టం అల్తాజ్ హాల్లో జరగనుంది. ఆ తర్వాత 24న వివాహ రిసెప్షన్ జరగనుంది. వివాహానంతరం తన భర్త, తల్లిదండ్రుల అనుమతితో నటనను కొనసాగిస్తానని నజ్రియా స్పష్టం చేసింది.