
ప్రియ ఇన్ లవ్!
పాలక్కడ్‌లో పుట్టి... బెంగళూరులో పెరిగిన బ్లాక్ బ్యూటీ ప్రియమణి ఇన్నాళ్లకు మనసులో మాట బయటపెట్టింది. అది కూడా చెప్పీ చెప్పనట్టు...
పాలక్కడ్‌లో పుట్టి... బెంగళూరులో పెరిగిన బ్లాక్ బ్యూటీ ప్రియమణి ఇన్నాళ్లకు మనసులో మాట బయటపెట్టింది. అది కూడా చెప్పీ చెప్పనట్టు... తెలిసీ తెలియనట్టు! మలయాళం, కన్నడంలో టీవీ రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఈ సెక్సీ భామ... తాను ఎంగేజ్‌డ్ అని చెప్పేసింది. అది ఎవరన్నది ఇప్పుడే బయట పెట్టనని... అయితే తన బాయ్‌ఫ్రెండ్ స్లాట్ మాత్రం ఖాళీ లేదని చెప్పి ఎందరో పురుష పుంగవుల మనసును నిర్దాక్షిణ్యంగా విరిచేసింది! పైగా... అతనెవరో అందరికీ తెలుసని ఆఖర్లో ఓ ట్విస్ట్ ఇచ్చి... ఆలోచనల్లో పడేసింది తెలివిగా! ఇప్పటి వరకు ప్రియ ఎఫైర్లపై రకరకాల రూమర్లు వైరస్‌లా పాకేశాయి. ఈ స్టేట్‌మెంట్‌తో వాటి ఫ్లో తగ్గించిందీ చిన్నది!