
థ్రిల్లర్ సినిమాలు తీయాలంటే మలయాళీ దర్శకుల తర్వాత ఎవరైనా! ఎందుకంటే చాలా సాధారణంగా అనిపించే విషయాల్ని స్టోరీలుగా మలచి అదిరిపోయే థ్రిల్లర్ చిత్రాలు తీస్తుంటారు. 'దృశ్యం' నుంచి మొదలుపెడితే కొన్నాళ్ల క్రితం వచ్చిన 'కిష్కింద కాండం' వరకు లిస్ట్ చాలా పెద్దదే.
ఇప్పుడు ఈ జాబితాలోకి మరో మూవీ చేరింది. ఫిబ్రవరి 20న కేరళలోని థియేటర్లలో రిలీజైన 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రస్తుతానికి రూ.30 కోట్ల మేర కలెక్షన్స్ కూడా సాధించింది. ఎంతలా మెప్పించకపోతే ఇప్పుడు దీన్ని డబ్బింగ్ చేసి తెలుగులోకి కూడా తీసుకొస్తారు.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 20 సినిమాలు)
'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' పేరుతోనే మార్చి 7న.. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. మైత్రీ సంస్థ ఆ పని చేస్తుంది. ఈ మేరకు అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ప్రియమణి.. కీలక పాత్రలో నటించింది.
సినిమా కథ విషయానికొస్తే.. సీఐగా పనిచేసే హరీశ్ శంకర్ చాలా స్ట్రిక్ట్. తన టీమ్ కూడా అలానే ఉండాలనుకుంటాడు. ఓసారి నకిలీ బంగారు ఆభరణాల కేసుని దర్యాప్తు చేస్తున్న టైంలో సె*క్స్, డ్ర*గ్ రాకెట్ కేసులు బయటపడతాయి. దీంతో ఇన్వెస్టిగేషన్ లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. నకిలీ ఆభరణాల కేసుకు.. డ్రగ్స్ కి సంబంధమేంటనేది మిగతా స్టోరీ. కట్టిపడే సస్సెన్స్ తో చివరి వరకు ఈ సినిమా థ్రిల్ చేస్తుందట. మరి తెలుగులో ఏ మేరకు అలరిస్తుందో?
(ఇదీ చదవండి: నాన్న ఫోన్ చేసేసరికి ప్రభాస్ భయపడ్డాడు: మంచు విష్ణు)

Comments
Please login to add a commentAdd a comment