
గత కొన్నేళ్లలో తీసుకుంటే మలయాళంలో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ వస్తూనే ఉన్నాయి. కొన్నిరోజుల క్రితం 'రేఖాచిత్రం' (Rekhachithram OTT) అనే మూవీ ఓటీటీలో రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు అలానే మరో చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. కాకపోతే థియేటర్లలో విడుదల వారానికే రాబోతుండటం విశేషం.
ఓటీటీల చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమున్న కుంచకో బోబన్, ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రల్లో నటించిన థ్రిల్లర్ మూవీ 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ'(Officer On Duty OTT ). ఫిబ్రవరి 20న మలయాళంలో రిలీజై హిట్ అయింది. ఆ ఊపులోనే తెలుగులోనూ రిలీజ్ ప్లాన్ చేశారు. తొలుత మార్చి 7 అనుకుని 14వ తేదీకి వాయిదా వేశారు. తెలుగులో ఇది విడుదలైనట్లు కూడా చాలామందికి తెలియదు.
(ఇదీ చదవండి: ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ తెలుగు రివ్యూ)
అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. మార్చి 20 నుంచే నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని క్లారిటీ ఇచ్చారు. మలయాళ వెర్షన్ కి నెలరోజుల గ్యాప్ ఓకే కానీ తెలుగులో మరీ థియేటర్లలోకి వచ్చిన వారానికే ఓటీటీలోకి వచ్చేస్తోంది.
'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' విషయానికొస్తే.. చైన్ స్నాచింగ్, ఫేక్ గోల్డ్ లాంటి కేసులను అవలీలగా ఛేదించే సీఐ హరిశంకర్(కుంచకో బోబన్) ఫేక్ గోల్డ్ కేసు ఎదురవుతుంది. ఆ కేసును సీరియస్‌గా తీసుకున్న హరిశంకర్ దర్యాప్తు ప్రారంభిస్తారు. ఆ సమయంలో సీఐ హరిశంకర్‌కు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అంతే కాకుండా ఈ ఫేక్ గోల్డ్ కేసు కాస్తా ఓ అమ్మాయి ఆత్మహత్యకు దారితీస్తుంది. అసలు ఈ కేసుతో ఆ అమ్మాయికి గల సంబంధం ఏంటి? ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది? అనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: 'కోర్ట్'లో ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది.. ఎవరీ 'జాబిలి'?)
Puthiya officer etheetund, stand in line and salute 🫡
Watch Officer on Duty on Netflix, out 20 March in Malayalam, Hindi, Telugu, Tamil, Kannada#OfficerOnDutyOnNetflix pic.twitter.com/1Y8O7aK3ln— Netflix India South (@Netflix_INSouth) March 15, 2025
Comments
Please login to add a commentAdd a comment