
ఎవరో... అతగాడు!
చెప్పీ.. చెప్పక... కనిపించీ... కనిపించనట్టుగా... దాచీ... దాచనట్టుగా తన మనసులో ఎవరో ఉన్నారని చెప్పింది మలయాళీ భామ ప్రియమణి. మలయాళ నటుడు పద్మాసూర్యతో క్లోజ్‌గా ఉందంటూ దక్షిణాది ఇండస్ట్రీ అంతా రూమర్లు వ్యాపించాయి. తాజాగా ఓ సినిమా కార్యక్రమంలో ప్రియ... వాటికి ఫుల్‌స్టాప్ పెట్టినట్టే పెట్టి... మరిన్ని ఊహాగానాలకు తెరలేపింది. పద్మాసూర్య- తనకు మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ తప్ప మరేదీ లేదని తేల్చేసింది. అయితే... ఒకరితో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని.. అతను సూర్య కాదంది. అతడెవరో త్వరలోనే ప్రపంచానికి చూపిస్తానని చెప్పి ఉత్సుకత మరింత రేపింది.