Rumor
-
టాలీవుడ్ ని షేక్ చేస్తున్న మెగా రూమర్
-
వింత నమ్మకం.. పెరిగిన పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు
పట్న: మన దగ్గర అప్పుడప్పుడు వింత వింత పుకార్లు వ్యాప్తి అవుతుంటాయి. ఆడపడుచులకు గాజులు పెట్టించాలి.. ఒక్కడే మగ పిల్లాడు ఉన్న తల్లి వేప చెట్టుకు నీళ్లు పోయాలని.. ఇలా వింత వింత పుకార్లు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా ఇలా వెలుగులోకి వచ్చిన ఓ పుకారు వల్ల పార్లేజీ బిస్కెట్ల అమ్మకాలు పెరిగాయి. పుకారు వల్ల బిస్కెట్ల అమ్మకాలు ఎలా పెరిగాయా అని ఆలోచిస్తున్నారు. అదే తెలియాలంటే ఈ వార్త చదవాలి. తాజాగా బిహార్‌లో ఓ వింత పుకారు వెలుగులోకి వచ్చింది. దాని సారంశం ఏంటంటే.. జితియా పండగ నాడు మగపిల్లలు పార్లేజీ బిస్కెట్లు తప్పక తినాలి. లేదంటే వారికి భవిష్యత్తులో తీవ్ర సమస్యలు తలెత్తుతాయి అని పుకారు మొదలయ్యింది. దాంతో జనాలు ఎగబడి మరీ పార్లే బిస్కెట్లు కొన్నారు. దీని వల్ల ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్ల లేదు. కంపెనీకి మాత్రం అమ్మకాలు పెరిగి లాభాలు వచ్చాయి. (చదవండి: గ్రామంలోని మహిళల బట్టలు ఉతకాలి.. నిందితుడికి కోర్టు ఆదేశం) తొలుత ఈ పుకారు సీతామర్హి జిల్లాలో వినిపించింది. దాంతో జనాలు పార్లే జీ బిస్కెట్ల కోసం షాపుల వద్దకు పరుగులు తీశారు. ఈ పుకారును జనాలు ఎంత బలంగా నమ్మారు అంటే.. సీతామర్హి ప్రాంతంలోని పలు దుకాణాల ముందు పెద్ద పెద్ద క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. లైన్లలో ఉన్నవారంతా బిస్కెట్ల కోసం వచ్చినవారే కావడం గమనార్హం. జనాలు బిస్కెట్ల కోసం ఇలా ఎగబడటంతో చాలా షాపుల్లో అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. నెమ్మదిగా ఈ పుకారు కాస్త బైర్గానియా, ధేంగ్, నాన్పూర్, దుమ్రా, బజ్‌పట్టి ప్రాంతాలకు వ్యాపించింది. ఇంకేముంది దీన్ని గుడ్డిగా నమ్మిన జనాలు.. పార్లేజీ బిస్కెట్ల కోసం షాపుల వద్దకు పరిగెత్తారు. ఆ తర్వాత ఈ పుకారు మరో నాలుగు జిల్లాలకు వ్యాపించింది. అక్కడ కూడా ఇవే దృశ్యాలు కనిపించాయి. ఎందుకు ఇలా బిస్కెట్ల కొంటున్నారని జనాలను అడిగితే.. ‘‘జితియా పండగనాడు మగ పిల్లలు పార్లే బిస్కెట్లు తినకపోతే.. వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. అందుకే కొంటున్నాం’’ అని తెలిపారు. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు షాపు యజమానులు ఐదు రూపాయల బిస్కెట్ ప్యాకెట్‌ని 50 రూపాయలకు అమ్మడం ప్రారంభించారు. అసలు ఈ పుకారు ఎలా.. ఎవరు వ్యాప్తి చేశారు అనే దాని గురించి మాత్రం తెలయలేదు. (చదవండి: నేను ఇవ్వను.. ప్రధాని నాకోసం ఆ పైసలు పంపారు !) జితియా పండుగ.. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో జితియా పండుగ జరుపుకుంటారు. తల్లులు.. తమ కుమారులు జీవితాంతం సంతోషంగా.. ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తూ 24 గంటల పాటు ఉపవాసం చేస్తారు. చదవండి: అమ్మాయిలూ ‘జట్టు విరబోసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’ -
పుకార్లపై స్పందించిన సల్మాన్ ఖాన్
కరోనా నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినీ తారలు కూడా ఇంటి పట్టునే ఉంటూ తమకు నచ్చిన వ్యాపకాల మీద దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి పన్వెల్ ఫామ్ హౌజ్‌కు మకాం మార్చారు. ఈ క్రమంలో సల్మాన్ తన ఫామ్‌హౌజ్‌లో కొత్త చిత్రం షూటింగ్ చేస్తున్నారని.. ఇందుకోసం నటీనటులను వెతుకుతున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ తరఫున మెయిల్స్ కూడా వెళ్తున్నాయంట. (ప్యార్ కరోనా) ఈ క్రమంలో ఇవన్ని అసత్యాలే అని కొట్టిపడేశారు సల్మాన్. తమ ఫామ్‌హౌస్‌లో ఎలాంటి షూటింగ్‌లు జరగడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం తన ట్విట్టర్లో పుకార్లను నమ్మవద్దు అంటూ ఓ లేఖను పోస్ట్ చేశారు సల్మాన్. ‘ఈ లేఖ ద్వారా నా అభిమానులకు, ప్రజలకు తెలియజేసేది ఏంటంటే నేను కానీ, నా ప్రొడక్షన్ హౌస్ సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ కానీ ఈ లాక్డౌన్ సమయంలో ఎలాంటి సినిమాలు నిర్మించడం లేదు. నటీనటులు కావాలంటూ ఎలాంటి కాస్టింగ్ ఏజెంట్లను నియమించ లేదు. నా పేరుతో గానీ, నా ప్రొడక్షన్ హౌస్ పేరుతో వచ్చే ఈమెయిల్స్, మెసేజ్‌లను నమ్మవద్దు అంటూ ట్వీట్ చేశారు. Mat karo rumours pe trust.... #staysafe @SKFilmsOfficial pic.twitter.com/fP83TRrePa — Salman Khan (@BeingSalmanKhan) May 13, 2020 మంగళవారం భాయిజాన్ తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసిన కొత్త రొమాంటిక్ ట్రాక్ ‘తేరే బినా’ వీడియో సాంగ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఇంట్లో ఉండటానికేం ఇబ్బంది? -
నా కారు నాయిష్టం...
కోటి రూపాయల కారు ఒక హీరోయిన్‌కి... అదీ సక్సెస్ఫుల్ హీరోయిన్‌కి పెద్ద విషయమా! ఆ.. ఈ రోజుల్లో విషయం చిన్నదా అన్నది కాదు... రూమర్ పెద్దదా అన్నదే విషయం! ఇదే కాదు.. ఇంటి గొడవ రచ్చకీడ్చడం.. అబ్బో భలే సరదాగా ఉంటుందే! కానీ పడేవాళ్లకి తెలుస్తుంది కష్టమేంటో.. అంజలి ఓపెన్‌గా మాట్లాడిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ మీ కోసం... ⇔ చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు.. కూల్‌గా ఉన్నారనిపిస్తోంది... అంజలి: అవునండి. చాలా కూల్‌గా, హ్యాపీగా ఉన్నాను. చెప్పాలంటే ఎప్పటికన్నా ప్రశాంతంగా ఉన్నాను. ⇔ ఇంటికి సంబంధించిన సమస్యలన్నీ తీరిపోయినందుకే ఈ హ్యాపీనెస్సా? అంజలి: కరెక్ట్‌గా చెప్పాలంటే నేనెప్పుడూ పెద్దగా టెన్షన్ పడింది లేదు. అఫ్కోర్స్ చిన్న చిన్న సమస్యలు తీరినప్పుడు ఎవరైనా ప్రశాంతంగా ఉంటారు కదా. ⇔ అసలు ప్రపంచంలో వేరే సమస్యలేవీ లేనట్లు.. మీ పిన్ని, మీ ఇంటి సమస్యల గురించి చాలామంది ఎక్కువగా మాట్లాడుకోవడం ఎలా అనిపించింది? అంజలి:ఏ ఇంట్లో సమస్యలు ఉండవు చెప్పండి? కొన్ని చిన్న సమస్యలు.. కొన్ని పెద్దవి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది. ఈలోపు నలుగురూ నాలుగు మాటలు మాట్లాడేస్తారు. అవతలి వ్యక్తుల జీవితాల్లో ఉన్న సమస్యల గురించి మాట్లాడుకోవడంలో కలిగే ఆనందం ఏముంటుందో! పైగా గోరంత విషయాన్ని కొండంత చేస్తారు. లేని విషయాన్ని ఉన్నట్లుగా సృష్టిస్తారు. ⇔ నిజమే.. ముఖ్యంగా ఆడవాళ్ల గురించి కొందరు ఏవేవో మాట్లాడతారు. ఆ మధ్య మీరు కొన్న కారు గిఫ్ట్ అన్నది కొందరి అభిప్రాయం... అంజలి: వినడానికి చాలా బాధగా ఉందండి. ఒక కారు కొనుక్కునే స్థితిలో నేను లేనా? కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుక్కున్న కారుని కూడా గిఫ్ట్ అంటే ఇంకేం అనాలి? ఎలాంటి కష్టమో చెబుతాను. లాస్ట్ ఇయర్ ‘డిక్టేటర్’ చేస్తున్న సమయంలోనే ‘సరైనోడు’లోని ‘బ్లాక్ బస్టర్’ సాంగ్ చేశాను. రెంటికీ డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమైంది. డేలో ‘డిక్టేటర్’, నైట్ ‘సరైనోడు’ షూటింగ్ చేశాను. 48 గంటలు కంటిన్యూస్‌గా నిద్రపోలేదు. అంతెందుకు? ‘చిత్రాంగద’ని తీసుకుందాం.. అమెరికాలో మైనస్ 11 డిగ్రీల టెంపరేచర్లో షూటింగ్ చేశాం. చలికి వణికిపోయే దాన్ని. ఒకటీ రెండు రోజులంటే ఫర్వాలేదు. ఎక్కువ భాగం షూటింగ్ చేసింది అక్కడే. అంత హార్డ్‌వర్క్ చేసి, సంపాదిస్తాం. కావాల్సినవి కొనుక్కుంటాం. ఆ కష్టం మాది కాదన్నట్లు మాట్లాడితే ఎంత బాధగా ఉంటుందో ఊహించవచ్చు. ⇔ ఈ మధ్య హైదరాబాద్ రావడం తగ్గించేశారేం? అంజలి: చేతిలో ఉన్నవి తమిళ సినిమాలు కావడంతో మన ఊరికి కాస్త దూరమయ్యా. రిలీజ్‌కి రెడీ అవుతున్న ద్విభాషా చిత్రం ‘చిత్రాంగద’ షూటింగ్ ఎక్కువగా యూఎస్‌లోనే చేశాం. మిగతా సినిమాల షూటింగ్ కొడైకెనాల్, ఊటీ, వేరే ప్రాంతాల్లో ఉండ టంవల్ల నేను చెన్నైలో ఉంటున్నది కూడా తక్కువే. ⇔ ‘గీతాంజలి’ తర్వాత మళ్లీ మీరు టైటిల్ రోల్ చేసిన సినిమా ‘చిత్రాంగద’. ఎంతైనా టైటిల్ రోల్ అంటే పెద్ద బాధ్యతే కదా? అంజలి: అవునండి. సినిమా మొత్తం హీరోయిన్ భుజాల మీద నడిపించాల్సి ఉంటుంది. మోయగల సత్తా ఉండాలి. అదే హీరో ఓరియంటెడ్ మూవీ అయితే ప్రాబ్లమ్ ఉండదు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా హీరోయిన్‌కి ఏం కాదు. కానీ, లేడీ ఓరియంటెడ్ మూవీ అంటే... భారమంతా హీరోయిన్ మీదే ఉంటుంది. ఇవన్నీ తెలిసినా ‘చిత్రాంగద’ ఒప్పుకోవడానికి కారణం డైరెక్టర్ అశోక్ చెప్పిన కథ. అసలు ఇలాంటి లైన్ నేనెక్కడా వినలేదు. ఇలాంటి కాన్సెప్ట్‌తో ఇప్పటివరకూ ఏ మూవీ రాలేదు. అందుకే థ్రిల్ అయ్యి, ఒప్పుకున్నా. వచ్చే నెల 3న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. చూసినవాళ్లు కూడా థ్రిల్ అవుతారు. ⇔ తెలుగు, తమిళ్.. ఇలా రెండు భాషల్లో సినిమా చేసినప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుందేమో? అంజలి: అవును. అలవాటైతే ఓకే కానీ, ఫస్ట్ టైమ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ పెద్ద ఛాలెంజ్. ఒక భాషలో చేసిన వెంటనే మరో భాషలో సేమ్ సీన్ చేసేటప్పుడు సేమ్ ఎమోషన్ వస్తుందనే గ్యారంటీ లేదు. ఆ విధంగా ‘చిత్రాంగద’ సవాల్ అనిపించింది. డబ్బింగ్ చెబుతున్నప్పుడు మొత్తం సినిమా చూశాను. అప్పుడు ఈ సినిమాకి పడిన కష్టం విలువైనదే అనిపించింది. అశోక్ వెరీ టాలెంటెడ్ టెక్నీషియన్. ఇలాంటి స్క్రిప్ట్‌ని సెలక్ట్ చేసుకోవడానికి ధైర్యం కావాలి. ఎవరూ ఊహించలేని సీన్స్‌తో సినిమా ఉంటుంది. ⇔ తెలుగమ్మాయిలు హీరోయిన్లుగా నిలదొక్కుకోవడం కష్టం. అలాంటిది మీరు స్టార్ కాగలిగారు. కానీ, తెలుగులో ఎక్కువ చేయడం లేదేంటి? అంజలి: నాకు స్టోరీ.. ప్లస్ నేను చేయబోయే క్యారెక్టర్ ముఖ్యం. ఈ రెండూ బాగుంటేనే సినిమా ఒప్పుకుంటాను. ఈ మధ్య తెలుగులో ఎగ్జయిటింగ్కి గురి చేసే స్క్రిప్ట్ రాలేదు. ఈలోపు తమిళ్లో వరుసగా మంచి అవకాశాలొచ్చాయి. అందుకని ఒప్పుకున్నాను. ⇔ ఇప్పుడు నార్త్ హీరోయిన్లదే హవా. వాళ్లతో పోటీపడి నిలదొక్కుకునే మీలాంటి తెలుగు హీరోయిన్లు ఒకరిద్దరు ఉంటారేమో. ఆ విషయంలో మీరెప్పుడైనా ఒత్తిడి ఫీలయ్యారా? అంజలి: ఇప్పుడిలా ఉంది కానీ, ఒకప్పుడు తెలుగు హీరోయిన్లు ఏ స్థాయిలో రాణించారో తెలిసిందే. ఆ తర్వాత మారిపోయింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ‘తెలుగు అమ్మాయిలు ఇలా వచ్చి, అలా వెళ్లిపోతున్నారు. నిలదొక్కుకుంటున్నవాళ్ల సంఖ్య తక్కువగా ఉంది. మన కెరీర్ ఎలా ఉంటుందో’ అనుకున్నా. నా విషయంలో ‘లిటిల్ లక్’, ‘మోర్ హార్డ్ వర్క్’ ఉపయోగపడ్డాయి. సినిమా ఒప్పుకున్నాక ఎంత కష్టమైనా కానివ్వండి.. ఆలోచించ కుండా చేసేస్తా. అదే నన్ను నిలబెట్టింది. ⇔ మీరు మీడియాకి దూరంగా ఉంటారు.. మీడియా అంటే పడదా? అంజలి: అయ్యో అలాంటిదేమీ లేదండి. నా సినిమా రిలీజ్ అప్పుడు ప్రమోట్ చేయడానికి మీడియా ముందుకు వస్తుంటాను. మిగతా సమయాల్లో మాట్లాడటానికి ఏం ఉంటుంది? ఏదో కలవాలి కదా అని మీడియా ముందుకు వస్తే ఏం మాట్లాడాలో తెలియదు. ఒకటి మాట్లాడితే ఇంకోటి అర్థం చేసుకునే అవకాశం ఉంది. మన ఇంట్లోనే మనవాళ్లు ఒక్కోసారి మనం మాట్లాడే మాటలను అర్థం చేసుకోరు. మీడియా అంటే ఎంతో మంది ఉంటారు. కొందరికి నా మాటలు వేరే రకంగా అర్థం కావచ్చు. వేరే విధంగా రాయొచ్చు. నేను వాళ్లని తప్పుబట్టడంలేదు. ఇదంతా ఆలోచించే.. సినిమా ప్రమోషన్‌కు మాత్రమే మీడియాను కలుస్తున్నా. ⇔ తక్కువ సమయంలో హీరోయిన్గా పెద్ద రేంజ్‌కి వెళ్లారు. అంతే స్థాయిలో వివాదాల్లో చిక్కుకున్నారు.. తల్చుకుంటే ఏమనిపిస్తోంది? అంజలి: లైమ్‌లైట్‌లో ఉన్నవాళ్లకు తప్పదు. ఎవరి జీవితంలో అయినా సమస్యలు ఉంటాయి. కానీ, సెలబ్రిటీలకు సంబంధించిన విషయాల గురించి నలుగురూ మాట్లాడుకుంటారు. వాటిలో నిజం ఎంతుంది అనేది పక్కనపెడితే కల్పితాలు బోల్డన్ని ఉంటాయి. మొదట్లో చాలా బాధపడేదాన్ని. రాను రాను పట్టించుకోవడం మానేశాను. ⇔ ఇన్ని వివాదాలున్న అమ్మాయితో సినిమానా? అని నిర్మాతలు పక్కన పెట్టేస్తారు. మీ చేతిలో నాలుగైదు సినిమాలుండటం విశేషమే.. అంజలి: ఆ విషయంలో నేను లక్కీ. ఆ దేవుడి ఆశీర్వాదాలు కూడా కారణం. నా గురించి తెలిసిన వాళ్లు ‘ఈ అమ్మాయి చాలా మంచిది. ప్రొఫెషన్ అంటే గౌరవం ఉంది’ అనుకున్నారు. మీరన్నట్లు వివాదాల్లో ఉన్న హీరోయిన్లను ఎంక రేజ్ చేయడానికి ఇష్టపడరు. కానీ, నా సిన్సియార్టీ తెలుసు కాబట్టే అవకాశాలు ఇస్తున్నారు. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టు కునేందుకు ఎంత హార్డ్‌వర్క్ చేయాలో అంతా చేస్తున్నాను. మనమా.. బ్లాక్‌బస్టరా అనుకున్నా! ⇔ హీరోయిన్గా బిజీగా ఉన్నారు.. మరి, ‘సరైనోడు’లో స్పెషల్ సాంగ్ ‘బ్లాక్ బస్టర్’ చేయడానికి రీజన్ ఏంటి? యాక్చువల్‌గా నాకు సింగిల్ సాంగ్ చేసే ఐడియా లేదు. అసలు ఎవరైనా అడుగుతారని కూడా ఊహించలేదు. అలాంటి టైమ్‌లో ‘బ్లాక్ బస్టర్..’ సాంగ్‌కి అడిగారు. ఇప్పటివరకూ స్పెషల్ సాంగ్ చేయని హీరోయిన్‌తో ఈ సాంగ్ చేయించాలనుకున్నామనీ, బాగా డ్యాన్స్ చేసే అమ్మాయి కూడా అయ్యుండాలనీ నాతో అన్నారు. బన్నీకి ఈక్వల్‌గా డాన్స్ చేయగలనా అనిపించింది. అదే అన్నాను. ‘చేయగలరు’ అన్నారు. నేనూ, బన్నీ వన్నండాఫ్ డే ప్రాక్టీస్ చేశాం. పాట చాలా రిచ్‌గా ఉంటుంది. ట్యూన్ సూపర్బ్. సినిమాకి ఎస్సెట్ అయిన పాట కాబట్టి, ‘ఐయామ్ హ్యాపీ’. ⇔ ‘చిత్రాంగద’ కోసం ఒక పాట కూడా పాడారు.. సింగర్‌గానూ కంటిన్యూ కావాలనుకుంటున్నారా? (నవ్వుతూ) అశోక్ పాడమన్నారు. ‘ఏమో ఎలా ఉంటుందో’ అని ముందు ఒప్పుకోలేదు. ‘నువ్వు పాడగలవు’ అని పాడించారు. నిజం చెప్పాలంటే పాడినంతసేపూ నాకు చాలా థ్రిల్‌గా అనిపించింది. మొత్తం పాడాక ‘మనమూ పాడగలం’ అనిపించింది. మళ్లీ పాట పాడే అవకాశం వస్తే.. చూద్దాం. ⇔ అసలు ఇంతదాకా వస్తానని అనుకున్నారా? అంజలి: లేదండి. సినిమాల్లోకి రావడం, పెద్ద స్థాయికి చేరుకోవడం, ఇటు తెలుగు, అటు తమిళ్లో సినిమాలు చేయడం.. ఏదీ ఊహించలేదు. అందుకే నేనింతదాకా రావడానికి కారణమైన అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ⇔ మీ వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారమయ్యాయా? అంజలి: నో ప్రాబ్లమ్స్. ప్రశాంతంగా ఉన్నాను. ⇔ మీకు మోరల్ సపోర్ట్ తక్కువేమో.. అందుకే ఎక్కువ సమస్యలు చుట్టుముట్టాయేమో అనిపిస్తోంది... అంజలి: అలా ఏం కాదండి. మా అమ్మ, ఇద్దరు అన్నయ్యలు, అక్క.. నా వెనక వాళ్లున్నారు. నాకు దక్కిన విజయాలను పంచుకున్నట్లుగానే.. నా బాధలను కూడా పంచుకుంటారు. అలాగే, మంచి స్నేహితులు ఉన్నారు. నేనేం ఒంటరిగా లేను. మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. ⇔ గడచిన విషయాలను పదే పదే తలుచుకునే అలవాటు ఉందా? అంజలి: అస్సలు లేదు. మంచిని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. చెడుని మర్చిపోవాలి. చెడు విషయాలను మనసులో భద్రంగా దాచుకుంటే ఏం లాభం? బాధపడిపోయి, క్రుంగిపోతాం. నెగటివిటీ పెరిగిపోతుంది. దానివల్ల లైఫ్ బాగుండదు. అదే మంచి విషయాలను గుర్తుంచుకున్నా మనుకోండి.. పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది. అది జీవితానికి ఉపయోగపడుతుంది. ‘ఆల్వేస్ బీ పాజిటివ్’ అనేది నా పాలసీ. ⇔ బాగా ఒత్తిడికి గురైనప్పుడు ఎలా రిలాక్స్ అవుతారు? అంజలి: నాకు ఇద్దరు, ముగ్గురు మంచి స్నేహితులు ఉన్నారు. వాళ్లతో కలసి నచ్చిన కంట్రీకి వెళతాను. ఆ ట్రిప్‌తో స్ట్రెస్ మొత్తం పోతుంది. ⇔ హీరోయిన్ల కెరీర్ ఓ పదేళ్లు ఉంటుందేమో.. ఈలోపే తెలివిగా సెటిల్ అయిపోవాలి. మరి.. మనీ మేనేజ్మెంట్ విషయంలో మీరెంతవరకూ బెస్ట్? అంజలి: కష్టపడి సంపాదించిన డబ్బు విలువ ఎవరికైనా బాగా తెలుస్తుంది. అందుకే నేను డబ్బు విషయంలో జాగ్రత్తగానే ఉంటాను. హీరోయిన్ల కెరీర్ పదేళ్లని అన్నారు కానీ.. అన్నేళ్లు కూడా ఉంటుందో లేదో తెలియదు. అందుకే సంపాదించేటప్పుడే జాగ్రత్తపడాలి. ⇔ కొంతమంది హీరోయిన్లు నగల వ్యాపారం అనీ, హోటల్ బిజినెస్ అనీ చేస్తున్నారు. మీకలాంటి ఆలోచన? అంజలి: ఇప్పటికైతే లేదు. షూటింగ్స్‌కే సరిపోతోంది. సినిమాలు స్టాప్ చేసిన తర్వాత మాత్రం కచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను. ⇔ పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? అంజలి: ప్రస్తుతానికైతే లేదు. అయితే అదొక మేజికల్ మూమెంట్. ఎప్పుడు వస్తుందో చెప్పలేం. రేపు వచ్చినా ఆశ్చర్యపోవడానికి లేదు. రెండు, మూడేళ్ల వరకూ ఆ మూమెంట్ రాకపోయినా నో వండర్. ⇔ మీ మనసు గెలుచుకోవాలంటే ఆ అబ్బాయికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? అంజలి: మంచి సెన్సాఫ్ హ్యూమర్ కంపల్సరీ. హుందాగా ప్రవర్తించాలి. డీసెంట్‌గా ఉండాలి. గుడ్ లుకింగ్‌గా ఉండాలి. అత్యాశ అనుకోకపోతే ఒకటి చెబుతా. నన్ను రాణిలా చూసుకోవాలి (నవ్వుతూ).. ⇔ ఇలాంటి లక్షణాలున్న అబ్బాయి మీకిప్పటివరకూ తారసపడలేదా? అంజలి: పడ్డారు. పెళ్లి చేసుకోవాలనే ఫీల్ కలగాలి కదా. ఇప్పటివరకూ ఆ దృష్టితో నేనెవర్నీ చూడలేదు. ⇔ 2017 మీకెలా ఉంటుందనుకుంటున్నారు? అంజలి: మంచి మంచి సినిమాలు చేస్తున్నాను. అన్నీ నాకు మంచి పేరు తెచ్చే సినిమాలే. ప్రొఫెషనల్‌గా బాగుంటుందనుకుంటున్నాను. పర్సనల్‌గా కూడా హ్యాపీగా ఉన్నాను. పాజిటివ్‌గా థింక్ చేస్తాను కాబట్టి.. అంతా బాగుంటుందని నమ్ముతున్నాను. – డి.జి. భవాని -
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం
బాపట్ల స్టేషన్లో దిగిపోయిన ప్రయాణికులు బాపట్ల: తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో బాంబు ఉందనే వదంతి గురువారం కలకలం సృష్టించింది. రైలు చీరాల స్టేషన్ దాటాక డి-5 బోగీలో నుంచి పొగలు రావడాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు రైలులో బాంబు ఉందని భయపడ్డారు. ఆ విషయం కాస్తా రైలంతా వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు బాపట్ల స్టేషన్‌కు చేరుకోగానే రైలులోని సుమారు 2 వేల మంది ప్రయాణికులు ఒక్కసారిగా ప్లాట్‌ఫామ్‌పైకి దూకడం మొదలెట్టారు. దీన్ని గమనించిన రైల్వే అధికారులు వారిని ప్రశ్నించగా.. రైలులో బాంబు ఉందని జవాబిచ్చారు. దీంతో అప్రమత్తమైన అధికారులు డి-5 బోగీని పరిశీలించారు. బ్రేక్ స్లిప్ అయ్యి పొగలు వస్తున్నాయని, ప్రమాదమేమీ లేదని ప్రయాణికులకు నచ్చజెప్పేందుకు అధికారులు ప్రయత్నించారు. అయినా ప్రయాణికులందరూ రైలు ఎక్కేందుకు నిరాకరించడంతో గూడూరు నుంచి విజయవాడ వెళ్తున్న ప్యాసింజర్‌లో కొంతమందిని, అండమాన్ ఎక్స్‌ప్రెస్‌లో మరికొంతమందిని ఎక్కించి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
గోదావరి సెంటిమెంట్‌తోనే ‘సరైనోడు’ హిట్
‘సాక్షి’తో సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్ ‘కెరటం’లా తెలుగు చిత్ర పరిశ్రమకు చేరి.. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో గుర్తింపు తెచ్చుకుని.. ‘కరెంట్ తీగ’లా నాజూగ్గా ఉంటూ ‘లౌక్యం’గా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులు ‘పండగ చేస్కో’నేలా.. వారికి డబుల్ ‘కిక్’నిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్. బ్రూస్లీతో జతకట్టి.. ‘నాన్నకు ప్రేమతో..’ అంటూ ‘సరైనోడు’ వంటి హీరోలకు సరైన జోడీ అనిపించుకున్న ఆమె బుధవారం రాజమహేంద్రవరంలో సందడి చేశారు. వైభవ్ జ్యూయలరీ షోరూమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన రకుల్ ‘సాక్షి’తో పలు విషయాలను పంచుకున్నారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే.. గోదావరి ప్రాంతమంటే చాలా ఇష్టం.. గోదావరి ప్రాంతమంటే చాలా ఇష్టం. ఇక్కడికి అల్లు అర్జున్‌తో కలిసి సరైనోడు సినిమా షూటింగ్‌కి వచ్చా.. ఇక్కడి ప్రజల ఆదరణ మరువలేనిది. వాతావరణం, తిండి చాలా బాగున్నాయి. షూటింగ్ జరిగింది రెండురోజులైనా నాకు మర్చిపోలేని అనుభూతి. సినిమా వాళ్లకు గోదావరి సెంటిమంట్ అంటే ఏమిటో అనుకున్నా అది ‘సరైనోడు’ సినిమాతో తెలిసింది. గత అనుభవాలు.. నేను పుట్టింది దిల్లీలో. ఇంటర్ పూర్తి చేసి సినిమాల్లోకి వచ్చా. తర్వాత డిగ్రీ పూర్తి చేశా. నా తొలిసినిమా కన్నడంలో ‘గిల్లీ’ దానిలో హీరోయిన్గా చేశా. తెలుగులోకి వచ్చేసరికి తొలిసినిమా ‘కెరటం’. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన లౌక్యం, మంచు మనోజ్‌తో కరెంటుతీగ, రామ్‌తో పండగచేస్కో, రామ్‌చరణ్‌తో బ్రూస్లీ, ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో సినిమాల్లో నటించాను. ఇటీవల విడుదలై.. సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోన్న ‘సరైనోడు’తో మరింత బ్రేక్ వచ్చింది. బాలీవుడ్‌లోనూ ట్రై చేశా. ప్రస్తుతం నేను హీరోయిన్గా నటించిన ‘సిమ్లా మిర్చి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు తెలుగు, కన్నడం, తమిళం, హిందీ మొత్తం నాలుగు భాషల్లో నటించాను. వస్తే వదులుకోను.. ప్రత్యేకంగా ‘ఇలాంటి’ పాత్రలే చేయాలని లేదు. ఏ పాత్ర అయినా చేస్తాను. హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ వస్తే వదులుకోను. కచ్చితంగా చేస్తా. రూమర్లు మామూలే.. తెలుగు చిత్రపరిశ్రమలో అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో ఒక సొంతిల్లు కొనుక్కున్నాను. దానిపై రూమర్లు వచ్చాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా(నవ్వుతూ) ఈ రూమర్లు మామూలే. వాటిని పట్టించుకుంటే ముందుకు వెళ్లలేం. బాగా ఇష్టమైనది.. రాజమహేంద్రవరంలో నాకు బాగా నచ్చింది పాలగంగరాజు కోవా.. దానిని షూటింగ్ టైంలో తెప్పించుకుని తిన్నా.. -
ఎవరో... అతగాడు!
చెప్పీ.. చెప్పక... కనిపించీ... కనిపించనట్టుగా... దాచీ... దాచనట్టుగా తన మనసులో ఎవరో ఉన్నారని చెప్పింది మలయాళీ భామ ప్రియమణి. మలయాళ నటుడు పద్మాసూర్యతో క్లోజ్‌గా ఉందంటూ దక్షిణాది ఇండస్ట్రీ అంతా రూమర్లు వ్యాపించాయి. తాజాగా ఓ సినిమా కార్యక్రమంలో ప్రియ... వాటికి ఫుల్స్టాప్ పెట్టినట్టే పెట్టి... మరిన్ని ఊహాగానాలకు తెరలేపింది. పద్మాసూర్య- తనకు మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్ తప్ప మరేదీ లేదని తేల్చేసింది. అయితే... ఒకరితో రిలేషన్షిప్లో ఉన్నానని.. అతను సూర్య కాదంది. అతడెవరో త్వరలోనే ప్రపంచానికి చూపిస్తానని చెప్పి ఉత్సుకత మరింత రేపింది. -
కేరళ కుట్టి భావన గుర్తుందా..!
అప్పుడప్పుడూ తెలుగులోనూ కనిపించే ఈముద్దుగుమ్మ తన పెళ్లిపై వచ్చిన రూమర్లను కొట్టి పారేసింది. ఉన్నట్టుండి ఫోన్ కాల్స్, మెసేజ్‌లు ముంచెత్తడంతో ‘పెళ్లి చేసుకొనేది మా సోదరుడు.. నేను కాదు. అదీ వచ్చే ఏడాది జనవరిలో’ అంటూ స్పష్టం చేసిందీ సుందరి. ప్రస్తుతం మలయూళ, కన్నడ చిత్రాలతో తాను చాలా బిజీగా ఉన్నానని.. మరికొన్ని కమిట్మెంట్స్ వల్ల వేరే ప్రాజెక్ట్‌లు ఓకే చేయులేకపోతున్నానని.. ఇప్పుడప్పుడే పెళ్లి గురించి ఆలోచన లేదని చెప్పింది. -
ఏలూరు కోటలో తోట పాగా
-
మైనారిటీలకు దూరాం
-
తెలుగు తమ్ముళ్లు
-
ఆనంకు ఎదురుగాలి
-
చతుర్ముఖ పోటీ
-
జడ్చర్ల జంగ్
-
ఉప్పు...నిప్పు..
-
పినపాకలో పాగా..
-
కుక్క కాటుకు..
-
వద్దు పిన్నమ్మా...
-
చేతులు కాలాక...
-
టూర్ ప్లాప్
-
చతుర్ముఖ పోటీ
-
రివర్స్ గేమ్..
-
ధర్మం వధ
-
అటు...ఇటు జీరో...
-
వంచన
-
క్రాస్ ఓటింగ్
-
మంత్రాలకు చింతకాయలు
-
రెబల్ గుబుల్
-
రూమర్ : గుండెలో గోలయ్య
-
వెనుకడుగు....
-
కావ్రేడ్స్ వార్
-
సైలెంట్ యవ్వారం...
-
పొత్తులు...జిత్తులు
-
పోరు (పెద్ద) పల్లి
-
ఇంకెన్ని మారతారు?
-
కమలంకు షాక్...
-
టార్గెట్ కిషన్
-
నో సపోర్ట్
-
అధ్యక్షా...అన్యాయం..!
-
హస్తానికి షాక్
-
షాక్ తిన్న శంకరన్న
-
నా రూటే సెపరేటు
-
టీఆర్ఎస్ ఎన్నికల టెన్నన్
-
కాంగ్రెస్ వీరులు
-
దేవరకొండల పై రగడ
-
బిజెపి,టిడిపిలో ముసలం
-
టికెట్లు రాలేదని ఆక్రోశం
-
బాలసాని టికెట్ కట్
-
అంబర్ పేట్ కుర్రాడు
-
టికెట్ల చిచ్చు
-
గిరిపై ఎవరు?
-
సీటు గోవిందా....
-
అక్కడా...ఇక్కడా
-
లూజింగ్ బ్రదర్స్
-
కరివేపాకు
-
’బై’ సమైక్యాంధ్ర
-
సిర్ఫ్ హమారా!
-
ముంచుతారా?
-
దగా బాబు!
-
పొరుగింటి పుల్లకూర
-
నాన్ లోకల్ నాయకులు
-
సైకిలెక్కితే అంతే
-
మూడు ముక్కలాట
-
సీటు కోసం తంటా...
-
పొత్తుల తకరారు
-
గ్రూప్ పాలిటిక్స్
-
బాబు ట్రిక్స్
-
కిస్సా కుర్సీకా
-
నేతల కలలు
-
బ్యాడ్ టైమ్
-
అందితే జుట్టు...
-
ఓటర్ల పై అలిగారట..!
-
పెను "కొండెక్కుతారా?"
-
జై....పాల్ మూర్
-
కారు మేఘాలు కమ్ముకాస్తున్నాయి
-
ఫ్యాన్ ప్రభంజనం
-
కరీంనగర్ ఎక్ దమ్ ఖాళీ
-
జనం నమ్మడం లేదు
-
విశాఖ తూర్పుకు మూర్తి స్పాట్
-
అల్లోల కల్లోలు