కరోనా నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సినీ తారలు కూడా ఇంటి పట్టునే ఉంటూ తమకు నచ్చిన వ్యాపకాల మీద దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి పన్వెల్ ఫామ్ హౌజ్‌కు మకాం మార్చారు. ఈ క్రమంలో సల్మాన్ తన ఫామ్‌హౌజ్‌లో కొత్త చిత్రం షూటింగ్ చేస్తున్నారని.. ఇందుకోసం నటీనటులను వెతుకుతున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ తరఫున మెయిల్స్ కూడా వెళ్తున్నాయంట. (ప్యార్ కరోనా)
ఈ క్రమంలో ఇవన్ని అసత్యాలే అని కొట్టిపడేశారు సల్మాన్. తమ ఫామ్‌హౌస్‌లో ఎలాంటి షూటింగ్‌లు జరగడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం తన ట్విట్టర్‌లో పుకార్లను నమ్మవద్దు అంటూ ఓ లేఖను పోస్ట్ చేశారు సల్మాన్. ‘ఈ లేఖ ద్వారా నా అభిమానులకు, ప్రజలకు తెలియజేసేది ఏంటంటే నేను కానీ, నా ప్రొడక్షన్ హౌస్ సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ కానీ ఈ లాక్‌డౌన్ సమయంలో ఎలాంటి సినిమాలు నిర్మించడం లేదు. నటీనటులు కావాలంటూ ఎలాంటి కాస్టింగ్ ఏజెంట్లను నియమించ లేదు. నా పేరుతో గానీ, నా ప్రొడక్షన్ హౌస్ పేరుతో వచ్చే ఈమెయిల్స్, మెసేజ్‌లను నమ్మవద్దు అంటూ ట్వీట్ చేశారు.
Mat karo rumours pe trust.... #staysafe @SKFilmsOfficial pic.twitter.com/fP83TRrePa
— Salman Khan (@BeingSalmanKhan) May 13, 2020
మంగళవారం భాయిజాన్ తన యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేసిన కొత్త రొమాంటిక్ ట్రాక్ ‘తేరే బినా’ వీడియో సాంగ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: ఇంట్లో ఉండటానికేం ఇబ్బంది?
Comments
Please login to add a commentAdd a comment