కృతీ కర్భందా
హీరోయిన్ కృతీ కర్భందా రీల్ మ్యారేజ్ లాక్‌డౌన్ వల్ల వాయిదా పడింది. ఇంతకీ విషయం ఏంటంటే.. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నిర్మాతగా ‘బుల్ బుల్ మ్యారేజ్ హాల్’ (వర్కింగ్ టైటిల్) అనే సినిమా రూపొందనుంది. రోహిత్ నాయర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. ఇందులో పుల్‌కిత్ సామ్రాట్, కృతీ కర్భందా, సునీల్ గ్రోవర్, దేశీ షా ముఖ్యతారలు. లక్నో బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రం భారతీయ వివాహ వ్యవస్థలోని అంశాల ఆధారంగా తెరకెక్కనుంది. ఏప్రిల్‌లో మొదలుకావాల్సిన ఈ సినిమా షూటింగ్ లాక్‌డౌన్ వల్ల ఆగిపోయింది. ఇలా కృతీ రీల్ మ్యారేజ్ వాయిదా పడింది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా ‘డ్రీమ్‌గర్ల్’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజ్ ఈ సినిమాకు డైలాగ్స్ అందించనుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment