Postponed
-
'లవర్స్ డే రోజున దిల్ రూబా'.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన కిరణ్ అబ్బవరం
'క' మూవీ సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం (Kiran Abbavaraam) నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ దిల్రూబా (Dil Ruba). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లవర్స్ డే కానుకగా సినీ ప్రియులను అలరించనుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా దిల్రూబా మేకర్స్ తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ నెల 14న సినిమాను రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు. ఈ విషయాన్ని కిరణ్ అబ్బవరం ఎక్స్ ద్వారా వెల్లడించారు. కొంచెం ఆలస్యంగా వస్తున్నాం.. కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కిరణ్ హీరోగా నటించిన ఈ లవ్ ఎంటర్టైనర్లో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీతో విశ్వ కరుణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అయితే ప్రేమికుల దినోత్సవం రోజున విడుదవుతుందని భావించిన ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అభిమానుల నుంచి అద్భతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా.. ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందించారు. ఈ మూవీలో నజియా కీలక పాత్రలో నటిస్తోంది.విశ్వక్ సేన్ లైలా రిలీజ్..అయితే ఈ లవర్స్ డే కానుకగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ విడుదల కానుంది. ఈ చిత్రంలో విశ్వక్ లేడీ గెటప్‌లో అభిమానులను అలరించనున్నారు. ఈ మూవీకి రామ్ నారాయణ దర్శకత్వం వహించారు. Koncham late ga vastunam :) #dilruba pic.twitter.com/H6UMPDLuwr— Kiran Abbavaram (@Kiran_Abbavaram) February 12, 2025 -
ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ వాయిదా
-
వైఎస్సార్సీపీ ‘ఫీజు పోరు’ వాయిదా
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ నిర్వహించతలపెట్టిన ఫీజు పోరు నిరసన కార్యక్రమం వాయిదా పడింది. ఫిబ్రవరి 5న జరగాల్సిన కార్యక్రమాన్ని మార్చి 12కి వాయిదా వేసింది. ఈ మేరకు పార్టీ సోమవారం(ఫిబ్రవరి3) ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఫీజుపోరు వాయిదా నిర్ణయం తీసకున్నట్లు తెలిపింది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తమ ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని ఆదివారమే ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ కోరింది. అయితే ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో నిరసనను వాయిదా వేయాలని నిర్ణయించారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నపుడు ప్రవేశపెట్టిన పీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌తో ఎందరో ఐటీ నిపుణులుగా, ప్రొఫెషనల్ కోర్సులు చదువుకున్నారు. తర్వాత వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనూ ఈ స్కీమ్ విజయవంతంగా కొనసాగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఈ స్కీమ్ అమలు చేయకుండా పేద, మధ్య తరగతి విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థులు,వారి తల్లిదండ్రుల పక్షాన ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఫీజుపోరు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ కార్యక్రమం మార్చి 12కి వాయిదా పడింది. -
డేట్ చేంజ్
జీవా(jeeva), అర్జున్ సర్జా(arjun sarja) హీరోలుగా, రాశీ ఖన్నా హీరోయిన్గా నటించిన తాజా చిత్రం ‘అగత్యా’(agatya). ప్రముఖ పాటల రచయిత పా. విజయ్ కథ అందించడంతో పాటు దర్శకత్వం వహించారు. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేశ్ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నేడు విడుదల కావాల్సింది.అయితే జనవరి 31 నుంచి ఫిబ్రవరి 28కి విడుదలని వాయిదా వేసినట్లు ప్రకటించారు మేకర్స్. ‘‘గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ‘అగత్యా’. మన సంస్కృతి, అనుబంధాలను దర్శకుడు బలంగా చెప్పారు. అద్భుతమైన సీజీ వర్క్‌తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. వీఎఫ్ఎక్స్ కోసం మరికొంత టైమ్ కేటాయించాలని భావించి, విడుదల వాయిదా వేశాం’’ అని యూనిట్ పేర్కొంది. -
డేట్ మారిందా?
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారని సమాచారం. విజయ్ దేవరకొండ కెరీర్లో 12వ సినిమా ఇది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాను తొలుత మార్చి 28న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్.అయితే ఆ డేట్‌కి రిలీజ్ వాయిదా పడిందని తెలిసింది. మే 30న రిలీజ్ చేయాలనే ఆలోచనలో చిత్రయూనిట్ ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ చిత్రంలో విజయ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని, రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుందనే టాక్ ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత దర్శకులు రాహుల్ సంకృత్యాన్ , రవికిరణ్ కోలా సినిమాల్లో విజయ్ దేవర కొండ నటించనున్నారు. -
రాజా సాబ్ వాయిదా?
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రస్తుత చిత్రాల్లో ‘రాజా సాబ్’ ఒకటి. ఈ హారర్ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘రాజా సాబ్’ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా, చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కావడం లేదని, కొత్త విడుదల తేదీపై త్వరలోనే చిత్రయూనిట్ ఓ ప్రకటన చేయనుందని తెలిసింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సంక్రాంతి సందర్భంగా ‘రాజా సాబ్’ సినిమాకు చెందిన ఓ అప్డేట్ని ఇవ్వడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోందట. బహుశా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్ రావొచ్చని సమాచారం. -
16కు సీఎం విదేశీ పర్యటన వాయిదా
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 13 నుంచి విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉండగా.. రెండ్రోజుల తర్వాత వెళ్లనున్నారు. ఈనెల 14న ఢిల్లీకి వెళ్లి 15న జరగనున్న ఏఐసీసీ కొత్త కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఆయన 13న వెళ్లాల్సిన ఆ్రస్టేలియా పర్యటనను విరమించుకున్నారు. 16న సీఎం స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లి అక్కడి స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు. అనంతరం వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. 24న రాష్ట్రానికి తిరిగి చేరుకుంటారు.నేడు కలెక్టర్లతో సీఎం సమావేశంసాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కలెక్టర్లతో సమావేశం నిర్వ హించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రా రంభించనున్న రైతు భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పా టు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఈ సమావేశంలో కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. -
కుబేర రిలీజ్ డేట్ లో ట్విస్ట్..
-
Hyderabad: నుమాయిష్ వాయిదా… ఎప్పటి నుంచంటే!
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)కు సర్వం సిద్ధమవుతోంది. అయితే నుమాయిష్ ప్రారంభ తేదీ వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి 1న ప్రారంభం కావాల్సిన నుమాయిష్ 3వ తేదీకి వాయిదా పడింది. రెండు రోజులు ఆలస్యంగా ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. 3న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తామని తెలిపారు. 46 రోజుల పాటు వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. నిజాం కాలంలో 1938లో ప్రారంభమైన నుమాయిష్‌ను తిలకించేందుకు నగరవాసులే కాక తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలి వస్తారు.2200 స్టాల్స్ ఏర్పాటుఎగ్జిబిషన్లో 2200 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జమ్మూకాశ్మీర్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల ఉత్పత్తులు ఈ స్టాళ్లల్లో కొలువుదీరనున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వైద్య, ఆరోగ్య, కార్మిక, సమాచార, ఆర్బీఐ, అటవీశాఖ, జైళ్ల శాఖలతో పాటు పలు ప్రభుత్వ శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేసి సందర్శకులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తాయి. జనవరి 3న ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్లో రౌండ్ స్టాళ్లను తొలగించి స్క్వైయర్ స్టాళ్లను కూడా అందుబాటులో ఉంచారు.సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ..ఎగ్జిబిషన్ నలుమూలలా 160 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు ప్రధాన గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. సందర్శకులను మధ్యాహ్నం 3 గంట నుండి రాత్రి 10.30 గంటల వరకు అనుమతిస్తారు. ఈ ఏడాది ఎంట్రీ ఫీజును రూ.10 పెంచారు. గతంలో రూ.40గా ఉన్న ప్రవేశ రుసుమును రూ.50 గా నిర్ణయించారు. -
ప్రభాస్ 'రాజాసాబ్' రిలీజ్ వాయిదా పడ్డట్లే
లెక్క ప్రకారం ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కావాలి. కానీ గత కొన్నిరోజుల నుంచి వాయిదా అని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అధికారికంగా ఏం చెప్పలేదు గానీ దాదాపు వాయిదా పడ్డట్లే. ఎందుకంటే యంగ్ హీరో సిద్ధు జొన్నల్లగడ్డ.. అదే తేదీకి తన కొత్త సినిమాని తీసుకొస్తున్నట్లు ప్రకటించడంతో ఈ క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సత్యదేవ్ కొత్త సినిమా)'టిల్లు' సినిమాలతో ఫేమస్ అయిన సిద్ధు.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'జాక్' మూవీ చేస్తున్నాడు. 'బేబి' వైష్ణవి చైతన్య హీరోయిన్. షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పుడు హఠాత్తుగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 'రాజాసాబ్' వాయిదా గురించి వీళ్లకు క్లారిటీ ఉన్నట్లు ఉంది. అందుకే అంత కచ్చితంగా అదే డేట్ వేశారు.'రాజాసాబ్' వాయిదాకు ప్రబాస్ గాయమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చీలమండ బెణికిందని న్యూస్ వచ్చింది. దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నాడని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తాడని తెలుస్తోంది. ఇది కూడా వాయిదాకు మరో కారణమని అంటున్నారు. (ఇదీ చదవండి: రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త) -
క్వాష్ పిటిషన్ పై విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా
-
యథావిధిగా గ్రూప్–2
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయలేమ ని హైకోర్టు తేల్చిం చెప్పింది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినందున స్టే ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది. యథావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్‌కు స్ప ష్టం చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 6కు వాయిదా వేసింది. ఈ నెల 16, 18 తేదీల్లో జరగనున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ ఆర్బీ) పరీక్షల దృష్ట్యా 16న జరగనున్న గ్రూప్–2 పేపర్–3, పేపర్–4 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా దంపిల్లపల్లికి చెందిన రావుల జ్యోతితోపాటు మరో 21 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ అంశంపై కమిషన్‌కు నవంబర్ 25నే వినతిపత్రం సమ ర్పించినా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టుకెక్కారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ పుల్ల కార్తీ క్ సోమవారం విచారణ చేపట్టారు. టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది వాది స్తూ 15, 16న జరగనున్న గ్రూప్–2 పరీక్షలకు దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని.. ఇప్పటికే పరీక్షల నిర్వ హణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పారు. స్టే కోరుతున్న వారి కోసం పరీక్షలను వాయిదా వేస్తే లక్షల మంది ఇబ్బందిపడతారని నివేదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ దశలో గ్రూప్–2 పరీక్షను నిలిపేయలేమని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ ముఖ్య కార్యదర్శి, టీజీపీఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు నోటీసులు జారీ చేశారు.గ్రూప్–2 హాల్‌టికెట్లు విడుదల గ్రూప్–2 పరీక్షల కోసం తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ సోమవారం హాల్‌టికెట్లను విడుదల చేసింది. కమిషన్ వెబ్సైట్లో వాటిని అభ్యర్థులకు అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ సూచించారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏవైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించేందుకు జిల్లాలవారీగా హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ హెల్ప్‌లైన్ నంబర్లు 040–22445566/ 23542185/23542187కు కాల్ చేసి లేదా helpdesk@tspsc.gov.in కు ఈ–మెయిల్ చేయాలని సూచించారు. తొలిరోజే లక్ష మందికిపైగా అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. -
ఈయూలో చేరిక అంశం వాయిదా
టిబిలిసీ: యురోపియన్ యూనియన్(ఈయూ)లో జార్జియా చేరే అంశాన్ని నాలుగేళ్లపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని ప్రకటించడంతో.. దేశంలో ఆగ్రహం వెల్లువెత్తింది. ప్రతిపక్షాలు పార్లమెంటును బహిష్కరించాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈయూ, జార్జియన్ జెండాలను ప్రదర్శిస్తూ పార్లమెంట్ వెలుపల ర్యాలీ నిర్వహించారు. రాజధాని టిబిలిసీ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు శుక్రవారం నిరసనకారులపై బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. కూటమి సిఫార్సులను నెరవేర్చాలనే షరతుతో ఈయూ 2023 డిసెంబరులో జార్జియాకు అభ్యర్థి హోదాను ఇచ్చింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ‘విదేశీ ప్రభావ’చట్టాన్ని ఆమోదించిన తరువాత దాని విలీనాన్ని నిలిపివేసింది. ఆర్థిక మద్దతును కూడా తగ్గించింది. ఈ నేపథ్యంలో జార్జియాలో అక్టోబర్ 26న ఎన్నికలు జరిగాయి. వీటిని యురోపియన్ యూనియన్‌లో చేరాలన్న దేశ ఆకాంక్షలకు రెఫరెండంగా భావించారు. అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే జార్జియాను తన అదీనంలోనే ఉంచుకోవాలనే రష్యా ప్రభావంతో ఓటింగ్‌లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. డబ్బు ప్రవాహం, డబుల్ ఓటింగ్, హింసాత్మక వాతావరణంలో ఓటింగ్ జరిగిందని యూరోపియన్ ఎన్నికల పరిశీలకులు సైతం తెలిపారు. అంతకుముందు, జార్జియన్ పార్లమెంటరీ ఎన్నికలు నిష్పాక్షికంగా జరగలేదని యురోపియన్ పార్లమెంటు గత నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీదే పూర్తి బాధ్యతని తెలిపింది. ఏడాదిలోగా పార్లమెంటరీ ఓటింగ్‌ను పునఃసమీక్షించాలని, జార్జియాపై ఆంక్షలు విధించాలని, ప్రభుత్వంతో అధికారిక సంబంధాలను పరిమితం చేయాలని సభ్యులు ఈయూకు పిలుపునిచ్చారు. ఈయూ ఆరోపణలను జార్జియా ఖండించింది. ఇది బ్లాక్మెయిల్ రాజకీయాలని, జార్జియాను శాసించే అధికారం ఎవ్వరికీ ఇవ్వబోమని ప్రధాని ప్రకటించారు. అంతేకాదు.. యురోపియన్ యూనియన్ దిశగా మా పంథాను కొనసాగిస్తామని తెలిపారు. అయితే 2028 చివరివరకు చర్చలను ఎజెండాలో ఉంచబోమని ప్రధాని కొబాఖిడ్జే గురువారం చెప్పారు. ఈయూ నుంచి ఎలాంటి బడ్జెట్ గ్రాంట్లను తీసుకోబోమని తెలిపారు. ప్రధాని ప్రకటన తర్వాత వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. టిబిలిసీలోని పార్లమెంటు భవనం ఎదుట ర్యాలీ నిర్వహించారు. ఇతర నగరాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించారు. జార్జియన్ డ్రీమ్పార్టీ నిరంకుశంగా మారి మాస్కో వైపు మొగ్గు చూపుతోందని విమర్శకులు అంటున్నారు. అధ్యక్షుడు సలోమ్ జౌరాబిచి్వలి అధికారిక ఫలితాలను తిరస్కరించారు. పార్లమెంటు చట్టబద్ధతను గుర్తించడానికి నిరాకరించారు. వచ్చే నెలలో అధ్యక్షుడి ఆరేళ్ల పదవీకాలం ముగియనుంది.. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. ఎన్నికలను దేశాన్ని ఐరోపా నుంచి, రష్యా వైపు తీసుకెళ్లేందుకు జరిగిన ‘తిరుగుబాటు’గా అభివరి్ణంచారు. దేశ భవిష్యత్తుపై పాలకపక్షం యుద్ధం చేస్తోందని ఆరోపించారు. -
హష్ మనీ కేసులో ట్రంప్‌కు ఊరట
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్‌కు కేసుల నుంచి భారీ ఉపశమనం లభిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హష్ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్‌కు శిక్షను న్యాయస్థానం నిరవధికంగా వాయిదా వేసింది. వాస్తవానికి ఈ కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనకు నవంబర్ నెలలోనే శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో కేసుల విషయంలో విచారణ ఎదుర్కోకుండా ఆయనకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలోనే హష్ మనీ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు న్యూయార్క్ కోర్టును ఆశ్రయించారు. దీంతో శిక్షపై స్టే కోసం దరఖాస్తు చేయాలని న్యాయస్థానం సూచించింది. ట్రంప్‌కు ఇది భారీ విజయమని ఆయన తరఫు ప్రతినిధులు చెప్పారు. శృంగార తార స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్ ఏకాంతంగా గడిపినట్లు ఆరోపణలు వచ్చాయి. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరువిప్పకుండా చేయడానికి రిపబ్లికన్ పార్టికి విరాళంగా అందిన సొమ్ము నుంచి డబ్బులు చెల్లించారని బయటపడింది. ట్రంప్ తన లాయర్ ద్వారా 1.30 లక్షల డాలర్లు ఇచ్చినట్లు రుజువైంది. అంతేకాదు స్టార్మీ డేనియల్స్కి చెల్లించిన డబ్బుల వివరాలను ట్రంప్ లెక్కల్లో చూపలేదు. -
మళ్ళీ వాయిదా పడిన పుష్ప 2..?
-
పోస్టుల భర్తీపై కూటమి గేమ్
-
AP: గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా
సాక్షి,విజయవాడ: ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. 2025 జనవరి 5న జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 23వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్ మంగళవారం(నవంబర్ 12) ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్ష మంది దాకా గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు.ఇదీ చదవండి: రేణిగుంట ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల నిరసన -
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా
సాక్షి, విజయవాడ: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది. సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడింది. రెండు, మూడు రోజుల్లో మళ్లీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6 బుధవారం(నేడు) నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండగా, అధికారులు వాయిదా వేస్తునట్లు వెల్లడించారు.గత వైఎస్సార్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 6100 పోస్టులతో పాటు.. దానికి మరో 10247 పోస్టులు కలిపి.. మొత్తం 16,347 పోస్టులతో డీఎస్సీ ప్రకటన విడుదల కానుంది. ఇందులో ఎస్జీటీ 6371 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు 7725 పోస్టులు, టీజీటీ 1781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు, ప్రిన్సిపల్ 52 పోస్టులు, పీఈటీ 132 పోస్టులు ఉండనున్నాయి. -
తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ కౌన్సిలింగ్ వాయిదా
-
గేమ్ చేంజ్
గేమ్ డేట్ చేంజ్ అయింది. ఎందుకంటే ఆడే ఆటని అందరూ చూడాలంటే సరైన తేదీ ఉండాలి కదా. అందుకే ఆటని సంక్రాంతికి మార్చారు. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ గురించే ఇదంతా. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రోడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ఇది. ఇందులో కియారా అద్వాని హీరోయిన్. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు.అయితే వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నప్పుడు క్రిస్మస్ కన్నా సంక్రాంతి అయితే బాగుంటుందని నాతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, కర్ణాటక ఓవర్సీస్లోని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ భావించాం.అయితే సంక్రాంతికి చిరంజీవిగారి ‘విశ్వంభర’ కూడా ఉంది. ‘విశ్వంభర’ భారీ బడ్జెట్ చిత్రమే. అయితే ‘గేమ్ చేంజర్’ మూడేళ్లుగా నిర్మాణంలో ఉందని, సంక్రాంతి డేట్ కావాలని చిరంజీవిగారిని, యూవీ సంస్థని కోరడంతో ‘విశ్వంభర’ దాదాపు పూర్తి కావచ్చినప్పటికీ సానుకూలంగా స్పందించారు. మా సినిమా కోసం వాళ్ల సినిమాను వాయిదా వేసుకోవడానికి ఒప్పుకున్నందుకు చిరంజీవిగారికి, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీకి ధన్యవాదాలు’’ అన్నారు. -
నెల ఆలస్యంగా కంగువ
‘కంగువ’ సినిమా కొత్త విడుదల తేదీ ఖరారైంది. సూర్య హీరోగా నటించిన ఈ భారీ పీరియాడికల్ యాక్షన్ చిత్రాన్ని నవంబరు 14న రిలీజ్ చేయనున్నట్లు గురువారం మేకర్స్ ప్రకటించారు. శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్గా నటించగా, బాబీ డియోల్, యోగిబాబు ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ ఈ సినిమాను నిర్మించారు.ఈ చిత్రాన్ని నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయనున్నారు. ‘‘పీరియాడిక్ యాక్షన్ జానర్లో ఇప్పటివరకూ రాని ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో ‘కంగువ’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘కంగువ’ సినిమాను తొలుత ఈ ఏడాది అక్టోబరు 10న రిలీజ్ చేయాలనుకున్నారు. ఫైనల్‌గా ఓ నెల ఆలస్యంగా నవంబరు 14కి వాయిదా వేశారు. -
మరోసారి వాయిదా
కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ విడుదల మరోసారి వాయిదా పడింది. శుక్రవారం (సెప్టెంబర్ 6న) ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయని కారణంగా మరోసారి వాయిదా పడింది. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ టైమ్‌లో జరిగిన ఘటనలతో ఈ మూవీ రూపొందింది.ఈ సినిమా పలుమార్లు విడుదల (2023 నవంబరు 24, 2024 జూన్ 14, 2024 సెప్టెంబర్ 6) వాయిదా పడింది. దీనిపై కంగనా రనౌత్ స్పందిస్తూ ‘‘ఎమర్జెన్సీ’ మరోసారి వాయిదా పడిందని చెప్పడానికి బాధగా ఉంది. సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నాం. త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని పేర్కొన్నారు. -
కంగువ వాయిదా?
‘కంగువ’ సినిమా దసరాకు రిలీజ్ కావడం లేదనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కంగువ’. దిశా పటానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో బాబీ డియోల్, యోగిబాబు ఇతర కీలక పాత్రల్లో నటించారు. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి.ఈ చిత్రాన్ని అక్టోబరు 10న విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. దసరా సెలవులను టార్గెట్‌గా చేసుకుని ‘కంగువ’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఈ సినిమా అక్టోబరు 10న విడుదల కావడం లేదని, నవంబరులో విడుదలయ్యే అవకాశం ఉందని, అది కూడా దీపావళి పండగ సమయంలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందనే టాక్ తమిళ పరిశ్రమలో వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. -
దీపావళికి లక్కీ భాస్కర్
అనుకున్న సమయాని కన్నా కాస్త లేట్‌గా థియేటర్స్‌లోకి రానున్నాడు లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 7న విడుదల చేయాలనుకున్నారు.కానీ నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావడానికి మరికొంత టైమ్ పడుతుందని, అందుకే వాయిదా వేసి, దీపావళికి తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో అక్టోబరు 31న రిలీజ్ చేయనున్నామనీ మేకర్స్ ప్రకటించారు. ‘‘ఓ సాధారణ వ్యక్తికి చెందిన అసాధారణ ప్రయాణమే ఈ చిత్రం. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినివ్వడం కోసం డబ్బింగ్‌తో సహా అన్ని సాంకేతిక విభాగాల విషయంలో రాజీ పడకుండా పని చేస్తున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. -
రెవెన్యూ సదస్సులు సెప్టెంబర్‌కు వాయిదా
సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీల కారణంగా రెవెన్యూ సదస్సులను వాయిదా వేస్తున్నట్టు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి ప్రారంభించాల్సిన సదస్సులను సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.ఈ సదస్సుల్లో మొదటి 45 రోజులు భూ వివాదాలు, రీ–సర్వే తప్పిదాలకు సంబంధించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు. అనంతరం 45 రోజుల్లో అర్జీలపై చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల విషయంలో మోసపూరిత రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ‘ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనే’ పద్ధతి తీసుకురావడంతో కొన్ని మోసపూరిత రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించామన్నారు. ఇలాంటి వాటిపై విచారణ జరిపి నిజమైన అసైనీలకు న్యాయం చేస్తామన్నారు. -
2018 నుంచి 16 పరీక్షలను వాయిదా వేసిన ఎన్టీఏ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 16 పరీక్షలను వాయిదా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2018లో ఎన్టీఏ ఏర్పాటు కాగా.. వివిధ కారణాల వల్ల 16 పరీక్షలను వాయిదా వేసినట్లు విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం లోక్‌సభలో పేర్కొంది. అయితే పరీక్షలను వాయిదా వేయడానికి కోవిడ్ 19 మహమ్మారి,సాంకేతిక, రవాణా, పరిపాలనా పరమైన సమస్యలను కారణాలుగా తెలిపింది. ఈ మేరకు డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు. విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.‘2018లో ఎన్టీఏ ఏర్పాటయ్యింది. 240 పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. 5.4 కోట్ల మందికి పైగా విద్యార్ధులు ఇందులో పాల్గొన్నారు. ఎన్టీఏ నిర్వహించే చాలా పరీక్షలు అనేక సబ్జెక్టులు, బహుళ-షిఫ్ట్‌లు, ఎక్కువ రోజుల వ్యవధిలో జరుగుతాయి. కాబట్టి కరోనా, లాజిస్టికల్, సాంకేతిక సమస్యలు, పరిపాలనాపరమైన సమస్యలు, చట్టపరమైన సమస్యలు వంటి కారణాల వల్ల పలు పరీక్షలు వాయిదా పడ్డాయి. ముందు చెప్పిన తేదీలు, సమయాలకు పరీక్షలు నిర్వహించలేకపోయింది.’ అని పేర్కొన్నారు.కరోనా కారణంగా జేఈఈ-మెయిన్ (2020), నీట్-యూజీ (2020), JEE-మెయిన్ (2021) నీట్-యూజీ(2021) పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా పడిన మరిన్ని పరీక్షలు.. CSIR UGC-NET (2020), UGC-NET (డిసెంబర్ 2020),UGC-NET (మే 2021)ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) AIEEA (2020).. ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (DUET) 2020, GNOU PhDకామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT)-2021ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (AIAPGET)-2021 జాయింట్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జిప్‌మ్యాట్)- 2021, GNOU PhD ఎంట్రన్స్ పరీక్షగ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ బయోటెక్నాలజీ (GAT-B), 2023నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (NCET), 2024, CSIR-NET, 2024 -
గ్రూప్–2 పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది. గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయడానికి అంగీకరించింది. దీంతో పాటు పోస్టుల సంఖ్యను పెంచేందుకు, కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడానికి కూడా ఆమోదం తెలిపింది. శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్‌లు నిరుద్యోగులతో సమావేశమయ్యారు. ఆయా అంశాలపై చర్చించిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు గ్రూప్–2 పరీక్షల వాయిదాపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డితోనూ ప్రభుత్వం మాట్లాడింది. చర్చల సందర్భంగా నిరుద్యోగుల డిమాండ్లను సానుకూలంగా సానుకూలంగా ఆలకించిన తర్వాత డిప్యూటీ సీఎం స్పందించారు. 3 నెలల్లో 54 వేల ఉద్యోగాలకు మోక్షం: భట్టి గ్రూప్–2 అభ్యర్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డి సూచించారని భట్టి చెప్పారు. డిసెంబర్లో పరీక్షల నిర్వహణపై అధికారులతో చర్చిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 3 నెలల వ్యవధిలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించిందని అన్నారు. మరిన్ని ఉద్యోగ ఖాళీలను గుర్తించి జాబ్ కేలండర్‌ను ప్రకటించే పనుల్లో ప్రభుత్వం నిమగ్నమైందని వెల్లడించారు.ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు ఇప్పటికే స్థిరపడేవన్నారు. ఎన్నికలకు ముందు సీఎల్పీ నేతగా తాను, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఎజెండాగా చేసుకున్నామని గుర్తుచేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికి జీతాల భారం తగ్గుతుంది కానీ, ప్రజా ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించదని స్పష్టం చేశారు. తెలంగాణ బిడ్డలు స్థిరపడాలని, వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నట్లు చెప్పారు. కొందరు వారి స్వలాభం కోసం నిరుద్యోగులను బలి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నాలెడ్జ్ సెంటర్ విద్యావ్యవస్థను సమూలంగా మార్చాలని ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోందని భట్టి చెప్పారు. కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం అధునాతన టెక్నాలజీతో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్ పద్ధతిలో శిక్షణ ఇస్తామని, దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్లో పాఠాలు బోధిస్తారని చెప్పారు. ఇది ప్రజా, విద్యార్థుల ప్రభుత్వం: ఎంపీలు గ్రూప్–2 పరీక్షల పోస్టులను పెంచుతూ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్ తెలిపారు. ఇది ప్రజా, విద్యార్థుల ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. డిప్యూటీ సీఎంతో సమావేశం తర్వాత మీడియా పాయింట్ వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. పరీక్షలకు సమయం ఇవ్వాలి: గ్రూప్–2 అభ్యర్థులు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోలేదని గ్రూప్–2 అభ్యర్థులు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తమ విజ్ఞప్తిని మన్నించారంటూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గ్రూప్ పోస్టులను వీలైనంత వరకూ పెంచాలని, అలాగే పరీక్షలకు వీలైనంత సమయాన్ని ఇవ్వాలని విద్యార్థులు సుఖేష్ (సిద్దిపేట జిల్లా), నవీన్ (హుస్నాబాద్), మహేష్ (ఖమ్మం) కోరారు. డీఎస్సీ పరీక్షలు రాసేవారు కూడా చాలామంది గ్రూప్ పరీక్షలు రాస్తున్నారని, అందువల్ల కనీసం మూడు నెలలైనా పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రూప్ పరీక్షల కోసం రూ.5 భోజనం చేస్తూ సిద్ధమవుతున్నామని, ప్రభుత్వం నిరుద్యోగులపై కరుణ చూపించాలని కోరారు. -
తెలంగాణ గ్రూప్-2 ఎగ్జామ్ వాయిదా
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష వాయిదా పడింది. అభ్యర్థుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం.. డిసెంబర్‌కు పరీక్షను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నాం అధికారికంగా ప్రకటించింది.ఆగష్టు 7, 8వ తేదీల్లో షెడ్యూల్ ప్రకారం పరీక్ష జరగాల్సి ఉంది. అయితే.. డీఎస్సీ పరీక్షలు పూర్తి కాగానే వెంటనే గ్రూప్ పరీక్షలు ఉండటం తో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తొలుత పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. అభ్యర్థుల ఆందోళనలు ఉధృతం కావడంతో వాయిదాకే మొగ్గు చూపించింది. ఇదిలా ఉంటే.. 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన చేసింది. కానీ వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా డిసెంబర్‌కు వాయిదా వేస్తూ.. త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు వెల్లడించింది.మరోవైపు ఉద్యోగాభ్యర్థులతో సెక్రటేరియెట్‌లో ప్రభుత్వం చర్చలు జరిపింది. చర్చలు జరుగుతుండగానే.. వాయిదా ప్రకటన వెలువడడం గమనార్హం. గ్రూప్ 2 పోస్టులు పెంచుతాం అనే అంశం పై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు.గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని అడిగితే ప్రభుత్వం సానుకూలంగా స్పందించారు.డిసెంబర్ నెలలో గ్రూప్ 2 పెట్టాలని అడిగాం ప్రభుత్వం ఒకే అన్నది.మా డిమాండ్ల పై సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు.:::గ్రూప్ -2 అభ్యర్థులు గ్రూప్ 2, 3 వాయిదాకు ప్రభుత్వం అంగీకరించింది.త్వరలో మళ్ళీ పరీక్షల నిర్వహణ పై తేదీలు ప్రకటిస్తుంది.విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఇది కాదు..ఇది ప్రజా ప్రభుత్వం.:::ఎంపీ మల్లు రవి DSC పోస్టుల పై విద్యార్థులు పలు విజ్ఞప్తులు చేశారు.DSC ప్రాంతేతర అంశాల త్వరలో చర్చలు జరుపుతం అని సిఎం అన్నారు.8ఏళ్లుగా BRS విద్యార్థులకు అన్యాయం చేసింది. :::ఎంపీ బలరాం నాయక్ గత విద్యార్థులను కనీసం పట్టించుకోలేదుఇది ప్రజా ప్రభుత్వం అందుకే విద్యార్థులతో మాట్లాడింది.నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నిరుద్యోగుల సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది.ఇది విద్యార్థి ప్రభుత్వం.:::ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ -
రెడీ... సెట్... గో
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప: ది రూల్’. ఈ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్‌కి రెడీ సెట్ గో అంటున్నారు మేకర్స్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ‘పుష్ప: ది రైజ్’ (2021) వంటి బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్‌గా సేమ్ కాంబినేషన్లో ‘పుష్ప: ది రూల్’ రూపొందుతోంది.షెడ్యూల్ ప్రకారం చిత్రీకరణ పూర్తి అయ్యుంటే ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే షూటింగ్ సకాలంలో పూర్తి కాకపోవడం.. క్వాలిటీ విషయంలో చిత్రయూనిట్ రాజీ పడకపోవడంతో ఈ మూవీని డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక తాజా షెడ్యూల్ విషయానికి వస్తే.. ఈ నెల 22 లేదా 25న ప్రారంభం అవుతుందట. ఈ నెల 28 నుంచి అల్లు అర్జున్ కూడా చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. శరవేగంగా చిత్రీకరణ, పోస్ట్‌ప్రోడక్షన్ పనులు పూర్తి చేసి, డిసెంబరు 6నే సినిమాని విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని భోగట్టా. -
టెట్ వాయిదా
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ఈ నెల రెండో తేదీన విడుదల చేసిన షెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. అభ్యర్థులు ఆగస్టు 3 వరకు ఫీజు చెల్లించవచ్చని కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఫలితాలను నవంబర్ 2న వెల్లడించనున్నారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు https://cse.ap.gov.in/ లో చూడొచ్చని తెలిపింది. మారిన టెట్ షెడ్యూల్ ఇదీ.. ⇒ ఫీజులు చెల్లించేందుకు గడువు: 03–08–2024⇒ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించేందుకు గడువు: 03/08/2024⇒ ఆన్లైన్లో మాక్ టెస్ట్ నిర్వహణ: 19/09/2024 నుంచి..⇒ హాల్‌టికెట్ల డౌన్లోడ్: 22/09/2024 నుంచి పరీక్షల నిర్వహణ: 03/10/2024 నుంచి 20/10/2024 వరకు⇒ ప్రాథమిక ‘కీ’: 04/10/2024 నుంచి⇒ ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణ: 05/10/2024 నుంచి 21/10/2024 వరకు⇒ ఫైనల్ ‘కీ’ విడుదల: 27/10/2024 ⇒టెట్ ఫలితాల వెల్లడి: 02/11/2024 -
Uttarakhand: చార్ధామ్ యాత్ర నిలిపివేత
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఏకధాటిగా వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్రంలోని నదులన్నీ పోటెత్తి ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో చార్ధామ్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వర్షాల కారణంగా చమోలీ జిల్లాలతోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై పలుచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. శనివారం కొండచరియలు విరిగి పడిన ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. భారత వాతావరణశాఖ(ఐఎండీ) ఉత్తరాఖండ్‌కు రెడ్అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది. రెడ్ అలర్ట్ నేపథ్యంలో సీఎం పుష్కర్‌సింగ్ ధామి కలెక్టర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. -
నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా
-
నీట్-యూజీ కౌన్సిలింగ్ వాయిదా
ఢిల్లీ: నీట్-యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా.. వాయిదా వేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రకటించింది. తిరిగి కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలోనే తెలియజేస్తామని ఆ ప్రకటనలో తెలిపింది. NEET UG counselling deferred until further notice: Official sources pic.twitter.com/VVMvpGwDDH— ANI (@ANI) July 6, 2024నీట్ పరీక్షలో అక్రమాలపై దర్యాప్తు కోరుతూ దాఖలైన ప్రధాన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కౌన్సెలింగ్‌ను వాయిదా వేసేందుకు మాత్రం నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పిటిషన్లను అన్నింటిని ఒక్కటిగా జూలై 8న(ఎల్లుండి) విచారణ జరపనుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీయే నీట్ కౌన్సిలింగ్‌ను వాయిదా వేసి ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. మరోవైపు.. నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ పరీక్షను రద్దు చేసేది లేదని తేల్చి చెప్పింది. పోటీ పరీక్షలను పారదర్శక రీతిలో నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజి కేసులో ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేశామని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామని తన అఫిడవిట్లో వెల్లడించింది. -
అమర్నాథ్ యాత్ర: కరిగిన మంచు శివలింగం.. భక్తుల నిరాశ
జమ్ముకశ్మీర్‌లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతోంది. అయితే తాజాగా భక్తులను నిరాశపరిచే ఒక వార్త వినిపిస్తోంది. అమర్నాథ్ గుహలో అంతకంతకూ పెరుగుతున్న వేడి కారణంగా మంచు శివలింగం అకాలంగా కరిగిపోయింది. దీంతో భక్తులు మహా శివలింగాన్ని దర్శించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గుహలో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా ఈరోజు(శనివారం) అమర్నాథ్ యాత్ర బల్తాల్, పహల్గాం రెండు మార్గాలలోనూ వాయిదా పడింది. వాతావరణం అనుకూలించిన వెంటనే యాత్ర ప్రారంభం కానున్నదని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా భక్తులు అమర్నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. అయితే తాజాగా పవిత్ర గుహలోని మంచు శివలింగం పూర్తిగా కరిగిపోవడంతో యాత్రికులు నిరాశకు గురయ్యారు.గత వారం రోజులుగా ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో మంచు కరిగే ప్రక్రియ వేగవంతమైందని అధికారులు చెబుతున్నారు. యాత్ర ప్రారంభమైన 10 రోజుల్లోనే మంచు శివలింగం పూర్తిగా కరిగిపోవడం 2008 తర్వాత ఇప్పుడే చోటుచేసుకుంది. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర 52 రోజుల పాటు కొనసాగనుంది. జూన్ 29న ప్రారంభమైన ఈ యాత్ర ఆగస్టు 19న ముగియనుంది. -
AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. పాలనాపరమైన కారణాలతో పరీక్ష వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో వెల్లడిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది. -
శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
సాక్షి, తిరుపతి: శ్రీహరికోట నుంచి జరగాల్సిన ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ ప్రయోగం మరోసారి వాయిదా పడింది. సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) వేదికగా ఈ ఉదయం రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే మంగళవారం వేకువ ఝామున ప్రయోగానికి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో వాయిదా వేశారు శాస్త్రవేత్తలు.చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ ఏరోస్పేస్ సంస్థ అగ్నిబాణ్ రాకెట్‌ను రూపొందించింది. సొంత ల్యాంచ్‌ప్యాడ్ ఏర్పాటు చేసి సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టాలనుకున్నారు. షెడ్యూల్ ప్రకారం.. ఎనిమిది గంటల కౌంట్‌డౌన్ అనంతరం ప్రైవేట్ ప్రయోగ వేదిక నుంచి ఉదయం 5.48 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. ప్రయోగాన్ని సమీక్షించేందుకు ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ సోమవారం సాయంత్రమే షార్కు కూడా చేరుకున్నారు. అయితే సాంకేతిక సమస్య తలెత్తడంతో చివరి నిమిషంలో శాస్త్రవేత్తలు ప్రయోగం నిలిపివేశారు.ఏప్రిల్ 7వ తేదీ నుంచి అగ్నిబాణ్ ప్రయోగం వాయిదా పడడం ఇది నాలుగోసారి. దేశంలోనే మొదటి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా అగ్నిబాణ్ రికార్డులకెక్కింది. దేశీయంగా రూపొందించిన 3డీ ప్రింటెడ్ ఇంజిన్‌ను ఇందులో ఉపయోగిస్తున్నారు. -
కేబినెట్ భేటీ వాయిదా.. కారణం ఇదే..
-
ఆలస్యంగా వస్తున్న గ్యాంగ్
కాస్త లేట్‌గా థియేటర్స్‌లోకి రానున్నారు గోదావరి గ్యాంగ్. విశ్వక్ సేన్ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్గా నటించగా, కీలక పాత్రలో అంజలి నటించారు. కృష్ణచైతన్య దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కావాల్సింది.కానీ వాయిదా వేసి, ఈ నెల 31న రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా థీమ్ సాంగ్ ‘బ్యాడ్’ లిరికల్ వీడియో నేడు విడుదలవుతోంది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలో లంకల రత్నగా విశ్వక్ సేన్, రత్నమాలగా అంజలి, బుజ్జిగా నేహా శెట్టి కనిపిస్తారు. -
లిక్కర్ కేసు: కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగనుంది. సీబీఐ అరెస్ట్ వ్యవహారంలో ఆమె వేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును గురువారం ఉదయం వాయిదా వేసింది సీబీఐ ప్రత్యేక స్థానం. లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ అరెస్టులపై బెయిల్ కోరుతూ కవిత తరఫున వేర్వేరు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఇవాళ సీబీఐ అరెస్ట్ వ్యవహారంపై ఆమె వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే.. ఆ తీర్పును మే 6వ తేదీకి వాయిదా వేసింది ప్రత్యేక కోర్టు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఒకేరోజు వేర్వేరుగా తీర్పులు ఇస్తామని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా స్పష్టం చేశారు. ఇక.. లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనను అక్రమంగా అరెస్టు చేసిందని బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపించింది. ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని సీబీఐ చెప్పుకొచ్చింది. ఆమె బయటకు వస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. ఈ కేసు రాజకీయ కక్షతో మాత్రమే పెట్టారని కవిత తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. కేవలం అప్రూవర్ల స్టేట్మెంట్లని ఆధారంగా చేసుకుని అరెస్టు చేశారని అన్నారు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలులేవని వాదనలు వినిపించారు.ఈడీ బెయిల్ పిటిషన్‌పై వాడీవేడి వాదనలుఇక.. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత మొదట్లో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. అయితే వాదనల అనంతరం కోర్టు దానిని తిరస్కరించింది. దీంతో ఆమె రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు. పిటిషన్‌పై వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసి.. మే 6వ తేదీన వెల్లడిస్తామని తెలిపింది. విచారణ సందర్భంగా.. ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని కవిత తరఫు న్యాయవాది వాదించారు. అయితే కవితను సెక్షన్ 19 కింద చట్టబద్దంగా అరెస్టు చేశామని.. అక్రమంగా అరెస్టు చేశారనే దానిలో పసలేదని ఈడీ వెల్లడించింది. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందన్నారు. రూ. 581 కోట్లు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారని... అయిదు నుంచి 12 శాతానికి కమీషన్ పెంచారన్నారు. దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరిగిందని తెలిపారు. ఈ పాలసీలో ఇండో స్పిరిట్‌కు మేజర్ షేర్ దక్కిందని.,. దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారని చెప్పారు. విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపారన్ నారు. విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని.. అసాధారణ లాభాలు గడించారని కోర్టుకు విన్నవించారు. బలవంతంగా మహదేవ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి పక్కకు తప్పించారన్నాు. ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కలేదని కోర్టుకు తెలిపారు. దాదాపు రెండు గంటలపాటు ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించడం గమనార్హం. -
కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా
ఢిల్లీ: లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి(ఏప్రిల్ 24) వాయిదా పడింది. బుధవారం తిరిగి వాదనలు కొనసాగనున్నాయి. మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గంటన్నర సేపు వాదనలు వినిపించింది. ఈడీ వాదనలు: కవితను అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదు మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు అరెస్టు చేయబోమని మేము కోర్టుకు అండర్‌టేకింగ్ ఇవ్వలేదు కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వబోమని చెప్పాం ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకుంది , అరెస్టు ప్రక్రియ అంతా చట్టబద్దంగా జరిగింది సెక్షన్ 19 ప్రకారం మాకు అరెస్టు చేసే అధికారం ఉంది ఈ స్కామ్‌లో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చింది కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ 25 కోట్ల రూపాయలు ఇచ్చారు దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు పాలసీని సౌత్ గ్రూప్‌నకు అనుకూలంగా మార్చారు ఇండో స్పిరిట్ కంపెనీ ద్వారా లంచాల సొమ్ము కవిత తిరిగి రాబట్టుకున్నారు ఈడీ జాతీయ దర్యాప్తు సంస్థ, దీనికి దేశమంతా పరిధి ఉంది ట్రాన్సిట్ రిమాండ్‌లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు అరెస్టు చేసిన 24 గంటల్లో కవితను కోర్టులో హాజరుపరిచాం పీఎంఎల్ఎ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవు అరుణ్ పిళ్లై కవితకు బినామీ ఇండో స్పిరిట్ లో 33.5 అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారు ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది డీల్ లో భాగంగా 100 కోట్లు ఇచ్చినట్లు దినేష్ అరోరా దర్యాప్తులో అంగీకరించారు బుచ్చి బాబు వాట్సాప్ చాట్‌లో కూడా ఈ విషయం బయటపడింది ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు వివిధరకాల వ్యక్తుల స్టేట్మెంట్స్, ఇతర సాక్షాల ఆధారంగా అక్రమ సొమ్ము ను గుర్తించవచ్చు గతంలో పై కోర్టులు తీర్పు ఇచ్చాయి ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది కవిత ఈ కేసులో పూర్తి స్థాయిలో సంబంధం ఉందని అనే దానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి -
సరికొత్త ప్రయత్నం చేయనున్న కల్కి
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్నారు. భైరవ పాత్రలో ప్రభాస్, పద్మావతి పాత్రలో దీపికా పదుకోన్, అశ్వత్థామ పాత్రలో అమితాబ్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. సి. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడే అవకాశం ఉందట. కాగా ఈ చిత్రం యూనిట్ ఓ సరికొత్త ప్రయత్నం చేస్తోందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రంలో లీడ్ రోల్స్‌లో కనిపించే ప్రభాస్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ల పాత్రలకు సంబంధించిన పూర్వాపరాలను, ఆ పాత్రల తీరు తెన్నులను చెబుతూ ఓ యానిమేటేడ్ వీడియోను రెడీ చేస్తున్నారట. ఈ వీడియో నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుందని భోగట్టా. ఈ వీడియోలోని తన పాత్రకు ప్రభాస్ ఇప్పటికే డబ్బింగ్ కూడా పూర్తి చేశారని తెలిసింది. అయితే ఈ యానిమేటెడ్ వీడియో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎప్పట్నుంచి స్ట్రీమింగ్ కానుంది? వీడియో నిడివి ఎంత? అసలు వార్తల్లో ఉన్నట్లు యానిమేటెడ్ వీడియో షూట్ జరిగిందా? లేదా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన పక్షంలో దీని ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై చూపే అవకాశం ఉండటంతో కౌంటింగ్ చేపట్టొద్దని ఎన్నికల కమి షన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ రెండో తేదీన ఎమ్మె ల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి.. ఐదో తేదీలోగా ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషన్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల రెండో తేదీన అంటే మంగళవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ చేప ట్టాల్సి ఉంది. జిల్లాకేంద్రంలోని బాలుర జూని య ర్ కళా శాలలో కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికలకు ముందుగా ఉప ఎన్నిక రావడం.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ వ్యూహాలతో క్యాంప్ రాజకీ యాలకు తెరలేపడం.. సీఎం రేవంత్ సొంత ఇలా కాలో జరుగుతున్న పోరు కావటంతో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టి ఉమ్మడి మహబూనగర్ జిల్లాపైనే పడింది. ఫలితాల కోసం పార్టీలు ఆతృతగా ఎదురు చూస్తున్న క్రమంలో కౌంటింగ్ వాయిదా పడడంతో నాయకుల్లో నిరుత్సాహం అలుముకుంది. -
విద్యార్ధులకు అలర్ట్.. తెలంగాణలో పాలిసెట్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పాలిసెట్) వాయిదా పడింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పరీక్షను వాయిదా వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం మే 17న పాలిసెట్ పరీక్ష జరగాల్సి ఉండగా.. మే 24న నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి కార్యదర్శి ఎ.పుల్లయ్య ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. కాగా దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహించనున్నారు.. తెలంగాణలో నాలుగో విడుతలో మే 13న ఎన్నికలు జరుగనున్నాయి. అదే రోజు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనుంది. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. చదవండి: ప్రణీత్ రావు పిటిషన్.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు -
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ముందుగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం మే 26న జరగాల్సిన రాతపరీక్షను.. జూన్ 16వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొంది. ఈ మేరకు UPSC తన వెబ్సైట్లో ఓ ప్రకటనలో తెలిపింది. ‘త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కారణంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష - 2024ను వాయిదా వేయాలని కమిషన్ నిర్ణయించింది. మే 26న కాకుండా జూన్ 16న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఇది ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్‌కు కూడా వర్తిస్తుంది’ అని పేర్కొంది. కాగా యూపీఎస్సీ-2024 నోటిఫికేషన్ ఫిబ్రవరి 14 విడుదలైంది. సివిల్ సర్వీసెస్ పరీక్ష దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షలలో ఒకటిగా పరిగణిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎఎస్ అయ్యేందుకు ప్రతి సంవత్సరం లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. -
Farmers movement, Delhi Chalo: కేసు నమోదయ్యాకే అంత్యక్రియలు
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దుల్లోని ఖనౌరీ వద్ద బుధవారం ‘ఢిల్లీ చలో’ఆందోళనల్లో పాల్గొన్న రైతులు హరియాణా పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో శుభ్‌కరణ్‌సింగ్(21) అనే యువ రైతు గాయాలతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. శుక్రవారం ఖనౌరీ వద్ద కొనసాగుతున్న ఆందోళనలో పలువురు రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. శుభ్‌కరణ్ మృతికి బాధ్యులైన వారిపై పంజాబ్ ప్రభుత్వం కేసు నమోదు చేసే వరకు అంత్యక్రియలు జరిపేది లేదని నేతలు తేల్చి చెప్పారు. శుభ్‌కరణ్‌ను అమరుడిగా ప్రకటించాలని కూడా డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్ మేరకు శుభ్‌కరణ్ కుటుంబానికి రూ.కోటి పరిహారంతోపాటు అతడి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటూ పంజాబ్ సీఎం మాన్ ప్రకటించారు. రైతు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలుంటాయని కూడా సీఎం స్పష్టం చేశారు. అనంతరం రైతు నేత సర్వాన్ సింగ్ పంథేర్ మీడియాతో మాట్లాడారు. ‘మాక్కావాల్సింది డబ్బు కాదు. మృతికి బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే మాకు ముఖ్యం. ఆ తర్వాతే అంత్యక్రియలు జరుపుతాం. ఇందుకు అవసరమైతే 10 రోజులైనా సరే వేచి ఉంటామని శుభ్‌కరణ్ కుటుంబసభ్యులు మాకు చెప్పారు’అని వివరించారు. రైతులపైకి టియర్ గ్యాస్.. హిసార్: హరియాణా పోలీసులతో శుక్రవారం మరోసారి రైతులు తలపడ్డారు. ఖనౌరీ వద్ద నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఖేరి చోప్తా గ్రామ రైతులను పోలీసులు అడ్డగించారు. కొందరు రైతులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలో కొందరు రైతులతోపాటు పోలీసులు గాయపడ్డారు. పోలీసులు వారిపైకి టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొందరు రైతులను అదుపులోకి తీసుకున్నారు. గుండెపోటుతో మరో రైతు మృతి పంజాబ్–హరియాణా సరిహద్దుల్లో ఆందోళనల్లో పాల్గొంటున్న దర్శన్ సింగ్(62) అనే రైతు గుండెపోటుతో చనిపోయినట్లు రైతు సంఘం నేతలు చెప్పారు. మరోవైపు ఆందోళనలకు సారథ్యం వహిస్తున్న రైతు సంఘాల నేతలు శుక్రవారం పలు అంశాలపై చర్చించారు. తదుపరి కార్యాచరణను 29న ప్రకటిస్తామని మీడియాకు తెలిపారు. శనివా రం కొవ్వొత్తులతో ర్యాలీ చేపడతామ న్నారు. పంజాబ్‌వ్యాప్తంగా బ్లాక్ డే అమృత్సర్: రైతులపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ పంజాబ్ అంతటా రైతులు బ్లాక్ డే పాటించారు. శుభ్‌కరణ్ మృతిని నిరసిస్తూ అమృత్సర్, లూధియానా, హోషియార్పూర్ సహా 17 జిల్లాల్లో నిరసనలు చేపట్టినట్లు రైతు సంఘాలు వెల్లడించాయి. -
'గేమ్ ఛేంజర్' వాయిదా.. అదే అసలు కారణం?
‘‘ఈ సంక్రాంతికి ‘గుంటూరు కారం, సైంధవ్, నా సామి రంగ, ఈగల్, హనుమాన్’ తదితర సినిమాలు విడుదల కానున్నాయి. ఐదుగురు నిర్మాతలనూ పిలిచి మాట్లాడాం. రెండు సినిమాల రిలీజ్‌ను వాయిదా వేసుకోవాలని సూచించాం. సంక్రాంతి పోటీలో ఉండకూడదని నా సినిమా ‘గేమ్ ఛేంజర్’ను వేసవికి వాయిదా వేశాం. ఎవరైనా రిలీజ్ వాయిదా వేసుకుంటే.. సోలో రిలీజ్ చేసేలా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున చర్యలు తీసుకుంటాం’’ అని నిర్మాత దిల్ రాజు అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జనవరి 21న ‘లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ’ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించనుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో సోమవారం జరిగిన ప్రెస్మీట్లో పాల్గొన్న ‘దిల్’ రాజు సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడారు. లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ గురు రామాచారి మాట్లాడుతూ– ‘‘దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారి ఆశీస్సులతో 1999లోప్రారంభమైన ఈ అకాడమీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ఈ సిల్వర్ జూబ్లీ ఉత్సవానికి సారథ్యం వహించాలని డైరెక్టర్ రాఘవేంద్రరావు, నిర్మాత ‘దిల్’ రాజుగార్లను కోరగానే ఒప్పుకున్నారు’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘దిల్’ నుంచి రామాచారిగారితో పరిచయం ఉంది. ఆ టైమ్‌లో ‘లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీ’ గురించి చెప్పారాయన. ఈ అకాడమీలో ఉచితంగా సంగీతం నేర్పిస్తున్నారు. అద్దె భవనంలో ఉన్న అకాడమీకి ప్రభుత్వం తరఫున సాయం వచ్చేలా చేయాలనే ఆలోచన ఉంది’’ అన్నారు. -
Telangana: గ్రూప్ 2 పరీక్ష మళ్లీ వాయిదా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు మరోసారి వాయిదా పడేలా కనిపిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేయడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7 తేదీల్లో జరగాల్సిన గ్రూప్- 2 పరీక్ష వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు గ్రూప్-2 ఎక్సామ్ పోస్ట్‌పోన్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిసన్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. పరీక్ష తేదీ రీ షెడ్యూల్ చేస్తారా.. లేక కొత్త పోస్టులను చేర్చి రీవైజ్డ్ నోటిఫికేషన్ ఇస్తారా అనేది సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు పరీక్షలపై రివ్యూ చేసిన ప్రభుత్వం.. గ్రూప్ ఎగ్జామ్స్‌పై స్పష్టత ఇవ్వలేదు. కాగా తెలంగాణలో గ్రూప్-2కు సంబంధించి 783 పోస్టులకు 5 లక్షల 50 వేల మంది అభ్యర్థుల దరఖాస్తు చేసుకున్నారు. చదవండి: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి.. ప్రధాని మోదీతో భేటీ -
తెలంగాణ జెన్కో ఎగ్జామ్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తొలి పరీక్ష వాయిదా పడింది. జెన్కో రాత పరీక్షను వాయిదా వేస్తూ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన వెలువడింది. ఈ నెల 17వ తేదీన పరీక్ష జరగాల్సి ఉండగా.. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసినట్లు మంగళవారం సదరు ప్రకటనలో జెన్కో తెలిపింది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ, అసిస్టెంట్ ఇంజనీర్, కెమిస్ట్ పోస్టుల భర్తీ కోసం ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 17వ తేదీన రాత పరీక్ష నిర్వహించాలనుకుంది. కానీ, అదే రోజు మరికొన్ని పరీక్షలు ఉన్నాయి. దీంతో పరీక్ష వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి జెన్కోకు విజ్ఞప్తులు వచ్చాయి. అదే సమయంలో తాజాగా కొందరు అభ్యర్థులు డిప్యూటీ సీఎం భట్టి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లారు. దీంతో పరీక్ష వాయిదా వేసేందుకే జెన్కో మొగ్గు చూపింది. అయితే తిరిగి పరీక్ష ఎప్పుడు నిర్వహించేది స్పష్టత ఇవ్వలేదు. కానీ, జెన్కో వెబ్సైట్లో షెడ్యూల్‌ను పెడతామని పేర్కొంది. -
కృష్ణా జలాల వివాదం.. కీలక సమావేశం వాయిదా
సాక్షి, ఢిల్లీ: కృష్ణా జలాల వివాదంపై ఈ నెల 6న నిర్వహించనున్న కీలక సమావేశాన్ని కేంద్ర జల్‌శక్తి వాయిదా వేసింది. మిచౌంగ్ తీవ్ర తుపాను కారణంగానే ఈ భేటీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై తెలంగాణ, ఏపీ సీఎస్‌లతో పాటు కృష్ణా నదీయాజమాన్యం బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం ఈ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఢిల్లీ నుంచి కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో ఈ సమావేశం ఉంటుందని తొలుత ప్రకటించింది. అయితే తెలుగు రాష్ట్రాలను మిచౌంగ్ తుపాను కుదిపేస్తుండడంతో అధికార యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో తలమునకలైంది. ఈ పరిస్థితుల్లో సమావేశం నిర్వహించడం సబబు కాదని భావించిన కేంద్ర జల్‌శక్తి వాయిదా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8వ తేదీన సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అన్ని అంశాలను కూలంకషంగా చర్చించి.. సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని.. అప్పటి వరకు పూర్తిగా సంయమనం పాటించాలని కార్యదర్శి ముఖర్జీ ఇదివరకే తెలుగు రాష్ట్రాలకు సూచించారు. కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తగు న్యాయం చేసేందుకు వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. -
ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ 9కి వాయిదా
-
ఫైబర్ నెట్ పీటీ వారెంట్‌పై 18 వరకు నిర్ణయం వాయిదా - ఏసీబీ కోర్టు
విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ 18కి వాయిదా పడింది. ఫైబర్ నెట్ పీటీ వారెంట్‌పై ఎప్పుడు కోర్టు ముందు హాజరుపరచాలో 18 తర్వాత నిర్ణయిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. కావున సోమవారం కోర్టుకి హాజరుపరచాల్సిన అవసరం లేదు. విచారణ సందర్బంగా చంద్రబాబుని 18 వరకు కస్టడీకి తీసుకోకూడదని సీఐడీని ఆదేశించింది. అంతే కాకుండా ఆ లోపల కోర్టు ముందు హాజరుపరచవద్దని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం తీర్పు ఆధారంగా 18 తర్వాతే చంద్రబాబు పిటి వారెంట్‌పై నిర్ణయం తీసుకోనుంది. -
తెలంగాణ డీఎస్సీ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో డీఎస్సీ నియామక పరీక్ష వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తూ శుక్రవారం(అక్టోబర్ 13న) నిర్ణయం తీసుకుంది విద్యాశాఖ. షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 20 నుంచి 30వ తారీఖుల మధ్య డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. తాజా వాయిదాతో పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్ణయిస్తామనేది త్వరలోనే తెలియజేస్తామని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ సర్కారు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 5 వేల 89 పోస్టులను భర్తీ చేసేందుకు గానూ.. నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే.. ఆ డీఎస్సీ ఎగ్జామ్ నవంబర్ 20 తారీఖు నుంచి 30 వరకు నిర్వహించనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. అక్టోబర్ 21 వరకు అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. -
సింగరేణి ఎన్నికలు వాయిదా..
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఈనెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలను ఎన్నికలు వాయిదా వేయాలన్న సింగరేణి యాజమాన్యం అభ్యర్థనను అంగీకరించిన కోర్టు.. ఈమేరకు ఎన్నికలను వాయిదా వేసింది. డిసెంబరు 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. నవంబర్ 30 లోపు ఓటర్ లిస్ట్ చేయాలని పేర్కొంది. ఈ నెల 28న సింగరేణిలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధం అవ్వగా, ఎన్నికలపై హైకోర్టు డివిజన్ బెంచ్‌లో సింగరేణి యాజమాన్యం అప్పీల్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరింది. గత ఏడాది నుంచి హైకోర్ట్‌లో సింగరేణి ఎన్నిక వివాదం జరుగుతోంది. ఎన్నికల నిర్వహణపై గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్న హైకోర్ట్.. ఇప్పటికే 3 సార్లు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 23న సింగరేణి ఎన్నికల పై కీలక ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసింది. ఎన్నికల నిర్వహించాల్సిందిగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇవ్వగా, ఉత్తర్వులపై చీఫ్ కోర్టులో సింగరేణి అప్పీల్ చేసింది. ఈ రోజు సింగరేణి ఎన్నికలపై విచారణ జరిపిన హైకోర్టు.. సింగరేణి ఎన్నికలను డిసెంబరు 27కి వాయిదా వేస్తూ తీర్పు చెప్పింది. చదవండి: 17 రోజులు.. 41 సభలు -
టీఆర్టీపై తర్జనభర్జన!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) వాయిదా వేయక తప్పేట్టు లేదని అధికార వర్గాలు అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటమే దీనికి కారణమని పేర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నవంబర్ 22 నుంచి 30వ తేదీ వరకూ టీఆర్టీ పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఆరు రోజుల పాటు పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగు తోంది. ఈ సమయంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో పరీక్ష నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి. పరీక్ష నిర్వహణ కష్టమేనా? రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. వచ్చే నెల 30న ఎన్నికలుండటంతో 15 రోజుల ముందు నుంచే పోలింగ్ అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తారు. అప్పటికి ఎన్నికల ప్రచారం హోరాహోరీ దశకు చేరుతుంది. దాదాపుగా ఇదే సమయంలో నవంబర్ 22న స్కూల్ అసిస్టెంట్లు, 23న ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, 24న భాషా పండితులు, 25 నుంచి 30వ తేదీ వరకూ సెకండరీ గ్రేడ్ టీచర్ల పోస్టులకు సంబంధించిన టీఆర్టీ జరగాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో పోలింగ్ జరిగే 30వ తేదీ పరీక్షను వాయిదా వేస్తే సరిపోతుందని అధికారులు భావించినా, 20వ తేదీ నుంచే ఎన్నికల హడావుడి ఉంటుందని, అభ్యర్థులు కూడా ఓటు వేసేందుకు తమ ఊళ్ళకు వెళ్ళాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు భద్రతతో పాటు ఇతర శాంతిభద్రతల అంశాన్నీ, ఆంక్షలను దృష్టిలో పెట్టుకోవాలని పలువురు విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అదీగాక ఎన్నికల విధులకు వెళ్ళేందుకు టీచర్లు, ఇతర సిబ్బంది సన్నాహాల్లో ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే పరీక్ష నిర్వహణ కష్టమని అధికార వర్గాలూ భావిస్తున్నాయి. దీంతో మొత్తంగా పరీక్షనే వాయిదా వేయడమా? ఎస్జీటీ పరీక్ష జరిగే 25 నుంచి 30వ తేదీల్లో మార్పు తేవడమా? అనే అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంప్రదించి, దీనిపై ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఒకటీ రెండురోజుల్లో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే వీలుందని అన్నారు. నెల రోజులు వాయిదా వేయండి ఎన్నికల హడావుడిలో టీఆర్టీ పరీక్ష నిర్వహణకు ఇబ్బందు లెదురయ్యే అవకాశం ఉంది. నవంబర్ 20 నుండి 30 వరకు జరగబోయే ఈ పరీక్షలన్నీ నెల రోజులు వాయిదా వేయాలి. పరీక్ష దరఖాస్తు తేదీని కూడా పొడిగించాలి. – రావుల రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు -
తెలంగాణ గ్రూప్-2 పరీక్ష వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం నవంబరు 2, 3 తేదీల్లో.. గ్రూప్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే.. వచ్చే ఏడాది జనవరి 6, 7వ తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. కమిషన్ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చ అనంతరం గ్రూప్-2 వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. చదవండి: బంజారాహిల్స్‌లో భారీగా హవాలా నగదు పట్టివేత -
'సలార్' రిలీజ్ వాయిదా పడిందా? నిజమేంటి?
డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన 'సలార్' కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది. 6వ తేదీన ట్రైలర్ రాబోతుందని అందరూ తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఎప్పుడెప్పుడు వస్తుందా? ఎప్పుడు చూస్తామా అని తెగ ఆరాటపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో రిలీజ్ వాయిదా అనే రూమర్ బయటకొచ్చింది. ఇంతకీ ఏం జరుగుతోంది? 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. ఆ తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు చేశాడు. కలెక్షన్స్ అయితే వచ్చాయి కానీ అతడికి తగ్గ హిట్ అనిపించుకోలేకపోయాయి. డార్లింగ్ ఫ్యాన్స్‌ని సంతృప్తి పరచలేకపోయాయి. దీంతో వాళ్ల ఆశలన్నీ 'సలార్'పై పెట్టుకున్నారు. ఎందుకంటే కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడమే దీనికి కారణం. (ఇదీ చదవండి: 'ఖుషి' రిజల్ట్‌పై విజయ్ దేవరకొండ ఫస్ట్ రియాక్షన్) ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్'.. మొన్న జూన్ లో వచ్చి ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. ఇది అయిన కొన్నాళ్లకు సలార్ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసి ఆశలు పెంచారు. ఇప్పుడు మరో 27 రోజుల్లో రిలీజ్ ఉందనగా, ట్విట్టర్లో వాయిదా పడనుందనే రూమర్స్ వచ్చాయి. సెప్టెంబరు నుంచి డిసెంబరుకి పోస్ట్‌పోన్ అయిందని అంటున్నారు. ప్రభాస్ మోకాలి సర్జరీ దీనికి కారణమని అంటున్నారు. మరికొందరు మాత్రం ఔట్ పుట్ విషయంలో ప్రశాంత్ నీల్ ఫెర్ఫెక్షన్ కోరుకుంటున్నాడని, అందుకే పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవుతుందని, దీంతో రిలీజ్ వాయిదా అంటున్నారు. మరికొందరు మాత్రం ఇప్పటికే ఓవర్సీస్ బుకింగ్స్ కి అంతా రెడీ అయిపోయిందని, ట్రైలర్ కూడా సెప్టెంబరు 6న రాబోతుందని అంటున్నారు. కావాలనే ఎవరో పుకారు సృష్టించారని కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదని, ఫ్యాన్స్ కావాలని వాయిదా ట్రెండ్ ఏమైనా ప్లాన్ చేశారా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రశ్నలన్నింటిపై క్లారిటీ రావాలంటే నిర్మాణ సంస్థ స్పందిస్తే తప్ప అసలు విషయం బయటపడదు. (ఇదీ చదవండి: Kushi Review: ‘ఖుషి’మూవీ రివ్యూ) There is a buzz that #Salaar is getting postponed. Nothing official yet. ||#Prabhas|| pic.twitter.com/PsMXHiarhI — Manobala Vijayabalan (@ManobalaV) September 1, 2023 -
గ్రూప్–2 పరీక్షలు నవంబర్‌కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–2 పరీక్షలను వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు పలికింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్షలను నిర్వహించాలని స్పష్టంచేసింది. ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచన లు చేశారు. గ్రూప్–2 పరీక్షను వాయిదా వేసే అంశంపై టీఎస్పీఎస్సీ యంత్రాంగంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మిగతా పరీక్షలకు అభ్యర్థులు సన్నద్ధమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ వివరాలను ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ శనివారం రాత్రి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అనంతరం ఈనెల 29, 30 తేదీల్లో జరగాల్సిన గ్రూప్–2 పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసిందని, వాటిని నవంబర్‌లో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అభ్యర్థుల ఆందోళనకు చెక్ ఈనెల 29, 30వ తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఐదు నెలల క్రితమే తెలిపింది. కమిషన్ షెడ్యూల్ ఆధారంగా ఆగస్టులో గురుకుల ఉద్యోగ అర్హత పరీక్షలకు గురుకుల బోర్డు సన్నద్ధమై పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించి నిర్వహిస్తోంది. వరుసగా ఆగస్టు 1 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహిస్తుండటం... ఆ తర్వాత 29, 30 తేదీల్లో 5.35 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే గ్రూప్–2 పరీక్షలుండటంతో అభ్యర్థులపై ఒత్తిడి తీవ్రమవుతుందనే వాదన తెరపైకి వచ్చింది. ఈక్రమంలో పలు రకాలుగా కమిషన్‌కు వినతులు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో కమిషన్ కార్యాలయ ముట్టడికి సైతం అభ్యర్థులు దిగడం... అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం... మరోవైపు కొందరు అభ్యర్థులు న్యాయపోరాటానికి సైతం ఉపక్రమించడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. పరీక్ష నిర్వహణను వాయిదా వేయడంతో అభ్యర్థుల ఆందోళనకు చెక్ పడింది. -
పార్లమెంట్ లో మణిపూర్ ప్రకంపనలు
-
‘స్థానిక’ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
సాక్షి నెట్వర్క్ : గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలలో ఏర్పడిన ఖాళీలకు గురువారం జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గత నెల 31న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు ఆయా స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ♦ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఏలూరులో ఎన్నిక ప్రక్రియను చేపట్టారు. అనంతరం పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వహించిన కవురు శ్రీనివాస్‌కు ఎమ్మెల్సీ పదవి వరించడంతో జిల్లా పరిషత్ చైర్మన్ పీఠానికి ఖాళీ ఏర్పడింది. దీంతో బీసీ మహిళగా ఉన్న గంటా పద్మశ్రీను ఈ పదవి వరించింది. జిల్లా పరిషత్ ఏర్పడిన అనంతరం బీసీ మహిళగా పద్మశ్రీ మొట్టమొదటి చైర్పర్సన్ కావడం.. మహిళకు జిల్లా పరిషత్ పీఠాన్ని అందించడం పట్ల పార్టీ శ్రేణులు, ప్రజలు సైతం హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సుపరిపాలన అందిస్తానని చెప్పారు. ఇక పద్మశ్రీకి మంత్రులు తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వాసుబాబు, వెంకట్రావు, అబ్బయ్యచౌదరి, ఎమ్మెల్సీలు వంకా రవీంద్ర, కవురు శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. ♦ ఏలూరు జిల్లా నూజివీడు పురపాలక సంఘం మున్సిపల్ వైస్ చైర్మన్‌గా 22వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కొమ్ము వెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ పదవికి గత నెలలో షేక్ అమీరున్నీసాబేగం రాజీనామా చేయడంతో మళ్లీ ఎన్నిక అనివార్యమైంది. ♦ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీ ముప్పిడి సరోజని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పరిషత్ ప్రత్యేకాధికారి జీవీకే మల్లికార్జునరావు ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ♦నర్సీపట్నం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వైఎస్సార్సీపీకి చెందిన (ఎస్సీ మహిళకు రిజర్వు) బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్‌గా కోనేటి రామకష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఇరువురికీ శుభాకాంక్షలు తెలిపారు. ♦ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్–1గా ముచ్చు లయయాదవ్ (వైఎస్సార్సీపీ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1వ డివిజన్ కార్పొరేటర్ అయిన ఆమెను ప్రత్యేక సమావేశంలో సభ్యులంతా ఎన్నుకున్నారు. ♦ విజయనగరం జిల్లా ఎల్.కోట మండల పరిషత్ రెండో వైస్ ఎంపీపీగా భీమాళి ఎంపీటీసీ (వైఎస్సార్సీపీ) సభ్యుడు ముధునూరు శ్రీనివాసవర్మరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా పనిచేసిన దండేకర్‌కుమారి మరణించడంతో ఎన్నిక అనివార్యమైంది. ♦గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ రెండో వైస్ చైర్‌పర్సన్‌గా 40వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ అత్తోట నాగవేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి, తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ప్రకటించి, ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ♦ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చేనేత వర్గానికి చెందిన కాచర్ల లక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే, స్థానిక సంస్థలకు సంబంధించి బత్తలపల్లి ఎంపీపీగా అప్పరాచెరువు ఎంపీటీసీ సభ్యురాలు బగ్గిరి త్రివేణి, చెన్నేకొత్తపల్లి వైస్ ఎంపీపీ–1గా చెన్నేకొత్తపల్లి–2 ఎంపీటీసీ సభ్యురాలు పి.రాములమ్మను ఎన్నుకున్నారు. ఇక అనంతపురం జిల్లా విడపనకల్లు మండల ఉపాధ్యక్షురాలు–2గా హాంచనహాళ్ ఎంపీటీసీ రాకెట్ల పుష్పావతి ఎంపికయ్యారు. కోరం లేకపోవడంతో రాయదుర్గం వైస్ ఎంపీపీ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. అన్నిచోట్ల ఎన్నిక ఏకగ్రీవం కాగా, అందరూ వైఎస్సార్సీపీకి సంబంధించిన వారే కావడం గమనార్హం. ♦అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీపీగా జల్లా పద్మావతమ్మ ఎంపికయ్యారు. ఎంపీపీ జల్లా సుదర్శన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో గరిగుపల్లె ఎంపీటీసీ సభ్యురాలు జల్లా పద్మావతమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఎన్నికలు వాయిదా.. చిత్తూరు జిల్లాలోని మూడు మండలాల్లో ఖాళీగా ఉన్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సభ్యుల ఎంపిక గురువారం కోరంలేక వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు రామకుప్పం, చిత్తూరు రూరల్ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సంబంధిత ఎంపీటీసీ సభ్యులకు వారం ముందే సమాచారమిచ్చారు. ఇందుకు ఎంపీటీసీ సభ్యులు రాకపోవడంతో కోరంలేక ఎన్నిక వాయిదా పడింది. విజయపురం వైస్‌ఎంపీపీ స్థానానికి ఎన్నిక మొదటిసారి వాయిదా పడడంతో శుక్రవారం మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు ఎంపీపీ ఎన్నికకు నిర్ణీత సమయంలో ఎంపీటీసీ సభ్యులు ఒక్కరు కూడా హాజరుకాకపోవడంతో ఎన్నిక శుక్రవారానికి వాయిదా వేశారు. -
విపక్షాల భేటీ వాయిదా!
న్యూఢిల్లీ: బీజేపీ వ్యతిరేక పార్టీలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన కీలక సమావేశం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పాట్నాలో ఈ నెల 12వ తేదీన ఈ భేటీ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అందుబాటులో లేరు. ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. దాంతో సమావేశాన్ని వాయిదా వేయాలని జేడీ(యూ) నేతలు నిర్ణయించుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్ష కూటమి ఏర్పాటుకు బిహార్ సీఎం నితీశ్‌కుమార్ యత్నిస్తుండటం తెలిసిందే. -
#GTvsCSK: ఫైనల్ మ్యాచ్ వాయిదా.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి
సీఎస్కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం(మే 28న) ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ సీజన్ ముగిసిపోవాలి. కానీ వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రిజర్వ్‌డేకు వాయిదా పడింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మధ్యాహ్నం నుంచి ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కనీసం టాస్ కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. రాత్రి 11 దాటినా వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక ఫైనల్ మ్యాచ్ వాయిదా పడడం ఇదే తొలిసారి. వర్షం కారణంగా పలు సీజన్లలో మ్యాచ్‌లు రద్దు కావడం లేదా ఓవర్లు కుదించి ఆడడం జరిగింది. కానీ గత 15 సీజన్లలో ఏ ఫైనల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడింది లేదు.. రిజర్వ్ డేకు వాయిదా పడింది లేదు. ఇక ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. ఫైనల్మ్యాచ్ చూద్దామని వచ్చిన అభిమానులకు వరుణుడి కారణంగా తీవ్ర నిరాశే మిగిలింది. రాత్రి 9 గంటల తర్వాత అభిమానులు ఒక్కొక్కరిగా స్టేడియం నుంచి వెళ్లిపోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May - 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad. Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD — IndianPremierLeague (@IPL) May 28, 2023 Fans leave the Narendra Modi Stadium. A sad end to what could have been an amazing Sunday. #IPLFinals to be played tomorrow it seems. #Ahmedabad #IPL2023Final #CskvsGttickets #MSDhoni𓃵 #rain pic.twitter.com/vGlfVQzBb9 — 7 & 18 & 45 (@Tamil_paiyan_01) May 28, 2023 చదవండి: #IPL2023Final: డ్యూటీ చేస్తున్న పోలీస్ అధికారిపై మహిళ దౌర్జన్యం -
‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం వాయిదా
సాక్షి, విజయవాడ: ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం వాయిదా వేసినట్లు పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. టెన్త్, ఇంటర్ టాపర్లకు జగనన్న ఆణిముత్యాలు పేరుతో ప్రోత్సాహకాలు, సత్కార కార్యక్రమాలని నిర్వహించాలని ఆంధ్రపదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25 నియోజకవర్గాలు, 27 న జిల్లా కేంద్రాలు, 31 న రాష్ట్ర స్ధాయి కార్యక్రమం నిర్వహించాలని మొదటగా నిర్ణయించగా, అయితే ఈ కార్యక్రమాలని పాఠశాలలు పున: ప్రారంభం తర్వాత జరపాలని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్ధులు, వారి తల్లితండ్రుల కోరిక మేరకు వాయిదా ప్రభుత్వం వాయిదా వేసింది. పాఠశాలలు రీ ఓపెన్ తర్వాత జరిపితే ఎక్కువ మంది హాజరై స్పూర్తిదాయకంగా ఉంటుందని తల్లిదండ్రులు విజ్ణప్తి చేశారు. జూన్ 12 తర్వాత ‘జగనన్న ఆణిముత్యాలు’ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకుని పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాలు (స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్)’ పేరిట ప్రభుత్వం సత్కరించనుంది. ఈ అవార్డుల వేడుకను నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ ప్రభుత్వ మేనేజ్మెంట్లలో నడుస్తున్న పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో 2023 మార్చి, ఏప్రిల్ పబ్లిక్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను జగనన్న ఆణిముత్యాలు అవార్డులతో ప్రభుత్వం సన్మానించనుంది. చదవండి: నాలుగేళ్ల పాలనపై సీఎం వైఎస్ జగన్ ట్వీట్ ఇంటర్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ/ఎంఈసీ గ్రూపుల వారీగా అత్యధిక మార్కులు సాధించిన వారిని సత్కరించనుంది. విద్యా రంగంలో పలు సంస్కరణలను అమలు చేస్తున్న ప్రభుత్వం.. విద్యలో నాణ్యత, విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ వేడుక నిర్వహిస్తోంది. మూడు స్థాయిల్లోనూ విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్ సర్టిఫికెట్ ఇవ్వనుంది. సంబంధిత పాఠశాలకు మెమెంటోతో పాటు ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరించనున్నారు. -
సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన వాయిదా
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి అనంతపురం జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ నెల 26కి వాయిదా వేసినట్లు సీఎంవో అధికారులు ప్రకటించారు. 26న అనంతపురం జిల్లా నార్పలలో సీఎం పర్యటించనున్నారు. జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఐదోసారి జిల్లాకు సీఎం జగన్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఉమ్మడి అనంతపురం జిల్లాకు ఐదోసారి వస్తున్నారు. తొలిసారిగా అనంతపురం జిల్లా కేంద్రంలో కంటివెలుగు కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఆ తర్వాత ధర్మవరంలో నేతన్న హస్తం, వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రైతుదినోత్సవం పేరుతో రాయదుర్గం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడే ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్ ప్రారంభించారు. అనంతరం రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు శింగనమల నియోజకవర్గం నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి వస్తున్నారు. ఇక్కడి నుంచే కంప్యూటర్ బటన్ నొక్కి వసతి దీవెన నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో వేయనున్నారు. కాగా, రేపు(సోమవారం) ముస్లిం సోదరులకు ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. విజయవాడ విద్యాధరపురం మినీ స్టేడియంలో జరిగే ఇఫ్తార్ విందులో సీఎం హాజరవనున్నారు. చదవండి: రామోజీరావు అంటే ఆయన కుమారుడు సుమన్‌కి నచ్చదు.. ఎందుకంటే? -
పేపర్ల లీకేజీ బాగోతం.. మరో పరీక్ష వాయిదా వేసిన టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ బాగోతం ఇప్పట్లో సద్దు మణిగేలా కనిపించడం లేదు. విద్యార్థుల భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకుని, సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు ఇప్పటికే పలు పరీక్షలను రద్దు చేశారు. తాజాగా మరో పరీక్షను సైతం వాయిదా వేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 4న జరగాల్సిన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్షను జూన్ 17కు వాయిదా వేసింది రాష్ట్ర ఉద్యోగ నియామక కమిషన్. కాగా, ప్రశ్నపత్రాల లీకేజీతో గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన కమిషన్.. వరుసగా ఏఈఈ, డీఏఓ, ఏఈ అర్హత పరీక్షలను కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 12వ తేదీన జరగాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్షను వాయిదా వేయగా... మార్చి 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేసింది. నిందితులకు కస్టడీ, రిమాండ్ ఇదిలాఉండగా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో ముగ్గురు నిందితులకు ఐదురోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. షమీమ్, సురేష్, రమేష్ లను నాంపల్లి కోర్టు కస్టడీకి అనుమతించింది. మరోవైపు ఇదే కేసులో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, డాక్య నాయక్, రాజేశ్వర్ మూడు రోజుల కష్టడీ విచారణ మంగళవారంతో ముగిసింది. నలుగురు నిందితులకు కింగ్ కోఠి లోని ప్రభుత్వ ఆస్పత్రి లో వైద్యపరీక్షలు పూర్తి చేశారు. అనంతరం నాంపల్లి న్యాయమూర్తి ముందు పోలీసులు వారిని హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు వారికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. నలుగురు నిందితులను సిట్ అధికారులు చంచల్ గూడ సెంట్రల్ జైల్ తరలించారు. (చదవండి: భార్యకు తెలియకుండానే మరో ఇద్దరికి పేపర్ లీక్ ) -
ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా
సాక్షి, విజయవాడ: ఏపీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు జరగాల్సిన గ్రూప్-1 మెయిన్స్‌ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది ఏపీపీఎస్సీ. జూన్ 3 నుంచి 9 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. 2022 సివిల్స్ ఫేజ్- 3 ఇంటర్వ్యూలు ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు ప్రకటించడంతో గ్రూప్ వన్ మెయిన్స్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను యూపీఎస్సీ సోమవారమే విడుదల చేసింది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూలకి ఏపీ నుంచి దాదాపు 25 మంది గ్రూప్ వన్ అభ్యర్థులు హాజరవుతున్నారు. దీంతో ఈ ఇంటర్వ్యూల కారణంగా గ్రూప్-1 మెయిన్స్‌ని జూన్‌లో నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. సివిల్స్ ఇంటర్వ్యూలకి ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకునే మెయిన్స్ వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ మెంబర్ సలాంబాబు పేర్కొన్నారు. చదవండి: ‘ఓటుకు కోట్లు 2.0’ ప్రకంపనలు -
వాయిదా పడిన బెల్లంకొండ గణేష్ మూవీ.. కారణమిదే!
బెల్లండకొండ గణేశ్ నటిస్తున్న రెండో చిత్రం నేను స్టూడెంట్ సర్.రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అవంతిక దస్సానీ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే రిలీజైప పోస్టర్స్, టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను 10న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే తాజాగా రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. విద్యర్థుల పరీక్షలను దృష్టిలో ఉంచుకొని సినిమాను వాయిదా వేస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం. పరీక్షలు రాయబోతున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. వేసవి సెలవుల్లో కలుద్దాం అంటూ మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా ఓ కాలేజీ స్టూడెంట్‌కి ఎదురైన సమస్య నుంచి అతను ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో సినిమాను తెరకెక్కించారు. #NenuStudentSir! is postponed from March 10th! 👍🏻 Wishing every student all the best for their exams & Meet you all during SUMMER HOLIDAYS ⛱️#GaneshBellamkonda @avantikadassani @NaandhiSATISH #RakhiUppalapati #MahathiSwaraSagar @adityamusic pic.twitter.com/Xf2i3iKH3c — 𝐒𝐕𝟐 𝐄𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐦𝐞𝐧𝐭 (@SV2Ent) February 27, 2023 -
తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. అయితే, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా సచివాలయం ప్రారంభ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 17వ తేదీన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం ఫిక్స్ చేశారు. ఇంతలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. -
శాకుంతలం: మళ్లీ వాయిదా
‘శాకుంతలం’ సినిమా ప్రేక్షకుల ముందుకు ఆలస్యంగా రానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, దేవ్ మోహన్ లీడ్ రోల్స్‌లో ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని ముందు గత ఏడాది నవంబరు 4న విడుదల చేయాలనుకున్నారు. అయితే 3డీ విజువల్ ఎక్స్పీరియన్స్, వీఎఫ్ఎక్స్ (గ్రాఫిక్స్) పనులు పూర్తి కాని కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి 17కి వాయిదా వేశారు. కానీ 17న కూడా ‘శాకుంతలం’ థియేటర్స్‌కి కావడం లేదు. విడుదల వాయిదా వేస్తున్నామని, కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
ఈసారి గట్టిగా ఇచ్చి పడేద్దాం: యంగ్ హీరో విశ్వక్ సేన్
యంగ్ హీరో విశ్వక్సేన్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'దాస్ కా దమ్కీ'. నివేదా పేతురాజు ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, ట్రైలర్ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపుగా పూర్తియింది. ఇంతకుముందే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా కోసం విశ్వక్ సేన్ అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈనెల 17న దాస్ కా ధమ్కీ థియేటర్లలో రిలీజ్ కావడం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే విడుదల కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. 'దాస్ కా ధమ్మీ సినిమాకు సంబంధించిన కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం. ఈసారి థియేటర్లలో గట్టిగా ఇచ్చిపడేద్దాం.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రావు రమేశ్, పృథ్విరాజ్, హైపర్ ఆది ప్రధాన పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. View this post on Instagram A post shared by Vishwaksen (@vishwaksens) -
అఫీషియల్.. సమంత ‘శాకుంతలం’ వాయిదా
స్టార్ హీరోయిన్ సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ శాకుంతలం. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా గుణ శేఖర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ఈ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార పోస్టర్లు, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా శాకుంతలం పాటలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడా అని సినీ ప్రియులంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కిన ‘నేనింతే’ హీరోయిన్, వరుడు ఎవరంటే! ఈ క్రమంలో ఆడియన్స్‌కి నిరాశ ఎదురైంది. కొద్ది రోజులుగా శాకులంత మూవీ వాయిదా అంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ తాజాగా చిత్రం బృందం ప్రకటన ఇచ్చింది. ఫిబ్రవరి 17న రిలీజ్ చేయాల్సిన శాకుంతలం చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మూవీ టీం అధికారిక ప్రకటన ఇచ్చింది. “ఫిబ్రవరి 17న శాకుంతలం సినిమాను విడుదల చేయలేకపోతున్నామని ప్రేక్షకులకు తెలిపేందుకు చింతిస్తున్నాం. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌తో వస్తాం. నిరంతరం మాపై కురిపిస్తున్న ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అంటూ ప్రకటన ఇచ్చింది. చదవండి: ఓర్వలేక నా బిజినెస్‌పై కుట్ర చేస్తున్నారు: కిరాక్ ఆర్పీ అయితే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ కాకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ కథానాయకుడిగా నటించగా.. మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్, గౌతమి, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో అర్హ భరతుడు పాత్రలో కనిపించనుంది. The theatrical release of #Shaakuntalam stands postponed. The new release date will be announced soon 🤍@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan @neelima_guna #ManiSharma @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/f0cyBfDCyj — Gunaa Teamworks (@GunaaTeamworks) February 7, 2023 -
సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'శాకుంతలం' వాయిదా?
స్టార్ హీరోయిన్ సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈనెల 17న విడుదల కాబోతుంది. శకుంతల, దుష్యంతుడి ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. మోహన్ బాబు దుర్వాస మహర్షిగా కనిపిస్తుండగా, ప్రకాష్ రాజ్,అనన్య నాగల్ల తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అల్లు అర్హ ఈ చిత్రంతో డెబ్యూ ఇవ్వనుంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో త్వరలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. శాకుంతలం సినిమాను వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
క్రిటికల్‌గా తారకరత్న ఆరోగ్యం.. రిలీజ్ వాయిదా వేసుకున్న కల్యాణ్ రామ్
సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బెంగళూరు హృదయాలయ ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హెల్త్ బుటిటెన్ విడుదల చేసిన వైద్యులు.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో సినిమా ప్రమోషన్స్ చేయడం సరికాదనుకున్నారు నందమూరి కల్యాణ్ రామ్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం అమిగోస్ ఫిబ్రవరి10న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన ‘ఎన్నో రాత్రులొస్తాయి గాని రాధే వెన్నల’ పాటని ఈ సినిమాలో రీమేక్ చేశాడు కళ్యాణ్ రామ్. ఇప్పటికే ఈ పాట ప్రోమోను విడుదల చేయగా, ఫుల్‌సాంగ్‌ను రేపు(ఆదివారం)సాయంత్రం గం.5:09 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సాంగ్ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు అమిగోస్ మేకర్స్ ప్రకటించారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. The song launch of #EnnoRatrulosthayi from #Amigos stands postponed to a later date. Praying & Wishing Sri. Taraka Ratna Garu a speedy recovery. pic.twitter.com/UQAKDQTKNU — Mythri Movie Makers (@MythriOfficial) January 28, 2023 -
Census 2021: మీనమేషాలే లెక్కిస్తున్నారు
ఎస్.రాజమహేంద్రారెడ్డి: ‘అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేది’ – కామారెడ్డి టౌన్‌ప్లానింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య అవును కదా! తరచి తరచి ఆలోచిస్తే న్యాయస్థానం వ్యాఖ్యతో ఏకీభవించక తప్పదు. వ్యక్తుల నుంచి రాజ్యం దాకా ఇదే తాత్సారం. ఏదో అనుకోవడం. ఇంకేదో అవుతుందని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోవడమే కాకుండా, వాటికి కారణాలు వెతకడం అలవాటైపోయింది. ఒక దేశం సుభిక్షంగా ఉండాలంటే ఆ దేశంలోని ప్రజలు కనీస స్థాయిలోనైనా సంతోషంగా ఉండాలి. వంద కోట్లపైగా జనాభా ఉన్న భారత్ లాంటి దేశంలో అంతమంది ప్రజల స్థితిగతులు, ఆర్థిక హెచ్చుతగ్గులు, ఉపాధి తీరుతెన్నులూ క్షుణ్నంగా తెలిసి ఉండాలి. ఒక మనిషి అతి సాధారణ జీవితం గడపాలన్నా కూడూ గూడూ కనీసావసరాలు. ఇలాంటి వివరాలు, గణాంకాలు చేతిలో ఉంటేనే ఏ ప్రభుత్వమైనా సంక్షేమ ఫలాలు ఎవరికి అత్యవసరమో, అవసరమో, అవసరం లేదో ఇదమిత్థంగా తేల్చుకోగలుగుతుంది. సరైన దిశలో సరైన చర్యలు చేపట్టగలుగుతుంది. దీనికి లెక్కలు కావాలి. అవే జనాభా లెక్కలు. ఈ లెక్కలు చేతిలో ఉంటే ప్రజల బతుకు లెక్కలు సరిచేసే వీలు చిక్కుతుంది. ఏడాది తిరిగే సరికి గ్రామాలకు గ్రామాలు వలసలతో వెలవెలబోతున్నాయి. ఆ బరువుతో పట్టణాలు ఇరుకైపోతున్నాయి. ఉపాధి వేటలో కష్టాలు తరుముకొస్తున్నాయి. గ్రామాల, పట్టణాల ముఖచిత్రాలు ఇంత వేగంగా మారుతుంటే జనగణన మరింత వేగంగా సాగాలి కదా! కానీ దేశంలో చివరిసారిగా ఈ కసరత్తు జరిగింది 2011లో. అంటే 11 ఏళ్ల కిందట! 2019లో జనగణనకు కేంద్రం ప్రణాళికలు వేసింది. 2021కల్లా ముగించాలని నిర్ణయించింది. ఇప్పుడు మనం 2023లో ఉన్నాం. కానీ ఆ దిశగా తొలి అడుగు కూడా పడలేదు. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఈసరికి ఆ అనుకున్నదేదో పూర్తయిపోయి ఉండేది. ఎందుకలా జరగలేదు? ఒకసారి చూద్దాం... అంతా సిద్ధంగానే ఉన్నా... నిజానికి 2021లోగా జనభా గణన పూర్తి చేయాలని కేంద్రం 2019లోనే నిర్ణయించడమే గాక రూ.8,754.23 కోట్లు కేటాయించింది కూడా. ఈ కసరత్తుకు 33 లక్షల మంది అవసరమని అంచనా వేసింది. వారిని ఏయే రంగాల నుంచి సమీకరించాలో కూడా నిర్ణయానికి వచ్చింది. మొత్తం ప్రక్రియను రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రణాళికలు వేసింది. 2020 ఆగస్టు నుంచి సెప్టెంబర్ దాకా తొలి దశ, 2021 ఫిబ్రవరిలో రెండో దశ పూర్తి చేయాలన్నది ఆలోచన. ప్రణాళికలన్నీ కాగితం మీద భేషుగ్గా కుదిరాయి. కానీ అనూహ్యంగా కరోనా మహమ్మారి విరుచుకుపడటంతో జన గణనను వాయిదా వేయాల్సి వచ్చింది. 2020లో కరోనా తొలి వేవ్, 2021లో రెండో వేవ్ వల్ల కార్యక్రమం అటకెక్కింది. నిజానికి కరోనా కల్లోలం నడుమే చైనా, అమెరికా, బ్రిటన్ వంటి చాలా దేశాలు 2020లోనే జనాభా లెక్కల ప్రక్రియను ముగించాయి! మన దగ్గర కనీసం 2022లో అయినా ఆ మహా కార్యాన్ని పూర్తి చేసి ఉంటే బాగుండేది. కరోనా నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న సాకుతో తప్పించుకోవడం కుదరదు. ఎందుకంటే గతేడాది ఉత్తరప్రదేశ్ వంటి అతి పెద్ద రాష్ట్రంతో పాటు గుజరాత్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల్లో శాసనసభ ఎన్నికలు దిగ్విజయంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు అడ్డురాని కరోనా భయం జన గణనకు మాత్రమే ఎలా అడ్డంకి అయింది? సూక్ష్మంగా చెప్పాలంటే ఎన్నికలు అనుకున్నట్టు జరిగాయి. జనాభా గణన అనుకున్నట్టు జరగలేదు. దీనిపై కేంద్రం ఈ రోజుకూ కిమ్మనకుండానే ఉంది. అంటే ఇప్పట్లో ఆ ఊసే లేదని కూడా స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది (2024) సాధారణ ఎన్నికలుండటంతో ఆ ఏడాదీ జన గణన లేనట్టే. ఒకవైపు బిహార్‌లో కుల గణనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ నడుం బిగించిన సంగతి తెలిసిందే. మరి అలాంటి చొరవ కేంద్రం ఎందుకు తీసుకోలేకపోతోంది? ఈ ఏడాది మరో 9 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. ఇలా ఎన్నికల నిర్వహణలో చూపించే చొరవ జనాభా సేకరణలో ఎందుకు చూపించలేక పోతున్నారనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. దేశ ప్రజల స్థితిగతులపై ఎన్నికలకు ముందే కొత్త లెక్కలు బహిర్గతమైతే ఎన్నికల్లో సమీకరణలు మారిపోతాయనా? ప్రతిపక్షాలకు చేజేతులా గణాంకాల అస్త్రం అందించినట్టు అవుతుందనా? పదేళ్లకోసారి... పదేళ్లకోసారి జనగణన చేయడం ఆనవాయితీగా వస్తోంది. మన దేశంలో తొలిసారిగా 1872లో జనాభా లెక్కలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత క్రమం తప్పకుండా పదేళ్లకోసారి నిర్వహిస్తూనే ఉన్నారు. 1941 (రెండో ప్రపంచ యుద్ధం), 1961 (చైనా యుద్ధం), 1971 (బంగ్లాదేశ్ విమోచన యుద్ధం)ల్లో కొన్ని ఇబ్బందులు ఎదరైనా పదేళ్ల ఆనవాయితీ తప్పలేదు. ఈసారి లెక్క తప్పింది. ఇంకోసారి తప్పదన్న గ్యారెంటీ లేదు! అయినా అనుకున్నది అనుకున్నట్టు జరిగి ఉంటే ఈసారికి గణాంకాలన్నీ మన చేతిలో ఉండేవి. అంత ఈజీ కాదు... పోనీ, కేంద్రం తక్షణ కర్తవ్యంగా ఇప్పటికిప్పుడు రంగంలోకి దిగి వచ్చే ఏడాదే జనాభా గణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నా అదంత సులువు కాదు. ఎందుకంటే జన గణనకు ఏడాది ముందే గృహాల జాబితా తయారు చేయాల్సి ఉంటుంది. 2011 ఫిబ్రవరిలో జనాభా సేకరణ జరగడానికి ముందే, అంటే 2010లో ఆవాసాల గుర్తింపును కేంద్రం పూర్తి చేసింది. నిజానికి గృహాలను గుర్తించడమే పెద్ద సమస్య. అయితే నేటి డిజిటల్ యుగంలో ఈ ప్రక్రియ కొంత వేగంగా జరగడానికి ఆస్కారముంది. ఆయా రాష్ట్రాలు తమ పరిపాలనా పరిధులకు జూన్ 30లోగా తుది రూపు ఇవ్వాలని భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సెస్ కమిషనర్ ఆదేశించినట్టు సమాచారం. అంటే గృహాలను గుర్తించే కార్యక్రమానికి జూన్ తర్వాతే వీలుపడుతుంది. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించడం కన్నా మొబైల్ యాప్ ద్వారా ఈ పనిని సులువుగా చేయవచ్చు. కచ్చితమైన సమాచారాన్ని రాబట్టేలా ప్రశ్నావళి రూపొందించాల్సి ఉంటుంది. జనాభా లెక్కల సేకరణలో భాగంగా 1951లో 13 ప్రశ్నలుండేవి. ఇప్పుడవి 31కి పెరిగాయి. హైటెక్ హంగులను ఉపయోగించుకుని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జనాభా గణన చేపడితే సంక్షేమ ఫలాలకు అర్హులైన ప్రజలందరికీ మేలు చేసినట్టవుతుంది. -
'వారసుడు' వాయిదా వేస్తున్నాం.. నేనే వెనక్కి తగ్గాను : దిల్‌రాజు
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'వారీసు'. తెలుగులో 'వారసుడు' పేరుతో రిలీజ్ అవుతుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈనెల 11న ఈ సినిమా విడుదల చేయనున్న్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు బుకింగ్ యాప్స్‌లో ఈ సినిమా కనిపించకపోవడం సందిగ్ధత మొదలైంది. రిలీజ్‌కు రెండు రోజులే ఉన్నా ఇంకా మూవీ టీం క్లారిటీ ఇవ్వకపోవడంతో అసలు ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుందా? లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా దీనిపై నిర్మాత దిల్‌రాజు స్పందించారు. తానే ఒక అడుగు వెనక్కి వేశానని, సినిమాను 11కి బదులుగా 14న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..'చిరంజీవి, బాలయ్య సినిమాలకు ఎక్కువ థియేటర్లు కావాలి. అందరు నిర్మాతలు బాగుండాలి. దీంతో నేనే ఒక అడుగు వెనక్కి తగ్గాను. అందరూ నామీద పడి ఏడుస్తున్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలుంటాయి. ఇండస్ట్రీ పెద్దలతో డిస్కస్ చేసిన తర్వాత సినిమాను రెండు రోజులు ఆలస్యంగా విడుదల వేయాలని నిర్ణయించాం' అంటూ వెల్లడించారు. కాగా తమిళంలో వారీసు రిలీజ్లో ఎలాంటి వాయిదా లేదు. ముందుగా అనుకున్న సమయానికే 11న అక్కడ విడుదల చేయనున్నారు. Dil Raju says that, he will make arrangements to bring Thalapathy @actorvijay to Hyderabad before the #Vaarasudu release on Jan-14. #Varisu pic.twitter.com/Jk8kekLyhs — T H M (@THM_Off) January 9, 2023 -
SSMB28 షూటింగ్ మళ్ళీ వాయిదా..!
-
Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా!
సాక్షి, ముంబై: మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలకు మళ్లీ నిరాశే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి నాగ్‌పూర్‌లో జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గత నెలలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో అసెంబ్లీ కార్యకలాపాల నిర్వాహణ కమిటీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసి తేదీ ప్రకటిస్తుందని ఆయన వెల్లడించారు. అంతేగాకుండా డిసెంబరు 5–9 తేదీల మధ్య ఏదో ఒకరోజు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని శిందే, ఫడ్నవీస్ సంకేతాలిచ్చారు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం, ఫడ్నవీస్ వర్గం ఎమ్మెల్యేలలో ఆనందం వెల్లివిరిసింది. కానీ ప్రత్యక్షంగా ఈ ముహూర్తం కూడా దాటిపోయే అవకాశం ఏర్పడింది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఇంతవరకు శిందే, ఫడ్నవీస్ మధ్య సాధారణ చర్చగాని, సమావేశంగాని జరగలేదు. దీంతో ఇరువర్గాల ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో తిరుగుబాటు లేదా దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెలరోజులకు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో శిందే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన తొమ్మిది మంది చొప్పున ఇలా 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా వారికి ఆవకాశం దొరకకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఈ మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై ఇటు మహిళా వర్గం నుంచి, అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో రెండో దశ మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని అందులో మహిళలకు చోటు కల్పిస్తామని అప్పట్లో అందరినీ బుజ్జగించే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా అప్పట్లో ఏక్నాథ్ శిందేతోపాటు శివసేన నుంచి బయటపడిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలోని మంత్రివర్గంలో తమకు చోటు లభిస్తుందని ఎంతో ఆశపడ్డారు. ఆ విధంగా తనతో వచ్చిన ఎమ్మెల్యేలందరికీ శిందే హామీ కూడా ఇచ్చారు. కానీ ఆ ఆశ నిరాశకు గురిచేసింది. శిందే వర్గం ఎమ్మెల్యేలలో నెలకొన్న అసంతృప్తి రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ఫలితంగా శిందేపై తిరుగుబాటుచేసి మళ్లీ సొంత గూటి (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) లోకి చేరే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే శిందే, ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంక్షో¿భంలో చిక్కుకోవడం ఖాయం. ఆ పరిస్ధితి రాకముందే శిందే, ఫడ్నవీస్ జాగ్రత్త తీసుకున్నారు. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతామని శిందే, ఫడ్నవీస్ ప్రకటించి అసంతృప్తులందరినీ సంతృప్తి పరిచే ప్రయత్నం జరిగింది. కానీ అసంతృప్తులకు హామీ ఇచ్చి దాదాపు ఐదు నెలలు కావస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు సమయం కూడా దగ్గరపడుతోంది. ఈ నాలుగైదు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలి. కానీ ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదు. కనీసం శిందే, ఫడ్నవీస్ మధ్య చర్చ కూడా జరగడం లేదు. శిందే, ఫడ్నవీస్ ఆదివారం నాగ్‌పూర్–షిర్డీ హై స్పీడ్ కారిడార్‌పై ట్రయల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఫడ్నవీస్ ఢిల్లీ వెళతారని తెలిసింది. ఈ నెల 11వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నాగ్‌పూర్ పర్యటనకు వస్తున్నారు. ఆ సమయంలో నాగ్‌పూర్‌లో మెట్రో రైలు మార్గం, దివంగత బాల్ ఠాక్రే సమృద్ధి మహామార్గ్ నాగ్‌పూర్–షిర్డీ మొదటి దశ 520 కిలోమీటర్ల మేర మార్గాన్ని మోడీ ప్రారంభిస్తారు. దీంతో మోడీ పర్యటన నేపధ్యంలో శిందే, ఫడ్నవీస్ ఏర్పాట్ల పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తరువాత వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతాయి. దీన్ని బట్టి ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని స్పష్టమవుతోంది. కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులు... అసెంబ్లీ శీతాకాల సమావేశానికి ముందు, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయాలని, రాష్ట్ర బోర్డులు, కార్పొరేషన్ల కేటాయింపులను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులేతో శిందే సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ కోసం కేంద్రం అనుమతి కోసం వేచి ఉండకుండా, కూటమి భాగస్వాములు ఇద్దరూ కలిసి కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులు, కార్పొరేషన్ల కేటాయింపులను ప్రారంభించవచ్చని నిర్ణయించారు. ‘శిందే తిరుగుబాటులో ఆయనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ చేయకుంటే.. విస్తరణలో తమ పేర్లు చేర్చకుంటే ఆందోళనకు దిగుతామని కొందరు హెచ్చరించారు. అసంతృప్త ఎమ్మెల్యేలను కేటాయింపుల ద్వారా శాంతింపజేయడమే సీఎం శిందే ముందున్న తక్షణ సమస్య’’ అని పేరు వెల్లడించని ఒక బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఐదు నెలల క్రితమే తొలి మంత్రివర్గ విస్తరణ జరిగినా, మెజారిటీ మంత్రిత్వ శాఖలు ఇంకా కేటాయించలేదు. ముఖ్యమంత్రి, ఆయన డిప్యూటీలపై గరిష్ట శాఖల భారం ఉంది. అంతేకాకుండా, ఇది ప్రభుత్వ విధానాలపై, పరిపాలన అమలుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. శిందే, ప్రముఖ మంత్రులతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఒకవేళ ప్రతికూల ఫలితం వస్తే ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది. అందువల్లనే విస్తరణలను ఆలస్యం చేయడంపై వారు చాలా ఆలోచిస్తున్నారు’’ అని ఆ సీనియర్ బీజేపీ నాయకుడు అన్నారు. కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులను కేటాయిస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడ్డట్టేనని శిందే సన్నిహితుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ‘ఇంతకుముందు క్రీమ్ పోర్ట్‌ఫోలియోలను డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. మంత్రి పదవి లభించని పక్షంలో బోర్డులతో సరిపెట్టుకోవడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. దీనివల్ల పోటీ తగ్గుతుంది. కాబట్టి తర్వాత, పోర్ట్‌ఫోలియోలను పంపిణీ చేయడం, మంత్రివర్గాన్ని విస్తరించడం మాకు సమస్య కాదు. ఇది పక్కా ప్రణాళికతో కూడిన వ్యూహం’ ఆయన అన్నారు. -
రేస్ లేకుండానే ముగిసిన లీగ్.. ‘డ్రైవర్ల భద్రతే అన్నింటికంటే ముఖ్యం’
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ రేసింగ్ లీగ్... గత కొద్ది రోజులుగా భాగ్యనగరంలో చర్చగా మారిన స్పోర్ట్స్ ఈవెంట్! శనివారమే లీగ్‌లో భాగంగా క్వాలిఫయింగ్‌తోపాటు ఒక ప్రధాన రేసు జరగాల్సి ఉన్నా... వేర్వేరు కారణాలతో అన్నింటినీ ఆదివారానికి వాయిదా వేశారు. వీకెండ్లో ఉత్సాహంగా పెద్ద సంఖ్యలో అభిమానులు హుస్సేన్ సాగర్ తీరానికి తరలి వచ్చి ‘స్ట్రీట్ సర్క్యూట్’లో రేసింగ్ పోటీలను తిలకించేందుకు సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా జరిగిన ఒక ఘటన తొలి అంచెలో మూడు రేసులను ముగించింది. అప్పటికి ఇంకా క్వాలిఫయింగ్ రేస్‌లు ప్రారంభమే కాలేదు. ప్రాక్టీస్ మాత్రమే సాగుతోంది. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో చెన్నై జట్టుకు చెందిన డ్రైవర్ విష్ణు ప్రసాద్ కారు ప్రమాదానికి గురైంది. దాంతో అతడిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. బ్రేక్‌ల సమస్యే ఇందుకు కారణమని తేలింది. ఎల్జీబీ ఫార్ములా 4లో పోటీపడుతున్న కార్లు ప్రాక్టీస్ సమయంలో వుల్ఫ్ జీబీ08 థండర్స్ కారు బ్రేక్‌లు ఆశించిన రీతిలో సరిగా పని చేయడం లేదని అప్పటికే డ్రైవర్లు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాక్‌లో మలుపుల వద్ద హెవీ బ్రేకింగ్ జోన్లో అవి ప్రభావం చూపలేకపోయాయి. ప్రమాదం జరిగాక ఆ కారును సర్క్యూట్ నుంచి తప్పించిన నిర్వాహకులు తర్జనభర్జనల అనంతరం ప్రధాన రేస్‌లను ప్రారంభించరాదని నిర్ణయించారు.‘డ్రైవర్ల భద్రతే అన్నింటికంటే ముఖ్యం. ఎఫ్ఎంఎస్సీఐ సూచనల మేరకు ముందు జాగ్రత్తగా రేస్‌లను రద్దు చేశాం. ఘటనపై విచారణ జరిపిస్తాం’అని ఇండియన్ రేసింగ్ లీగ్ అధికారులు వెల్లడించారు. దాంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లీగ్‌లో భాగంగా తర్వాతి రెండు అంచెలు చెన్నైలో, ఆపై చివరి అంచె డిసెంబర్ 10, 11లో మళ్లీ హైదరాబాద్‌లోనే జరగాల్సి ఉంది. అయితే తాజా ఘటన అనంతరం వాయిదా పడిన తొలి అంచెలోని మూడు రేస్‌లను ఎప్పుడు నిర్వహిస్తారో? మరోవైపు ఇండియన్ రేసింగ్ లీగ్ అర్ధాంతరంగా ముగిసినా వీక్షకులకు మరో రూపంలో కాస్త ఊరట లభించింది. అదే ట్రాక్‌పై ఆదివారం సమాంతరంగా జరగాల్సిన జేకే టైర్ నేషనల్ రేసింగ్ చాంపియన్‌షిప్ (ఎల్జీబీ ఫార్ములా 4)ను మాత్రం విజయవంతంగా నిర్వహించారు. ఈ చాంపియన్‌షిప్‌లో భాగంగా ‘ఓపెన్ వీల్‘కార్లతో సాగిన మూడు రేస్‌లు కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. -
ఆదిపురుష్ సినిమా వాయిదా
-
ఆదిపురుష్ కు అవతార్ దెబ్బ ..?
-
రెండు జిల్లాల్లో ఎస్ఏ–1 పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో 1–10 తరగతులకు నవంబర్ 1 నుంచి జరగాల్సిన సమ్మెటివ్ అసెస్మెంట్ –1 (ఎస్ఏ–1) పరీక్షను నవంబర్ 9 నుంచి నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఈ మార్పులు చేసినట్టు పేర్కొన్నది. మిగతా జిల్లాల్లో ముందుగా ప్రకటించిన ప్రకారం ఎస్ఏ–1 షెడ్యూల్ అమలులో ఉంటుందని వెల్లడించింది.