
మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్‌లు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. అక్టోబర్5న దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ సినిమాను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. దసరా బరిలో ఇప్పటికే ‘గాడ్‌ఫాదర్’, ‘ది ఘోస్ట్’ చిత్రాలు విడుదల కానుండటంతో ఇలాంటి సమయంలో జిన్నా మూవీని రిలీజ్ చేయడం కరెక్టు కాదని భావించినా మేకర్స్ రెండు వారాల పాటు సినిమాను పోస్ట్‌పోన్ చేయనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment