మంచు విష్ణు 'కన్నప్ప' రిలీజ్ డేట్ ప్రకటన | Manchu Vishnu Kannappa Movie Release Date Official | Sakshi
Sakshi News home page

Kannappa Movie: మంచు వారి 'కన్నప్ప' రిలీజ్ ఎప్పుడంటే?

Published Mon, Nov 25 2024 10:33 AM | Last Updated on Mon, Nov 25 2024 12:00 PM

Manchu Vishnu Kannappa Movie Release Date Official

మంచు విష్ణు ప్రధాన పాత్రలో చేస్తున్న సినిమా 'కన్నప్ప'. చాన్నాళ్ల క్రితమే షూటింగ్ మొదలైనప్పటికీ.. రిలీజ్ డేట్ విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది. లెక్క ప్రకారం ఈ డిసెంబరులోనే రావొచ్చనే రూమర్స్ వచ్చాయి. కానీ చిత్రీకరణ ఆలస్యం కావడంతో ఇది కేవలం రూమర్ మాత్రమే అని తేలిపోయింది.

(ఇదీ చదవండి: ప్రేమ విషయం.. పబ్లిక్‌లో ఓపెన్ అయిపోయిన రష్మిక)

దీంతో 'కన్నప్ప' ఎప్పుడు  థియేటర్లలోకి వస్తాడా అని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 25న వస్తున్నట్లు అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు. అయితే శివరాత్రి కానుకగా వచ్చుంటే కంటెంట్‌కి కలిసి వచ్చేదేమో అనిపించింది.

ఈ సినిమాలో మంచు విష్ణు ప్రధాన పాత్ర చేయగా.. ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఇందులో అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. కాజల్, మోహన్ బాబు, శరత్ కుమార్ తదితరుల కూడా నటించారు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 23 సినిమా రిలీజ్.. ఆ ఐదు స్పెషల్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement