ప్రేమ విషయం.. పబ్లిక్‌లో ఓపెన్ అయిపోయిన రష్మిక | Rashmika Opens Up Vijay Devarakonda Pushpa 2 Event Chennai | Sakshi
Sakshi News home page

Rashmika Vijay Devarakonda: మీ అందరికీ తెలుసు.. నేనే వెళ్లి ప్రపోజ్ చేస్తా

Published Mon, Nov 25 2024 8:17 AM | Last Updated on Mon, Nov 25 2024 8:19 AM

Rashmika Opens Up Vijay Devarakonda Pushpa 2 Event Chennai

రష్మిక పేరు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చేది విజయ్ దేవరకొండ. ఎందుకంటే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తోంది. అయితే అది నిజమని వీళ్ళిద్దరూ చెప్పరు. కానీ ఎ‍ప్పటికప్పుడు కలిసి ఎక్కడో ఓ చోటకు వెళ్తారు. ఎవరో వీళ్లిద్దరిని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దీంతో కొన్నిరోజుల పాటు ఈ టాపిక్ నెటిజన్ల మధ్య డిస‍్కషన్ అవుతుంది. మరి ఇవన్నీ ఎందుకు అనుకుందో ఏమో గానీ రష్మక.. తన ప్రేమ విషయంలో సగం ఓపెన్ అయిపోయింది.

'పుష్ప 2' వైల్డ్ ఫైర్ ఈవెంట్.. చెన్నైలో ఆదివారం జరిగింది. గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకలో రష్మి పెళ్లి టాపిక్ వచ్చింది. 'మీరు చేసుకోబోయేది ఇండస్ట్రీ వ్యక్తినా? లేదంటే బయటి వ్యక్తినా?' అని యాంకర్ అడగ్గా.. ఈ విషయం ఆల్రెడీ అందరికీ తెలిసిందే అని రష్మి నవ్వుతూ చెప్పింది. దీనికి శ్రీలీల చప్పట్లు కొడుతూ తనకు తెలుసు అన్నట్లు తెగ సంబరపడిపోయింది.

(ఇదీ చదవండి: 'పుష్ప 2' వివాదం.. నిర్మాతలపై దేవి శ్రీ ప్రసాద్ సెటైర్లు)

మరి ప్రపోజల్ కోసం వెయిట్ చేస్తున్నారా లేదా మీరే ప్రపోజ్ చేస్తారా? అని యాంకర్ మరోసారి అడగ్గా.. అస్సలు వెయిట్ చేయను, నేనే వెళ్లి ప్రపోజ్ చేస్తాను అని రష్మిక చెప్పింది. ఈమె విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందని అందరికీ తెలుసు. అయితే నేరుగా ఇతడి పేరు చెప్పగానే.. తాము ప్రేమలో ఉన్నది నిజమే అని హింట్ ఇచ్చేసింది. దీంతో అటు రౌడీ ఫ్యాన్స్, ఇటు రష్మిక ఫ్యాన్స్ తెగ ఆనంద పడిపోతున్నారు.

రష్మిక-విజయ్ దేవరకొండ రిలేషన్‌లో ఉన్నట్లు పబ్లిక్‌గా క్లారిటీ వచ్చేసింది. మరి పెళ్ళెప్పుడు చేసుకుంటారో చూడాలి? రష్మిక సినిమాల విషయానికొస్తే.. 'పుష్ప 2' డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. 'ఛావా' అనే హిందీ మూవీ డిసెంబరు చివర్లో విడుదల కానుంది. 'సికిందర్' మూవీలో సల్మాన్‌కు జోడిగా నటిస్తుంది. వీటితో పాటుగా మరో నాలుగు సినిమాలు చేస్తుంది. వచ్చే ఏడాది ఆ సినిమాలు విడుదల కాబోతున్నాయి.

(ఇదీ చదవండి: స్ట్రాంగ్‌ ఉమెన్‌.. ఆ తప్పుల వల్లే యష్మి ఎలిమినేట్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement