'పుష్ప 2' వివాదం.. నిర్మాతలపై దేవి శ్రీ ప్రసాద్ సెటైర్లు | Devi Sri Prasad Speech Highlights In Pushpa 2 The Rule Wildfire Event In Chennai, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Devi Sri Prasad Pushpa 2: ఏది కావాలన్నా సరే అడిగి తీసుకోవాలి.. ఇలా అనేశాడేంటి?

Published Mon, Nov 25 2024 7:27 AM | Last Updated on Mon, Nov 25 2024 10:34 AM

Devi Sri Prasad Speech Pushpa 2 Event Chennai

'పుష్ప 2' మరో పదిరోజుల్లో థియేటర్లలోకి రానుంది. హైప్ గట్టిగానే ఉంది. కాకపోతే కొన్నిరోజుల క్రితం మ్యూజిక్ విషయంలో చిన్నపాటి గందరగోళం జరిగిందని చెప్పొచ్చు. స్వతహాగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. కానీ బ్యాక్ గ్రౌండ్ కోసమని చెప్పి మరో ముగ్గురు సంగీత దర్శకుల్ని అప్పటికప్పుడు తీసుకొచ్చారు. ఇలా జరగడం ఓ రకంగా దేవీకి అవమానం అని చెప్పొచ్చు. తాజాగా చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో ఇతడు ఓపెన్ అయిపోయాడు. 'పుష్ప' నిర్మాతలని పొగుడుతూనే సెటైర్లు వేశాడు. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

'పుష్ప మా అందరికీ స్పెషల్. మనకు ఏది కావాలన్నా సరే అడిగి తీసుకోవాలి. నిర్మాతలు ఇచ్చే రెమ్యునరేషన్ అయినా తెరపై మన క్రెడిట్ అయినా.. అడగకపోతే ఎవరూ ఇవ్వరు. కరెక్టే కదా బన్నీ. రవిశంకర్ (నిర్మాత) సర్.. నేను స్టేజీపై ఎక్కువ టైమ్ తీసుకుంటున్నానని అనొద్దు. ఎందుకంటే నేను సమయానికి పాట ఇవ్వలేదు, బ్యాక్ గ్రౌండ్ చేయలేదు, టైంకి ప్రోగ్రామ్‌కి రాలేదు అంటుంటారు (నవ్వుతూ). మీకు నాపై చాలా ప్రేమ ఉంది. కానీ అంతకుమించి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి'

(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌ పుష్ప-2.. శ్రీలీల కిస్సిక్ ఫుల్ సాంగ్ వచ్చేసింది)

'నా విషయంలో మీకు ఫిర్యాదులు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా రాంగ్ టైమింగ్ అన్నారు. ఇవన్నీ వ్యక్తిగతంగా అడిగితే పెద్ద కిక్ ఉండదు. ఇలా ఓపెన్ గా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. నేనేప్పుడూ ఆన్ టైమ్ సర్' అని దేవిశ్రీ ప్రసాద్ అన్నాడు.

మరి దేవిపై 'పుష్ప' నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్‌కి ఏం కంప్లైంట్స్ ఉన్నాయో తెలీదు గానీ అవన్నీ ఇప్పుడు ఈవెంట్‌లో బయటపెట్టేశాడు. అది కూడా నవ్వూతూనే. పుష్ప 2కి అనుకున్న టైంలో దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వలేదని మరో ముగ్గురుని సంగీత దర్శకుల్ని తీసుకొచ్చారు. బ‌హుశా ఆ విష‌యమై త‌న నిర‌స‌న‌ని దేవిశ్రీ ఇలా స‌భాముఖంగా ఇలా తెలియ‌జేశాడేమో?

(ఇదీ చదవండి: అన్నపూర్ణ స్టూడియోస్‌లో పెళ్లి.. అసలు కారణం వెల్లడించిన చైతూ!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement