మరి కొద్ది రోజుల్లోనే అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి జరగనుంది. డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల కొత్త జీవితం ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్ వేదికగా గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.
పెళ్లి వేదిక అక్కడే ఎందుకంటే..
అయితే అన్నపూర్ణ స్టూడియోస్‌నే పెళ్లి వేదికగా ఫిక్స్ చేశారు. అయితే ఎలాంటి ఆడంబరం లేకుండా సింపుల్‌గానే చేయాలని నాగచైతన్య కోరినట్లు నాగార్జున వెల్లడించారు. అందుకే పెళ్లి పనులు వారిద్దరే చూసుకుంటున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య-శోభిత పెళ్లి జరగడానికి అదే సెంటిమెంట్‌గా తెలుస్తోంది. అక్కడే తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఉండడమే కారణం.
కుటుంబ ఉమ్మడి నిర్ణయం..
ఈ పెళ్లికి ఆయన ఆశీర్వాదాలు కూడా ఉండాలని ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయమని చైతూ తెలిపారు. అందుకే తన తాత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వివాహం చేసుకోబోతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతూ వెల్లడించారు. మా కుటుంబాలు ఒకచోట చేరి ఈ వేడుక జరుపుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారని వివరించారు. శోభితతో కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నట్లు చైతన్య పేర్కొన్నారు.
తనతో బాగా కనెక్ట్ అయ్యా..
శోభితతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు చైతూ వెల్లడించారు. ఆమెతో తాను చాలా కనెక్ట్ అయ్యా.. నన్ను బాగా అర్థం చేసుకుంటుందన్నారు. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని తాను భర్తీ చేస్తుందని తాజా ఇంటర్వ్యూలో నాగచైతన్య తెలిపారు. కాగా.. వీరిద్దరి పెళ్లి వేడుక డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment