Akkineni Nageshwar Rao
-
మీ గుర్తింపు ఆయన సేవలకు నిదర్శనం: నాగార్జున్ ట్వీట్
భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi)కి హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాసిన 'అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ' పుస్తకాన్ని ప్రధానికి అందజేశారు. మీకు ఈ పుస్తకాన్ని అందించడం గౌరవంగా భావిస్తున్నన్నట్లు వెల్లడించారు. ఇది నా తండ్రి ఏఎన్నార్ సినిమా వారసత్వానికి నివాళిగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆయన సేవలను మీరు గుర్తించడం మా కుటుంబం, అభిమానులు, భారతీయ సినీ ప్రేమికులకు ఒక విలువైన జ్ఞాపకమని నాగార్జున ట్వీట్ చేశారు.పార్లమెంట్ హౌస్‌లో అక్కినేని కుటుంబ సభ్యులంతా ప్రధానిని కలిసి ఫోటో దిగారు. నాగార్జునతో పాటు అక్కినేని అమల, నాగచైతన్య, శోభిత ధూళిపాల కూడా నరేంద్ర మోదీని కలిశారు. కాగా.. ఇటీవల మన్ కీ బాత్‌లో తెలుగువారి లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. Profoundly thankful to Hon'ble Prime Minister @narendramodi ji for today's meeting at Parliament House. It was an honor to present 'Akkineni Ka Virat Vyaktitva' by Padma Bhushan awardee Dr. Yarlagadda Lakshmi Prasad, a tribute to my father ANR garu's cinematic heritage. Your… pic.twitter.com/4y5y1C1eRY— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 7, 2025 -
అన్నపూర్ణ స్టాఫ్‌ని ఫ్యామిలీలా భావిస్తాం: నాగార్జున
‘‘రోడ్లు కూడా లేని రోజుల్లో నాన్నగారు (అక్కినేని నాగేశ్వరరావు) హైదరాబాద్ వచ్చి, ఇంత పెద్ద అన్నపూర్ణ స్టూడియోని ఎలా స్థాపించారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కానీ, ఒక్కటి మాత్రం తెలుసు... అన్నపూర్ణ స్టూడియోస్ ఎంతో మంది సాంకేతిక నిపుణులు, నూతన నటీనటులు, కొత్త డైరెక్టర్స్‌కు ఉపాధి కల్పించింది. ఎంతోమందికి ఏఎన్‌ఆర్‌గారు స్ఫూర్తి’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఏర్పాటు చేసి 50 ఏళ్లయిన సందర్భంగా నాగార్జున ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ– ‘‘అన్నపూర్ణ స్టూడియోస్కి 50వ ఏడాది మొదలైంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందని నాన్నగారు నమ్మేవారు. ఆయన సక్సెస్ వెనక మా అమ్మ అన్నపూర్ణగారు ఉన్నారనేది ఆయన నమ్మకం. అందుకే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు. ఈ స్టూడియోకి వచ్చినప్పుడల్లా అమ్మానాన్నలు ఇక్కడే ఉన్నారనిపిస్తుంటుంది. అన్నపూర్ణ స్టాఫ్‌ని మేం ఫ్యామిలీలా భావిస్తాం. స్టూడియో ఇంత కళకళలాడుతోందంటే దానికి అన్నపూర్ణ ఫ్యామిలీనే కారణం. ఈ సందర్భంగా వారికి థ్యాంక్స్. 50 ఏళ్ల క్రితం సంక్రాంతి పండక్కి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత ప్రతి సంక్రాంతికి అమ్మానాన్నలు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలసి బ్రేక్ ఫాస్ట్ చేసేవారు. ఆ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. బయట చాలా మందిని కలసినప్పుడు నాన్నగారి గురించి పాజిటివ్‌గా మాట్లాడతారు. ఆయన జీవితం పెద్ద స్ఫూర్తి అనడం హ్యాపీగా ఉంటుంది’’ అన్నారు. -
వీడియో: అన్నపూర్ణ స్టూడియోని చూశారా.. ఎంత అద్భుతంగా ఉందో..
చెన్నైలో ఉన్న చిత్రపరిశ్రమను హైదరాబాద్‌కి తీసుకురావడానికి నాటి అగ్ర హీరో అక్కినేని నాగేశ్వర్ రావు తీవ్రంగా శ్రమించారు. కొండలు, గుట్టలు ఉన్న అడవి ప్రాంతాన్ని కొని స్టూడియోని నెలకొల్పాడు. అదే అన్నపూర్ణ స్టూడియో. ఈ స్టూడియో నెలకొల్పి ఈ ఏడాదికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అక్కినేని తనయుడు, హీరో నాగార్జున ఓ స్పెషల్ వీడియోని విడుదల చేశాడు.రోడ్లే లేని ప్రాంతంహైదరాబాద్లో సినీ పరిశ్రమ స్థాపించేందుకు.. ఇక్కడ స్టూడియో ఏర్పాటుకు నాగేశ్వర రావు ముందుకువచ్చారు. 1976లో అప్పటి ప్రభుత్వం అక్కినేనికి 22 ఎకరాల భూమికి తక్కువ ధరకు కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో అక్కినేని నాగేశ్వర రావు అతి కష్టపడి స్టూడియో నిర్మించారు. దానికి తన భార్య పేరు మీద 'అన్నపూర్ణ స్టూడియో' అని పెట్టారు. ఆ స్టూడియో నిర్మించే సమయంలో అక్కడికి వెళ్లడానికి రోడ్డు మార్గం కూడా సరిగా లేదట. కొండలు,గుట్టలు ఉన్న ప్రాంతం కొని ఏం చేస్తాడని అంతా ఏఎన్నార్‌ని హేళన చేశారట. కానీ అక్కినేని మాత్రం పట్టుపట్టి మరీ స్టూడియోని నిర్మించారట. తను ఎంతో కష్టపడి నిర్మించుకున్న ఈ స్టూడియోకి తన భార్య పేరే పెట్టాలనుకున్నాడట. అందుకే ఆ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియో అని నామకరణం చేశారు. ‘అమ్మ అంటే నాన్నగారికి చాలా ఇష్టం. ఆయన విజయం వెనుక అమ్మగారు ఉన్నారని ఎప్పుడూ నమ్మేవాడు. అందుకే ఆమె పేరును స్టూడియోకి పెట్టి.. ప్రాణంగా చూసుకున్నాడు. ఎక్కువ సమయం ఆ స్టూడియోలోనే గడిపేవారు. అందుకే అన్నపూర్ణ స్టూడికి వచ్చినప్పుడల్లా..అమ్మానాన్న ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది’ అని నాగార్జున అన్నారు.సంక్రాంతి ఆనవాయితీఏఎన్నార్ స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోని మరింత డెవలప్ చేశాడు నాగార్జున. ఇప్పుడు అక్కడ పదుల సంఖ్యలో సినిమాలు తెరకెక్కుతున్నారు. వందలాది మంది టెక్నీషియన్స్ , ఆర్టిస్టులు, డైరెక్టర్లకు ఉపాధి పొందుతున్నారు. 1976 సంక్రాంతికి ఈ స్టూడియో స్థాపించారట. ఆ రోజు నుంచి ప్రతి ఏడాది సంక్రాంతికి ఏఎన్నార్ తన సతీమణితో అక్కడికి వచ్చి.. అక్కడి ఎంప్లాస్తో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసేవాడట. ఇప్పటికీ ఆ సంప్రదాయాన్ని అక్కినేని ఫ్యామిలీ కొనసాగిస్తుందట. ‘అన్నపూర్ణ స్టూడియో ఇప్పటికీ ఇంత చక్కగా రన్ అవుతుందంటే కారణం ఇక్కడి ఉద్యోగులు. వారు ఎంప్లాస్ కారు అన్నపూర్ణ ఫ్యామిలీ. వారంతా ఈ స్టూడియో కోసం చాలా కష్టపడతారు. నాన్నగారి మొదలుపెట్టన సాంప్రదాయాన్ని మేము కొనసాగిస్తున్నాం. సంక్రాంతి పండక్కి మేమంతా ఇక్కడి ఎంప్లాస్తో కలిసి టిఫిన్ చేస్తాం’ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు నాగార్జున. -
'రాబోయే తరాలకు ఆదర్శం'.. ప్రధానికి నాగార్జున కృతజ్ఞతలు
భారత ప్రధాని నరేంద్ర మోదీకి టాలీవుడ్ హీరో నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. మన్ కీ బాత్‌లో అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించడంపై నాగ్ స్పందించారు. మా నాన్న శతజయంతి ఏడాది సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని నాగార్జున పోస్ట్ చేశారు. ఈ గుర్తింపు మా కుటుంబంతో పాటు సినీ ప్రపంచానికి దక్కుతుందన్నారు. ఆయన సినీ జీవితం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.కాగా.. ఏడాది ఏఎన్నాఆర్ శతజయంతి ఉత్సావాలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం అవార్డ్‌ను మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. ఈ వేడుకలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. అక్కినేని శతజయంతి ఉత్సావాల సందర్భంగా చివరిసారి అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడిన ఆడియోను కూడా ప్రదర్శించారు.ఇక సినిమాల విషయానికొస్తే నాగార్జున కుబేర మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ ధనుశ్, రష్మిక మందన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.Thank you, Hon’ble Prime Minister shri @narendramodi ji, for honoring my father, ANR Garu, on his centenary year alongside such iconic legends. 🙏His vision and contributions to Indian cinema continue to inspire generations, and this recognition means the world to our family and… https://t.co/PK0kah9gHT pic.twitter.com/Yh5QSYm4cA— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 29, 2024 -
ఆయన వల్లే తెలుగు సినిమా ప్రపంచస్థాయికి వెళ్లింది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మన్ కీ బాత్‌లో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు పేరును మోదీ ప్రస్తావించారు. ఆయన వల్లే తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచస్థాయికి వెళ్లిందని గుర్తు చేసుకున్నారు.ఏఎన్నార్ నటించిన చిత్రాల్లో మన సంప్రదాయాలు, విలువలు చక్కగా చూపించారని ప్రధాని మోదీ కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచదేశాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూస్తున్నాని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే ఏడాది వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. మన్ కీ బాత్‌లో మన తెలుగు సినీ దిగ్గజం నాగేశ్వరరావును ప్రశంసించండంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ట్రెండ్ సెట్ చేసిన ‘బుల్లోడు’..ఆల్‌టైమ్ రికార్డు
‘దసరా బుల్లోడు’ అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది అక్కినేని–హీరోయిన్ వాణిశ్రీ. 1971 జనవరి 13న రిలీజైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. వాస్తవానికి ఈ సినిమా కోసం హీరోయిన్గా తొలుత అనుకున్నది జయలలితను. ఈమెతో నిర్మాతల సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ‘దసరా బుల్లోడు’లో నటించడానికి జయలలిత గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. అయితే అదే సమయంలో ఆమె ఎన్టీఆర్‌తో ‘శ్రీకృష్ణ విజయము’, ఎమ్జీఆర్తో మరో సినిమాలో నటిస్తున్నారు. దీంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక చివరి నిమిషంలో ఏఎన్నార్ ‘దసరా బుల్లోడు’ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం అందించారు. కేవలం వారం రోజుల ముందు ఈ విషయం తెలియడంతో అప్పటికప్పుడు వాణిశ్రీని హీరోయిన్గా అనుకున్నారట.ఏఎన్నార్ కంటే వాణిశ్రీకి డబుల్ రెమ్యునరేషన్ ఈ సినిమాకు అక్కినేని పారితోషికం పాతిక వేలైతే వాణిశ్రీకి యాభై వేలు చెల్లించాల్సి వచ్చిందట. అప్పటికి వాణిశ్రీకి పెద్ద హీరోయిన్గా గుర్తింపు కూడా లేదు. అయినా అంత మొత్తం చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. అయితే... ‘దసరా బుల్లోడు’ హిట్‌తో వాణిశ్రీ కూడా స్టార్ హీరోయిన్గా మారి పోయారు. ఆ తర్వాత ‘ప్రేమ్‌నగర్’ లాంటి ఆల్‌టైమ్ బెస్ట్ రావడానికి దసరాబుల్లోడే పునాది వేసింది. దీంతో అక్కినేని–వాణిశ్రీలది హిట్ పెయిర్ అనే పేరొచ్చేసింది. వీరిద్దరి కాంబినేషన్లో 20కి పైగా సినిమాలొచ్చాయంటే‘దసరాబుల్లోడు’ ఎఫెక్ట్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.12 రోజుల రీ షూట్హీరా లాల్ డ్యాన్స్ డైరక్షన్లో ‘పచ్చగడ్డి కోసేటి...’ సాంగ్ షూటింగ్‌తో షూటింగ్ ప్రారంభమైంది. భారీ సంఖ్యలో డ్యాన్సర్లతో పెద్ద పండగలా షూటింగ్ చేశారు. 12 రోజుల పాటు షూటింగయ్యాక మొదటి రోజు మినహా మిగతాది ఏదీ కెమేరాలో క్యాప్చర్ కాలేదని తెలిసి అంతా షాకయ్యారు. దీంతో చేసేది లేక మళ్లీ ఆ 12 రోజుల షూటింగ్ మొత్తాన్ని తిరిగి తీయాల్సి వచ్చింది. ఇక ‘దసరా బుల్లోడు’ పాటలు ఓ సంచలనమనే చెప్పాలి. అప్పట్లో రేడియోలో ఈ పాటలు మోగని రోజు లేదు. ఏ గడప దగ్గర నించున్నా ఈ సినిమాలో పాటలు వినపడాల్సిందే. కేవీ మహదేవన్ మ్యూజిక్ ఓ వైపు... ఆత్రేయ సాహిత్యం మరోవైపు జనాల్ని ఓ ఊపు ఊపేశాయి. ‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లా...’, ‘ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ...’, ‘చేతిలో చెయ్యేసి చెప్పు బావా...’, ‘నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే...’ ఇలా అన్ని పాటలూ బంపర్ హిట్. అప్పట్లో ‘దసరా బుల్లోడు’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. రిలీజైన తొలి 4 వారాలకే 25 లక్షల గ్రాస్ వసూలు చేయడం తెలుగు సినీ చరిత్రలో అప్పటి వరకూ కనీవినీ ఎరుగని రికార్డు.హీరోగా సూపర్ హిట్ కెరీర్‌ని చూసి, ఇప్పుడు విలన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ దూసుకెళుతున్న జగపతిబాబు తండ్రే ‘దసరా బుల్లోడు’ నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ అనే విషయం తెలిసిందే. జగపతిబాబు పేరుతోనే ప్రొడక్షన్ హౌస్‌ను ఏర్పాటు చేసి సినిమాలు తీసేవారు. అప్పట్లో జగపతి పిక్చర్స్ అంటే టాలీవుడ్ నెంబర్ వన్. ‘దసరా బుల్లోడు’తోనే వీబీ రాజేంద్రప్రసాద్ దర్శకుడయ్యారు. ఈ సినిమా కథ కూడా ఆయనే తయారు చేసుకున్నారు. వాస్తవానికి జగపతి సంస్థకు విక్టరీ మధుసూదనరావు ఆస్థాన దర్శకుడు. అయితే ఆయన బిజీగా ఉండడం వల్ల దర్శకుడు ఆదుర్తి సుబ్బారావును అడిగారట వీబీ. ఆయనకూ వీలు కాలేదు. చివరికి అక్కినేనినే డైరెక్ట్ చేయమని అడిగారట. కానీ స్టేజ్ ఆర్టిస్ట్‌గా, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా మంచి అనుభవమున్న వీబీనే డైరెక్ట్ చేయాల్సిందిగా ఏఎన్నార్ ప్రొత్సహించడంతో వీబీ దర్శకత్వం చేయక తప్పలేదు. అందుకే ఈ సినిమా అంటే ఆయనకు అంత ఇష్టం. తర్వాత వివిధ కారణాలవల్ల అన్నీ కోల్పోయినప్పుడు తన అనుభవాలు, జ్ఞాపకాలకు అక్షర రూపమిస్తూ రాసిన పుస్తకానికి ‘దసరా బుల్లోడు’ అనే టైటిలే పెట్టుకున్నారు వీబీ రాజేంద్రప్రసాద్. – దాచేపల్లి సురేష్‌కుమార్ -
శోభిత-నాగ చైతన్య పెళ్లి : అప్పుడు అలా.. ఇపుడు ఇలా!
అక్కినేని నాగ చైతన్య ,శోభిత ధూళిపాళ మూడు ముళ్ల వేడుకతో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ పెళ్లికి వధువు శోభితా ధూళిపాళ సింపుల్ మేకప్, టెంపుల్ జ్యుయల్లరీతో బంగారు రంగు కంజీవరం ప్యూర్ గోల్డ్ జరీ చీరలో అందంగా ముస్తాబైంది. వరుడు నాగచైతన్య టెంపుల్ బోర్డర్ఉన్న పంచె (మధుపర్కం) కట్టుకొని ఎలిగెంట్ లుక్‌లో అలరించాడు. అయితే కుటుంబ వారసత్వాన్ని గౌరవిస్తూ, తన జీవితంలో కీలకమైన శుభకార్యానికి తాతగారి పంచెను కట్టుకున్నాడంటూ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. తాజా నివేదికల ప్రకారం నాగ చైతన్య శోభిత ధూళిపాళతో తన పెళ్లికి తన తాత పంచెను ధరించాడుట. కుర్తా-పైజామాతో పాటు ముహూర్తం సమయానికి తనతాత టాలీవుడ్ దిగ్గజ నటుడు, దివంతగ అక్కినేని నాగేశ్వరావు తెల్లటి పంచెను ఎంచుకున్నాడట. అలా అక్కినేని కుటుంబ వారసత్వాన్ని పాటించాడు అంటున్నారు ఫ్యాన్స్. (మూడు ముళ్లూ పడగానే శోభిత ఎమోషనల్, నాగ్ భావోద్వేగ సందేశం)తాజాగా సోషల్‌మీడియాలో వీరి పెళ్లి ఫోటోలతో పాటు, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతాతో చైతన్య మొదటి పెళ్లినాటి ఫోటోలు, సమంత ఎంగేజ్మెంట్కు, పెళ్లికి కట్టుకున్న చీర వివరాలు కూడా మరోసారి వార్తల్లో నిలిచాయి. అప్పుడు సమంతా అమ్మమ్మ చీరను మురిపెంగా కట్టుకుంటే, ఇపుడు చైతన్య తాత పంచెను కట్టుకున్నాడు అంటున్నారు ఫ్యాన్స్. కాగా నాగ చైతన్యతో పెళ్లి సందర్బంగా సమంత ‘చే’ అమ్మమ్మ చీరను ప్రత్యేకంగా రీడిజైన్ చేయించుకుంది. అలాగే చే, సామ్ లవ్ స్టోరీతో ఆధారంగా వారి ఎంగేజ్మెంట్ చీరను తీర్చిదిద్దుకున్న సంగతి తెలిసిందే. -
ఎన్ని తరాలు చూసినా కొత్తగా అనిపించే కల్ట్ క్లాసిక్ 'గుండమ్మ కథ'
ఏ సినీ ఇండస్ట్రీలోనైనా కొన్ని క్లాసిక్స్ ఉంటాయి. వాటిని ఎన్నిసార్లు, ఎన్ని తరాలు చూసినా కొత్త ఆవకాయలా ఘాటుగా, తియ్యటి బంగినపల్లి మామిడిలా ఉంటాయి. అలాంటి సినిమాల్లో ‘గుండమ్మ కథ’ ఒకటి. 1962 జూన్ 7న విడుదలైన ఇలాంటి సినిమా అసలు ఎవరు చూస్తారు? అన్న దగ్గర మొదలై... ఈ సినిమా చూడని వారు ఉన్నారా? అనేవరకూ వెళ్లింది. అలాంటి కల్ట్ క్లాసిక్ గురించి కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి ఇద్దరు స్టార్ హీరోలు... సావిత్రి, జమున వంటి హేమాహేమీలున్న సినిమాకు సూర్యకాంతం వంటి నటి టైటిల్ రోల్లో ‘గుండమ్మ కథ’ పేరు పెట్టడం అప్పట్లో పెద్ద సంచలనం. వాస్తవానికి గుండమ్మ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు. ఇది కన్నడ పేరు. ‘పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయా బజార్’ వంటి క్లాసిక్స్ తీసిన విజయా సంస్థ తొలిసారిగా రీమేక్ చేసిన సినిమా ‘గుండమ్మ కథ’. కన్నడంలో విఠలాచార్య తీసిన ‘మనె తుంబిద హెణ్ణు’ సినిమాకు రీమేక్ ఇది. ఇందులో ఓ ప్రధాన పాత్ర పేరు గుండమ్మ. ఆ పాత్రకు తెలుగులో ఏ పేరు పెట్టాలా? అని ఆలోచిస్తుండగా అదే పేరు ఉంచమని చక్రపాణి సలహా ఇచ్చారు. చివరకు దాన్నే సినిమా పేరుగా కూడా ఖాయం చేశారు. అలా సినిమాలో టాప్ స్టార్లున్నా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరుపై టైటిల్ పెట్టడం విశేషం. ఈ ప్రాజెక్టును విజయా వారు చేయడానికి కారణం.. సినిమాను మద్రాసులోని నాగిరెడ్డి స్టూడియోలో తీస్తుండగా.. విఠలాచార్య ఆయన్నుంచి కొంత ఆర్థిక సహాయం పొందారు. దానికి కృతజ్ఞతగా రీమేక్ రైట్స్‌ను నాగిరెడ్డికి ఇచ్చారు విఠలాచార్య.కథేంటంటే...ఈ చిత్రకథ విషయానికొస్తే.. గుండుపోగుల వెంకట్రామయ్య రెండో భార్య సూర్యకాంతం. ఈమె తన సవతి కూతురు లక్ష్మి (సావిత్రి)ని పని మనిషిలా చూస్తూ ఇంటి చాకిరి మొత్తం చేయిస్తుంటుంది. తన కూతురు సరోజ (జమున)ను మాత్రం గారాభంగా పెంచుతుంది. వెంకట్రామయ్య బాల్య స్నేహితుడు ఎస్వీఆర్ ఇద్దరు కొడుకులు ఎన్టీఆర్ (అంజి), ఏఎన్నార్ (రాజా) ఆ ఇంట్లో చెరో దారిన ప్రవేశించి గుండమ్మ కూతుళ్లను పెళ్లి చేసుకుంటారు. తర్వాత గుండమ్మ కూతురు సరోజకు రెండో అల్లుడు రాజా ఎలా బుద్ధి చెప్పాడు? గుండమ్మ తన తప్పు ఎలా తెలుసుకుంది? అనేదే ‘గుండమ్మ కథ’ స్టోరీ.‘టేమింగ్ ఆఫ్ ది ష్రూ’ స్ఫూర్తితో...‘గుండమ్మ కథ’ను ముందుగా బీఎన్ రెడ్డి డైరక్షన్ లో తీద్దామనుకున్నారు. ఓ రీమేక్‌ను అంత పెద్ద దర్శకుడితో తీయిస్తే బాగుండదని పుల్లయ్యతో చేద్దామని చర్చించుకున్నారు. అయితే... నరసరాజు రాసిన డైలాగ్ వెర్షన్ ఆయనకు పంపితే ‘ఈ ట్రీట్మెంట్ నాకంత నచ్చలేదు’ అని పుల్లయ్య అన్నారట. దీంతో నాగిరెడ్డి రంగంలోకి దిగి కమలాకర కామేశ్వరరావుకు డైరక్షన్ అప్పగించారు. మరో విషయం ఏంటంటే... కామేశ్వరరావు అప్పటి వరకూ పౌరాణిక సినిమాలే తీశారు. ఈ సినిమాతో తొలిసారి ఓ సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ సినిమాలో ఉన్న కొన్ని సీన్లు నచ్చని చక్రపాణి షేక్స్పియర్ రచన ‘టేమింగ్ ఆఫ్ ది ష్రూ’ నుంచి కొంత స్ఫూర్తి పొంది అచ్చ తెలుగు కథను సిద్ధం చేశారు.గుండమ్మగా ఆమే కరెక్ట్సినిమా కోసం ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్, రమణారెడ్డి వంటి వారంతా డేట్స్ ఇచ్చినా సినిమా మాత్రం మొదలు పెట్టలేదు. కారణం ‘గుండమ్మ’ పాత్ర ఎవరు చేయాలి అని. ఓ షూటింగ్లో సూర్యకాంతం మాట తీరు గమనించిన నాగిరెడ్డి ‘గుండమ్మ’ పాత్రకు ఆమైతేనే కరెక్ట్ అని భావించారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌తో ప్రస్తావిస్తే ఆయన వెంటనే ఓకే అనేశారట.గార్డెన్స్‌లోనే ప్రేమ యాత్రలకు బృందావనమూ...సినిమాలోని అన్ని పాటలను పింగళ నాగేంద్రరావు రాశారు. ఘంటసాల సంగీతం అందించారు. ప్రతీ పాట ఓ క్లాసిక్. ‘ప్రేమ యాత్రలకు బృందావనమూ...’ పాట వెనుక ఓ చిత్రమైన చర్చ జరిగింది. చక్రపాణితో రచయిత పింగళి నెక్ట్స్ డ్యూయెట్ ఎక్కడ తీస్తున్నారు? అని అడగ్గా... ఎక్కడో ఎందుకు? పాటలో దమ్ముంటే విజయా గార్డెన్స్‌లోనే చాలు... ఊటీ, కశ్మీర్, కొడైకెనాల్ ఎందుకు? అని అన్నారట. ఆయన మాటల్ని దృష్టిలో పెట్టుకుని, ‘ప్రేమ యాత్రలకు బృందావనమూ...’ పాట రాశారు పింగళి.ఇద్దరికీ నూరవ చిత్రమేహీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నార్లకు ఇది 100వ చిత్రం. అప్పటికి ఎన్టీఆర్ తెలుగులో రారాజు. అలాంటి వ్యక్తి అంజి పాత్ర ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా తనకు దీటుగా నటించే ఏఎన్నార్ ఈ సినిమాలో స్టైలిష్‌గా కనిపిస్తారు. ఎన్టీఆర్ మాత్రం సినిమాలో ఎక్కువ భాగం నిక్కర్‌తో కనిపిస్తారు. పైగా పిండి రుబ్బుతారు. నటనపై ఎన్టీఆర్‌కున్న నిబద్ధతకు ఈ సినిమా ఓ చిన్న ఉదాహరణ. ఈ సినిమాను తమిళంలో జెమినీ గణేషన్, ఏఎన్నార్లతో రీమేక్ చేశారు.ఫొటోలతో టైటిల్స్ఎన్టీఆర్, ఏయన్నార్ కలిసి నటించినప్పడల్లా ఓ సమస్య ఉండేది. స్క్రీన్ పై ముందు ఎవరి పేరు వేయాలి అని. ‘గుండమ్మ కథ’కూ అదే సమస్య వచ్చింది. దీనికి నాగిరెడ్డి ఓ ప్లాన్ ఆలోచించారు. స్క్రీన్‌పై అసలు పేర్లే వేయకుండా ఫొటోలు చూపించాలని డిసైడయ్యారు. అలా టైటిల్ తర్వాత ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి, జమున, ఎస్వీఆర్ ఫొటోలు పడతాయి. ఇలా హీరో పేర్లు కాకుండా ఫొటోలతో టైటిల్స్ వేయడం ఈ సినిమాతోనే మొదలైంది.‘గుండమ్మ కథ’ రీమేక్?ఎన్టీఆర్, ఏఎన్నార్ పలు చిత్రాల్లో నటించారు. వారి వారసులు బాలకృష్ణ, నాగార్జున కూడా ఓ సినిమాలో కలిసి నటించాలనుకున్నారు. కానీ ఎందుకో వర్కౌట్ కాలేదు. తర్వాత వీళ్లిద్దరూ ‘గుండమ్మ కథ’ను రీమేక్ చేద్దామనుకున్నారు. అదీ వర్కౌట్ కాలేదు. మరి అక్కినేని, నందమూరి మూడో తరం వారసులైనా ‘గుండమ్మ కథ’ను చేస్తారేమో చూడాలి.– అలిపిరి సురేష్ -
అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య- శోభిత వెడ్డింగ్.. అసలు కారణం వెల్లడించిన చైతూ!
మరి కొద్ది రోజుల్లోనే అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి జరగనుంది. డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల కొత్త జీవితం ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్డూడియోస్ వేదికగా గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు కుటుంబాలు పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు.పెళ్లి వేదిక అక్కడే ఎందుకంటే..అయితే అన్నపూర్ణ స్టూడియోస్‌నే పెళ్లి వేదికగా ఫిక్స్ చేశారు. అయితే ఎలాంటి ఆడంబరం లేకుండా సింపుల్‌గానే చేయాలని నాగచైతన్య కోరినట్లు నాగార్జున వెల్లడించారు. అందుకే పెళ్లి పనులు వారిద్దరే చూసుకుంటున్నట్లు తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగచైతన్య-శోభిత పెళ్లి జరగడానికి అదే సెంటిమెంట్‌గా తెలుస్తోంది. అక్కడే తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఉండడమే కారణం.కుటుంబ ఉమ్మడి నిర్ణయం..ఈ పెళ్లికి ఆయన ఆశీర్వాదాలు కూడా ఉండాలని ఫ్యామిలీ తీసుకున్న నిర్ణయమని చైతూ తెలిపారు. అందుకే తన తాత అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు వివాహం చేసుకోబోతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చైతూ వెల్లడించారు. మా కుటుంబాలు ఒకచోట చేరి ఈ వేడుక జరుపుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారని వివరించారు. శోభితతో కలిసి కొత్త జీవితం ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నట్లు చైతన్య పేర్కొన్నారు.తనతో బాగా కనెక్ట్ అయ్యా..శోభితతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఆశగా ఎదురుచూస్తున్నట్లు చైతూ వెల్లడించారు. ఆమెతో తాను చాలా కనెక్ట్ అయ్యా.. నన్ను బాగా అర్థం చేసుకుంటుందన్నారు. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని తాను భర్తీ చేస్తుందని తాజా ఇంటర్వ్యూలో నాగచైతన్య తెలిపారు. కాగా.. వీరిద్దరి పెళ్లి వేడుక డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. -
ఆ సమయంలో అవార్డ్ తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది: మెగాస్టార్
పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ఘనతను సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం ఆయనను వరించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీతారలంతా పాల్గొన్నారు. ఈ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏఎన్ఆర్పై ప్రశంసలు కురిపించారు. ఆయనతో నాకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైందని అన్నారు. అక్కినేని జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో భావోద్వేగానికి గురైన చిరు పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.చిరంజీవి మాట్లాడుతూ..' ఎవరైనా ఇంటి గెలిచి రచ్చ గెలవాలంటారు. నా సినీ ప్రస్థానంలో రచ్చ గెలిచాను. ఇంట గెలిచే అవకాశం సినీ వత్రోత్సవాల్లో వచ్చింది. నాకు లెజెండరీ అవార్డు ప్రదానంతో ధన్యుడిగా భావించా. కానీ నాకు లెజెండరీ అవార్డు ఇవ్వడాన్ని కొందరు హర్షించలేదు. ఆ సమయంలో అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు. అందుకే ఆ రోజు లెజెండరీ అవార్డును క్యాప్సుల్ బాక్సులో వేశా. పద్మవిభూషణ్ సహా ఎన్ని అవార్డులొచ్చినా ఆ అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది' అని అన్నారు.ఏఎన్నార్ అవార్డ్ గురించి మాట్లాడుతూ.. 'ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈ రోజు ఏఎన్నార్ అవార్డ్ అందుకున్నప్పుడు ఇంట గెలిచాననిపిస్తోంది. ఇప్పుడు ఇంట గెలిచాను.. రచ్చ గెలిచాను. ఈ అవార్డ్ గురించి నాగార్జున, వెంకట్ మా ఇంటికి వచ్చినప్పుడు చాలా ఆనందపడ్డా. నాకు పద్మభూషణ్, పద్మ విభూషణ్, గిన్నిస్ బుక్‌తో సహా ఎన్ని అవార్డులు వచ్చినా ఈ రోజు నా భావోద్వేగం వేరుగా ఉంది. నా వాళ్లు నన్ను గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయంగా అనిపించింది. అన్ని పురస్కారాలకు మించిన ఘనత ఇదేనని నాగార్జునతో చెప్పా. ఇదే మాట స్టేజీ మీద కూడా చెబుతున్నా.' అంటూ ఆనందం వ్యక్తం చేశారు. -
అక్కినేనికి డై హార్డ్ ఫ్యాన్ ఆమెనే: మెగాస్టార్ చిరంజీవి
తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోయిన ముద్ర వేసిన సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఇవాళ ఆయన శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లో నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం అందుకున్నాపు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.మెగాస్టార్ మాట్లాడుతూ..'మా అమ్మ అంజనాదేవిని ఇక్కడ కూర్చోబెట్టడానికి ప్రధాన కారణముంది. ఏఎన్ఆర్ సీనియర్ మోస్ట్ ఫ్యాన్స్‌లో అమ్మ కూడా ఒకరు. మొగల్తూరులో నిండు గర్భంతో ఉన్నప్పటికీ ఆ సమయంలో ఏఎన్ఆర్ సినిమా చూసేందుకు వెళ్లారు. అప్పట్లో సినిమా చూసేందుకు నర్సాపురం దాటి పాలకొల్లు వెళ్లి చూడాలి. ఆ సినిమా పేరు 'రోజులు మారాయి'.. అప్పట్లో సూపర్ హిట్ సినిమా. దీంతో జట్కా బండిలో సినిమాకు బయలుదేరారు. కానీ అప్పుడే ఓ బస్సు వీరి బండికి ఎదురొచ్చింది. ఆ బస్సుకు దారి ఇచ్చే సమయంలో వీరి ప్రయాణిస్తున్న జట్కా బండి పక్కన ఉన్న పొలాల్లో పడిపోయింది. అందరూ కిందపడ్డారు. నాన్న ఇంటికి వెళ్దామని చెప్పినా వినకుండా సినిమా చూడాల్సిందేనని అమ్మ పట్టుబట్టి మరి వెళ్లింది. ఎలాగైనా సరే ఆ మూవీ చూసి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చింది' అని అన్నారు. నాకు డ్యాన్స్‌లో అక్కినేని నాగేశ్వరరావు ఆదర్శమని చిరంజీవి కొనియాడారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషి వల్లే మనందరం ఇక్కడ ఉన్నామని తెలిపారు. అక్కినేని కుటుంబంతో నాకున్న అనుబంధం చాలా గొప్పదని అన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ రావడమనేది నా పూర్వజన్మ సుకృతమని సంతోషం వ్యక్తం చేశారు. అమితాబ్ చేతుల మీదుగా తీసుకోవడం మరింత ఆనందం కలిగించిందని మెగాస్టార్ అన్నారు. -
మెగాస్టార్‌కు అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం.. అందజేసిన అమితాబ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ సినీ అగ్రతారలు, దర్శక నిర్మాతలు, నటీనటులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకల్లో చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా పాల్గొన్నారు. తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోయిన ముద్ర వేసిన సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఇవాళ ఆయన శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలకు అల్లు అరవింద్, వెంకటేశ్, రామ్ చరణ్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, నాని, బ్రహ్మనందంతో పాటు పలువురు సినీతారలు హాజరయ్యారు. -
'ఏఎన్ఆర్ చివరి ఆడియో సందేశం'.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్!
తెలుగు సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు హైదరాబాద్‌లో నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ అగ్ర సినీతారలంతా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏఎన్ఆర్ మాట్లాడిన చివరి ఆడియో సందేశాన్ని ప్రదర్శించారు.ఏఎన్ఆర్ ఆడియోలో మాట్లాడుతూ..' నా కోసం మీరు అంతా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారని తెలుసు. మా కుటుంబ సభ్యులు కూడా ఎప్పటికప్పుడు నా ఆరోగ్య సమాచారం గురించి మీకు చెబుతూనే ఉన్నారు. మీ ప్రేమ, అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. త్వరలోనే నేను మీ ముందుకు వస్తానన్న నమ్మకం ఉంది. మీరు చూపిన ప్రేమ, అభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇక సెలవు' అంటూ చివరిసారిగా ఐసీయూ నుంచి సందేశమిచ్చారు. ఇవాళ శతజయంతి వేడుకల్లో నాగేశ్వరరావు మాట్లాడిన ఆడియో సందేశాన్ని వినిపించారు. ఇది విన్న మెగాస్టార్ చిరంజీవి, నటి రమ్యకృష్ణ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నారు. -
అభిమానులతో కలసి ANR హిట్ సినిమా చూసిన నాగచైతన్య
నటసామ్రాట్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ANR 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. హైదరబాద్‌లో 'దేవదాసు' 4K స్క్రీనింగ్‌తో ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైయింది. 31 నగరాల్లో ANR 10 ఐకానిక్ మూవీస్ ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శస్తున్నారు.ఈ ఫెస్టివల్లో భాగంగా అక్కినేని నాగచైతన్య తన తాతగారి క్లాసిక్ మూవీ ప్రేమ్ నగర్ (1971) చిత్రాన్ని హైదరబాద్‌లోని శాంతి థియేటర్లో అభిమానులతో కలిసి చూశారు. ఈ సందర్భంగా అభిమాను కోలాహలంతో థియేటర్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'దేవదాసు' (1953), 'మిస్సమ్మ' (1955) 'మాయాబజార్' (1957), 'భార్య భర్తలు' (1961), 'గుండమ్మ కథ' (1962), 'డాక్టర్ చక్రవర్తి' (1964), 'సుడిగుండాలు' (1968), 'ప్రేమ్ నగర్' (1971), 'ప్రేమాభిషేకం' (1981) 'మనం' (2014) సహా ANR ల్యాండ్‌మార్క్ మూవీస్ దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారు. -
ఏఎన్నార్‌తో నటించడం నా అదృష్టం: చిరంజీవి
లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 20న ఏఎన్నార్ 100వ జయంతి సందర్భంగా ఫిలిం ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎన్నార్‌ను గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ (ట్విటర్) వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.అలనాటి గొప్ప నటులలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకరు. ఆయన అద్భుతమైన నటన తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో గొప్ప స్థానం సంపాదించుకుంది. సినీపరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడం నా అదృష్టం. తనతో కలిసి నటించడం ఎన్నటికీ మర్చిపోలేను. ఆ అద్భుతమైన క్షణాలు నాకు మధురమైన జ్ఞాపకాలు అని రాసుకొచ్చారు. Remembering the legendary ANR,#AkkineniNageswaraRao garu, one of the greatest actors of all time on his 100th birth anniversary.An acting genius and A doyen of Cinema, ANR garu’s memorable performances remain etched in the hearts and minds of Telugu audiences. His… pic.twitter.com/nW0TCrz2Cf— Chiranjeevi Konidela (@KChiruTweets) September 20, 2024 చదవండి: ఇంగ్లీష్‌తో అక్కినేని అనుబంధం.. ఓ నిబద్ధతకు పాఠం -
హిట్ సినిమా కొట్టిన తర్వాతే అఖిల్ మీ ముందుకొస్తాడు: నాగార్జున
తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని నేడు (సెప్టెంబర్ 20) ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ నిర్వహించిన ఓ వేడుకలో నాగార్జున మాట్లాడారు. తన తండ్రి నటించిన చిత్రాలను ఆయన మరోసారి గుర్తుచేసుకున్నారు.ఎంతో ఘనంగా జరిగిన ఆ ఈవెంట్లో అఖిల్ పాల్గొనలేదు. దీంతో కాస్త నిరుత్సాహపడిన ఫ్యాన్స్ నాగార్జునను ప్రశ్నించారు. అఖిల్ ఎక్కడ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో నాగార్జున రియాక్ట్ అయ్యారు. బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టే వరకూ అభిమానుల ముందుకు రానని అఖిల్ చెప్పినట్టుగా నాగార్జున తెలిపారు. దీంతో అభిమానులు భారీగా కేకలు, విజిల్స్ వేశారు.అభిమానులు చూపుతున్న ప్రేమను చూసి నాగర్జున ఆనందపడ్డారు. వారి గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ' మీరు చూపించే అభిమానం, ఆశీస్సుల వల్లే మేము ఈ స్థానంలో ఉన్నాం. నేడు నాన్నగారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్న వారందరికీ నా ధన్యవాదాలు. ఈ సందర్భంగా కొందరు రక్తదానం చేశారు. ఇలా మీ ప్రేమను పొందడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సమయంలో నాన్నగారు ఉండుంటే చాలా బాగుండేది. నాన్నగారి శత జయంతి సందర్భంగా కొన్ని హిట్ సినిమాలు విడుదల చేస్తున్నాం. ఉచితంగా చూసి మీరందరూ ఆనందించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లతోపాటు పీవీఆర్‌లో కూడా ఈ చిత్రాలను ఉచితంగా చూడండి.' అని అభిమానులను నాగార్జున కోరారు.#ANR lives on ♥️ #NagarjunaAkkineni about #akhilakkineni at #ANR100 birthday celebration in Hyderabad pic.twitter.com/5ksfKaxBYC— ARTISTRYBUZZ (@ArtistryBuzz) September 20, 2024 -
కుటుంబంతో పాటు తండ్రి హిట్ సినిమాను చూడనున్న నాగార్జున
టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన నటించిన పది క్లాసిక్ సినిమాలు మళ్లీ విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఇండియాస్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (FHF) వారు దేశవ్యాప్తంగా చలనచిత్రోత్సవాన్ని నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్‌ని ప్రకటించిన సంగతి తెలిసిందే.సెప్టెంబర్ 20 నుంచి మూడు రోజుల పాటు నాగేశ్వరరావు క్లాసికల్ హిట్ సినిమాల ప్రదర్శన ఉండనుంది. అన్నపూర్ణ స్టూడియోస్, హెరిటేజ్ ఫౌండేషన్, పీవీఆర్ ఐనాక్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. సెప్టెంబర్ 20న హైదరాబాద్ సినిఫ్లెక్స్లో అక్కినేని నటించిన దేవదాసు సినిమా ప్రదర్శన ఉంటుంది. ఈ ప్రదర్శనకు అక్కినేని నాగార్జునతో పాటు ఆయన కుటుంబసభ్యులు అందరూ పాల్గొననున్నారు. సాయింత్రం 6:30 గంటలకు ఈ షో ఉంటుంది. టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.సెప్టెంబర్ 20 నుంచి విడుదల కానున్న సినిమాలుదేవదాసు (1953), మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), భార్య భర్తలు (1961), గుండమ్మ కథ (1962)డాక్టర్ చక్రవర్తి (1964), సుడిగుండాలు (1968), ప్రేమ్ నగర్ (1971), ప్రేమాభిషేకం (1981), మనం (2014) -
ఇంగ్లీష్‌తో అక్కినేని అనుబంధం.. ఓ నిబద్ధతకు పాఠం
అక్కినేని నాగేశ్వరావు జీవితంలో తక్కువగా తెలిసిన, కానీ ఎంతో లోతైన అంశం ఆయనకు ఇంగ్లీష్ భాషతో ఉన్న అనుబంధం. ఒకసారి అమెరికా వెళ్లినప్పుడు ఇంగ్లీష్ భాషలో ప్రవేశం లేనందుకు ఆయనని హేళన చేశారు. ఆ అవమాన భారంతో గుండెలు మండి బాత్ రూమ్‌లోకి వెళ్ళి బాధతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సంఘటన ఆయన జీవితంలో ఓ మలుపుగా మారింది. నాగేశ్వరరావు ఇంగ్లీష్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంగ్లీష్ పత్రికలను ప్రధాన వనరుగా చేసుకొని, ప్రతిరోజూ పత్రిక చదువుతూ, ఆంగ్ల భాషపై ప్రావీణ్యం సంపాదించడానికి కృషి చేశారు. కొంత కాలం పిదప ఆయన తన ఆంగ్ల భాషా ప్రావీణ్యం ప్రదర్శిస్తూ, చక్కటి శైలితో ఆకట్టుకున్నారు. ఒకప్పుడు బాధ పెట్టిన విషయమే ఆయనకు విజయంగా మారింది.స్కూల్‌కు వెళ్లలేదు, కానీ తానే విశ్వవిద్యాలయం అయ్యాడుఅక్కినేని పాఠశాలకు వెళ్లలేదు. పెద్ద చదువులు చదవలేదు. కానీ సినీ కళపై ఉన్న అంకితభావంతో స్కూల్‌కు వెళ్లకపోయినా, నటన కళలో నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. సినిమాను తన తరగతి గది అనుకున్నారు. ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం ఆయనకు ఓ పాఠం. అంచలంచెలుగా ఎదిగారు. క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష, పట్టుదల, కఠోర శ్రమ, శ్రద్ధతో నేర్చుకోవడం వలన ఆయన తానే ఓ విశ్వవిద్యాలయంగా ఆవిర్భవించారు. ఎంతో మందికి ఆదర్శవంతులయ్యారు.-సందీప్ ఆత్రేయ, సాక్షి పోస్ట్ -
అక్కినేని తర్వాతే ఎవరైనా.. ఏ తెలుగు హీరోకి సాధ్యం కాని ఘనత
ఆ హీరో సినిమాకు వచ్చిన వసూళ్లని ఈ హీరో అధిగమించాడు. అతడి కంటే ఇతడు రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకుంటున్నాడు. ఇప్పుడంతా ఇండస్ట్రీలో ఇలాంటి మాటలు వింటుంటాం. కానీ ఒకప్పుడు రికార్డులు అంటే వేరే ఉండేవి. అంతెందుకు అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఎప్పటికీ ఎవరూ అందుకోలేని ఘనతల్ని సాధించాడు. ఆయన 100వ జయంతి సందర్భంగా అలాంటి ఓ రెండింటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.ట్రాజెడీ కింగ్ ఏఎన్నార్ఫైట్స్ ఎవరైనా చేస్తారు గానీ ప్రేక్షకుడు గుండెలు కరిగాలే యాక్టింగ్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో ఏఎన్నార్ సిద్ధహస్తుడనే చెప్పాలి. ఎందుకంటే విషాదాంత ప్రేమకథలంటే తెలుగులో ఎప్పటికీ గుర్తొచ్చే ఒకేఒక్క పేరు అక్కినేని నాగేశ్వరరావు. ట్రాజెడీ ప్రేమకథలంటే లైలా-మజ్ను, సలీమ్-అనార్కలీ, దేవదాసు-పార్వతి కథలు గుర్తొస్తాయి. ఈ మూడింటిలోనూ ఏఎన్నార్ నటనతో అదరగొట్టేశారు. బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టేశారు.(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్)ఎప్పటికీ గుర్తుండిపోయే..లైలా-మజ్ను సినిమాలో అక్కినేని భగ్న ప్రేమికుడిగా బాధపడుతుంటే ప్రేక్షకులు కూడా అంతే ఎమోషనల్ అయ్యారు. ఇది రిలీజైన నాలుగేళ్లకు 'దేవదాసు' చేశారు. ఇది ఏఎన్నార్ కెరీర్లోనే సాహసోపోతమైన మైల్ స్టోన్ మూవీ. ఎందుకంటే అప్పటికే 'దేవదాసు' నవల చదివినోళ్లు.. అదే కథతో తీసిన హిందీ, బెంగాలీ సినిమాలు చూసిన వాళ్లు.. 'దేవదాసు'గా ఏఎన్నార్ ఆకట్టుకోవడం అసాధ్యం అన్నారు. కానీ ఈ మూవీ తన నటజీవితానికి సవాలుగా భావించారు. 'జగమే మాయ..', 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్..' అని పాడుతూ మహానటుడు అనిపించుకున్నారు. తనని విమర్శించిన ప్రతి ఒక్కరి నోరు మూయించేశారు.ఆ రెండింటిలోనూపై రెండే కాదు 'అనార్కలి' సినిమాలోని సలీమ్గానూ అక్కినేని యాక్టింగ్ అద్భుతం. దీనితో పాటు పెళ్లి కానుక, సుమంగళి చిత్రాల్లోనూ భగ్న ప్రేమికుడు, త్యాగమూర్తిగా ఆహా అనేలా నటించారు. బాటసారి, మూగమనసులు, రావణుడే రావణుడైతే తదితర సినిమాల్లోనూ ఏఎన్నార్ అదరగొట్టేశారు. 'ప్రేమాభిషేకం' లాంటి విషాదంత ప్రేమకథ అయితే ఎప్పటికీ రాదేమో? అలా టాలీవుడ్ చరిత్రలో ట్రాజెడీ కింగ్‌గా నిలిచిపోయారు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)నవలా నాయకుడుఇప్పుడంటే రీమేక్ కథలని మన హీరోలు వెంటపడుతున్నారు. వాటిలోనూ మెప్పించలేకపోతున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం చాలామంది చదివేసిన నవలల్ని సినిమాలుగా తీస్తే ఏఎన్నార్ తనదైన మార్క్ యాక్టింగ్‌తో మైమరిపించారు. దేవదాసు, అర్ధాంగి, చరణదాసి, డాక్టర్ చక్రవర్తి, బంగారు కలలు, చదువుకున్న అమ్మాయిలు, విచిత్రబంధం, తోడికోడళ్లు, మాంగల్య బలం, విచిత్ర బంధం, భార్య భర్తలు, పునర్జన్మ, బాటసారి, వాగ్దానం, ఆరాధన, పూజాఫలం, ప్రేమలు-పెళ్లిళ్లు, ప్రేమనగర్, సెక్రటరీ.. ఇలా ఏఎన్నార్ కెరీర్లోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన సినిమాలన్నీ నవలలే కావడం విశేషం.అటు విషాదాంత ప్రేమకథలైనా.. ఇటు నవలా చిత్రాలైనా సరే అక్కినేని నాగేశ్వరరావు తన మార్క్ చూపించారు. ఈ రెండు విషయాల్లోనూ ఏఎన్నార్‌ని దాటే హీరో తెలుగులో ఎప్పటికీ రాడు, రాలేడు!(ఇదీ చదవండి: అక్కినేని డ్యూయెట్స్ 50 : విజిల్ వేయండి.. పజిల్ విప్పండి!) -
అక్కినేని డ్యూయెట్స్ 50 : విజిల్ వేయండి.. పజిల్ విప్పండి!
అక్కినేని డ్యూయెట్స్ 50విజిల్ వేయండి.. పజిల్ విప్పండిఅక్కినేని నాగేశ్వరరావు మహిళా ప్రేక్షకులకు ఆరాధ్య నటుడు. ముఖ్యంగా గృహిణులు ఏఎన్ఆర్ సినిమా కోసం ఎదురు చూసేవారు. దానికి తగ్గట్టే ఏఎన్ఆర్ సినిమాల కథాంశాలుండేవి. సావిత్రి, జమున ఆ తర్వాతి కాలంలో వాణిశ్రీ అక్కినేనికి సరిజోడుగా నటించి మెప్పు పొందారు. ఆయన సినిమాల్లో అందమైన యుగళ గీతాలుండేవి. అలాంటి 100 యుగళగీతాలను తలుచుకుందాం. అక్కినేని వల్ల మన జీవితంలో వచ్చిన ఆనందగీతాలను ఆస్వాదిద్దాం. ఈ తొలి పది పాటల్లో సైకిల్ మీద వెళుతూ బి.సరోజాదేవితో పాడే పాట ఏదో గుర్తుపట్టండి. అలాగే తర్వాతి రోజుల్లో కమెడియన్‌గా మారిన గిరిజతో ఎంతో మంచి డ్యూయెట్టు ఉంది. అది ఏది?1. ఓ దేవదా చదువు ఇదేనా (దేవదాసు)2. రాజశేఖరా నీపై మోజు తీర లేదురా (అనార్కలి)3. చిగురాకులలో చిలకమ్మా చిన్నమాట వినరావమ్మా (దొంగరాముడు)4. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము (మాయాబజార్)5. చెట్టులెక్కగలవా ఓ నరహరి (చెంచులక్ష్మి)6. ఆకాశ వీధిలో అందాల జాబిలి (మాంగల్యబలం)7. నేడు శ్రీవారికి మేమంటే పరాకా (ఇల్లరికం)8. వాడుక మరచెదవేల (పెళ్లికానుక)9. హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి (వెలుగు నీడలు)10. మధురం మధురం ఈ సమయం (భార్యాభర్తలు)అక్కినేనికి కవి దాశరథి తన గ్రంథాన్ని అంకితమిచ్చారు. అందుకు కృతజ్ఞతగా అక్కినేని ఆయనకు పాటలు రాసే అవకాశం ఇచ్చాడు. దిగువ ఉన్న పది పాటల్లో దాశరథి రాసినవి ఉన్నాయి.. గుర్తు పట్టండి. అలాగే తెలుగు సినిమాల్లో తొలి వాన పాట కూడా ఉంది. బెంగళూరులో పాట ఏం రాయాలో తోచక కారులో తిరుగుతున్న ఆత్రేయకు అప్పుడే మొదలైన వాన ఆ పాటను రాయించి నేటికీ మనం తడిసేలా చేస్తోంది.11. పాడవేల రాధిక ప్రణయసుధా గీతిక (ఇద్దరు మిత్రులు)12. నన్ను వదిలి నీవు పోలేవులే (మంచి మనసులు)13. ప్రేమయాత్రలకు బృందావనము (గుండమ్మ కథ)14. వినిపించని రాగాలే కనిపించని అందాలే (చదువుకున్న అమ్మాయిలు)15. చిటపట చినుకులు పడుతూ ఉంటే (ఆత్మబలం)16. నా పాట నీ నోట పలకాల సిలక (మూగమనసులు)17. నిలువుమా నిలువుమా నీలవేణి (అమరశిల్పి జక్కన)18. ఈ మౌనం ఈ బిడియం ఇదేనా ఇదేనా (డాక్టర్ చక్రవర్తి)19. కనులు కనులతో కలబడితే (సుమంగళి)20. పగడాల జాబిలి చూడు (మూగనోము)21. కన్నులు నీవే కావాలి (సుమంగళి)22. నువ్వంటే నాకెందుకో అంత ఇది (అంతస్తులు)23. అది ఒక ఇదిలే అతనికి తగులే (ప్రేమించి చూడు)24. సిగ్గేస్తోందా సిగ్గేస్తోందా (మనుషులు మమతలు)25. ఒక పూలబాణం తగిలింది మదిలో (ఆత్మగౌరవం)26. చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి (పూలరంగడు)27. విన్నవించుకోనా చిన్న కోరిక (బంగారు గాజులు)28. విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియ (బందిపోటు దొంగలు)29. ఓ చామంతి ఏమిటే ఈ వింత (ఆత్మీయులు)30. కళ్లలో పెళ్లిపందిరి కనపడసాగే (ఆత్మీయులు)‘దసరా బుల్లోడు’తో అక్కినేని కలర్ పాటలు. స్టెప్పులు చూసే వీలు ప్రేక్షకులకు కలిగింది. ఘంటసాలకు అలవాటు పడిన ప్రేక్షకులు ఆయన స్థానంలో వి.రామకృష్ణను వినేందుకు కూడా సిద్ధం కావాల్సి వచ్చింది. ఈ పాటల్లో లక్ష్మితో మంచి డ్యూయెట్ ఉంది. చూడండి.31. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లా (దసరా బుల్లోడు)32. నీ కోసం వెలసింది ప్రేమమందిరం (ప్రేమ్ నగర్)33. ఆకులు పోకలు ఇవ్వొద్దు (భార్యాబిడ్డలు)34. మనసులు మురిసే సమయమిది (ప్రేమలు పెళ్లిళ్లు)35. వయసే ఒక పూలతోట (విచిత్ర బంధం)36. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది (బంగారు బాబు)37. చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మా (బంగారు కలలు)38. జాబిల్లి చూసేను నిన్ను నన్ను (మహాకవి క్షేత్రయ్య)39. ఎదురుగా నీవుంటే ఎన్నెన్ని భావాలో (మహాత్ముడు)40. మొరటోడు నా మొగుడు మోజు పడి తెచ్చాడు (సెక్రటరీ)1980ల తర్వాత పూర్తిగా అక్కినేని కొత్తతరం హీరోయిన్లతో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గళంలో హుషారు పాటలతో కొనసాగారు. జయసుధ, జయప్రద, శ్రీదేవి, సుజాత వీరంతా ఎక్కువగా ఆయన పక్కన నటించారు. అక్కినేని హీరోగా రిటైర్ అయ్యే వరకు ఎన్నో హిట్లు ఉన్నా ఒక పది పాటలు చెప్పుకుందాం. ఈ లిస్ట్‌లోని చివరిపాటను మోహన్‌లాల్‌తో డ్యూయెట్గా అభినయించారు అక్కినేని. ఆ సినిమా సంగీత దర్శకుడు ఎవరు?41. నేల మీది జాబిలి నింగిలోన సిరిమల్లి (రాజా రమేష్)42. నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని (ప్రేమాభిషేకం)43. ఒక లైలా కోసం తిరిగాను దేశం (రాముడు కాదు కృష్ణుడు)44. మల్లెపూలు గొల్లుమన్నవి (అనుబంధం)45. మధురం జీవన సంగీతం (వసంత గీతం)46. చందమామ దిగి వచ్చే లోన (జస్టిస్ చక్రవర్తి)47. ఇది మేఘ సందేశమో (ఏడంతస్తుల మేడ)48. ఈ కోవెల నీకై వెలిసింది ఈ వాకిలి నీకై తెరిచింది (అండమాన్ అమ్మాయి)49. తామరపువ్వంటి తమ్ముడు కావాలా (బంగారు కానుక)50. గోరువంక వాలగానే గోకులానికి (గాండీవం) – కూర్పు : కె -
అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు.. 10 క్లాసిక్ సినిమాలు రీ-రిలీజ్
ఇండియాస్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ (FHF) తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా చలనచిత్రోత్సవాన్ని నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి సందర్భంగా 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' పేరుతో ఫిల్మ్ ఫెస్టివల్‌ని నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గానైజేషన్ ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రకటించింది.1941లో చిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చిన నాగేశ్వరరావు.. తెలుగు, తమిళం, హిందీ పరిశ్రమలలో 71 సంవత్సరాల పాటు కొనసాగారు. తన కెరీర్లో 250 చిత్రాలకు పైగా నటించారు. అన్నపూర్ణ స్టూడియోను స్థాపించి పలు సినిమాలను నిర్మించారు. ఈ క్రమంలో భారతదేశపు అత్యున్నతమైన పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సహా అనేక ప్రశంసలను అందుకున్నారు. 1924 సెప్టెంబరు 20న జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు 2014 జనవరి 22న మరణించారు. 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' ఈవెంట్ సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు కొనసాగుతుంది. దేశంలో 25 ప్రధాన నగరాల్లో నాగేశ్వరరావు నటించిన 10 సూపర్ హిట్ క్లాసిక్ చిత్రాలను కూడా ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనలు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రోలతో పాటు వడోదర, జలంధర్, తుమకూరు వంటి చిన్న నగరాల్లో కూడా ఈ సనిమాలు రిలీజ్ అవుతాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని ప్రధాన సిటీలలో విడుదల అవుతాయి.సెప్టెంబర్ 20 నుంచి విడుదల కానున్న సినిమాలుదేవదాసు (1953), మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), భార్య భర్తలు (1961), గుండమ్మ కథ (1962)డాక్టర్ చక్రవర్తి (1964), సుడిగుండాలు (1968), ప్రేమ్ నగర్ (1971), ప్రేమాభిషేకం (1981), మనం (2014)నిధులుఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, అక్కినేని నాగేశ్వరరావు కుటుంబం, NFDC - నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా , మల్టీప్లెక్స్ చైన్ PVR-Inox సంయుక్తంగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాయి. నేషనల్ ఫిల్మ్ హెరిటేజ్ మిషన్ కింద భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి నిధులు సమకూరుతాయి.తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది: నాగార్జున 'ANR 100 - కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్' ఈవెంట్ గురించి నాగార్జున ఇలా రియాక్ట్ అయ్యారు. 'కొన్ని దశాబ్దాలుగా ప్రజల హృదయాలలో నిలిచిపోయే పాత్రలలో నాగేశ్వరరావు గారు నటించారు. ఆయన సాధువుగా కనిపించినా, మద్యపానానికి బానిసగా ఆపై రొమాంటిక్ హీరోగా అనేక రకాల పాత్రలను పోషించడంలో అద్భుతమైన ప్రతిభ చూపారు. అందుకే ఆయన్ను 'నటసామ్రాట్' అని పిలుస్తారు. మన రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసి అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించిన మార్గదర్శకుడు. అతని వారసత్వం గురించి మేము చాలా గర్విస్తున్నాము. ఈ పండుగ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు కేవలం తెలుగు సినిమాకే కాకుండా భారతీయ సినిమాకు ఒక ఐకాన్‌ను గుర్తుంచుకుంటారు.' అని నాగ్ అన్నారు.ఆ అదృష్టం నాకు కలిగింది: అమితాబ్ బచ్చన్'అక్కినేని నాగేశ్వరరావు గారిని చాలా సందర్భాల్లో కలుసుకునే అదృష్టం నాకు కలిగింది. ఇతరుల పట్ల ఆయన చూపించే ప్రేమ, వినయం ఎప్పుడూ ఆశ్చర్యాన్ని తెప్పిస్తాయి. భారతీయ సినిమా వారసత్వాన్ని తిరిగి పెద్ద తెరపైకి తీసుకురావాలనే ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ ఈ పండుగను జరుపుతుంది. బహుముఖ ప్రజ్ఞ, లెజెండరీ నటుడి గురించి అందరూ తెలుసుకునే అద్భుతమైన అవకాశం మనకు దక్కుతుంది.' అని అన్నారు. -
ఏయన్నార్ శత జయంతి సందర్భంగా కింగ్ ఆఫ్ ది సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్
ప్రముఖ దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు నటించిన కొన్ని క్లాసిక్ చిత్రాలు మళ్లీ థియేటర్స్‌లో ప్రదర్శితం కానున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 20న అక్కినేని నాగేశ్వరరావు నూరవ జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ‘ఏయన్నార్ 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్‌స్క్రీన్’ పేరుతో ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రకటించింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో సిటీస్‌తో ΄ాటు వరంగల్, కాకినాడ, తుముకూరు, వడోదర, జలంధర్, రూర్కెలా సహా 25 నగరాల్లో సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు 10 క్లాసిక్స్ చిత్రాలను ఈ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి 100వ జయంతిని దేశవ్యాప్తంగా ఆయన ల్యాండ్‌మార్క్ సినిమాల ఫెస్టివల్‌తో జరుపుకోనుండటం ఆనందంగా ఉంది. మన రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసి అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించి మార్గ దర్శకునిగా నిలిచారు. ఆయన లెగసీని కొనసాగించడం మాకు గర్వంగా వుంది. ఈ పండగను సాధ్యం చేయడంలో మాతో భాగస్వామ్యం అయినందుకు అక్కినేని కుటుంబం మొత్తం ఎన్ఎఫ్డీసీ–ఎన్ఎఫ్ఎఐ, పీవీఆర్–ఐనాక్స్కి ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘తెలుగు సినీ లెజెండ్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం ఈ ఫెస్టివల్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ శివేంద్ర సింగ్ దుంగార్పూర్. ‘‘ఒక దిగ్గజ నటుడికి నివాళులర్పించడం మాత్రమే కాదు, భారతీయ సినిమా యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రచారం చేయడానికే ఈ పండగ’’ అని తెలి΄ారు ఎన్ఎఫ్డీసీ–నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ పృథుల్ కుమార్. -
పద్మ విభూషణ్.. ఆ దిగ్గజ నటుడి తర్వాత మెగాస్టార్‌కే!
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రతిష్ఠాత్మక అవార్డులైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ ప్రకటించింది. వివిధ రంగాల్లో అందించిన సేవలకు గాను ఈ గౌరవం లభిస్తుంది. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వరించింది. అయితే తెలుగు సినీరంగంలో ఈ అవార్డ్ ఇప్పటివరకు ఒక్కరికే మాత్రమే వచ్చింది. ఆయనెవరో కాదు నట దిగ్గజం, దివంగత అక్కినేని నాగేశ్వరరావు. తాజాగా ఇప్పుడు మన మెగాస్టార్‌ను వరించింది. దీంతో అయితే దశాబ్దాల తెలుగు సినిమా చరిత్రలో ఈ అవార్డు కేవలం ఇద్దరికీ మాత్రమే దక్కింది. అక్కినేనికి పద్మ విభూషణ్ మొదట 2011లో నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుకు దక్కింది. ఈ లెజెండరీ నటుడు 67 ఏళ్ల సినీ కెరీర్లో 150కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు సినీ చరిత్రలో తన పేరును శాశ్వతంగా లిఖించుకున్న మహోన్నత వ్యక్తి అక్కినేని. ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మ భూషణ్ అవార్డు, పద్మశ్రీ అవార్డు, కలిమామణి, రఘుపతి వెంకయ్య అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (7 సార్లు), జాతీయ స్థాయిలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాళిదాసు లాంటి ఎన్నో విలువైన అవార్డులను అందుకున్నారు. అవార్డుల రారాజు మెగాస్టార్ తాజాగా ఆ ఘనత కేవలం మెగాస్టార్‌కు మాత్రమే దక్కింది. తెలుగు సినీ రంగంలో ఏఎన్ఆర్ తర్వాత అరుదైన ఘనత దక్కించుకున్న నటుడిగా చిరంజీవి నిలిచారు. అంతకుముందే మెగాస్టార్‌కు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు దక్కాయి. సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ఇచ్చింది. ఇక 1987లో స్వయం కృషి సినిమా, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్ర సినిమాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా నంది అవార్డులను అందుకున్నారు. అలాగే శుభలేఖ (1982), విజేత (1985), ఆపద్బాంధవుడు (1992), ముఠామేస్త్రి (1993), స్నేహంకోసం (1999), ఇంద్ర (2002), శంకర్ దాదా ఎంబీబీఎస్ (2004) చిత్రాలకు గాను చిరంజీవి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను అందుకున్నారు. 2006లో సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి స్పెషల్ అవార్డును ఫిలింఫేర్ అవార్డుల్లో భాగంగా అందుకున్నారు. అంతే కాకుండా 2010లో ఆయనకు ఫిలింఫేర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది. తెలుగు సినిమా రంగానికి చేసిన సేవలకు గాను ఆయనకు 2016లో రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. 2006లో చిరంజీవికి ఆంధ్రా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. అంతేకాకుండా 1987లో దక్షిణ భారతదేశం నుంచి ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరైన ఏకైక నటుడు చిరంజీవి కావడం విశేషం. -
దీపావళికి ఈ పాటలు ఎంతో ప్రత్యేకం
దీపావళి.. తెలుగు వారి ముంగిట ఎంతో వెలుగులతో జరిగే పండుగ. నేడు ప్రతి ఇంటి ముందు కాంతులు వెదజల్లుతూ ఆకాశంలోకి రివ్వున వెళ్లే తారా జువ్వలతో పాటు చిచ్చుబుడ్లు వెలుగుల ముందు అందరూ ఆనందంగా గడుపుతారు. ప్రతి ఇంట్లో సంతోషాల కోలాహలానికి ప్రతీకగా ఇవన్నీ నిలుస్తాయి. పగలు, రాత్రిలానే జివితంలోనూ కష్టసుఖాలు దోబూచులాడుతుంటాయి. కటిక అమావాస్య నాడు వచ్చే చీకటిని పారద్రోలుతూ ఇళ్ల ముంగిట దీపాలను వెలిగించి కాంతులను విరజిమ్ముతాం. దీపావళి నాడు చేసే సంబరాలు అంతా ఇంతా కాదు. అందుకే సినిమాల్లో కూడా దీపావళికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పండుగ సందర్భంగా కొన్ని పాటలు మీకోసం.. అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ జంటగా నటించిన విచిత్రబంధం సినిమాలో “చీకటి వెలుగుల రంగేళి..” అంటూ సాగే దీపావళి పాట ఆ రోజుల్లో పెద్ద హిట్ అయింది. 1972లో ఏయన్నార్ నటించిన సినిమాల్లో నవలా చిత్రం ‘విచిత్రబంధం’ ఘనవిజయం సాధించింది. మామగారు 1991లో ఎడిటర్ మోహన్ నిర్మాతగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన తెలుగు చిత్రం. ఇందులో దాసరి నారాయణరావు, వినోద్ కుమార్, యమున జంటగా నటించారు. ఇందులోని దిపావళి పండుగ సాంగ్ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ప్రభాస్, దీక్షాసేథ్, తమన్నా ప్రధాన పాత్రలో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మించిన చిత్రం ‘రెబల్’. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీక్షాసేథ్, ప్రభాస్ మధ్య దీపావళీ సాంగ్ బాగా పాపులర్ అయింది. 1950 లో విడుదలైన షావుకారు తెలుగు సినిమా డ్రామా ఎంటర్టైనర్గా నిలిచింది. ఇందులో నటించిన వారు షావుకరు జానకి, గోవింద రాజుల సుబ్బ రావు, నందమురి తారక రామారావు. నిర్మాతగా బి నాగిరెడ్డి కాగా ఎల్.వి. ప్రసాద్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఘంటసాల స్వరాలు సమకూర్చారు. -
అన్నపూర్ణ స్టూడియోలో ANR శత జయంతి ఉత్సవాలు
-
అక్కినేని.. నీకెవరు సాటిరాని!
తెలుగునాట సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు జన్మించి నేటితో 99 ఏళ్లు నిండాయి. సెప్టెంబర్ 20న 1924లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో ఆయన జన్మించారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 20వ తేదీకి 100 ఏళ్లు నిండుతాయి. ఈ రోజు నుంచే ఆ శకపురుషుడి శతవసంత వేడుక ఆరంభమైంది. ప్రపంచమంతా, వాడవాడలా విశేష వేడుకలు మొదలయ్యాయి. విగ్రహాల ఆవిష్కరణలు, ప్రత్యేక సంచికలు, ఛాయాచిత్రాల విశిష్ట ప్రచురణల కోలాహలం మొదలైంది. తెలుగు జన హృదయ సామ్రాజ్యలను దోచుకున్న 'నటసామ్రాట్' అక్కినేని. ఆయనే అనేకసార్లు అన్నట్లుగా ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. తానే చెక్కుకున్న అద్భుతమైన శిల్పం. తానే గీసుకున్న అందమైన 'చిత్రం'. ఏ కాలేజీ చదువులు చదవని విద్యాధికుడు, ప్రపంచాన్ని, జీవితాన్ని విశ్వవిద్యాలయంగా భావించి, జీవించిన నిత్య అధ్యయన శీలి. చదువులంటే ఎంతో ఇష్టం.చదువుకున్నవారంటే అంతులేని గౌరవం. తను రాసిన 'అ ఆలు..' చదివితే చాలు. అతనెంతటి ఆలోచనాపరుడో తెలుస్తుంది. ఆ జీవితాన్ని సమీక్షిస్తే తెలుస్తుంది, ఆయనెంతటి సాధకుడో! అది ఒక ప్రయోగశాల. తొమ్మిది పదుల నిండు జీవితాన్ని పండించుకున్న పూర్ణ యశస్కుడు, కళాప్రపూర్ణుడు. భారతీయ చలనచిత్ర జగతిలో ఆయన వేసిన పాత్రలు అజరామరం. సాంఘిక సినిమాలు ఆయన ప్రత్యేకం. ముఖ్యంగా మహాకవులు, వాగ్గేయకారులు,మహాభక్తులు, కళాకారుల పాత్రలకు పెట్టింది పేరు. కాళిదాసు,తెనాలి రామకృష్ణ ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది. జయదేవుడు, విప్రనారాయణుడు ఈయనే ఏమో! అని భ్రమ కలుగుతుంది. చాణుక్యుడు అచ్చూ అలాగే ఉంటాడేమో అని అనుకుంటాం. "స్పర్ధయాన్ వర్ధతే విద్య" అనే ఆర్యుల వాక్కు అక్కినేనికి నూటికి నూరుపాళ్లు సరిపోతుంది. ఎన్టీఆర్ వంటి విద్యాధికుడు, పరమ ఆకర్షణా స్వరూపుడు అటువైపు ఉండగా, తన ఉనికిని కాపాడుకుంటూ.. తన విశిష్ట ముద్ర వేసుకోడానికి, ఎంత తపన పడ్డాడో? జగ్గయ్య వంటి చదువరులు, భానుమతి వంటి గడసరులు, సావిత్రి వంటి ప్రతిభామణులు ఉన్న కాలంలో, దీటుగా నిలబడడానికి ఎన్ని ధీరోదాత్తమైన ఆత్మదీపాలు వెలిగించుకున్నారో! అడుగడుగునా,ఆణువణువునా తనను తాను భద్రంగా కాపాడుకోవడానికి,గెలుపుగుర్రంపై స్వారీ చేయడానికి చెప్పలేనంత తపన పడ్డారు. ఆ తపనే తపస్సు. హైస్కూల్ విద్య కూడా దాటని అక్షరాస్యతతో, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ వంటి మహాకవుల పాత్రలు వేయడం బహు సాహసం, వేసి గొప్పగా మెప్పించడం బహు ఆశ్చర్యచకితం. నిజజీవితంలో దైవభక్తి ఎరుగని మనిషి, పరమ భక్తులైనతుకారాం,విప్రనారాయణలుగా జీవించిన తీరు అనన్య సామాన్యం. అమరశిల్పి జక్కనగా ఆయన వేసిన ముద్ర ఆయనకే చెల్లింది. తెలుగు సినిమాలో డాన్సులు మొదలు పెట్టిన మొట్టమొదటి హీరో ఆయనే. ద్విపాత్రాపోషణం ఆయనతోనే మొదలైంది.'నవరాత్రి' సినిమాలో ఏకంగా తొమ్మిది పాత్రలు పోషించారు. ఆయనే తొలి నవలా నాయకుడు కూడా. ఇక ప్రేమికుడు, భగ్నప్రేమికుడు పాత్రలు ఆయనకే చెల్లాయి. 'దేవదాసు'గా ఆ విశ్వరూపాన్ని చూడవచ్చు. హీరోకు ఆయన ఒక స్టైల్ తీసుకొచ్చారు.ఆ హెయిర్ కట్, ఆ మీసకట్టు,డ్రెస్‌ను కొన్ని లక్షలమంది అనుకరించారు. ఆయన స్టైల్ కొన్ని తరాలను శాసించింది. కృష్ణా జిల్లాలోని గుడివాడ దగ్గర ఎక్కడో రామాపురం/ వెంకటరాఘవాపురం అనే కుగ్రామంలో జన్మించారు. దిగువ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం. పల్లెల్లో పొలాల్లో పనిచేసుకుంటూ, నాటకాలలో చిన్నచిన్న పాత్రలు వేసుకుంటూ నటప్రస్థానాన్ని ప్రారంభించారు. స్త్రీ పాత్రలు వేసి,తొలినాళ్ళల్లోనే అందరినీ ఆకర్షించారు. పాటలు, పద్యాలు పాడి డాన్సులు వేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఘంటసాల బలరామయ్య చలువతో తన ప్రగతి భవనానికి మెట్లు కట్టుకున్నారు. వెండితెరపై ఏడు దశాబ్దాలు 16 ఏళ్ల వయస్సులోనే (1940)'ధర్మపత్ని'తో సినిమా రంగంలో అడుగుపెట్టారు. 20ఏళ్ల ప్రాయంలోనే 'సీతారామ జననం'(1944)తో మొట్టమొదటగా కథానాయకుడిగా అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇక తిరిగి చూసుకోలేదు. అప్రతిహతంగా ఏడు దశాబ్దాల పాటు మహాప్రస్థానం సాగింది. తొమ్మిది పదుల వయస్సులోనూ 'మనం'లో జీవించి మెప్పించారు. జీవితంలో తుదిశ్వాస వరకూ నటించిన అరుదైన చరిత్రను లిఖించుకున్నారు. కె విశ్వనాథ్‌కు దర్శకుడిగా అవకాశం నటుడుగా విజృంభించడమే కాక,'అన్నపూర్ణ' బ్యానర్లో ఆణిముత్యాల వంటి ఎన్నో సినిమాలను నిర్మించారు. తెలుగునేలపై చిత్రపరిశ్రమ ప్రభవించడానికి కృషిచేసి, సాధించినవారిలో అక్కినేనివారిది అగ్రశ్రేణి. కె.విశ్వనాథ్‌లో దర్శకత్వ ప్రతిభ ఉందని తొలిగా గుర్తించినవారు అక్కినేని నాగేశ్వరావు. కేవలం గుర్తించడమే కాక 'ఆత్మగౌరవం' సినిమాకు దర్శకుడుగా అవకాశమిచ్చి.. ప్రోత్సహించినవారు కూడా ఆయనే. ఎక్కడ ప్రతిభ, పాండిత్యం ఉంటే అక్కడ గుర్తించి, ఆ ప్రతిభామూర్తులను ప్రోత్సహించి, గౌరవించిన కళాహృదయుడు, ప్రతిభా పక్షపాతి అక్కినేని.మహాదాత కూడా. కాలేజీ కోసం ఉన్నదంతా దానం గుడివాడలో కళాశాల నిర్మాణానికి, అప్పుడు తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇచ్చివేసిన త్యాగశీలి. తన ప్రతిభ పట్ల, రేపటి పట్ల అచంచలమైన విశ్వాసంతో అంతటి దానం చేశారు. ఆ కాలేజీకి అక్కినేని నాగేశ్వరావుపేరు పెట్టుకున్నారు. కేవలం గుడివాడ కాలేజీకే కాదు.. ఆంధ్రా యూనివర్సిటీ మొదలు ఎన్నో విద్యాలయాలకు భూరి విరాళాలు ఇచ్చారు. ఎందరికో, ఎన్నింటికో గుప్తదానాలు కూడా చేశారు. ఆర్ధిక క్రమశిక్షణను కాపాడుకుంటూనే, పాత్రత ఎరిగి దానం చేసే విజ్ఞత ఆయన సొత్తు.'అపాత్రాదానం' చేయకూడదన్నది ఆయన నియమం. తన విజ్ఞాన పరిధులను విశేషంగా విస్తరించుకోడానికై కవులు,మేధావులతో గడిపేవారు. సత్ సాంగత్యంలో గడపడం ఆయన నిత్యకృత్యం. 50 ఏళ్లకే గుండె ఆపరేషన్ 50 ఏళ్ల వయస్సులోనే గుండె దెబ్బతిన్నది. అమెరికాలో ఆపరేషన్ చేయించుకొని పునరుత్తేజం పొందారు. అప్పటి నుంచి జీవనశైలిని ఎంతో మార్చుకున్నారు. తన శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుకోడానికి ఋషి వలె కృషి చేశారు. గుండె చాలా తక్కువ శాతం మాత్రమే పనిచేసేది. అచంచలమైన మనోధైర్యం, విచక్షణతో హృదయాన్ని ధృడంగా నిలుపుకున్నారు. ఆ తీరు అన్యులకు సాధ్యపడదు. సునిశితమైన పరిశీలన, చురుకైన చూపులు, పాదరసం వంటి మెదడు, నిలువెల్లా రసికత, గుండెనిండా పట్టుదల, నిత్య కృషీవలత్వం అక్కినేని సుగుణాలు,సులక్షణాలు. క్రమశిక్షణకు మారుపేరు అకడమిక్‌గా తాను పెద్ద చదువులు చదువుకోలేదనే స్మృతితో పిల్లలను బాగా చదివించారు. చదివించడమే కాక,ఎంతో క్రమశిక్షణతో పెంచారు. శ్రమ విలువ తెలియాలన్నది ఆయన సూక్తి. సినిమా జీవితంలోనూ, నిజ జీవితంలోనూ తన బలాలు,బలహీనతలు బాగా ఎరిగి నడుచుకున్నారు. తాను ఎక్కడ రాణించగలనో తెలిసి అక్కడ విజృంభించారు. ఎచ్చట గెలవలేనో ఎరిగి అచ్చట విరమించుకున్నారు. రాజకీయాల్లో అనేకసార్లు అవకాశాలు వచ్చినా చిరునవ్వుతో తప్పించుకున్నారు. కానీ,రాజకీయాలను సునిశితంగా పరిశీలించడం ఎన్నడూ మానలేదు. రాజకీయ నాయకులతో విస్తృతంగా సంబంధాలను పెంచుకున్నారు. ఆయనకి అదొక 'ఆట'విడుపు. సాధించని అవార్డులు లేవు ఆయన నటించిన సినిమాలు, నిర్మించిన సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించి రికార్డ్ సృష్టించాయి.నటుడుగా ఆయన పొందని సత్కారాలు లేవు, ఆయనను చేరని బిరుదులు లేవు. పద్మశ్రీ నుంచి పద్మవిభూషణ్ వరకూ,కళాప్రపూర్ణ నుంచి కాళిదాసు సమ్మాన్ వరకూ, డాక్టరేట్ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే వరకూ ఆన్నీ వరించాయి. ఒక్క 'భారతరత్న' తప్ప, ఘనమైన గౌరవాలన్నీ దక్కించుకున్నారు. 'అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్' స్థాపించారు. దాదా సాహెబ్ ఫాల్కేతో సమానమైన పురస్కారాలను ప్రతి ఏటా చలనచిత్ర ప్రతిభామూర్తులకు సమర్పించాలని సంకల్పం చేసుకున్నారు. దేవానంద్ మొదలు రేఖ వరకూ ఎందరో ప్రజ్ఞాప్రముఖులు 'ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు'ను అందుకున్నారు. అక్కినేని మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయం. "బండరాళ్లను సైతం అరగించుకో గలిగిన వయసులో డబ్బులు లేవు. డబ్బులున్న నేడు వయస్సు లేదు" అంటూ జీవనసారాన్ని చెప్పిన తత్త్వవేత్త అక్కినేని. అక్కినేని వలె జీవించడం, జీవితాన్ని సాధించడం అందరికీ సాధ్యపడేది కాదు. నిన్న మొన్నటి వరకూ మన మధ్యనే నడచి వెళ్లిన అక్కినేని 'అమరజీవి'గా అనంతమైన కాలంలో అఖండగా వెలుగుతూనే ఉంటారు. రచయిత: మా శర్మ, సీనియర్ జర్నలిస్టు -
ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ప్రేక్షకులు 'ఆదిపురుష్' నామం జపిస్తున్నారు. ఎవరినీ పలకరించినా జై శ్రీరామ్ అనే పదమే వినిపిస్తోంది. ఎందుకంటే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రామాయణం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి రాముడిగా నటించడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే స్థాయిలో చిత్రబృందం సైతం ప్రమోషన్లలో భాగంగా భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగులో రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు గతంలో చాలానే వచ్చాయి. కానీ అప్పటి స్టార్ హీరోలు సైతం రాముడి పాత్రలో కనిపించారు. వెండితెరపై రాముడిగా మెప్పించినవారిలో నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్‌తో పాటు అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, శోభన్‌బాబు సైతం రాముడి పాత్ర పోషించారు. మరీ రాముడి పాత్రలో ఎవరు చక్కగా ఒదిగిపోయారు? రాముడి వేషధారణలో అచ్చం రాముడే అనిపించేలా ఎవరు మెప్పించారు? అలా వెండితెరపై మొదటిసారి రాముడిగా ఎవరు కనిపించారు? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి. (ఇది చదవండి: విడాకులు తీసుకున్న నటి.. నేను సరైన పనే చేస్తున్నా) తొలిసారి రాముడిగా ఆయనే.. సినీరంగంలో చాలామంది అగ్రనటులు రాముడిగా కనిపించినా.. తొలిసారి తెరపై రాముడిగా కనిపించింది మాత్రం నటుడు యడవల్లి సూర్యనారాయణనే. 1932లో విడుదలైన పాదుకా పట్టాభిషేకం చిత్రంలో రాముడిగా కనిపించారు. బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండో తెలుగు చిత్రంగా తెరకెక్కింది. ఆ తర్వాత ఇదే పేరుతో 1945లో విడుదలైన చిత్రంలో సీఎస్ఆర్ ఆంజనేయులు రాముడిగా కనిపించారు. తొలి చిత్రంలోనే రాముడిగా అక్కినేని శ్రీ సీతారామ జననం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు రాముడిగా కనిపించారు. 1944లో వచ్చిన ఈ సినిమాలో ఆయన పూర్తిస్థాయి కథానాయకుడిగా నటించారు. తొలి సినిమా అయినా వెండితెరపై రాముడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా ఘంటసాలకు కూడా ఇది తొలిచిత్రం కావడం విశేషం. రాముడంటే ఆయనే అనేలా.. తెలుగు సినిమాల్లో రాముడు అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఆయనదే. ఆయనే నట విశ్వరూపం నందమూరి తారకరామారావు. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంలో తొలిసారి రాముడిగా కనిపించారు. ఆ తర్వాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రాల్లోనూ రాముడి పాత్ర పోషించారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన శ్రీరామ పట్టాభిషేకం సినిమాలోనూ రాముడి పాత్రలో కనిపించారు. ఎన్టీఆర్‌ను రాముడిలా తెరపై కనిపిస్తే ప్రేక్షకులు థియేటర్లలో స్క్రీన్‌కే హారతులు ఇచ్చారంటే ఆయన ఎంతలా ఒదిగిపోయాడో తెలుస్తోంది. రావణుడిగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘సీతారామ కల్యాణం’ సినిమాలో నటుడు హరనాథ్ రాముడి పాత్ర పోషించారు. 1961లో విడుదలైన ఈ మూవీలో రావణుడిగా రామారావు నటించారు. ఆ తర్వాత 1968లో విడుదలైన ‘శ్రీరామకథ’ సినిమాలోనూ హరనాథ్ రాముడిగా కనిపించారు. ఒక్కసారైనా ఒదిగిపోయారు.. తెలుగు సినీరంగంలో అందగాడైన హీరో శోభన్‌బాబు ఓ చిత్రంలో రాముడిగా కనిపించారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంపూర్ణ రామాయణంలో రాముడి పాత్ర పోషించారు. 1971లో వచ్చిన ఈ సినిమాలో రావణుడి పాత్రలో ఎస్వీ రంగారావు ఆకట్టుకున్నారు. 1968లో వచ్చిన వీరాంజనేయ చిత్రంలో కాంతారావు రాముడిగా కనిపించారు. 1976లో బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సీతా కల్యాణం సినిమాలో నటుడు రవికుమార్ రాముడిగా ఒదిగిపోయారు. (ఇది చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆ థియేటర్లలో ఆదిపురుష్ రిలీజ్ లేనట్లేనా?) బాల రాముడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ మనవడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో మెప్పించారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాల రామాయణం’లో జూనియర్ నటించారు. 1997లో వచ్చిన ఈ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు, రెండు నంది అవార్డులను దక్కించుకుంది. రామదాసులో సుమన్.. దేవుళ్లులో శ్రీకాంత్.. శ్రీ రామరాజ్యంలో బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు కూడా రాముడి పాత్ర పోషించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ రామదాసు’లో సుమన్ రాముడిగా ఆకట్టుకున్నారు. అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవుళ్లు’ చిత్రంలోని ఓపాటలో శ్రీకాంత్ రాముడిగా కనిపించారు. నందమూరి బాలకృష్ణ సైతం ఓ చిత్రంలో రాముడిగా కనిపించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీ రామరాజ్యంలో మెప్పించారు. 2011లో వచ్చిన మూవీలో సీతగా నయనతార ఆకట్టుకుంది. ఆదిపురుష్‌లో ప్రభాస్ అయితే ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో రాముడి పాత్రలో అలనాటి హీరోలు అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే అప్పటి రామాయణానికి.. ఇప్పుడు తెరకెక్కిన రామాయణానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే అప్పట్లో ఇంతలా సాంకేతికపరమైన టెక్నాలజీ లేదు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణానికి ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. ఈ చిత్రాన్ని గ్రాఫిక్స్, సరికొత్త హంగులతో తీర్చిదిద్దారు. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఆదిపురుష్‌లో ప్రభాస్ రూపంలో ఉన్న రాముడు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో తెలియాలంటే తెరపై చూడాల్సిందే. రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించనుండగా.. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న ఆదిపురుష్ థియేటర్లలో సందడి చేయనుంది. -పిన్నాపురం మధుసూదన్ -
అక్కినేని వివాదం: మరోసారి బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లెజెండరి నటులు దివంగత నాగేశ్వరరావును ఉద్దేశించిన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యాలు తీవ్ర దూమారం లేపాయి. దీంతో బాలయ్య క్షమాపణలు చెప్పాలటూ అక్కినేని అభిమానులంతా డిమాండ్ చేశారు. దీంతో ఎట్టకేలకు తన వ్యాఖ్యాలపై స్పందించిన బాలయ్య వివరణ ఇస్తూనే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చదవండి: ఎన్టీఆర్ వర్థంతి నాడు నాగ్ అలా.. ఏఎన్ఆర్ వర్ధంతి నాడు బాలయ్య ఇలా.. ‘నాగేశ్వరరావు గారు నాకు ఎప్పుటికి బాబాయే. ఆయన అంటే నాకు చాలా గౌరవం.ఆయన కూడా నన్ను తన పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేవారు. నన్ను అప్యాయంగా పలకరించేవారు. ఎందుకంటే అక్కడ లేని(అక్కినేని కుటుంబంలో) అప్యాయత ఇక్కడ ఉంది కాబట్టి. గుర్తు పెట్టుకోండి’ అని బాలయ్య వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి బాలయ్య కామెంట్స్ వైరల్‌గా మారాయి. కాగా వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్లో బాలయ్య చేసిన ‘అక్కినేని-తొక్కినేని’ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ టైమ్‌లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో చెబుతూ.. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’ అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: కఠిన సమయంలో నాకు చేరువై, నాలో స్ఫూర్తి నింపావు..: సమంత -
అక్కినేని వివాదంపై స్పందించిన బాలయ్య
‘అక్కినేని తొక్కినేని’ వివాదంపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. అక్కినేని నాగేశ్వరరావుని కించపరిచే వ్యాఖ్యలు తాను చేయలేదన్నారు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో యాదృచ్చికంగా ఆ మాట వచ్చిందన్నారు. హిందూపురంలో జరిగిన ఆ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీకి రెండు కళ్లలాంటివారు నాన్నగారు(ఎన్టీఆర్), అక్కినేని నాగేశ్వరరావు . నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ నేర్చుకున్నాను. నాన్న పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు కు ఇచ్చాం. బాబాయి(నాగేశ్వరరావు) పై ప్రేమ గుండెల్లో ఉంటుంది. బయట ఏం జరిగినా నేను పట్టించుకోను. ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదు’ అని బాలకృష్ణ అన్నారు. కాగా, వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్లో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ టైమ్‌లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో చెబుతూ.. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’ అని బాలకృష్ణ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి. -
బాలయ్య అనుచిత వ్యాఖ్యలు, ట్రెండింగ్‌లో ‘మెంటల్ బాలకృష్ణ’ హ్యాష్ ట్యాగ్!
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదంలో నిలిచారు. ఆయన లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి మూవీ సక్సెస్ మీట్ సినీ దిగ్గజాలను కించపరుస్తూ చేసిన ఆయన కామెంట్స్ ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యాయి. సినీ దిగ్గజం, నట సామ్రాట్ దివంగత అక్కినేని నాగేశ్వరరావుపై బాలయ్య అనుచిత వ్యాఖ్యలు చేసిని సంగతి తెలిసిందే. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నారు. ఇటవల జరిగిన వీర సింహారెడ్డి మూవీ సక్సెస్ మీట్లో బాలయ్య మాట్లాడుతూ ‘అక్కినేని.. తొక్కినేని’ అని వ్యాఖ్యానించడం సరికాదని, ఇందుకు ఆయన క్షమాపణలు చెప్పాలని అక్కినేని అభిమాన సంఘాలు, కాపునాడు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య చేసిన కామెంట్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్న ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఈ మేరకు మెంటల్ బాలయ్య అని పేర్కొంటూ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్న అక్కినేని ఫ్యాన్స్. మెంటల్ హ్యాష్‌ట్యాగ్ ‘‘అక్కినేని నాగేశ్వరరావుపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు’’ అంటూ సోషల్ మీడియా వేదికగా వివిధ ప్రాంతాల నుంచి అక్కినేని అభిమానులు స్పందించారు. దీంతో ‘మెంటల్ బాలకృష్ణ, ముద్దుల మామయ్య కాదు.. మెంటల్ మామయ్య’ అనే హ్యాష్‌ట్యాగ్స్ ట్విటర్ వేదికగా ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అలాగే వివిధ సందర్భాల్లో బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతరకర ప్రవర్తనలకు సంబంధించిన వీడియోలను అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ‘ఈ మెంటల్‌కి సర్టిఫికెట్ రెన్యూవల్ చేయలేదా?.. మళ్ళీ పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు.. ఎస్వీ రంగారావుగారు, అక్కినేని నాగేశ్వర రావుగారి గురించి మాట్లాడే స్థాయి నీకు ఉందా అసలు?’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ‘‘బహిరంగ సభల్లో మాట్లాడకుండా బాలకృష్ణపై నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. వివిధ కారణాల వల్ల ఆయన నాలుకకు అడ్డూ అదుపు ఉండటం లేదు’ అంటూ ఓ ఫ్యాన్ ట్వీట్ చేశారు. ఇటు ఎస్వీ రంగారావు అభిమానులు కూడా బాలకృష్ణ వైఖరిని తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. Ma mental balakrishna ni kutha pagal degai la Unaru 🤣 Andhukai mata matladai mundhu alochinchi matladali... Adhi yavar ina sare.... #MentalBalaKrishna pic.twitter.com/rvD6oVOlEV — AK Badri (@AKBadri6848) January 25, 2023 సినిమాల్లో డైలాగ్స్ ఏముంది బొచ్చడు చెప్పుకోవచ్చు కానీ బైట అలా ఉండదు #VeeraSimhaReddy#MentalBalaKrishna pic.twitter.com/sf31KY3Y2e — Mahesh (@Norito_DON) January 23, 2023 చివరి రోజుల్లో ఎన్టీఆర్‌కు పట్టెడన్నం కూడా పెట్టని నందమూరి వారసులు రామారావుగారి చివరి రోజుల్లో ఆయనకు పట్టెడన్నం కూడా నందమూరి వారసులు పెట్టలేదన్న విషయం నందమూరి బాలకృష్ణగారు గ్రహించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డిగారు ఉన్న సమయంలో బాలకృష్ణగారి ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు ఏ విధంగా ఆ కేసు నుంచి బాలకృష్ణగారు బయటపడ్డారనే నిజం ఆయనకే (బాలకృష్ణ) తెలియాలి. ఈ కేసు విషయాలను బాలకృష్ణగారు బయటపెడితే మేం కూడా స్వాగతిస్తాం. ఇకనైనా బాలకృష్ణగారు సీనియర్ నటులను గౌరవించడాన్ని నేర్చుకోవాలి. అక్కినేని నాగేశ్వరరావుగారిపై ఇకపై ఏ నటుడైనా విమర్శలు చేస్తే అభిమానులు కూడా ప్రతి విమర్శలు చేస్తారు’’ అంటూ కడప జిల్లా నాగార్జున యువశక్తి అధ్యక్షుడు ఓ వీడియో షేర్ చేశారు. ఇంకా ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారికి ఎన్నో అవార్డులు రాకుండా చేసింది ఎవరో అందరికీ తెలుసు. సినీ ఇండస్ట్రీ హైదరాబాద్‌కు రావడానికి ముఖ్య కారకులు నాగేశ్వరరావుగారు. అలాంటి నటుడిపై బాలకృష్ణ విమర్శలు చేయడం దారుణం. సొంతంగా స్పందించిన డబ్బుతో అక్కినేని నాగేశ్వరరావుగారు అన్నపూర్ణ స్టూడియోను నిర్మించాలనుకుంటే ఆ స్థలాన్ని కూడా నందమూరి రామారావుగారు కబ్జా చేయాలని చూస్తే, కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. అయినప్పటికీ తన చివరి రోజుల్లో కూడా రామారావుగారు అక్కినేని నాగేశ్వరరావుగారిని బ్రదర్ అంటూ పిలిచారు. తన తండ్రి వయసుగల అక్కినేని నాగేశ్వరరావుగారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇకనైనా మానుకోవాలి’’ అన్నారు. ‘‘బాలకృష్ణ గారు వాళ్ల నాన్నగారి ముందు వీళ్లంతా ఎవరూ అక్కినేని, తొక్కినేని అంటూ అసభ్యకర పదజాలంతో మాట్లాడటం అహంకారపూరిత అవలక్షణంగా భావించాల్సి వస్తోంది’’ అంటూ అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. సర్వేశ్వరరావు ఓ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీ కళాకారులను మదరాసులోనే అంతం అవకుండా మొట్టమొదట హైదరాబాద్‌కు తీసుకువచ్చి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో సేవలు చేసేలా చేసి, తన నటనతో, సేవాభావంతో ఎంతోమందికి, ఆర్టిస్ట్‌లకు అవకాశాలు కల్పిస్తూ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణగారి అహంకారపు మాటలను ఖండిస్తున్నాం. మీ (బాలకృష్ణని ఉద్దేశించి) నాన్నకు అన్యాయం చేసి అధికారం లాక్కుంటే, మీ నాన్న మాటల్లో ఆ నీచుడిని చంపి నా దగ్గరికి రా బాలయ్య అంటూ ఆ రోజు మీ నాన్న నీకు చెప్తే ఈ రోజుకీ ఒక కొడుకుగా నెరవేర్చలేని నీ హీరోయిజం ఏ మాత్రానికి అని మేం ప్రశ్నించవచ్చు. కానీ మా అక్కినేని ఫ్యాన్స్‌కు ఆ సంస్కారం ఉంది. ఇక మీద మీ అహంకార కుల మత్తు మాటలు కట్టిపెట్టి అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ వారు చేసే విభిన్న కార్యక్రమాలకు మీరు చాలా బాధపడాల్సి వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ హెచ్చరిస్తూ ఉంది’’ అని ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారు. పవన్ స్పందించాలి ఎప్పుడూ ఇండస్ట్రీకి ఏదో మేలు చేసే వ్యక్తిలా మాట్లాడే పవన్ కల్యాణ్ ఇప్పుడు ‘అక్కినేని నాగేశ్వరరావుగారి’పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని ఓ అక్కినేని ఫ్యాన్ ట్వీట్ చేశారు. ఇక పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ ఓ సందర్భంలో పేర్కొన్నారు. కానీ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సెకండ్ సీజన్‌లోని ఓ ఎపిసోడ్‌కు పవన్ గెస్ట్‌గా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఇటీవలే క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అంటూ ఇటీవల బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో తన పొరపాటును మన్నించాల్సిందిగా కోరుతూ బాలకృష్ణ ఓ లేఖను విడుదల చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. -
తాగే బ్రాండయినా మార్చుకో లేదా తీరు మార్చుకో.. బాలయ్యకు వార్నింగ్
తెలుగు సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయాలను లిఖించిన దిగ్గజాలలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. జనవరి 22న ఆయన వర్ధంతి కాగా అదేరోజు నందమూరి బాలకృష్ణ 'అక్కినేని తొక్కినేని' అంటూ ఏఎన్నార్‌ను కించపరిచేలా మాట్లాడటంతో అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. వరుసగా సినిమాలు విజయం సాధించడంతో బాలకృష్ణకు గర్వం తలకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నెల్లూరులో ఏఎన్నార్ అభిమానులు బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. నర్తకి సెంటర్లో బాలయ్య ఫ్లెక్సీని దగ్ధం చేశారు. వెంటనే బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాగే బ్రాండ్ అయినా మార్చుకో లేదా మాట తీరైనా మార్చుకో అని నినాదాలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు. చదవండి: విజయ్ ఆంటోని ఆరోగ్యంపై క్లారిటీ ఎన్టీఆర్ వర్ధంతి నాడు నాగ్ అలా.. ఏఎన్నార్ వర్ధంతి నాడు బాలయ్య ఇలా.. -
ఎన్టీఆర్ వర్థంతి నాడు నాగ్ అలా.. ఏఎన్ఆర్ వర్ధంతి నాడు బాలయ్య ఇలా..
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తెలుగు సినీ దిగ్గజాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. గొప్ప నటుడు స్వర్గీయ నాగేశ్వరరావుని కించపరిచేలా ‘అక్కినేని తొక్కినేని’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించడంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు. దిగ్గజ నటుడైన అక్కినేని కించపరుస్తూ మాట్లాడటం సరికాదంటూ బాలకృష్ణపై మండిపడుతున్నారు. బాలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్.. ఎంపికైన నాటు నాటు సాంగ్ అదే విధంగా గతంలో దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి తారకరామారావు గురించి ప్రస్తావిస్తూ గౌరవప్రదంగా వ్యాఖ్యానించిన నాగార్జున పాత వీడియోను అక్కినేని ఫ్యాన్స్ పలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో వైరల్ చేస్తున్నారు. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన ‘బంగార్రాజు’ సినిమా గత ఏడాది జనవరి 14న విడుదలై, సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో ‘బంగార్రాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. ఈ వేదికపై ఎన్టీఆర్ వర్ధంతిని గుర్తు చేసుకుని నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ఫిలిం ఇండస్ట్రికి రెండు కళ్లు ఎప్పుటించో అంటుంటారు. ఒకటి నందమూరి తారకరామారావు గారు, ఇంకొకరు అక్కినేని నాగేశ్వరరావు. చదవండి: బాలకృష్ణ ‘అక్కినేని తొక్కినేని’ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్ ఫైర్ ఈ రోజు జనవరి 18.. నందమూరి తారక రామారావుగారి వర్ధంతి. తెలుగు సినిమా ఉన్నంతవరకు మనం ఆయనను గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటాం. ఎన్టీఆర్ లివ్స్ ఆన్.. అలాగే ఏయన్నార్ లివ్స్ ఆన్’’ అన్నారు’‘ఎన్టీఆర్ వర్ధంతి నాడు నాగార్జున అంత బాగా మాట్లాడితే, జనవరి 22న అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి నాడు ‘అక్కినేని తొక్కినేని’ అంటూ బాలకృష్ణ మాట్లాడటం సబబేనా? ఇదేనా బాలకృష్ణ సంస్కారం అంటూ అప్పటి నాగార్జున వీడియోను, ఇప్పటి బాలకృష్ణ వీడియోను అక్కినేని ఫ్యాన్స్ షేర్ చేశారు. Difference between #MentalBalaKrishna and King @iamnagarjuna Nag gave huge respect towards late NTR garu on his death anniversary during #Bangarraju celebrations👏, on the other hand Ball insulted legendary #ANR on his death anniversary during VSR success meet 🤮🤮🤮 pic.twitter.com/zefa3eOrYR — Nag Mama Rocks 🤙🔥👑😎🌟🫶⛓️🇮🇳 (@SravanPk4) January 24, 2023 -
బాలకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందే.. అక్కినేని ఫ్యాన్స్
నందమూరి బాలకృష్ణపై అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. తన అభిమాన హీరో, గొప్ప నటుడు స్వర్గీయ నాగేశ్వరరావుని కించపరిచేలా ‘అక్కినేని తొక్కినేని’అని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. బాలయ్య వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం జరిగిన వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో బాలయ్య ఈ కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ విషయాలను ప్రస్తావిస్తూ.. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’. అని బాలకృష్ణ అన్నారు. (చదవండి: బాలకృష్ణ ‘అక్కినేని తొక్కినేని’ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్ ఫైర్) దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య వ్యాఖ్యలపై ఆల్ ఇండియా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వేశ్వరరావు మండిపడ్డారు. ‘బాలయ్య స్టేజ్‌పై ఏం మాట్లాడుతాడో కూడా తెలియదు. మహానటుల గురించి జోక్‌గా మాట్లాడుకోవడం చాలా పెద్ద తప్పు. ఏన్నాఆర్ నాకు బాబాయ్ లాంటివాడు అని చెప్పుకునే బాలకృష్ణ.. ఆయన వర్థంతి రోజు(జనవరి 22).. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ పెట్టుకోవడం ఏంటి? అభిమానం ఉంటే ఒక్క నిమిషం మౌనం పాటించాలి. నాగార్జున ఎప్పుడైనా నందమూరి హీరోల గురించి మాట్లాడారా? బతికున్నంత కాలం నటించిన గొప్ప వ్యక్తి నాగేశ్వరరావు. అలాంటి వ్యక్తిని కించపరచడం అంటే తెలుగు ఇండస్ట్రీని అవమానించినట్లే. బాలకృష్ణ వెంటనే అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలి’ అని సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు. కాగా, బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని మనవళ్లు హీరో నాగచైతన్య, నిఖిల్ స్పందించారు. ‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్ వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం’అని నాగచైతన్య, అఖిల్ ట్వీట్ చేశారు. -
బాలకృష్ణ ‘అక్కినేని తొక్కినేని’ వ్యాఖ్యలపై నాగచైతన్య, అఖిల్ ఫైర్
‘అక్కినేని తొక్కినేని’ అంటూ అక్కినేని నాగేశ్వరరావును కించపరుస్తూ నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై నాగేశ్వరరావు మనవళ్లు, హీరో నాగచైతన్య, అఖిల్ స్పందించారు. వారిని అగౌరపరచడం మనల్ని మనం కించపరుచుకోవడమేన్నారు. ‘నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం’అని నాగచైతన్య, అఖిల్ ట్వీట్ చేశారు. (చదవండి: రాజమౌళిని చంపేందుకు కుట్ర.. ఆర్జీవీ ట్వీట్ వైరల్) కాగా, వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్లో బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ టైమ్‌లో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో చెబుతూ.. ‘అందరూ అద్భుతంగా నటించారు. నాకు మంచి టైం పాస్. ఎప్పుడు కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం’ అని బాలకృష్ణ అన్నారు. ఇప్పుడు ఈ వాఖ్యలే వివాదాస్పదమవుతున్నాయి. దీనిపై అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. pic.twitter.com/NAuvMrQZtu — chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023 pic.twitter.com/0coiyzlkiD — Akhil Akkineni (@AkhilAkkineni8) January 24, 2023 -
ఒక శకం ముగిసింది
-
250 థియేటర్లో రీ రిలీజ్‌కు రెడీ అవుతున్న అక్కినేని ‘ప్రతిబింబాలు’
దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘ప్రతిబింబాలు’(1982) చిత్రం 40 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ హీరోయిన్గా నటించారు. విష్ణుప్రియ సినీకంబైన్స్ బేనర్‌పై సీనియర్ నిర్మాత జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 5న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. చదవండి: సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్‌గా హీరో పోస్ట్ ఈ సందర్భంగా జాగర్లమూడి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ప్రతిబింబాలు’ సినిమాని అనేక కారణాల వల్ల అప్పట్లో విడుదల చేయలేకపోయాను. కానీ, ప్రస్తుతం ఉన్న అధునాతన టెక్నాలజీని జోడించి, సరికొత్త హంగులతో రిలీజ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా గత సక్సెస్ఫుల్ చిత్రాల కోవలోనే ‘ప్రతిబింబాలు’ కూడా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘ప్రతిబింబాలు’ చిత్రాన్ని మా వాణి వెంకటరమణ సినిమాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా 250 థియేటర్లలో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు నిర్మాత కాకర్లమూడి రవీంద్ర కల్యాణ్. ఈ చిత్రానికి సమర్పణ: రాజేశ్వరన్ రాచర్ల, నిర్వహణ: జాగర్లమూడి సురేశ్ బాబు. -
ఎన్టీఆర్- ఏఎన్నార్ మధ్య విబేధాలు.. సీఎం చెప్పినా వినలేదట
ఎన్టీఆర్ - ఏఎన్నార్ తెలుగు సినిమాకి రెండు కళ్ల లాంటివారు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.పౌరాణిక పాత్రలకి ఎన్టీఆర్ చెరగనా ముద్ర వేసుకుంటేప్రేమకథా చిత్రాల్లో తనకెవరూ సాటిలేరని ఏఎన్ఆర్ నిరూపించుకున్నారు.ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది.అంతేకాకుండా పోటీపడి మరీ ఒకేసారి సినిమాలను రిలీజ్ చేయించుకునేవారు. కలెక్షన్ల విషయంలోనూ వీరు ఎన్నో రికార్డులు తిరగరాశారు. సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. కానీ ఎన్టీఆర్ - ఏఎన్నార్ మాత్రం 15 సినిమాల్లో కలిసి నటించారు. ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న వీళ్లిద్దరి మధ్య కూడా అప్పట్లో మనస్పర్థలు వచ్చాయి. ఓసారి తన సినిమాలో కృష్ణుడి వేషాన్ని వేయాల్సిందిగా ఏఎన్నార్‌ను ఎన్టీఆర్ కోరారట. దీనికి ఆ ఒక్కమాట మాత్రం అడగకండి మహానుభావా అంటూ ఏఎన్నార్ సున్నితంగా తిరస్కరించారట. అప్పటి సీఎం జలగం వెంగళరావుతోనూ ఎన్టీఆర్ రికమెండ్ చేయించినా ఏఎన్నార్ ఒప్పుకోలేదు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయని చెబుతుంటారు. దీంతో వీళ్లిద్దరు అప్పట్లో మల్టీస్టారర్ సినిమాలు చేయకూడదనే నిర్ణయానికి వచ్చారట. ఇక ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య అభిప్రాయబేధాలపై ప్రముఖ రచయిత సి నారాయణ రెడ్డి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమన్నారంటే.. ఎన్టీఆర్ గులేబకావళి అనే సినిమాకు పాటలు రాసే అవకాశం వచ్చింది. అయితే తన మొదటి సినిమా కావడంతో మొత్తం అన్ని పాటలకు రాసే అవకాశం ఇస్తేనే రాస్తాను అని కండీషన్ పెట్టాను. దీంతో ఎన్టీఆర్ ఒప్పుకొని మొత్తం 10 పాటలకు అవకాశం కల్పించారు. ఇదే క్రమంలో ఏఎన్నార్ హీరోగా 'ఇద్దరు మిత్రులు' సినిమాలో ఓ పాట రాసేందుకు అవకాశం వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ దిక్కుపాటి మధుసూదన్ రావు ఓసారి ఫోన్ చేసి అడగ్గా.. నేను సున్నితంగా తిరస్కరించాను. ఒకవేళ మీకు రాసిన మొదట విడుదలైతే, ఆ ప్రత్యేకత, క్రెడిట్ మీకే దక్కుతుంది. అప్పుడు నా మొదటి సినిమాకే మొత్తం పాటలు రాసే ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్‌కు ఆ క్రెడిట్ రాదు అని చెప్పి సున్నితంగా ఆ ఆఫర్‌ను తిరస్కరించాను. కానీ తర్వాతి రోజుల్లో ఎన్టీఆర్-ఏఎన్నార్‌కి మధ్య అభిప్రాయబేధాలు ఉన్న సమయంలోనూ ఇద్దరికీ పాటలు రాశాను' అంటూ చెప్పుకొచ్చారు. -
రీ-రిలీజ్‌కు ముస్తాబవుతున్న చిరు, పవన్ బ్లాక్‌బస్టర్ చిత్రాలు!
‘ఏదీ... కొంచెం ఫేస్ లెఫ్ట్‌కి టర్నింగ్ ఇచ్చుకో’ అంటూ ‘ఘరానా మొగుడు’లో చిరంజీవి, ‘ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుద్దో వాడే పండుగాడు’ అంటూ ‘పోకిరి’లో మహేశ్‌బాబు మాస్‌గా రెచ్చిపోతే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ చిత్రాలను మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద చూసే చాన్స్ రావడం ఫ్యాన్స్‌కి పండగే. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను ‘నేడే చూడండి.. మళ్లీ విడుదల’ అంటూ రీ రిలీజ్ చేసే కొత్త ట్రెండ్ వల్ల ఆ చాన్స్ దక్కుతోంది. ఇక ఆ విశేషాల్లోకి వెళదాం... మహేశ్‌బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘పోకిరి’ (2006) పలు రికార్డులు సాధించింది. సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని ఇటీవల మహేశ్‌బాబు బర్త్‌డే (ఆగస్ట్ 9) సందర్భంగా రిలీజ్ చేస్తే మళ్లీ రికార్డ్ సొంతం చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 200 థియేటర్లలో సింగిల్ షో రిలీజ్ చేస్తే.. టికెట్స్ భారీగా అమ్ముడుపోయాయి. థియేటర్లు కూడా పెంచాల్సిన పరిస్థితి. ఆ విధంగా ఈ చిత్రం రికార్డ్ సాధించింది. 4కె (ఆల్రెడీ ఉన్న పిక్సెల్స్ దాదాపు నాలుగు రెట్లు పెరుగుతాయి. వీడియో మరింత స్పష్టంగా కనబడుతుంది.. 4కె వల్ల మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి) హంగులతో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కరోనా లాక్డౌన్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు రావడంలేదనే పరిస్థితుల్లో ఈ సినిమాకి వచ్చిన ఆదరణ ఇండస్ట్రీకి బూస్ట్ అయింది. దాంతో పాటు ఇటీవల విడుదలైన స్ట్రయిట్ చిత్రాలు ‘బింబిసార, సీతారామం, కార్తికేయ 2, మాచర్ల నియోజకవర్గం’కి లభించిన ఆదరణ ఇండస్ట్రీకి నూతనోత్సాహాన్ని ఇచ్చింది. రానున్న రోజుల్లో పలు స్ట్రయిట్ చిత్రాలు రిలీజ్‌కి రెడీ అవుతుండగా.. ‘పోకిరి’లా కొత్త హంగులతో మళ్లీ రిలీజ్ కాబోయే చిత్రాలు కొన్ని రెడీ అవుతున్నాయని తెలిసింది. వాటిలో ముందు వరుసలో ‘ఘరానా మొగుడు’ ఉంది. చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ‘ఘరానా మొగుడు’ (1992) సూపర్ డూపర్ హిట్. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని కొత్త హంగులతో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ‘బంగారు కోడి పెట్ట..’ అంటూ చిరు వేసిన మాస్ స్టెప్పులు మళ్లీ చూసే చాన్స్ వస్తే... అభిమానులకు ఆనందమే కదా. ఈ నెలలోనే నాగార్జున పుట్టినరోజు (ఆగస్ట్ 29) కూడా. నాగార్జున నటించిన చిత్రాల్లో ఒక ట్రెండ్ సెట్టర్ అయిన ‘శివ’ (1989)ను కూడా 4కె వెర్షన్‌కి మార్చి మళ్లీ రిలీజ్ చేయాలనుకుంటున్నారని సమాచారం. సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ సైకిల్ చైన్ సందడిని చూడొచ్చన్న మాట. ఇవే కాదు.. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘జల్సా’ కూడా రీ రిలీజ్ కానుందట. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జల్సా’ (2008). సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ బర్త్ డేకి ఈ చిత్రం రిలీజ్ కానుందని టాక్. ఇంకా ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలు మళ్లీ విడుదలయ్యే అవకాశం ఉంది. రంగుల బజార్ తెలుగు చలన చిత్ర చరిత్రలో ‘మాయాబజార్’ (1957) ఎవర్ గ్రీన్. ఒకరితో మరొకరు పోటీపడ్డారా అన్నట్లు ఎన్టీఆర్, ఏయన్నార్, సావిత్రి, ఎస్వీ రంగారావు తదితర తారల అద్భుత నటనతో కేవీ రెడ్డి దర్శకత్వంలో ఈ బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్‌ని నాగిరెడ్డి, చక్రపాణి నిర్మించారు. భావితరాలకు ఈ చిత్రాన్ని చూపించాలనే ఆకాంక్షతో రంగులద్ది ఈ దృశ్యకావ్యాన్ని గోల్డ్‌స్టోన్ సంస్థ 2010లో విడుదల చేసింది. సో.. రీ రిలీజ్ అనేది పన్నెండేళ్ల క్రితమే ఉంది. రిలీజ్‌కి రెడీ అవుతున్న ఏయన్నార్ ‘ప్రతిబింబాలు’ దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘ప్రతిబింబాలు’ చిత్రం 40 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయసుధ హీరోయిన్గా నటించారు. జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు. 1982లో రూపొందిన ఈ చిత్రాన్ని ఏయన్నార్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా జాగర్లమూడి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘‘వియ్యాలవారి కయ్యాలు, ఒక దీపం వెలిగింది, శ్రీ వినాయక విజయం, కోడళ్లొస్తున్నారు జాగ్రత్త, కోరుకున్న మొగుడు’ వంటి సినిమాలను నిర్మించాను. అయితే ఏయన్నార్‌గారితో నిర్మించిన ‘ప్రతిబింబాలు’ సినిమాని కొన్ని దుష్పరిణామాల వల్ల విడుదల చేయలేకపోయాను. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని మిళితం చేసి, సరికొత్త హంగులతో విడుదల చేస్తున్నాను. నా సక్సెస్ఫుల్ చిత్రాల కోవలోనే ‘ప్రతిబింబాలు’ కూడా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
కేన్సర్‌తో బెడ్ మీద నుంచే ఏఎన్నార్ డబ్బింగ్.. అక్కినేని అమల ఎమోషనల్
సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్: ‘మా మామ గారు అక్కినేని నాగేశ్వర్రావు చివరి వరకూ శ్రమిస్తూనే ఉన్నారు. కేన్సర్‌తో బాధపడుతూనే ‘మనం’ సినిమాకు పనిచేశారు. చివరి దశలో హాస్పిటల్ బెడ్పైనుంచే ఆ సినిమాకు డబ్బింగ్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి ఆశీర్వాదంతో తాను ఇంత అద్భుతమైన జీవితాన్ని గడిపానని, మీరు విచారించాల్సిన అవసరం లేదని ఆయన మా అందరికీ చెప్పేవారు’ అని మామయ్య అక్కినేని నాగేశ్వరరావును గుర్తు చేసుకుంటూ అక్కినేని అమల ఎమోషనల్ అయ్యారు. కేన్సర్ వ్యాధిపై అవగాహన పెంచేందుకు గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న అంతర్జాతీయ కేన్సర్ అవగాహన పరుగు పోస్టర్‌ను శనివారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ.. మనం మనల్ని తగినంతగా ప్రేమించుకోకపోవడం, పర్యావరణాన్ని ప్రేమించకపోవడం.. అన్నింటినీ నిర్లక్ష్యం చేయడమే కేన్సర్ విజృంభణకు కారణాలన్నారు. కలుపు మందులు, పురుగుమందులు చాలా వరకు కేన్సర్‌కు కారణమవుతాయని తెలిసినా వాటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కేన్సర్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. గ్రేస్ ఫౌండేషన్, వ్యవస్థాపకుడు సీఈఓ డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి, మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఫౌండేషన్ వ్యవస్థాపక ట్రస్టీ డాక్టర్ ప్రమీలారాణి, గ్లోబల్ రేస్ డెరైక్టర్ నిరంజన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
దేనికీ పనికిరానన్నారు, ఆ ప్రమాదంలో తీవ్రగాయాలు: నటుడు
'సీతారాముల కల్యాణం' సినిమాతో నటుడిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు వెంకట్. ఈ సినిమా మంచి హిట్ సాధించినప్పటికీ అతడికి గుర్తింపు వచ్చింది మాత్రం 'అన్నయ్య' మూవీతో! ఈ చిత్రంలో చిరంజీవి తమ్ముడిగా నటించాడు వెంకట్. ఇందులో మెగాస్టార్ అతడిని జెమ్స్ అని పిలుస్తుంటాడు. దీంతో చాలామంది ఇప్పటికీ వెంకట్‌ను జెమ్స్ అనే పిలుచుకుంటారు. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నాడీ యాక్టర్. తాజాగా అతడు ఓ టీవీ షోకు హాజరై వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించాడు. చదువు మీద ధ్యాస లేదన్న వెంకట్ మోడలింగ్ నుంచి ఇండస్ట్రీకి వచ్చానని తెలిపాడు. ఒక డ్యాన్స్ మాస్టర్ అందరిముందు తనను అవమానించాడని, తాను దేనికీ పనికిరానని, ఎక్కడినుంచి పట్టుకొచ్చారని విసుగు ప్రదర్శించాడని వెల్లడించాడు. ఒకసారైతే ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చెంప చెల్లుమనిపించాడని చెప్పుకొచ్చాడు. ఆ ఐదుగురు సినిమా షూటింగ్ సమయంలో పెద్ద ప్రమాదం జరిగిందని తెలిపాడు వెంకట్. రాడ్ల మీద ఎక్కి పైకి దూకాల్సిన సీన్ ముందుకు దూకబోయి వెనక్కు పడ్డట్లు తెలిపాడు. ఆ ప్రమాదంలో పెద్ద గాయాలే అయ్యాయన్న ఆయన మూడు నెలలపాటు ఆస్పత్రి బెడ్‌కే పరిమితమైనట్లు పేర్కొన్నాడు. ఈ యాక్సిడెంట్ వల్ల చాలా సినిమాలు మిస్ అయ్యాయని చెప్తూ బాధపడ్డాడు. -
Telugu Movie: 50 ఏళ్ల ‘ప్రేమనగర్’
కొన్ని కథలు భాషల హద్దులు చెరిపేసి, వెళ్ళిన ప్రతిచోటా బాక్సాఫీస్ చరిత్ర సృష్టిస్తాయి. అవి ప్రేమకథలైనప్పుడు, సంగీతం, సాహిత్యం, అభినయం, అలుపెరుగని నిర్మాణం లాంటివి తోడైనప్పుడు తరాలు మారినా చిరస్మరణీయం అవుతాయి. అలాంటి ఓ అజరామర ప్రేమకథ – తెలుగు, తమిళ, హిందీ మూడింటిలో హిట్ రూపం – ‘ప్రేమనగర్’. ఒకదశలో ‘ద్రోహి’ (1970) లాంటి ఫ్లాప్ తర్వాత, రూ. 12 లక్షల నష్టంతో, మరొక్క దెబ్బతింటే సినిమాలొదిలి, సేద్యంలోకి వెళ్ళిపోవాలనుకున్న నిర్మాత డి. రామానాయుడునీ, ఆయన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థనూ ఇన్నేళ్ళు సుస్థిరంగా నిలిపిన చిత్రం అది. కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వం, అక్కినేని – వాణిశ్రీ అపూర్వ అభినయం, ఆత్రేయ మాటలు – పాటలు, మహదేవన్ సంగీతం – ఇలా అన్నీ కలసి తెలుగు ‘ప్రేమనగర్’ను తీపిగుర్తుగా మార్చాయి. ప్రణయజీవుల ఊహానివాసం ‘ప్రేమనగర్’ (1971 సెప్టెంబర్ 24) రిలీజై, నేటికి 50 ఏళ్ళు. ఒకరు కొంటే, వేరొకరు తీశారు! ‘ప్రేమనగర్’ నిర్మాణమే ఓ విచిత్రం. అది తీయాలనుకున్నది మొదట రామానాయుడు కాదు. ‘ఆంధ్రప్రభ’ వీక్లీ సీరియల్‌గా హిట్టయిన కౌసల్యాదేవి నవల హక్కులు కొన్నది నిజామాబాద్‌కు చెందిన శ్రీధర్‌రెడ్డి. అక్కినేనితో తీయడానికి పాలగుమ్మి పద్మరాజు, చంగయ్య లాంటి ప్రసిద్ధులు స్క్రిప్ట్ సిద్ధం చేశారు. కె.ఆర్. విజయ హీరోయిన్. సిన్మా తీద్దామనుకున్న సమయంలో అనుకోని దుర్ఘటనలతో శ్రీధర్‌రెడ్డికి సెంటిమెంట్ పట్టుకుంది. ప్రాజెక్ట్ అటకెక్కింది. అప్పుడే అక్కినేని ‘దసరాబుల్లోడు’ రిలీజై, కలెక్షన్ల వర్షంతో హోరెత్తిస్తోంది. ఆయనతో సినిమా తీయాలనుకొన్న రామానాయుడికి ఈ స్క్రిప్టు విషయం తెలిసింది. రూ. 60 వేలకు కొని, హిట్ హీరోయిన్ వాణిశ్రీ జోడీగా ‘ప్రేమనగర్’ ప్రారంభించారు. ఆపైన అనేక నవలా చిత్రాలు తీసిన సురేష్ సంస్థకూ, రామానాయుడుకూ ఇదే తొలి నవలా ప్రయత్నం. దర్శకుడు ప్రకాశరావు, రచయిత ఆత్రేయ కృషితో నవలలో లేని అనేక అంశాలతో సెకండాఫ్ స్క్రిప్ట్ అంతా కొత్తగా తయారైంది. ఆ రోజుల్లోనే కామెడీ ట్రాక్ ప్రత్యేకంగా అప్పలాచార్యతో రాయించారు. అప్పట్లో ‘దసరాబుల్లోడు’ రూ. 14 లక్షల్లో తీస్తే, అంతకన్నా ఎక్కువగా రూ. 15 లక్షల్లో కలర్లో తీయాలని సిద్ధపడ్డారు రామానాయుడు. వాహినీ స్టూడియోలో 1971 జనవరి 22న మొదలైన ‘ప్రేమనగర్’ కోసం కళా దర్శకుడు కృష్ణారావు వేసిన హీరో జమీందార్ ఇల్లు, ప్రేమనగర ఫుల్ఫ్లోర్ సెట్ సంచలనం. అది... ఆ ఇద్దరి అపూర్వ ట్రేడ్‌మార్క్ ఇలాంటి ప్రేమకథలు, విషాదదృశ్యాల అభినయాలు అక్కినేనికి కొట్టినపిండి. ‘దేవదాసు’ నుంచి ‘ప్రేమాభిషేకం’ దాకా తెరపై ఆ ఇమేజ్, ఆ గెటప్ ఆయనకే సొంతం. అయితే, ‘దసరాబుల్లోడు’, ఆ వెంటనే ‘ప్రేమనగర్’తో నటిగా వాణిశ్రీ ఇమేజ్ తారస్థాయికి చేరింది. ఇందులో ఆత్మాభిమానం గల నాయిక లత పాత్రలో ఆమె అభినయం అపూర్వం. కథానాయకుడి మొదలు కథంతా ఆ పాత్ర చుట్టూరానే తిరిగే ఈ చిత్రం ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్. ఆ తరువాత అనేక చిత్రాల్లో ఆత్మాభిమానం గల పాత్రలకు వాణిశ్రీయే ట్రేడ్‌మార్క్. ఇక, తలకొప్పు, మోచేతుల దాకా జాకెట్టు, ఆభరణాలు, అందమైన చీరలతో అప్పట్లో ఆమె ఫ్యాషన్ ఐకాన్ అయిపోయారు. అక్కడ నుంచి తెరపై ఆమె చూపిన విభిన్న రకాల స్టయిల్స్ తెలుగు స్త్రీ సమాజాన్ని ప్రభావితం చేయడం ఓ చరిత్ర. రిపీట్ రన్ల... బాక్సాఫీస్ నగర్! ‘ప్రేమనగర్’ రిలీజైన వెంటనే తొలి రెండు వారాలూ తెలుగునాట భారీ వర్షాలు. రామానాయుడికి కంగారు. ఆ రెండు వారాల అవరోధాలనూ అధిగమించి, సినిమా బాగా పికప్ అయింది. వసూళ్ళ వర్షం కురిపించింది. ‘దసరాబుల్లోడు’, వెంటనే ‘ప్రేమనగర్’ బంపర్ హిట్లతో 1971 అక్కినేనికి లక్కీ ఇయరైంది. అప్పట్లో 34 సెంటర్లలో రిలీజైన ఈ చిత్రం 31 కేంద్రాల్లో 50 రోజులాడింది. 13 కేంద్రాల్లో వంద రోజులు, షిఫ్టులతో హైదరాబాద్‌లో సిల్వర్ జూబ్లీ చేసుకుంది. అర్ధశతదినోత్సవం నాటికి అంతకు ముందు వసూళ్ళ రికారై్డన ‘దసరాబుల్లోడు’ను ‘ప్రేమనగర్’ దాటేసి, రూ. 33 లక్షల గ్రాస్‌తో కొత్త ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది. అప్పటి నుంచి ‘ప్రేమనగర్’ ఎప్పుడు రిలీజైనా వసూళ్ళ వానే. అక్కినేని చిత్రాల్లోకెల్లా రిపీట్ రన్ల పరంగా నంబర్ 1 చిత్రమైంది. హార్ట్ ఆపరేషన్ తర్వాత అక్కినేని రెస్ట్ తీసుకున్న 1975లో ‘ప్రేమనగర్’ రిపీట్‌లో 50 రోజులు ఆడడం విశేషం. మూడు భాషలు... ముగ్గురు స్టార్లు... ‘ప్రేమనగర్’ కథను తెలుగు తర్వాత తమిళ, హిందీల్లోనూ దర్శకుడు ప్రకాశరావుతోనే తీశారు. తమిళ ‘వసంత మాళిగై’లో శివాజీగణేశన్ – వాణిశ్రీ జంట. హిందీ ‘ప్రేమ్‌నగర్’లో రాజేశ్‌ఖన్నా– హేమమాలిని జోడీ. మూడూ పెద్ద హిట్. అన్నిటికీ రామానాయుడే నిర్మాత. ‘విజయా’ నాగిరెడ్డి కుటుంబం ఈ 3 చిత్రాల నిర్మాణంలో భాగస్థులు. ఇప్పటికీ ఈ చిత్ర రైట్స్ తాలూకు రాయల్టీ ఆ కుటుంబాలకు అందుతుండడం ఈ సినిమా సత్తా. అన్నిటికీ పబ్లిసిటీ డిజైనర్ ఇటీవల కన్నుమూసిన ప్రసిద్ధ డిజైనర్ ఈశ్వరే. ఈ చిత్రం ఆయన కెరీర్‌ను మరో మెట్టెక్కించింది. అంతకు ముందు ‘రాముడు – భీముడు’, తమిళంలో ‘ఎంగవీట్టు పిళ్ళై’, హిందీలో ‘రామ్ ఔర్ శ్యామ్’గా 3 భాషల్లో హిట్. ఆ తరువాత ‘ప్రేమనగర్’ మూడు భాషల్లో హిట్. అక్కడ ఎన్టీఆర్, ఎమ్జీఆర్, దిలీప్ కుమార్. ఇక్కడ ఏయన్నార్, శివాజీ, రాజేశ్‌ఖన్నా. అదీ లెక్క. శివాజీ చిత్రాల్లో ‘వసంత మాళిగై’ డైరెక్ట్ 40 వారాలాడిన కెరీర్ బెస్ట్ హిట్. ఎనిమిదిన్నరేళ్ళ క్రితం ఆ తమిళ చిత్రాన్ని డిజిటల్‌గా పూర్తిగా పునరుద్ధరించి, స్కోప్‌లో 2013 మార్చి 8న రీరిలీజ్ చేస్తే, అప్పుడూ హిట్టే. మారిన పాటలు! మారని క్లైమాక్స్! ‘ప్రేమనగర్’లో ఆత్రేయ మాటలు, పాటలు జనం నోట నిలిచాయి. ‘కడవెత్తుకొచ్చిందీ..’, ‘నేను పుట్టాను..’ లాంటి మాస్ పాటలు, ‘తేటతేట తెలుగు’, ‘నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం..’ లాంటి క్లాస్ పాటలు ఇవాళ్టికీ మర్చిపోలేం. ‘తేటతేట తెలుగులా..’ పాట తెలుగులోనే ఉంది. తమిళ, హిందీ వెర్షన్లలో అలాంటి పాటే లేకుండా, సీన్‌తో వదిలేశారు. అలాగే, తెలుగులో క్లైమాక్స్‌లో హీరో విషం తాగి, ‘ఎవరి కోసం’ అంటూ పాట పాడడం విమర్శకు తావిచ్చింది. దాంతో తమిళ, హిందీల్లో జాగ్రత్తపడి, పాట పాడాక, విషం తాగేలా మార్చారు. తెలుగులో సుఖాంతం, విషాదాంతం 2 క్లైమాక్సులూ తీశారు. సుఖాంతంగా రిలీజ్ చేశారు. జనానికి నచ్చకపోతే ఉంటుందని ముందుజాగ్రత్తగా రెండో క్లైమాక్స్ రీలూ అందరికీ పంపారు. సుఖాంతానికి జై కొట్టడంతో, రీలు మార్చే పని రాలేదు. లవ్‌స్టోరీలకు ఇది సెంటిమెంట్ డేట్! ‘ప్రేమనగర్’ బాక్సాఫీస్ హిట్‌తో ఆ రిలీజ్ డేట్ సెంటిమెంట్ అయిపోయింది. సరిగ్గా పదేళ్ళకు 1981లో దాసరి దర్శకత్వంలో అక్కినేనితోనే రూపొందిన దేవదాసీ ప్రేమకథ ‘ప్రేమమందిరం’ చిత్రాన్నీ సెప్టెంబర్ 24నే రామానాయుడు రిలీజ్ చేశారు. మరుసటేడు దాసరి సొంతంగా, అక్కినేనితో నిర్మించిన ప్రేమకావ్యం ‘మేఘసందేశం’ రిలీజ్ డేటూ అదే. తాజాగా ఇప్పుడు అక్కినేని మనుమడు నాగచైతన్య లేటెస్ట్ ‘లవ్‌స్టోరీ’ ఇదే డేట్‌కి రిలీజ్ చేయడం విశేషం. – రెంటాల జయదేవ -
నాన్న ఫేవరెట్ పంచె, వాచ్ : నాగ్ భావోద్వేగ పోస్ట్
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సినీ వినీలాకాశంలో ధృవతారలా వెలిగిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. యావత్ప్రపంచం గర్వపడేలా అగ్రకథానాయకుడిగా విరాజిల్లిన కళామతల్లి ముద్దుబిడ్డ ఏఎన్ఆర్. దేవదాసు అయినా, కాళిదాసు అయినా, అమర ప్రేమికుడైనా ఆయనొక లెజెండ్. అందుకే అనేక అవార్డులు ఆయనకు సలాం చేశాయి. 75 వసంతాలకు పైగా వెండి తెరను సుపంపన్నం చేసిన ఎఎన్ఆర్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన నటవారడు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తన తండ్రికి ట్విటర్ ద్వారానివాళులర్పించారు. ఆయనే తన హీరో, స్పూర్తి అంటూ ఒక వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. ఆయనకు పంచె అంటే ఎంతో ఇష్టమని, ముఖ్యంగా పొందూరు ఖద్దరుఅంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఆయన పంచె కట్టు అందాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకే అంటూ తన అప్‌కమింగ్ మూవీ బంగార్రాజు లుక్‌ను జోడించారు. కాగా నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్గా 'బంగార్రాజు' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాలో నాగార్జునతో పాటు యంగ్ హీరో నాగ చైతన్య కూడా అలరించనున్నారు. నాగ్‌కు జోడీగా రమ్యకృష్ణ, నాగ చైతన్య సరసన ఉప్పెన ఫేం బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది Remembering dear Nana! My hero!! My inspiration!! #ANRLivesOn pic.twitter.com/CgHKCLwObY — Nagarjuna Akkineni (@iamnagarjuna) September 20, 2021 -
సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పటి స్టార్ హీరో తెలుసా!
సినిమాల్లో బాల నటులుగా నటించిన వారు కొంతమంది పెద్దాయ్యాక ఇతర రంగాల్లో రాణిస్తుండగా.. మరికొందరూ సినిమాల్లో స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇప్పటి మన స్టార్స్ ఒకప్పుడు సినిమాల్లో బాల నటులుగా నటించిన వారే. ఊయలలో ఉన్నప్పుడే వారు వెండితెర ఎంట్రీ ఇచ్చారు. కాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తండ్రి కృష్ణ సినిమాలతో బాలనటుడిగా తెరంగేట్రం చేశాడు. జూనియర్ ఎన్టీఆర్, మంచు విష్ణు, మనోజ్‌లు కూడా బాల నటులుగా కనిపించిన విషయం తెలిసిందే. అయితే బ్లాక్ అండ్ వైట్ కాలంలో నటించిన మన స్టార్ హీరోలు చైల్డ్ అర్టిస్టులుగా నటించిన విషయం తెలుసా?.. వారుల ఎలా ఉంటారో చూశారా?. (చదవండి: మీరే నా బలం, నా జీవితం: మెగా బ్రదర్) కాగా అప్పటి లెజెండరీ నటుడి తనయుడు చైల్డ్ అర్టిస్టుగా నటించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన ఎవరో గుర్తుపట్టలేక చాలా మంది బుర్రకు పని చెబుతున్నారు. మహానటి సావిత్రి ఎత్తుకుని ముద్దాడుతున్న ఆ చిన్నారి ఇప్పటి స్టార్ ఎవరో గుర్తుపట్టలేక నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. అయితే ఈ బుడ్డోడు ఓ లెజెండరి నటుడు తనయుడు.. తెలుగు ప్రముఖ హీరోల్లో ఒకడు.. అంతేకాదు ఆయన తనయులు కూడా ఇప్పుడు టాలీవుడ్లో హీరోలుగా రాణిస్తున్నారు. ఇప్పుడైన సావిత్రి చేతిలో ఉన్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తు పట్టారా... లేదా.. అయితే ఎవరో తెలుసుకుందా రండి!. (చదవండి: ‘పుష్ప’ కోసం బన్ని డెడికేషన్, మేకప్‌కు అంత సమయమా..!) అయితే అప్పట్లో టాలీవుడ్‌ను ఏలిన కథానాయకులు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరావుల కుమారులు చిన్నతనంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినిమాల్లో చైల్డ్ అర్టిస్టులుగా హరికృష్ణ, బాలకృష్ణలు నటిస్తుండగా, నాగేశ్వరావు సినిమాల్లో ఆయన తనయుడు నాగార్జున బాలనటుడిగా రెండు సినిమాలు చేశాడు. అందులో నాగేశ్వరావు, సావిత్రిలు జంటగా నటించిన వెలుగు-నీడలు చిత్రంలో నాగ్ చైల్డ్ అర్టిస్టుగా కనిపించాడు. ఈ మూవీ సమయంలో నాగార్జున 8 నెలల పసిపాపగా ఉన్నాడు. అనంతరం ‘సుడిగుండాలు’ సినిమాలో కూడా నాగార్జున బాలనటుడిగా నటించిన సంగతి తెలిసిందే. మరీ ఇప్పడు మీకు క్లారిటీ వచ్చిందనుకుంటా. అప్పటి నటశిరోమణి చేతిలో తెరపై ఆడుకున్న ఈ బుడ్డోడే ఇప్పటి మన ‘కింగ్’ నాగార్జున. (చదవండి: Meera Jasmine Now: మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుంది?) -
ఎంతోమంది ఆప్తుల్ని ఇచ్చారు...
మా నాన్నగారండీ.. ఆయనకి ఇద్దరు భార్యలండీ.. నేను మొదటి భార్య కొడుకునండీ ... అంటూ శంకరాభరణంలో అల్లురామలింగయ్య దగ్గరకు న్యాయం కోసం వచ్చారు.. శ్రీవారికి ప్రేమలేఖలో మరచెంబు పాత్రలో చతుర్ముఖ పారాయణం ఆడారు... చిన్న చిన్న పాత్రలే వేసినా, తెలుగువారి హృదయాల మీద హాస్య పన్నీరు జల్లారు. నాన్నకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ అంటున్నారు వాడ్రేవు విశ్వనాథమ్ ఉరఫ్ థమ్ కుమార్తె శ్రీకాంతి. నాన్న తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పుట్టారు. తాతగారు వాడ్రేవు చలమయ్య, బామ్మ లక్ష్మీకాంతమ్మ. వారికి నాన్న ఎనిమిదో సంతానం. ఇద్దరు అక్కలు, ముగ్గురు అన్నయ్యలు, ఇద్దరు తమ్ముళ్లు. ‘తాతగారి పేరు, మార్కెట్‌కి ఎదురుగా ఉన్న వాడ్రేవు బిల్డింగ్, పిఠాపురం’ అని అడ్రస్ రాస్తే చాలు పోస్టు వెళ్లిపోతుంది. తాతగారు డ్రాయింగ్ మాస్టారుగా పనిచేసేవారు. మా పెద్దనాన్నగారే ఇంటి పెద్దగా అందరి బాగోగులు చూసుకున్నారు. నాన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమా ఇన్ యాక్టింగ్ చేశారు. ఆదిరాజు ఆనంద్‌మోహన్ మా అమ్మకి బాబాయ్. ఆయన ‘పెళ్లి కాని పెళ్లి’ అనే సినిమా తీశారు. అందులో నాన్న చిన్న వేషం వేశారు. అలా మా బాబాయ్ ద్వారా అమ్మకి నాన్నతో పెళ్లి సంబంధం కుదిరి, వివాహం జరిగింది. నాన్నగారికి ఆడవాళ్లంటే చాలా గౌరవం. అమ్మని ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. నేను పుట్టినప్పుడు ‘మా అమ్మే మళ్లీ పుట్టింది’ అని ఎంతో సంతోషంగా అందరికీ స్వీట్స్ పంచారుట. మా అన్నయ్య కొంచెం అమాయకంగా ఉంటాడని వాడిని ఎప్పుడూ కోప్పడేవారు కాదు. నాటకాలలో పరిచయం... నాన్నకి నాటకాలంటే ప్రాణం. నాటకాల ద్వారానే సాక్షి రంగారావు గారు, పొట్టి ప్రసాద్ గార్లతో పరిచయం ఏర్పడింది. సాక్షి రంగారావు గారిని నాన్న ‘మా రంగడు’ అనేవారు. పొట్టిప్రసాద్ గారు తనకు గురువుతో సమానమని చెప్పేవారు. సాక్షి రంగారావు గారిని పెద్దనాన్న అని, పొట్టి ప్రసాద్ గారిని మావయ్య అని పిలిచేవాళ్లం. రాళ్లపల్లి గారు మాకు దేవుడు ఇచ్చిన మావయ్యే. అన్న, అక్క అంటే మాకు వాళ్ల పిల్లలే. రాళ్లపల్లి మావయ్య వాళ్ల అమ్మాయి బయటికి వెళితే నన్ను తనతో తీసుకుని వెళ్లేది. సీతారామశాస్త్రి గారు, దివాకర్‌బాబు గారు.. అందరం చెన్నైలోని సాలిగ్రామంలోనే దగ్గరదగ్గరగా ఉండేవాళ్లం. ఇప్పటికీ అందరితో టచ్‌లో ఉన్నాం. మా నాన్న మాకు ఇచ్చి వెళ్లిన బెస్ట్ గిఫ్ట్ ఈ కుటుంబాలే. చదివితే చాకొలేట్లు... నాన్న షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా మా చదువు విషయంలో ఎన్నడూ అశ్రద్ధ చేయలేదు. సెలవుల్లో కూడా చదువుకోవాలనేవారు. ఆయన సూట్‌కేస్‌లో థ్రెప్టిన్ బిస్కెట్ల డబ్బా, క్యాడ్బరీ చాకొలేట్ బాక్స్ ఉండేవి. రోజూ నాన్న బయటకు నుంచి ఇంటికి రాగానే మేం ఆయన వెనకాల నిలబడేవాళ్లం. మేము చదువుకున్నామని చెప్పాక ఇద్దరికీ రెండు బిస్కెట్లు, రెండు చాకొలేట్లు ఇచ్చేవారు. చదవకపోతే నో ట్రీట్. రెండో క్లాసు చదువుతున్నప్పుడు... ఒకరోజున ఇంటి దగ్గర టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతోంది. అందులో చిన్న సీన్లో నేను, అన్నయ్య ఇద్దరం నటించాం. టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు అన్నయ్య సీన్ వచ్చింది, నా సీన్ ఎడిట్ అయిపోయింది. నేను ఏడ్చాను. అప్పుడు నాన్న, ‘ఆడపిల్ల ఏడవకూడదు. నేను రాకపోతేనేం... అన్నయ్య టీవీలో కనిపించాడు కదా... అని నువ్వు సంతోషంగా ఉండాలి తల్లీ’ అని బుజ్జగించారు. చాలా సైలెంట్‌గా ఉండేవారు... సినిమాలలో హాస్య పాత్రలు వేసేవారు కానీ, ఇంటి దగ్గర చాలా సైలెంట్. ఎక్కువ మాట్లాడేవారు కాదు. నాన్న ఇంట్లో ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ఉండేవాళ్లం. ఆయన బయటకు వెళ్లగానే కిటికీలోంచి తొంగి చూసేవాళ్లం. నాన్న గేట్ దాటాక, మేం గేటు దాకా వచ్చి, బస్‌స్టాప్‌లో ఉన్నారా, వెళ్లిపోయారా అని చూసి, ఆయన వెళ్లిపోయారని నిర్ధారించుకుని వెంటనే ఆడుకోవటానికి పారిపోయేవాళ్లం. ఒకసారి టీనగర్లో మా తాతగారి ఇంటికి వెళ్లాం. అక్కడ ఉండిపోతానని పేచీ పెట్టటంతో నన్ను అక్కడ ఉంచి వెళ్లిపోయారు నాన్న. అమ్మ సాయంత్రం వరకు ఉండి, ఆ తరవాత ఇంటికి వెళ్లిపోయింది. అమ్మ వెళ్లిన కాసేపటికే బెంగ వచ్చి ఏడుపు మొదలుపెట్టాను. అప్పటికి నాన్న ఏదో పని మీద ఇంకా టీ నగర్లోనే ఉన్నారు. తాతగారు నాన్నకి ఫోన్ చేసి, విషయం చెప్పటంతో, నాన్న వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. నాన్న దగ్గర అంత చేరిక నాకు. నేను పదో తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినప్పుడు వాచ్ ఇచ్చారు. నాన్నగారు ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమో ఇన్ యాక్టింగ్ చేశారని నేను కూడా నా ఎంబిఏ అక్కడ నుంచే చేశాను. ఏయన్నార్‌కి కోపం వచ్చింది... మా చిన్నప్పటి కంటె, మేం కొంచెం పెద్దవాళ్లం అయ్యాకే నాన్నతో గడిపే అవకాశం వచ్చింది. అప్పటికి సినిమా షూటింగ్స్ తగ్గి, సీరియల్స్‌లో మాత్రం వేస్తుండేవారు. ఎక్కువసేపు ఇంట్లో ఉండటం వల్ల, మాతో క్యారమ్బోర్డు అడేవారు. అప్పుడప్పుడు ఏవైనా సినిమా కబుర్లు చెప్పేవారు. నాన్నకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు గారితో... రాళ్లపల్లి ఏ క్లాస్ ఆర్టిస్ట్, నేను బి క్లాస్ ఆర్టిస్ట్, మీరు సి క్లాస్ ఆర్టిస్ట్ అన్నారట. అక్కినేని గారికి కొంచెం కోపం వచ్చిందట. అప్పుడు నాన్న.. అపార్థం చేసుకోకండి. రాళ్లపల్లిగారు ఆటోలో తిరుగుతున్నారు కాబట్టి ఆయన ఏ గ్రేడ్ ఆర్టిస్ట్, నేను బస్సుల్లో తిరుగుతున్నాను కాబట్టి బి గ్రేడ్ ఆర్టిస్ట్, మీరు కారులో తిరుగుతున్నారు కాబట్టి సి గ్రేడ్ ఆర్టిస్ట్ అన్నారట. ఏయన్నార్‌గారు ఫక్కుమని నవ్వారుట. ఎన్టీఆర్ సహాయం చేశారు... ఎన్టీఆర్‌లో ఉన్న ఒక గొప్ప గుణం గురించి చెప్పారు నాన్న. ఆయనకి చిన్న చిన్న కళాకారులు కూడా గుర్తు ఉంటారట. ఏదైనా సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటే, దానికి ఏ ఆర్టిస్టు కరెక్ట్ అని ఆలోచించి, ఆ ఆర్టిస్టు ఎక్కడున్నా కబురు పంపేవారట. వారు కష్టాల్లో ఉంటే కూడా ఎన్టీఆర్ గుర్తుపెట్టుకుంటారనటానికి పొట్టి ప్రసాద్‌గారికి చేసిన సహాయమే పెద్ద నిదర్శనం. పొట్టిప్రసాద్ మావయ్యకు ఆరోగ్యం బాగా లేనప్పుడు, హీరో బాలకృష్ణ గారితో ఒక బుట్ట నిండా పళ్లు పంపారు రామారావు గారు. బాలకృష్ణ గారిని దగ్గరుండి ఆసుపత్రికికి నేనే తీసుకువెళ్లాను. అప్పుడు నాలుగో క్లాసు చదువుతున్నాను. బాలకృష్ణ గారు ఎంతో ఆప్యాయంగా పలకరించి వెళ్లారు. ఎన్టీఆర్ గురించి నాన్న చెప్పిన మాటలు అప్పుడు నాకు బాగా గుర్తు వచ్చాయి. ఇద్దరికీ ఒకటే పేరు పెట్టారు నాన్న పూర్తి పేరు వాడ్రేవు కాశీవిశ్వనాథం. తన పేరులోని ఆఖరి అక్షరాలు తీసుకుని థమ్ అని పేరు పెట్టుకున్నారు. పేరు కూడా కామెడీగా ఉండాలని ఆయన ఆలోచన. తమిళంలో అలనాటి హాస్య నటుడు నగేశ్ అంటే ఇష్టం. అందుకే ఆయనలాగే సన్నగా ఉండేవారేమో అనుకుంటాం. అమ్మ పేరు లలిత. బి.ఎస్.సి. బిఈడీ చదివి, సైన్స్ టీచర్‌గా పనిచేసి, పెళ్లయ్యాక మానేసింది. ఇంటి బాధ్యతలు పూర్తిగా అమ్మే చూసుకుంది. వాళ్లకి మేం ఇద్దరం పిల్లలం. అమ్మమ్మ పేరు, బామ్మ పేరు ఇద్దరి పేరు ఒకటే.. లక్ష్మీ కాంతమ్మ. అందుకని నాకు శ్రీకాంతి అని, అన్నయ్యకు శ్రీకాంత్ అని పేర్లు పెట్టారు. ఇద్దరికీ ఒక్క చిన్న అక్షరం తేడా అంతే. కళ్లనీళ్లు పెట్టుకున్నారు.. నాన్నగారు ఏడవటం నా జీవితంలో నేను చూడటం అదే మొదటిసారి. పొట్టిప్రసాద్ మావయ్య ఆరోగ్యం బాగా దెబ్బ తినటంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనను చూసి వచ్చిన నాన్నకు ఏడుపు ఆగలేదు. ఆ రోజు నాన్న మంచినీళ్లు కూడా తాగకుండా కూర్చుండిపోయారు. నేనే నాన్నని బుజ్జగించి, అన్నం తినిపించాను. ఆ మావయ్య కన్ను మూసిన రోజున నాన్నను ఓదార్చటం కష్టమైపోయింది. ఆయన మరణం తరవాత చాలా మార్పులు జరిగాయి. ఆప్తులందరూ హైదరాబాద్ తరలి వచ్చేశారు. నాన్న హైదరాబాద్ మారాలా వద్దా అని తర్జనభర్జన పడి, చివరకు మారటానికే నిశ్చయించుకుని, ఏవో వ్యక్తిగత పనుల మీద పిఠాపురం వెళ్లారు. అక్కడ ఉండగానే నాన్నకు అకస్మాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి కాలం చేశారు. మాకు దిక్కుతోచని పరిస్థితి. అప్పటికింకా నేను డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాను. మమ్మల్ని చెన్నై నుంచి సాక్షి శివ (సాక్షి రంగారావు కుమారుడు) అన్నయ్యే పిఠాపురం తీసుకువెళ్లాడు. ఆ తరవాత మేం హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాం. సాక్షి రంగారావు పెద్దనాన్న సినీ ప్రముఖుల నుంచి కొంత డబ్బు సేకరించి అమ్మకు ఇచ్చారు. కె.విశ్వనాథ్ గారు పది వేలు ఇచ్చారు. సీతారామశాస్త్రి అంకుల్ ‘అమ్మాయిని నాకు ఇచ్చేయండి, పెంచుకుంటాను’ అన్నారు. ఆ రోజు నేను వెక్కివెక్కి ఏడుస్తుంటే, సీతారామశాస్త్రి అంకుల్ నన్ను ఓదారుస్తూ, ‘అమ్మాయీ! నాకూ మా నాన్నగారు లేరు, నేను ఆయనను ఎన్నటికీ చూడలేను. కాని నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ నాన్నను టీవీలో ఏదో ఒక సినిమాలో చూడగలవు కదా’ అన్నారు. ఆస్తులు పాస్తుల కన్నా అనుబంధాలు గొప్పవని నాకు అర్థమైంది. నాన్న చాలా మంది ఆప్తుల్ని మాకు ఇచ్చినందుకు మనసులోనే ఆయనకు నమస్కరిస్తాను. సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత అక్కినేని చేసిన సినిమా ఇదే!
పాపులర్ నవలల్ని తెర మీదకు తెస్తే? అంతకన్నా సక్సెస్ ఫార్ములా ఇంకేముంటుంది! ‘సెక్రటరీ’... యద్దనపూడి సులోచనారాణిని మోస్ట్ పాపులర్ రైటర్ని చేసిన నవల. ‘ప్రేమనజర్’ కాంబినేషన్ – దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు, అక్కినేని, వాణిశ్రీ లతో సురేశ్మూవీస్ రామానాయుడుకు ‘నవలా చిత్రాల నిర్మాత’ అన్న పేరును సుస్థిరం చేసిన నవల. వంద ముద్రణలు జరుపుకొన్న ‘సెక్రటరీ’ నవలకు ఇప్పుడు 55 వసంతాలు. నవలను సినిమాగా తీసినప్పుడుండే సహజమైన విమర్శలు, భిన్నాభిప్రాయాల మధ్యనే శతదినోత్సవం జరుపుకొన్న ఆ నవలాధారిత చిత్రానికి 45 ఏళ్ళు. అంతర్జాతీయ మహిళా వత్సరం! అరవై ఏళ్ళ క్రితం సంగతి. అప్పటి దాకా వంటింటికే పరిమితమైన మధ్యతరగతి అమ్మాయిలు చదువుకొని, కుటుంబ అవసరాల రీత్యా రెక్కలు విప్పుకొని, గడప దాటి ఉద్యోగాలు చేయడం అప్పుడప్పుడే మొదలైంది. మారుతున్న సమాజాన్నీ, చుట్టూ ఉన్న హైక్లాస్ ప్రపంచాన్నీ, అందులోని మనుషులనూ చూస్తూ... అటు మొగ్గలేని, ఇటు మధ్యతరగతి విలువలలో మగ్గలేని ఊగిసలాట ఉంది. ఆ నేపథ్యంలో సెక్రటరీ ఉద్యోగం చేసిన జయంతి అనే అమ్మాయి కథ – యద్దనపూడి రాసిన, రామానాయుడు తీసిన – ‘సెక్రటరీ’. 1975ను ‘అంతర్జాతీయ మహిళా సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఆ కాలఘట్టంలో, నవల వెలువడ్డ పదేళ్ళకొచ్చిన చిత్రం ‘సెక్రటరీ’. రచనలోనూ, తెరపైనా చివరకు పురుషాధిక్యమే బలంగా కనపడినప్పటికీ, ‘‘ఒకరిలా ఉండాల్సిన అవసరం నాకేం లేదు. నేను నేనుగా ఉండడమే నాకిష్టం’’ అనే వ్యక్తిత్వమున్న జయంతి పాత్రలో వాణిశ్రీ రాణించిన సందర్భమది. స్టార్ హీరోకు... సెకండ్ ఇన్నింగ్స్! మహిళాదరణ ఉన్న హీరోగా అక్కినేని కెరీర్లో ‘సెక్రటరీ’ది ప్రత్యేక స్థానం. అప్పట్లో గుండె జబ్బుకు చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్ళారు. తీరా అప్పటికప్పుడు 1974 అక్టోబర్ 18న ఆయనకు ఓపెన్ హార్ట్సర్జరీ చేశారు. డిసెంబర్ మొదట్లో స్వదేశానికి తిరిగొచ్చినా, కొద్దికాలం విశ్రాంతి తీసుకున్నారు. దాంతో, 1975లో ఆయన కొత్త సినిమాలేవీ రిలీజు కాలేదు. పాత ప్రాజెక్ట్ ‘మహాకవి క్షేత్రయ్య’ను కొనసాగించారు. కానీ, పూర్తిస్థాయిలో అక్కినేని రెండో ఇన్నింగ్స్ మొదలెట్టింది ‘సెక్రటరీ’తోనే! అక్కినేని మానసిక సంఘర్షణ... అప్పట్లో సారథీ స్టూడియో అందుబాటులో లేక, తాను ఒకప్పుడు కాదని వచ్చేసిన మద్రాసుకు మళ్ళీ షూటింగులకు వెళ్ళలేక అక్కినేని ఇరుకున పడ్డారు. అమెరికా పర్యటనకు ముందెప్పుడో మొదలై, కుంటినడక నడుస్తున్న ‘క్షేత్రయ్య’ పూర్తి చేయడం కోసం చివరకు బెంగుళూరుకు వెళ్ళాల్సి వచ్చింది. కోయంబత్తూరు పక్షిరాజా స్టూడియోస్ అధినేత శ్రీరాములు నాయుడు అక్కడ బెంగుళూరులో బొబ్బిలి రాజా ప్యాలెస్ కొని, 1969 నుంచి ‘చాముండేశ్వరీ స్టూడియోస్’ నిర్వహిస్తున్నారు. అక్కడ అక్కినేని తన ‘క్షేత్రయ్య’ షూటింగ్ జరపాల్సి వచ్చింది. అప్పుడిక విధి లేక... సొంత స్టూడియో ఉండాలనే ఆలోచనతో, ‘అన్నపూర్ణా స్టూడియోస్’కు శ్రీకారం చుట్టారు. నిర్మాత దుక్కిపాటి సహా శ్రేయోభిలాషులు వద్దన్నా సరే... అక్కినేని సాహసించారు. అక్కడ తొలి షూటింగ్... ఇదే! అన్నపూర్ణా స్టూడియోస్ 1976 జనవరి 14 సాయంత్రం నాలుగు గంటల వేళ ప్రారంభమైంది. అప్పట్లో కొండలు, గుట్టలుగా, సరైన రోడ్డు కూడా లేని ప్రాంతం అది. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అండతో అక్కినేని స్వయంగా దేశ రాష్ట్రపతిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. దేశ ప్రథమ పౌరుడి ప్రోటోకాల్ ఏర్పాట్లతో స్టూడియోకు రోడ్డు పడింది. అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సతీసమేతంగా వచ్చి, స్టూడియోను ప్రారంభించారు. అప్పటికి స్టూడియోలో ఒక్క ఫ్లోరే సిద్ధమైంది. ఆ ఫ్లోర్‌లోనే ‘సెక్రటరీ’ మొదలెట్టారు నిర్మాత రామానాయుడు. సినీపరిశ్రమను హైదరాబాద్‌కు తేవాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, ప్రోత్సా హాలకు అనుగుణంగా ఆవిర్భవించిన అన్నపూర్ణా స్టూడియోలో చిత్రీకరణైన తొలిచిత్రం ‘సెక్రటరీ’. ఆ కథ ఎన్నో చేతులు మారి... జయంతి (వాణిశ్రీ), రాజశేఖరం (అక్కినేని) నాయికా నాయకులు. ఎదుటపడితే ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు. చాటున మాత్రం ఒకరినొకరు తలుచుకుంటారు. ఒకరికి పొగరు. వేరొకరికి బిగువు. పొగరు దిగి, బిగువు సడలి ఇద్దరి మధ్య ఎలా జత కుదిరిందన్నది ‘సెక్రటరీ’ కథ. దీన్ని సీరియల్‌గా రాసేటప్పటికి యద్దనపూడికి నిండా పాతికేళ్ళు లేవు. గర్భవతి. అలా 1964 – 65ల్లో ఆమె రాసిన ఆ నవల ఓ ఊపు ఊపేసింది. ఆ రోజుల్లో పడవ లాంటి కారు, మేడ, తోట, నౌకర్లున్న ఆరడుగుల అందగాడైన రాజశేఖరం లాంటి అబ్బాయి తమకు భర్త కావాలని కోరుకోని మధ్యతరగతి అమ్మాయిలు లేరు. అలాగే, ఆత్మాభిమానం నిండిన జయంతిలో తమను తాము వారు చూసుకున్నారు. 1966లో తొలి ముద్రణ నుంచి ఇప్పటికి వంద ఎడిషన్లు... వేల కాపీలు... లక్షలాది పాఠకాభిమానంతో తెలుగు నవలా సాహిత్యంలో రికార్డు సృష్టించిన నవల – ‘సెక్రటరీ’. అప్పట్లో ఆ నవలను తెరకెక్కించాలని చాలామంది అనుకున్నారు. ఆ నవల ఎన్నో ఏళ్ళు, ఎందరి చేతులో మారింది. చివ రకు రామానాయుడికి ఆ అదృష్టం దక్కింది. అప్పటికే పాపులర్ నవలల ఆధారంగా వరుసగా ‘ప్రేమనగర్’, ‘జీవన తరంగాలు’, ‘చక్రవాకం’ చిత్రాలు తీసిన ఆయన ‘సెక్రటరీ’ని రిచ్‌గా నిర్మించారు. ఆ పాటలు... ఆ వ్యూహాలు! ‘సెక్రటరీ’ కన్నా నెల రోజుల ముందు ‘క్షేత్రయ్య’ (1976 మార్చి 31) రిలీజైంది. దాన్ని పక్కనపెడితే, ‘దొరబాబు’ (1974 అక్టోబర్ 31) తర్వాత దాదాపు ఏణ్ణర్ధం గ్యాప్‌తో జనం ముందుకు అక్కినేని ఉత్సాహంగా వచ్చిన సినిమా ‘సెక్రటరీ’యే (1976 ఏప్రిల్ 28)! నవలా చిత్రమనే క్యూరియాసిటీ, మంచి పాటలు కలగలిసి సినిమా రిలీజుకు మంచి క్రేజు వచ్చింది. ఆ రోజుల్లో అనూహ్యమైన అడ్వా¯Œ ్స బుకింగ్‌తో కలకలం రేపింది. మంచి ఓపెనింగ్స్ సాధించింది. రామకృష్ణ గళంలో హుషారు గీతం ‘నా పక్కనచోటున్నది ఒక్కరికే...’, ఆత్రేయ మార్కు విషాద రచన ‘మనసు లేని బ్రతుకొక నరకం...’ పాటలు హిట్. ప్రేక్షక జనాకర్షణ కోసం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు మంచి వ్యూహాలే వేశారు. నవలలోని పాత్రలకు జనంలో ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని, సినిమా టైటిల్స్‌లో తారల పేర్ల బదులు వారి ఫోటోలు పెట్టి, రాజశేఖరం, జయంతి లాంటి నవలా పాత్రల పేర్లే వేశారు. ‘మొరటోడు నా మొగుడు..’ పాటను సినిమా రిలీజైన కొన్నాళ్ళకు కొత్తగా కలిపారు. అప్పట్లో ఎన్టీఆర్, దిలీప్ కుమార్ సారథ్యంలో దక్షిణాది, ఉత్తరాది సినీతారల మధ్య హైదరాబాద్ ఎల్బీ స్టేడియమ్లో బెనిఫిట్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. రిలీజైన అయిదారు వారాలకు ‘సెక్రటరీ’తో పాటు ఆ మ్యాచ్ దృశ్యాల రీలును ప్రదర్శించారు. కానీ, భారీ అంచనాలతో హాలుకొచ్చిన నవలా పాఠకుల ఊహలను సినిమా అందుకోలేకపోయింది. ‘సక్సెసైనా, మేము ఆశించిన అద్భుత విజయం దక్కలేదు. రిపీట్ రన్లో లాభాలొచ్చాయి’ అని రామానాయుడు చెప్పుకున్నారు. 6 కేంద్రాల్లో ‘సెక్రటరీ’ వంద రోజులు పూర్తిచేసుకుంది. ‘‘చదవడానికి బాగున్న ‘సెక్రటరీ’లో బాక్సాఫీస్ సూత్రాలు తక్కువ’’ అంటూ, ‘‘ఈ నవలను సిన్మా తీయడం తేలికైన పని కాదు’’ అని స్వయంగా అక్కినేనే శతదినోత్సవ వేదికపై విశ్లేషించారు. ఏమైనా, ‘సెక్రటరీ’ నవల, ఈ నవలా చిత్రం ఇన్నేళ్ళు గడిచినా ఆ తరానికి ఓ తరVýæని పాత జ్ఞాపకాల పేటిక! ‘సారథీ’తో ‘దేవదాసు’ వివాదం ‘సెక్రటరీ’కి ముందు అక్కినేనికి పెద్ద ఇబ్బంది ఎదురైంది. నవయుగ ఫిలిమ్స్ వారు అక్కినేనికి సన్నిహితులు. నవయుగ వారి సోదర పంపిణీ సంస్థ ‘శ్రీఫిలిమ్స్’లో అక్కినేని భాగస్వామి! హైదరాబాద్ షిఫ్టయి, ఇక్కడే సినిమాలు చేస్తానంటున్న తమ హీరో అక్కినేని కోసం నవయుగ వారు నష్టాల్లో ఉన్న సారథీ స్టూడియోను లీజుకు తీసుకొని నడుపుతున్నారు. 1971 ప్రాంతంలో అక్కినేని ‘అన్నపూర్ణా ఫిల్మ్స్’ అని సొంతంగా డిస్ట్రిబ్యూషన్ పెట్టారు. కాగా, 1974లో శ్రీఫిలిమ్స్ ఆర్థిక సహకారంతో హీరో కృష్ణ కలర్లో ‘దేవదాసు’ తీయడం సంచలనమైంది. అమెరికాకు వెళ్ళే ఆరు నెలల ముందు అక్కినేని తన పాత ‘దేవదాసు’ హక్కులు కొన్నారు. కృష్ణ ‘దేవదాసు’(1974 డిసెంబర్ 6)కు పోటీగా వారం ముందు ఈ పాతది రిలీజ్ చేయించారు. కృష్ణ ‘దేవదాసు’కు డబ్బులు పెట్టిన తాము నష్టపోతామని నవయుగ వారు వారించినా, అక్కినేని వినలేదు. ఆ పోటీలో కృష్ణ ‘దేవదాసు’ ఫ్లాపైంది. దాంతో, మనసుకు కష్టం కలిగిన నవయుగ వారు ఆ డిసెంబర్ 10న అమెరికా నుంచి వచ్చాక అక్కినేని ‘క్షేత్రయ్య’ షూటింగ్‌కు సారథీ స్టూడియో ఇవ్వడం ఆపేశారు. ‘నష్టాల వల్ల స్టూడియో మూసేశాం’ అన్నారు. ఇక, తప్పక అక్కినేని అన్నపూర్ణా స్టూడియోస్ కట్టుకోవాల్సి వచ్చింది. ఆ జంట... సూపర్ హిట్! అది వాణిశ్రీ హవా సాగుతున్న కాలం. ఆమె కట్టిందే చీరగా, పెట్టిందే బొట్టుగా, చుట్టిందే కొప్పుగా జనం నీరాజనం పడుతున్న సమయం. 1970ల మొదట్నించి ఏడెనిమిదేళ్ళు ఏ సినిమా చూసినా వాణిశ్రీయే! ఏయన్నార్‌తో ‘సెక్రటరీ’ నాటికి ఎన్టీఆర్ (‘ఆరాధన’), కృష్ణ (‘చీకటి వెలుగులు’), శోభన్‌బాబు (‘ప్రేమబంధం’), కృష్ణంరాజు (‘భక్త కన్నప్ప’) – ఇలా పేరున్న ప్రతి హీరో పక్కనా ఆమే! ఆ ఊపులో వచ్చిన ‘సెక్రటరీ’, ఆమె జయంతి పాత్ర జనంలో బోలెడంత ఆసక్తి రేపాయి. శతదినోత్సవ చిత్రం చేశాయి. అక్కినేని – వాణిశ్రీలది అప్పుడు హిట్ పెయిర్. కలర్ సినిమాల శకం ప్రారంభమైన 1971 నుంచి 1976లో ‘సెక్రటరీ’ దాకా ఆ కాంబినేషన్లో ఫెయిల్యూర్ సిన్మా లేదు. ఆ ఆరేళ్ళలో తెలుగు సినీ రాజధాని విజయవాడలో రిలీజైన హాలులోనే వంద రోజులాడిన అక్కినేని 8 చిత్రాల్లోనూ వాణిశ్రీయే హీరోయిన్ (1971 – దసరాబుల్లోడు, పవిత్రబంధం, ప్రేమనగర్. 1972 – విచిత్ర బంధం, కొడుకు – కోడలు. 1973 – బంగారుబాబు. 1974 – మంచివాడు. 1976 – సెక్రటరీ). ఇక అదే కాలంలో వచ్చిన తొమ్మిదో చిత్రం ‘దత్తపుత్రుడు’ (1972) కూడా ఎబౌ ఏవరేజ్‌గా నిలిచి, షిఫ్టులతో శతదినోత్సవం చేసుకోవడం విశేషం. అదే సమయంలో ఇతర హీరోలతోనూ వాణిశ్రీకి మరో ఆరేడు శతదినోత్సవ విజయాలుండడం గమనార్హం. అలా ఆమె ఆ కాలంలో తన ఆధిక్యాన్ని చాటుకున్నారు. చివరకు సాక్షాత్తూ అక్కినేని సైతం, ‘‘ఈ ‘సెక్రటరీ’లో నేను నటించకపోయినా ఫరవాలేదు కానీ, వాణిశ్రీ లేకపోతే చిత్రం విజయవంతం కాదనే నమ్మకం నాకు కలిగింది’’ అని శతదినోత్సవ వేదికపై బాహాటంగా ఒప్పుకోవడం మరీ విశేషం. అన్నపూర్ణా స్టూడియోస్... అలా కట్టారు! ‘‘నాకు నటించడానికి హైదరాబాద్‌లో చోటు లేదని తెలిశాక... నేను విపరీతంగా మానసిక సంఘర్షణను ఎదుర్కొంది అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మాణానికి ముందు’’ అని అక్కినేని అప్పట్లో తన మానసికస్థితిని వివరించారు. మనుమడు – నేటి హీరో చిన్నారి సుమంత్, పెద్ద కుమారుడు వెంకట్ చేతుల మీదుగా 1975 ఆగస్టు 13 ఉదయం అన్నపూర్ణా స్టూడియోస్‌కు శంకుస్థాపన చేయించారు అక్కినేని. ప్రభుత్వమిచ్చిన 15 ఎకరాల స్థలంలో... కొండలను పిండి కొట్టి, బండరాళ్ళను పగలగొట్టి, ఎంతో కష్టం మీద స్టూడియో నిర్మాణం సాగించారు. ఒకపక్క ‘క్షేత్రయ్య’ కోసం తరచూ బెంగుళూరు వెళ్ళి వస్తూ, మరోపక్క ఈ నిర్మాణం పనుల్లో తలమునకలయ్యారు. ‘‘ఇంజనీర్లు లేరు. బండరాళ్ళు కొట్టించడం దగ్గర నుంచి డిజైన్లు, ఇతర ప్లాన్లు వేసుకోవడం వరకూ అన్నీ నేనే చూసుకోవాల్సి వచ్చింది’’ అని అక్కినేని ఓసారి చెప్పారు. అంతకు ముందు ‘అక్కినేని 60 సినిమాల పండుగ’కు సొంత ఖర్చుతో మద్రాసులో ‘విజయా గార్డె¯Œ ్స’ సిద్ధం చేసిన నిర్మాత బి. నాగిరెడ్డి ఈసారి హైదరాబాద్ లో స్టూడియో నిర్మాణంలోనూ సలహాలు, సూచనలిచ్చారు. మద్రాసు నుంచి ప్రత్యేకంగా పనివాళ్ళను పంపించారు. ∙అన్నపూర్ణా స్టూడియోస్ తొలి నవలే... సెన్సేషన్ యద్దనపూడి తొలి నవలే ‘సెక్రటరీ’. అప్పట్లో విజయవాడ నుంచి ‘జ్యోతి’ మంత్లీ రాఘవయ్య ప్రారంభించారు. ఆ పత్రిక నడిపిన బాపు – రమణలు కోరగా యద్దనపూడి రాసిన నవల ఇది. అనంతర కాలంలో ‘నవలా రాణి’గా పేరు తెచ్చుకున్న యద్దనపూడి, నిజానికి ‘‘వాళ్ళు అడిగినప్పుడు, నేను కథలే రాశా. నవల రాయడం తెలీదు. ఎప్పుడూ రాయలేదన్నా’’రు. కానీ బాపు – రమణ, ‘‘మీరు రాయగలరు. మరేం లేదు... పెద్ద కథ రాసేయండి’’ అని భరోసా ఇచ్చారు. నవల పేరేమి వేద్దామంటే, అప్పటికప్పుడు యద్దనపూడి ఇంట్లోని తనకిష్టమైన సరస్వతీదేవి బొమ్మ దగ్గర తెల్లకాగితంపై ‘సెక్రటరీ – రచన యద్దనపూడి సులోచనారాణి’ అని రాసిచ్చారు. ఆమె నవలా హీరో చిత్రనిర్మాణవేళలోనే ‘సెక్రటరీ’కి బోలెడంత క్రేజు రావడానికి కారణం నవల. ‘సెక్రటరీ’ మంత్లీ సీరియల్ వచ్చిన రోజుల్లోకి వెళితే... తెలుగులో పాపులర్ సాహిత్యాన్ని మహిళలు ఏలడం మొదలైన కాలమది. లత, రంగనాయకమ్మ, కోడూరి కౌసల్యాదేవి లాంటి పాపులర్ రచయిత్రుల వెనుక వచ్చి, రేసులో వారిని దాటి దూసుకుపోయిన పేరు యద్దనపూడి. కన్నెవయసులో బందరులో ‘తోడికోడళ్ళు’ సినిమా చూసి, హీరో అక్కినేనిని కలల నిండా నింపుకొన్న యద్దనపూడి, తాను సృష్టించిన కలల లోకపు నవలలకు అదే అక్కినేని కథానాయకుడై ప్రాణం పోస్తాడని ఊహించలేదు. అక్కినేని నటించిన ‘ఆత్మీయులు’, ‘విచిత్ర బంధం’, ‘బంగారు కలలు’, ‘సెక్రటరీ’ చిత్రాలు యద్దనపూడి నవలలే! – రెంటాల జయదేవ -
అక్కినేని అభిమానులకు ఆర్జీవీ సర్ప్రైజ్
తండ్రి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని బాల నటుడిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున అక్కినేని. అలా ఇప్పడు టాలీవుడ్లో స్టార్ హీరో ఎదిగారు ఆయన. అలాగే నిర్మాతగాను ఆయన సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అక్కినేని అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. నాగార్జున బాల నటుడిగా పరిచయం అవుతూ తన తండ్రి నాగేశ్వరరావుతో కలిసి మొదటిసారిగా ‘సుడిగుండాలు’ అనే మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని తాజాగా ఆర్జీవీ తన ట్విటర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి ‘సుడిగుండాలు సన్నివేశం.. చంద్రశేఖరం ఆయన కుమారుడిని స్కూలుకి కారులో తీసుకేళ్లారు’ అంటూ ఆర్జీవీ ఈ వీడియోను పంచుకున్నాడు. కాగా నాగార్జున ‘వెలుగు నీడలు’ అనే చిత్రంలో కూడా బాల నటుడిగా నటించారు. ఈ ఇందులో కూడా అక్కినేనికి కొడుకుగా కనిపించారు. అయితే నాగార్జున-అక్కినేని కాంబినేషన్లో వచ్చిన ‘కలెక్టర్ గారి అబ్బాయి’, ‘అగ్నిపుత్రుడు’, ‘రావుగారిల్లు’, ‘ఇద్దరు ఇద్దరే’, ‘శ్రీరామదాసు’, ‘మనం’ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. That’s @iamnagarjuna 😎 pic.twitter.com/Lv2WHnJawq — Ram Gopal Varma (@RGVzoomin) March 17, 2021 చదవండి: సితూ పాప నువ్వు అప్పుడే ఎదగకు ప్లీజ్.. అందుకే సౌందర్య ఎక్స్పోజింగ్ చేయలేదు : ఆమని ఇదే తొలిసారి.. ‘చందమామ’తో నాగ్ రొమాన్స్! -
చెరిగిపోని పచ్చబొట్టు పవిత్రబంధం
కథలోని ప్రధాన పాత్రలకు ఏదో దెబ్బ తగిలి, గతం మర్చిపోవడం ఎప్పుడూ ఓ మంచి వెండితెర కమర్షియల్ పాయింట్. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి ఇప్పటి దాకా ఈ పాయింట్‌తో అల్లుకున్న కథలు అనేకం. మన అగ్ర హీరోల్లో దాదాపు అందరూ ఈ పాయింట్ ఆధారంగా సినిమాలు చేశారు. సక్సెస్ అందుకున్నారు. కలర్ చిత్రాల జోరు మొదలైన రోజుల్లో దర్శకుడు వి. మధుసూదనరావు, హీరో అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్లో ఈ పాయింట్‌తో వచ్చిన సక్సెస్ఫుల్ బ్లాక్ అండ్ వైట్ చిత్రం ‘పవిత్రబంధం’. బిగువైన కథ, పాటలు, హీరోయిన్లు కాంచన, వాణిశ్రీ అందచందాలతో సరిగ్గా 50 ఏళ్ళ క్రితం వచ్చిన ‘పవిత్రబంధం’ ఆ తరానికి ఓ తీపి గుర్తు. ఆ సినిమాలోని ‘గాంధి పుట్టిన దేశమా ఇది’, ‘పచ్చబొట్టూ చెరిగీపోదులే’ లాంటి సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అందాల తారలతో... ఒక్కో హీరోకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఒక్కో సినిమాకు ఒక్కో యు.ఎస్.పి. ఉంటుంది. ‘దేవదాసు’ ఫేమ్ అక్కినేనికి కెరీర్ తొలి రోజుల నుంచీ హీరోగా మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఎక్కువ. ఒకరికి ఇద్దరు నాయికలతో అలాంటి ప్రేమలు, పెళ్ళిళ్ళ కథలు తెరపై పండించడంలో ఆయనదో ప్రత్యేక ముద్ర. అందుకే, 1950లలో, ’60లలో అలాంటి కుటుంబకథలతో ఆయన తన రేంజ్‌నూ, ఇమేజ్‌నూ పెంచుకుంటూ వచ్చారు. కలర్ సినీశకం మొదలయ్యాక కూడా ఆయన ఆ మార్గం వీడలేదు. బ్లాక్ అండ్ వైట్ సినిమాల చివరలో అక్కినేని చేసిన అలాంటి ఓ గమ్మతై ్తన ప్రేమ, పెళ్ళి కథ – ‘పవిత్రబంధం’. ‘‘ప్రేమించిన ప్రియురాలు! పెళ్ళాడిన ఇల్లాలు!! ఎవరి అనుబంధం – తరతరాల పవిత్రబంధం?’’ ఒక్కముక్కలో ఇదీ ఈ సినిమా కాన్సెప్ట్. అప్పటికే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న అందాల నటి కాంచన, సావిత్రి తరువాత అప్పుడప్పుడే స్టార్ హోదాకు ఎదుగుతున్న వాణిశ్రీ ఇందులో అక్కినేని సరసన హీరోయిన్లు. శృంగారాభినయానికి ఒకరు, సెంటిమెంటుకు మరొకరు. ఇక, 1970ల ద్వితీయార్ధానికి హీరోగా స్థిరపడ్డ కృష్ణంరాజు నెగటివ్ రోల్ చేశారు. ఆకట్టుకొనే కథ... కథనం... ‘పవిత్రబంధం’లో ‘‘కల్లకపటాలు లేని పల్లెటూరి వలపులు, అల్లకల్లోలమైన పట్నవాసపు తలపులు’’ చూపారు. అశోక్ మూవీస్ పతాకంపై టి. గోవిందరాజన్ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు వి. మధుసూదనరావు పక్కా కమర్షియల్ మీటర్లో తీర్చిదిద్దారు. మెదడుకు దెబ్బ తగిలి, కథలోని ప్రధానపాత్ర పాత జ్ఞాపకాలను మర్చిపోవడమనే ఫార్ములాను లేడీస్ సెంటిమెంట్‌కు ముడిపెట్టి, హాస్య, శృంగార రసాలకు ప్రాముఖ్యమిస్తూ అల్లుకున్నారు. అనుకోని విధంగా జీవితంలో ఇద్దరు అమ్మాయిలకు ప్రేమను పంచవలసి వచ్చిన హీరో కథ ఇది. అనాథాశ్రమంలో పెరిగి, ఉన్నత విద్య చదివి, ఉద్యోగం దొరకక పట్నంలో తిరుగుతూ, ఓ పాడైపోయిన బస్సులో నివసిస్తుంటాడు హీరో (అక్కినేని). అతి గారాబంతో పంజరంలా మారిన ఇంట్లో నుంచి బయటపడి, తానెవరో చెప్పని ఓ కల వారింటి అమ్మా యి (కాంచన)ను ప్రేమి స్తాడు. ఇంతలో ఓ కారు ప్రమాదం. హీరో గతాన్ని మర్చిపోతాడు. ఓ పల్లెటూరు చేరతాడు. అనుకోకుండా అక్కడో పల్లెటూరి అమ్మాయి (వాణిశ్రీ)ని కాపాడి, ఆమె ప్రేమ దక్కించుకొని, పెళ్ళి చేసుకొంటాడు. పండంటి పిల్లాడికి తండ్రి అవుతాడు. రైతుగా జీవితం గడుపుతుంటాడు. పట్నానికి పని మీద వెళతాడు. తీరా అప్పుడు రెండోసారి ప్రమాదం. మళ్ళీ మెదడుకు దెబ్బ. ఈ రెండు యాక్సిడెంట్లకు మధ్య జరిగిన కథను హీరో మర్చిపోతాడు. మొదటి యాక్సిడెంట్‌కు ముందు పెద్దింటి అమ్మాయితో జరిపిన పాత ప్రేమకథ మాత్రం గుర్తొచ్చి, పెళ్ళికి సిద్ధమవుతాడు. కనిపించని భర్త కోసం వెతుక్కుంటూ పట్నం వస్తుంది పల్లెటూరి భార్య. అక్కడ హీరో కోసం ఇద్దరు హీరోయిన్ల మధ్య అంతః సంఘర్షణ. ‘పచ్చబొట్టు’ పాట, కన్నకొడుకు (బేబీ డాలీ) జ్ఞాపకాలతో హీరోకు తన పల్లెటూరి పెళ్ళికథా గుర్తొస్తుంది. చివరకు ప్రేమ కన్నా, తాళి కట్టిన అమ్మాయిదే పవిత్రబంధం అనే మహిళా సెంటిమెంటుకే సినిమా జై కొడుతుంది. ఒకమ్మాయి త్యాగంతో మరో అమ్మాయి సంసారం చక్కబడుతుంది. మనిషి, మనసు, డబ్బు– వీటి మధ్య బంధం ఏమిటి? హీరో కథలో పట్నంలో జరిపిన ప్రేమా, పల్లెటూరిలోని పెళ్ళా– ఏది గొప్ప? ఇలా పాత్రల ఘర్షణ, అనుబంధాల పవిత్రత చూపుతుందీ సినిమా. ఆరుద్ర కలం... పాటల బలం... ఈ సినిమాకు ఆరుద్ర రాసిన ‘అట్ల తద్దోయ్ ఆరట్లోయ్..’ (గానం పి. సుశీల బృందం), ‘ఫిఫ్టీ ఫిఫ్టీ సగం సగం నిజం నిజం’ (సుశీల – ఘంటసాల), సంతోష – విషాద సందర్భాలు రెంటిలోనూ వచ్చే ‘పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా’ పాటలు మోస్ట్ పాపులర్. జనపదం మెచ్చే పాటల రచయిత కొసరాజు కలంలోని ‘ఘల ఘల ఘల ఘల గజ్జెల బండి..’ (సుశీల – స్వర్ణలత) హుషారు రేపింది. అప్పట్లో మంచి మ్యూజికల్ ఆల్బమ్‌గా నిలిచిన ‘పవిత్రబంధం’ సక్సెస్‌కు తారల అభినయంతో పాటు ఈ ఎవర్ గ్రీన్ పాటలూ తోడయ్యాయి. ఈ సినిమాకు ప్రధాన బలమైన పాటలతో పాటు మాటలూ ఆరుద్రే రాశారు. ఆ అసిస్టెంట్లు ఇప్పుడు ఫేమస్! సర్వసాధారణంగా తెలుగునాట సినిమాలన్నీ డిస్ట్రిబ్యూటర్ల ముందస్తు పెట్టుబడితో తయారవుతూ వచ్చిన కాలం అది. అప్పటి ప్రముఖ పంపిణీ సంస్థ ‘నవయుగ ఫిలిమ్స్’ సహకారంతో ‘పవిత్రబంధం’ తయారైంది. సహజంగానే, ‘నవయుగ ఫిలిమ్స్’ వారే సినిమాకు ప్రధాన పంపిణీదారులు. చిత్రం ఏమిటంటే, ఆ తరువాతి కాలంలో సుప్రసిద్ధులైన ఓ దర్శకుడు, ఓ నిర్మాత అప్పట్లో ఈ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు. వారెవరంటే – దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, నిర్మాత ‘యువచిత్ర’ కె. మురారి. అప్పట్లో దర్శకుడు వి. మధుసూదనరావు దగ్గర సహాయకులుగా పనిచేసిన ఈ ఇద్దరూ కాలక్రమంలో చెరొక శాఖలో స్థిరపడ్డారు. కోదండరామిరెడ్డి తమ గురువులానే పలు కమర్షియల్ హిట్స్ అందించి, దర్శకుడిగా 100 చిత్రాల మార్కుకు కాస్త దూరంలో ఆగారు. ఇక, ‘నవయుగ ఫిలిమ్స్’ అధినేతలైన కాట్రగడ్డ కుటుంబానికే చెందిన మురారి దర్శకత్వం కన్నా నిర్మాణం తన అభిరుచికి సరిపోతుందని అటు మళ్ళారు. ‘సీతామాలక్ష్మి’, ‘గోరింటాకు’ మొదలు ‘నారీ నారీ నడుమ మురారి’ దాకా పలు మ్యూజికల్ హిట్స్ నిర్మించారు. అలా ‘పవిత్రబంధం’ అసిస్టెంట్ డైరెక్టర్లిద్దరూ తర్వాత ఫేమసయ్యారు. విజయవాడ విశ్లేషణకు పెద్ద పీట! ఓ సినిమా రిలీజయ్యాక ఆ చిత్ర యూనిట్ ఆంధ్రదేశంలోని ప్రధాన రిలీజు కేంద్రాలకు వెళ్ళడం, విజయయాత్రలు చేయడం, పత్రికా రచయితలతో సంభాషించడం అప్పట్లో ఓ ఆనవాయితీ. సినీ వ్యాపార, పంపిణీరంగ రాజధాని విజయవాడలో ప్రతి సినిమాకూ అవి తప్పనిసరిగా జరిగేవి. ‘పవిత్రబంధం’కి కూడా ఆ ఆనవాయితీ పాటించారు. విజయవాడలో నవయుగ ఫిలిమ్స్ నిర్వహణ బాధ్యతలతో అప్పటికే తల పండిన ప్రముఖ సినీ వ్యాపార, ప్రచార రంగ నిపుణుడు కాట్రగడ్డ నరసయ్య ఎప్పటికప్పుడు వినూత్న ప్రచార వ్యూహాలతో సినిమాకు ప్రచారం కల్పించేవారు. ‘పవిత్రబంధం’ రిలీజయ్యాక తొలి వారంలోనే ఆయన వినూత్నంగా స్థానిక రచయితలతో చిత్ర యూనిట్ ఇష్టాగోష్ఠి సమావేశం నిర్వహించారు. దర్శకుడు వి. మధుసూదనరావు, నిర్మాత టి. గోవిందరాజన్ పాల్గొన్న ఈ ఇష్టాగోష్ఠిలో రావూరి సత్యనారాయణరావు, రెంటాల గోపాల కృష్ణ, వాసిరెడ్డి సీతాదేవి, తుర్లపాటి కుటుంబరావు లాంటి ఆ తరం ప్రముఖ రచయితలు, జర్నలిస్టులు సినిమాపై తమ అభిప్రాయాలను వివరించడం విశేషం. విజయవాడలో తరచూ రచయితలతో సమావేశాలు జరపడం, వారి అభిప్రాయాలనూ, విశ్లేషణలనూ తెలుసుకోవడం సినిమా పురోగతికి మేలు చేస్తుందని సాక్షాత్తూ దర్శకుడు వి. మధుసూదనరావు అభిప్రాయపడ్డారు. ఆ ఒరవడి డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో పెను మార్పులు వచ్చిన 1990ల చివరి దాకా కొనసాగడం విశేషం. మొత్తం మీద అక్కినేని, మధుసూదనరావుల కాంబినేషన్ లోని ‘పవిత్రబంధం’ ఓ పాపులర్ చిత్రంగా నిలిచింది. అప్పట్లో రేడియోలో పదే పదే వినిపించిన పాపులర్ పాటలతో ఇప్పటికీ జనానికి గుర్తుండిపోయింది. ఆరుద్ర రాసిన ‘గాంధి పుట్టిన దేశమా ఇది..’ పాట యాభయ్యేళ్ళు గడిచిపోయినా, నేటి సమకాలీన సమాజానికీ వర్తించడం ఓ విశేషం. మారని మన వ్యవస్థకు అద్దం పట్టే ఓ విషాదం. బాక్సాఫీస్ విజయాల లెక్కల కన్నా ఈ బాధామయ పరిస్థితులు, నిరుద్యోగిగా – రైతుగా – ఎస్టేటు యజమానిగా మూడు పార్శా్వలలో అక్కినేని నటన, ఘంటసాల గానం – అన్నీ ఈ సినిమాను చిరస్మరణీయం చేశాయి. కలర్ అక్కినేని వర్సెస్ బ్లాక్ అండ్ వైట్ అక్కినేని! ఓ మాస్ హిట్ సినిమా థియేటర్లలో నడుస్తుండగా... ఆ పక్కనే మరెంత బాగున్న సినిమా మరొకటి వచ్చినా బాక్సాఫీస్ ఎదురీత తప్పదు. అక్కినేని ‘పవిత్రబంధం’కి అలాంటి పరిస్థితే ఎదురైంది. కలర్ చిత్రాలు ఊపందుకుంటున్న సమయంలో వచ్చిన కలర్‌ఫుల్ మాస్ హిట్ అక్కినేని ‘దసరా బుల్లోడు’ (1971 జనవరి 13). ఆ తరువాత సరిగ్గా 6 వారాలకే ‘పవిత్రబంధం’ వచ్చింది. దానికి ‘దసరా బుల్లోడు’ ఊహించని ప్రత్యర్థి అయి కూర్చుంది. సినిమా, తీసుకున్న పాయింట్, తీసిన విధానం, నటీనటులు, పాటలు – ఇలా అన్నీ బాగున్నా, రంగుల చిత్రం ‘దసరా బుల్లోడు’ వెల్లువ నలుపు తెలుపుల ‘పవిత్ర బంధం’ని బాక్సాఫీస్ వద్ద ముంచెత్తింది. కానీ, అంత గట్టి పోటీలోనూ ‘పవిత్రబంధం’ జనాదరణ పొందింది. బెజవాడలో శతదినోత్సవమూ చేసుకుంది. అక్కినేని కథతో... రాఘవేంద్రుడి ముద్దుల ప్రియుడు గమ్మత్తేమిటంటే, విజయవంతమైన చిత్రాలతో విక్టరీ మధుసూదనరావుగా పేరు తెచ్చుకున్న వి. మధుసూదనరావు దగ్గర తొలి రోజుల్లో పనిచేసిన తరువాతి తరం కమర్షియల్ చిత్ర దర్శకుడు కె. రాఘవేంద్రరావు అచ్చంగా ఇదే కథను రంగుల్లో తెరకెక్కించారు. ‘పవిత్ర బంధం’ రిలీజైన 23 ఏళ్ళ తరువాత రాఘవేంద్రరావు తీసిన ‘ముద్దుల ప్రియుడు’ (1994) చూస్తే – బేసిక్‌గా రెండు కథలూ ఒకటే అని అర్థమవుతుంది. బ్లాక్ అండ్ వైట్ అక్కినేని, వాణిశ్రీ, కాంచన స్థానంలో రెండు దశాబ్దాల తరువాత రంగుల్లో వెంకటేశ్, రంభ, రమ్యకృష్ణ వచ్చారు. కొత్త తరం ప్రేక్షకులకు కావాల్సిన మసాలాలు దట్టిస్తూ, మార్పులూ చేశారు. అప్పటి ‘పవిత్ర బంధం’లానే ఇప్పటి ‘ముద్దుల ప్రియుడు’లోనూ కొన్ని పాటలు (వేటూరి రచనలు ‘వసంతంలా వచ్చిపోవా ఇలా...’, ‘సిరి చందనపు చెక్క లాంటి భామ...’, సిరివెన్నెల రచన ‘నాకే గనక నీతోనే గనక పెళ్ళయితే గనక...’) పదే పదే వినిపించాయి. కీరవాణి మార్కు సంగీతానికి, రాఘవేంద్రరావు మార్కు పూలు – పండ్ల చిత్రీకరణ శైలి, రమ్యకృష్ణ అందం తోడై పాటలు రేడియోలో, టేప్రికార్డర్లలో మారు మోగాయి. కానీ, సినిమా మాత్రం ఆశించిన బాక్సాఫీస్ రిజల్ట్ అందుకోలేకపోయింది. స్వీయ నిర్మాణ సంస్థ ఆర్.కె. ఫిల్మ్ అసోసియేట్స్‌పై నిర్మించిన రాఘవేంద్రరావుకు నిరాశే మిగిలింది. ఎవర్ గ్రీన్ సాంగ్స్ అక్కినేని సినీ కెరీర్ లో సూపర్ హిట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. అందులోనూ, సామాజిక పరిస్థితులకు సరిపడేలా నిత్యనూతనంగా నిలిచిన పాటలూ అనేకం. అలాంటి పాటలనగానే ఎవరికైనా – అక్కినేని ‘వెలుగు నీడలు’ చిత్రంలో పెండ్యాల సంగీతంలో ఘంటసాల పాడిన శ్రీశ్రీ రచన ‘పాడవోయి భారతీయుడా..’ గుర్తొస్తుంది. ‘స్వాతంత్య్రం వచ్చెనని సభలే చేసి, సంబరపడగానే సరిపోద’నీ, ‘అవినీతి – బంధుప్రీతి – చీకటి బజారు అలముకొన్న ఈ దేశం ఎటు దిగజారు’ననీ అక్కినేని పాత్ర నోట రచయిత పలికిన మాట దురదృష్టవశాత్తూ ఇవాళ్టికీ వర్తించే మాట! ప్రతి స్వాతంత్య్ర దినోత్సవాన జనాన్ని ఆలోచింపజేస్తున్న పాట!! సరిగ్గా అదే పద్ధతిలో చిరస్మరణీయ గీతమైంది – ‘పవిత్రబంధం’లో ఎస్. రాజేశ్వరరావు సంగీతంలో, ఆరుద్ర రాయగా, ఘంటసాల గళంలో, తెరపై హీరో అక్కినేని నోట వచ్చే ‘గాంధి పుట్టిన దేశమా ఇది.’ ఆ పాటలో ‘ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు’, ‘ఉన్నది మనకు ఓటు – బ్రతుకు తెరువుకే లోటు’ అంటూ సాగే నిరుద్యోగ నాయక పాత్ర ఆవేదన నేటి పరిస్థితులకీ అన్వయిస్తుంది. ‘పేరుకు ప్రజలదే రాజ్యం – పెత్తందార్లకే భోజ్యం’ అంటూ కవి క్రాంతదర్శి అయ్యాడు. – రెంటాల జయదేవ -
ప్రేమాభిషేకం: అక్కినేని ప్రేమకు... దాసరి పట్టాభిషేకం
ప్రేమకథలు... అందులోనూ భగ్న ప్రేమకథలు... తెరపై ఎప్పుడూ హిట్ ఫార్ములా! ఆ ఫార్ములాతో అక్కినేని, దాసరి కాంబినేషన్ తెలుగు సినీ చరిత్రలో సృష్టించిన అపూర్వ వాణిజ్య విజయం ‘ప్రేమాభిషేకం’. సరిగ్గా నలభై ఏళ్ళ క్రితం 1981 ఫిబ్రవరి 18న రిలీజైన సినిమా అది. కానీ ఇవాళ్టికీ ఆ పాటలు, మాటలు – ఇలా అన్నీ సినీ ప్రియులకు గుర్తే! ‘ప్రేమకు అర్థం– త్యాగ’మనే మరువలేని అంశాన్ని మరపురాని రీతిలో చెప్పిన ‘ప్రేమాభిషేకం’... అజరామర ప్రేమకు వెండితెర పట్టాభిషేకం! అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణా స్టూడియోస్(1976 జనవరి 14) స్థాపించి, అప్పటికి నాలుగేళ్ళవుతోంది. స్టూడియో పేరుపై ఆయన ‘రామకృష్ణు్ణలు’ (జగపతి రాజేంద్రప్రసాద్‌తో కలసి –1978), ‘కళ్యాణి’ (’79), ‘పిల్ల జమీందార్’ (’80) తీశారు. అదే కాలంలో ఎ.ఎ. కంబైన్స్ బ్యానర్‌పై ‘మంచి మనసు’ (’78), ‘బుచ్చిబాబు’ (’80) నిర్మించారు. ఇవన్నీ స్టూడియో మొదలెట్టాక, అక్కినేని సమర్పించిన చిత్రాలే. కానీ, ఏవీ అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు. మరోపక్క ఖర్చులతో స్టూడియో కష్టనష్టాలూ ఎక్కువగానే ఉన్నాయి. కాశ్మీర్లో పుట్టిన కథ! సరిగ్గా అప్పుడే... అక్కినేని వీరాభిమాని, అన్నపూర్ణా స్టూడియోస్‌కు ‘కళ్యాణి’, ‘బుచ్చిబాబు’ తీసిన పాపులర్ డైరెక్టర్ దాసరి నారాయణరావు తన అభిమాన హీరోతో కాశ్మీర్లో ‘శ్రీవారి ముచ్చట్లు’ చిత్రీకరిస్తున్నారు. ‘దేవదాసు మళ్ళీ పుట్టాడు’ (’78)తో మొదలుపెట్టి అక్కినేనితో దాసరికి అది 5వ సినిమా. ఓ రోజు కాశ్మీర్ డాల్ లేక్‌లో షూటింగ్ ముగించుకొని, పడవలో వస్తుండగా దాసరి మనసులో ఏవో ఆలోచనలు. అవన్నీ ఓ కొలిక్కి వచ్చి, ‘ప్రేమాభిషేకం’ కథాంశం మనసులో రూపుదిద్దుకుంది. ఓ అమ్మాయి ప్రేమ కోసం పరితపించే హీరో. కష్టపడి ఆ అమ్మాయి ప్రేమ గెలుస్తాడు. తీరా ఆమె ఓకే అన్నాక, ఊహించని పరిస్థితులు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఆమె క్షేమం, సౌభాగ్యం కోసం హీరో తన నుంచి దూరం పెట్టి ప్రేమను త్యాగం చేస్తే? ఈ కథాంశం చెప్పగానే అక్కినేని డబుల్ ఓకే. సొంత స్టూడియో బ్యానర్ మీదే తీద్దామన్నారు. అలా అక్కినేని సొంత చిత్రంగా, కుమారులు వెంకట్, నాగార్జున నిర్మాతలుగా ‘ప్రేమాభిషేకం’ పట్టాలెక్కింది. ఆగిన షూటింగ్! అన్నపూర్ణ మధ్యవర్తిత్వం!! మొదటి నుంచి ఈ కథపై దాసరికి గట్టి నమ్మకం. తీరా షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కినేనికి ఓ డౌట్ వచ్చింది. పెళ్ళిచూపుల్లో నటి కవితలో శ్రీదేవిని ఊహించుకొని, పెళ్ళికి ఓకే చెప్పి వస్తాడు హీరో. తీరా తరువాత కవిత పూలబొకేతో ఎదురైతే, ‘నువ్వెవరో నాకు తెలీదు, నిన్ను చూసి ఓకే చెప్పలేదు’ అంటాడు. ముందు ఓకే అన్నా, ఆ సీన్ తీస్తున్నప్పుడు తన లేడీస్ ఫాలోయింగ్ ఇమేజ్‌కు అది భంగం కలిగిస్తుందని అక్కినేని అనుమానించారు. ఆ సీను మార్చాల్సిందే అన్నారు. దాసరితో వాదించారు. కానీ, కథానుసారం ఇంటర్వెల్ వద్ద కథను కీలకమైన మలుపు తిప్పే సీనుకు ఈ సీనే లింకు అంటూ దాసరి పట్టుబట్టారు. వ్యవహారం ముదిరి ఒకరోజు షూటింగ్ ఆగింది. అక్కినేని, దాసరి – ఇద్దరూ భీష్మించుకున్న పరిస్థితుల్లో చివరకు అక్కినేని శ్రీమతి అన్నపూర్ణ కలగజేసుకొని, మధ్యవర్తిత్వం వహించారు. చివరకు దాసరి ‘‘ఆ సీనులో సారం చెడిపోకుండా, ఒకటి రెండు సవరణలు చేసి, అక్కినేనిని ఒప్పించా’’రు. అద్భుతంగా తీసి, మెప్పించారు. ఆ దేవదాసు పాత్రలే... మళ్ళీ! గమనిస్తే ఒకప్పటి దేవదాసు, పార్వతి, చంద్రముఖులే ఈ ‘ప్రేమాభిషేకం’లో అక్కినేని, శ్రీదేవి, జయసుధలు వేసిన పాత్రలు. పార్వతి ప్రేమ కన్నా చంద్రముఖి ప్రేమ గొప్పదనే చర్చ ఈ చిత్రంలోని శ్రీదేవి, జయసుధల పాత్ర ద్వారా చెలరేగింది. సూపర్ హిట్స్ ‘దేవదాసు’, ‘ప్రేమ్‌నగర్’ కథలను కలగలిపి, కొత్తగా వండి వడ్డించారు దాసరి. అయితే, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వంలో దాసరి బహుముఖ ప్రజ్ఞ ఓ సంచలనం. ఆ పాటలకు వందనం... అభివందనం! చక్రవర్తి సంగీతంలో ‘దేవీ మౌనమా’, ‘కోటప్పకొండకు’, ‘తారలు దిగివచ్చిన’, ‘నా కళ్ళు చెబుతున్నాయి’, ‘ఒక దేవుడి గుడిలో’, ‘వందనం’, ‘ఆగదూ’– ఇలా దాసరి రాసిన అన్ని పాటలూ ఆల్‌టైమ్ హిట్. ఎస్పీబీకి సింగర్‌గా నంది అవార్డూ వచ్చింది. నిజానికి, ‘వందనం...’ పాట స్థానంలో దాసరి మొదట ‘జీవితాన్ని చూడు రంగు రంగుల అద్దంలో’ అనే పాట రాశారు. పాట ఇంకా బాగుండాలన్నారు అక్కినేని. అప్పుడు చేసిన కొత్త పాట ‘వందనం’ అయితే, ఆడియోలో మాత్రం ‘జీవితాన్ని చూడు’ పాట కూడా రిలీజ్ చేశారు. సినిమాలో లేకపోయినా, ఆ పాటా ఆ రోజుల్లో తెగ వినపడింది. 57వ ఏట ‘ప్రేమాభిషేకం’తో అంత పెద్ద సక్సెస్ రావడం అక్కినేనికి అన్ని విధాలా తృప్తినిచ్చింది. ‘‘ఈ క్రెడిట్ అంతా దాసరిదే. చక్రవర్తి సంగీతానిదీ మేజర్ కంట్రిబ్యూషన్’’ అని అక్కినేని తరచూ చెబుతుండేవారు. మరపురాని డైలాగ్ డ్రామా! నిజం చెప్పాలంటే – సీన్ల రూపకల్పనలో, డైలాగ్ డ్రామాలో దాసరి ప్రతిభకు ‘ప్రేమాభిషేకం’ ఓ మచ్చుతునక. ‘‘ఈ లోకంలో అందరికీ తెలుసు’’ అంటూ హీరోయిన్‌కు తన మీద అసహ్యం కలిగించడం కోసం హీరో డైలాగులు చెప్పే సీన్, శ్రీదేవి– జయసుధ– అక్కినేనివ మధ్య మాటల యుద్ధం సీను లాంటివి సినిమాను వేరే స్థాయిలో నిలిపాయి. ఆ డైలాగుల్ని జనం అందరూ తెగ చెప్పుకున్నారు. హీరో మరణించినా, మరణం లేని ప్రేమను తెరపై పదే పదే చూస్తూ, రిపీట్ ఆడియన్స్ కాసుల వర్షం కురిపించారు. పాత్ర చిన్నదే... ఆమె అభినయం పెద్దది! మొదట ఈ సినిమాలో వేశ్య పాత్ర ఎవరితో వేయించాలనే చర్చ జరిగింది. ఒక దశలో నటి లక్ష్మి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అప్పటికే టాప్ హీరోయినైన జయసుధ అయితేనో అన్నారు దాసరి. కానీ ‘కేవలం 2పాటలు, 6 సీన్లే ఉన్న పది రోజుల్లోపు పాత్రను, అదీ వేశ్య పాత్రను ఆమె ఒప్పుకుంటుందా’ అన్నది అక్కినేని అనుమానం. ఇంతలో ‘ప్రేమాభిషేకం’లో ఓ చిన్నపాత్రకు తనను అనుకుంటున్నారని జయసుధ దాకా వెళ్ళింది. ‘ఆ పాత్ర నేనే చేయాలని దాసరి అనుకుంటే, అది వేశ్య పాత్ర అయినా సరే చేస్తా’ అని జయసుధ యథాలాపంగా అనేశారు. తీరా అది వేశ్య పాత్రే! ‘ఏ–బి–సి–డి అండ్ జె’ హిట్ కాంబినేషన్! అప్పట్లో ‘అక్కినేని – బాలు – చక్రవర్తి – దాసరి అండ్ జయసుధ’ల కాంబినేషన్ వరుస హిట్లు అందించింది. విజయవాడలో ఈ చిత్ర విజయోత్సవంలో వీళ్ళను ‘ఏ–బి–సి–డి అండ్ జె’ హిట్ కాంబినేషన్ అని జర్నలిస్టులు ప్రస్తావించారు. చాలాకాలం ఫ్యాన్స్‌లో, ట్రేడ్‌లో ఆ పదం పాపులరైంది. బాక్సాఫీస్ చరిత్రలో... సువర్ణాధ్యాయం ‘ప్రేమాభిషేకం’ తెలుగు సినీ బాక్సాఫీస్ చరిత్రలో కొన్ని అరుదైన రికార్డులు సొంతం చేసుకుంది. రిలీజుకు ముందు మంచి రేటొచ్చినా, దాసరి సలహా మేరకు హక్కులు అమ్మలేదు అక్కినేని. నెల్లూరు, సీడెడ్ ప్రాంతాల హక్కులు మాత్రం అమ్మి, మిగతాచోట్ల సొంత అన్నపూర్ణా ఫిలిమ్స్ ద్వారా రిలీజ్ చేశారు. 31 కేంద్రాలలో రిలీజైన చిత్రం (గూడూరులో 32 రోజులకు తీసేయగా, 28 కేంద్రాల్లో డైరెక్ట్‌గా, ఒక కేంద్రంలో షిఫ్టుతో, మరో కేంద్రంలో నూన్‌షోలతో) మొత్తం 30 కేంద్రాల్లో అర్ధ శత దినోత్సవం చేసుకుంది. అలాగే, 24 కేంద్రాల్లో డైరెక్టుగా, 2 కేంద్రాల్లో షిప్టుతో, 4 కేంద్రాలు సికింద్రాబాద్, ఖమ్మం, గుడివాడ, ఆదోనిల్లో నూన్‌షోలతో మొత్తం 30 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొంది. 16 కేంద్రాల్లో డైరెక్ట్‌గా, 3 కేంద్రాల్లో షిఫ్టుతో, 10 కేంద్రాల్లో నూన్ షోలతో మొత్తం 29 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ (25 వారాలు) ఆడింది. తెలుగులో తొలిసారిగా గుంటూరు విజయా టాకీస్‌లో నేరుగా 365 రోజులు ప్రదర్శితమై, ‘ప్రేమాభిషేకం’ కొత్త రికార్డ్ సృష్టించింది. ఆ హాలులో 380 రోజుల ప్రదర్శన చేసుకుంది. గుంటూరు కాక, మరో 3 కేంద్రాల్లో షిఫ్టులతో, 4 కేంద్రాలలో నూన్ షోలతో – మొత్తం 8 కేంద్రాల్లో ఈ విషాద ప్రేమకథ గోల్డెన్ జూబ్లీ (50 వారాలు) ఆడింది. అటు పైన 5 కేంద్రాల్లో డైమండ్ జూబ్లీ (60 వీక్స్) నడిచింది. తర్వాత విజయవాడ, హైదరాబాద్‌లలో షిఫ్టులు, నూన్‌షోలతో కలిపి, ఏకంగా 527 రోజులు ప్రదర్శితమై, అప్పటి ఉమ్మడి ‘ఆంధ్రప్రదేశ్‌లో ప్లాటినమ్ జూబ్లీ (75 వీక్స్) ఆడిన తొలిచిత్రం’గా రికార్డు సృష్టించింది. అక్కడ ‘మరో చరిత్ర’... ఇక్కడ ‘ప్రేమాభిషేకం’ నిజానికి, ‘ప్రేమాభిషేకం’ కన్నా ముందే 1978లో కమలహాసన్ – కె. బాలచందర్‌ల నేరు తెలుగు చిత్రం ‘మరో చరిత్ర’ తమిళనాట మద్రాసులో ప్లాటినమ్ జూబ్లీ చేసుకొంది. అక్కడి సఫైర్ థియేటర్లో నూన్‌షోలతో ఏకధాటిగా 596 రోజులు ఆడి, ‘ప్లాటినమ్ జూబ్లీ జరుపుకొన్న తొలి తెలుగు చిత్రం’గా నిలిచింది. అలా మద్రాసులో ‘మరో చరిత్ర’, మన తెలుగునాట ‘ప్రేమాభిషేకం’ తొలి తెలుగు ప్లాటినమ్ జూబ్లీ చిత్రాలయ్యాయి. కానీ, విచిత్రంగా ఇక్కడి పబ్లిసిటీలో మాత్రం ‘ప్రేమాభిషేకం’ చిత్రాన్ని ‘తెలుగులోనే తొలి ప్లాటినమ్ జూబ్లీ చిత్రం’గా ప్రకటించుకున్నారు. ఇంకా గమ్మత్తేమిటంటే, దీని తరువాత ప్లాటినమ్ జూబ్లీ (525 రోజులు) రికార్డు దగ్గర దాకా వచ్చిన ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ (1982లో– హైదరాబాద్‌లో 517 రోజులకు), ‘సాగర సంగమం’ (1983లో– బెంగుళూరులో 511 రోజులకు) ఎందుకో అర్ధంతరంగా హాళ్ళ నుంచి అదృశ్యమయ్యాయి. దాని వెనుక ‘ప్రేమాభిషేకం’ పెద్దల మంత్రాంగం ఉందని అప్పట్లో ట్రేడ్ వర్గాల టాక్. చివరకు 1984లో ‘మంగమ్మ గారి మనవడు’ (హైద్రాబాద్‌లో–565 రోజులు) ఆడి ప్లాటినమ్ జూబ్లీ చిత్రాల లిస్టుకెక్కింది. రన్‌లోనూ... కలెక్షన్లలోనూ... కోస్తా ఆంధ్రలో కొత్త రికార్డ్! ఏది ఏమైనా, ‘ప్రేమాభిషేకం’ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఓ కొత్త చరిత్ర అయింది. లేట్ రన్‌లోనూ మరో 50 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం చేసుకుంది. మరో 11 కేంద్రాలలో (డైరెక్టుగా – మదనపల్లి, తుని, చిలకలూరిపేట, బెంగుళూరు, మద్రాసుల్లో, నూన్‌షోలతో – శ్రీకాళహస్తి (తొలి శతదినోత్సవం), నంద్యాల, హిందూపురం, నరసరావుపేట, పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో) వంద రోజులాడింది. లేట్ రిలీజులోనే బెంగుళూరులో నూన్ షోలతో 365 రోజులకు పైగా ప్రదర్శితమైంది. మొత్తం 41 శతదినోత్సవ కేంద్రాలకు గాను 14 కేంద్రాల్లో అక్కినేని చిత్రాలలో ఏకైక శతదినోత్సవ చిత్రంగా నిలిచింది. ‘భార్యాభర్తలు’ (1961) తరువాత మళ్ళీ రెండు దశాబ్దాలకు బెంగుళూరులో అక్కినేనికి ఓ శతదినోత్సవాన్ని అందించింది. ఆ రోజుల్లో ‘ప్రేమాభిషేకం’ కోస్తా ఆంధ్రలోని ప్రధాన కేంద్రాలలో అటు ఆడిన రోజుల్లోనూ, ఇటు వసూళ్ళలోనూ కొత్త రికార్డులు సృష్టించింది. అలా విజయవాడ, గుడివాడ, గుంటూరు, తెనాలి, నెల్లూరు, చిత్తూరు, శ్రీకాళహస్తి, ఏలూరు, తణుకు, తుని, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం తదితర కేంద్రాల్లో రన్‌లోనూ, కలెక్షన్లలోనూ అప్పటికి ‘ప్రేమాభిషేకం’దే సరికొత్త రికార్డ్. అలా తన అభిమాన హీరో అక్కినేనికి దాసరి ఇచ్చిన అపురూప కానుక ఇది. ఊరూవాడా... ఎన్నెన్నో విజయోత్సవాలు ఇన్ని విజయాలు సాధించిన ‘ప్రేమాభిషేకం’కి ఉత్సవాలు చాలా జరిగాయి. విజయవాడలో శతదినోత్సవం, హైదరాబాద్ అన్నపూర్ణా స్టూడియోలో సిల్వర్‌జూబ్లీ, నెల్లూరులో త్రిశతదినోత్సవం, ఆ తరువాత మద్రాసులో స్వర్ణోత్సవం నిర్వహించారు. ఇక, ఊరూవాడా ఫ్యాన్స్ చేసిన వేడుకలకైతే అంతే లేదు. అలా అక్కినేని కెరీర్‌కు కిరీటమైందీ చిత్రం. ఫస్ట్ రిలీజైన నాలుగున్నరేళ్ళ తరువాత 1985 సెప్టెంబర్ 20న అక్కినేని బర్త్‌డేకి భారీ పబ్లిసిటీతో, రాష్ట్రమంతటా ‘ప్రేమాభిషేకా’న్ని సెకండ్ రిలీజ్ చేశారు. అయితే, రిపీట్ రన్లలో అక్కినేని చిత్రాలలో ఎప్పుడూ ముందుండే ‘ప్రేమ్‌నగర్’ లాగా ‘ప్రేమాభిషేకం’ ఆశించిన ఆదరణ పొందలేదు. కానీ అదే ‘ప్రేమాభిషేకం’ మరో పదేళ్ళకు 1995లో ఏ హడావిడీ, అంచనాలూ లేకుండా తెలుగునాట అంచెలంచెలుగా రీ–రిలీజైనప్పుడు మంచి వసూళ్ళు తేవడం విశేషం. అందుకే, ‘ప్రేమాభిషేకం’ జనంలోనూ, బాక్సాఫీస్ జయంలోనూ అసలైన ప్రేమకు జరిగిన అపురూప పట్టాభిషేకం. వరుసగా మూడేళ్ళూ... ఆమెకే అవార్డ్! నిడివి చిన్నదైనా, ‘ప్రేమాభిషేకం’లో వేశ్యగా జయసుధదే కీలకపాత్ర అయింది. అందులోనూ గ్లామర్ నటి శ్రీదేవి ఎదుట ఏ మేకప్పూ లేకుండా ఆమె చూపిన సహజమైన నటన సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించింది. ఆ ఏడాది ఉత్తమ నటిగా నంది అవార్డూ జయసుధకే దక్కింది. ‘ప్రేమాభిషేకం’తో మొదలుపెట్టి వరుసగా మూడేళ్ళు (‘ప్రేమాభిషేకం–1981, మేఘసందేశం–1982, ధర్మాత్ముడు–1983’) ఉత్తమ నటిగా నంది అవార్డులు అందుకొని, జయసుధ హ్యాట్రిక్ సాధించారు. దర్శకుడు కె. విశ్వనాథ్ (ఉత్తమ చిత్రాలు ‘చెల్లెలి కాపురం–1971, కాలం మారింది – 1972, శారద–1973’) తర్వాత అలాంటి హ్యాట్రిక్ మళ్ళీ జయసుధకే సాధ్యమైంది. అక్కినేని, జయసుధ చిత్రం... భళారే విచిత్రం! గమ్మత్తేమిటంటే, 1980లో అక్కినేని పుట్టినరోజైన సెప్టెంబర్ 20న ‘ప్రేమాభిషేకం’ షూటింగ్ మొదలైంది. హైదరాబాద్, చెన్నైలలో 32 షూటింగ్ డేస్‌లో పూర్తయింది. 1981లో సరిగ్గా అక్కినేని పెళ్ళిరోజైన ఫిబ్రవరి 18న రిలీజైంది. గమ్మత్తుగా ఎన్టీఆర్ పుట్టినరోజైన మే 28కి వంద రోజులు పూర్తి చేసుకుంది. అదే రోజున ఎన్టీఆర్, ఏయన్నార్ల కాంబినేషన్లో ఆఖరి చిత్రం ‘సత్యం – శివం’ రిలీజైంది. ఆ భాషల్లో మాత్రం వట్టి రీ ‘మేకు’! గమ్మత్తేమిటంటే, తెలుగులో ఇంత పెద్ద కమర్షియల్ సక్సెస్ అయిన ఈ కథ ఇతర భాషల్లో రీమేక్ అయినప్పుడు ఆశించినంత ఆడలేదు. తమిళంలో ఈ కథను ‘వాళ్వే మాయమ్’ (1982)గా కమలహాసన్‌తో రీమేక్ చేశారు. ఆ తమిళ చిత్రాన్నే మలయాళంలో ‘ప్రేమాభిషేకం’ పేరుతోనే డబ్ కూడా చేసి, రిలీజ్ చేశారు. ఇక హిందీలో సాక్షాత్తూ దాసరి దర్శకత్వంలోనే జితేంద్ర, రీనారాయ్, రేఖ నటించగా ‘ప్రేమ్ తపస్యా’ (1983) పేరుతో అక్కినేనే నిర్మించారు. కానీ, అవేవీ ఆదరణకు నోచుకోలేదు. కమలహాసనైతే అక్కినేనిలా తాను చేయలేకపోయానని బాహాటంగా చెప్పేశారు. కోటి అంటే... కోటిన్నర! ప్రేయసి బాగు కోసం తన ప్రేమనే త్యాగం చేసే క్యాన్సర్ పేషెంట్ హీరో కథకు జనం బ్రహ్మరథం పట్టారు. ‘‘ఈ సినిమా కథ చెప్పినప్పుడే ‘నన్ను నమ్మండి. మీకు మాట ఇస్తున్నా. ఇది బాక్సాఫీస్ వద్ద కోటి రూపాయలు వసూలు చేసే కథ అవుతుంది’ అని నాతో దాసరి అన్నారు. దాసరి అన్నమాట నిలబెట్టడమే కాక, అంతకు మించి ‘ప్రేమాభిషేకం’ కోటీ 30 లక్షలు వసూలు చేసింది’’ అని మద్రాసులో గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్లో అక్కినేని సభాముఖంగా చెప్పారు. అటుపైనా ఆ సినిమా అప్రతిహతంగా ఆడి, ఏకంగా 75 వారాల ప్లాటినమ్ జూబ్లీ చేసుకుంది. చివరకు కోటిన్నర దాకా వసూలు చేసింది. అక్కినేని కెరీర్లో తొలి రూ. కోటి వసూలు చిత్రం ఇదే! ఆయన కెరీర్లో రెండో గోల్డెన్ జూబ్లీ చిత్రం (మొదటిది ‘దసరా బుల్లోడు’) కూడా ఇదే!! ఇంతటి బాక్సాఫీస్ విజయంతో, ‘ప్రేమాభిషేకం’ అప్పట్లో అన్నపూర్ణా స్టూడియోస్‌ను బాలారిష్టాల నుంచి బయటపడేసింది. - రెంటాల జయదేవ -
నో పార్కింగ్
సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది ఉపశీర్షిక. ఎస్. దర్శన్ దర్శకత్వంలో రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ చిత్రంలోని సుశాంత్ కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘మార్చి పోయి సెప్టెంబర్ వచ్చింది.. గేర్ మార్చి బండి తియ్’ (షూటింగ్ మొదలుపెడుతున్న విషయాన్ని ఉద్దేశిస్తూ) అని ట్వీట్ చేశారు సుశాంత్. హీరో సుమంత్ సైతం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘ఆప్యాయత నిండిన అన్ని జ్ఞాపకాలు ఈ రోజు ఎక్కువగా మెదులుతున్నాయి తాతా.. మీ జీవితంలో ఒక చిన్న భాగమైనందుకు జీవితాంతం రుణపడి ఉంటాను, కృతజ్ఞుడనై ఉంటాను’ అని భావోద్వేగపూరితంగా రాసుకొచ్చారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: ఎం. సుకుమార్. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - అక్కినేని నాగేశ్వరరావు
-
ఆంధ్ర ప్యారిస్‌తో అక్కినేనికి అనుబంధం
‘బాలరాజు’గా ‘కీలుగుర్రం’ ఎక్కి.. ‘లైలాను–మజ్నూలా ప్రేమలో ముంచి.. పారూ కోసం ‘దేవదాసు’లా మారి.. ‘అనార్కలి’ కోసం సలీంలో పరకాయ ప్రవేశం చేసి.. ‘మూగ మనసు’తో ముద్ద బంతి పువ్వును మురిపించి.. ‘నవరాత్రి’లో నవరస నటన ప్రదర్శించి.. ‘దసరా బుల్లోడు’గా దుమ్ములేపి.. ‘ప్రేమనగర్’కు ‘మేఘసందేశం’ పంపించి.. అభిమానులకు ‘ప్రేమాభిషేకం’ చేసి.. ‘మనం’ అంతా ఒక్కటే నంటూ మూడు తరాలతో ముచ్చట చేసి దివికేగిన నటసామ్రాట్ అక్కినేని. ఈ అక్కినేనికి అదృష్ట దేవత ఎదురొచ్చి ఆహ్వానించి అద్భుతమైన నటుడిగా నిరూపించుకునే అవకాశం కల్పించింది మన తెనాలి. రేపు అక్కినేని జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం. తెనాలి : అక్కినేని నాగేశ్వరరావు కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని వెంకట రాఘవపురంలో ఓ రైతు కుటుంబంలో 1924 సెప్టెంబరు 20న జన్మించారు. నాగేశ్వరరావుకు మూడున్నరేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి మరణించారు. పొరుగు ఊరిలో ప్రాథమిక పాఠశాలలో చేర్పించినా చదువుపై ధ్యాస ఉండేది కాదు. గ్రామాల్లో జరిగే కోలాటాలు, భజన్లు, ఊరేగింపుల్లో పాటలు పాడేవారితో తిరుగుతూ.. అనుకరించేవాడు. ఈ క్రమంలో పాటలు, పద్యాలు వంటపట్టాయి. తొలిసారి ఆరో తరగతిలో స్కూల్ పిల్లలతో కలిసి ‘హరిశ్చంద్ర’ నాటకంలో నారద పాత్ర వేశాడు. – పాఠశాల వార్షికోత్సవంలో చంద్రమతిగా స్త్రీ పాత్రలో నటించాడు. ఇంటి నుంచి ప్రోత్సాహం ఉండటంతో నాటక సమాజాల్లో వేషాలు వేశాడు. అలా స్త్రీ పాత్రల్లో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో ఓ సారి సినిమా అవకాశం వచ్చినట్టే వచ్చి పోయింది. ఆ తర్వాత నాటకాల్లో వేషాలు కొనసాగించారు. చిన్న వేషంతో సరిపెట్టి.. నాగేశ్వరరావుకు ధర్మపత్ని సినిమాలో అవకాశం వచ్చినా అందులో పిల్లలంతా కలిసి పాడుకునే పాట సన్నివేశంలోనే వేషం ఇచ్చారు. ఆ తర్వాత ముదినేపల్లిలోని ఎక్సెల్షియర్ క్లబ్ కార్యదర్శి దుక్కిపాటి మధుసూదనరావు ఒక నాటక ప్రదర్శనలో అక్కినేనిని చూసి తన నాటక సమాజానికి తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత క్లబ్లో శాశ్వత ప్రాతిపదికన ‘నాయిక’ పాత్రలకు ఒప్పందం చేసుకున్నారు. ఇలా మలుపు తిరిగింది.. క్లబ్ ప్రదర్శించిన తెలుగు తల్లి, సత్యాన్వేషణ, ఆశాజ్యోతి నాటకాలు ప్రాచుర్యం పొందాయి. ఈ క్రమంలోనే ఇతర జిల్లాల నుంచి నాటక ప్రదర్శనలకు క్లబ్‌కు ఆహ్వానాలు ఎక్కువయ్యాయి. అలా తెనాలి నుంచి ఆహ్వానం రావడంతో తెనాలిలో నాగేశ్వరరావు ఆశాజ్యోతి నాటకంలో స్నేహలత పాత్ర పోషణతో స్థానిక ప్రేక్షకులను మెప్పించారు. తిరుగు ప్రయాణంలోనే అక్కినేనిని అదృష్టం ఎదురొచ్చి స్వాగతించింది. అక్కడి నుంచే ఆయన జీవితం కీలక మలుపు తిరిగింది. తెనాలితో ప్రత్యేక అనుబంధం.. నాటకాల్లో సహనటి అంజలి దంపతులు 1957లో తీసిన సువర్ణసుందరి సినిమా శత దినోత్సవానికి నాగేశ్వరరావు స్థానిక స్వరాజ్ టాకీస్‌కు వచ్చారు. తర్వాత అక్కినేని సినీజీవిత వజ్రోత్సవ వేడుకలను తెనాలిలో వైభవంగా నిర్వహించగా, అక్కినేనిని భారీ ఊరేగింపుతో తీసుకొచ్చి సత్కరించారు. దేవదాసు సినిమా 1980ల్లో విడుదలైనప్పుడు తెనాలిలో 300 రోజులు ఆడటాన్ని ఇప్పటికీ చెప్పుకుంటారు. రైల్వేస్టేషన్లో బుల్లోడు.. తెనాలిలో ఓ ప్రదర్శన తర్వాత తిరుగు ప్రయాణంలో విజయవాడ రైల్వేస్టేషన్‌కు నాగేశ్వరరావు నాటక బృందం చేరుకుంది. తోటి సభ్యులతో కలిసి రైలు ఎక్కుతున్న నాగేశ్వరరావును అదే రైల్లోని ఫస్ట్‌క్లాస్ ఏసీలో ఉన్న ప్రతిభా సంస్థ ఘంటసాల బలరామయ్య గమనించారు. దగ్గరకు పిలిచి పేరు, ఊరు వివరాలు తెలుసుకుని ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడిగారు. సీతారామ జననం సినిమాలో శ్రీరాముడు పాత్రధారి కోసం అన్వేషిస్తున్న నిర్మాత బలరామయ్య దృష్టిలో పడిన నాగేశ్వరరావు, ఆయన ఆహ్వానంతో దుక్కిపాటి మధుసూదనరావుతో కలిసి 1944 మే 8న చెన్నైలో అడుగుపెట్టారు. చెప్పినట్టే బలరామయ్య అవకాశమిచ్చి ఆశీర్వదించారు. అప్పటి నుంచి నటనలో వెనుదిరిగి చూడలేదు. దాదా సాహెబ్ ఫాల్కే, పద్మ విభూషణ్ వంటి అత్యున్నత గౌరవాలను అందుకున్నారు. చివరగా ‘మనం’ సినిమాలో కొడుకు, మనుమడితో కలిసి నటించి అక్కినేని మూడు తరాల నటనను వెండి తెరపై పూయించారు. -
చైతూకి 49, సమంతకు 51: సామ్ ట్వీట్!
‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత.. నేటికీ తన మ్యాజిక్‌తో అభిమానులను మాయ చేస్తూనే ఉన్నారు. ఈ సినిమాలో తనతో కలిసి నటించిన హీరో నాగ చైతన్యను ప్రేమించిన ఈ ఆపిల్ బ్యూటీ... తొలి సినిమా జ్ఞాపకాలను వివాహ బంధంతో ముడివేసుకుని.. శాశ్వతంగా గుండెగూటిలో పదిలపరచుకున్నారు. ఇక భార్యాభర్తలిద్దరికీ కెరీర్ పరంగా బిగ్‌బ్రేక్ ఇచ్చిన ఈ సినిమా విడుదలై నేటికి పదేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా... అక్కినేని ఇంటి కోడలికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పదేళ్ల సినీ ప్రస్థానంలో చిరస్థాయిగా నిలిచిపోయే క్షణాల గురించి సమంత తన అభిమానులతో పంచుకున్నారు. లెజండరీ నటుడు, దివంగత అక్కినేని నాగేశ్వరరావు తన గురించి గతంలో చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు. ‘‘ఈ సినిమాలో ఎవరి నటనకు వంద మార్కులు వేయాలంటే... చైతన్యకు 49, సమంతకు 51 మార్కులు వేస్తాను’’ అంటూ నాగేశ్వరరావు పేర్కొన్న వీడియోను ఆమె షేర్ చేశారు. కాగా ఏ మాయ చేశావే, ఆటోనగర్ సూర్య సినిమాల్లో నాగ చైతన్యతో కలిసి నటించిన సమంత.. మనం సినిమాలో చైతూ, నాగార్జున, నాగేశ్వరరావు, అఖిల్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చైతూను పెళ్లాడిన సమంత.. అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగిస్తూ నటిగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక రీల్‌లైఫ్ భార్యాభర్తలుగా నటించిన సామ్- చైతూ రియల్ లైఫ్‌లో భార్యాభర్తలుగా మారిన తర్వాత కలిసి నటించిన తొలి చిత్రం మజిలీ ఎంత హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత నటించిన తాజా చిత్రం జాను కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ❤️🙏 my most favourite moment in these 10 years would have to be this https://t.co/WHrRATC3pC — Samantha Akkineni (@Samanthaprabhu2) February 26, 2020 -
అక్కినేని అంతర్జాతీయ అవార్డులు ప్రకటన
డాలస్, టెక్సాస్: పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 96వ జయంతి (సెప్టెంబర్ 20) సందర్భంగా అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏఎఫ్ఏ) బోర్డు సమావేశం డాలస్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఏఎఫ్ఏ అధ్యక్షురాలు శారద ఆకునూరి మాట్లాడుతూ.. అనేక దశాబ్దాలుగా అక్కినేని నాగేశ్వరరావు గారితో సన్నిహితంగా మెలిగి ఆయనను 1997లోను, 2012లోను టెక్సాస్‌కు తీసుకురావడంలో ముఖ్య కారకులైన డా.తోటకూర ప్రసాద్ నాయకత్వంలో 2014లో ఈ ఏఎఫ్ఏ సంస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటికి వరకు ఐదు అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరుపుకున్నామని అన్నారు. 2019 సంవత్సరానికి గానూ డిసెంబర్ 21న సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నంలో వీఎమ్ఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఆరవ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తున్నామని శారద ఆకునూరి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం, రావు కల్వల, డా. సి.ఆర్ రావులు అక్కినేని గారితో తమకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు ఒక ప్రముఖ సినిమా నటుడిగా మాత్రమే గాక, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషని కొనియాడారు. అక్కినేని అంతిమ శ్వాస వరకు అత్యంత సన్నిహితంగా మెలిగిన అమెరికాలోని మిత్రులం కొంతమంది ‘అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ సంస్థను ఏర్పాటుజేశామని తెలిపారు. డా.అక్కినేని ఒక చిన్న కుగ్రామంలో, అతిసాధారణ కుటుంబంలో జన్మించి కేవలం కృషి, పట్టుదల, ఆత్మ స్థైర్యం, దూరదృష్టితో అద్భుత విజయాలు సాధించడం అనన్య సామాన్యమని, ఈ అంశాలనే ముఖ్యంగా యువతలో ప్రేరేపించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలను జరుపుతున్నామని ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు. 2014లో గుడివాడ, 2015లో హైదరాబాద్, 2016లో చెన్నై, 2017లో ఏలూరు, 2018లో కరీంనగర్లో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరిగాయని తెలిపారు. 2019 అక్కినేని అంతర్జాతీయ పురస్కార గ్రహీతలు “జీవిత సాఫల్య పురస్కారం”– శ్రీమాగంటి మురళీమోహన్, సినీ, వ్యాపార, రాజకీయ రంగాలలో ప్రముఖులు "విద్యా రత్న” – ప్రొఫెసర్. పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఛైర్మన్ "సినీ రత్న"– “మహానటి” చిత్రబృందం, జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్న చిత్రం "వ్యాపార రత్న"- డా. సూరపనేని విజయకుమార్, నిర్మాణ రంగంలో అగ్రగ్రామి, కళాపోషకులు "రంగస్థలరత్న"– పద్మశ్రీ డాక్టర్. శోభానాయుడు, కూచిపూడి నృత్యంలో అగ్రశ్రేణి నర్తకి, నాట్యాచారులు "వైద్య రత్న"- డాక్టర్. ముళ్ళపూడి వెంకటరత్నం, సామాన్య ప్రజల పాలిట పెన్నిధి "సేవా రత్న" – “మన కోసం మనం ట్రస్ట్”– చల్లపల్లి, పరిశుభ్రత, పచ్చదనంలో సమిష్టి కృషి "వినూత్న రత్న"– శ్రీసత్తిరాజు శంకరనారాయణ, పెరేన్నికగన్న పెన్సిల్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ "యువ రత్న” – శ్రీ ఫణికెర క్రాంతికుమార్, సాహసవీరుడు కాగా, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థకు డాక్టర్.ప్రసాద్ తోటకూర(వ్యవస్థాపక అధ్యక్షులు), శారద ఆకునూరి(అధ్యక్షులు), చలపతి రావు కొండ్రకుంట(ఉపాధ్యక్షులు), డాక్టర్.సి.ఆర్.రావు( కార్యదర్శి), రవి కొండబోలు(కోశాధికారి), రావు కల్వల, ధామా భక్తవత్సలు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం బోర్డు అఫ్ డైరెక్టర్స్‌గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలకు www.akkinenifoundationofamerica.org ను సందర్శించండి. -
సత్యం పలికిన పాపం!
బీయస్ రంగా దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, చిత్తూరు నాగయ్య, బి.సరోజాదేవి... నటించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... ఆ విగ్రహాన్ని చూసి రాజావారికి మతిపోయినంత పనైంది. ఏమి అందం! ఏమి అందం!! ‘‘మోహిని కాదురా. వెన్నెల వెలుగులో వెలిగిపోతున్న శిలాప్రతిమ. ఆ మోహిని మోహనమూర్తిని తిరస్కరించే అందాలబొమ్మ. ఏ సిద్ధహస్తుడు చెక్కాడో ఈ చిన్నారిని’’ సంభ్రమాశ్చర్యాలతో అన్నాడు రాజు. ‘‘నేనే ప్రభూ’’ అంటూ ఒక నిరాడంబరుడు అక్కడికి వచ్చాడు. ‘‘నీవా!’’ అంటూ ఆశ్చర్యపోయాడు రాజు. ‘‘సృష్టికర్తను మరిపించే శిల్పాన్ని ప్రదర్శించావు!’’ అని ప్రశంసించాడు. ‘‘అది మానవులకు సాధ్యం కాదు ప్రభూ. ప్రకృతిని చూసే కళాకారుడు ప్రతిరూపాన్ని సృష్టిస్తాడు. ఇది జీవం ఉన్న సింగారి శిల్పం’’ అన్నాడు శిల్పి. ‘‘ఇంతటి సౌందర్యరాశి ఎక్కడ ఉంది?’’ ఆశ్చర్యపోతూ అడిగాడు రాజు. ‘‘ఇక్కడే ఉంది’’ అని జవాబు చెప్పాడు శిల్పి. ‘‘ఇంతటి అందాలబొమ్మ మా అంతఃపురంలో అలంకారం ఉండాల్సిందే. ఈ ప్రతిమను అంతఃపురానికి తరలించండి’’ అని ఆదేశించాడు రాజు. ‘‘వద్దు ప్రభూ... ఇది నా జీవనాధారం... నా కలలసాధనం’’ అని అడ్డుపడ్డాడు శిల్పి. ‘‘శిల్పి! నీ శ్రమకు ప్రతిఫలంగా కోరినంత బంగారం ఇస్తాను. పుచ్చుకో’’ అని ఆశపెట్టాడు రాజు. ‘‘ప్రభూ! అదేనాటికీ జరగదు. నా ప్రాణమైనా వదులుకుంటానుగానీ దీన్ని మాత్రం వదలను’’ అని ఆ సుందర విగ్రహాన్ని గట్టిగా పట్టుకున్నాడు శిల్పి. రాజుగారి అహం దెబ్బతిన్నది. ‘‘ ఈ రాజ్యం నాది... ఈ రాజ్యంలో సర్వస్వం మాదే. మా ఆనందాన్ని, మా వాంఛను ఎవరూ తొలగించలేరు’’ అన్నాడు రాజు. విగ్రహాన్ని తరలించే క్రమంలో పెనుగులాట జరిగింది. విగ్రహం కింద పడి విరిగిపోయింది. ఇది చూసి శిల్పి గుండె పగిలిపోయింది. ‘‘విరిగిపోయిన బొమ్మను నీవే ఉంచుకో. సజీవ ప్రతిమనే మేము దక్కించుకుంటాం’’ అంటూ అక్కడి నుండి కదిలాడు రాజు. ‘‘రాజం...’’ అని పెద్దగా కేకలు వేస్తూ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు రాజు. ‘‘ప్రభూ! తమ రాకతో మా గృహం పావనం అయింది’’ అని ఆనందపడిపోయింది రాజం. ‘‘నీ కూతురెక్కడ?’’ అడిగాడు రాజు. ‘‘అమ్మాయి మంజరీ...’’ అని పిలిచింది రాజం. మంజరి వచ్చింది. ఆమె అందాన్ని చూసి పరవశుడైపోయాడు రాజు. ‘‘ఆహా! మంజరి నిజంగా రంభే. కరిగిన బంగారంలో చంద్రుడిని సానబెట్టి పొడి చేసి మెదిపి ఆ ముద్దతో బ్రహ్మ ఈ మూర్తిని సృష్టించాడు’’ అని పొగడ్తల వర్షం కురిపిస్తూనే... ‘‘ఇంతటి సౌందర్యరాశిని ఇంట్లో దాచి మమ్మల్ని మోసం చేశావా?’’ అని పిడుగులా గర్జించాడు రాజు. ‘‘లేదు ప్రభూ! ముందు నాట్యరాణిని చేసి తమ ముందు...’’ అని గొణికింది రాజం. ‘‘నాట్యరాణి ఎన్నడో అయిపోయింది. మా సంస్థానంలో రాజనర్తకిగా నియమిస్తున్నాను. మంచిరోజు చూసి అంతఃపురంలో నాట్యప్రదర్శన ఏర్పాటు చేయిస్తాను. ఈ నవరత్నముద్రిక నాట్యరాణికి మా ప్రేమచిహ్నం’’ రాజంకు రాజముద్రిక ఇచ్చి ఆ ఇంటి నుంచి వెళ్లాడు రాజు. ఆమె సంతోషానికి పట్టపగ్గాలు లేవు. ‘‘ఈనాటికి మన బాగ్యరేఖ పండి నువ్వు రాజనర్తకి అవుతున్నావు. ఈ సీమలో ఈ గౌరవం మనకే దక్కింది’’ అన్నది కూతురితో. ‘‘ఆ గౌరవం నాకు అక్కర్లేదు. ఆ అంతఃపురంలో నేను నాట్యం చేయను’’ అన్నది గట్టిగా మంజరి. ‘‘ఈ మహాయోగం నీకు పట్టాలని అహోరాత్రాలు కలలు కన్నాను. వెదుక్కుంటూ సిరివస్తే నిరాకరిస్తావా! వీల్లేదు... ఏమైనా సరే నువ్వు నాట్యం చేసి తీరాల్సిందే’’ అంటూ కూతురు మీద గట్టిగా కేకలు వేసింది రాజం. ప్రజలు శిల్పిని చెట్టుకు కట్టేసి కొడుతున్నారు. ఇంతలో ‘‘ఆగండి’’ అనే మాట వినిపించింది. ‘‘రామానుజాచార్యులు వస్తున్నారు’’ అంటూ ప్రజలు పక్కకు తప్పుకున్నారు. ‘‘ ఇతడిని విముక్తి చేయండి’’ అని ప్రజలను ఆదేశించి ‘‘నీవు ఎవరు నాయనా? ఎందుకీ దండన?’’ అని శిల్పిని అడిగాడు. ‘‘సత్యం పలికిన పాపం’’ అన్నాడు శిల్పి. ‘‘నీ ప్రయాణం ఎక్కడికి నాయనా?’’ అడిగారు రామానుజాచార్యులు. ‘‘ఏమో స్వామి! దిక్కులేని వాడిని ఎక్కడికని చెప్పను!’’ అన్నాడు దిక్కులు చూస్తూ ఆ శిల్పి. ‘‘సరే, మా ఆశ్రమానికి రా. అక్కడ నీకు శాంతి లభిస్తుంది నాయనా’’ అని దిక్కులేని అతనికి ఒక దిక్కు చూపారు రామానుజాచార్యులు. ‘‘తమ ఆజ్ఞ’’ అన్నాడు కృతజ్ఞతాభావంతో శిల్పి. ‘‘నీ స్థితి నాకు అర్థమైంది నాయనా. అనిత్యమైన సౌందర్యాన్ని ప్రేమించి సాధ్యం చేసుకోలేదని బాధపడుతున్నావు’’ అన్నారు రామానుజాచార్యులు. ‘‘లేదు స్వామి, నన్ను ఈ లోకం వంచించింది. నా సుందరస్వప్నాలను తుడిచి వేసింది. నాకు ఈ లోకంలో భీకర శాకినీ ఢాకినీ పిశాచాలే కనిపిస్తున్నాయి. వంచన వికటాట్టహాసం చేస్తూ నన్ను బెదిరిస్తోంది’’ అని బాధపడుతూ ‘‘స్వామీ, నాకు ఈ లోకంలో శాంతి లేదా?’’ అని అడిగాడు శిల్పి. ‘‘ఉంది నాయనా.. పువ్వు పుష్పించి నేల రాలినట్టే... కనిపించే అందం అంతా అంతరించిపోతుంది. చరాచర జీవజాలంలో కనిపించే సౌందర్యమంతా ఆ భగవంతుడి లీలావిలాసం. నీ సౌందర్యదృష్టిని నిత్యమైన ఆ అందం వైపు మరల్చు. అర్థం చేసుకో. దానిని కళా రూపంలో సృష్టించి తరతరాల మానవులు దర్శించి ఆనందించి తరించేట్టు చెయ్యి’’ అని ఉపదేశించారు రామానుజాచార్యులు. ‘‘ధన్యోస్మి గురుదేవా! పరమార్థం బోధపరిచి దివ్యజ్యోతిని చూపించావు. శిష్యుడనై నీ సన్నిధిలోనే ఉండి ఆ సాధన చేస్తాను. కాని ఒక ప్రార్థన...’’ అన్నాడు శిల్పి. ‘‘ఏమిటది?’’ అడిగారు రామానుజాచార్యులు. ‘‘నా పూర్వచరిత్ర ఈ క్షణంతో మరుగునపడిపోవాలి’’ అన్నాడు శిల్పి ‘‘అలాగే నాయనా... సుందరనారాయణ విగ్రహాన్ని లోకోత్తరంగా సృష్టించి నీ కళాప్రతిభను సార్థకం చేసుకో’’ అని ఆశీర్వదించారు రామానుజాచార్యులు. సమాధానం: అమరశిల్పి జక్కన -
‘మామయ్యకు మహా ఇష్టం’
పంజగుట్ట: నా మాతృభాష బెంగాళీ.. మా మామయ్య అక్కినేని నాగేశ్వరరావుకు బెంగాళీ సినిమాలంటే ఎంతో ఇష్టమని, పలు సినిమాలను తెలుగులో రీమేక్ చేశారని ప్రముఖ నటి అక్కినేని అమల అన్నారు. బెంగాళీస్ ఇన్ హైదరాబాద్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహించనున్న ఆరవ ‘హైదరాబాద్ బెంగాళీ ఫిల్మ్ ఫెస్టివల్’ వివరాలను ఎర్రమంజిల్‌లోని హోటల్ మెర్క్యూరీలో శుక్రవారం వివరించారు. కార్యక్రమానికి హాజరైన అమల మాట్లాడుతూ.. మా మామయ్యకు బెంగాళ్ సినిమాలంటే ఎంతో మక్కువ అన్నారు. ఈ ఫెస్టివల్‌కు 50 మంది ప్రముఖులు బెంగాళ్, ఇతర రాష్ట్రాల నుంచి హాజరుకావడం సంతోషకరమన్నారు. ఫెస్టివల్ డైరెక్టర్ పార్థ పాతమ్ మలిక్ మాట్లాడుతూ.. ఫెస్టివల్‌ను ఈ నెల 18వ తేదీన అన్నపూర్ణ స్టూడియోలోని శివ థియేటర్లో ప్రారంభిస్తున్నప్పటికీ అధికారికంగా 19వ తేదీన బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ప్రముఖ సినీ నిర్మాత బుద్దదేబ్ దాస్‌గుప్త ప్రారంభిస్తారని తెలిపారు. బెంగాళి సినిమా ఈ యేడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దిగ్గజాల సినిమాలు ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. బెంగాలి ఇన్ హైదరాబాద్ అధ్యక్షురాలు మోసొమి శర్మ, జాయింట్ కన్వీనర్ మాలిక్ బసు పాల్గొన్నారు. -
‘యన్.టి.ఆర్’లో ఏఎన్నార్
నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా టాలీవుడ్ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. సినీ ప్రముఖులు సోషల్ ఈ మీడియా ద్వారా ఏఎన్నార్‌ను స్మరించుకుంటున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రయూనిట్ ఏఎన్నార్‌కు నివాళులర్పిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ బయోపిక్‌లో ఏఎన్నార్ పాత్రలో నటిస్తున్న ఆయన మనవడు సుమంత్ లుక్‌ను రివీల్ చేశారు చిత్రయూనిట్. నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. సాయి కొర్రపాటి, విష్ణువర్దన్ ఇందూరి నిర్మాణంలో తెరకెక్కిస్తుండగా కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ ప్రస్థానాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో యంగ్ హీరో రానా నటిస్తుండగా ఎన్టీఆర్ సతీమణి బసవతారకంగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కనిపించనున్నారు. -
మనం చూడనిది!
‘‘నా వయసు 32’’ అంటున్నారు నాగార్జున. హ్యాండ్సమ్గా ఫిట్‌గా ఉండే నాగార్జున ఏజ్ ఫిఫ్టీ ప్లస్ అయినా థర్టీ ప్లస్ అంటే నమ్మేట్టే ఉంటుంది. ఇంతకీ పని గట్టుకుని ‘32 ఇయర్స్’ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందీ అంటే.. ‘నా వయసు ముప్పై రెండే, కానీ... నటుడిగా’ అన్నారు నాగ్. మే 23తో నటుడిగా నాగార్జున వయసు 32. అదేనండీ ఇండస్త్రీకి వచ్చి 32ఏళ్లు అవుతోంది. నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్’ మే 23న రిలీజ్ అయింది. అదే రోజున అక్కినేని నాగేశ్వరరావు లాస్ట్ సినిమా ‘మనం’ కూడా విడుదలవ్వడం విశేషం. ఈ విషయం గురించి నాగార్జున స్పందిస్తూ – ‘‘కొన్ని సంఘటనలు కాకతాళీయంగా జరుగుతాయా? లేక యూనివర్శ్‌కి నంబర్ గేమ్స్ అంటే ఇష్టమా? అని ఆశ్చర్యపోతుంటాను. నా ఫస్ట్ సినిమా ‘విక్రమ్’, మా నాన్నగారి లాస్ట్ సినిమా ‘మనం’ రెండూ మే 23నే రిలీజ్ అయ్యాయి. మేం ఏదీ ప్లాన్ చేయలేదు. అన్నీ అలా జరిగిపోయాయి. ఆ డేట్ 23ని రివర్స్ చేస్తే 32. అది నా ఏజ్. యాక్టర్‌గా నా వయసు 32. ఇన్ని సంవత్సరాలుగా అందరూ చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘మనం’ సినిమా రిలీజ్ అయి నాలుగు సంవత్సరాలు కావడంతో తండ్రిని గుర్తు చేసుకుంటూ – ‘‘మనం’ రిలీజ్ అయి 4 సంవత్సరాలు అవుతోంది. మమ్మల్నందర్నీ నవ్వించారు, ఏడిపించారు, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. ఇలా ప్రతీ విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాం నాన్నా. ప్రతీక్షణం మీ గురించే ఆలోచిస్తూ చిరునవ్వు తెచ్చుకుంటాం. ఏయన్ఆర్ ఎప్పటికీ బతికే ఉంటారు’’ అని ఉద్వేగంగా పేర్కొన్నారు నాగార్జున. అన్నట్లు ‘మనం’లో ఏయన్నార్ కింద, నాగచైతన్య కుర్చీలో కూర్చుని, నాగార్జున నిలబడి ఉన్న ఫస్ట్ లుక్ బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో కనిపించని రేర్ ఫొటో ఒకటుంది. పైన ఉన్నది అప్పుడు మనం చూడని ఫొటోనే. ‘మనం’ విడుదలై నాలుగేళ్లైన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేసిన ఫొటో ఇది. -
‘ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంటాం నాన్న’
అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన మనం సినిమా రిలీజ్ అయి నేటికి నాలుగేళ్లు. అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ కలిసి నటించిన ఈ సినిమా, దివంగత నటుడు నాగేశ్వరర్రావు చివరి సినిమా కావటం విశేషం. ఆరోగ్యం సహకరించకపోయినా.. చివరి క్షణం వరకు నటిస్తూనే ఉండాలన్న కోరికతో ఈ సినిమాను పూర్తి చేశారు ఏఎన్నార్. మనం సినిమా రిలీజ్ అయి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నాగార్జున ట్వీట్ చేశారు. ‘మనం సినిమా రిలీజ్ అయి నాలుగేళ్లు. నేనెప్పుడూ అదే ఆలోచిస్తుంటా.. మీరు మమ్మల్ని ఏడిపించి, నవ్వించి జీవితాన్ని చావును ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చారు. మేం ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తుంటాం నాన్న’ అంటూ ట్వీట్ చేశారు నాగ్. It’s been 4 yrs since #Manam released. I hv been thinking of how you made us cry,laugh and finally inspire the family to face life and death!! we think of you all the time NANA and we smile🙏 #ANRliveson pic.twitter.com/XjCM1YrFne — Nagarjuna Akkineni (@iamnagarjuna) 23 May 2018 -
తండ్రిగా గర్వంగా.. కొడుకుగా ఈర్ష్యగా ఉంది : నాగ్
కింగ్ నాగార్జున తన సోషల్ మీడియా పేజ్ లో ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. ‘ఈ రోజు నేను తండ్రిగా గర్వపుడుతున్నా.. కొడుకుగా ఈర్ష్య పడుతున్నా.. నేను ఎప్పుడు నా తండ్రి లెజండరీ నటులు అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో నటించలేదు. కానీ ఈ రోజు నాగచైతన్య ఆ పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది’ అంటూ మహానటి సినిమాలోని నాగచైతన్య లుక్‌ను రిలీజ్ చేశారు నాగార్జున. ఎవడే సుబ్రమణ్యం ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుగా యువ నటుడు నాగచైతన్య కనిపించారు. సినిమాలోని నాగచైతన్య పాత్రను పరిచయం చేస్తూ రూపొందించిన వీడియోకు యంగ్ హీరో నాని వాయిస్ ఓవర్ అందించారు. Am today a proud father and a jealous son. I never played my father legendary #ANR Garu. But, I am overwhelmed and very happy to present to you all, Chay as ANR in #Mahanati #ANRliveson 👉 https://t.co/v1FdzRajcp pic.twitter.com/yCWJYDLmb8 — Nagarjuna Akkineni (@iamnagarjuna) 10 May 2018 -
పదం పలికింది – పాట నిలిచింది
ఒక పాత్ర మానసిక స్థితికీ, దాని మేధోస్థాయికీ తగిన పదాలతో రాసిన పాట విన్నప్పుడు ఒక రసస్పందన ఏదో కలుగుతుంది. అలాంటి అనుభూతే 1982లో వచ్చిన ‘మేఘసందేశం’ చిత్రంలోని ‘ఆకాశ దేశాన ఆషాఢ మాసాన’ కలిగిస్తుంది. గీత రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి. అందులో మొదటి చరణంలో నాయకుడు– ‘వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని / కడిమి వోలె నిలిచానని’ అని పాడతాడు. రెండో చరణంలో– ‘రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై / ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని / శిథిల జీవినైనానని’ అని తన మనోవేదననూ, మరణ యాతననూ వెల్లడిస్తాడు. నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద, జగ్గయ్య నటించగా దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం సమకూర్చింది రమేశ్ నాయుడు. పాడింది కె.జె.యేసుదాస్. ఈ చిత్రాన్ని కృష్ణశాస్త్రికి అంకితమివ్వడం గమనించదగ్గది. ఇది అక్కినేని 200వ చిత్రం కావడం మరో విశేషం. -
ఒక పాట రేపిన తుఫాను పూజాఫలం
నాటి సినిమా తుఫాన్లను కనిపెట్టడానికి వాతావరణ శాఖ ఉంది. అది తుఫాను వచ్చే ముందే ఆ సంగతి కనిపెట్టి హెచ్చరికలు చేస్తుంది. ప్రమాద సూచికను ఎగురవేయమంటుంది.జనం జాగ్రత్త పడతారు. కాని ఆడపిల్ల రేపే తుఫానును కనిపెట్టే శాఖ ఏదీ లేదు. హెచ్చరికలు చేసే విభాగం ఏదీ లేదు. జాగ్రత్తలు చెప్పే వ్యవస్థంటూ అసలు లేనే లేదు. అందుకే ఆ తుఫానులో చిక్కుకున్న మగాళ్లు చిక్కుల్లో పడి దోవ తప్పి అల్లకల్లోలం అవుతారు. తాత్కాలిక అంధులై తల్లడిల్లుతారు. తెరిపిన పడటానికి ఒక జీవితకాలం వెచ్చిస్తారు.వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. ఆడపిల్ల చేసిన గాయాన్ని ఆడపిల్లే పూడ్చాలి. అలా పూడ్చగలిగే దేవత ఎదురు రావాలి. వస్తే ధన్యత. చేసిన పూజలన్నీ ఫలించినట్టే. ఈ సినిమాలో అక్కినేని జమీందారు మనవడు. పెద్ద మహలు, ఎస్టేటు, మేనేజరు, నౌకర్లు, తోటలు, పూలు, ఫలాలు, గుర్రాలు పూన్చిన వాహనాలు... అక్కినేని చాలా సిగ్గరి. సంస్కారవంతుడు. భావకుడు. పుస్తకాలు, సంగీతం, గానం... ఇవి అతనికి ఇష్టం. పుస్తకాల ర్యాక్‌లో భాగవతం, సంగీత రత్నాకరం ఉన్నవాడు ఈ కాలం కుర్రవాడు అవుతాడా? కాదు అని చెప్తుంది ఆ మహల్లో అద్దెకు దిగిన జమున. మహలు కింది భాగం బావురుమంటోందని కాలక్షేపానికి ఒక బ్యాంక్ ఏజెంట్‌కు అద్దెకు ఇస్తారు. ఆ ఏజెంట్ కుమార్తే జమున. ఆ అమ్మాయి అసలు అమ్మాయి కాదు. రాకెట్టు. మొహమాటం లేదు. అరమరికలు అసలే లేవు. అంతపెద్ద జమీందారుని కూడా చనువుగా పలకరిస్తుంది. తన బుజ్జికుక్క పిల్లతో అతడిని ఆటలాడమంటుంది. ర్యాక్‌లో ఉన్న గంభీర సాహిత్యాన్ని చూసి డిటెక్టివ్లు, వార పత్రికలు లేవా అని అడుగుతుంది. ఆ అమ్మాయి రాకతో అక్కినేని ఉక్కిరిబిక్కిరి అవుతాడు. అంతవరకు నిస్సారంగా గడుస్తున్న తన జీవితానికి ఒక ఉత్సాహం దొరికినట్టు భావిస్తాడు. తన వయసును తాను గుర్తుకు తెచ్చుకుని హుషారు తెచ్చుకుంటాడు. అవన్నీ పక్కనపెట్టండి– ఒకరోజు సాయంత్రం అతడు కాలేజీ నుంచి మహలుకు చేరుకోగానే పియానో ముందు కూర్చుని ఆమె పాడే పాట వింటాడు. ఎంత జీవనోత్సాహం ఉన్న పాట అది. పగలే వెన్నెలా జగమే ఊయల కదలే ఊహలకే కన్నులుంటే.... అంతే.. ఆ పాటకు ఆమెకు తన మనసు కానుకగా ఇస్తాడు. మరునాడు ఉద్యానవనానికి వెళ్లి సంతోషంగా పాడుకుంటాడు. ఏమని? నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదుర లేచెనెందుకో... కాని ఈ మెలుకువ మృతపాయం కానుంది. తనను కబళించనుంది. ఎందుకంటే జమున మనసులో అక్కినేని అంటే ప్రేమభావం లేదు. సోదరభావం ఉంది. ఎన్నడో చనిపోయిన తన సోదరుణ్ణి అక్కినేనిలో చూసుకుంటూ అతడికి సన్నిహితం అవుతుంది ఆమె. ఈ సంగతి ఏరోజు తెలుస్తుందో ఆ రోజే అక్కినేని సగం చచ్చిపోతాడు. ఆడపిల్ల మనసు ఎటువంటిదో కనిపెట్టడం ప్రాణాంతకమైన విషయంగా గ్రహిస్తాడు. ఈలోపు తండ్రి పని చేసే బ్యాంకు దివాలా తీసి జమున కుటుంబం హటాత్తుగా నిష్క్రమిస్తుంది. కంటి ముందు ఆమె కనిపించకపోయేసరికి అక్కినేని ఇంకా నిర్లిప్తతలో కూరుకుపోతాడు. అదంతా ఆ ఎస్టేట్ మేనేజర్ అయిన గుమ్మడి కూతురు సావిత్రి చూస్తుంది. అతడిని తిరిగి మామూలు మనిషి చేయాలని చూస్తుంది. అతడి పట్ల అనురాగం ప్రదర్శిస్తుంది. సపర్యలు చేస్తుంది. ఆ పాడైపోయిన వీణలో తాను నాదం నింపుతుంది. కాని అక్కినేనికి భయం. పాత గాయం అతణ్ణి దారుణంగా భయపెడుతూ ఉంటుంది. ఈ అమ్మాయి మనసులో ఏముందో... తాను ఈ అమ్మాయిని ఇష్టపడితే కనుక తాను ఏ దృష్టితో చూస్తూ ఉందో. ఒకసారి దెబ్బ తినింది చాలు.. మళ్లీ తినాలా అని సతమతమవుతాడు. కాని అతడి మనసు అప్పటికే ఆమెతో నిండిపోయింది. ఆ సంగతి చెప్పలేడు. ఆమె ఇష్టాన్ని గ్రహించలేడు. ఏం చేయాలో అర్థం కాక తనను తాను హింసించుకోవడానికి అన్నట్టు గానాబజానాల వాళ్ల వెంట తిరుగుతూ ఉంటాడు. మరోవైపు దూరపుబంధువులు ఎస్టేటు మీద దావా వేసి అస్తి పెండింగ్‌లో పడేట్టు చేసి అతణ్ణి రోడ్డు మీదకు తెస్తారు. భౌతికంగా మానసికంగా సంక్షోభంలో ఉన్నా సావిత్రి అతడి నీడ వదలదు. ఆరాధిస్తూనే ఉంటుంది. చివరకు అతడు ధైర్యం చేస్తాడు. ఆమెకు తన మనసులో మాట చెప్తాడు. ఆమె సంతోషంతో ఉక్కిరిబిక్కిరై అతడి పాదాల మీద పడుతుంది. కథ సుఖాంతమవుతుందనుకునేంతలో దాయాదులు వేసిన పన్నాగంలో యాక్సిడెంట్ అయ్యి అక్కినేనికి మతి పోతుంది. జగ్గయ్య వంటి మిత్రుడు వైద్యం చేస్తున్నా వేరే ఏదో ఓదార్పు అవసరమవుతుంది. అప్పుడు జమునను అక్కినేని ముందుకు తీసుకుని వస్తారు. అన్నేళ్ల క్రితం పాడిన పాటను తిరిగి ఆమె పాడుతుంది. పగలే వెన్నెలా.. జగమే ఊయలా... మరో వైపు సావిత్రి అతడికెంతో ఇష్టమైన వయొలిన్‌ని అతడి చేతుల్లో పెట్టి వాయించమంటుంది. అటు పాట.. ఇటు సంగీతం.. చెదిరిన అతడి స్థిరత్వాన్ని వెనక్కు తీసుకువస్తాయి. అతడు మామూలు మనిషి అవుతాడు. సావిత్రి అతణ్ణి తన మనిషిగా గెలుచుకుంటుంది. సావిత్రికి భక్తి ఎక్కువ. ఎప్పుడూ పూజలో ఉంటుంది. ఆ పూజ వృ«థాపోలేదని ఫలం దక్కిందని కథ. కాని ఆ పూజ కన్నా అక్కినేని పట్ల ఆమె ప్రదర్శించిన ఆరాధన ఎక్కువ. ఆ ఆరాధనే ఆమెకు అతణ్ణి తిరిగి అప్పజెప్పిందని అర్థం చేసుకోవాలి. 1964లో వచ్చిన ‘పూజాఫలం’ మ్యూజికల్. పాటల కంటే కూడా నేపధ్య సంగీతం ద్వారా ఒక బ్యాలే లాగా ఈ సినిమా కొనసాగుతుంది. సినిమా అంతా వయొలిన్, వీణ, ఏదో ఒక రాగం, గానం ఉంటాయి. ఇలాంటి సబ్జెక్ట్‌ను బి.ఎన్.రెడ్డి కాకుండా ఇంకెవరు తీసినా ఇది ఒక్కరోజు కూడా ఆడి ఉండేది కాదు. బి.ఎన్. వల్లే ఇది క్లాసిక్ స్థాయిలో నిలబడింది. ముఖ్యంగా క్లయిమాక్స్‌లో అక్కినేని వయొలిన్ వాయించడం మొదలుపెట్టి తన మానసిక స్థితికి తగ్గట్టుగా కాసేపు శృతిలో మరికాసేపు అపశృతిలో వాయించే సన్నివేశం ఇంతకు మునుపు లేదు అటు తర్వాత కూడా లేదు. క్యారెక్టరైజేషన్, కథ నడక... వీటన్నింటిలో బిఎన్ మార్కు కనిపిస్తుంది. ఆయనకు నప్పని కామెడీ ట్రాకును పెట్టినా పొట్టి ప్రసాద్, రమణారెడ్డి, రేలంగి దానిని పండించే ప్రయత్నం చేస్తారు. సంగీత దర్శకుడిగా సాలూరి రాజేశ్వరరావు ప్రావీణ్యం ఈ సినిమాలో అడుగడుగునా గమినంచవచ్చు. కథారచయిత మునిపల్లె రాజు రాసిన ‘పూజారి’ అనే నవల ఆధారంగా తీసిన ఈ సినిమా అసలు సిసలు అక్కినేని సినిమా అనిపిస్తుంది. ఆయన కాకపోతే ఎవరూ ఈ పాత్రను చేయలేరు. చేసినా ఎవరూ చూడలేరు. అబ్బాయి మనసులో అమ్మాయిని పెట్టుకుని ఆ సంగతి బయటపెట్టక నలుగుతూ ఉండటం ఈ సినిమాతోనే మొదట చూపారనిపిస్తుంది. ఈ సినిమా వచ్చిన చాలా రోజుల తర్వాత ఇటువంటి కథాంశం ఉన్న సినిమాలు అనేకం తెలుగులో, తమిళంలో వచ్చాయి. తెలుగులో డబ్ అయిన ‘హృదయం’, పవన్ కల్యాణ్ ‘తొలి ప్రేమ’ ఇవన్నీ చివరి వరకూ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడానికి సతమతమయ్యేవే. పూజాఫలం నీట్ అండ్ క్లీన్ సినిమా. అబ్బాయిల సినిమా. అబ్బాయిల మనసును కొద్దో గొప్పో చెప్పిన సినిమా. ఫలించిన సినిమా. ప్రాక్టీసు పెడితే రెండు లక్షలు ఈ సినిమా 1964లో వచ్చిందని చెప్పుకున్నాం. దీనికి మాటలు రాసిన డి.వి.నరసరాజు ఆ నాటి కట్నం లెక్కలు ఒక డైలాగులో చెప్పించారు. ఎస్ఎస్ఎల్సీ పాసైతే పదివేలు. బి.ఏ. పాసైతే పాతిక వేలు. ఎంబిబిఎస్ చేరితే యాభై వేలు. పాసైతే లక్ష. ప్రాక్టీసు పెడితే రెండు లక్షల కట్నం ఆ రోజుల్లో మార్కెట్లో ఉందట. మరి ఈ రోజుల్లో ఎంబిబిఎస్ పాసై ప్రాక్టీసు పెట్టిన వాళ్లు ఎంత డిమాండ్ చేస్తున్నారో కాని మగపిల్లలను కట్నం కోసమే పెద్ద చదువులు చదివించే మనస్తత్వం మాత్రం ఇంకా పోలేదు... అనుకునే దాఖలాలు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. – కె -
కళాతపస్వికి అక్కినేని జీవిత సాఫల్యపురస్కారం
డాలస్‌లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా బోర్డు సమావేశం డాలస్, టెక్సాస్: పద్మవిభూషణ్ డాక్టర్.అక్కినేని నాగేశ్వర రావు 94వ జయంతి సందర్భంగా డాలస్‌లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా బోర్డు సమావేశం అయ్యింది. అమెరికాలో “అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” ను 2014 లో స్థాపించామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. తోటకూర ప్రసాద్ తెలిపారు. నాగేశ్వరరావు 'కృషి, పట్టుదల, ఆత్మస్తైర్యం, దూరదృష్టి' అనే విశిష్ట లక్షణాలు ముఖ్యంగా యువతరానికి స్ఫూర్తిదాయకం కావాలనే ఉద్దేశ్యంతో భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్కినేని అంతర్జాతీయ పురస్కారాన్ని జరుపుతున్నామన్నారు. 2014లో గుడివాడ, 2015 లో హైదరాబాద్, 2016లో చెన్నైలో జరిపామని తెలిపారు. ఈ సంవత్సరం డిసెంబర్ 16 న ఏలూరులో ఈ పురస్కార ప్రదానోత్సవం జరుపుతున్నామని, ఈ సందర్భoగా వివిధ రంగాలలో నిష్ణాతులైన వారికి పురస్కారాలను అందజేస్తున్నామని తోటకూర ప్రసాద్ పేర్కొన్నారు. అనేక ఉత్తమ చిత్రాలు నిర్మించి తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె. విశ్వనాథ్‌కి “జీవిత సాఫల్య పురస్కారం” అందజేయనున్నట్టు వెల్లడించారు. అత్యున్నత ప్రమాణాలతో విద్యా సంస్థలు నిర్వహిస్తూ, యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్న గీతం విశ్వవిద్యాలయాల వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ఎం.వి.వి.ఎస్ మూర్తికి 'విద్యా రత్న'; ప్రముఖ నటులు, సినీ, నాటక రచయిత గొల్లపూడి మారుతీరావుకి 'సినీ రత్న'; అత్యధిక చలన చిత్రాల పంపిణీదారులు, నిబద్ధతతో వ్యాపారం చేస్తున్న ఉషా ఫిలిమ్స్ అధినేత డాక్టర్. వి.వి. బాల కృష్ణారావుకి 'విశిష్ట వ్యాపార రత్న'; కార్మిక స్థాయి నుండి ప్రజాకవిగా ఎదిగి ప్రజాభిమానాన్ని చూరగొంటున్న ప్రజాకవి వంగపండు ప్రసాదరావుకి 'రంగస్థల రత్న'; విదేశాలలో పని చేస్తూ ఎక్కువ డబ్బు గడించే అవకాశాలువచ్చినప్పటికీ వాటిన్నంటిని వదులుకొని మాతృదేశంలోనే ఉండి వేలాది మందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్. గుడారు జగదీష్‌కి 'వైద్య రత్న'; ‘మానవ సేవే మాధవ సేవగా’ భావిస్తూ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడానికి విద్యార్థులకు అవసరమైయ్యే శిక్షణను అందజేస్తూ వందలాది మంది యువత మంచి ఉద్యోగాల్లో స్థిరపడటానికి సహాయం చేస్తున్న మానవతావాది, తన స్వగ్రామాభివృద్ధికి ఎంతో పాటుపడుతున్న మాయలూరి మనోహర్ రెడ్డికి 'సేవారత్న'; అంధత్వ లోపం ఉన్నప్పటికీ దాన్ని లెక్కచేయకుండా తనకున్న అద్భుతమైన జ్ఞాపక శక్తి , స్ఫూర్తిదాయక ప్రసంగాలతో విశేష ప్రతిభ కనబరుస్తున్న షాకీర్ మహమ్మద్‌కి 'వినూత్న రత్న'; ఎన్ని అవాంతరాలు ఎదురైనా చెక్కుచెదరని ధైర్యంతో అన్నింటిని ఎదుర్కొని అంత్యంత చిన్నవయస్సులో, ప్రపంచంలోనే మొదటి మహిళా పైలట్‌గా (బోయింగ్ - 777) ఎంపికైన కెప్టెన్ అన్నే దివ్యకు 'యువ రత్న' పురస్కారాలను అందజేస్తున్నామని వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్. ప్రసాద్ తోటకూర, అధ్యక్షులు డాక్టర్. సి.ఆర్. రావులు ఓ పత్రికా ప్రకటనలో తెలియజేశారు. డాక్టర్. ప్రసాద్ తోటకూర (వ్యవస్థాపక అధ్యక్షులు), డాక్టర్. సి.ఆర్. రావు (అధ్యక్షులు), రావు కల్వల (ఉపాధ్యక్షులు), శారద అకునూరి ( కార్యదర్శి), చలపతి రావు కొండ్రకుంట (కోశాధికారి), రవి కొండబోలు, ధామా భక్తవత్సలు , డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం బోర్డు అఫ్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సంవత్సరం ఏలూరులో 4వ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవానికి మోహన్ ముళ్లపూడి సమన్వయకర్త గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలకు www.akkinenifoundationofamerica.orgను సందర్శించండి. -
ఇదో మనవరాలి కథ
నాటి సినిమా మాట తప్పని తండ్రి – ఆ తండ్రి పెంపకంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే వ్యక్తిగా పెరిగిన కొడుకు – తండ్రీకొడుకుల మంచితనాన్ని పుణికి పుచ్చుకున్న మనవరాలు. ముగ్గురూ మంచితనానికి కేరాఫ్ అడ్రస్. సీతారామయ్యగారు గొప్పవారు. తాతయ్యకు బాధ కలగకుండా ఉండటానికి మనసులో బాధను దిగమింగుకునే మనవరాలు ఇంకా గొప్ప. తండ్రీ–కొడుకు– మనవరాలు... ఈ మూడు పాత్రల చుట్టూ తిరిగే ఎమోషనల్ జర్నీ ‘సీతారామయ్యగారి మనవరాలు’. ఈ తాతా మనవరాలి కథ ఏంటంటే... గోదావరి తీరంలోని సీతారామపురం ఊరి పెద్ద సీతారామయ్య (అక్కినేని నాగేశ్వరరావు). భార్య జానకి (రోహిణి హట్టంగడి), ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. ఇది సీతారామయ్య కుటుంబం. కొడుకు శ్రీనివాస మూర్తి అలియాస్ వాసు (రాజా)కి తండ్రంటే ప్రాణం. కొడుకంటే తండ్రికి కూడా బోల్డంత ప్రేమ. ఫాదర్–సన్ అనడంకంటే ‘బెస్ట్ ఫ్రెండ్స్’ అనడం కరెక్ట్‌గా ఉంటుంది. కొడుక్కి పెళ్లి సంబంధం చూస్తాడు సీతారామయ్య. ఆ విషయం చెప్పేలోపే వాసు తాను సుమతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తండ్రికి చెబుతాడు. మునసబుని వియ్యంకుణ్ణి చేసుకుంటానని మాటిచ్చేసానంటాడు తండ్రి. సుమతికి మనసిచ్చానంటాడు కొడుకు. తండ్రి మాటకు ఊళ్లో ఎంత విలువ ఉందో చెప్పి, పెళ్లికి ఒప్పుకోమంటారు వాసు అక్కా బావ. అటువంటి తండ్రి కడుపున పుట్టిన కొడుకుగా మాట తప్పలేనంటాడు వాసు. తప్పక పెళ్లికి ఒప్పుకుంటాడు సీతారామయ్య. అవే చివరి మాటలు! పాతికేళ్లు ప్రతి మాటనూ పంచుకున్న కొడుకు మనసిచ్చిన అమ్మాయి గురించి ఒక్క మాట కూడా ముందు చెప్పకపోవడం తనను అవమానించినట్లుగా, అగౌరవించినట్లుగా భావిస్తాడు సీతారామయ్య. సుమతి, తానూ డాక్టర్స్ కాబట్టి, ఊళ్లో ఆస్పత్రి కట్టిస్తే, ఇక్కడే ఉంటామంటాడు వాసు. ఆస్పత్రి కావాలంటే ఆస్పత్రి, ఆస్తి కావాలంటే ఆస్తి.. ఏదైనా ఇచ్చేస్తా.. కానీ, ఎప్పటికీ నాతో మాట్లాడకూడదంటాడు. కొడుకుతో సీతారామయ్య మాట్లాడే చివరి మాటలవే. ఈ తండ్రీకొడుకుల మధ్య జానకమ్మ నలిగిపోతుంది. పుట్టిన తర్వాత కొడుకు చేసిన మొదటి తప్పుని క్షమించమని జానకమ్మ బతిమాలుతుంది. తాను కూడా మొదటిసారి మాట తప్పానంటాడు సీతారామయ్య. మరోవైపు కోడలు సుమతి అన్యోన్యంగా ఉన్న తండ్రీకొడుకులు తన కారణంగా విడిపోయారని బాధపడుతుంది. చేసేదేం లేక భార్యతో సహా ఇంటి నుంచి వెళ్లిపోతాడు వాసు. కాలం ఎవరికోసమూ ఆగదు. 20 ఏళ్లు గడిచిపోతాయ్. పైకి మామూలుగానే ఉన్నా సీతారామయ్య మనసులో కొడుకు జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. బాధను బయటపెట్టకుండా సీతారామయ్య, జానకమ్మ గంభీరంగా రోజులు గడుపుతుంటారు. కట్ చేస్తే... అమెరికా టు ఇండియాకి సీత సీతారామయ్య మనవరాలి (పెద్ద కుమార్తె కూతురు) వివాహం కుదురుతుంది. ఈ పెళ్లికి సీతారామయ్య మరో మనవరాలు (వాసు కూతురు) సీత (మీనా) అమెరికా నుంచి ఇండియా వస్తుంది. మనవరాలిని చూసి, మురిసిపోతుంది జానకమ్మ. సీతారామయ్య మనసు మురిసినా బయటపడడు. ‘నా పేరు సీత.. మీ పేరే’ అంటూ తాతయ్యతో మాటలు కలిపిన మనవరాలికి మెల్లమెల్లగా దగ్గరవుతాడు సీతారామయ్య. పెరిగింది అమెరికాలో అయినా తెలుగింటి పిల్లలా మనవరాలు ఉండటం, సంస్కృతీ సంప్రదాయాలకు విలువ ఇవ్వడం సీతారామయ్య మనసుని ఆకట్టుకుంటుంది. మనవరాలిలో కొడుకుని చూసుకుంటాడు. మాట పట్టింపుతో కొడుకు తన ఇంటికి రాలేదని ఓ మూల బాధపడతాడు. అంతా సాఫీగా సాగుతోందనుకుంటున్న సమయంలో అమెరికా నుంచి వాసు ఫ్రెండ్ (మురళీమోహన్) ఇండియా వచ్చి, సీతారామయ్యగారింటికి వెళతాడు. ‘మా అబ్బాయి ఎప్పుడు వస్తాడు’ అని సీతారామయ్య దంపతులు అడగడంతో తన తల్లిదండ్రులు చనిపోయిన విషయాన్ని సీత దాచిన విషయం అతనికి అర్థమవుతుంది. చెప్పొద్దని మురళీమోహన్‌తో సీత విన్నవించుకుంటుంది. అతను వచ్చిన దారినే అమెరికా చెక్కేస్తాడు. మనవరాలిలోనే కొడుకు ‘నీలో నన్ను చూసుకునేవరకూ తాతయ్యకు నేను చనిపోయిన విషయం చెప్పకు’ అని తండ్రి చివరి క్షణాల్లో చెప్పిన మాటను నిలబెట్టడానికి సీత విశ్వప్రయత్నం చేస్తుంది. దుఃఖాన్నంతా లోపల మింగేసుకుని, బయటికి నవ్వుతుంటుంది. ఇప్పుడో చిక్కొచ్చి పడుతుంది. సీతారామయ్య–జానకమ్మల షష్టిపూర్తి వేడుక నిర్ణయం అవుతుంది. ఆ వేడుకకు కొడుకు వస్తాడని ఆశిస్తారు. వాసు రాడు? మరీ ఇంత పట్టింపా? అని సీతారామయ్య బాధపడిపోతాడు. ఎలాగైతేనేం వేడుక బాగానే జరుగుతుంది. ఆ తర్వాత జరగకూడనిదే జరుగుతుంది, జానకమ్మ హఠాన్మరణం ఇంటిల్లిపాదినీ కుంగదీస్తుంది. ఇప్పుడైనా కొడుకు వస్తాడని ఎదురు చూస్తాడు సీతారామయ్య. రాకపోవడంతో ఈసారి బాధ.. కోపంగా మారుతుంది. ‘నువ్విక్కడే ఉంటే నా కొడుకు లేని వెలితి బాగా కనిపిస్తోంది. అమెరికా వెళ్లిపో’ అంటాడు మనవరాలితో. సీత కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. చివరకు తాతయ్య చెప్పినట్లే అమెరికా ప్రయాణమవుతుంది. కానీ, అప్పటివరకూ రాసుకున్న డైరీని మరచిపోయి, వెళ్లిపోతుంది. అది చదివి, కొడుకు చనిపోయిన విషయం తెలుసుకున్న సీతారామయ్య ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి మనవరాలిని వెనక్కి తీసుకొస్తాడు. కొడుకు అస్తికలను గోదావరిలో కలుపుతాడు. ‘మా నాన్న మీకు గిఫ్ట్ పంపించాడు’ అంటూ ఇంటికొచ్చిన రోజున మనవరాలు ఇచ్చిన చేతి కర్రను నదిలో విసిరేస్తాడు. దీని అవసరం లేదు.. నువ్వున్నావుగా అంటూ మనవరాలిని అక్కున చేర్చుకుంటాడు. ఇది ఓ మనవరాలి కథ. అందుకే ఏయన్నార్ లాంటి స్టార్ ఉన్నప్పటికీ ‘సీతారామయ్యగారి మనవరాలు’ అని టైటిల్ పెట్టారు. ఆ మనవరాలి ప్రేమ, త్యాగం మనసుని మెలిపెడతాయి. తప్పంతా పరిస్థితులదే మాట ఇచ్చిన తండ్రిదీ తప్పు కాదు. తండ్రి మాటను కాదన్న కొడుకుదీ కాదు. తప్పంతా పరిస్థితులదే. మానస రాసిన ‘నవ్వినా కన్నీళ్లే’ అనే నవల ఆధారంగా తీసిన సినిమా ఇది. గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిచయ వాక్యాలతో సినిమా గంభీరంగా మొదలవుతుంది. నవలను దర్శకుడు క్రాంతికుమార్ వెండితెరకు ట్రాన్స్ఫామ్ చేసిన తీరు బాగుంటుంది. కళ్లెదుటే జరుగుతున్న కథేనేమో అన్నంతగా హృదయాన్ని తాకే సన్నివేశాలతో తీశారు. అక్కినేని నాగేశ్వరరావు తొలిసారి విగ్ లేకుండా నటించిన సినిమా. ‘సీతారామయ్య’లాంటి పాత్రలు చేయడం ఆయనకు కష్టం కాదు. జీవించేశారు. ఏయన్నార్‌కి దీటుగా నటించగలిగింది మీనా. బాలనటిగా మెరిసిన మీనా మెయిన్ లీడ్ చేసిన మొదటి సినిమా ఇది. అద్భుతంగా నటించింది. ఈ పాత్రల్లో వీళ్లను తప్ప వేరేవాళ్లను చూడలేం అన్నంతగా రోహిణి హట్టంగడి, రాజా, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు తదితరులు నటించారు. అతిథి పాత్రలో దాసరి నారాయణరావు గోదావరి యాసలో నవ్వించారు. ‘పూసింది పూసింది పున్నాగ’, ‘భద్రగిరి రామయ్య’, ‘కలికి చిలకల...’ వంటి పాటలతో సినిమా హాయిగా సాగుతుంది. కీరవాణి ఇచ్చిన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ ప్లస్.1991లో వచ్చిందీ సినిమా. విడుదలై పాతికేళ్లవుతున్నా సీతారామయ్యగారు, ఆయన మనవరాలు మనసుల్లో నిలిచిపోయారంటే కథ గొప్పతనం అది. ఏయన్నార్ అభినందనను మరచిపోలేను – మీనా ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమాకి ఛాన్స్ వచ్చినప్పుడు కొంచెం భయపడ్డాను. అక్కినేని నాగేశ్వరరావుగారితో సినిమా చేయడం అంటే మాటలా? టెన్షన్ అనిపించినప్పటికీ మంచి ఛాన్స్ అని ఒప్పుకన్నా. నాగేశ్వరరావుగారు బాగా మాట్లాడేవారు. దాంతో నా భయం మొత్తం పోయింది. ‘మనం ఎవరి కోసమైనా వెయిట్ చేయొచ్చు.. మనకోసం ఎవరూ వెయిట్ చేయకూడదు. పంక్చువాల్టీ ముఖ్యం’ అని ఏయన్నార్‌గారు నాకో సలహా ఇచ్చారు. అది ఎప్పటికీ మరచిపోలేను. అలాగే సినిమా విడుదలైన తర్వత, ‘లొకేషన్లో నువ్వు యాక్ట్ చేసినప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ, సినిమాలో చూస్తే చాలా బాగానే యాక్ట్ చేశావ్ అనిపించింది’ అని మెచ్చుకున్నారు. అది మరచిపోలేను. చెన్నయ్‌లో జరిగిన వందేళ్ల భారతీయ సినిమా పండగ (2014) అప్పుడు అన్ని భాషలవాళ్లు వచ్చారు. అక్కడే ఏయన్నార్‌గారి పుట్టినరోజు వేడుక జరిగింది. ఆ వేడుకలో నేను పాల్గొన్నాను. ఆయన్ను చూడటం అదే చివరిసారి. ‘మనం’ చూసినప్పుడు ఎమోషనల్ అయ్యాను. తల్లిదండ్రులు చనిపోయారనే విషయం తాతయ్య–నానమ్మలకు చెప్పలేక గోదావరి తీరాన మీనా ఏడవడం, తాతయ్య అమెరికా వెళ్లిపొమ్మన్నప్పుడు పడే బాధ ప్రేక్షకుల కళ్లు చెమర్చే సన్నివేశాలు. కొడుకు పంపిన బహుమతి (చేతికర్ర)ని సీతారామయ్య ఆప్యాయంగా తడిమి చూసుకునే సీన్, అది చూసి జానకమ్మ మురిసిపోవడం అలరిస్తాయి. ‘పెళ్లి చేసినట్లే చేసి నాకు మరణశిక్ష విధించారు’, ‘కన్నతండ్రికి అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడా మీ నాన్న.. వాడి కోసం ఒక్క మెట్టు కూడా దిగను’, ‘మాటకు విలువ తెలియనవాడితో నన్ను మాట్లాడమని అడగొద్దు’ వంటి డైలాగ్స్ సూపర్బ్. గణేశ్ పాత్రో రాసిన ఇలాంటి సంభాషణలు సినిమాకు బలం. 1991లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. నాలుగు నంది అవార్డులు దక్కించుకుంది. మలయాళంలో ‘సంధ్వానమ్’గా, కన్నడంలో ‘బెల్లి మొదగళు’ పేరుతో, హిందీలో ‘ఉదార్ కీ జిందగీ’గా రీమేక్ అయింది. – డి.జి. భవాని -
రికాడ్డేన్స్
అన్ని రికాడ్డేన్స్ల గురించీ మనం చెప్పలేపోవొచ్చునేమో గానీ, అంభేరుపురం రికాడ్డేన్స్ మటికి చాలా ఆరోగ్యకరమైంది. మనసుని నిండుగా చేసీసీది. పిల్లాపాపల్తో కలిసి చూడబుల్‌గా ఉండీది. బాగుండీది. మా చోడవరం కంటే అంభేపురవేంటీ పెద్ద పొడిచీసిన ఊరుగాదు. చిన్నూరే. కాపోతే, అక్కడ పందార ఫేట్రీ ఉంది. భూషణం రికార్డింగ్ డేన్స్ ట్రూపూ ఉంది. కాబట్టికే ఆ ఊరికి కొంత గర్రా. గొప్పున్నోడు ఫోజులు కొడతాడు. భరించాలి. జుత్తున్నమ్మ ముడేసుకుంటుంది. మాటాడగూడదు. అంభేరుపురం డేన్స్ ట్రూపు ఎలాంటిదంటే, అదంతా ఒక కుటుంబం కిందే లెక్క. అక్కినేని నాగేశ్వరరావుగా భూషణంబాబు స్టెప్పులు దంచీవాడు. కిశోర్కుమారయితే నందమూరి తారక రామారావుని స్టేజీమీద దింపీసీవాడు. వాళ్ల చుట్టాలమ్మాయిలే వాళ్ల పక్కన హీరోయిన్లు. ఫీమేల్ ఆర్టిస్టుల కోసం వెతుక్కోనక్కర్లేదన్నమాట. వరాలని ఒక పిల్ల ఉండీది. ఆ పిల్లా భూషణం దూరపు బంధువే. క్లబ్డ్యాన్సులు గట్రా చేసీది. బాబ్జీ అని ఉండీవాడు. అతగాడేమో హిందీ పాటలు, పవర్ స్టార్ క్రిష్ణ డేన్సులు వేసీవాడు. ‘తనే రాజబాబు.. రాజబాబే తను..’ అని తల్లితోడుగా నమ్మీసీ ఎండు నరం లాంటి వాడొకడు ఎప్పుడూ రడీరడీచ్చే. వీడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి లాంటివాడు. ఒక ట్రూపులో పెరమనెంటుగా ఉండడు. ఎవరు పిలిస్తే వాళ్ల దగ్గరికి పోతాడు. ఆ రాత్రికి డేన్సేస్సి డబ్బులు పట్టూ పోతాడు. సరుకున్నవాడు. అందుకే వీడికి డిమేండెక్కువ. రాజమండ్రి అనకాపల్లి కేంద్రాలుగా చాలా రికార్డింగ్ డేన్స్ బృందాలుండీవి. కాదన్లేదు. వేల్పుల వీర్రాజు, ఉదయ్ కుమార్, అశోక్ కుమార్లాంటి వాళ్లు ఆ రోజుల్నాడు బాగానే ఏలీవారు. వాళ్లకి ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ కాదు మా భూషణం. చోడవరం వినాయకుడి నవరాత్రులప్పుడు బాలగణపతి సంఘం తొలీతా బుక్ చేసీది ఇతగాణ్ణే. తనూ కాదనీవాడు కాడు. పొయ్యికాడ ఆకుమడి పోగ్రాం కాదనీసి ఎక్కడెక్కడో తిరిగితే ఏం లాభం.. డబ్బు మిగలొచ్చునేమో గానీ నలిగిపోతాం.. సుఖవుండదు.. అనుకునీవాడు. వెంటనే బాలగణపతి సంఘానికి మాటిచ్చీసీవాడు. భూషణం ట్రూపు డ్రస్సులు భలే ఉండీవి. ఆయన స్వయానా టైలరు. నలభైయ్యేళ్ల కిందట టీవీలెక్కడివి. గూగుల్లూ, యూ ట్యూబులూ ఎక్కడని చచ్చేయి. అయినా భూషణానికి లోటు లేదు. ఒకసారి సినిమా చూస్తే చాలు. హీరో హీరోయిన్ల స్టెప్పులు, డ్రస్సులు అన్నీ గుర్తుపెట్టీసుకునీవాడు. తనేసుకుని ఏఎన్నార్ బట్టలు కుట్టుకునీవాడు. తన హీరోయిన్ రత్నావళికి వాణిశ్రీ దుస్తులు సిద్ధపరిచీవాడు. ఎన్టీఆర్‌గా చేసీ కిశోర్‌కి పెద్ద కాలర్ చొక్కాలు, బెల్‌బాటమ్ ఫేంట్లు క్షణాల మీద తయారుపెట్టీవాడు. అతని పక్కన కథానాయికకీ బట్టలు రైట్ చేసీవాడు. మిగతా డ్యాన్సర్లకి కూడాని చాలా శ్రద్ధగా మేకప్ సామాన్లు, డ్రస్సులు కొనిచ్చీవాడు. చోడవరం ఎంతో దూరం కాదు గనక రిక్షాల మీద బయలుదేరిపోయీవాడు. ప్రోగ్రాం జరిగీ గణపతి గుడికి చవితినాటి సాయంత్రం ట్రూపుని తీసుకొచ్చీసీవాడు. వీళ్ల బృందం ఊళ్లో దిగిందని తెలిస్తే చాలు. కుర్రనాగన్నలు రెచ్చిపోయీవారు. ‘ఎన్టీఆర్ వచ్చేడట్ట. ఏఎన్నార్ దిగీసేడట్ట..’ ఇకను ఇవే మాట. గుంటసావాదిగాళ్లందరూ పొలోమని ఆలయానికే పోయీవారు. వద్దంటున్నా వినకుండా రిక్షాలమీంచి డేన్సర్ల ఇనప రేకుపెట్టెలు లైటింగ్ సామాన్లు దింపీసి మోస్సీవారు. స్టేజీ వెనకాల తాటి కమ్మల్తో కట్టిన మేకప్ దడిలోకి చేరబెట్టీవారు. అలాంటప్పుడే కొందరు కుర్రాళ్లు మాచెడ్డ నీరసపడిపోయీవారు. ఎన్టీఆర్ వేషం కట్టీ కిశోర్, నాగేశ్వర్రావు యేక్షన్ చేసీ భూషణం ఆ క్షణాన హీరోల్లా వాళ్ల కళ్లకి కనిపించీవారే కాదు. ‘‘స్టేజీ మీదున్నట్టు గాని బయటలేరేట్రా..’’ అంటూ ఆ కురాళ్లు బితుకుబితుకుమంటూ దెబ్బతినీసినట్టు అయిపోయీవారు.‘‘అదేటీ గాదు. మేకప్పేసేక, రంగునైట్లు ఎలిగేక, ఆల్లు హీరోల్నాగే ఉంతార్లేరా’’ ఇంకో గుంటకక్కగట్టెవడో సరిదీవాడు. రాత్రి ఎనిమిదయ్యేసరికి తిళ్లు తిని మేకప్పులకి కూర్చునీవారు భూషణం బ్యాచీ సభ్యులు. ముఖం మీద జుత్తులు పడకుండా నెత్తికి రుమాలు గుడ్డలు కట్టుకునీవారు మగడేన్సర్లు. నేత్రాలమీద పెద్ద పెద్ద కనుబొమలు దిద్దికునీవారు. ముఖానికి తెల్ల కోటాలు దిట్టంగా కొట్టుకునీవారు. ఆడవాళ్లు మాత్రం పొడవైన కొప్పులు నెత్తిమీద పెట్టుకునీవారు. వాటికి వరసావాయీ లేకుండా చెంపపిన్నులు గుచ్చుకునీవారు. సన్నటి కనుబొమల్ని పెన్సిళ్లతో గీసుకునీవారు. మొహాలకి గులాబీరంగు దట్టంగా రాసుకునీవారు. కళ్ల పైరెప్పల మీద చెమ్కీ అద్దుకునీవారు. పెదాలకి ఎర్రరంగు పట్టించీవారు. అది బాగా అంటుకోడానికి మూసుకున్న మూతుల్ని ముప్ఫయిచుట్లు తిప్పీవారు. ఇదంతాను తాటాకుదడి కన్నాల్లోంచి ఊరి కుర్రగాళ్లు చూసీవారు. పక్కనున్న పాతచెర్లోంచి పీక్కొచ్చిన తూటికాడ కర్రల్తోటి బాలగణపతి సంఘం కార్యకర్త వీళ్లని ఆట్టే దెబ్బతగలకుండా కొడుతుండీవారు. దూరంగా తోలుతుండీవారు.క్లబ్డ్యాన్సులేసీ వరాలు మొగుడు రాజులని ఉండీవాడు. వాడు ఆటకి పనికిరాడు. వాడితో ఆడిస్తే ఏనుగు చేత గానుగాడించినట్టే. మొత్తం బొక్కడిపోద్ది. వాడు తిండికి తిమ్మరాజు. పనికి పోతురాజు. అంచేత, వాణ్ని స్టేజీ ముందరుండీ ఫోకస్ లైటు దగ్గిర కూచోబెట్టి రంగుల ముచ్చికాయితాల చక్రం తిప్పమనీవాడు భూషణం. పాటకి తగ్గట్టుగా స్టేజీని రంగుల కాంతిలో ముంచమనీవాడు. డేన్సెంతో ఫోకసింగూ అంతే ముఖ్యమని చిలక్కి చెప్పినట్టు చెప్పీవాడు. పిచిక్కి మప్పినట్టు మప్పీవాడు. రాజులుగాడు తక్కువేంటీ కాదు. వాడికీ, వాడి పెళ్లాం వరాలకీ ఇచ్చీ కిరాయి ముందే భూషణాన్ని అడిగి తీసీస్కునీవాడు. కాదంటే అల్లరి పెట్టీవాడు. వరాలు ఆడకుండా అడ్డీసీవాడు. అందుకే ఆ డబ్బేదే వాడికి పారీమని చెప్పీది ఆ పిల్ల. రోజూ బీడీలు కాల్చీ రాజులుగాడు సొమ్ము చేతిలో పడగానే రెడ్‌విల్స్ అంటించీవాడు. అస్తమానూ సారా తాగీవోడు ఆరారా సేంపిలేసీవాడు. ముష్టి చెక్కపొట్లాం నమిలీవాడల్లా రత్నా జరదాకిల్లీ బిగించీవాడు. ఎవడేంటి చెప్పినా చివరికి వాడికి పుట్టిన బుద్ధే వాడిది. వాడి పెళ్లాం పాటప్పుడు సక్రంగా చక్రం తిప్పి భలే రంగులు చూపించీవాడు. వాడికిష్టం లేని పాటలొచ్చినప్పుడు మటికి చెత్త రంగులు ఫోకస్ చేసీసి కంపు కొట్టించీసీవాడు. డేన్స్లన్నీ అయిపోయేక ఉస్సురుమంటూ ‘అలా సేసేవేటి రాజులూ’ అని భూషణం కొద్దిగా కోప్పడితే, ‘అదేటి మాయ్యా. బాగానే తిప్పినా గదేటి సెక్రం’ అని అన్నీ చేసీసి ఏవీ ఎరగనట్టు ఎర్రిపప్పలా మాటాడీవాడు. మెత్తని కక్కలా గునిసీవాడు. భూషణవూ అటు తిరగ్గానే ‘దురత్తీరిందా’ అన్నట్టుగా ఓరగా ఓ వెకిలి నవ్వు విసిరీవాడు. రాత్రి పదికి రికాడ్డేన్స్ మొదలయిపోయీది. అప్పటికే ఊళ్లోని ఇల్లుపిల్లాద్రీ స్టేజీ ముందు వారసరిగా చేరీసీవారు. మరీ ముఖ్యంగా అగ్రజాతి పురుష పుంగవుల భార్యామణులయితే నిలుచున్న చోటు నుంచి బెత్తెడు దూరమూ కదిలీవారు కారు. తమ దిక్కుమాలిన మొగుళ్లు ఏడాదికోమారు చూపించీ మహావినోదం ఇదేనని వాళ్లంతా గట్టిగా భావించీవారు. రోజూ వంటింట్లో పడి చచ్చీ తమకి ఈ రోజే స్వేచ్ఛాదినమన్నట్టుగా ప్రవర్తించీవారు. ఆసక్తిగా డేన్స్‌ల మీదనే మనసు లగ్నం చేసీవారు. వీళ్లకి వెనకాల సకల రకాల జనావళీ పోగుబడిపోయీవారు.ముందుగుండా ‘శుక్లాం బరధరం విష్ణూం.. శశివర్ణం చతుర్భుజం..’ ఘంటసాల రికార్డు పాడించీవాడు భూషణం. స్టేజీ మీద తెర వెనుకే డేన్సర్లందరూ నిలబడి ప్రార్థన చేసీవారు. ఆ వెంటనే ఫస్టు ఫస్టు ‘తెలుగు జాతి మనది.. నిండుగ వెలుగుజాతి మనది..’ పాట వేస్తున్నట్టుగా మైకులో హిందీపాటల డేన్సరు బాబ్జీ ప్రకటించీవాడు. ప్లేటును ప్లేయర్ మీద వేసీవాడు. తెర తొలిగీది. పాట మొదలవగానే కిశోర్‌కుమార్ స్టేజీ మీది దీపకాంతుల మధ్య ఎన్టీవోడిలాగానే వెలిగిపోయీవాడు. ‘తల్లా పెళ్లామా’ సినిమా అతగాడు ఎన్ని సార్లు చూసేడో మనకి తెలీదు. ‘‘పాలు పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవదు, నలుగురిలో మన జాతి పేరును నవ్వుల పాలు చేయొద్దు’’ అన్నచోట స్టేజీ దిగిపోయి అచ్చం సినీమాలో రామారావు బాధపడున్నట్టుగానే రెండు చేతులూ అడ్డంగా గాల్లో ఊపీసీవాడు. జనంలోకొచ్చీసి చాలా ఇదయిపోయీవాడు. ప్రేక్షకులు ప్చ్..ప్చ్.. కొట్టీసి, హాహాకారాలు చేసీసి ఆయన చుట్టూ చేరిపోయీవారు. ఆ పాట మైకంలోంచి వాళ్లు చప్పున తేరుకోలేపోయీవారు. ఈ వ్యవహారాన్ని సరిచేయడానికన్నట్టుగా.. ‘‘నెక్స్ట్ అయిటమ్ ‘దత్తపుత్రుడు’ చిత్రంలో ‘పిల్లోయ్ జాగత్త’, జూనియర్ ఏఎన్నార్ భూషణం జూనియర్ వాణిశ్రీ రత్నావళి’’ అనే ఎనౌన్స్‌మెంటు వెలువడీది. ఈలలు మిన్నుముట్టీసీవి. ‘‘ఆడదిలే అని వదిలేస్తుంటే అడ్డుతగులుతున్నావా, నా దెబ్బ చూపమంటావా’’ పంచె కట్టుకుని భూషణం రెచ్చిపోతూ నోరు కదిపీవాడు.‘‘పాపం పోనీ పసివాడంటే, పైకి పైకి వస్తావా, ఒక పట్టు పట్టమంటావా’’ రత్నావళీ తక్కువ తినీది కాదు. చదివింపుల మీద చదివింపులు వచ్చిపడిపోయీవి. ఎన్టీఆర్, ఏఎన్నార్ పాటలయిపోయేక ‘హమ్ కిసీసే కమ్‌నహీ’ హిందీ సినిమాలోని ‘‘బచ్నా ఏ హసీనోం లోమై ఆగయా’’ మోగీది. రికార్డు ప్లేయర్ నడిపించీ బాబ్జీ చకచకా స్టేజీ ఎక్కీసీవాడు. రిషీకపూర్లా విరగబడిపోయీవాడు.ఆ తర్వాత ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమాలోని ‘మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల..’ వర్ర వర్రగా వరాలు ఆడీది. వినాయకచవితినాడు తిన్న ఉండ్రాళ్లు, జిల్లేడుగాయల కంటే ఈ డేన్సులే బాగున్నట్టుగా పందిరి కింద చేరిన ప్రజానీకం పరవశించీది. అనంతరం ‘సెక్రటరీ’ సినిమాలోని ‘మొరటోడు నా మొగుడు మోజు పడి తెచ్చాడు’, ‘అడవిరాముడు’ చిత్రంలోని ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’, ‘అమ్మ మాట’లోని ‘మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు’, ‘ఇదాలోకం’లోని ‘‘గుడి ఎనక నా సామి గుర్రమెక్కి కూచున్నాడు’ పాట మోతెక్కిపోయీవి. చప్పట్లే చప్పట్లు. ఈలలే ఈలలు. అవునట్టు, రాజబాబు విషయం చెప్పనే లేదు కదూ. ఆమ్మో వాడి డేన్స్ సామాన్యమైన డేన్స్ కాదు. ‘‘చిలకలాంటి చిన్నదానా.. రావే వయ్యారి జాణ..’’ మొదటగా రుచి చూపించీవాడు. ఆనక ‘‘వినరా సూరమ్మ కూతురు మొగుడా విషయము చెబుతాను’’ పాటలో కలగలిసిపోయి నానా దీర్ఘాలు తీసీవాడు. పందిరి మొత్తం నవ్వుల పువ్వులు పూస్సీది. రికాడ్డేన్స్ చివర్నజేసి కిశోరేమో ‘దేవత’ లోని ‘బొమ్మపే చేసి ప్రాణము పోసి’ పాట వేసీవాడు. ఆ వెంటనే, ‘ప్రేమనగర్’లోని ‘ఎవరికోసం ఎవరికోసం ఈ ప్రేమమందిరం ఈ శూన్య నందనం’ సాంగుని భూషణం లాగించీవాడు. మూడు గంటలకు పైగా సాగే రికాడ్డేన్స్లో అశ్లీలం పాలు చిన్నమెత్తు కూడా భూతద్దం పెట్టి వెదికినా కనిపించీది కాదు. ఆఖరికి, వరాలు వేసే క్లబ్ డేన్స్లప్పుడూ సుబ్బరవైన గుడ్డలు కట్టుకునే ఆడీది. ఈ విధంగా, మూడు పువ్వు ఆరు కాయలుగా సాగిపోతున్న భూషణం రికార్డింగ్ డేన్స్ ట్రూపు ఉన్నట్టుండి ఇబ్బందుల్లో ఇరుక్కుపోయింది. హఠాత్తుగా చిక్కుల్లో చిక్కుబడిపోయింది. చివికి చీకాకుపడిపోయింది. పోలీసు బాబుల నుంచి ఎదురయిన ఆంక్షలతో రొడ్డ రొడ్డగా నానా బాధలూ పడిపోయింది. ఎక్కడో ఎవరో రికాడ్డేన్స్ ట్రూపులవాళ్లు ఏవో అభ్యంతకర నృత్యాలు చేస్తున్నారని చెప్పీసీ విశాఖపట్నం జిల్లా ఖాకీ అధికారులు వీటి మీద నిషేధం పెట్టీసేరు. ఇవి ఆడితే కటకటాల వెనక్కేనని నిబంధన విధించీసేరు. తుంటి కొడితే పళ్లు రాలినట్టుగా ఎక్కడో ఏదో జరిగితే భూషణం రికాడ్డేన్స్కి ముంచుకొచ్చీసింది. భూషణం బాబు వేదనకు అంతూదరీలేదు. నోటి దగ్గర కూడుపోవడం ఒక ఎత్తయితే, ఇష్టమైన హీరో డేన్సులు చేయలేకపోవడం అంతకుమించిన ఎత్తు. మనసంతా కల్లోలపడిపోయింది. రోజుల వ్యవధిలోనే టీబీ పేషెంట్లాగ అయిపోయేడు. ఆరు నెలలు కాళ్లరిగేలాగ నాయకుల దగ్గరకీ పోలీసు పెదబాబుల దగ్గరకీ తెగ తిరిగేడు. ‘‘ఆకల్తో సస్తన్నాం’’ అని మొరపెట్టుకున్నాడు. ‘ఆట సూసి, అది మంచో సెడో సెప్పండి’ అంటూ బతిమాలేడు. లాభం లేపోయింది. అంతవరకూ భూషణం ట్రూపు డేన్స్ మంచివేనని మెచ్చుకున్న జనమెవ్వరూ కొంచెం కూడా నోరిప్పలేదు. మాట సాయం అస్సలు చెయ్యలేదు. ‘పక్కవాడి తగూ వినవేడుక’ టైపులో లేని జాలి ప్రదర్శించి తప్పుకున్నారు. పెళ్లాలతో సహా పెద్ద పెద్ద కుర్చీలేసుకుని తమ అభిమాన హీరోల పాటల్ని భూషణం, కిశోరు ఆడుతుంటే చూసి తరించీసిన సీఐలు, ఎస్ఐలూను కలుగజేసుకోనేలేదు. ఎవడెలా పోయినా అధికారులు చెప్పినట్టు చేసీసీ తమ బతుకులు బాగుండీలా చూసీసుకుంటే సరిపోతుందనుకున్నారు. ఒల్లక కూచుండిపోయేరు.కొన్నాళ్లిలా గడిచిపోయేయి. డేన్స్లేసీ కాళ్లతో పగలూ రాత్రీ భూషణానికి కుట్టుమిషను తొక్కడం తప్పింది కాదు. ఇష్టపడి తొక్కీ తొక్కుడు వేరు. హృదయం లేని తొక్కుడు వల్ల తప్పుడు కుట్లు పడిపోయి గుడ్డలు పాడయిపోయీవి. కస్టమర్లు తిట్టిపోసీవారు. ఇలాగే మరికొంత కాలం పోయాక ఎవరో మనసున్న ఎస్పీ దొరగారు జిల్లాకొచ్చేరు. చార్జి తీసుకున్నారు. రికాడ్డేన్సర్ల బాధ విని కొద్దిగా కరిగేరు. మళ్లీ డేన్సులు మొదలెట్టుకోవచ్చని పెద్దమనసుతో ఆదేశాలిచ్చేరు. కాకపోతే వీటికి ‘భామాకలాపం’ అని పేరు పెట్టుకోమన్నారు. భూషణం ఏం చేయగలడు. అదే పదివేలనుకున్నాడు. పడుతూ లేస్తూ సరుకూ సప్పరా మళ్లీ సమకూర్చుకున్నాడు. రికాడ్డేన్స్కి తలపడ్డాడు. సేన్నాళ్లుగా ప్రోగ్రాము లేకపోడంతోనూ అప్పుల పాలయిపోడంతోనూ మునుపటి ఉత్సాహం అంభేరుపురం బృందంలో లేకపోయింది. ఏదో ఆడేం అంటే ఆడేం అన్నట్టుగా ఉండీవారు. కాలమూ మెల్లగా మారిపోవొచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్నార్లే సినిమాలకు దూరమైపోడం మొదలెట్టేరు. వాళ్ల పిల్లలు తెరమీదికి దిగీసేరు. భూషణం రికాడ్డేన్స్ పూర్తిగా మూలకెళ్లిపోడానికి అడ్డులేపోయింది. కొన్నాళ్లపాటు భూషణం కొడుకు సూర్యం, కిశోర్ కొడుకు చంద్రం, నాగార్జున, బాలకృష్ణ డేన్సులు చెయ్యకపోలేదు. కానీ పెద్దగా హిట్టవ్వలేదు. జనాలూను స్పీడు యుగంలో పడిపోయి ముఖం పక్కకి తిప్పీసుకున్నారు. ఆ బెంగతోనేనేమో భూషణం గుండె ఓ నాటి తెల్లవారుఝామున అకస్మాత్తుగా ఆగిపోయింది. అతగాడు వెళ్లిపోడంతో నాథుడు లేక ట్రూపంతా కకావికలమైపోయింది. ఏవో పనులు వేపగించుకోడానికి, కూలిపనులు చేసుకోడానికి డేన్సర్లందరూ ఎటెటో చెదిరిపోయేరు. భూషణం ట్రూపే కాదు. కాలచక్రంలో పడిపోయి ఇలాంటి డేన్స్ బృందాలన్నీ చాలామటుకు మొగుమొత్తంగా అయిపు లేకుండా పోయేయి. ఇంతకీ, చిన్నప్పటి రికాడ్డేన్స్ ఊసులన్నీ నాకెందుకిప్పుడు ఉన్నపాటున గుర్తుకొచ్చినట్టు. బాల్యంలోకి పాళంగా నేనెందుకు పయనమైపోయినట్టు. ఎందుకంటేను... ఈ మధ్యనే విశాఖపట్నంలో తోటగరువు దుర్గాలమ్మ పండగ ఘనంగా జరిగింది. ఆ సమయంలో అనుపు సంబరానికి అటుగా వెళ్లవలిసివచ్చింది. అంభేరుపురం రికాడ్డేన్స్ బాబ్జీ ఏమో లైటింగ్ పనులు చేస్తూ అక్కడ కనిపించేడు. పెద్దవాడయిపోయేడు. బాగా లొంగిపోయేడు. ఒకప్పుడు రిషీకపూర్లా మెరిసినవాడు ఇప్పుడు ముసిలి కపూర్‌లా ఉప్పూపత్రీ లేనట్టయిపోయేడు. ఒంటికి ప్రాణం తప్ప మరేంటీ లేనట్టుగా అవుపించేడు. నేనెవరో తనకేం ఎరుక. నేనే గుర్తుపట్టేను. ఎలా ఉన్నావన్నాను. ఆశ్చర్యపోయేడు. ‘‘నా పేరు తమరికెలా తెలుసును’’ అనడిగేడు. చోడవరం భోగట్టాలు, రికాడ్డేన్స్ ఊసులూ గబాగబా చెప్పీసరికి గొప్పగా సంతోషపడిపోయేడు. ‘హమ్ కిసీకే కమ్ నహీ’ సినిమా పేరెత్తగానే కొత్త బలం వచ్చీసినట్టుగా అయిపోయేడు. అతని ముఖం అప్పటికప్పుడే వెలిగీసింది. ‘‘వొప్పుడో వొయిజాగొచ్చీసినా నాయినా. సీరియల్ సెట్లు బిగించుకుంతన్నాను. బతకాలిగదేటి’’ అన్నాడు.ఒకప్పుడు ఎందరెందరి పొగడ్తలో పొందినవాడు. ఈవేళ ఈకలు తీసిన కోడిలా అయిపోయేడు. నా మనసు బాధతో ఒక్క సిటం మూలిగింది. ఇంతలోనే అన్నాడు కదా.. ‘‘వుప్పుడు రికాడ్డేన్సులెక్కడియి బావూ? ఏ ఇనాయికసవితి పండగ సూసినా, ఏ దసరా టెంట్ల కాడ ఎదికినా డేన్స్ బేబీ డేన్సింగులే. ఈ డేన్సింగులేసి గుంటల్లో ఒక్కుదానికీ ఒంటిమీద సరీగా గుడ్డముక్కలుండవు. కాలంనాడు మావంతా చెరీరం మొత్తానికీ గుడ్డలు సుట్టుకునీవోల్లం. ఆడీవోల్లం. అయినా గానీ పోలీసోల్లు కుదరదనీవోరు. మరా పోలీసుబావులు వుప్పుడేటయిపోయినారో తెల్దు. ఆల్లు మటికి ఏటి సేత్తార్లెండి. వుప్పుడు ఆడగుంట్లకి దయిద్రుగొట్టు బట్టలు తొడిగించీసీదీ అమ్మాబావులే గదేటి. ఒకనాడు తప్పుకాన్దాన్ని తప్పు అనీనారు. వుప్పుడు రాంగుని రైటంతన్నారు’’ అనీసేడు నిస్త్రాణగా. ఇలా అంనే, తనకిక సెలవిప్పించమన్నట్టుగా నావేపు చూసేడు. నాతో నిమిత్తం లేకుండా అటేపు తిరిగీసి దీపాల తోరణాలు కట్టుకోడంలో మునిగిపోయేడు. -
అఖిల్ నిశ్చితార్థ వేడుక ఆహ్వానం
‘శ్రీమతి అన్నపూర్ణ మరియు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు ఆశీర్వాదాలతో... మా అబ్బాయి అఖిల్ నిశ్చితార్థ వేడుకకు మిమ్మల్ని అమితానందంతో ఆహ్వానిస్తున్నాం’ - ఇట్లు అమల అండ్ అక్కినేని నాగార్జున. సినీ ప్రముఖులకూ, సన్నిహితులకూ అక్కినేని కుటుంబం నుంచి అందిన ఆహ్వానం ఇది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలు, సోమనాద్రి భూపాల్, షాలినీ దంపతుల కుమార్తె శ్రీయా భూపాల్, అఖిల్‌ల ప్రేమను ఇరు కుటుంబ సభ్యులూ అంగీకరించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు జీవీకే ఇంట్లో నిశ్చితార్థం జరగనుంది. వచ్చే ఏడాది పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటలీ రాజధాని రోమ్‌లో పెళ్లి చేయాలనుకుం టున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్‌నగర్ టాక్ -
నాగ్ కొత్త సినిమాలో ఏఎన్నార్ గెస్ట్ రోల్..?
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. చనిపోయి చాలా కాలం అవుతున్నా.. ఏఎన్నార్ సినిమాలో ఎలా నటిస్తారని ఆలోచిస్తున్నారా..? ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏఎన్నార్‌ను మరోసారి వెండితెర మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు అక్కినేని టీం. గ్రాఫిక్స్ సహాయంతో రూపొందించనున్న నాగేశ్వరరావు పాత్ర దాదాపు మూడు నిమిషాల పాటు కనిపించనుందట. ప్రస్తుతం కన్నడలో తెరకెక్కిన నాగభరణం సినిమాలో కూడా చనిపోయిన విష్ణువర్థన్ హీరోగా కనిపిస్తున్నారు. అదే తరహాలో ఓం నమోవేంకటేశాయలో ఏఎన్నార్ కనిపించనున్నారు. ఇప్పటి వరకు యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించకపోయినా అక్కినేని అభిమానులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. -
టీయస్సార్‌కి ఏయన్నార్ అవార్డు
ప్రతి ఏటా అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా వివిధ రంగాలకు చెందిన నిష్టాతులకు ‘రసమయి డా.అక్కినేని లైఫ్ టైమ్ అచీవ్మెంట్’ అవార్డు బహూకరిస్తున్నారు. ఈ ఏడాది ఈ అవార్డును ‘కళాబంధు టి.సుబ్బరామిరెడ్డికి అందించనున్నట్లు ‘రసమయి’ అధినేత డా.ఎంకె. రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘ఏయన్నార్‌తో సుబ్బరామిరెడ్డికి 40 ఏళ్ల అనుబంధం ఉంది. సినీ కళాకారులను సత్కరిస్తూ ప్రోత్సహిస్తున్న ఆయనకు ఈ అవార్డు ఇవ్వడం సముచితం. ఈనెల 21న హైదరాబాద్‌లో అవార్డు ప్రదానం చేయబోతున్నాం. ఈ వేడుకకు పలువురు రాజకీయ నాయకులు, సినిమా కళాకారులు హాజరు కానున్నారు’’ అని తెలిపారు. -
ఆయన అవకాశం ఇవ్వకపోతే ఎక్కడ ఉండేవాళ్లమో..
‘‘డెబ్భై ఐదేళ్ల క్రితం ఘంటసాల బలరామయ్యగారు మా నాన్నగారిని (అక్కినేని నాగేశ్వరరావు) చూసి, ‘కుర్రాడు బాగున్నాడే చలాకీగా..’ అనుకుని యాక్టర్‌ని చేశారు. ఆయన నాన్నగారికి అవకాశం ఇచ్చి ఉండకపోతే మేం ఎక్కడుండేవాళ్లమో? ఏం చేసేవాళ్లమో? ఎప్పుడూ కొత్తగా ఆలోచించాలనీ, కొత్తవారిని ప్రోత్సహించాలని నాన్నగారు చెప్పేవారు. ఆయన స్ఫూర్తితో ముందుకెళుతున్నాం’’ అన్నారు నాగార్జున.. శ్రీకాంత్ తనయుడు రోషన్‌ని హీరోగా పరిచయం చేస్తూ, జి. నాగకోటేశ్వర రావు దర్శకత్వంలో నాగార్జున సమర్పణలో అన్నపూర్ణ స్టూడియో, మ్యాట్రిక్ టీమ్ వర్క్స్ పతాకాలపై నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘నిర్మలా కాన్వెంట్’. సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని నిమ్మగడ్డ ప్రసాద్ విడుదల చేసి, నిర్మాత అల్లు అరవింద్‌కు ఇచ్చారు. హీరో గోపీచంద్ ట్రైలర్ లాంచ్ చేశారు. నాగార్జున మాట్లాడుతూ- ‘‘రోషన్ డైలాగ్ డెలివరీ, మెమొరీ పవర్ గుడ్’’ అన్నారు. నిర్మాత నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ -‘‘ఈ వయసులో నిర్మాత ఎందుకయ్యారని కొందరు అడిగారు. నిర్మాతకు వయసుతో పనేముంది? రాబోయే తరం గురించి నాకు మా తాత చిన్నప్పుడు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుండటం, నా మిత్రుడు నాగార్జున యంగ్‌స్టర్స్‌ని ఎంకరేజ్ చేద్దామని చెప్పడం ఈ చిత్రం నిర్మించడానికి ఓ కారణం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఇందులో ఇద్దరు హీరోలు. ఒకరు రోషన్, మరొకరు నాగార్జునగారు. నాగార్జునగారి ఫ్యాన్స్ గర్వపడేలా ఉంటుందీ సినిమా. ఈ ఏడాది ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘ఊపిరి’తో హిట్ సాధించిన ఆయన ‘నిర్మలా కాన్వెంట్’తో హ్యాట్రిక్ సాధించబోతున్నారు’’ అన్నారు. ‘‘సెట్స్‌కి వెళ్లి, రోషన్ హార్డ్‌వర్క్ స్వయంగా చూశా. చాలా గర్వంగా ఉంది’’ అని శ్రీకాంత్ అన్నారు. ‘‘పెద్ద సంస్థల ద్వారా లాంచ్ అవడం రోషన్ లక్’’ అని తనయుణ్ణి మురిపెంగా చూస్తూ, ఊహ అన్నారు. ‘‘ఏయన్నార్‌గారు, మా నాన్న రాజేశ్వరరావుగారి కాంబినేషన్లో ఎన్నో హిట్ చిత్రాలొచ్చాయి. నేను నాగార్జునగారి చిత్రాలకు సంగీతం అందించా. ఇప్పుడు నా కుమారుడు రోషన్ సంగీత దర్శకుడు కావడం హ్యాపీ’’ అని కోటి అన్నారు. రోషన్ మాట్లాడుతూ - ‘‘నేను మీ ముందు మాట్లాడుతున్నానంటే నా తల్లిదండ్రులే కారణం. యాక్టర్ అవుతానన్నప్పుడు, కళ్లు పైకే చూస్తుండాలి.. కాళ్లు కిందే ఉండాలన్నారు. అమ్మానాన్న తలెత్తుకునేలా ఉంటాను’’ అన్నారు. నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు ధవళ సత్యం, ఆయన సోదరుడు ధవళ మల్లిక్, దర్శకుడు కల్యాణ్‌కృష్ణ, హీరోయిన్ శ్రేయాశర్మ తదితరులు పాల్గొన్నారు. -
అక్కినేని అంచు పంచెలు...
పొందూరు ఖాదీకి ఎవర్గ్రీన్ బ్రాండ్ అంబాసిడర్ అంటే అక్కినేని నాగేశ్వరరావే. ఆకుపచ్చ, ఊదా, కెంపు రంగుల్లో అంచులు ఉండే పంచెలంటే అక్కినేనికి మహా ఇష్టం. ఈ తరహా పంచెలు అక్కినేని పంచెలు గానే స్థిరపడిపోయాయి. చనిపోయేంత వరకు ఏఎన్ఆర్ పొందూరు ఖాదీనే వాడారు. అక్కినేని స్వయంగా పంచెలకు అంచును డిజైన్ చేసి పొందూరుకు పంపించడంతో ఆ వస్త్రాలకు మంచి గిరాకీ వచ్చింది. ఏటా సుమారు రూ. 40 వేలు విలువ చేసే వస్త్రాలను ఆయన కొనుగోలు చేసేవారు. ఈ పంచెలను నేయడానికి పొందూరు ఫైన్(100వ కౌంట్) దారాన్ని వాడుతారు. అంచు సింగిల్ బోర్డర్ అంచు పంచె రూ.8వేలు నుంచి రూ. 9వేలు వరకు ధర పలుకుతోంది. ఏటా రూ 7 లక్షలు విలువ చేసే ఏఎన్ఆర్ అంచు పంచెలను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. -
నాగ్ గెటప్ కోసం నటసామ్రాట్ కాస్ట్యూమ్స్
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ సోగ్గాడే చిన్నినాయనా.. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్న నాగ్.. ఒక పాత్ర కోసం పల్లెటూరి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. మనం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నాగ్ త్వరలో సోగ్గాడిగా అభిమానులను పలకరించనున్నాడు. ఈ సినిమా కోసం నాగ్ ఎంచుకున్న గెటప్‌లో ఓ ప్రత్యేకత ఉందంటున్నారు చిత్రయూనిట్. ఎన్నో చిత్రాల్లో పల్లెటూరి పాత్రలు చేసిన తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావే తన పాత్రకు స్ఫూర్తి అంటున్నాడు నాగ్. అంతేకాదు ఈ సినిమాలో తన గెటప్ కోసం నాగ్ వాడిన కాస్ట్యూమ్స్ గతంలో అక్కినేని నాగేశ్వరరావు వాడినవే.. ఈ సినిమాలో నాగ్ వాడిన వాచీ కూడా 1959లో అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా కొన్నది కావటం మరో విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సోగ్గాడే చిన్నినాయనా సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తుండగా, హంసానందిని, అనసూయ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు. -
నిజ జీవిత కథానాయకుడు అక్కినేని
‘బతికి బావుకునేది లేదని చావబోకు- చచ్చి సాధించేది లేదని బతకబోకు-బతికి జీవితాన్ని సాధించు-చనిపోయి కలకాలం జీవించు’. ఇవి అక్కినేని నాగేశ్వరరావు తన ‘అ-ఆలు’ (అక్కినేని ఆలోచనలు)పుస్తకంలో రాసుకున్న మా(పా)టలు. దీనికి నిలువెత్తు నిర్వచనం ఆయన జీవితమే. కృష్ణాజిల్లాలోని మారుమూల కుగ్రామంలో జన్మించి, చదువు సంధ్యలు అంతమాత్రంగానే అబ్బిన ఓ కుర్రవాడు, నాటకాలలో ఆడపిల్లల వేషాలు వేస్తుండగా..గుడివాడ స్టేషనులో ఓ నిర్మాత కంటబడటం, సినీ రంగంలో అడుగుపెట్టడం.. తొలి దశలో ఎన్ని అవమానాలు ఎదురైనా.. మొక్కవోని దీక్షతో క్రమశిక్షణ, పటుట్టదలతో ఇంతింతై..వటుడింతై అన్నట్టుగా ఎదగడం నిజంగా అద్భుతం.. ఇది తెలుగు సినిమా కథ కాదు, నిజ జీవిత కథానాయకుని కథ. సినీ రంగాన్ని ఏలిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు దీక్షాదక్షత. గోదావరితో ఏఎన్నార్ అనుబంధం గోదావరి తీరంతో అక్కినేనికి ఎనలేని సంబంధం ఉంది. ఔట్ డోర్ షూటింగుకు నటులు అంతగా ఇష్టపడని రోజుల్లో ఆయన మూగమనసులు సినిమాలో హీరోగా నటించారు. దాని చిత్రీకరణ గోదారి ఒడ్డునే జరిగింది. జిల్లాలోని పులిదిండి, ర్యాలి గ్రామాల్లో చిత్రీకరణ జరుపుకున్న బుద్ధిమంతుడు సినిమాకీ ఆయనే హీరో.. అందాల రాముడు, సీతారామయ్యగారి మనుమరాలు, సూత్రధారులు, శ్రీరామదాసు ఇలా ఏఎన్నార్ నటించిన ఎన్నో చిత్రా లు గోదారి ఒడ్డున ప్రాణం పోసుకున్నాయి. అన్నీ అఖండ విజయాలే. గోదారి తీరాన ఉన్న ఎందరో కళాకారులు, చిత్రకారులు, సాహితీవేత్తలతో అక్కినేనికి మంచి సాన్నిహిత్యం ఉంది. రాజమండ్రి టీ నగర్‌లోని పాల గంగరాజు దుకాణంలో లభించే పాలకోవా అంటే అక్కినేనికి ప్రాణం. నాకు డైలాగ్ పెట్టమన్నారు. 1955లో రోజులు మారాయి శతదినోత్సవానికి అక్కినేని రాజమండ్రి వచ్చారు. నా అన్న శ్రీపాదపట్టాభి ద్వారా అప్పుడే అక్కినేనితో నాకు పరిచయమైంది. ఆయన తుది శ్వాస విడిచే వరకు ఆ పరిచయం అలాగే దినదినప్రవర్ధమానమైంది. తొలిసారిగా బాపు, రమణలు తీసిన బుద్ధిమంతుడు సినిమాలో నాకు ఆయనతో నటించే అవకాశం లభించింది. పతాక సన్నివేశంలో విలన్ పాత్రధారి నాగభూషణాన్ని అరెస్టు చేసే పోలీస్ అధికారి పాత్రను నాకు ఇచ్చారు. ‘మన జిత్‌కు డైలాగ్ పెట్టండి’ అని ఆయన రచయిత ముళ్లపూడికి సూచించారు. అందారాముడు, సూత్రధారులు, శ్రీరామదాసు.. ఇలా ఎన్నో చిత్రాలలో ఆయనతో కలసి నటించాను. దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు ఆయన అందుకున్నాక, తొలి సన్మానం నా చేతులమీదుగా రాజమండ్రిలోనే జరగడం నా అదృష్టం. - జిత్ మోహన మిత్ర, గాయకుడు, రంగస్థల, సినీనటుడు అహంభావం అణువంత కూడా లేదు 2007 మేలో గోదావరీ తీరాన శ్రీరామదాసు షూటింగ్ జరుగుతోంది. నాది భక్తునిగా ఒక చిన్న పాత్ర. మిమ్మల్ని కలవడం, కలసి నటించడం చాలా ఆనందంగా ఉందని ఆయనతో అన్నాను. ఆయన ఆప్యాయంగా నా ఉద్యోగం, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీరిక సమయాల్లో కళారంగానికి సంబంధించిన ఎన్నో సత్యాలను ఆవిష్కరించేవారు. ఆయన ఎంత గొప్ప నటుడో, వ్యక్తిగా కూడా అంత గొప్పవారు. - నేదునూరి గోపాలకృష్ణ, విశ్రాంత ఉపాధ్యాయుడు. చిన్నతనం నుంచి ఆయనకు అభిమానినే ఉద్యోగరీత్యా బాపట్లలో బ్యాంకులో పనిచేస్తున్న నేను ఒకసారి హైదరాబాద్ బ్యాంకు పనిమీద వెళ్లాను. నేను సేకరించిన అక్కినేని ఫొటోలతో కూడిన ఆల్బమ్‌ను ఆయనకు చూపించా. వాటిని చూసి ఈ ఫొటోలు నా వద్ద కూడా లేవే అన్నారు. 1953లో దేవదాసు శతదినోత్సవం సందర్భంగా ఆయన, సావిత్రి, పేకేటి శివరాం వచ్చారు. వరద రోజులు. అప్పుడు హోటళ్లు లేవు. వచ్చిన నటీనటులు వాడ్రేవువారి భవనంలో దిగారు. అప్పుడు నేను తొలిసారిగా అక్కినేనిని చూశాను. ఓసారి అక్కినేని పుట్టినరోజున నేను ఆయన బొమ్మగీసి పంపితే, ఆయన అభినందనలు తెలియజేస్తూ లేఖ రాసారు. నాగేశ్వరరావు అరుదైన నటుడు. - ఎం.వి.అప్పారావు (సురేఖ), విశ్రాంత బ్యాంకు ఉద్యోగి, కార్టూనిస్టు -
ఎవర్ గ్రీన్
-
నిజజీవిత కథానాయకుడు
నేడు అక్కినేని నాగేశ్వరరావు 91వ జయంతి దేవదాసు ఎలా ఉంటాడు? విప్రనారాయణ ఎలా ప్రవర్తిస్తాడు? కవి కాళిదాసు, భక్త జయదేవుడు ఎలా ఉండి ఉంటారు? మరి, దసరా బుల్లోడంటే? భగ్న ప్రేమి కుడి నుంచి భాగవతోత్తముడి దాకా, కవీశ్వరుడి నుంచి కుటుంబ కథల కథా నాయకుడి దాకా - ఏ పాత్రకైనా రోల్ మోడల్‌గా నిలవడం ఎంతటి నటుడికైనా సవాలు. కానీ, కష్టపడి పైకొచ్చి, ఆ సవాలును ఇష్టపూర్తిగా స్వీకరించి, అభినయమే శ్వాసగా బతికిన నటుడంటే అక్కినేని నాగేశ్వరరావు(1924 - 2014). పెద్దగా చదువైనా లేని పల్లెటూరి పిల్లగాడు... పెద్దయ్యాక కూడా నాటకాల్లో ఆడవేషాలు వేసిన ఒక కుర్రాడు... పెద్దమనుషుల్ని పరిచయం చేస్తే కనీసం నమస్కరించి మాట్లాడడం కూడా తెలియని శుద్ధ బుద్ధావతారం... నేర్చుకొనే గుణం ఉంటే ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడవచ్చనీ, సాధన చేస్తే కొన్ని కోట్ల మందిని ఆకట్టుకొనే కథానాయకుడు కావచ్చనీ, ఒక జాతి తరతరాలూ చెప్పుకొనే కల్చరల్ ఐకాన్‌గా చిరకాలం మిగిలిపోవచ్చనీ నిరూపించడం అక్కినేని జీవిత కాలంలో చేసి చూపెట్టిన అపూర్వ సాధన. అనారోగ్యం రావచ్చు... ఒకటికి రెండు గుండె ఆపరేషన్లు జరగచ్చు... జీవితంలో, కెరీర్లో ఎప్పటికప్పుడు కొత్త సవాళ్ళు ఎదురుకావచ్చు. కానీ, ‘బతుకు కన్నీటి ధారలలో బలి చేయకు’ అన్న పాఠాన్ని ఎలా చెప్పాలి? అవన్నీ ఎదురై నప్పుడు అక్షరాలా ఆచరించి చూపడం తప్ప! అక్కినేని చేసింది అదే! ఆఖరి క్షణంలో క్యాన్సర్ కబళిస్తున్నప్పుడు కూడా అదే ధైర్యం... అదే హుందాతనం. చేస్తున్న వృత్తినే దైవంగా భావించడం, ఆ భావనతోనే ఆఖరు దాకా జీవించడం... చాలా మంది చెబుతారు. కానీ, అక్కినేని చేసి చూపించారు. ‘నటుడిగానే మరణించాలి. మరణించాక కూడా జీవించాలి’- ఇది కొందరికి ఆశ. ఇంకొందరికి తీరని ఆశయం. మరికొందరికి కేవలం జనం మెచ్చడానికిచ్చే స్టేట్మెంట్. కానీ, చిన్ననాటే రంగస్థలంపై మొదలుపెట్టి, వెండితెరపై ‘ధర్మపత్ని’ (1941) నుంచి చనిపోయే ముందు ‘మనం’ (2014) దాకా ఏడున్నర దశాబ్దాల పైగా వృత్తినే శ్వాసించడం ఏయన్నార్ ఘనత. జీవితంలో నటించడం ఎక్కువై, నటనలో జీవించడం తక్కువైన రోజుల్లో అక్కినేని జీవితకాలపు జ్ఞాపకాల్ని జనం గుండెల్లో మిగిల్చిన మహానటుడు. అందుకే, భారతీయ సినీచరిత్రలో ఏయన్నార్ కథ చిరకాలపు పాఠం. అచ్చతెలుగు జీవితం, పంచెకట్టు వేషమంటే ఇప్పటికీ గుర్తొచ్చే ఆయన అమరజీవి... తెలుగు సమాజపు సమష్టి చేతనలో సదా చిరంజీవి. -
హీరో.. హీరోయిన్.. ఓ చెట్టు..
సమ్‌థింగ్ స్పెషల్ నా చిన్నతనంలో మా ఊరికి అక్కినేని నాగేశ్వరరావు వచ్చారు. ఈ చెట్టు కిందే షూటింగ్ జరిపారు. ఆయనతో షేక్‌హ్యాండ్ ఇచ్చిన సంఘటన ఇప్పటికీ మరిచిపోలేను. మట్టిపిడతలో అన్నం వండించుకుని నాగేశ్వరరావుగారు తినేవారు. మా చెట్టు వల్ల ఎంతో మంది సినీ ప్రముఖులను చూసే అదృష్టం కలిగింది. - నీరుకొండ లక్ష్మణరావు, స్థానికుడు మా నిద్రగన్నేరుచెట్టు మా గ్రామానికే తొలిమెట్టు. ఇక్కడ ఎంతో మంది ప్రముఖులు పలు సన్నివేశాల్లో నటించారు. ఏడాదిలో రెండు మూడు షూటింగులన్నా మా గ్రామంలో జరుగుతాయి. ఇటీవల అల్లరి నరేష్ నటించిన బందిపోటు సినిమా ఇక్కడ షూటింగు జరుపుకున్నదే! - బోగవెళ్లి బ్రహ్మానందం, స్థానికుడు -
ఏయన్నార్ 75 ఏళ్ల సినీ జీవితం
-
అక్కినేని జ్ఞాపకాలు
-
గోదావరి బుల్లోడు అక్కినేని
రాజమండ్రి కల్చరల్ : మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు మన మధ్యనుంచి నిష్ర్కమించి అప్పుడే ఏడాది గడిచింది. గోదావరి జిల్లాలతో అవినాభావ అనుబంధం ఆయనకు ఉంది. గోదావరి తీరాన రూపు దిద్దుకున్న అక్కినేని సినిమాలు చరిత్ర సృష్టించాయి. 1963లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో విడుదలైన మూగమనసులు కోటిపల్లి రేవు తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేసుకుంది. అన్నపూర్ణా పిక్చర్స్ బ్యానర్‌పై వచ్చిన పూలరంగడు షూటింగ్ కపిలేశ్వరపురంలో జరిగింది. 1969లో బాపు, రమణల బుద్ధిమంతుడు పులిదిండి, ర్యాలి గ్రామాలలో నిర్మాణమైంది. 1997లో విడుదలైన ఆత్మీయుడు తాపేశ్వరం లాకుల వద్ద, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిత్రీకరణ చేసుకుంది. 1982నాటి మేఘసందేశం సన్నివేశాల షూటింగ్ దోసకాయలపల్లి, నందరాడ గ్రామాల్లో జరిగింది. 1970లో విడుదలయిన ఇద్దరమ్మాయిలు షూటింగ్ సామర్లకోట షుగర్ ఫ్యాక్టరీలో జరిగింది. ఆ తరువాత వచ్చిన సూత్రధారులు షూటింగ్ అన్నవరం, మిర్తిపాడు, తొర్రేడు, కపిలేశ్వరపురం గ్రామాల్లో జరిగింది.సీతారామయ్యగారి మనుమరాలు షూటింగ్ కోనసీమలో జరిగింది. మాధవయ్యగారి మనుమడు మిర్తిపాడు, తొర్రేడు గ్రామాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. చివరిసారిగా అక్కినేని 2013 జనవరి 9న గైట్ కళాశాల వార్షికోత్సవాలకు రాజమండ్రి వచ్చి షెల్టాన్ హోటల్ 614 గదిలో ఉన్నారని ఆయన అభిమాని అడబాల మరిడయ్య తెలిపారు. -
‘నటసామ్రాట్’బిరుదు అలా ఇచ్చాం!
నేడు అక్కినేని ప్రథమ వర్ధంతి ఎంతలో తిరిగివచ్చింది ఏడాది! ‘నట సామ్రాట్’ అక్కినేని మనల్ని విడనాడి దివికేగి సంవత్సరమైందా? ఆయన మన మధ్య ఉన్నట్టు, ఇంకా హైదరాబాద్ రవీంద్రభారతిలో సభలో మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నదే! అందులోనూ ఆయన పార్థివ శరీరాన్ని చూడని నాకు ఆయన తన అభిమానులతో తన అనుభవాల గురించి ముచ్చటిస్తున్నట్టే అనిపిస్తున్నది! అక్కినేని నాగేశ్వరరావు జీవితం బహువిచిత్రమైనది. అదొక అద్భుత గాథ. వ్యక్తిత్వ వికాస విద్యార్థులకు ఆదర్శ పాఠ్యగ్రంథం! లేకపోతే, ఒక సాధారణ రైతు కుమారుడు అలభ్యమైన అప్పటి మద్రాసులో చిత్రజగత్తుకు వెళ్లడమేమిటి? అక్కడ హీరోలకు హీరో కావడమేమిటి? నాల్గవ తరగతి కూడా సరిగ్గా చదవని ఆ అబ్బాయి అమెరికా ప్రభుత్వం ఆహ్వానంపై అమెరికా వెళ్లడమా? చివరికి ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’లు ఆయన నట జీవితాన్ని అలంకరించడమా? అందువల్లనే, అక్కినేనిది అద్భుత చరిత్ర; ఆయన బాల్య జీవితాన్ని పరిశీలిస్తే, ప్రపంచ ప్రఖ్యాతులైన పెక్కుమంది మహామహుల బాల్య జీవితంలో కానవచ్చే విశేషాలే కానవస్తాయి! తల్లిదండ్రులకు అక్కినేని కడగొట్టు సంతానం. పుట్టిన వారి వరుసలో ఆయన తొమ్మిదవవాడు! ఆయనకు ముందు పుట్టిన బేసి సంఖ్య పిల్లలు పోవడం వల్ల ఈ తొమ్మిదో వాడేం జీవిస్తాడని అందరూ ఆశ వదులుకున్నారు! గండాలమారి దానికి తగ్గట్టే ఆ పిల్లవాడికి మెడపై కణితి లేవడం ప్రారంభించింది! ఇంకేమున్నది? ఇక లాభం లేదని వైద్యం కూడా మానేశారు. కాని, ఆ గొంతు లక్షలాది ఆంధ్ర ప్రేక్షకుల హృదయాలను భవిష్యత్తులో ఉర్రూత లూగించడం విధి విలాసమైతే, ఆ కణితి ఏమి చేస్తుంది? మందు లేకుండానే అది మానిపోయింది! చిన్నప్పుడు ఆయనకు జలగండం, అగ్ని గండం తప్పాయి. గండాలన్నీ గడిచి అక్కినేని వారి అబ్బాయి గట్టెక్కాడు! పున్నమ్మ గారికి ఆడపిల్లలు లేరు. ఈ అబ్బాయినే అమ్మాయిగా చూసుకుని సంతోషించాలని అతనికి ఆడపిల్లవలె జడవేసేది, పరికిణీలు తొడిగేది! మరి, వేష భాషలే కదా మనిషిని మార్చివేసేది! అమ్మాయి వేషం వేసే సరికి అబ్బాయి గారికి అమ్మాయిల వలె కులకడం, నడవడం అలవాటయింది. అందువల్ల, నాటకాలలో ఆడ వేషాలు వేయడం నాగేశ్వరరావుకు చిన్నప్పుడే అబ్బింది! తల్లి ఆరోగ్యం సరిగా లేనందున, ఆమెకు వంట, మిగిలిన ఇంటి పని చేసిపెట్టి, బడికి వెళ్లి చదువుకుంటూ, అది అయిన తరువాత మైలు దూరంలో ఉన్న నాటకాల రిహార్సల్ స్థలానికి వెళ్లేవాడు. ఆయన ఆడవేషం, ఆ తళుకు, ఆ బెళుకు, ఆ కులుకు చూసి కొందరు ఆ పాత్రధారి నిజంగా అమ్మాయే అనుకునేవారట! అప్పుడు ఆయన పారితోషికం మూడు రూపాయలు! ఒకసారి తెనాలిలో నాటకం వేసి, విజయవాడ మీదుగా గుడివాడ వెళదామని విజయవాడ రైలు స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తున్న నాగేశ్వరరావును ‘ప్రతిభా పిక్చర్స్’ ఘంటసాల బలరామయ్య చూశారు! అప్పుడు తాను తీస్తున్న ‘శ్రీ సీతారామ జననం’లో శ్రీరాముడు వేషానికి ఈ కుర్రవాడు సరిపోయేట్టు ఉన్నాడని భావించి, అక్కినేని అన్నగారితో మాట్లాడి, ఆ తరువాత ఆ ఆడపాత్రధారి చేత తన చిత్రంలో మొదటిసారిగా మగ పాత్రను వేయించారు! అక్కడి నుంచి అక్కినేని వెనుదిరిగి చూడలేదు. ఇది 1944 నాటి మాట. అప్పటికి నాగేశ్వరరావు వయస్సు 19 సంవత్సరాలు. ఇక అప్పటి జానపద చిత్రాల యుగంలో ఈ నవ యువకుడే అమ్మాయిల కలల రాకుమారుడు! అలా ఆనాటి జానపద చిత్రాలలో నాగేశ్వరరావు ‘హీరో నాగేశ్వరరావు’ అయ్యాడు! అక్కినేని ‘దేవదాసు’కు అర్హుడా? 1952లో వినోదా పిక్చర్స్ వారు బెంగాలీ నవల ‘దేవదాసు’ను తెలుగులో చిత్రించదలచి అక్కినేనిని కథానాయకుడుగా నిర్ణయించి, ప్రకటించేసరికి చాలామందికి ఆశ్చర్యం కలిగింది! జానపద చిత్రాల రాకుమారుడు ఆ తాగుబోతు పాత్రకు ఏమి పనికి వస్తాడన్న విమర్శలు బయలుదేరాయి! అప్పటిలో - 1952లో - నేను ‘ప్రతిభ’ అనే తెలుగు వారపత్రికకు ఎడిటర్‌గా పని చేస్తున్నాను. ‘‘అక్కినేని దేవదాసు పాత్రకు అర్హుడా?’’ అన్న శీర్షికతో నేను నా పత్రికలో ఒక వ్యాసం రాశా. అది నాగేశ్వరరావు దృష్టికి వెళ్లింది! 1953లో ఆ చిత్రం విడుదలై, యావదాంధ్ర దేశంలో నాగేశ్వరరావు ‘దేవదాసు’ పాత్రను గురించి జనం వింతగా చర్చించుకుంటున్నారు. విజయవాడలో నాగేశ్వరరావుకు అప్పుడే సన్మానం జరిగింది. ఆ సన్మానానికి నేను కూడా వెళ్లాను. సభానంతరం అక్కినేని నా వద్దకు వచ్చి, ‘‘ఏమండీ! ‘దేవదాసు’ పాత్రకు నేను అర్హుడినా? అనర్హుడినా?’’ అని చిరునవ్వుతో అడిగేసరికి నేను కొంచెం బిడియంతో ‘‘హ్యాట్సాఫ్ టు యు’’ అని అభినందించేసరికి ఆయన ముఖంలో ఆనందం వెల్లివిరిసింది! అక్కినేనికి ముఖస్తుతి పనికిరాదు. సద్విమర్శనే ఆయన ఆహ్వానించేవారు. ‘దేవదాసు’కు తాను పనికిరానన్న విమర్శను పెద్ద సవాల్‌గా తీసుకుని, ఆ పాత్రలో మెప్పు పొందడానికి తాను అహోరాత్రులు తపనపడ్డానని ఆయన నాతో అన్నారు. ఆ తరువాత దాదాపు పది సంవత్సరాల అనంతరం నేను లక్నోలో ‘హిందీ సినీ లెజెండ్’ దిలీప్‌కుమార్‌ను కలుసుకున్నప్పుడు ఆయన ‘దేవదాసు’ పాత్రను అభినందించారు. ఆయనకు ‘ట్రాజెడీ కింగ్’ అని బిరుదు. ‘నా కంటే మీ నాగేశ్వరరావే బాగా నటించారు’’అని దిలీప్ అన్నారు. అలాగే ‘కన్నడ కంఠీరవ’ రాజ్‌కుమార్ కూడా అదే మాట అన్నారు. మొత్తం మీద ‘దేవదాసు’ పాత్రను సైడల్, బారువా, దిలీప్, షారుక్‌ఖాన్ మొదలైన మహానటులు ఎందరు పోషించినా, అక్కినేని ‘దేవదాసు’కు ఆయనే సాటి!ఆ తరువాత ఆయన నట జీవితంలో 60వ చిత్రం ‘దొంగల్లో దొర’ 1957 జూలై 19న విడుదలైంది. అది అక్కినేని నట జీవిత వజ్రోత్సవం. ఆ సందర్భంగా ఆయనను సినీ జీవితంలోకి పంపిన విజయవాడలో ఆయనకు భారీ ఎత్తున సన్మానాన్ని తలపెట్టాము. ఎలా సన్మానించాలన్న సమస్య వచ్చినప్పుడు అక్కినేనికి దీటైన సాంఘిక చిత్రాల హీరో లేడని, ఆయనకు ‘నటసామ్రాట్’ అన్ని బిరుదు అన్ని విధాల తగినదని నేను సూచించినప్పుడు ఆహ్వాన సంఘం వారు అంగీకరించారు. అక్కినేని ఎత్తిపొడుపు! 1957లో ఆగస్టులో విజయవాడలో జరిగిన అక్కినేని సన్మాన సభలో ‘నటసామ్రాట్’ బిరుదు ఇస్తూ, సన్మాన పత్రం రాసిన నేనే దాన్ని చదివి, అప్పటి ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బెజవాడ గోపాలరెడ్డితో కలిసి, అక్కినేనికి సమర్పించగా, ఆయన ‘‘ ‘నేను నటసామ్రాట్’ బిరుదుకు తగినవాడినంటారా?’’ అంటూ నా వంకకు తిరిగి నవ్వుతూ అన్నారు. నవ్వడం నా వంతు, ఏమిటో తెలియక ఆశ్చర్యపోవడం గోపాలరెడ్డిగారి వంతు అయింది! ఆ తరువాత ఆయనకు ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘పద్మవిభూషణ్’ - ఎన్ని అవార్డులు వచ్చినా, ‘నట సామ్రాట్’కు చాలిన బిరుదు లేదని ఆయన చాలా సందర్భాల్లో అంటూ వచ్చారు. చివరికి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో అక్కినేని ముఖ్య అతిథిగా పాల్గొన్నప్పుడు ఆయనను అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి కూడా ‘నటసామ్రాట్ నాగేశ్వరరావుజీ’ అని సంబోధించారు!ఔను! నటసామ్రాట్ అంటే నాగేశ్వరరావు! నాగేశ్వరరావు అంటే నటసామ్రాట్! అందువల్లనే, తనకు ఆ బిరుదు వచ్చి, 50 ఏళ్లు అయిన సందర్భంగా 2007లో అక్కినేని నన్ను హైదరాబాద్ ఆహ్వానించి, నాకు స్వర్ణకంకణం తొడిగారు! ‘నటసామ్రాట్’ అంటే అక్కినేనికి అంత ప్రియతమ బిరుదు! -
అప్పుడాయన కళ్లెర్రజేసి ఉంటే...నా పరిస్థితి ఏమయ్యేదో!
సినిమా ప్రపంచంలో పాత్ర పరంగా కాకుండా వ్యక్తిగతంగా కొందరు ఆలోచిస్తారు. ఒక పాత్ర ఇంకో పాత్రని దూషిస్తే రెండో పాత్రధారి, మొదటి పాత్రధారిని ఉద్దేశించి ‘‘అతనెవడు నన్ను తిట్టడానికి?’’ అని అడిగిన సందర్భాలున్నాయి. రాజ్యం పిక్చర్స్ ‘హరిశ్చంద్ర’లో యస్.వి. రంగారావు- హరిశ్చంద్రుడు, గుమ్మడి -విశ్వామిత్రుడు. ఒక దృశ్యంలో విశ్వామిత్రుడు, హరిశ్చంద్రుడు తన ముందు మోకరిల్లి ఉండగా, తలను కాలితో తన్నాలి. రంగారావు ఒప్పుకోలేదు. ‘‘గుమ్మడెవరు నన్ను తన్నడానికి?’’ అని అంగీకరించపోతే, ‘డూప్’ షాట్ తీసుకున్నారు. ‘ప్రేమించి చూడు’లో రేలంగిని, అల్లు రామలింగయ్య ‘బావా’ అనాలి - దృశ్యపరంగా. రేలంగి ఒప్పుకోలేదు. అలిగి కూచుంటే దర్శకుడు పి. పుల్లయ్య బుజ్జగించారు. ఇలాంటివి ఇంకా ఎన్నో కనిపిస్తాయి. ‘ప్రేమించి చూడు’లో నేను, అక్కినేని వారికి (హీరో) తండ్రిని. పదిమంది నా గురించి చెప్పి.. చెప్పి.. చెబితేగాని, దర్శకుడు పి. పుల్లయ్యగారు ఆ వేషం నాకివ్వలేదు. ఆ భయం ఉంది వేషం మొదలు పెడుతున్నప్పుడు. పైగా, మొట్టమొదటి రోజు నా షూటింగు, నాగేశ్వరరావుగారిని తిట్టడంతో ఆరంభం! ‘‘ఒరే గాడిదా, ఎక్కడ తిరుగుతున్నావురా?’’ అని డైలాగు ఆరంభం. ఒళ్లు వణుకు, గుండె దడ. నాగేశ్వరరావు గారు నాకు బాగా తెలుసు గాని, ఆయనతో నటించడం అదే మొదలు. పైగా దృశ్యంలో గుమ్మడి, జగ్గయ్య, రేలంగి కూడా ఉన్నారు. ‘‘ఈ రావి కొండలరావు నన్ను గాడిదా అని తిడతాడా? అసలు ఈ వేషం ఇతనికెందుకు ఇచ్చారు?’’ అని అక్కినేని, కళ్లెర్రజేస్తే? అమ్మో! ‘‘రిహార్సల్ - రావయ్యా కొండల్రావు చెప్పు డైలాగ్’’ అని పుల్లయ్యగారు అరుస్తున్నారు. నా పక్కనే ఉన్న సహాయ దర్శకుల దగ్గర నెమ్మదిగా మొర పెట్టుకుంటున్నాను. షాట్‌కి వెళ్లడం లేదు. ‘‘ఏం జరుగుతోందక్కడ? ఏమిటాలస్యం?’’ అని హీరోగారూ ఓ కేక వేశారు. సహాయకులు వెళ్లి అక్కినేనికి వివరించారు - నాలో జరుగుతున్న ఘర్షణ. ‘రండి - రండి ఇలా’ అని పిలిచారు హీరో. నెమ్మదిగా వెళ్లాను. ‘‘ఏమిటి? ఏమిటా సందేహం?... ఎవర్ని తిడుతున్నారు మీరు? నన్నా? మీ కొడుకునా?... తన కొడుకుని, తండ్రి ‘గాడిదా’ అని తిడుతున్నాడు. అంతేగాని, అక్కినేని నాగేశ్వరరావుని, రావి కొండలరావు ‘గాడిద’ అనడం లేదు కదా. ఆలోచిస్తారేమిటండీ - విజృంభించండి. రండి’’ అని భుజం తట్టి ప్రోత్సహించారు. అంతే. రిహార్సల్లో దంచాను. టేక్‌లోనూ మార్కులు కొట్టాను. అదీ - అక్కినేని ప్రోత్సాహం! తక్కిన కొందరు పెద్ద తారలు అన్నట్టుగా ‘వీడెవడు నన్ను గాడిదా’ అనడానికి అని, ఆయన ఒక్క మాట అని ఉంటే - నేను సినిమాల్లో నిలదొక్కుకోగలగడానికి కారణమైన ఆ పాత్ర పోయేది. అసలు నా సినిమా జీవితం- నటుడిగా - అక్కడే ఆగిపోయేది! ఆయన ముఖ్య నటుడు. ఏం చెబితే అది జరుగుతుంది. కానీ ఆయన పాత్రపరంగా ఆలోచించారే గాని, వ్యక్తిగతంగా ఆలోచించలేదు. ఎంతటి పెద్ద మనసు! నాలాగా ఎంతోమంది కొత్తవారికి ఇచ్చిన ప్రోత్సాహం విషయంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇది నేను మరచిపోలేను! - రావి కొండలరావు సీనియర్ నటుడు, జర్నలిస్ట్ -
అక్కినేని ఆలోచనలు
‘‘వివేకం, విజ్ఞానం ఉన్న శత్రువు కంటే అవివేకం, అజ్ఞానం ఉన్న మిత్రుడు ప్రమాదకరం.’’ ‘‘నువ్వు మంచివాడవని అందరూ అనుకోవాలని ఆలోచించకు. చెడు చేయకూడదని ఆలోచించు. అది చాలు.. నువ్వు నీకు తెలియకుండానే మంచివాడివే అవుతావు.’’