‘మనం’లో నాగార్జున, నాగచైతన్య, ఏయన్నార్
‘‘నా వయసు 32’’ అంటున్నారు నాగార్జున. హ్యాండ్‌సమ్‌గా ఫిట్‌గా ఉండే నాగార్జున ఏజ్ ఫిఫ్టీ ప్లస్ అయినా థర్టీ ప్లస్ అంటే నమ్మేట్టే ఉంటుంది. ఇంతకీ పని గట్టుకుని ‘32 ఇయర్స్’ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందీ అంటే.. ‘నా వయసు ముప్పై రెండే, కానీ... నటుడిగా’ అన్నారు నాగ్. మే 23తో నటుడిగా నాగార్జున వయసు 32. అదేనండీ ఇండస్త్రీకి వచ్చి 32ఏళ్లు అవుతోంది. నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్’ మే 23న రిలీజ్ అయింది. అదే రోజున అక్కినేని నాగేశ్వరరావు లాస్ట్ సినిమా ‘మనం’ కూడా విడుదలవ్వడం విశేషం. ఈ విషయం గురించి నాగార్జున స్పందిస్తూ – ‘‘కొన్ని సంఘటనలు కాకతాళీయంగా జరుగుతాయా? లేక యూనివర్శ్‌కి నంబర్ గేమ్స్ అంటే ఇష్టమా? అని ఆశ్చర్యపోతుంటాను. నా ఫస్ట్ సినిమా ‘విక్రమ్’, మా నాన్నగారి లాస్ట్ సినిమా ‘మనం’ రెండూ మే 23నే రిలీజ్ అయ్యాయి. మేం ఏదీ ప్లాన్ చేయలేదు. అన్నీ అలా జరిగిపోయాయి. ఆ డేట్ 23ని రివర్స్ చేస్తే 32.
అది నా ఏజ్. యాక్టర్‌గా నా వయసు 32. ఇన్ని సంవత్సరాలుగా అందరూ చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘మనం’ సినిమా రిలీజ్ అయి నాలుగు సంవత్సరాలు కావడంతో తండ్రిని గుర్తు చేసుకుంటూ – ‘‘మనం’ రిలీజ్ అయి 4 సంవత్సరాలు అవుతోంది. మమ్మల్నందర్నీ నవ్వించారు, ఏడిపించారు, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. ఇలా ప్రతీ విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాం నాన్నా. ప్రతీక్షణం మీ గురించే ఆలోచిస్తూ చిరునవ్వు తెచ్చుకుంటాం. ఏయన్‌ఆర్ ఎప్పటికీ బతికే ఉంటారు’’ అని ఉద్వేగంగా పేర్కొన్నారు నాగార్జున. అన్నట్లు ‘మనం’లో ఏయన్నార్ కింద, నాగచైతన్య కుర్చీలో కూర్చుని, నాగార్జున నిలబడి ఉన్న ఫస్ట్ లుక్ బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో కనిపించని రేర్ ఫొటో ఒకటుంది. పైన ఉన్నది అప్పుడు మనం చూడని ఫొటోనే. ‘మనం’ విడుదలై నాలుగేళ్లైన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేసిన ఫొటో ఇది.
Comments
Please login to add a commentAdd a comment