manam
-
స్క్రీన్‌పై సమంతతో రొమాంటిక్ సీన్స్.. చైతూ రియాక్షన్ ఏంటంటే?
నాగచైతన్య-సమంత.. టాలీవుడ్లో ఈ జోడీకి స్పెషల్ క్రేజ్ ఉంది. కలిసి కెరీర్ మొదలుపెట్టిన వీళ్లిద్దరూ ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ ఏమైందో ఏమో గానీ నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరి కెరీర్ పరంగా వాళ్లు బిజీ అయిపోయారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరి గురించి మాట్లాడుకునేలా చేశారు. ఇంతకీ అసలేం జరిగింది?(ఇదీ చదవండి: 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ-సమంత.. జంటగా నాలుగు సినిమాలు చేశారు. వీటిలో అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన 'మనం'లో భార్యభర్తలుగా నటించారు. తాజాగా ఈ మూవీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని దేవి థియేటర్లో గురువారం సాయంత్రం షో వేయగా.. అక్కినేని ఫ్యామిలీకి చెందిన చైతూ, సుప్రిత తదితరులు హాజరయ్యారు.ఇక ఈ సినిమాలో తాతతో ఉన్న సీన్స్ చూస్తూ ఎమోషనల్ అయిన చైతూ.. సమంతతో రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయాడు. కానీ థియేటర్లో ఉన్న ఫ్యాన్స్ మాత్రం అరిచి గోల గోల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: చరణ్-తారక్‌పై మనసు పారేసుకున్న హాలీవుడ్ భామ.. ఏం చెప్పిందంటే?)#NagaChaitanya reaction for #ChaySam Pelli Scene at #Manam Re Release 💖🔥🔥@Samanthaprabhu2 @chay_akkineni #ManamReRelease#NagaChaitanya#Samantha pic.twitter.com/KYRzcMdbyt— Ungamma (@ShittyWriters) May 23, 2024 -
రామ్ చరణ్‌తో కాదు.. నాగ చైతన్యతో!
వైవిధ్యమైన కథాంశాలతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రతిభ గల డైరెక్టర్ విక్రమ్ కె కుమార్. ‘నాని గ్యాంగ్ లీడర్’ చిత్రంతో ఓ సెక్షన్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేశాడు ఈ క్రేజీ డైరెక్టర్. గ్యాంగ్ లీడర్ తర్వాత ఇప్పటివరకు మరో చిత్రాన్ని పట్టాలెక్కించలేదు. అయితే మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌కు ఓ స్టోరీ లైన్ వినిపించాడని, చెర్రీకి నచ్చడంతో తన తదుపరి సినిమా అవకాశం విక్రమ్‌కు ఇచ్చాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిచ్చాయి. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యేలోపు పూర్తి స్క్రిప్ట్‌ను సిద్దం చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో కాని విక్రమ్ కుమార్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారని సమాచారం. తన తదుపరి సినిమా రామ్‌చరణ్‌తో కాకుండా నాగచైతన్యతో తీసేందుకు సన్నాహాలు చేసున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాణ సంస్థ ఈ సినిమా తెరకెక్కించనుందని టాలీవుడ్ టాక్. ‘మనం’ సినిమాతో అక్కినేని కుటుంబానికి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన విక్రమ్ కుమార్‌తో మరో సినిమా చేసేందుకు నాగ చైతన్య సైతం ఆసక్తి కనబరుస్తానడట. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ’తో చైతూ బిజీగా ఉన్నాడు. లవ్ స్టోరీ తర్వాత చైతూకి మరో రెండు కమిట్మెంట్స్ ఉండటంతో.. ఆ రెండింటి తర్వాతనే విక్రమ్‌తో చైతూ సినిమా ఉండనున్నట్లు సమాచారం. ఈ గ్యాప్‌లో చిన్న వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో కూడా విక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై వీరిద్దరి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. చదవండి: చైతూకి 49, సమంతకు 51: సామ్ ట్వీట్! ఇవి ఎవరికి ఇవ్వాలో సలహా ఇవ్వండి : ఉపాసన -
మనం సైతం ఆధ్వర్యంలో చేయూత
సాక్షి, సిటీబ్యూరో: సినీ రంగంలోని అవసరార్థుల కోసం ఏర్పడిన మనం సైతం సంస్థ ఆధ్వర్యంలో పలువురికి ఆర్ధిక సాయం అందించారు. జూబ్లీహిల్స్‌లోని ఫిలింఛాంబర్ లో శనివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..సేవా సంస్థను మరింత అభివృద్ధి చేయాలని, దీని కోసం తన వంతుగా ఒక యాప్ రూపొందించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. బిగ్ బాస్ 2 విజేత కౌశల్ మాట్లాడుతూ ఇకపై మనం సైతం స్ఫూర్తితో కౌశల్ ఆర్మీ కూడా పనిచేస్తుందన్నారు. తన వంతుగా పాతిక వేల రూపాయలు విరాళం ప్రకటించారు. సీనియర్ నటి జయలలిత మాట్లాడుతూ.... మనం సైతం ద్వారా పేదల ఆరోగ్యం, విద్య, వృద్ధులకు సహాయపడుతుండడం అభినందనీయమన్నారు. తన వంతుగా లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. కాదంబరి కిరణ్ మాట్లాడుతూ గత జనవరి నుంచి ఇప్పటికి 90 మంది పేదలకు ఆర్థిక సహాయం అందించామని, వివిధ ఆస్పత్రులను అభ్యర్థించి పేదలకు 43 లక్షల రూపాయల ఫీజులు తగ్గించామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మణికంఠ, పి. రంగాచార్యులు, లక్కీ యాదవ్, గుమ్మోజి భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మనం చూడనిది!
‘‘నా వయసు 32’’ అంటున్నారు నాగార్జున. హ్యాండ్సమ్గా ఫిట్‌గా ఉండే నాగార్జున ఏజ్ ఫిఫ్టీ ప్లస్ అయినా థర్టీ ప్లస్ అంటే నమ్మేట్టే ఉంటుంది. ఇంతకీ పని గట్టుకుని ‘32 ఇయర్స్’ అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందీ అంటే.. ‘నా వయసు ముప్పై రెండే, కానీ... నటుడిగా’ అన్నారు నాగ్. మే 23తో నటుడిగా నాగార్జున వయసు 32. అదేనండీ ఇండస్త్రీకి వచ్చి 32ఏళ్లు అవుతోంది. నాగార్జున హీరోగా పరిచయమైన ‘విక్రమ్’ మే 23న రిలీజ్ అయింది. అదే రోజున అక్కినేని నాగేశ్వరరావు లాస్ట్ సినిమా ‘మనం’ కూడా విడుదలవ్వడం విశేషం. ఈ విషయం గురించి నాగార్జున స్పందిస్తూ – ‘‘కొన్ని సంఘటనలు కాకతాళీయంగా జరుగుతాయా? లేక యూనివర్శ్‌కి నంబర్ గేమ్స్ అంటే ఇష్టమా? అని ఆశ్చర్యపోతుంటాను. నా ఫస్ట్ సినిమా ‘విక్రమ్’, మా నాన్నగారి లాస్ట్ సినిమా ‘మనం’ రెండూ మే 23నే రిలీజ్ అయ్యాయి. మేం ఏదీ ప్లాన్ చేయలేదు. అన్నీ అలా జరిగిపోయాయి. ఆ డేట్ 23ని రివర్స్ చేస్తే 32. అది నా ఏజ్. యాక్టర్‌గా నా వయసు 32. ఇన్ని సంవత్సరాలుగా అందరూ చూపిస్తున్న అభిమానానికి చాలా థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘మనం’ సినిమా రిలీజ్ అయి నాలుగు సంవత్సరాలు కావడంతో తండ్రిని గుర్తు చేసుకుంటూ – ‘‘మనం’ రిలీజ్ అయి 4 సంవత్సరాలు అవుతోంది. మమ్మల్నందర్నీ నవ్వించారు, ఏడిపించారు, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించారు. ఇలా ప్రతీ విషయాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాం నాన్నా. ప్రతీక్షణం మీ గురించే ఆలోచిస్తూ చిరునవ్వు తెచ్చుకుంటాం. ఏయన్ఆర్ ఎప్పటికీ బతికే ఉంటారు’’ అని ఉద్వేగంగా పేర్కొన్నారు నాగార్జున. అన్నట్లు ‘మనం’లో ఏయన్నార్ కింద, నాగచైతన్య కుర్చీలో కూర్చుని, నాగార్జున నిలబడి ఉన్న ఫస్ట్ లుక్ బాగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో కనిపించని రేర్ ఫొటో ఒకటుంది. పైన ఉన్నది అప్పుడు మనం చూడని ఫొటోనే. ‘మనం’ విడుదలై నాలుగేళ్లైన సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేసిన ఫొటో ఇది. -
నా తొలి సినిమా... నాన్న చివరి సినిమా
అక్కినేని కుటుంబానికి మరుపురాని సినిమా ‘మనం’. అక్కినేని మూడు తరాల హీరోలు ఈ సినిమాలో కలిసి నటించారు. పైగా ఏఎన్నార్‌కు ఇది చివరి చిత్రం కావడంతో అక్కినేని కుటుంబానికి ఈ మూవీ ఎంతో ప్రత్యేకం. నేటికి మనం మూవీ రిలిజై నాలుగు సంవత్సరాలైంది. ఈ సందర్భంగా కింగ్ నాగ్ తన భావాల్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. నాన్న నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాం అంటూ ట్వీట్ చేసిన నాగ్, కొంత సమయం తరువాత.. ‘నా మొదటి సినిమా విక్రమ్, మా నాన్న చివరి చిత్రం మనం ఒకే తేదీన (మే 23) విడుదలయ్యాయి. మేము ముందుగా ప్లాన్ చేయలేదు. అలా జరిగింది. అంతేకాకుండా ఈ 23ను తిరిగేస్తే 32 వస్తుంది. నేను సినీరంగంలో అడుగుపెట్టి 32 ఏళ్లు అవుతోంది. మా పై ప్రేమను చూపిస్తున్న వారందరికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. I sometimes wonder if it is a coincidence or the universe likes numbers🤔my fathers LAST film #manam & my FIRST film Vikram released on the same date May23🙏of course we didn’t plan.. it just happened!! Reverse 23 and that becomes 32! My age as an actor😊thx for all the love❤️ pic.twitter.com/RK6yc1ITXn — Nagarjuna Akkineni (@iamnagarjuna) May 23, 2018 -
‘ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంటాం నాన్న’
అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన మనం సినిమా రిలీజ్ అయి నేటికి నాలుగేళ్లు. అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ కలిసి నటించిన ఈ సినిమా, దివంగత నటుడు నాగేశ్వరర్రావు చివరి సినిమా కావటం విశేషం. ఆరోగ్యం సహకరించకపోయినా.. చివరి క్షణం వరకు నటిస్తూనే ఉండాలన్న కోరికతో ఈ సినిమాను పూర్తి చేశారు ఏఎన్నార్. మనం సినిమా రిలీజ్ అయి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నాగార్జున ట్వీట్ చేశారు. ‘మనం సినిమా రిలీజ్ అయి నాలుగేళ్లు. నేనెప్పుడూ అదే ఆలోచిస్తుంటా.. మీరు మమ్మల్ని ఏడిపించి, నవ్వించి జీవితాన్ని చావును ఎదుర్కొనే ధైర్యాన్ని ఇచ్చారు. మేం ఎప్పుడూ మీ గురించే ఆలోచిస్తుంటాం నాన్న’ అంటూ ట్వీట్ చేశారు నాగ్. It’s been 4 yrs since #Manam released. I hv been thinking of how you made us cry,laugh and finally inspire the family to face life and death!! we think of you all the time NANA and we smile🙏 #ANRliveson pic.twitter.com/XjCM1YrFne — Nagarjuna Akkineni (@iamnagarjuna) 23 May 2018 -
మరోసారి.. నాగ్ సినిమాలో సమంత?
అక్కినేని వారి కోడలు సమంత మరోసారి మామ నాగార్జున తో కలిసి నటించేందుకు రెడీ అవుతోందట. ఇప్పటికే మనం, రాజుగారి గది 2 లాంటి సినిమాల్లో ఈ ఇద్దరు కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి ఓ డిఫరెంట్ సినిమా కోసం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్న నాగ్, ఈ నెల 24 నుంచి మరో సినిమాను ప్రారంభించనున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో నాగార్జున తోపాటు నాని మరో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో నానికి జోడిగా సమంత నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా కన్నడ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ నటించనుంది. ఈ కాంబినేషన్‌పై ఇంతవరకు అధికారిక ప్రకటన లేకపోయినా.. అక్కినేని అభిమానులు మాత్రం ఈ వార్తలతో పండగ చేసుకుంటున్నారు. -
డిసెంబర్లో వస్తాడు
డిసెంబర్ అంటే నాగార్జునకు ఎంతో ఇష్టం. ఎందుకంటే... ఆ నెలలో రిలీజైన ఆయన సినిమాలన్నీ దాదాపు హిట్టే! ఆ సెంటిమెంట్ ఏమో.. అఖిల్ హీరోగా నటిస్తున్న రెండో సినిమాను కూడా అదే నెలలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అఖిల్ హీరోగా ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌పై నిర్మిస్తున్న సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ‘‘సినిమాలో చిన్న బిట్ చూశా. విక్రమ్, వినోద్ (సినిమాటోగ్రాఫర్, ‘మనం’కి కూడా వర్క్ చేశారు) మళ్లీ మేజిక్ రిపీట్ చేస్తారు’’ అని నాగార్జున పేర్కొన్నారు. -
మనసు నేపథ్యంగా ‘మనలో మనం’
ఆసక్తికరంగా రచించిన డాక్టర్ రామారెడ్డి ఆవిష్కరణసభలో ‘సైకాలజీ టుడే’ ఎడిటర్ సురేష్ సాక్షి, రాజమహేంద్రవరం : మానసిక ధోరణులు అంశంగా ఉండే కథలు పెద్దగా ఆసక్తిగా ఉండవని, కానీ డాక్టర్ కర్రి రామారెడ్డి వ్యక్తుల మనసుల నేపథ్యంలో రాసిన ‘మనలో మనం’ పుస్తకం మసాలాతో పాటు అద్భుతమైన శైలి ఆకట్టుకుంటోందని న్యూవిజన్ పబ్లిషర్, సైకాలజీ టుడే ఎడిటర్ డాక్టర్ ఎస్వీ సురేష్ అన్నారు. బీసీ రాయ్ అవార్డు గ్రహీత, ప్రముఖ మానసిక వైద్యనిపుణుడు డాక్టర్ రామారెడ్డి రచించిన ‘మనలో మనం’ పుస్తకావిష్కరణ ఆదివారం నగరంలోని మానస వైద్యశాలలో జరిగింది. ముఖ్యఅతిథిగా సురేష్ మాట్లాడుతూ రామారెడ్డి గతంలో రాసిన ‘మనలో ఒకరు’ పుస్తకాన్ని కూడా తామే ప్రచురించామని, ఆ పుస్తకం రెండో ముద్రణ వేసేలా విరివిగా అమ్ముడయిందని చెప్పారు. ‘మనలో మనం’ చదివేటప్పుడు మనం, మన చుట్టూ ఉన్న వ్యక్తులను చూస్తున్నట్లు ఉంటుందని విశ్లేషకులు ఫణి నాగేశ్వరరావు పేర్కొన్నారు. వైద్యునిగా సేవలందిసూ్తనే రామారెడ్డి ప్రసంగాలు చేయడం, వివిధ పత్రికలకు 3,500 వ్యాసాలు రాయడం గొప్పవిషయమన్నారు. డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ ఇది తాను రాసిన మూడో పుస్తకమని, గతంలో ‘మనిషి మనసు’, ‘మనలో ఒకరు’ మాదిరిగానే ఈ పుస్తకాన్ని పాఠకులు ఆదరిస్తారన్న నమ్మకముందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి బీసీ రాయ్ అవార్డు అందుకున్న సైకియాట్రిస్ట్ తానే కావడం సంతోషంగా ఉందన్నారు. -
మరోసారి అక్కినేని మల్టీ స్టారర్..?
ఫ్యామిలీ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన మనం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు అక్కినేని ఫ్యామిలి. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలు కలిసి నటించారు. అఖిల్ కూడా అతిథి పాత్రలో కనిపించటంతో సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఇదే ఫ్యామిలీ నుంచి ఓ మల్టీ స్టారర్ సినిమా రెడీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా శతమానం భవతి ఫేం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. నాగార్జున, నాగచైతన్యలు హీరోలుగా నటించనున్న ఈ సినిమాకు ప్రస్తుతం కథ రెడీ చేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
సంక్రాంతికి షురూ!
దర్శకుడు విక్రమ్ కుమార్ కొత్త పెళ్లి కొడుకు... అక్కినేని అఖిల్ కాబోయే పెళ్లి కొడుకు.. ఇద్దరూ వ్యక్తిగత జీవితాలలో ఫుల్‌జోష్‌లో ఉన్నారు. ఇప్పుడు అదే జోష్‌లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. విక్రమ్‌కుమార్ దర్శకత్వం వహిం చిన ‘మనం’లో అఖిల్ జస్ట్ ఇలా కనిపించి, అలా మార్కులు కొట్టేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు హీరోగా అఖిల్‌ను ఇంకా బాగా ప్రెజెంట్ చేయడానికి విక్రమ్ రెడీ అవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న ఈ చిత్రం మొదలవుతుందట. అన్న పూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగా ర్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. -
మనం రీమేక్‌లో మమ్ముట్టి
మహానటుడు నాగేశ్వరరావు చివరి సినిమాగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న మూవీ మనం. అక్కినేని కుటుంబ హీరోలు నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలు కలిసి నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. మూడు తరాల హీరోల కథతో తెరకెక్కిన ఈ మూవీని రీమేక్ చేసేందుకు చాలా మంది స్టార్లుప్రయత్నించారు. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో సూర్య మనం రీమేక్ చేద్దామని ప్లాన్ చేసినా వర్క్ అవుట్ కాలేదు. తాజాగా మరో సూపర్ స్టార్ ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మనంను రీమేక్ చేయనున్నారు. నాగార్జున నటించిన పాత్రలో మమ్ముట్టి, నాగచైతన్య పాత్రలో దుల్కర్ సల్మాన్‌లు నటించే అవకాశం ఉంది. ఇక నాగేశ్వరరావు కనిపించిన పాత్రలో మలయాళ సీనియర్ నటుడు మదు కనిపించనున్నారు. ఇక హీరోయిన్లుగా నిత్యామీనన్, మమతా మోహన్‌దాస్‌లు నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. -
ప్రముఖ దర్శకుడి పెళ్లి తేదీ ఇదే!
తెలుగు సినీ పరిశ్రమ టాలీవుడ్లో ప్రస్తుతం వెడ్డింగ్ సీజన్ నెలకొంది. ముఖ్యంగా ప్రతిభావంతులైన దర్శకులంతా వరుసగా బ్యాచ్‌లర్ జీవితానికి చరమగీతం పాడి.. వైవాహిక జీవితంలో అడుగుపెడుతున్నారు. ఇప్పటికే దర్శకులు క్రిష్, హను రాఘవపూడి పెళ్లిలు చేసుకొని ఓ ఇంటి వారు అయ్యారు. తాజాగా ఈ జాబితాలోకి 'మనం', 'ఇష్క్', '24' చిత్రాల దర్శకుడు విక్రమ్ కే కుమార్ కూడా చేరబోతున్నారు. '24' సినిమాకు సౌండ్ ఇంజినీర్‌గా పనిచేసిన శ్రీనిధిని విక్రమ్ ప్రేమించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి వివాహ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వచ్చే నెల 4న శ్రీనిధిని చెన్నైలో విక్రమ్ కే కుమార్ పెళ్లి చేసుకోబోతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. చెన్నైలోని హిల్టన్ హోటల్లో అంగరంగ వైభవంగా జరగనున్న వీరి వివాహానికి నాగార్జున, ఏఆర్ రహమాన్, సూర్య, శ్రియ శరణ్, నిత్యా మీనన్, సమంత, మాధవన్ వంటి దక్షిణాది సినీ ప్రముఖులు పలువురు రానున్నట్టు సమాచారం. విక్రమ్ కే కుమార్ పెళ్లిముహూర్తం నిశ్చయమవ్వడంతో శుభలేఖలు అచ్చువేయించి బంధుమిత్రులకు అందజేస్తున్నట్టు తెలుస్తున్నది. 'మనం', 24 వంటి విభిన్న సినిమాలు అందించిన విక్రమ్ కే కుమార్ ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం స్క్రిప్ట్ పనుల్లో అతను బిజీగా ఉన్నట్టు సమాచారం. -
మొక్క.. కాకిలెక్క!
రెండు నెలల్లో 18,25,761 మొక్కలు – జూలై 29న ఒక్క రోజు 11,70,773 మొక్కలు నాటినట్లు లెక్కలు – పది శాతం మొక్కలు ఉంటే ఒట్టు – అధికారుల్లో కనిపించని చిత్తశుద్ధి – నాటిన మొక్కల సంరక్షణ గాలికి.. కర్నూలు(అగ్రికల్చర్): ఏ ప్రాంతమైనా సుభిక్షంగా ఉండాలంటే మొత్తం భూ భాగంలో 33 శాతం అడవులు ఉండాలి. అయితే కర్నూలు జిల్లాలో అడవుల శాతం 19.9 మాత్రమే. అడవులతో పాటు పచ్చదనం తగ్గిపోతుండటంతో జిల్లాలో వరుస కరువు నెలకొంటోంది. ప్రతి సంవత్సరం జూన్ నెల నుంచి మొక్కల పెంపకంపై అధికార యంత్రాంగం హడావుడి చేయడం తప్పిస్తే.. వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంటోంది. గత రెండు నెలల నుంచి కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 18,25,761 మొక్కలు నాటినట్లు అధికారుల లెక్కలను బట్టి తెలుస్తోంది. జూన్ 1 నుంచి జూలై 28 వరకు 6,54,988 మొక్కలు నాటగా.. జూలై 29న ఒక్క రోజులో 11,70,773 మొక్కలు నాటినట్లు కాగితాల్లో నమోదయింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం–మనం అభాసు పాలవుతోందనేందుకు ఈ లెక్కలే నిదర్శనం. గత ఏడాది 22 లక్షల మొక్కలు నాటినట్లు అధికారుల రికార్డుల్లో ఉంది. ఇందులో ప్రస్తుతం పది శాతం మొక్కలు కనిపిస్తే ఒట్టు. మొక్కలు పెంచడానికే రూ.1.98 కోట్లు ఖర్చు చేశారు. గుంతలు తవ్వడానికి, ట్రాన్స్‌పోర్టుకు, వన మహోత్సవాల నిర్వహణకు చేసిన ఖర్చు మరింత భారీగానే ఉంది. దీన్ని బట్టి చూస్తే మొక్కల పేరుతో నిధుల దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోంది. ఈ ఏడాది అంతా హడావుడే.. జిల్లాలోని అటవీ శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ నర్సరీల్లో ఈ ఏడాది 1.10 కోట్ల మొక్కలు సిద్ధం చేశారు. ఇందులో చిన్నవి మినహాయిస్తే నాటడానికి అనువైనవి 59.68 లక్షలు. మొక్కలు పెంచడానికి రూ.9.90 కోట్లు వ్యయం చేశారు. అయితే మొక్కలు నాటడంలో చేతులెత్తేశారు. హడావుడి చేయడం తప్ప మొక్కలు నాటడంలో చిత్తశుద్ధి లోపించింది. ఆర్భాటంగా 10–15 మొక్కలు నాటి ఫొటోలకు ఫోజులివ్వడం మినహా నిజంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలనే ఆలోచన కరువయింది. కొన్ని ప్రభుత్వ శాఖలు ఒక్క మొక్క కూడా నాటలేదు. కానీ వేలాది మొక్కలు నాటినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటిస్తుండటం గమనార్హం. మొక్కలు నాటడానికి ఎన్‌ఆర్‌ఈసీఎస్ ద్వారా గుంతలు తవ్వారు. అధికారుల లెక్కల ప్రకారం 15 లక్షల గుంతలు తవ్వగా ఎన్ఆర్ఈజీఎస్ కింద దాదాపు రూ.10 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం మీద మొక్కలు పెంపకంలో రూ.25 కోట్ల వరకు ఖర్చు చేయగా ఇందులో 80 శాతం దుర్వినియోగమే. మొక్కలు నాటడంలో వింతలు ఇలా.. – మార్క్‌ఫెడ్ ద్వారా 1,450 మొక్కలు నాటినట్లు సామాజిక వనవిభాగం అధికారులు ప్రకటించారు. వాస్తవంగా మార్క్‌ఫెడ్‌లో ఒక్క మొక్కను నాటిన పాపాన పోలేదు. – కర్నూలు నగరపాలక సంస్థలో గత ఏడాది 70వేల మొక్కలు నాటినట్లు అధికారులు చెబుతున్నారు. జూలై 29న ఒక్క రోజులో∙21,319 మొక్కలు నాటినట్లు లెక్కలు చూపారు. నగరం అంతా వెతికినా పది శాతం మొక్కలు కనిపించవు. – డీఈఓ, ఆర్ఐఓ, డీవీఈఓ పరిధిలోని స్కూళ్లు, కళాశాలల్లో, డిగ్రీ కళాశాలలు, గురుకుల పాఠశాలల్లో 1.11 లక్షల మొక్కలు నాటినట్లు చెబుతున్నారు. వీటిల్లో 10వేల మొక్కలు నాటిన దాఖలాలు కూడా లేవు. – వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో జూలై 28 వరకే 4,600 మొక్కలు నాటినట్లు చెబుతున్నారు. అయితే ఆ సంఖ్య 500 మొక్కలకు మించలేదని తెలుస్తోంది. – రెవెన్యూ శాఖలో.. అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో 5400 మొక్కలు నాటినట్లు లెక్కలు ఉన్నాయి. ఇటీవల కలెక్టర్ కార్యాలయంలో 100 మొక్కలు నాటారు. తర్వాత వాటి సంరక్షణను పట్టించుకోవడమే మానేశారు. ఆర్డీఓ కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయాల్లో చాలా వరకు మొక్కలు నాటే కార్యక్రమాలే చేపట్టలేదు. -
బన్సాలీ డైరెక్షన్లో 'మనం' రీమేక్
అక్కినేని ఫ్యామీలి మూడుతరాల హీరోలు కలిసి నటించిన క్లాసిక్ మూవీ మనం. అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రంగా భారీ హైప్ క్రియేట్ చేసిన మనం, కథా కథనాల విషయంలో కూడా కొత్తదనంతో ఆకట్టుకుంది. నాగార్జున కెరీర్ లోనే బిగెస్ట్ హిట్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా రీమేక్‌పై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. తాజాగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ మనం బాలీవుడ్ రీమేక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ, మనం సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ప్రస్తుతం విక్రమ్ డైరెక్షన్లో రిలీజ్‌కు రెడీ అవుతోన్న 24 సినిమా షూటింగ్ సమయంలో మనం రీమేక్‌పై చర్చ జరిగిందని వెల్లడించాడు విక్రమ్. 'ముంబైలో 24 మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో సంజయ్ లీలా బన్సాలీని కలిశాను. ఆయన మనం సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారు', అని తెలిపాడు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నాడు విక్రమ్. విక్రమ్ కె కుమార్ స్వయంగా మనం సినిమాను కోలీవుడ్ రీమేక్ చేయడానికి ట్రై చేశాడు. సూర్య, కార్తీ సూర్య తండ్రి శివకుమార్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమాను రీమేక్ చేయాలని భావించాడు. అయితే సూర్యకు మనం కన్నా 24 కథ బాగా నచ్చటంతో ముందుగా 24 సెట్స్ మీదకు వచ్చింది. మరి త్వరలో కోలీవుడ్‌లో కూడా మనం రీమేక్ అవుతుందేమో చూడాలి. -
విక్రమ్‌తో అల్లు అర్జున్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఓ ఇంట్రస్టింగ్ సినిమాకు అంగీకరించాడన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడు సినిమాను కంప్లీట్ చేసిన బన్నీ.. ఆ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు ప్రమోషన్‌ను కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ సినిమా తరువాత బన్నీ చేయబోయే సినిమా ఏంటి అన్న విషయంలో మాత్రం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంలో హ్యాట్రిక్ సాధించే దిశగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇష్క్, మనం సినిమాలతో క్రేజీ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్, ప్రస్తుతం సూర్య హీరోగా 24 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తరువాత విక్రమ్, బన్నీ హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలోఉన్నాడట. బన్నీ కూడా విక్రమ్‌తో సినిమాకు రెడీ గానే ఉన్నాడన్న టాక్ వినిపిస్తోంది. తన ప్రతీ సినిమా ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించే విక్రమ్ బన్నీతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. -
హ్యాట్రిక్ కొట్టేలాగే ఉన్నాడు..!
యంగ్ హీరోలు కూడా సక్సెస్ కోసం కష్టపడుతుంటే సీనియర్ హీరో నాగార్జున మాత్రం భారీ సక్సెస్‌లతో దూసుకుపోతున్నాడు. మనం, సోగ్గాడే చిన్నినాయనా సినిమాలతో మంచి విజయాలు సాధిచిన టాలీవుడ్ మన్మథుడు ఇప్పుడు హ్యాట్రిక్ మీద కన్నేశాడు. మరోసారి ప్రయోగాత్మక చిత్రంతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న కింగ్ మరో సక్సెస్ గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉన్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో 50 కోట్ల క్లబ్లో చేరిన తొలి సీనియర్ హీరోగా రికార్డ్ సృష్టించాడు నాగార్జున.. ఇప్పుడు అదే జోష్‌లో ఊపిరి సినిమాతో మరో భారీ సక్సెస్ మీద కన్నేశాడు. ఫ్రెంచ్ సినిమా ద ఇంటచబుల్స్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో కార్తీతో కలిసి నటిస్తున్నాడు నాగ్. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఊపిరి మార్చ్ 25న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో నాగ్ పూర్తిగా వీల్ చైర్‌కే పరిమితమయ్యే పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఫ్రెష్ లుక్‌తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నాగ్ మరోసారి తన మార్క్ పర్ఫామెన్స్తో అలరించగా, కార్తీ ఎనర్జీ మరింత ప్లస్ అయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుండటం కూడా సినిమా బిజినెస్‌కు ప్లస్ అవుతుందటున్నారు విశ్లేషకులు. అంతేకాదు ఊపిరితో నాగ్‌కు హ్యట్రిక్ కన్ఫామ్ అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
సూపర్ సిస్టర్స్!
కుటుంబ కథాంశంతో తెరకెక్కే సీరియళ్లకు ఉన్న గిరాకీ మరి దేనికీ లేదు. అందుకే ఆ కథల వెంట పరిగెడుతుంటాయి డైలీసోపులు. తెలుగే కాదు... హిందీలోనూ ఇదే పరిస్థితి. దైనందిన జీవితంలో జరిగే అంశాలనే కాస్త డిఫరెంట్‌గా తెరకెక్కించి సక్సెస్ కొట్టడంలో వాళ్లకి వాళ్లే సాటి. అందుకే మన వాళ్లు ఈ మధ్య హిందీ సీరియళ్లను డబ్ చేయడంలో ఎక్కువ చొరవ చూపిస్తున్నారు. ఆ కోవలోనే ‘శాస్త్రి సిస్టర్స్’ మన దగ్గరకు చేరారు. ‘మనం’ అంటూ దగ్గరయ్యారు. శాస్త్రిగారికి నలుగురు కూతుళ్లు. నలుగురూ నాలుగు రకాలు. వాళ్ల వాళ్ల మనస్తత్వాల చిత్రణే ఈ సీరియల్‌కి మొదటి ప్లస్. ఇక వాళ్ల జీవితాల్లో వచ్చే ఒడి దుడుకులు, తెలివిగా వాళ్లు వెదికే పరిష్కారాలతో ఆసక్తికరంగా సాగి పోయే ఈ సీరియల్ హిందీలో హిట్ కొట్టింది. ఈ మధ్యనే తెలుగులోనూ ‘మనం’గా మొదలయ్యింది. మంచి కాన్సెప్ట్ కాబట్టి మన వాళ్లకూ నచ్చే అవకాశం ఉంది. -
లేడీ ఓరియంటెడ్ సినిమాలో సమంత
సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా వెలిగిపోతున్న సమంత త్వరలోనే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించనుంది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో కాస్త కొత్తగా ట్రై చేస్తోంది. ఈ శుక్రవారం రిలీజ్ అయిన నవమన్మథుడు సినిమాలో గ్లామర్ షో ఏ మాత్రం లేని సాధారణ గృహిణి పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇదే జోష్‌లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకు రెడీ అవుతోంది. ప్రస్తుతం సూర్య హీరోగా తెరకెక్కుతున్న 24 సినిమాతో పాటు, నితిన్, త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న అ.. ఆ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది ఈ బ్యూటీ. మనం, 24 సినిమాల్లో సమంత యాక్టింగ్‌కు ఫిదా అయిన దర్శకుడు విక్రమ్ కుమార్ సమంత లీడ్ రోల్లో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లేది మాత్రం కన్ఫామ్ చేయలేదు. -
మనం దర్శకుడితో రేసుగుర్రం
వరుస సూపర్ హిట్స్ తో టాలీవుడ్ బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేస్తున్న యంగ్ హీరో అల్లు అర్జున్ సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లతో పాటు సాఫ్ట్ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కూడా చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాతో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అందించిన బన్నీ, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరోసారి క్లాస్ సినిమాకు కమిట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడు స్టైలిష్ స్టార్. 'మనం' సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ సినీ జనాలతో పాటు టాప్ స్టార్స్ దృష్టిని కూడా ఆకర్షించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నాడు. విక్రమ్ కుమార్ ప్రస్తుతం సూర్య హీరోగా తమిళ్ లో'24' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈసినిమా రిజల్ట్ చూసిన తరువాత బన్నీ సినిమా కు సంబందించిన పని మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం 24 గ్యారెంటీ హిట్ అంటున్నారు. అందుకే బన్నీ, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో సినిమా రావటం ఖాయంగా కనిపిస్తోంది. -
'ముదుర్స్' గా పుట్టి 'మదర్స్' మాట వినని హర్ష
'మనుషుల్ని సృష్టించిన దేవుడే...' అంటూ అక్కినేని నాగేశ్వరరావు తన ఆఖరు సినిమా 'మనం' లో డైలాగ్ చెబుతుంటే ప్రేక్షకులు తన్మయులై విన్నారు. 'బై బర్త్ ముదుర్సగా పుట్టిన వారు మదర్స్ మాటే వినరు, ఇంక అదర్స్ మాట ఎందుకు వింటారు' అంటూ 'గుండెజారి గల్లంతయ్యిందే'లో నితిన్ గురించి చిలిపిగా పరిచయం చేస్తున్నా అలాగే విన్నారు. 'ఐలవ్ యు అంటే ఇలా ఇవ్వు' అని కొత్తగా రాసినా అబ్బా బాగుందే అనుకున్నారు. ఈ మాటల మాయ వెనుక ఉన్నది హర్షవర్ధన్. నటునిగా చాలాకాలంగా ప్రేక్షకులకు తెలిసినా రచయితగా ఇప్పుడు కొత్త అవతారంలో అందిరినీ అలరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో పుట్టి విజయనగరంలో చదువుకున్న హర్షవర్ధన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా సాక్షితో సంభాషించారు. మీది విజయనగరమే కదా..? హర్ష: నేను పుట్టింది రాజాంలో. ఎల్కేజీ నుంచి నాల్గవ తరగతి వరకు విశాఖలో చదువుకున్నా. మళ్లీ డిగ్రీ మొదటి సంవత్సరం వరకు విజయనగరంలో చదువుకున్నా. అందుకే విజయనగరం తో బంధం వీడనంతంగా బలపడింది. చాలా వ రకు స్నేహితులు ఇక్కడి వారే. విజయనగరంలో మూడు రోజులుగా గడుపుతున్నారు. ఎలా ఉంది..? హర్ష: అమ్మతో అనుబంధాలు పంచుకున్నా. నా చిన్న నాటి మిత్రులందరినీ కలుసుకోగలిగాను. చాలా హ్యాపీగా ఉంది. వచ్చే నె ల 26, 27 తేదీల్లో మళ్లీ విజయనగరం వచ్చి ఆరెండు రోజులు పూర్తిగా నా చిన్ననాటి మిత్రులతో గడిపేందుకు ప్లాన్ చేసుకున్నాం. సినీ రంగంలోకి ఎందుకు వెళ్లాలనిపించింది.? మీకు అందులో ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా..? హర్ష: నాకు చిన్న తనం నుంచి సినిమా అంటే పి చ్చి. అందుకే అందరిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలనుకునేవాడిని. డిగ్రీ పూర్తయిన తరువాత సినీరంగంలో ఎవరూ తెలియకున్నా స్నేహితుడి తో కలిసి ఎర్రబస్సెక్కినట్లు గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోయా.(నవ్వుతూ...) అక్కడ మీ జర్నీ సంగతులు..? హర్ష: అమ్మ, నాన్న కాస్త భయపడ్డారు. నేను మాత్రం పట్టుదలతో ఎలా అయినా రాణించాలనుకున్నా. అయితే సినిమా అంటే అలా ఉంటుందని అప్పటి వరకు నాకు తెలియదు. అసలు మీరు ఏమి అవుదామని అక్కడికి వెల్లారు..? హర్ష: నా పట్టుదల అంతా ఒక్కటే. మ్యూజిక్ డెరైక్టర్ కావాలని. అయితే అప్పట్లో నాకు కనీసం సంగీతం అంటే అవగాహన ఉంది తప్ప అంతకుమించి ఏమీ తెలియదు. అందరి లాగానే హైదరాబాద్ వెళ్లగానే అన్ని ఆఫీసులకు తిరిగాను. కొన్ని ఇబ్బందులు పడ్డాను. అయితే నన్ను చూసిన వాళ్లంతా నీ కళ్లు, వాయిస్ బాగున్నాయి. యాక్టింగ్ చేయచ్చుగా అని అడిగారు. అయితే మీ తొలి ప్రయత్నం కెమేరా ముందున్న మాట.? హర్ష: ఏదో వచ్చిన తర్వాత నిరాశతో వెనక్కివెళ్లిపోకుండా ఎలా అయినా సినీ రంగంలో సిర్థపడాలనుకున్నా. అందుకే అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా. ముందుగా రుతురాగాలు సీరియల్లో యాక్ట్ చేసేందుకు అవకాశం వచ్చింది. అయితే ఆ తర్వాత ప్రారంభమైన వందేమాతరం సీరియల్ ముందు టెలికాస్ట్ అయిందనుకోండి. మీరు తొలుతగా గుర్తింపు తెచ్చుకున్న సందర్బం..? హర్ష: అమృతం సీరియల్. ఆ సీరియల్ నాకు తొలి మెట్టు వంటిది. మీరు కథలు రాస్తుంటారా..? హర్ష: విశాఖ ఎక్స్‌ప్రెస్ సినిమాకు. అందులో హీరో నరేష్, రాజీవ్ కనకాల నటించారు. అందులో సగభాగమే నా పాత్ర ఉంది. మీరు చేసిన సినిమాల్లో ఇష్టమైనవి..? హర్ష: నటన పరంగా లీడర్. క్యారెక్టర్ పరంగా స్టాలిన్ సినిమాలో చేసిన పాత్ర. 55 రోజుల పాటు ఆ సినిమా షూటింగ్లో మెగాస్టార్ చిరంజీవితో గడిపడటం ఎంతో అనుభూతినిచ్చింది. సెట్లో ఆయన నేను మాత్రమే ఉండేవారం. నేను పుట్టిన ఊరు, పెరిగి పెద్దయిన పరిస్థితులు అన్ని ఆయనకు వివరించా. మీకు బాగా గుర్తింపు వచ్చిన సందర్భం..? హర్ష: గుండె జారి గల్లంతయ్యిందే. ఆ సినిమాకు స్క్రీన్ ప్లే రైటర్ని. అప్పటి వరకు నేను ఏ మాటలు, కథలు రాయాలన్నా సేఫ్‌జోన్‌లోనే ఉంటూ నా పని చేసేవాడ్ని. అయితే ఆ సినిమా నా సినీ జీవితంలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతో రిస్క్‌తో (డూ అర్ డై) అన్న చందంగా ఆ సినిమా చేశాం. చివరికి మంచి ఫలితం లభించింది. మీకు నచ్చిన తారలు..? హర్ష: అందరూ ఇష్టమే. ప్రతి ఒక్కరిలో ఓ వైవిధ్యం ఉంటుంది. మీరు సినీరంగంలో రాణించేందుకు ఎవరైనా సహాయం చేశారా..? హర్ష: నాకు ప్రేక్షకులే వెన్నుదన్ను. మొదటిలో చిన్న చిన్న రోల్స్ (అంటే ఆ సీన్ ఎప్పుడు వచ్చి వెళ్లిపోయేదో తెలియనవి) కూడాచేశా. మీరు పుట్టి పెరిగిన ఊరిలో సన్మానం మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది..? హర్ష: అసలు నాకు సన్మానాలంటేనే ఇష్టం ఉండదు. మొన్న రోటరీ వాళ్లు ఇచ్చింది పురస్కారం. ఆ విషయం ఇక్కడకు వచ్చేంత వరకు తెలియదు. సినీ రంగంలో ఒక స్థాయికి ఎదిగారు.. మీ అనుభూతి..? హర్ష: ఈ రంగంలో రాణించాలంటే అదృష్టం ఉండాలి. నా కన్నా బాగా నటించి గలిగే వారు, నటన అంటే ప్రాణం పెట్టేవారు, అందగాళ్లు చా లా మంది ఉన్నా వారికి అవకాశాలు దక్కని పరి స్థితి. అలా అని కాస్త యావరేజ్‌గా ఉన్నా నా కన్నా ఉన్నత స్థాయిలో ఉన్న వారు లేకపోలేదు. మనం సినిమాకి మాటలు రాశారు. ఆ సినిమా గురించి కాస్త...? హర్ష: తప్పకుండా... నేను చిన్నపుడు మాయాబజార్ సినిమా చూశా. అప్పట్లో ఆడియో టేపులు ఉండేవి. మా ఇంట్లో ప్రతి రోజు అక్కినేని నాగేశ్వరరావు చెప్పిన డైలాగులు వింటుండేవాడిని, ఒక రోజు ఇంట్లో వారి ముందే 90 నిమిషాలు పాటు అందులో డైలాగులు చెప్పేశా. అందరూ ఆశ్చర్యపోయారు. వాస్తవానికి చెప్పాలంటే ఆ సినిమాయే నాకు మాటలు నేర్పింది. ఆ సినిమాలో హీరో నటించిన ఏఎన్ఆర్ చివరి చిత్రానికి మాట లు రాయటం పూర్వజన్మ సుకృతం. నా కోసమే ఆయన అన్నాళ్లు జీవించి ఉన్నారేమో అనిపించింది. నేను సమకూర్చిన మాటలనే ఆయన పలికారు. ఎంతో అనందమనిపించింది. జీవితంలో మీ లక్ష్యాలు ..? హర్ష: సినిమా రంగంలో అయితే ఏమీ లేవు. ప్రస్తుతం జరుగుతున్నదంతా నాకు బోనస్. పర్సనల్ విషయానికి వస్తే రాష్ట్రం మొత్తం కోటి మొక్కలు నాటాలని ఉంది. 1000 మంది అ నాథ పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివించాలని ఉంది. లేటెస్ట్గా మీరు మాటలు రాసిన సినిమా? హర్ష: వస్తుంది.. గురువారం ఆ సినిమా పాటలు విడుదలయ్యాయి. -
నీతా అంబానీ తదితరులకు 'మనం' ప్రత్యేక ప్రదర్శన
హైదరాబాద్: భారత దేశంలో ప్రముఖ కార్పోరేట్ సంస్థల అధినేత్రిలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోను శనివారం సందర్శించారు. అన్నపూర్ణ స్టూడియోలో సందర్శించిన వారిలో బాలీవుడ్ నటి జుహీ చావ్లా, రిలయన్స్ అధినేత్రి నీతా అంబానీ, స్వాతి పిరమిల్, నవాజ్ సింఘానియా, అనన్య గోయోంకాలు, లీనా తివారీ, రాధిక సేథ్, అనుప షెహ్నయ్ లున్నారు. అధినేత అక్కినేని నాగార్జున వారికి స్వాగతం పలికి.. అన్నపూర్ణ స్టూడియోలోని వివిధ విభాగాలను చూపించారు. స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం 'మనం'ను మినీ థియేటర్ లో వారికి నాగార్జున ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. హుదూద్ బాధితులకు వారు 11 కోట్ల రూపాయల సహాయం అందించారు. -
మనం 100రోజుల వేడుక
-
ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి....మనం, మిణుగురులు
వచ్చే ఏడాదికి ఆస్కార్ అవార్డు ఎంట్రీల సందడి ఇప్పుడే మొదలైంది. మన దేశం నుంచి ఆస్కార్ అవార్డుకు ఎంట్రీగా ఏ సినిమాను పంపించాలనే దాని మీద ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఉత్తమ విదేశీచిత్ర విభాగంలో ఆస్కార్ అవార్డు కోసం మన దేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపిక కావడానికి వివిధ భారతీయ భాషల నుంచి 30 సినిమాలు మన ‘ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్.ఎఫ్.ఐ) స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చాయి. వీటిలో రెండు తెలుగు సినిమాలున్నాయి. ఒకటి - అక్కినేని నటించిన ఆఖరు సినిమా ‘మనం’ కాగా, రెండోది - నిజజీవిత అంధ విద్యార్థులతో అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి రూపొందించిన ‘మిణుగురులు’. ఇప్పటికే జాతీయ అవార్డును అందుకున్న బెంగాలీ చిత్రం ‘జతీశ్వర్’, మరాఠీ చిత్రం ‘ఫండ్రీ’, దర్శకుడు హన్సల్ మెహతా హిందీ ‘షాహిద్’లు కూడా స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చాయి. అలాగే, పాపులర్ సినిమాలైన ‘మర్దానీ’, ‘ఫిల్మిస్తాన్’, సంజయ్ లీలా భన్సాలీ ‘రామ్‌లీలా’, ప్రియాంకా చోప్రా నటించిన ‘మేరీ కోమ్’ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. తమిళం నుంచి రజనీకాంత్ యానిమేషన్ చిత్రం ‘కోచ్చడయాన్’, ‘కదై.. తిరైక్కదై.. వసనమ్... ఇయక్కమ్’ చిత్రాలు, ఇంకా కొంకిణి తదితర భాషా చిత్రాలు సైతం మన దేశం నుంచి ఆస్కార్ ఎంట్రీగా వెళ్ళాలని ఉత్సాహపడుతున్నాయి. ఎఫ్.ఎఫ్.ఐ. నియమించనున్న స్క్రీనింగ్ కమిటీ ఈ బుధవారం నుంచి ఈ చిత్రాలను వీక్షించి, మన దేశం పక్షాన పంపే తుది ఎంట్రీని ఖరారు చేయనుంది. ‘‘ఈ సినిమాల స్క్రీనింగ్‌లన్నీ హైదరాబాద్‌లో జరగనున్నాయి. అన్ని చిత్రాలనూ కమిటీ చూసి, ఈ నెల 23న తన తుది నిర్ణయాన్ని ఖరారు చేస్తుంది’’ అని ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి (ఫిల్మ్ చాంబర్) వర్గాలు ‘సాక్షి’కి వివరించాయి. -
కన్నడలో రీమేక్ కానున్న ‘మనం’
తన కుటుంబంతో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు సాయికుమార్ ఉత్సాహం సాక్షి, బెంగళూరు : పూర్వ జన్మల కథాంశంతో మూడు తరాల నట వారసత్వాన్ని ఒకే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుంచడంతో పాటు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఆఖరి చిత్రంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మనం’ చిత్రం సగటు ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను సాధించింది. కాగా ఈ సినిమాను ప్రస్తుతం వివిధ భాషల్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కన్నడలో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు అటు టాలీవుడ్‌తో పాటు ఇటు శాండల్‌వుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటుడు సాయికుమార్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ఇలా ఒకే కుటుంబంలోని ముగ్గురు నటులు ఒకే తెరపై తళుక్కుమన్నారు. ఇక అదే విధమైన అరుదైన సినీ నేపథ్యాన్ని సాయుకుమార్ కుటుంబం కూడా సొంతం చేసుకుంది. సాయికుమార్ తండ్రి పి.జె.శర్మ నటులుగా మాత్రమే కాక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, రచయితగా సినీ ప్రేక్షకులకు సుపరిచితులే. సాయికుమార్ తన విలక్షమైన నటన, డైలాగ్ డెలివరీతో ఎన్నో విభిన్న పాత్రల్లో వెండితెరపై మెరిశారు. తాత, తండ్రి బాటలోనే వెండితెరకు హీరోగా పరిచయమయ్యారు సాయుకుమార్ కుమారుడు ఆది. దీంతో మూడు తరాల సినీ వారసత్వాన్ని వెండి తెరపై మెరిపించిన ‘మనం’ సినిమా కథ తమ కుటుంబానికి సైతం సరిగ్గా సరిపోతుందని సాయికుమార్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ సినిమా కన్నడ రీమేక్ రైట్స్ పొందేందుకు సాయికుమార్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అదే కనుక జరిగితే మూడు తరాల సినీ వారసత్వాన్ని పొందిన మరో కుటుంబాన్ని తెరపై చూసే అవకాశం శాండల్‌వుడ్ ప్రేక్షకులకు కలగడంతో పాటు మూడు తరాల సినీనటులను కలిగిన అరుదైన కుటుంబంగా కూడా సాయికుమార్ కుటుంబానికి గౌరవం లభించనుంది. -
అఖిల్‌కు తల్లిగా నటించనున్న నదియా?
-
అక్కినేనికి కమల్ వాయిస్?
దివంగత మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు విశ్వ నాయకుడు కమలహాసన్ వాయిస్ ఇవ్వనున్నారా? ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆసక్తికరమైన అంశం ఇదే. అక్కనేనికి కమల్ వాయిస్ అవసరమేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఏఎన్ఆర్ చివరి చిత్రం మనం ఏఎన్ఆర్తో పాటు ఆయన కొడుకు, ప్రముఖ నటుడు నాగార్జున, ఆయన కొడుకు యువ నటుడు నాగచైతన్య కలసి నటించిన చిత్రం మనం. శ్రీయ, సమంత హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని సాధించిం ది. ఈ చిత్రం ఇప్పుడు తమిళంలోకి అనువాదం కానుంది. తమిళంలో అక్కినేని పాత్రకు కమలహాసన్‌తో డబ్బింగ్ చెప్పించాలని చిత్ర దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అదే విధంగా నాగార్జున పాత్రకు నటుడు మాధవన్ డబ్బింగ్ చెబితే బాగుంటుందనుకుంటున్నట్లు సమాచారం. కమలహాసన్‌కు అక్కినేని నాగేశ్వరరావు అంటే చాలా గౌరవం. ఆయన ఇటీవల మనం చిత్రం చూసి చాలా గొప్ప చిత్రం అంటూ ప్రశంసించడంతో పాటు ఏఎన్ఆర్ తన మానసిక గురువు అని వ్యాఖ్యానించారు. అలాంటిది ఆయనకే వాయిస్ ఇచ్చే అవకాశం రావడం నిజంగా అరుదైన విషయం. మరి కమల్ ఏఎన్ఆర్గా పాత్రకు డబ్బింగ్ చెబితే మనం చిత్రానికి అది మరింత ప్రత్యేక అంశంగా నిలిచిపోతుంది. మరో విషయం ఏమిటంటే మనం చిత్రం తెలుగు వెర్షన్ ఇప్పటికీ చైన్నైలోని ప్రముఖ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. -
హిట్ కాంబినేషన్లో సినిమా షురూ
‘మనం’ విజయంతో ఉత్సాహంతో ఉన్న నాగచైతన్య... మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. ‘స్వామి రారా’ దర్శకుడు సుధీర్‌వర్మ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృతీసనన్ కథానాయిక. ఈ చిత్రం ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నాగచైతన్య క్లాప్ ఇచ్చారు. ‘‘సుధీర్‌వర్మ ‘స్వామిరారా’ సినిమా అంటే నాకెంతో ఇష్టం. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా చాలా బాగా వచ్చింది. నా కెరీర్లో మరో భారీ విజయంగా నిలుస్తుంది’’ అని నాగచైతన్య నమ్మకం వెలిబుచ్చారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘‘అత్తారింటికి దారేది’ తర్వాత మా సంస్థ నుంచి వస్తున్న సినిమా ఇది. సుధీర్ వర్మ అద్భుతమైన కథ తయారు చేశారు. చైతూకి వందశాతం సరిపోయే కథ ఇది. జూలై 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. భారీ నిర్మాణ విలువలతో ఈ చిత్రం ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘నాగచైతన్య కోసమే అన్నట్లుగా ఈ కథ కుదిరింది. అన్ని వర్గాలనూ ఆకట్టుకునే ఈ కథ నా కెరీర్‌కి మంచి మలుపు అవుతుంది. ‘అత్తారింటికి దారేది’ లాంటి ఇండస్ట్రీ హిట్‌ని నిర్మించిన సంస్థలో నా రెండో సినిమా రూపొందడం ఆనందంగా ఉంది’’ అని సుధీర్‌వర్మ అన్నారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రవిబాబు, రావురమేశ్, ప్రవీణ్, పూజ, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్ని ఎం.ఆర్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుధీర్ ఈదర, సమర్పణ: భోగవల్లి బాపినీడు. -
సూపర్ హిట్‌గా నిలిచిన మనం
-
అఖిల్ మంచి స్టార్ అవుతాడు
‘‘అఖిల్‌లో నాకు భవిష్యత్ స్టార్హీరో కనిపించాడు’’ అంటున్నారు మహేశ్‌బాబు. ఇటీవలే ఆయన ‘మనం’ సినిమాను చూశారు. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు మహేశ్.‘‘అనుకోకుండా తళుక్కున మెరిసిన అఖిల్ అతిథి పాత్ర నన్ను ఆశ్చర్యానికి లోనుచేసింది. అతను చాలా హుందాగా కనిపించాడు. ఆ అబ్బాయి వెండితెరపై చాలా బాగున్నాడు.కచ్చితంగా మంచి స్టార్ అవుతాడు’’ అని ట్విట్టర్లో అఖిల్ గురించి వ్యాఖ్యానించారు మహేశ్.అలాగే ఈ సందర్భంలో ‘మనం’ సినిమాను కూడా ప్రశంసల్లో ముంచెత్తారాయన.‘‘‘మనం’ నాకు చాలా బాగా నచ్చింది. మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఇప్పుడున్న తెలుగు దర్శకుల ఆలోచనలకు భిన్నంగా ఆలోచించాడు దర్శకుడు. ఏది ఏమైనా అక్కినేని కుటుంబానికి ఓ గొప్ప సినిమా లభించింది’’ అని ట్వీట్ చేశారు మహేశ్. -
ఆ సినిమా చూసి భావోద్వేగానికి గురయ్యా: కమల్
అక్కినేని కుటుంబంలో ఉన్న నటులంతా కలిసి చేసిన 'మనం' సినిమా.. తనను తీవ్ర భావోద్వేగానికి గురిచేసిందని ప్రముఖ నటుడు, దర్శకుడు కమల్ హాసన్ అన్నారు. ఒక ప్రైవేటు స్క్రీనింగ్‌లో ఆయన ఈ సినిమా చూశారు. ఈ సినిమా దివంగత అక్కినేని నాగేశ్వరరావుకు మంచి నివాళి అవుతుందని చెబుతూ, సినిమా నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి అక్కినేని నాగేశ్వరరావు అభిమానినని, ఈ సినిమా మళ్లీ తన పాత జ్ఞాపకాలను గుర్తుచేసిందని కమల్ తెలిపారు. వెండితెరమీద ఏఎన్నార్‌ను చూడగానే ఒక్కసారిగా ఉద్వేగం ఆపుకోలేకపోయినట్లు చెప్పారు. ఆయనకు ఈ రకంగా నివాళులు అర్పించిన అక్కినేని కుటుంబానికి హృదయ పూర్వకంగా అభినందనలు తెలిపారు. -
జోరు పెంచిన చైతూ...
-
ఆ అనుబంధం గుర్తుకొచ్చి ఏడుపొచ్చింది
‘‘ఇది చాలా గొప్ప సినిమా. చూస్తున్నంతసేపూ ఏయన్నార్‌గారితో నాకున్న అనుబంధం గుర్తొచ్చింది’’ అని బుధవారం ఓ ప్రకటనలో కమల్‌హాసన్ పేర్కొన్నారు. ఏయన్నార్, నాగార్జున, నాగచైతన్య నటించిన ‘మనం’ చిత్రాన్ని కమల్‌హాసన్ ప్రత్యేకంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘నేను శివాజీ గణేశన్‌గారి అభిమానిని. ఏయన్నార్ అంటే కూడా విపరీతమైన ఇష్టం. ఈ సినిమా చూసిన తర్వాత ఆయన మీద ఉన్న అభిమానం రెట్టింపు అయ్యింది. ఈ సినిమాలో వినోద ప్రధానంగా సాగే సన్నివేశాలకు అందరూ నవ్వుతుంటే, ఏయన్నార్‌గారితో నాకున్న అనుబంధం గుర్తొచ్చి ఏడుపొచ్చింది. ఆయన భౌతికంగా మాత్రమే దూరమయ్యారు. నాగార్జున, నాగచైతన్య... ఇలా వారి కుటుంబ సభ్యుల గుండెల్లో జీవించి ఉన్నట్లుగా, నా తలపులలోనూ ఆయన జీవించే ఉన్నారు. ‘మనం’లాంటి గొప్ప సినిమా తీసినందుకు ఏయన్నార్ అభిమానిగా ఆయన కుటుంబ సభ్యులకు నా కృతజ్ఞతలు’’ అన్నారు. -
మనం కురిపిస్తోన్న ధనం
-
అఖిల్ నాకు పోటీ అవుతాడు..అవ్వాలి కూడా : నాగ చైతన్య
‘‘నిజంగా ‘మనం’ సినిమా తాతయ్యకు ఘనమైన నివాళి. అవార్డుల కోసమో, రివార్డుల కోసమో మేమీ సినిమా చేయలేదు. తాతయ్య చివరి సినిమా అక్కినేని వంశాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనే తలంపుతో ఈ సినిమా చేశాం. అమెరికాలో అయితే.. ఇప్పటికే మిలియన్ (పది లక్షల) డాలర్ల వసూళ్లు వచ్చాయి. మా కుటుంబ హీరోల చిత్రాల్లో ఇంతటి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదే’’ అని నాగ చైతన్య సంతోషం వెలిబుచ్చారు. మంగళవారం విలేకర్లతో ముచ్చటించారు. మీ తాతయ్యతో, మీ నాన్నతో తొలిసారి కలిసి నటించారు కదా. ఆ అనుభూతి ఎలా ఉంది? నాకు వంద ఫ్లాపులొచ్చినా, వంద విజయాలొచ్చినా.. ‘మనం’ మాత్రం నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా. తాతయ్యతో నటించే భాగ్యం ఈ సినిమాతో నాకు దక్కింది. ఆ మధుర క్షణాలు నా గుండెలో నిలిచిపోతాయి. భవిష్యత్తులో నా ఉన్నతికి అవి మరింత దోహదం చేస్తాయి. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యేంత వరకూ నాన్నతో, తాతయ్యతో కలిసి నటించడానికి తడబడుతూనే ఉన్నాను. తలబిరుసుగా నటించాలి, తాగుబోతుగా నటించాలి. పైగా కొన్ని సన్నివేశాల్లో తాతయ్యను ‘ముసలోడా’ అని సంబోధించడానికి ఇబ్బంది పడ్డా. తాతయ్య, నాన్న నా రోల్ మోడల్స్. వారి ముందు అలా నటించడం చాలా కష్టంగా అనిపించింది. కానీ వారిద్దరి సహకారం అద్భుతం. పవన్‌కల్యాణ్‌కి ‘ఖుషి’, మహేశ్‌కి ‘ఒక్కడు’, ఎన్టీఆర్‌కి ‘సింహాద్రి’, బన్నీకి ‘దేశముదురు’... మీకేమో ‘మనం’... ఇలా స్టార్ హీరోలందరికీ ఏడో సినిమా బ్రేక్ ఇచ్చింది. మీరేమంటారు? అది యాదృచ్ఛికమే. నాక్కూడా అదే రిపీట్ అవ్వడం ఆనందంగా ఉంది. తాత ‘మూగ మనసులు’, నాన్న ‘జానకిరాముడు’, మీరేమో ‘మనం’... ముగ్గురూ పునర్జన్మల నేపథ్యంతో కూడిన సినిమాలు చేయడం కూడా యాదృచ్ఛికమే కదా! అవును... అది కూడా కావాలని చేసిందేం కాదు. అయితే.. ‘మనం’ చేశాక పునర్జన్మ విషయంలో కొంత నిజం ఉందనిపిస్తోంది. గత జన్మలో తీరని కోర్కెలు ఏమైనా ఉంటే...మళ్లీ పుట్టి ఆ కోర్కెలను తీర్చుకుంటారని కొన్ని కథలు కూడా వెలువడ్డాయి. ప్రయోగాల్నిమన హీరోలు దరిచేరనీయరు. ఓ హీరోగా ఈ విషయంపై మీ దృక్కోణం ఏంటి? నా మైండ్‌సెట్‌లో కొంత మార్పు వచ్చిందండీ. ప్రయోగాల్ని ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. సరైన కథ, కథనాలు, ఆసక్తిని గొలిపే అంశాలు, పుష్కలంగా వినోదం ఉంటే.. ప్రయోగాలు కూడా సఫలం అవుతాయని ‘మనం’ రుజువు చేసింది. ఇక నుంచి కూడా ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని ఉంది. కెరీర్ మొదట్లో తాతయ్య, నాన్న కూడా ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు. పాత్రల పరంగా కూడా భిన్నంగా వెళ్ళారు. వారితో పోల్చి చూస్తే... నేను జీరో. కెరీర్ మొదట్లో నేను కమర్షియల్ సినిమాలే ఎక్కువగా చేశా. ఇక నుంచి వారి దారిలోనే పయనించాలని నిర్ణయించుకున్నాను. ‘ఆటోనగర్ సూర్య’ సంగతేంటి? ఆ సినిమా జాప్యం విషయంలో నా ప్రమేయం లేదు. కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమవుతోంది. అయితే... ఒకటి మాత్రం నిజం. ఆ సినిమా ఎప్పుడు విడుదలైనా హిట్టే. మీరు చేస్తున్న ‘ఒక లైలా కోసం’ సినిమా ప్రొడక్షన్ పనులు కూడా మీరే చూసుకుంటున్నారట? సినీ నిర్మాణంలో కూడా అనుభవం అవసరమని నాన్న చెప్పారు. అందుకే.. ఆ సినిమా ప్రొడక్షన్ పనులు దగ్గరుండి చూసుకుంటున్నా. టాకీ పూర్తయ్యింది. పాటల చిత్రీకరణకు విదేశాలకు వెళ్తున్నాం. జూలై లేదా ఆగస్ట్‌లో విడుదల చేస్తాం. భవిష్యత్తులో సినిమాలు నిర్మించాలని కూడా ఉంది. ‘మనం’లో అఖిల్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది అంటున్నారు అందరూ. మరి, మీ అభిప్రాయం ఏమిటి? నిజమే.. అఖిల్ ఎంట్రీ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. నిజానికి స్క్రిప్ట్ టైమ్‌లో ఆ సీన్ లేదు. అఖిల్ కూడా ఉంటే బావుంటుందని విక్రమ్‌కుమార్ అనడంతో అందరం ‘ఓకే’ చేశాం. కథలో ఆ సీన్‌కి మంచి ప్రాముఖ్యత ఉంది. మా అందర్నీ అఖిలే రక్షిస్తాడు. నిజంగా తనకు అది గ్రేట్ ఇంట్రడక్షన్. అలాంటి పరిచయం లభించడం చాలా లక్కీ అని నేనే అఖిల్‌తో చెప్పా. అంటే భవిష్యత్తులో అఖిల్ మీకు పోటీ అవ్వబోతున్నాడన్నమాట? అవుతాడండీ... ఎందుకవడు? అవ్వాలి కూడా. అసలు సినిమా అంటేనే పోటీ. అయితే ఆ పోటీ ఆరోగ్యకరంగా ఉండాలి. మీరన్నట్టు మా కుటుంబంలోనే నాకు కావాల్సినంత పోటీ ఉంది. కెరీర్ విషయంలో అఖిల్‌కు ఏమైనా సలహాలిస్తుంటారా? నేను సలహాలివ్వడం కాదు, తనే నాకు సలహాలిస్తుంటాడు (నవ్వుతూ). సుధీర్‌వర్మ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు? జూలైలో మొదలవుతుంది. కొత్త పంథాలో సాగే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అది. సుధీర్ ‘స్వామి రారా’ సినిమా నాకు నచ్చింది. అదే పంథాలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. -
'మనం' ముందు నిలబడలేకపోయిన 'విక్రమసింహ'
చెన్నై: రజనీకాంత్ సినిమా 'విక్రమసింహ' తెలుగు బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన 'మనం' సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాతో పాటు విడుదలైన 'విక్రమసింహ' ప్రేక్షకుల ఆదరణ కరువై కాసులు కురిపించలేకపోతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు బాగానే ఉన్నట్టు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆరు భాషల్లో విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ. 42 కోట్లు సాధించింది. త్రీడీ మోషన్ కాప్చరింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించినంత స్పందన రావడం లేదు. ఓపెనింగ్ వీకెండ్ లో మనం సినిమా ఆంధ్రప్రదేశ్ లో రూ.5.32 కోట్ల వసూళ్లు రాబట్టగా, విక్రమసింహ రూ. 2.8 కోట్లకు పరిమితమైంది. మనం సినిమా బాగుందన్న టాక్ రావడంతో వసూళ్లు పెరుగుతున్నాయి. -
'మనం'కు మంచి స్పందన
చెన్నై: అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మనం'కు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు క్రమేణా పుంజుకుంటున్నాయి. శుక్రవారం విడుదలైన మనం చిత్రం తొలి రెండు రోజుల్లో దేశ వ్యాప్తంగా 4.02 కోట్ల రూపాయిలు వసూలు చేసింది. విదేశాల్లో ఈ సినిమాకు అనూహ్య స్పందన వస్తోందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అమెరికాలో 1.17 కోట్ల రూపాయిలు రాబట్టింది. ఈ సినిమాలో అక్కినేని కుటుంబంలో మూడు తరాలకు చెందిన వారు నటించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి చిత్రం ఇదే. నాగేశ్వరరావు కుమారుడు, యువ సామ్రాట్ నాగార్జున, మనవళ్లు నాగ చైతన్య, అఖిల్ ఈ సినిమాలో నటించారు. కాగా కేన్సర్‌తో బాధపడ్డ నాగేశ్వరరావు ఈ సినిమా విడుదలకు ముందే మరణించిన సంగతి తెలిసిందే. -
'మనం'ను అక్కినేని చూడకపోవడం విషాదకరం:వర్మ
అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం 'మనం'పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ లో ఈ చిత్రం విడుదలై ఉంటే సులభంగా వంద కోట్ల రూపాయలు వసూలు చేసేందని వర్మ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఏఎన్నాఆర్ తో తొలిసారి నాగార్జున నటించేటప్పడు తడబాటుకు గురయ్యాడు. అయితే నాగ చైతన్య విషయంలో అలాంటి జరగలేదని.. నాగార్జున కంటే నాగచైతన్యనే బెటర్ గా యాక్ట్ చేశారని వర్మ ట్వీట్ చేశారు. అయితే 'మనం' చిత్రాన్ని ఏఎన్నాఆర్ చూడలేకపోవడం అత్యంత విషాదకరమని వర్మ వ్యాఖ్యలు చేశారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన 'మనం' చిత్రంలో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ తోపాటు అమల, అమితాబ్ బచ్చన్ లు నటించారు. -
'మనం'పై సోషల్ మీడియాలో కామెంట్స్
అన్నపూర్ణ స్టూడియో నిర్మాణంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్, సమంత, శ్రియలు నటించిన మనం చిత్రం మే 23 తేది శుక్రవారం విడుదలైంది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో, అనూప్ రూబెన్ సంగీత దర్వకత్వంలో రూపొందిన చిత్రంపై మంచి స్పందన లభిస్తోంది. మనం చిత్రంపై ట్విటర్ లో ప్రముఖులు, అభిమానులు వెల్లడించిన అభిప్రాయాలను కింద ఇవ్వడమైంది. Watched Manam.. U will want to give ur Mom nd Dad a big hug once u watch it... #ANRlivesOn— Nikhil Siddhartha (@actor_Nikhil) May 23, 2014 MANAM ! Its a Classic Period ! If u miss this movie. Its ur loss guys. A Must must must watch - AlluArjun #ANRlivesON pic.twitter.com/zVn6EqM0sY — AlluArjun (@AlluArjunAdicts) May 23, 2014 On the other hand I have dubbed for Samantha again in Manam. She s done a great job as usual and I had fun dubbing for her :) — Chinmayi Sripaada (@Chinmayi) May 23, 2014 Just Saw Manam. ..If it was made in Bollywood it wud hav straight gone for 100 crores..its an avant garde product but deeply rooted in earth — Ram Gopal Varma (@RGVzoomin) May 23, 2014 Great to see a sweet, romantic film like 'Manam' become a blockbuster. My favourite co-star ever, the legend gets his fitting goodbye. #ANR — Siddharth (@Actor_Siddharth) May 23, 2014 U have to believe in miracles to enjoy Life and #Manam .I believe, and I had a fabulous time watching it .Fantastic movie.. — Veeru Potla (@VeeruPotla1) May 23, 2014 And for all those asking about me, Manam is perfect as is! And hey, My CAR acted in Manam! #Manam superb movie loved aa lot hatss off 2 director vikram for his wonderful taking — uppalapati sekhar (@upbcsekhar) May 23, 2014 MANAM movie is Excellent, A movie of million emotions, tears came like waterfall from my eyes, Couldn't control at some seens. — G Hari Kumar (@hariagra) May 23, 2014 T-1891 MANAM is good, cute, heart touching and entertaining movie. The script is very unique. Vikram's direction is fabulous. — Buddhi Yagna Murthy (@yagnamurthy) May 23, 2014 -
సినిమా రివ్యూ: మనం
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాల్లో 'మనం' చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. అక్కినేని కుటుంబానికి చెందిన మూడు జనరేషన్ లు తెరపై కనిపించడం అన్నివర్గాల ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. తెలుగు సినీ పరిశ్రమలో ఎవరెస్ట్ లాంటి అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం కావడం, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఒకే చిత్రంలో నటించడం అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచింది. విడుదలకు ముందే ఫస్ట్ లుక్ తోపాటు ప్రోమోలతో సగటు సినీ ప్రేక్షకుడికి చేరువైన 'మనం' చిత్రం ఎలాంటి అనుభూతిని మిగిల్చిందో తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకోవాల్సిందే. అర్ధాంతరంగా చనిపోయిన రెండు జంటలు (రాధామోహన్ & కృష్ణవేణి, సీతారాం &రామ లక్ష్మి) మళ్లీ జన్మించడమే మనం చిత్ర కథ. రెండు జంటలను కలుపడానికి వారి కుమారులు చేసిన ప్రయత్నానికి తెర రూపమే 'మనం' చిత్రం. సీతారాం, నాగేశ్వరరావు పాత్రల్లో అక్కినేని నాగార్జున, రాధామోహన్, నాగార్జునగా నాగ చైతన్య, కృష్ణవేణి, ప్రియగా సమంత, రామలక్ష్మి, అంజలి పాత్రల్లో శ్రీయలు, నాగ చైతన్య పాత్రలో అక్కినేని నాగేశ్వరరావులు నటించారు. కథ: నాగార్జున ఓ బిజినెస్ మాగ్నెట్. అతి చిన్న వయస్సులోనే ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన వ్యాపారవేత్త. అనుకోకుండా నాగచైతన్య, సమంతలను కలుసుకుంటాడు. నాగచైతన్య, సమంతలను చూడగానే తన చిన్నతనంలో చనిపోయిన తల్లి, తండ్రులు (రాధా మోహన్, కృష్ణవేణి) మళ్లీ పుట్టారు అని నిర్థారించుకుంటాడు. నాగచైతన్య, సమంతల రూపంలో ఉన్న తన తల్లితండ్రులను కలిపేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నసమయంలో ఓ యాక్సిడెంట్ కు గురైన అక్కినేని నాగేశ్వరరావుకు నాగార్జున రక్తాన్ని ఇచ్చి కాపాడుతాడు. ఈ ఘటనలో శ్రియను కలుసుకుంటాడు. అయితే ఆస్పత్రిలో నాగార్జున, శ్రియలను చూసిన నాగేశ్వరరావు.. తన పసితనంలో పొగొట్టుకున్న తల్లితండ్రులు(రామలక్ష్మి, సీతారాం)లుగా గుర్తిస్తాడు. నాగార్జున, శ్రియలను కలుపడానికి నాగేశ్వరరావు, నాగ చైతన్య, సమంతలను కలుపడానికి నాగార్జున ప్రయత్నాలు చేస్తారు. నాగార్జున, నాగేశ్వరరావు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయా?, నాగ చైతన్య, సమంతలు పూర్వజన్మ గురించి తెలుసుకుంటారా? నాగార్జున, శ్రియలు ఒక్కటవుతారా? తమ నాగార్జున, శ్రియలను కలపడానికి అక్కినేని నాగేశ్వరరావు చేసిన ప్రయత్నాలు ఎంటి? అనే ప్రశ్నలకు సమాధానమే 'మనం' చిత్ర కథ. నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రియలు విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఒకే చిత్రంలో రెండు జనరేషన్లకు చెందిన పాత్రలను పోషించడంలో జట్టుగా అక్కినేని నాగేశ్వరరావుతోపాటు నలుగురు హీరోహీరోయిన్లు పాత్రలకు జీవం పోశారు. సమంతను అమ్మ అంటూ, నాగ చైతన్యను నాన్న అంటూ పిలుస్తూ నాగార్జున ఆకట్టుకోవడమే కాకుండా.. ప్రేక్షకులను మెప్పించారు కూడా. ముఖ్యంగా నాగేశ్వరరావు పాత్రలో నాగార్జున నటించిన తీరు ప్రశంసనీయం. ఇంటర్వెల్ లో అక్కినేని నాగేశ్వరరావు ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్లో ఓ అనుభూతిని కలిగించాడు. రెండవ భాగం ప్రారంభమైన దగ్గర నుంచి చివరి సన్నివేశం వరకు ప్రేక్షకుడిలో అక్కినేని నాగేశ్వరరావు చేరువవ్వడంతోపాటు చక్కటి ఫీలింగ్ ను నింపారు. ఇక నాగచైతన్య తన వయస్సుకు మించిన ఓ బరువైన పాత్రలో కనిపించడమే కాకుండా రెండు పాత్రలకు తగినట్టుగా పరిణతిని ప్రదర్శించాడు. సమంత, శ్రియలు విభిన్నమైన పాత్రలతో మెప్పించారు. ఆలీ, బ్రహ్మనందం, సప్తగిరి కామెడీతో ఆలరించారు. ముఖ్యంగా ఈ చిత్ర కథను రూపొందించిన విక్రమ్ కే కుమార్ కే క్రెడిట్ దక్కుతుంది. మనం చిత్రంలో అక్కినేని వంశంలోని నాగేశ్వరరావు, నాగార్జున, యువ హీరోలు నాగచైతన్య, అఖిల్ లకు తగినట్టుగా కథను రూపొంది.. చాలా ఒద్దికగా, కథపై నియంత్రణతో.. చిత్రాన్నిమలిచిన తీరు ఆకట్టుకునేలా ఉంది. రెండు పునర్జన్మ కథలను చక్కగా చిత్రీకరించి ప్రేక్షకులను ఆలరింప చేయడంలో విక్రమ్ కుమార్ సఫలమయ్యారు. వివిధ జనరేషన్లకు తగినట్టుగా ఓ మూడ్ ను క్రియేట్ చేయడంలో కెమెరామెన్ పీఎస్ వినోద్, ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ లు ప్రధాన పాత్రలు పో్షించారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. అనూప్ రూబెన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. అనూప్ రూబెన్ అందించిన అందర్ని పాటలు ఆకట్టుకున్నాయి. వందేళ్ల సినిమా చరిత్రలో దాదాపు 70 సంవత్సరాల సినీ జీవితంతో ప్రేక్షకుడికి విభిన్నమైన పాత్రలతో ఆలరించి, ఆకట్టుకుని తెలుగువారి గుండెల్లో చోటు సంపాదించుకున్న అక్కినేని నాగేశ్వరరావు 'మనం' చిత్రం గొప్ప నివాళి. -
‘మనం’ లోగో రూపకర్త ప్రేమ్‌రాజ్
పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : అన్నపూర్ణ స్టూడియో నిర్మించిన మనం సినిమా లోగోను ఆత్మకూరు మండలం నాగయ్యపల్లె గ్రామానికి చెందిన గిన్నారపు ప్రేమ్‌రాజ్ రూపొందించారు. అక్కినేని నాగేశ్వర్రావు చివరి చిత్రం ఇదే. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వర్రావు, నాగార్జున, నాగచైతన్యలు హీరోలుగా, సమంత, శ్రేయ హీరోయిన్లుగా చేశారు. ప్రేమ్‌రాజ్ కొంత కాలంగా సినిమా లోగోలు తయారు చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నాడు. ఆయన ఆర్టిస్ట్‌గా (పెయింటింగ్) చేస్తూ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ప్రేమ్‌రాజ్ మాట్లాడుతూ కాశిబుగ్గకు చెందిన అనిల్ ఈ సినిమాకు పోస్టర్ డిజైనర్‌గా చేయడం వల్ల లోగోను రూపొందించి అవకాశం తనకు దక్కిందన్నారు. ఇంతపెద్ద సిని మాకు లోగో తయారు చేయడం అదృష్టంగా భావి స్తున్నానని తెలిపారు. -
నేను జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి అవి చాలు
లక్కీ గాళ్ ఆఫ్ టాలీవుడ్ అంటే సమంతానే. ఆమె నటించిన తెలుగు సినిమాలన్నీ ఎక్కువ శాతం హిట్లే. గ్లామర్‌తో పాటు అభినయానికీ ప్రాధాన్యమిచ్చే సమంత ‘మనం’లో రెండు రకాల పాత్రలు పోషించారు. అక్కినేని త్రయం హీరోలుగా విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో అక్కినేని కుటుంబం నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకరులతో సమంత ప్రత్యేకంగా ముచ్చటించారు. నిజంగా నా అదృష్టం: అక్కినేని కుటుంబం నటించిన ఈ లెజెండ్రీ మూవీలో నాకూ స్థానం దొరకడం నిజంగా అదృష్టం. అయితే... వాళ్లు కాకుండా ఎవరు చేసినా... ఈ సినిమాను మాత్రం వదులుకునేదాన్ని కాదు. ఇందులో రెండు రకాల పాత్రల్లో కనిపిస్తాన్నేను. వాటిలో ఒక పాత్ర పేరు ‘కృష్ణ’. తల్లి పాత్ర. నా కెరీర్లో వయసుకు మించిన పాత్ర చేయడం ఇదే. రెండో పాత్ర పేరు ‘ప్రియ’. జోవియల్‌గా అల్లరి చేస్తూ ఉండే పాత్ర. నిజంగా ఈ రెండు పాత్రలు నాకు ఛాలెంజ్. అలాగే... ఇందులో శ్రీయ కూడా ఓ కథానాయిక. గొప్పగా నటించింది తను. చైతూ, నేను కలిసి నటించిన మూడో సినిమా ఇది. ఇందులో మా జంట యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో ‘నాగేశ్వర్’ ఎవరు? అని అందరూ అడుగుతున్నారు. తనెవరో తెరపై చూస్తేనే మజాగా ఉంటుంది. అక్కినేనిగారి విజువల్స్ చూస్తాను: అక్కినేనిగారి కాంబినేషన్లో నావి రెండు మూడు సీన్లే. నేను జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి అవి చాలు. ఆయన సెట్లో ఉంటే సమయమే తెలిసేది కాదు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధగా ఉంది. ‘ఏమాయ చేశావె’ టైమ్ నుంచి ఆయనతో నాకు మంచి పరిచయం ఉంది. ఆర్టిస్ట్‌గా నాకందిన తొలి ప్రశంస ఆయనదే. ఇప్పటికీ... ‘నేను సరైన రంగంలోనే ఉన్నానా. నటిగా నేను కరెక్టేనా’ అనిపించినప్పుడు ‘ఏ మాయచేశావె’ సక్సెస్‌మీట్‌లో అక్కినేనిగారు నా గురించి మాట్లాడిన విజువల్స్ చూస్తాను.అంతే... నాలో ఉన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎగిరిపోతుంది. అక్కినేనిగారితో పాటు నాగార్జునగారితో కూడా కలిసి చేసే అవకాశం ఈ సినిమా పుణ్యమా అని నాకు దక్కింది. అభినయానికే తొలి ప్రాధాన్యం: నేను మొదట్నుంచీ గ్లామర్‌కి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలుగులో నా తొలి సినిమా ‘ఏమాయ చేశావె’లో కూడా నాది గ్లామర్ పాత్ర కాదు. నా అదృష్టమో ఏమో తెలీదు కానీ... నేను కమర్షియల్ సినిమాలు ఎన్ని చేసినా, ఏడాదికి ఒకటైనా సరే... అభినయానికి ఆస్కారమున్న సినిమా నాకు దక్కింది. ఏమాయ చేశావె, ఈగ, ఇప్పుడు ‘మనం’. ఇక నుంచి కూడా అభినయానికే తొలి ప్రాధాన్యం ఇస్తాను. -
‘డాక్టర్లు ఎన్ని రోజులని చెప్పార్రా’ అని నాన్న అడిగారు
నాగార్జున మంచి నటుడు. మంచి నిర్మాత. మంచి వ్యాపారవేత్త. వీటన్నింటినీ మించి... మంచి కొడుకు. ఎంత మంచి కొడుకంటే.. తన తండ్రి అక్కినేని టాపిక్ తెస్తేనే భావోద్వేగానికి లోనైపోయేంత. తండ్రి జ్ఞాపకాల్లో జీవించడం ఆయనకిష్టం. తండ్రి గురించి వినడం ఆయనకిష్టం. తండ్రి గురించి మాట్లాడటం ఆయనకిష్టం. మొత్తంగా తండ్రే ఆయనకు లోకం. కాసేపు ఆయనతో ముచ్చటిస్తే ఇది నిజమని ఎవరైనా అంగీకరిస్తారు. ఈ నెల 23న తన తండ్రి అక్కినేనితో, తనయుడు నాగచైతన్యతో కలిసి నాగ్ నటించిన ‘మనం’ చిత్రం విడుదలకానుంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో అక్కినేని కుటుంబం నిర్మించిన ఈ చిత్రానికి విక్రమ్‌కుమార్ దర్శకుడు. ‘మనం’ ముచ్చట్లు చెప్పడానికి ఆదివారం నాగార్జున విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో ‘మనం’ గురించే కాక, తన తండ్రి అక్కినేని చివరి రోజుల్ని ఉద్వేగంతో గుర్తు చేసుకున్నారు. ఆ వివరాలివి. ‘మనం’ సినిమాకు గత ఏడాది మార్చిలో కొబ్బరికాయ కొట్టాం. కానీ... ఆ ఎండల్లో నాన్నను కష్టపెట్టడం నాకిష్టం లేదు. అందుకే... జూలైలో చల్లబడగానే షూటింగ్ మొదలుపెట్టాం. నాన్నకు ముందే చెప్పేశాను.. ‘నాన్నా.. ఏం ఫర్లేదు... సినిమాను ఏడాది పాటు నిదానంగా తీసుకుందాం. మీకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చి చేసేసి వెళ్లిపోండి’ అని. అలాగే వచ్చి చేసి వెళ్లిపోయేవారు. ఎందుకో తెలీదు కానీ... గత ఏడాది ఆయన 90వ పుట్టిన రోజుని మిత్రులు, శ్రేయోభిలాషులందరినీ పిలిపించుకొని మరీ చేసుకున్నారు. చెన్నయ్, యూఎస్, లండన్... ఇలా దేశవిదేశాల నుంచి కూడా వచ్చారు. వాళ్లందరి సమక్షంలో పుట్టినరోజును జరుపుకోవాలని నాన్నకు ఎందుకు అనిపించిందో!సెప్టెంబర్ 30... మా కుటుంబానికి అదో దుర్దినం. ఎందుకంటే... నాన్నకు తొలిసారి కడుపు నొప్పి వచ్చింది ఆ రోజే. నాన్న అప్పుడు షూటింగ్ లొకేషన్లోనే ఉన్నారు. ‘ఇంటికెళ్లండి నాన్నా... తర్వాత చూసుకుందాం’ అని పంపించేశాను. అయినా హాస్పిటల్కెళ్లి చూపించుకున్నారు. ‘ఎసిడిటీ’ అన్నారు. యాంటాసిడ్ ఇస్తే తగ్గిపోయింది. అసలు నాన్నకు ఎసిడిటీ అనేది ఎన్నడూ లేదు. అంత హెల్దీగా ఉండేవారు. అక్టోబర్ 10... నాన్నకు మళ్లీ కడుపులో నొప్పి వచ్చింది. ఈ దఫా తీవ్రంగా. స్కాన్ చేస్తే... చిన్న ట్యూమర్ ఉన్నట్లు తెలిసింది. దాన్ని డాక్టర్లు తొలగించేశారు. మళ్లీ నాన్న పర్ఫెక్ట్. అయితే... ఆ ట్యూమర్‌ని బయాప్సీకి పంపినప్పుడు అసలు విషయం బయటపడింది. నాన్నకు ‘కేన్సర్’. ఇంట్లో అందరి గుండె ఆగినంత పనైంది. తక్షణ కర్తవ్యం ఏంటని డాక్టర్లను అడిగాం. ‘ఓపెన్ చేస్తే కానీ చెప్పలేం. కానీ ఓపెన్ చేయడానికి ఆయన వయసు సహకరించదు’ అనేశారు. మేం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటే.. ఎవరికి తోచింది వాళ్లు ఊహించుకోవడం మొదలుపెట్టారు. కొందరైతే... ఫోన్లు చేసి ఏడవడం, ఇంకొందరైతే... ‘సార్... మీరు బాగున్నారా?’ అనడగడం. నాన్నకు విసుగొచ్చేసింది. ఇది ఆగాలంటే.. ఉన్న విషయం చెప్పేయడమే మంచిదని భావించారు. అక్టోబర్ 19... నాన్న ప్రెస్‌మీట్ పెట్టారు. అంతా పూసగుచ్చినట్టు చెప్పారు. అదే రోజు... ‘మనం’ షూటింగ్లో పాల్గొన్నారు. శ్రీయతో నా సీన్స్ జరుగుతున్నాయి. ఒక్కసారిగా... కడుపు పట్టుకొని పడిపోయారు. వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లాం. స్కాన్ తీశారు. అప్పుడు తెలిసింది.. ట్యూమర్ పెరిగిపోయి.. జీర్ణాశయాన్ని మెలిపెట్టేసిందని, ఆ ప్రాంతమంతా బిగుసుకుపోవడంతో ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లడంలేదని. ఇక ఎంత పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా నాన్నకు నొప్పి ఆగడంలేదు. సర్జరీ చేస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అన్నారు. నాన్న మొండి మనిషి. ‘చేసేయండి’ అన్నారు. కడుపుని ఓపెన్ చేశారు. అది కడుపంతా స్ప్రెడ్ అయిపోవడం గమనించారు. అయినా సరే.. సర్జరీ చేసేశారు. పెద్ద సర్జరీ. అయినా తట్టుకున్నారు. రెండ్రోజుల్లోనే లేచి తిరిగారు కూడా. ఓ రోజు సర్జరీ చేసిన డాక్టర్లందర్నీ ఇంటికి పిలిపించారు నాన్న. ‘నన్ను ఓపెన్ చేశారు. లోపల ఏముందో మీ అందరికీ తెలుసు. అబద్ధం చెప్పొద్దు. నిజం చెప్పండి’ అని సూటిగా అడిగారు. నాన్నతో వాళ్లు అబద్ధం చెప్పలేకపోయారు. ‘మీకు కావాల్సినవన్నీ తినండి. సాధ్యమైనంతవరకూ ఆనందంగా ఉండండి. అంతకు మించి ఏం చెప్పలేం’ అనేశారు. ఇక వాళ్లను పంపించేసి, మమ్మల్ని పిలిపించారు నాన్న. ‘ఎన్ని రోజులు అని చెప్పార్రా’ అనడిగారు. నాన్న అబద్ధం చెబితే అస్సలు ఊరుకోరు. ఆయన దగ్గర ఉన్నదున్నట్లు చెప్పేయాలి. అందుకే... ‘ఏమో నాన్న.. ఇన్ని రోజులనేం చెప్పలేదు. మమ్మల్ని మాత్రం ఎక్కువ సమయం మీతోనే గడపమన్నారు’ అని చెప్పేశాం. ఆ రోజే అందర్నీ భోజనాలకు పిలుస్తూ... ‘ఏడుస్తూ వచ్చేటట్లయితే... ఎవరూ నా ఇంటికి రావొద్దు’ అని నిర్మొహమాటంగా చెప్పారు. ఇక ఆ రోజు నుంచి మాతో కబుర్లు చెబుతూ హ్యాపీగా గడిపారు నాన్న. కేన్సరేమో... ఆయన్ను లోలోపల నిదానంగా తినేస్తోంది. ఓ రోజు నాన్న నన్ను పిలిచి... ‘మనం’లో నా వర్క్ ఎన్ని రోజులుంది అనడిగారు. మీరు ఆర్రోజులొస్తే సరిపోతుందని చెప్పాను. సీన్స్ అన్నీ తెప్పించుకొని చూశారు. ‘ఫస్ట్ క్లైమాక్స్ ఫినిష్ చేయ్’ అన్నారు. సినిమా పూర్తవ్వాలంటే... క్లైమాక్స్ పూర్తి చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. అది నాన్నకు బాగా తెలుసు. తర్వాత ఏయే సీన్స్ తీయాలో కూడా వివరించి చెప్పారు. ‘ఆర్టిస్టులందర్నీ రెడీ చేసి పెట్టుకో... ఏదో ఒకరోజు నేనొచ్చి చేసేసి వెళ్లిపోతా’ అని చెప్పారు. అన్నట్లుగానే... ముందు క్లైమాక్స్ కంప్లీట్ చేసేశారు. తర్వాత నిదానంగా మిగిలిన సీన్స్ పూర్తి చేశారు. ‘మనం’ ట్రైలర్లో లాస్ట్ షాట్ మీరు చూసే ఉంటారు. నాన్నపై తీసిన లాస్ట్ షాట్ కూడా అదే. ఆ షాట్లో ఆయన నవ్వు ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో. జనవరి 14... అన్నపూర్ణ స్టూడియో ప్రారంభమైన రోజు. ఆ రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తారు నాన్న. వర్కర్లందర్నీ పిలిచి వాళ్లతో పాటే బ్రేక్‌ఫాస్ట్ చేస్తారు. అయితే... ఈ దఫా నాన్న రాలేరు అనుకున్నాను. కానీ.. వీల్ ఛెయిర్లో స్టూడియోకి వచ్చారు. ఉద్యోగులందర్నీ పేరుపేరునా పలకరిచారు. సాయంత్రం మా అందర్నీ ఇంటికి పిలిచారు. ‘నా జీవితం అందమైందిరా.. చేయాల్సినవన్నీ చేసేశాను’ అని సంబరపడిపోయారు. క్రమంగా నాన్న ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. కిమ్స్ డాక్టర్లు చెప్పారు... ‘రెండు వారాల్లో ఆయనకు పెయిన్ స్టార్ట్ అవుతుంది. మీరు ప్రిపేర్ అయిపోండి. హాస్పిటల్‌కి తీసుకొచ్చినా వేస్ట్. మేం సర్జరీలు కూడా చేయలేం. పెయిన్ మెడికేషన్ ఇంట్లో రెడీగా పెట్టుకోండి’ అని. పెయిన్ మెడికేషన్ ఇచ్చిన మనిషి చనిపోయిన వాడితో సమానం. ఎందుకంటే... అలా నిద్రలో ఉండిపోతాడంతే. చేసేది లేక డాక్టర్ల మాట పాటించాం. జనవరి 21... రాత్రి మా ఫ్యామిలీ మొత్తం నాన్నతోనే ఉన్నాం. భోజనాలు చేశాం. అందరికీ నాన్న ‘గుడ్‌బై’ చెప్పారు. నిద్ర వస్తోందని లోపలకెళ్లి పడుకున్నారు. నేను పదింటివరకూ అక్కడే ఉన్నాను. ఇంటికెళ్లేముందు నాన్నను ఓసారి చూసి వెళదామని గదిలోకి వెళ్లాను. గురక పెడుతున్నారు. సరే... వెళ్లబోయాను. ఇంతలో నర్స్ ‘అదేంటిసార్... నాన్నకు గుడ్ నైట్ చెప్పకుండా వెళ్లిపోతారా?’ అంది. ‘నాన్న... నాన్న’ అని తట్టాను. నాన్న లేచారు. ‘గుడ్‌నైట్ నాన్నా’ అన్నాను. ‘సరే... వెళ్లు. రేపు కలుద్దాం’ అని నిద్రలోకి జారుకున్నారు. నిద్రలోనే.... నిజంగా నాన్నది అద్భుతమైన జీవితం. ఒక మనిషి ఎంత సాధించగలడో అంతా సాధించారు. అందుకే... ఆయన ధన్యజీవి. ‘మనం’ మీకు చాలా ప్రత్యేకమైన సినిమా కదా? కచ్చితంగా. నా కెరీర్లో గుర్తుంచుకోదగ్గ సినిమా. శివ, గీతాంజలి విడుదలై పాతికేళ్లయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు నా కెరీర్లో రాబోతున్న మరో మైలురాయి ‘మనం’. నాకే కాదు, నా కుటుంబం మొత్తం ప్రేమించి ఈ సినిమా చేశాం. ఆడుతుందా, ఆడదా అనే విషయాలు మేం ఆలోచించలేదు. ‘ఇలా చేద్దాం’ అనుకున్నాం.. చేసేశాం. తెరపై కూడా చైతూ నాకు కొడుకే. నాన్న వాడికి తాతే. ఈ మధ్యకాలంలో నాకు సూట్ అయ్యే పాత్రలు నేను చేయలేదు. ఇన్నాళ్లకు నాకు తగ్గ పాత్రను ‘మనం’లో చేశాను. మొన్నే అందరం చూసుకున్నాం. అద్భుతంగా అనిపించింది. ఇందులో అమితాబ్ కూడా నటించారు కదా. ఆ విషయం నాన్నగారికి తెలుసా? ఆయనకు తెలీదండీ... నాన్న మనకు దూరమైన తర్వాత తీసుకున్న నిర్ణయం అది. నాన్నకు అమితాబ్గారంటే చాలా ఇష్టం. ఆయన నటనను ఎప్పుడూ పొగుడుతుండేవారు. అందుకే... ఈ సినిమాలో ఆయనతో కూడా నటింపజేయాలనిపించింది. ‘నాన్న చివరి సినిమాలో మీరూ నటిస్తే బావుంటుంది’ అని స్వయంగా ఆయన్ను అడిగాను. ‘మూడు జనరేషన్లు కలిసి ఒకే సినిమాలో నటిస్తున్నారు. ఇలాంటి సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్’ అని... అన్నమాట ప్రకారం వచ్చి నటించారు. ఇందులో ఆయనది చాలా చిన్న వేషం. మీ నాన్నగారి పాటను ఇందులో రీమిక్స్ చేశారట కదా? ‘ప్రేమనగర్’లోని ‘నేను పుట్టాను...’ పాటను రీమిక్స్ చేశాం. ఇందులో ముగ్గురం నటించాం. మణిరత్నం సినిమా సంగతేంటి? చర్చలు జరిగాయి కానీ.. కార్యరూపం దాల్చలేదు. మొన్ననే ‘గీతాంజలి’కి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పా. ఆ సినిమాకు పాతికేళ్లు వచ్చినట్లు ఆయనకు తెలీదంట. ఎన్టీఆర్, మీరూ కలిసి చేస్తున్నారట? అవును... పీవీపీవాళ్లు తీస్తున్నారు. పైడిపల్లి వంశీ దర్శకుడు. అందులో నా పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వైజాగ్‌లో కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పలువురి అభిప్రాయం. మరి అక్కడ స్టూడియో కట్టాలనే యోచన ఏమైనా ఉందా? 1974లో నాన్న స్టూడియో కట్టారు. అయినా... చెన్నయ్ నుంచి హైదరాబాద్‌కి పూర్తి స్థాయిలో పరిశ్రమ రావడానికి ఇరవై ఏళ్లు పట్టింది. ఇప్పటికీ డాన్సర్లు కావాలన్నా, మ్యూజిషియన్లు కావాలన్నా చెన్నయ్నే ఆశ్రయించాల్సిన పరిస్థితి. మన తెలుగునేలపై చదువుపై చూపించే శ్రద్ధ కళలపై చూపించరు. కానీ తమిళనాడు, కేరళలలో విద్యావంతులు ఎంత ఎక్కువగా ఉంటారో, కళాకారులు కూడా అంతే ఉంటారు. అందుకే... ఇప్పటికీ కళాకారుల్ని మనం అక్కడ్నుంచే తెచ్చుకుంటున్నాం. దీన్ని బట్టి అర్థమైందేంటంటే... స్టూడియో అని ఓ నాలుగు గోడలు కడితే సరిపోదు. ముందు ఒక వ్యవస్థ అక్కడ క్రియేట్ అవ్వాలి. అసలు పరిశ్రమ వైజాగ్ వెళ్లే అవసరం ఉందంటారా? అసలక్కడ పాలనా వ్యవస్థే లేదు. స్టూడియోలకి తొందరెందుకు? మీ నాన్నగారి జ్ఞాపకార్థం ఏదైనా స్మారక చిహ్నం ఏర్పాటు చేసే ఆలోచన ... ఉందండీ... అమ్మ, నాన్న ఇద్దరి పేరిటా చేయాలి. నాన్న మ్యూజియం కూడా డెవలప్ చేయాలి. ఎందుకంటే మ్యూజియం అంటే నాన్నకు చాలా ఇష్టం. స్టూడియోలోనే... సరైన స్పాట్ చూసి ఆ కార్యక్రమాలు మొదలుపెడతాం. నాన్న పేరిట ప్రతి ఏడాదీ ఇచ్చే అవార్డును కూడా క్రమం తప్పకుండా కొనసాగిస్తాం. -
ఓ తీపి జ్ఞాపకం...
‘‘చివరి క్షణం వరకూ నటునిగానే కొనసాగాలన్న నాన్నగారి ఆశకు ప్రతిరూపమే ‘మనం’ సినిమా’’ అని నాగార్జున చెప్పారు. అక్కినేని కుటుంబం నిర్మించిన చిత్రం ‘మనం’. మహానటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ -‘‘నాన్నగారి చివరి సినిమా ‘మనం’ జనహృదయాల్లో కలకాలం గుర్తుండిపోతుంది. అనూప్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం నాకో తీపి జ్ఞాపకం’’ అన్నారు. శ్రీయ, సమంత కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, కెమెరా: పి.ఎస్.వినోద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుప్రియ, సమర్పణ: అక్కినేని అన్నపూర్ణ, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్. -
నాన్నగారికి నేను బోర్ కొట్టేశానేమో!
‘‘తండ్రీ కొడుకులతో కలిసి నటించే అదృష్టం అందరికీ దక్కదు. ఆ ఆనందాన్ని దక్కేలా చేసిన మా నాన్నగారికి కృతజ్ఞతలు’’ అంటున్నారు నాగార్జున. డా. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన సినిమా ‘మనం’. విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు, అక్కినేని కుటుంబ అభిమానులతో పాటు నాగార్జున కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున పలు విశేషాలు చెప్పారు. ‘‘నాన్నగారితో కలిసి సినిమా చేయడంవల్ల ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి కుదిరింది. గతంలో నాన్నగారి కాంబినేషన్లో నేను చేసినప్పుడు ఆయన దృష్టంతా నా మీదే ఉండేది. కానీ, ఈ సినిమాకి మాత్రం నాన్నగారి దృష్టి మొత్తం చైతూ మీదే. బహుశా నేను బోర్ కొట్టి ఉంటానేమో’’ అని సరదాగా అన్నారు నాగ్. ‘మనం’ షూటింగ్ లొకేషన్లో తన తండ్రి, తనయుడు ఒకరి మీద ఒకరు జోక్‌లేసుకుంటూ సరదాగా ఉండేవాళ్లని, ఈ సినిమా మొత్తం తనకో తీపి గుర్తులాంటిదని నాగ్ అన్నారు. ముఖ్యంగా తమ ముగ్గురి కాంబినేషన్లో షూటింగ్ చేసిన ఆ నాలుగైదు రోజులను ఎప్పటికీ మర్చిపోలేనని, అవి చాలా ప్రత్యేకం అని నాగార్జున పేర్కొన్నారు. 1920 నుంచి 2013 వరకు సాగే కథతో ఈ సినిమా ఉంటుందని, అంతకు మించి ఈ సినిమా కథకు సంబంధించిన విశేషాలేమీ బయటపెట్టలేనని కూడా ఆయన అన్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ నటించిన విషయం గురించి చెబుతూ -‘‘మా నాన్నగారికి అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం. ‘రేయ్.. ఎంత బాగా చేశాడురా... చక్కగా ఉంది కదరా...’ అని అమితాబ్ నటన గురించి అనేవారు. అమితాబ్ నటించిన సినిమాలను దాదాపు వదలకుండా చూసేవారు. అందుకే, ఆయన చివరి చిత్రంలో అమితాబ్ నటిస్తే బాగుంటుందనుకున్నా. బిగ్ బి నటించడంతో ఈ సినిమా మరింత ప్రత్యేకం అయ్యింది’’ అని నాగార్జున అన్నారు. -
‘మనం’లో అతిథిగా అమితాబ్
ఇది స్పెషల్ న్యూస్... తెలుగు తెరకు సమ్‌థింగ్ స్పెషల్ న్యూస్. ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో నటించారు. అది కూడా ‘మనం’ సినిమా కావడం విశేషం. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరాఖరి సినిమా ఇది. ఏయన్నార్ తన తనయుడు నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి నటించిన ఏకైక చిత్రం ‘మనం’పై ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. దానికి తోడు అమితాబ్ కూడా అతిథి పాత్ర చేశారన్న వార్త తెలియడంతో ఆ అంచనాలు రెట్టింపు అవుతాయన్నది ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ‘మనం’లో అమితాబ్ నటించిన విషయాన్ని యూనిట్ వర్గాలు రహస్యంగా ఉంచాయి కానీ, అమితాబ్ తన బ్లాగ్ ద్వారా అధికారికంగా ప్రకటించేశారు. ‘‘లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావుగారి తనయుడు, నా ఆప్తమిత్రుడు నాగార్జున తన తండ్రితో కలిసి నటించిన సినిమాలో నేను అతిథి పాత్ర చేశాను’’ అని అమితాబ్ తన బ్లాగ్‌లో వెల్లడించారు. అమితాబ్‌తో నాగార్జునకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి ఆ మధ్య ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. ఇటీవలకాలంలో అమితాబ్ తన సినిమాల ప్రమోషన్ నిమిత్తం తరచుగా హైదరాబాద్ వస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తాను నటించిన ‘బుడ్డా హోగా తేరా బాప్’ ప్రచారం నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగు సినిమాలపై తనకున్న మక్కువను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘తెలుగు సినిమాలు చాలా బాగుంటాయి. భవిష్యత్తులో ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా ఓ తెలుగు సినిమాలో నటిస్తా’’ అని చెప్పారు. ఎట్టకేలకు అమితాబ్ కోరిక ‘మనం’తో నెరవేరింది. ముంబయ్‌లోని ఫిల్మిస్తాన్ స్టూడియోలో ఆయన వెర్షన్‌ని చిత్రీకరించారు. -
మా ఇద్దరి అదృష్టం ఇది
మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం ‘మనం’ కోసం ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ప్రచార చిత్రానికి వచ్చిన స్పందనే అందుకు గొప్ప నిదర్శనం. రెండు రోజుల్లో పెద్ద సంఖ్యలో క్లిక్స్ దీనికి లభించాయి. ఈ విషయంపై అక్కినేని నాగార్జున ఆనందం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- ‘‘మనం ప్రచార చిత్రాలకు ఈ స్థాయిలో స్పందన రావడం ఆనందంగా ఉంది. చాలా కొత్తగా ఉన్నాయని ఫోన్లు చేసి మరీ అభినందిస్తున్నారు. మా కుటుంబం కలిసి నటించిన ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ రీతిలో ఉంటుందని నమ్మకంగా చెప్పగలను. దర్శకుడు విక్రమ్‌కుమార్ సరికొత్త శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాన్న చివరి సినిమాలో ఆయనతో పాటు భాగం పంచుకునే అదృ ష్టాన్ని నాకు, నాగచైతన్యకు కలిగించిందీ సినిమా’’ అని చెప్పారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందని, మే నెల 23న ఘనంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత సుప్రియ తెలిపారు. శ్రీయ, సమంత కథానాయికలు. -
సుధీర్ వర్మ దర్శకత్వంలో?
‘‘ఇక నుంచి ఏ సినిమా పడితే ఆ సినిమా చేయను. కథ మనసుకు నచ్చాలి. అది నన్ను డిమాండ్ చేయాలి. అలాంటి సినిమాలే చేస్తా’’ అని ఇటీవల పాత్రికేయుల సాక్షిగా చెప్పారు నాగార్జున. అందుకు తగ్గట్టే... అంగీకరించిన సినిమాలను సైతం పక్కన పెట్టేశారాయన. ‘మనం’ తర్వాత ఏ కథకూ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. నాగార్జున నుంచి సరైన సినిమా కోసం అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ‘స్వామి రారా’ చిత్రం దర్శకుడు సుధీర్‌వర్మ... నాగ్‌కు ఓ కథ వినిపించారట. ఆ కథ ఆయనకు విపరీతంగా నచ్చేసిందని విశ్వసనీయ సమాచారం. తాను చేస్తేనే ఆ కథకు న్యాయం కలుగుతుందని నాగ్ భావించారట. వెంటనే సుధీర్‌వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. నాగార్జున లాంటి టాప్ స్టార్‌ని డెరైక్ట్ చేసే అవకాశం రెండో సినిమాకే సుధీర్‌వర్మకు దక్కిందనే వార్త సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుందని తెలిసింది. ఓ ప్రముఖ నిర్మాత నిర్మించే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
'మనం' సినిమా వీడియో పాటలు యూట్యూబ్‌లో అప్లోడ్
హైదరాబాద్: టాలీవుడ్‌ను పైరసీభూతం వెంటాడుతోంది. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరగా నటించిన అన్నపూర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన 'మనం' సినిమా విడుదల కాకముందే పాటల వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు తన కుమారుడు నాగార్జున, మనవడు నాగచైతన్యలతో కలిసి నటించారు. వాట్స్ప్ నుంచి ఈ సినిమా పాటలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేడంతోపాటు యూట్యూబ్ నుంచి ఆ వీడియో పాటలను తొలగించారు. ఇంతకు ముందు సినిమాలు విడుదలైన తరువాత పైరసీ సిడిలు బయటకు వచ్చేవి. ఇప్పుడు సినిమా విడుదల కాకముందే పైరసీ సిడిలు బయటకు వస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది? చిత్రం పైరసీ సిడి విడులకు ముందే బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మనం సినిమా పాటల వీడియోని ఏకంగా యూట్యూబ్‌లోనే అప్లోడ్ చేశారు. దీంతో తెలుగు నిర్మాతలు బెంబేలెత్తిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. -
లవర్ బాయ్‌కి లక్ చిక్కేనా?
తండ్రి నుంచి కూడా పోటీని ఎదుర్కొక తప్పడం లేదు ఓ యువ హీరోకి. ఈ విషయాన్ని ఆ హీరోనే స్వయంగా తెలిపాడు కూడా. అయితే తమ మధ్య పోటీ ఉన్నా.. అది ఆరోగ్యకరమైనదిగానే ఉంటుందన్న యువ హీరో అక్కినేని నాగ చైతన్య నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. తాత, తండ్రి నుంచి నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని జోష్ చిత్రంతో చైతు తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా నిరాశ కలిగించినా ఆ తర్వాత 'ఏ మాయ చేశావే', '100% లవ్' సినిమాల విజయంతో లవర్ బాయ్ ఈమేజ్ సొంతం చేసుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ పక్కకి తోసేసి మాస్ ఇమేజి సంపాదించుకునేందుకు నాగచైతన్య చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత వచ్చిన 'బెజవాడ', 'దడ' చిత్రాలే అతనికి నిరాశే మిగిల్చాయి. అనంతరం సునీల్‌తో కలిసి 'తడాఖా' చూపించాడు. తాజాగా దేవ కట్టా దర్శకత్వంలో వస్తున్న ‘ఆటోనగర్ సూర్య’పై నాగచైతన్య చాలా ఆశలే పెట్టుకున్నాడు. సుదీర్ఘ కాలంగా నడుస్తున్న ఈ సినిమా ఓ పాట మినహా పూర్తయింది. మరోవైపు అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసి నటిస్తున్న (నాగేశ్వరావు ,నాగార్జున, నాగ చైతన్య) ‘మనం’ కొత్త షెడ్యూల్ డిసెంబర్ 1 నుంచి కర్నాటకలోని కూర్గ్‌లో మొదలవుతుంది. ఇక కొంతకాలంగా జోష్ తగ్గించిన నాగ చైతన్య సినిమాలు చేసే విషయంలో ప్రస్తుతం మంచి స్పీడ్ మీద ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం, డి.రామానాయుడు నిర్మించనున్న ‘సింగ్ వర్సెస్ కౌర్’ తెలుగు రీమేక్... మొదలు కావాల్సి ఉన్నాయి. పలు చిత్రాలతో తీరిక లేకుండా దూసుకుపోతున్న ఈ అక్కినేని కుర్రోడు ఆశించిన గుర్తింపు మాత్రం సాధించలేకపోతున్నాడు. 2009లో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ యంగ్ డైనమిక్కు సినీ పెద్దల సహకారం బాగానే ఉన్నప్పటికీ.. ఓ ప్రత్యేక గుర్తింపు కోసం నిరంతరం శ్రమిస్తున్నాడు. తాత, తండ్రిల స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్న ఈ నటుడు అందుకు తగ్గ ప్రయత్నాలనే చేస్తున్నాడు. ఈ ఏడాది అయినా అతని ప్రయత్నాలు సఫలం కావాలని ఆశిద్దాం. -
‘మనం’తో ఏయన్నార్ మళ్లీ బిజీ
ఆత్మస్థయిర్యానికి చిరునామా ఏయన్నార్ అని... ఇప్పుడు కాదు ఎప్పుడో ప్రూవ్ అయ్యింది. అప్పట్లో మొదటిసారి ఏయన్నార్‌కి శస్త్రచికిత్స జరిగింది. పధ్నాలుగేళ్లు మీ లైఫ్‌కి గ్యారంటీ అన్నారు డాక్టర్లు. ఇది జరిగి 39 ఏళ్లయ్యింది. ఇప్పుడు తొమ్మిది పదుల వయసులో ఒక్క పన్ను కూడా ఊడకుండా, కంఠస్వరంలో ఏమాత్రం తేడా లేకుండా... ఎంతో చలాకీగా ఉన్నారు అక్కినేని. కానీ, ఇటీవల కేన్సర్ కణాలు ఉన్నాయని, కానీ భయపడాల్సిన అవసరమేం లేదని ఆయన ప్రెస్‌మీట్ పెట్టి చెప్పినా, చాలామంది బాధపడ్డారు. ఆ తర్వాత ఆయనకు శస్త్రచికిత్స జరిగిందని విని కలవరపడ్డారు. ప్రస్తుతం అక్కినేని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలనే తపన ఆయన అభిమానులనే కాకుండా, చాలామందిలో ఉంది. అయితే, అక్కినేని ఈజ్ బ్యాక్ టు షూటింగ్. ఆయన హ్యాపీగా ‘మనం’ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ముద్దుల మనవడు, హీరో సుమంత్ ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. అక్కినేని, నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్లో రూపొందుతున్న ‘మనం’పై భారీ అంచనాలున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ తుది దశకు చేరుకుంది. విక్రమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. -
అక్కినేని బర్త్ డేకి 'మనం' ఫస్ట్ లుక్ వీడియో
డా.అక్కినేని నాగేశర్వరావు 90వ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్మాత, ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున 'మనం' చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. తన తండ్రి అక్కినేనితో, తనయుడు నాగచైతన్యతో కలిసి నటిస్తుండటం కొత్త అనుభూతిని అందిస్తోందని, తమ సంస్థలోనే ఇదొక మెమరబుల్ మూవీ అని నాగార్జున అన్నారు. ఫేస్ బుక్ లో అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. మనం' చిత్రానికి ‘ఇష్క్' ఫేం విక్రమ్‌కుమార్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాత, తనయుడు, మనవడు... ఒకేసారి తెరపై సాక్షాత్కరించడం అటు అక్కినేని అభిమానులకే కాక, సగటు ప్రేక్షకులకు కూడా కనుల పండుగ కానుంది. -
‘మనం' ఫస్ట్ లుక్ విడుదల
అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘మనం'. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయింది. రేపు అక్కినేని నాగేశ్వరరావు 90వ జన్మదినం సందర్భంగా నిర్మాతలు దీన్ని విడుదల చేశారు. నాగార్జున సూట్ నిల్చునుండగా, నాగ చైతన్య పంచకట్టుతో మధ్యలో కూర్చుని ఉన్నాడు. నట సామ్రాట్ నాగేశ్వరావు చిన్నపిల్లాడి డ్రెస్సులో మనవడి ముందు చేతులు కట్టుకుని ఉన్న ఈ ఫోటో చూడగానే ఆకట్టుకుంటోంది. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ ఫోటోను ఫేస్ బుక్ లో ఉంచారు. మరోవైపు తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ నాగార్జున ట్విట్ చేశారు. 'యంగ్ అండ్ హ్యేపీ బర్త్ డే నాన్న' అంటూ శుభాకాంక్షలు తెలిపారు. Tommorrow is my fathers 90 th bday and I cannot resist releasing the first look of manam..forever young,happy birthday nana! — Nagarjuna Akkineni (@iamnagarjuna) September 19, 2013 'మనం' చిత్రానికి ‘ఇష్క్' ఫేం విక్రమ్‌కుమార్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాత, తనయుడు, మనవడు... ఒకేసారి తెరపై సాక్షాత్కరించడం అటు అక్కినేని అభిమానులకే కాక, సగటు ప్రేక్షకులకు కూడా కనుల పండుగ కానుంది. నాగార్జునకు జోడీగా శ్రీయ, నాగచైతన్య సరసన సమంత నటిస్తున్నారు. హర్షవర్దన్ కథ, సంభాషణలు అందించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. -
మళ్లీ కెమెరా ముందుకి వస్తున్న అక్కినేని
దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ మహానటుడు అక్కినేని ముఖానికి రంగేసుకున్నారు. ఆయన కుటుంబానికి చెందిన మూడు తరాలు కలిసి ‘మనం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున, నాగచైతన్యలపై ఇప్పటికే దర్శకుడు విక్రమ్‌కుమార్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సోమవారంతో ఏఎన్నార్ వంతు వచ్చింది. దాంతో రెండేళ్ల విరామం తర్వాత మేకప్ వేసుకొని హుషారుగా అడుగులేస్తూ కెమెరా ముందుకెళ్లారు ఏఎన్నార్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన మనవడు సుమంత్ తెలిపారు. సుమంత్ ప్రస్తుతం ‘ఏమో గుర్రం ఎగురావచ్చు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.