మనం దర్శకుడితో రేసుగుర్రం | allu arjun next film with manam fame vikram kumar | Sakshi
Sakshi News home page

మనం దర్శకుడితో రేసుగుర్రం

Published Sun, Nov 8 2015 12:17 PM | Last Updated on Sun, Sep 3 2017 12:14 PM

మనం దర్శకుడితో రేసుగుర్రం

మనం దర్శకుడితో రేసుగుర్రం

వరుస సూపర్ హిట్స్ తో టాలీవుడ్ బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ చేస్తున్న యంగ్ హీరో అల్లు అర్జున్ సినిమాల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లతో పాటు సాఫ్ట్ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ కూడా చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.

'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాతో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అందించిన బన్నీ, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత మరోసారి క్లాస్ సినిమాకు కమిట్ అయ్యే ఆలోచనలో ఉన్నాడు స్టైలిష్ స్టార్. 'మనం' సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ సినీ జనాలతో పాటు టాప్ స్టార్స్ దృష్టిని కూడా ఆకర్షించిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలని భావిస్తున్నాడు.

విక్రమ్ కుమార్ ప్రస్తుతం సూర్య హీరోగా తమిళ్ లో'24' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈసినిమా రిజల్ట్ చూసిన తరువాత బన్నీ సినిమా కు సంబందించిన పని మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం 24 గ్యారెంటీ హిట్ అంటున్నారు. అందుకే బన్నీ, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో సినిమా రావటం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement