
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తరువాత ఇంత వరకు మరో సినిమా అంగీకరించలేదు. ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవటంతో తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు బన్నీ. ఇప్పటికే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఓ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ టీం ఎలాంటి ప్రకటనా చేయలేదు.
తాజాగా మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. యువ దర్శకులు మారుతి, పరుశురాంలు కూడా బన్నీ కోసం కథ రెడీ చేస్తున్నారట. అంటే విక్రమ్ కథను ఇంకా బన్నీ ఫైనల్ చేయలేదా..? లేక విక్రమ్ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా బన్నీ లైన్‌లో పెడుతున్నాడా..? అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం దొరకాలంటే మాత్రం బన్నీ క్లారిటీ ఇవ్వాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment