
Samantha Special Song Gets Trolled In Pushpa Movie: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తొలిసారిగా స్పెషల్ సాంగ్‌లో కాలు కదిపింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో సామ్ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. ఇక ఈ పాట నిన్న(డిసెంబర్ 10) విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప ఐటెం సాంగ్ మెనియానే కనిపిస్తోంది. ‘ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా.. అంటూ సాగే ఈ స్పెషల్ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.
చదవండి: ఆ తెలుగు హీరో చాలా చాలా హాట్.. సారా షాకింగ్ కామెంట్స్
లంగా జాకెట్‌లో సమంత తన అందచందాలు ఆరబోస్తూ కుర్రకారు మతి పోగొడుతోంది. కాగా ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా.. గాయని ఇంద్రావతి చౌహాన్ ఆలపించింది. ఈ పాటలో సమంత గ్లామర్, దేవిశ్రీ సంగీతం ఒక ఎత్తయితే.. గాయనీ ఇంద్రావతి చౌహన్ మత్తు వాయిస్ పాటను నెక్స్ట్ లెవల్‌కు తీసుకేళ్లింది. ఇక అంతా బాగానే ఉన్న ఈ పాట ఎక్కడో విన్నట్టు అనిపిస్తోందంటూ నెటిజన్లు పట్టేస్తున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య-తమన్నా జంటగా నటించిన వీడొక్కడే మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
చదవండి: బయటకొచ్చిన కత్రినా-విక్కీల హల్ది ఫంక్షన్ ఫొటోలు
ఈ మూవీలో కూడా అచ్చం ఇలాగే ఓ స్పెషల్ ఉంది. ‘హానీ.. హానీ..’ అంటూ ఆ పాట సాగుతుంది. ఇప్పుడు సమంత చేసిన ఈ స్పెషల్ సాంగ్ అచ్చం ఆ పాటను తలపిస్తోందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. లిరిక్స్ బాగున్నా మ్యూజిక్ మాత్రం సేమ్ ఉందని, అంటే సమంత సాంగ్‌ను కాపీ కొట్టారా? అంటూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. మరి దీనిపై పుష్ప టీం ఎలా రియాక్ట్ అవుతుంతో చూడాలి. అయితే స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సామ్ డేర్ చేసి ఈ స్పెషల్ సాంగ్ చేసింది. కానీ ఇప్పుడు ఈ పాట ఇలా ట్రోల్స్ బారిన పడటంతో ఆమెకు చేదు అనుభవం ఎదురైందని అందరూ అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment