troll
-
అల్లు అర్జున్ అరెస్ట్ పై పొలిటికల్ ఫైట్?
-
Prabhakar: ట్రోలర్స్ కి దొరికితే ఏసుకుంటారు..
-
మెట్లపైనుంచి జారిపడ్డ విజయ్.. ట్రోలర్స్‌కు అదిరిపోయే పంచ్
రెండురోజుల క్రితం విజయ్ మెట్లపైనుంచి జారిపడ్డారు. ఆ వీడియో సోషల్‌మీడియాలో భారీగా వైరల్ అయింది. కొందరైతో ట్రోల్స్ కూడా చేశారు. అయితే, తాజాగా విజయ దేవరకొండ ఆ వీడియోను షేర్ చేస్తూ ట్రోలర్స్‌కు అదిరిపోయే పంచ్ ఇచ్చారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ఏకంగా తన బ్రాండ్ దుస్తుల షాప్ ప్రమోషన్ కోసం విజయ్ ఉపయోగించాడు. ఇలా బిజినెస్‌లో కూడా తన మార్కెట్ స్ట్రాటజీని విజయ్ ఉపయోగించారు. దీంతో అభిమానులతో పాటు నెటిజన్లు కూడా విజయ్ ఆలోచనకు ఫిదా అవుతున్నారు. తన బిజినెస్ బ్రాండ్ పేరు చెబుతూ అన్నీ 'రౌడీ' ఆలోచనలే అంటూ క్లాంప్లీమెంట్ ఇస్తున్నారు.'సాహిబా' అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో ప్రేక్షకులను అలరించేందుకు ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ రెండురోజుల క్రితం ముంబై వెళ్లారు. అయితే, ఈ కార్యక్రమాన్ని ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, ఆ వీడియోకి మరో వీడియోను జత చేసి విజయ్ ఎడిట్ చేశారు. తాజాగా దానిని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'నేను, నా రౌడీ బాయ్స్, గర్ల్స్ ప్రేమలో పడుతూనే ఉంటాం. తప్పకుండా మీరు కూడా రౌడీ వేర్‌తో ప్రేమలో పడతారు' అని క్యాప్షన్ ఇచ్చారు. ఇలా తన వ్యాపారానికి పనికొచ్చేలా ఆ వీడియోను విజయ్ ఉపయోగించడం చెప్పుకోతగిన విషయం అని చెప్పవచ్చు.'రౌడీ' పేరుతో దుస్తుల బ్రాండ్‌ని విజయ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయ్ స్టైల్ తనకి బాగా నచ్చిందని, 'రౌడీ' బ్రాండ్ దుస్తులు అడిగానని అల్లుఅర్జున్ ఓ సందర్భంలో పంచుకున్నారు కూడా.. దీంతో విజయ్ కోసం ప్రత్యేకంగా కొన్ని దుస్తులు డిజైన్ చేసి విజయ్ పంపించారు కూడా. వాటికి ఫిదా అయిన బన్నీ ఆ దుస్తులు దరించి పలు ఫోటోలు కూడా పంచుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో వల్ల రౌడీ బ్రాండ్ దుస్తులు మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
ఎవరి కోసం ఎవరూ రారు.. అది మాత్రమే మాట్లాడాలి: దిల్ రాజు హాట్ కామెంట్స్
టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కిరణ్ అబ్బవరం క మూవీ సక్సెస్ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన టాలెంట్ గురించి మాట్లాడారు. ఇక్కడ ఎవరూ ఎవరినీ సపోర్ట్ చేయరని అన్నారు. కిరణ్ అబ్బవరం మాట్లాడిన వీడియో చూశానని తెలిపారు. ఇదంతా నీ కష్టం వల్లే సాధ్యమైందని దిల్ రాజు ప్రశంసించారు. అంతేకానీ ఇక్కడ ఎవరి కోసమో మీరు వెయిట్ చేయవద్దని కోరారు. నీ దగ్గర టాలెంట్ ఉందని.. ట్రోల్స్ గురించి మరోసారి అలా ఎమోషనల్ కావొద్దని కిరణ్ అబ్బవరంకు దిల్ రాజు సూచించారు.ఎవరూ సపోర్ట్ చేయరు..ఇటీవల మరో టాలీవుడ్ హీరో రాకేశ్ వర్రే సైతం చిన్న హీరోలకు సెలబ్రిటీ స్టార్స్ ఎవరూ సపోర్ట్ చేయడం లేదని మాట్లాడారు. తాను ఎంత ప్రయత్నించినప్పటికీ ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ విషయం గురించి కూడా దిల్ రాజు ప్రస్తావించారు. మీ టాలెంట్, హార్డ్ వర్క్‌ను నమ్ముకోండి తప్ప.. ఇక్కడ ఎవరినీ ఎవరూ సపోర్ట్ చేయరు.. అలాగే వెనక్కి కూడా లాగరని ఆయన అన్నారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలని.. సక్సెస్ వస్తే మాలాంటి వాళ్లు వచ్చి అభినందిస్తామని దిల్ రాజు కామెంట్స్ చేశారు.కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన చిత్రం 'క'. తన్వీ రామ్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం దీపావళికి విడుదలైంది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో నిర్మాత దిల్ రాజు పాల్గొని మాట్లాడారు. కాగా.. ఈ చిత్రానికి సుజిత్, సందీప్ ద్వయం దర్శకత్వం వహించారు.ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా...కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - 'మా "క" సక్సెస్ మీట్‌కు వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. ఇంత పెద్ద సక్సెస్ ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు. నాపై ప్రేమ చూపిస్తున్న ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకుంటా. పెద్ద సినిమాల మధ్య మీ సినిమా ఎందుకు అన్నారు. మంచి మూవీ అని చెప్పినా ఎవరూ నమ్మలేదు. కానీ మేము చెప్పిన విషయాన్ని ప్రేక్షకులే నిజం చేశారు. నాకు సక్సెస్ కంటే నా జర్నీ ముఖ్యం. ఈ జర్నీనే సంతృప్తినిస్తోంది. మరెంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేయాలి. ఏ హీరోను అతని మార్కెట్ బట్టి డిసైడ్ చేయొద్దు. ఒక్క శుక్రవారం చాలు ఆ నంబర్స్ మారిపోవడానికి. మీ ప్రోత్సాహంతో మరిన్ని మంచి మూవీస్ చేస్తాను' అని అన్నారు. -
సమంత చిట్‌చాట్.. ఆ ప్రశ్నతో విసిగించిన నెటిజన్!
హీరోయిన్ సమంత ప్రస్తుతం సిటాడెల్ ఇండియన్ వర్షన్ హానీ:బన్నీతో ప్రేక్షకులను పలకరించనుంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్‌కు జంటగా నటించింది. ఈ సిరీస్ త్వరలోనే ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లతో బిజీగా ఉన్న సమంత.. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా సమంతకు ఓ నెటిజన్ ఆసక్తికర ప్రశ్న వేశాడు. దయచేసి మీరు కాస్తా బరువు పెరగండి మేడమ్? అని అడిగాడు. అయితే ఈ ప్రశ్నకు సమంత సైతం స్పందించింది, తనదైన శైలిలో నెటిజన్‌కు ఇచ్చిపడేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.సమంత వీడియోలో మాట్లాడుతూ..'మళ్లీ అదే ప్రశ్న. నా బరువు గురించి నాకు అంతా తెలుసు.. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే.. ప్రస్తుతం నేను కఠినమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో ఉన్నా.. అందువల్లే నా బరువు నిర్దిష్టంగానే ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల ఇలానే ఉండాలి. దయచేసి ఇతరులను జడ్జ్ చేయడం ఆపండి. అవతలి వారిని కూడా జీవించనివ్వండి. ప్లీజ్ గాయ్స్.. ఇది 2024' అంటూ కౌంటర్ ఇచ్చింది. తనకు మరోసారి ఇలాంటి ప్రశ్న ఎదురైందని సమంత చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్‌కు కాస్తా ఘాటుగానే రిప్లై ఇచ్చేసింది. కాగా.. సమంత నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ఈ నెల 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడీయోలో స్ట్రీమింగ్ కానుంది. -
'విశ్వంభర' టీజర్లో గ్రాఫిక్స్‌పై ట్రోల్స్
మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' టీజర్ రిలీజైంది. ముందు నుంచే చెబుతున్నట్లు ఇది సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీతో తీస్తున్న సినిమా.. అందుకు తగ్గట్లే టీజర్లో గ్రాఫిక్స్ ఉన్నాయి. మెగా ఫ్యాన్స్‌కి చిరు గ్రేస్‌తో పాటు అన్నీతెగ నచ్చేస్తుంటే.. మిగిలిన వాళ్లలో కొందరు మాత్రం గ్రాఫిక్స్ షాట్స్ విషయమై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: సూపర్ హీరోగా బాలకృష్ణ.. వీడియో రిలీజ్)అలానే టీజర్ ప్రారంభంలో చూపించే అంతరిక్షం సీన్.. హాలీవుడ్ హిట్ సినిమా 'అవెంజర్స్' నుంచి తెచ్చి పెట్టారని ప్రూఫ్స్‌తో ట్వీట్స్ పెడుతున్నారు. మరికొందరైతే గ్రాఫిక్స్ నేచురల్‌గా లేవని అంటున్నారు. మూవీ రిలీజ్ టైంకి ఇవన్నీ కాస్త కరెక్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. చిరంజీవిని ఏం అనట్లేదు గానీ గ్రాఫిక్స్ విషయంలో దర్శకుడు వశిష్ఠ కేర్ తీసుకోలేదని విమర్శిస్తున్నారు. ఇతడిని 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్‌తో పోల్చి ట్రోల్ చేస్తున్నారు.చిరంజీవి, త్రిష జంటగా నటిస్తున్న ఈ సినిమాని లెక్క ప్రకారం సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ చేయాలి. కానీ 'గేమ్ ఛేంజర్' కోసం దీన్ని వాయిదా వేశారు. ఈ విషయాల్ని అధికారికంగా ప్రకటించారు. అంటే 'విశ్వంభర' వచ్చేది వేసవికే అనమాట. ఏప్రిల్‌లో 'రాజా సాబ్' ఉంది కాబట్టి మేలోనే రిలీజయ్యే ఛాన్సులు ఎక్కువ. మరి చూడాలి ఏ డేట్ ఫిక్స్ చేస్తారో?(ఇదీ చదవండి: పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?)MEGA fans thappa andaru konchem disappointed feel lo ne unnaru ga teaser choosi 😴😴😴 Its nice that they postponed to Summer 2025 ..Work well on Vfx and bring out GRANDDD OUTPUT ..plz don't go PAN-INDIA with this movie @UV_Creations 🙏⭐️ @KChiruTweets⭐️ #ViswambharaTeaser 👎 pic.twitter.com/zOX9eJWOII— ★ Movie Monster ★ (@movie_monsterz) October 12, 2024#ViswambharaTeaser - Storyline definitely looks thrilling but VFX could have been better. Aa chota k naidu mida antha interest enti boss aadi cinematography outdated asalu, small range movies kuda adni consider cheyatle 🤦🏻♂️Btw, Boss in this frame 🔥 pic.twitter.com/CtYwzZZjMS— CK (@Chanti616) October 12, 2024 -
సోషల్ మీడియాలో వేట్టైయాన్పై ట్రోల్స్.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.అయితే టాలీవుడ్లో రజినీకాంత్‌కు ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉంది. దీంతో టాలీవుడ్‌లోనూ వెట్టైయాన్ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అందులో తెలుగులోనూ అదే టైటిల్‌తో ఈ మూవీని విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమాపై అప్పుడే నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. వెట్టైయాన్ డిజాస్టర్ అంటూ నెగెటివ్ ట్రోలింగ్ మొదలెట్టారు. మరోవైపు తెలుగులో ఈ మూవీని ఏషియన్, దిల్‌రాజు సంస్థలు రిలీజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగులో తమిళ టైటిల్ ఉండడంపై సోషల్ మీడియాలో చర్చ జరగడంపై ఆయన స్పందించారు.దిల్ రాజు మాట్లాడుతూ.. 'పాన్ ఇండియా సినిమా చేసేటప్పుడు కొన్ని టైటిల్ విషయంలో సమస్యలు ఉంటాయి. గేమ్ ఛేంజర్ విషయలో కూడా రెండు, మూడు భాషల్లో ఇబ్బంది ఎదురైంది. సోషల్ మీడియాలో రజనీకాంత్ వెట్టాయన్ బాయ్ కాట్ ట్రెండింగ్ చేస్తున్నారు. అలాగే వెట్టయాన్ అనే టైటిల్ తెలుగులో కాంట్రవర్సీ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమా గ్లోబల్ అయిపోయింది. సాధ్యమైనంత వరకు టైటిల్స్ లోకల్ పేరుతో పెడుతున్నారు. లేని పక్షంలో అదే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. సినిమాని సినిమాగా చూడండి' అని అన్నారు.నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ …'తెలుగులో చాలా డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. తెలుగు సినిమాలు కూడా చాలా ఇతర భాషల్లో డబ్ అవుతున్నాయి. వన్ ఇండియా వన్ నేషన్ అంటున్నారు కదా. తెలుగు వెట్టయాన్ అందరూ వచ్చి చూడండి' అని అన్నారు. దగ్గుబాటి రానా మాట్లాడుతూ … 'రజినీకాంత్ సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ఉంటుంది. డైరెక్టర్ మీద ఇష్టంతో ఈ సినిమాలో ఇంతమంది స్టార్స్ నటించారు. ఈ రోజు మన తెలుగు సినిమాని ప్రపంచం మొత్తం చూస్తోంది. ట్రోల్స్ అనేవి టైం పాస్ లాంటివని అన్నారు. -
కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలకు దిగారు. ప్రముఖ హీరోహీరోయిన్లు నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి కేటీఆరే కారణమని అన్నారామె. తనపై తాజాగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ అన్నట్లు దొంగ ఏడుపులు మాకు అవసరం లేదు. సినీ పరిశ్రమలో చాలా మంది విడాకులకు కేటీఆరే కారణం. ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నారు. నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆరే కారణం. ఎన్ కన్వెన్షన్ విషయంలోనే ఇది జరిగింది. అలాగే.. మరో హీరోయిన్ రకుల్ త్వరగా వివాహం చేసుకోవడానికి కూడా కేటీఆర్ వైఖరే కారణం. ఇదీ చదవండి: అక్కా దొంగ ఏడుపులు ఎందుకు: కేటీఆర్ విచారణలో కేటీఆర్ గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. మహిళలంటే కేటీఆర్‌కు చిన్నచూపు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారు. హీరోయిన్స్ కి కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారు. కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకొంటే.. మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారు. .. దుబాయ్ నుండి సోషల్ మీడియా ను అపరేట్ చేయమని కేటీఆర్ కొందర్ని పురమాయించాడు. అక్కడి నుంచి బీఆర్ఎస్ సోషల్ మీడియా నడుస్తోంది. అక్కడి నుంచే నాపై పోస్టులు పెడుతున్నారు. మొన్న ఇద్దరిని, ఈరోజు ఇద్దరిని కేటీఆర్ దుబాయికి పంపించాడు’’ అని సురేఖ ఆరోపించారు. ఇక తనపై సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ మీద మాజీ మంత్రి హరీశ్‌రావు మనసున్న మనిషిలా స్పందించారని, కేటీఆర్ మాత్రం స్పందించకపోగా.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని కొండా సురేఖ ఫైర్ అయ్యారు. -
వయనాడ్ విషాదం.. వివాదంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్
తిరువనంతపురం : కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో ప్రకృతి ప్రకోపించింది. దీంతో దైవ భూమి కేరళ ఇప్పుడు మరుభూమిలా మారింది. అటవీ, కొండ ప్రాంతమైన వయనాడ్‌లో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ దుర్ఘటనలో తాజా మరణాలు ఆదివారం (ఆగస్ట్4) ఉదయం 10.30 గంటల సమయానికి 357కి చేరుకున్నాయి. 200 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది.మరోవైపు కొండ చరియలు విరుచుకుపడడంతో సర్వం కోల్పోయి, తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న బాధితులకు వైద్య సహాయం కొనసాగుతుంది. వారికి అండగా నిలిచేందుకు పలువురు ప్రముఖులు నేరుగా సహాయ కేంద్రాలను సందర్శిస్తున్నారు. మీకు మేం అండగా ఉన్నామంటూ వారిలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. కావాల్సిన నిత్య సరాల్ని తీరుస్తున్నారు.మండక్కై జంక్షన్, చూరాల్మల ప్రాంతాలు భవనాలు, బురద నిందిన వీధులు, రాళ్లతో మృత్యు దిబ్బులుగా మారాయి. ఆ రెండు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిపోక ముందు సుమారు 450 నుంచి 500 పైగా ఇళ్లుండేవి. కానీ ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. భారీ రాళ్లే దర్శనమిస్తున్నాయి. భద్రతా బలగాలు సహాయక చర్యల్ని ముమ్మురం చేస్తున్నాయి. 1300 మందికి పైగా ఆర్మీ జవానులు జాడ తెలియని వారికోసం అన్వేషిస్తున్నారు. ఈ తరుణంలో కేరళ రాజధాని తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ వయనాడ్ బాధితుల్ని పరామర్శించారు. బాధితుల పరిస్థితి, ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా వారికి కావాల్సిన బెడ్ షీట్లు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని ప్రజా ప్రతినిధులందరూ వయనాడ్‌కు సహాయం చేయాలని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా లేఖ రాసినట్లు మీడియాకు వెల్లడించారు.ఇదే విషయంపై ఎక్స్ వేదికగా స్పందించారు. వయనాడ్ విషాదంపై మరపురాని రోజు కొన్ని జ్ఞాపకాలు అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై వివాదం నెలకొంది.Some memories of a memorable day in Wayanad pic.twitter.com/h4XEmQo66WFor all the trolls: definition of “memorable”: Something that is memorable is worth remembering or likely to be remembered, because it is special or unforgettable. Thats all i meant. https://t.co/63gkYvEohv— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2024— Shashi Tharoor (@ShashiTharoor) August 3, 2024 ఇలాంటి విషాదాన్ని వివరించినందుకు ఆయన మెమరబుల్ అనే పదాన్ని ఎలా వినియోగిస్తారని బీజేపీ నేతలతో సహా పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.కొండచరియలు విరిగిపడి 300 మందికి పైగా మరణిస్తే జ్ఞాపకం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.శశి థరూర్‌కి విపత్తులు, మరణాలు చిరస్మరణీయం చెప్పడం సిగ్గుగా ఉందని మరో యూజర్ ట్వీట్ చేశారు. బీజేపీ ఐటి సెల్ చీఫ్ ,బీజేపీ సీనియర్ నేత అమిత్ మాల్వియా..‘శశి థరూర్ మరణాలు, విపత్తులు చిరస్మరణీయం’ అని ట్వీట్ చేశారు.Deaths and disaster are memorable for Shashi Tharoor. https://t.co/40zjGW6c0b— Amit Malviya (@amitmalviya) August 3, 2024ఈ ట్వీట్ వివాదంపై శశిథరూర్ మరో ట్వీట్ చేశారు. ట్రోలర్స్ అందరికి అంటూ మెమొరిబుల్‌పై నా ఉద్ద్యేశ్యం వేరే ఉంది. పలు సందర్భాలలో ఊహించని సంఘటనల్ని, విషాదాల్ని గుర్తుచేసుకునే విధంగా నిలుస్తుందని అర్థం అంటూ వివరణిచ్చారు. -
ఆదిపురుష్ డైరెక్టర్ ని వదలని ఫ్యాన్స్.. కల్కి, హనుమాన్ ని చూసి..
-
ప్రాణాలు తీసిన వైరల్ వీడియోలు.. మనస్తాపంతో వృద్దుడి ఆత్మహత్య
ట్రోల్స్, మీమ్స్, వీడియోలు వైరల్చేయడం వల్ల తాత్కాలికంగా నవ్వుకోవచ్చేమో కానీ.. కొంత మంది జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయి. సరదాకు చేసిన పనుల వల్ల ఆందోళన, మనస్తాపానికి గురై చివరకు ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే వీటి కారణంగా ఎంతో మంది మరణించగా.. తాజాగా వ్యర్థాలను సేకరించే ఓ వృద్ధుడు తన వీడయోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవమానంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది.వివరాలు.. ప్రతాప్ సింగ్ అనే వృద్దుడు రోడ్ల పక్కన ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించి అమ్ముకుంటూ బతికేవాడు. ఆయా వ్యర్థాలను ఓ హ్యాండ్‌కార్ట్ లో వేసుకుని వెళ్లేవాడు. గ్రమంలో అందరకీ సుపరిచితుడు కావడంతో అందరూ అతన్ని బాబాజీ* అని పిలిచేవారు.అయితే అతడిపై లొహావత్ గ్రామ యువకులు వీడియోలు తీయడం ప్రారంభించారు. వాటిని మీమ్స్‌గా రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పోస్టు చేసిన వీడియోల్లో కొంతమంది వ్యక్తులు అతనిని వెంబడించి తన చేతి బండిని తోసుకుంటూ వెక్కిరిస్తున్నట్లు కనిపిస్తుంది.ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. .తనను ఎగతాళి చేస్తూ తీసిన వీడియోల పట్ల ఆ వృద్ధుడు మనస్తాపానికి గురయ్యాడు. చివరకు ఓ హైవే పక్కన చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తన వీడియోలు వైరల్ అవ్వడం, అమానించడం, మీమ్స్ కారణంగానే ప్రతాప్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
సోషల్ మీడియా ట్రోల్స్ పై యాంకర్ శ్యామల రియాక్షన్
-
'దిల్ రాజుపై నెగెటివ్ ట్రోల్స్'.. ఫ్యామిలీ స్టార్ నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాలీవుడ్లో అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీత గోవిందం తర్వాత పరశురామ్- విజయ్ దేవరకొండ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా చిత్రయూనిట్ మీడియా ప్రతినిధులతో ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు దిల్ రాజు సమాధానలిచ్చారు. గతంలో మీపై వచ్చిన నెగెటివ్ ట్రోల్స్‌ను మీరేలా అధిగమించారు? అనే ప్రశ్నకు తనదైన శైలిలో ఆన్సరిచ్చారు. దిల్ రాజు మాట్లాడుతూ.. 'నా మీద మీమ్స్ వచ్చాయనే విషయంపై నాకు అవగాహన కూడా లేదు. నేను ఓ ఇంటర్వ్యూలో నా పెళ్లి గురించి ప్రస్తావించా. దాని గురించి మస్తుగా చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో నన్ను గుర్తు పట్టేవాళ్లు దాదాపు ఒక కోటి మంది ఉంటారు. నాపై కామెంట్స్ పెట్టినవాళ్లు ఒక పదివేల మంది ఉంటారు. కాబట్టి వాళ్ల గురించి ఆలోచిస్తే మిగిలినవాళ్లకు దూరమవుతా. మనం నెగెటివ్ వైబ్‌లో బతుకుతున్నాం. ఇంట్లో కూడా అలానే ఉంటున్నాం. అలా మనకు తెలియకుండానే హెల్త్‌ను పాడు చేసుకుంటాం. ఆ నెగెటివ్‌ను మన దగ్గరకు రాకుండా జాగ్రత్తపడాలి. అవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్. అవేమైనా నన్ను చంపేస్తాయా? చంపలేవుగా. పాసింగ్ క్లౌడ్స్ పోయాక మనకు క్లియర్‌గా ఆకాశమే కనిపిస్తుంది. మనం స్కై లాంటి వాళ్లం. క్లౌడ్స్‌కు భయపడితే ఎలా? ' అని అన్నారు. "Trolls are like passing clouds, but I'm like the sky" Ace Producer #DilRaju responds to trolls on his personal life, giving a befitting reply 🙌#TheFamilyStar #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/Fuwifsq0NQ — Telugu FilmNagar (@telugufilmnagar) April 4, 2024 -
నేనూ ట్రోల్స్‌కు గురయ్యా: సీజేఐ చంద్రచూడ్
బెంగళూరు: సోషల్ మీడియాలో తాను కూడా ట్రోలింగ్‌కు గురయ్యానని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. శనివారం బెంగుళూరులో జ్యుడీషియల్ అధికారుల 21వ ద్వైవార్షిక సమావేశంలో పాల్గొన్న సీజేఐ ఇటీవల తనపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్‌కు సంబంధించి మాట్లాడారు. ‘4-5 రోజుల కింద ఓ కేసు వాదనల సమయంలో నాకు వెన్ను నొప్పి వచ్చింది. అయితే నేను కూర్చున్న చైర్ నుంచి మారి సౌకర్యం కోసం మరో చైర్లో కూర్చున్నా. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో నేను అహంకారి అని కామెంట్లతో నెటిజన్లు ట్రోల్ చేశారు. వాదనలు జరుగుతున్న మధ్యలోనే నేను లేచి కోర్టు నుంచి వెళ్లిపోయానని అన్నారు. అసలే నేను కోర్టు వదిలి వెళ్లలేదు. నేను కేవలం నా కుర్చిని మార్చుకోవటం కోసమే లేచానని వారికి తెలియదు. కుర్చి నుంచి లేచిన వీడియోను మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అయింది’ అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వివరణ ఇచ్చారు. అయితే తాను చేసే పనిలో సామాన్య పౌరులకు అందించే విశ్వాసాన్ని మాత్రమే నమ్ముతానని పేర్కొన్నారు. న్యాయవవస్థలో పని చేసే.. న్యాయాధికారులు విధులను నిర్వహిస్తున్న సమయంలో పనితోపాటు ఒత్తిడిని సమానంగా జయంచడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పని, ఒత్తిడిని అధిగమించటం అనేవి రెండు వేరువేరు పనులు కాదని తెలిపారు. వైద్యులకు, సర్జన్లకు.. ‘మిమ్మల్ని మీరు నయం చేసుకోండి. మీరు(వైద్యులు) ఇతరులను నయం చేసే ముందు, మిమ్మల్ని మీరు ఎలా నయం చేసుకోవాలో నేర్చుకోవాలి’ అని చెబుతుంటామని గుర్తు చేశారు. మరి న్యాయమూర్తుల విషయంలో కూడా ఇదే వర్తిస్తుందని సీజేఐ స్పష్టం చేశారు. -
వాన్ని వదలొద్దు గీతాంజలి భర్త ఆవేదన
-
సలార్ హిట్ దెబ్బ...పవన్ కళ్యాణ్ ని ఆడుకుంటున్న నెటిజన్లు
-
ఉర్లగడ్డ ట్రోల్స్ పై మంత్రి అంబటి దిమ్మతిరిగే కౌంటర్
-
నోరు జారిన రాహుల్.. బీజేపీ సెటైర్లు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని కబీర్‌ధామ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నోరు జారారు. అదానీ కోసం పనిచేయాలని కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌కి సూచించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు కురిపించింది. అదాని వంటి పారిశ్రామిక వేత్తల కోసం పనిచేసింది కాంగ్రెస్ పార్టీనే అని చివరకు రాహుల్ గాంధీయే ఒప్పుకున్నారని బీజేపీ మండిపడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించిన కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ.. బీజేపీ ధనవంతులకు సేవ చేస్తోందని ఆరోపించారు. అదానీ గ్రూపును ప్రస్తావిస్తూ కేంద్రం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా పనిచేస్తోందని అన్నారు. అదే క్రమంలో అదానీ కోసం పనిచేయాలని భూపేష్ భగేల్‌కు కూడా సూచించారు. "బీజేపీ అదానీ ప్రయోజనాల కోసం 24X7 సేవ చేస్తోంది. బీజేపీతో పాటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి కూడా అదానీ వంటి వారి కోసం పనిచేస్తున్నారు. కానీ మేము రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారుల కోసం పని చేస్తున్నాము. ఇదే తేడా" అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ ప్రసంగం సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో సీఎం పదవిలో ఉన్న భూపేష్ బఘేల్ కూడా అక్కడే ఉన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు ఆయన ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. అటు.. రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ అందిపుచ్చుకుంది. ఛత్తీస్‌గఢ్ సీఎం అదానీ గ్రూప్ కోసం పనిచేస్తున్నట్లు రాహుల్ గాంధీ ఒప్పుకున్నారని బీజేపీ ఐటీ సెల్ నాయకుడు అమిత్ మాలవీయ అన్నారు. ఇదీ చదవండి: కేరళ పేలుళ్లు.. పోలీసుల ముందు లొంగిపోయిన నిందితుడు -
ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు.. వార్నింగ్ ఇచ్చిన అరియాన
యాంకర్‌గా కెరీయర్ ప్రారంభించి బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియానా గ్లోరీ అందరికీ పరిచయమే. తన ఫోటోలను ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ. ఒక్కోసారి తనపై ఎన్ని కామెంట్లు వచ్చినా వాటిని లెక్కచేయకుండా.. తనకు నచ్చింది ఓపెన్‌గా మాట్లాడటంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. మొదట ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన ఆమె బిగ్‌బాస్ రియాలిటీ షోతో మరింత పాపులర్ అయ్యింది. చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను అరియానా సొంతం చేసుకుంది. (ఇదీ చదవండి: స్టేజీపై బతుకమ్మ ఆడిన కాజల్, శ్రీలీల.. వీడియో వైరల్) బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లొచ్చాక పలు ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలో ప్రోగ్రామ్స్‌తో పాటు సెలబ్రిటీల ఇంటర్వూల పేరుతో అరియానా గ్లోరీ ప్రత్యేకమైన ఐడెంటిటీ సొంతం చేసుకుంది. కానీ ఆమె కొన్నిరోజులపాటు స్క్రీన్కు దూరంగా ఉండటం జరిగింది. దీంతో ఆమె కొంచెం బొద్దుగా తయారైంది. ఈ క్రమంలో ఆమె ఫోటో షేర్ చేసినా.. వీడియో షేర్ చేసినా ట్రోలర్స్ దారుణమైన కామెంట్లు చేయడం ప్రారంభించారు. మరికొందరైతే అరియానా పట్ల బాడీ షేమింగ్ కూడా చేశారు. అలాంటి వారికి ఆమె స్టైల్ల్లో సమాధానం ఇచ్చిపడేసింది. పనికి మాలిన వేస్ట్ ఫెల్లోస్ కోసం ఇది చెబుతున్నా.. నేను సన్నగా ఉంటే..? సన్నగా ఉన్నావ్ అన్నారు. సర్లే అని లావు అయితే.. ఏంటి ఇంత లావుగా ఉన్నావు. ఆంటీలా అయ్యావ్ అని అంటున్నారు. ఇలాంటి కామెంట్లు చేసే వాడు ఎలా ఉంటాడో ఒక ఫోటో పెడితే మేం కూడా చూస్తాం కదా..? నీకు నాతో ఏమైనా ఇబ్బంది ఉంటే అన్ ఫాలో కొట్టొచ్చు కదా..? నేను ఎలా ఉంటే నీకేంటి..? సన్నగా ఉంటే నీకేంటి..? లావుగా ఉంటే నీకేంటి..? నా జీవితంలో ముందుకు వెళ్లేందుకు కనీసం నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాను. నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి కామెంట్ చేయ్.. నేను ఎలా ఉంటే నీకేంటి..? కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. ఏదుటివారి మీద పడి ఎందుకు ఏడుస్తారు. పనీ పాట లేకపోతే ఏదైనా ఓ పని చేసుకోవచ్చు కదా అని ట్రోలర్స్‌పై అరియానా విరుచుకుపడింది. ప్రస్తుతం ఆమె పలు డ్యాన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by starmaa__shows (@starmaa__shows) -
'మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లండి'.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన అఖిల్!
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఈ ఏడాది ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి కాగా.. నలుగురు మహిళ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిర రోజ్ హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఉల్టా పల్టా అంటూ మొదలైన సీజన్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచింది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తుంటాయి. అంతే కాకుండా ఎలిమినేట్ అయివారితో పాటు.. హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ను కూడా ట్రోల్స్ చేస్తుంటారు. అయితే ఈసారి ఓ రైతుబిడ్డగా హౌస్‌లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన టాలెంట్‌ను చూపిస్తున్నాడు. అయితే మొదటి నుంచి పల్లవి ప్రశాంత్‌కు సపోర్ట్‌కు మాట్లాడుతున్న బిగ్‌బాస్ సీజన్-4 రన్నరప్ అఖిల్ సార్థక్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనపై ట్రోల్స్ చేస్తున్న వారందరికీ తనదైన శైలిలో ఇచ్చిపడేశాడు. మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లి మీ టాలెంట్‌ను చూపించాలంటూ ఫైరయ్యాడు. ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ నేను హౌస్‌లో ఉన్నప్పుడే చాలా చూశానని చెప్పుకొచ్చాడు. అయితే హౌస్‌లో పవరాస్త్ర దక్కించుకున్న పల్లవి ప్రశాంత్‌పై అఖిల్ సార్థక్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. వాళ్లందరికీ సరైన బుద్ధి చెప్పావంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తాజాగా మరోసారి పల్లవి ప్రశాంత్‌ను పొగుడుతూ మరో వీడియో రిలీజ్ చేశాడు. తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్‌ను ఉద్దేశించి అఖిల్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అఖిల్ మాట్లాడుతూ..' నాపై ట్రోల్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తున్నారు. నాపై నెగెటివ్ కామెంట్స్ చేసేవాళ్లకి స్పెషల్ థ్యాంక్స్. ఇవన్నీ నేను ఇప్పటికే. వీటిని అస్సలు పట్టించుకోను కూడా. ప్రశాంత్ రన్నర్ అయినా, విన్నర్‌గా నిలిచినా సంతోషిస్తా. దానికంటే నాకు సంతోషం ఏమి లేదు. సీజన్-4 ప్రోమోలు తీసుకొచ్చి కొంతమంది కంటెస్టెంట్స్ పీఆర్స్ స్టంట్స్ చేస్తున్నారు. కానీ కొత్తగా ఏదైనా ఆలోచించండి. డిఫరెంట్‌గా ట్రోలింగ్ చేస్తే బాగుంటుంది. నన్ను రెండుసార్లు రన్నర్ అంటున్నారు. అరే మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లి మీ టాలెంట్ చూపించండి. ప్రశాంత్ హౌస్‌లోకి వెళ్లి గేమ్ క్లియర్‌గా ఆడుతున్నాడు. మీ పబ్లిసిటీ మీరు చేసుకోండి. నాకెలాంటి ఇబ్బంది లేదు. అలాగే సీజన్-4 గుర్తు చేసినందుకు మీ అందరికీ మరోసారి థ్యాంక్స్' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం అఖిల్ సార్థక్‌కు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by 𝔸𝕜𝕙𝕚𝕝 𝕊𝕒𝕣𝕥𝕙𝕒𝕜 ℕ𝕒𝕚𝕕𝕦 (@akhilsarthak_official) -
భారత్-కెనడా వివాదం.. మీమ్స్‌తో నవ్వులు పూయిస్తున్నారు
ఇండియా-భారత్ మధ్య దౌత్యపరంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించడం వివాదానికి తెరలేపింది. అయితే.. ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. వచ్చే జీ20 సమ్మిట్‌లో ఇండియా, కెనడా దౌత్య వేత్తలు ఈ విధంగా కొట్టుకుంటారంటూ ఓ వీడియోను జతచేశారు. ఉత్తరప్రదేశ్‌లో భాగ్‌పత్‌లోని చాట్ సెల్లర్లు కొట్టుకున్న వీడియోను ఇండియా, కెనడా దౌత్య వేత్తలతో ఫన్నీగా పోల్చారు. India and Canada diplomats in the next G20 summit pic.twitter.com/q9wclQuSbY — Sagar (@sagarcasm) September 21, 2023 తాజా పరిణామాలతో ఇరుదేశాలు ‘‘నువ్వా-నేనా’’ అన్నట్లు ఆంక్షలు విధించుకునే స్థాయికి చేరాయి. తమ దేశాల్లోని ఇరుపక్షాల దౌత్య వేత్తలను బహిష్కరించుకున్నాయి. కెనడా భారత దౌత్య అధికారులను బహిష్కరించిన కొద్ది గంటల్లోనే ఇండియా కూడా కెనడా దౌత్య అధికారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. కెనడా, యూఎస్, యూకేల్లో పెరుగుతున్న ఖలిస్థానీల మద్దుతుకు మన దేశ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మరో మీమ్‌ను కూడా నెటిజన్లు ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు. India - Canada situation explained pic.twitter.com/oqCgxNrjxW — Pakchikpak Raja Babu (@HaramiParindey) September 21, 2023 ఇరు దేశాలు అంతటితో ఆగకుండా తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలను జారీ చేశాయి. ఇండియా ఒకడుగు ముందుకేసి కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. కెనడాకు పంజాబ్ నుంచి ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. వీసాలు రద్దు చేసిన నేపథ్యంలో పంజాబ్ నుంచి వెళ్లేవారి ఇలా ఉంటుందంటూ ఫన్నీగా ఓ వీడియో ట్రోల్ అయింది. Indian Cancels visa Services for Canada right now Whole Punjab now 👇 #canadaindia #IndiaCanada #Canadian pic.twitter.com/DdRCqRvtX2 — Harsh (@Harshjindal22_) September 21, 2023 "Canadian High Commissioner"😭🤣🤣🤣#JustinTrudeau #Khalistani #Canada #India #CanadianPappu #CanadaBanegaKhalistan #canadaindia #CanadaNews #CanadaIndiaRelations #CanadaNews #indianGovernment #KhalistanisAreNotSikhs #KhalistaniTerrorist pic.twitter.com/x7CEe7NSQA — Arun Gangwar (@AG_Journalist) September 19, 2023 కెనడాతో ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఆదేశానికి వెళ్లాలనుకునే భారతీయులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాదానికి సంబంధించిన విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కెనడాలో ఉన్న భారతీయులు, ఆ దేశానికి ప్రయాణించేవారు జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. #canadaindia #KhalistaniTerrorist India has suspended visa services for Canadian nationals. This is what happening : de pic.twitter.com/VtXC7bBenQ — M A 𝕏 A L U 🗡️ (@YourMasalu) September 21, 2023 ఇదీ చదవండి: కెనడా-భారత్ ప్రతిష్టంభనకు అగ్గి రాజుకుంది అక్కడే..? -
ఆశిష్ విద్యార్థితో పెళ్లిపై మొదటిసారి స్పందించిన రుపాలీ
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో గువాహటికి చెందిన ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ రుపాలీ బరూవాను వివాహమాడిన విషయం తెలిసిందే. సుమారు రెండు నెలల క్రితం ఇరు కుటుంబాలు, అతి కొద్దిమంది అతిథుల సమక్షంలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఆయన రెండో పెళ్లిపై ఆశిష్ విద్యార్థి మొదటి భార్య పిలు విద్యార్థి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది. సుమారు 22 ఏళ్ల పాటు కలిసి జీవించిన వీరిద్దరూ 2021లో విడాకులు తీసుకున్నారు. (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకుని ఇప్పటికి రెండు నెలలు దాటినా ఆయనపై ట్రోల్స్ ఆగడం లేదు.. ఇప్పుటికే వాటిని ఆయన సున్నితంగా తిరష్కరించారు కూడా.. తాజాగా మళ్లీ ఆయనతో పాటు రెండో భార్య రుపాలీ బరూవా కూడా స్పందించారు. తమపై వచ్చిన అసభ్య వ్యాఖ్యలను చదివినప్పుడు వారి మనస్సులో ఏమి ఉందని ప్రశ్నించగా రుపాలీ ఇలా స్పందించారు. 'నన్ను తిట్టే వాళ్లందరూ నాకు తెలియని వ్యక్తులే కాబట్టి నేను దానిని పట్టించుకోను తిరిగి వారిని కూడా తిట్టుకోలేదు. మా జీవితంలో జరిగిన విషయాల గురించి వారికి స్పష్టంగా తెలియదు.. అందరిలాగే వారు కూడా ఈ విషయాన్ని చూశారు. ఎందుకంటే వారికి నా గురించి తెలియదు. వాళ్లందరూ నన్ను తిడుతున్నారని వారి వద్దకు వెళ్లి క్లారిటీ ఇవ్వలేను. నెటిజన్లలో ఒక వర్గం వారు తిడితే మరో వర్గం వారు అర్థం చేసుకుంటారు. అలా ఎవరు ఎలాంటి మాటలు అనుకున్నా పర్వాలేదు. నేను ఆ కామెంట్లను అంతగా చదవనందున ఇది నన్ను అంతగా ప్రభావితం చేయలేదు. నా సన్నిహితులు నాకు మద్దతు ఇస్తున్నారు, నాకు వేరే వారి సపోర్ట్ అవసరం లేదు.' అని ఆమె చెప్పింది. (ఇదీ చదవండి: సూర్య కోసం సెన్సేషనల్ హీరోయిన్, విలన్ ఎంట్రీ) ఇంతలో, ఆశిష్ విద్యార్థి కలుగజేసుకుని ఇలా చెప్పారు. ప్రేమ, ఆప్యాయతతో కూడిన ఈ రెండు విషయాలపై మరోకరికి నిరూపించాల్సిన అవసరం లేదు. మేమిద్దరం ఏ విషయాన్ని నిరూపించుకోవడానికి ఇక్కడ లేము. మా మధ్య కలత లేదు, కోపం లేదు. మమ్మల్ని తిడితే మీకు సంతోషమా..? అయితే అలాగే చేయండి. నా రెండో పెళ్లిపై ముసలోడు.. సభ్యత, సంస్కారం లేని వాడు అంటూ చాలా అసభ్యకరమైన పదాలను కూడా వాడారు. జీవితానా చివరి దశలో ఉన్నప్పుడు తోడు కావాలనుకోవడంలో తప్పు ఏంటి.. ? 22 ఏళ్లుగా నా మొదటి భార్యతో జీవితాన్ని పంచుకున్నాను. తర్వాత ఇద్దరి మధ్య వచ్చిన గొడవలతో సంసారం చితికిపోయింది. అప్పుడు నేను ఒంటరివాడినయ్యాను. అలాంటి సమయంలో రుపాలీ నా జీవితంలోకి వచ్చింది.' అని ఆయన అన్నారు. జీవితంలో ఇద్దరం ఒంటరిగా ఉన్న సమయంలో ఒక తోడు దొరకడం , కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడం చాలా పెద్ద విషయం అని రుపాలి ఇలా తెలిపారు. 'విశ్వం ఈ అవకాశం ఇవ్వడం చాలా పెద్ద విషయం. దీని ముందు నా జీవితంలో మరేదైనా చిన్నదే. నేను ఏమి కోల్పోయానో నాకు మాత్రమే తెలుసు. ఈ వయసులో తోడు దొరకడం ఒక వరం. ఆ ఆశీర్వాదం చాలా పెద్దది. ఈ విషయంపై ప్రతికూలతలు వచ్చినా అవి తాత్కాలికమే.' అని ఆమె చెప్పింది. కోల్‌కతాలోని ఓ ప్రముఖ ఫ్యాషన్ స్టోర్‌లో రుపాలీకి భాగస్వామ్యం ఉంది. తన తండ్రి నార్త్ ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్త అని సమాచారం. ఆశిష్ విద్యార్థి కూడా విశాల్ భరద్వాజ్ స్పై-థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Ashish Vidyarthi Avid Miner (@ashishvidyarthi1) -
చంద్రముఖి 2 ట్రైలర్ పై దారుణమైన ట్రోల్స్
-
మాపై ట్రోల్స్ చేస్తుంది ఆ 'స్నేక్' బ్యాచ్‌నే: మంచు విష్ణు
సినిమా రంగానికి చెందిన కొందరిని టార్గెట్ చేస్తూ పలువురు ట్రోల్స్ చేస్తుంటారు. అవి ఆరోగ్యకరమైనవి అయితే పర్వాలేదు.. కానీ ఒక్కోసారి అవి శ్రుతిమించి వారిని బాధకు గురిచేస్తాయి కూడా.. ఈ ట్రోల్స్ వల్ల సినిమా రంగంలోని చాలామంది ప్రముఖులు ఇబ్బందులకు గురైనవారే ఉన్నారు. 'మా' ఎన్నికల నేపథ్యంలో మంచు మోహన్‌బాబు కుటుంబంపై కొందరు పనికట్టుకుని ట్రోల్స్ చేస్తున్నారని వారి అభిమానులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. అప్పటికి అవి ఏ మాత్రం తగ్గకపోవడంతో మంచు విష్ణు కలుగచేసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగ ఈ విషయంపై ఆయన స్పందించారు. (ఇదీ చదవండి: మామయ్య కోసం పొలిటికల్ వేడుకకు వెళ్తున్న అల్లు అర్జున్) తమపై ట్రోలింగ్ చేయిస్తున్నది.. చేస్తున్నది ఎవరో ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ తెలుసని ఆయన అన్నారు. అదొక 'స్నేక్' బ్యాచ్ చేస్తున్న పనే అని విష్ణు అన్నారు. కానీ అలాంటి ట్రోలింగ్‌ను పెద్దగా పట్టించుకోనని ఆయన తెలిపారు. ప్రస్తుత రోజుల్లో అందరికీ ట్రోల్స్ నుంచి ఇబ్బందులు ఎదరవుతున్నాయని ఆయన గుర్తు చేశారు. కానీ అవి కొన్నిసార్లు మితిమీరిపోతున్నాయని అలాంటి సమయంలో మాత్రం సహించేదిలేదని విష్ణు పేర్కొన్నారు. కొంతమంది తమ మీద వేసే సెటైర్లు చాలా బాగుంటాయి.. వాటిని చూసినప్పుడు తాము కూడా ఎంజాయ్ చేస్తామని ఆయన అన్నారు. (ఇదీ చదవండి: చిరంజీవిని అలా అంటుంటే చాలా బాధగా ఉంది: ప్రముఖ హీరో) కొంతమంది పనికట్టుకుని డబ్బులిచ్చిమరీ ట్రోల్ చేయిస్తున్నారు. అది మాత్రం చాలా తప్పని విష్ణు ఇలా తెలిపారు. 'మా ఎలక్షన్స్ ముందు వరకూ నాపై ట్రోలింగ్ ఉండేది కాదు.. ఎప్పుడైతే ఎలక్షన్స్ ప్రారంభం అయ్యాయో అప్పుడే నాపై ట్రోల్ చేయడం ప్రారంభించారు. అది ఎవరు చేయించారో అందరికీ తెలుసు. ఆ స్నేక్ బ్యాచ్ గురించి ఇప్పుడెందుకులే’ అని ఆ ఇంటర్వ్యూలో మంచు విష్ణు అన్నారు. కానీ ఆ స్నేక్ బ్యాచ్ ఎవరు..? దాని వెనుక ఎవరున్నారనేది ఆయన తెలియచేయలేదు. 'కన్నప్ప'కు శ్రీకారం చుట్టిన మంచు విష్ణు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తాజాగ వెల్లడించారు. చాలా రోజులుగా ఈ సినిమా కథ మీద పని చేస్తున్న విష్ణు.. శ్రీ కాళహస్తిలో పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో చిత్ర షూటింగ్ ప్రారంభిస్తామని వెల్లడించారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాస్థాయిలో ఈ సినిమాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు హీరో విష్ణు. ఈ చిత్రానికి మోహన్ బాబు నిర్మాతగా వ్యవహిస్తున్నారు. ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు. మహా భారతం సిరీస్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ఆదిపురుష్ భామ కృతి సనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్గా కనిపించనుంది. -
శివ జ్యోతిని అక్కా.. అంటూనే ఇలాంటి కామెంట్లా?
యాంకర్ శివజ్యోతి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా గుర్తింపు సంపాదించుకున్న శివజ్యోతి బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది. బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని టాప్ 6 కంటెస్టెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. షో తర్వాత వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా మారిన శివజ్యోతి తన యూట్యూబ్ చానల్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. (ఇదీ చదవండి: బేబీ సినిమాకు వీళ్ల ముగ్గురి రెమ్యునరేషన్ ఇంత తక్కువనా..?) అయితే తాజాగా బోనాల పండుగ సందర్భంగా ఆమె ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేసింది. అందులో తన కోసం భర్త గంగూలీ కొన్న బంగారు నగలను చూపించింది. దీంతో జ్యోతి భర్త గంగూలీపై నెటిజన్లు దారుణమైన కామెంట్స్ చేశారు. అక్క మీ భర్త ఏం జాబ్ చేస్తారని ఒకరు కామెంట్ చేయగా.. మరోకరు ఏ జాబ్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాడని కామెంట్ చేశారు. అంతటితో ఆగని కొందరు ఇంతకూ మీరెప్పుడు పిల్లల్ని కంటారని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి వారి మాటలను పట్టించుకోకూడదని శివజ్యోతికి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన జ్యోతి.. ప్రేమించి గంగూలీని పెళ్లి చేసుకుంది. వీరిద్దరి ప్రేమ పెళ్లి ఇరు కుటుంబాలకు నచ్చకపోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశామని ఓ షోలో శివ జ్యోతి చెప్పింది. తన జీవితం ప్రారంభంలో గంగూలీ జాబ్ చేసేవాడని కూడా చెప్పింది. కానీ ఒక న్యూస్ యాంకర్‌గా జర్నీ ప్రారంభించిన శివజ్యోతికి బిగ్‌బాస్ తర్వాత పలు టీవీ షోలలో నటించే అవకాశాలు వచ్చాయి. ఆపై వారు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. తనకు ఇంతగా గుర్తింపు రావడానికి కారణం తన భర్తేనని, మొదట్లో ఈ కెరీర్‌ను ఎంచుకున్నప్పుడు భర్త గంగూలీ ప్రోత్సహం ఎక్కువ ఉందని గతంలో జ్యోతి చెప్పింది. బిగ్‌బాస్ షో తర్వాత వీరిద్దరి జంట బాగా పాపులర్ అయింది. తర్వాత ఇద్దరూ కలిసే పలు షోలు కూడా చేశారు. దీంతో అతను జాబ్ మానేయాల్సి వచ్చింది. ప్రస్తుతం జ్యోతితో పాటు అటూ టీవీ షోలు, తన సొంత యూట్యూబ్ ఛానల్ వీడియోలకు సంబంధించి ఎడిటింగ్ పనులను తనే చూసుకుంటున్నట్లు కూడా తెలిసిందే. తన ప్రెగ్నెన్సీ గురించి గతంలో జ్యోతి ఇలా చెప్పింది 'మాకు పెళ్లయి చాలా సంవత్సరాలు అయ్యింది. మా పిల్లల కోసం మా ఫ్యామిలీ అంతా ఎంతో ఎదురుచూస్తుంది. నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఇది ఎమోషనల్‌గా ఎంత బాధపెడుతుందో మీకు చెప్పలేను. ప్రెగ్నెన్సీ అన్నది నా జీవితంలో చాలా పెద్ద విషయం. నాపై పర్సనల్‌గా, ప్రొఫెషనల్‌గా తప్పుగా ప్రచారం చేయకండి. అది నాపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది.' అని ఆమె చెప్పింది. బిగ్‌బాస్‌లో చిన్నచిన్న విషయాలకే ఎమోషనల్ అయ్యే శివజ్యోతికి తనకూ తల్లి కావాలనే ఎమోషన్ ఉండదా. అందులో వారి తప్పేముంది..? రామ్ చరణ్-ఉపాసన దంపతులకు 11 ఏళ్ల తర్వాత కానీ సంతానం కలగలేదా అంటూ తనకు సపోర్టుగా పలువురు సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.