బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఈ ఏడాది ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి కాగా.. నలుగురు మహిళ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిర రోజ్ హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఉల్టా పల్టా అంటూ మొదలైన సీజన్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచింది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో జరుగుతున్న పరిణామాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తుంటాయి. అంతే కాకుండా ఎలిమినేట్ అయివారితో పాటు.. హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ను కూడా ట్రోల్స్ చేస్తుంటారు. అయితే ఈసారి ఓ రైతుబిడ్డగా హౌస్‌లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన టాలెంట్‌ను చూపిస్తున్నాడు.
అయితే మొదటి నుంచి పల్లవి ప్రశాంత్‌కు సపోర్ట్‌కు మాట్లాడుతున్న బిగ్‌బాస్ సీజన్-4 రన్నరప్ అఖిల్ సార్థక్ మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తనపై ట్రోల్స్ చేస్తున్న వారందరికీ తనదైన శైలిలో ఇచ్చిపడేశాడు. మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లి మీ టాలెంట్‌ను చూపించాలంటూ ఫైరయ్యాడు. ఇలాంటి చీప్ ట్రిక్స్ అన్నీ నేను హౌస్‌లో ఉన్నప్పుడే చాలా చూశానని చెప్పుకొచ్చాడు. అయితే హౌస్‌లో పవరాస్త్ర దక్కించుకున్న పల్లవి ప్రశాంత్‌పై అఖిల్ సార్థక్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. వాళ్లందరికీ సరైన బుద్ధి చెప్పావంటూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తాజాగా మరోసారి పల్లవి ప్రశాంత్‌ను పొగుడుతూ మరో వీడియో రిలీజ్ చేశాడు. తనపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్‌ను ఉద్దేశించి అఖిల్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అఖిల్ మాట్లాడుతూ..' నాపై ట్రోల్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నాకు ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తున్నారు. నాపై నెగెటివ్ కామెంట్స్ చేసేవాళ్లకి స్పెషల్ థ్యాంక్స్. ఇవన్నీ నేను ఇప్పటికే. వీటిని అస్సలు పట్టించుకోను కూడా. ప్రశాంత్ రన్నర్ అయినా, విన్నర్‌గా నిలిచినా సంతోషిస్తా. దానికంటే నాకు సంతోషం ఏమి లేదు. సీజన్-4 ప్రోమోలు తీసుకొచ్చి కొంతమంది కంటెస్టెంట్స్ పీఆర్స్ స్టంట్స్ చేస్తున్నారు. కానీ కొత్తగా ఏదైనా ఆలోచించండి. డిఫరెంట్‌గా ట్రోలింగ్ చేస్తే బాగుంటుంది. నన్ను రెండుసార్లు రన్నర్ అంటున్నారు. అరే మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లి మీ టాలెంట్ చూపించండి. ప్రశాంత్ హౌస్‌లోకి వెళ్లి గేమ్ క్లియర్‌గా ఆడుతున్నాడు. మీ పబ్లిసిటీ మీరు చేసుకోండి. నాకెలాంటి ఇబ్బంది లేదు. అలాగే సీజన్-4 గుర్తు చేసినందుకు మీ అందరికీ మరోసారి థ్యాంక్స్' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం అఖిల్ సార్థక్‌కు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment