Bigg Boss 7
-
పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్
గతేడాది బిగ్‌బాస్ 7 తమిళ సీజన్లో పాల్గొన్న ప్రదీప్ ఆంటోని వివాదానికి కారణమయ్యాడు. తనతో పాటు హౌసులోకి వచ్చిన లేడీ కంటెస్టెంట్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో రెడ్ కార్డ్ జారీ చేసి, షో నుంచి అర్థాంతరంగా బయటకు పంపేశారు. ఈ సీజన్లో తిరిగి పాల్గొంటాడని అన్నారు. కానీ అది రూమర్ అని తేలిపోయింది. ఇప్పుడు ఇతడు పెళ్లి చేసుకున్నాడు.(ఇదీ చదవండి:'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా)గత కొన్నాళ్లుగా పూజ అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న ప్రదీప్ ఆంటోని.. జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇప్పుడు గురువారం (నవంబర్ 7) క్రిస్టియన్ పద్ధతిలో పూజని పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని తోటి బిగ్‌బాస్ కంటెస్టెంట్ సురేశ్ చక్రవర్తి పోస్ట్ చేశాడు. కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పుకొచ్చాడు. డాడా, అరువి, వాళ్ తదితర సినిమాలు చేసిన ప్రదీప్ ఆంటోని.. ఇప్పుడిప్పుడే నటుడిగా నిలదొక్కుకుంటున్నాడు.ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిగ్ బాస్ 8వ సీజన్ నడుస్తోంది. తెలుగులో ఎప్పటిలానే నాగార్జున హోస్టింగ్ చేస్తుండగా.. తమిళంలో మాత్రం ఈసారి కమల్ హాసన్ తప్పుకొన్నాడు. దీంతో విజయ్ సేతుపతి కొత్త హోస్ట్‌గా వచ్చాడు. దాదాపు 70 రోజులు అయిపోయినా సరే తెలుగు సీజన్ అంతంత మాత్రంగానే సాగుతోంది. తమిళంలో పర్లేదనిపించేలా నడుస్తోంది.(ఇదీ చదవండి: హైదరాబాద్‌లోని హనుమాన్ గుడిలో జాన్వీ ప్రత్యేక పూజలు) -
టీవీ షోలో కుమారి ఆంటీ.. 'బిగ్‌బాస్ 7' బ్యాచ్‌తో కలిసి స్కిట్!
'మీది మొత్తం థౌజండ్ అయింది రెండు లివర్లు ఎక్స్ ట్రా'.. ఈ డైలాగ్ చెప్పగానే ఈపాటికే మేటర్ అర్థమైపోయింటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల మీడియాలో తెగ పాపులర్ అయిపోతున్న కుమారి ఆంటీదే ఈ డైలాగ్. హైదరాబాద్‌లోని రోడ్డు సైడ్ మధ్యాహ్న భోజనం అమ్మే ఈవిడ.. ఫుడ్ వ్లాగర్స్ వల్ల చిన్న సైజు సెలబ్రిటీ అయిపోయింది. ఆల్రెడీ ఈమెని పలువురు ఇంటర్వ్యూ చేయగా.. ఇప్పుడు ఏకంగా ఓ టీవీ షోలో కూడా కనిపించింది. (ఇదీ చదవండి: మాజీ భర్త గురించి ప్రశ్న.. క్లారిటీ ఇచ్చేసిన స్టార్ హీరోయిన్) గత కొన్నాళ్ల నుంచి హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నాన్ వెజ్ మీల్స్ విక్రయించే ఈమె.. అనుకోకుండా ఫేమస్ అయిపోయింది. దీంతో ఈమె షాప్ దగ్గరకు జనాలు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ అవుతుందని చెప్పి షాప్ మూసివేయడం.. ఈ గొడవపై ఏకంగా తెలంగాణ సీఎంఓ ఆఫీస్ నుంచి స్పందించడం. ఇప్పుడు యధావిధిగా మళ్లీ ఈమె బిజినెస్ రన్ అవుతుండటం.. ఇలా గత కొన్నాళ్ల నుంచి కుమారి ఆంటీ వార్తల్లో నిలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఈమె ఫేమస్ అయినప్పుడే ఇంకెందుకు లేటు.. టీవీ షోల్లో కూడా కనిపిస్తుందని ఊహించారు. ఇప్పుడు అదే జరిగింది. 'బిగ్‌బాస్ 7' కంటెస్టెంట్స్ అందరూ కలిసి తాజాగా ఓ షోలో పాల్గొన్నారు. ఇందులో కుమారి ఆంటీ కూడా పాల్గొంది. స్టేజీపైనే అందరికీ తన స్టైల్ ఫుడ్ తినిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈమెతో ఓ స్కిట్ కూడా చేయించారని టాక్. (ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి వచ్చేస్తున్న 'ద కేరళ స్టోరీ'.. రిలీజ్ డేట్ ఫిక్స్) #BBUtsavam షో లో #KumariAunty ! అందరికీ NonVeg భోజనం కూడా... pic.twitter.com/SfmCzFSjOd — Rajesh Manne (@rajeshmanne1) February 6, 2024 -
సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్‌బాస్' శోభాశెట్టి
బిగ్‌బాస్ 7 ఫేమ్ శోభాశెట్టి ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. సరిగ్గా ఓ రెండు నెలల క్రితం ఇదే షోలో ప్రియుడిని పరిచయం చేసింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంది. అలానే త్వరలో పెళ్లి కూడా చేసుకోనుంది. ఇంతకీ ఈ కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ జరిగింది? శోభాశెట్టి దీని గురించి ఏం చెప్పిందనేది ఇప్పుడు చూద్దాం. కన్నడ బ్యూటీ శోభాశెట్టి.. 'కార్తీకదీపం' సీరియల్లో మోనిత అనే విలన్ పాత్రతో బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు ప్రతి తెలుగింటిలోనూ ఈమెకు అభిమానులు ఉండొచ్చు. నటిగా అలా అదరగొట్టేసింది. ఇక గతేడాది జరిగిన బిగ్‌బాస్ 7వ సీజన్లో పాల్గొని దాదాపు చివరివరకు వచ్చేసింది. శివాజీ అండ్ గ్యాంగ్‌కి తన మాటలతో చుక్కలు చూపించింది. చాలామంది ఈమెని విమర్శించారు కానీ శివాజీ లాంటి వాళ్లతో పోలిస్తే శోభా చాలా బాగా ఆడిందని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 విన్నర్ ప్రశాంత్ అరెస్ట్‌పై స్కిట్.. ముఖం మాడ్చుకున్న శివాజీ!) ఇకపోతే ఇదే షోలో తన ప్రియుడు యశ్వంత్ రెడ్డిని పరిచయం చేసింది. శోభా-యశ్వంత్.. ఇదే 'కార్తీకదీపం' సీరియల్లో కలిసి నటించారు. షార్ట్ ఫిల్మ్స్‌లోనూ యాక్ట్ చేశారు. అలా పనిచేస్తూ ప్రేమలో పడ్డారు. అయితే గతేడాది వీళ్ల నిశ్చితార్థం జరగాల్సింది కానీ ఎందుకో క్యాన్సిల్ అయిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా శోభాశెట్టిని ఇప్పుడు బయటపెట్టింది. తాజాగా బెంగళూరులోని శోభాశెట్టి ఇంట్లో నిశ్చితార్థం జరిగింది. యశ్వంత్-శోభా దండలు మార్చుకున్నాడు. అయితే ఇది నిశ్చితార్థ వేడుక అని వీడియోలో శోభాశెట్టి ఎక్కడ చెప్పలేదు. తర్వాత వీడియోలో దీని గురించి చెబుతానని దాటవేసింది. త్వరలో పెళ్లి డేట్ కూడా చెప్పేస్తుందేమో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) -
నా తల్లి ముందే అలాంటి బూతులు వినాల్సి వచ్చింది: అమర్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పలు వివాదాలతో ముగిసింది. హౌస్‌లో అమర్, శోభ,ప్రియాంక (SPY) ఒక బ్యాచ్‌లో ఉంటే.. శివాజీ, ప్రశాంత్, యావర్ (SPA) బ్యాచ్‌లో ఉన్నారు. ఈ రెండు బ్యాచ్‌ల మధ్య పెద్ద గొడవలే జరిగాయి. ఫైనల్‌గా ప్రశాంత్ విన్నర్ అయితే.. అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. కానీ చాలా మంది ప్రేక్షకుల అభిమానాన్ని ఆయన అమర్ పొందాడు. అతను హీరో రవితేజ సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అనుకున్నాడు. బిగ్ బాస్ వల్ల ఆ అవకాశం దక్కింది అదే నాకు పెద్ద విజయం అని అమర్ పేర్కొన్నాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అమర్ కారుపై దాడి జరుగుతున్నప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో ఒక ఇంటర్వ్యూలో అమర్ ఇలా తెలిపాడు. 'హౌస్ నుంచి బయటకు రాగానే మా వాళ్లు అందరూ నన్ను దాక్కో అన్నారు... బయట ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను ఎందుకు దాక్కోవాలి..? నేను ఏం తప్పు చేశాను అని కారు ఎక్కి స్టార్ట్ అయ్యాం. కారు బయటకు రాగానే చాలామంది నా కారు చూట్టూ తిరుగుతూ ఫోన్ లైట్ ఆన్ చేశారు. నేను కనిపించగానే ఒక్కసారిగా బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. రాళ్లతో కారు అద్దాలు పగలకొట్టారు.. అమ్మ పక్కన ఉండగానే నోటికి ఏదొస్తే అది అనేశారు. తల్లి పక్కన ఉన్నప్పుడు అలాంటి మాటలు ఏ కుమారుడు వినలేడు.. వారందరి కోపం నామీద కదా అని కారు దిగే ప్రయత్నం చేస్తే అమ్మ ఆపింది. నాలుగు దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ ఆ తిట్లు భరించలేకపోయాను. కొందరైతే నా భార్య తేజును తీసుకెళ్తాం అంటూ బూతులు మాట్లాడారు. ఇవే మాటలు మిమ్మల్ని ఎవరైనా అంటే తట్టుకోగలరా..? ఓర్చోకోగలరా..? వారందరి మీదా నేనూ రియాక్ట్ కాగలను, కేసులు పెట్టగలను కానీ వారికీ కుటుంబాలు ఉంటాయని ఆలోచించి వద్దనుకున్నాను. నేను మీకు ఏం పాపం చేశాను..? అదొక గేమ్ మాత్రమే.. హౌస్‌లో కొందరు నన్ను పదేపదే తిట్టినా పెద్దవారు కదా అని ఓర్చుకున్నాను.. వారి వద్ద నేను నిజాయితీగానే మాట్లాడాను.. బ్యాక్ బిచింగ్ చేయలేదు. అని అమర్ తెలిపాడు. అందరిలా తను కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చానని అమర్ పేర్కొన్నాడు. తన నాన్నగారు ఆర్టీసీ ఉద్యోగి అని.. అందులో ఒక మెకానిక్‌గా పనిచేస్తాడని అమర్ తెలిపాడు. సినిమా అంటే అభిమానంతో ఈ పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. తన అమ్మగారు అనంతపురం జిల్లాలో బీజేపీ మహిళా విభాగం 'మహిళా మోర్చా' లో కార్యకర్తగా పనిచేస్తున్నారని ఆయన చెప్పాడు. -
పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడంటే.. బిగ్ బాస్ 'అశ్విని' కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్-7లో వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన అశ్విని శ్రీ మంచి పాపులారిటీని తెచ్చుకుంది. 5వ వారంలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్‌లో టాస్క్‌ల పరంగా పెద్దగా మెప్పించకపోయిన తన అందాలతో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. హౌస్‌లో భోలే షావళితో మంచి పెయిర్‌గా తన ఆటను కొనసాగించిన ఈ బ్యూటీ 12వ వారంలో ఎలిమినేట్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విని హీరో పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తాను గబ్బర్ సింగ్‌లో నటించిన సమయంలో పవన్‌తో తనుకున్న పరిచియాన్ని తెలిపింది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఫ్రెండ్‌గా నటించిన అశ్విని మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ OG సినిమా హిట్ కావాలని ఆమె కోరుకుంది. పవన్ కల్యాణ్ ఎప్పుడూ నా వాడే.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పింది. పవన్ కల్యాణ్‌ను మళ్లీ కలిసే అవకాశం వస్తే మీ రియాక్షన్ ఏంటని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది. ' పవన్‌తో దాదాపు 3 నెలలు జర్నీ చేశాను. షూటింగ్ సమయంలో పక్కన కూర్చొపెట్టుకుని పవన్ సార్ మాట్లాడేవారు. సెట్స్‌లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ తింటున్న డ్రై ఫ్రూట్స్ కూడా తినమ్మా అంటూ నాకు ఇచ్చేవారు. అశ్విని కమాన్ అని ఎంకరేజ్ చేసేవారు. ఆయనకి ఎప్పుడైనా బోర్ కొడితే నన్నే పిలిచేవారు.. ఆపై మాతో పాటలు, డ్యాన్స్ చేపిస్తూ సరదాగా ఉంటారు. అందుకే పవన్ అంటే ఇష్టం. ఆయన నేను క్యారివాన్‌లో ఉండేవాళ్లం. షూటింగ్‌కి రోజులో ఒక్కోసారి మాత్రమే పిలిచేవారు. మిగిలిన టైం అంతా క్యారివాన్లోనే ఉండేదాన్ని. ఆయనపై ఉన్న ఇష్టం మాటల్లో చెప్పలేను. సంథింగ్ ఆయనలో ఏదో ఉంటుంది. గబ్బర్ సింగ్ టైంలో సార్‌తో షూటింగ్ చేసి ఇంటికెళ్లి పడుకున్న తర్వాత ఆయన నాకు కలలోకి వచ్చేవారు. ఆయనతో షూటింగ్ చేస్తున్నట్టుగానే డ్రీమ్స్ వచ్చేవి. ఆయనతో ఎక్కడికో వెళ్లినట్టుగా పిచ్చి పిచ్చి కలలు వచ్చేవి. సార్ నన్ను మర్చిపోయి ఉంటారు కానీ.. నేను ఎప్పటికీ మర్చిపోలేని అనూభూతులు ఆయనతో ఉన్నాయి.'అని ఆమె చెప్పింది. పవన్‌పై అశ్విని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో గబ్బర్ సింగ్‌తో పాటు రాజా ది గ్రేట్ వంటి చిత్రాల్లో నటించినా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు.. మళ్లీ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
నన్ను మోసం చేశారు
-
బిగ్ బాస్ కోసం రూ. 2.50 లక్షలు ఇస్తే మోసం చేశారు: యాంకర్
బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ముగిసిపోయింది. కానీ ఉల్టాపుల్టా పేరుతో వచ్చిన ఈ సీజన్ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించిందో తెలియదు కానీ వివాదాలు మాత్రం భారీగానే ఉన్నాయి. బిగ్ బాస్ పేరుతో మోసం చేశారంటూ టాలీవుడ్ నటి, యాంకర్ స్వప్న చౌదరి ఒక వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 'నమస్తే సేట్ జీ' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో కి అడుగుపెట్టి అందరి నోట మంచి నటిగా పేరు తెచ్చుకుంది ఖమ్మం జిల్లాకి చెందిన అమ్మినేని స్వప్న చౌదరి. యాంకర్‌గా, ఈవెంట్ ఆర్గనైజర్‌గా, అటూ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ తెలుగమ్మాయి బిగ్ బాస్‌కు వెళ్లాలని చాలారోజుల నుంచి కోరిక ఉంది. ఇదే విషయాన్ని గతంలో కూడా చెప్పుకొచ్చింది. దీనినే కొందరు అదునుగా చూసుకొని ఆమె నుంచి రూ. 2.50 లక్షలు తీసుకుని మోసం చేశారు. ఇదే విషయాన్ని ఆమె వీడియో ద్వారా తెలిపింది. 'నాకు బిగ్ బాస్‌కి వెళ్లడం అంటే చాలా ఇష్టం.. ఎంతలా అంటే నేను నిద్రపోతున్న సమయంలో కూడా బిగ్ బాస్‌లో ఉన్నట్లు ఊహించుకుంటాను. బిగ్ బాస్ సీజన్ -1 నుంచి అన్నీ సీజన్లు ఎంతో ఇష్టంగా చూశాను. బిగ్ బాస్ సీజన్-7 సమయంలో నన్ను కంటెస్టెంట్‌గా పంపిస్తానని చెప్పి తమ్మలి రాజు అనే వ్యక్తి నా దగ్గర రూ. 2.50 లక్షలు తీసుకున్నాడు. ఈ డబ్బుతో ప్రతి శనివారం వచ్చే ఎపిసోడ్ సమయంలో నాకు కాస్ట్యూమ్స్ పంపిస్తానన్నాడు. అతని మాటలు నమ్మి నేను గతేడాది జూన్‌లో డబ్బు ఇచ్చాను. ఆ డబ్బే కాకుండా ఫోటో షూట్ కోసం రూ. 25వేలు తీసుకున్నాడు. చివరి క్షణం వరకు పంపిస్తానని చెప్పి..చేతులెత్తేశాడు. ఆ సమయంలో నాకొక అగ్రిమెంట్ రాసిచ్చాడు. బిగ్ బాస్‌కు పంపించలేకపోతే డిసెంబర్ నెలలో డబ్బు తిరిగిచ్చేస్తానని చెప్పాడు. కాల్ చేస్తే సరిగ్గా రెస్పాండ్ కాలేదు.. జనవరిలో తప్పకుండా ఇస్తానన్నాడు.. తీరా ఇప్పుడు కాల్ చేస్తే నీకు నచ్చింది చేసుకో.. కావాలంటే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసుకో అని వార్నింగ్ ఇస్తున్నాడు. నేను ఎంతో కష్టపడి ఆ డబ్బు సంపాదించుకున్నాను. బిగ్ బాస్‌లోకి వెళ్దామనే నా ఆశను తుంచేశాడు. ఇలాంటి వాళ్లను నమ్మి టీమ్‌గా పెట్టుకోకండి. వచ్చే సీజన్లో అయిన నాకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. అని స్వప్న తెలిపింది. View this post on Instagram A post shared by 𝐀𝐧𝐜𝐡𝐨𝐫 𝐒𝐰𝐚𝐩𝐧𝐚 𝐜𝐡𝐨𝐰𝐝𝐚𝐫𝐲 (@its_me_swapna_chowdary) -
పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై మొదటిసారి రియాక్ట్ అయిన అమర్ దీప్
బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్‌ను రైతుబిడ్డ అనే ట్యాగ్‌లైన్‌తో ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ గెలుచుకుంటే రన్నర్‌గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్‌లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్‌ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. అంతేకాకుండా అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను కూడా కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పోలీసుల సూచనలు పాటించకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేయడం వల్లే ఈ గొడవకు కారణమని పోలీసులు అయన్ను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు కూడా పంపించారు. ఆపై ప్రశాంత్ బెయిల్ మీద విడుదలయ్యాడు. తాజాగా అమర్ మొదటిసారి బిగ్ బాస్ గురించి రియాక్ట్ అయ్యాడు. 'హౌస్ నుంచి నేను బయటకు రాగానే ఏం జరుగుతుందో అనేది నాకేం అర్థం కాలేదు. అప్పుడు నా మైండ్ బ్లాంక్‌గా ఉంది. అక్కడితోనే ఆ గొడవ ముగిసిపోయింది. బిగ్ బాస్ వల్ల నాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా అభిమానుల ప్రేమ దొరికింది. అన్నింటికి మించి నా అన్న రవితేజ సినిమాలో ఛాన్స్ దక్కింది. బిగ్ బాస్ విన్నర్ కంటే నాకు రవితేజ సినిమా అవకాశం దక్కడమే గొప్ప విజయం. ఈ షో ద్వారా నాకు కావాల్సిన ఆదరణ దక్కింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా నన్ను గుర్తిస్తారు.. ఇవన్నీ కూడా బిగ్ బాస్ ద్వారా వచ్చిన అచీవ్మెంట్స్ అని నేను భావిస్తాను. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అనేది మిస్ అండర్స్టాండింగ్ వల్లే జరిగింది. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు.. కానీ కొందరు ఫ్యాన్స్ చేస్తున్న పనుల వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదరైతాయి. ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉండటం సహజమే.. ఇదీ ఎప్పుడూ ఉండేదే.. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నా అభిమాన హీరోను ఎవరైనా ఒక మాట అంటే గొడవపడే వాళ్లం... కొంత ఆలోచన శక్తి వచ్చాక అవన్నీ వదిలేసి అందరం కలిసి ప్రతి హీరో సినిమా చూసేవాళ్లం.. ఒకరి కోసం తిట్టుకోవడం, గొడవ పడటం లేకుండా అందరూ కలిసి ఆనందంగా ఉండండి.' అని అమర్ అన్నాడు. -
అమర్ రన్నర్ కావడంతో నాగార్జునకు చెడ్డపేరు: శివాజీ
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న అక్కసు శివాజీలో కనిపిస్తుంది. అందుకే ఆయన పలు ఇంటర్వ్యూలలో ఇప్పటికీ కూడా అమర్, శోభా పట్ల పలు చిల్లర వ్యాఖ్యలతో పాటు పరుష పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాడు. చివరకు అమర్ రన్నర్ ఎలా అయ్యాడో అంటూ చెప్పుకొస్తున్నాడు. బిగ్ బాస్‌లో శివాజీని అన్నిరోజులు ఉంచడమే గొప్ప విషయం అనుకుంటుంటే.. తనను తాను ఎదో గొప్ప అనుకునే భ్రమలో ఇప్పటికీ ఆయన ఉన్నాడు. శివాజీ వల్లే ఈ సీజన్లో ఇంత రచ్చ అయిందని చెప్పేవారు ఎందరో ఉన్నారు. అనవసరంగా తనను ఈ సీజన్లోకి తీసుకున్నారని కూడా పలువురు కామెంట్లు కూడా చేశారు. హౌస్‌లో ఎప్పుడూ కూడా తాను పోతా పోతా అంటాడు, ఆటలు ఆడడు, బెడ్డు వదలడు, పైగా చెయ్యి నొప్పి, మాట్లాడితే వెటకారాలు, నీతిబోధలు. బిగ్ బాస్‌లో ఆయన చేసింది ఇదే కదా.. మరోకటి ఏమైనా ఉంటే చెప్పండి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు కూడా. గట్టు పంచాయితీలు తీర్చే ఈ పెద్దకు ఇద్దరు పాలేర్లు. వారిద్దరినీ తన చుట్టూ తిప్పుకోవడం.. బిగ్ బాస్‌లో శివాజీ చేసింది ఏమిటి..? నచ్చని వారిపై దుమ్మెత్తిపోయడం.. ఇప్పడు బిగ్ బాస్ బయట కూడా అదే చేస్తున్నాడు. శోభా శెట్టి గొడవతో తనను నెగిటివ్‌గా చూపించే ప్రయత్నం బిగ్ బాస్ చేశారని తాజాగా శివాజీ సంచలన ఆరోపణ చేశాడు. శోభా శెట్టి పరాకాష్టకు వెళ్లింది. అందుకే మా ఇంట్లో ఆడపిల్లలు అయితే.. అంటూ కోపంగా ప్రవర్తించానని అంటూ శివాజీ ఇలా చెప్పాడు. 'గేమ్ ఒక దశకు వచ్చాక విన్నర్ ఎవరు..? ఎవరెవరికి ఏ స్థానాలు దక్కుతాయో కూడా అంచనా వేశాను. 1, 2, 3 స్థానాల్లో మనం ముగ్గురం ఉండబోతున్నామని ప్రశాంత్ చేతిలో రాశాను. అయితే ఊహించని విధంగా ఒక వ్యక్తిని బిగ్ బాస్ కావాలనే హైలైట్ చేస్తూ వచ్చాడు. బిగ్ బాస్ కూడా అతడిని పొగడడం నాకు నచ్చలేదు. అతను (అమర్) చపాతి చేస్తే బాగుంది నాకు కూడా పంపించు అని బిగ్ బాస్ అంటాడు... నేను ఎంతో కష్టపడి వడలు చేపిస్తే కనీసం ఒక మాట కూడా నాకు దక్కలేదు. పలుసార్లు పౌల్ గేమ్ ఆడిన వ్యక్తిని చివరకు రన్నరప్‌ను చేశారు. ఇలాంటి తప్పిదాల వల్ల నాగార్జున గారికి చెడ్డ పేరు వస్తుంది. ఇదే విషయం నాగ్ సారుకు కూడా త్వరలో చెబుతాను. న్యాయంగా అయితే టాప్ 3లో ప్రశాంత్, నేను, యావర్ ఉండేవాళ్లం.' అని శివాజీ అన్నారు. -
బిగ్ బాస్ అమర్‌పై శివాజీ చెత్త వ్యాఖ్యలు.. ఇవి దేనికి సంకేతం..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 ముగిసిపోయి చాలా రోజులే అయింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఆపై బెయిల్ మీద విడుదల ఇలా పలురకాల వివాదాలతో ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ సీజన్ గురించి వార్తలు వస్తునే ఉన్నాయి. ఈ సీజన్లో రన్నర్‌గా ఆమర్ దీప్ ఉంటే టాప్-3లో శివాజీ ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన బిగ్ బాస్ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ జర్నీలో బాగా ఇబ్బంది పడిన సందర్భం ఎంటి..? అని శివాజీకి ప్రశ్న ఎదురైంది. హౌస్‌లో మాదిరే ఇంటర్వ్యూలో కూడా అమర్ పట్ల ఉన్న కోపాన్ని తన వ్యాఖ్యలతో శివాజీ ఇలా చెప్పాడు. 'ప్రశాంత్, యావర్ విషయంలో నేను స్టాండ్ తీసుకున్న సందర్భాల్లో చాలా సార్లు ఇబ్బంది పడ్డాను. ప్రశాంత్ కెప్టెన్ బ్యాడ్జ్ లాక్కున్నారు. అతను సరిగ్గా హౌస్‌ను హ్యాండిల్ చేయలేకున్నాడు అని అందరూ ఓట్లు వేయడంతో అతని బ్యాడ్జ్‌ను బిగ్ బాస్ తీసుకున్నాడు. ఒక కామన్ మ్యాన్ కెప్టెన్ అయితే సెలబ్రిటీలకు నచ్చట్లేదా అని కోపం వచ్చింది. హౌస్‌లో కొందరు యావర్‌తో గొడవలు పెట్టుకున్నప్పుడు కోపం వచ్చింది. ఫైనల్‌గా నేను ఒకరిని కొట్టేద్దామని అనుకున్న సందర్భం కూడా వచ్చింది. మూడు వారాలుగా బిగ్ బాస్‌లో ప్రశాంత్‌ను మానశికంగా కొందరు టార్చర్ చేశారు. ఆ సమయంలో ప్రశాంత్‌ను అమర్ రెచ్చగొడుతున్నాడు. నేను పక్కనే ఉన్నాను.. నేను వాడి పక్కన ఉంటే ఎవరినీ లెక్క చేయడు. 14 వారంలో అమర్, ప్రశాంత్ మధ్య భారీగా గొడవ జరుగుతుంది. ఆ సందర్భంలో ఆమర్‌ను నాలుగు పీకి వెళ్లిపోదాం అనిపించింది. ప్రశాంత్ భుజం మీద చెయి వేసి అమర్ తోసుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో కోపం కట్టలు తెంచ్చుకుంది. గేమ్‌కు బౌండ్ అయి అగ్రిమెంట్లో సంతకం చేశాను కాబట్టి అమర్‌ను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో నా రక్తం మరిగిపోయింది.' అంటూ అమర్‌పై మరోసారి ఇంటర్వ్యూలో శివాజీ రెచ్చిపోయాడు. బిగ్ బాస్ అనేది ఒక గేమ్.. ఒక్కొసారి మాటల వల్ల అదుపు తప్పుతుంటారు. అది సహజం అని అందరికీ తెలుసు.. ఆ తర్వాత మళ్లీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అదీ హౌస్ వరకే పరిమితం. అయినా ప్రశాంత్, అమర్ ఇద్దరూ ఎన్ని గొడవలు పడినా మళ్లీ బ్రదర్స్ మాదిరి ఒకటిగా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ -7 ముగిసి పోయిన చాప్టర్.. బయటకు వచ్చాక కూడా ఇలా ఒకరిపై విషం చిమ్మడం ఎందుకు శివాజీ.. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేసి ఏం చెప్పదలుచుకుంటున్నారు. అయినా ప్రశాంత్ కెప్టెన్సీ నచ్చలేదని మీరు కూడా చెప్పారు కదా.. అప్పుడే మరిచిపోతే ఎలా శివాజీ.. అమర్‌ను నువ్వు రెచ్చగొట్టలేదా మానసిక వేదనకు గురి చేయలేదా అంటూ శివాజీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హౌస్‌లో ఇలాంటి మాటలు మాట్లాడే బయట జనాన్ని రెచ్చగొట్టి అమర మీద దాడి చేయించావు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అమర్ ఇంటికి వెళ్లి దాడి చేయండి అని ఇలా పరోక్షంగా మళ్లీ రెచ్చగొడుతున్నావా అంటూ శివాజీపై విరుచుకుపడుతున్నారు. అమర్‌పై చేసిన వ్యాఖ్యల వీడియో కింద ఎక్కువ మంది శివాజీని ఏకిపారేసిన కామెంట్లే కనిపిస్తున్నాయి. -
Ashwini Sree: అందంతో ఊరిస్తున్న బ్యూటీ క్వీన్ (ఫోటోలు)
-
'బిగ్‌బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్
ఈసారి బిగ్‌బాస్ సీజన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మరీ ముఖ్యంగా ఇందులో పాల్గొన్న సీరియల్ నటి శోభాశెట్టి ఇంకా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆట కంటే గొడవలతో చాలా ఫేమ్ తెచ్చుకుంది. అదే టైంలో విపరీతమైన ట్రోలింగ్ కూడా ఫేస్ చేసింది. బిగ్‌బాస్ ట్రోఫీ కచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పిన శోభా.. 14వ వారం ఎలిమినేట్ అయి ఆ కల నెరవేర్చుకోలేకపోయింది. అయితేనేం ఇప్పుడో అవార్డ్ గెలుచుకుని మళ్లీ వార్తల్లో నిలిచింది. (ఇదీ చదవండి: డార్లింగ్ ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా?) శోభాశెట్టి అంటే బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. 'కార్తీకదీపం' మోనిత అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్లో లేడీ విలన్‌గా చేసి చాలా పేరు తెచ్చుకుంది. అలా ఈసారి బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టింది. కానీ ఆట, గెలుపు కంటే గొడవలు పెట్టుకోవడంతోనే ఈమె బాగా ఫేమస్ అయింది. ఒకానొక టైంలో ఈమెని ఎలిమినేట్ చేయకుండా ఇంకా ఉంచుతున్నారేంట్రా బాబు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇలాంటి క్యారెక్టర్ షోలో లేకపోతే పెద్దగా మజా ఉండదు. సోఫాజీ అలియాస్ శివాజీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గని శోభా.. దాదాపు చివరి వరకు వచ్చేసింది. ఫినాలేకి వారం ఉందనగా ఎలిమినేట్ అయిపోయింది. తాజాగా ఈమెకు ఉత్తమ ప్రతినాయకగా రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్ వచ్చింది. ఈ విషయాన్ని శోభానే స్వయంగా తన ఇన్ స్టాలో ఫొటోలతో సహా పోస్ట్ చేసింది. ప్రస్తుతానికైతే ఈమె కొత్త సీరియల్స్ ఏం చేయట్లేదు. త్వరలో షోల్లో గానీ, సీరియల్స్‌లో గానీ శోభా మళ్లీ కనిపించే అవకాశముంది. (ఇదీ చదవండి: Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్) View this post on Instagram A post shared by Shobhashetty (@shobhashettyofficial) -
Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్
బిగ్‌బాస్ షోపై చాలా ఏళ్ల నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. కానీ ఈసారి అది రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ దెబ్బకు మరింత ముదిరిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫినాలే తర్వాత గొడవ, కార్లు-బస్సుల ధ్వంసం, విజేత అరెస్ట్.. ఇప్పుడు ఏకంగా నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేసేంతవరకు పరిస్థితి వచ్చింది. దీంతో షో ఆర్గనైజర్.. అనుహ్య నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు అది అందరినీ షాకయ్యేలా చేస్తోంది. హిందీలో చాన్నాళ్ల నుంచి ఉంది కానీ తెలుగులో మాత్రం గత ఏడేళ్లుగా బిగ్‌బాస్ ప్రసారమవుతోంది. ఎన్టీఆర్, నాని తొలి రెండు సీజన్లను హోస్ట్ చేయగా.. ఆ తర్వాత మాత్రం నాగార్జునే వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. పలువురు సెలబ్రిటీలని హౌసులో 100 రోజుల పాటు ఉంచి, పలు పోటీలు పెట్టి.. వీటన్నింటిలో గెలిచిన వాడిని విజేతగా ప్రకటించడం ఆనవాయితీ. ఈసారి అలా కామన్‌మ్యాన్, రైతుబిడ్డ ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ విజేతగా నిలిచాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) రైతుబిడ్డ పేరు చెప్పుకొని ప్రశాంత్ ఎలా ఆడాడు? ఏంటనే విషయం పక్కనబెడితే.. ఫినాలే జరుగుతుండగానే అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఇతడి ఫ్యాన్స్ చాలామంది గుమిగూడిపోయారు. దీంతో ర్యాలీ లాంటివి ఏం వద్దని ముందే పోలీసులు, ప్రశాంత్‌ని హెచ్చరించారు. దీన్ని లెక్కచేయకుండా అభిమానుల దగ్గరకు ప్రశాంత్ వచ్చాడు. దీంతో పలువురు కంటెస్టెంట్స్ కార్లు, పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సు అద్దాల్ని.. వీళ్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్‌ని అరెస్ట్ చేసి చంచల్ గుడ జైల్లో పెట్టారు. ఈ మధ్య బెయిల్ మీద కూడా విడుదలయ్యాడు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు.. షో నిర్వాహకులకు నోటీసులు కూడా పంపారు. అయితే ఈ తలనొప్పులకు తట్టుకోలేకపోతున్న ఆర్గనైజర్స్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. ఇకపై రాబోయే సీజన్స్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ర్యాలీలు లాంటివి చేయకూడదట. దీన్నే అగ్రిమెంట్‌లోనూ పొందుపరచనున్నారట. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా రైతుబిడ్డ దెబ్బకు 'బిగ్‌బాస్' తలకు బొప్పి కట్టింది! (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న 'బిగ్‌బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా?) -
Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?
'బిగ్‌బాస్ 7' ఫేమ్ పల్లవి ప్రశాంత్.. షోలో గెలిచిన తర్వాత చాలా హడావుడి చేశాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాజాగా బెయిల్‌పై బయటకొచ్చాడు. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కి వచ్చి వెళ్లాలని కండీషన్ పెట్టిన పోలీసులు.. కొన్నాళ్లకు ఇంటర్వ్యూలు లాంటివి ఏం ఇవ్వకూడదని కూడా చెప్పారు. ఇదంతా పక్కనబెడితే ఈ రైతుబిడ్డ.. కొందరిపై రివేంజ్ తీర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో 'బిగ్‌బాస్ 7' షోలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్.. ఎలాగైతేనేం విజయం సాధించాడు. అయితే డిసెంబరు 17న ఫినాలే అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ఇతడి ఫ్యాన్స్ చాలామంది వచ్చి చేరారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు.. ప్రశాంత్‌ని వేరే రూట్ నుంచి వెళ్లిపోమని చెప్పారు. కానీ మనోడు పోలీసులు మాట కూడా లెక్క చేయకుండా.. తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయారు. పలువురి కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలు కూడా ధ్వంసం చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ప్రశాంత్‌ని అతడి ఊరికెళ్లి మరీ అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల విధించగా.. చంచల్ గూడా జైల్లో పెట్టారు. నాలుగు రోజుల తర్వాత ఇతడికి బెయిల్ రావడంతో తిరిగి ఊరికివెళ్లిపోయాడు. ఇదంతా పక్కనబెడితే.. ఫినాలే అయిపోయిన తర్వాత ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించగా, తన ఊరికొస్తే ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పినట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. (ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో తమ్ముడు.. అమ్మాయి ఎవరంటే?) తీరా సదరు యూట్యూబర్స్.. ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం అతడి ఊరికి వెళ్లగా, చాలాసేపు వెయిట్ చేయించి తమని నిర్ధాక్షిణ్యంగా వెళ్లిపోమన్నాడని కొందరు ఇన్ స్టాలో స్టోరీలు పెట్టారు. అయితే తాను అలసిపోవడం వల్లే ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోయినని ప్రశాంత్ తీరిగ్గా వీడియో పోస్ట్ చేశాడు గానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్రశాంత్ అసలు రంగు ఏంటో అందరికీ తెలిసిపోయింది. అయితే తన ఇమేజ్ డ్యామేజ్ చేసిన సదరు యూట్యూబర్స్‌పై ప్రశాంత్ ఇప్పుడు పరువు నష్టం దావా వేయాలని అనుకుంటున్నాడట. ఇందులో ఎంత నిజముందనేది పక్కనబెడితే.. ఇది జరిగే పనేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్.. ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయి, బెయిల్‌పై బయటకొచ్చాడు. ఇలాంటి టైంలో పరువు నష్టం దావా లాంటి కొత్త తలనొప్పులు తెచ్చుకుంటాడా? అనేది చూడాలి. మరి ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్) -
Pallavi Prashanth: చంచల్ గూడ జైలు నుంచి బయటకొచ్చిన రైతుబిడ్డ
బిగ్‌బాస్ 7 విజేత ప్రశాంత్.. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. నాంపల్లి కోర్టు ఇతడికి శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా.. తాజాగా జైలు నుంచి బయటకొచ్చాడు. ఈ కేసులో భాగంగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు.. ప్రశాంత్‌ని ఆదేశించింది. అసలు ఈ గొడవేంటి? ప్రశాంత్‌ని ఎందుకు జైల్లో పెట్టారు? (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) తెలంగాణలోని ఓ పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే ప్రశాంత్.. తనని తాను రైతుబిడ్డగా చెప్పుకొన్నాడు. అలా ఇన్ స్టాలో వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసారి బిగ్‌బాస్ షోలో కామన్‌మ్యాన్ అనే ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 105 రోజుల పాటు హౌసులో ఉండి విజేతగా నిలిచాడు. అయితే ఫినాలేలో విజయం సాధించిన తర్వాత షో నిర్వహించిన అన్నపూర్ణ స్టూడియోస్ బయట చాలా గొడవ జరిగింది. అమర్, అశ్విని, గీతూతో పాటు పలువురు కార్లని ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. అయితే షోలో విజేతగా నిలిచిన తర్వాత ప్రశాంత్.. ఫ్యాన్స్‌ని కలిసేందుకు ప్రయత్నించగా తొలుత పోలీసులు వద్దని వారించారు. కానీ పోలీసుల మాటలని లెక్కచేయకుండా, పంపేచేసిన సరే తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయారు. వీరంగం సృష్టించాడు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యుడిగా ప్రశాంత్ పై సుమోటాగా కేసు నమోదు చేశారు. రీసెంట్‌గానే ప్రశాంత్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్న ఇతడు తాజాగా బెయిల్‌పై బయటకొచ్చాడు. ఇతడిని చూసేందుకు జైలు దగ్గరకు కూడా అభిమానులు చాలామంది వచ్చారు. (ఇదీ చదవండి: 'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి) -
పేరు మార్చుకున్న 'బిగ్ బాస్' విన్నర్ పల్లవి ప్రశాంత్
బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్ టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్‌కు ఉపశమనం లభించింది. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్‌ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్‌ను ఏ-2గా పేర్కొంటూ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నేడు (డిసెంబర్ 23) చంచల్ గూడ జైలు నుంచి ఆయన విడుదల కావచ్చు. తాజాగా పల్లవి ప్రశాంత్ ఇన్‌స్టాలో తన పేరు మారింది. అందులో తన పేరు, బయోను మార్పు చేశారు. MALLA OCHINA, SPY Team Winner అని కొత్తగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేర్చుకున్నాడు. ప్రశాంత్ సూచన మేరకు అతని మరో సోదరుడు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తన విజయంలో SPY బ్యాచ్ పాత్ర ఎంతగానో ఉందని ప్రశాంత్ గుర్తించినట్లు ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ వల్ల ప్రశాంత్ ఇన్‌స్టాగ్రామ్‌కు భారీగా ఫాలోవర్లు పెరిగారు. ప్రస్తుతం ప్రశాంత్‌ను 1 మిలియన్‌కు పైగానే ఫాలోవర్లు అనుసరిస్తూ ఉండటం విశేషం. ప్రశాంత్‌కు అండగా నిలబడిన భోలే చంచల్‌గూడ జైలు నుంచి పల్లవి ప్రశాంత్ నేడు విడుదల కానున్నాడు. ప్రశాంత్ కోసం అండగా భోలే మాత్రమే నిలబడ్డాడు. హౌస్‌లో కూడా ఆయన ప్రశాంత్ కోసమే బిగ్ బాస్‌కు వచ్చానని చెప్పాడు. బెయిల్ వచ్చిన సందర్భంగా భోలే మాట్లాడుతూ.. రైతుబిడ్డకి న్యాయం జరిగిందని తెలిపాడు. 15 వేల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీల నిబంధనతో బెయిల్ మంజూరు చేయడం జరిగిందని తెలిపాడు. ప్రశాంత్ అరెస్ట్ అయిన 48 గంటల్లోనే బెయిల్ వచ్చేలా చేసిన అడ్వకేట్లకు ధన్యవాదాలు తెలిపాడు. అంతే కాకుండా నిష్పక్షపాతంగా తీర్పు ఇచ్చిన జడ్జీగారికి పాదాభివందనం తెలిపాడు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు బెయిల్
బిగ్‌బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌కు ఊరట లభించింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా రూ. 15 వేల చొప్పున రెండు షూరిటీలు కాగా బిగ్ బాస్ టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షో విన్నర్‌గా నిలిచిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఆయన అభిమానులు అత్యుత్సాహంతో కార్లు, బస్సుల అద్దాలు పగులగొట్టారు. దీంతో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్‌ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్‌ను చేర్చారు. డిసెంబర్ 20న పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రశాంత్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. నేడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. బిగ్‌బాస్ విన్నర్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చదవండి: అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక -
అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక
బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7 ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద దుమారమే రేగింది. ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమర్ కారుపై ఒక వర్గం ఫ్యాన్స్ దాడి చేశారు. అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. తాజాగా ఈ విషయంపై ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రియాంక రియాక్ట్ అయింది. అభిమానులు ఎవరైనా కానీ ఇలా దాడి చేయడం చాలా దారుణమని ఆమె ఇలా తెలిపింది. 'ఫ్యాన్స్ పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడటం చాలా దారుణం. మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వ్యతిరేకించండి.. అందులో తప్పులేదు కానీ ఇలా దాడి చేయడం చాలా హేయం. ఎవరమైనా ఎంతో కష్టపడి ఒక వస్తువును కొంటాము. కానీ ఇలా కొన్ని క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్ కాదు. దాడి సమయంలో కారులోపల మహిళలు ఉన్నారనే ఆలోచన కూడా లేకుంటే ఎలా..? హౌస్‌లో గేమ్ పరంగా మాత్రమే మాలో గొడవలు ఉన్నాయి. టాస్క్ ముగియగానే పల్లవి ప్రశాంత్,యావర్,శివాజీ,అమర్ ఇలా అందరం చాలా బాగా కలిసే ఉండే వాళ్లం. మాలో ఎలాంటి గొడవలు లేవు.' ముఖ్యంగా చివరి 4 వారాల్లో ప్రశాంత్‌తో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. వాడు నిజంగానే భూమి బిడ్డ అని ఆమె తెలిపింది. కానీ ఆ ఇంటర్వ్యూ జరిగిన సమయానికి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కాలేదు.. దీంతో ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ అరెస్ట్‌పై ఆమెకు ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాలేదు. -
పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
బిగ్‌బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రాత్రి అతని స్వగ్రామం గజ్వేల్‌లోని కొల్గూరులో అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్‌ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్‌ను ఏ-2గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత వీరిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడంతో లాయర్ ద్వారా వారిద్దరూ మళ్లీ ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సీజన్- 6 కాంటెస్టెంట్ గీతూరాయల్ కారును కూడా ధ్వంసం చేశారు. ఆపై ఆమె కారులోకి చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దాంతో అల్లరిమూకలు రోడ్లపైకి పరుగులు తీస్తూ ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కేసు పెట్టడం జరిగింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్‌పై కేసు.. కారణం అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేటు నుంచి పంపారు. కానీ ఆ సమయానికే ప్రశాంత్‌ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్ తన మిత్రుడు వినయ్ ద్వారా రెండు కార్లను అద్దెకు తెచ్చుకున్నారు. ఇది గమనించిన పోలీసులు ఇప్పటికే ఇక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది.. ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం.. బయటకు వెళ్లి ఎక్కడైన సభ పెట్టుకోండి అని చెప్పి.. ఆ కార్లను పక్కనపెట్టి పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్‌ను పంపించారు. అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దె కార్లతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ మళ్లీ జోక్యం చేసుకుని ప్రశాంత్‌ను రావొద్దని చెప్పినా.. ప్రశాంత్ వినిపించుకోలేదని ఆయన తెలిపారు. ప్రశాంత్‌ను అడ్డగించి పంపించేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్లపై దాడితో పాటు రెండు పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు ఆరు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలకొట్టారు. ప్రశాత్కు 14 రోజుల రిమాండ్ ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ ఎస్సై మెహర్ రాకేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్, మనోహర్, వినయ్‌తో పాటు అద్దె కార్లను నడిపిన డ్రైవర్లు సాయికిరణ్, రాజుపై కూడా కేసు నమోదు చేశారు. ఈనెల 19న డ్రైవర్లు సాయికిరణ్, రాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడు మనోహర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్లో వారిద్దరినీ విచారించి ఆపై రాత్రి సమయంలోనే జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్‌తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. పల్లవి ప్రశాంత్‌తో పాటు సోదరుడు మనోహర్‌కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అర్ధరాత్రి వారిద్దరినీ చల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. పోలీసులు ముందే హెచ్చరించినా సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ.. ప్రభుత్వ ఆస్థులకు నష్టం కలిగేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని పోలీసులు తెలిపారు. ఫైనల్‌గా వారిద్దరిపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసును పోలీసులు నమోదుచేశారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
బిగ్ బాస్‌పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ రచ్చే జరిగింది. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అభిమానులు చేసిన ఫలితంగా అక్కడ గొడవలు జరిగాయని పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఇలా అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద గొడవే జరిగింది. ఇప్పటికే బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని పలువురు ప్రముఖులు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ షో గురించి తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు (HRC ) హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. కానీ ఎక్కడ హీరో నాగార్జున పేరు లేదు. ఈ కేసులలో నాగార్జున పేరును కూడా చేర్చాలి. అయన కూడా ఈ గొడవలకు బాద్యులే. అంత గొడవ బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టుకు లేఖ రాశాను. నాగార్జునను కూడా వెంటనే అరెస్ట్ చెయ్యాలి.' అని ఆయన కోరారు. కేసుల విషయాలు.. బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్లో పాల్గొన్న అమర్దీప్, అశ్విని, అక్కడే ఉన్న మరో సెలబ్రిటీ గీతూ రాయల్ కార్ల మీద దాడి జరిగింది. వారి కార్ల అద్దాలు పగిలాయి. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. ఆ తరువాత ఆరు ఆర్టీసీ బస్సులు, ఒక పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. పోలీసులు సుమోటోగా ఈ కేసు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 147, 148, 290, 353, 427 r/w 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టారు. మొత్తం రెండు కేసులు ఉండగా ఒకదానిలో పల్లవి ప్రశాంత్ పేరు ఉన్నట్లు సమాచారం. -
పల్లవి ప్రశాంత్ బెయిల్‌కు చిక్కులు.. కారణం ఇదే: ప్రశాంత్ లాయర్
బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ముందు గేటు నుంచి రావద్దని పోలీసులు చెప్పినా కూడా ప్రశాంత్ రావడం వల్ల అక్కడ పరిస్థితి కంట్రోల్ చేయడం తమ వల్ల కాలేదేని ఆ సమయంలో పోలీసులు తెలిపారు. ఆ సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు విషయంపై హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్‌కుమార్ సాక్షి మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్‌పై కక్షసాధింపు చర్యలు తగవని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని ఆయన చెబుతూ ప్రశాంత్ బెయిల్ గురించి ఇలా మాట్లాడారు. 'ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు.. కానీ ఇప్పటి వరకు కనీసం నిందితుడికి FIR కాపీ ఇవ్వడం లేదు. ఈ కేసుల వల్ల భయపడిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దీంతో Fir కాపీ కోసం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ను నేను సంప్రదించాను. కానీ ఆయన మాత్రం FIR కాపీ కొసం కుటుంబ సభ్యులు రావాలని తెలుపుతున్నారు. కేసు ఏదైనా సరే FIR కాపీని మాత్రం పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన బాధ్యత పొలిసులకు ఉంది. FIR కాపీ ఉంటేనే ప్రశాంత్‌కు బెయిల్ దరఖాస్తు చేసుకునేందకు అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆ కాపీ ఇవ్వకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో FIR కాపీ చూస్తేనే తెలుస్తుంది.' అని హైకోర్టు న్యాయవాది కే రాజేశ్‌కుమార్ తెలిపారు. -
నేనైతే కారుతో గుద్దిపడేసేవాడిని.. అమర్ విషయంపై సోహైల్ ఫైర్
బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్‌ను రైతుబిడ్డ అని చెప్పుకుంటున్న పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ రన్నర్‌గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్‌లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్‌ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. ఈ విషయంపై చాలామంది రియాక్ట్ అవుతున్నారు. తాజాగా సయ్యద్ సోహైల్ రియాక్ట్ అయ్యాడు. 'ఒక వ్యక్తిపై అభిమానం ఉండాలి కానీ ఉన్మాదం పనికిరాదు.. అమర్ కారుపై దాడి చేసింది అందరూ కూడా యువకులే. మనకు ఉద్యోగాలు లేక ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇలాంటి పనులు చేసి తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకు రాకండి. అభిమానం ముసుగులో ఇలా అమర్‌పై దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్... ఆ దాడి సమయంలో అమర్‌తో పాటు ఆయన అమ్మగారు, భార్య తేజు ఉన్నారు. వారి కారును చుట్టుముట్టి అద్దాలు పగులకొట్టి ఆపై వారందరినీ నోటికి వచ్చిన బూతులు తిట్టారు. అమర్ భార్య, అమ్మగారిని చెప్పలేని పదాలతో తిట్టారు. మరోకడు అయితే ఆ బూతులు వినలేడు కూడా.. అలాంటి పదాలతో తిట్టడం ఎంత వరకు కరెక్ట్... నేను కూడా ఒక కొడుకుగా చెబుతున్నా.. ఇలాంటి మాటలు నాకే ఏదురైతే గనుకా ఆ సమయంలో కారుతోనే గుద్దిపడేసేవాడిని తర్వాత ఏదైతే అది జరగని.. తన తల్లిదండ్రులను అంటే ఎవరిలోనైనా ఇదే అభిప్రాయం వస్తుంది. భార్య, అమ్మను తన ముందే ఇలా తిడితే ఎవడూ సహించడు. కారుతో అలానే గుద్ది పారేస్తాడు.. కానీ అమర్ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. నిజానికి వాడు చాలా మంచోడు ఇండస్ట్రీలో ఎవరినీ అడిగినా అదే చెబుతాడు.. అంత గొడవ జరిగినా తర్వాత కూడా తన అమ్మ, భార్య జోలికి మాత్రం రాకండి. ఏమైనా చేయాలనుకుంటే తనను మాత్రమే చేసుకోండి అని చెప్పాడు. ఇంతలా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం దేనికి..?' అని సోహైల్ రియాక్ట్ అయ్యాడు. -
బిగ్ బాస్‌కు ముందే SPY బ్యాచ్ స్టార్ట్ అయిందా.. వీడియో వైరల్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. ఈ సీజన్ ప్రధానంగా SPY (శివాజీ, ప్రశాంత్, యావర్) SPA (శోభ,ప్రియాంక,అమర్) బ్యాచ్‌ల మధ్యే నడిచింది. చివరకు స్పై బ్యాచ్‌లోని ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ ప్రారంభంలోనే శోభ,ప్రియాంక,అమర్ ముగ్గురూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని.. వాళ్లందరూ 'స్టార్ మా' బ్యాచ్ అంటూ మొదట్లోనే శివాజీ కన్నింగ్ ప్లాన్ వేశాడు. వాస్తవానికి ఆ విషయంలో వాళ్లే ఒప్పుకున్నారు. ఇక్కడికి రాక ముందే తామందరం మంచి స్నేహితులం.. ఈ షో గురించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పలేమని తెలిపి వారు గ్రూప్‌గానే గేమ్ ఆడుతూ వచ్చారు. ఇదే క్రమంలో శివాజీ, యావర్, ప్రశాంత్ కూడా SPY అనే పేరుతో గ్రూప్ అయ్యారు.. వారు కూడా గ్రూప్ గేమ్ ఆడుతూ పదే పదే SPA బ్యాచ్ మాత్రమే గ్రూప్ గేమ్ ఆడుతుందని హౌస్‌లో పదేపదే ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ వీరు ముగ్గురు హౌస్‌లోకి రాక ముందే ఒకరికొకరితో పరిచయం ఉంది అంటూ గతంలోనే కొన్ని వార్తలు వచ్చాయి. హౌస్‌లోకి వచ్చిన తర్వాతే వాళ్ల మధ్య పరిచయం అయినట్లూ ఈ ముగ్గురు కూడా కలరింగ్ ఇచ్చారు. ఎక్కడా తమ మధ్య ముందే పరిచయం ఉందని రివీల్ చేయలేదు. బిగ్ బాస్‌లోనే మొదటి పరిచయం అయినట్లు కనిపించారు. అలా ఈ ముగ్గురు ఒకటిగా గేమ్ ఆడుతూ.. SPA బ్యాచ్ మాత్రమే గ్రూప్ అంటూ పదే పదే ఎదురుదాడి చేశారు. SPY బ్యాచ్‌పై ముందు నుంచే చాలా అనుమానాలు కనిపించాయి. బిగ్ బాస్‌కు ముందు ప్రశాంత్‌ను ఎక్కడా చూడలేదని యావర్ చెప్పాడు. అంతేకాకుండా కలవలేదని చెప్పాడు. ఇక్కడికి వచ్చాకే ఫ్రెండ్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు. అదంతా నిజమేనని జనాలు కూడా నమ్మారు. కానీ అది అబద్దం అని తేలిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పల్లవి ప్రశాంత్, యావర్ చాలా క్లోజ్‌గా మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్‌కు ముందే వారిద్దరి మధ్యే బాటలు సాగాయని తేలిపోయింది. ఇదే క్రమంలో శివాజీ, ప్రశాంత్ మధ్య కూడా పరిచయం ఉందని సమాచారం. బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు ప్రశాంత్‌ను ఇంటర్వ్యూ చేయాలని ఒక యూట్యూబ్ వారిని శివాజీనే సూచించాడట. ఇలా ఈ ముగ్గురి మధ్య పరిచయం ఉన్నప్పటికీ దానిని దాచి వారి గేమ్ ప్లాన్‌ను మొదలు పెట్టారు. దీంతో స్పై బ్యాచ్ ముందే ప్లాన్ చేసుకొని వచ్చారనే కామెంట్స్ వినిపిస్తన్నాయి. ఇది చూసిన స్పై ఫ్యాన్స్ సైతం ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. జనాలను మోసం చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ చాలా ఏళ్ల నుంచి తమ మధ్య స్నేహం ఉందని ఓపెన్‌గా చెప్పిన స్పా బ్యాచ్... ఆట కోసం తమ స్నేహాన్ని వదులుకోలేమని చెప్పి ఆటలో ఎన్ని గొడవలు జరిగినా మళ్లీ కలిసిపోతూ.. స్నేహంలో ఇవన్నీ సహజమే అనేలా తమ ఆటను కొనసాగించి నిజమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. View this post on Instagram A post shared by 𝐒𝐌𝐃🧘 (@swaasa_meedha_dhyaasa_) -
నాకేం జరిగినా భయపడను..
-
BB7 RunnerUp Amardeep Photos: సింపుల్ లుక్‌లో బీటెక్ బాబు అమర్దీప్ (ఫోటోలు)