బిగ్‌బాస్ షోలో 7వ సీజన్ విన్నర్ ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే అర్జున్, ప్రియాంక.. తక్కువ ఓట్లు పడిన కారణంగా హౌస్ నుంచి బయటకొచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన నలుగురిలో ఓ కంటెస్టెంట్.. సూట్‌కేసులోని మంచి మొత్తానికి టెంప్ట్ అయినట్లు టాక్. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్? ఎంత డబ్బు దక్కించుకున్నాడు?
సూట్‌కేసు సంప్రదాయం
బిగ్‌బాస్ గత కొన్ని సీజన్లని తీసుకుంటే ఈ సూట్‌కేసు సంప్రదాయం ఏంటనేది తెలుస్తోంది. 4వ సీజన్‌లో ఫినాలే రేసులో ఉన్న సొహైల్.. రూ.25 లక్షలు తీసుకుని బయటకొచ్చేశాడు. ఓటీటీ సీజన్‌లో అరియానా.. రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి డ్రాప్ అయింది. గత సీజన్‌లోనూ ఏకంగా రూ.40 లక్షలు తీసుకుని శ్రీహాన్.. తనకు తానుగా బయటకొచ్చేశాడు. అయితే ఈసారి ఫినాలే జరగడానికి ముందు సూట్‌కేసు ఆఫర్ ఇచ్చిన బిగ్‌బాస్.. రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి డ్రాప్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఎవరూ దీన్ని ఉపయోగించలేదు.
(ఇదీ చదవండి: రైతు బిడ్డకే బిగ్‌బాస్ ట్రోఫీ.. రన్నరప్ అతనే..‘సాక్షి’పోల్ రిజల్ట్)
యావర్ తెలివైన నిర్ణయం
SPY బ్యాచ్‌లో ఉండటం ప్లస్ గేమ్స్‌లోనూ మంచిగా ఫెర్ఫార్మ్ చేయడం వల్ల.. తెలుగు పెద్దగా రాకపోయినా గానీ యావర్.. ఫినాలే వరకు వచ్చేశాడు. రూ.10 లక్షల మొత్తం ఆఫర్ చేసినప్పుడు లైట్ తీసుకున్నాడు. కానీ ప్రియాంక, అర్జున్.. ఖాళీ చేతులతో ఎలిమినేట్ అయ్యేసరికి మనోడికి బుర్ర పనిచేసినట్లుంది. మిగతా ముగ్గురి(ప్రశాంత్, అమర్, శివాజీ)ని దాటి కప్ కొట్టడం కష్టం. కాబట్టి నాగ్ ఆఫర్ చేసిన రూ.15 లక్షలు తీసుకొని సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది.
యావర్‌కి అవసరమే
సీరియల్స్, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన యావర్.. తనకు, తన ఫ్యామిలీకి డబ్బు అవసరమని ఇదే బిగ్‌బాస్‌లో చాలాసార్లు చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు రూ.15 లక్షలు తీసుకుని మంచి పనిచేశాడని చెప్పొచ్చు. అయితే డబ్బులు తీసుకునే విషయంలో శివాజీ ఏమైనా హింట్ ఇచ్చాడా? లేదంటే ఇది యావర్ సొంత నిర్ణయమా? అనేది ఆదివారం ఎపిసోడ్‌లో తెలిసిపోతుంది!
(ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న హీరో మంచు మనోజ్.. శుభవార్త చెప్పేశారు!)
Comments
Please login to add a commentAdd a comment