Bigg Boss 7 Telugu
-
Pallavi Prashanth: మాట మారింది.. స్టైల్ మారింది!
'అన్నా.. నేను రైతుబిడ్డనన్నా..', 'జై జవాన్- జై కిసాన్' అంటూ బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో ఇవే డైలాగ్స్ రిపీట్ చేశాడు పల్లవి ప్రశాంత్. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఓ పక్క అమాయకంగా ఉంటూనే మరోక్క పుష్ప లెవల్లో డైలాగ్స్ పలికేవాడు. టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్‌మనీతో నిరుపేదలకు సాయం చేస్తానని మాటిచ్చాడు. నేలతల్లి సాక్షిగా, పంట చేను సాక్షిగా చెప్తున్నా.. నేను గెలిచిన రూ.35 లక్షల్లో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను. అందరికీ దానం చేస్తానని బీరాలు పలికాడు.చేతులు దులిపేసుకున్న ప్రశాంత్?ఇచ్చిన మాట ప్రకారం అప్పట్లో రూ.1 లక్ష సాయం చేశాడు. తర్వాత మరో కుటుంబానికి లక్ష కంటే తక్కువే ఇచ్చినట్లు తెలుస్తోంది. షో పూర్తయి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ప్రైజ్‌మనీ మొత్తాన్ని అతడు చెప్పినట్లుగా నిరుపేదలకు ఖర్చు చేయనేలేదు. ఈ విషయంలో ప్రశాంత్ మాట తప్పాడని జనాలు విమర్శిస్తూనే ఉన్నారు. హౌస్‌లో సింపతీ డ్రామా ఆడి, బయటకు వచ్చాక మాత్రం తలపొగరు చూపిస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. లుక్ మార్చిన రైతు బిడ్డతాజాగా ప్రశాంత్ సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేశాడు. అందులో ప్రశాంత్ గెటప్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. లుక్ మార్చేశావేంటన్నా.., రైతు బిడ్డ రాయల్ బిడ్డ అయ్యాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం.. ఈ సోకులకేం తక్కువ లేదు, ముందు ఇచ్చిన మాట ప్రకారం డబ్బు పంచు అని సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) చదవండి: ఇన్‌స్టాతో పాపులర్.. ఫోక్ సింగర్ 'శృతి' ఆత్మహత్య -
బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్‌గా అడుగుపెట్టిన శోభా శెట్టి
బిగ్‌బాస్ షో చప్పగా సాగుతున్నప్పుడు, తిరిగి పట్టాలెక్కించేందుకు వైల్డ్కార్డులనే నమ్ముకుంటున్నారు. అందుకే గత సీజన్‌తో పాటు ఈ సీజన్లో కూడా ఈ ఫార్ములానే నమ్ముకున్నారు. అది ఈసారి కాస్త ఫలించినట్లు కనిపిస్తోంది. ఎంటర్టైన్మెంట్ లేక బోసిపోయిన బిగ్‌బాస్ హౌస్‌కు కాస్త కొత్త కళ వచ్చినట్లయింది.వైల్డ్ కార్డులనే నమ్ముకుంటున్నారుఅటు కన్నడ బిగ్‌బాస్ పదకొండో సీజన్లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఏడు వారాలుగాయవంతంగా కొనసాగుతున్న ఈ షోలో నేడు ఇద్దరు సెలబ్రిటీలు భాగం కానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా బయటకు వచ్చేసింది.గతేడాది తెలుగులో.. ఇప్పుడు కన్నడలోప్రోమోలో ఫేస్ రివీల్ చేయలేదు కానీ వచ్చిన ఇద్దరిలో ఒకరు మన తెలుగువారికి బాగా సుపరిచితురాలు. తనే కార్తీక దీపం సీరియల్ విలన్ శోభా శెట్టి. పోయిన ఏడాదే తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొంది. సీరియల్లో చూపించిన ఉగ్రరూపాన్నే ఇక్కడ కూడా చూపించి కొంత నెగెటివిటీ మూటగట్టుకుంది.మరి ఈసారైనా..?కాకపోతే ఎవరినైనా ఎదురించే స్వభావం జనాలకు తెగ నచ్చేసింది. టాప్ 5 వరకు రాకుండానే వెనుదిరిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం కన్నడ బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. హౌస్‌లో ఎవరు నీకు పోటీ? అని హోస్ట్ కిచ్చా సుదీప్ అడిగితే.. తనకు ఎవరూ పోటీ కారంటోంది శోభా. మరి అక్కడ ఎన్నివారాలు హౌస్‌లో కొనసాగుతుందో చూడాలి! View this post on Instagram A post shared by Colors Kannada Official (@colorskannadaofficial) మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హీరోగా 'బిగ్‌బాస్' అమరదీప్.. కొత్త సినిమా మొదలు
దసరా సందర్భంగా పలు చిన్న చిత్రాలు నుంచి అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో బిగ్‌బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా చేస్తున్న మూవీ ఒకటి కాగా.. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు ప్రధాన పాత్ర పోషించిన మూవీ రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు.సీరియల్ నటుడిగా అందరికీ తెలిసిన అమర్దీప్.. గతేడాది బిగ్‌బాస్ షోలో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా ఇప్పటికే ఓ మూవీ చేస్తుండగా.. ఇప్పుడు 'నా నిరీక్షణ' పేరుతో మరో చిత్రాన్ని మొదలుపెట్టాడు. దసరా సందర్భంగా ఇది ప్రారంభమైంది. లిషి గణేష్ కల్లపు హీరోయిన్ కాగా సాయి వర్మ దాట్ల దర్శకుడు. పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం)'ఎర్రచీర' రిలీజ్ ఎప్పుడంటే?నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్వి నటించిన కొత్త సినిమా 'ఎర్రచీర'. తల్లి సెంటిమెంట్ కథతో తీసిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ డిసెంబరు 20న థియేటర్లలో మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సుమన్ బాబు దీనికి దర్శకుడు.'పెన్ డ్రైవ్' మూవీ షురూవిష్ణు వంశీ, రియా కపూర్ హీరోహీరోయిన్లుగా చేస్తున్న సినిమా 'పెన్ డ్రైవ్'. ఎంఆర్ దీపక్ దర్శకుడు. కె.రామకృష్ణ నిర్మాత. నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సమకాలీన కథా కథనాలతో తెరకెక్కుతోంది. దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.(ఇదీ చదవండి: ప్రముఖ నేత దారుణ హత్య.. బిగ్‌బాస్ షూటింగ్ రద్దు)'ప్రేమలు' బ్యూటీ తెలుగు సినిమా'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు చేస్తున్న తొలి తెలుగు సినిమా 'డియర్ కృష్ణ'. దినేష్ బాబు దర్శకుడు. కొత్తోళ్లు అక్షయ్, ఐశ్వర్యతో మమిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ కృష్ణుడి నమ్మే ఓ భక్తుడి స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
గులాబీలతో గుబాళిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ (ఫోటోలు)
-
'బిగ్‌బాస్' బ్యూటీ శ్రీ సత్య బర్త్‌డే.. ఈమె స్మైల్ వేరే లెవల్ (ఫొటోలు)
-
కాబోయే భర్తకు కాస్ట్ లీ కారు గిఫ్ట్ ఇచ్చిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి
గతేడాది బిగ్‌బాస్ 7వ సీజన్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ నటి శోభాశెట్టి. అంతకు ముందు 'కార్తీకదీపం'లో మోనిత అనే విలన్ పాత్రలో ఆకట్టుకున్న ఈమె.. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించింది. కానీ గతేడాది బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల ఈమెపై పాజిటివిటీ కంటే నెగిటివిటీనే ఎక్కువ ఏర్పడింది. దానికి పెద్ద రీజన్ ఏం లేదు. అదంతా పక్కనబెడితే నెలన్నర క్రితం యశ్వంత్ అనే నటుడితో నిశ్చితార్థం చేసుకుంది.(ఇదీ చదవండి: పెళ్లికి రూ.60 లక్షలదాకా ఖర్చు.. ఏం లాభం? నాలుగేళ్లకే విడిపోయిన 'బిగ్ బాస్' జోడీ)'కార్తీకదీపం' సీరియల్లో యశ్వంత్, శోభా శెట్టి నటించారు. అలా షూటింగ్ జరుగుతున్న టైంలో తొలుత ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. బిగ్ బాస్ షోలోనే శోభాశెట్టి తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. దీనితో పాటు కొత్త ఇంట్లో కూడా అడుగుపెట్టింది.ఇప్పుడు తనకు కాబోయే భర్త యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా లక్షలు విలువ చేసే కారుని అతడికి గిఫ్ట్‌గా ఇచ్చింది. బీస్ట్ ఎక్స్‌యూవీ 700 కారుని శోభాశెట్టి కొనుగోలు చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మార్కెట్లో ఈ కారు ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలో ఉంది. ఏదేమైనా పుట్టినరోజుకే ఈ రేంజు గిఫ్ట్ ఇచ్చింది అంటే పెళ్లికి శోభా ఇంకేం బహుమతిని ఇస్తుందో?(ఇదీ చదవండి: రూ.5 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అనుష్క.. కారణం అదేనా?) -
ఎట్టకేలకు రైతుబిడ్డ చేతికి! తల్లికి తొలి కానుక..
బిగ్‌బాస్ షో పనైపోయిందనుకున్న సమయంలో ఉల్టా పుల్టా అంటూ ఏడో సీజన్‌పై ఆసక్తి పెంచాడు కింగ్ నాగార్జున. ఈ రియాలిటీ షోని మళ్లీ గాడిలో పెట్టే పనిని తన భుజాలపై వేసుకున్నాడు. అలా నాగ్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ బాగానే వర్కవుట్ అయింది. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా నటుడు అమర్దీప్ చౌదరి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.ప్రైజ్‌మనీతో పాటువిన్నర్కు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వాలి. అయితే ఫినాలేలో ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్‌కేసును ఎగరేసుకుపోవడంతో ప్రశాంత్‌కు రూ.35 లక్షలు వచ్చాయి. ఇందులో 30-40 శాతం వరకు ట్యాక్స్‌కే పోతుంది. ఇది కాకుండా లగ్జరీ కారు గెలుచుకున్నాడు. అయితే హౌస్‌లో ఉన్నప్పుడు రూ.15 లక్షల విలువైన డైమండ్ జ్యువెలరీ కూడా ఇస్తామని ప్రకటించారు. అమ్మకు తొలి కానుకషో ముగిసిన ఐదు నెలల తర్వాత ఆ నగను ప్రశాంత్‌కు అందించారు. అక్షయ తృతీయ రోజే జ్యువెలరీ చేతికి రావడంతో రైతుబిడ్డ సంతోషంలో మునిగిపోయాడు. 'అమ్మకు తొలి కానుక.. బిగ్‌బాస్ ఏడో సీజన్‌కు థ్యాంక్స్.. లవ్యూ నాగ్ సర్..' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడా పోస్ట్ వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)చదవండి: బుల్లితెర నటి ఇంట సెలబ్రేషన్స్.. బాబు ఊయల ఫంక్షన్ -
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
'కార్తీకదీపం' సీరియల్, 'బిగ్‌బాస్ 7' షోతో గుర్తింపు తెచ్చుకున్న శోభాశెట్టి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేసింది. సోమవారం గృహ ప్రవేశం జరగ్గా.. బిగ్‌బాస్ షోలో తనతో పాటు పాల్గొన్న తేజ, ప్రియాంక, గౌతమ్, సందీప్ మాస్టర్ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్)కర్ణాటకకు చెందిన శోభాశెట్టి.. కన్నడలో పలు షోలు చేసింది. తెలుగులోకి 'కార్తీకదీపం' సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మోనిత అనే విలన్‌గా ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ చేసింది. గతేడాది బిగ్‌బాస్ 7వ సీజన్లో పాల్గొన్న ఈమె.. ఫైనల్ వరకు వచ్చింది కానీ విజేత కాలేకపోయింది. మరోవైపు ఇదే షోలో తన ప్రియుడు యశ్వంత్ రెడ్డి అని పరిచయం చేసింది. వీళ్లకు ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది.ప్రస్తుతం శోభాశెట్టి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేసింది. ఈ గృహ ప్రవేశానికి బిగ్ బాస్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అయితే షోలో పాల్గొన్న తర్వాత వచ్చిన డబ్బులతోనే శోభా ఇల్లు కట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా శోభా కొత్త ఇంట్లో ఉన్న వీడియోని టేస్టీ తేజ తన యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?) -
హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక
బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్‌తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతకు ముందు పలు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం షోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీగా ఉంది. తన బాయ్ ఫ్రెండ్‌తో హైదరాబాద్‌లోనే కలిసి ఉంటున్న ప్రియాంక ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. తాము ఇక్కడ భూమి కొనుగోలు చేసినట్లు శుభవార్త చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటా.. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్)ప్రస్తుతం హైదరాబాద్‌లోని అద్దె ఫ్లాట్‌లో ఉంటున్న ప్రియాంక-శివ్.. తొలుత కొత్త ఫ్లాట్ తీసుకోవాలని అనుకున్నారు. టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఫ్లాట్ తీసుకోవడం తనకు ఇష్టం లేదని, ల్యాండ్ కొని ఇల్లు కట్టుకుంటే వచ్చే మజా వేరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివ్ అసలు విషయం చెప్పాడు. జనవరి నుంచి ల్యాండ్ కోసం తిరుగుతుండగా ఎప్పుడో ఓ సమస్య వచ్చేదని ప్రియాంక చెప్పుకొచ్చింది.ల్యాండ్ బాగుంటే రేటు నచ్చడం లేదని, అన్ని బాగుంటే పేపర్స్ సరిగా ఉండట్లేదని ప్రియాంక-శివ్ చెప్పారు. ఏప్రిల్ 10న ల్యాండ్ ఓకే చేసి, 23వ తేదీని రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. ఆ విజువల్స్ కూడా చూపించారు. అయితే హైదరాబాద్‌లో ల్యాండ్ కొనడం అంత ఈజీ కాదని చెప్పాడు. మొత్తానికి తన కల నెరవేరిందని శివ్ చెప్పగా.. ప్రియాంక ఫుల్ హ్యాపీగా కనిపించింది. ప్రస్తుతానితి ముహుర్తాలు లేవని, త్వరలో ఇంటి అప్డేట్స్ చెబుతామని ప్రియాంక-శివ్ చెప్పారు.(ఇదీ చదవండి:కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్ ) -
బిగ్ బాస్ అశ్విని శ్రీకి ఇంత గొప్ప అవార్డా? (ఫోటోలు)
-
Priyanka Jain HD Photos: తొలిసారి గ్లామర్ లుక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ 'ప్రియాంక' (ఫోటోలు)
-
విరూపాక్ష సినిమా నేను చేయాల్సింది: అర్జున్
సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చినవాళ్లు చాలానే ఉన్నారు. అయితే కొందరే క్లిక్ అవుతారు. సీరియల్స్‌కు, సినిమాకు మధ్యలో బిగ్‌బాస్ ప్లాట్‌ఫామ్‌ను వాడుకున్నవాళ్లూ ఉన్నారు. ఇక్కడ క్రేజ్ తెచ్చుకున్నాక పలువురూ సినిమాల్లో బిజీ అవుతుంటే మరికొందరు మాత్రం ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నెగెటివిటీ అయితే బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ అర్జున్ అంబటి మరో రకం. ఇతడు నేరుగా సినిమాల్లోనే అడుగుపెట్టాడు. కానీ ఎంత కష్టపడ్డా గుర్తింపే దొరకలేదు. దీంతో బుల్లితెరను ఆశ్రయించాడు. సీరియల్స్ ద్వారా క్లిక్ అయ్యాడు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రేజ్‌ను మరింత క్యాష్ చేసుకునేందుకు బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో అడుగుపెట్టాడు. కానీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడం అతడు చేసిన పెద్ద పొరపాటు! ఈ షో వల్ల అతడు నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు నటించిన తెప్ప సముద్రం త్వరలో రిలీజ్ కానుంది. రెండేళ్లు తిరిగాం ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన అర్జున్ అంబటి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'డైరెక్టర్ కార్తీక్ నా స్నేహితుడు. అతడు ఎప్పుడూ సినిమా ప్రపంచంలోనే ఉంటాడు. అతడితో నేను లూప్ అని ఓ వెబ్ ఫిలిం చేశాను. తర్వాత మేమిద్దరం ఓ సినిమా చేద్దామనుకున్నాం. నిర్మాతల కోసం రెండేళ్లు తిరిగాం. కానీ సెట్టవ్వలేదు. అప్పుడు ఓటీటీ లాంటి ప్లాట్‌ఫామ్స్ కూడా లేవు. ఆ ప్రాజెక్ట్‌కు శాసనం అని టైటిల్ పెట్టుకున్నాం. తర్వాత అదే విరూపాక్షగా రిలీజైంది. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. నాతో చేసుంటే అంత పెద్ద సక్సెస్ వచ్చి ఉండేది కాదేమో!' అని చెప్పుకొచ్చాడు. చదవండి: 'ఓం భీమ్ బుష్' సినిమా కలెక్షన్స్ ఊహించలేరు.. -
Shobha Shetty Latest Photos: లంగా ఓణీలో మరింత అందంగా 'బిగ్‌బాస్' శోభాశెట్టి (ఫొటోలు)
-
మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ ప్రశాంత్.. వాళ్లకు రూ.లక్ష సాయం
'బిగ్‌బాస్ 7' షో అయిపోయి చాలారోజులైపోయింది. రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో షోలో అడుగుపెట్టి విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్.. రూ.35 లక్షల ప్రైజ్‌మనీతో రైతులకు సాయం చేస్తానన్నాడు. మూడు నెలల కావస్తున్నా ఇంకా దాని గురించి ఊసేలేదని తెగ విమర్శలు వచ్చాయి. షోలు చేసుకుంటూ, ఎంజాయ్ చేస్తున్నాడని అందరూ మనోడిని తెగ ట్రోల్ చేశాడు. ఫైనల్‌గా ఇన్నాళ్లకు మాట నిలబెట్టుకున్నాడు. తొలి సాయం చేశాడు. (ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో నిశ్చితార్థం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్) గతంలో జరిగిన ఆరు సీజన్ల కంటే ఈసారి బిగ్‌బాస్.. ఊహించిన దానికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. దీనికి కారణం పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో వచ్చి షోలో సింపతీ కొట్టేశాడు. జనాలు కూడా ఇతడిని చెప్పింది నిజమా అబద్ధమా అనేది చూడకుండా నమ్మేశారు. ఓట్లు వేశారు. ఇక షోలో విజేతగా నిలిచిన తర్వాత అదే రోజు రాత్రి.. హైదరాబాద్‌లో ఇతడి ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్లు, బస్సుల అద్దాల పగలగొట్టి నానా రచ్చ చేశారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌ని కొన్నిరోజలు జైల్లో పెట్టడం, బెయిల్‌పై బయటకు రావడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. అయితే షోలో పల్లవి ప్రశాంత్ చెప్పినట్లు పేద రైతులకు సాయం చేస్తానని మాట మాత్రం మరిచిపోయాడా అని సందేహం వచ్చింది. అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ.. గజ్వేల్‌లోని కొలుగురూ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి ఏకంగా రూ.లక్ష సాయమందించాడు. తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లల కోసం రూ.లక్షతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందజేశాడు. ఇతడికి తోడుగా సందీప్ మాస్టర్ రూ.25 వేలు సాయం చేయడం విశేషం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సందీప్-ప్రశాంత్ పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్) View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
ప్రిన్స్ యావర్‌తో లవ్? క్లారిటీ ఇచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ
బిగ్‌బాస్ షోలో పాల్గొంటే పాపులారిటీ ఎంతొస్తుందో.. నెగెటివిటీ కూడా అదే స్థాయిలో వస్తుంది. చిన్నచిన్న పొరపాట్లను, తప్పులను కూడా భూతద్దంలో పెట్టి చూస్తూ కంటెస్టెంట్లను ట్రోల్ చేస్తుంటారు. అయితే ఇలాంటి షోలో ఎటువంటి నెగెటివిటీ లేకుండా బయటకు రావడం చాలా కష్టం. కానీ బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో ఫుల్ పాజిటివిటీతో బయటకు వచ్చింది నయని పావని. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టిన ఈమె ఒక్క వారంలోనే బయటకు వచ్చేసింది. కానీ బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. షో నుంచి బయటకు వచ్చాక బిగ్‌బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్‌తో తరచూ రీల్స్, డ్యాన్స్ వీడియోలు చేస్తూ వస్తోంది. ఇది చూసిన జనాలు.. వీళ్ల మధ్య ఏదో ఉందని అనుమానించడం మొదలుపెట్టారు. తాజాగా ఆమె అభిమానులతో చిట్‌చాట్ చేయగా ఓ వ్యక్తి నువ్వు ప్రిన్స్ యావర్‌తో ప్రేమలో ఉన్నావా? అని అడిగేశాడు. ఈ ప్రశ్న వినీవినీ విసుగెత్తిపోయిన నయని.. అరేయ్, ఏంట్రా మీరు? ఇంకో ప్రశ్నే లేదా? మా మధ్య ఏం లేదు అని ఎన్నిసార్లు క్లారిటీ ఇవ్వాలి అని రిప్లై ఇచ్చింది. దీంతో వారి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని క్లారిటీ వచ్చేసింది. #NayaniPavani Clarifies Relation with #Yawar pic.twitter.com/KR5B1jT93x — BigBoss Telugu Views (@BBTeluguViews) February 21, 2024 చదవండి: ఫస్ట్ ప్రెగ్నెన్సీ లేట్‌గా ప్లాన్ చేశా.. రెండోది త్వరలోనే.. -
బిగ్‌బాస్ విన్నర్ రైతుబిడ్డకు ఊరట.. ఇకపై..
గెలుపోటములు సహజమే.. కష్టసుఖాలూ కామనే.. కానీ రెండూ ఒకేసారి వస్తే తట్టుకోవడం, తట్టుకుని నిలబడటం చాలా కష్టం. పల్లవి ప్రశాంత్‌కు ఇటువంటి పరిస్థితే ఏర్పడింది. తనను తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్ విజేతగా ప్రకటించడంతో ఫుల్ ఖుషీ అయ్యాడు ప్రశాంత్. కానీ ఫినాలే ఎపిసోడ్ జరిగిన కొద్ది క్షణాలకే గందరగోళం సృష్టించాడు. స్టూడియో బయట పరిస్థితి బాలేదు, వెనకనుంచి వెళ్లిపో అని పోలీసులు చెప్తున్నా పట్టించుకోకుండా లెక్క చేయలేదు. ప్రశాంత్ రాకతో వీరంగం అప్పటికే అభిమానులు కంటెస్టెంట్ల కార్ల అద్దాలు, బస్సుల అద్దాలు ధ్వంసం చేస్తూ నానా వీరంగం సృష్టిస్తుండగా ప్రశాంత్ అక్కడికి చేరుకోవడంతో అక్కడి జనాలు మరింత రెచ్చిపోయారు. ఈ వ్యవహారంలో ప్రశాంత్, అతడి సోదరుడితో పాటు పలువురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నాలుగు రోజులపాటు జైల్లో ఉన్న ప్రశాంత్ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. రెండు నెలలుగా పోలీసుల ఎదుట హాజరు బెయిల్‌లోని కండీషన్ ప్రకారం రెండు నెలలుగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు పోలీసుల ఎదుట హాజరు నుంచి రిలీఫ్ ఇవ్వాలని ప్రశాంత్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై బుధవారం నాడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. ప్రశాంత్, ఆయన సోదరుడు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. చదవండి: అనసూయ గ్లామర్ వెనుక కష్టాలు ఎవరికీ తెలియవు.. తనలాంటి అమ్మాయి.. -
అమర్‌ను సర్ప్రైజ్ చేసిన శోభ.. అతడి కోసం త్యాగం..
బిగ్‌బాస్ షోను డీల్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. కంటెస్టెంట్లను మెచ్చుకోవాలి. తప్పు చేసినవారిని సరిచేయాలి.. వారి నుంచి ఎంటర్టైన్మెంట్ రప్పించాలి.. ఎపిసోడ్‌ను జోష్‌గా ఉంచాలి.. ప్రేక్షకులు షో చూడగలిగేలా చేయాలి.. ఇలా చాలానే ఉంటాయి. అయితే సినిమాలతో బిజీగా ఉన్నా సరే బిగ్‌బాస్‌ను ఓ బాధ్యతగా భుజానెత్తుకున్నాడు కింగ్ నాగార్జున. వరుసగా ఐదు సీజన్లకు ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఎనిమిదో సీజన్‌కు కూడా ఆయనే యాంకర్‌గా ఉంటాడు. ఇందులో డౌటే లేదు. శోభాకు టీషర్ట్ గిఫ్ట్ కాకపోతే నాగ్ ఎక్కువగా కోప్పడడు. అలాంటిది ఏడో సీజన్లో మాత్రం ఉగ్రరూపాన్ని చూపించాడు. ఒక్కొక్కరు మారు మాట్లాడకుండా చేశాడు. అమ్మాయిలను మాత్రం సుతిమెత్తగానే వారించేవాడు. ఓ రోజు శోభా శెట్టి నాగ్ ధరించిన టీ షర్ట్ చూసి ముచ్చటపడింది. అది కావాలని మనసులో మాట బయటపెట్టింది. అంత ప్రేమగా అడిగితే మన్మథుడు కాదంటాడా? షో అయిపోయిన వెంటనే ఆ టీ షర్ట్‌ను ఇచ్చేశాడు. కానీ అదే షోలో అమర్దీప్ అడిగితే మాత్రం నీకు ఇచ్చేదేంటన్నట్లుగా చూశాడు. ఫ్రెండ్ కోసం త్యాగం ఇక షో అయిపోయాక ఆ టీషర్ట్ ధరించి ఫోటోషూట్ కూడా చేసింది శోభ. అయితే స్నేహితుడి కోరిక గుర్తొచ్చి అతడి కోసం ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. నాగార్జున తనకు గిఫ్ట్‌గా ఇచ్చిన టీషర్ట్‌ను ఓ షోలో అమర్‌కు త్యాగం చేసింది. 'ఇది నాకెంతో విలువైన బహుమతి. కానీ ఆరోజు అమర్ నాగ్ సర్‌ను అడిగాడు, కాబట్టి ఇది తనకు ఇచ్చేస్తున్నా' అని చెప్పింది. అది తీసుకుని మురిసిపోయిన అమర్ స్టేజీపైనే దాన్ని ధరించి సంబరపడ్డాడు. ఇది చూసిన జనాలు శోభను మెచ్చుకుంటున్నారు. ఫ్రెండ్ అంటే నీలా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: షారుక్ ఖాన్ అంత ఆస్తి లేదు, భరణం ఎంతిచ్చానంటే? -
బిగ్‌బాస్ ప్రియాంకతో సహజీవనం, పెళ్లి.. బాయ్‌ఫ్రెండ్ సమాధానమిదే
బిగ్‌బాస్ 7 ఫేమ్ ప్రియాంక సహజీవనం చేస్తోంది. ఈమె గురించి పరిచయమున్న వాళ్లకు ఈ విషయం తెలుసు. ఎందుకంటే ఈ షో జరుగుతున్న టైంలోనే ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ హౌసులోకి వచ్చాడు. బయటకు రాగానే పెళ్లి చేసుకుందామని ఆమెతో చెప్పుకొచ్చాడు. ఇదంతా జరిగి దాదాపు మూడు నెలలు కావొస్తోంది. దీంతో చాలామంది ప్రియాంకని పెళ్లెప్పుడు? అని అడుగుతున్నారు. తాజాగా దీనిపై ఈమె ప్రియుడు స్పందించాడు. మ్యారేజ్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. కర్ణాటకలో పుట్టి పెరిగిన ప్రియాంక.. తెలుగులో పలు సీరియల్స్‌లో హీరోయిన్గా చేసింది. 'జానకి కలగనలేదు' సీరియల్‌తో అనే సీరియల్‌తో కాస్త పాపులారిటీ తెచ్చుకుంది. ఈమెకు సీరియల్ నటుడు శివకుమార్‌తో ప్రేమలో ఉంది. ఇంకా చెప్పాలంటే వీళ్లిద్దరూ చాన్నాళ్ల నుంచి లివ్ ఇన్ రిలేషన్షిప్(సహజీవనం)లో ఉన్నారు. గతేడాది బిగ్‌బాస్ షో వల్ల తెలుగు ప్రేక్షకులకు ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ పెళ్లెప్పుడు? పెళ్లెప్పుడు? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిపై ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ పూర్తి స్పష్టత ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: పెళ్లి అయిపోయిందిగా సినిమాలు మానేస్తారా? క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు) 'పెళ్లి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందులోనూ ప్రియాంక గ్రాండ్‌గా కొన్నిరోజుల పాటు పెళ్లి చేసుకోవాలి అనుకుంటోంది. అంత గ్రాండ్‌గా చేసుకోవాలంటే డబ్బులు కావాలి. అందుకే ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. పెళ్లి అవ్వకుండా ఎలా జీవిస్తున్నారు? మీ పేరెంట్స్ ఏం అనట్లేదా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మేం వాళ్ల అంగీకారంతోనే కలిసి ఉంటున్నాం. అయితే ఈ కామెంట్స్‌కి చెక్ పెట్టేందుకు ఒకానొక టైంలో రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోవాలని ఆలోచన ఒకటి వచ్చింది. కానీ తర్వాత దాన్ని విరమించుకున్నాం' అని ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ శివ చెప్పుకొచ్చాడు. దీనిబట్టి చూసుకుంటే ప్రియాంక-శివకుమార్ ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం కష్టమే అనిపిస్తుంది. బాగా డబ్బులు సంపాదించాలి అంటున్నారంటే మరో రెండు మూడేళ్ల తర్వాత పెళ్లి ఉండొచ్చని ఈ జంట క్లారిటీ ఇస్తున్నట్లే. (ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం వివాదం.. ఇప్పుడు సారీ చెప్పిన యంగ్ హీరోయిన్) -
చాలాసార్లు మోసపోయా.. డబ్బులు తిరిగివ్వలేదు.. ఇన్నాళ్లకు!:శోభ
బిగ్‌బాస్ షో వల్ల పాపులారిటీ ఎంతొస్తుందో నెగెటివిటీ కూడా అంతే వస్తుంది. షోలో ఏమాత్రం తడబడ్డా, గొడవలు పడ్డా వారిని సోషల్ మీడియాలో ఇట్టే ట్రోలింగ్ చేస్తుంటారు. అలా తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లో శోభా శెట్టిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ప్రతీదీ తనకే కావాలన్న స్వార్థం, ఓటమిని అంగీకరించలేని తత్వం, చిన్నదానికీ గొడవపడే వైఖరి ఆమెను విమర్శలపాలు చేసింది. అదే సమయంలో శివంగిలా పోరాడే గుణం, స్నేహితుల కోసం ఎంతవరకైనా వెళ్లే మంచి మనసు ఆమెకు అభిమానులను తెచ్చిపెట్టింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల.. ఇక షో ముగిశాక తన పర్సనల్ లైఫ్‌పై ఎక్కువ ఫోకస్ చేసిందీ బ్యూటీ. ఈ మధ్యే తన ప్రియుడు యశ్వంత్‌తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. తాజాగా మరో శుభవార్త చెప్పింది శోభ. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల ఇప్పుడు సాకారమైందని, అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజు(జనవరి 22న) కొత్తింటి తాళం తన చేతికొచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది. శోభా మాట్లాడుతూ.. 'రెండేళ్ల క్రితం నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ చూశాం. నచ్చడంతో అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చాం. కానీ ఏవో కారణాల వల్ల ఆ భవన నిర్మాణం ఆగిపోయింది. డబ్బులు తిరిగివ్వలేదు అప్పుడు మేమిచ్చిన డబ్బులు కూడా తిరిగివ్వలేదు. అలా చాలాసార్లు మోసపోయాం. ఈ క్రమంలో ఈ ఇల్లు కూడా కొంటానా? లేదా? అని టెన్షన్‌పడ్డాను, కానీ మొత్తానికి నా కల నెరవేరింది. బిగ్‌బాస్ ఇచ్చిన డబ్బులతో ఈ ఇల్లు తీసుకోలేదు. రెండేళ్ల క్రితమే దీన్ని కొనుగోలు చేశాము. కాకపోతే ఆలస్యంగా ఈ ఇంటి తాళం నా చేతికి వచ్చింది. మేము 15వ అంతస్థులో ఉన్న ఫ్లాట్ తీసుకున్నాం. ఇంటీరియర్ డిజైనింగ్‌కు మరో నాలుగు నెలలు పడుతుంది. ఆ తర్వాతే ఈ ఇంటికి షిఫ్ట్ అవుతాం' అని చెప్పుకొచ్చింది. -
తీవ్ర రక్తస్రావం.. పరీక్షిస్తే క్యాన్సర్..
-
బిగ్‌బాస్ 7 విన్నర్ ప్రశాంత్ అరెస్ట్‌పై స్కిట్.. ముఖం మాడ్చుకున్న శివాజీ!
బిగ్‌బాస్ 7 షో దాదాపు నెలన్నర క్రితమే అయిపోయింది. రైతుబిడ్డ అని చెప్పుకొన్న పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఫైనల్ తర్వాత హైదరాబాద్ రోడ్లపై నానా రచ్చ చేశాడు. అతడి అభిమానులైతే.. ఆర్టీసీ బస్సులతో పాటు పలువురు కార్లని కూడా ధ్వంసం చేశారు. దీంతో ప్రశాంత్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇంత సీరియస్ విషయాన్ని ఇప్పుడు కామెడీ చేసి పడేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బిగ్‌బాస్ 7వపై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా శివాజీ ఆటతీరు, షోలో అమ్మాయిలపై చేసిన వల్గర్ కామెంట్స్.. షో చూడాలనే ఆసక్తిని పూర్తిగా చంపేశాయి. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా శివాజీ బుర్ర ఇంకా అలానే ఉండిపోయింది. అమర్, శోభాపై పిచ్చిపిచ్చి కామెంట్స్ చేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) సరే ఇదంతా పక్కనబెడితే శివాజీ ఈ మధ్య ఓ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేశాడు. ఓటీటీలో అది ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దాని ప్రమోషన్స్ కోసం ప్రముఖ కామెడీ షోకి వచ్చాడు. అయితే చాలా కాంట్రవర్సీ అయిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌ని ఇందులో స్కిట్‌గా వేశారు. పాపం అంత సీరియస్ విషయాన్ని పూర్తిగా కామెడీ చేసి పడేశారు. స్కిట్ చూస్తున్న టైంలో శివాజీ ముఖమైతే పూర్తిగా మాడిపోయింది. ఏదో తెచ్చిపెట్టుకున్నట్లు కాస్త నవ్వాడు అంతే! తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇదంతా ఉంది. అయితే బిగ్‌బాస్ షోలోకి రాకముందు శివాజీపై కొందరి వరకు కాస్త మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ షోలో పార్టిసిపేట్ చేశాడో.. తన ప్రవర్తనతో ఉన్న ఆ కాస్త పరువు కూడా పోగొట్టుకున్నాడు! ఇప్పుడు అదే శివాజీకి దోస్త్ అయిన ప్రశాంత్ అరెస్టుపై స్కిట్ వేసి.. శివాజీని సైలెంట్ అయిపోయేలా చేసేపడేశారు. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) -
ప్రియాంకకు చెప్పాలనుకున్న బ్యాడ్ న్యూస్ ఇదేనా?
-
ఆ బ్యాడ్‌న్యూస్ ఇదేనా? ప్రియాంకకు దూరంగా..
సీరియల్ నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియాంక జైన్. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరైంది. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి ఓసారి ప్రియుడు శివకుమార్ వచ్చినప్పుడు ఎమోషనలైంది నటి. పెళ్లి చేసుకుందాం.. ఇప్పుడే, ఇక్కడే! అంటూ అతడిని క్షణం కూడా వదల్లేకపోయింది. అటు శివకుమార్ నీకో గుడ్‌న్యూస్, బ్యాడ్‌న్యూస్ రెండూ చెప్తానన్నాడు. షో అయిపోయాక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని ఆ శుభవార్తను బయటపెట్టాడు. తాజాగా అతడు అమెరికా షిఫ్ట్ కాబోతున్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. వీసా కోసం తిప్పలు అతడు చెప్తానన్న బ్యాడ్ న్యూస్ ఇదేనా? ప్రియాంకను వదిలి దూరంగా వెళ్లిపోతున్నాడా? అని అభిమానులు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఇక తన యూట్యూబ్ వీడియోలో వీసా పొందడానికి ఢిల్లీ వెళ్లి ఎన్ని తిప్పలు పడ్డాడో వివరించాడు. శివకుమార్ మాట్లాడుతూ.. యూఎస్ ఎంబసీ ముందు వీడియోలు తీస్తే ఫోన్లు లాగేసుకుంటారట. అందుకని అక్కడ వీడియో చేయలేకపోయాను. కానీ మొదటి ప్రయత్నంలోనే వీసా వచ్చేసింది. ప్రియాంక కాళ్లు మొక్కి మరీ వెళ్లాను. ప్రియాంకతో పాటు అమ్మ ఆశీర్వాదం వల్లే వీసా వచ్చింది. 20 సెకన్లలోనే ఇంటర్వ్యూ అయిపోయింది. త్వరలోనే ఒక సర్ప్రైజ్ ఆమె న్యూయార్క్ ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? అని అడిగింది. నేను తెలుగు ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. ఈ మధ్యే సీరియల్ అయిపోయింది. రెండు నెలలుగా ఖాళీగా ఉంటున్నాను. ఈ సమయంలో న్యూయార్క్ వెళ్లి రావాలనుకుంటున్నాను అని చెప్పాను. వార్షిక జీతం, ఎవరెవరు వెళ్తున్నారని అడిగింది. అన్నింటికీ సమాధానాలు చెప్పాను. చివరకు వీసా అప్రూవ్ అని చెప్పడంతో సంతోషమేసింది. త్వరలోనే ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది' అని చెప్పుకొచ్చాడు. అసలు శివకుమార్ అమెరికాకు వెకేషన్ వెళ్తున్నాడా? లేదంటే అక్కడే సెటిల్ అయ్యే ఆలోచనలున్నాయా? ఏంటనేది వీడియోలో స్పష్టంగా చెప్పలేదు. చదవండి: భర్తకు నళిని విడాకులు.. ఆ తర్వాత కూడా నాన్న కొట్టేవాడన్న నటి కూతురు -
నా తల్లి ముందే అలాంటి బూతులు వినాల్సి వచ్చింది: అమర్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పలు వివాదాలతో ముగిసింది. హౌస్‌లో అమర్, శోభ,ప్రియాంక (SPY) ఒక బ్యాచ్‌లో ఉంటే.. శివాజీ, ప్రశాంత్, యావర్ (SPA) బ్యాచ్‌లో ఉన్నారు. ఈ రెండు బ్యాచ్‌ల మధ్య పెద్ద గొడవలే జరిగాయి. ఫైనల్‌గా ప్రశాంత్ విన్నర్ అయితే.. అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. కానీ చాలా మంది ప్రేక్షకుల అభిమానాన్ని ఆయన అమర్ పొందాడు. అతను హీరో రవితేజ సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అనుకున్నాడు. బిగ్ బాస్ వల్ల ఆ అవకాశం దక్కింది అదే నాకు పెద్ద విజయం అని అమర్ పేర్కొన్నాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అమర్ కారుపై దాడి జరుగుతున్నప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో ఒక ఇంటర్వ్యూలో అమర్ ఇలా తెలిపాడు. 'హౌస్ నుంచి బయటకు రాగానే మా వాళ్లు అందరూ నన్ను దాక్కో అన్నారు... బయట ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను ఎందుకు దాక్కోవాలి..? నేను ఏం తప్పు చేశాను అని కారు ఎక్కి స్టార్ట్ అయ్యాం. కారు బయటకు రాగానే చాలామంది నా కారు చూట్టూ తిరుగుతూ ఫోన్ లైట్ ఆన్ చేశారు. నేను కనిపించగానే ఒక్కసారిగా బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. రాళ్లతో కారు అద్దాలు పగలకొట్టారు.. అమ్మ పక్కన ఉండగానే నోటికి ఏదొస్తే అది అనేశారు. తల్లి పక్కన ఉన్నప్పుడు అలాంటి మాటలు ఏ కుమారుడు వినలేడు.. వారందరి కోపం నామీద కదా అని కారు దిగే ప్రయత్నం చేస్తే అమ్మ ఆపింది. నాలుగు దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ ఆ తిట్లు భరించలేకపోయాను. కొందరైతే నా భార్య తేజును తీసుకెళ్తాం అంటూ బూతులు మాట్లాడారు. ఇవే మాటలు మిమ్మల్ని ఎవరైనా అంటే తట్టుకోగలరా..? ఓర్చోకోగలరా..? వారందరి మీదా నేనూ రియాక్ట్ కాగలను, కేసులు పెట్టగలను కానీ వారికీ కుటుంబాలు ఉంటాయని ఆలోచించి వద్దనుకున్నాను. నేను మీకు ఏం పాపం చేశాను..? అదొక గేమ్ మాత్రమే.. హౌస్‌లో కొందరు నన్ను పదేపదే తిట్టినా పెద్దవారు కదా అని ఓర్చుకున్నాను.. వారి వద్ద నేను నిజాయితీగానే మాట్లాడాను.. బ్యాక్ బిచింగ్ చేయలేదు. అని అమర్ తెలిపాడు. అందరిలా తను కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చానని అమర్ పేర్కొన్నాడు. తన నాన్నగారు ఆర్టీసీ ఉద్యోగి అని.. అందులో ఒక మెకానిక్‌గా పనిచేస్తాడని అమర్ తెలిపాడు. సినిమా అంటే అభిమానంతో ఈ పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. తన అమ్మగారు అనంతపురం జిల్లాలో బీజేపీ మహిళా విభాగం 'మహిళా మోర్చా' లో కార్యకర్తగా పనిచేస్తున్నారని ఆయన చెప్పాడు. -
పవన్ కళ్యాణ్ ఎలాంటి వాడంటే.. బిగ్ బాస్ 'అశ్విని' కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్-7లో వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన అశ్విని శ్రీ మంచి పాపులారిటీని తెచ్చుకుంది. 5వ వారంలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్‌లో టాస్క్‌ల పరంగా పెద్దగా మెప్పించకపోయిన తన అందాలతో ఎనలేని క్రేజ్ తెచ్చుకుంది. హౌస్‌లో భోలే షావళితో మంచి పెయిర్‌గా తన ఆటను కొనసాగించిన ఈ బ్యూటీ 12వ వారంలో ఎలిమినేట్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్విని హీరో పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. తాను గబ్బర్ సింగ్‌లో నటించిన సమయంలో పవన్‌తో తనుకున్న పరిచియాన్ని తెలిపింది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఫ్రెండ్‌గా నటించిన అశ్విని మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ OG సినిమా హిట్ కావాలని ఆమె కోరుకుంది. పవన్ కల్యాణ్ ఎప్పుడూ నా వాడే.. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పింది. పవన్ కల్యాణ్‌ను మళ్లీ కలిసే అవకాశం వస్తే మీ రియాక్షన్ ఏంటని అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చింది. ' పవన్‌తో దాదాపు 3 నెలలు జర్నీ చేశాను. షూటింగ్ సమయంలో పక్కన కూర్చొపెట్టుకుని పవన్ సార్ మాట్లాడేవారు. సెట్స్‌లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ తింటున్న డ్రై ఫ్రూట్స్ కూడా తినమ్మా అంటూ నాకు ఇచ్చేవారు. అశ్విని కమాన్ అని ఎంకరేజ్ చేసేవారు. ఆయనకి ఎప్పుడైనా బోర్ కొడితే నన్నే పిలిచేవారు.. ఆపై మాతో పాటలు, డ్యాన్స్ చేపిస్తూ సరదాగా ఉంటారు. అందుకే పవన్ అంటే ఇష్టం. ఆయన నేను క్యారివాన్‌లో ఉండేవాళ్లం. షూటింగ్‌కి రోజులో ఒక్కోసారి మాత్రమే పిలిచేవారు. మిగిలిన టైం అంతా క్యారివాన్లోనే ఉండేదాన్ని. ఆయనపై ఉన్న ఇష్టం మాటల్లో చెప్పలేను. సంథింగ్ ఆయనలో ఏదో ఉంటుంది. గబ్బర్ సింగ్ టైంలో సార్‌తో షూటింగ్ చేసి ఇంటికెళ్లి పడుకున్న తర్వాత ఆయన నాకు కలలోకి వచ్చేవారు. ఆయనతో షూటింగ్ చేస్తున్నట్టుగానే డ్రీమ్స్ వచ్చేవి. ఆయనతో ఎక్కడికో వెళ్లినట్టుగా పిచ్చి పిచ్చి కలలు వచ్చేవి. సార్ నన్ను మర్చిపోయి ఉంటారు కానీ.. నేను ఎప్పటికీ మర్చిపోలేని అనూభూతులు ఆయనతో ఉన్నాయి.'అని ఆమె చెప్పింది. పవన్‌పై అశ్విని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో గబ్బర్ సింగ్‌తో పాటు రాజా ది గ్రేట్ వంటి చిత్రాల్లో నటించినా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు.. మళ్లీ ఇప్పుడు బిగ్ బాస్ వల్ల మంచి గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
హీరోగా బిగ్‌బాస్ కంటెస్టెంట్.. పాటతో కుమ్మేసిన భోలె!
ఆట సందీప్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లో కొరియోగ్రాఫర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి ఆయన పేరు ఆట సందీప్‌గా మారిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా మంచి డ్యాన్సరే కావడం విశేషం. అంతే కాకుండా గతేడాది జరిగిన బిగ్‌బాస్ రియాలిటీ షో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. చాలా వారాల పాటు హౌస్‌లోనూ తన ఆటతీరుతో మెప్పించారు. అయితే ప్రస్తుతం ఆట సందీప్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ది షార్ట్‌కట్ అనే చిత్రంలో ఆయన నటిస్తున్నారు. విజయానికి అడ్డదారులువండవు అనేది ఈ మూవీకి క్యాప్షన్. ఈ చిత్రాన్ని రామకృష్ణ కంచి దర్శకత్వంలో తోట రంగారావు, రజినీకాంత్ పున్నపు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ఈవెంట్లో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ పాల్గొన్ని సందడి చేశారు. ఈవెంట్‌కు హాజరైన వారిలో భోలె షావలి, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శివాజీ, అశ్విని, గౌతమ్ ఉన్నారు. View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) -
తండ్రి అయిన ‘బిగ్‌బాస్’ అర్జున్.. ఏం పేరు పెట్టారంటే..?
బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ అర్జున్ అంబటి తండ్రి అయ్యాడు. అర్జున్ భార్య సురేఖ ఈ రోజు (జనవరి 9) పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అర్జున్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన కూతురుకి ఆర్ఖా అని నామకరణం చేశాడు. కూతురు పుట్టినా, కొడుకు పుట్టినా ఈ పేరునే పెట్టుకుంటానని బిగ్‌బాస్ హౌస్‌లోనే చెప్పాడు అర్జున్. తన పేరులోని ఆర్.. సురేఖ పేరులో నుంచి ఖ తీసుకొని అర్ఖా అని పేరు ఫిక్స్ చేసినట్లు ఓ వీకెండ్ ఎపిసోడ్లో చెప్పాడు. అయితే తనకు మాత్రం కూతురు పుట్టాలనే ఉందని చెప్పాడు. అనుకున్నట్లే అర్జున్‌కి కూతురే పుట్టింది. దీంతో అర్జున్ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. అర్జున్-సురేఖ దంపతులకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, పలు సీరియళ్లలో హీరోగా నటించిన అర్జున్.. బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొని తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. షో ప్రారంభమైన ఐదు వారాల తర్వాత అర్జున్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనితో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. కానీ అర్జున్ మాత్రం చివరి వరకు ఉన్నాడు. ఫినాలే రోజు టాప్ 6 ప్లేస్‌లో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం బుల్లితెరపై షోలు, సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. త్వరలోనే ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Nagarjuna Reddy Ambati (@ambati_arjun) -
ఆపరేషన్ థియేటర్లో బిగ్‌బాస్ ప్రియాంక.. ఏమైందంటే?
సీరియల్ ద్వారా బోలెడంత ఫేమ్ సంపాదించుకుంది ప్రియాంక జైన్. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్ ద్వారా జనాల్లో మరింత గుర్తింపు తెచ్చుకుంది. తన ఆటతో, మాటలతో టాప్ 5లో చోటు దక్కించుకుంది. త్వరలోనే తన ప్రియుడు, నటుడు శివకుమార్‌ను పెళ్లాడబోతున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ సీరియల్ నటి ఆస్పత్రిపాలైంది. ఆమెకు ఆపరేషన్ జరిగిందంటూ శివకుమార్ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఏడో తరగతిలో సైట్.. 'ప్రియాంక బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు నేను కంటి ఆపరేషన్ చేయించుకున్నాను. కళ్లు ఎర్రబడిపోయి, నొప్పితో విలవిల్లాడిపోయాను. లాసిక్ సర్జరీ చేశాక దాదాపు 8-10 గంటల పాటు కళ్లు తెరవలేము. ఇప్పుడు ప్రియాంక కూడా అదే సర్జరీ చేయించుకుంటోంది' అని చెప్పాడు. ప్రియాంక మాట్లాడుతూ.. 'నాకు ఏడో తరగతిలో సైట్ వచ్చింది. అప్పటినుంచే కళ్లద్దాలు పెట్టుకుంటున్నాను. దాదాపు 15 ఏళ్లుగా కళ్లజోడు పెట్టుకుంటూనే ఉన్నాను. ప్రతిరోజూ ఇవి ధరించడం వల్ల ఇరిటేషన్ వస్తోంది. అందుకే సర్జరీ చేయించుకుందామనుకుంటున్నాను' అని చెప్పింది. కంటి ఆపరేషన్ సక్సెస్ తర్వాత తను ఆస్పత్రికి వెళ్లిన మొదటి రోజు నుంచి ఏమేం జరిగిందో వివరంగా వీడియోలో చూపించారు. శివకుమార్ ఆమె గురించి భయపడుతున్నా ప్రియాంక మాత్రం ఎంతో ధైర్యంగా సర్జరీకి ముందడుగు వేసింది. చివరకు ఆస్పత్రిలో తన కంటి ఆపరేషన్ ఎలా చేశారన్నది కూడా వీడియోలో క్లియర్‌గా చూపించారు. మొత్తానికి కొన్నేళ్లుగా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రియాంకకు ఎట్టకేలకు దాన్నుంచి విముక్తి లభించింది. ఈ సర్జరీ విజయవంతమైందని, ఇక కళ్లజోడుతో తనకు పని లేదని సంతోషం వ్యక్తం చేసింది ప్రియాంక. చదవండి: ఒకప్పుడు జేబు నిండా నోట్ల కట్టలు.. చివరకు కారు డిక్కీలో తెలుగు కమెడియన్ శవం -
బిగ్ బాస్ కోసం రూ. 2.50 లక్షలు ఇస్తే మోసం చేశారు: యాంకర్
బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ ముగిసిపోయింది. కానీ ఉల్టాపుల్టా పేరుతో వచ్చిన ఈ సీజన్ ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పించిందో తెలియదు కానీ వివాదాలు మాత్రం భారీగానే ఉన్నాయి. బిగ్ బాస్ పేరుతో మోసం చేశారంటూ టాలీవుడ్ నటి, యాంకర్ స్వప్న చౌదరి ఒక వీడియో విడుదల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 'నమస్తే సేట్ జీ' సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో కి అడుగుపెట్టి అందరి నోట మంచి నటిగా పేరు తెచ్చుకుంది ఖమ్మం జిల్లాకి చెందిన అమ్మినేని స్వప్న చౌదరి. యాంకర్‌గా, ఈవెంట్ ఆర్గనైజర్‌గా, అటూ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ తెలుగమ్మాయి బిగ్ బాస్‌కు వెళ్లాలని చాలారోజుల నుంచి కోరిక ఉంది. ఇదే విషయాన్ని గతంలో కూడా చెప్పుకొచ్చింది. దీనినే కొందరు అదునుగా చూసుకొని ఆమె నుంచి రూ. 2.50 లక్షలు తీసుకుని మోసం చేశారు. ఇదే విషయాన్ని ఆమె వీడియో ద్వారా తెలిపింది. 'నాకు బిగ్ బాస్‌కి వెళ్లడం అంటే చాలా ఇష్టం.. ఎంతలా అంటే నేను నిద్రపోతున్న సమయంలో కూడా బిగ్ బాస్‌లో ఉన్నట్లు ఊహించుకుంటాను. బిగ్ బాస్ సీజన్ -1 నుంచి అన్నీ సీజన్లు ఎంతో ఇష్టంగా చూశాను. బిగ్ బాస్ సీజన్-7 సమయంలో నన్ను కంటెస్టెంట్‌గా పంపిస్తానని చెప్పి తమ్మలి రాజు అనే వ్యక్తి నా దగ్గర రూ. 2.50 లక్షలు తీసుకున్నాడు. ఈ డబ్బుతో ప్రతి శనివారం వచ్చే ఎపిసోడ్ సమయంలో నాకు కాస్ట్యూమ్స్ పంపిస్తానన్నాడు. అతని మాటలు నమ్మి నేను గతేడాది జూన్‌లో డబ్బు ఇచ్చాను. ఆ డబ్బే కాకుండా ఫోటో షూట్ కోసం రూ. 25వేలు తీసుకున్నాడు. చివరి క్షణం వరకు పంపిస్తానని చెప్పి..చేతులెత్తేశాడు. ఆ సమయంలో నాకొక అగ్రిమెంట్ రాసిచ్చాడు. బిగ్ బాస్‌కు పంపించలేకపోతే డిసెంబర్ నెలలో డబ్బు తిరిగిచ్చేస్తానని చెప్పాడు. కాల్ చేస్తే సరిగ్గా రెస్పాండ్ కాలేదు.. జనవరిలో తప్పకుండా ఇస్తానన్నాడు.. తీరా ఇప్పుడు కాల్ చేస్తే నీకు నచ్చింది చేసుకో.. కావాలంటే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసుకో అని వార్నింగ్ ఇస్తున్నాడు. నేను ఎంతో కష్టపడి ఆ డబ్బు సంపాదించుకున్నాను. బిగ్ బాస్‌లోకి వెళ్దామనే నా ఆశను తుంచేశాడు. ఇలాంటి వాళ్లను నమ్మి టీమ్‌గా పెట్టుకోకండి. వచ్చే సీజన్లో అయిన నాకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను. అని స్వప్న తెలిపింది. View this post on Instagram A post shared by 𝐀𝐧𝐜𝐡𝐨𝐫 𝐒𝐰𝐚𝐩𝐧𝐚 𝐜𝐡𝐨𝐰𝐝𝐚𝐫𝐲 (@its_me_swapna_chowdary) -
పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై మొదటిసారి రియాక్ట్ అయిన అమర్ దీప్
బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్‌ను రైతుబిడ్డ అనే ట్యాగ్‌లైన్‌తో ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ గెలుచుకుంటే రన్నర్‌గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్‌లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్‌ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. అంతేకాకుండా అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను కూడా కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పోలీసుల సూచనలు పాటించకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేయడం వల్లే ఈ గొడవకు కారణమని పోలీసులు అయన్ను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు కూడా పంపించారు. ఆపై ప్రశాంత్ బెయిల్ మీద విడుదలయ్యాడు. తాజాగా అమర్ మొదటిసారి బిగ్ బాస్ గురించి రియాక్ట్ అయ్యాడు. 'హౌస్ నుంచి నేను బయటకు రాగానే ఏం జరుగుతుందో అనేది నాకేం అర్థం కాలేదు. అప్పుడు నా మైండ్ బ్లాంక్‌గా ఉంది. అక్కడితోనే ఆ గొడవ ముగిసిపోయింది. బిగ్ బాస్ వల్ల నాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా అభిమానుల ప్రేమ దొరికింది. అన్నింటికి మించి నా అన్న రవితేజ సినిమాలో ఛాన్స్ దక్కింది. బిగ్ బాస్ విన్నర్ కంటే నాకు రవితేజ సినిమా అవకాశం దక్కడమే గొప్ప విజయం. ఈ షో ద్వారా నాకు కావాల్సిన ఆదరణ దక్కింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా నన్ను గుర్తిస్తారు.. ఇవన్నీ కూడా బిగ్ బాస్ ద్వారా వచ్చిన అచీవ్మెంట్స్ అని నేను భావిస్తాను. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అనేది మిస్ అండర్స్టాండింగ్ వల్లే జరిగింది. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు.. కానీ కొందరు ఫ్యాన్స్ చేస్తున్న పనుల వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదరైతాయి. ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉండటం సహజమే.. ఇదీ ఎప్పుడూ ఉండేదే.. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నా అభిమాన హీరోను ఎవరైనా ఒక మాట అంటే గొడవపడే వాళ్లం... కొంత ఆలోచన శక్తి వచ్చాక అవన్నీ వదిలేసి అందరం కలిసి ప్రతి హీరో సినిమా చూసేవాళ్లం.. ఒకరి కోసం తిట్టుకోవడం, గొడవ పడటం లేకుండా అందరూ కలిసి ఆనందంగా ఉండండి.' అని అమర్ అన్నాడు. -
నాగార్జున స్పెషల్ గిఫ్ట్.. ఎగిరి గంతేసిన బిగ్‌బాస్ బ్యూటీ
విలనిజం పండించడం అంత ఈజీ కాదు. విలన్‌గా హీరోహీరోయిన్లను డామినేట్ చేయడమూ అంత ఈజీ కాదు. కానీ 'కార్తీక దీపం' సీరియల్‌తో మోనిత అలియాస్ శోభా శెట్టి అన్నీ సుసాధ్యమే అని నిరూపించింది. కొన్ని సార్లు హావభావాలతోనే విలనిజం పండించేది. మరికొన్నిసార్లు తన యాక్టింగ్‌తో అవతలవారిని డామినేట్ చేసేది. ఈ ధారావాహికలో ఆమె చేసే కుట్రలు, కుతంత్రాలు చూసి జనాలు అమ్మో.. అని దడుచుకునేలా చేసింది. నాగార్జునను అడిగేసిన శోభ ఎంతో టాలెంట్ ఉన్న ఈ నటి తెలుగు బిగ్‌బాస్ 7లోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సీజన్లో తన ఆటతో, అందంతో రఫ్ఫాడించింది. చాలాసార్లు తనలోని మోనితను బయటకు తీసుకువచ్చేది శోభ. అదే సమయంలో ఎవరికీ జంకకుండా, తనకు నచ్చింది చేసుకుంటూ పోతూ శివంగిలా ఆడేది. ఈ తీరు చాలామంది జనాలను కట్టేపడేసింది. ఇక షోలో ఉన్నప్పుడు ఓసారి హోస్ట్ నాగార్జున వేసుకున్న వెరైటీ షర్ట్ చూసి ముచ్చటపడిపోయింది శోభ. అది తనకు కావాలని అడిగింది. దాన్ని సీరియస్‌గా తీసుకున్న నాగ్ నిజంగానే ఆ డ్రెస్‌ను ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని శోభ తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడించింది. గుర్తుపెట్టుకుని మరీ బహుమతిచ్చిన నాగ్ 'బహుశా ఆరో వారంలో అనుకుంటా.. అప్పుడు నాగార్జున ధరించిన టీ షర్ట్ కావాలని అడిగాను. తర్వాత నేను 14వ వారంలో ఎలిమినేట్ అయ్యాను. నేను టీ షర్ట్ అడిగిన విషయం గుర్తుపెట్టుకుని మరీ ఎలిమినేట్ అయిన రోజు నాగ్ సర్ స్వయంగా ఆ టీషర్ట్ ఇచ్చారు. ఆయన వేసుకున్న టీషర్ట్ నాకు ఇచ్చేశారు.. అంతకంటే సంతోషం ఏముంటుంది? ఇది ధరించి ఫోటోషూట్ కూడా చేశాను' అంటూ తన షూట్ ఎలా జరిగిందో వీడియోలో చూపించింది. ఇది చూసిన జనాలు.. శోభా అనుకున్నది సాధించింది.. నువ్వు ఇలాగే డేర్ అండ్ డాషింగ్‌గా ఉండాలి, మరిన్ని మంచి అవకాశాలతో కెరీర్లో పైకి ఎదగాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఫుడ్ పాయిజన్ తర్వాతే ఇలా.. క్రికెట్ ఆడేటప్పుడు అలా అవడంతో. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ.. ఇన్నాళ్లకు ఓటీటీలో రిలీజ్ -
నువ్వు తోపెహె.. బిగ్‌బాస్‌ను ఇలా కూడా వాడుకుంటారా?
ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో వచ్చిన బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రేక్షకుల మనసులు గెలుచుకుని విజయవంతం అయింది. రైతుబిడ్డ విజేతగా.. బీటెక్ కుర్రాడు రన్నర్‌గా నిలిచాడు. నీతులు చెప్పడమే తప్ప పాటించడం తెలియని శివాజీ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రియాంక, ప్రిన్స్ యావర్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉండగా టాస్కుల బాహుబలిగా పేరు గడించిన అర్జున్ ఆరో స్థానానికి పరిమితమయ్యాడు. అసలు ఫినాలే వరకు రాకుండా ఎనిమిదో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు కొరియోగ్రాఫర్ సందీప్. ఎన్నో తప్పులు.. అయినా బెస్ట్ సంచాలక్ బిగ్‌బాస్ 7 నుంచి ఎలిమినేట్ అయిన ఫస్ట్ మేల్ కంటెస్టెంట్‌గా, అలాగే నామినేషన్లోకి వచ్చిన మొదటి వారమే ఎలిమినేట్ అయిన హౌస్‌మేట్‌గా తనకంటూ ఓ రికార్డు కూడా ఉంది. ఇకపోతే ఫినాలే రోజు నాగార్జున.. కంటెస్టెంట్లకు ఒక్కో అవార్డు ప్రకటించాడు. అందులో భాగంగా.. సందీప్‌కు బెస్ట్ సంచాలక్ అవార్డు ఇచ్చాడు. నిజానికి సందీప్ సంచాలకుడిగా ఉన్నప్పుడు చాలా సార్లు తప్పులు జరిగాయి. కానీ ఎక్కువసార్లు అతడే సంచాలకుడిగా ఉన్నందుకో ఏమో కానీ తనను ఉత్తమ సంచాలకుడిగా ప్రకటించేశారు. అయితే ఇప్పుడు అదే అవార్డును తన పేరు ముందు పెట్టేసుకున్నాడు సందీప్. ఈ డ్యాన్స్ మాస్టర్ ప్రస్తుతం హీరోగా ద షార్ట్‌కట్ అనే సినిమా చేస్తున్నాడు. ఆస్కార్ గెలిచినట్లు ఫీలవుతున్నాడే.. విజయానికి అడ్డదారులుండవు అనేది ట్యాగ్‌లైన్. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఈ చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బిగ్‌బాస్ 7 బెస్ట్ సంచాలక్ సందీప్ అని ఉండటంతో నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. 'ఎవరైనా బిగ్‌బాస్ ఫేమ్ అని వేసుకుంటారు.. కానీ బెస్ట్ సంచాలక్ ఏంట్రా బాబూ..', 'ట్రోఫీ గెలిచినట్లు ఫీలవుతున్నాడుగా.. దాన్నేదో ఆస్కార్‌లా వాడేసుకుంటున్నాడు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆడియో లాంచ్‌లో బిగ్‌బాస్ నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయిన మేల్ కంటెస్టెంట్ అని సందీప్ గురించి పొగుడుతారేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. Me : Inthaki ah title evaru icharu Bata Sundeep : evaru ivvaledhu, nene petteskunna — Gajala ceo (@gajala_sonicsol) January 2, 2024 View this post on Instagram A post shared by 𝐀𝐚𝐭𝐚 𝐒𝐚𝐧𝐝𝐞𝐞𝐩 𝐃𝐚𝐧𝐜𝐞 𝐌𝐚𝐬𝐭𝐞𝐫🇮🇳 (@aata_sandeep) చదవండి: ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న 'యానిమల్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా? -
అమర్ రన్నర్ కావడంతో నాగార్జునకు చెడ్డపేరు: శివాజీ
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న అక్కసు శివాజీలో కనిపిస్తుంది. అందుకే ఆయన పలు ఇంటర్వ్యూలలో ఇప్పటికీ కూడా అమర్, శోభా పట్ల పలు చిల్లర వ్యాఖ్యలతో పాటు పరుష పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాడు. చివరకు అమర్ రన్నర్ ఎలా అయ్యాడో అంటూ చెప్పుకొస్తున్నాడు. బిగ్ బాస్‌లో శివాజీని అన్నిరోజులు ఉంచడమే గొప్ప విషయం అనుకుంటుంటే.. తనను తాను ఎదో గొప్ప అనుకునే భ్రమలో ఇప్పటికీ ఆయన ఉన్నాడు. శివాజీ వల్లే ఈ సీజన్లో ఇంత రచ్చ అయిందని చెప్పేవారు ఎందరో ఉన్నారు. అనవసరంగా తనను ఈ సీజన్లోకి తీసుకున్నారని కూడా పలువురు కామెంట్లు కూడా చేశారు. హౌస్‌లో ఎప్పుడూ కూడా తాను పోతా పోతా అంటాడు, ఆటలు ఆడడు, బెడ్డు వదలడు, పైగా చెయ్యి నొప్పి, మాట్లాడితే వెటకారాలు, నీతిబోధలు. బిగ్ బాస్‌లో ఆయన చేసింది ఇదే కదా.. మరోకటి ఏమైనా ఉంటే చెప్పండి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు కూడా. గట్టు పంచాయితీలు తీర్చే ఈ పెద్దకు ఇద్దరు పాలేర్లు. వారిద్దరినీ తన చుట్టూ తిప్పుకోవడం.. బిగ్ బాస్‌లో శివాజీ చేసింది ఏమిటి..? నచ్చని వారిపై దుమ్మెత్తిపోయడం.. ఇప్పడు బిగ్ బాస్ బయట కూడా అదే చేస్తున్నాడు. శోభా శెట్టి గొడవతో తనను నెగిటివ్‌గా చూపించే ప్రయత్నం బిగ్ బాస్ చేశారని తాజాగా శివాజీ సంచలన ఆరోపణ చేశాడు. శోభా శెట్టి పరాకాష్టకు వెళ్లింది. అందుకే మా ఇంట్లో ఆడపిల్లలు అయితే.. అంటూ కోపంగా ప్రవర్తించానని అంటూ శివాజీ ఇలా చెప్పాడు. 'గేమ్ ఒక దశకు వచ్చాక విన్నర్ ఎవరు..? ఎవరెవరికి ఏ స్థానాలు దక్కుతాయో కూడా అంచనా వేశాను. 1, 2, 3 స్థానాల్లో మనం ముగ్గురం ఉండబోతున్నామని ప్రశాంత్ చేతిలో రాశాను. అయితే ఊహించని విధంగా ఒక వ్యక్తిని బిగ్ బాస్ కావాలనే హైలైట్ చేస్తూ వచ్చాడు. బిగ్ బాస్ కూడా అతడిని పొగడడం నాకు నచ్చలేదు. అతను (అమర్) చపాతి చేస్తే బాగుంది నాకు కూడా పంపించు అని బిగ్ బాస్ అంటాడు... నేను ఎంతో కష్టపడి వడలు చేపిస్తే కనీసం ఒక మాట కూడా నాకు దక్కలేదు. పలుసార్లు పౌల్ గేమ్ ఆడిన వ్యక్తిని చివరకు రన్నరప్‌ను చేశారు. ఇలాంటి తప్పిదాల వల్ల నాగార్జున గారికి చెడ్డ పేరు వస్తుంది. ఇదే విషయం నాగ్ సారుకు కూడా త్వరలో చెబుతాను. న్యాయంగా అయితే టాప్ 3లో ప్రశాంత్, నేను, యావర్ ఉండేవాళ్లం.' అని శివాజీ అన్నారు. -
బిగ్ బాస్ అమర్‌పై శివాజీ చెత్త వ్యాఖ్యలు.. ఇవి దేనికి సంకేతం..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 ముగిసిపోయి చాలా రోజులే అయింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఆపై బెయిల్ మీద విడుదల ఇలా పలురకాల వివాదాలతో ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ సీజన్ గురించి వార్తలు వస్తునే ఉన్నాయి. ఈ సీజన్లో రన్నర్‌గా ఆమర్ దీప్ ఉంటే టాప్-3లో శివాజీ ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన బిగ్ బాస్ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ జర్నీలో బాగా ఇబ్బంది పడిన సందర్భం ఎంటి..? అని శివాజీకి ప్రశ్న ఎదురైంది. హౌస్‌లో మాదిరే ఇంటర్వ్యూలో కూడా అమర్ పట్ల ఉన్న కోపాన్ని తన వ్యాఖ్యలతో శివాజీ ఇలా చెప్పాడు. 'ప్రశాంత్, యావర్ విషయంలో నేను స్టాండ్ తీసుకున్న సందర్భాల్లో చాలా సార్లు ఇబ్బంది పడ్డాను. ప్రశాంత్ కెప్టెన్ బ్యాడ్జ్ లాక్కున్నారు. అతను సరిగ్గా హౌస్‌ను హ్యాండిల్ చేయలేకున్నాడు అని అందరూ ఓట్లు వేయడంతో అతని బ్యాడ్జ్‌ను బిగ్ బాస్ తీసుకున్నాడు. ఒక కామన్ మ్యాన్ కెప్టెన్ అయితే సెలబ్రిటీలకు నచ్చట్లేదా అని కోపం వచ్చింది. హౌస్‌లో కొందరు యావర్‌తో గొడవలు పెట్టుకున్నప్పుడు కోపం వచ్చింది. ఫైనల్‌గా నేను ఒకరిని కొట్టేద్దామని అనుకున్న సందర్భం కూడా వచ్చింది. మూడు వారాలుగా బిగ్ బాస్‌లో ప్రశాంత్‌ను మానశికంగా కొందరు టార్చర్ చేశారు. ఆ సమయంలో ప్రశాంత్‌ను అమర్ రెచ్చగొడుతున్నాడు. నేను పక్కనే ఉన్నాను.. నేను వాడి పక్కన ఉంటే ఎవరినీ లెక్క చేయడు. 14 వారంలో అమర్, ప్రశాంత్ మధ్య భారీగా గొడవ జరుగుతుంది. ఆ సందర్భంలో ఆమర్‌ను నాలుగు పీకి వెళ్లిపోదాం అనిపించింది. ప్రశాంత్ భుజం మీద చెయి వేసి అమర్ తోసుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో కోపం కట్టలు తెంచ్చుకుంది. గేమ్‌కు బౌండ్ అయి అగ్రిమెంట్లో సంతకం చేశాను కాబట్టి అమర్‌ను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో నా రక్తం మరిగిపోయింది.' అంటూ అమర్‌పై మరోసారి ఇంటర్వ్యూలో శివాజీ రెచ్చిపోయాడు. బిగ్ బాస్ అనేది ఒక గేమ్.. ఒక్కొసారి మాటల వల్ల అదుపు తప్పుతుంటారు. అది సహజం అని అందరికీ తెలుసు.. ఆ తర్వాత మళ్లీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అదీ హౌస్ వరకే పరిమితం. అయినా ప్రశాంత్, అమర్ ఇద్దరూ ఎన్ని గొడవలు పడినా మళ్లీ బ్రదర్స్ మాదిరి ఒకటిగా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ -7 ముగిసి పోయిన చాప్టర్.. బయటకు వచ్చాక కూడా ఇలా ఒకరిపై విషం చిమ్మడం ఎందుకు శివాజీ.. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేసి ఏం చెప్పదలుచుకుంటున్నారు. అయినా ప్రశాంత్ కెప్టెన్సీ నచ్చలేదని మీరు కూడా చెప్పారు కదా.. అప్పుడే మరిచిపోతే ఎలా శివాజీ.. అమర్‌ను నువ్వు రెచ్చగొట్టలేదా మానసిక వేదనకు గురి చేయలేదా అంటూ శివాజీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హౌస్‌లో ఇలాంటి మాటలు మాట్లాడే బయట జనాన్ని రెచ్చగొట్టి అమర మీద దాడి చేయించావు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అమర్ ఇంటికి వెళ్లి దాడి చేయండి అని ఇలా పరోక్షంగా మళ్లీ రెచ్చగొడుతున్నావా అంటూ శివాజీపై విరుచుకుపడుతున్నారు. అమర్‌పై చేసిన వ్యాఖ్యల వీడియో కింద ఎక్కువ మంది శివాజీని ఏకిపారేసిన కామెంట్లే కనిపిస్తున్నాయి. -
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రియాంక, శోభా శెట్టి !
-
హీరోగా పల్లవి ప్రశాంత్.. లీక్ చేసిన సింగర్ భోలె
సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది ఎంతో ఈజీగా ఫేమస్ అయిపోతున్నారు. తమలో ఉన్న టాలెంట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఆ టాలెంట్‌తో నెట్టింట చెలరేగి పోతున్నారు. అలా జనాలకు పరిచయమైన వ్యక్తి పల్లవి ప్రశాంత్. అన్నా.. మళ్లొచ్చిన అంటూ వీడియోలు చేసుకునే ఇతడు రైతుబిడ్డగా ఫేమస్ అయ్యాడు. రైతు కష్టాలు చెప్తూ, పొలం పని చేస్తూ తీసిన వీడియోలు ఎంతో పాపులర్ అయ్యాయి. కేసులో ఇరుక్కున్న రైతుబిడ్డ అంతే కాదు కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లోనూ అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. తన ఆటతో, మాటతో ప్రేక్షకులను మెప్పించి.. బిగ్‌బాస్ 7 టైటిల్ విజేతగా నిలిచాడు. కానీ విజయానందంలో పోలీసులు చెప్పిన మాట వినకుండా రభస జరుగుతున్న చోటే ర్యాలీ చేసి జైలుపాలయ్యాడు. తర్వాత భోలె షావళి చొరవ తీసుకుని లాయర్‌ను మాట్లాడి మరీ ఈ కేసు నుంచి ప్రశాంత్‌ను బయటకు తీసుకువచ్చాడు. అయితే ప్రశాంత్‌కు హీరోగా అవకాశాలు వచ్చాయని చెప్తున్నాడు సింగర్ భోలె. హీరోగా సినిమా ఛాన్సులు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'ప్రశాంత్‌కు సినిమా అవకాశాలు వచ్చాయి. మధ్యలో ఈ పోలీస్ కేసు లాంటిది లేకపోయుంటే ఈపాటికే కొన్ని సినిమాలకు సంతకం చేసేవాడు. తనకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కొందరు లక్షల విలువ చేసే గిఫ్ట్స్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. రైతుబిడ్డ హీరోగా చేస్తాడా? అని కొందరు నా దగ్గరకు వచ్చి అడిగారు. అతడి సినిమాకు నేను సంగీతం ఇవ్వాలని కూడా చెప్పారు. తప్పకుండా చేస్తానన్నాను. కాకపోతే ఇంతలోనే ఈ రచ్చ అంతా జరిగింది. నిజంగా ఆ సమయంలో మేము అండగా లేకపోయుంటే తను డిప్రెషన్లోకి వెళ్లిపోయేవాడు. బిగ్‌బాస్‌కు వెళ్లకపోయినా బాగుండు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు. బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉంటే బాగుండేదని బాధపడ్డాడు. ప్రశాంతే ఈ విషయాలను నాతో స్వయంగా చెప్పాడు. కానీ బయటకు వచ్చాక జనం తనమీద పెట్టుకున్న నమ్మకం చూసి సంతోషించాడు. నన్ను కూడా చాలామంది హీరోగా అడుగుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణించాలన్నది నా కల. ఇటు హీరోగా కూడా చేస్తా. ఆల్‌రౌండర్‌గా ఎంటర్టైన్మెంట్ అందిస్తాను' అంటున్నాడు భోలె షావళి. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఆసక్తికర ట్వీట్ చేసిన ఉపాసన.. భర్తపై ఎంత ప్రేమో.. -
బిగ్ బాస్ OTT: బర్రెలక్కతో పాటు సీజన్-7 నుంచి ఆ ఇద్దరికీ ఛాన్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సూపర్ హిట్ అయినట్లు సోషల్ మీడియాలో భారీగానే వార్తలు వచ్చాయి. బిగ్ బాస్-7 విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ నిలవడం... ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన గొడవల వల్ల ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం.. చివరకు రెండు రోజుల పాటు ఆయన చంచల్‌గూడ జైలుకు కూడా వెళ్లడం వంటి సంఘటనలతో ఇప్పటికీ కూడా బిగ్ బాస్ సీజన్-7 టాపిక్ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది. (ఇదీ చదవండి: రూ.500కోట్ల క్లబ్లో సలార్.. మరో వంద కోట్లు వస్తే) ఈ సీజన్ హిట్ కావడంతో బిగ్ బాస్ OTT -2 కోసం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. గతేడాది ఫిబ్రవరిలో ‘బిగ్‌బాస్ నాన్- స్టాప్ పేరుతో హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారం అయింది. 24/7 వినోదం పంచేందుకు 2022లో మొదటిసారి ఓటీటీలోకి కూడా వచ్చేశాడు బిగ్ బాస్. అప్పుడు కూడా ఈ షో పట్ల మంచి బజ్ క్రియేట్ అయింది. గతంలో మాదిరే ఈసారి కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్‌గా వ్యహరిస్తున్నట్లు సమాచారం. బిగ్ బాస్ OTT సీజన్-1 విజేతగా తెలుగు హీరోయిన్ బిందు మాధవి నిలిచింది. బిగ్ బాస్ OTTలో ఒక ప్రత్యేకత ఉంది ఇందులో కొత్త, పాత కంటెస్టెంట్లు కూడా ఉంటారు. అంటే బుల్లితెర బిగ్ బాస్‌లో కనిపించిన కొంతమంది OTTలో కూడా పాల్గొంటారు. SPY బ్యాచ్ వర్గం నుంచి ఆ ఇద్దరికి ఛాన్స్ బిగ్ బాస్ సీజన్-7లో బాగా పాపులర్ అయిన కొంతమందిని ఓటీటీ కోసం తీసుకుంటున్నట్లు సమాచారం. SPY బ్యాచ్‌కు మద్ధతుగా నిలిచిన భోలే షావళి, నయని పావణిని బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 కోసం తీసుకోబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ కూడా ఈసారి బిగ్ బాస్‌లో మంచి ఇంపాక్ట్ చూపారు. తాజాగా పల్లవి ప్రశాంత్‌కు బెయిల్ కోసం భోలే ఎక్కువగా చొరవ చూపారు. దీంతో ఆయనకు షోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. దీనిని బిగ్ బాస్ టీమ్ ఓటీటీ కోసం క్యాష్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు టాక్. బర్రెలక్కతో పాటు పార్వతి కూడా అవకాశం బిగ్ బాస్ ఓటీటీలోకి కర్నె శిరీష (బర్రెలక్క) కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఆమెకు ఫ్యాన్‌బేస్ ఎక్కువగా ఉంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆమె పోటీ చేసింది. సుమారుగా 6 వేల ఓట్లు సాధించి మరింత పాపులర్ అయింది. ముఖ్యంగా జనసేన అభ్యర్థుల కంటే ఆమెకే ఎక్కువగా ఓట్లు రావడంతో ఆమె పేరును పెద్దపెద్ద రాజకీయ నాయకులే బహిరంగంగా పలికారు. దీంతో ఆమె పేరు రెండు రాష్ట్రాల్లో ట్రెండింగ్ అయిపోయింది. ఈ ఇమేజ్ను బిగ్ బాస్ టీమ్ క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ వేసినట్లు సమాచారం. బగ్ బాస్ ఓటీటీ కోసం ఆమెను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు జీ తెలుగులో వచ్చిన 'సరిగమప' షో ద్వారా సింగర్‌గా పరిచయమైన పార్వతిని కూడా బిగ్ బాస్ వారు కలిశారట. యూట్యూబ్‌లో నవాబ్ కిచెన్ పేరుతో మోయిన్ భాయ్ చాలా పాపులర్ అయ్యాడు. ఆయన్ను కూడా బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయిందని సమాచారం. వీరితో పాటు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వారిని బిగ్ బాస్ టీమ్ కలుస్తున్నట్లు సమాచారం. 2024 ఫిబ్రవరిలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 ప్రారంభం కానుందని టాక్ ఉంది. -
హోస్ట్‌గా నాగార్జున ఫెయిల్.. ఆయనసలు..: గీతూ రాయల్
బిగ్‌బాస్ షోలో గీతూ రాయల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్ షోపై రివ్యూలు చెప్పుకునే ఈ యూట్యూబర్ ఆరో సీజన్లో అడుగుపెట్టి నానారచ్చ చేసింది. ఎలిమినేట్ అయినప్పుడు గుండె బాదుకుని ఏడ్చింది. అయితే ఈ షో వల్ల మనుషుల విలువ తెలిసిందని.. మరెన్నో నేర్చుకున్నానని చెప్పింది. ఇక ఏడో సీజన్లో బిగ్‌బాస్ బజ్కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది గీతూ. జనాలు అడగాలనుకున్న ప్రశ్నలన్నింటినీ కంటెస్టెంట్ల ముఖం పట్టుకుని అడిగేసింది. నాగార్జున సైతం టచ్ చేయని టాపిక్‌లను లేవనెత్తి మరీ వారిని ఇరకాటంలో పెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగార్జున హోస్ట్‌గా ఫెయిలయ్యాడంటోంది. స్క్రిప్ట్ వస్తుందని తెలియదు ఇంకా గీతూ మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చే కంటెస్టెంట్లపై జనాలకు చాలా డౌట్స్ ఉంటాయి. అడగాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. నాగార్జున అడుగుతారనుకుంటే.. ఇప్పటివరకు ఆయన చేసిన సీజన్స్ అన్నింటిలోనూ చప్పచప్పగా ప్రశ్నలడిగేవారు. స్క్రూ టైట్ చేసే ప్రశ్నలు, బెండు తీసేలా ఎప్పుడూ మాట్లాడలేదు. కూల్‌గా వచ్చి కూల్‌గా మాట్లాడేసి వెళ్లిపోయారు. ఈ ఒక్క సీజన్‌కు మాత్రమే నాగార్జున కఠినంగా ఉన్నాడు. నాగార్జు హోస్ట్‌గా ఫెయిలయ్యారనే చెప్పాలి.. ఈ మాట ఎందుకన్నానంటే.. నాగార్జున ఎపిసోడ్స్ చూసి మాట్లాడతారనుకున్నాను. తనకు స్క్రిప్ట్ వస్తుందన్న విషయం నాకు తెలియదు. నా తప్పు లేదు ఆరో సీజన్లో చంటిగారు కీర్తిని వెటకారంగా మాట్లాడారు. అప్పుడు వీకెండ్లో రెండుసార్లు వీడియో తిప్పి తిప్పి చూపించి నాదే తప్పు అని ఒప్పించడానికి ప్రయత్నించారు. చంటి-కీర్తి విషయంలో నా తప్పే లేదు. ఇప్పటికీ అదే మాటకు కట్టుబడి ఉన్నాను. అలాంటివి జరిగినప్పుడు నాగార్జున స్టాండ్ తీసుకుని ఏది కరెక్ట్? ఏది తప్పు? అనేది గట్టిగా చెప్తే బాగుండేది. నా విషయంలోనే కాదు సన్నీ- షణ్ముఖ్ విషయంలోనూ సన్నీ తప్పు లేకపోయినా హౌస్ మొత్తానితో తనదే తప్పు అనిపించారు. ఇక బిగ్‌బాస్ బజ్‌లో నాగార్జున అడగలేకపోయిన వాటిని నేను అడిగాను' అని చెప్పుకొచ్చింది గీతూ. చదవండి: గీతాంజలి, నిన్నే పెళ్లాడతా.. మిస్ అయ్యా! రెండోపెళ్లిపై ఏమందంటే? -
అవార్డ్ గెలుచుకున్న శోభా
-
'బిగ్‌బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్
ఈసారి బిగ్‌బాస్ సీజన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మరీ ముఖ్యంగా ఇందులో పాల్గొన్న సీరియల్ నటి శోభాశెట్టి ఇంకా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆట కంటే గొడవలతో చాలా ఫేమ్ తెచ్చుకుంది. అదే టైంలో విపరీతమైన ట్రోలింగ్ కూడా ఫేస్ చేసింది. బిగ్‌బాస్ ట్రోఫీ కచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పిన శోభా.. 14వ వారం ఎలిమినేట్ అయి ఆ కల నెరవేర్చుకోలేకపోయింది. అయితేనేం ఇప్పుడో అవార్డ్ గెలుచుకుని మళ్లీ వార్తల్లో నిలిచింది. (ఇదీ చదవండి: డార్లింగ్ ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా?) శోభాశెట్టి అంటే బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. 'కార్తీకదీపం' మోనిత అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్లో లేడీ విలన్‌గా చేసి చాలా పేరు తెచ్చుకుంది. అలా ఈసారి బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టింది. కానీ ఆట, గెలుపు కంటే గొడవలు పెట్టుకోవడంతోనే ఈమె బాగా ఫేమస్ అయింది. ఒకానొక టైంలో ఈమెని ఎలిమినేట్ చేయకుండా ఇంకా ఉంచుతున్నారేంట్రా బాబు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇలాంటి క్యారెక్టర్ షోలో లేకపోతే పెద్దగా మజా ఉండదు. సోఫాజీ అలియాస్ శివాజీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గని శోభా.. దాదాపు చివరి వరకు వచ్చేసింది. ఫినాలేకి వారం ఉందనగా ఎలిమినేట్ అయిపోయింది. తాజాగా ఈమెకు ఉత్తమ ప్రతినాయకగా రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్ వచ్చింది. ఈ విషయాన్ని శోభానే స్వయంగా తన ఇన్ స్టాలో ఫొటోలతో సహా పోస్ట్ చేసింది. ప్రస్తుతానికైతే ఈమె కొత్త సీరియల్స్ ఏం చేయట్లేదు. త్వరలో షోల్లో గానీ, సీరియల్స్‌లో గానీ శోభా మళ్లీ కనిపించే అవకాశముంది. (ఇదీ చదవండి: Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్) View this post on Instagram A post shared by Shobhashetty (@shobhashettyofficial) -
గుడ్‌న్యూస్ చెప్పిన బిగ్‌బాస్ బ్యూటీ..
తెలుగు బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే మూడు ముళ్లబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పింది. గత కొన్నేళ్లుగా నటుడు శివకుమార్‌తో ప్రేమలో మునిగి తేలుతోందీ నటి. ఇటీవల బిగ్‌బాస్ హౌస్‌లో తాను శివకుమార్‌తో ప్రేమలో ఉన్న విషయాన్ని ధ్రువీకరించింది. అంతేకాదు, అతడు హౌస్‌లోకి రాగానే పెళ్లెప్పుడు చేసుకుందాం.. బిగ్‌బాస్ అయిపోగానే భార్యాభర్తలుగా కొత్త జర్నీ మొదలుపెడదాం అంటూ ఎమోషనలైంది. అప్పుడే పెళ్లి అటు శివకుమార్ సైతం.. ప్రియురాలిని ముద్దులతో ముంచెత్తి ఆప్యాయంగా హత్తుకున్నాడు. బిగ్‌బాస్ 7లో టాప్ 5కి చేరుకున్న ప్రియాంక తాజాగా తన పెళ్లి గురించి యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. త్వరలోనే మూహూర్తం ఫిక్స్ చేసి ఆ పెళ్లి తేదీ కూడా సోషల్ మీడియాలో వెల్లడిస్తామని తెలిపింది. అలాగే తన పెళ్లి గురించి చాలా ఆలోచనలు ఉన్నాయని, అవన్నీ మరో వీడియోలో చెప్తానంది. శోభా పెళ్లి కూడా అప్పుడే! ఇకపోతే బిగ్‌బాస్ హౌస్‌లో ఓ టాస్క్‌లో భాగంగా తన జుట్టు కత్తిరించుకున్న ప్రియాంక.. తన హెయిర్ ఇంకాస్త పొడుగ్గా అయిన తర్వాతే వివాహం చేసుకుంటానంది. పనిలో పనిగా మరో సీక్రెట్ కూడా బయటపెట్టింది. తన బెస్ట్ ఫ్రెండ్, బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ శోభా కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని సీక్రెట్ రివీల్ చేసింది. దీంతో అభిమానులు వీరిద్దరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదవండి: నాకోసం ఎవరూ ముందుకు రాలే.. దుస్తులు కొనుక్కునే స్థోమత లేక.. -
Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్
బిగ్‌బాస్ షోపై చాలా ఏళ్ల నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. కానీ ఈసారి అది రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ దెబ్బకు మరింత ముదిరిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫినాలే తర్వాత గొడవ, కార్లు-బస్సుల ధ్వంసం, విజేత అరెస్ట్.. ఇప్పుడు ఏకంగా నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేసేంతవరకు పరిస్థితి వచ్చింది. దీంతో షో ఆర్గనైజర్.. అనుహ్య నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు అది అందరినీ షాకయ్యేలా చేస్తోంది. హిందీలో చాన్నాళ్ల నుంచి ఉంది కానీ తెలుగులో మాత్రం గత ఏడేళ్లుగా బిగ్‌బాస్ ప్రసారమవుతోంది. ఎన్టీఆర్, నాని తొలి రెండు సీజన్లను హోస్ట్ చేయగా.. ఆ తర్వాత మాత్రం నాగార్జునే వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. పలువురు సెలబ్రిటీలని హౌసులో 100 రోజుల పాటు ఉంచి, పలు పోటీలు పెట్టి.. వీటన్నింటిలో గెలిచిన వాడిని విజేతగా ప్రకటించడం ఆనవాయితీ. ఈసారి అలా కామన్‌మ్యాన్, రైతుబిడ్డ ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ విజేతగా నిలిచాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) రైతుబిడ్డ పేరు చెప్పుకొని ప్రశాంత్ ఎలా ఆడాడు? ఏంటనే విషయం పక్కనబెడితే.. ఫినాలే జరుగుతుండగానే అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఇతడి ఫ్యాన్స్ చాలామంది గుమిగూడిపోయారు. దీంతో ర్యాలీ లాంటివి ఏం వద్దని ముందే పోలీసులు, ప్రశాంత్‌ని హెచ్చరించారు. దీన్ని లెక్కచేయకుండా అభిమానుల దగ్గరకు ప్రశాంత్ వచ్చాడు. దీంతో పలువురు కంటెస్టెంట్స్ కార్లు, పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సు అద్దాల్ని.. వీళ్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్‌ని అరెస్ట్ చేసి చంచల్ గుడ జైల్లో పెట్టారు. ఈ మధ్య బెయిల్ మీద కూడా విడుదలయ్యాడు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు.. షో నిర్వాహకులకు నోటీసులు కూడా పంపారు. అయితే ఈ తలనొప్పులకు తట్టుకోలేకపోతున్న ఆర్గనైజర్స్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. ఇకపై రాబోయే సీజన్స్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ర్యాలీలు లాంటివి చేయకూడదట. దీన్నే అగ్రిమెంట్‌లోనూ పొందుపరచనున్నారట. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా రైతుబిడ్డ దెబ్బకు 'బిగ్‌బాస్' తలకు బొప్పి కట్టింది! (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న 'బిగ్‌బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా?) -
బిగ్ బాస్ నిర్వాహకులకు షాక్.. అసలేం జరిగిందంటే?
పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్‌తో బిగ్‌బాస్ నిర్వాహకులకు పోలీసులు షాకిచ్చారు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆర్టీసీ బస్సులతో పాటు, కంటెస్టెంట్స్ కార్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. తాజాగా ఈ ఘటనలపై యాజమాన్యం ఎండమోల్‌షైన్‌కు నోటీసులు జారీ చేశారు. అభిమానులు భారీగా వస్తారని తెలిసినా ముందస్తుగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై నమోదైన రెండు కేసుల్లో ఇప్పటివరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని సైతం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పీఎస్‌కు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. -
Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?
'బిగ్‌బాస్ 7' ఫేమ్ పల్లవి ప్రశాంత్.. షోలో గెలిచిన తర్వాత చాలా హడావుడి చేశాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాజాగా బెయిల్‌పై బయటకొచ్చాడు. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కి వచ్చి వెళ్లాలని కండీషన్ పెట్టిన పోలీసులు.. కొన్నాళ్లకు ఇంటర్వ్యూలు లాంటివి ఏం ఇవ్వకూడదని కూడా చెప్పారు. ఇదంతా పక్కనబెడితే ఈ రైతుబిడ్డ.. కొందరిపై రివేంజ్ తీర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో 'బిగ్‌బాస్ 7' షోలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్.. ఎలాగైతేనేం విజయం సాధించాడు. అయితే డిసెంబరు 17న ఫినాలే అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ఇతడి ఫ్యాన్స్ చాలామంది వచ్చి చేరారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు.. ప్రశాంత్‌ని వేరే రూట్ నుంచి వెళ్లిపోమని చెప్పారు. కానీ మనోడు పోలీసులు మాట కూడా లెక్క చేయకుండా.. తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయారు. పలువురి కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలు కూడా ధ్వంసం చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ప్రశాంత్‌ని అతడి ఊరికెళ్లి మరీ అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల విధించగా.. చంచల్ గూడా జైల్లో పెట్టారు. నాలుగు రోజుల తర్వాత ఇతడికి బెయిల్ రావడంతో తిరిగి ఊరికివెళ్లిపోయాడు. ఇదంతా పక్కనబెడితే.. ఫినాలే అయిపోయిన తర్వాత ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించగా, తన ఊరికొస్తే ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పినట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. (ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో తమ్ముడు.. అమ్మాయి ఎవరంటే?) తీరా సదరు యూట్యూబర్స్.. ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం అతడి ఊరికి వెళ్లగా, చాలాసేపు వెయిట్ చేయించి తమని నిర్ధాక్షిణ్యంగా వెళ్లిపోమన్నాడని కొందరు ఇన్ స్టాలో స్టోరీలు పెట్టారు. అయితే తాను అలసిపోవడం వల్లే ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోయినని ప్రశాంత్ తీరిగ్గా వీడియో పోస్ట్ చేశాడు గానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్రశాంత్ అసలు రంగు ఏంటో అందరికీ తెలిసిపోయింది. అయితే తన ఇమేజ్ డ్యామేజ్ చేసిన సదరు యూట్యూబర్స్‌పై ప్రశాంత్ ఇప్పుడు పరువు నష్టం దావా వేయాలని అనుకుంటున్నాడట. ఇందులో ఎంత నిజముందనేది పక్కనబెడితే.. ఇది జరిగే పనేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్.. ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయి, బెయిల్‌పై బయటకొచ్చాడు. ఇలాంటి టైంలో పరువు నష్టం దావా లాంటి కొత్త తలనొప్పులు తెచ్చుకుంటాడా? అనేది చూడాలి. మరి ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్) -
బిగ్‌బాస్ గొడవలో మరో ముగ్గురి అరెస్టు
హైదరాబాద్: బిగ్‌బాస్ గొడవలో జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 17న అన్నపూర్ణ స్టూడియోస్‌లో బిగ్‌బాస్ ఫైనల్స్ అనంతరం విజేత ప్రశాంత్, రన్నరప్ అమర్‌దీప్‌చౌదరి అభిమానులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడి బస్సులు, కార్లను ధ్వంసం చేసి పోలీసులపై రాళ్లు రువ్వి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అతడి సోదరుడు మహావీరంలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా శనివారం వీరిద్దరూ బెయిల్‌పై వచ్చారు. అలాగే ఈ విధ్వంసానికి పాల్పడిన 12 మందిని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. తాజాగా సరూర్‌నగర్‌కు చెందిన హరినాథ్‌రెడ్డి, యూసుఫ్‌గూడలకు చెందిన ఎం. సుధాకర్‌లను ఆదివారం రిమాండ్‌కు తరలించారు. పవన్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ట్రాన్స్‌జెండర్‌గా సీజన్-7 బిగ్‌బాస్ కంటెస్టెంట్.. ఎవరో గుర్తుపట్టారా?
ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్-7 అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ సీజన్ విన్నర్‌గా రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే ఈ సీజన్లో టాప్-3లో ప్రశాంత్, అమర్దీప్, శివాజీ నిలవగా.. యావర్, ప్రియాంక, అర్జున్ టాప్-6లో చోటు దక్కించుకున్నారు. అయితే ఈ షో ద్వారా ఎంతో మంది కంటెస్టెంట్స్ గుర్తింపు తెచ్చుకున్నారు. మరికొందరు ఫేమస్ కావడంతో పాటు సినిమాల్లో కూడా ఛాన్స్ కొట్టినవాళ్లు ఉన్నారు. అయితే బిగ్‌బాస్ కంటే ముందే ఓ సినిమాలో లీడ్ రోల్ పోషించిన నటుడు టాప్-6 కంటెస్టెంట్స్‌లో ఉన్నారు. ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ ద్వారా షో మధ్యలో ఐదుగురు ఎంట్రీ ఇచ్చారు. వారిలో నలుగురు ఎమిలినేట్ అవ్వగా.. కేవలం అర్జున్ అంబటి మాత్రమే టాప్-6లో నిలిచారు. అయితే అర్జున్ హౌస్‌లోకి రాకముందే పలు సినిమాల్లో నటించారు. చూడటానికి సాఫ్ట్‌గా కనిపించే అర్జున్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. విజయవాడలో పుట్టి పెరిగిన ఇతడు ఐటీలో రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పని చేశాడు. (ఇది చదవండి: బిగ్ బాస్ అర్జున్‌కు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..!) ఆ తర్వాత మోడల్‌గా మొదలైన తన ప్రయాణం కాస్తా నటనవైపు పరుగులు తీసింది. అర్ధనారి, గీతోపదేశం, సుందరి వంటి పలు చిత్రాల్లో అతడు నటించాడు. గోపీచంద్ హీరోగా వచ్చిన సౌఖ్యంలో విలన్‌గా నటించారు. అగ్ని సాక్షి, దేవత వంటి సీరియల్స్‌తో ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. నటనపై మక్కువతోనే మళ్లీ మంచి కంబ్యాక్ ఇవ్వడానికి బిగ్‌బాస్ షోను ఎంచుకున్నారు. అర్ధనారిలో ట్రాన్స్‌జెండర్‌గా.. అర్ధనారి సినిమాలో అర్జున్ ట్రాన్స్‌జెండర్ పాత్రలో మెప్పించారు. చాలా అరుదైన పాత్రలో కనిపించిన అర్జున్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. భానుశంకర్ చౌదరి దర్శకత్వంలో ఎమ్.రవికుమార్ 2016లో నిర్మించిన చిత్రమే అర్ధనారి. ఈ చిత్రంలో అర్జున్ యజత్, మౌర్యాని జంటగా నటించారు. చాలా అరుదైన పాత్రలో నటించి మెప్పించిన అర్జున్ అంబటి ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్లో కనిపించి మరింత ఫేమస్ అయ్యారు. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి టాప్-6లో నిలిచారు. అంతేకాకుండా బుచ్చిబాబు సనా తెరకెక్కించే రామ్ చరణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు. ఉప్పెనతో తొలి ప్రయత్నంలోనే బుచ్చిబాబు. ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
ఎవరో చేసిన తప్పుకి నన్ను ఇలా చేయడం కరెక్ట్ కాదు
-
Pallavi Prashanth: చంచల్ గూడ జైలు నుంచి బయటకొచ్చిన రైతుబిడ్డ
బిగ్‌బాస్ 7 విజేత ప్రశాంత్.. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. నాంపల్లి కోర్టు ఇతడికి శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా.. తాజాగా జైలు నుంచి బయటకొచ్చాడు. ఈ కేసులో భాగంగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు.. ప్రశాంత్‌ని ఆదేశించింది. అసలు ఈ గొడవేంటి? ప్రశాంత్‌ని ఎందుకు జైల్లో పెట్టారు? (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) తెలంగాణలోని ఓ పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే ప్రశాంత్.. తనని తాను రైతుబిడ్డగా చెప్పుకొన్నాడు. అలా ఇన్ స్టాలో వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసారి బిగ్‌బాస్ షోలో కామన్‌మ్యాన్ అనే ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 105 రోజుల పాటు హౌసులో ఉండి విజేతగా నిలిచాడు. అయితే ఫినాలేలో విజయం సాధించిన తర్వాత షో నిర్వహించిన అన్నపూర్ణ స్టూడియోస్ బయట చాలా గొడవ జరిగింది. అమర్, అశ్విని, గీతూతో పాటు పలువురు కార్లని ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. అయితే షోలో విజేతగా నిలిచిన తర్వాత ప్రశాంత్.. ఫ్యాన్స్‌ని కలిసేందుకు ప్రయత్నించగా తొలుత పోలీసులు వద్దని వారించారు. కానీ పోలీసుల మాటలని లెక్కచేయకుండా, పంపేచేసిన సరే తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయారు. వీరంగం సృష్టించాడు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యుడిగా ప్రశాంత్ పై సుమోటాగా కేసు నమోదు చేశారు. రీసెంట్‌గానే ప్రశాంత్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్న ఇతడు తాజాగా బెయిల్‌పై బయటకొచ్చాడు. ఇతడిని చూసేందుకు జైలు దగ్గరకు కూడా అభిమానులు చాలామంది వచ్చారు. (ఇదీ చదవండి: 'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి) -
తెలుగు స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం.. ప్రెగ్నెన్సీ టెస్ట్.. ఇంకా..
బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్.. ఈ షోని ఆరాధించే అభిమానులతో పాటు తిట్టిపోసే జనాలు సైతం ఉన్నారు. అయితే ఎంత తిట్టుకున్నా ఆ మ్యూజిక్ రాగానే చాలామంది టీవీలకు అతుక్కుపోయి మరీ బిగ్‌బాస్ చూస్తుంటారు. అదే ఈ షో ప్రత్యేకత! ఒక్క మాటలో చెప్పాలంటే సెలబ్రిటీలు ఇంట్లో ఎలా ఉంటారో చూపించాలన్నదే దీని కాన్సెప్ట్. వారికి ఇచ్చే ఛాలెంజ్‌లు, టాస్కులు అదనం.. దీని ద్వారా చూసే జనాలకు కాలక్షేపం.. షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు కాసుల వర్షం. కానీ షో ముగిసిన తర్వాత నెమ్మదిగా జనాలు వారిని మర్చిపోతుంటారు. అటు కంటెస్టెంట్లు కూడా బోలెడంత నెగెటివిటీతో బయటకు వస్తారు. పైగా ఛాన్సులు, ఫేమ్ అందుకోవడం అందని ద్రాక్షగా మారుతూ ఉంటుంది. టైటిల్ గెలిచామన్న సంతృప్తి తప్ప ఏదో కోల్పోయామన్న లోటు మాత్రం అలాగే ఉండిపోతుంది. దాని తర్వాత మళ్లీ ఇప్పుడే అంత క్రేజ్! బిగ్‌బాస్ తెలుగు రెండో సీజన్, నాలుగో సీజన్ తర్వాత మళ్లీ ఏడో సీజన్‌కు ఆ స్థాయిలో క్రేజ్ వచ్చింది. కంటెస్టెంట్ల కోసం అభిమానులు సోషల్ మీడియాలో యుద్ధాలే చేశారు. అంతిమంగా ఈ పోరులో రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో పల్లవి ప్రశాంత్ విజయం సాధించాడు. బిగ్‌బాస్ షో అనేది వ్యక్తిత్వ, మానసిక వికాస కేంద్రం అని అప్పట్లో బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్ బిందుమాధవి తండ్రి అన్నాడు. అంటే మన గురించి మనం తెలుసుకోవడానికి, తప్పొప్పులు సరిదిద్దుకోవడానికి ఇంతకంటే మంచి వేదిక దొరకదన్నాడు. కానీ ఇక్కడే ప్రశాంత్‌ను తప్పుదారి పట్టించాడు శివాజీ. హౌస్‌లో ప్రశాంత్ తప్పు చేయబోయిన ప్రతిసారి శివాజీ అడ్డుకున్నాడు. అతడిని మాట్లాడనీయకుండా చేశాడు. టైటిల్ విజేత అరెస్ట్ అప్పుడే కనక శివాజీ అడ్డుపడకపోయుంటే ప్రశాంత్ స్వభావం అందరికీ తెలిసేది, తన తప్పులను సరిదిద్దుకునే అవకాశం వచ్చి ఉండేది. హౌస్‌లో ఉన్ననాళ్లూ మాస్క్ వేసుకుని నటించాడన్న మాట వచ్చుండేదే కాదు. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే (డిసెంబర్ 17) రోజు అన్నపూర్ణ స్టూడియో వద్ద ఎంత ఉద్రిక్త వాతావరణం నెలకొందో అందరకీ తెలిసిందే! ప్రశాంత్‌ను వెనక గేటు నుంచి వెళ్లిపోమన్నా ముందు నుంచే వెళ్తానన్నాడు. పోనీ, కారు ఆపకుండా వెళ్లిపోమని చెప్పినా లెక్క చేయలేదు. రైతుబిడ్డ అనే సింపతీ వాడాలనుకున్నాడు. పైగా అంతమంది అభిమానులు కనిపించడంతో మళ్లీ అదే స్టూడియో దగ్గరకు వచ్చాడు. దీంతో అక్కడ చెలరేగిన అలజడి అంతా ఇంతా కాదు. చివరకు ఏమైంది? పోలీసుల మాటల్ని బేఖాతరు చేసినందుకు అతడిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. టైటిల్ గెలిచిన ఒక్కరోజులోనే ప్రశాంత్ అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరో వల్ల ఇండస్ట్రీని వదిలేసిన హీరోయిన్ మరోవైపు తమిళంలో రన్ అవుతున్న బిగ్‌బాస్ ఏడో సీజన్ సైతం తరచూ వార్తల్లో ఉంటోంది. ఈ షోలో సీనియర్ హీరోయిన్ విచిత్ర పాల్గొంది. ఓ ఎపిసోడ్లో ఆమె ఇండస్ట్రీని వదిలేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది. తెలుగులో ఓ స్టార్ హీరో పెట్టిన టార్చర్ వల్లే సినిమాలు వదిలేశానంది. ఆ హీరో తన గదికి రమ్మని పిలిస్తే వెళ్లలేదని.. దీంతో తనను షూటింగ్‌లోనూ చాలా ఇబ్బంది పెట్టారని చెప్పింది. తనను సెట్స్‌లోనూ అసభ్యంగా తాకాడని.. ఆ విషయం చెప్పినందుకు తన చెంపే పగలగొట్టారని వాపోయింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆ హీరో బాలకృష్ణయే అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. Actor Who Harassed : #Balayya (Balakrishna) Telugu Film Name : Bhalevadivi Basu (2001 Release) Stunt Director : A.Vijay Nadigar Sangam Head Who Refused Action: Radha Ravi #Vichithra #MeToo pic.twitter.com/9rrxagpUwV — Analyst (@BoAnalyst) November 22, 2023 పారిపోయేందుకు యత్నం ఇక ఇదే హస్‌లోని కంటెస్టెంట్ కూల్ సురేశ్ ఓ రోజు బిగ్‌బాస్ ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. గోడ ఎక్కి పారిపోవడానికి యత్నించగా అది చూసిన ఓ కంటెస్టెంట్ పరుగెత్తుకుంటూ వచ్చి అతడిని కిందకు దింపాడు. ఇదిలా ఉంటే హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య వార్, బయట అభిమానుల మధ్య వార్ సహజమే! కానీ లోపల కంటెస్టెంట్లు ఏదో అనుకున్నారని వారి కుటుంబసభ్యులపైనే దాడి జరిగింది. నటి వనితా విజయ్‌కుమార్ కూతురు జోవిక బిగ్‌బాస్ హౌస్‌లో ఉంది. ఆమె ప్రదీప్ ఆంటోని అనే కంటెస్టెంట్‌పై తీవ్ర విమర్శలు చేసింది. #CoolSuresh try to escape .this week no elimination cool suresh self eviction. pic.twitter.com/hZqh8RDuwP — Jin (@Jin49486319) December 13, 2023 జోవిక ఆరోపణలు.. ప్రదీప్‌కు రెడ్ కార్డ్ ఆయన ఎప్పుడూ వాష్ రూమ్ వద్దే ఉంటున్నాడు.. ఆయన వల్ల ఇక్కడ ఉన్న అమ్మాయిలకు భద్రత లేదని జోవిక ఆరోపించింది. దీంతో కమల్ అతడికి రెడ్ కార్డ్ జారీ చేసి షో మధ్యలోనే అర్థాంతరంగా ఎలిమినేట్ చేశాడు. దీనివల్ల జోవికపై నెట్టింట విపరీతమైన ట్రోలింగ్ జరగ్గా దాన్ని తిప్పికొడుతూ వచ్చింది వనిత. ఓ రోజు బిగ్‌బాస్ షో గురించి రివ్యూ చెప్పి బయటకు వస్తుండగా ఓ వ్యక్తి తన ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. కంటెస్టెంట్ ప్రదీప్ ఆంటోని అభిమానే తనపై దాడి చేశాడని వనిత ఆరోపించింది. View this post on Instagram A post shared by Vanitha Vijaykumar (@vanithavijaykumar) షో మధ్యలో కంటెస్టెంట్ అరెస్ట్ కన్నడ బిగ్‌బాస్ 10వ సీజన్లో ఓ కంటెస్టెంట్‌ను షో మధ్యలో నుంచే పోలీసులు తీసుకెళ్లిపోయారు. వర్తూర్ సంతోష్ పులి గోరును మెడలో ధరించి దర్జా ప్రదర్శించాడు. దీంతో అటవీ అధికారులు అది నిజమైనదా? కాదా అని సెట్స్‌కు వెళ్లి మరీ పరీశిలించారు. అది నిజమైన పులి గోరేనని తేలడంతో అతడిని వెంటనే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇకపోతే బిగ్‌బాస్ షోలోకి యూట్యూబర్లు, సింగర్లు, డ్యాన్సర్లు, నటీనటులు వెళ్తుంటారు. కానీ తొలిసారి ఓ ఎమ్మెల్యే హౌస్‌లో అడుగుపెట్టాడు. హౌస్‌లోకి ఎమ్మెల్యే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ కన్నడ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి కంటెస్టెంట్లను మోటివేట్ చేశాడు. కంటెస్టెంట్‌గా కాకుండా అతిథిగా షోకి వెళ్లి వచ్చాడు. ఇక ఇదే షోలో ఓ శునకం ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరిగింది. సదరు ఛానల్ కూడా 777 చార్లీ సినిమాతో ఆకట్టుకున్న చార్లీ అనే శునకం మొదటి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లనుందని ప్రకటించింది. కానీ పలు కారణాల రీత్యా ఇది కార్యరూపం దాల్చలేదు. ಕಲರ್ಫುಲ್ ಮನೆಗೆ ತಾಳ್ಮೆಯ ಬಿಳುಪು; ಎಂಟ್ರೀ ಕೊಟ್ರು ಎಮ್.ಎಲ್.ಎ ಪ್ರದೀಪು! ಬಿಗ್ ಬಾಸ್ | ಪ್ರತಿ ರಾತ್ರಿ 9:30 #BBK10 #HappyBiggBoss #KichchaSudeep #ColorsKannada #ಬಣ್ಣಹೊಸದಾಗಿದೆ #ಬಂಧಬಿಗಿಯಾಗಿದೆ pic.twitter.com/9FB9d1eVrd — Colors Kannada (@ColorsKannada) October 9, 2023 ప్రెగ్నెన్సీ టెస్ట్ బిగ్‌బాస్ షోలో దంపతులు పార్టిసిపేట్ చేయడం చూశాం. తెలుగులోనూ ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. కానీ తొలిసారి ఓ మహిళకు హౌస్‌లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశారు. హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్లో అంకితా లోఖండే- విక్కీ జైన్ కలిసి పాల్గొన్నారు. హౌస్‌లోకి వెళ్లిన నెల రోజుల తర్వాత తనకు ఇంకా పీరియడ్స్ రాకపోవడంతో అయోమయానికి లోనైంది అంకిత. దీంతో ఆమెకు రక్త, మూత్ర పరీక్షలు చేశారు. అయితే ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో ఆమెకు నెగెటివ్ వచ్చింది. ఇలా ఈ ఏడాది ఏదో భాషలో ఏదో ఒక వార్తతో బిగ్‌బాస్ షో ట్రెండ్ అవుతూనే వచ్చింది. చదవండి: బుల్లితెర జంట విడాకులు? ఇద్దరి తప్పు.. ఏడుస్తూ ఉండలేం కదా! -
పేరు మార్చుకున్న 'బిగ్ బాస్' విన్నర్ పల్లవి ప్రశాంత్
బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్ టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్‌కు ఉపశమనం లభించింది. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్‌ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్‌ను ఏ-2గా పేర్కొంటూ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నేడు (డిసెంబర్ 23) చంచల్ గూడ జైలు నుంచి ఆయన విడుదల కావచ్చు. తాజాగా పల్లవి ప్రశాంత్ ఇన్‌స్టాలో తన పేరు మారింది. అందులో తన పేరు, బయోను మార్పు చేశారు. MALLA OCHINA, SPY Team Winner అని కొత్తగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేర్చుకున్నాడు. ప్రశాంత్ సూచన మేరకు అతని మరో సోదరుడు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తన విజయంలో SPY బ్యాచ్ పాత్ర ఎంతగానో ఉందని ప్రశాంత్ గుర్తించినట్లు ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ వల్ల ప్రశాంత్ ఇన్‌స్టాగ్రామ్‌కు భారీగా ఫాలోవర్లు పెరిగారు. ప్రస్తుతం ప్రశాంత్‌ను 1 మిలియన్‌కు పైగానే ఫాలోవర్లు అనుసరిస్తూ ఉండటం విశేషం. ప్రశాంత్‌కు అండగా నిలబడిన భోలే చంచల్‌గూడ జైలు నుంచి పల్లవి ప్రశాంత్ నేడు విడుదల కానున్నాడు. ప్రశాంత్ కోసం అండగా భోలే మాత్రమే నిలబడ్డాడు. హౌస్‌లో కూడా ఆయన ప్రశాంత్ కోసమే బిగ్ బాస్‌కు వచ్చానని చెప్పాడు. బెయిల్ వచ్చిన సందర్భంగా భోలే మాట్లాడుతూ.. రైతుబిడ్డకి న్యాయం జరిగిందని తెలిపాడు. 15 వేల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీల నిబంధనతో బెయిల్ మంజూరు చేయడం జరిగిందని తెలిపాడు. ప్రశాంత్ అరెస్ట్ అయిన 48 గంటల్లోనే బెయిల్ వచ్చేలా చేసిన అడ్వకేట్లకు ధన్యవాదాలు తెలిపాడు. అంతే కాకుండా నిష్పక్షపాతంగా తీర్పు ఇచ్చిన జడ్జీగారికి పాదాభివందనం తెలిపాడు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక
బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7 ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద దుమారమే రేగింది. ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమర్ కారుపై ఒక వర్గం ఫ్యాన్స్ దాడి చేశారు. అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. తాజాగా ఈ విషయంపై ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రియాంక రియాక్ట్ అయింది. అభిమానులు ఎవరైనా కానీ ఇలా దాడి చేయడం చాలా దారుణమని ఆమె ఇలా తెలిపింది. 'ఫ్యాన్స్ పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడటం చాలా దారుణం. మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వ్యతిరేకించండి.. అందులో తప్పులేదు కానీ ఇలా దాడి చేయడం చాలా హేయం. ఎవరమైనా ఎంతో కష్టపడి ఒక వస్తువును కొంటాము. కానీ ఇలా కొన్ని క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్ కాదు. దాడి సమయంలో కారులోపల మహిళలు ఉన్నారనే ఆలోచన కూడా లేకుంటే ఎలా..? హౌస్‌లో గేమ్ పరంగా మాత్రమే మాలో గొడవలు ఉన్నాయి. టాస్క్ ముగియగానే పల్లవి ప్రశాంత్,యావర్,శివాజీ,అమర్ ఇలా అందరం చాలా బాగా కలిసే ఉండే వాళ్లం. మాలో ఎలాంటి గొడవలు లేవు.' ముఖ్యంగా చివరి 4 వారాల్లో ప్రశాంత్‌తో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. వాడు నిజంగానే భూమి బిడ్డ అని ఆమె తెలిపింది. కానీ ఆ ఇంటర్వ్యూ జరిగిన సమయానికి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కాలేదు.. దీంతో ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ అరెస్ట్‌పై ఆమెకు ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాలేదు. -
ప్రశాంత్ అమాయకుడు.. అసలు జైల్లో వేయడమేంటి?: అశ్విని ఎమోషనల్
రైతుబిడ్డగా బిగ్‌బాస్ రియాలిటీ షో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. వంద రోజులకు పైగా సాగిన ఈ షోలో మరో కంటెస్టెంట్ అమర్దీప్ రన్నరప్‌గా నిలిచాడు. అయితే అంతవరకు బాగానే ఉన్నా.. ప్రశాంత్ గెలిచి బయటికొచ్చాక జరిగిన పరిణామాలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. అభిమానుల అత్యుత్సాహంతో కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు అద్దాలు ధ్వంసం కావడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అన్నపూర్ణ స్టూడియో వద్ద ఫ్యాన్స్ చేసిన హంగామాతో అమర్దీప్, అశ్విని, గీతూరాయల్ కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. (ఇది చదవండి: భారీ ధరకు డంకీ ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై మరో కంటెస్టెంట్ అశ్విని స్పందించారు. పల్లవి ప్రశాంత్ అమాయకుడని అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన సంతోషం లేకుండా చేశారని అన్నారు. నాకు ప్రశాంత్ తమ్ముడిలాంటి వాడు.. అతను త్వరలోనే జైలు నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నట్లు అశ్విని బాధపడ్డారు. అది ఫ్యాన్స్ చేసిన తప్పే కానీ.. ప్రశాంత్ అలాంటివాడు కాదని తెలంగాణ పోలీసులను కోరింది. అశ్విని మాట్లాడుతూ.. 'పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారని తెలిసింది. ఇది కరెక్ట్ కాదండి. ఓ కామన్ మ్యాన్‌గా వచ్చి ట్రోఫీ గెలిచాడు. పాపం.. ప్రశాంత్ ఏం చేశాడండి. అతన్ని చూసేందుకు అన్నపూర్ణ స్టూడియో వద్దకు ఫ్యాన్స్ వచ్చారు. అతన్ని అరెస్ట్ చేయడం చాలా తప్పు. ప్రశాంత్ చాలా అమాయకుడు, మంచి వ్యక్తి కూడా. కప్ గెలిచి ఒక్కరోజు కూడా కాలేదు. ఆ సంతోషం కూడా లేకుండా చేశారు. నా తమ్ముడు లాంటి వ్యక్తిని జైల్లో వేశారంటనే చాలా బాధగా ఉంది. అతను త్వరగా బయటికి రావాలని కోరుకుంటున్నా. ప్లీజ్ ప్రశాంత్‌కు సపోర్ట్ చేయండి. అది అతని తప్పుకాదని తెలంగాణ పోలీసులకు విజ్ఞుప్తి చేస్తున్నా' అంటూ ప్రశాంత్‌కు మద్దతుగా నిలిచారు. కాగా.. స్టూడియో బయట జరిగిన గొడవలో అశ్విని కారు అద్దాలు కూడా ధ్వంసమైన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఆర్జీవీ బ్యూటీ.. ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన భామ!) -
రైతుబిడ్డకు గెలిచినా ఆనందం లేకుండా చేశారు: ప్రశాంత్ తండ్రి ఆవేదన
రైతుబిడ్డగా బిగ్‌బాస్ రియాలిటీ షో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ గెలిచాడు. వంద రోజులకు పైగా సాగిన ఈ షోలో మరో కంటెస్టెంట్ అమర్దీప్ రన్నరప్‌గా నిలిచాడు. అయితే అంతవరకు బాగానే ఉన్న.. ప్రశాంత్ గెలిచి బయటికొచ్చాక జరిగిన పరిణామాలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. అభిమానుల అత్యుత్సాహంతో కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు అద్దాలు ధ్వంసం కావడంతో పోలీసులు పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు. ట్రోఫీ గెలిచి ఇంటికి వెళ్లిన ప్రశాంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు కూడా తరలించారు. తాజాగా ఈ వివాదంపై ప్రశాంత్ తండ్రి సత్యనారాయణ మాట్లాడారు. తన కుమారుడిని అరెస్ట్ మాకు సంతోషం లేకుండా చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదని.. కుమారుల అరెస్ట్‌తో ఏడుస్తూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: మరికొద్ది గంటల్లో సలార్ రిలీజ్.. సూపర్ సాంగ్ విడుదల!) అరెస్ట్‌పై ప్రశాంత్ తండ్రి మాట్లాడుతూ.. 'నా కొడుకు బిగ్‌బాస్ గెలిచిండని మురిసిపోయినా. ట్రోఫీ గెలిచిన ఐదు గంటలకే నాకు బాధగా అనిపించింది. మాకు ఇదంతా ఎందుకు? వ్యవసాయం చేసుకుంటే సరిపోయేదనిపించింది. మా ఊర్లో ఉంటేనే బాగుండు. లేని పోనివీ సృష్టించి వార్తలు రాస్తుర్రు. ప్రశాంత్ పక్కనే నేను కూడా ఉన్నా. నాకు వాంతులు కూడా అయ్యాయి. ఈ గొడవతో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు. అదే సెలబ్రిటీలు అయితే ఇలానే చేస్తారా?. మావాడు ఎక్కడికి పోలే. కానీ కొందరు కావాలనే పారిపోయిండని రాసిర్రు.'అని వాపోయారు. పోలీసులు తీరుపై సత్యనారాయణ మాట్లాడుతూ.. 'బుధవారం సాయంత్రం 6.30కు పోలీసులు వచ్చి ప్రశాంత్‌ను తీసుకెళ్లారు. మాది మారుమూల గ్రామం. బెయిల్ ఇలాంటి వన్నీ నాకు తెల్వదు. నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు. ఆమె ఏడుస్తూ కూర్చుంది. జ్వరం కూడా వచ్చింది. మమ్మల్ని లేని పోనీ ఇబ్బందులు, బాధలు పెట్టిండ్రు సార్. పరేషాన్ చేసిర్రు. బట్టలు మార్చుకుంటానంటే కూడా వినలేదు. ముందుగా మంచిగానే మాట్లాడిర్రు, ఒకాయన అయితే ప్రశాంత్ మెడల మీద చేతులపట్టి నూక్కొచ్చిర్రు. వారెంట్ కూడా ఇయ్యలేదు. దొంగతనం చేసినట్లు ప్రశాంత్‌ను తీసుకెళ్లారు. ప్రజలందరికీ నేను ఒక్కటే వేడుకుంటున్నా. నా కొడుకు దొంగ కాదు. బిగ్ బాస్‌కు పోతానంటే నేను పంపించినా. విన్నర్ అయినడు. కానీ ఆ సంతోషం మాకు లేకుండా పోయింది.' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. (ఇది చదవండి: పల్లవి ప్రశాంత్ కేసు.. నలుగురు మైనర్లు అరెస్ట్!) -
పల్లవి ప్రశాంత్ కేసు.. నలుగురు మైనర్లు అరెస్ట్!
బిగ్ బాస్ సీజన్ - 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. రియాలిటీ షో విజేతగా నిలిచిన తర్వాత జరిగిన గొడవ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు, మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా కొల్గూరులో బుధవారం ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అదే రోజు రాత్రి జరిగిన గొడవలో టీఎస్ ఆర్టీసీ బస్సులపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. బస్సులతో పాటు మరికొందరు కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్ల అద్దాలు సైతం పగలగొట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మరో 16 మందిని అరెస్ట్ చేశారు. అయితే అరెస్టైన వారిలో నలుగురు మైనర్లు కూడా ఉన్నారు. మరో 12 మంది మేజర్లను వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజర పరచనున్నారు. నలుగురు మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరు పరచనున్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగిదంటే... అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేటు నుంచి పంపారు. కానీ ఆ సమయానికే ప్రశాంత్‌ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్ తన మిత్రుడు వినయ్ ద్వారా రెండు కార్లను అద్దెకు తెచ్చుకున్నారు. ఇది గమనించిన పోలీసులు ఇప్పటికే ఇక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది.. ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం.. బయటకు వెళ్లి ఎక్కడైన సభ పెట్టుకోండి అని చెప్పి.. ఆ కార్లను పక్కనపెట్టి పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్‌ను పంపించారు. అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దె కార్లతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ మళ్లీ జోక్యం చేసుకుని ప్రశాంత్‌ను రావొద్దని చెప్పినా.. ప్రశాంత్ వినిపించుకోలేదని ఆయన తెలిపారు. ప్రశాంత్‌ను అడ్డగించి పంపించేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్లపై దాడితో పాటు రెండు పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు ఆరు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలకొట్టారు. -
బిగ్‌బాస్ విన్నర్ రైతుబిడ్డకు నిరాశ.. తీర్పు వాయిదా
బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. స్టూడియో నుంచి వెళ్లిపోమని చెప్పినా వినకుండా తిరిగి స్టూడియో ఎదుట ప్రశాంత్ ర్యాలీ చేయడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అతడి అభిమానులు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. దీంతో తమను డ్యూటీ చేయకుండా అడ్డుకున్నాడంటూ ప్రశాంత్‌ను, అతడి సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసులు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు ప్రశాంత్.. తనపై నమోదైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. దీంతో ప్రశాంత్‌కు బెయిల్ వస్తుందా? లేదా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత! -
రైతుబిడ్డకంత నాలెడ్జ్ లేదు..
-
నా పాట, అతడి ఆట జైలుపాలైంది.. ఏడ్చేసిన భోలె షావళి
బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలే రోజు పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఇంటర్వ్యూ ఇవ్వమని అడగడానికి వస్తే తమను అసభ్య పదజాలంతో దూషించాడని కొందరు యాంకర్లు ప్రశాంత్ మీద ఆరోపణలు చేశాడు. తనను కావాలని నెగెటివ్ చేస్తున్నారంటూ అరెస్టుకు ముందు ఆవేదన వ్యక్తం చేశాడు ప్రశాంత్. తాజాగా ప్రశాంత్‌ను అరెస్ట్ చేయడంపై సింగర్, బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ భోలె షావళి స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. జనం కోసం ఆడాలి.. 'అతడు మట్టిబిడ్డ, రైతుబిడ్డ. ఎంతో పోరాటం చేసి గెలిచాడు. హౌస్‌లో టాస్కులు ఆడేటప్పుడు ఎన్నో దెబ్బలు తగిలేవి. అన్నా.. ఛాతీ దగ్గర నొప్పి లేస్తుంది, ఏమైనా అయితదా? అన్నా అని అడిగేవాడు. లేదు తమ్ముడు, నువ్వు జనం కోసం ఆడాలి. నీకు మంచి పేరుంది. నువ్వు ఆడాలి, నువ్వు గెలవాలి. నీకోసం పాట పాడటానికి వచ్చాను. నేను హౌస్‌లో లేకున్నా పర్వాలేదు. నేను బయట పాటతో బతుకుతాను. కానీ నువ్వు ఆటతోనే బతకాలి అని చెప్పాను. చివరకు నా పాట, ఆయన ఆట.. అంతా జైలుపాలైంది. చాలా బాధగా ఉంది. జనం స్పందించి ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వరకు తీసుకెళ్లండి. ఆనందంలో ఏం చేశాడో తెలియలేదు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో కూడా ప్రశాంత్‌కు తెలియదు. అభిమానులు చాలామంది వచ్చారు. ఇంతమంది ఓటేస్తే గెలిచానన్న ఆనందంలో ఆయన ఏం చేశాడో ఆయనకే తెలియలేదు. ఆయన నేరం చేయలేదు. టైటిల్ గెలిచిన వ్యక్తి జైలుపాలైతే ఆయన ఎంత మానసిక క్షోభ పడతాడు. తనకు లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియదు. తనకంత నాలెడ్జ్ లేదు. తనవల్ల ఇబ్బందులు ఎదురైతే.. పోలీసులకు నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను' అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు భోలె షావళి. హైకోర్టు అడ్వకేట్ వినోద్‌ను తన వెంట జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన భోలె న్యాయం కోసం పోరాడతానంటున్నాడు. చదవండి: నాకు, నా ఫ్యామిలీకి ఏదైనా జరిగితే ఆ ఐదుగురిదే బాధ్యత! -
మీరు చేస్తుంది తప్పు...
-
నాకేదైనా అయితే ఆ ఐదుగురే కారణం.. వీడియోలున్నాయ్!
ఒక కామన్ మ్యాన్ అనుకుంటే ఏదైనా సాధించగలడని నిరూపించాడు పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డగా హౌస్‌లో అడుగుపెట్టిన అతడు ఎంతో వినయంగా మెదులుతూ అందరి మనసులు గెలుచుకున్నాడు. ఆటల్లోనూ విజృంభిస్తూ ఇతర కంటెస్టెంట్లకు గట్టిపోటినిచ్చాడు. అంతిమంగా అందరినీ వెనక్కు నెట్టి బిగ్‌బాస్ 7 టైటిల్ ఎగరేసుకుపోయాడు. కానీ ఈ ఆనందం ఒక్కరోజులోనే ఆవిరైపోయింది. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియో ఎదుట కంటెస్టెంట్ల కార్లపై, ప్రభుత్వ ఆస్తులపై దాడి జరిగింది. పోలీసుల మాటలు బేఖాతరు శాంతి భద్రతల సమస్య దృష్ట్యా ప్రశాంత్‌ను అక్కడ ఆగకుండా వెంటనే వెళ్లిపోమన్నారు పోలీసులు. ఇతడు మాత్రం రైతుబిడ్డకు విలువిస్తలేరంటూ పోలీసులనే వీడియోలు తీస్తూ దురుసుగా ప్రవర్తించాడు. బయటకు వెళ్లిపోయిన కాసేపటికే పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రశాంత్ మళ్లీ అన్నపూర్ణ స్టూడియోకు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమయ్యాడంటూ పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కావాలనే నెగెటివ్ చేస్తున్నారు అయితే తాను అరెస్ట్ అవడానికి ముందు ప్రశాంత్.. అసలేం జరిగిందనేదానిపై వివరణ ఇస్తూ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో ప్రశాంత్ మాట్లాడుతూ.. 'నాకు సరిగా తిండీ నిద్ర లేదు. కొంచెం ఫ్రీ అయ్యాక మీకు గంటలు గంటలు ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పిన. కొందరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదని వాళ్లు ఏదేదో మాట్లాడారు. అది చాలా తప్పు. ఆ నలుగురైదుగురి ఫోటోలు, వీడియోలు మావాళ్ల దగ్గర ఉన్నాయి. వాళ్లు నన్ను కావాలనే నెగెటివ్ చేస్తున్నారు. నాకేమైనా అయితే వాళ్లదే బాధ్యత! పోలీసులు చెప్పారు, కానీ.. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే నాకోసం వచ్చిన జనాన్ని చూసి నేను పరేషాన్ అయిన. నాకు ఇంతమంది సపోర్ట్ చేశారా? అనుకున్నాను. పోలీసులు వెనుక గేట్ నుంచి వెళ్లమన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. నాకోసం అంతమంది వచ్చారు.. నేను దొంగలాగా వెనుక నుంచి వెళ్లను.. ముందు గేట్ నుంచే వెళ్తానని చెప్పాను. వాళ్లు ఇంకా ఏమని చెప్పారో ఆ రణగొణ ధ్వనుల మధ్య నాకు వినబడలేదు. వాళ్లు నా మంచి కోసమే చెప్పారు.. కానీ అప్పుడు నాకు ఏదీ సరిగా వినబడకపోవడంతో అలాగే ముందుకు వెళ్లాను. కొందరు కావాలనే నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ నాకేదైనా అయినా, నా ఇంట్లోవాళ్లకు ఏదైనా జరిగినా ఆ ఐదుగురి ఫోటోలు బయటకు వస్తాయి' అని చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. చదవండి: పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్.. వారిద్దరిపై నమోదైన కేసు ఇదే -
పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడ జైలుకు తరలింపు
బిగ్‌బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రాత్రి అతని స్వగ్రామం గజ్వేల్‌లోని కొల్గూరులో అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్‌ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్‌ను ఏ-2గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ ఫైనల్ ముగిసిన తర్వాత వీరిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. పోలీసులు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడంతో లాయర్ ద్వారా వారిద్దరూ మళ్లీ ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సీజన్- 6 కాంటెస్టెంట్ గీతూరాయల్ కారును కూడా ధ్వంసం చేశారు. ఆపై ఆమె కారులోకి చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దాంతో అల్లరిమూకలు రోడ్లపైకి పరుగులు తీస్తూ ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను పగులగొట్టారు. ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కేసు పెట్టడం జరిగింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్‌పై కేసు.. కారణం అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్ బాస్ సీజన్-7 విజేత పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేటు నుంచి పంపారు. కానీ ఆ సమయానికే ప్రశాంత్‌ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్ తన మిత్రుడు వినయ్ ద్వారా రెండు కార్లను అద్దెకు తెచ్చుకున్నారు. ఇది గమనించిన పోలీసులు ఇప్పటికే ఇక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది.. ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం.. బయటకు వెళ్లి ఎక్కడైన సభ పెట్టుకోండి అని చెప్పి.. ఆ కార్లను పక్కనపెట్టి పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్‌ను పంపించారు. అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దె కార్లతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ మళ్లీ జోక్యం చేసుకుని ప్రశాంత్‌ను రావొద్దని చెప్పినా.. ప్రశాంత్ వినిపించుకోలేదని ఆయన తెలిపారు. ప్రశాంత్‌ను అడ్డగించి పంపించేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్లపై దాడితో పాటు రెండు పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు ఆరు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలకొట్టారు. ప్రశాత్కు 14 రోజుల రిమాండ్ ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం కేసులో జూబ్లీహిల్స్ ఎస్సై మెహర్ రాకేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్, మనోహర్, వినయ్‌తో పాటు అద్దె కార్లను నడిపిన డ్రైవర్లు సాయికిరణ్, రాజుపై కూడా కేసు నమోదు చేశారు. ఈనెల 19న డ్రైవర్లు సాయికిరణ్, రాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ప్రశాంత్, అతని సోదరుడు మనోహర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్లో వారిద్దరినీ విచారించి ఆపై రాత్రి సమయంలోనే జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్‌తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. పల్లవి ప్రశాంత్‌తో పాటు సోదరుడు మనోహర్‌కు కూడా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అర్ధరాత్రి వారిద్దరినీ చల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. పోలీసులు ముందే హెచ్చరించినా సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ.. ప్రభుత్వ ఆస్థులకు నష్టం కలిగేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని పోలీసులు తెలిపారు. ఫైనల్‌గా వారిద్దరిపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసును పోలీసులు నమోదుచేశారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్
-
బిగ్ బాస్‌పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ రచ్చే జరిగింది. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అభిమానులు చేసిన ఫలితంగా అక్కడ గొడవలు జరిగాయని పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఇలా అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద గొడవే జరిగింది. ఇప్పటికే బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని పలువురు ప్రముఖులు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ షో గురించి తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు (HRC ) హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. కానీ ఎక్కడ హీరో నాగార్జున పేరు లేదు. ఈ కేసులలో నాగార్జున పేరును కూడా చేర్చాలి. అయన కూడా ఈ గొడవలకు బాద్యులే. అంత గొడవ బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టుకు లేఖ రాశాను. నాగార్జునను కూడా వెంటనే అరెస్ట్ చెయ్యాలి.' అని ఆయన కోరారు. కేసుల విషయాలు.. బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్లో పాల్గొన్న అమర్దీప్, అశ్విని, అక్కడే ఉన్న మరో సెలబ్రిటీ గీతూ రాయల్ కార్ల మీద దాడి జరిగింది. వారి కార్ల అద్దాలు పగిలాయి. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. ఆ తరువాత ఆరు ఆర్టీసీ బస్సులు, ఒక పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. పోలీసులు సుమోటోగా ఈ కేసు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 147, 148, 290, 353, 427 r/w 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టారు. మొత్తం రెండు కేసులు ఉండగా ఒకదానిలో పల్లవి ప్రశాంత్ పేరు ఉన్నట్లు సమాచారం. -
పల్లవి ప్రశాంత్ బెయిల్‌కు చిక్కులు.. కారణం ఇదే: ప్రశాంత్ లాయర్
బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ముందు గేటు నుంచి రావద్దని పోలీసులు చెప్పినా కూడా ప్రశాంత్ రావడం వల్ల అక్కడ పరిస్థితి కంట్రోల్ చేయడం తమ వల్ల కాలేదేని ఆ సమయంలో పోలీసులు తెలిపారు. ఆ సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు విషయంపై హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్‌కుమార్ సాక్షి మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్‌పై కక్షసాధింపు చర్యలు తగవని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని ఆయన చెబుతూ ప్రశాంత్ బెయిల్ గురించి ఇలా మాట్లాడారు. 'ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు.. కానీ ఇప్పటి వరకు కనీసం నిందితుడికి FIR కాపీ ఇవ్వడం లేదు. ఈ కేసుల వల్ల భయపడిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. దీంతో Fir కాపీ కోసం జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ను నేను సంప్రదించాను. కానీ ఆయన మాత్రం FIR కాపీ కొసం కుటుంబ సభ్యులు రావాలని తెలుపుతున్నారు. కేసు ఏదైనా సరే FIR కాపీని మాత్రం పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన బాధ్యత పొలిసులకు ఉంది. FIR కాపీ ఉంటేనే ప్రశాంత్‌కు బెయిల్ దరఖాస్తు చేసుకునేందకు అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆ కాపీ ఇవ్వకపోవడంతో బెయిల్ దరఖాస్తు చేసుకోలేకపోతున్నాం. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏంటో FIR కాపీ చూస్తేనే తెలుస్తుంది.' అని హైకోర్టు న్యాయవాది కే రాజేశ్‌కుమార్ తెలిపారు. -
పల్లవి ప్రశాంత్ కార్ డ్రైవర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
-
పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ఛాప్.. కంటతడి పెట్టుకున్న తల్లిదండ్రులు
సాక్షి, గజ్వేల్: కోట్లాదిమంది తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్న బిగ్‌బాస్ సీజన్–7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కక్షసాధింపు చర్యలు తగవని హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్‌కుమార్ అన్నారు. మంగళవారం ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ప్రశాంత్‌పై వివిధ సెక్షన్లతో కేసు నమోదైనట్లు మీడియాలో కథనాలు వస్తున్నా...ఇప్పటివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆన్లైన్లో పెట్టలేదని తెలిపారు. ఆరెస్ట్ చేస్తారనే భయంతో ప్రశాంత్‌తోపాటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. సామాన్య రైతు బిడ్డగా వెళ్లి బిగ్‌బాస్ టైటిల్‌ను గెలుచుకున్న యువకునికి ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. ప్రశాంత్ విజేతగా నిలవడం ఇష్టంలేని కొన్ని శక్తులు నగరంలో జరిగిన సంఘటనలకు కారణమన్న అనుమానం నెలకొందన్నారు. ఈ విషయంలో నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. చట్ట ప్రకారం పోలీసులు వెళ్తే తాము అడ్డుపడబోమని, కానీ ప్రశాంత్‌పై కేసు నమోదు చేసినట్లయితే వెంటనే పోలీసుశాఖ వెబ్సైట్లో ఎఫ్ఐఆర్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన ఆనందాన్ని కోల్పోయి..ఫోన్ కూడా స్విచ్ఛాప్ చేసుకొని ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. అతనికి అండగా ఉంటూ న్యాయసహాయం అందిస్తానని తెలిపారు. తల్లిదండ్రులు కంటతడి.. తమ కొడుకుపై కక్షసాధిస్తున్నారని విలేకరుల సమావేశంలో పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలు కంటతడిపెట్టుకున్నారు. చిన్నప్పటి నుంచి ప్రశాంత్ ఎంతోకష్టడి చివరకు తానూ అనుకున్నదని సాధించాడని, కానీ ఈ సంతోషం కొన్ని గంటలు కూడా నిలవలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా నిలవాలని వారు కోరారు. -
నేనైతే కారుతో గుద్దిపడేసేవాడిని.. అమర్ విషయంపై సోహైల్ ఫైర్
బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్‌ను రైతుబిడ్డ అని చెప్పుకుంటున్న పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ రన్నర్‌గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్‌లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్‌ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. ఈ విషయంపై చాలామంది రియాక్ట్ అవుతున్నారు. తాజాగా సయ్యద్ సోహైల్ రియాక్ట్ అయ్యాడు. 'ఒక వ్యక్తిపై అభిమానం ఉండాలి కానీ ఉన్మాదం పనికిరాదు.. అమర్ కారుపై దాడి చేసింది అందరూ కూడా యువకులే. మనకు ఉద్యోగాలు లేక ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇలాంటి పనులు చేసి తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకు రాకండి. అభిమానం ముసుగులో ఇలా అమర్‌పై దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్... ఆ దాడి సమయంలో అమర్‌తో పాటు ఆయన అమ్మగారు, భార్య తేజు ఉన్నారు. వారి కారును చుట్టుముట్టి అద్దాలు పగులకొట్టి ఆపై వారందరినీ నోటికి వచ్చిన బూతులు తిట్టారు. అమర్ భార్య, అమ్మగారిని చెప్పలేని పదాలతో తిట్టారు. మరోకడు అయితే ఆ బూతులు వినలేడు కూడా.. అలాంటి పదాలతో తిట్టడం ఎంత వరకు కరెక్ట్... నేను కూడా ఒక కొడుకుగా చెబుతున్నా.. ఇలాంటి మాటలు నాకే ఏదురైతే గనుకా ఆ సమయంలో కారుతోనే గుద్దిపడేసేవాడిని తర్వాత ఏదైతే అది జరగని.. తన తల్లిదండ్రులను అంటే ఎవరిలోనైనా ఇదే అభిప్రాయం వస్తుంది. భార్య, అమ్మను తన ముందే ఇలా తిడితే ఎవడూ సహించడు. కారుతో అలానే గుద్ది పారేస్తాడు.. కానీ అమర్ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. నిజానికి వాడు చాలా మంచోడు ఇండస్ట్రీలో ఎవరినీ అడిగినా అదే చెబుతాడు.. అంత గొడవ జరిగినా తర్వాత కూడా తన అమ్మ, భార్య జోలికి మాత్రం రాకండి. ఏమైనా చేయాలనుకుంటే తనను మాత్రమే చేసుకోండి అని చెప్పాడు. ఇంతలా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం దేనికి..?' అని సోహైల్ రియాక్ట్ అయ్యాడు. -
పరారీలో పల్లవి ప్రశాంత్!
-
బిగ్ బాస్‌కు ముందే SPY బ్యాచ్ స్టార్ట్ అయిందా.. వీడియో వైరల్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. ఈ సీజన్ ప్రధానంగా SPY (శివాజీ, ప్రశాంత్, యావర్) SPA (శోభ,ప్రియాంక,అమర్) బ్యాచ్‌ల మధ్యే నడిచింది. చివరకు స్పై బ్యాచ్‌లోని ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ ప్రారంభంలోనే శోభ,ప్రియాంక,అమర్ ముగ్గురూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని.. వాళ్లందరూ 'స్టార్ మా' బ్యాచ్ అంటూ మొదట్లోనే శివాజీ కన్నింగ్ ప్లాన్ వేశాడు. వాస్తవానికి ఆ విషయంలో వాళ్లే ఒప్పుకున్నారు. ఇక్కడికి రాక ముందే తామందరం మంచి స్నేహితులం.. ఈ షో గురించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పలేమని తెలిపి వారు గ్రూప్‌గానే గేమ్ ఆడుతూ వచ్చారు. ఇదే క్రమంలో శివాజీ, యావర్, ప్రశాంత్ కూడా SPY అనే పేరుతో గ్రూప్ అయ్యారు.. వారు కూడా గ్రూప్ గేమ్ ఆడుతూ పదే పదే SPA బ్యాచ్ మాత్రమే గ్రూప్ గేమ్ ఆడుతుందని హౌస్‌లో పదేపదే ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ వీరు ముగ్గురు హౌస్‌లోకి రాక ముందే ఒకరికొకరితో పరిచయం ఉంది అంటూ గతంలోనే కొన్ని వార్తలు వచ్చాయి. హౌస్‌లోకి వచ్చిన తర్వాతే వాళ్ల మధ్య పరిచయం అయినట్లూ ఈ ముగ్గురు కూడా కలరింగ్ ఇచ్చారు. ఎక్కడా తమ మధ్య ముందే పరిచయం ఉందని రివీల్ చేయలేదు. బిగ్ బాస్‌లోనే మొదటి పరిచయం అయినట్లు కనిపించారు. అలా ఈ ముగ్గురు ఒకటిగా గేమ్ ఆడుతూ.. SPA బ్యాచ్ మాత్రమే గ్రూప్ అంటూ పదే పదే ఎదురుదాడి చేశారు. SPY బ్యాచ్‌పై ముందు నుంచే చాలా అనుమానాలు కనిపించాయి. బిగ్ బాస్‌కు ముందు ప్రశాంత్‌ను ఎక్కడా చూడలేదని యావర్ చెప్పాడు. అంతేకాకుండా కలవలేదని చెప్పాడు. ఇక్కడికి వచ్చాకే ఫ్రెండ్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు. అదంతా నిజమేనని జనాలు కూడా నమ్మారు. కానీ అది అబద్దం అని తేలిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పల్లవి ప్రశాంత్, యావర్ చాలా క్లోజ్‌గా మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్‌కు ముందే వారిద్దరి మధ్యే బాటలు సాగాయని తేలిపోయింది. ఇదే క్రమంలో శివాజీ, ప్రశాంత్ మధ్య కూడా పరిచయం ఉందని సమాచారం. బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు ప్రశాంత్‌ను ఇంటర్వ్యూ చేయాలని ఒక యూట్యూబ్ వారిని శివాజీనే సూచించాడట. ఇలా ఈ ముగ్గురి మధ్య పరిచయం ఉన్నప్పటికీ దానిని దాచి వారి గేమ్ ప్లాన్‌ను మొదలు పెట్టారు. దీంతో స్పై బ్యాచ్ ముందే ప్లాన్ చేసుకొని వచ్చారనే కామెంట్స్ వినిపిస్తన్నాయి. ఇది చూసిన స్పై ఫ్యాన్స్ సైతం ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. జనాలను మోసం చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ చాలా ఏళ్ల నుంచి తమ మధ్య స్నేహం ఉందని ఓపెన్‌గా చెప్పిన స్పా బ్యాచ్... ఆట కోసం తమ స్నేహాన్ని వదులుకోలేమని చెప్పి ఆటలో ఎన్ని గొడవలు జరిగినా మళ్లీ కలిసిపోతూ.. స్నేహంలో ఇవన్నీ సహజమే అనేలా తమ ఆటను కొనసాగించి నిజమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. View this post on Instagram A post shared by 𝐒𝐌𝐃🧘 (@swaasa_meedha_dhyaasa_) -
పరారీలో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్!
హైదరాబాద్: పబ్లిక్ న్యూసెన్స్‌కు కారకుడైన బిగ్‌బాస్ సీజన్–7 విజేత గొడుగు పల్లవి ప్రశాంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండగా ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో అతడి అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గజ్వేల్ సమీపంలోని కొలుగూరు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ ఆదివారం రాత్రి జరిగిన బిగ్‌బాస్–7 విజేతగా ఎంపిక కాగా, అమర్దీప్ రన్నరప్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్‌రోడ్ నె.ం 5లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమర్‌దీప్‌ను విజేతగా ప్రకటించ కపోవడంతో ఆయన అభిమానులు గొడవకు దిగారు. మరోవైపు పల్లవి ప్రశాంత్ అభిమానులు వేలాదిగా అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తూ అమర్దీప్ కారును ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడమేగాక అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బయట గొడవ జరుగుతున్నట్లు గుర్తించిన బిగ్‌బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్‌ను స్థానిక పోలీసుల సహకారంతో రహస్య మార్గం నుంచి బయటికి పంపించింది. మళ్లీ ఇటు వైపు రావొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే పల్లవి ప్రశాంత్ ఇటు పోలీసుల ఆదేశాలను, అటు బిగ్‌బాస్ యాజమాన్యం సూచనలను బేఖాతర్ చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్ టాప్ జీప్‌పై చేరుకోవడంతో రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మద్దతుదారులు రాళ్లు రువ్వుతూ మహిళా కంటెస్టెంట్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఇందుకు కారకుడైన పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి పోలీసులకు దొరక్కుండా పరారయ్యాడు. దీంతో అతడి సోదరుడు పరుశరాములు కోసం పోలీసులు ఒక బృందాన్ని స్వగ్రామానికి పంపించారు. కారు డ్రైవర్ సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కోసం ప్రత్యేకంగా మూడు బృందాలు ఏర్పాటు చేశారు. ఆయన అనుచరుల ఫోన్ డేటాను సేకరించారు. కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో పల్లవి ప్రశాంత్ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి కూడా ఓ బృందాన్ని పంపించనున్నారు. ఇదిలా ఉండగా బస్సులపై రాళ్లు రువి్వన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం 15 మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను వడపోస్తున్నారు. -
సంతోషం లేకుండా చేశారు !
-
నాకేమైనా సీఎం పదవి ఇచ్చిర్రా?: పల్లవి ప్రశాంత్!
కామన్ మ్యాన్ టైటిల్ ఎగరేసుకుపోవడం బిగ్‌బాస్ చరిత్రలోనే తొలిసారి! ఇంతవరకు తెలుగులో కామన్ మ్యాన్ రన్నరప్ వరకు కూడా వచ్చిందే లేదు. అలాంటిది రైతుబిడ్డగా హౌస్‌లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన పేరు చానా ఏండ్లు యాదుండేలా బిగ్‌బాస్ 7 టైటిల్ సాధించేశాడు. జనాలు టాస్కులు ఒక్కటే చూడరు.. వారి మాటతీరు, ప్రవర్తననే ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారు. వినయం, విధేయత ఎక్కడ? అలా ప్రశాంత్ వినయ, విధేయత చాలామందిని కట్టిపడేసింది. పొగడ్తలకు ఉప్పొంగిపోకుండా ఒదిగి ఉండే తీరుకు ప్రేక్షకులు ముచ్చటపడ్డారు, గెలిపించారు. ఇక్కడివరకు అంతా బానే ఉంది.. కానీ తర్వాతే సీన్ రివర్స్ అయింది. టైటిల్ గెలిచిన తర్వాత ప్రశాంత్ కాళ్లు భూమి మీద లేవు. గాల్లో తేలుతున్నాడు. షోలోకి వెళ్లడం కోసం యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చి తనకు సపోర్ట్ చేయమన్న రైతుబిడ్డ ఇప్పుడు కప్పుతో వచ్చిన తర్వాత యూట్యూబ్ యాంకర్లను అస్సలు పట్టించుకోవడం లేదట. అంతే కాదు ఇంటర్వ్యూ అడిగితే కూడా చాలా దురుసుగా, చులకన చేసి మాట్లాడుతున్నాడట. ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదే! ఒక్క ఇంటర్వ్యూ అని అడిగితే.. 'మీరు మా పొలం దగ్గరకు రండి.. పనులు చేయండి.. వీడియో తీసుకోండి. మీ యూట్యూబ్ ఛానల్స్ నుంచి రైతులకు ఏమిస్తారో చెప్పుర్రి. ఆ తర్వాతే మీకు ఇంటర్వ్యూలు ఇస్తా..' అంటూ అతి చేస్తూ మాట్లాడాడు. ఇక మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ వల్ల భూములు కోల్పోయిన దాదాపు 15 గ్రామాల రైతులకు గతంలో ఏమైనా సాయం చేశారా? వారికి అండగా నిలిచారా? అని ఓ యాంకర్ అడిగాడు. దీనికి ప్రశాంత్ స్పందిస్తూ.. 'నాకేమైనా సీఎం పదివి ఇచ్చిర్రా? ఏదైనా చేయడానికి! నేను ఒక రైతుబిడ్డను కదా.. సీఎం చేస్తరా చెప్పుండ్రి.. అందరినీ ఆదుకుంటా.. నేనేమైనా నాయకుడినా? నేనూ ఒక రైతుబిడ్డనే.. నేనేం చేస్తా' అని వెటకారంగా నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఫ్రెండ్స్‌ను సైతం లెక్కచేయట్లేదా? ఈ ప్రవర్తనను బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, యాంకర్ శివ తప్పుపట్టాడు. 'ప్రశాంత్.. 18 గంటలు వెయిట్ చేయించి ఇంటికి రా అన్నా.. ఇంటర్వ్యూ ఇస్తా అని పిలిచాడు. తీరా అక్కడికి వెళ్తే ఇంటి బయట 8 గంటలు కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇవ్వను.. వెళ్లిపోమని దురుసుగా మాట్లాడాడు. గొప్ప విన్నర్ ప్రశాంత్.. అక్కడే ఉన్న తన స్నేహితులను కూడా అతడు లెక్క చేయడం లేదు.. ఇవన్నీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని పెట్టలేదు.. ఇవ్వను అని చెప్పే విధానం బాలేదు' అని మండిపడ్డాడు. రైతులకు ఏం చేస్తారో చెప్తేనే ఇంటర్వ్యూలు ఇస్తానన్న వీడియోను షేర్ చేస్తూ.. బిగ్‌బాస్‌కు వెళ్లేముందు ఇంటర్వ్యూలు ఇచ్చావుగా.. అప్పుడు లేని కండీషన్స్ ఇప్పుడెందుకు? ఆరోజు రైతుకి ఏమైనా ఇవ్వమని ఎందుకు చెప్పలేదు? అని వరుస ప్రశ్నలు అడిగాడు. ఇన్నాళ్లూ మాస్క్ వేసుకున్నాడా? మరోవైపు గ్రాండ్ ఫినాలే రోజు స్టూడియో బయట గందరగోళం నెలకొన్న పరిస్థితి తెలిసిందే! అమర్, గీతూ, అశ్విని కారు అద్దాలతో పాటు అక్కడి బస్సు అద్దాలు సైతం పగిలిపోయాయి. శాంతి భద్రతల సమస్య కారణంగా వెళ్లిపోమని పోలీసులు చెప్తుంటే.. ప్రశాంత్ అది అర్థం చేసుకోకుండా పోలీసులు రైతుబిడ్డకు విలువ ఇవ్వడం లేదంటూ వీడియో తీశాడు. ఇదంతా చూసిన నెటిజన్లు.. ప్రశాంత్ ఇన్నాళ్లూ బిగ్‌బాస్ హౌస్‌లో మాస్క్ వేసుకునే ఉన్నాడు, బిగ్‌బాస్‌కు రాకముందు ప్రశాంత్ ఏమైనా రైతులకు సాయం చేశాడా? లేదు కదా.. ఎందుకింత పొగరుగా వ్యవహరించడం? యాటిట్యూడ్, తలపొగరు చూపించకుండా సమాధానాలు చెప్పి ఉంటే బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. #BiggBossTelugu7 is immature or arrogance #PallaviPrashanth. Omg he just lost the plot pic.twitter.com/pu53KsS8a4— telugu guy (@nthony_venky) December 19, 2023 చదవండి: 35 ఏళ్ల వయసులోనూ స్లిమ్‌గా.. అరడజను సినిమాలతో ఫుల్ బిజీ.. -
హద్దులు దాటిన అభిమానం
బంజారాహిల్స్: అభిమానం హద్దులు దాటడంతో జూబ్లీహిల్స్‌లో బీభత్సం నెలకొంది. ఆరు ఆర్టీసీ బస్సులపై బిగ్‌బాస్ సీజన్–7 కంటెస్టెంట్ల అభిమానులు రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. పోలీసుల వాహనాల పైనా దాడి చేయడంలో ఓ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. పలువురు కంటెస్టెంట్ల వాహనాలు ధ్వంసమయ్యాయి. అర్ధరాత్రి అన్నపూర్ణ స్టూడియో ఏడెకరాల వద్ద భయానక వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళితే..ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ సీజన్–7 ఫైనల్స్ జరిగాయి. అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న ఫైనల్స్ విజేత పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్దీప్ అభిమానులు నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. స్టూడియో నుంచి బయటికి వస్తున్న కార్లపై దాడులకు తెగపడ్డారు. రన్నరప్ అమర్దీప్ కారు అద్దాలను ధ్వంసం చేయడంతో ఆయన కారులో నుంచి బయటికి పరుగులు తీసి ఓ చెట్టు చాటున దాక్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొద్ది సేపటికే మరో కంటెస్టెంట్ అశ్విని శ్రీతో పాటు గత సీజన్ కంటెస్టెంట్ గీతూ రాయల్ వాహనాలపైనా దాడి చేశారు. అంతటితో ఆగక అటుగా వెళ్తున్న హెచ్‌సీయూ, రాణిగంజ్ డిపోలకు చెందిన ఆరు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. ఓ డ్రైవర్‌కు రాయి తగిలి గాయమైంది. రాణిగంజ్ డిపోకు చెందిన డ్రైవర్ ఖాసిం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసు వాహనాలపైనా దాడికి దిగడంతో సీపీ రిజర్వ్ పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా దాడులకు పాల్పడిన వారి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో స్టూడియో యజమానుల నిర్లక్ష్యం ఉందని భావించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసే యోచనలో ఉన్నారు. సరైన భద్రతా ఏర్పాట్లు చేసుకోకుండా స్టూడియో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా దర్యాప్తులో తేలింది. కంటెస్టెంట్లపై అదుపు లేనందునే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ సీజన్–7 విజేతపై క్రిమినల్ కేసు నమోదు బిగ్‌బాస్ సీజన్–7 విజేత పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో హీరో నాగార్జున బిగ్‌బాస్–7 విజేతగా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించారు. అప్పటికే రన్నరప్ అమర్దీప్ అభిమానులు పెద్ద సంఖ్యలో స్టూడియో బయట వేచి ఉన్నారు. వారికి తోడుగా పలువురు కంటెస్టెంట్ల అభిమానులు అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పల్లవి ప్రశాంత్‌ను రెండో గేటు నుంచి జూబ్లీహిల్స్ ఎస్ఐ రాకేష్, సిబ్బంది బయటికి పంపించారు. తాను ఇంటికి వెళ్తున్నానని చెప్పిన ప్రశాంత్ కొద్దిసేపటికే తన అనుచరులతో కలిసి ఓపెన్‌టాప్ జీప్‌పై మళ్లీ స్టూడియో వద్దకు వచ్చాడు. అప్పటికే ఆగ్రహంగా ఉన్న అమర్దీప్ అభిమానులు, ఇతర కంటెస్టెంట్ల అభిమానులు రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనలో రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేసి ప్రశాంత్‌ను అక్కడి నుంచి పంపారు. అప్పటికే పరిస్థితి అదుపుతప్పడంతో పంజగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్, సాయుధ బలగాలతో అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. ఎస్ఐ రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రశాంత్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్‌ను అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. -
BB7 RunnerUp Amardeep Photos: సింపుల్ లుక్‌లో బీటెక్ బాబు అమర్దీప్ (ఫోటోలు)
-
BB7 Winner Pallavi Prashanth Photos: మళ్లొచ్చిన అంటే తగ్గేదేలె.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ (ఫోటోలు)
-
జనం చూశారు.. అమర్‌కు జై కొట్టారు, శివాజీనీ ఛీ కొట్టారు!
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో 19 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. వీరందరూ తమకు తోచిన ఆట ఆడారు. హౌస్‌లో ఉండేందుకు ప్రయత్నించారు. కానీ షో ముందుకు సాగాలంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే! అలా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ పోగా గ్రాండ్ ఫినాలే వచ్చేసరికి ఆరుగురు మిగిలారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. షోలో కొనసాగడం కోసం కష్టపడ్డ ఎంతోమంది ముందే ఎలిమినేట్ అయిపోగా.. ఏమాత్రం కష్టపడకుండా సోఫాలో సేద తీరుతూ.. బిగ్‌బాస్‌కే ఆర్డర్లు వేసిన శివాజీ మాత్రం టాప్ 3 వరకు వచ్చాడు. పగతో రగిలిపోయాడు.. ఈయనది మాస్టర్ మైండ్ అని నాగ్ అన్నారు. నిజమే, శివాజీ అంత కన్నింగ్ మాస్టర్ మైండ్ బిగ్‌బాస్ చరిత్రలోనే ఎవరికీ లేదు. ఒకరి మీద పగపెట్టుకుని ద్వేషంతో రగిలిపోతూ కుట్రలు పన్నుతూ పైకి మాత్రం ఏమీ ఎరుగనివాడిలా నటించడం ఆయనకే సాధ్యమైంది. శివాజీ హౌస్‌లో చేసింది రెండే రెండు. ఒకటి.. అమర్‌ను టార్గెట్ చేయడం. రెండు.. ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌లను తన గుప్పిట్లో పెట్టుకోవడం. కామన్ మ్యాన్‌కు సపోర్ట్ చేస్తే జనాల్లో తనకు మంచి గుర్తింపు వస్తుందనుకున్నాడు. అందుకే రైతుబిడ్డను, అలాగే నటుడిగా పెద్ద గుర్తింపు లేని ప్రిన్స్ యావర్‌ను తన గ్రూపులో చేర్చుకున్నాడు. టాస్కుల్లో విజృంభించి ఆడేది వీళ్లిద్దరే కాబట్టి వీళ్లేది సాధించినా అది తన ఖాతాలోనే వేసుకునేవాడు. మానసికంగా వేధించిన ఛీవాజీ బిగ్‌బాస్ 7 మొదలైనప్పుడే అమర్ టైటిల్ ఫేవరెట్‌గా హౌస్‌లో అడుగుపెట్టాడు. ఈ విషయం తెలిసిన శివాజీ అతడి గురించి అంతా రీసెర్చ్ చేసి మరీ తనను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. తనను ఎప్పుడూ కిందకు లాగాలని చూశాడు. సూటిపోటి మాటలతో వేధించాడు. లక్షలాది మంది ప్రేక్షకులు చూసే షోలో అతడిని పనికిరాని వెధవగా చిత్రీకరించాడు. తను ఏం చేసినా తప్పనేవాడు. శివాజీ కుట్రలు తెలియని అమర్దీప్ అతడిని మాత్రం గురువుగానే భావించాడు. ఈ వంకతో మరింత చనువు తీసుకున్న సోఫాజీ.. అమర్ మీద ఎన్నోసార్లు విషం కక్కాడు. ఏదైనా అంటే సరదాగా అన్నానని తప్పించుకునేవాడు. డమ్మీ చాణక్య.. జనం చూశారు! పదేపదే జనం చూస్తున్నారు అని చెప్పే శివాజీ.. తను అనే మాటలను, తన చేష్టలను జనం పట్టించుకోరనుకున్నాడేమో! కానీ జనం చూశారు. ఈ డమ్మీ చాణక్య పన్నాగాలు తెలుసుకున్నారు. ఒకరిని కిందకు లాగాలనుకుంటే ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. అమర్‌కు జై కొట్టి రెండో స్థానంలో నిలబెట్టాడు. అతడిని తొక్కేయాలని చూసిన శివాజీని మూడో స్థానానికే పరిమితం చేశారు. ఇక్కడే శివాజీ ఓడిపోయాడు. అమర్‌కు వేస్ట్ ఫెలో, పనికిమాలినోడు, వెధవన్నర వెధవ, పిచ్చి పోహ.. ఇలా ఎన్నో బిరుదులిచ్చాడు. మరి అతడి చేతిలో ఓడిపోయిన శివాజీని ఏమని పిలిస్తే బాగుంటుందో అతడికే తెలియాలి. వాళ్లు లేకపోయుంటే శివాజీ 'జీరో' పోనీ శివాజీ హౌస్‌లో పెద్దగా పొడిచేసిందేమైనా ఉందా? అంటే అదీ లేదు. ఒక టాస్క్ ఆడలేదు, ఎంటర్టైన్మెంట్ అసలే చేతకాలేదు. పైగా ఆడలేక మద్దెల దరువు అన్నట్లు ప్రతిసారి తన చేయినొప్పిని సాకుగా చూపిస్తూ ఎంచక్కా ట్రిప్పుకు వచ్చినట్లు సోఫాలో సెటిలై గేమ్ చూస్తూ ఎంజాయ్ చేశాడు. సీజన్ అంతా చేయినొప్పినే చూపిస్తూ సింపతీ ఓట్లు సంపాదించుకున్నాడు. ప్రశాంత్‌ను విన్నర్ చేసింది తానే అని విర్రవీగుతున్న శివాజీ ఈ రోజు కనీసం టాప్ 3లో అయినా ఉన్నాడంటే అందుకు కారణం.. ప్రశాంత్, ప్రిన్స్ యావర్లే! ఇది ఎవరూ కాదనలేని నిజం! వాళ్లు లేకపోయుంటే శివాజీ 'జీరో'. చదవండి: ప్రశాంత్‌ను కారు దిగనివ్వని పోలీసులు.. రైతుబిడ్డను అన్నా.. ఇట్ల చేస్తే ఎలా? -
రైతుబిడ్డకు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు!
బిగ్‌బాస్ సీజన్-7 విన్నర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. ఆదివారం షో ముగిసిన తర్వాత పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ కార్లపై జరిగిన దాడులపై పోలీసులు సీరియస్ అయ్యారు. అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లతో పాటు పలు ఆర్టీసీ బస్సులపై సైతం ఫ్యాన్స్ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడులను సుమోటోగా స్వీకరించిన పోలీసులు పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని అభిమానులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసలేం జరిగిందంటే... ఫినాలే ముగిసిన తర్వాత అమర్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుంటే.. అతడి కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనకవైపు అద్దం ధ్వంసం చేశారు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన గీతూ రాయల్ కారుని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతూ.. పోలీస్ కేసు పెట్టింది. ఇది కాదన్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
రైతుబిడ్డకు గింత విలువిస్తలేరు.. పోలీసులపై ప్రశాంత్ అసహనం
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ సూపర్ హిట్టయింది. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా అవతరించాడు. ఇతడి గెలుపుకు సింపతీ కూడా ఓ కారణమే! మొదటి నుంచి అతడిని రైతుబిడ్డ.. రైతుబిడ్డ అంటూ ఆకాశానికెత్తారు. జనాలు సైతం తమలో ఒకడు ప్రశాంత్ అంటూ అతడికి బాగా కనెక్ట్ అయ్యారు. నిన్న(డిసెంబర్ 17న) అన్నపూర్ణ స్టూడియోలో బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలేలో అమర్‌దీప్‌ను ఓడిస్తూ విజేతగా అవతరించాడు ప్రశాంత్. ఇక షో ముగిసిన తర్వాత కంటెస్టెంట్లు తమ ఇంటికి తిరుగుపమయనమయ్యారు. స్టూడియో వెలుపల గందరగోళం వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. అమర్దీప్.. తన భార్య, తల్లితో కారులో బయటకు రాగానే ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు. కారును చుట్టుముట్టి అద్దాలు పగలగొట్టారు. అలాగే కొన్ని అల్లరి మూకలు గీతూ రాయల్, అశ్విని శ్రీ కారు అద్దాలు సైతం ధ్వంసం చేశారు. అటువైపుగా వెళ్తున్న బస్సు అద్దాలపైనా రాళ్లదాడి చేశారు. దీంతో పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకురావడం కోసం కంటెస్టెంట్లను అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టారు. వెళ్లిపోమన్నందుకు పోలీసులపై అసహనం ప్రశాంత్ రూఫ్ టాప్ ద్వారా కారులో నుంచి బయటకు వస్తే శాంతిభద్రతలకు ఇబ్బంది కలుగుతుందని భావించిన పోలీసులు అతడిని బయటకు రావొద్దని చెప్పారు. అలాగే కారు కూడా ఆపకుండా ముందుకు పోనివ్వాలని హెచ్చరించారు. దీంతో ప్రశాంత్ అసహనానికి లోనయ్యాడు. 'అన్నా.. ఏందన్నా ఇది! ఒక రైతుబిడ్డకు గింత విలువిస్తలేరు' అని ఆగ్రహించాడు. 'పోలీసులే ఇట్ల చేస్తే ఎలా అన్నా? ఒక రైతుబిడ్డ అన్నా.. నా కోసం ఎంతమంది వచ్చిర్రన్నా..' అంటూ ఆగ్రహించాడు. పోలీసులను వీడియో తీయ్.. అంటూ ఆర్డర్స్ తనను బయటకు రానివ్వట్లేదని తల బాదుకుంటూ.. పోలీసులను వీడియో తీయమని కారులో ఉన్నవారికి ఆదేశాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. 'ఈ రైతుబిడ్డ అనే సింపతీతో సీజనే గెలిచేశావ్.. దాన్ని ఇంకా వదిలిపెట్టవా' అని కామెంట్లు చేస్తున్నారు. 'శాంతి భద్రతల కోసం పోలీసులు వెళ్లిపోమంటే అది కూడా తలకెక్కడం లేదా?' అని ప్రశ్నిస్తున్నారు. Veedu winner entra karma kakapothe🥴🤦🏻♂️ Law n order issue ani cheptunte, oka raithu bidda ki viluva isthaleru antunadu💀🤧#BiggBossTelugu7pic.twitter.com/ooDetkYlK6 — ✯ (@sagatuXuser) December 17, 2023 చదవండి: బిగ్‌బాస్ 7 టైటిల్ ముద్దాడిన రైతుబిడ్డ.. ఆ బలమైన కారణాల వల్లే విజయం.. -
బిగ్‌బాస్ విన్నర్ ప్రశాంత్‌కు అభిమాని ఊహించని గిఫ్ట్!
బిగ్‌బాస్ షోకి వెళ్తావా? నిన్నెవడు తీసుకుంటాడ్రా?.. అసలు స్టూడియో లోపలైనా అడుగుపెట్టగలవా? నీకంత సీన్ లేదులే.. పగటి కలలు కనకు.. ఇలా నానామాటలు అన్నారు.. ఎవరెంత హేళన చేసినా పట్టించుకోలేదు. ఎలాగైనా బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాలని గట్టిగా ఫిక్సయ్యాడు. అందుకు తగ్గ ప్రయత్నాలు చేశాడు. అతడిలోని కసిని బిగ్‌బాస్ టీమ్ గుర్తించింది. కామన్ మ్యాన్ కేటగిరీలో రైతుబిడ్డను బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లోకి తీసుకొచ్చింది. వైల్డ్‌గా ఆడాడు.. గతంలోనూ కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంతోమంది వచ్చారు. కానీ ఎవరూ ప్రశాంత్ అంత ప్రభావం చూపలేకపోయారు. ఓటమికి ఛాన్సే ఇవ్వకూడదన్న చందంగా గెలుపు కోసం విజృంభించి ఆడాడు. తన కోపాన్ని, కసినంతా ఆటలో చూపించాడే కానీ అవతలి వారిపై చూపించలేదు. నామినేషన్స్‌లో ఎంత వైల్డ్‌గా రియాక్ట్ అయినా తర్వాత మాత్రం ఎటువంటి రాగద్వేషాలు మనసులో పెట్టుకోకుండా అందరితో ఇట్టే కలిసిపోయేవాడు. తనకు సాయం చేసినవారిని గుండెలో పెట్టుకుని చూసుకున్నాడు. సాయం చేయనివారికి సైతం అవకాశం వచ్చినప్పుడు వారివైపు నిలబడ్డాడు. రైతుబిడ్డకు ఊహించని గిఫ్ట్ ఇతడి నిష్కల్మమైన మనసు చూసి జనాలు ఓట్లు గుద్దారు. ఫలితంగా ప్రశాంత్ బిగ్‌బాస్ 7 విజేతగా నిలిచాడు. అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వచ్చిన ప్రశాంత్‌కు జనం ఘనంగా స్వాగతం పలికారు. తాజాగా ఓ అభిమాని అయితే రైతుబిడ్డకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. యాదగిరిగుట్టలో లక్షలు విలువ చేసే భూమిని బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. యాదగిరి గుట్టకు సమీపంలోని వంగపల్లి దగ్గర రూ.15 లక్షలు విలువ చేసే ఓపెన్ ప్లాట్‌ను బహుమతిగా ఇస్తున్నట్లు వెల్లడించాడు. ప్రశాంత్‌కు భారీగానే ముట్టాయి త్వరలోనే ప్రశాంత్ పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తామని తెలిపాడు. ఇది తెలిసిన జనాలు రైతుబిడ్డకు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్‌కు ప్రైజ్‌మనీ ద్వారా రూ.35 లక్షలు, పారితోషికం ద్వారా రూ.15 లక్షలు ముట్టాయి. ఇందులో సగం ట్యాక్స్‌ల రూపేణా ప్రభుత్వానికే చెల్లించాల్సి ఉంటుంది. ఈ నగదు కాకుండా అతడు కాస్ట్లీ కారు, రూ.15 లక్షల విలువ చేసే డైమండ్ నెక్లెస్ కూడా గెలుచుకోవడం విశేషం. చదవండి: బిగ్‌బాస్ 7 టైటిల్ ముద్దాడిన రైతుబిడ్డ.. ఆ బలమైన కారణాల వల్లే విజయం.. బిగ్‌బాస్ చాణక్యకు తగిన శాస్తి.. మాస్టర్ మైండ్ అని చెప్పి చివరకేమో అలా! -
Bigg Boss 7: శివాజీకి బొమ్మ చూపించిన బిగ్‌బాస్.. చివరకు అదొక్కటే మిగిలింది!
శివాజీ... బిగ్‌బాస్ ఆర్గనైజర్స్ ఇచ్చిన హైప్ చూస్తే నిజంగా గెలిచేస్తాడేమో అని అందరూ తెగ భయపడ్డారు. ఎందుకంటే ఈ సీజన్ మొదటిరోజు నుంచి సోఫాపై కూర్చుని ఆర్డర్స్ వేయడం, ప్రశాంత్-యావర్‌లతో పనిచేయించుకోవడం తప్పితే ఒక్క విషయంలోనూ ఎంటర్టైన్ చేయలేకపోయాడు. నాగార్జున అయితే మాస్టర్ మైండ్, చాణక్య లాంటి పెద్దపెద్ద బిరుదులిచ్చేసి శివాజీని ఆకాశంలో కూర్చోబెట్టాడు. చివరకు అక్కడి నుంచే కిందకు తోసేశాడు. అసలు ఈ సీజన్లో శివాజీ ఏం చేశాడు? ఇంతకీ ఆడాడా లేదా? నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టుగా శివాజీ కాస్తోకూస్తో గుర్తింపు ఉంది. అప్పట్లో హీరో, సైడ్ క్యారెక్టర్ తరహా పాత్రలు చేశాడు కానీ ఆ తర్వాత ట్రెండ్‌కి తగ్గట్లు మింగిల్ కాలేక యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. అలా నటుడిగా కనుమరుగైపోయాడు. రాజకీయాల్లోకి వచ్చి 'గరుడ పురాణం' చెప్పాడు. చాల్లే నీ సేవలు అని చెప్పి పక్కకు తోసేశారు. ఇక అన్నీ అయిపోయేసరికి ఏం చేయాలో తెలీక పిల్లల మీద ప్రతాపం చూపించడానికా అన్నట్లు బిగ్‌బాస్ లోకి వచ్చాడు. ఇక్కడ కూడా మనోడికి మొండిచెయ్యే మిగిలింది. కప్ కొట్టడం సంగతి అటుంచితే కనీసం రన్నరప్ కూడా కాలేకపోయాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) శివాజీ బిగ్‌బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు.. 3-4 వారాలు ఉంటే గ్రేట్ అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఫినాలే వరకు వచ్చేశాడు. ఏ మాత్రం పనిచేయకపోయినా సరే టాప్-3 వరకు వచ్చేశాడు. అయితే శివాజీ ఈ షోకే అనర్హుడు అని చెప్పడానికి బోలెడన్ని కారణాలున్నాయి. అందులో మొదటిది నాగార్జున సపోర్ట్. గేమ్ షో అంటే సొంతంగా ఆడాలి. కానీ శివాజీ ఎప్పుడు అలా చేసింది లేదు. నోటికొచ్చింది మాట్లాడేయడం.. వీకెండ్ వచ్చేసరికి 'బాబుగారు అలా కాదు.. బాబుగారు ఇలా కాదు' అని డిఫెండ్ చేసుకోవడం.. నాగార్జున శివాజీకి వంతపాడటం. ఇక ప్రశాంత్-యావర్‌ని గుప్పిట్లో పెట్టుకుని, పనులన్నీ వీళ్లతో చేయించుకోవడం కూడా శివాజీ గేమ్ ప్లాన్‌లో భాగమేమో? ఇక బిగ్‌బాస్‌లో శివాజీ మాటతీరు చాలా వరస్ట్! ఎందుకంటే హౌసులోని ప్రతిఒక్కరూ ఇతర కంటెస్టెంట్స్‌ని పేరు పెట్టి పిలవాలి. కానీ శివాజీ ఈ విషయంలో చాలా పూర్. కారణం లేకపోయినా సరే అమర్‌పై మొదటి నుంచే చాలా పగ పెంచేసుకున్నాడు. ప్రతివారం నామినేట్ చేసేవాడు. 'పనికిమాలినోడా', 'పిచ్చోడా' అని నోటికి ఏమొస్తే అలా పిలిచేవాడు. అమర్.. ఇవన్నీ పట్టించుకోడు కాబట్టి లైట్ తీసుకున్నాడు. గౌతమ్ లేదా అర్జున్‌ని ఇలా గానీ పిలుచుంటే శివాజీకి ఇచ్చిపడేసేవాళ్లు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ సీజన్ విన్నర్ నేనే.. శివాజీ తలతిక్క కామెంట్స్!) శివాజీలో ఇంకో అవలక్షణం ఏంటంటే.. ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. మిగతా లేడీ కంటెస్టెంట్స్.. తన మాటకు ఎదురుచెప్పలేదు. దీంతో వాళ్లని అమ్మ అమ్మ అని పిలిచేవాడు. వాళ్లని ఏం అనేవాడు కూడా కాదు. కానీ శోభా-ప్రియాంక.. శివాజీ నిజస్వరూపాన్ని ఉన్నది ఉన్నది చెప్పేవారు. మాటకు మాట కౌంటర్ ఇచ్చేవారు. ఇది శివాజీ అస్సలు తీసుకోలేకపోయాడు. 'ఒక్కటి పీకుతా', 'పీక మీద కాలేసి తొక్కుతా' లాంటి పిచ్చికూతులన్నీ కూసి, షో పరువు తీశాడు. మళ్లీ ఏమైనా అంటే.. మాది పల్నాడు, మా దగ్గర ఇలానే మాట్లాడుతారని చెప్పి పుట్టిన ఊరిపేరు కూడా చెడగొట్టాడు. బిగ్‌బాస్ షోలోకి వచ్చిన మొదటి వారాల్లోనే శివాజీ కుడి చేతికి గాయమైంది. దీంతో చాలా గేమ్స్‌లో పార్టిసిపేట్ చేయలేదు. కొన్ని గేమ్స్‌లో కనీస పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేశాడు. ఏమన్నా అంటే డిస్ట్రబ్ చేశావ్ అదీ ఇదీ అని అవతల వాళ్లపై అరిచేవాడు. ఈ సీజన్ మొత్తంలో పవరస్త్ర గెలుచుకోవడం, కెప్టెన్ కావడం (ఇంటి సభ్యుల సహకారంతోనే) తప్పితే చెప్పుకోదగ్గ ఘనత శివాజీకి ఒక్కటీ లేదు. ఇక ఫినాలేకి కొన్ని రోజులు ఉందనగా హోస్ట్ నాగార్జునతోనే పిచ్చి వాదనకు దిగాడు. ఇలా బోలెడన్ని కారణాల దృష్ట్యా.. శివాజీని నిర్వహకులు విన్నర్ కాదు కదా కనీసం రన్నరప్ కూడా చేయలేదు. పొరపాటున శివాజీ గానీ విన్నర్ అయ్యింటే మాత్రం అంతకంటే విచిత్రం మరొకటి ఉండేది కాదు. ఓవరాల్‌గా చూసుకంటే.. షోలో పార్టిసిపేట్ చేయడం, రెమ్యునరేషన్ తీసుకోవడం అనే సంతృప్తి తప్పితే శివాజీకి ఇంకేం మిగల్లేదు! (ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం) -
Bigg Boss 7: ఈ సీజన్ విన్నర్ నేనే.. శివాజీ తలతిక్క కామెంట్స్!
బిగ్‌బాస్ 7 అయిపోయింది. రైతుబిడ్డ గెలిచాడు. అమర్ రన్నరప్‌గా నిలిచాడు. ఇకపోతే గెలిచేస్తాడు, ట్రోఫీ కొట్టేస్తాడు, చాణక్య అని మాట్లాడుకున్న శివాజీ.. ఊహించని విధంగా మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఏదో హౌస్ట్ నాగార్జున, నిర్వహకులు పుణ్యమా అని ఏ మాత్రం ఆడకపోయినా సరే శివాజీ ఇక్కడ వరకు వచ్చాడు. లేకపోతే మనోడికి అంత సీన్ లేదు. ఇక షో అయిపోయిన తర్వాతైనా సరే తిన్నగా మాట్లాడకుండా తలతిక్క కామెంట్స్ చేస్తున్నాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం) బిగ్‌బాస్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ.. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అదే ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తారు. అలా గీతూ రాయల్.. శివాజీని ఇంటర్వ్వూ చేసింది. షోలో అంటే గెలవాలి కాబట్టి వంద అబద్ధాలు చెప్పొచ్చు. కానీ ఇక్కడ కూడా శివాజీ అదే బాపతు సమాధానాలు ఇస్తూ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మాత్రం ఆపలేదు. టాప్-3 వరకు వస్తారని ఊహించారా? అని అడిగిదే.. 'ఈ సీజన్ విన్నర్ నేను, నాకు తెలుసు' అని తలతిక్క సమాధానం చెప్పాడు. టాప్-3వరకు వచ్చి, మీరు ఆగిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? అని అడిగితే.. తిన్నగా సమాధానం చెప్పకుండా.. పల్లవి ప్రశాంత్, ఊరి నుంచి వచ్చాడు, అతడిపై మాటలు దాడి చేశారు, అడ్డుకున్నాను.. ఇలా అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్పకుండా ఏదేదో మాట్లాడాడు. యావర్, ప్రశాంత్ మీ వల్లే ఇంతదూరం వచ్చారని అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'అవును, కాకపోతే వాళ్ల వెనకాల ఓ శక్తి ఉందని అందరికీ తెలియజేశాను' అని శివాజీ అన్నాడు. వీళ్లిద్దరి మైండ్‌లో లేని ఆలోచనలు పుట్టించారు కదా అని అడగ్గా.. నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడానికి రాలేదని హౌస్ట్తోనే వాగ్వాదానికి దిగాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ ప్రశాంత్ విజయానికి అసలు కారణాలు ఇవేనా?) అమర్‌ని కావాలనే తొలిరోజు నుంచి టార్గెట్ చేసినట్లు అనిపించింది? దీనికి ఏమంటారు అని శివాజీని అడగ్గా.. మీకు మళ్లీ మళ్లీ చెప్పేదేంటంటే అమర్ గాడు, నేను వెరీగుడ్ ఫ్రెండ్స్ అని మొత్తం ప్లేట్ మార్చేశాడు. హౌసులో అమర్‌ని పేరుతో కాకుండా ఎన్ని రకాల పదాలతో శివాజీ పిలిచాడో ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటే మీకు ఆన్సర్ తెలుస్తుంది. మీ బ్యాచ్‌లో ఫేవరిజం లేదా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'మీరు ఎంత అనుకున్నా జనం చూస్తున్నారు' అని అదే పాత చింతకాయ పచ్చడి డైలాగ్స్ కొట్టాడు తప్పితే తిన్నగా ఆన్సర్ చెప్పలేకపోయాడు. శివాజీ అసలు బిగ్‌బాస్‌లోకి ఎందుకొచ్చాడు? అని అడగ్గా.. బిగ్‌బాస్ తెలుగు సీజన్లలో నా పేరు గుర్తుండాలి. దటీజ్ మై మార్క్ అని విచిత్రమైన సమాధానాలు చెప్పాడు. అయితే ఈ కామెంట్స్ అన్నీ కూడా ప్రోమోలో చెప్పినవి. ఇక పూర్తి ఇంటర్వ్యూలో ఎన్నెన్ని విచిత్ర విన్యాసాలు చేశాడో చూడాలి? (ఇదీ చదవండి: బిగ్‌బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?) -
Bigg Boss 7: రైతుబిడ్డ విజయానికి ప్రధాన కారణాలు ఇవే!
పల్లవి ప్రశాంత్.. బిగ్‌బాస్ షోకు రావడానికి ముందు సోషల్ మీడియా ఉపయోగించే కొద్దిమందికే తెలుసు. కానీ బిగ్‌బాస్ 7లోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఒదిగి ఉండే స్వభావం, చురుకుతనం, టాలెంట్, అమాయకత్వం.. ఇవన్నీ జనాలకు బాగా నచ్చేశాయి. మట్టి మనిషిని అని చెప్పుకునే ప్రశాంత్.. తాను గెలిస్తే వచ్చే డబ్బును కష్టాల్లో ఉన్న రైతు కుటుంబాలకే ఇస్తానని చెప్పడం ఎంతోమంది మనసులను కదిలించింది. అలా ఇప్పుడు 7వ సీజన్ విజేతగా నిలిచాడు. మరి అతడి గెలుపు వెనకున్న కారణాలేంటి? చెప్పులరిగేలా తిరిగాడు 'మల్లొచ్చినా అంటే తగ్గేదేలే'.. అని సోషల్ మీడియాలో వీడియోలు చేసుకునే ప్రశాంత్.. ఎలాగైనా బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టాలనుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. ఇప్పుడు విజేతగా గెలిచాడు. అయితే ప్రశాంత్.. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో అడుగుపెట్టినప్పుడే తొలి విజయం సాధించాడు. (ఇదీ చదవండి: బీటెక్ కుర్రాడు అమర్.. బిగ్‌బాస్ ద్వారా ఎంత సంపాదించాడంటే?) గెలుపే అంతిమ లక్ష్యంగా.. రైతుబిడ్డగా హౌస్‌లో అడుగుపెట్టిన ప్రశాంత్ టాస్కుల్లో విజృంభించి ఆడేవాడు. గెలుపే అంతిమ లక్ష్యంగా పోరాడాడు. విజయం కోసం ఎంతవరకైనా పోరాడతానన్న అతడి ధృడ సంకల్పమే తనను ముందుకు నడిపించింది. ఓడిన ప్రతిసారి రెట్టింపు కసితో ఆడటం జనాలకు ఎంతగానో నచ్చింది. తనను తాను నిరూపించుకునేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నామినేషన్స్‌లో మాత్రం.. షోలో మిగతా టైమ్ అంతా కూడా సింపుల్‌గా ఉండే ప్రశాంత్.. నామినేషన్స్ వచ్చేసరికి తనలోని మరో యాంగిల్‌ను బయటకు తీసేవాడు. తానేమీ తక్కువవాడిని కాదని, మీకు పోటీనిచ్చే బలమైన కంటెస్టెంట్‌ను అని హౌస్‌మేట్స్‌కు గుర్తు చేశాడు. నామినేషన్స్‌లో అతడి వైఖరిని చూసి ప్రశాంత్‌కు అపరిచితుడిగా ముద్ర వేశారు. అయితే రానురానూ తన తప్పొప్పులను సరిదిద్దుకుంటూ విజయానికి మెట్లు వేసుకుంటూ పోయాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం) ఈ సీజన్లోనే తొలి కెప్టెన్ మొదట్లో రతిక రోజ్‌తో క్లోజ్‌గా ఉంటూ రాంగ్ ట్రాక్ ఎక్కాడు ప్రశాంత్. ఆమె వెన్నుపోటు పొడవడంతో గేమ్‌పై తిరిగి ఫోకస్ పెట్టాడు. అప్పటినుంచి తప్పటడగులు వేయకుండా ఎవరి జోలికీ వెళ్లకుండా ఆటమీదే తన ధ్యాసను కేంద్రీకరించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఫస్ట్ కెప్టెన్‌గా నిలిచి తన సత్తా ఏంటో చూపించాడు. అలాగే ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలిచి.. తనకు ఆటలో తిరుగులేదని నిరూపించాడు. అయితే ఈ పాస్‌ను తన స్నేహితుల కోసం వాడాలనుకున్నాడు. ఆ అవకాశం రాకపోవడంతో కష్టపడి సంపాదించిన పాస్‌ను వెనక్కు ఇచ్చేందుకు సైతం వెనుకాడలేదు. ఈ నిజాయితీ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది. నిష్కల్మషమైన మనసుకు ఫిదా నామినేషన్స్‌లో ఎన్ని తిట్టుకున్నా సరే తర్వాత అందరినీ తనే వెళ్లి మరీ పలకరించేవాడు. మనసులో ఎటువంటి కోపాలు పెట్టుకోకుండా హౌస్‌మేట్స్‌ను కలుపుకుపోయేవాడు. ఎవరెన్ని పనులు చెప్పినా కాదనకుండా చేసేవాడు. ఈ వినయం, విధేయత, మంచితనానికి జనాలు ఫిదా అయ్యారు. కామన్ మ్యాన్ కేటగిరీలో వెళ్లిన ప్రశాంత్ రైతుబిడ్డ కావడంతో జనాలకు బాగా కనెక్ట్ అయ్యాడు. హౌస్‌లో ఉన్నవాళ్లందరూ సెలబ్రిటీలేనని, ప్రశాంత్ మాత్రం మనలో ఒకరైన రైతుబిడ్డ అని ఫీలయ్యారు. దీంతో షో మొదటినుంచే అతడిని మనలో ఒకడిగా ఫీలయ్యారు. వీటితో పాటు చాలా విషయాల్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తనదైన మార్క్ చూపించాడు. బిగ్‌బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?) View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం
బిగ్‌బాస్ 7 పూర్తయిపోయింది. రైతుబిడ్డ ట్యాగ్‌తో హౌసులోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్‌గా నిలిచాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఫినాలే పూర్తయిన తర్వాత అమర్ ఫ్యాన్స్ vs రైతుబిడ్డ ఫ్యాన్స్ గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అమర్ కారుతో పాటు మరో ఇద్దరి సెలబ్రిటీలు కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అలానే ఆర్టీసీ బస్సుని కూడా వదల్లేదు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?) అసలు విషయానికొచ్చేస్తే.. బిగ్‌బాస్ అనేది గేమ్ షో. కానీ అభిమానులు అని చెప్పుకు తిరిగే వాళ్లకు అవేమి పట్టవు. ఈ సీజన్లో నామినేషన్స్‌లో భాగంగా అమర్, ప్రశాంత్ మధ్య చాలాసార్లు వాదన జరిగింది. అయితే అదంతా కూడా గేమ్‌లో భాగమని అర్థం చేసుకోలేకపోయిన ఈ పిచ్చి ఫ్యాన్స్.. అమర్ కుటుంబ సభ్యులని సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు అక్కడ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఫినాలే ముగిసిన తర్వాత అమర్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుంటే.. అతడి కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనకవైపు అద్దం ధ్వంసం చేశారు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన గీతూ రాయల్ కారుని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతూ.. పోలీస్ కేసు పెట్టింది. ఇది కాదన్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: బీటెక్ కుర్రాడు అమర్.. బిగ్‌బాస్ ద్వారా ఎంత సంపాదించాడంటే?) View this post on Instagram A post shared by ❤HD EDITS❤ (@_hd__edits) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
బీటెక్ కుర్రాడు.. బిగ్‌బాస్ ద్వారా ఎంత సంపాదించాడంటే?
ప్రతి సీజన్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఒకరుంటారు. అలా ఈ సీజన్లో అమర్దీప్ ఉన్నాడు. షో ప్రారంభంలో తడబడ్డా తర్వాత నెమ్మదిగా పుంజుకున్నాడు. అయితే కొన్ని సార్లు తన మాటలతో పాటు ఆటల్లో తెలిసీతెలియక చేసిన తప్పుల వల్ల నలుగురిలో నవ్వులపాలయ్యాడు. అంతేకాకుండా శత్రువులు ఎక్కడో ఉండరు.. మన పక్కనే ఉంటారన్నది అమర్ విషయంలో నిజమైంది. మెంటల్ టార్చర్‌ను చిరునవ్వుతో భరించాడు కొన్నిసార్లు స్నేహితులు సైతం తనను పట్టించుకోలేదు. గురువుగా భావించే శివాజీ అయితే అమర్‌ను అనరాని మాటలన్నాడు.. మెంటల్ టార్చర్ పెట్టాడు. అయినా అన్నింటినీ చిరునవ్వుతో భరించాడు. అనారోగ్యంతో బాధపడుతున్నా ఏనాడూ బయటకు చెప్పుకోలేదు. హెల్త్ ప్రాబ్లమ్ వల్ల టాస్కులు ఆడలేకపోయినా అది తన వైఫల్యంగానే భావించాడే కానీ అనారోగ్యాన్ని సాకుగా చెప్పలేదు. విజయానికి అడుగు దూరంలో ఆగిపోయిన అమర్ రన్నరప్‌గా నిలిచాడు. వారానికి రూ.2.5 లక్షలు మరి ఈ అనంతపురం కుర్రాడు ఎంత సంపాదించాడో తెలుసా? షోలోకి రావడానికి ముందే సీరియల్స్ ద్వారా బోలెడంత గుర్తింపు ఉంది. కనుక అమర్‌దీప్‌కు భారీగానే డబ్బులు ఆఫర్ చేశారు. వారానికి రూ.2.5 లక్షలు ఇచ్చారట! ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.37,50,000 అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ట్యాక్స్‌లు, జీఎస్టీల రూపంలో దాదాపు సగం ప్రభుత్వమే లాగేసుకుంటుంది. చదవండి: బిగ్‌బాస్ 7 విజేతగా ప్రశాంత్.. ప్రైజ్‌మనీ ఎంతంటే? -
బిగ్‌బాస్ 7 విన్నర్‌గా రైతుబిడ్డ.. స్పీచ్‌తో అదరగొట్టేశాడు!
మట్టిలో మాణిక్యం.. పల్లవి ప్రశాంత్. తన టాలెంట్‌తో బిగ్‌బాస్ షోలో ఛాన్స్ దక్కించుకోవడమే కాదు ఆటతీరుతో, మాటతీరుతో ప్రేక్షకుల మనసులు సైతం గెలుచుకున్నాడు. వినయం, విధేయతకు నిలువెత్తు రూపంగా నిలిచిన ప్రశాంత్.. 18 మంది కంటెస్టెంట్లను వెనక్కు నెట్టి బిగ్‌బాస్ 7 విజేతగా నిలిచాడు. గ్రాండ్ ఫినాలే చివర్లో అమర్దీప్, ప్రశాంత్ ఇద్దరే మిగలగా నాగార్జున రైతుబిడ్డను విన్నర్‌గా ప్రకటించాడు. దీంతో ప్రశాంత్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆ నమ్మకమే గెలిపించింది విజయానందంలో ప్రశాంత్ మాట్లాడుతూ.. 'నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను ఇక్కడివరకు రావాలని ఎన్నో కలలు కన్నాను. స్టూడియో చుట్టూ ఎంతో తిరిగాను. తినకపోయినా సరే ఇంట్లోవాళ్లకు తిన్నట్లు అబద్ధం చెప్పేవాడిని. నేనేదైనా అనుకుంటే చేయగలనని నా మీద నేను నమ్మకం పెట్టుకున్నాను. నా తండ్రి కూడా నన్ను నమ్మాడు. నువ్వు నడువు.. నేను నిన్ను ముందుకు నడిపిస్తాను అన్నాడు. ఆ నమ్మకమే ఇక్కడివరకు వచ్చేలా చేసింది. రూ.35 లక్షలు రైతులకోసమే.. నాగార్జున సార్ మీద చిన్న కవిత రాశాను.. చీకటి బతుకులకు వెలుగు నింపింది సార్ నవ్వు.. ఆకలి బతుకులకు అండగా నిలిచింది సార్ నవ్వు.. అలిసిపోయిన బతుకులకు ఆసరైంది సార్ నవ్వు.. సార్ నవ్వుతూనే ఉండాలి, నలుగురిని నవ్విస్తూనే ఉండాలి. ఇంకెంతోమంది జీవితాలు బాగుపడుతాయి. నాకు వచ్చిన రూ.35 లక్షలు రైతులకే పంచుతాను. రైతుల కోసమే వచ్చాను.. రైతుల కోసమే ఆడాను. నాకు ఇచ్చిన కారు నాన్నకు, నెక్లెస్ అమ్మకు బహుమతిగా ఇస్తాను' అంటూ స్పీచ్‌తో అదరగొట్టాడు ప్రశాంత్. చదవండి: బిగ్‌బాస్ 7 విజేతగా రైతుబిడ్డ.. రెమ్యునరేషన్ + ప్రైజ్‌మనీ ఎంతంటే? -
బిగ్‌బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?
బిగ్‌బాస్ 7 విన్నర్‌గా పల్లవి ప్రశాంత్.. ప్రతి మనిషిలోనూ లోటుపాట్లు ఉంటాయి. అలాగే ఇతడిలోనూ ఉన్నాయి. నామినేషన్స్ అప్పుడు ఒకలా.. సాధారణ సమయాల్లో మరోలా ప్రవరిస్తూ అపరిచితుడిగా ముద్ర వేయించుకున్నాడు. నామినేషన్స్‌లో ఇతడు చేసే ఓవరాక్షన్ చూసి జనాలకు చిరాకు పుట్టింది. అయితే నామినేషన్స్‌లో ఎలా ఉన్నా మిగతా సమయాల్లో మాత్రం సామాన్యుడిగా, అతి మామూలుగా ఉండేవాడు. రానూరానూ తన తప్పులు తెలుసుకుంటూ వాటిని సరిదిద్దుకున్నాడు. ఎవరెంత రెచ్చగొట్టినా ఒదిగి ఉన్నాడే తప్ప అతిగా ఆవేశపడలేదు. బిగ్‌బాస్ 7 ట్రోఫీ అందుకున్న ప్రశాంత్ తన ఫోకస్ అంతా టాస్కుల మీదే పెట్టాడు. తన సత్తా మాటల్లో కాకుండా ఆటలో చూపించాడు. తన ఆటతోనే ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. అయితే ఎంతో టాలెంట్ ఉన్న ప్రశాంత్ చిన్నచిన్న విషయాలకు సైతం కుంగిపోయేవాడు. ఓటమిని తీసుకోలేకపోయేవాడు, కన్నీళ్లు పెట్టుకునేవాడు. మొదట్లో ఇదంతా సింపతీ గేమ్ అనుకున్నారు. కానీ తర్వాత అది అతడి సున్నిత మనసుకు నిదర్శనం అని అర్థం చేసుకున్నారు. ఎవరి మాటల్ని లెక్క చేయక గెలుపు మీదే దృష్టి పెట్టిన ప్రశాంత్ అనుకున్నది సాధించాడు. ఏ స్టూడియో ముందైతే అదే పనిగా తచ్చాడాడో అదే స్టూడియోలో కరతాళ ధ్వనుల మధ్య బిగ్‌బాస్ 7 ట్రోఫీ అందుకున్నాడు. ప్రైజ్‌మనీలో కోత బిగ్‌బాస్ విజేతకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ అని ప్రకటించారు. కానీ ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్‌కేసు తీసుకోవడంతో రైతుబిడ్డకు రూ.35 లక్షలు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ టాక్స్, జీఎస్టీ పోగా అతడి చేతికి దాదాపు రూ.17 లక్షలు మాత్రమే అందనున్నట్లు తెలుస్తోంది. మరీ ఈరేంజ్‌లో కోతలు ఉంటాయా? అంటే నిజంగానే ఉంటుందట. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. తనకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వాల్సిందని, కానీ ఇందులో దాదాపు రూ.27 లక్షల వరకు ప్రభుత్వానికే వెళ్లిపోయిందన్నాడు. ట్యాక్స్ కట్ చేసుకున్న తర్వాతే మిగిలిన డబ్బును తనకు ఇచ్చారన్నాడు. పారితోషికం తక్కువే కానీ.. ఇక ప్రశాంత్‌కు ఇచ్చిన పారితోషికం తక్కువగానే ఉంది. రోజుకు రూ.15 వేలు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన వారానికి లక్ష పైచిలుకు కాగా 15 వారాలకు కలిపి రూ.15,75,000 వెనకేసినట్లు భోగట్టా. అయితే తను అందుకున్న పారితోషికంలోనూ ట్యాక్స్ కటింగ్స్ ఉంటాయట. ఆ కటింగ్స్ పోనూ దాదాపు రూ.8 లక్షల పైచిలుకు తన చేతికి రానున్నట్లు కనిపిస్తోంది. అంటే పారితోషికం(రూ.15,75,000)+ ప్రైజ్‌మనీ(రూ.35 లక్షలు) మొత్తం కలిపి రూ.50 లక్షలపైనే తనకు రావాల్సి ఉన్నా ఈ ట్యాక్స్‌లు అన్ని పోనూ దాదాపు రూ.25- 27 లక్షలే చేతికి వచ్చేట్లు కనిపిస్తోంది. దీనితో పాటు అదనంగా ఖరీదైన మారుతి బ్రెజా కారు, రూ.15 లక్షల విలువ చేసే వజ్రాభరణాన్ని సొంతం చేసుకున్నాడు. చదవండి: ఆ ఒక్క విషయంలో ప్రియాంక సూపర్.. మొత్తం సంపాదన ఎంతంటే? అర్జున్ ఎలిమినేట్.. కేవలం 10 వారాల్లోనే అంత సంపాదించాడా? -
Bigg Boss 7: ఎలిమినేట్ అయితేనేం యావర్‌కి జాక్‌పాట్.. టోటల్ రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్‌బాస్ 7 నుంచి ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే కప్ కొట్టే విషయంలో ముందు నుంచి ఓ క్లారిటీతో ఉన్న యావర్.. చివరికొచ్చేసరికి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఎలిమినేట్ అయిన మిగతా వాళ్లతో పోలిస్తే జాక్‌పాట్ కొట్టేశాడు. దీనికి తోడు మంచి రెమ్యునరేషన్ తీసుకుని హౌస్ నుంచి బయటకొచ్చేశాడు. ఇంతకీ యావర్ ఎలా ఆడాడు? మొత్తం ఎంత సంపాదించాడు? యావర్ ఇంట్రెస్టింగ్ డెసిషన్ సాధారణంగా తెలుగు షోలో పాల్గొంటున్నారు అంటే ఎవరైనా సరే కచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలి. బిగ్‌బాస్ షోలో అయితే ఇది ఇంకా పక్కాగా ఉండాలి. కానీ యావర్ విషయంలో నిర్వహకులు చాలాసార్లు దీన్ని పక్కనబెట్టేశారు. ఇక మనోడు శివాజీ బ్యాచ్‌లోకి చేరిపోయేసరికి.. ఎలిమినేషన్ నుంచి ప్రతిసారి సేవ్ అవుతూ వచ్చాడు. అలా ఫినాలే వీక్‌లోకి కూడా అడుగు పెట్టేశాడు. అయితే టాప్-6లో ఉన్న వాళ్లలో యావర్ కప్ కొట్టే ఛాన్స్ లేదు. దీంతో రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని ఫినాలే ఎపిసోడ్లో తనకు తానే ఎలిమినేట్ అయిపోయాడు. రెమ్యునరేషన్ ఎంత? పేరుకు నటుడు అయినాసరే తన ఫ్యామిలీకి చాలా అప్పులు ఉన్నాయని... ఎపిసోడ్స్‌లోని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. తనకు డబ్బు చాలా అవసరమని కూడా అన్నాడు. ఇప్పుడు దానికి తగ్గట్లే నాగ్.. రూ.15 లక్షల సూట్‌కేస్ ఆఫర్ చేయగా తీసుకుని, తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సూట్‌కేసు ఆఫర్‌కే ఓటు వేసేసరికి.. ట్రోఫీ రేసు నుంచి తప్పుకొన్నాడు. అలానే వారానికి రూ.లక్షన్నర రెమ్యునరేషన్ చొప్పున 15 వారాలకు గానూ రూ. 22.5 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా రూ.37.5 లక్షల వరకు యావర్ సంపాదించినట్లు తెలుస్తోంది. -
Bigg Boss 7: ప్రియాంక ఎలిమినేట్.. మొత్తం రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ 7వ సీజన్లో షాకింగ్ ఎలిమినేషన్. ఒక్కో దశని దాటుకుంటూ ఫినాలే వరకు వచ్చిన ప్రియాంక.. చిట్టచివరిది అయిన ఆదివారం ఎపిసోడ్లో ఫస్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌గా నిలిచింది. కప్ కొట్టలేకపోవచ్చు, ఓట్లు విషయంలో మిగతా వారికంటే వెనకబడిపోయి ఉండొచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలామంది మనసులు గెలిచింది. దీనికి తోడు మంచి రెమ్యునరేషన్‌తో బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చింది. ఎలిమినేషన్‌కి రీజన్ బిగ్‌బాస్ 7 హౌసులోకి తొలి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంకపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఎందుకంటే సీరియల్ నటిగా అందరికీ తెలిసిన ఈమె.. కప్ కొట్టడం, ఫినాలే వీక్ రావడం సంగతి అటుంచితే కొన్ని వారాలు ఉంటే గ్రేట్ అనుకున్నారు. అలాంటిది తొలి పవరస్త్ర కోసమే చివరివరకు వచ్చి ఓడిపోయింది. అక్కడి నుంచి మొదలుపెడితే దాదాపు చాలా గేమ్స్‌లో చివరివరకు వచ్చి బోల్తా కొట్టింది. ఒకటి రెండుసార్లు మినహా దాదాపు సీజన్ అంతా కూడా చాలా డిగ్నిఫైడ్‌గా ఆడింది. అమ్మాయి కావడం, పెద్దగా ఫేమ్ లేకపోవడంతో ఈమె ఓట్లు పడలేదు. (ఇదీ చదవండి: Bigg Boss 7: అర్జున్ అంత సంపాదించాడా? 10 వారాల్లోనే..) ఈ క్రమంలోనే ఫినాలే టాప్-6లో అడుగుపెట్టిన వన్ అండ్ ఓన్లీ లేడీ కంటెస్టెంట్‌గా ప్రియాంక నిలిచింది. కానీ ఓటింగ్ విషయంలో బలమైన కంటెస్టెంట్స్ ఈమె కంటే ముందు ఉండటం ఈమెకు పెద్ద మైనస్ అయిందని చెప్పొచ్చు. ఈ సీజన్లో పాల్గొన్న అమ్మాయిలందరితో పోలిస్తే ప్రియాంక ది బెస్ట్ ఫెర్ఫార్మర్ అని చెప్పొచ్చు. చాలామంది ఒప్పుకొన్న ఒప్పుకోకపోయినా శివాజీ కంటే ప్రియాంక చాలా బెటర్! రెమ్యునరేషన్ ఎన్ని లక్షలు? సీరియల్ నటిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక.. బిగ్‌బాస్ షోతో మరింత ఫేమ్, క్రేజ్ తెచ్చుకుంది. ఈమెకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇకపోతే సీజన్ అంతా అంటే 15 వారాల పాటు హౌసులో ఉన్న ప్రియాంక.. వారానికి రూ.2.5 లక్షల రెమ్యునరేషన్ మాట్లాడుకుందట. అంటే మొత్తంగా రూ.37.5 లక్షలు ఈమె సంపాదించినట్లు తెలుస్తోంది. ఇంత మొత్తం డబ్బులు అంటే ప్రియాంక ఆర్థికంగానూ కాస్త కుదురుకున్నట్లే! (ఇదీ చదవండి: Bigg Boss 7 Grand Finale: అది ఫేక్ న్యూస్) -
Bigg Boss 7: అర్జున్ అంత సంపాదించాడా? 10 వారాల్లోనే..
బిగ్‌బాస్ షోలో నామినేషన్స్- ఎలిమినేషన్స్‌కు విడదీయలేని సంబంధం ఉంది. ఎందుకంటే నామినేట్ అయినవారు ఎలిమినేట్ అవకా తప్పదు. ఎలిమినేట్ చేయడం కోసం అవతలివారిని నామినేట్ చేయకా తప్పదు. ఈ సీజన్‌పై ఎక్కువగా ఆసక్తిని క్రియేట్ చేసింది నామినేషన్సే! ఈ నామినేషన్స్‌లో ఎన్ని ఎక్కువసార్లు ఉంటే అంత పుంజుకోవచ్చన్నది కొందరి వాదన. నామినేషన్స్‌కు భయపడి దూరంగా ఉంటే మాత్రం ఇక అంతే సంగతులు. లేకలేక ఒక్కవారం నామినేషన్లోకి వచ్చి ఇట్టే ఎలిమినేట్ అయిపోయాడు సందీప్. అదే మైనస్.. బిగ్‌బాస్ ప్రారంభమైన నెల రోజుల తర్వాత హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు అర్జున్. ఇతడు మాట్లాడే మాటలకు అవతలి వారి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే! అంత సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడతాడు అర్జున్. కానీ నెల రోజులు ఆలస్యంగా హౌస్‌లోకి రావడంతో జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయాడు. టాస్కుల్లో బాహుబలిలా ఆడాడు. ఎవరి అండదండలు లేకపోయినా సొంతంగా ఆడుతూ చివరి వరకు వచ్చాడు. కానీ మొదటి నుంచీ లేకపోవడంతో ఓసారి నామినేషన్స్‌లోకి వచ్చి ఎలిమినేట్ అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ఫినాలే అస్త్ర సాయంతో ఎలిమినేషన్ నుంచి గట్టెక్కి నేరుగా ఫినాలేలో అడుగుపెట్టాడు. టాప్ 6లో ఉండగా ఎలిమినేట్.. జనాదరణ పొందడంలో వెనకబడిన ఇతడు ఆరో స్థానంలో ఉండగానే షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. సీరియల్ నటుడిగా గొప్ప పేరున్న ఇతడు రోజుకు దాదాపు రూ.50 వేల మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే వారానికి రూ.3,50,000 తీసుకున్నాడన్నమాట! ఈ లెక్కన 10 వారాలకుగానూ అర్జున్ రూ.35,00,000 వెనకేశాడు. లేటుగా హౌస్‌లోకి వచ్చినప్పటికీ చాలామందికంటే ఎక్కువగానే సంపాదించాడు అర్జున్. కానీ ఇందులో దాదాపు సగం వరకు ప్రభుత్వానికి ట్యాక్స్‌ల రూపంలో అప్పజెప్పాల్సి ఉంటుంది. చదవండి: పీకల్లోతు అప్పుల్లో యావర్.. ప్రైజ్‌మనీ కూడా సరిపోదన్న ప్రిన్స్ సోదరుడు -
బిగ్‌బాస్7: ప్రిన్స్ యావర్‌కు అన్ని లక్షల అప్పు ఉందా?
కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్లు.. సంతోషమొచ్చినా, బాధొచ్చినా అస్సలు ఆపుకోలేడు ప్రిన్స్ యావర్. ఏదీ మనసులో పెట్టుకోడు. తనకు అనిపించింది ముఖం మీదే అడిగేస్తాడు. కాకపోతే అప్పుడప్పుడూ టెంపర్ లూజవుతూ ఉంటాడు. టాస్కుల్లో అగ్రెసివ్‌గా ఆడతాడు. అది ఫన్నీ టాస్క్ అయినా, సీరియస్ టాస్క్ అయినా చావోరేవో అన్న రీతిలో బరిలోకి దూకుతాడు. ఓడిపోతే అస్సలు తట్టుకోలేడు.. ఫ్రస్టేట్ అవుతుంటాడు. ఆకలి బాధ.. అయితే తన కోపానికి, ఆవేశానికి, బాధకు అసలు కారణం ఆకలి అని ఒకానొక సమయంలో బయటపెట్టాడు ప్రిన్స్. తను ఏదైనా సాధించాలన్న ఆకలితో అలమటిస్తున్నట్లు చెప్పాడు. ధరించడానికి సరైన బట్టలు కూడా లేవని.. రెండు జతలు మాత్రమే ఉన్నాయని, పీకల్లోతు అప్పుల్లో ఉన్నానని చెప్తూ ఏడ్చేశాడు. తన అన్నల వల్లే బిగ్‌బాస్ షో వరకు రాగలిగానని, తనకు డబ్బు చాలా అవసరమని ఎమోషనలయ్యాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రిన్స్ యావర్ సోదరుడు తమకు అప్పులు ఉన్న మాట వాస్తవమేనన్నాడు. రూ.50 లక్షలు ఇచ్చినా తమకు సరిపోవన్నాడు. చాలా అప్పుల్లో కూరుకుపోయాం.. ప్రిన్స్ సోదరుడు మాట్లాడుతూ.. 'మాది ఉమ్మడి కుటుంబం. మేము నలుగురం అన్నదమ్ములం.. ఇంకా నలుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. లోన్లు తీసుకుని వారికి పెళ్లి చేశాం. రూ.30-35 లక్షల వరకు అప్పు ఉంది. మాకు సరైన ఇల్లు కూడా లేదు. ప్రిన్స్ బిగ్‌బాస్‌కు వెళ్లినప్పుడు.. తనకు వచ్చే డబ్బుతో మంచి ఇల్లు తీసుకుందాం అన్నాడు. మరోపక్క లక్షల్లో అప్పులు.. మా పరిస్థితి అంత దయనీయంగా ఉంది' అని చెప్పాడు. ఇప్పటికే ప్రిన్స్ గ్రాండ్ ఫినాలేలో రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. అప్పుల్లో కూరుకుపోయిన ప్రిన్స్ యావర్‌కు మరింత డబ్బు ఆఫర్ చేసుంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: Bigg Boss 7 Grand Finale: అది ఫేక్ న్యూస్ -
Bigg Boss 7 Grand Finale: అది ఫేక్ న్యూస్
బిగ్‌బాస్ ఫినాలే గ్రాండ్‌గా మొదలైంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ ఎపిసోడ్ స్టార్ మాతో పాటు ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయింది. దాదాపు 105 రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకుల అలరించిన సీజన్ 7.. నేటితో ముగియనుంది. ఉల్టా పుల్టా అంటూ వచ్చిన ఏడో సీజన్ గత సీజన్లకు కాస్త భిన్నంగా సాగింది. తొలుత 14 మంది.. ఐదు వారాల తర్వాత మరో 5 మంది హౌస్‌లోకి వెళ్లారు. ఈ సారి తెలిసిన ముఖాలే హౌస్‌లోకి వెళ్లడంతో.. తొలి నుంచే సీజన్ 7పై పాజిటివ్ టాక్ వినిపించింది. టాస్క్‌లు కూడా కొత్తగా ఉండడం.. కంటెస్టెంట్స్ కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించడంతో సీజన్ 7 సూపర్ హిట్‌గా నిలిచింది. మేకర్స్ కూడా ఈ సీజన్ పట్ల హ్యాపీగా ఉన్నారు. అందుకే ఫినాలేను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. టాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్స్‌ని ఫినాలో భాగస్వామ్యం చేశారు. రవితేజ మొదలు అల్లరి నరేశ్ వరకు ఫినాలే ఈవెంట్లో పాల్గొన్నారు. అయితే ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా సూపర్ స్టార్ మహేశ్ బాబు వస్తాడని గత మూడు రోజులుగా వార్తలు వినిపించాయి. మహేశ్ కొత్త సినిమా గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్ ఉండడంతో నిజంగా బిగ్‌బాస్ షోకి వస్తారని అంతా భావించారు. పలు వెబ్సైట్లలో కూడా వార్తలు వచ్చాయి. కానీ అదంతా ఫేక్. ఫినాలేకు మహేశ్ రావడం లేదు. ఈ రోజు విడుదలైన ప్రోమోలు చూస్తే కూడా ఈ విషయం అర్థమైపోతుంది. వాస్తవానికి మహేశ్ బీబీ 7 ఫినాలేకు రావాల్సిందే. కానీ గుంటూరు కారం సినిమా సాంగ్ షూటింగ్ ఉండడంతో రాలేకపోయాడట. ఈ సాంగ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలోనే ఉండడం.. మహేశ్ అక్కడికి వెళ్లడంతో అంతా ఫినాలే కోసమే వెళ్లారని భావించారు. కానీ అది ఫేక్ అని మహేశ్ సన్నిహితులు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం హౌస్‌లో ఉన్న శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్, అర్జున్, ప్రియాంక, అమర్దీప్ ఉన్నారు. వీరిలో పల్లవి ప్రశాంత్ సీజన్ 7 విన్నర్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. -
Bigg Boss 7 Finale Highlights: బిగ్‌బాస్ 7వ విజేతగా రైతుబిడ్డ ప్రశాంత్
105 రోజులకు పైగా ప్రేక్షకుల్ని అలరించిన బిగ్‌బాస్ 7 షోకి ఎట్టకేలకు పూర్తయింది. ఆదివారం అంగరంగ వైభవంగా గ్రాండ్ ఫినాలే జరిగింది. ఫినాలేకి అమర్దీప్, ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, యావర్, అర్జున్ మిగిలారు. వీరిలో రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అలానే ఆదివారం ఎపిసోడ్లో చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అందించారు. అవేంటో ఓ లుక్కేసేయండి. ►'కేజీఎఫ్' సినిమాలో మంచి ఎలివేషన్ సాంగ్‌తో నాగార్జున.. ఫినాలే ఎపిసోడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ సూట్లో రాయల్ లుక్‌లో కనిపించి, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. ►ఇక ఫినాలే కోసం వచ్చిన ఈ సీజన్ మిగిలిన హౌస్మేట్స్ అందరూ హిట్ సాంగ్స్‌కి డ్యాన్స్ చేసి అదరగొట్టేశారు. అశ్విని-పూజా, శోభా-తేజ, గౌతమ్-శుభశ్రీ, సందీప్-నయని పావని స్టెప్పులతో అదరగొట్టారు. భోలే అంటే హీరో, హీరో అంటే బిగ్‌బాస్ అని స్వయంగా కంపోజ్ చేసిన పాటకు భోలె డ్యాన్స్ చేసి ఫుల్‌గా ఎంటర్టైన్ చేశాడు. ►బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత 15 సినిమా ఆఫర్లు వచ్చాయని టేస్టీ తేజ చెప్పుకొచ్చాడు. 9 వారాల్లో బిగ్‌బాస్ షోలో ఉండి ఎంత సంపాదించానో.. బయటకొచ్చిన తర్వాత 6 వారాల్లో అంతకంటే రెట్టింపు సంపాదించానని తేజ.. ఇంట్రెస్టింగ్ విషయాల్ని బయటపెట్టాడు. తేజతో పాటు గౌతమ్, భోలె, శోభాశెట్టి తదితరులు.. బిగ్‌బాస్ నుంచి బయటకెళ్లినా తర్వాత తమ లైఫ్ చాలా బాగుందని అందరూ తమ అభిప్రాయాల్ని చెప్పుకొచ్చారు. ►ఇక ఎలిమినేట్ అయిన హౌస్మేట్స్, హౌస్‌లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌తో హోస్ట్ నాగార్జున మాట్లాడిన తర్వాత.. ఇంట్లో ఉన్న ఆరుగురు డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సులతో అదరగొట్టేశారు. యావర్ జిమ్ సామాన్లతో, శివాజీ కాఫీ కప్పుతో, ప్రియాంక కిచెన్ సామాగ్రితో, మొక్కతో ప్రశాంత్, రాకెట్స్‌తో అర్జున్, కప్పుతో అమర్ డ్యాన్స్ చేశారు. ►ఇక మొత్తం 19 మందికి సంబంధించిన బిగ్‌బాస్ జర్నీని వీడియోగా ప్లే చేసి అందరికీ చూపించారు. ఇది మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్తో సాగింది. ప్రతిఒక్కరూ తమని తాము స్క్రీన్‌పై చూసుకుని మురిసిపోయారు. ఇక చివర్లో ఎమోషనల్ కంటెంట్ చూసి తేజ.. గుక్కపట్టి ఏడ్చేశాడు. మా అందరిదీ చాలా బ్యూటీఫుల్ జర్నీ అని చెప్పుకొచ్చాడు. ►ఇంట్లోని ఆరుగురు సభ్యులతో చిన్న ఫన్ టాస్క్ పెట్టిన నాగ్.. ఒక్కో కంటెస్టెంట్ మరొకరిలా యాక్ట్ చేసి మెప్పించారు. శివాజీ.. యావర్‌లా, అర్జున్.. శివాజీలా, యావర్.. అర్జున్‌లా, ప్రశాంత్.. ప్రియాంకలా, అమర్.. ప్రశాంత్‌లా, ప్రియాంక.. అమర్‌లా యాక్ట్ చేసి చూపించారు. ►హౌస్‌లో ఉన్న ఆరుగురిని బీబీ హౌస్‌లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? అని నాగార్జున అడగ్గా.. ఒక్కొక్కరు తమకు నచ్చిన ప్లేస్ చెప్పారు. ప్రియాంక-స్టాండర్డ్ రూమ్, అర్జున్ - గార్డెన్ ఏరియా.. శివాజీ- యావర్-జోయకాలూస్ రూమ్, అమర్- గోడౌన్, ప్రశాంత్-గార్జెన్ ఏరియాలోని మొక్క అని చెప్పి..తమ బొమ్మలను ఆయా ప్లేసుల్లో పెట్టారు. ► అందాల తార నిధి అగర్వాల్ డాన్స్‌తో అదరగొటేటసింది. జవాన్ సినిమాలోని రామయ్య వస్తావయ్యా సాంగ్‌తో పాటు నాగార్జున సినిమాకు చెందిన పలు పాటలకు నిధి తనదైన స్టెప్పులేసి అలరించింది. ►టాప్-6లో ఉన్న ఆరుగురిలో నుంచి ఫినాలే ఎపిసోడ్లో అర్జున్ ఫస్ట్ ఎలిమినేషన్‌గా బయటకొచ్చాడు. ఇతడిని యాంకర్ సుమ.. హౌస్ నుంచి ఇతడిని బయటకు తీసుకొచ్చింది. ►దామిని బాగా కుక్ చేస్తుందనే ప్రశ్నకు యస్.. అశ్వినిని శోభా, ప్రియాంక తొక్కేశారు అన్న ప్రశ్నకు నో.. అర్జున్-అమర్ సంభాషణ ఒక్కోటి ఆణిముత్యం అన్న ప్రశ్నకు యస్.. శోభాపై పెట్టిన శ్రద్ధ, గేమ్ పై పెట్టుంటే తేజ టాప్-5లో ఉండేవాడనే ప్రశ్నకు యస్.. తదితర ప్రశ్నలకు అందరూ సమాధానాలు చెబుతూ ఫన్ జనరేట్ చేశారు. ►కాస్త ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత నటి చంద్రిక రవి స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. 'బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్' లాంటి పాటకు కేక పుట్టించే స్టెప్టులేసింది. ఇకపోతే ఎక్స్-కంటెస్టెంట్స్‌ని పలు అవార్డులతో హోస్ట్ నాగార్జున సత్కరించాడు. పిడకల అవార్డ్- దామిని ఇన్స్టంట్ న్యూడిల్స్ అవార్డ్- నయని పావని వాటర్ బాటిల్ అవార్డ్ - పూజామూర్తి రెడ్ లిప్‌స్టిక్ అవార్డ్ - శుభశ్రీ ఉడత అవార్డ్ - రతిక సంచాలక్ ఆఫ్ సీజన్ అవార్డ్- సందీప్ మాస్టర్ గోల్డెన్ మైక్ అవార్డ్ - భోలె టిష్యూ అవార్డ్ - అశ్విని డంబెల్ అవార్డ్ - గౌతమ్ ఫైర్ బ్రాండ్ - శోభాశెట్టి బేబీ సోనోగ్రఫీ ఫొటోని టీషర్ట్ పై వేసి, దాన్ని అర్జున్‌కి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది కాస్త స్పెషల్‌గా అనిపించింది. ►ఇక 'ఈగిల్' సినిమా ప్రమోషన్లో భాగంగా స్టేజీపైకి వచ్చిన రవితేజ.. తన అభిమాని అయిన అమర్‌తో కాసేపు డ్రామా పండించాడు. తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తానని బిగ్‌బాస్ సాక్షిగా హామీ ఇచ్చాడు. అయితే మూవీ ఛాన్స్ ఇస్తా, బయటకొచ్చేస్తావా? అని నాగ్ అడగ్గానే మరో ఆలోచన లేకుండా అమర్ బయటకొచ్చేస్తానని అన్నాడు. అమర్ ఇష్టం చూసి నాగ్-రవితేజ ఇద్దరూ అవాక్కయ్యారు. దీనిబట్టి చూస్తే రవితేజ రాబోయే సినిమాల్లో ఏదో ఒకదానిలో అమర్ యాక్ట్ చేయడం గ్యారంటీ. ►ఫినాలేలో రెండో ఎలిమినేషన్ గా ప్రియాంక బయటకొచ్చింది. కొత్త సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన రవితేజ.. ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు. ►'నా సామి రంగ' మూవీ ప్రమోషన్ కోసం హౌసులోకి వచ్చిన అల్లరి నరేశ్, రాజ్ తరుణ్.. రూ.15 లక్షల డబ్బుతో ఉన్న గోల్డెన్ సూట్‌కేస్‌తో బిగ్‌బాస్‌లోకి వచ్చారు. మిగిలిన నలుగురితో (అమర్, ప్రశాంత్, శివాజీ, యావర్) చాలాసేపు డిస్కషన్ పెట్టారు. డబ్బులు తీసుకునేలా టెంప్ట్ చేశారు. చివరకు యావర్.. సూట్‌కేస్ తీసుకుని, తనకు తానుగా ఎలిమినేట్ అయ్యాడు. అయితే యావర్.. సోదరులు కూడా చెప్పడంతో ఇక ఫైనల్‌గా సూట్ కేసు తీసుకుని బయటకొచ్చేశాడు. ►'డెవిల్' మూవీ ప్రమోషన్లో భాగంగా షోకి వచ్చిన కల్యాణ్ రామ్, సంయుక్త మేనన్.. కాసేపు సినిమా గురించి చిట్‌చాట్ చేశారు. కాసేపు సస్పెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మిగిలిన ముగ్గురిలో శివాజీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే శివాజీ ఎలిమినేట్ కావడాన్ని ప్రశాంత్ తట్టుకోలేకపోయాడు. కాళ్లు పట్టేసుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ►ఇక టాప్-2లో మిగిలిన అమర్, ప్రశాంత్ కోసం హౌసులోకి వెళ్లొచ్చిన హోస్ట్ నాగార్జున.. వీళ్లిద్దరినీ స్టేజీపైకి తీసుకొచ్చారు. అయితే విజేత ఎవరనేది ప్రకటించడానికి ముందు బిగ్‌బాస్ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. నాగార్జున జర్నీని వీడియోగా ప్లే చేసి కాస్త ఫన్ జనరేట్ చేశాడు. ►చివరి వరకు సస్పెన్స్ మెంటైన్ చేస్తూ వచ్చిన బిగ్‌బాస్ హౌస్ట్ నాగార్జున.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ని విజేతగా ప్రకటించాడు. అయితే ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోయిన ప్రశాంత్.. అలా షాక్‌లో ఉండిపోయాడు. ఇకపోతే అమర్దీప్ రన్నరప్‌గా నిలిచాడు. ► బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌కి రూ.35 లక్షల చెక్‌తో పాటు మారుతీ సుజుకీ బ్రెజా, రూ.15 లక్షల విలువైన జ్యూవెల్లరీ నెక్లెస్ సెట్‌ని కూడా బహుమతిగా అందించారు. నాకు వచ్చిన రూ.35 లక్షలు రైతులకే పంచుతాను. రైతుల కోసమే వచ్చిన రైతుల కోసమే ఆడాను. కారు నాన్నకు, నెక్లెస్ అమ్మకు బహుమతిగా ఇస్తాను అంటూ స్పీచ్‌తో అదరగొట్టాడు. -
బిగ్‌బాస్ విన్నర్ ప్రశాంత్.. లీక్ చేసిన సందీప్ భార్య!
బిగ్‌బాస్ జర్నీ.. జీవితంలో ఒక్కసారైనా ఈ షోకి వెళ్లాలని చాలామంది అనుకుంటారు. కానీ కొందరికే ఆ అవకాశం వరిస్తుంది. అందులో అతికొంతమందే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటారు. జీవిత పాఠాలు తెలుసుకుంటారు. అందుకే ఈ రియాలిటీ షో ఏళ్లతరబడి హిట్ అవుతూ వస్తోంది. ఇప్పుడు ఏడో సీజన్ ముగింపుకు వచ్చింది. నేటితో బిగ్‌బాస్ 7 చాప్టర్ క్లోజ్ కానుంది. మరికాసేపట్లో విజేత ఎవరనేది తేలిపోనుంది. ఇప్పటికే ఆరుగురు కంటెస్టెంట్లు ఫినాలేలో అడుగుపెట్టగా అందులో ముగ్గురు.. అర్జున్, ప్రియాంక, ప్రిన్స్ యావర్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ నిన్నే అయిపోయింది. కష్టం ఎప్పటికీ వృథా పోదు.. ఈరోజు మిగతా ముగ్గురిలో విజేత ఎవరనేది నిర్ణయించనున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్ 7 విన్నర్ అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ పెట్టింది ఆట సందీప్ భార్య జ్యోతిరాజ్. 'పడ్డ కష్టం ఎన్నటికీ వృథా కాదు.. దేవుడు నిన్ను చల్లగా చూడాలిరా తమ్ముడు' అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో స్పై(శివాజీ, ప్రశాంత్, ప్రిన్స్ యావర్) బ్యాచ్ అభిమానులు ఆదివారం రాత్రి 8.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోకి రావాలని ఉంది. అసలే సందీప్ మాస్టర్ ఫినాలే షూటింగ్లో ఉండటంతో ఈ పోస్ట్ నిజమయ్యే ఛాన్స్ ఉందని అభిమానులు ఖుషీ అవుతున్నారు. న్యాయం కోసం ఫ్రెండ్షిప్ను పక్కన పెట్టేశాడు! ఇక మరో పోస్ట్‌లో సందీప్ మాస్టర్ న్యాయం కోసం ఫ్రెండ్షిప్ను పక్కన పెట్టాడని చెప్పుకొచ్చింది. అయితే ఇదే కాస్త అతిగా ఉంది. సందీప్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు అమర్‌కు బెస్ట్ ఫ్రెండ్‌గా ఉన్నాడు. ప్రశాంత్ పేరెత్తినా కూడా చిరాకుపడేవాడు. కానీ షో నుంచి బయటకు రాగానే ప్రశాంత్‌కు ఏ లెవల్లో సపోర్ట్ ఉందో బాగా అర్థమైంది సందీప్‌కు. దీంతో అమర్‌ను పక్కన పెట్టేసి ప్రశాంత్‌కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. నిజానికి అమర్‌కు ఫౌల్ గేమ్స్ అనే ట్యాగ్ రావడానికి సందీప్ కూడా ఓ కారణమే! కానీ బయటకు వచ్చాక మాత్రం ఆ ట్యాగ్‌కు, తనకు ఏ సంబంధం లేదన్నట్లు వ్యవహరించాడు. చదవండి: క్రేజీ ఆఫర్.. 7 సెకన్ల టైమ్.. అమర్దీప్ అంత వేగంగా! -
అమర్‌దీప్‌కు క్రేజీ ఆఫర్..
-
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే.. అమర్‌కు ఊహించని ఆఫరిచ్చిన నాగ్.. మరో ఆలోచన లేకుండా!
Bigg Boss Season 7 Telugu Grand Finale: మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే షురూ కానుంది. వందకు పైగా రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులు కట్టి పడేసిన తెలుగువారి బిగ్ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ఈ నేపథ్యంలో సీజన్-7 విన్నర్ ఎవరనే విషయంపై అందరిలో ఆసక్తిని పెంచుతోంది. శనివారం రోజు ఇంటి సభ్యులంతా చిల్ అయ్యారు. 3వ సీజన్ రన్నరప్, యాంకర్ శ్రీముఖి.. కాసేపు ఆరుగురు ఇంటి సభ్యులతో పాటలు పాడించింది. ఇక చివరి రోజు సాయంత్రం 7 గంటలకే ఎపిసోడ్ ప్రసారం కానుండగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: 'సలార్' రెండో ట్రైలర్‌తో ప్రభాస్ రెడీ) తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఈ ఏడాది సీజన్-7 గ్రాండ్ ఫినాలేను మరింత గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ ఫినాలేకు హాజరైనట్లు కనిపిస్తోంది. అయితే ఈ గ్రాండ్ ఫినాలేలో మాస్ మహారాజా రవితేజ, కల్యాణ్ రామ్, యాంకర్ సుమ, ఆమె కొడుకు రోషన్, బబుల్ గమ్ హీరోయిన్ మానస చౌదరి, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ సందడి చేశారు. వీరంతా తమ సినిమాల ప్రమోషన్లలో భాగంగా గ్రాండ్ ఫినాలేకు హాజరయ్యారు. అయితే మరోవైపు ఈరోజు బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. కానీ అంతకంటే ముందు టాప్-6లో ఉన్న కంటెస్టెంట్స్‌కు సూట్ కేస్ ఆఫర్ తీసుకొచ్చారు. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ సూట్‌కేసుతో హౌస్‌లో అడుగుపెట్టారు. 'రండి బాబు రండి.. ఆలోచిస్తే ఆశాభంగం' అంటూ అల్లరి నరేశ్ వారికి సూట్‌కేస్ కోసం రండి వేలంపాట మొదలెట్టాడు. ఆ తర్వాత ఇన్ని రోజుల కష్టపడి ఉట్టి చేతులతో బయటికెళ్లడమా? అంటూ రాజ్ తరుణ్ టెంప్టింగ్ అయ్యేలా సలహా ఇచ్చాడు. అయితే ప్రోమో చివర్లో మాస్ రవితేజ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అమర్‌దీప్‌కు ఎవరు ఊహించని ఆఫర్ ఇచ్చాడు. బిగ్‌బాస్ గేట్స్ తెరిచి ఉన్నాయి.. నువ్వు బయటకి వస్తే నెక్ట్స్ సినిమాలో రవితేజతో పాటు నటిస్తావ్ అన్నారు. అంతేకాకుండా అమర్‌కు కేవలం 7 సెకన్లు మాత్రమే టైం ఇచ్చాడు. దీంతో అమర్దీప్ మరో ఆలోచన లేకుండా పరుగుత్తాడు. అయితే అమర్దీప్ నిజంగానే బయటికొచ్చేశాడా? చివరి నిమిషంలో ఏం జరిగింది? అనేది తెలియాలంటే ఇవాళ ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలేను మిస్ అవ్వకండి. (ఇది చదవండి: Bigg Boss 7: అన్ని లక్షలు ఆఫర్ చేసిన నాగ్.. టైటిల్ రేసు నుంచి ఆ ఒక్కడు డ్రాప్!) -
Bigg Boss 7: రూ.10 లక్షల టెంప్టింగ్ ఆఫర్.. ఆ విషయంలో అర్జున్, ప్రియాంక సూపర్
మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ ఫినాలే అంటే హడావుడి ఎలా ఉండాలి. ఇంటి సభ్యులు గానీ ప్రేక్షకులు గానీ టెన్షన్‌తో ఉక్కిరిబిక్కిరి అయిపోవాలి. ఈ విషయంలో నిర్వహకులు పూర్తిగా చేతులెత్తేశారు. ఏం చేయాలో తెలీక ఏదేదో చేస్తూ ఫుల్ టైమ్ పాస్ చేస్తూ వచ్చారు. చివర్లో సూట్‌కేస్‌తో కాస్త సస్పెన్స్ క్రియేట్ చేయాలనుకున్నారు గానీ ఇందులోనూ సక్సెస్ కాలేకపోయారు. ఇంతకీ శనివారం ఏం జరిగిందనేది Day 104 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. టైమ్‌పాస్ పల్లీ బఠాణీ ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ ఉంది కాబట్టి నాగార్జున శనివారం రాలేదు. ఇంట్లో ఉన్న ఆరుగురితోనే టైమ్ పాస్ చేయించాలని ఫిక్సయిన బిగ్‌బాస్.. చిన్నపిల్లల ఆటలన్నీ పెట్టాడు. కళ్లకు గంతలు కట్టుకుని ఎవరు కొట్టారో చెప్పుకోండి చూద్దాం అనే తరహాలో ఓ గేమ్ పెట్టాడు. ఇందులో ఏమంత ఫన్ క్రియేట్ కాలేదు. దీని తర్వాత ఇంట్లో ఉన్న వాళ్లలా యాక్ట్ చేసి చూపించాలని బిగ్‌బాస్ కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రైతుబిడ్డ ప్రశాంత్, అమర్‌లా యాక్ట్ చేసి చూపించిన అర్జున్.. అలానే కాఫీ ఇవ్వకపోతే బయటకెళ్లిపోతానంటూ శివాజీ చేసే హడావుడిని రీక్రియేట్ చేసిన ప్రియాంక.. ఫుల్ మార్కులు కొట్టేశారు. మిగతా నలుగురికి ఛాన్స్ రాలేదో, మరి వాళ్లు చేయలేదో తెలియలేదు. శ్రీముఖి ఎంటర్టైనర్ ఇక త్వరలో ప్రారంభమయ్యే 'సూపర్ సింగర్' కొత్త సీజన్ ప్రమోషన్ కోసం హౌసులోకి వచ్చిన 3వ సీజన్ రన్నరప్, యాంకర్ శ్రీముఖి.. కాసేపు ఆరుగురు ఇంటి సభ్యులతో పాటలు పాడించింది. 'ట్రూత్ ఆర్ డేర్' గేమ్ ఆడిపించింది. ఈ ఆటలో భాగంగా శివాజీని శ్రీముఖి ఓ ప్రశ్న అడగ్గా.. బయటకెళ్లిన తర్వాత నయని పావనితో బాండింగ్ పెంచుకుంటానని శివాజీ అన్నాడు. రతిక.. ఓసారి ఎలిమినేట్ అయి, హౌసులోకి తిరిగొచ్చినా సరే ఇంకా మెచ్యూరిటీ లెవల్స్ రాలేదని శివాజీ చెప్పాడు. అలానే మరో ప్రశ్నకు బదులిచ్చిన యావర్.. అశ్వినిని పెళ్లి చేసుకుంటా, రతికతో డేట్‌కి వెళ్తా, శుభశ్రీని కిల్ చేస్తానని నవ్వుతూ చెప్పాడు. సూట్‌కేస్ గమ్ ప్రతి సీజన్లో ఉన్నట్లే ఫినాలేకి ఓ రోజు ముందు హౌసులోకి బిగ్‌బాస్ డబ్బుల సూట్‌కేస్ పంపించాడు. రూ.3 లక్షల మొత్తంతో వేలం పాట మొదలుపెట్టాడు. ఎవరు తీసుకుంటారంటూ ఒకరి తర్వాత మరొకరికి ఆఫర్ ఇచ్చాడు. రూ.3 లక్షల దగ్గర మొదలైన ఈ ఆఫర్.. వరసగా రూ.5 లక్షలు, రూ.8 లక్షలు, రూ.10 లక్షల వరకు వెళ్లింది. కానీ ఎవరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ మొత్తం మంచి టెంప్టింగ్గా ఉన్నప్పటికీ ఎవరూ ఆసక్తి చూపించలేదు. అయితే ఈ వేలంపాట జరుగుతున్నప్పుడు మధ్యలో శివాజీ.. అర్జున్, అమర్‌తో చిన్న పిచ్చి డిస్కషన్ పెట్టాడు. ఎంత కావాలి? ఎంత కావాలి? అని అన్నాడు. తనకు రూ.40 లక్షలిస్తే పోతానని అర్జున్.. రూ.45 లక్షలైతే వెళ్లిపోతానని అమర్ అన్నాడు. ఇక చివరగా ప్రియాంకకు ఇంటి నుంచి ఫుడ్ రావడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఆదివారం ఫినాలే ఎపిసోడ్ సాయంత్రం 6 లేదా 7 గంటలకు మొదలయ్యే ఛాన్స్ ఉంది. -
Bigg Boss 7: అన్ని లక్షలు ఆఫర్ చేసిన నాగ్.. టైటిల్ రేసు నుంచి ఆ ఒక్కడు డ్రాప్!
బిగ్‌బాస్ షోలో 7వ సీజన్ విన్నర్ ఎవరనేది మరికొన్ని గంటల్లో తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎలిమినేషన్ ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే అర్జున్, ప్రియాంక.. తక్కువ ఓట్లు పడిన కారణంగా హౌస్ నుంచి బయటకొచ్చేసినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన నలుగురిలో ఓ కంటెస్టెంట్.. సూట్‌కేసులోని మంచి మొత్తానికి టెంప్ట్ అయినట్లు టాక్. ఇంతకీ ఎవరా కంటెస్టెంట్? ఎంత డబ్బు దక్కించుకున్నాడు? సూట్‌కేసు సంప్రదాయం బిగ్‌బాస్ గత కొన్ని సీజన్లని తీసుకుంటే ఈ సూట్‌కేసు సంప్రదాయం ఏంటనేది తెలుస్తోంది. 4వ సీజన్లో ఫినాలే రేసులో ఉన్న సొహైల్.. రూ.25 లక్షలు తీసుకుని బయటకొచ్చేశాడు. ఓటీటీ సీజన్లో అరియానా.. రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి డ్రాప్ అయింది. గత సీజన్లోనూ ఏకంగా రూ.40 లక్షలు తీసుకుని శ్రీహాన్.. తనకు తానుగా బయటకొచ్చేశాడు. అయితే ఈసారి ఫినాలే జరగడానికి ముందు సూట్‌కేసు ఆఫర్ ఇచ్చిన బిగ్‌బాస్.. రూ.10 లక్షలు తీసుకుని రేసు నుంచి డ్రాప్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఎవరూ దీన్ని ఉపయోగించలేదు. (ఇదీ చదవండి: రైతు బిడ్డకే బిగ్‌బాస్ ట్రోఫీ.. రన్నరప్ అతనే..‘సాక్షి’పోల్ రిజల్ట్) యావర్ తెలివైన నిర్ణయం SPY బ్యాచ్‌లో ఉండటం ప్లస్ గేమ్స్‌లోనూ మంచిగా ఫెర్ఫార్మ్ చేయడం వల్ల.. తెలుగు పెద్దగా రాకపోయినా గానీ యావర్.. ఫినాలే వరకు వచ్చేశాడు. రూ.10 లక్షల మొత్తం ఆఫర్ చేసినప్పుడు లైట్ తీసుకున్నాడు. కానీ ప్రియాంక, అర్జున్.. ఖాళీ చేతులతో ఎలిమినేట్ అయ్యేసరికి మనోడికి బుర్ర పనిచేసినట్లుంది. మిగతా ముగ్గురి(ప్రశాంత్, అమర్, శివాజీ)ని దాటి కప్ కొట్టడం కష్టం. కాబట్టి నాగ్ ఆఫర్ చేసిన రూ.15 లక్షలు తీసుకొని సెల్ఫ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. యావర్‌కి అవసరమే సీరియల్స్, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన యావర్.. తనకు, తన ఫ్యామిలీకి డబ్బు అవసరమని ఇదే బిగ్‌బాస్‌లో చాలాసార్లు చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు రూ.15 లక్షలు తీసుకుని మంచి పనిచేశాడని చెప్పొచ్చు. అయితే డబ్బులు తీసుకునే విషయంలో శివాజీ ఏమైనా హింట్ ఇచ్చాడా? లేదంటే ఇది యావర్ సొంత నిర్ణయమా? అనేది ఆదివారం ఎపిసోడ్లో తెలిసిపోతుంది! (ఇదీ చదవండి: తండ్రి కాబోతున్న హీరో మంచు మనోజ్.. శుభవార్త చెప్పేశారు!) -
రైతు బిడ్డకే బిగ్‌బాస్ ట్రోఫీ.. రన్నరప్ అతనే..‘సాక్షి’పోల్ రిజల్ట్
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 ముగింపు దశకు వచ్చింది. ఉల్టా పుల్టా అంటూ గత 100 రోజులుగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన సీజన్ 7కి నేటితో శుభం కార్డు పడనుంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు బిగ్‌బాస్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రారంభం అయింది. గత సీజన్‌తో పోలిస్తే.. ఏడో సీజన్ కాస్త బెటర్‌గానే ఎంటర్టైన్మెంట్ని అందించింది. తొలుత 14 మందిని.. ఐదువారాల తర్వాత మరో ఐదు మందిని హౌస్‌లోకి పంపించారు. ఈసారి ఎక్కువగా తెలిసిన ముఖాలే హౌస్‌లో కనిపించడం.. టాస్క్‌లు కాస్త డిఫరెంట్‌గా ఉండడంతో బిగ్‌బాస్ 7 సక్సెస్ అయింది. మేకర్స్ కూడా సీజన్ 7 పట్ల హ్యాపీగా ఉన్నారు. ఇక ఫినాలేను గతం కంటే గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. టాలీవుడ్‌కి చెందిన పలువురు హీరోహీరోయిన్లు ఫినాలేలో పాల్గొని అలరించబోతున్నారు. ఓ స్టార్ హీరో ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రేక్షకులు మాత్రం ఫినాలే ఎంత గ్రాండ్‌గా నిర్వహించబోతున్నారనేది పక్కకి పెట్టి..విన్నర్ ఎవరనేదానిపైనే ఎక్కువ ఆసక్తి కనబర్చుతున్నారు. సోషల్ మీడియాలో సైతం బిగ్‌బాస్ 7 విన్నర్ ఎవరనేదానిపైనే చర్చ జరుగుతుంది. గత సీజన్ల మాదిరే ఈసారి కూడా విన్నర్ ఇతనే అంటూ కొందరి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం హౌస్‌లో పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, అర్జున్, అమర్దీప్, యావర్ ఉన్నారు. వీరిలో విన్నర్ ఎవరనేది రేపు సాయంత్రం తెలిసిపోతుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం అమర్, పల్లవి ప్రశాంత్, శివాజీ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ సీజన్ 7 విన్నర్ అని నెట్టింట వైరల్ అవుతుంది. ‘సాక్షి’ నిర్వహించిన ఓపినియన్ పోల్‌లో కూడా పల్లవి ప్రశాంత్‌కే ఎక్కువ శాతం ఓట్లు లభించాయి. ‘బిగ్‌బాస్-7 విన్నర్ ఎవరని భావిస్తున్నారు?’అని సాక్షి ఓపినియన్ పోల్ నిర్వహించగా.. ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ పోల్‌లో 40 శాతం ఓట్లతో పల్లవి ప్రశాంత్ మొదటి స్థానంలో ఉండగా.. 20 శాతం ఓట్లతో శివాజీ రెండో స్థానంలో నిలిచాడు. అమర్దీప్ 16శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. 10శాతం ఓట్లతో అర్జున్, ప్రియాంక..4 శాతం ఓట్లతో యావర్ చివరి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే విన్నర్ ఎవరో కామెంట్ చేయడంటూ ‘సాక్షి’ఫేస్బుక్ పేజీలో పోస్ట్ పెట్టగా.. అందులో కూడా ఎక్కువ మంది ప్రశాంతే విన్నర్ అవుతారని కామెంట్ చేశారు. మరి నెటిజన్స్ అభిప్రాయపడినట్లుగా ప్రశాంత్ విన్నర్ అవుతారా? లేదా ? అనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది. -
Bigg Boss 7: ఆమె ఎలిమినేట్.. ఈసారి కూడా లేడీ విన్నర్ లేనట్లే!
ఇప్పటివరకు బిగ్‌బాస్ ఆరు సీజన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తోంది. మొత్తంగా అన్నింట్లోనూ అబ్బాయిలే విజేతలుగా నిలిచారు. ఓటీటీ షోలో బిందుమాధవి గెలిచినా సరే అది రెగ్యులర్ సీజన్ కేటగిరీలోకి రాదు. అయితే ఈసారైనా లేడీ కంటెస్టెంట్‌కి నిరాశే ఎదురైంది. ఫినాలే వరకు వచ్చి, టాప్-6లో నిలిచిన వన్ అండ్ ఓన్లీ అమ్మాయి కూడా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఏంటి సంగతి? (ఇదీ చదవండి: ఉచితంగా 'సలార్' టికెట్స్.. తెలుగు యంగ్ హీరో బంపరాఫర్) ప్రియాంక ఎలిమినేట్! సీరియల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్.. తొలి కంటెస్టెంట్‌గా ఈ సీజన్లో అడుగుపెట్టింది. హైట్ తక్కువగా ఉన్నాసరే తొలివారం నుంచి అబ్బాయిలకు టఫ్ ఫైట్ ఇచ్చింది. చాపకింద నీరులా ఒక్కో గేమ్ గెలుస్తూ చివరివరకు వచ్చేసింది. ఈసారి ఫినాలే వీక్‌లో అడుగుపెట్టిన ఏకైక లేడీ కంటెస్టెంట్‌గా నిలిచింది. అయితే చివరి ఆరుగురిలో ఓట్లు తక్కువ వచ్చిన కారణంగా తొలుత అర్జున్ బయటకెళ్లిపోగా, తాజాగా ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. పొట్టిపిల్ల కాదు గట్టిపిల్ల సీజన్ మొదలైనప్పటి నుంచి ప్రియాంక మీద ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అయితేనేం ఒక్కో వారం మిగిలిన కంటెస్టెంట్స్‌ని దాటుకుంటూ ఫైనల్ వరకు వచ్చేసింది. టాప్-6లో ఈమె కంటే ఓటింగ్ పరంగా బలమైన కంటెస్టెంట్స్ ప్రశాంత్, అమర్, శివాజీ ఉండటం ఈమెకు కలిసిరాలేదని చెప్పొచ్చు. ఏదేమైనా ఫినాలే వరకు వచ్చినప్పుడే ప్రియాంక గెలిచేసింది. కాకపోతే ట్రోఫీ కూడా గెలుచుకుని ఉంటే వేరే లెవల్ ఉండేది. అయితే ప్రియాంక ఎలిమినేషన్ పై ఆదివారం ఎపిసోడ్లో పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్: ప్రశాంత్‌కు బంపరాఫర్ ఇచ్చిన శ్రీముఖి) -
బిగ్‌బాస్ 7: స్ట్రాంగ్ కంటెస్టెంట్ అర్జున్ ఎలిమినేట్!
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌కు రేపటితో శుభం కార్డు పడనుంది. సీజన్ 7 కాబట్టి గ్రాండ్ ఫినాలేకు ఏడుగురిని తీసుకెళ్తారనుకున్నారంతా.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అటు ఏడుగురిని కాకుండా, ఇటు ఐదుగురిని కాకుండా ఆరుగురిని ఫైనల్స్‌కు పంపించారు. వీరిలో అర్జున్, ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రియాంక, అమర్దీప్ ఉన్నారు. నిజానికి ఈ ఆరుగురిలో అర్జున్ రెండువారాల క్రితమే ఎలిమినేట్ కావాల్సింది. కానీ తను ఫినాలే అస్త్ర పొందడంతో ఈ సీజన్లోనే తొలి ఫైనలిస్టుగా నిలిచాడు. మొదలైన గ్రాండ్ ఫినాలే షూటింగ్ దీంతో ఆ వారం ఓట్లు పడకపోయినా నేరుగా ఫినాలే వీక్‌లో అడుగుపెట్టాడు. ఇకపోతే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం నేటి ఉదయం నుంచే షూటింగ్ మొదలైంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఆటపాటల షూటింగ్ పూర్తవగా తాజాగా ఒక ఎలిమినేషన్ ప్రక్రియ సైతం పూర్తయినట్లు తెలుస్తోంది. అంబటి అర్జున్ ఎలిమినేట్ అయినట్లు సోసల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సింగిల్‌గా ఆడి సత్తా చూపాడు గతంలోనూ అతడికి తక్కువ ఓట్లు రావడంతో ఈసారి కూడా ఓటింగ్‌లో అర్జున్ చివరిస్థానంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. సింగిల్‌గా ఆడి ఫినాలే వరకు రాగలిగాడు కానీ ప్రేక్షకాదరణ పొందడంలో మాత్రం అర్జున్ ఘోరంగా విఫలమయ్యాడు. సీజన్ ప్రారంభమైనప్పుడే అతడు హౌస్‌లో అడుగుపెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. టాస్కులు ఇరగదీస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అర్జున్ ఈరోజు విన్నర్ రేసులో నిలబడేవాడు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో రేసులోనే లేకుండా పోయాడు. చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి.. అశ్వినిని పెళ్లి చేసుకుంటానన్న యావర్ -
బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి..
-
బిగ్‌బాస్: ప్రశాంత్‌కు బంపరాఫర్ ఇచ్చిన శ్రీముఖి
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను గెలిపించుకునేందుకు పోటాపోటీగా ఓట్లు గుద్దేశారు. అటు కంటెస్టెంట్లు ఫినాలే వరకు రావడానికి ఎంతో కష్టపడ్డారు. మొత్తానికి బిగ్‌బాస్ ఇంటా, బయటా ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ యుద్ధం ముగిసింది.. కానీ ఇందులో ఎవరు గెలిచారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఆ ఫలితాల కోసం బిగ్‌బాస్ ప్రేమికులు కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. రేపు రాత్రి ఈ ఎదురుచూపులకు మోక్షం లభించనుంది. ప్రశాంత్ ప్లీజ్.. ఇది ఫన్ టాస్క్ ఇకపోతే తాజాగా బిగ్‌బాస్ ఓ ప్రోమో రిలీజ్ చేశాడు. ఇందులో యాంకర్ శ్రీముఖి హౌస్‌లో అడుగుపెట్టింది. త్వరలో పాటల ప్రోగ్రామ్ మొదలుకాబోతోందని చెప్తూ కంటెస్టెంట్లను ఆడిషన్ చేసింది. అయితే ముందుజాగ్రత్తగా ప్రశాంత్‌ను హెచ్చరించింది. ప్రశాంత్, ప్లీజ్.. ఇది ఫన్ టాస్క్. ఓడిపోతే హగ్ ఇస్తా.. గెలిస్తే గట్టి హగ్ ఇస్తా కానీ ఏడవకు అని బంపరాఫర్ ఇచ్చింది. ఇంత మంచి ఆఫర్ ఇస్తే ఎందుకు వదులుకుంటానన్నట్లుగా తెగ మెలికలు తిరిగాడు రైతు బిడ్డ. ట్రూత్ ఆర్ డేర్.. ఇక ఆడిషన్స్ మొదలవగానే అమర్దీప్ తనలోని బాత్రూమ్ సింగర్‌ను బయటకు తీశాడు. గోంగూర తోట కాడ కాపు కాశా.. అంటూ పాట మొదలుపెట్టాడు. కానీ మధ్యలోనే లిరిక్స్ మర్చిపోయాడు. తర్వాత అర్జున్ సరదాగా పాట పాడి నవ్వించేశాడు. కంటెస్టెంట్లతో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించింది శ్రీముఖి. ముగ్గురు లేడీ కంటెస్టెంట్లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావని అడగ్గా ప్రిన్స్ యావర్ క్షణం ఆలోచించకుండా అశ్విని పేరు చెప్పాడు. దీంతో హౌస్మేట్స్ అతడిని ఆటపట్టించారు. చదవండి: విడాకుల రూమర్స్.. భర్త, మామతో ఐశ్వర్య డ్యాన్స్.. వీడియో వైరల్ -
Bigg Boss 7: శివాజీ అతి బద్ధకం.. అమర్‌కి సర్ప్రైజ్ ఇచ్చిన రైతుబిడ్డ
బిగ్‌బాస్ 7 పూర్తయిపోవడానికి ఇంకొన్ని గంటలే ఉంది. మొన్నటివరకు జర్నీ వీడియోలతో ప్రేక్షకుల్ని ఎమోషనల్ చేసిన నిర్వహకులు.. ఇప్పుడు ఏం చేయాలో తెలీక టైమ్ పాస్ చేస్తున్నారు. అందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు. శివాజీ మాత్రం అతి బద్ధకంతో చిరాకు తెప్పిస్తున్నాడు. రైతుబిడ్డ అమర్‌కి ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ శుక్రవారం ఏం జరిగిందనేది Day 103 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. శివాజీ అలాంటి భాష ఆరుగురు ఇంటిసభ్యులు నిద్రలేవడంతో శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. అయితే అమర్.. మిగిలిన ఐదుగురి జాతకం చెప్పాలని చెప్పి ఓ టాస్క్ ఇచ్చాడు. ఉన్నంతలో మనోడు బాగానే ఎంటర్టైన్ చేయాలని చూశాడు. కానీ మధ్యలో శివాజీ దూరి.. వెధవ-వెధవ అనే పదేపదే అడ్డుతగిలి చిరాకు తెప్పించాడు. టాస్క్ సరిగా పూర్తి చేయనీకుండా తలనొప్పి తీసుకొచ్చాడు. ఇక ఉన్న ఆరుగురూ మరీ బద్ధకంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయిన బిగ్‌బాస్.. విన్నర్‌గా నిలిచేవారు చివరివరకు వచ్చి ఆగిపోరు అని అలెర్ట్‌గా ఉండాలని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరో చెప్పండి చూద్దాం?) యావర్ సేఫ్ గేమ్ ఇక గురువారం ఎపిసోడ్లో భాగంగా అర్జున్, శివాజీ, అమర్.. ఇంట్లో వాళ్లు పంపిన ఫుడ్‌ని ఆస్వాదించారు. లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రియాంక, ప్రశాంత్, యావర్ కోసం ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది. అయితే వీళ్లకి ఫుడ్ దక్కుతుందా లేదా అనేది అర్జున్, అమర్, శివాజీ చేతుల్లో ఉంటుందని బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్ల ముగ్గురికి గేమ్స్ పెట్టి, అందులో గెలిచిన వాళ్లు ఫుడ్ ఎవరికి రావాలో డిసైడ్ చేస్తారని బిగ్‌బాస్ చెప్పాడు. తొలి గేమ్‌లో గెలిచిన అమర్.. యావర్ పేరు చెప్పాడు. అయితే ఇంటి ఫుడ్ మరో సభ్యుడితో పంచుకోవాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పగా.. ఎవరి పేరు చెప్పినా మరొకరు ఫీల్ అవుతారని నాకు ఫుడ్ వద్దని చెప్పేశాడు. శివాజీ బద్ధకం ఇక కప్పులు బ్యాలెన్స్ చేసే రెండో గేమ్‌లో అర్జున్ గెలిచాడు. ప్రశాంత్ పేరు చెప్పాడు. అయితే ప్రశాంత్ నువ్వు ఎవరితో ఫుడ్ పంచుకుంటావ్? అని బిగ్‌బాస్ అడగ్గా.. అమర్ పేరు చెప్పాడు. అయితే ఈ రోజు అమర్ పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా ప్రశాంత్ ఇతడి పేరు చెప్పాడు. వీళ్లిద్దరూ ప్రశాంత్ అమ్మ చేసి పంపిన మటన్ కర్రీ, బగారా రైస్ తిన్నారు. ఇకపోతే రెండు గేమ్స్‌లోనూ శివాజీ మరీ బద్ధకం ఆడి.. ఒక్క గేమ్‌లోనూ గెలవలేకపోయాడు. ఇలాంటోడిని గనుక బిగ్‌బాస్ పొరపాటున విజేతని చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు! మరోవైపు తనదగ్గరున్న పాయింట్స్ ఉపయోగించుకున్న అమర్.. తన భార్య తేజస్వితో బిగ్‌బాస్ హౌస్ నుంచి లైవ్ వీడియో కాల్ మాట్లాడాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: 'సలార్' మూవీ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టిన ప్రభాస్..) -
శివాజీకి కూతురు ఉంది.. బయటపెట్టిన సమీర్
శివాజీ.. ఒకప్పుడు మంచి నటుడు.. కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి మురికిపట్టిపోయాడు. స్వార్థపరులకు, అవకాశవాదులవైపు నిలబడి అందరితో ఛీ కొట్టించుకున్నాడు. ఫలితంగా జనాల్లో ఆదరణ తగ్గిపోయింది. అవకాశాలు దూరమయ్యాయి. ఇంట్లో ఖాళీగా ఉంటున్న సమయంలో బిగ్‌బాస్ ఛాన్స్ రావడంతో ఓకే చెప్పాడు. అలా బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో పాల్గొన్నాడు. ఎప్పుడూ నిజాలే మాట్లాడతాను, అబద్ధం చెప్పను.. అసలు అబద్ధం అంటే ఎలా ఉంటుందో తెలీదన్నట్లుగా పోజు కొడుతుంటాడు శివాజీ. పీక మీద కాలేసి తొక్కుతా.. చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేది చిల్లర పనులు అన్నట్లుగా ఈయన చెప్పేది ఒకటుంటుంది.. వాస్తవం మరొకటి ఉంటుంది. ఈ మధ్య అతడు షోలో ఆడవాళ్ల గురించి పిచ్చి కూతలు కూశాడు. శోభ కోపంతో అరిచినందుకుగానూ.. అలాంటి అమ్మాయిలు మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కేవాడిని.. రెండు పీకేవాడిని.. అంటూ నోటికొచ్చింది వాగాడు శివాజీ. అలా అపడం తప్పని నాగార్జున చెప్పినా వినిపించుకోలేదు. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే పీక మీద కాలేసి తొక్కుతావా? అని నాగ్ నిలదీస్తే.. అవును.. ఇలాగే ప్రవర్తిస్తా.. రెండు పీకుతా అని దురుసుగా సమాధానమిచ్చాడు. ఎవరికీ తెలియని విషయం చెప్పిన సమీర్ ఆఖరికి ఆడియన్స్ కూడా అలా కాలేసి తొక్కుతాననడం నచ్చలేదని చెప్తున్నా.. తనను తాను సమర్థించుకున్నాడే తప్ప తప్పును అంగీకరించడానికి ఇష్టపడలేదు. హౌస్‌లో ఉన్న ప్రియాంక, శోభను కూడా ఎప్పుడూ చులకన చేసి మాట్లాడుతూ ఆడవారి పట్ల తనకెంత చులకన భావం ఉందనే విషయాన్ని బయటపెడుతూనే వచ్చాడు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడు సమీర్.. శివాజీ గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. శివాజీకి ఇద్దరు కొడుకులతో పాటు ఓ కూతురు ఉందని చెప్పాడు. శివాజీకి కూతురు ఉందా? ఈ విషయం తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఎందుకంటే శివాజీ.. ఇప్పటివరకు తనకు ఇద్దరు కొడుకులు మాత్రమే సంతానం అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడా తనకు కూతురు ఉన్నట్లు ప్రస్తావించలేదు. బిగ్‌బాస్ షోలోనూ పెద్ద కొడుకు ఫ్యామిలీ వీక్‌లో హౌస్‌లోకి వెళ్లాడు. అలాగే సండే ఎపిసోడ్లో శివాజీ భార్యతో పాటు చిన్న కొడుకు స్టేజీపై కనిపించారు. కానీ కూతురు ప్రస్తావన, ఉనికి మాత్రం ఎక్కడా లేదు. నెటిజన్ల డౌటానుమానాలు అయితే ఇన్నాళ్లూ శివాజీ గుట్టుగా దాచిన తన కూతురి విషయాన్ని బయటపెట్టాడు సమీర్. ఓ ఇంటర్వ్యూలో సమీర్ మాట్లాడుతూ.. శివాజీకి ఓ కూతురు ఉందన్నాడు. దీంతో యాంకర్.. శివాజీకి ఇద్దరు కొడుకులతో పాటు ఓ కూతురు ఉందా? అని తిరిగి ప్రశ్నించగా.. అవును, అతడికి ఓ కూతురు కూడా ఉందని నొక్కి చెప్పాడు. మరి శివాజీ ఆ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదు? తన కూతురి గురించి ఇంతవరకు ఎక్కడా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? అని నెటిజన్లు రకరకాలుగా అనుమానిస్తున్నారు. చదవండి: Adhik Ravichandran Marriage Photos: ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి.. విశాల్ స్వీట్ వార్నింగ్.. -
ముష్టి బ్యాచ్.. ముష్టినాయాళ్లు.. వంకరబుద్ధి పోనిచ్చుకోని శివాజీ
బిగ్‌బాస్ 7 ఫినాలే దగ్గరపడుతోంది. ఇప్పుడు కూడా హౌస్మేట్స్.. వారిలో వారే కొట్టుకోకుండా కాస్త కలిసిమెలిసి ఉండేందుకు సరదా టాస్కులిచ్చాడు బిగ్‌బాస్. ఒకరి కోసం మరొకరు ఆడాలంటూ వారి మధ్య బంధాన్ని బలపర్చేందుకు ప్రయత్నించాడు. మరి ఎవరు ఎవరికోసం ఆడారు? ఏలియన్స్ ఇంట్లో ఎందుకు దూరాయి? ఈ విషయాలన్నీ తాజా ఎపిసోడ్ (డిసెంబర్ 14) హైలైట్స్‌లో చూసేద్దాం.. మీ ఇంటి వంట.. ఈ వారం నామినేషన్ల గోల లేదు, పెద్దగా టాస్కులు కూడా లేకపోవడంతో హౌస్మేట్స్ విశ్రాంతి తీసుకుంటున్నారు. బద్ధకస్తులుగా మారిపోయిన కంటెస్టెంట్లను హుషారెత్తించేందుకు బిగ్‌బాస్ మరోసారి హాచీ ఏలియన్స్‌ను రంగంలోకి దింపాడు. ఈ హాచీ.. కంటెస్టెంట్ల కోసం ఇంటి నుంచి ఫుడ్ వచ్చిందని, తమను సంతోషపరిస్తేనే ఆ ఆహారం ఇస్తామని చెప్పింది. అయితే మీ ఫుడ్ కోసం తోటి ఇంటిసభ్యులు ఆ ఆహారాన్ని సంపాదించాల్సి ఉంటుందని మెలిక పెట్టింది. శివాజీ కోసం ఆడి గెలిచిన ప్రియాంక మొదటగా అర్జున్ ఇంటి నుంచి రాగిముద్ద-మటన్ కూర వచ్చింది. ఈ ఫుడ్ కోసం యావర్ షేక్ బాల్ షేక్ గేమ్ ఆడి గెలిచాడు. తనకోసం ఆడి గెలిచిన యావర్‌కు తన చేతితో ఇంటి ఫుడ్‌ను తినిపించాడు అర్జున్. శివాజీ కోసం ఇంటి నుంచి చికెన్ కర్రీ వచ్చింది. దీనికోసం ప్రియాంక బ్యాలెన్స్ ది బాల్స్ గేమ్ ఆడి గెలిచి చికెన్ కూర శివాజీకి దక్కేలా చేసింది. ఆ తర్వాత అమర్‌దీప్‌కు రొయ్యల బిర్యానీ వచ్చింది. దీని కోసం శివాజీ బెలూన్ల టాస్క్ ఆడి గెలవడంతో అమర్ రొయ్యల బిర్యానీని ఇతరులతో షేర్ చేసుకుంటూ కడుపునిండా ఆరగించాడు. గంట ఎపిసోడ్లో ఎవరెంత కనిపిస్తారు? తర్వాత కొందరు గ్రహాంతరవాసుల్లాగా మాస్కులు పెట్టుకుని ఇంట్లోకి వచ్చి అందరినీ ఓ ఆటాడుకుని వెళ్లిపోయారు. అనంతరం బిగ్‌బాస్.. మీ 14 వారాల జర్నీలో మీ ఓవరాల్ పర్ఫామెన్స్ ఆధారంగా 60 నిమిషాల ఎపిసోడ్లో మీరు ఎంతసేపు కనిపించడానికి అర్హులో చెప్పాలంటూ కొన్ని బోర్డులు ఇచ్చాడు. ముందుగా అర్జున్.. 10 నిమిషాల బోర్డు తన మెడలో వేసుకున్నాడు. ఫౌల్స్ ఆడుతూ, దొంగతనాలు చేస్తూ, తిట్లు తింటూ అమర్ 20 నిమిషాలు కనబడతాడని అనుకుంటున్నట్లు చెప్పాడు. శివాజీకి 15, ప్రియాంకకు 7, ప్రిన్స్ యావర్‌కు 5, ప్రశాంత్‌కు 3 నిమిషాల బోర్డులు ఇచ్చాడు. అమర్‌ను చులకనగా చూస్తున్న శివాజీ శివాజీ.. ఎవరికీ తక్కువ నిమిషాల బోర్డు ఇవ్వబుద్ధి కావట్లేదంటూనే అమర్ మెడలో 3 నిమిషాల బోర్డు వేసి క్లాస్ పీకాడు. నువ్వు ఈ 2 వారాలే ఆడావు.. అంతకుముందు ఏమీ ఆడలేదంటూ మరోసారి తనను టార్గెట్ చేశాడు. కొన్నిసార్లు నువ్వు నెగెటివ్ కంటెంట్ కోసం ప్రయత్నించావు, అసలు గేమ్ ఆడలేదు అని అన్నాడు. 3 నిమిషాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నా, నేను గేమ్ ఆడానన్నా.. అని అమర్ డిఫెండ్ చేసుకుంటుంటే.. నేను 5 వేసుకున్నప్పుడు నీకు 3 నిమిషాలు వేస్తే రోగమా? అని తిట్టాడు శివాజీ. అంతేకాదు.. అర్జున్‌కు 7 ఇచ్చి అమర్ కంటే నువ్వు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలవన్నాడు. ముష్టి బ్యాచ్ ప్రియాంకకు 10 ఇచ్చి మిగిలిన 15, 20 నిమిషాల బోర్డులు ప్రిన్స్, ప్రశాంత్ చేతిలో పెట్టి ఇద్దరూ తమకు నచ్చినవి వేసుకోమని ఆఫర్ ఇచ్చాడు. తర్వాత అందరూ ఈ బోర్డుల ప్రక్రియను ఒకరి తర్వాత ఒకరు పూర్తి చేశారు. కాగా ఫినాలే దగ్గరపడుతున్నప్పటికీ టైం దొరికినప్పుడల్లా అమర్ మీద విషం కక్కుతూనే ఉన్నాడు శివాజీ. వేస్ట్ ఫెలో, దొంగ, వెధవ, పనికిమాలినోడు, పిచ్చి పోహా.. ఇలా ఎన్నో మాటలన్నాడు. తాజా ఎపిసోడ్‌లోనూ స్పా(శోభ, ప్రియాంక, అమర్) బ్యాచ్‌ను ఉద్దేశిస్తూ ముష్టి బ్యాచ్.. ముష్టినాయాళ్లు.. అంటూ తన స్పై బ్యాచ్ దగ్గర చులకనగా మాట్లాడాడు. వాళ్ల ముందేమో పద్ధతిగా, పెద్దాయనలా ప్రవర్తిస్తూ పక్కకు రాగానే ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ మరోసారి తన వంకరబుద్ధి బయటపెట్టుకున్నాడు శివాజీ. చదవండి: నటుడు కన్నుమూత.. గురువు మరణం కలిచివేసిందంటూ భారతీరాజా పోస్ట్.. -
బిగ్‌బాస్: ఆగిపోయిన 24x7 లైవ్.. దానికోసమేనా?
బిగ్‌బాస్ పని అయిపోయింది.. ఈ షో క్రేజ్ తగ్గిపోయింది.. దీన్నెవరు చూస్తారు? పరమ సోది.. ఇలా ఈ రియాలిటీ షో గురించి నానామాటలన్నారు. కారణం.. రానురానూ షోలో పస తగ్గింది. లీకులు ఎక్కువైపోయాయి. ఫేవరిజం పెరిగింది. కంటెస్టెంట్ల ఎంపిక, ఎలిమినేషన్పైనా తీవ్ర వ్యతిరేకత.. వెరసి.. బిగ్‌బాస్‌కు ఆదరణ తగ్గుతూ వచ్చింది. దీంతో ఎలాగైనా బిగ్‌బాస్‌కు పూర్వవైభవం తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు మేకర్స్. 19 మందితో బిగ్‌బాస్ 7 అందులో భాగంగానే సీజన్ 7ను ఉల్టాపల్టా పేరిట వినూత్నంగా మొదలుపెట్టారు. సెప్టెంబర్ 3న కేవలం 14 మంది మాత్రమే హౌస్‌లో అడుగుపెట్టారు. షో మొదలైన నెలరోజుల తర్వాత మరో ఐదుగురు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఈ సీజన్లో 19 మంది పాల్గొనగా ప్రస్తుతం ఆరుగురు మాత్రమే మిగిలారు. ఓటీటీల పుణ్యమా అని గంట ఎపిసోడ్ మాత్రమే కాకుండా 24 గంటల లైవ్ స్ట్రీమ్ కూడా హాట్‌స్టార్‌లో ప్రసారం చేస్తున్నారు. శని, ఆదివారాల్లో మాత్రం లైవ్ ఆపేసేవారు. మిడ్‌వీక్ ఎలిమినేషన్.. హింటివ్వని నాగ్ మరో మూడు రోజుల్లో షోకి ఎండ్‌కార్డ్ పడనున్న తరుణంలో సడన్‌గా లైవ్ ఆపేశారు. గత సీజన్లో మిడ్‌వీక్ ఎలిమినేషన్‌కు ముందు కూడా ఇలాగే లైవ్ ఆపేశారు. కానీ అప్పటికి ఫైనలిస్టులను ఇంకా ప్రకటించలేదు. పైగా మిడ్‌వీక్ ఎలిమినేషన్ ఉందని హోస్ట్ జనాలను ముందే హెచ్చరించాడు. అన్నట్లుగానే శ్రీసత్యను వారం మధ్యలో ఎలిమినేట్ చేసి ఆ తర్వాత మిగిలిన ఐదుగురిని ఫైనలిస్టులుగా ప్రకటించారు. కానీ ఈసారి నాగార్జున మిడ్ వీక్ ఎలిమినేషన్ ఊసే ఎత్తలేదు. పైగా ఫైనలిస్టులను సైతం ప్రకటించేశాడు. సడన్‌గా ఆగిపోయిన లైవ్ కానీ సడన్‌గా లైవ్ ఆపేశారు. దీంతో అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా? లేదా? అని జనాలు అయోమయానికి లోనవుతున్నారు. అయితే సోషల్ మీడియా బజ్ చూస్తుంటే మిడ్ వీక్ ఎలిమినేషన్‌కు 50-50 ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈసారి కప్పు కోసం టాప్ 6 గట్టిగానే కొట్టుకున్నారు. ఇప్పటిదాకా కంటెస్టెంట్లు శాయశక్తులా పోరాడగా ఇప్పుడు వారి అభిమానులు తమ ఫేవరెట్స్‌ను గెలిపించుకునేందుకు ఓట్లు గుద్దుతున్నారు. టైటిల్ రేసులో ప్రశాంత్, అమర్ ముందు వరుసలో ఉన్నారు. వీరి మధ్యే అసలైన పోటీ నడుస్తోంది. రేపటితో ఓటింగ్‌కు ఎండ్‌కార్డ్ పడనుంది. మరి ఆలస్యం చేయకుండా మీ అభిమాన కంటెస్టెంట్‌కు ఓటేసుకోండి. -
ట్రూ ఎమోషన్స్ బయటపడ్డాయి.. ది బెస్ట్ జర్నీ వీడియోస్!
-
Bigg Boss 7: యావర్ ఏడ్చేశాడు.. ప్రశాంత్ ఏడిపించేశాడు!
బిగ్‌బాస్ షో చివరకొచ్చేసింది. దీంతో హౌస్ అంతా కూడా ఫుల్ పాజిటివ్ వైబ్స్ నడుస్తున్నాయి. ఇప్పటికే అమర్, అర్జున్, శివాజీ, ప్రియాంక.. తమ జర్నీ వీడియోలు చూసేసుకున్నారు. తాజా ఎపిసోడ్లో భాగంగా చివరగా మిగిలిన యావర్, ప్రశాంత్.. తమ జర్నీ వీడియోస్ చూసి తెగ మురిసిపోయారు. ఇంతకీ బుధవారం ఏం జరిగిందనేది Day 101 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: Bigg Boss: వింత టాస్క్.. చావు అంచుల దాకా వెళ్లొచ్చిన యంగ్ హీరోయిన్!) యావర్‌కి కేజీఎఫ్ ఎలివేషన్స్ ఫైనల్-6లో ఒకడైన యావర్.. తన బిగ్‌బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్ చూసుకోవడంతో బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తన ఫొటలన్నీ చూస్తూ ఎమోషనల్ అయిపోయిన యావర్.. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక యాక్టివిటీ రూంలో స్క్రీన్‌పై ప్లే చేసిన దాదాపు 17 నిమిషాల వీడియో చూస్తే అన్ని రకాల భావోద్వేగాలు పలికించాడు. యావర్ కోసం బిగ్‌బాస్.. కేజీఎఫ్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ వాడేశాడు. వేరే లెవల్ ఎలివేషన్ ఇచ్చాడు. 'నాకు కోపం ఉందని అందరూ అంటారు, కానీ నాలో చరిత్ర సృష్టించే అంతా దమ్ముంది' అని యావర్.. తన ఫీలింగ్ బయటపెట్టాడు. మురిసిపోయిన రైతుబిడ్డ ప్రశాంత్ యావర్ తర్వాత ప్రశాంత్ వంతు. బిగ్‌బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్ చూసుకున్న ప్రశాంత్.. తన తండ్రితో ఉన్న ఫొటో చూసి తెగ ఎమోషనల్ అయిపోయాడు. అనంతరం యాక్టివిటీ రూంలోకి వెళ్లిన ప్రశాంత్.. తన జర్నీని స్క్రీన్‌పై చూసుకుని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయాడు. ఇక మొదటి నుంచి కేవలం ప్రశాంత్ అని పిలుస్తూ వచ్చిన బిగ్‌బాస్.. ఫస్ట్ టైమ్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అని పిలిచాడు. దీంతో మనోడు ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఓవైపు నవ్వుతూ, మరోవైపు ఏడుస్తూ.. ఆనంద భాష్పలతో షర్ట్ అంతా తడిపేశాడని చెప్పొచ్చు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 ఫైనల్ అతిథిగా ఆ స్టార్ హీరో? వెరీ ఇంట్రెస్టింగ్!) -
బిగ్‌బాస్ 7 ఫైనల్ అతిథిగా ఆ స్టార్ హీరో? వెరీ ఇంట్రెస్టింగ్!
బిగ్‌బాస్ 7వ సీజన్ గ్రాండ్ ఫినాలేకు మరికొన్ని రోజులే ఉంది. ఈ ఆదివారం చాలా గ్రాండ్‌గా ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నాడు. ఇప్పటికే చివరివారాన్ని నిర్వహకులు.. ఫుల్ పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చేశారు. ఎవరు విన్నర్ అవుతారా? అని ప్రేక్షకులు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఫైనల్‌కి రాబోయే గెస్ట్ ఎవరనే న్యూస్ బయటకొచ్చింది. ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తయ్యాయి. గతసారి చీఫ్ గెస్ట్ అంటూ ఎవరూ రాలేదు. దీంతో నాగార్జునే.. రేవంత్‌కి ట్రోఫీ అందజేశాడు. అంతకు ముందు పలు సీజన్ల ఫినాలేకు మాత్రం స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేశ్ వచ్చారు. అలా ఈసారి ఎవరైనా వస్తారా? అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు రాబోతున్నాడనే తియ్యటి వార్త.. అభిమానుల చెవుల్లో పడింది. ఇది నిజమైపోవాలని తెగ ఆరాటపడుతున్నారు. (ఇదీ చదవండి: హీరో విజయ్ దేవరకొండపై అలాంటి వార్తలు.. ఆ వ్యక్తి అరెస్ట్) అయితే ఫినాలే ఎపిసోడ్‌కి మహేశ్ రావడంలో పెద్ద విచిత్రం ఏం ఉండకపోవచ్చు. ఎందుకంటే మరో నెల రోజుల్లో అంటే సంక్రాంతి కానుకగా 'గుంటూరు కారం'.. థియేటర్లలోకి రాబోతుంది. బిగ్‌బాస్ షోకి మహేశ్ గెస్ట్‌గా వస్తే మాత్రం.. ప్రమోషన్ పరంగా మూవీకి కాస్త హెల్ప్ కావొచ్చు. దీనిబట్టి చూస్తే మహేశ్ రావడం గ్యారంటీనే అనిపిస్తోంది. మరో ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చేస్తుందిలే! ఇకపోతే ఈసారి విన్నర్ అయ్యే సూచనలు అమర్-ప్రశాంత్‌లలో ఒకరికి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఓట్లు అయితే వీరిద్దరికే ఎక్కువగా పడుతున్నట్లు తెలుస్తోంది. వీళ్లతో పాటు శివాజీ కూడా ఉన్నాడు కానీ అతడిని విన్నర్ చేస్తారా అంటే సందేహంగానే కనిపిస్తుంది. మరి బిగ్‌బాస్ 7 విజేత.. వీళ్ల ముగ్గురిలో ఒకడా? లేదా అనుహ్యంగా కొత్త వ్యక్తి అవుతాడా అనేది ఆదివారం (డిసెంబరు 17) తేలిపోతుందిలే! (ఇదీ చదవండి: బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆ ముగ్గురిలో ఎవరు?) -
ప్రియాంకని ఏడిపించేసిన బిగ్‌బాస్..
-
Bigg Boss 7: శివాజీ బయటపడలేదు.. ప్రియాంక మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయింది!
బిగ్‌బాస్ మరోసారి ఏడిపించేశాడు. అవును ప్రియాంక, తనని తాను కంట్రోల్ చేసుకోలేనంతగా ఎమోషనల్ చేశాడు. అయితే శివాజీ మాత్రం పెద్దగా బయటపడలేదు. మరోవైపు ఓ గొడవ వల్ల విడిపోయిన అర్జున్-యావర్ మళ్లీ ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే యావర్ బోరున ఏడ్చేయడం కంటతడి పెట్టించింది. ఇంతకీ మంగళవారం ఏం జరిగిందనేది Day 100 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. శివాజీకి ఓ రేంజు ఎలివేషన్ సోమవారం ఎపిసోడ్లో జర్నీ వీడియోలతో అమర్, అర్జున్‌ని ఎమోషనల్ చేసిన బిగ్‌బాస్.. మంగళవారం ఎపిసోడ్‌ని శివాజీతో స్టార్ట్ చేశాడు. ఇతడి బిగ్‌బాస్ జ్ఞాపకాల్ని.. 'బుక్ ఆఫ్ మెమొరీస్'లో పొందుపరిచి శివాజీని సర్ప్రైజ్ చేశాడు. అనంతరం దాదాపు 17 నిమిషాల వీడియోని ప్లే చేసి మరీ శివాజీకి ఓ రేంజు ఎలివేషన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ క్రమంలోనే శివాజీ.. 25 ఏళ్ల ఇండస్ట్రీ కెరీర్ ఓ ఎత్తు.. బిగ్‌బాస్ జర్నీ ఓ ఎత్తు.. ఇక్కడి నుంచి ఎంతో కొంత నేర్చుకుని వెళ్తాం. అదైతే సత్యం బిగ్‌బాస్.. కప్పు గెలుస్తామా? లేదా అనేది పక్కనబెడితే.. చివరివారం వరకు వచ్చిన ఆరుగురు మాత్రం ప్రేక్షకుల హృదయాల్ని గెలిచారని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!) ప్రియాంక గట్టిపిల్ల శివాజీ తర్వాత ప్రియాంకని పిలిచిన బిగ్‌బాస్.. ఈమెకి సంబంధించిన ఫొటోలని డిస్ప్లే చేశారు. అయితే మిగతా ఫొటోల సంగతేమో గానీ తన బాయ్‌ఫ్రెండ్ శివతో ఉన్న పిక్ చూసిన తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇక ప్రియాంక గురించి ఎలివేషన్స్ ఇచ్చిన బిగ్‌బాస్.. సింపుల్ ప్రియాంకగా ఉండే మీరు.. శివంగి ప్రియాంకగా నామినేషన్స్‌లో మీరు ఎంత బలమైన కంటెస్టెంట్ అనేది మీరు ఎలాంటివారో తెలిసింది. పొట్టి పిల్ల కాదు గట్టిపిల్ల.. మీరు 100 శాతం ఇస్తూ వచ్చారు. మీ పట్టుదలే మిమ్మల్ని జీవితంలో మొదటి స్థానంలో నిలుపుతుందని కోరుకుంటూ మీ ప్రయాణం చూద్దాం అని దాదాపు 15 నిమిషాల వీడియోని ప్లే చేశాడు. అయితే ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా ప్రియాంక ఎమోషనల్ అవుతూ, ఆనంద బాష్పలతో కనిపించింది. మరోవైపు గతంలో ఓసారి నామినేషన్స్ సందర్భంగా ఇక యావర్‌తో మాట్లాడనని చెప్పిన అర్జున్.. తన జర్నీ వీడియోలో ఇద్దరం కలిసున్న సీన్స్ భలే ఉన్నాయని చెప్పాడు. దీంతో యావర్, అర్జున్‌ని హగ్ చేసుకుని గట్టిగా ఏడ్చేశాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. ఈరోజు ఎపిసోడ్ గురించి మీకు రాసి చెబితే ఆ ఫీల్ క్యారీ చేయలేం. కాబట్టి కుదిరితే ఫుల్ వీడియో చూడండి. (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) -
Bigg Boss 7: రూట్ మార్చిన బిగ్‌బాస్.. అర్జున్, అమర్ కన్నీళ్లు పెట్టేశారు!
బిగ్‌బాస్ 7వ సీజన్ చివరి వారానికి వచ్చేశాం. కొన్నిరోజుల ముందు హోస్ట్ నాగార్జున చెప్పినట్లు ఈసారి నామినేషన్స్ లాంటి హడావుడి ఏం లేదు. కేవలం హౌస్‌లోని ఉన్న ఆరుగురు సభ్యుల ఎమోషన్స్ మాత్రమే పలికించాలని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. అందుకు తగ్గట్లే తాజా ఎపిసోడ్లో అమర్, అర్జున్‌కి బోలెడన్ని సర్ప్రైజులతో పాటు అదిరిపోయే ఎలివేషన్స్ దక్కాయి. ఇంతకీ సోమవారం ఏం జరిగిందనేది Day 99 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. మెమొరీస్ బుక్ చివరి వారాన్ని చాలా అంటే చాలా హ్యాపీ మెమొరీస్‌తో చాలా పాజిటివ్‌గా ఎండ్ చేద్దామని బిగ్‌బాస్ ఫిక్సయ్యాడు. అందుకు తగ్గట్లే ఒక్కో ఇంటి సభ్యుడి జర్నీని చూపించి, అతడి నుంచి ఎమోషన్స్ అన్నీ బయటకు లాగేయాలనేది ఆర్గనైజర్స్ ప్లాన్. ఫస్ట్ ఫస్ట్ అమర్ ని మాత్రమే లాన్లోకి రమ్మన్నారు. అక్కడ అతడి బిగ్‌బాస్ మెమొరీస్ అన్నింటినీ ఫొటోల రూపంలో ప్రదర్శించాడు. ఆ తర్వాత యాక్టివిటీ రూంలోకి పిలిచిన తర్వాత దాదాపు 16 నిమిషాల జర్నీ వీడియోని ప్లే చేశారు. (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) అమర్ ఎమోషనల్ ఇందులో భాగంగా అమర్.. బిగ్ బాస్ హౌసులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమేం చేశాడు? ఎలా ప్రవర్తించాడు? లాంటి సీన్స్ అన్నింటినీ ఒక్కటిగా చేసి 16 నిమిషాల జర్నీ వీడియో ప్లే చేశారు. అయితే ఈ వీడియో చూస్తే అమర్ నవ్వాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, గూస్ బంప్స్ తెచ్చుకున్నాడు. చివరకు థ్యాంక్స్ బిగ్‌బాస్ అని చెప్పాడు. చాలా పెద్ద గిఫ్ట్ ఇది. అల్టిమేట్ బిగ్‌బాస్ అని అమర్ తన ఆనందాన్ని బయటపెట్టాడు. అర్జున్ ఎమోషనల్ ఇక అమర్‌కి చేసినట్లే అర్జున్‌ని కూడా పిలిచిన బిగ్‌బాస్.. అలానే 'బిగ్‌బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్' చూపించాడు. తన బిగ్‌బాస్ ఫొటోల్ని చూసి తెగ మురిసిపోయాడు. కాసేపటి తర్వాత యాక్టివిటీ రూంలోకి వెళ్లిన తర్వాత దాదాపు 14 నిమిషాల జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు. ఓవరాల్ వీడియో అంతా నవ్వుతూ చూసిన అర్జున్.. భార్య వచ్చిన క్లిప్ చూసినప్పుడు మాత్రం ఎమోషనల్ అయ్యాడు. అయితే ఈ రోజు ఎపిసోడ్‌ని రాయడం కంటే వీడియోగా చూస్తేనే కిక్ వస్తుంది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: నాగార్జున స్పెషల్ స్వెట్ టీ-షర్ట్.. ఎన్ని లక్షల ఖరీదంటే?) -
Bigg Boss 7: నాగార్జున స్పెషల్ స్వెట్ టీ-షర్ట్.. ఎన్ని లక్షల ఖరీదంటే?
బిగ్‌బాస్ హోస్ట్‌గా నాగార్జున డౌన్ అయిపోతున్నాడు. గత కొన్ని సీజన్లలో పర్వాలేదనిపించినప్పటికీ.. ఈ సారి మాత్రం తేలిపోయాడు. ప్రతి వీకెండ్ అంటే ఒకప్పుడ నాగ్ హోస్టింగ్ కోసం షో చూసేవారు. ఇప్పుడు దీనికోసం కాకుండా.. నాగ్ వేసుకుంటున్న కాస్ట్యూమ్స్ గురించి ఆరా తీస్తున్నారు. తాజాగా ఆదివారం అలాంటి ఓ స్వెట్ టీ-షర్ట్ వేసుకుని వచ్చాడు. ఇప్పుడు దాని ధర తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) ఆదివారం ఎపిసోడ్లో భాగంగా పసుపు రంగు చలికోటు లాంటిది వేసుకుని వచ్చాడు. చాలా వదులుగా ఉన్న ఈ టీ-షర్ట్ చూడటానికి డిఫరెంట్‌గా అనిపించింది. అమర్దీప్ కూడా.. ;మీ స్వెట్ టీ-షర్ట్ బాగుంది, నాకు ఇస్తారా సర్?' అని నాగార్జునని అడిగాడు. దీంతో ఇస్తానులే అని మాటిచ్చాడు. మహా అయితే ఈ టీ-షర్ట్ ఎంత ఖరీదు ఉంటుందిలే అని మీరనుకోవచ్చు. కానీ దీని ధర అక్షరాలు రూ.2,11,190 అని తెలుస్తోంది. buyma.us అనే వెబ్సైట్లో ఇది అందుబాటులో ఉంది. ఇకపోతే తాజా వీకెండ్లో శోభాని ఎలిమినేట్ చేసి పంపేశారు. దీంతో ప్రస్తుతం హౌస్‌లో టాప్-6 మాత్రమే ఉన్నారు. వీళ్లలో విజేత ఎవరనేది ఈ ఆదివారం అంటే డిసెంబరు 17న తెలిసిపోతుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 మూవీస్) -
వెనకాల గోతులు తవ్వుతోంది.. అమర్ వీడియో చూసి షాకైన శోభ
బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆదివారం నాడు శోభా శెట్టి ఎలిమినేట్ అయింది. తన ఎలిమినేషన్‌ను జనాలే కాదు శోభా కూడా పసిగట్టేసింది. అందుకే ఏదైతే అదైందని గతవారం హౌస్‌లో విశ్వరూపం చూపించింది. అందరి మీదా అరిచేసింది. కావాలని గొడవపెట్టుకుంది. ఇతరుల్ని రెచ్చగొట్టింది. చివరకు ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. తాజాగా ఆమె బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా గీతూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. మీరు హౌస్‌లో ప్రిన్స్ యావర్ సహా పలువురిని టార్గెట్ చేశారనిపించింది.. నిజమేనా? అని గీతూ అడగ్గా.. గేమ్‌ను టార్గెట్ చేశానే తప్ప ఎవరినీ టార్గెట్ చేయలేదని వివరణ ఇచ్చింది. తేజ కోసం బిగ్‌బాస్‌కు రాలే.. తేజ నువ్వు లేకుండా ఉండలేనన్న మీరు అతడు వెళ్లిపోయాక ఒక్కసారి కూడా తల్చుకోలేదేంటి? అని అడిగింది గీతూ.. దీనికి శోభా స్పందిస్తూ.. తేజ కోసం బిగ్‌బాస్ హౌస్‌కు రాలేదు, తేజని తల్చుకుని ఏడుస్తూ సింపతీ రావాలనుకోలేదని క్లారిటీ ఇచ్చింది. శోభా ఇంకా మాట్లాడుతూ.. అమర్, అర్జున్.. ఇద్దరికీ సపోర్ట్ చేస్తాను. ప్రియాంక నా స్నేహితురాలైనా సపోర్ట్ చేయను. ఎందుకంటే అమర్ గెలవాలని ఎక్కువగా ఉంది. శివాజీ స్ట్రాటజీతో ఆడుతున్నాడు. మైండ్ గేమ్ ఆడుతున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండాలంటే మెంటల్ గేమ్ ఆడటం చాలా అవసరం.. అది శివాజీ గ్రిప్‌లో పెట్టుకున్నాడు. జనాలకు ఏది చేస్తే నచ్చుతుంది అనేది ఆలోచించి మరీ ఆడుతున్నాడు. ఇలా ఆడితే ఏకంగా విన్నర్ అయిపోవచ్చు. అమర్ మాటలు విని షాక్ అమర్.. శోభ గురించి మాట్లాడిన వీడియో చూపించింది గీతూ. 'శోభ బ్యాక్‌బిచింగ్ చేస్తుంది. స్వార్థం ఎక్కువైపోయింది.. అంత స్వార్థంగా ఆలోచించేవారు గేమ్‌లో ముందుకు వెళ్లలేరు' అని మాట్లాడాడు.. ఇది చూసి షాకైన శోభ.. 'ఇది నాకు తెలియలేదు, హౌస్‌లో ఈ వీడియో చూపించాల్సింది' అని అభిప్రాయపడింది. ఇక చాలామటుకు గీతూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు దాటవేసింది శోభ. చదవండి: బంగారు తల్లీ.. నిన్ను కలిసేవరకు నాకీ శోకం తప్పదు.. విజయ్ ఆంటోని భార్య ఎమోషనల్ -
ప్రియాంక అమ్మ ఇప్పటికీ పెళ్లిళ్లకు వెళ్లి పనులు చేస్తుంది: శివ
ప్రియాంక జైన్‌గా కంటే ఇప్పుడు బిగ్ బాస్ ప్రియాంక అనే పేరుతోనే ఆమెకు మంచి గుర్తింపు ఉంది. బుల్లితెరపై 'జానకి కలగనలేదు' సీరియల్‌తో ఆమె వెలుగులోకి వచ్చింది. అదే విదంగా బుల్లితెర నటుడు శివ కుమార్‌తో ఆమె ప్రేమలో పడిన విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు. మౌనరాగం సీరియల్లో కలిసి నటించారు. అమ్ములుగా ప్రియాంక జైన్.. అంకిత్‌గా శివ కుమార్‌లు కనిపించారు. కెమెరా ముందే నటనతో జీవించిన వీళ్లు.. కెమెరా వెనుక కూడా రొమాంటిక్ జోడీగా మారారు. ఈ క్రమంలో ప్రియాంకకు బిగ్ బాస్‌లోకి ఎంట్రీ అవకాశం రావడంతో ఆమెకు మరింత గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఆమె టాప్-5 కంటెస్టెంట్‌గా ఆమె ఉన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ప్రియాంక ఎక్కడా బ్యాలెన్స్ తప్పలేదని చెప్పవచ్చు. గేమ్‌లో తన హుందాతనాన్ని, సంస్కారాన్ని కోల్పోకుండా ఉండటం వల్ల టాప్-5 వరకు వచ్చింది. ఈ క్రమంలో కొందరు యాంటీ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడం కూడా జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక కుటుంబం గురించి శివ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రియాంక బిగ్ బాస్‌లో ఉండగా తన ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ వీడియో ఒకటి భారీగా వైరల్ అయింది. ఆ వీడియోను చాలా రోజుల క్రితమే ఆమె యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన వారందరూ ప్రియాంక ఇంత పేదరికాన్ని చూసి ఈ స్థాయికి వచ్చిందా..? అని కొందరు ప్రశంసించారు. దీనిని జీర్ణించుకోలేని కొందరూ అదంతా ఓట్ల కోసం సింపతీ అనే విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ విషయంపై శివ ఇలా సమాధానం చెప్పాడు. 'ఆ వీడియో పోస్ట్ చేసే సమయానికి ప్రియాంకకు బిగ్ బాస్ ఆఫర్ రాలేదు. నిజానికి ఆమె అక్కడే జన్మించింది. ప్రియాంక నాన్నగారిని వ్యాపారం పరంగా ఆయన స్నేహితుడు మోసం చేయడంతో ఆర్థికంగా భారీగా నష్టపోయారు. ఆ సమయంలో ఆ ఇల్లు అమ్మేసి ప్రస్తుతం బెంగళూరులో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. దానికి రూ. 15 వేలు రెంట్ అవుతుంది.. ఆ డబ్బు కూడా ప్రియాంకనే చెల్లిస్తుంది. ప్రియాంక అమ్మగారు ఇప్పుడు కూడా పెళ్లికూతురికి మేకప్ చేయడం.. మెహందీ పెట్టడం వంటివి చేస్తున్నారు. ఆమె నాన్నగారు ఒక చిన్న మొబైల్ షాప్ పెట్టుకుని కొనసాగుతున్నాడు. చాలా పూర్ ఫ్యామిలీ నుంచి ఇంత దూరం ఆమె వచ్చింది. అలాంటి వ్యక్తిపై కూడా ఇలాంటి దారుణమైన ట్రోల్స్ చేయడం ఏంటి..? గేమ్‌లో భాగంగా వారు కొద్దిసేపు అరుచుకుంటారు.. మళ్లీ కలిసిపోతారు. అంతే గానీ బయట కొందరు పనిగట్టుకుని ఆమెను ఇంతలా ట్రోల్ చేయడం ఏంటి..? ట్రోల్ చేసే వారిలో ఎవరికైనా అన్యాయం చేసిందా అని ఆయన వ్యాఖ్యానించారు. ఆమెను ఎందరు ట్రోల్ చేసినా నేను ఆమెకు తోడుగా ఉంటూనే వాటిని ఎదుర్కుంటాను. అని ఆయన అన్నారు. రేపటి రోజున 'శివాజీ' కూడా స్టార్ మా బ్యాచ్‌నే ప్రియాంక, శోభ, అమర్ దీప్‌ను చాలా మంది 'స్టార్ మా బ్యాచ్' అంటూ ట్రోల్ చేస్తూన్నారని శివ తెలిపాడు. ఈ వ్యాఖ్యలు మొదట చేసింది శివాజీ గారే అంటూ ఆయన చెప్పాడు. బిగ్ బాస్ కూడా 'స్టార్ మా' ఛానెల్లోనే వస్తుంది. రేపొద్దున బిగ్ బాస్ పూర్తి అయ్యాక వీరందరూ బయటకు వస్తారు... అప్పుడు శివాజీ, పల్లవి ప్రశాంత్ వంటి వారితో పాటు అందరూ కూడా 'స్టార్ మా బ్యాచ్'నే అవుతారు. ఎందుకంటే వారందరూ కూడా 'స్టార్ మా' ఛానెల్ కోసం పనిచేశారు. అందులో తప్పేముంది..? ఇలాంటి విషయం లేని ట్రోల్స్ చేయడం ఎందుకు..? అని శివ ప్రశ్నించాడు. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
Bigg Boss 7: అనుకున్నట్లే శోభా ఎలిమినేషన్.. కాకపోతే అదొక్కటే అసంతృప్తి!
బిగ్‌బాస్ 7వ సీజన్ 14వ వారం కూడా పూర్తయిపోయింది. అనుకున్నట్లే శోభాశెట్టి ఎలిమినేట్ అయిపోయింది. అయితే చివరకొచ్చేసరికి కాస్త టెన్షన్ పెట్టారు గానీ అప్పటికే అందరికీ సీన్ అర్థమైపోయింది. అయితే శోభా.. ఎలిమినేట్ కావడం మాటేమో గానీ సడన్‌గా తనలో ఓ మార్పు చూపించి అందరికీ షాకిచ్చింది. ఇంతకీ ఆదివారం ఏం జరిగిందనేది Day 98 ఎపిసోడ్ హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) పశ్చాత్తాపం టాస్క్ శనివారం అందరినీ ఓ ఆటాడేసుకున్న హోస్ట్ నాగార్జున.. ఆదివారం వచ్చేసరికి ఫుల్ కూల్ అయిపోయాడు. 14 వారాల్లో ఏ వారం మీరు పశ్చాత్తాపంగా ఫీలయ్యారు? ఎందుకు? అనే చిన్న గేమ్ ఒకటి పెట్టాడు. ప్రియాంక.. 7వ వారంలో భోలెని ఓ మాట అనకుండా ఉండాల్సిందని చెప్పింది. శోభాశెట్టి.. 9వ వారం యావర్‌ని పిచ్చోడని అనకుండా ఉండాల్సిందని చెప్పింది. అమర్.. 14వ వారం తను ఎందుకలా పిచ్చోడిలా ప్రవర్తించానే అర్థం కాలేదని అన్నాడు. శివాజీ.. 14వ వారంలో ఆడపిల్లల గురించి ఉపయోగించిన పదాలు వ్యక్తిగతంగా ఫీలయ్యాను కానీ మిగతావాళ్లకు అవి టచ్ అయ్యాయని, ఈ విషయంలో పశ్చాత్తాపపడ్డానిని సంజాయిషీ ఇచ్చుకున్నారు. మిగతా వాళ్లందరూ ఒక్క ముక్కలో చెబితే.. శివాజీ మాత్రం సీరియల్ సాగదీసినట్లు చాంతాడంత చెప్పాడు. పోనీ అదైనా చక్కగా ఉందా అంటే.. మొత్తం యాక్టింగే కనిపించింది. ఎవరు ఏం నేర్చుకున్నారు? ఇక పశ్చాత్తాపం గేమ్ పూర్తయిన తర్వాత 14 వారాల్లో ఒక్కో కంటెస్టెంట్.. ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నారో చెప్పాలని నాగ్ చెప్పాడు. దీంతో ఫస్ట్ మాట్లాడిన అమర్.. ప్రశాంత్ దగ్గర నుంచి గేమ్ ఆడటం నేర్చుకున్నాను. అర్జున్ దగ్గర నిజాయతీ నేర్చుకున్నానని అన్నాడు. శివాజీ దగ్గర ఓపికగా ఉండటం నేర్చుకున్నానని యావర్ అన్నాడు. అమర్‌లా ఫౌల్ గేమ్స్ ఆడొద్దని నేర్చుకున్నానని ప్రియాంక చెప్పింది. శివాజీ దగ్గర లౌక్యం, యావర్ దగ్గర పట్టుదల, ప్రశాంత్ దగ్గర కలిసిపోయి నవ్వుతూ మాట్లాడటం, ప్రియాంక దగ్గర నవ్వుతూ మాట్లాడటం నేర్చుకున్నానని అర్జున్ చెప్పాడు. శోభా మాత్రం.. ఎవరి దగ్గర ఏం నేర్చుకోలేదు కానీ ఫోన్ లేకుండా బతకడం నేర్చుకున్నానని డిఫరెంట్‌గా చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: లేటు వయసులో పెళ్లి చేసుకున్న జైలర్ నటుడు, ఫోటోలు వైరల్) ఫైనలిస్టులుగా వాళ్లు గతవారం టికెట్ టూ ఫినాలే పోటీల్లో గెలిచి చివరివరకు నిలిచిన అర్జున్.. తొలి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఇక ఇప్పుడు సేవింగ్, ఎలిమినేషన్ లాంటిది కాకుండా ఎవరెవరు ఫైనలిస్ట్ అయ్యారనేది నాగార్జున ప్రకటించాడు. వరసగా ప్రియాంక, యావర్, అమర్, ప్రశాంత్.. ఫినాలే వీక్‌లోకి అడుగుపెట్టినట్లు చిన్నచిన్న హింట్స్ రూపంలో రివీల్ చేశారు. చివరగా శోభా-శివాజీ మిగలగా.. కాసేపు సస్పెన్స్ తర్వాత శోభా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే తాను బయటకెళ్లిపోతానని ముందే తెలుసో ఏమో గానీ పెద్దగా రియాక్ట్ కాలేదు. సైలెంట్‌గా స్టేజీపైకి వచ్చేసింది. అయితే ఆమె ఓవరాల్ జర్నీ వీడియో చూపించినప్పుడు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంది. అలానే ఇన్నిరోజులు హౌసులో అందరితో పోట్లాడిన శోభా.. ఎలిమినేట్ అయిన తర్వాత మాత్రం శాంతమూర్తిలా అందరి గురించి మంచిగా చెబుతూ కనిపించేసరికి.. ఈమెలో ఏంట్రా ఈ మార్పు అని అనుకున్నారు. అయితే ఎలిమినేట్ అవుతానని తెలియడం వల్లనో ఏమో గానీ శివాజీ, యావర్‌లని గేమ్స్ పేరుతో ట్రిగ్గర్ చేసి, వాళ్ల నిజస్వరూపాల్ని బయటపెట్టి వెళ్లిపోయింది. ఇప్పుడున్న వాళ్లతో శోభాతో కొన్ని విషయాల్లో బ్యాడ్ అయ్యిండొచ్చు కానీ ఆమెని చివరి వారం కూడా ఉంచుంటే శివాజీని ఆడుకునేది. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయిపోవడం.. ఆమె అభిమానులకు చిన్న అసంతృప్తిని మిగిల్చింది. ఇకపోతే టాప్-6 సెలబ్రేషన్స్ చేసుకోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: ముంబైలో లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. రామ్ చరణ్ ఆస్తులెంతో తెలుసా?) -
Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?
చాలామంది ప్రేక్షకులు ఎప్పటినుంచో తెగ ఆరాటపడుతున్నట్లు.. శోభాశెట్టి ఎలిమినేట్ అయిపోయింది. 14వ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే ఇది ఆమెకు ఇది పెద్ద షాకింగ్ విషయమేం కాదు. ఎందుకంటే ఇలా జరుగుతుందని ముందే ఊహించింది. ఇంతకీ శోభా ఎలిమినేషన్‌కి కారణమేంటి? మొత్తంగా రెమ్యునరేషన్ ఎంత సంపాదించింది? శోభా ఎలిమినేషన్ కరెక్టేనా? శోభాశెట్టి.. బిగ్‌బాస్ ప్రస్తుత సీజన్లో సీరియల్ బ్యాచ్‌కి లీడర్. ఫస్ట్ నుంచి అమర్-ప్రియాంకకి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. లెక్క ప్రకారం చూస్తే ఈమె చాన్నాళ్ల క్రితమే ఎలిమినేట్ అయిపోవాలి. కానీ షో ఆర్గనైజర్స్ అలా చేయలేదు. శోభాశెట్టిలో వీళ్లకు టీఆర్పీ కనిపించింది. దీంతో మోస్తరుగా ఆడినా సరే ఆమెని చివరివరకు లాక్కొచ్చేశారు. ఎందుకంటే అవసరం అలాంటిది మరి. అలానే శివాజీతో ఢీ అంటే ఢీ అనేలా ఫైట్ చేసింది కూడా ఈమె ఒక్కతే. అలాంటి శోభాని ముందే పంపేంచేసి ఉంటే షోలో మజా ఉండేది కాదు. ఇన్నాళ్లకు శోభా అవసరం తీరిపోయింది. దీనికి తోడు ప్రస్తుతమున్న వాళ్లలో ఓటింగ్ శాతం శోభాదే తక్కువ. అలా ఈమె ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది. శివాజీ పరువు పాయే ఈ సీజన్లో సీరియల్ బ్యాచ్, శివాజీ బ్యాచ్.. అందరికి అందరూ అలానే తయారయ్యారు. గేమ్స్ పరంగా అర్జున్, ప్రియాంక మినహా ఒక్కరు కూడా తిన్నగా ఆడలేదు. దీని గురించి పక్కనబెడితే 14 వారాలుగా అమర్‌ని పురుగు కంటే హీనంగా చూసిన శివాజీ.. నోటికి ఎన్ని వస్తే అన్ని మాటలు అన్నాడు. 'పనికిమాలినోడా' లాంటి చీప్ కామెంట్స్ చేశాడు. అయినా సరే అమర్.. వీటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ వారం.. ఓ టాస్క్ సందర్భంగా జస్ట్ పదే పదే నిమిషాల్లో శివాజీని ఆడేసుకుంది. దీంతో సోఫాజీ ట్రిగ్గర్ అయిపోయాడు. కట్ చేస్తే.. ఆడపిల్లల్ని పీకుతా, పీకమీద కాలేసి తొక్కుతా అని శివాజీ చిల్లర కామెంట్స్ చేశాడు. దీంతో ఉన్న ఆ కాస్త పరువు కూడా పోయింది. దీన్ని కవర్ చేసేందుకు ప్రస్తుతం సోషల్ మీడియాలో శివాజీ బ్యాచ్ పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో శోభా సూపర్ ఆడింది అని చెప్పం గానీ ఎలిమినేట్ అయి వెళ్తూ వెళ్తూ శివాజీ పరువు మాత్రం తీసేసి వెళ్లిపోయింది. రెమ్యునరేషన్ ఎంత? సీరియల్ నటిగా శోభాకి కాస్త పేరుంది. అలానే వారానికి రెండున్నర లక్షల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అంటే 14 వారాలకుగానూ మొత్తం రూ.35 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయినవాళ్ల పరంగా చూసుకుంటే మాత్రం శోభాదే హయస్ట్ అని చెప్పొచ్చు. సో అదన్నమాట విషయం. -
బిగ్‌బాస్ 7: ఎలిమినేషన్ రౌండ్.. శివాజీ వర్సెస్ శోభా! చివరకు..
శోభా శెట్టి.. అన్నీ తన సొంతం కావాలనుకుంటుంది. ఏ టాస్క్ అయినా తనే గెలిచేయాలనుకుంటుంది. అందరూ తనకే సపోర్ట్ ఇవ్వాలనుకుంటుంది. పొరపాటున తనను కాదని పక్కవాళ్లకు మద్దతు ఇచ్చారంటే ఇక అంతే సంగతులు.. ఫినాలే దగ్గరపడుతున్నా తన పంతం మార్చుకోలేదు శోభ. చెప్పాలంటే ఈ వారం ఇంకా మొండిగా వ్యవహరించింది. స్నేహితులను కూడా విడిచిపెట్టలేదు. అటు స్పై బ్యాచ్తోనూ ఇటు తన ఫ్రెండ్స్‌తోనూ గొడవపడింది. ఊహించిందే నిజమైంది ఓపక్క తనకు ఓట్లు పడుతున్నాయి, తాను వీక్ కాదంటూనే.. మరోపక్క ఈవారం వెళ్లిపోయేది తానేనంటూ రెండు మాటలు మాట్లాడింది. అటు ప్రేక్షకులు సైతం ఈ వారం ఇంటి నుంచి శోభాను బయటకు పంపించేయాలని డిసైడ్ అయ్యారు. చివరకు అందరి అంచనా నిజమైంది.. శోభా ఎలిమినేట్ అయింది. ఫినాలేకు అడుగు దూరంలోనే ఆమె బిగ్‌బాస్ జర్నీ ఆగిపోయింది. అయితే ఈసారి నామినేషన్లో ఉన్నవారిని సేవ్ చేసుకుంటూ రాలేదు నాగ్. ఫినాలే వీక్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఒక్కొక్కరి పేర్లు ప్రకటించాడు. అలా ప్రియాంక, ప్రశాంత్, అమర్, యావర్ ఫినాలేలో అడుగుపెట్టారు. చివరి రౌండ్లో ఇద్దరు అర్జున్ ఎలాగో ఫినాలే అస్త్ర గెలవడంతో ఈ వారం నామినేషన్లోనే లేడు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లయిన శివాజీ, శోభ మధ్యే జరిగినట్లు తెలుస్తోంది. శివాజీ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా తన సింపతీ గేమ్ వల్ల ఓట్లు పడుతున్నాయి. దీంతో అతడు ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు. ఇక శోభా శెట్టి సైకోలా మారిపోయి తన గేమ్ తానే చెడగొట్టుకుంది. దీంతో తాను తవ్వుకున్న గోతిలో తనే పడింది, ఈవారం ఎలిమినేట్ అయింది. మరి ఎలిమినేషన్ తర్వాత శోభా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: శివాజీ బ్యాచ్‌ని ఉతికారేసిన నాగార్జున.. ఆ విషయమే కారణమా? -
Bigg Boss 7: ప్రశాంత్ మోసాన్ని బయటపెట్టిన నాగ్.. శివాజీ వరస్ట్ బిహేవియర్!
బిగ్‌బాస్ 7లో శివాజీ ఓ చెదపురుగు. పురుగు వల్ల చెక్క అంతా డ్యామేజ్ అయినట్లు.. సోఫాజీ అలియాస్ శివాజీ వల్ల ఈ సీజన్ తీరే దెబ్బతినేసింది. దీన్ని బాగుచేయడం నాగ్ వల్ల కూడా కాదు. అయినా సరే పెద్దాయన ముసుగు వేసుకున్న ఈయన ఇప్పటికీ తీరు మార్చుకోవడం లేదు. స్వయంగా నాగార్జున.. నువ్వు చేసింది తప్పురా బాబు అని చెబుతున్నాసరే ఒప్పుకోలేదు. శివాజీ ఒక్కడికే కాదు ఇతడి బ్యాచ్ మొత్తానికి గట్టిగా పడ్డాయి. ఇంతకీ శనివారం ఏం జరిగిందనేది Day 97 ఎపిసోడ్ హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. అర్జున్-ప్రియాంక ఫర్ఫెక్ట్ ప్లేయర్స్ వీకెండ్ కాబట్టి వచ్చేసిన నాగార్జున.. శుక్రవారం సంగతులన్నీ చూశాడు. అలా శనివారం ఎపిసోడ్ మొదలైంది. ఇక ఈసారి ఏడుగురు ఇంటి సభ్యుల తప్పుల్ని బయటపెట్టడమే నాగ్ పనిగా పెట్టుకున్నాడు. అయితే ప్రియాంక, అర్జున్ మాత్రం సేవ్ అయ్యాడు. ఫినాలే వీక్కి చేరుకున్నా సరే ఈ వారమంతా గేమ్స్ ఆడి, ఒక్కటంటే ఒక్క తప్పు చేయని అర్జున్.. జస్ట్ ఒకే ఒక్క ఫౌల్ చేసిన ప్రియాంకని నాగ్ మెచ్చుకున్నాడు. దీనిబట్టి చూస్తే ప్రియాంక కూడా ఫినాలే వీక్కి ఆల్మోస్ట్ చేరిపోయినట్లే ఓ క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: మెగాహీరో రామ్ చరణ్‌కు మరో గ్లోబల్ అవార్డ్) శోభాకి స్మూత్‌గా కౌంటర్స్ ఫస్ట్ ఫస్ట్ శోభా ఫేస్ ఉన్న మార్బెల్ పగలగొట్టిన నాగ్, ఆమెని కన్ఫెషన్ రూంలోకి పిలిచాడు. అలా ఆమెతో పర్సనల్‌గా మాట్లాడాడు. అయితే వెళ్తున్నప్పుడే ఆమె భయపడుతూ వెళ్లింది. దీన్ని పాయింట్ ఔట్ చేసిన నాగ్.. ఎందుకు భయపడుతున్నావ్ అని అడిగాడు. అసలేమైంది? శివాజీతో గొడవ ఎందుకు? అని నాగ్ అడగ్గా.. 'తెలుగమ్మాయిలు కాదు, ఫేవరిజం అని శివాజీ పదేపదే అంటున్నారు. కొన్నికొన్నిసార్లు ప్రియాంక, నాతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అలానే ప్రతిసారి గ్రూపిజం, గ్రూపిజం అని అంటున్నారు. దీని గురించి మాట్లాడుదామని అనుకున్నాను కానీ కుదర్లేదు' అని శివాజీతో వాదనపై శోభా దగ్గర క్లారిటీ తీసుకున్నాడు. అయితే నువ్వు అందరినీ డిస్ట్రబ్ చేస్తున్నావ్, ఇంకా చెప్పాలంటే రెచ్చగొడుతున్నావ్ అని నాగ్, శోభాపై సీరియస్ అయ్యాడు. హౌస్ వాతావరణం కూడా నీ వల్ల కలుషితం అయిపోయిందని అన్నాడు. దీంతో శోభా ఏడ్చేసింది. దీంతో నాగ్ రూట్ మార్చాడు. ఆడపిల్ల ఏడిస్తే షోకి మళ్లీ బ్యాడ్ నేమ్ రావొచ్చని.. ఏమైంది శోభా చెప్పు? అని చాలా స్మూత్ గా అడిగాడు. అయితే వెళ్లిపోతానేమోనని భయమేస్తుంది సర్, అందుకే అలా అని నాగ్ ప్రశ్నలకు శోభా ఆన్సర్ చెప్పుకొచ్చింది. యావర్ అస్సలు మారడు శోభా తర్వాత యావర్ ని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగ్.. శోభాని 'చీ..థూ' అని అనడంపై సీరియస్ అయ్యాడు. ఆ ప్రవర్తన బాగుందా? వరస్డ్ బిహేవియర్ అని అన్నాడు. మధ్యలో యావర్.. తనది తప్పు కాదని సమర్థించుకోవడానికి తెగ ప్రయత్నించాడు. దీంతో నాగ్ సీరియస్ అయ్యాడు. నిన్ను చూసిన మాకు ఏమనిపించిందంటే.. ఇది యావర్ నిజస్వరూపం, ఇప్పుడు బయటకొచ్చింది అని నాగ్.. యావర్ గురించి స్మూత్‌గా నిజాలు చెప్పేశాడు. నీది తప్పు, బయటకెళ్లి శోభాకి మనస్పూర్తిగా సారీ చెప్పు అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ గొడవలో శోభాది కూడా తప్పు ఉందని యావర్, మళ్లీ మళ్లీ అదే పాట పాడేసరికి.. ఇక నీకు చెప్పలేను, దండంరా బాబు అని నాగ్ తన విసుగు చూపించాడు. (ఇదీ చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!) రైతుబిడ్డ మస్త్ యాక్టింగ్ రైతుబిడ్డని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగ్.. అతడి నిజస్వరూపాన్ని, ఆస్కార్ లెవల్ యాక్టింగ్ బయటపెట్టాడు. చెప్పు ప్రశాంత్.. నీకు ఏ వీడియోలు చూపించాలి అని నాగ్ వంగిమరీ దండం పెడుతూ సెటైరికల్‌గా మాట్లాడాడు. ఎందుకు ప్రశాంత్ నీకు అందరి మీద అపనమ్మకం ఉంది? నువ్వు అడిగిన ప్రతి వీడియో చూపించడానికి ఉన్నాడా బిగ్ బాస్? అని నాగ్ ఫుల్ సీరియస్ అయ్యాడు. నాగ్ విషయం చెప్పడానికి ట్రై చేస్తుంటే.. అతడిని కూడా ఏమార్చడానికి ప్రయత్నించాడు. దీంతో నాగ్.. చెప్పింది వినరా బాబు అని సైలెంట్ చేశాడు. ఇక అమర్ కొరికేశాడని ప్రశాంత్ సీన్ చేసిన విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ ఏమో బ్లడ్ వచ్చిందని రైతుబిడ్డ అన్నాడు. అయితే డాక్టర్‌తో ఇప్పుడే మాట్లాడానని చెప్పిన నాగ్.. నో టూత్ మార్క్, నో బ్లడ్ అని అసలు విషయం చెప్పాడు. అదికాదు సర్ చేయి ఉబ్బిపోయిందని రైతుబిడ్డ మాట మార్చేశాడు. మధ్యలో అర్జున్ కూడా పిలిచిన నాగ్.. ప్రశాంత్‌ని అమర్ కొరకలేదని, జస్ట్ పట్టి వదిలేశాడని చెప్పాడు. జరిగిన దానికి, నువ్వు అక్కడ చేసినదానికి ఎంత సీన్ చేశావ్ తెలుసా? అని నాగ్ ప్రశాంత్‌పై ఓ రేంజులో రెచ్చిపోయాడు. మిగతా విషయాల్లో ఎంతో నొప్పి భరించావ్ కానీ అమర్ దగ్గరకొచ్చేసరికి తప్పు ఎక్కడ చేస్తాడా అని ఎదురుచూస్తున్నావ్.. అమర్ విషయంలో పెట్టిన శ్రద్ధ ఆట విషయంలో పెట్టుంటే బాగుండేదని నాగ్ అన్నాడు. అలానే ఈ హౌసులో నువ్వు శివాజీ సేవకుడివా? గులంవా? అని నాగ్ సీరియస్ అయ్యాడు. నాగ్ చెబుతుంటే ప్రశాంత్ అడ్డు తగిలాడు. ప్రశాంత్ నువ్వు చేసిందే తప్పు, అటుఇటు తీసుకెళ్లకు అని నాగ్ కౌంటర్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ!) శివాజీ ఓ వరస్డ్ కేండిడేట్ శివాజీని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగార్జున.. ఇన్నివారాలు సపోర్ట్ చేసినట్లు కాకుండా సీరియస్ అయ్యాడు. ఇప్పటికీ మాట్లాడకపోతే షోని ప్రేక్షకులు చూడటం మానేస్తారని తెలుసు. అందుకే నాగ్ ఈసారి తెచ్చిపెట్టుకుని మరీ శివాజీపై సీరియస్ అయ్యాడు. ఆడపిల్లలని పీకుతా అని శివాజీ అన్న కామెంట్‌పై నాగ్.. వివరణ అడిగాడు. ప్రశాంత్‌ని గత రెండు వారాల నుంచి టార్చర్ చేస్తున్నారని, అందుకే ఆ ముగ్గురిపై(శోభా-అమర్-ప్రియాంక) సీరియస్ అయ్యానని అన్నాడు. నువ్వు చేసింది తప్పు శివాజీ అని నాగ్ బల్లగుద్ది చెబుతున్నాసరే.. తనని తాను చాలా సమర్థించుకున్నాడు. ప్రేక్షకుల్లోని అమ్మాయి తన బాధ చెబుతున్నా సరే.. ఆమెతో కూడా వాదించాడు తప్పితే తాను చేసింది తప్పని శివాజీ ఒప్పుకోలేదు. ఆడపిల్ల తప్పు చేస్తే గొంత మీద కాలేసి తొక్కుతా అని శివాజీ కామెంట్ చేసి మరో వీడియోని నాగ్ చూపించాడు. అయితే అది కోపం, ఫ్రస్టేషన్ వల్ల వచ్చింది బాబుగారు అని శివాజీ నంగనాచి కబుర్లు చెప్పాడు. ఫ్లోలో వచ్చిన మాట తప్పితే.. వాంటెడ్ గా అన్న మాట కాదు అని శివాజీ ఓ పనికిమాలిన రీజన్ చెప్పాడు. దీనిబట్టి శివాజీ.. ఎంత వరస్ట్ కంటెస్టెంట్ అనేది అర్థమైపోయింది. అమర్‌కి గట్టిగా పడ్డాయ్ ఈ వారం నిజంగా పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తించిన అమర్‌ని కూడా నాగ్ ఓ రేంజులో ఆడేసుకున్నాడు. ఏమైంది అమర్, నీకు పిచ్చెక్కిందా? కెప్టెన్ గా ఏంటా బిహేవియర్? అని.. ప్రశాంత్ ని తోసుకుంటూ మెడికల్ రూంలోకి తీసుకువెళ్లడంపై నాగ్ సీరియస్ అయ్యాడు. యావర్, ప్రశాంత్ మీదనే ఎందుకలా చేస్తున్నావ్ అని సీరియస్ అయ్యాడు. ఈ మొత్తం వ్యవహారంలో చపాతీలు కలపడం అనే ఓ చిన్న విషయాన్ని నాగ్ తీసుకొచ్చాడు. ఇంత సీరియస్ డిస్కషన్లో నాగ్ దీని గురించి ఎందుకు మాట్లాడాడు అనేది అస్సలు అర్థం కాలేదు. అలానే నిజంగా 'పిచ్చి నా కొడుకు'లానే బిహేవ్ చేస్తున్నావ్ అని అమర్ ప్రవర్తన గురించి తన కోపాన్ని బయటపెట్టాడు. నన్ను కూడా బయట ఇద్దరు ముగ్గురు అడిగారు.. అమర్ ఎందుకలా సైకోలా బిహేవ్ చేస్తున్నాడని నాగ్ తనకెదురైన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈవారం సేవింగ్ లాంటివి ఏం ఉండవు, ఫినాలేకి వెళ్లేది ఎవరో చెప్పడం మాత్రమే ఉంటుందని నాగ్ క్లారిటీ ఇవ్వడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. అయితే ఇప్పటికే శివాజీ బ్యాచ్‌ని నాగార్జున వెనకేసుకొస్తున్నాడని అందరికీ క్లియర్ గా అర్థమైంది. ఇప్పటికీ వాళ్లని తిట్టకపోతే షో పరువు పోతుందని నాగ్ తిట్టినట్లు అనిపించింది అంతే. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ!
మిగతా సీజన్లతో పోలిస్తే గొడవలు, గ్రూపుల గోల వల్ల బిగ్‌బాస్.. ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. అయితే ఈ మొత్తం వివాదంలో శోభాశెట్టి అనే ఓ క్యారెక్టర్ వల్ల ఎక్కడలేని మజా వచ్చింది. ఈసారి ఆమె ఎలిమినేట్ అయిపోయిందని అంటున్నారు. సరే దాని గురించి పక్కనబెడితే మాత్రం.. కొన్ని నిజాల్ని స్వయంగా నాగార్జున ముందే ఒప్పేసుకుంది. కాకపోతే హోస్ట్‌కే బొమ్మ చూపించింది. శోభా ట్రాపులో నాగార్జున 14వ వారం వీకెండ్‌కి వచ్చేసింది. అంటే మరో వారం రోజుల పాటు షో నడుస్తుంది అంతే. ఈ విషయం శోభాకి కూడా తెలుసు. ఎలానూ కప్ గెలుస్తానని నమ్మకం అయితే లేదు. ఏదైతే అది అయిందని చెప్పి, మొత్తానికే తెగించేసింది. వీకెండ్ వస్తే నాగార్జున.. కచ్చితంగా అడుగుతాడని తెలిసే శివాజీ, యావర్‌తో కావాలనే గొడవలు పెట్టుకుంది. కరెక్ట్‌గా ఆమె ఊహించినట్లే నాగ్.. వీటి గురించే అడిగి శోభా ట్రాపులో పడ్డాడు. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ.. అక్కడే స్ట్రీమింగ్..) ఫేవరిజం నిజమే! శివాజీ సరే.. ఫేవరిజం అని ప్రతిసారి అంటున్నారు. నాక్కూడా క్లారిటీ కావాలని ఆయన్ని అడుగుదామనుకున్నానని శోభా.. నాగార్జునతో శోభా చెప్పింది. మరి టాస్క్ సందర్భంగా ప్రియాంకని నువ్వు ఎంకరేజ్ చేయడం కరెక్టేనా? అని నాగ్ అడిగితే.. అవును ప్రియాంక అంటే ఇష్టం, అందుకే సపోర్ట్ చేశానని శోభా ఒప్పుకొంది. అలా తన బ్యాచ్ అంటే ఫేవరిజం ఉందని పరోక్షంగా అంగీకరించింది. ఇంకా డెప్త్‌గా నాగ్ అడుగుతుండేసరికి.. ఈ వారం నా మైండ్ అంతా డిస్ట్రబెన్స్గా ఉందని చెప్పి మొత్తం సీన్ మార్చేసింది. దీంతో నాగ్ కూడా ఏం అనలేకపోయాడు. శోభాకి అది ముందే తెలుసా? బహుశా శోభాకి కూడా ఈసారి తానే ఎలిమినేషన్ అవుతానని ముందే తెలిసినట్లుంది. అందుకే మొత్తానికే తెగించేసి.. ఏదైతే అది అవుతుందని తెలిసి అందరితో గొడవలు పెట్టేసుకుంది. మరీ ముఖ్యంగా తనని మొదటి నుంచి ఇబ్బంది పెడుతున్న శివాజీ, యావర్‌కి రైట్ లెఫ్ట్ ఇచ్చిపడేసింది. ఈమె దెబ్బకు వీళ్లిద్దరూ అసలు రంగు బయటపడింది. దీని వల్ల శోభా కంటే వాళ్లిద్దరికే డ్యామేజ్ ఎక్కువ ఉండొచ్చు. తీరా వీటన్నింటి గురించి నాగ్ అడిగేసరికి.. మైండ్ డిస్ట్రబ్ అని ప్లేట్ మార్చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో శోభా.. తను అనుకున్నది సాధించినట్లే కనిపిస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు
Bigg Boss 7 Day 96 Highlights: బిగ్ బాస్‌లో ప్రస్తుతం వరుసగా కొట్లాటలు.. గొడవలు.. భారీగానే జరుగుతున్నాయి. మొదటి నుంచి SPY బ్యాచ్‌లో ఎలాంటి గొడవలు లేకుండా గ్రూప్‌గానే గేమ్ ఆడుతూ వస్తున్నారు. అదే విధంగా SPA బ్యాచ్ కూడా గ్రూప్ గేమ్ ఆడుతూనే ఇంత వరకు వచ్చింది. కానీ వీరిలో యూనిటి మాత్రం ఎక్కడా కనిపించలేదు. స్నేహితులం అని చెప్పుకుంటున్న వీరి మధ్య కూడా పొరపచ్చాలు వస్తున్నాయి. శోభపై మాటలు తూలిన శివాజీ.. గొంతుపై కాలేసి తొక్కుతా అంటూ బిగ్ బాస్‌లో ఓట్ అప్పీల్ కోసం ఫన్నీ టాస్క్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే శోభ,అర్జున్ ఓట్ అప్పీల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఓట్ అప్పీల్ కోసం జరుగుతున్న ఫన్సీ గేమ్స్‌లో శివాజీ,శోభ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో శివాజీ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరంగా ఉన్నాయి. ఒకానొక సమయంలో బాల్ టాస్క్ ఆడలేనని చెప్పి బయటకు వచ్చేస్తాడు. అసలు శివాజీ ఆడేదే కన్నింగ్ గేమ్.. యావర్, ప్రశాంత్‌ను వెంటేసుకుని ఇతరులపై నాలుగు పిచ్చి మాటలు విసురుతాడు. కానీ ఎప్పుడూ కూడా శివాజీపై బిగ్ బాస్ కిమ్మనడు. దీనినే అలుసుగా తీసుకున్న శివాజీ తాజాగా జరిగిన బాల్ టాస్క్ విషయంలో శోభపై ఫైర్ అవుతాడు. చిల్లరోళ్లు, క్యారెక్టర్ లెస్, మేము పీకేదానికి ఉన్నామా..? అంటూ శివాజీ రెచ్చిపోతాడు. రేపు శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో... వాడు భయపడిపోడా..? అంటూ అవసరం లేని మాటలు శివాజీ వాగుతాడు. పెళ్లి తర్వాత ఇలాగే ఉంటే అంటూ టాపిక్కు సంబంధంలేని వ్యాఖ్యాలు చేశాడు శివాజీ. ప్రియాంక, శోభను ఉద్దేశిస్తూ.. ఇలాంటి ఆడపిల్లలను ఎక్కడా చూడలేదు.. అదే మన ఇంట్లో ఇలాంటి వాళ్లుంటే గొంతుమీద కాలు వేసే తొక్కేవాడినంటూ నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ఇదే క్రమంలో శివాజీని కూడా శోభ పదేపదే ట్రిగ్గర్ చేస్తూ మాట్లాడుతుంది. దానిని సంహించలేని శివాజీ ఇలా వ్యక్తిగతంగా మాట్లాడటం ఏ మాత్రం కరెక్ట్ కాదని చెప్పవచ్చు. ఓట్ అప్పీల్ చేసుకున్న శివాజీ ఓట్ అప్పీల్ చేసుకునేందుకు అర్జున్. శివాజీ పోటీ పడుతారు. అప్పటికే అర్జున్ ఓట్ అప్పీల్ చేసుకోవడం వల్ల హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరూ శివాజీకే ఓట్ అప్పీల్ అవకాశం దక్కేలా సపోర్ట్ చేస్తారు. తర్వాత ఆయన ఓట్ అప్పీల్ చేసుకుంటాడు. తన గేమ్ నచ్చితే ఓట్ వేయాలని ఆయన కోరుతాడు. SPA బ్యాచ్‌లో గొడవలకు కారణమైన శోభ బిగ్ బాస్‌లో ఒక యాడ్‌కు సంబంధించిన టాస్క్‌లో అమర్, శోభ మధ్య గొడవ జరుగుతుంది. హౌస్‌లో రెండు గ్రూపులుగా డివైడ్ చేసి.. ఒక బ్యాచ్‌లో ప్రియాంక, శివాజీ, ప్రశాంత్ ఉంటారు. మరోక బ్యాచ్‌లో శోభ,యావర్,అర్జున్ ఉంటారు. సంచాలక్‌గా అమర్ ఉంటాడు. వీరికి ఇచ్చిన టాస్క్‌లో వండర్ ఉమెన్‌గా ప్రియాంకను విన్నర్‌గా ప్రకటిస్తాడు అమర్ దీంతో శోభకు కోపం రావడం.. ఆపై అమర్ నిర్ణయాన్ని తప్పుపట్టిన శోభ గొడవకు దిగుతుంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పవచ్చు. అక్కడ గెలిచింది ప్రియాంకనే కదా... మనం అనే విషయాన్ని మరిచిపోయి అమర్‌తో గొడవకు దిగుతుంది. అప్పుడు అమర్ కూడా పక్కన వాళ్లను చూసి నేర్చుకో ఎలా ఉండాలో అని చెబుతాడు. ఇలా SPA బ్యాచ్‌లో చిచ్చు పెట్టిన వ్యక్తిగా శోభ మిగిలిపోయింది. Sivaji crossed all the limits today. 40 seconds of utter garbage🤮 Ammayila character nunchi valla marriage life varaku neechamga dhigajaaripoyi maatladadu @StarMaa @iamnagarjuna#Sivaji #BiggBoss7Telugu#biggbosstelugu7 pic.twitter.com/SK59Km9Xo4 — Betty🌶️ (@BinduFanBettyyy) December 8, 2023 -
సైకోలా మారిన అమర్దీప్.. టైటిల్ రేసులో నుంచి అవుట్..
ఎంత కష్టపడ్డా ప్రతిఫలం దక్కట్లేదు.. చేతి దాకా వచ్చింది నోటి దాకా రావట్లేదు.. అదృష్టం కలిసి రావట్లేదు.. అంటూ ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు అమర్దీప్. ఈ నెగెటివ్ ఫీలింగ్ పోగొట్టడానికి బిగ్‌బాస్, నాగార్జున సైతం గత వారం అమర్ ఆటతీరు అద్భుతంగా ఉందని, అందుకు బహుమతిగా కెప్టెన్సీని అనుభవించమని బంపరాఫర్ ఇచ్చాడు. కానీ అమర్ ఏం చేస్తున్నాడు? హౌస్‌మేట్స్‌తో సరిగా పనులు చేయించుకోలేకపోతున్నాడు. కొందరికి ఎక్కువ పనులు, కొందరికి తక్కువ పనులు అప్పజెబుతుండటంతో ఇంటిసభ్యులు అమర్ కెప్టెన్సీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్సీ బ్యాడ్జ్‌తో మొదలైంది.. అటు నామినేషన్స్‌లోనూ నేను కెప్టెన్‌ను చెప్తున్నా.. కూర్చో అని కాస్త రూడ్‌గా మాట్లాడాడు. ఇక ఎప్పుడైతే అమర్ కెప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టుకున్నాడో.. అప్పుడే అతడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. వరుస కొట్లాటలు.. గొడవలు.. ఆఖరికి స్నేహితుల మధ్య కూడా పొరపచ్చాలు. అంతకుముందు వరకు సరదాగా ఉండే అమర్ ఈ వారం మాత్రం కంట్రోల్ తప్పిపోయాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకు గొడవపడుతున్నాడు? అన్న స్పృహ కూడా లేకుండా పోయింది. చేతులారా తన ఆటను తానే చెడగొట్టుకుంటున్నాడు. మొన్నటి వరకు విన్నర్ రేసులో ఉన్న అతడి గ్రాఫ్ నిన్నటి ఒక్క ఎపిసోడ్‌తో పాతాళానికి పడిపోయింది. కొడుతూ, తిడుతూ, కొరికేస్తూ.. ఏంటీ అరాచకం? నిజానికి ఏ సీజన్లో అయినా అప్పటిదాకా కొట్టుకున్న కంటెస్టెంట్లు కూడా ఫినాలే దగ్గరపడగానే అంతా మర్చిపోయి కలిసిపోతారు. కానీ ఈ సీజన్లో మాత్రం గొడవలు ముదురుతున్నాయే తప్ప చల్లారడం లేదు. నిన్నటి ఎపిసోడ్లో అయితే అమర్దీప్ రైతుబిడ్డ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. అతడిని తిడుతూ, కొడుతూ.. ఒరేయ్ అని పిలుస్తూ సైకోలా మారిపోయాడు. చెప్పుతో కొడతానంటూ సంజ్ఞ చేశాడు. పైగా కోపంతో ప్రశాంత్‌ను పంటితో కొరికేశాడు. ఇలా కొరుకుతున్నావేంటన్నా అని ప్రశాంత్ అడిగిన పాపానికి అతడిని మెడికల్ రూమ్‌కు తోసుకుంటూ, నెట్టేస్తూ, లాక్కెళ్తూ హీనంగా ప్రవర్తించాడు. ఎందుకంత చులకన? తోయకు అన్నా.. వద్దన్నా.. అని ప్రశాంత్ ఎంత అర్థిస్తున్నా వినకుండా అతడి మీద చేయి చేసుకుంటూ, చులకనతో నెట్టేస్తూ అతి చేశాడు. ఇది చూసిన జనాలు అమర్‌ను ఏకిపారేస్తున్నారు. 'అమర్‌కు ప్రశాంత్ అంటే ఎందుకంత చులకనభావం?', 'ఒక వ్యక్తి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా?', 'ఇలాంటి వ్యక్తికి నాగార్జున రెడ్ కార్డ్ చూపించి ఎలిమినేట్ చేయాలి' అని ఆగ్రహిస్తున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్‌తో అమర్ గెలుపు దాదాపు దూరమైనట్లే! ప్రశాంత్ విజయానికి మరో అడుగు ముందుకు పడినట్లే! #BiggBossTelugu7#Biggboss7Telugu Amar inthakante digajaradu anukunna prathi sari antha kante worst ga behave chestunnadu. Dear @StarMaa and @iamnagarjuna, its rigt time to show RED card to this worst fellow #Amardeep pic.twitter.com/RKgUYvdx9L — 🦋🅺🆄🆂🆄🅼🅰🦋 (@KusumaAllada) December 7, 2023 Poorthiga pichhodi la maripotunna #amardeep 👍🏻#BiggBossTelugu7 pic.twitter.com/9pAVafq3h7 — MK (@MK99086) December 7, 2023 చదవండి: అమర్దీప్ ఫ్యాన్స్ గలీజ్ మాటలు.. కాళ్లు మొక్కుతానంటూ కీర్తి ఎమోషనల్ -
నా జీవితంతో ఆడుకోకండి.. మీ అమ్మతోనే నడిరోడ్డుపై కొట్టిస్తా: కీర్తి
బిగ్‌బాస్ హౌస్‌లో కొట్లాటలు కామన్.. వీరు గొడవపడ్తారు అంతలోనే మళ్లీ కలిసిపోతారు. కానీ బయట జరిగే కొట్లాటలు, గొడవలు, వివాదాలు మాత్రం అంతకుమించి అన్నట్లుగానే ఉంటాయి. సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్స్ వార్‌కు అయితే లెక్కే లేదు. అయితే కంటెస్టెంట్లను విమర్శించి, అక్కడితో ఆగకుండా వారి కుటుంబాలను కూడా గొడవలోకి లాగుతున్నారు. అసభ్యపదజాలంతో దూషిస్తున్నారు. గౌతమ్‌కు సపోర్ట్ చేయడమే పాపమైపోయింది! పొరపాటున ఏ సెలబ్రిటీ అయినా తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేయట్లేదని తెలిస్తే ఇక అంతే సంగతులు. బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి భట్.. ఇటీవల ఎలిమినేట్ అయిన గౌతమ్ కృష్ణకు సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. అతడికి వెల్కమ్ చెప్తూ జరిపిన సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. అంతే.. సీరియల్ బ్యాచ్‌కు కాకుండా గౌతమ్‌కు మద్దతు తెలపడంతో అమర్దీప్ ఫ్యాన్స్ ఆమెను పచ్చిబూతులు తిడుతూ వేధిస్తున్నారట. దీంతో ఆవేదనకు గురైన కీర్తి సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. సోలోగా ఆడేవారికే నా సపోర్ట్ 'కొద్ది రోజుల నుంచి నాకు చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన గౌతమ్ కృష్ణ సెలబ్రేషన్స్‌కు నేను వెళ్లాను. అప్పుడు ఇంటర్వ్యూలు అడిగితే ఇచ్చాను. అందులో ఎవరి గురించీ చెడుగా మాట్లాడలేదు. కానీ అమర్ ఫ్యాన్స్ కొందరు నన్ను చెండాలమైన బూతులు తిడుతున్నారు. నీ తల్లి కూడా ఒక ఆడదే కదా.. నేను బిగ్‌బాస్ హౌస్ లోపల ఉన్నప్పుడు ప్రియాంక, మానస్, మహేశ్ తప్ప నాకెవరూ సపోర్ట్ చేయలేదు. సోలోగా ఎవరు ఆడతారో వారికే నేను సపోర్ట్ చేస్తున్నాను. ఒక్కొక్కరికీ ఒక్కొక్కరు నచ్చుతారు. గౌతమ్ నాకు ముందునుంచీ పరిచయమే లేదు. తను ఒంటరిగా ఆడటం నచ్చింది.. అందుకే తన దగ్గరకు వెళ్లి సపోర్ట్ చేశా.. నా జీవితంలో నాకు నచ్చింది చేస్తాను. ఎందుకిలా వేధిస్తున్నారు? నడిరోడ్డుపై కొడతా మీకు దండం పెడతా.. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఫ్యాన్స్ అన్న పేరుతో ఇతరులను బాధపెట్టకండి. ఇంత గలీజ్‌గా మాట్లాడొద్దు. నా తప్పుంటే మీ అందరి కాళ్లు మొక్కుతా.. తప్పు లేదంటే మాత్రం అస్సలు ఊరుకోను. సోషల్ మీడియాలో అలాంటి కామెంట్లు పెడుతుంటే చూసి చాలా హర్ట్ అవుతున్నాను. నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? అమ్మాయిలను గౌరవించండి. లోపల ఉన్న నలుగురి స్నేహితులకు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాను. అది మీకేం తెలుసు? నా తిండి నేను తింటున్నాను. ఎవరి దగ్గరా అడుక్కోవట్లే.. నేను తిని నలుగురికి ఇస్తున్నాను. వీలైతే మీరు సాయం చేయండి. ఎవరు ఏ ఐడీ నుంచి మెసేజ్‌లు పెడుతున్నారో అవన్నీ ట్రాక్ చేసి మీరెక్కడున్నా వచ్చి నడి రోడ్డుపై కొడతా.. మీ అమ్మతోనే కొట్టిస్తా..' అని ఆగ్రహించింది కీర్తి భట్. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) చదవండి: స్టార్ హీరోతో బెడ్రూమ్ సీన్... ఆ అత్యాచార సీన్ కంటే బెటరేనన్న బ్యూటీ -
కంట్రోల్ తప్పిన అమర్.. ప్రశాంత్‌ను కొరికి నెట్టేస్తూ..
బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్లో 94 రోజులు గడిచిపోయాయి. దాదాపు శుభం కార్డు పడే సమయం వచ్చేసింది. ఉల్టా పుల్టా పేరుతో వచ్చిన ఈ సీజన్ పేరుకు తగినట్లే జరిగింది. ఒక ఎపిసోడ్లో ఫైర్ ఉంటే.. మరో ఎపిసోడ్లో ఫన్ ఉంటుంది. కానీ ఒక్కోసారి ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. గురువారం ఎపిసోడ్ అయితే అమర్, ప్రశాంత్ మధ్య మాటల యుద్ధమే నడిచింది. Day 95 హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. అమర్ Vs అర్జున్ టాస్క్‌లో భాగంగా ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించాడు. అందుకు రీచ్ కావాలంటే కొన్ని ఫన్ టాస్క్‌లలో గెలవాలని రూల్ పెట్టాడు. వాటిలో అమర్, అర్జున్ ఇద్దరూ గెలిచి ఓట్ అప్పీల్ రేసులోకి వచ్చారు. వారిద్దిరిలో ఒకరిని ఎంపిక చేసి ఓట్ అప్పీల్ అవకాశం ఎవరికి కల్పిస్తారో అనే అంశాన్ని మాత్రం ఓట్ల ప్రాతిపదికన కంటెస్టెంట్ల చేతిలో పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఎక్కువ ఓట్లు అర్జున్‌కు రావడంతో ఆయన ఓట్ అప్పిల్ చేసుకున్నాడు. యావర్,పల్లవి ప్రశాంత్, శివాజీ ముగ్గురూ అర్జున్‌కు సపోర్ట్ చేస్తే... శోభ,ప్రియాంక ఇద్దరూ అమర్‌కు సపోర్ట్ చేశారు. దీంతో అర్జున్‌కు మెజారిటీ వచ్చింది. ఈ ఓటింగ్ విషయంలో కూడా SPY బ్యాచ్‌లోని ముగ్గురితో అమర్ చిన్నపాటి గొడవకు దిగాడు. దీనికి ప్రధాన కారణం అతను ఈ వారం ఎలిమినేషన్లో ఉండటం... అర్జున్ లేకపోవడం. దీంతో ఓట్ అప్పీల్ అవకాశం తనకు కల్పించాలని అమర్ బలంగా కోరాడు కానీ SPY బ్యాచ్ ఈ విషయంలో అమర్‌కు ఎలాంటి సాయం చేయలేదు. శోభ ట్రాప్‌లో యావర్.. ఛీ.. ఛీ.. అంటూ ఫైర్ ఓట్ అప్పీల్ కోసం మరో టాస్క్‌ను బిగ్ బాస్ ఇచ్చాడు. హౌస్‌లోని కంటెస్టెంట్లు అయిన అందరికీ టీ షర్ట్స్ ఇస్తాడు బిగ్ బాస్. ఒక బార్డర్ లైన్లో వారందరూ ఉంటూ వారి వద్ద ఉన్న బాల్స్‌ను తను ప్రత్యర్థులు అనుకున్న వారిపై విసరాలి.. అవి ఎవరి టీ షర్ట్‌కు ఎక్కువగా అంటుకుంటాయో వారు ఆ రౌండ్ నుంచి ఎలిమినేషన్ అయినట్లు అని రూల్స్ పెడుతాడు బిగ్ బాస్. ఈ క్రమంలో మొదట శోభపై యావర్ అటాక్ స్టార్ట్ చేస్తాడు. అదే సమయంలో ఆమె కూడా అతనిపై ఫైట్ చేస్తుంది. ఈ సమయంలో యావర్ కోపంతో రెచ్చిపోయి శోభపై ఫైర్ అవుతాడు. కానీ శోభ చాలా తెలివిగా యావర్‌ను బార్డర్ లైన్ దాటేలా చేస్తుంది. కావాలనే ఆట నుంచి ఆమె బయటకు వస్తుంది. కోపంలో ఉన్న యావర్ అదేమి గమనించకుండా లైన్ క్రాస్ అవుతాడు. దీంతో బిగ్ బాస్ ఇద్దరినీ ఎలిమినేట్ చేస్తాడు. అప్పుడు యావర్ కంట్రోల్ తప్పిపోయి శోభపై ఛీ.. ఛీ.. ఛీ.. అంటూ రెచ్చిపోతాడు. పదే పదే అదే మాటను యావర్ ఉపయోగించడం చాలా తప్పుగా ఉంటుంది. చివరకు శివాజీ కూడా యావర్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. కంట్రోల్ తప్పిన అమర్.. పల్లవి ప్రశాంత్ సూపర్ ఇదే బాల్ టాస్క్‌లో అమర్ Vs పల్లవి ప్రశాంత్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. గేమ్‌లో భాగంగా మొదట ప్రశాంత్ వద్దకు అమర్ వెళ్తాడు. ఇద్దరూ టాస్క్‌లో ఫిజికల్ అవుతారు. ఈ క్రమంలో అమర్ గొంతును ప్రశాంత్ పట్టుకుంటే.. అతని చెయిని అమర్ కొరుకుతాడు. కానీ అది ఆటలో అనుకోకుండా జరిగినట్లు భావించవచ్చు. కానీ ఇదే విషయంలో ఇద్దరూ మాటకు మాట పెరుగుతుంది. ఎవరు ఎవర్నీ కొట్టారో తెలుసుకోవాలంటే మెడికల్ రూమ్‌కు పోదాం పదండి అన్నా అంటూ ప్రశాంత్ అంటాడు. ఆ సమయంలో అమర్ కంట్రోల్ తప్పుతాడు. ఎదుట ఉండేది ఒక కంటెస్టెంట్ అనే విషయాన్ని అమర్ మరిచిపోయినట్లు ఉన్నాడు. ప్రశాంత్ వీపుపై చెయ్యి పెట్టిన అమర్ పదే పదే తోస్తూ మెడికల్ రూమ్‌కు పదా అంటూ నెట్టేస్తాడు. ఆ సమయంలో ప్రశాంత్ పట్ల అమర్ చాలా రూడ్‌గా ప్రవర్తించాడు. తన గొంతును గట్టిగా పట్టుకున్నాడని చెప్పుకొస్తున్న అమర్ కంట్రోల్ తప్పి భారీగానే రెచ్చిపోయాడు. ప్రశాంత్, ఆమర్ మధ్య చాలా సేపు మాటలు యుద్ధం జరిగింది. కానీ ఎక్కడా కూడా ప్రశాంత్ కంట్రోల్ తప్పి మాట్లడలేదు.. పదే పదే అమర్‌ను అన్నా అంటూ తన వాదనను చెప్పుకొస్తున్నాడు. కానీ అమర్ మాత్రం రెచ్చ గొట్టకు రా అంటూ ప్రశాంత్‌పై ఫైర్ అవుతున్నాడు. తనను తాను ఏ మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయిన ఆమర్ పూర్తిగా ట్రాక్ తప్పాడు. ఆ సమయంలో అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా గ్రహించలేకపోయాడు.. అలా కోపంలో ఉన్న అమర్‌ను చూస్తే ఎవరికైనా భయం వేయడం ఖాయం. అంతలా కంట్రోల్ తప్పాడు.. ఆ కోపంలో ఒకానొక సమయంలో ఏమైనా చేసుకుంటా అంటూ రెచ్చిపోయాడు. ఈ విషయంలో అతనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. -
Bigg Boss 7: రైతుబిడ్డకు ఇచ్చిపడేసిన అర్జున్.. దెబ్బకు సైలెంట్!
బిగ్‌బాస్ 7వ సీజన్ అయిపోవడానికి ఇంకా 10 రోజులే ఉంది. ఇలాంటి టైంలో షోని ఎంత ఇంట్రెస్ట్‌గా డిజైన్ చేయాలి. కానీ నిర్వహకులకు అలాంటి ఆలోచనే లేనట్లు ఉంది. ఎందుకంటే మంగళవారం ఎపిసోడ్ అంతంత మాత్రంగా ఉంది. తాజాగా బుధవారం ఎపిసోడ్ అయితే ఏ విషయంలోనూ అలరించలేకపోయింది. కొద్దొగొప్పో అర్జున్-ప్రశాంత్ గొడవ మాత్రమే ఆసక్తిగా అనిపించింది. ఇంతకీ లేటెస్ట్గా ఏం జరిగిందనేది Day 94 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' టైటిల్ విజేత రేసులో ఆ ముగ్గురు.. కానీ?) అర్జున్ కేక్ టాస్క్ శోభా.. ఓటు అప్పీలు చేసుకోవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ప్రియాంక-శోభా-అమర్.. కాసేపు తమలో తామే వాదించుకున్న తర్వాత ఊరుకున్నారు. కాసేపటి తర్వాత 2 కిలోల కేక్ పంపించి, అర్జున్ ఒక్కడే దీన్ని తినాలని బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. కొంత తిన్నాడు, ఆ తర్వాత వల్ల కావట్లేదనేసరికి ఎవరిదైనా సహాయం తీసుకుంటారా అని అడగ్గా.. యావర్ పేరు చెప్పాడు. అలా వీరిద్దరూ కేక్ మొత్తం తినేశాడు. దీంతో రేపు(గురువారం).. ఇంటి సభ్యుల కోసం కేక్ పంపిస్తానని బిగ్‌బాస్ చెప్పాడు. పిల్లలని ఆడించే గేమ్ ఎపిసోడ్‌ని ఎలా టైమ్ పాస్ చేయాలా అని బాగా ఆలోచించిన బిగ్‌బాస్.. తనకు కవల పిల్లలు ఉన్నారని, నేను బయటకెళ్లి వచ్చేలేపు కాసేపు వాళ్లని ఆడించాలని చెప్పాడు. అందుకోసం రెండు చిన్నపిల్లల బొమ్మల్ని పంపించాడు. అయితే ఇందులో అర్జున్ ఒక్కడే కాస్త ఎంటర్టైన్ చేశాడు. మిగతా వాళ్లందరూ చేతులెత్తేశారు. దీని తర్వాత 'చెర్రీ ఆన్ ద టాప్' అని ఓ గేమ్ పెట్టి, ఇందులో భాగంగా చెర్రీ పండు పడిపోకుండా ఇసుకతో చేసిన కేక్, ఒక్కొక్కరుగా కట్ చేయాలని అన్నాడు. ఇందులో విజేతగా నిలిచిన అమర్.. ఓటు అప్పీలు చేసుకునే ఛాన్సుకు దగ్గరయ్యాడు. (ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) అర్జున్-ప్రశాంత్ గొడవ ఇక ఓటు అప్పీలు చేసుకునేందుకు మరో గేమ్ ఉందని, కాకపోతే దీన్ని ఒక్కరే ఆడాల్సి ఉంటుందని.. దీనికోసం ఎవరైతే ముందుగా గంట మోగిస్తారో వాళ్లకు ఛాన్స్ దక్కుతుందని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే గంట మోగించాలని పరుగెత్తే క్రమంలో అర్జున్.. చేతుల వెనక్కి ఊపుతూ వేగంగా పరుగెత్తాడు. పోటీలో గెలిచి టాస్క్ కూడూ పూర్తి చేశాడు. అయితే పరుగెత్తే క్రమంలో అర్జున్ చేయి, అతడి పక్కనే ఉన్న ప్రశాంత్‌ని కాస్త గట్టిగా తగిలేసినట్లు ఉంది. దీంతో రైతుబిడ్డ నానా హంగామా చేశాడు. ఎందుకు ఆపేశావ్ అన్నా అని గట్టిగట్టిగా అరిచాడు. దీంతో ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే అర్జున్ కూడా రెచ్చిపోయాడు. నిన్న(మంగళవారం).. పూల్‌లో డ్యాన్స్ చేసే టాస్క్ కోసం పరుగెత్తినప్పుడు నీ చేయి నాకు తగిలింది, నేను అడిగానా? అని లాజిక్ మాట్లాడాడు. రైతుబిడ్డ దగ్గర ఆన్సర్ లేదు. అర్జున్.. నిన్నటి దాని గురించి అడుగుతుంటే ప్రశాంత్ మాత్రం ఇప్పటి దాని గురించి పదేపదే అడిగాడు. అర్జున్ మరింత గట్టిగా లాజిక్స్ మాట్లాడేసరికి ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు. ఇక అర్జున్, అమర్.. వీళ్లిద్దరిలో ఓటు అప్పీలు చేసుకునే ఛాన్స్ ఎవరికి దక్కిందనేది గురువారం ఎపిసోడ్లో తేలుస్తుంది. (ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?) -
'బిగ్‌బాస్ 7' టైటిల్ విజేత రేసులో ఆ ముగ్గురు.. కానీ?
బిగ్‌బాస్ 7వ సీజన్ చివరకొచ్చేసింది. ప్రస్తుతం 14వ వారం నడుస్తోండగా, మరో 10 రోజుల్లో షో పూర్తి అయిపోతుంది. ఈ క్రమంలోనే విన్నర్ ఎవరవుతారనే కుతుహలం ఉండటం పక్కా. అందుకు తగ్గట్లే నిర్వహకులు.. ఉన్న ఏడుగురితో గేమ్స్ అవీఇవీ అని టైమ్ పాస్ చేస్తున్నారు. కానీ టైటిల్ రేసులో మాత్రం ముగ్గురే ఉన్నారు. (ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) మిగతా సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్‌బాస్ అనుకున్నంత ఇంట్రెస్ట్ లేకుండానే సాగుతోంది. శివాజీ బ్యాచ్, సీరియల్ బ్యాచ్.. ఒకరిపై ఒకరు అరుచుకోవడం తప్పితే ఓ ఎంటర్టైన్మెంట్ సరిగా లేదు, ఓ లవ్ ట్రాక్ లేదు. ఎమోషనల్‌గా ఫీలయ్యే సంఘటన లేదు. ఎలాగోలా ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేస్తున్నారు తప్పితే చాలా బోర్ కొట్టించేస్తున్నారు. ఏదైతేనేం షో చివరకు వచ్చేశాం. విజేత ఎవరనేది మరో 10 రోజుల్లో తేలిపోతుంది. అయితే గడిచిన వీకెండ్ సందర్భంగా నిర్వహకులు ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఈ రెండు వారాలు కూడా ఓటింగ్ లైన్స్ తెరుచుకునే ఉంటాయని, ఎక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్.. బిగ్‌బాస్ 7 విజేతగా నిలుస్తారని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఓటింగ్ నంబర్స్ చూసుకుంటే.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ 34 శాతం ఓట్లతో టాప్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?) ప్రశాంత్ తర్వాత శివాజీ, అమర్దీప్ దాదాపు 20 శాతం ఓటింగ్ పర్సంటేజ్‌తో ఉన్నారు. ఆ తర్వాత వరసగా యావర్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్టులోని తొలి ముగ్గురిలోనే స్థానాలు అటుఇటు మారాలి తప్పితే మిగతా వాళ్లు.. టాప్-3లోకి వచ్చే ఛాన్సులు తక్కువ. అంటే ప్రశాంత్, శివాజీ, అమర్‌లలో ఎవరో ఒకరే విజేత అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే విజేత అని బిగ్‌బాస్ నిర్వహకులు చెప్పారు. కానీ రాబోయే 10 రోజుల్లో ఏమైనా జరగొచ్చు. లెక్కలు మార్చొచ్చు. ఎన్ని లెక్కలు మారినా సరే ప్రశాంత్ లేదంటే అమర్ విజేత అయితే పెద్దగా సమస్య ఉండదు. శివాజీకి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మిగతావాళ్లతో పోలిస్తే.. మనోడు చాలా విషయాల్లో పూర్. ఏదో మాటలతో లాక్కోచ్చేస్తున్నాడు అంతే! ఏదైతేనేం టైటిల్ కోసం పోటీ మంచిగా నడుస్తోంది. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారని మీరనుకుంటున్నారు? (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!) -
Bigg Boss 7: అపరిచితుడులా ప్రవర్తిస్తున్న అమర్.. ప్రియాంకతో అలాంటి సిల్లీ గొడవ!
బిగ్‌బాస్ 14వ వారం నామినేషన్స్ ఒకేరోజులో పూర్తయ్యాయి. కానీ అమర్-ప్రశాంత్ గొడవ మాత్రం రాత్రంతా నడుస్తూనే ఉంది. 'ఓట్ ఫర్ అప్పీల్' అనే టాస్క్ పెట్టిన బేసిక్ లాజిక్ మర్చిపోయి మరీ ప్రేక్షకుల్ని పిచ్చోళ్లని చేశాడు. శోభా అయితే ఓటు అడిగే విషయంలో అవసరం లేకపోయినా సరే ఎమోషనల్ అయిపోయింది. ఇంతకీ మంగళవారం ఏం జరిగిందనేది Day 93 హైలైట్స్‌లో చూద్దాం. రైతుబిడ్డ ఎదురుదెబ్బ నామినేషన్స్‌లో అర్జున్ తప్ప మిగతా వాళ్లంతా ఉన్నారని బిగ్‌బాస్ చెప్పడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. నామినేషన్స్‌లో భాగంగా 'అమ్మాయిలా మాట్లాడుతున్నావ్' అని అర్థమొచ్చేలా ప్రశాంత్, అమర్‌తో అన్నాడు. తననే 'ఆడోడు' అని అంటావా? అని అమర్.. అదే పదాన్ని పదేపదే చెబుతూ ప్రశాంత్‌ని రెచ్చగొట్టాడు. సెటైర్స్ కూడా వేశాడు. కాసేపటి తర్వాత ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో హిట్ సినిమా) ఓటు అప్పీలుకు ఛాన్స్ చిల్ పార్టీ పేరుతో కొన్ని గేమ్స్ ఉంటాయని చెప్పిన బిగ్‌బాస్.. ఇందులో గెలిచిన వాళ్లకు ఓటు అడిగే ఛాన్స్ దక్కుతుందని చెప్పాడు. అలా పాట ప్లే కాగానే.. బెంచ్‌పై వస్తువుల్లో ఒకదాన్ని తీసుకుని స్విమ్మింగ్ పూల్‌లో దూకాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ పోటీలో చివరివరకు నిలిచిన యావర్ విజేతగా నిలిచాడు. ఇక కలర్స్ జంపింగ్ గేమ్‌లో అందరూ తడబడ్డారు కానీ శోభా చివరివరకు ఉండి విన్నర్ అయింది. అమర్ కాదు అపరిచితుడు ఈ గేమ్ అయిపోయిన తర్వాత శోభా, ఓ టెడ్డీ బేర్ తీసుకుని రూంలోకి వచ్చింది. అక్కడే అన్న అమర్-ప్రియాంకతో కాసేపు మాట్లాడింది. ఆ తర్వాత ప్రియాంక.. సరదాగానే తలగడతో అమర్ ముఖంపై కొట్టింది. సీరియస్ అయిపోయిన అమర్.. అలిగి బయటకెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత లోపలికి వచ్చాడు. అప్పుడు ప్రియాంక-శోభా లేచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి హర్ట్ అయిన అమర్.. ఏమైంది? మాట్లాడకపోతే మాట్లాడొద్దు అని ప్రియాంకపై సీరియస్ అయ్యాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి!) అమర్ అలా అనేసరికి ప్రియాంక ఊరుకోలేదు. రిటర్న్‌లో గట్టిగానే ఇచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావ్? అదీ ఇదీ అని అమర్‌కి ఆన్సర్ ఇచ్చింది. బొమ్మలకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయింది, స్ట్రెయిట్‌గా చేయాల్సిన పని స్ట్రెయిట్‌గా చేయవ్ అని అమర్, ప్రియాంకని ఉద్దేశిస్తూ అన్నాడు. ఎందుకు గతవారం జరిగిన విషయాన్ని ఇప్పుడు తీస్తున్నావ్ అని ప్రియాంక రెచ్చిపోయింది. ఈ గొడవలోకి ఎంటరైన శోభా.. మా ఇద్దరి మీద నీకో ఏదో ఉంది, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావ్ అని అమర్‌కి కౌంటర్ ఇచ్చింది. అయితే ఇదంతా కూడా కంటెంట్ ఇవ్వాలని చేశారా అనే సందేహం వచ్చింది. ఎందుకంటే ఈ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత అర్జున్ మాట్లాడుతూ.. టైమ్ పాస్ కావట్లేదా మీ ముగ్గురికి? అని చిన్న సెటైర్ వేసి నవ్వేశాడు. ఓటు ఫర్ అప్పీలు టాస్క్ పోటీల్లో గెలిచిన యావర్, శోభా.. ఇద్దరు కూడా 'ఓటు ఫర్ అప్పీలు' చేసుకోవాలని, కాకపోతే ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశముంటుందని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. శోభాకి తక్కువ ఓట్లు పడిన కారణంగా.. అప్పీలు చేసుకునే ఛాన్స్ ఆమెకి దక్కింది. దీంతో.. 'అందరికీ నమస్కారం. నేను 'కార్తీకదీపం' మోనితగానే మీకు తెలుసు. బిగ్‌బాస్‌లో చూసేవాళ్లకు శోభాశెట్టిగా తెలుసు. ఇక్కడ మీరు నాకు చాలాచాలా సపోర్ట్ చేశారు. ఈ రోజు నా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉన్నాం. కడుపు నిండా తింటున్నాం అంటే మీ అందరీ సపోర్ట్ కారణం. థ్యాంక్యూ సోమచ్ ఫర్ ద సపోర్ట్. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఎలిమినేషన్ హింట్ ఇచ్చేసిన బిగ్‌బాస్.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్?) 6వ సీజన్ వరకు అబ్బాయిలే గెలిచారు. సీజన్ 7లో నేను గెలవాలి, టైటిల్ కొట్టుకుని వెళ్లాలి. ఈ సీజన్ లో ఉల్టా పుల్టాలో అమ్మాయిగా నేను గెలవాలి అనేది ఒకత్తైతే.. బిగ్‌బాస్ గెలిస్తే వచ్చే అమౌంట్ గానీ వేరే ఏదైతే ఉందో నాకు చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేసుంటే ప్లీజ్ క్షమించండి. ప్లీజ్ ఓటు చేయండి' అని శోభా.. ప్రేక్షకుల్ని ఓట్లు అడుక్కుంది. ఇక ఓటు ఫర్ అప్పీలు టాస్క్‌లో ఏ ఒక్కరు ఉండాలని.. ఇంటి సభ్యులు డిసైడ్ చేస్తున్న టైంలో ప్రియాంక-శోభా మధ్య చిన్నపాటి వాదన జరిగింది. యావర్ నువ్వు నెక్స్ట్ గేమ్‌లో గెలిచి, మళ్లీ ఈ ప్లేసులో నిల్చుంటావ్! అందుకే నేను శోభాకి ఇవ్వాలనుకుంటున్నాని ప్రియాంక కారణం చెప్పింది. అంటే నేను వీక్‌గా ఉన్నానా.. ప్రియాంక మాటల్ని నెగిటివ్‌గా తీసుకుంది. దీంతో కాసేపు గొడవ జరిగింది. ఈ రోజు ఎపిసోడ్లో మిగతా సోది అంతా పక్కనబెడితే సీరియల్ బ్యాచ్ ప్రవర్తన మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది. అప్పుడే గొడవ పడతారు. అప్పుడే కలిసిపోతారేంట్రా బాబు అనిపించింది. అలానే ఎక్కడైనా గేమ్స్ లో ఓడిపోతే ఓట్లు అడుక్కుంటారు. ఈరోజు మాత్రం ఓ పోటీలో గెలిచిన శోభనే ఓట్ల కోసం ప్రాధేయపడటం విడ్డూరంగా అనిపించింది. మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!) -
Bigg Boss 7: ఎలిమినేషన్ హింట్ ఇచ్చేసిన బిగ్‌బాస్.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్?
బిగ్‌బాస్ 7 చివరకొచ్చేసింది. 14వ వారానికి సంబంధించిన నామినేషన్స్ పూర్తయ్యాయి. దీంతో ఈ వారం బిగ్‌బాస్ ఏం ప్లాన్ చేశాడా? అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో అసలైన ఫిట్టింగ్ పెట్టేశాడు. ఎలిమినేషన్ గురించి చిన్న హింట్ కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా, ఇది సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. టాస్క్‌తో బిగ్‌బాస్ ట్విస్ట్ 'టికెట్ టూ ఫినాలే' పోటీలో గెలిచి ఫైనలిస్ట్ అయిన అర్జున్.. చిట్టచివరి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. ఇతడు తప్పితే మిగతా ఆరుగురు(అమర్, ప్రశాంత్, శోభా, ప్రియాంక, యావర్, శివాజీ).. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. రాబోయే రెండు వారాలకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోయాయని చెప్పిన బిగ్ బాస్.. తక్కువ ఓట్లు వచ్చిన చివరి వ్యక్తి 14వ వారం ఎలిమినేట్ అయిపోతాడని నామినేషన్స్ సందర్భంగా చెప్పారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి!) మంగళవారం ఎపిసోడ్లో భాగంగా 'వోట్ ఫర్ మీ' పేరుతో టాస్క్ పెట్టారు. బిగ్‌బాస్ మాట్లాడుతూ.. 'యావర్, శోభా.. మీరిద్దరూ మీ ఓటు అప్పీలు చేసేందుకు మిగతావారి కంటే చేరువలో ఉన్నారు. కానీ మీ ఇద్దరిలో నుంచి ఒక్కరికి మాత్రమే ఓటు అప్పీలు చేసుకునే వీలుంది. ఆ ఒక్కరు ఎవరు అనే విషయం మిగతా ఇంటి సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది' అని ఫిట్టింగ్ పెట్టాడు. ఈ టాస్క్‌లో భాగంగా యావర్‌కి శివాజీ, ప్రశాంత్ ఓటేశారు. శోభాకి ప్రియాంక, అమర్‌తో పాటు అర్జున్ కూడా ఓటేసినట్లు ప్రోమోలో చూపించారు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవాళ్లలో అర్జున్ ఫైనల్ వీక్కి అర్హత సాధించాడు. మిగతా ఆరుగురిలో శోభా, యావర్ మాత్రం చివరి స్థానాల్లో ఉంటారు. అంటే ఈ వారం వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోయే ఛాన్సులు గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు అదే విషయాన్ని టాస్క్ పేరు చెప్పి బిగ్‌బాస్ హింట్ ఇచ్చాడా అనే సందేహం వస్తోంది. అయితే ఈ టాస్కులో శోభా కాస్త భయపడినట్లు కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి!
బిగ్‌బాస్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బాగానే ఆడుతున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే అలా లేకపోతే 14వ వారం వరకు ఎలా వస్తాడు. అంతే కదా. అయితే అంతా బాగానే ఉన్నా గానీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. తాజా నామినేషన్స్‌లోనూ తనకు అలవాటైన ఓ థియరీ ఉపయోగిద్దామని చూశాడు. కానీ ఎదురుదెబ్బ తగిలింది. గిలగిల కొట్టేసుకున్నాడు. తాజాగా రిలీజైన ప్రోమోతో ఆ విషయం అర్థమైంది. (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) రైతుబిడ్డ అతితెలివి కామన్‌మ్యాన్ ప్లస్ రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన మిగతా రోజుల్లో ఏ మాత్రం సౌండ్ చేయకుండా, అసలు ఉన్నాడా లేడా అన్నట్లు ఉంటాడు. నామినేషన్స్ వస్తే మాత్రం షర్ట్ పై బటన్ కూడా పెట్టేసి, మెడలో టవల్ వేసుకుని మరీ బుద్దిమంతుడు అయిపోయాడు. అవతల వాళ్లు చెబుతున్నది వినకుండా, వాళ్ల చెప్పిన పాయింట్ మార్చేసి మరీ తనపై సింపతీ వచ్చేలా ప్లేట్ తిప్పేస్తాడు. గతంలో ఓసారి సందీప్ మాస్టర్ నామినేషన్ చేసిన టైంలో.. తనని ఊరోడు అన్నాడని నానా హంగామా చేశాడు. అమర్ రివర్స్ పంచ్ అయితే గతకొన్ని వారాల నుంచి నామినేషన్స్ సైలెంట్‌గా పూర్తి చేస్తూ వచ్చిన తాజాగా సోమవారం మాత్రం అమర్‌తో పెద్ద వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే 'ఆడవాళ్లలా మాట్లాడకు' అని అర్థమొచ్చేలా అన్నాడు. దీంతో అమర్.. దాన్ని రచ్చ చేశాడు. 'నన్ను ఆడోడా అంటావా, చేతులకు గాజులు వేసుకోవాలా?' అని అమర్ రెచ్చిపోయాడు. దీంతో రైతుబిడ్డ డిఫెన్స్‌లో పడిపోయాడు. ప్రతిసారీ ఏదో ఒకలా సింపతీ కొట్టేద్దామని చూసే రైతుబిడ్డకు ఈసారి అమర్ రివర్స్ పంచ్ ఇచ్చాడు. ఈ గొడవని ఎవరో ఒకరు ఫుల్స్టాప్ పెట్టాలి. కానీ అమర్ రెచ్చిపోయి ప్రశాంత్ తప్పు చేసేలా చేస్తున్నాడు. మంగళవారం ఎపిసోడ్‌లోనూ ఈ పంచాయతీ సాగింది. మరి ఈ గొడవకు ఎప్పుడు ఎలా? ఎండ్ కార్డ్ పడిందనేది రాబోయే ఎపిసోడ్లో తేలుతుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) -
Bigg Boss 7: మళ్లీ గొడవపడ్డ అమర్-ప్రశాంత్.. ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్!
బిగ్‌బాస్ చిట్టచివరి నామినేషన్స్ అయిపోయాయి. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండాల్సిన ఈ ప్రక్రియ.. చాలా సిల్లీగా నడిచింది. ఎప్పటిలానే పనికిమాలిన సీరియల్ బ్యాచ్, శివాజీ బ్యాచ్ ఒకరిపై ఒకరు పగ ప్రతీకారాలు చూపించుకున్నారు. వీటన్నింటిలో అమర్-ప్రశాంత్ గొడవ మాత్రం కాస్తోకూస్తో ఎంటర్టైనింగ్గా అనిపించింది. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 92 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. నామినేషన్స్ హడావుడి గౌతమ్ ఎలిమినేట్ అయిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక నామినేషన్స్‌తో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. 'టికెట్ టూ ఫినాలే' రేసులో గెలిచిన ఫైనలిస్ట్ అయిన కారణంగా అర్జున్.. ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్లు చెప్పారు. అలా ఈ ప్రక్రియ షురూ అయింది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? యావర్ - శోభా, ప్రియాంక శోభాశెట్టి - యావర్, శివాజీ ప్రశాంత్ - అమర్,శోభాశెట్టి అర్జున్ - అమర్, యావర్ ప్రియాంక - అమర్, యావర్ శివాజీ - ప్రియాంక, అమర్ అమర్ - ప్రశాంత్, యావర్ చాలా అతి చేసిన యావర్ వీకెండ్ ఎపిసోడ్లో ఓ సందర్భంలో ప్రియాంక మాట్లాడుతూ యావర్.. ఇంట్లో తక్కువ పనిచేస్తున్నాడని చెప్పింది. ఇప్పుడు అదే పాయింట్ కారణాన్ని చూపించి ప్రియాంకని యావర్ నామినేట్ చేశాడు. అయితే ప్రియాంక గురించి మాట్లాడినప్పుడు ఆమెతోనే మాట్లాడాలి. కానీ శోభా-అమర్ పేర్లు ప్రస్తావించాడు. ఫేవరిజం చూపిస్తున్నావ్ నువ్వు అని ప్రియాంకతో అన్నాడు. మధ్యలో ఎంటరైన శోభా.. నీత నన్ను కంపేర్ చేయకు, అసలు నువ్వేం చేస్తావ్.. డిన్నర్ రెడీ అయిన తర్వాత వస్తావ్, తింటావ్, వెళ్లిపోతావ్.. అంతకు మించి ఏం చేస్తున్నావ్ అని యావర్ అసలు చేసేదాన్ని బయటపెట్టింది. దీంతో యావర్ పిచ్చిపిచ్చిగా ప్రవరిస్తూ అతి చేశాడు. అమర్‌కి షాకిచ్చిన ప్రియాంక సీరియల్ బ్యాచ్‌కి చెందిన ప్రియాంక.. తన ఫ్రెండ్ అయిన అమర్నే నామినేట్ చేసింది. గతవారం టికెట్ టూ ఫినాలే పోటీలో భాగంగా గేమ్ ఓడిపోయిన బాధలో ఉంటే, పదే పదే పాయింట్స్ గురించి తనని అడగడం నచ్చలేదని కారణం చెప్పింది. ఇక మిగిలిన వాళ్లవి ఓకే అనిపించేలా నామినేషన్స్ జరిగాయి. అమర్-ప్రశాంత్ మధ్యలో మాత్రం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. రెండో వారం నామినేషన్స్‌ని గుర్తుచేశారు. అమర్ vs ప్రశాంత్ గత కొన్ని వారాల నుంచి బాగానే ఉన్న ప్రశాంత్, అమర్.. ఈసారి నామినేషన్స్‌లో రెచ్చిపోయారు. అమర్.. ప్రశాంత్‌ని నామినేట్ చేశాడు. వీళ్లిద్దరి మధ్య నువ్వు ఫేక్ అంటే నువ్వు ఫేక్ అంటూ, మోసం చేస్తున్నావ్ అదీ ఇది అని అనుకున్నారు. మీదమీదకు వెళ్లి మరీ కొట్టుకుంటారా అనేలా ప్రవర్తించారు. చివరకు శివాజీ, మిగతా ఇంటి సభ్యులు కల్పించుకోవడంతో సైలైంట్ అయిపోయారు. ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ ఈ ఫినాలే రేసు మిమ్మల్ని ఓ ఫైనలిస్టుని చేస్తుంది లేదా ఫినిష్ లైన్ చేరకుండానే ఆపేస్తుంది. ఆ నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. వారు మీ ప్రతి ఆట ప్రతి మాట ప్రతి కదలిక చాలా దగ్గర నుంచి గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటినుంచి మీరు చేసే ప్రతి పని మీ గెలుపోటములని నిర్ణయిస్తుంది. బిగ్ బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ రెండు వారాలు కూడా మీ ఓటింగ్ లైన్స్ తెరుచుకుంటాయి. ఎక్కువ ఓట్లు పొందిన వాడు.. బిగ్‌బాస్ 7 విజేతగా నిలుస్తాడు. కానీ ఒకవేళ ఈ వారం మీ ఓట్లు.. మిగతా వారి కంటే తక్కువగా ఉంటే ఫినాలే వారానికి చేరుకోవడానికి ముందే ఎలిమినేట్ అవుతారు. అర్జున్.. ఫినాలే వీక్కి చేరుకున్నాడు కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యాడని బిగ్‌బాస్ చెప్పడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. -
నామినేషన్స్‌లో ట్విస్ట్.. అమర్‌కు షాకిచ్చిన ప్రియాంక..
బిగ్‌బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలేకు ముహూర్తం దగ్గరపడింది. సీజన్ 7 కథ కంచికి చేరేందుకు ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. గౌతమ్ ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఏడుగురు మాత్రమే మిగిలారు. వీరిలో అర్జున్ టికెట్ టు ఫినాలే గెలిచి నేరుగా ఫైనల్స్‌లో అడుగుపెట్టారు. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌దీప్‌ను ఇమ్యూనిటీ లేకుండా కెప్టెన్ చేశారు. దీంతో అతడు కూడా నామినేషన్ ప్రక్రియలో ఉన్నాడు. నిజానికి ఫినాలేకు దగ్గర్లో ఉన్న సమయంలో హౌస్మేట్స్ అంతా నామినేట్ అవుతుంటారు. కానీ ఈసారి నామినేషన్స్‌ను ఇంటిసభ్యుల చేతిలో పెట్టాడు బిగ్‌బాస్. ఎవరిని ఇంటి నుంచి బయటకు పంపించాలనుకుంటారో వారి ముఖాలను టైల్స్‌పై స్టాంప్ వేసి, ఆ టైల్స్‌ను పగలగొట్టాలన్నాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ప్రిన్స్ యావర్.. శోభను నామినేట్ చేశాడు. శోభ.. ప్రిన్స్, శివాజీలను నామినేట్ చేసింది. ప్రియాంక.. అమర్‌దీప్‌ను నామినేట్ చేసి అందరికీ షాకిచ్చింది. తాజా సమాచారం ప్రకారం అర్జున్ మినహా మిగతా ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ నామినేషన్స్ ఎలా జరిగాయి? ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! చదవండి: ఆ ఒక్కటే గౌతమ్‌కి మైనస్.. అందుకే ఇలా ఎలిమినేట్! -
Bigg Boss 7: రైతుబిడ్డ సేఫ్ గేమ్? చివరకొచ్చినా 'బిగ్‌బాస్' తీరు మారట్లేదు!
బిగ్‌బాస్ 7 గురించి హోస్ట్ నాగార్జున ఏమో గొప్పలు చెబుతున్నాడు. రియాలిటీలో మాత్రం అస్సలు అలా లేదు. తాజా ఎపిసోడే దీనికి సరైన ఉదాహరణ. అలానే రైతుబిడ్డ ఈ సీజన్లో చాలా తెలివిగా ఆడాడని అందరూ అనుకుంటున్నారు. కానీ మనోడి సేఫ్ గేమ్ ఇప్పుడు బయటపడింది. అయితే ఓ విషయంలో మాత్రం బిగ్‌బాస్ అస్సలు తీరు మార్చుకోవడం లేదు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 91 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. బిగ్‌బాస్ విన్నర్ ప్రైజ్‌మనీ ఫినాలే టికెట్ గెలుచుకున్న అర్జున్.. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయినట్లు చెప్పడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ సీజన్లో విజేతగా నిలిస్తే ఏమేం దక్కుతాయో నాగార్జున ప్రకటించడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ సీజన్ విన్నర్‌గా నిలిస్తే రూ.50 లక్షల నగదుతో పాటు మారుతి కార్, రూ. 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ సొంతమవుతుందని నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే రూ. 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారని అందరినీ నాగ్ అడిగితే.. అమ్మని ఈ డబ్బుతో హాయిగా చూసుకుంటా, తల్లిదండ్రులకు ఇల్లు కట్టిస్తా లాంటివి చెప్పారు. అయితే ఈ మొత్తం డిస్కషన్లో పెద్దగా డ్రామా పండలేదు. మొత్తం తేలిపోయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఆ కారణంతో అర్జున్ ఎలిమినేట్.. 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?) ప్రమోషన్స్ మధ్య ఎపిసోడ్ అయితే వీకెండ్ ఎపిసోడ్ అంటే.. హౌసులో ఉన్నవాళ్లతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి. కానీ బిగ్‌బాస్ టీమ్ దీనికంటే ప్రమోషన్స్‌పై ప్రేమ ఎక్కువైపోయింది. ప్రమోషన్స్ చేయొద్దని అనట్లేదు గానీ ఎపిసోడ్లో ఎక్కడో ఐదు నిమిషాల పాటు ప్రమోషన్ ఉంటే బాగుండేది.. ఈ ఆదివారం మాత్రం కాస్త ఎక్కువ లెంగ్త్ ఉండేసరికి చాలా బోర్ కొట్టేసింది. 'నా సామి రంగ', 'హాయ్ నాన్న' సినిమాల్ని ప్రమోట్ చేయడానికి వచ్చిన ఆషికా రంగనాథ్, నాని పర్వాలేదనిపించారు తప్పితే ఏమంత అలరించలేకపోయారు. ప్రశాంత్ సేఫ్ గేమ్? సేవింగ్‌లో భాగంగా ప్రియాంక, శివాజీ, యావర్ వరసగా ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు. చివరగా ప్రశాంత్, శోభా, గౌతమ్ మిగిలారు. ఇలాంటి టైంలో ఎవిక్షన్ పాస్ ఉపయోగించాల్సిందేనని నాగార్జున అల్టిమేటం జారీ చేశాడు. లేకపోతే తిరిగిచ్చేయాల్సి ఉంటుందని అన్నాడు. ఇక్కడ చాలా తెలివిగా ఆలోచించిన ప్రశాంత్.. శోభా-గౌతమ్ ఇద్దరిలో ఎవరికిచ్చినా ఇలాంటి టైంలో తను బ్యాడ్ అయిపోతానని తెలుసు. అందుకే ఎవరికి ఇచ్చేదే లేదని పదే పదే చెప్పాడు. తిరిగిచ్చేసి హీరో అయిపోదామనుకున్నాడు. కానీ ఇదంతా కూడా సేఫ్ గేమ్‌లా అనిపించింది తప్పితే ఇంట్రెస్టింగ్గా అయితే లేదు. ఆ తర్వాత ప్రశాంత్ సేవ్ అయ్యాడు. చివరగా శోభా బతికిపోయింది. గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు. 13వ వారం కావడం వల్లో ఏమో గానీ మనోడి.. ఎలిమినేట్ అయిపోయినా సరే పెద్దగా బాధపడలేదు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: హనీమూన్‌కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) -
Bigg Boss 7: ఆ కారణంతో గౌతమ్ ఎలిమినేట్.. 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్‌బాస్ 7 నుంచి డాక్టర్‌బాబు ఎలిమినేట్ అయిపోయాడు. అశ్వద్ధామ 2.0 అని హడావుడి చేసిన ఇతడు.. సింగిల్‌గా ఆడుతూనే 13వ వారం వరకు నెట్టుకొచ్చేశాడు. అయితే ఇతడు చేసిన కొన్ని పనులు, అలానే హౌసులోని పలువురి వల్ల గౌతమ్.. బయటకొచ్చేసినట్లు అనిపిస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే.. ఇన్నివారాలకు కలిపి రెమ్యునరేషన్ మాత్రం గట్టిగా ముట్టినట్లు టాక్. ఇంతకీ ఏంటి విషయం? డాక్టర్‌బాబు ఫెర్ఫార్మెన్స్ ఓకే డాక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ కృష్ణ.. బిగ్‌బాస్ హౌస్‌లో 13వ వారాలైతే ఉన్నాడు గానీ గుర్తింపు అయితే పెద్దగా తెచ్చుకోలేకపోయాడు. మొదటి వారం నుంచి ఇప్పటివరకు దాదాపు ఒంటరిగానే పోరాడుతూ వచ్చారు. ఈ విషయంలో మాత్రం అతడిని మెచ్చుకోవచ్చు. ఇన్ని వారాలు జరిగిన గేమ్స్‌లోనూ గౌతమ్ గెలిచిన దాఖలాలు అయితే లేవు. ఓ రోజు సీక్రెట్ రూంలో ఉండొచ్చి, 'అశ్వద్ధామ 2.0' అని హడావుడి చేశాడు గానీ అది పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. (ఇదీ చదవండి: హనీమూన్‌కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) ఎలిమినేషన్‌కి అదే కారణమా? ప్రారంభంలో నామమాత్రంగా ఆడిన గౌతమ్.. ఆ తర్వాత నుంచి శివాజీతో గొడవ పెట్టుకుని హైలైట్ అయ్యాడు. అప్పటి నుంచి తాజా వీకెండ్ ఎపిసోడ్ వరకు ఈ తంతే నడిచింది. అయితే శివాజీ వరస్ట్ కామందు తరహా ప్రవర్తన గురించి కాస్తో కూస్తో నిజాలు మాట్లాడిన వాళ్లలో గౌతమ్ ఒకడు. ఇదే ఇప్పుడు బిగ్‌బాస్ ఆర్గనైజర్స్‌కి నచ్చలేదు. గౌతమ్‌ని ఎలిమినేట్ చేసి పడేశారు. గత రెండు మూడు వారాల గేమ్ తీసుకుంటే శివాజీ, యావర్ కంటే గౌతమ్ చాలా బెటర్. కానీ శివాజీ మీద బిగ్బాసోళ్లకు ప్రేమ ఎక్కువైంది. అదే గౌతమ్‌కి శాపమైందని టాక్. రెమ్యునరేషన్ ఎంత? ఇకపోతే వారానికి రూ 1.5 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అని గౌతమ్ డీల్ మాట్లాడుకున్నాడట. అంటే 13 వారాలకు గానూ దాదాపు రూ 19.5 లక్షలు పారితోషికంగా అందుకున్నాడని సమాచారం. అయితే ఈ విషయంపై గౌతమ్ క్లారిటీ ఇస్తే తప్ప అసలు లెక్కలు తెలియవు. ఏదేమైనా శివాజీతో పెట్టుకోవడం తనకు ప్లస్ అవుతుందని గౌతమ్ అనుకున్నాడు కానీ అదే మైనస్ అయి, ఇంటి నుంచి బయటకొచ్చేలా చేసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: రానా తమ్ముడి డెస్టినేషన్ వెడ్డింగ్? ఆ దేశంలో మూడు రోజుల పాటు!) -
Bigg Boss 7: ప్రియాంకని ఒప్పించడానికి నాగ్ ప్రయత్నం.. శివాజీకి చెప్పడానికి నో ధైర్యం!
బిగ్‌బాస్ 7వ సీజన్లో మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఈ వారం ఓ మాదిరి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. కాకపోతే శివాజీ మీద నాగ్ ప్రేమ ఎంత ఉందనేది మరోసారి బయటపడింది. ప్రియాంకని అయితే నాగ్ పదే పదే ఓ విషయం ఒప్పించేందుకు తెగ ప్రయత్నించాడు. అమర్‌కి ఓ సర్ప్రైజ్ కూడా ఇచ్చాడు. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 90 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. బయటపడ్డ ప్రియాంక ఆవేదన టికెట్ టూ ఫినాలే రేసులో గెలిచిన అర్జున్.. ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి శనివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. వీకెండ్ కాబట్టి స్టేజీపైకి వచ్చిన నాగార్జున.. శుక్రవారం ఏం జరిగిందో చూశాడు. ఆ తర్వాత ప్రస్తుతానికి వచ్చేశాడు. ఫినాలే రేసు మొదటి రౌండులోనే ఎలిమినేట్ అయిపోయిన శోభా-శివాజీ నిలబెట్టి.. ఒకరి గేమ్ గురించి మరొకరు చెప్పాలని అన్నాడు. ఈ డిస్కషన్లో వీళ్లిద్దరూ అమర్‌కి పాయింట్స్ ఇవ్వడంపై నాగ్ కౌంటర్స్ వేశాడు. (ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?) అమర్ అలుగుతాడని, బ్లాక్ మెయిల్ చేస్తాడని నవ్వుతూనే నిజాలు చెప్పేశాడు. ఆ వెంటనే.. ప్రియాంక చెప్పమ్మా అని ఆమెని నిలబెట్టాడు. దీన్ని నిజమేనని ఒప్పుకొన్న ప్రియాంక.. అది చాలా పెయిన్ఫుల్, ఆల్రెడీ ఓడిపోయినా బాధ ఓవైపు ఉంటే.. మళ్లీ మళ్లీ అమర్ పాయింట్స్ ఇవ్వమని చెబుతుంటే చాలా బాధగా అనిపించింది ప్రియాంక తన ఆవేదన బయటపెట్టింది. ప్రియాంకని ఒప్పించే ప్రయత్నం ప్రియాంకని నిలబెట్టి మాట్లాడిన నాగ్.. గతవారమే అనుకున్నాం కదా ఒంటరిగా గేమ్ ఆడమని.. కానీ నువ్వు ఏం చేశావ్? అని అమర్‌కి గౌతమ్ ద్వారా పాయింట్లు ఇచ్చిన విషయం గురించి మాట్లాడాడు. అయితే ఈ మొత్తం డిస్కషన్లో ప్రియాంకది గ్రూప్ గేమ్ అని ఒప్పించాలని నాగ్ చాలా ప్రయత్నించాడు. కానీ ఈ విషయంలో ఫెయిలయ్యాడు. ఆ తర్వాత గౌతమ్‌తోనూ నాగ్.. ప్రియాంకది తప్పని చెప్పించాడు. ప్రియాంక.. నువ్వు ఎంత సమర్ధించుకున్నాసరే నీది గ్రూప్ గేమ్ అని మాకు అనిపించిందని నాగ్ అన్నాడు. కానీ ఇలానే గతంలో శివాజీ బ్యాచ్‌గా ఆడినప్పుడు మాత్రం నాగ్ కనీసం పల్లెత్తు మాట కూడా అనలేకపోయాడు. దీనిబట్టి శివాజీపై నాగ్ ప్రేమ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కు హెల్త్ ఇష్యూ.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన సుకుమార్) అమర్‌కి సర్ప్రైజ్.. ప్రశాంత్‌కి షాక్ ఈ వారం 'టికెట్ టూ ఫినాలే' అర్జున్ గెలిచిన కారణంగా.. ఎవిక్షన్ పాస్ 14వ వారం కాదు, ఈ వారమే ఉపయోగించాలని ప్రశాంత్‌కి నాగ్ కండీషన్ పెట్టాడు. దాని గురించి తర్వాత చెబుతానని అన్నాడు. కానీ శనివారం ఎపిసోడ్లో కారణం లాంటిది ఏం చెప్పలేదు. మరోవైపు అమర్ మాట్లాడుతూ.. ఒక్కసారి మీరు నన్ను కెప్టెన్ అని పిలిస్తే వినాలని ఉందని నాగార్జునని రిక్వెస్ట్ చేశాడు. ఇది జరిగిన నాగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. టికెట్ టూ ఫినాలే పోటీలో 1200 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన కారణంగా.. వచ్చే వారం కెప్టెన్ అయ్యావ్ అమర్ అని నాగ్ చెప్పాడు. శివాజీ, అర్జున్.. డిప్యూటీస్ అని నాగ్ ఆదేశించాడు. శివాజీతో గౌతమ్ గొడవ ఇక 'బీబీ లైబ్రరీ' అని ఓ గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా కొన్ని పేర్లు రాసున్న బుక్... మరొకరికి ఇవ్వాల్సి ఉంటుందని నాగ్ చెప్పాడు. మిగతా వాళ్ల విషయంలో పెద్దగా ఇబ్బంది కాలేదు కానీ.. 'ప్రతిదానికి నేనే రైట్ అని అనుకోకుండా ఎలా ఉండాలి?' అనే బుక్ మాత్రం గౌతమ్.. శివాజీకి ఇచ్చాడు. దీన్ని తీసుకోలేకపోయిన శివాజీ.. 'కుళ్లు, కుట్ర, కుతంత్రం నుంచి విముక్తి పొందడం ఎలా?' అని పుస్తకాన్ని.. రిటర్న్‌లో గౌతమ్‌కి ఇచ్చాడు. దీంతో గొడవ మొదలైంది. ఇద్దరూ నీది తప్పంటే నీది తప్పు అని నామినేషన్స్‌లో వాదించుకున్నట్లు హోస్ట్ నాగార్జున ముందే గొడవపడ్డారు. అంతా విన్న నాగార్జున.. ఎప్పటిలానే శివాజీకి సపోర్ట్ చేశాడు. గౌతమ్దే తప్పన్నట్లు తీర్పు ఇచ్చాడు. ఫినాలే అస్త్ర గెలుచుకున్న కారణంగా అర్జున్.. ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి సేవ్ అయిపోయినట్లు నాగ్ ప్రకటించాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. అయితే శనివారం అంతా కూడా నవ్వుతూనే సీరియల్ బ్యాచ్ గురించి నాగార్జున నిజాలు చెప్పాడు. ఇలానే శివాజీ బిహేవియర్ గురించి కూడా నిజాలు చెబితే బాగుండేది అనిపించింది. (ఇదీ చదవండి: ఆ సమస్యతో బాధపడుతున్న అమర్.. లోపల ట్రీట్మెంట్ లేదు!) -
బిగ్‌బాస్ 7: స్ట్రాంగ్ కంటెస్టెంట్ డాక్టర్ బాబు అవుట్!
అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా... ఈ పాట పాడుకునే సమయం వచ్చేసింది. ఈ వారం నామినేషన్స్ వల్ల అర్జున్ మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. ఈసారి ఈయన జెండా ఎత్తేయడం పక్కా అనుకున్నారంతా! కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన సత్తా ఏంటో చూపించాడు అర్జున్. టికెట్ టు ఫినాలే రేసులో అందరినీ వెనక్కు నెడుతూ, ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్‌గా ఆడి ఫినాలే అస్త్ర గెలిచాడు. అయితే ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయితేనే కదా టాప్ 5లో చోటు దక్కించుకునేది అని అందరూ డౌట్ పడ్డారు. కానీ ఈ వారం మొదట సేవ్ అయింది అర్జునే! నాగార్జున ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్‌గా అర్జున్ను ప్రకటిస్తూ అతడిని సేవ్ చేశాడు. దీంతో ఎలిమినేషన్ గండం గౌతమ్, శోభల మెడకు చుట్టుకుంది. కానీ శోభ కోసం ఎవరినైనా బలి చేసేందుకు బిగ్‌బాస్ రెడీ.. కాబట్టి ఆమెకు బదులుగా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను పంపించే ప్లాన్ చేశారట! టాప్5లో ఉండేందుకు అర్హత ఉన్న గౌతమ్ కృష్ణను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది చూసిన డాక్టర్ బాబు అభిమానులు.. అన్‌ఫెయిర్ బిగ్‌బాస్ అంటూ సోషల్ మీడియాలో ఆర్తనాదాలు చేస్తున్నారు. చదవండి: శివాజీ ప్రవర్తన వల్ల బాధపడ్డా.. ఆ నొప్పితో బాధపడుతున్న అమర్.. బిగ్‌బాస్ హౌస్‌లో నో ట్రీట్మెంట్ -
ఆ సమస్యతో బాధపడుతున్న అమర్.. లోపల ట్రీట్మెంట్ లేదు!
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి టైటిల్ రేసులో ఉన్నారు. మొదటి నుంచీ ఏ ముసుగు వేసుకోకుండా మాట్లాడుతున్నాడు అమర్. అయితే తను చేసే తింగరి పనుల వల్ల సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అవుతుంటాడు. ఇక హౌస్‌లో శివాజీ మొదటి నుంచీ అమర్‌ను టార్గెట్ చేస్తూ అతడిని చులకన చేస్తూ మాట్లాడుతూ వచ్చాడు. ఈ వైఖరిని తాను కూడా సహించలేకపోయానంటోంది అమర్ భార్య, నటి తేజస్విని. హౌస్‌లో అడుగుపెట్టాక అంతా మర్చిపోయా తాజాగా తేజస్విని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కొన్ని విషయాల్లో శివాజీ ప్రవర్తన వల్ల నేను బాధపడ్డాను. ఎందుకలా మాట్లాడుతున్నారు అనుకునేదాన్ని. బహుశా అమర్ టఫ్ కాంపిటీషన్ ఇస్తాడనుకున్నారేమో, అందుకే తనతో అలా ప్రవర్తించారేమో! నేను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లినప్పుడు చాలా అనుకున్నాను, ఎన్నో చెప్పాలనుకున్నాను. కానీ హౌస్‌లోకి వెళ్లాక ఏదీ గుర్తులేదు. అమర్ తప్ప ఎవరూ కనిపించలేదు. తనే అందరినీ పరిచయం చేశాడు. అమర్‌కు శివాజీ అంటే ప్రత్యేక గౌరవం ఉంది. అందుకే నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్లాడు, ఆశీర్వాదం తీసుకున్నాం. ఆ సమస్యతో అమర్‌కు ఫిజియోథెరపీ అమర్‌కు అనారోగ్యసమస్యలు ఉన్నాయి. బిగ్‌బాస్ షోలోకి వెళ్లేముందు కూడా తనకు విపరీతమైన బ్యాక్‌పెయిన్ ఉంది. హౌస్‌లోకి వెళ్లే ఒకరోజు ముందు కూడా అతడికి ఫిజియోథెరపీ జరిగింది. నీతోనే డ్యాన్స్ షో ఫినాలే రోజు పెయిన్ కిల్లర్స్ ఇంజక్షన్స్ వేయించుకున్నాడు. అంత నొప్పి అనుభవిస్తూనే షోకి వెళ్లాడు. ఇప్పటికీ అతడు నొప్పి అనుభవిస్తున్నాడు. హౌస్‌లో తనకు వెన్ను నొప్పి ఉన్న విషయాన్ని బయటకు చెప్పడం లేదు. ఏ ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు. దెబ్బ తగిలితే ఫ్రాక్చర్.. ఎక్కడ సింపతీ అనుకుంటారోనని తన అనారోగ్య సమస్యను ఎవరికీ చెప్పట్లేదని నాకు చెప్పాడు. తనకు నొప్పి తగ్గడానికి డాక్టర్ రాసిచ్చిన క్రీమ్ పంపిస్తూనే ఉన్నాను. అమర్ రోజూ అది రాసుకునే పడుకుంటున్నాడు. తనకు కండరాల బలహీనత కూడా ఉంది. దీనివల్ల ఏదైనా దెబ్బ తగిలితే అక్కడ ఫ్రాక్చర్ అవుతుందని డాక్టర్ చెప్పారు. అయినా సరే ఏమీ లెక్క చేయకుండా అమర్ బిగ్‌బాస్ షోకి వెళ్లాడు. అందుకే మొదట్లో టాస్కులు పెద్దగా ఆడలేకపోయాడు. కానీ తర్వాత ఏదైతే అదైందని ఆడుతూ పోయాడు' అని చెప్పుకొచ్చింది తేజస్విని. చదవండి: స్టార్ హీరోయిన్ మాజీ భర్తతో నాలుగేళ్లుగా డేటింగ్.. బ్రేకప్‌కు అదే కారణమంటూ.. -
Bigg Boss 7: లవ్ స్టోరీ బయటపెట్టిన రైతుబిడ్డ.. ఆ ఒక్క కారణంతో బ్రేకప్!
గత కొన్నిరోజుల నుంచి జరుగుతున్న 'టికెట్ టూ ఫినాలే' రేసు పూర్తయింది. ఎవరూ ఊహించని విధంగా అర్జున్.. చివరి వరకు పోరాడి తొలి ఫైనలిస్ట్ అయ్యాడు. మరోవైపు రైతుబిడ్డ ప్రశాంత్.. ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని తన ప్రేమకథని బయటపెట్టాడు. అయితే ఇది బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 89 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. గౌతమ్ రేసు నుంచి ఔట్ నాలుగు స్థానాల్లో వరసగా అమర్, అర్జున్, ప్రశాంత్, గౌతమ్ ఉన్నారు. అలా గురువారం ఎపిసోడ్ ముగిసింది. తక్కువ పాయింట్స్ ఉన్న కారణంగా గౌతమ్.. రేసు నుంచి తప్పుకొన్నాడని బిగ్‌బాస్ చెప్పడంతో శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. తన దగ్గరున్న వాటిలో 20 శాతం అంటే 140 పాయింట్లు.. రేసులో ఉన్న ముగ్గురిలో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పగా.. అమర్ పేరు చెప్పాడు. అయితే ఇవి ప్రియాంక పాయింట్స్ అని, ఆమెని మరోమాట అనొద్దని గౌతమ్, అమర్‌తో చెప్పాడు. (ఇదీ చదవండి: Salaar Part 1: Ceasefire Trailer: రిలీజైన 'సలార్' ట్రైలర్.. స్టోరీ హింట్ ఇచ్చేశారుగా!) బెడ్రూంలో శోభా డిస్కషన్ అయితే పాయింట్స్ ఇస్తూ.. ప్రియాంకని ఏమొనద్దని అమర్‌కి చెప్పడం ఏం బాగోలేదని శోభా అభిప్రాయపడింది. ఇదే విషయాన్ని రాత్రి నిద్రపోయే టైంలో తన ఫ్రెండ్స్ అయిన ప్రియాంక-అమర్‌తో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. అలానే ఇవ్వాలనుకుంటే నువ్వే(ప్రియాంక) నేరుగా ఇవ్వొచ్చు కదా, గౌతమ్‌ని బతిమలాడి అడగడం ఎందుకు? అని శోభా.. తన ఫ్రెండ్ ప్రియాంకతో చెప్పుకొచ్చింది. శోభాకి పనిష్మెంట్ 10వ గేమ్‌గా 'కలర్ బాల్స్' అన్ని ఒకే వరసలో సెట్ చేయాలని టాస్క్ ఇచ్చారు. ఇందులో అర్జున్ విజయం సాధించాడు. ఆ తర్వాత ప్రశాంత్, అమర్ నిలిచారు. అయితే ఈ పోటీ పూర్తయిన తర్వాత శోభా.. బంతుల్ని టచ్ చేసిందని చెబుతూ ఆమెకి పనిష్మెంట్ ఇస్తున్నట్లు బిగ్‌బాస్ కాస్త భయపెట్టాడు. కానీ పనిష్మెంట్గా అందరూ గంట నిద్రపోవాలని అన్నాడు. అందరూ పడుకుని లేచేసరికి బయట గార్డెన్ ఏరియాలో టీ-స్నాక్స్ సదుపాయం ఏర్పాటు చేశాడు. ఇవి తింటూ అందరూ తమతమ లవ్ స్టోరీలు చెప్పాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అందులోనే) ప్రశాంత్ భగ్న ప్రేమకథ ఈ టాస్కులో భాగంగా శివాజీ, శోభా.. తమ ప్రేమకథల్ని చెప్పుకొచ్చారు. గౌతమ్ మాత్రం తన సినిమా పిచ్చి వల్ల.. దాదాపు పెళ్లి వరకు ఓ వచ్చిన స్టోరీ బ్రేకప్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. ఇక ప్రశాంత్‌ని ప్రేమకథ చెప్పాలని బిగ్‌బాస్ చెప్పమన్నాడు. దీంతో మనోడు అప్పట్లో జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. ఓ రోజు పొలంకి వెళ్తుంటే.. దారిలో ఓ అమ్మాయి హాయ్ చెప్పింది. కొన్నాళ్లుకు మెసేజ్ చేసింది. అలా కాస్త పరిచయమైన తర్వాత ఆమెకి ఫ్రెండ్ అని ఒకడు వచ్చాడు. దీంతో నాకు మెసేజులు చేయడం తగ్గించేసింది. వాడు ఒక్క మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇచ్చేసేది. చాలా రోజుల తర్వాత ఓ రోజు ఫోన్ చేసి.. పొలం పని వదిలేస్తేనే నీ వెంట వస్తా అని సీరియస్‌గా చెప్పింది. నాకు తెలిసింది పొలం పనే, దీన్ని విడిచిపెట్టి రానని చెప్పేశా, అలా ప్రేమకథ బ్రేకప్ అయిపోయిందని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. అర్జున్ మైండ్ గేమ్.. తొలి ఫైనలిస్ట్ 'టికెట్ టూ ఫినాలే' పోటీలో భాగంగా 'పట్టు వదలకురా డింభకా' అని పెట్టిన 11వ గేమ్ పెట్టారు. ఇందులో లోపలి నుంచి ఎవరికి వాళ్లు తాడుని డిఫెండ్ చేస్తూనే, కింద పడున్న జెండాలని తీసి, బుట్టలో వేయాలని చెప్పగా అర్జున్.. వేగంగా పదివరకు జెండాలని తన బుట్టలో వేశాడు. తర్వాత అమర్-ప్రశాంత్.. కనీసం అక్కడి నుంచి కదలకుండా చేశాడు. అలా చాలాసేపు ఉంచేశాడు. దీంతో బజర్ మోగింది. ఇక ముగ్గురిలో చివరి స్థానంలో నిలిచిన ప్రశాంత్ ఎలిమినేట్ అయిపోయాడు. కాసేపు బాధపడ్డాడు. 'పాముతో చెలగాటం' అని ఫైనల్ పోటీ పెట్టగా.. ఇందులో అర్జున్ విజయం సాధించాడు. ఏడో సీజన్ తొలి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: Dhootha Web Series Review: నాగచైతన్య 'దూత' వెబ్ సిరీస్ రివ్యూ) -
టికెట్ టు ఫినాలే గెలిచింది అతడే.. నేరుగా టాప్ 5లోకి!
బిగ్‌బాస్ హౌస్‌లో టికెట్ టు ఫినాలే అస్త్ర పోటీ చివరి దశకు చేరుకుంది. బిగ్‌బాస్ పెట్టిన గేమ్స్‌లో ఎక్కువగా అర్జున్, రైతుబిడ్డ గెలుచుకుంటూ పోగా అమర్ అందరి దగ్గరా పాయింట్లు అడుక్కుంటూ టాప్ స్థానంలో నిలబడ్డాడు. నిజానికి అతడికి ఎవరూ పాయింట్లు ఇవ్వకపోయినా టాప్ 3-4 స్థానాల్లో ఉండేవాడే! కానీ ఎక్కడ రేసులో నుంచి అవుట్ అయిపోతానో అన్న భయంతో అందరినీ బతిమాలుకుంటున్నాడు. చూడటానికి అది అడుక్కుంటున్నట్లుగానే ఉందని నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. కేవలం రెండు టాస్కులు మాత్రమే గెలిచిన అమర్ అందరూ ఇచ్చిన పాయింట్లతో స్కోర్ బోర్డ్‌లో టాప్‌లో ఉన్నాడు. కానీ అర్జున్ ఎవరి దగ్గరా ఒక్క పాయింట్ తీసుకోకుండా సొంతంగా ఆడి ఐదు గేమ్స్ గెలిచాడు. సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం ప్రకారం అర్జున్ టికెట్ టు ఫినాలే గెలిచినట్లు తెలుస్తోంది. అంటే అతడు టాప్ 5లో అడుగుపెట్టేసినట్లే అనుకోకండి.. తనముందు ఎలిమినేషన్ గండం ఉంది. ఈవారం ఎలిమినేషన్ దాటుకుని ముందుకు వస్తేనే అతడు ఫినాలేలో అడుగుపెడతాడు. నామినేషన్లో ఎంతో నెగెటివిటీ ఉన్నా టికెట్ టు ఫినాలేలో మాత్రం టాస్కులతో అదరగొట్టి అదుర్స్ అనిపించుకున్నాడు అర్జున్. ఎవరి సాయం లేకపోయినా ఒంటరిగా పోరాడి గెలిచాడు. మరి అతడు ఈ వారం సేవ్ అవుతాడా? టాప్ 5లో నిలుస్తాడా? చూడాలి! చదవండి: పెళ్లైన ఏడాదికే రెండో భార్యకు విడాకులు? అందుకే వీడియో డిలీట్! -
అమర్‌ను ఛాలెంజ్ చేసిన గౌతమ్.. అర్జున్‌కు అన్యాయం!
బిగ్‌బాస్ హౌస్‌లో టికెట్ టు ఫినాలే కోసం పోటీ జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఆటలో వెనకబడి రేసులో నుంచి పక్కకు తప్పుకోగా ఐదుగురు ఫినాలే అస్త్ర కోసం పోటీపడుతున్నారు. మరి వీరిలో ఎవరు ఆ అస్త్రాన్ని గెలుచుకోవడానికి దగ్గర్లో ఉన్నారు? ఎవరు రేసులో వెనకబడ్డారు? అనేది తాజా ఎపిసోడ్ (నవంబర్ 30) హైలైట్స్‌లో చదివేద్దాం... క్రికెట్ టాస్క్.. సిక్సులు బాదిన అమర్ తక్కువ పాయింట్లు ఉన్న ప్రియాంక, శివాజీ, శోభ ఫినాలే అస్త్ర రేసు నుంచి తప్పుకున్నారు. అయితే ప్రియాంక తన పాయింట్లను గౌతమ్‌కు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయాడు అమర్దీప్. కనీసం ఫ్రెండ్ అని కూడా చూడలేదు, ఎందుకు తప్పు నిర్ణయం తీసుకున్నావంటూ బాధపడ్డాడు. ఇంతలో మిగతా ఐదుగురు ఇంటిసభ్యులకు వెరైటీ క్రికెట్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో అమర్ గెలిచాడు. తప్పించుకో రాజా టాస్క్‌లో రైతుబిడ్డ గెలిచాడు. తప్పు చేసిన యావర్.. నోరు విప్పని శివాజీ అయితే ఈ టాస్కులో ఎవరి కాలికి ఉన్న తాళాలకు వారు కీ వెతికి విడిపించుకోవాలి. యావర్ ఒక కీ తీసుకుని అది రాకపోవడంతో కింద పడేశాడు. దీంతో అర్జున్‌కు బాక్స్‌లో ఎంత వెతికినా సరైన కీ దొరకలేదు. కీ కింద పడేయకూడదు కదా.. సంచాలకులు చెప్పాలి కదా అని గరమయ్యాడు. యావరే కీ కింద పడేశాడని తెలిసినా శివాజీ పెదవి విప్పలేదు. ఇక పాయింట్ల పట్టికలో యావర్ దిగువన ఉండటంతో రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన పాయింట్లను పల్లవి ప్రశాంత్‌కు ఇచ్చాడు. అమర్ విజయంపై డౌట్ తర్వాత పట్టుకో తెలుసుకో టాస్క్ జరగ్గా ఇందులో అమర్దీప్ గెలిచాడు. కానీ కళ్లు కనిపించకుండా ఇచ్చిన మాస్క్‌లు సరిగా పనిచేస్తున్నాయో, లేదోనని యావర్ చెక్ చేయడంతో అమర్ అసహనానికి లోనయ్యాడు. నేను గెలిచినప్పుడే అందరికీ అనుమానాలు వస్తాయని ఆవేశపడ్డాడు. తర్వాత బ్యాలెన్స్ ది బాల్ టాస్కు జరిగింది. బ్యాలెన్స్ టాస్కులకు పెట్టింది పేరైన ప్రశాంత్ ఈ గేమ్‌లో గెలిచాడు. ఇక ఈ టాస్కు ప్రారంభంలో నిన్ను ఓడిస్తా చూడు అని అమర్‌కు ఛాలెంజ్ చేశాడు గౌతమ్. అన్నట్లుగానే అమర్ ఓడిపోయిన తర్వాత గౌతమ్ ఆటలో నుంచి పక్కకు వెళ్లిపోయాడు. గౌతమ్ తనతో ఛాలెంజ్ చేసిన విషయాన్ని శోభాతో చెప్పాడు అమర్. దీంతో శోభ.. అతడు ఈ టికెట్ టు ఫినాలే రేసులో ఒక్క టాస్క్ కూడా గెలవలేదంటూ డాక్టర్ బాబును హేళన చేసి మాట్లాడింది. ఒక్క టాస్క్ కూడా గెలవని గౌతమ్ మొత్తానికి పాయింట్ల పట్టికను చూస్తుంటే అమర్- పల్లవి ప్రశాంత్ మధ్య గట్టి పోటీ ఉండేట్లు కనిపిస్తోంది. పాపం.. అర్జున్ గట్టిగా ప్రయత్నిస్తున్నా తనకెవరూ పాయింట్లు దానం చేయకపోవడంతో స్కోర్ బోర్డులో వెనుకబడ్డాడు. ఇక ప్రియాంక.. గౌతమ్‌ను తన పాయింట్లు అమర్‌కే ఇవ్వాలని మాట తీసుకుంది. దీంతో అతడు అమర్‌కు దానం చేయడం గ్యారెంటీ! సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రైతుబిడ్డ రేసు నుంచి తప్పుకోగా అమర్ వర్సెస్ అర్జున్ మాత్రమే టికెట్ టు ఫినాలే కోసం పోటీపడనున్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి! చదవండి: దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. 'రౌడీ బాయ్స్' హీరో ఎంగేజ్మెంట్ -
కొత్తింటి కల సాకారం చేసుకున్న దేత్తడి హారిక..
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లే రేపటి స్టార్లు.. ఈ మాటను ఎప్పుడో రుజువు చేసి చూపించింది దేత్తడి హారిక అలియాస్ అలేఖ్య హారిక. సాంగ్ ఆల్బమ్స్, రీల్స్ చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో తెగ హడావుడి చేసే ఈ బ్యూటీ పలు షార్ట్ ఫిలింస్, యూట్యూబ్ వెబ్ సిరీస్‌లు చేసింది. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్లో టాప్ 5 వరకు చేరుకుని తన సత్తా చూపించింది. సినిమాల్లో అక్కడక్కడా కనిపించినా పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు మాత్రం చేయలేదు. అయితే తను త్వరలోనే హీరోయిన్‌గానూ వెండితెరపై కనిపించనుంది. బేబి ఫేమ్ సాయి రాజేశ్ డైరెక్షన్లో సంతోష, హారిక హీరోహీరోయిన్లుగా నిస్తున్నారు. మొత్తానికి చాలాకాలానికి హారిక పంట పండిందని అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. తాజాగా మరో శుభవార్త చెప్పింది దేత్తడి పాప. తను కొత్తిల్లు కొనుక్కుంది. గృహప్రవేశానికి తారలను, స్నేహితులను ఆహ్వానించింది. ఈ క్రమంలో నూతన గృహప్రవేశానికి వచ్చిన దీప్తి సునయన తదితరులు కొత్తింటి కల సాకారమైనందుకు సంతోషంగా ఉందంటూ శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు. ఇంటికి వచ్చినవారిని వట్టి చేతులతో పంపించకుండా బహుమతులు కూడా అందించింది. చదవండి: అప్పట్లో నిశ్చితార్థం రద్దు.. 11 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న హీరోయిన్ -
Bigg Boss 7: మాటలు జారిన అమర్.. ప్రియాంక తప్పు చేయకపోయినా సరే అలా!
బిగ్‌బాస్ ప్రస్తుత సీజన్లో ఫినాలేలో తొలి స్థానం కోసం మంచి పోటీ నడుస్తోంది. మంగళవారం ఓ మూడు గేమ్స్ జరగ్గా.. తాజాగా మరో రెండు గేమ్స్ జరిగాయి. ఇందులో SPY(శివాజీ, ప్రశాంత్, యావర్) బ్యాచ్‌కి షాక్ తగిలింది. మరోవైపు సీరియల్ బ్యాచ్ లో ప్రియాంకని ఒంటరి చేసేశారు. శోభా-అమర్ కలిసి ఈమెపై మానసికంగా దాడి చేశారు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో అసలేం జరిగిందనేది Day 87 హైలెైట్స్లో ఇప్పుడు చూద్దాం. ఓ దాంట్లో టాప్.. మరో దానిలో ఫెయిల్ సోమవారం మూడు గేమ్స్ జరగ్గా.. రెండింటిలో అర్జున్ విజయం సాధించాడు. తాజాగా బుధవారం పెట్టిన గేమ్స్‌లోనూ అర్జున్ చాలా స్మార్ట్‌గా వ్యవహరించాడు. 'టికెట్ టూ ఫినాలే' కోసం 'ఎత్తరా జెండా' అని పెట్టిన నాలుగో గేమ్‌లో ప్రశాంత్, యావర్ తొలి రెండు స్థానాల్లో నిలవగా.. అర్జున్ మూడో స్థానం సంపాదించాడు. ఇక 'గెస్ చేయ్ గురూ' అని పెట్టిన ఐదో గేమ్‌లో.. వినిపించే సౌండ్స్ బట్టి, అవేంటనేవి వరసగా పలకపై రాయాల్సి ఉంటుంది. ఇందులో అర్జున్ 31 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. ఇదే పోటీలో సరిగా ఆడని కారణం.. ప్రశాంత్, యావర్ మధ్యలో ఔట్ అయిపోయారు. అలా స్పై బ్యాచ్ ఎదురుదెబ్బ తగిలింది (ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!) ప్రియాంక పాయింట్స్ దానం ఇక ఐదు గేమ్స్ పూర్తయిన తర్వాత చివరి స్థానంలో ప్రియాంక ఉన్న కారణంగా.. 'టికెట్ టూ ఫినాలే' రేసు నుంచి ఆమెని బిగ్‌బాస్ తప్పించాడు. అయితే ఆమె దగ్గరున్న వాటిలో సగం పాయింట్స్ వేరొకరికి ఇచ్చేయాల్సి ఉంటుంది చెప్పగా.. 125 పాయింట్లని గౌతమ్‌కి ఇచ్చేసింది. దీంతో ఓవరాల్ పొజిషన్లో గౌతమ్... మూడో స్థానానికి చేరుకున్నాడు. అయితే ఆ పాయింట్లు తనకు ఇస్తుందనుకున్న అమర్.. ప్రియాంకపై అలిగాడు. మాటలు జారిన అమర్ ప్రియాంక ఎలిమినేట్ అయిపోయి, తన పాయింట్లు గౌతమ్‌కి ఇచ్చేయడాన్ని అమర్ తీసుకోలేకపోయాడు. ఆమె తప్పు చేసిందని అన్నాడు. అది తన గేమ్, తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని శోభా.. పరిస్థితి వివరించడానికి చూసింది. కానీ అమర్ తీసుకోలేకపోయాడు. కాసేపటి తర్వాత ప్రియాంకతో మాట్లాడుతూ.. నాకు ఇవ్వాలనిపించలేదా? అని అమర్.. డైరెక్ట్‌గా ఆమెనే అడిగాడు. ప్రియాంక, అమర్‌కి పరిస్థితి అర్థమయ్యేలా చెప్పడానికి చూస్తుంటే.. 'వెధవని అయిపోయింది నేనేగా' అని అమర్ మాట జారాడు. ఏం చెప్పాలనుకుంటున్నావ్, క్లియర్‌గా చెప్పి వెళ్లు అని ప్రియాంక.. తిరిగి మాట్లాడుతుండగానే అమర్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. (ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..) అమర్ ఇలా తయారయ్యాడేంటి? ప్రియాంకపై ఏది పడితే మాట్లాడేసిన అమర్.. 'అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, మన అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు' అని తనలో తానే ఏదేదో మాట్లాడేసుకున్నాడు. 'పిచ్చ నా కొడకా, ఇప్పుడైనా నీకు కళ్లు తెరుచుకుంటే బాగుపడతావ్' అని తనని తానే తిట్టుకున్నాడు. మరోచోట.. ప్రియాంక, గౌతమ్‌తో మాట్లాడుతూ.. వాళ్లకు వాళ్లకే గ్రాటిట్యూడ్ ఉంటుంది, మాకు ఉండదా అని శోభా-అమర్‌ని ఉద్దేశిస్తూ తన మనసులో మాట బయటపెట్టింది. ఇదంతా జరిగిన కాసేపటి తర్వాత అమర్ దగ్గరకొచ్చిన ప్రియాంక.. చేసిన దానికి క్షమాపణలు చెప్పింది. తప్పయిపోయింది, ప్లీజ్ క్షమించు అని బతిమాలాడుకుంది. అయినా సరే అమర్.. శాంతించలేదు. దీంతో మిగతా వాళ్లతో ఈ విషయం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక్కడ ఓ విషయం మాత్రం వింతగా అనిపించింది. ఎందుకంటే అమర్.. మరీ స్వార్థపరుడిలా ప్రవర్తించాడా అనే సందేహం వచ్చింది. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం ప్రియాంక ఏం చేయాలో కూడా అమరే డిసైడ్ చేస్తాడా? ఆమెకు స్వాతంత్రం లేదా అనిపించింది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: 'సలార్' స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. అదీ మ్యాటర్!) -
Bigg Boss 7: సీరియల్ బ్యాచ్ కొట్లాట.. చివరకొచ్చేసరికి ఇలా తయారయ్యేంట్రా!
బిగ్‌బాస్ గత సీజన్స్ మాటేమో గానీ ఈసారి మాత్రం బ్యాచ్‌ల గోల ఎక్కువైంది. అంతెందుకు రీసెంట్ వీకెండ్ ఎపిసోడ్లో స్వయంగా హోస్ట్ నాగార్జున ఒప్పుకొన్నాడు. చుక్క బ్యాచ్, ముక్క బ్యాచ్ అని చెప్పుకొచ్చాడు. ఇందులో శివాజీ ఆధ్వర్యంలోని ముక్క బ్యాచ్ బాగానే ఉంది. చుక్క బ్యాచ్ అధ్వానంగా తయారైంది. బయటవాళ్లతో కాదు వీళ్లలో వీళ్లే గొడవపడి ఆ తప్పు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంతకీ ఏం జరుగుతోంది? (ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!) ప్రస్తుత సీజన్లో సీరియల్ బ్యాచ్ సభ్యులైన అమర్, ప్రియాంక, శోభా.. ప్రారంభం నుంచి ఒక్కటిగా ఆడుతున్నారు. మరోవైపు శివాజీ, ప్రశాంత్, యావర్.. ఓ బ్యాచ్‌గా ఆడుతున్నారు. నామినేషన్స్ దగ్గర నుంచి గేమ్స్ వరకు పోటీ అంతా వీళ్ల మధ్య ఉంటోంది. శివాజీ బ్యాచ్‌తో పోలిస్తే సీరియల్ బ్యాచ్ కొన్ని విషయాల్లో బెటర్. కానీ ఇప్పుడు వీళ్లే తమ నిల్చున్న కొమ్మ తామే నరుక్కుంటున్నట్లు అనిపిస్తోంది. తాజాగా 'టికెట్ టూ ఫినాలే' కోసం పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శోభా, శివాజీ ఇప్పటికే తక్కువ పాయింట్లు సాధించిన కారణంగా గేమ్ నుంచి సైడ్ అయిపోయారు. అమర్, ప్రశాంత్, అర్జున్, గౌతమ్, యావర్, ప్రియాంక.. ఇలా దాదాపుగా అబ్బాయిలే ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక కూడా తక్కువ పాయింట్లు ఉన్న కారణంగా గేమ్ నుంచి సైడ్ అవ్వాలి. దీంతో ఆమె తన సగం పాయింట్లని వేరొకరికి ఇవ్వాలని చెప్పగా, గౌతమ్‌కి ఇచ్చేసింది. (ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..) 12వ వారం ప్రియాంక కెప్టెన్ కావడానికి గౌతమ్ సాయం చేశాడు. ఇప్పుడు పాయింట్స్ ఇచ్చి అతడి రుణం తీర్చుకుంది. అయితే పాయింట్స్ ఇవ్వడానికి తాను కనిపించలేదా అని అమర్ హర్ట్ అయిపోయారు. దీంతో శోభా-అమర్ ఒక్కటైపోయారు. ప్రియాంకని వేరు చేసి చూస్తున్నారు. ఇన్నాళ్లు ఒక్కటిగా ఉంటూ వచ్చిన సీరియల్ బ్యాచ్.. శివాజీని అన్ని విషయాల్లోనూ ఎదుర్కొంటూ వచ్చారు. ఇప్పుడు చివరకొచ్చేసరికి వీళ్లలో వీళ్లు కొట్లాడుకుని.. శివాజీ బ్యాచ్ కి హెల్ప్ అయ్యేలా ఉన్నారనిపిస్తుంది. ఒకవేళ ఇలానే జరిగితే మాత్రం.. తెలియకుండానే శివాజీ బ్యాచ్ కి హెల్ప్ చేసినట్లు అవుతుంది. గేమ్‌లో ఉన్న ఆ కాస్త మజా కూడా పోవడం గ్యారంటీ. అయితే ఈ గొడవలో ప్రియాంక కాస్త ఆలోచనతో వ్యవహరించినట్లు అనిపించింది. అమర్ మాత్రం ప్రతిదానికి అలుగుతూ తనపై ఉన్న సింపతీని కాస్త నెగిటివిటీ చేసుకునేలా కనిపిస్తున్నాడు. మరోవైపు అతడికి సపోర్ట్ చేస్తున్న శోభా కూడా తెలియకుండానే మరింత నెగిటివీ తెచ్చుకుంటోందనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు) -
బిగ్‌బాస్: అమర్‌కు ఝలక్ ఇచ్చిన ప్రియాంక..
విజయవంతంగా దూసుకుపోతున్న బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ముగింపు దశకు చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్‌లో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ 5లో ఉంటారు? ఎవరు విజేతగా అవతరిస్తారు? అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే ఫినాలేలో అందరి కంటే ముందు అడుగుపెట్టేందుకు బిగ్‌బాస్ ఫినాలే అస్త్రను ప్రవేశపెట్టాడు. ఇది గెలిచినవారు నేరుగా టాప్ 5కి చేరుకుంటారు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే మొదలైంది. ఇందులో భాగంగా పలు గేమ్స్ ఆడిస్తున్నాడు బిగ్‌బాస్. తొలి ఆటలో అర్జున్ గెలవగా రెండో టాస్క్‌లో ప్రశాంత్ గెలిచాడు. ఈరోజు హౌస్‌లో మరిన్ని టాస్కులు ఆడించాడు బిగ్‌బాస్. మూడో టాస్క్‌లో అర్జున్, నాలుగో టాస్కులో ప్రశాంత్ విజయం సాధించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇచ్చిన మరో టాస్క్‌లో అమర్దీప్ విజేతగా నిలిచాడు. తక్కువ పాయింట్లు ఉన్నవారు ఒక్కొక్కరిగా రేసులో నుంచి అవుట్ అవుతున్నారు. ఇప్పటివరకు శివాజీ, శోభతో పాటు ప్రియాంక సైతం గేమ్‌లో అవుట్ అయినట్లు తెలుస్తోంది. అయితే తన పాయింట్లను అమర్‌కు కాకుండా తన కెప్టెన్సీ కోసం పోరాడిన గౌతమ్‌కు ఇచ్చిందట! ప్రస్తుతం టికెట్ టు ఫినాలే రేసులో ప్రశాంత్, అర్జున్, అమర్దీప్, గౌతమ్, యావర్ ఉన్నారు. వీరిలో గౌతమ్ దగ్గర తక్కువ పాయింట్లు ఉన్నాయని టాక్! మరి ఫినాలే అస్త్ర ఎవరి సొంతమవుతుంది? ఎవరు టాప్ 5లో తొలుతగా చోటు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. -
Bigg Boss 7: శివాజీ తెలివిలేని పని.. ప్రియాంక ప్రాణం మీదకొచ్చింది!
బిగ్‌బాస్ 7వ సీజన్లో శివాజీ ఉన్నాడంటే ఉన్నాడంతే. ఓ టాస్క్ సరిగా ఆడలేడు, గేమ్‌లో గెలవలేడు. పోనీ సంచాలక్ బాధ్యత అయినా సరిగా చేశాడా? అంటే అది లేదు. తాజాగా శివాజీ పెట్టిన నిర్ణయం.. ప్రియాంక ప్రాణాల మీదకు తెచ్చింది. మరోవైపు 'టికెట్ టూ ఫినాలే' కోసం ఆల్రెడీ పోటీ మొదలైంది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 86 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. శివాజీ సోది ముచ్చట నామినేషన్స్ పూర్తవడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే అర్జున్, గౌతమ్ తనని నామినేట్ చేయడాన్ని శివాజీ తీసుకోలేకపోయాడు. పొద్దుపొద్దునే ప్రశాంత్‌తో మాట్లాడుతూ.. మొన్నే వెళ్లిపోవాల్సిందిరా, ఎందుకురా ఈ మెంటల్ టార్చర్ అని గౌతమ్‌ని ఉద్దేశించి అన్నాడు. అలానే తన విషయంలో అర్జున్‌ది 100 శాతం పిచ్చి స్ట్రాటజీ అని, నన్ను పంపించేయండ్రా బాబు అని మాట్లాడాడు. ఇది జరిగిన కాసేపటి తర్వాత ప్రియాంకతోనూ మాట్లాడుతూ.. వెళ్లిపోయినా బాగుండేది, పిల్లలు బాగా గుర్తొస్తున్నారని శివాజీ చెప్పుకొచ్చాడు. అయితే ఇవన్నీ కూడా సోది ముచ్చట్లలానే అనిపించాయి. టికెట్ టూ ఫినాలే షురూ 13వ వారం వచ్చేసింది. అంటే ఫినాలే జరగడానికి రెండు వారాలు కూడా లేదు. దీంతో బిగ్‌బాస్.. తన గేమ్ షురూ చేశాడు. 'టికెట్ టూ ఫినాలే' మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా పలు గేమ్స్ పెడతారని, వీటన్నింటిలో గెలిచి ఎక్కువ పాయింట్స్ సంపాదించిన హౌస్‌మేట్.. ఇకపై కేవలం ఇంటి సభ్యునిగా ఉండకుండా నేరుగా ఫినాలే వారానికి చేరుకుంటారు. మొట్టమొదటి ఫైనలిస్ట్ అవుతారని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చేశాడు. అర్జున్ దూకుడు.. అమర్ అదృష్టం 'టిక్ టాక్ టిక్' అని తొలి గేమ్‌లో భాగంగా.. బాణం వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఆ బాణం టచ్ అయితే ఔట్ అయినట్లు కాదు, ఫ్లాట్ ఫామ్ పైనుంచి కింద పడితే ఔట్ అయినట్లు అని బిగ్‌బాస్ తొలుత చెప్పాడు. కాసేపటి తర్వాత బాణానికి కాలు తగిలినా సరే ఫౌల్(ఔట్) అని ట్విస్ట్ ఇచ్చాడు. ఇందులో ప్రశాంత్, గౌతమ్, శోభా, శివాజీ, యావర్, అమర్, ప్రియాంక వరసగా ఎలిమినేట్ అయిపోయారు. చివరగా మిగిలిన అర్జున్ విజేతగా నిలిచాడు. పూలని సేకరించే రెండో టాస్క్‌లో తక్కువ పూలు ఉన్న కారణంగా శివాజీ, ప్రియాంక ఎలిమినేట్ అయిపోయారు. ఇలా రెండు గేమ్స్‌తో మొదటి లెవల్ పూర్తయింది. పాయింట్ల ప్రకారం చివర్లో ఉన్న శివాజీ, శోభా ఎలిమినేట్ అయిపోయారు. వాళ్లు పాయింట్స్ వేరొకరికి ఇవ్వాలని చెప్పగా.. అమర్‌కి ఇచ్చేశారు. అలా మనోడికి లక్ కలిసొచ్చింది. తలతిక్క సంచాలక్స్.. గేమ్ డిస్ట్రబ్ ఇక చివరగా 'గాలం వేయ్ బుట్టలో పడేయ్' అనే టాస్క్ పెట్టారు. దీనికి శివాజీ, శోభా సంచాలక్స్గా వ్యవహరించారు. అయితే రింగ్‌తో బంతిని బయటకు లాగిన తర్వాత ఎవరైనా సరే దాన్ని తీసేసుకోవచ్చని ఓ పిచ్చి రూల్ పెట్టారు. ఈ పోటీ అర్జున్.. బంతిని ఫస్ట్ ఫస్ట్ లాగేసి ఎక్కువ పాయింట్స్ సంపాదించాడు. అయితే ప్రియాంక మూడుసార్లు బంతిని బయటకు లాగినప్పటికీ ప్రశాంత్, యావర్, అమర్.. ఈమె దగ్గర నుంచి లాగేసుకున్నారు. చివర్లో అమర్ అయితే ఈమెని ఎలా పడితే అలా లాగేశాడు. బయటకు చెప్పలేదు గానీ ప్రియాంకకు దెబ్బలు గట్టిగానే తగిలినట్లు అనిపించాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. శివాజీకి గ్రూప్ గేమ్స్ అంటే ప్రశాంత్-యావర్ తో ఏదే మేనేజ్ చేసి ఆడేస్తాడు. కానీ ఒంటరిగా ఆడాలనేసరికి దొరికిపోయాడు. తాజాగా రెండు గేమ్స్ లోనూ ఓడిపోయి.. టికెట్ టూ ఫినాలే రేస్ నుంచి తప్పించారు. పోనీ అది కాదని సంచాలక్ బాధ్యతలు ఇస్తే, అందులోనూ ఎక్కడలేని పిచ్చి రూల్స్ అన్ని పెట్టి.. ప్రియాంక విజయావకాశాల్ని దెబ్బతీసేశాడు చేశాడు. 13వ వారంలో శివాజీ తీరు వల్ల అతడొక్కడే కాదు.. మొత్తం గేమ్ తీరే దెబ్బతింటోంది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. -
Bigg Boss 7: శివాజీకి షాకిచ్చిన బిగ్‌బాస్.. ఓట్లు పడినా ఈసారి వేటు గ్యారంటీ!
'బిగ్‌బాస్' షోలో శివాజీ ఆటలు ఇన్నిరోజులు సాగాయేమో కానీ ఇకపై మాత్రం నో ఛాన్స్. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. ఇప్పటివరకు ఓట్లు పడితే సేవ్ అవుతూ వచ్చాడు. ఈసారి మాత్రం వేటు పడటం గ్యారంటీ అనిపిస్తుంది. మొన్నీమధ్యే శివాజీకి బిగ్‌బాస్.. వార్నింగ్ లాంటి హింట్ ఇచ్చాడు. కాకపోతే మనోడు అప్పుడు అర్థం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు రియాలిటీలో అదంతా తెలిసి వస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? శివాజీకి బుర్రపనిచేయలేదు మొన్న వీకెండ్ ఎపిసోడ్లో భాగంగా భుజం సమస్య గురించి శివాజీని బిగ్‌బాస్ అడిగి తెలుసుకున్నాడు. నొప్పి ఎలా ఉందని అడుగుతూనే.. ఇకపై హౌస్‌లో ఉండాలనుకుంటున్నారా? వెళ్లిపోవాలనుకుంటున్నారా? అని చాలా పద్ధతిగా అడిగాడు. శివాజీ మాత్రం... ఉంటానని, వెళ్లిపోతానని రకానికి ఒకలా చెప్పాడు. చివరగా నాగార్జున సర్ది చెప్పడంతో.. కొనసాగుతానని అన్నాడు. అయితే అన్ని విషయాల్లో ముందు చూపుతో ఆలోచించే శివాజీ.. బిగ్‌బాస్ ఇచ్చిన హింట్‌ని సరిగా అర్థం చేసుకోలేక పప్పులో కాలేశాడు. కరెక్ట్‌గా చెప్పాలంటే శివాజీకి బుర్రలేదని క్లియర్‌గా అర్థమైపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు) శివాజీకి వరస షాక్‌లు ఈవారం నామినేషన్స్ పూర్తయిపోయాయి. అమర్ తప్ప మిగతా ఏడుగురు లిస్టులో ఉన్నారు. అయితే ఈసారి కెప్టెన్సీ కోసం టాస్క్‌లు ఏం ఉండవని నాగ్ ముందే చెప్పాడుగా. దీనికి తగ్గట్లే 'టికెట్ టూ ఫినాలే' పోరు మొదలైంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోల ప్రకారం మూడు గేమ్స్ పెట్టగా.. శివాజీ అడ్డంగా దొరికిపోయాడు. ఏ ఒక్క దానిలోనూ కనీసం చివరివరకు వెళ్లలేకపోయాడు. ఇలా వరస షాక్‌లు తగిలాయి. వేటు పడటం గ్యారంటీ? ప్రతివారం ఓట్లు పడితే నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోవచ్చు. ఇన్నాళ్లు ఇదే జరుగుతోంది. అయితే చివరి వారాల్లో ఓట్లు ఎక్కువ పడితే సరిపోదు. గేమ్స్‌లోనూ గెలవాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు గ్రూప్ గేమ్స్ కాబట్టి శివాజీ తన మాటలతో మేనేజ్ చేస్తూ బండి లాక్కొచ్చేశాడు. కానీ ఇప్పుడు జరిగేవన్నీ సింగిల్ గేమ్స్ కదా. శివాజీ పనితనం ఏంటో తేలుతుంది. ఒకవేళ టికెట్ టూ ఫినాలే పోటీలో గెలవకపోతే.. ఓటింగ్‌తో సంబంధం లేకుండా బయటకు పంపేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఫిజికల్ టాస్క్‌ల వల్ల భుజం నొప్పి తిరగబెడితే మాత్రం.. శివాజీ మిడ్ వీక్ ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ ఎంగేజ్మెంట్.. కాబోయే భర్త ఎవరంటే?) -
టికెట్ టు ఫినాలే.. ఆదిలోనే రైతుబిడ్డ అవుట్.. కానీ..
డబుల్ ఎలిమినేషన్ సమయంలో గ్రూపులు బయటపడ్డాయి. హౌస్‌లో స్పా(శోభ, ప్రియాంక, అమర్), స్పై(శివాజీ, ప్రశాంత్, యావర్) బ్యాచ్‌లున్నాయని స్వయంగా నాగార్జునే బయటపెట్టాడు. దీంతో గ్రూప్ గేమ్ ఆడట్లేదంటూ అబద్ధాలు వల్లెవేస్తున్న శివాజీ నాటకాలకు అడ్డుకట్ట వేసినట్లయింది. ఇక నామినేషన్స్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో లెక్కలు మారిపోయాయి. స్పై బ్యాచ్‌కు దగ్గర్లో ఉన్న అర్జున్ నామినేషన్స్‌తో శివాజీకి పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాలను పక్కనపెడితే బిగ్‌బాస్ ఫినాలేకు చేరుకోవడానికి టికెట్ టు ఫినాలేను ప్రవేశపెట్టాడు. ఫినాలే అస్త్ర గెలుచుకున్నవారు నేరుగా ఫైనల్స్‌కు వెళ్తారని చెప్పాడు. అయితే ఒకటీరెండు ఆటలు కాకుండా దాదాపు 10 వరకు టాస్క్‌లివ్వనున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌లో గెలిచినవారికి వంద పాయింట్లు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అలా చివరికి ఎవరి దగ్గర ఎక్కువ పాయింట్లు ఉంటే వారే ఫినాలే అస్త్ర సొంతం చేసుకుంటారు. తాజాగా రిలీజైన ప్రోమోలో.. ఫినాలే అస్త్ర కోసం మొదటి టాస్క్ ఇచ్చాడు. ఈ ఆటలో ప్రశాంత్ మొదట అవుట్ అవగా.. అర్జున్ చివరి వరకు ఉండి గెలిచాడు. రెండో గేమ్‌లో ప్రశాంత్, మూడో గేమ్‌లో అర్జున్ గెలిచారు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న శివాజీ, శోభ గేమ్‌లో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వీరు తమ పాయింట్లను అమర్‌కు త్యాగం చేసినట్లు వినికిడి! చదవండి: రంగులు గుమ్మరించినట్లుగా ఉన్న ఈ షర్ట్ ధరెంతో తెలుసా? -
బిగ్‌బాస్: వామ్మో... నాగార్జున షర్ట్ ధర అన్ని లక్షలా?
తెలుగు ఇండస్ట్రీలో మన్మథుడు ఎవరనగానే నాగార్జున అని టపీమని చెప్పేస్తారు. 64 ఏళ్ల వయసులోనూ యంగ్‌గా కనిపిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటినిస్తున్నాడు కింగ్. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క బిగ్‌బాస్ షోకి హోస్టింగ్ చేస్తున్నాడు. వీకెండ్లో హౌస్‌మేట్స్‌కు క్లాసులు పీకుతూ తర్వాత వారితో గేమ్స్ ఆడిస్తూ ఉంటాడు. శని, ఆదివారాల్లో స్పెషల్‌గా డిజైన్ చేసిన డ్రెస్సుల్లో దర్శనమిస్తుంటాడు నాగ్. కొన్ని చిత్రవిచిత్రంగా ఉన్నా నాగ్‌కు మాత్రం పర్ఫెక్ట్గా సరిపోతుంటాయి. అలా మొన్నటి శనివారం.. రంగులతో పెయింట్ వేసినట్లుగా ఉన్న షర్ట్ ధరించాడు. వాలెంటినో బ్రాండ్‌కు చెందిన ఈ షర్ట్ ధర ఏకంగా రూ.1,03,019గా ఉంది. ఆదివారం రోజు ఆయన వైట్ స్వెట్‌షర్ట్ ధరించాడు. లూయిస్ వ్యూటన్కు చెందిన దీని ధర ఏకంగా రూ.1,82,016 అని తెలుస్తోంది. ఆరోజు ఆయన వేసుకున్న షూ ధర కూడా లక్ష పై చిలుకే ఉండటం గమనార్హం. ఎంతైనా స్టార్ హీరో కదా.. ఆమాత్రం మెయింటెన్ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం నాగ్ 'నా సామిరంగా' సినిమా చేస్తున్నాడు. చదవండి: మహేశ్‌బాబు సినిమా 10 సార్లు చూసి ఎంపీనయ్యా.. మల్లారెడ్డి స్పీచ్ వైరల్ -
శివాజీ ఆటలో బలిపశువుగా అర్జున్.. ఈ వారం అస్సాం టికెట్ ఫిక్స్!
ఎలిమినేషన్‌కు పునాదులు పడేది నామినేషన్లోనే! కేవలం నామినేట్ అయితేనే ఎలిమినేట్ అయిపోరు.. ఇక్కడ ఎవరు ఏ కారణాలు చెప్తున్నారు? ఎవరి తప్పొప్పులు బయటపడుతున్నాయి? ఇలా అన్నింటినీ గమనిస్తారు ప్రేక్షకులు. ఎవరైతే కరెక్ట్ అనిపిస్తారో వారికి సపోర్ట్‌గా ఉంటారు. ఫలానా వాళ్లు తప్పనిపిస్తే వారికి ఓట్లేయడం మానేసి బయటకు పంపించేస్తారు. మరి ఈ పదమూడోవారం నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో చూసేద్దాం... అబద్ధాలు ఆడుతున్నానా? ఈ వారం నామినేషన్ ప్రక్రియ రైతుబిడ్డతో మొదలైంది. సీక్రెట్ టాస్క్‌లో కూడా నీ ఫ్రెండ్ శోభాను కాపాడాలనుకున్నావ్, అది నచ్చలేదంటూ ప్రియాంకను, వీఐపీ రూమ్‌లోని దుప్పటి దాచుకుని వాడుతున్నావంటూ శోభాను నామినేట్ చేశాడు ప్రశాంత్. గౌతమ్.. ప్రియాంక, శివాజీకి రంగు పూశాడు. తర్వాత ప్రియాంక మాట్లాడుతూ.. నాగార్జున సార్ ముందు నేను అబద్ధాలే ఆడతానని నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు... అది నేను తీసుకోలేకపోతున్నాను అంటూ శివాజీకి రంగు పూసింది. తర్వాత ప్రశాంత్‌ను నామినేట్ చేసింది. పెద్ద తప్పు చేసిన అర్జున్ ఒక్కోసారి చిన్న తప్పులే మన మెడకు చుట్టుకుంటాయి. అలా గతవారం సెల్ఫ్ నామినేట్ చేసుకుని ఏకంగా ఎలిమినేట్ అయిపోయింది అశ్విని. ఇక ఎప్పుడూ తెలివిగా నామినేషన్స్ వేసిన అర్జున్ అంబటి ఈవారం సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. కెప్టెన్సీ కోసం తనకు మద్దతుగా నిలబడ్డ శివాజీని నామినేట్ చేశాడు. నిజానికి శివాజీ.. అర్జున్ను అడ్డుపెట్టుకుని అమర్ మీద కసి తీర్చుకున్నాడు. అతడిని కెప్టెన్ కానీయకుండా చేశాడు. ఈ విషయాన్ని హౌస్‌లో గౌతమ్ తప్ప ఎవరూ పసిగట్టలేకపోయారు. అర్జున్ అప్పుడే ఓ మెట్టు దిగి అమర్‌ను కెప్టెన్ చేయండి అని చెప్పుంటే హీరో అయ్యేవాడు. అర్జున్‌కు దెబ్బ పడింది అప్పుడు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు శివాజీని నామినేట్ చేయడం వల్ల అందరి దృష్టిలో విలన్ అయిపోయాడు. ఫినాలే దగ్గరకు వస్తున్నా సొంతంగా ఆడకపోవడం కరెక్ట్ కాదంటూ ప్రియాంకను నామినేట్ చేశాడు. తర్వాత శివాజీ వంతురాగా.. అర్జున్ ఇచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసేశాడు. నువ్వు గేమ్ ఆడుతున్నావని తెలిసాక కూడా ఇది ఉంచుకోవడం కరెక్ట్ కాదన్నాడు. నీకు కెప్టెన్ కావాలని ఇంట్రస్ట్ లేకపోతే మొదట్లోనే చెప్పేస్తే సరిపోయేది.. ఇప్పుడు నేను పిచ్చోడిని అయిపోయాను అంటూ అర్జున్ను నామినేట్ చేశాడు. తర్వాత తనను నామినేట్ చేసిన గౌతమ్‌కు రివేంజ్ నామినేషన్ వేశాడు. తప్పు చేసిన అమర్, ఏడ్చేసిన ప్రశాంత్ అనంతరం అమర్దీప్ చౌదరి కూడా ఓ పెద్ద తప్పు చేశాడు. కెప్టెన్సీ టాస్కులో తనకు సపోర్ట్ చేసిన ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు. బీబీ మ్యాన్షన్ గేమ్‌లో నువ్వు అంత త్వరగా చనిపోవడం నచ్చలేదు. నీతో గేమ్ ఆడటం మిస్ అయ్యానంటూ సిల్లీ రీజన్ చెప్పాడు. ఇది విని షాకైన ప్రశాంత్.. నిన్ను నమ్మినందుకు బాధపడుతున్నా అని ఏడ్చేశాడు. నమ్మకద్రోహం అని మాట్లాడకు.. నీకు వేయను పో అని అమర్ అన్నప్పటికీ ప్రశాంత్ అక్కడినుంచి కదలకపోవడంతో రైతుబిడ్డకు రంగు పూశాడు అమర్. అలాగే తనకు కెప్టెన్సీ కోసం సాయపడలేదని గౌతమ్‌ను నామినేట్ చేశాడు. తర్వాత యావర్.. గౌతమ్, ప్రియాంకను నామినేట్ చేశాడు. చివరిగా శోభా.. ప్రశాంత్, యావర్‌లను నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారం అమర్దీప్ మినహా మిగతా అందరూ నామినేట్ అయ్యారు. చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు చిత్రం.. నిర్మాతకు కాస్ట్లీ కారు గిఫ్ట్ -
'మీ దోస్తాన్ మళ్లీ స్టార్ట్ చేసిర్రు'.. నా కళ్లు తెరుచుకున్నాయన్న రైతు బిడ్డ!
బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 మరో వారం ముగిసింది. గతవారం ఎవరిని ఎలిమినేట్ చేయని బిగ్‌బాస్.. ఈ సారి ఏకంగా ఇద్దరిని ఇంటికి పంపించేశాడు. ఇప్పటివరకు హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ ముగియడంతో మళ్లీ నామినేషన్స్ పర్వం మొదలైంది. ఇప్పటి నుంచి టాప్-5 లో నిలిచేందుకు టఫ్ ఫైట్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియలో వాదనలు వేరే లెవెల్లో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. ప్రోమో ప్రారంభంలోనే యావర్‌ను నామినేట్ చేస్తూ శోభాశెట్టి.. గేమ్ ఓవర్ శెట్టి అని రాశావ్ అంటూ చెప్పింది. దీనికి నువ్వు చూశావా అని యావర్ అడగడంతో.. నేను చూడలేదంటూ సమాధానమిచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్‌ను అమర్ నామినేట్ చేశాడు. దీంతో రైతు బిడ్డ ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు. దీంతో అమర్.. పోరా కూర్చోపో.. ఎలిమినేట్ చేయను పో అన్నాడు. దీనికి అన్నా నిన్ను నమ్మినందుకు నేను బాధపడతున్నా అంటూ ప్రశాంత్ మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వతా శివాజీని నామినేట్ చేస్తూ మధ్యలో ప్రశాంత్ టాపిక్ తీసుకొచ్చాడు గౌతమ్. నేను ఎప్పుడైనా యావర్, ప్రశాంత్‌కు సపోర్ట్ చేశానా? అని గౌతమ్‌ను ప్రశ్నించాడు. ఆ తర్వాత గౌతమ్‌ను అమర్ నామినేట్ చేశాడు. నాకు సపోర్ట్ చేస్తా అని మోసం చేశావ్ అన్నాడు. మధ్యలో శివాజీ ఎంటరయ్యాడు. వాంటెడ్‌గా చేస్తుంటే జనాలేమైనా పిచ్చోళ్లా ఇక్కడ ఉంచడానికి అని గౌతమ్ ఫైరయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్‌ను శోభా నామినేట్ చేస్తూ.. నువ్వు చాలా సేఫ్‌గా ఆడావు.. నీవల్లే అమర్ కెప్టెన్సీ పోయిందంటూ నామినేట్ చేసింది. దీనికి ఆశ్చర్యపోయిన ప్రశాంత్ అన్నా.. నా వల్లే కెప్టెన్సీ పోయిందా? అని అమర్‌ను అడిగాడు. దీనికి ప్రశాంత్‌పై ఓ రేంజ్లో ఫైర్ అయింది శోభా. దీనికి మీరు మళ్లీ దోస్తాన్ స్టార్ట్ చేసిర్రు.. నా కళ్లు ఇప్పడే తెరుచుకున్నాయి అన్నాడు ప్రశాంత్. దీనికి శోభా.. అవును బరాబర్ ఆ రోజు సేఫ్ గేమ్ ఆడింది పల్లవి ప్రశాంత్ అంటూ గట్టిగానే వాదించింది. దీంతో ప్రోమో ముగిసింది. ఎవరు, ఎవరినీ నామినేట్ చేశారనేది పూర్తి వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. -
హీరో అల్లరి నరేశ్ తండ్రి నన్ను అడ్జస్ట్మెంట్ అడిగాడు: షకీల
టాలీవుడ్‌లోని ఓ స్టార్ హీరో టార్చర్ వల్ల సినిమాలే వదిలేశానంటూ ఇటీవల నటి విచిత్ర చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఆయన ప్రవర్తన వల్ల ఇండస్ట్రీని వదిలేశానని, 20 ఏళ్లుగా స్క్రీన్‌పై కనిపించనేలేదని చెప్పింది. తాజాగా షకీల.. విచిత్రకు మద్దతు తెలుపుతూ తాను కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్ తండ్రి తనను అడ్జస్ట్మెంట్ గురించి అడిగాడని ఆరోపించింది. విచిత్ర అతడి పేరు చెప్పాల్సింది తమిళ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'విచిత్ర నా స్నేహితురాలు. మేమిద్దరం కొన్ని సినిమాల్లో కలిసి నటించాం కూడా! ఏ హీరో తనను గదిలోకి పిలిచాడు? ఎవరి వల్ల ఇండస్ట్రీని వదిలేయాల్సి వచ్చిందనేది చెప్తే బాగుండేది. అతడి పేరు బయటపెట్టి ఉండాల్సింది. నేను ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. గతంలో నేను కూడా ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఒకానొక సమయంలో అల్లరి నరేశ్ తండ్రి, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ నన్ను అడ్జస్ట్మెంట్ అడిగాడు. అడ్జస్ట్ అయిపో.. ఇంకో సినిమా ఇస్తా.. తనతో అడ్జస్ట్ అయితే నాకు నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఇస్తానన్నాడు. అప్పుడు నేను.. సర్, ఇప్పుడీ సినిమాలో నటించినందుకు నాకు డబ్బులిచ్చేశారు. ఇంకో సినిమా ఛాన్స్ నాకు అక్కర్లేదు. అంత అవసరం కూడా లేదు అని ముఖం మీదే చెప్పాను. ఇప్పుడాయన బతికి లేరు. దీని గురించి నన్ను టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు పిలిచి అడిగినా చెప్తా.. అవును, ఆ రోజు ఆయన నన్ను తన గదికి పిలిచాడు. ఇదే నిజం..' అని చెప్పుకొచ్చింది షకీల. ఈమె వ్యాఖ్యలు టాలీవుడ్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కాగా బోల్డ్ నటిగా పేరు తెచ్చుకున్న షకీల ఇటీవలే బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో అడుగుపెట్టింది. రెండు వారాలకే హౌస్‌లో నుంచి ఎలిమినేట్ అయింది. చదవండి: నా కూతురు సహజీవనం చేస్తానంటే బలవంతంగా మొదటి పెళ్లి చేశా.. చివరకు.. -
ఆ ఒక్కరు తప్ప అందరూ నామినేషన్స్‌లో, ఎవరెవరంటే?
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో ఎనిమిది మంది మిగిలారు. వీరిలో ఎవరు టాప్ 5కి చేరతారు? ఎవరు ఫినాలేలో అడుగుపెట్టకుండానే తిరిగి వెళ్లిపోతారు? అనేది ఆసక్తికరంగా మారింది. నిన్న డబుల్ ఎలిమినేషన్‌తో అశ్విని, రతిక ఇద్దరినీ పంపించేశారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడే ఛాన్స్ ఉన్నప్పటికీ రైతుబిడ్డ ఎవరికీ ఇవ్వడానికి మొగ్గుచూపలేదు. దీంతొ ఇద్దరమ్మాయిలు వెళ్లిపోయారు. తాజాగా మరో ఒకర్ని ఇంటికి పంపించేందుకు నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. నామినేట్ చేయాలనుకునే ఇద్దరి ముఖంపై పెయింట్ వేయాలని చెప్పాడు. ప్రియాంక మాట్లాడుతూ.. మీరు నా గేమ్ చూసి చాలాసార్లు ప్రోత్సహించారు. దానికన్నా ఎక్కువ నాపై నెగెటివిటీ పెట్టుకున్నారు. నన్ను నెగెటివ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు అంటూ శివాజీని నామినేట్ చేసింది. అర్జున్, గౌతమ్ సైతం అతడిని నామినేట్ చేశారు. ఇక సోఫాజీని నామినేట్ చేసినందుకో ఏమో కానీ ప్రిన్స్ యావర్, ప్రశాంత్.. సీరియల్ బ్యాచ్‌ను నామినేట్ చేశారు. కానీ అమర్‌ను మాత్రం ఎవరూ నామినేట్ చేయకపోవడం విశేషం. దీంతో ఈ వారం అమర్ మినహా మిగతా ఏడుగురూ నామినేషన్లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎవర్ని ఏ కారణాలతో నామినేట్ చేశారు? టికెట్ టు ఫినాలే దక్కించుకునేదెవరు? అనేది రానున్న ఎపిసోడ్స్‌లో తెలియనుంది. చదవండి: తెలుగులో స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్.. కానీ అలా చేశారు