బిగ్‌బాస్‌ 7: స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అర్జున్‌ ఎలిమినేట్‌! | Bigg Boss Telugu 7: Buzz, Ambati Arjun Eliminated from BB House | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: అర్జున్‌ ఎలిమినేట్‌.. బలం ఉంది కానీ బలగమే లేదు..

Published Sat, Dec 16 2023 3:24 PM | Last Updated on Sun, Dec 17 2023 8:05 AM

Bigg Boss Telugu 7: Buzz, Ambati Arjun Eliminated from BB House - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌కు రేపటితో శుభం కార్డు పడనుంది. సీజన్‌ 7 కాబట్టి గ్రాండ్‌ ఫినాలేకు ఏడుగురిని తీసుకెళ్తారనుకున్నారంతా.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అటు ఏడుగురిని కాకుండా, ఇటు ఐదుగురిని కాకుండా ఆరుగురిని ఫైనల్స్‌కు పంపించారు. వీరిలో అర్జున్‌, ప్రశాంత్‌, శివాజీ, ప్రిన్స్‌ యావర్‌, ప్రియాంక, అమర్‌దీప్‌ ఉన్నారు. నిజానికి ఈ ఆరుగురిలో అర్జున్‌ రెండువారాల క్రితమే ఎలిమినేట్‌ కావాల్సింది. కానీ తను ఫినాలే అస్త్ర పొందడంతో ఈ సీజన్‌లోనే తొలి ఫైనలిస్టుగా నిలిచాడు.

మొదలైన గ్రాండ్‌ ఫినాలే షూటింగ్‌
దీంతో ఆ వారం ఓట్లు పడకపోయినా నేరుగా ఫినాలే వీక్‌లో అడుగుపెట్టాడు. ఇకపోతే గ్రాండ్‌ ఫినాలే ఎపిసోడ్‌ కోసం నేటి ఉదయం నుంచే షూటింగ్‌ మొదలైంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఆటపాటల షూటింగ్‌ పూర్తవగా తాజాగా ఒక ఎలిమినేషన్‌ ప్రక్రియ సైతం పూర్తయినట్లు తెలుస్తోంది. అంబటి అర్జున్‌ ఎలిమినేట్‌ అయినట్లు సోసల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

సింగిల్‌గా ఆడి సత్తా చూపాడు
గతంలోనూ అతడికి తక్కువ ఓట్లు రావడంతో ఈసారి కూడా ఓటింగ్‌లో అర్జున్‌ చివరిస్థానంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. సింగిల్‌గా ఆడి ఫినాలే వరకు రాగలిగాడు కానీ ప్రేక్షకాదరణ పొందడంలో మాత్రం అర్జున్‌ ఘోరంగా విఫలమయ్యాడు. సీజన్‌ ప్రారంభమైనప్పుడే అతడు హౌస్‌లో అడుగుపెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. టాస్కులు ఇరగదీస్తూ ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చే అర్జున్‌ ఈరోజు విన్నర్‌ రేసులో నిలబడేవాడు. కానీ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వడంతో రేసులోనే లేకుండా పోయాడు.

చదవండి: బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖి.. అశ్వినిని పెళ్లి చేసుకుంటానన్న యావర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement