Arjun Ambati
-
Bigg Boss 8: సోనియా బాగోతం.. గ్యాప్ ఇవ్వకుండా అర్జున్ రోస్టింగ్
బిగ్‌బాస్ నుంచి సోనియా ఎలిమినేట్ అయిపోయింది. స్టేజీపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా వచ్చేసింది. కానీ బిగ్‌బాస్ బజ్‌లో మాత్రం కచ్చితంగా మాట్లాడాలి. హోస్ట్ అర్జున్ అదే చేశాడు. గ్యాప్ ఇవ్వకుండా రోస్టింగ్ చేసి వదిలేశాడు. కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చిన సోనియా.. కొన్నింటికి మాత్రం ఆన్సర్ చెప్పలేక సైలెంట్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఈసారి ఎవరిపై వేటు?)హౌసులో ఎవరితో ఎక్కువ బాండింగ్ ఏర్పడింది అని అడగ్గా.. అభయ్, నిఖిల్, పృథ్వీ పేర్లు చెప్పింది. నిఖిల్‌కి నీపై ఎలాంటి ఫీలింగ్ ఉందని అడగ్గా.. మా అన్నలాగా, అన్ని విషయాలు షేర్ చేసుకుంటాడని సోనియా చెప్పింది. లోపల హౌసులో వాళ్లని ఏమారుస్తావేమో గానీ నన్ను వద్దులే అని అర్జున్ సైలెంట్‌గా సెటైర్ వేశాడు.పృథ్వీకి కోపమే మైనస్ అని తెలిసినా.. వాడిని మీరు ఓ ఆయుధంలా ఉపయోగించుకున్నారని మేం అంటున్నాం అని.. అలానే ముందుండి ఆట పట్టిస్తున్నారని మీరనుకుంటున్నారు గానీ వెనకుండి ఆట నడిపిస్తున్నారని ఆడియెన్స్‌కి తెలుసులే అని సోనియా బాగోతాలన్ని అర్జున్ బయటపెట్టాడు. చేయాల్సిందంతా చేసేసి నాకేం తెలియదన్నట్లు కూర్చుంటారు 'కపటనాటక సూత్రధారి' అని సోనియాకి కొత్త పేరు పెట్టాడు.(ఇదీ చదవండి: మణికంఠకి మెంటలెక్కించారు.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నదెవరు?)ఆడపులి అని సోనియా తనకు తానే అనుకోవడంపైన కూడా అర్జున్ కౌంటర్ వేశాడు. ఆడపులి అంటే ముందుకొచ్చి ఆడతుంది, పిల్లిలా వెనకుండదని అన్నాడు. ఇక నిఖిల్-పృథ్వీ గురించి అర్జున్ మాట్లాడుతూ.. వాళ్లు బాధితులు, మీరు బాధపెట్టినోళ్లు కాబట్టి ముందు మీరు బయటకొచ్చేశారు అని అన్నాడు. దీంతో కోపమొచ్చినా సరే సోనియా ఆపుకొంది. చూద్దాం వాళ్లు ఎన్నిరోజులు ఉంటారో? వాళ్లేం ఆట ఆడతారో చూద్దాం అని తనదైన శైలిలో సమాధానమిచ్చింది.ఇలా హౌసులో శివంగిలా చెలరేగిపోయింది గానీ ఇంటర్వ్యూలో మాత్రం పిల్లిలా అర్జున్ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక సౌండ్ చేయలేకపోయింది. మిగతా వాటి సంగతేమో గానీ నిఖిల్, తనకు అన్నయ్య లాంటోడు అని సోనియా చెప్పడం మాత్రం విడ్డూరంగా అనిపించింది. (ఇదీ చదవండి: Bigg Boss8: సోనియాని ఎలిమినేట్ చేసి మంచి పనిచేశారా?) -
ఎవరూ ఒప్పుకోలేదట.. చివరికి ఇతడే బజ్ హోస్ట్‌గా!
బిగ్‌బాస్ షోలో జనాలు ఎంతో ఆసక్తికరంగా చూసేది రెండే రెండింటి కోసం.. ఒకటి నామినేషన్, మరొకటి ఎలిమినేషన్. ఎలిమినేట్ అయిన వారు స్టేజీపైకి వచ్చి రెండు మాటలు చెప్పివెళ్లిపోతారు. వారి మనసులో ఏముంది, లోపల ఏం జరుగుతోంది? ఎలిమినేట్ అవుతారని ముందే ఊహించారా? ఇవన్నీ వివరంగా తెలుసుకునేందుకు సెపరేట్‌గా బిగ్‌బాస్ బజ్ అనే ప్రోగ్రామ్ ఉండనే ఉంది.ఎవరిని అడిగినా..బిగ్‌బాస్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రామ్‌కు కచ్చితంగా రావాల్సిందే! గత సీజన్‌లోని ఓ టాప్ కంటెస్టెంట్‌ను మరుసటి సీజన్‌కు హోస్ట్‌గా పెడతారు. అలా ఈసారి గత సీజన్‌లోని కంటెస్టెంట్లను యాంకర్ పోస్ట్‌కు ఆహ్వానించారట.. కానీ చాలామంది తమ ప్రాజెక్టులు, ఆఫర్లతో బిజీగా ఉండటంతో వచ్చేదేలేదని చెప్పేశారట.టైం బాలేకపోతే..దీంతో కండలవీరుడు అర్జున్ అంబటిని రంగంలోకి దింపారు. ఈ మేరకు ఓ ప్రోమో కూడా విడుదల చేశారు. టైం బాగున్న కొందరు బిగ్‌బాస్ హౌస్‌లోకి వస్తున్నారు.. వాళ్ల టైం బాగోలేకపోతే బిగ్‌బాస్ బజ్‌లోకి వస్తారంటూ అర్జున్ ప్రాస కలిపేశాడు. ప్రోమో అయితే బాగుంది.. అర్జున్ హోస్టింగ్ పూర్తి స్థాయిలో చూడాలంటే ముందు బిగ్‌బాస్ షురూ అయ్యేంతవరకు ఆగాలి. ఇకపోతే తెలుగుబిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. -
అర్జున్ అంబటి హీరోగా వెడ్డింగ్ డైరీస్.. ట్రైలర్ చూశారా?
బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబటి, చాందిని తమిలారసన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం వెడ్డింగ్ డైరీస్. ఎమ్ వి ఆర్ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ మిద్దె విజయవాణి సమర్పణలో వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 23న విడుదల అవుతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేశారు.ఈ సందర్భంగా చంద్రబోస్ గారు మాట్లాడుతూ "వెడ్డింగ్ డైరీస్ ట్రైలర్ చూశాను. చాలా ఆసక్తికరంగా ఉంది. పెళ్లి తర్వాత వచ్చే అపార్థాలు, అపోహలు శాశ్వతం కాదు. వైవాహిక బంధం మాత్రమే చిరకాలం ఉంటుందనే మంచి కథను తీసుకున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను" అన్నారు.దర్శక నిర్మాత వెంకటరమణ మిద్దె మాట్లాడుతూ "దాంపత్య జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు, సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో ఈ మూవీ చూపిస్తుంది. రోజూ జరిగే గొడవలు, విభేదాలతో విసిగిపోయిన దంపతులు విడిపోవాలనుకుంటారు. కానీ తమ బంధం ఎంత విలువైనదో గుర్తించి మళ్లీ కలిసిపోవాలని నిర్ణయించుకుంటారు. ఆగస్టు 23న మహా మూవీస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తున్నాం" అని తెలిపారు. -
బిగ్ బాస్ అర్జున్ అంబటి 'వెడ్డింగ్ డైరీస్' టీజర్ విడుదల
టాలీవుడ్లో పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలకు కూడా మంచి ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలో 'వెడ్డింగ్ డైరీస్' అనే సినిమా తెరకెక్కుతుంది. MVR స్టూడియోస్ పేరుతో డాక్టర్ మిద్దె విజయవాణి సమర్పణలో వెంకటరమణ మిద్దె స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో బిగ్ బాస్ ఫెమ్ అర్జున్ అంబటి హీరోగా , చాందిని తమిలారసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన 'వెడ్డింగ్ డైరీస్' ఆగస్టు 23న విడుదలకి సిద్ధమైంది. అయితే, తాజాగా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఈ సందర్భంగా దర్శక నిర్మాత వెంకటరమణ మిద్దె మాట్లాడుతూ .. 'వివాహిత జంట తమ సంబంధంలోని ఇబ్బందులు, సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో ఈ సినిమా చూపిస్తుంది. రోజూ వచ్చే విభేదాల వల్ల నిరాశతో విసిగి వారు విడిపోవాలని నిర్ణయానికి వస్తారు. కానీ, తర్వాత ప్రేమను, తమ బంధాన్ని ఎంత విలువైనదో గుర్తించి మళ్లీ కలుసుకుని, పెళ్లిని పునర్నిర్మించుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ చిత్రం ప్రేమ, దీర్ఘకాలిక సంబంధాలపై ఉన్న విలువలను వివరిస్తుంది.' అని ఆయన పేర్కొన్నారు. అర్జున్ అంబటి,చాందిని తమిళరసన్‌తో పాటు చమ్మక్ చంద్ర, మేక రామకృష్ణ, రవి తేజ తదితరులు ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా కి మదన్ ఎస్.కే సంగీతం అందించారు. -
మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా
బిగ్‌బాస్ షోలో పాల్గొని సినిమాల్లో ఛాన్సులు తెచ్చుకున్నోళ్లు తెలుగులో అయితే ఒకరిద్దరున్నారు. వీళ్లలో అర్జున్ అంబటి ఒకడు. గత సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఫైనల్ వరకు వచ్చాడు. గతంలో సీరియల్స్ చేసిన అర్జున్.. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నాడు. ఇతడు నటించిన లేటెస్ట్ మూవీ 'తెప్ప సముద్రం'. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్)వేసవిలో అంటే ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజైన 'తెప్ప సముద్రం' మూవీ డీసెంట్ టాక్ తెచ్చుకుంది. కానీ చిన్న సినిమా కావడంతో జనాలకు పెద్దగా రీచ్ కాలేదు. ఇప్పుడు ఆహా ఓటీటీలో ఆగస్టు 3 నుంచి అంటే ఈ శనివారం నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఒకవేళ వీకెండ్ టైమ్ పాస్ చేద్దామనుకుంటే దీన్ని చూడొచ్చు.'తెప్ప సముద్రం' అనే ఊరిలో స్కూల్ పిల్లలు మాయమవుతుంటారు. దీనికి కారణం కనుక్కోవడానికి ఎస్సై గణేశ్ వస్తాడు. మరోవైపు రిపోర్టర్ ఇందు, ఈమె ప్రియుడు ఆటో డ్రైవర్ విజయ్ కూడా పిల్లల కోసం వెతుకుంటారు. మరోవైపు గంజాయి దందాతో పిల్లల మిస్సింగ్‌కి సంబంధం ఉందని ఎస్సై తెలుకుంటాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ కొరియన్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడ చూడొచ్చంటే?) -
బిగ్ బాస్ అర్జున్ 'తెప్ప సముద్రం' మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?
బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి హీరోగా, కిశోరి దాత్రక్ హీరోయిన్గా నటించిన సినిమా 'తెప్ప సముద్రం'. సతీష్ రాపోలు దర్శకత్వం వహించారు. నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ నిర్మించారు. పి. ఆర్ సంగీత దర్శకుడు. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. (ఇదీ చదవండి: 'రేసుగుర్రం' విలన్ సీక్రెట్ ఫ్యామిలీ.. ఎన్నికల టైంలో ఇరికించేశారు!) ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాట, ట్రైలర్ ని వీళ్లు లాంచ్ చేశారు. (ఇదీ చదవండి: రహస్యంగా పెళ్లి చేసుకున్న 'టెంపర్' నటి) -
విరూపాక్ష సినిమా నేను చేయాల్సింది: అర్జున్
సీరియల్స్ నుంచి సినిమాల్లోకి వచ్చినవాళ్లు చాలానే ఉన్నారు. అయితే కొందరే క్లిక్ అవుతారు. సీరియల్స్‌కు, సినిమాకు మధ్యలో బిగ్‌బాస్ ప్లాట్‌ఫామ్‌ను వాడుకున్నవాళ్లూ ఉన్నారు. ఇక్కడ క్రేజ్ తెచ్చుకున్నాక పలువురూ సినిమాల్లో బిజీ అవుతుంటే మరికొందరు మాత్రం ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నెగెటివిటీ అయితే బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ అర్జున్ అంబటి మరో రకం. ఇతడు నేరుగా సినిమాల్లోనే అడుగుపెట్టాడు. కానీ ఎంత కష్టపడ్డా గుర్తింపే దొరకలేదు. దీంతో బుల్లితెరను ఆశ్రయించాడు. సీరియల్స్ ద్వారా క్లిక్ అయ్యాడు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ క్రేజ్‌ను మరింత క్యాష్ చేసుకునేందుకు బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో అడుగుపెట్టాడు. కానీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడం అతడు చేసిన పెద్ద పొరపాటు! ఈ షో వల్ల అతడు నెగిటివిటీ మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు నటించిన తెప్ప సముద్రం త్వరలో రిలీజ్ కానుంది. రెండేళ్లు తిరిగాం ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన అర్జున్ అంబటి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. 'డైరెక్టర్ కార్తీక్ నా స్నేహితుడు. అతడు ఎప్పుడూ సినిమా ప్రపంచంలోనే ఉంటాడు. అతడితో నేను లూప్ అని ఓ వెబ్ ఫిలిం చేశాను. తర్వాత మేమిద్దరం ఓ సినిమా చేద్దామనుకున్నాం. నిర్మాతల కోసం రెండేళ్లు తిరిగాం. కానీ సెట్టవ్వలేదు. అప్పుడు ఓటీటీ లాంటి ప్లాట్‌ఫామ్స్ కూడా లేవు. ఆ ప్రాజెక్ట్‌కు శాసనం అని టైటిల్ పెట్టుకున్నాం. తర్వాత అదే విరూపాక్షగా రిలీజైంది. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. నాతో చేసుంటే అంత పెద్ద సక్సెస్ వచ్చి ఉండేది కాదేమో!' అని చెప్పుకొచ్చాడు. చదవండి: 'ఓం భీమ్ బుష్' సినిమా కలెక్షన్స్ ఊహించలేరు.. -
తండ్రి అయిన ‘బిగ్‌బాస్’ అర్జున్.. ఏం పేరు పెట్టారంటే..?
బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ అర్జున్ అంబటి తండ్రి అయ్యాడు. అర్జున్ భార్య సురేఖ ఈ రోజు (జనవరి 9) పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అర్జున్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన కూతురుకి ఆర్ఖా అని నామకరణం చేశాడు. కూతురు పుట్టినా, కొడుకు పుట్టినా ఈ పేరునే పెట్టుకుంటానని బిగ్‌బాస్ హౌస్‌లోనే చెప్పాడు అర్జున్. తన పేరులోని ఆర్.. సురేఖ పేరులో నుంచి ఖ తీసుకొని అర్ఖా అని పేరు ఫిక్స్ చేసినట్లు ఓ వీకెండ్ ఎపిసోడ్లో చెప్పాడు. అయితే తనకు మాత్రం కూతురు పుట్టాలనే ఉందని చెప్పాడు. అనుకున్నట్లే అర్జున్‌కి కూతురే పుట్టింది. దీంతో అర్జున్ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. అర్జున్-సురేఖ దంపతులకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, పలు సీరియళ్లలో హీరోగా నటించిన అర్జున్.. బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొని తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. షో ప్రారంభమైన ఐదు వారాల తర్వాత అర్జున్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనితో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. కానీ అర్జున్ మాత్రం చివరి వరకు ఉన్నాడు. ఫినాలే రోజు టాప్ 6 ప్లేస్‌లో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం బుల్లితెరపై షోలు, సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. త్వరలోనే ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Nagarjuna Reddy Ambati (@ambati_arjun) -
Bigg Boss 7: అర్జున్ అంత సంపాదించాడా? 10 వారాల్లోనే..
బిగ్‌బాస్ షోలో నామినేషన్స్- ఎలిమినేషన్స్‌కు విడదీయలేని సంబంధం ఉంది. ఎందుకంటే నామినేట్ అయినవారు ఎలిమినేట్ అవకా తప్పదు. ఎలిమినేట్ చేయడం కోసం అవతలివారిని నామినేట్ చేయకా తప్పదు. ఈ సీజన్‌పై ఎక్కువగా ఆసక్తిని క్రియేట్ చేసింది నామినేషన్సే! ఈ నామినేషన్స్‌లో ఎన్ని ఎక్కువసార్లు ఉంటే అంత పుంజుకోవచ్చన్నది కొందరి వాదన. నామినేషన్స్‌కు భయపడి దూరంగా ఉంటే మాత్రం ఇక అంతే సంగతులు. లేకలేక ఒక్కవారం నామినేషన్లోకి వచ్చి ఇట్టే ఎలిమినేట్ అయిపోయాడు సందీప్. అదే మైనస్.. బిగ్‌బాస్ ప్రారంభమైన నెల రోజుల తర్వాత హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు అర్జున్. ఇతడు మాట్లాడే మాటలకు అవతలి వారి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే! అంత సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడతాడు అర్జున్. కానీ నెల రోజులు ఆలస్యంగా హౌస్‌లోకి రావడంతో జనాలకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయాడు. టాస్కుల్లో బాహుబలిలా ఆడాడు. ఎవరి అండదండలు లేకపోయినా సొంతంగా ఆడుతూ చివరి వరకు వచ్చాడు. కానీ మొదటి నుంచీ లేకపోవడంతో ఓసారి నామినేషన్స్‌లోకి వచ్చి ఎలిమినేట్ అంచుల వరకు వెళ్లి వచ్చాడు. ఫినాలే అస్త్ర సాయంతో ఎలిమినేషన్ నుంచి గట్టెక్కి నేరుగా ఫినాలేలో అడుగుపెట్టాడు. టాప్ 6లో ఉండగా ఎలిమినేట్.. జనాదరణ పొందడంలో వెనకబడిన ఇతడు ఆరో స్థానంలో ఉండగానే షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. సీరియల్ నటుడిగా గొప్ప పేరున్న ఇతడు రోజుకు దాదాపు రూ.50 వేల మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. అంటే వారానికి రూ.3,50,000 తీసుకున్నాడన్నమాట! ఈ లెక్కన 10 వారాలకుగానూ అర్జున్ రూ.35,00,000 వెనకేశాడు. లేటుగా హౌస్‌లోకి వచ్చినప్పటికీ చాలామందికంటే ఎక్కువగానే సంపాదించాడు అర్జున్. కానీ ఇందులో దాదాపు సగం వరకు ప్రభుత్వానికి ట్యాక్స్‌ల రూపంలో అప్పజెప్పాల్సి ఉంటుంది. చదవండి: పీకల్లోతు అప్పుల్లో యావర్.. ప్రైజ్‌మనీ కూడా సరిపోదన్న ప్రిన్స్ సోదరుడు -
బిగ్‌బాస్ 7: స్ట్రాంగ్ కంటెస్టెంట్ అర్జున్ ఎలిమినేట్!
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌కు రేపటితో శుభం కార్డు పడనుంది. సీజన్ 7 కాబట్టి గ్రాండ్ ఫినాలేకు ఏడుగురిని తీసుకెళ్తారనుకున్నారంతా.. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అటు ఏడుగురిని కాకుండా, ఇటు ఐదుగురిని కాకుండా ఆరుగురిని ఫైనల్స్‌కు పంపించారు. వీరిలో అర్జున్, ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రియాంక, అమర్దీప్ ఉన్నారు. నిజానికి ఈ ఆరుగురిలో అర్జున్ రెండువారాల క్రితమే ఎలిమినేట్ కావాల్సింది. కానీ తను ఫినాలే అస్త్ర పొందడంతో ఈ సీజన్లోనే తొలి ఫైనలిస్టుగా నిలిచాడు. మొదలైన గ్రాండ్ ఫినాలే షూటింగ్ దీంతో ఆ వారం ఓట్లు పడకపోయినా నేరుగా ఫినాలే వీక్‌లో అడుగుపెట్టాడు. ఇకపోతే గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం నేటి ఉదయం నుంచే షూటింగ్ మొదలైంది. ఇప్పటికే కంటెస్టెంట్ల ఆటపాటల షూటింగ్ పూర్తవగా తాజాగా ఒక ఎలిమినేషన్ ప్రక్రియ సైతం పూర్తయినట్లు తెలుస్తోంది. అంబటి అర్జున్ ఎలిమినేట్ అయినట్లు సోసల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. సింగిల్‌గా ఆడి సత్తా చూపాడు గతంలోనూ అతడికి తక్కువ ఓట్లు రావడంతో ఈసారి కూడా ఓటింగ్‌లో అర్జున్ చివరిస్థానంలో ఉండే అవకాశం కనిపిస్తోంది. సింగిల్‌గా ఆడి ఫినాలే వరకు రాగలిగాడు కానీ ప్రేక్షకాదరణ పొందడంలో మాత్రం అర్జున్ ఘోరంగా విఫలమయ్యాడు. సీజన్ ప్రారంభమైనప్పుడే అతడు హౌస్‌లో అడుగుపెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. టాస్కులు ఇరగదీస్తూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అర్జున్ ఈరోజు విన్నర్ రేసులో నిలబడేవాడు. కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడంతో రేసులోనే లేకుండా పోయాడు. చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి.. అశ్వినిని పెళ్లి చేసుకుంటానన్న యావర్ -
ముష్టి బ్యాచ్.. ముష్టినాయాళ్లు.. వంకరబుద్ధి పోనిచ్చుకోని శివాజీ
బిగ్‌బాస్ 7 ఫినాలే దగ్గరపడుతోంది. ఇప్పుడు కూడా హౌస్మేట్స్.. వారిలో వారే కొట్టుకోకుండా కాస్త కలిసిమెలిసి ఉండేందుకు సరదా టాస్కులిచ్చాడు బిగ్‌బాస్. ఒకరి కోసం మరొకరు ఆడాలంటూ వారి మధ్య బంధాన్ని బలపర్చేందుకు ప్రయత్నించాడు. మరి ఎవరు ఎవరికోసం ఆడారు? ఏలియన్స్ ఇంట్లో ఎందుకు దూరాయి? ఈ విషయాలన్నీ తాజా ఎపిసోడ్ (డిసెంబర్ 14) హైలైట్స్‌లో చూసేద్దాం.. మీ ఇంటి వంట.. ఈ వారం నామినేషన్ల గోల లేదు, పెద్దగా టాస్కులు కూడా లేకపోవడంతో హౌస్మేట్స్ విశ్రాంతి తీసుకుంటున్నారు. బద్ధకస్తులుగా మారిపోయిన కంటెస్టెంట్లను హుషారెత్తించేందుకు బిగ్‌బాస్ మరోసారి హాచీ ఏలియన్స్‌ను రంగంలోకి దింపాడు. ఈ హాచీ.. కంటెస్టెంట్ల కోసం ఇంటి నుంచి ఫుడ్ వచ్చిందని, తమను సంతోషపరిస్తేనే ఆ ఆహారం ఇస్తామని చెప్పింది. అయితే మీ ఫుడ్ కోసం తోటి ఇంటిసభ్యులు ఆ ఆహారాన్ని సంపాదించాల్సి ఉంటుందని మెలిక పెట్టింది. శివాజీ కోసం ఆడి గెలిచిన ప్రియాంక మొదటగా అర్జున్ ఇంటి నుంచి రాగిముద్ద-మటన్ కూర వచ్చింది. ఈ ఫుడ్ కోసం యావర్ షేక్ బాల్ షేక్ గేమ్ ఆడి గెలిచాడు. తనకోసం ఆడి గెలిచిన యావర్‌కు తన చేతితో ఇంటి ఫుడ్‌ను తినిపించాడు అర్జున్. శివాజీ కోసం ఇంటి నుంచి చికెన్ కర్రీ వచ్చింది. దీనికోసం ప్రియాంక బ్యాలెన్స్ ది బాల్స్ గేమ్ ఆడి గెలిచి చికెన్ కూర శివాజీకి దక్కేలా చేసింది. ఆ తర్వాత అమర్‌దీప్‌కు రొయ్యల బిర్యానీ వచ్చింది. దీని కోసం శివాజీ బెలూన్ల టాస్క్ ఆడి గెలవడంతో అమర్ రొయ్యల బిర్యానీని ఇతరులతో షేర్ చేసుకుంటూ కడుపునిండా ఆరగించాడు. గంట ఎపిసోడ్లో ఎవరెంత కనిపిస్తారు? తర్వాత కొందరు గ్రహాంతరవాసుల్లాగా మాస్కులు పెట్టుకుని ఇంట్లోకి వచ్చి అందరినీ ఓ ఆటాడుకుని వెళ్లిపోయారు. అనంతరం బిగ్‌బాస్.. మీ 14 వారాల జర్నీలో మీ ఓవరాల్ పర్ఫామెన్స్ ఆధారంగా 60 నిమిషాల ఎపిసోడ్లో మీరు ఎంతసేపు కనిపించడానికి అర్హులో చెప్పాలంటూ కొన్ని బోర్డులు ఇచ్చాడు. ముందుగా అర్జున్.. 10 నిమిషాల బోర్డు తన మెడలో వేసుకున్నాడు. ఫౌల్స్ ఆడుతూ, దొంగతనాలు చేస్తూ, తిట్లు తింటూ అమర్ 20 నిమిషాలు కనబడతాడని అనుకుంటున్నట్లు చెప్పాడు. శివాజీకి 15, ప్రియాంకకు 7, ప్రిన్స్ యావర్‌కు 5, ప్రశాంత్‌కు 3 నిమిషాల బోర్డులు ఇచ్చాడు. అమర్‌ను చులకనగా చూస్తున్న శివాజీ శివాజీ.. ఎవరికీ తక్కువ నిమిషాల బోర్డు ఇవ్వబుద్ధి కావట్లేదంటూనే అమర్ మెడలో 3 నిమిషాల బోర్డు వేసి క్లాస్ పీకాడు. నువ్వు ఈ 2 వారాలే ఆడావు.. అంతకుముందు ఏమీ ఆడలేదంటూ మరోసారి తనను టార్గెట్ చేశాడు. కొన్నిసార్లు నువ్వు నెగెటివ్ కంటెంట్ కోసం ప్రయత్నించావు, అసలు గేమ్ ఆడలేదు అని అన్నాడు. 3 నిమిషాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నా, నేను గేమ్ ఆడానన్నా.. అని అమర్ డిఫెండ్ చేసుకుంటుంటే.. నేను 5 వేసుకున్నప్పుడు నీకు 3 నిమిషాలు వేస్తే రోగమా? అని తిట్టాడు శివాజీ. అంతేకాదు.. అర్జున్‌కు 7 ఇచ్చి అమర్ కంటే నువ్వు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలవన్నాడు. ముష్టి బ్యాచ్ ప్రియాంకకు 10 ఇచ్చి మిగిలిన 15, 20 నిమిషాల బోర్డులు ప్రిన్స్, ప్రశాంత్ చేతిలో పెట్టి ఇద్దరూ తమకు నచ్చినవి వేసుకోమని ఆఫర్ ఇచ్చాడు. తర్వాత అందరూ ఈ బోర్డుల ప్రక్రియను ఒకరి తర్వాత ఒకరు పూర్తి చేశారు. కాగా ఫినాలే దగ్గరపడుతున్నప్పటికీ టైం దొరికినప్పుడల్లా అమర్ మీద విషం కక్కుతూనే ఉన్నాడు శివాజీ. వేస్ట్ ఫెలో, దొంగ, వెధవ, పనికిమాలినోడు, పిచ్చి పోహా.. ఇలా ఎన్నో మాటలన్నాడు. తాజా ఎపిసోడ్‌లోనూ స్పా(శోభ, ప్రియాంక, అమర్) బ్యాచ్‌ను ఉద్దేశిస్తూ ముష్టి బ్యాచ్.. ముష్టినాయాళ్లు.. అంటూ తన స్పై బ్యాచ్ దగ్గర చులకనగా మాట్లాడాడు. వాళ్ల ముందేమో పద్ధతిగా, పెద్దాయనలా ప్రవర్తిస్తూ పక్కకు రాగానే ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ మరోసారి తన వంకరబుద్ధి బయటపెట్టుకున్నాడు శివాజీ. చదవండి: నటుడు కన్నుమూత.. గురువు మరణం కలిచివేసిందంటూ భారతీరాజా పోస్ట్.. -
Bigg Boss 7: రూట్ మార్చిన బిగ్‌బాస్.. అర్జున్, అమర్ కన్నీళ్లు పెట్టేశారు!
బిగ్‌బాస్ 7వ సీజన్ చివరి వారానికి వచ్చేశాం. కొన్నిరోజుల ముందు హోస్ట్ నాగార్జున చెప్పినట్లు ఈసారి నామినేషన్స్ లాంటి హడావుడి ఏం లేదు. కేవలం హౌస్‌లోని ఉన్న ఆరుగురు సభ్యుల ఎమోషన్స్ మాత్రమే పలికించాలని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. అందుకు తగ్గట్లే తాజా ఎపిసోడ్లో అమర్, అర్జున్‌కి బోలెడన్ని సర్ప్రైజులతో పాటు అదిరిపోయే ఎలివేషన్స్ దక్కాయి. ఇంతకీ సోమవారం ఏం జరిగిందనేది Day 99 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. మెమొరీస్ బుక్ చివరి వారాన్ని చాలా అంటే చాలా హ్యాపీ మెమొరీస్‌తో చాలా పాజిటివ్‌గా ఎండ్ చేద్దామని బిగ్‌బాస్ ఫిక్సయ్యాడు. అందుకు తగ్గట్లే ఒక్కో ఇంటి సభ్యుడి జర్నీని చూపించి, అతడి నుంచి ఎమోషన్స్ అన్నీ బయటకు లాగేయాలనేది ఆర్గనైజర్స్ ప్లాన్. ఫస్ట్ ఫస్ట్ అమర్ ని మాత్రమే లాన్లోకి రమ్మన్నారు. అక్కడ అతడి బిగ్‌బాస్ మెమొరీస్ అన్నింటినీ ఫొటోల రూపంలో ప్రదర్శించాడు. ఆ తర్వాత యాక్టివిటీ రూంలోకి పిలిచిన తర్వాత దాదాపు 16 నిమిషాల జర్నీ వీడియోని ప్లే చేశారు. (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) అమర్ ఎమోషనల్ ఇందులో భాగంగా అమర్.. బిగ్ బాస్ హౌసులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమేం చేశాడు? ఎలా ప్రవర్తించాడు? లాంటి సీన్స్ అన్నింటినీ ఒక్కటిగా చేసి 16 నిమిషాల జర్నీ వీడియో ప్లే చేశారు. అయితే ఈ వీడియో చూస్తే అమర్ నవ్వాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, గూస్ బంప్స్ తెచ్చుకున్నాడు. చివరకు థ్యాంక్స్ బిగ్‌బాస్ అని చెప్పాడు. చాలా పెద్ద గిఫ్ట్ ఇది. అల్టిమేట్ బిగ్‌బాస్ అని అమర్ తన ఆనందాన్ని బయటపెట్టాడు. అర్జున్ ఎమోషనల్ ఇక అమర్‌కి చేసినట్లే అర్జున్‌ని కూడా పిలిచిన బిగ్‌బాస్.. అలానే 'బిగ్‌బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్' చూపించాడు. తన బిగ్‌బాస్ ఫొటోల్ని చూసి తెగ మురిసిపోయాడు. కాసేపటి తర్వాత యాక్టివిటీ రూంలోకి వెళ్లిన తర్వాత దాదాపు 14 నిమిషాల జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు. ఓవరాల్ వీడియో అంతా నవ్వుతూ చూసిన అర్జున్.. భార్య వచ్చిన క్లిప్ చూసినప్పుడు మాత్రం ఎమోషనల్ అయ్యాడు. అయితే ఈ రోజు ఎపిసోడ్‌ని రాయడం కంటే వీడియోగా చూస్తేనే కిక్ వస్తుంది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: నాగార్జున స్పెషల్ స్వెట్ టీ-షర్ట్.. ఎన్ని లక్షల ఖరీదంటే?) -
Bigg Boss 7: రైతుబిడ్డకు ఇచ్చిపడేసిన అర్జున్.. దెబ్బకు సైలెంట్!
బిగ్‌బాస్ 7వ సీజన్ అయిపోవడానికి ఇంకా 10 రోజులే ఉంది. ఇలాంటి టైంలో షోని ఎంత ఇంట్రెస్ట్‌గా డిజైన్ చేయాలి. కానీ నిర్వహకులకు అలాంటి ఆలోచనే లేనట్లు ఉంది. ఎందుకంటే మంగళవారం ఎపిసోడ్ అంతంత మాత్రంగా ఉంది. తాజాగా బుధవారం ఎపిసోడ్ అయితే ఏ విషయంలోనూ అలరించలేకపోయింది. కొద్దొగొప్పో అర్జున్-ప్రశాంత్ గొడవ మాత్రమే ఆసక్తిగా అనిపించింది. ఇంతకీ లేటెస్ట్గా ఏం జరిగిందనేది Day 94 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' టైటిల్ విజేత రేసులో ఆ ముగ్గురు.. కానీ?) అర్జున్ కేక్ టాస్క్ శోభా.. ఓటు అప్పీలు చేసుకోవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ప్రియాంక-శోభా-అమర్.. కాసేపు తమలో తామే వాదించుకున్న తర్వాత ఊరుకున్నారు. కాసేపటి తర్వాత 2 కిలోల కేక్ పంపించి, అర్జున్ ఒక్కడే దీన్ని తినాలని బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. కొంత తిన్నాడు, ఆ తర్వాత వల్ల కావట్లేదనేసరికి ఎవరిదైనా సహాయం తీసుకుంటారా అని అడగ్గా.. యావర్ పేరు చెప్పాడు. అలా వీరిద్దరూ కేక్ మొత్తం తినేశాడు. దీంతో రేపు(గురువారం).. ఇంటి సభ్యుల కోసం కేక్ పంపిస్తానని బిగ్‌బాస్ చెప్పాడు. పిల్లలని ఆడించే గేమ్ ఎపిసోడ్‌ని ఎలా టైమ్ పాస్ చేయాలా అని బాగా ఆలోచించిన బిగ్‌బాస్.. తనకు కవల పిల్లలు ఉన్నారని, నేను బయటకెళ్లి వచ్చేలేపు కాసేపు వాళ్లని ఆడించాలని చెప్పాడు. అందుకోసం రెండు చిన్నపిల్లల బొమ్మల్ని పంపించాడు. అయితే ఇందులో అర్జున్ ఒక్కడే కాస్త ఎంటర్టైన్ చేశాడు. మిగతా వాళ్లందరూ చేతులెత్తేశారు. దీని తర్వాత 'చెర్రీ ఆన్ ద టాప్' అని ఓ గేమ్ పెట్టి, ఇందులో భాగంగా చెర్రీ పండు పడిపోకుండా ఇసుకతో చేసిన కేక్, ఒక్కొక్కరుగా కట్ చేయాలని అన్నాడు. ఇందులో విజేతగా నిలిచిన అమర్.. ఓటు అప్పీలు చేసుకునే ఛాన్సుకు దగ్గరయ్యాడు. (ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) అర్జున్-ప్రశాంత్ గొడవ ఇక ఓటు అప్పీలు చేసుకునేందుకు మరో గేమ్ ఉందని, కాకపోతే దీన్ని ఒక్కరే ఆడాల్సి ఉంటుందని.. దీనికోసం ఎవరైతే ముందుగా గంట మోగిస్తారో వాళ్లకు ఛాన్స్ దక్కుతుందని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే గంట మోగించాలని పరుగెత్తే క్రమంలో అర్జున్.. చేతుల వెనక్కి ఊపుతూ వేగంగా పరుగెత్తాడు. పోటీలో గెలిచి టాస్క్ కూడూ పూర్తి చేశాడు. అయితే పరుగెత్తే క్రమంలో అర్జున్ చేయి, అతడి పక్కనే ఉన్న ప్రశాంత్‌ని కాస్త గట్టిగా తగిలేసినట్లు ఉంది. దీంతో రైతుబిడ్డ నానా హంగామా చేశాడు. ఎందుకు ఆపేశావ్ అన్నా అని గట్టిగట్టిగా అరిచాడు. దీంతో ఎప్పుడూ సైలెంట్‌గా ఉండే అర్జున్ కూడా రెచ్చిపోయాడు. నిన్న(మంగళవారం).. పూల్‌లో డ్యాన్స్ చేసే టాస్క్ కోసం పరుగెత్తినప్పుడు నీ చేయి నాకు తగిలింది, నేను అడిగానా? అని లాజిక్ మాట్లాడాడు. రైతుబిడ్డ దగ్గర ఆన్సర్ లేదు. అర్జున్.. నిన్నటి దాని గురించి అడుగుతుంటే ప్రశాంత్ మాత్రం ఇప్పటి దాని గురించి పదేపదే అడిగాడు. అర్జున్ మరింత గట్టిగా లాజిక్స్ మాట్లాడేసరికి ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు. ఇక అర్జున్, అమర్.. వీళ్లిద్దరిలో ఓటు అప్పీలు చేసుకునే ఛాన్స్ ఎవరికి దక్కిందనేది గురువారం ఎపిసోడ్లో తేలుస్తుంది. (ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?) -
బిగ్‌బాస్ 7: స్ట్రాంగ్ కంటెస్టెంట్ డాక్టర్ బాబు అవుట్!
అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా... ఈ పాట పాడుకునే సమయం వచ్చేసింది. ఈ వారం నామినేషన్స్ వల్ల అర్జున్ మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. ఈసారి ఈయన జెండా ఎత్తేయడం పక్కా అనుకున్నారంతా! కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన సత్తా ఏంటో చూపించాడు అర్జున్. టికెట్ టు ఫినాలే రేసులో అందరినీ వెనక్కు నెడుతూ, ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్‌గా ఆడి ఫినాలే అస్త్ర గెలిచాడు. అయితే ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయితేనే కదా టాప్ 5లో చోటు దక్కించుకునేది అని అందరూ డౌట్ పడ్డారు. కానీ ఈ వారం మొదట సేవ్ అయింది అర్జునే! నాగార్జున ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్‌గా అర్జున్ను ప్రకటిస్తూ అతడిని సేవ్ చేశాడు. దీంతో ఎలిమినేషన్ గండం గౌతమ్, శోభల మెడకు చుట్టుకుంది. కానీ శోభ కోసం ఎవరినైనా బలి చేసేందుకు బిగ్‌బాస్ రెడీ.. కాబట్టి ఆమెకు బదులుగా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను పంపించే ప్లాన్ చేశారట! టాప్5లో ఉండేందుకు అర్హత ఉన్న గౌతమ్ కృష్ణను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది చూసిన డాక్టర్ బాబు అభిమానులు.. అన్‌ఫెయిర్ బిగ్‌బాస్ అంటూ సోషల్ మీడియాలో ఆర్తనాదాలు చేస్తున్నారు. చదవండి: శివాజీ ప్రవర్తన వల్ల బాధపడ్డా.. ఆ నొప్పితో బాధపడుతున్న అమర్.. బిగ్‌బాస్ హౌస్‌లో నో ట్రీట్మెంట్ -
టికెట్ టు ఫినాలే గెలిచింది అతడే.. నేరుగా టాప్ 5లోకి!
బిగ్‌బాస్ హౌస్‌లో టికెట్ టు ఫినాలే అస్త్ర పోటీ చివరి దశకు చేరుకుంది. బిగ్‌బాస్ పెట్టిన గేమ్స్‌లో ఎక్కువగా అర్జున్, రైతుబిడ్డ గెలుచుకుంటూ పోగా అమర్ అందరి దగ్గరా పాయింట్లు అడుక్కుంటూ టాప్ స్థానంలో నిలబడ్డాడు. నిజానికి అతడికి ఎవరూ పాయింట్లు ఇవ్వకపోయినా టాప్ 3-4 స్థానాల్లో ఉండేవాడే! కానీ ఎక్కడ రేసులో నుంచి అవుట్ అయిపోతానో అన్న భయంతో అందరినీ బతిమాలుకుంటున్నాడు. చూడటానికి అది అడుక్కుంటున్నట్లుగానే ఉందని నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. కేవలం రెండు టాస్కులు మాత్రమే గెలిచిన అమర్ అందరూ ఇచ్చిన పాయింట్లతో స్కోర్ బోర్డ్‌లో టాప్‌లో ఉన్నాడు. కానీ అర్జున్ ఎవరి దగ్గరా ఒక్క పాయింట్ తీసుకోకుండా సొంతంగా ఆడి ఐదు గేమ్స్ గెలిచాడు. సోషల్ మీడియాలో నడుస్తున్న ప్రచారం ప్రకారం అర్జున్ టికెట్ టు ఫినాలే గెలిచినట్లు తెలుస్తోంది. అంటే అతడు టాప్ 5లో అడుగుపెట్టేసినట్లే అనుకోకండి.. తనముందు ఎలిమినేషన్ గండం ఉంది. ఈవారం ఎలిమినేషన్ దాటుకుని ముందుకు వస్తేనే అతడు ఫినాలేలో అడుగుపెడతాడు. నామినేషన్లో ఎంతో నెగెటివిటీ ఉన్నా టికెట్ టు ఫినాలేలో మాత్రం టాస్కులతో అదరగొట్టి అదుర్స్ అనిపించుకున్నాడు అర్జున్. ఎవరి సాయం లేకపోయినా ఒంటరిగా పోరాడి గెలిచాడు. మరి అతడు ఈ వారం సేవ్ అవుతాడా? టాప్ 5లో నిలుస్తాడా? చూడాలి! చదవండి: పెళ్లైన ఏడాదికే రెండో భార్యకు విడాకులు? అందుకే వీడియో డిలీట్! -
అమర్‌ను ఛాలెంజ్ చేసిన గౌతమ్.. అర్జున్‌కు అన్యాయం!
బిగ్‌బాస్ హౌస్‌లో టికెట్ టు ఫినాలే కోసం పోటీ జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఆటలో వెనకబడి రేసులో నుంచి పక్కకు తప్పుకోగా ఐదుగురు ఫినాలే అస్త్ర కోసం పోటీపడుతున్నారు. మరి వీరిలో ఎవరు ఆ అస్త్రాన్ని గెలుచుకోవడానికి దగ్గర్లో ఉన్నారు? ఎవరు రేసులో వెనకబడ్డారు? అనేది తాజా ఎపిసోడ్ (నవంబర్ 30) హైలైట్స్‌లో చదివేద్దాం... క్రికెట్ టాస్క్.. సిక్సులు బాదిన అమర్ తక్కువ పాయింట్లు ఉన్న ప్రియాంక, శివాజీ, శోభ ఫినాలే అస్త్ర రేసు నుంచి తప్పుకున్నారు. అయితే ప్రియాంక తన పాయింట్లను గౌతమ్‌కు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయాడు అమర్దీప్. కనీసం ఫ్రెండ్ అని కూడా చూడలేదు, ఎందుకు తప్పు నిర్ణయం తీసుకున్నావంటూ బాధపడ్డాడు. ఇంతలో మిగతా ఐదుగురు ఇంటిసభ్యులకు వెరైటీ క్రికెట్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో అమర్ గెలిచాడు. తప్పించుకో రాజా టాస్క్‌లో రైతుబిడ్డ గెలిచాడు. తప్పు చేసిన యావర్.. నోరు విప్పని శివాజీ అయితే ఈ టాస్కులో ఎవరి కాలికి ఉన్న తాళాలకు వారు కీ వెతికి విడిపించుకోవాలి. యావర్ ఒక కీ తీసుకుని అది రాకపోవడంతో కింద పడేశాడు. దీంతో అర్జున్‌కు బాక్స్‌లో ఎంత వెతికినా సరైన కీ దొరకలేదు. కీ కింద పడేయకూడదు కదా.. సంచాలకులు చెప్పాలి కదా అని గరమయ్యాడు. యావరే కీ కింద పడేశాడని తెలిసినా శివాజీ పెదవి విప్పలేదు. ఇక పాయింట్ల పట్టికలో యావర్ దిగువన ఉండటంతో రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన పాయింట్లను పల్లవి ప్రశాంత్‌కు ఇచ్చాడు. అమర్ విజయంపై డౌట్ తర్వాత పట్టుకో తెలుసుకో టాస్క్ జరగ్గా ఇందులో అమర్దీప్ గెలిచాడు. కానీ కళ్లు కనిపించకుండా ఇచ్చిన మాస్క్‌లు సరిగా పనిచేస్తున్నాయో, లేదోనని యావర్ చెక్ చేయడంతో అమర్ అసహనానికి లోనయ్యాడు. నేను గెలిచినప్పుడే అందరికీ అనుమానాలు వస్తాయని ఆవేశపడ్డాడు. తర్వాత బ్యాలెన్స్ ది బాల్ టాస్కు జరిగింది. బ్యాలెన్స్ టాస్కులకు పెట్టింది పేరైన ప్రశాంత్ ఈ గేమ్‌లో గెలిచాడు. ఇక ఈ టాస్కు ప్రారంభంలో నిన్ను ఓడిస్తా చూడు అని అమర్‌కు ఛాలెంజ్ చేశాడు గౌతమ్. అన్నట్లుగానే అమర్ ఓడిపోయిన తర్వాత గౌతమ్ ఆటలో నుంచి పక్కకు వెళ్లిపోయాడు. గౌతమ్ తనతో ఛాలెంజ్ చేసిన విషయాన్ని శోభాతో చెప్పాడు అమర్. దీంతో శోభ.. అతడు ఈ టికెట్ టు ఫినాలే రేసులో ఒక్క టాస్క్ కూడా గెలవలేదంటూ డాక్టర్ బాబును హేళన చేసి మాట్లాడింది. ఒక్క టాస్క్ కూడా గెలవని గౌతమ్ మొత్తానికి పాయింట్ల పట్టికను చూస్తుంటే అమర్- పల్లవి ప్రశాంత్ మధ్య గట్టి పోటీ ఉండేట్లు కనిపిస్తోంది. పాపం.. అర్జున్ గట్టిగా ప్రయత్నిస్తున్నా తనకెవరూ పాయింట్లు దానం చేయకపోవడంతో స్కోర్ బోర్డులో వెనుకబడ్డాడు. ఇక ప్రియాంక.. గౌతమ్‌ను తన పాయింట్లు అమర్‌కే ఇవ్వాలని మాట తీసుకుంది. దీంతో అతడు అమర్‌కు దానం చేయడం గ్యారెంటీ! సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రైతుబిడ్డ రేసు నుంచి తప్పుకోగా అమర్ వర్సెస్ అర్జున్ మాత్రమే టికెట్ టు ఫినాలే కోసం పోటీపడనున్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి! చదవండి: దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. 'రౌడీ బాయ్స్' హీరో ఎంగేజ్మెంట్ -
టికెట్ టు ఫినాలే.. ఆదిలోనే రైతుబిడ్డ అవుట్.. కానీ..
డబుల్ ఎలిమినేషన్ సమయంలో గ్రూపులు బయటపడ్డాయి. హౌస్‌లో స్పా(శోభ, ప్రియాంక, అమర్), స్పై(శివాజీ, ప్రశాంత్, యావర్) బ్యాచ్‌లున్నాయని స్వయంగా నాగార్జునే బయటపెట్టాడు. దీంతో గ్రూప్ గేమ్ ఆడట్లేదంటూ అబద్ధాలు వల్లెవేస్తున్న శివాజీ నాటకాలకు అడ్డుకట్ట వేసినట్లయింది. ఇక నామినేషన్స్‌తో బిగ్‌బాస్ హౌస్‌లో లెక్కలు మారిపోయాయి. స్పై బ్యాచ్‌కు దగ్గర్లో ఉన్న అర్జున్ నామినేషన్స్‌తో శివాజీకి పూర్తిగా దూరమయ్యాడు. ఈ విషయాలను పక్కనపెడితే బిగ్‌బాస్ ఫినాలేకు చేరుకోవడానికి టికెట్ టు ఫినాలేను ప్రవేశపెట్టాడు. ఫినాలే అస్త్ర గెలుచుకున్నవారు నేరుగా ఫైనల్స్‌కు వెళ్తారని చెప్పాడు. అయితే ఒకటీరెండు ఆటలు కాకుండా దాదాపు 10 వరకు టాస్క్‌లివ్వనున్నట్లు తెలుస్తోంది. టాస్క్‌లో గెలిచినవారికి వంద పాయింట్లు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అలా చివరికి ఎవరి దగ్గర ఎక్కువ పాయింట్లు ఉంటే వారే ఫినాలే అస్త్ర సొంతం చేసుకుంటారు. తాజాగా రిలీజైన ప్రోమోలో.. ఫినాలే అస్త్ర కోసం మొదటి టాస్క్ ఇచ్చాడు. ఈ ఆటలో ప్రశాంత్ మొదట అవుట్ అవగా.. అర్జున్ చివరి వరకు ఉండి గెలిచాడు. రెండో గేమ్‌లో ప్రశాంత్, మూడో గేమ్‌లో అర్జున్ గెలిచారు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న శివాజీ, శోభ గేమ్‌లో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. వీరు తమ పాయింట్లను అమర్‌కు త్యాగం చేసినట్లు వినికిడి! చదవండి: రంగులు గుమ్మరించినట్లుగా ఉన్న ఈ షర్ట్ ధరెంతో తెలుసా? -
శివాజీ ఆటలో బలిపశువుగా అర్జున్.. ఈ వారం అస్సాం టికెట్ ఫిక్స్!
ఎలిమినేషన్‌కు పునాదులు పడేది నామినేషన్లోనే! కేవలం నామినేట్ అయితేనే ఎలిమినేట్ అయిపోరు.. ఇక్కడ ఎవరు ఏ కారణాలు చెప్తున్నారు? ఎవరి తప్పొప్పులు బయటపడుతున్నాయి? ఇలా అన్నింటినీ గమనిస్తారు ప్రేక్షకులు. ఎవరైతే కరెక్ట్ అనిపిస్తారో వారికి సపోర్ట్‌గా ఉంటారు. ఫలానా వాళ్లు తప్పనిపిస్తే వారికి ఓట్లేయడం మానేసి బయటకు పంపించేస్తారు. మరి ఈ పదమూడోవారం నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో చూసేద్దాం... అబద్ధాలు ఆడుతున్నానా? ఈ వారం నామినేషన్ ప్రక్రియ రైతుబిడ్డతో మొదలైంది. సీక్రెట్ టాస్క్‌లో కూడా నీ ఫ్రెండ్ శోభాను కాపాడాలనుకున్నావ్, అది నచ్చలేదంటూ ప్రియాంకను, వీఐపీ రూమ్‌లోని దుప్పటి దాచుకుని వాడుతున్నావంటూ శోభాను నామినేట్ చేశాడు ప్రశాంత్. గౌతమ్.. ప్రియాంక, శివాజీకి రంగు పూశాడు. తర్వాత ప్రియాంక మాట్లాడుతూ.. నాగార్జున సార్ ముందు నేను అబద్ధాలే ఆడతానని నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు... అది నేను తీసుకోలేకపోతున్నాను అంటూ శివాజీకి రంగు పూసింది. తర్వాత ప్రశాంత్‌ను నామినేట్ చేసింది. పెద్ద తప్పు చేసిన అర్జున్ ఒక్కోసారి చిన్న తప్పులే మన మెడకు చుట్టుకుంటాయి. అలా గతవారం సెల్ఫ్ నామినేట్ చేసుకుని ఏకంగా ఎలిమినేట్ అయిపోయింది అశ్విని. ఇక ఎప్పుడూ తెలివిగా నామినేషన్స్ వేసిన అర్జున్ అంబటి ఈవారం సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. కెప్టెన్సీ కోసం తనకు మద్దతుగా నిలబడ్డ శివాజీని నామినేట్ చేశాడు. నిజానికి శివాజీ.. అర్జున్ను అడ్డుపెట్టుకుని అమర్ మీద కసి తీర్చుకున్నాడు. అతడిని కెప్టెన్ కానీయకుండా చేశాడు. ఈ విషయాన్ని హౌస్‌లో గౌతమ్ తప్ప ఎవరూ పసిగట్టలేకపోయారు. అర్జున్ అప్పుడే ఓ మెట్టు దిగి అమర్‌ను కెప్టెన్ చేయండి అని చెప్పుంటే హీరో అయ్యేవాడు. అర్జున్‌కు దెబ్బ పడింది అప్పుడు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు శివాజీని నామినేట్ చేయడం వల్ల అందరి దృష్టిలో విలన్ అయిపోయాడు. ఫినాలే దగ్గరకు వస్తున్నా సొంతంగా ఆడకపోవడం కరెక్ట్ కాదంటూ ప్రియాంకను నామినేట్ చేశాడు. తర్వాత శివాజీ వంతురాగా.. అర్జున్ ఇచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసేశాడు. నువ్వు గేమ్ ఆడుతున్నావని తెలిసాక కూడా ఇది ఉంచుకోవడం కరెక్ట్ కాదన్నాడు. నీకు కెప్టెన్ కావాలని ఇంట్రస్ట్ లేకపోతే మొదట్లోనే చెప్పేస్తే సరిపోయేది.. ఇప్పుడు నేను పిచ్చోడిని అయిపోయాను అంటూ అర్జున్ను నామినేట్ చేశాడు. తర్వాత తనను నామినేట్ చేసిన గౌతమ్‌కు రివేంజ్ నామినేషన్ వేశాడు. తప్పు చేసిన అమర్, ఏడ్చేసిన ప్రశాంత్ అనంతరం అమర్దీప్ చౌదరి కూడా ఓ పెద్ద తప్పు చేశాడు. కెప్టెన్సీ టాస్కులో తనకు సపోర్ట్ చేసిన ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు. బీబీ మ్యాన్షన్ గేమ్‌లో నువ్వు అంత త్వరగా చనిపోవడం నచ్చలేదు. నీతో గేమ్ ఆడటం మిస్ అయ్యానంటూ సిల్లీ రీజన్ చెప్పాడు. ఇది విని షాకైన ప్రశాంత్.. నిన్ను నమ్మినందుకు బాధపడుతున్నా అని ఏడ్చేశాడు. నమ్మకద్రోహం అని మాట్లాడకు.. నీకు వేయను పో అని అమర్ అన్నప్పటికీ ప్రశాంత్ అక్కడినుంచి కదలకపోవడంతో రైతుబిడ్డకు రంగు పూశాడు అమర్. అలాగే తనకు కెప్టెన్సీ కోసం సాయపడలేదని గౌతమ్‌ను నామినేట్ చేశాడు. తర్వాత యావర్.. గౌతమ్, ప్రియాంకను నామినేట్ చేశాడు. చివరిగా శోభా.. ప్రశాంత్, యావర్‌లను నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారం అమర్దీప్ మినహా మిగతా అందరూ నామినేట్ అయ్యారు. చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు చిత్రం.. నిర్మాతకు కాస్ట్లీ కారు గిఫ్ట్ -
పాతాళానికి పడిపోయిన శివాజీ గ్రాఫ్! మాట కోసం చస్తావా? పెద్ద జోక్..
'ఇచ్చిన మాట కోసం ప్రాణమిస్తాను బాబు గారూ.. నీతి, నిజాయితీ వైపే నిలబడతాను. ఎన్నడూ మాట తప్పను.. న్యాయం కోసం పోరాడుతాను..' అబ్బో.. ఇలా చెప్పుకుంటూ పోతే సోఫాజీ వీకెండ్లో నాగార్జున ముందు ఇచ్చే పర్ఫామెన్స్‌కు ఆస్కార్ ఇవ్వాల్సిందే! చేసేది గోరంత చెప్పేది కొండంత.. అవును మరి, తన డప్పు తను కొట్టుకోకపోతే నిజాలు, నిజస్వరూపాలు బయటపడిపోతాయి కదా.. ఆమాత్రం కవరింగ్ చేయాల్సిందే! కానీ ఎన్నాళ్లు? బిగ్‌బాస్ సీజన్ 7 కథ కంచికి చేరే సమయం దగ్గరపడుతోంది. ఇంకా ముసుగు వేసుకుంటే కష్టం కదా.. కానీ, నిన్నటి ఎపిసోడ్‌తో శివాజీ ముసుగు తొలగిపోయింది.. అతడి బండారం బయటపడింది. ఇద్దరికీ మాటిచ్చాడట.. ఎవరి మీదా పగ లేదు అంటూనే కెప్టెన్సీ టాస్క్‌లో అమర్ మీద ఉన్న అక్కసునంతా వెల్లగక్కాడు శివాజీ. నిజానికి అమర్.. కెప్టెన్సీ పోటీలో సపోర్ట్‌గా ఉండమని అడిగితే శివాజీ నా ఓటు నీకే.. విజయం నీదేపో అన్నంత బిల్డప్ ఇచ్చాడు. తీరా టాస్క్‌లో అర్జున్ భార్య.. అతడు రెండోసారి కెప్టెన్ కావాలని కోరింది. ఆమెకు మాటిచ్చాను.. అంటూ అమర్‌కు వెన్నుపోటు పొడిచాడు. పోనీ నిజంగానే అర్జున్ను కెప్టెన్ చేయాలనుకుంటే గత వారాల్లో చేసి ఉండొచ్చుగా.. అంతదాకా ఎందుకు? అర్జున్ వర్సెస్ శివాజీ ఉన్నప్పుడు.. స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుని అర్జున్ను కెప్టెన్ చేసుంటే గొప్పోడివి అని అంతా చప్పట్లు కొట్టేవారు. టార్గెట్ చేసింది ఎవరు? ఏమీ ఆడకపోయినా సరే, చేతినొప్పి సింపథీతో హౌస్‌లో నెట్టుకొస్తున్న తనకు కెప్టెన్సీ కావాలి.. కానీ ఎన్నోసార్లు కెప్టెన్సీ కంటెండర్ దాకా వచ్చి కెప్టెన్‌కు అడుగుదూరంలో ఆగిపోయిన అమర్‌కు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వకూడదు. అలాంటప్పుడు అమర్‌కు అండగా నిలబడతానని మాటివ్వడం దేనికో? ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే... తను అతడిని టార్గెట్ చేసింది పోయి.. అమర్ తనను టార్గెట్ చేశాడని టాస్క్‌లో పచ్చి అబద్ధాలు చెప్పాడు. నువ్వు నాకు వ్యతిరేకంగా అన్ని చేసినా నేను ఏమీ అనలేదని మహానుభావుడిలా నటించాడు. వెన్నుపోటు పొడిస్తే ఏడ్వక నవ్వుతారా? అవునవును, ఛాన్స్ దొరికినప్పుడల్లా అమర్ మీద వెకిలి డైలాగులు, వెకిలి చేష్టలు చేసిందెవరో అందరికీ తెలుసు. తనను నీచాతినీచంగా చూసినా, టార్గెట్ చేసినా అమర్ మాత్రం శివాజీకి గౌరవమిచ్చి మాట్లాడాడు. లోలోప ద్వేషంతో రగిలిపోతున్నా పైకి మాత్రం పెద్దమనిషిలా నటించాడు శివాజీ. పైగా నీకే నా సపోర్ట్ అని మాటిచ్చి గొంతు కోస్తే అమర్ అల్లాడిపోక ఇంకేం చేస్తాడు. చివరి కెప్టెన్సీ కళ్లముందే కోల్పోతుంటే, మాటిచ్చినవారే వెన్నుపోటు పొడుస్తుంటే కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఈ ఏడుపులు.. డ్రామా.. సింపతీ ఆపంటూ కసురుకున్న శివాజీ.. ప్రశాంత్ ఏడిస్తే మాత్రం అతడి స్వభావమే అంత, కావాలని ఏడవట్లేదని వెనకేసుకొచ్చాడు. అది ఒక ఎమోషన్.. అని మాట్లాడాడు. గౌతమ్ చేస్తే తప్పు.. నువ్వు చేస్తే ఒప్పా? గత కెప్టెన్సీ టాస్క్‌లో గౌతమ్.. ప్రియాంక తన చెల్లి అంటూ ఆమెకు సపోర్ట్ చేశాడు. ఆటలో అన్నాచెల్లెళ్లు అనేవి ఉండవంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు శివాజీ. కానీ నిన్న మాత్రం అర్జున్ భార్య కోసం అతడికి సపోర్ట్ చేస్తున్నా అన్నాడు. అంటే తను మాత్రం బంధాలు, బాంధవ్యాలు ఆలోచించొచ్చు.. పక్కవారు మాత్రం నోరు మూసుకుని ఉండాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. అమర్ కెప్టెన్ అయితే శోభా, ప్రియాంకలను డిప్యూటీలుగా పెట్టుకుంటానన్నాడు.. ఇది సోఫాజీకి నచ్చలేదట. కెప్టెన్ కానివారికి అవకాశం ఇవ్వొచ్చుగా అని వితండవాదన చేశాడు. మరి ఈ బాబుగారు కెప్టెన్ అయినప్పుడు ఆల్రెడీ కెప్టెన్ అయిన ప్రశాంత్, యావర్‌ను డిప్యూటీలుగా పెట్టుకున్నాడెందుకో? అంతే మరి మనం చేస్తే ఒప్పు.. పక్కోళ్లు చేస్తే తప్పు. ఏదేమైనా నిన్నటి ఒక్క ఎపిసోడ్‌తో శివాజీ గ్రాఫ్ పాతాళానికి పడిపోయిందనే చెప్పాలి! ఈ దెబ్బతో అతడు టాప్ 2 రేసులో కూడా లేకుండా పోయాడు. #Shivaji "arey maat icha.. maata kosam chachipotha po" Super dialogue kada.#BiggBossTelugu7 pic.twitter.com/JOYDNSudBR — BiggBossTelugu7 (@TeluguBigg) November 25, 2023 చదవండి: నెలసరి ఆలస్యం.. కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్.. ఫలితం ఏమని వచ్చిందంటే? -
ముసలి వెంట్రుక ఎంతపని చేసింది? వంకరబుద్ధి పోనిచ్చుకోని శివాజీ!
బిగ్‌బాస్ హౌస్‌లో బీబీ మ్యాన్షన్ టాస్క్ జరుగుతోంది. బిగ్‌బాస్ భార్య హత్య జరిగిందని, చంపిందెరో కనుక్కోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ హత్య కేసును ఛేదించే బాధ్యతను పోలీస్ ఇన్వెస్టిగేటర్లయిన అమర్, అర్జున్‌లకు అప్పగించాడు. దీంతో హౌస్‌లో ఉన్న అందరినీ విచారిస్తున్నారు. మరి వీరు హంతకులను పట్టుకున్నారా? లేదా? అనేది తాజా (నవంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.. అమర్ మీద అదేపనిగా అక్కసు.. శివాజీ టాస్క్‌లో కూడా అమర్ మీద అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నాడు. పోలీస్ గెటప్‌లో ఉన్న అమర్‌ను 420, జామకాయలు అమ్ముకునేవాడివి, వీడికెవడ్రా పోలీస్ డ్రెస్ ఇచ్చింది అంటూ హేళన చేస్తూ మాట్లాడాడు. అమర్ మాత్రం ఎంతో సహనంతో అతడికి గౌరవమిచ్చి మాట్లాడటం విశేషం. ఇక అర్జున్.. ప్రశాంత్‌ను ఎవరు చంపారో తెలుసుకుంటే హౌస్‌లో జరుగుతున్న హత్యలకు కారకుడిని పట్టుకున్నట్లే అన్నాడు. దీంతో అమర్.. శివాజీనే అని చెప్పాడు. ఆయన అందరినీ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు అసలు గుట్టు బయటపెట్టాడు. హంతకుడిని పట్టించిన ముసలి వెంట్రుక ఇంతలో శివాజీకి మరో మర్డర్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో భాగంగా అద్దంపై క్రైయింగ్ బేబి అశ్విని గెటౌట్ అని రాయడంతో ఆమె చనిపోయి దెయ్యంగా మారింది. అయితే శివాజీ మీద రతిక అనుమానపడటంతో.. ఏయ్ పిచ్చా, ఏం చేస్తున్నవ్.. అని అరిచి కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అద్దం మీద ఏ పేస్ట్‌తో శివాజీ రాశాడో దాన్ని వెతికి తీసుకొస్తాడు అమర్. దానికి ఒక వెంట్రుక అంటుకుని ఉంటుంది. అది ముసలి వెంట్రుకలా ఉంది, తెల్లబడింది అని శివాజీపై అనుమాం వ్యక్తం చేస్తారు. హంతకుడు శివాజీనే అని శోభా, గౌతమ్, ప్రియాంకలు కూడా ఫిక్సయిపోతారు. ఫెయిలైన శివాజీ అనంతరం గౌతమ్‌ను చంపాలని టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఐయామ్ డెడ్ అని ఉన్న స్టిక్కర్ గౌతమ్‌కు అంటించాలన్నాడు. అయితే శివాజీయే ఇదంతా చేస్తున్నాడని మరోసారి పసిగట్టేశాడు అమర్. కానీ శివాజీ ఆ స్టిక్కర్‌ను గౌతమ్‌ను అంటించకపోవడంతో ఈ సీక్రెట్ టాస్క్‌లో ఫెయిలయ్యాడు. అలా ఆ టాస్క్ ప్రియాంకకు బదిలీ అయింది. ఎంతో అలవోకగా టాస్క్ పూర్తి చేసింది ప్రియాంక. ఇన్వెస్టిగేటర్లు మొదట రతికపై అనుమానంతో ఆమెను జైల్లో వేశారు. తర్వాత శివాజీపై అనుమానం బలపడటంతో రతికను వదిలేసి అతడిని జైల్లో బంధించారు. మరి హంతకుడు ఇతడేనని ఈసారైనా గట్టి నిర్ణయంతో ఉంటారా? మళ్లీ అతడిని వదిలేస్తారా? అనేది చూడాలి! చదవండి: ఓటీటీలో హిట్ సినిమాలు, హారర్ సిరీస్.. ఏవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే? -
రైతుబిడ్డని వదలని రతిక.. అమర్, యావర్‌ల కొట్లాట ఆగేదేలే!
బిగ్‌బాస్ షోలో గతవారం ఎలిమినేషన్ ఎత్తేయడంతో కంటెస్టెంట్లు ఊపిరి పీల్చుకున్నారు. మరీ ముఖ్యంగా అశ్విని, రతిక అయితే తమ ప్రతాపం చూపించడానికి ఇంకో వారం దొరికిందని లోలోపలే సంతోషించారు. 12వ వారం నామినేషన్స్ మొదలుపెట్టాడు బిగ్‌బాస్. గేమ్‌లో ఫౌల్స్ ఆడావని యావర్‌ను నామినేట్ చేశాడు అమర్. అయితే అది తన తప్పు కాదని, సంచాలకుడిగా ఎవరేం తప్పు చేస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని అమర్ మీద మండిపడ్డాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఎలిమినేషన్ ఫ్రీ పాస్ కోసం ఇచ్చిన టాస్కుల్లో ఒకటైన విల్లు గేమ్‌లో ఇద్దరూ తప్పు చేశారంటూ యావర్, శివాజీలను నామినేట్ చేశాడు అర్జున్. గేమ్‌లో అందరూ అరుస్తుంటే ఏకాగ్రత దెబ్బ తిందన్న నువ్వు గేమ్‌లో అవుట్ అవగానే మిగతావాళ్లు ఆట ఆడుతున్నా పట్టించుకోకుండా అరిచేశావని కరెక్ట్ పాయింట్ లాగాడు. దీంతో శివాజీ తన దగ్గర సమాధానం లేక నవ్వి ఊరుకున్నాడు. గౌతమ్.. ప్రశాంత్, శివాజీని.. రతిక.. ప్రశాంత్, అమర్లను నామినేట్ చేశారు. మొత్తానికి ఈ వారం కెప్టెన్ ప్రియాంక, శోభా శెట్టి మినహా మిగతా ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నామినేషన్స్ ఎలా జరిగాయి? ఎవరు కరెక్ట్ పాయింట్స్ చెప్పారు? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! చదవండి: 'మళ్లీ చెప్తున్నా, అలా చేసుంటే భారత్ గెలిచేది..' నటుడి వ్యాఖ్యలపై ట్రోలింగ్ -
బిగ్‌బాస్ ప్లాన్ ఫెయిల్? ఈసారి ఆమెను కాపాడటం కష్టమే!
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో ఫ్యామిలీ వీక్ అయిపోయింది. కంటెస్టెంట్ల ఇంటిసభ్యులు అటు ఇంట్లోకి, ఇటు స్టేజీపైకి వచ్చి మాట్లాడటంతో హౌస్‌మేట్స్‌లో జోష్ రెట్టింపయ్యింది. ఆడాలన్న కసి మరింత పెరిగిపోయింది. ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో ఈ వారాన్ని ప్రారంభించారు. అయితే ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చిన హింట్స్‌ను దృష్టిలో పెట్టుకుని నామినేషన్స్ మొదలుపెట్టారు. రతికను గేమ్ ఆడమని చెప్తే నామినేషన్స్‌లో తన టాలెంట్ చూపించింది. సా...గదీస్తూ చిరాకు పుట్టిస్తున్న రతిక ఏదేదో మాట్లాడుతూ.. రెచ్చిపోయి అరుస్తూ తనకు హైప్ తెచ్చుకోవాలని ప్రయత్నించింది. కానీ చూసేవాళ్లకు అదంతా కావాలని చేస్తుందని ఇట్టే అర్థం కావడంతో తన ప్రవర్తనకు విసుగెత్తిపోయారు. ఇక ప్రశాంత్ క్రేజ్ పెరిగిందనుకున్నాడో మరేంటో కానీ అర్జున్ అనూహ్యంగా రైతుబిడ్డను నామినేట్ చేశాడు. కాకపోతే అతడు చెప్పిన కారణాన్ని మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే! నీ ఇండివిడ్యుయాలిటీ కోల్పోతున్నావ్, సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం లేదని చెప్పాడు. ఎప్పుడూ ఒకరి నీడలో ఉండి ఆడుతున్న ప్రశాంత్ ఈ పాయింట్‌ను అర్థం చేసుకుంటే అతడికే ప్లస్ అవుతుంది. ర్యాంకింగ్‌లో వెనకబడ్డ ఆ ఐదుగురు ఇకపోతే హౌస్‌లో ర్యాంకింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. కంటెస్టెంట్లు.. వారికి అర్హత అనిపించే ర్యాంకుల్లో నిలబడాలన్నాడు. దీంతో తొలి స్థానంలో శివాజీ, రెండు, మూడు స్థానాల్లో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ నిలబడ్డారు. నాలుగైదు స్థానాల్లో ప్రియాంక, శోభ నిల్చోగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఫినాలేలో ఇదే ఆర్డర్ ఉండే అవకాశం లేదు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెల్చుకుంది అతడే అయితే చివరి ఐదు స్థానాల్లో ఉన్నవారి కోసం బంపరాఫర్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను ప్రవేశపెట్టాడు. అందులో భాగంగా ఓ ఈజీ టాస్క్ ఇచ్చాడు. బహుశా అమ్మాయిలను కాపాడటానినే సులువైన టాస్క్ పెట్టాడేమో! కానీ బిగ్‌బాస్ ఆశలను అడియాశలు చేస్తూ అర్జున్ అంబటి పాస్ గెల్చుకున్నట్లు తెలుస్తోంది. పాపం.. రతికను కాపాడటానికి బిగ్‌బాస్ ఎంత ప్రయత్నిస్తున్నా ఈ వారం తనే ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. చదవండి: ఆల్రెడీ పెళ్లై విడాకులు తీసుకున్న హీరోతో ఐదేళ్లు సహజీవనం.. పిల్లల కోసమే పెళ్లి.. -
బిగ్ బాస్ అర్జున్‌కు సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..!
బిగ్ బాస్‌తో వచ్చిన గుర్తింపు కొందరికి వరంలా మారుతుంది. వారి జీవితాన్ని కూడా ఉన్నతస్థాయికి తీసుకెళ్తుంది. ఇప్పటికే కొందరి విషయంలో అది నిజమైంది కూడా.. ఈ సీజన్లో వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌కు ఊహించని అవకాశం దక్కింది. ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు బిగ్ బాస్ వేదికపైకి గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో అర్జున్‌కు సినిమా ఛాన్స్ ఇచ్చాడు బుచ్చిబాబు... తను రామ్ చరణ్‌తో తీయబోయే సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో అర్జున్ ఎగిరిగంతేశాడు. దీపావళి సందర్భంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన బుచ్చిబాబు.. అర్జున్ ఆట తీరును మెచ్చుకున్నారు. తన కోసం వచ్చినందుకు బుచ్చిబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు అర్జున్. 'మీ ఉప్పెన సినిమాకు అవార్డు వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవడానికి రెండు మూడుసార్లు ఆఫీస్‌కు వచ్చాను. కానీ మీరు చెన్నై వెళ్లారని చెప్పారు. ఫోన్ చేద్దామనుకున్నా కుదరలేకపోయింది. ఈలోగా ఉన్నపలంగా బిగ్‌బాస్‌కు రావాల్సి వచ్చింది' అని అర్జున్ అన్నారు. దీనిపై స్పందించిన బుచ్చిబాబు.. 'రామ్ చరణ్ సర్ మూవీలో నువ్వొక సూపర్ పాత్ర చేయబోతున్నావ్. ఫిక్స్ అయిపో' అంటూ పండగ వేళ అర్జున్‌కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ చిత్రం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ పనిచేస్తున్నట్లు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు. దీంతో బిగ్‌బాస్ కంటెస్టెంట్లు అందరూ కేరింతలు కొట్టారు. గేమ్ చేంజర్ తర్వాత RC 16 షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అంబటి అర్జున్ కూడా పలు సీరియల్లతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అర్ధనారి, సుందరి వంటి సీరియల్స్లలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. అంతేకాకుండా గోపీచంద్ 'సౌఖ్యం'లో విలన్‌గానూ మెప్పించాడు. క్రీడా నేపథ్యంలో రూపొందనున్న రామ్ చరణ్ సినిమాలో అర్జున్‌కు ఛాన్స్ దక్కడం గొప్ప విషయమేనని చెప్పవచ్చు. -
రైతుబిడ్డను మళ్లీ ఏడిపించిన రతిక.. నోరేసుకుని సాధిస్తున్న శోభ!
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ అనేది అమృతం కన్నా ఎంతో విలువైనది. కెప్టెన్సీ వస్తే ఒక వారం పాటు ఇమ్యూనిటీ లభించినట్లే! ఈ లెక్కన ఆ వారమంతా ఏ పనీ చేయనక్కర్లేదు, నామినేషన్స్ ఉండవు, ఎలిమినేషన్ భయమే లేదు. పైగా తన మాటే శాసనం అన్నట్లుగా కెప్టెన్ ఏది చెప్తే అదే నడుస్తుంది. అందుకే కెప్టెన్ అవ్వాలని కంటెస్టెంట్లు తహతహలాడిపోతుంటారు. కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెండర్లను ఎంపిక చేసేందుకు బిగ్‌బాస్ బీబీ మారథాన్ పోటీ పెట్టాడు. మరి ఈ మారథాన్‌లో ఏం జరిగింది? ఎవరు కంటెండర్లుగా నిలిచారు? అనేది తాజా(అక్టోబర్ 26) ఎపిసోడ్లో చూసేద్దాం.. నీటితో గేమ్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఈ ఎపిసోడ్లో ముందుగా స్టోర్ ఇట్.. పోర్ ఇట్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా షవర్ నుంచి వచ్చే నీళ్లను తలపై స్పాంజిలో నింపుకుని తమ కంటైననర్లో పిండుకోవాలి. ఈ గేమ్‌లో అర్జున్, అశ్విని, సందీప్, భోలె షావళి ఆడారు. ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో అర్జున్ తోసేయడంతో అశ్విని కిందపడిపోయింది. ఇక బజర్ మోగిన ప్రతిసారి కంటైనర్‌లో తక్కువ నీళ్లు ఉన్నవారు అవుట్ అవుతారు. మొదట భోలె అవుట్ కాగా అతడు తన కంటైనర్‌లోని నీటిని అశ్వినికి ఇచ్చేశాడు. ఇద్దరి త్యాగాలు.. గెలిచిన సందీప్ తర్వాతి రౌండ్లో అశ్విని అవుట్ కాగా ఆమె తన నీటిని సందీప్ మాస్టర్‌కు ఇచ్చేసింది. మూడో రౌండ్లో అర్జున్ ఎంత కష్టపడ్డా సందీపే గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. తర్వాత అమర్‌తో సందీప్ ముచ్చట్లు పెట్టాడు. అర్జున్ సీరియస్‌గా ఆడుతున్నాడని, తను తోసేశాడని ఆరోపించాడు. ఎక్కడ కొడితే ఎక్కడ నొప్పి వస్తుందో నాకూ తెలుసు. నా మోచేయి చాలు తన హైట్‌కు.. అంటూ ఏదేదో మాట్లాడాడు. ఇక అర్జున్ తను గేమ్ ఆడేటప్పుడు ఎవరూ తనకు సపోర్ట్ చేయలేని తెగ ఫీలైపోయాడు. ఇంతకుముందు నో మాస్టర్ అనేవాళ్లు, ఇప్పుడు మాస్టర్ మాస్టర్ అంటున్నారనగానే శివాజీ.. అవన్నీ గచ్చిబౌలి స్ట్రాటజీస్ అంటూ చులకనగా మాట్లాడాడు. అక్కా అనొద్దంటూ వెంటపడ్డ రతిక హౌస్‌లో రీఎంట్రీ ఇచ్చిన రతిక వచ్చినప్పటినుంచి ఇంకా ఏ అలజడి సృష్టించకుండా ఉందేంటా? అనుకునేలోపు మళ్లీ మొదలెట్టేసింది. యావర్‌తో నిన్ను, శివనన్నని తప్ప హౌస్‌లో ఎవరినీ నమ్మను.. మనం ఇద్దరం ఒకే ప్లేట్లో తింటుంటే ప్రియాంక.. మనల్ని లవ్‌బర్డ్స్ అందట. నీ మనసులో, నా మనసులో ఏం లేదు. ఫ్రెండ్లీగా ఉన్నాం.. లవ్ కనెక్షన్ ఎట్లా వస్తుంది అని మాట్లాడింది. మరోవైపు ప్రశాంత్‌తో తనను అక్కా అనొద్దంటూ సతాయించింది. అతడికేమో ఆమె పెట్టిన టార్చర్ గుర్తొచ్చి ఏడుస్తూ అక్కా అనే పిలుస్తా అన్నాడు. ఆమె మాత్రం అందుకొప్పుకోలేదు. చివర్లో శివాజీ కలగజేసుకుని అక్కా అని పిలవనవసరం లేదు అంటూ తీర్పునిచ్చాడు. కంటెండర్‌గా గౌతమ్ కాసేపటికి ఎంప్టీ ద కంటైనర్ టాస్క్ ఇచ్చాడు. దీంతో శోభా.. నేను ఆడతా.. నన్ను ఆడనివ్వకపోతే ఎవరినీ ఆడనివ్వను.. నేను ఆడాల్సిందే అంటూ ఓరకంగా వార్నింగే ఇచ్చింది. దీంతో అర్జున్.. ఆమెతో పోరు పడలేక శివాజీ, అశ్విని, గౌతమ్‌లతో పాటు శోభాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో గౌతమ్ గెలిచాడు. ఓటమిని తీసుకోలేని శోభ ఏడుపు మొదలెట్టేసింది. తర్వాత తేజ-శోభలను బిగ్‌బాస్ ఆటపట్టించాడు. తేజను తిననివ్వకుండా ఎందుకంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావ్.. స్వయంగా మీరే రెండు చపాతీలు చేసి తేజకు తినిపించాలంటూ శోభకు పనిష్మెంట్ ఇచ్చాడు. దీంతో లవ్ సింబల్ షేప్‌లో చపాతీ చేసి తేజ వద్దంటున్నా అతడి వెనకాలే వెళ్తూ ముద్దలు తినిపించింది. ఎట్టకేలకు కంటెండర్‌గా శోభా ఇక చివరగా వేర్ ఇట్ అండ్ విన్ ఇట్ గేమ్ పెట్టాడు. మళ్లీ శోభా.. నేను ఆడతా.. అంటూ మళ్లీ మొదలుపెట్టింది. అర్జున్ ఏదో ఆలోచిస్తుంటే అలిగి వెళ్లిపోయింది. దీంతో అశ్విని, అర్జున్ త్యాగం చేసి తేజ, యావర్, శోభాలకు అవకాశం ఇచ్చారు. ఇందులో తేజకు అమర్, శోభాకు ప్రియాంక, యావర్‌కు ప్రశాంత్ సపోర్ట్ చేశాడు. ఈ గేమ్‌లో శోభా అత్యధికంగా 72 దుస్తులేసుకుని విన్నర్‌గా నిలిచింది. ఈ వారం బీబీ మారథాన్‌లో ప్రియాంక, ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
అశ్వినిని తోసిపడేసిన అర్జున్.. తన పీక పట్టుకున్నాడన్న సందీప్
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఇప్పటికే రెండు టాస్కులు జరగ్గా వాటిలో ప్రియాంక, ప్రశాంత్ గెలిచి కంటెండర్లుగా నిలిచారు. అమర్, రతిక ఆటలో నుంచి అవుట్ అయి రేసులోనే లేకుండా పోయారు. ఇక మిగిలిన కంటెస్టెంట్ల కోసం నేడు బిగ్‌బాస్ మరిన్ని టాస్కులు పెట్టనున్నాడు. ఈమేరకు ప్రోమోలు రిలీజయ్యాయి. షవర్ కింద స్పాంజ్ ఉన్న హెల్మెట్ పెట్టుకుని నిలబడాలి. తర్వాత ఆ స్పాంజ్‌లోని నీళ్లను తమ కంటెయినర్లలో నింపాలి. అర్జున్ ఆటతీరుపై అసహనం ఈ టాస్కులో అర్జున్, భోలె షావళి, అశ్విని, సందీప్ ఆడారు. స్పాంజ్‌ను పూర్తిగా తడుకుపుకునేందుకు పోటీపడి మరీ ఆడారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకున్నారు. అర్జున్ అయితే అశ్వినిని కింద పడేశాడు. ఈ గేమ్ ముగిసిన తర్వాత సందీప్.. అర్జున్ ఆటతీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఫిజికల్ చేయాలంటే రెండు నిమిషాలు పట్టదు. నా పీక పట్టుకుని తోశాడు. ఆ పిల్లను ఒక్క తోపు తోస్తే కింద పడింది అంటూ అర్జున్ మీద మండిపడ్డాడు. ఈ ఆటలో సందీప్ గెలిచినట్లు తెలుస్తోంది. గెలిచిందెవరంటే? ఇక మరో ఆటలో వీలైనన్ని ఎక్కువ దుస్తులు వేసుకోవాలని ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో తేజ, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ ఆడారు. ఇక తేజ తనవే కాకుండా అందరి బట్టలు సైతం వేసుకోవడంతో హౌస్మేట్స్ పడీపడీ నవ్వారు. ఈ టాస్కులో శోభ గెలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు లైవ్‌లో జరిగిన గేమ్స్ ప్రకారం ప్రియాంక, శోభా, గౌతమ్, పల్లవి ప్రశాంత్, సందీప్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. మరి ఈ వారం ఎవరు కెప్టెన్‌గా అవతరిస్తారో చూడాలి! చదవండి: భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన.. 39 ఏళ్ల తర్వాత వెబ్ సిరీస్‌గా.. ఏ ఓటీటీలో అంటే?