బిగ్‌బాస్ 7వ సీజన్ చివరి వారానికి వచ్చేశాం. కొన్నిరోజుల ముందు హోస్ట్ నాగార్జున చెప్పినట్లు ఈసారి నామినేషన్స్ లాంటి హడావుడి ఏం లేదు. కేవలం హౌస్‌లోని ఉన్న ఆరుగురు సభ్యుల ఎమోషన్స్ మాత్రమే పలికించాలని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. అందుకు తగ్గట్లే తాజా ఎపిసోడ్‌లో అమర్, అర్జున్‌కి బోలెడన్ని సర్‌ప్రైజులతో పాటు అదిరిపోయే ఎలివేషన్స్ దక్కాయి. ఇంతకీ సోమవారం ఏం జరిగిందనేది Day 99 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
మెమొరీస్ బుక్
చివరి వారాన్ని చాలా అంటే చాలా హ్యాపీ మెమొరీస్‌తో చాలా పాజిటివ్‌గా ఎండ్ చేద్దామని బిగ్‌బాస్ ఫిక్సయ్యాడు. అందుకు తగ్గట్లే ఒక్కో ఇంటి సభ్యుడి జర్నీని చూపించి, అతడి నుంచి ఎమోషన్స్ అన్నీ బయటకు లాగేయాలనేది ఆర్గనైజర్స్ ప్లాన్. ఫస్ట్ ఫస్ట్ అమర్ ని మాత్రమే లాన్‌లోకి రమ్మన్నారు. అక్కడ అతడి బిగ్‌బాస్ మెమొరీస్ అన్నింటినీ ఫొటోల రూపంలో ప్రదర్శించాడు. ఆ తర్వాత యాక్టివిటీ రూంలోకి పిలిచిన తర్వాత దాదాపు 16 నిమిషాల జర్నీ వీడియోని ప్లే చేశారు.
(ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!)
అమర్ ఎమోషనల్
ఇందులో భాగంగా అమర్.. బిగ్ బాస్ హౌసులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమేం చేశాడు? ఎలా ప్రవర్తించాడు? లాంటి సీన్స్ అన్నింటినీ ఒక్కటిగా చేసి 16 నిమిషాల జర్నీ వీడియో ప్లే చేశారు. అయితే ఈ వీడియో చూస్తే అమర్ నవ్వాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, గూస్ బంప్స్ తెచ్చుకున్నాడు. చివరకు థ్యాంక్స్ బిగ్‌బాస్ అని చెప్పాడు. చాలా పెద్ద గిఫ్ట్ ఇది. అల్టిమేట్ బిగ్‌బాస్ అని అమర్ తన ఆనందాన్ని బయటపెట్టాడు.
అర్జున్ ఎమోషనల్
ఇక అమర్‌కి చేసినట్లే అర్జున్‌ని కూడా పిలిచిన బిగ్‌బాస్.. అలానే 'బిగ్‌బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్' చూపించాడు. తన బిగ్‌బాస్ ఫొటోల్ని చూసి తెగ మురిసిపోయాడు. కాసేపటి తర్వాత యాక్టివిటీ రూంలోకి వెళ్లిన తర్వాత దాదాపు 14 నిమిషాల జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు. ఓవరాల్ వీడియో అంతా నవ్వుతూ చూసిన అర్జున్.. భార్య వచ్చిన క్లిప్ చూసినప్పుడు మాత్రం ఎమోషనల్ అయ్యాడు. అయితే ఈ రోజు ఎపిసోడ్‌ని రాయడం కంటే వీడియోగా చూస్తేనే కిక్ వస్తుంది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: Bigg Boss 7: నాగార్జున స్పెషల్ స్వెట్ టీ-షర్ట్.. ఎన్ని లక్షల ఖరీదంటే?)
Comments
Please login to add a commentAdd a comment