బిగ్‌బాస్ హౌస్‌లో బీబీ మ్యాన్షన్ టాస్క్ జరుగుతోంది. బిగ్‌బాస్ భార్య హత్య జరిగిందని, చంపిందెరో కనుక్కోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ హత్య కేసును ఛేదించే బాధ్యతను పోలీస్ ఇన్వెస్టిగేటర్లయిన అమర్, అర్జున్‌లకు అప్పగించాడు. దీంతో హౌస్‌లో ఉన్న అందరినీ విచారిస్తున్నారు. మరి వీరు హంతకులను పట్టుకున్నారా? లేదా? అనేది తాజా (నవంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..
అమర్ మీద అదేపనిగా అక్కసు..
శివాజీ టాస్క్‌లో కూడా అమర్ మీద అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నాడు. పోలీస్ గెటప్‌లో ఉన్న అమర్‌ను 420, జామకాయలు అమ్ముకునేవాడివి, వీడికెవడ్రా పోలీస్ డ్రెస్ ఇచ్చింది అంటూ హేళన చేస్తూ మాట్లాడాడు. అమర్ మాత్రం ఎంతో సహనంతో అతడికి గౌరవమిచ్చి మాట్లాడటం విశేషం. ఇక అర్జున్.. ప్రశాంత్‌ను ఎవరు చంపారో తెలుసుకుంటే హౌస్‌లో జరుగుతున్న హత్యలకు కారకుడిని పట్టుకున్నట్లే అన్నాడు. దీంతో అమర్.. శివాజీనే అని చెప్పాడు. ఆయన అందరినీ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు అసలు గుట్టు బయటపెట్టాడు.
హంతకుడిని పట్టించిన ముసలి వెంట్రుక
ఇంతలో శివాజీకి మరో మర్డర్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో భాగంగా అద్దంపై క్రైయింగ్ బేబి అశ్విని గెటౌట్ అని రాయడంతో ఆమె చనిపోయి దెయ్యంగా మారింది. అయితే శివాజీ మీద రతిక అనుమానపడటంతో.. ఏయ్ పిచ్చా, ఏం చేస్తున్నవ్.. అని అరిచి కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అద్దం మీద ఏ పేస్ట్‌తో శివాజీ రాశాడో దాన్ని వెతికి తీసుకొస్తాడు అమర్. దానికి ఒక వెంట్రుక అంటుకుని ఉంటుంది. అది ముసలి వెంట్రుకలా ఉంది, తెల్లబడింది అని శివాజీపై అనుమాం వ్యక్తం చేస్తారు. హంతకుడు శివాజీనే అని శోభా, గౌతమ్, ప్రియాంకలు కూడా ఫిక్సయిపోతారు.
ఫెయిలైన శివాజీ
అనంతరం గౌతమ్‌ను చంపాలని టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఐయామ్ డెడ్ అని ఉన్న స్టిక్కర్ గౌతమ్‌కు అంటించాలన్నాడు. అయితే శివాజీయే ఇదంతా చేస్తున్నాడని మరోసారి పసిగట్టేశాడు అమర్. కానీ శివాజీ ఆ స్టిక్కర్‌ను గౌతమ్‌ను అంటించకపోవడంతో ఈ సీక్రెట్ టాస్క్‌లో ఫెయిలయ్యాడు. అలా ఆ టాస్క్ ప్రియాంకకు బదిలీ అయింది. ఎంతో అలవోకగా టాస్క్ పూర్తి చేసింది ప్రియాంక. ఇన్వెస్టిగేటర్లు మొదట రతికపై అనుమానంతో ఆమెను జైల్లో వేశారు. తర్వాత శివాజీపై అనుమానం బలపడటంతో రతికను వదిలేసి అతడిని జైల్లో బంధించారు. మరి హంతకుడు ఇతడేనని ఈసారైనా గట్టి నిర్ణయంతో ఉంటారా? మళ్లీ అతడిని వదిలేస్తారా? అనేది చూడాలి!
చదవండి: ఓటీటీలో హిట్ సినిమాలు, హారర్ సిరీస్.. ఏవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?
Comments
Please login to add a commentAdd a comment