బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. వీరందరూ తమకు తోచిన ఆట ఆడారు. హౌస్‌లో ఉండేందుకు ప్రయత్నించారు. కానీ షో ముందుకు సాగాలంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే! అలా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ పోగా గ్రాండ్ ఫినాలే వచ్చేసరికి ఆరుగురు మిగిలారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. షోలో కొనసాగడం కోసం కష్టపడ్డ ఎంతోమంది ముందే ఎలిమినేట్ అయిపోగా.. ఏమాత్రం కష్టపడకుండా సోఫాలో సేద తీరుతూ.. బిగ్‌బాస్‌కే ఆర్డర్లు వేసిన శివాజీ మాత్రం టాప్ 3 వరకు వచ్చాడు.
పగతో రగిలిపోయాడు..
ఈయనది మాస్టర్ మైండ్ అని నాగ్ అన్నారు. నిజమే, శివాజీ అంత కన్నింగ్ మాస్టర్ మైండ్ బిగ్‌బాస్ చరిత్రలోనే ఎవరికీ లేదు. ఒకరి మీద పగపెట్టుకుని ద్వేషంతో రగిలిపోతూ కుట్రలు పన్నుతూ పైకి మాత్రం ఏమీ ఎరుగనివాడిలా నటించడం ఆయనకే సాధ్యమైంది. శివాజీ హౌస్‌లో చేసింది రెండే రెండు. ఒకటి.. అమర్‌ను టార్గెట్ చేయడం. రెండు.. ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌లను తన గుప్పిట్లో పెట్టుకోవడం. కామన్ మ్యాన్‌కు సపోర్ట్ చేస్తే జనాల్లో తనకు మంచి గుర్తింపు వస్తుందనుకున్నాడు. అందుకే రైతుబిడ్డను, అలాగే నటుడిగా పెద్ద గుర్తింపు లేని ప్రిన్స్ యావర్‌ను తన గ్రూపులో చేర్చుకున్నాడు. టాస్కుల్లో విజృంభించి ఆడేది వీళ్లిద్దరే కాబట్టి వీళ్లేది సాధించినా అది తన ఖాతాలోనే వేసుకునేవాడు.
మానసికంగా వేధించిన ఛీవాజీ
బిగ్‌బాస్ 7 మొదలైనప్పుడే అమర్ టైటిల్ ఫేవరెట్‌గా హౌస్‌లో అడుగుపెట్టాడు. ఈ విషయం తెలిసిన శివాజీ అతడి గురించి అంతా రీసెర్చ్ చేసి మరీ తనను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. తనను ఎప్పుడూ కిందకు లాగాలని చూశాడు. సూటిపోటి మాటలతో వేధించాడు. లక్షలాది మంది ప్రేక్షకులు చూసే షోలో అతడిని పనికిరాని వెధవగా చిత్రీకరించాడు. తను ఏం చేసినా తప్పనేవాడు. శివాజీ కుట్రలు తెలియని అమర్‌దీప్ అతడిని మాత్రం గురువుగానే భావించాడు. ఈ వంకతో మరింత చనువు తీసుకున్న సోఫాజీ.. అమర్ మీద ఎన్నోసార్లు విషం కక్కాడు. ఏదైనా అంటే సరదాగా అన్నానని తప్పించుకునేవాడు.
డమ్మీ చాణక్య.. జనం చూశారు!
పదేపదే జనం చూస్తున్నారు అని చెప్పే శివాజీ.. తను అనే మాటలను, తన చేష్టలను జనం పట్టించుకోరనుకున్నాడేమో! కానీ జనం చూశారు. ఈ డమ్మీ చాణక్య పన్నాగాలు తెలుసుకున్నారు. ఒకరిని కిందకు లాగాలనుకుంటే ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. అమర్‌కు జై కొట్టి రెండో స్థానంలో నిలబెట్టాడు. అతడిని తొక్కేయాలని చూసిన శివాజీని మూడో స్థానానికే పరిమితం చేశారు. ఇక్కడే శివాజీ ఓడిపోయాడు. అమర్‌కు వేస్ట్ ఫెలో, పనికిమాలినోడు, వెధవన్నర వెధవ, పిచ్చి పోహ.. ఇలా ఎన్నో బిరుదులిచ్చాడు. మరి అతడి చేతిలో ఓడిపోయిన శివాజీని ఏమని పిలిస్తే బాగుంటుందో అతడికే తెలియాలి.
వాళ్లు లేకపోయుంటే శివాజీ 'జీరో'
పోనీ శివాజీ హౌస్‌లో పెద్దగా పొడిచేసిందేమైనా ఉందా? అంటే అదీ లేదు. ఒక టాస్క్ ఆడలేదు, ఎంటర్‌టైన్‌మెంట్ అసలే చేతకాలేదు. పైగా ఆడలేక మద్దెల దరువు అన్నట్లు ప్రతిసారి తన చేయినొప్పిని సాకుగా చూపిస్తూ ఎంచక్కా ట్రిప్పుకు వచ్చినట్లు సోఫాలో సెటిలై గేమ్ చూస్తూ ఎంజాయ్ చేశాడు. సీజన్ అంతా చేయినొప్పినే చూపిస్తూ సింపతీ ఓట్లు సంపాదించుకున్నాడు. ప్రశాంత్‌ను విన్నర్ చేసింది తానే అని విర్రవీగుతున్న శివాజీ ఈ రోజు కనీసం టాప్ 3లో అయినా ఉన్నాడంటే అందుకు కారణం.. ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌లే! ఇది ఎవరూ కాదనలేని నిజం! వాళ్లు లేకపోయుంటే శివాజీ 'జీరో'.
చదవండి: ప్రశాంత్‌ను కారు దిగనివ్వని పోలీసులు.. రైతుబిడ్డను అన్నా.. ఇట్ల చేస్తే ఎలా?
Comments
Please login to add a commentAdd a comment