
బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7 ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద దుమారమే రేగింది. ఈ సీజన్‌లో పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమర్ కారుపై ఒక వర్గం ఫ్యాన్స్ దాడి చేశారు. అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు.
తాజాగా ఈ విషయంపై ఒక యూట్యూబ్ ఛానల్‌లో ప్రియాంక రియాక్ట్ అయింది. అభిమానులు ఎవరైనా కానీ ఇలా దాడి చేయడం చాలా దారుణమని ఆమె ఇలా తెలిపింది. 'ఫ్యాన్స్ పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడటం చాలా దారుణం. మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వ్యతిరేకించండి.. అందులో తప్పులేదు కానీ ఇలా దాడి చేయడం చాలా హేయం. ఎవరమైనా ఎంతో కష్టపడి ఒక వస్తువును కొంటాము. కానీ ఇలా కొన్ని క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్ కాదు. దాడి సమయంలో కారులోపల మహిళలు ఉన్నారనే ఆలోచన కూడా లేకుంటే ఎలా..?
హౌస్‌లో గేమ్ పరంగా మాత్రమే మాలో గొడవలు ఉన్నాయి. టాస్క్ ముగియగానే పల్లవి ప్రశాంత్,యావర్,శివాజీ,అమర్ ఇలా అందరం చాలా బాగా కలిసే ఉండే వాళ్లం. మాలో ఎలాంటి గొడవలు లేవు.' ముఖ్యంగా చివరి 4 వారాల్లో ప్రశాంత్‌తో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. వాడు నిజంగానే భూమి బిడ్డ అని ఆమె తెలిపింది. కానీ ఆ ఇంటర్వ్యూ జరిగిన సమయానికి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కాలేదు.. దీంతో ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ అరెస్ట్‌పై ఆమెకు ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment