Pallavi Prashanth
-
సోనియా పెళ్లిలో పెద్దోడు మిస్సింగ్.. కానీ పుష్ప లెవల్లో రైతుబిడ్డ ఎంట్రీ
సోనియా ఆకుల.. బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో సెన్సేషన్ అయిన పేరు. నిర్భయంగా, నిర్మొహమాటంగా తనకు ఏదనిపిస్తే అది మాట్లాడుతుంది. ఎవరేమనుకున్నా లెక్క చేయకుండా నచ్చింది చేసుకుంటూ పోతుంది. బిగ్‌బాస్ 8లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన పృథ్వీ, నిఖిల్‌తో కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడింది. ఆ ఇద్దరినీ తన గుప్పిట్లో పెట్టుకుందన్న విమర్శలు కూడా మూటగట్టుకుంది. కట్ చేస్తే షో నుంచి ఎలిమినేట్ అయ్యాక తనపై నెగెటివిటీ వచ్చిందని తెలుసుకుని దాన్ని ఎలాగోలా కవర్ చేసేయాలనుకుంది.నిఖిల్‌కు ఆహ్వానం.. కానీ!అందుకుగానూ తన గుప్పిట్లో పెట్టుకున్న పెద్దోడు అలియాస్ నిఖిల్‌నే నామినేట్ చేసింది. సోషల్ మీడియాలోనూ అతడికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టింది. ఇప్పుడు షో పూర్తయింది కాబట్టి అంతా కలిసిపోయారు. తన పెళ్లికి రమ్మని శుభలేఖ ఇచ్చిందట. ఆమెపై అలిగాడో, కోపమో, పనివల్లో కానీ సోనియా వివాహానికి నిఖిల్ డుమ్మా కొట్టాడు. అయితే గత సీజన్ విజేత రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మాత్రం సోనియా రిసెప్షన్‌కు హాజరై ఆమెను ఆశీర్వదించాడు. పుష్ప లెవల్లో ఎంట్రీఈమేరకు తన గ్రాండ్ ఎంట్రీ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో ప్రశాంత్ చుట్టూ ఇద్దరు, ముగ్గురు బౌన్సర్లు కూడా ఉన్నారు. కొత్త జంటను కలిసిన అనంతరం బిగ్‌బాస్ సెలబ్రిటీలందర్నీ పలకరించాడు. ఇక ఈ వీడియోకు పుష్ప 2 మూవీలోని గంగో రేణుక తల్లి పాటను యాడ్ చేయడం గమనార్హం. ఇది చూసిన జనాలు ఇతడేంటి? హీరోలా ఫీలైపోతున్నాడు అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) చదవండి: ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్ -
Pallavi Prashanth: మాట మారింది.. స్టైల్ మారింది!
'అన్నా.. నేను రైతుబిడ్డనన్నా..', 'జై జవాన్- జై కిసాన్' అంటూ బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో ఇవే డైలాగ్స్ రిపీట్ చేశాడు పల్లవి ప్రశాంత్. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు ఓ పక్క అమాయకంగా ఉంటూనే మరోక్క పుష్ప లెవల్లో డైలాగ్స్ పలికేవాడు. టైటిల్ గెలిస్తే వచ్చిన ప్రైజ్‌మనీతో నిరుపేదలకు సాయం చేస్తానని మాటిచ్చాడు. నేలతల్లి సాక్షిగా, పంట చేను సాక్షిగా చెప్తున్నా.. నేను గెలిచిన రూ.35 లక్షల్లో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోను. అందరికీ దానం చేస్తానని బీరాలు పలికాడు.చేతులు దులిపేసుకున్న ప్రశాంత్?ఇచ్చిన మాట ప్రకారం అప్పట్లో రూ.1 లక్ష సాయం చేశాడు. తర్వాత మరో కుటుంబానికి లక్ష కంటే తక్కువే ఇచ్చినట్లు తెలుస్తోంది. షో పూర్తయి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ ప్రైజ్‌మనీ మొత్తాన్ని అతడు చెప్పినట్లుగా నిరుపేదలకు ఖర్చు చేయనేలేదు. ఈ విషయంలో ప్రశాంత్ మాట తప్పాడని జనాలు విమర్శిస్తూనే ఉన్నారు. హౌస్‌లో సింపతీ డ్రామా ఆడి, బయటకు వచ్చాక మాత్రం తలపొగరు చూపిస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. లుక్ మార్చిన రైతు బిడ్డతాజాగా ప్రశాంత్ సోషల్ మీడియాలో తన ఫోటోలు షేర్ చేశాడు. అందులో ప్రశాంత్ గెటప్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. లుక్ మార్చేశావేంటన్నా.., రైతు బిడ్డ రాయల్ బిడ్డ అయ్యాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం.. ఈ సోకులకేం తక్కువ లేదు, ముందు ఇచ్చిన మాట ప్రకారం డబ్బు పంచు అని సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) చదవండి: ఇన్‌స్టాతో పాపులర్.. ఫోక్ సింగర్ 'శృతి' ఆత్మహత్య -
బిగ్‌బాస్ 8 ఫినాలే.. పోలీసులు ముందస్తు వార్నింగ్
బిగ్‌బాస్ 8వ సీజన్ ఫినాలే సాయంత్రం జరగనుంది. అయితే గతేడాది జరిగిన అనుభవాల దృష్ట్యా.. హైదరాబాద్ వెస్ట్ పోలీసులు పలు సూచనలు, వార్నింగ్స్ ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో ఆంక్షలు విధించారు. స్టూడియో బయట భారీ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అభిమానులు ఎవరూ స్టూడియో దగ్గరకు రావొద్దని పోలీసులు తెలిపారు.(ఇదీ చదవండి: 'బిగ్ బాస్' విన్నర్ ప్రైజ్ మనీ రివీల్ చేసిన నాగ్.. హిస్టరీలో ఇదే టాప్)కార్యక్రమం పూర్తయిన అనంతరం ఊరేగింపులు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా సరే బిగ్ బాస్ నిర్వహకులదే బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు. ఇవన్నీ ఎందుకంటే గతేడాది డిసెంబరు 17న బిగ్‌బాస్ 7వ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్‌ని ప్రకటించారు.పల్లవి ప్రశాంత్ బయటకొచ్చిన తర్వాత ఇతడి అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తోటి కంటెస్టెంట్స్ కార్లపై దాడి చేయడంతో పాటు ఆ దారిలో వెళ్తున్న ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈసారి ర్యాలీలపై నిషేధం విధించారు.(ఇదీ చదవండి: చిరంజీవి ఇంటికి కుటుంబంతో పాటు వెళ్లిన 'అల్లు అర్జున్') -
రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్.. బన్నీకి పోటీ ఇచ్చేలా ఉన్నాడుగా!
రైతు బిడ్డ ట్యాగ్‌తో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన తెలంగాణ బిడ్డ పల్లవి ప్రశాంత్. ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ఏకంగా ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. బిగ్‌బాస్ సీజన్-7 విన్నర్‌గా నిలిచి ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఇక రైతు బిడ్డ కాస్తా బిగ్‌బాస్ విన్నర్‌గా స్టార్‌గా ఎదిగాడు. అయితే ట్రోఫీ గెలిచిన తర్వాత ఊహించని పరిణామాలతో జైలుకు వెళ్లి వచ్చాడు.సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపించే పల్లవి ప్రశాంత్.. తాజాగా స్టార్ మా అవార్డ్స్ వేడుకలో మెరిశాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తన తన ట్విటర్లో పోస్ట్ చేసింది. స్టార్ మా పరివార్ అవార్డ్స్‌లో పల్లవి ప్రశాంత్ గ్రాండ్ ఎంట్రీ అంటూ వీడియోను రిలీజ్ చేసింది. మన రైతు బిడ్డ ఏకంగా పుష్ప స్టైల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. గడ్డంతో పుష్ప మేనరిజాన్ని ఇమిటేట్ చేస్తూ కనిపించాడు. ఈ వేడుక త్వరలోనే స్టార్ మాలో ప్రసారం కానుంది. Pallavi Prashanth’s grand entry at the Star Maa Parivaar Awards! 🌟✨ His energy and grace will leave everyone in awe, setting the stage on fire with his powerful presence. Coming soon only on #StarMaa! 🌟 #StarMaaParivaarAwards2024 #SMPA2024 pic.twitter.com/5Lkrminsn9— Starmaa (@StarMaa) October 15, 2024 -
ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలివే!
ఫేమస్ అవడానికో లేదా డబ్బు సంపాదించడానికో బిగ్‌బాస్ షోకు వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు! అయితే వచ్చిన ప్రతి ఒక్కరూ అంతో ఇంతో డబ్బు వెనకేసుకుంటారేమో కానీ మంచి పేరు రావడం కష్టం. ఇక్కడ అడుగుపెట్టినవాళ్లలో నెగెటివిటీని మూటగట్టుకుని బయటకు వెళ్లినవాళ్లే ఎక్కువ. కొందరు మాత్రమే తామేంటో నిరూపించుకుని విజేతలుగా నిలిచి ప్రేక్షకుల మనసులు గెలిచారు. మరి ఇప్పటివరకు జరిగిన సీజన్లలో గెలిచినవారు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూసేద్దాం..బిగ్‌బాస్ 1బిగ్‌బాస్ తెలుగు మొదటి సీజన్లో సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్లనే ఎక్కువగా తీసుకొచ్చారు. నవదీప్, హరితేజ, ఆదర్శ్ అందరినీ వెనక్కు నెట్టి శివబాలాజీ విజేతగా నిలిచాడు. ఈ విజయంతో తన కెరీర్ ఏమైనా మారిందా? అంటే లేదనే చెప్పాలి. 2017లో బిగ్‌బాస్ 1 సీజన్ జరగ్గా దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత 2022లో మళ్లీ బిగ్స్క్రీన్పై కనిపించాడు. ఒకప్పటి అంత స్పీడుగా సినిమాలు చేయకపోయినా ఆచితూచి ప్రాజెక్టులు ఎంపిక చేసుకుంటున్నాడు.బిగ్‌బాస్ 2బిగ్‌బాస్ రెండో సీజన్లో కౌశల్ మండా విజయం సాధించాడు. ఇతడి కోసం జనాలు ర్యాలీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తన చేతిలో బోలెడన్ని ఆఫర్లు ఉన్నాయి, సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకునే అతడు ఎక్కువగా బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్, షోలలోనే కనిపిస్తున్నాడు తప్ప సినిమాల ఊసే లేదు.బిగ్‌బాస్ 3శ్రీముఖిని వెనక్కు నెట్టి రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్ 3 టైటిల్ ఎగరేసుకుపోయాడు. ఇతడికి ఉన్న టాలెంట్‌తో పెద్ద సినిమాల్లోనూ పాటలు పాడే ఛాన్సులు అందుకున్నాడు. అలా ఆర్ఆర్ఆర్ మూవీలోని ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'నాటు నాటు..'ను కాలభైరవతో కలిసి ఆలపించాడు. బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చాక స్టార్ స్టేటస్ అందుకున్న ఏకైక విన్నర్ బహుశా ఇతడే కావచ్చు.బిగ్‌బాస్ 4కండబలం కన్నా బుద్ధిబలం ముఖ్యం అని నిరూపించాడు అభిజిత్. ఎక్కువగా టాస్కులు గెలవకపోయినా మైండ్ గేమ్ ఆడి, తన ప్రవర్తనతో టైటిల్ గెలిచేశాడు. బిగ్‌బాస్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకుని మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనే సిరీస్‌లో తళుక్కున మెరిశాడు. మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని మెగా కోడలు లావణ్య త్రిపాఠితో కలిసి మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ చేశాడు. ఇప్పుడు మళ్లీ ఖాళీగానే ఉన్నట్లున్నాడు.బిగ్‌బాస్ 5బిగ్‌బాస్ ఐదో సీజన్లో వీజే సన్నీ విన్నర్‌గా నిలిచాడు. అప్పటివరకు సీరియల్స్‌లోనే కనిపించిన అతడిని వెండితెరకు పరిచయం చేయడానికి ఈ షో మంచి ప్లాట్‌ఫామ్ అని భావించాడు. బిగ్‌బాస్ విజేతగా బయటకు వచ్చి హీరోగా ఏడాదికో సినిమా చేశాడు. కానీ మంచి హిట్టు అందుకోలేకపోయాడు.'బిగ్‌బాస్ 6ఈ సీజన్ విన్నర్ సింగర్ రేవంత్ మంచి టాలెంటెడ్. అప్పటివరకు ఎన్నో హిట్ సాంగ్స్ పాడాడు. ఈ షో తర్వాత కూడా తన జీవితం అలాగే కొనసాగిందే తప్ప ఊహించని మలుపులు అయితే ఏమీ జరగలేదు. ఇంకా చెప్పాలంటే అప్పటికన్నా ఇప్పుడే కాస్త ఆఫర్లు తగ్గాయి.బిగ్‌బాస్ 7రైతుబిడ్డ.. ఈ ఒకే ఒక్క పదం అతడిని బిగ్‌బాస్ విన్నర్‌ను చేసింది. గెలిస్తే రైతులకు సాయం చేస్తానంటూ ఆర్భాటాలు పోయిన ఇతడు ఆ తర్వాత ఒకరిద్దరికి సాయం చేసి చేతులు దులిపేసుకున్నాడు. ఈ బిగ్‌బాస్ షో తర్వాత కూడా ఎప్పటిలాగే రోజూ పొలం వీడియోలు చేసుకుంటూ బతికేస్తున్నాడు.బిగ్‌బాస్ నాన్‌స్టాప్ (ఓటీటీ)హీరోయిన్ బిందుమాధవి.. లేడీ ఫైటర్‌గా పోరాడి బిగ్‌బాస్ నాన్‌స్టాప్ టైటిల్ ఎగరేసుకుపోయింది. ఈ తెలుగమ్మాయికి బిగ్‌బాస్ తర్వాత మంచి అవకాశాలే వచ్చాయి. యాంగర్ టేల్స్, న్యూసెన్స్, మాన్షన్ 24, పరువు వెబ్ సిరీస్‌లలో కనిపించింది. అయితే ఇప్పటికీ తమిళంలోనే సినిమాలు చేస్తోంది తప్ప టాలీవుడ్లో మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు.ఇప్పటివరకు బిగ్‌బాస్ గెలిచినవారి జాతకాలు ఇలా ఉన్నాయి. మరి ఈసారి ఇంట్లో అడుగుపెట్టిన పద్నాలుగో మందిలో ఎవరు గెలుస్తారో? తర్వాత వారి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి! -
ఎట్టకేలకు రైతుబిడ్డ చేతికి! తల్లికి తొలి కానుక..
బిగ్‌బాస్ షో పనైపోయిందనుకున్న సమయంలో ఉల్టా పుల్టా అంటూ ఏడో సీజన్‌పై ఆసక్తి పెంచాడు కింగ్ నాగార్జున. ఈ రియాలిటీ షోని మళ్లీ గాడిలో పెట్టే పనిని తన భుజాలపై వేసుకున్నాడు. అలా నాగ్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ బాగానే వర్కవుట్ అయింది. ఈ సీజన్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా నటుడు అమర్దీప్ చౌదరి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.ప్రైజ్‌మనీతో పాటువిన్నర్కు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వాలి. అయితే ఫినాలేలో ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్‌కేసును ఎగరేసుకుపోవడంతో ప్రశాంత్‌కు రూ.35 లక్షలు వచ్చాయి. ఇందులో 30-40 శాతం వరకు ట్యాక్స్‌కే పోతుంది. ఇది కాకుండా లగ్జరీ కారు గెలుచుకున్నాడు. అయితే హౌస్‌లో ఉన్నప్పుడు రూ.15 లక్షల విలువైన డైమండ్ జ్యువెలరీ కూడా ఇస్తామని ప్రకటించారు. అమ్మకు తొలి కానుకషో ముగిసిన ఐదు నెలల తర్వాత ఆ నగను ప్రశాంత్‌కు అందించారు. అక్షయ తృతీయ రోజే జ్యువెలరీ చేతికి రావడంతో రైతుబిడ్డ సంతోషంలో మునిగిపోయాడు. 'అమ్మకు తొలి కానుక.. బిగ్‌బాస్ ఏడో సీజన్‌కు థ్యాంక్స్.. లవ్యూ నాగ్ సర్..' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడా పోస్ట్ వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)చదవండి: బుల్లితెర నటి ఇంట సెలబ్రేషన్స్.. బాబు ఊయల ఫంక్షన్ -
మాట నిలబెట్టుకున్న రైతుబిడ్డ ప్రశాంత్.. వాళ్లకు రూ.లక్ష సాయం
'బిగ్‌బాస్ 7' షో అయిపోయి చాలారోజులైపోయింది. రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో షోలో అడుగుపెట్టి విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్.. రూ.35 లక్షల ప్రైజ్‌మనీతో రైతులకు సాయం చేస్తానన్నాడు. మూడు నెలల కావస్తున్నా ఇంకా దాని గురించి ఊసేలేదని తెగ విమర్శలు వచ్చాయి. షోలు చేసుకుంటూ, ఎంజాయ్ చేస్తున్నాడని అందరూ మనోడిని తెగ ట్రోల్ చేశాడు. ఫైనల్‌గా ఇన్నాళ్లకు మాట నిలబెట్టుకున్నాడు. తొలి సాయం చేశాడు. (ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో నిశ్చితార్థం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్) గతంలో జరిగిన ఆరు సీజన్ల కంటే ఈసారి బిగ్‌బాస్.. ఊహించిన దానికంటే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. దీనికి కారణం పల్లవి ప్రశాంత్. రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో వచ్చి షోలో సింపతీ కొట్టేశాడు. జనాలు కూడా ఇతడిని చెప్పింది నిజమా అబద్ధమా అనేది చూడకుండా నమ్మేశారు. ఓట్లు వేశారు. ఇక షోలో విజేతగా నిలిచిన తర్వాత అదే రోజు రాత్రి.. హైదరాబాద్‌లో ఇతడి ఫ్యాన్స్ చేసిన హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్లు, బస్సుల అద్దాల పగలగొట్టి నానా రచ్చ చేశారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌ని కొన్నిరోజలు జైల్లో పెట్టడం, బెయిల్‌పై బయటకు రావడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. అయితే షోలో పల్లవి ప్రశాంత్ చెప్పినట్లు పేద రైతులకు సాయం చేస్తానని మాట మాత్రం మరిచిపోయాడా అని సందేహం వచ్చింది. అయితే తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెడుతూ.. గజ్వేల్‌లోని కొలుగురూ గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి ఏకంగా రూ.లక్ష సాయమందించాడు. తల్లిదండ్రులు కోల్పోయిన ఇద్దరు పిల్లల కోసం రూ.లక్షతో పాటు ఏడాదికి సరిపడా బియ్యాన్ని అందజేశాడు. ఇతడికి తోడుగా సందీప్ మాస్టర్ రూ.25 వేలు సాయం చేయడం విశేషం. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో సందీప్-ప్రశాంత్ పోస్ట్ చేశారు. (ఇదీ చదవండి: రాజమౌళి సలహా.. పద్ధతి మార్చుకున్నా: స్టార్ హీరోయిన్) View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
రాజకీయాల్లోకి రైతుబిడ్డ? అందుకే అలా..
రైతుబిడ్డ తలుచుకుంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదంటున్నాడు పల్లవి ప్రశాంత్.. ఒక్క ఛాన్స్ అంటూ బిగ్‌బాస్ స్టూడియో ముందు పడిగాపులు కాసిన ప్రశాంత్ ఏడో సీజన్లో పాల్గొనడమే కాకుండా ఆ సీజన్‌కు విన్నర్‌గా నిలిచిన విషయం తెలిసిందే! అయితే షో అయిపోయిన తర్వాత చేసిన హంగామా వల్ల జైలుకు కూడా వెళ్లివచ్చాడు. తాజాగా ఇతడు బిగ్‌బాస్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ హీరోగా నటించిన ఓ సినిమా ఈవెంట్‌కు హాజరయ్యాడు. దేవుడే దిక్కు ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ.. 'మనల్ని మనం నమ్ముకోవాలి. అలాగే దేవుడిని నమ్మినవాళ్లు ఎప్పుడూ చెడిపోరు. ఆ భగవంతుడే కాపాడతాడు. ఏ కష్టంలో ఉన్నా దేవుడే దిక్కనుకుంటే ఆయనే ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడతాడు. మన వెన్నంటే ఉంటాడు. మనం ముందుకు వెళ్తుంటే ఎన్నో దెబ్బలు తాకుతూ ఉంటాయి. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా సరే గట్టిగా నిలబడాలి. నేను అలాగే నిలబడ్డాను.. అందుకే మీముందు ఇలా నిలబడ్డాను. మీ ఆశీస్సులు ఉంటే.. ఇంకా ఎన్ని ఎదురుదెబ్బలు తాకినా సరే అస్సలు భయపడను, వెనక్కు వెళ్లను.. ఇలాగే నిలబడతాను. రైతుబిడ్డ అనుకుంటే ఏదైనా సాధిస్తాడు' అని చెప్పాడు. ఇంతలో శివాజీ పార్లమెంటుకు కూడా వెళ్తాడు అనగా.. 'మీ అందరి ఆశీస్సులు ఉంటే అది కూడా జరుగుతుంది. యువత మేలుకోవాలి, యువత ముందడుగు వేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది' అని చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ మాటల్ని బట్టి చూస్తే జనాలు సపోర్ట్ చేస్తే రాజకీయాల్లోకి రావడానికి సిద్ధమని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్ విన్నర్ ఓవరాక్షన్.. యూట్యూబర్‌ను కాలితో తన్నుతూ, కొడుతూ.. -
బిగ్‌బాస్ విన్నర్ రైతుబిడ్డకు ఊరట.. ఇకపై..
గెలుపోటములు సహజమే.. కష్టసుఖాలూ కామనే.. కానీ రెండూ ఒకేసారి వస్తే తట్టుకోవడం, తట్టుకుని నిలబడటం చాలా కష్టం. పల్లవి ప్రశాంత్‌కు ఇటువంటి పరిస్థితే ఏర్పడింది. తనను తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్ విజేతగా ప్రకటించడంతో ఫుల్ ఖుషీ అయ్యాడు ప్రశాంత్. కానీ ఫినాలే ఎపిసోడ్ జరిగిన కొద్ది క్షణాలకే గందరగోళం సృష్టించాడు. స్టూడియో బయట పరిస్థితి బాలేదు, వెనకనుంచి వెళ్లిపో అని పోలీసులు చెప్తున్నా పట్టించుకోకుండా లెక్క చేయలేదు. ప్రశాంత్ రాకతో వీరంగం అప్పటికే అభిమానులు కంటెస్టెంట్ల కార్ల అద్దాలు, బస్సుల అద్దాలు ధ్వంసం చేస్తూ నానా వీరంగం సృష్టిస్తుండగా ప్రశాంత్ అక్కడికి చేరుకోవడంతో అక్కడి జనాలు మరింత రెచ్చిపోయారు. ఈ వ్యవహారంలో ప్రశాంత్, అతడి సోదరుడితో పాటు పలువురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నాలుగు రోజులపాటు జైల్లో ఉన్న ప్రశాంత్ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. రెండు నెలలుగా పోలీసుల ఎదుట హాజరు బెయిల్‌లోని కండీషన్ ప్రకారం రెండు నెలలుగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకం చేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు పోలీసుల ఎదుట హాజరు నుంచి రిలీఫ్ ఇవ్వాలని ప్రశాంత్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై బుధవారం నాడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. ప్రశాంత్, ఆయన సోదరుడు పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. చదవండి: అనసూయ గ్లామర్ వెనుక కష్టాలు ఎవరికీ తెలియవు.. తనలాంటి అమ్మాయి.. -
ప్రశాంత్‌కు ఇబ్బందిగా మారిన 'బిగ్‌బాస్' ప్రైజ్ మనీ.. వాళ్లను మోసం చేశాడా?
బిగ్‌బాస్ 7 ముగిసిపోయి ఇప్పటికి రెండు నెలలు దాటింది. ఈ సీజన్ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ నిలిచిన విషయం తెలిసిందే. రైతుబిడ్డ ట్యాగ్‌లైన్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన ప్రశాంత్ విజేతగా నిలిచాడు. తన స్ట్రాటజీతో గేమ్ ఆడుతూ ప్రత్యర్థులను ఎదుర్కుంటూ ఒక్కోమెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకున్నాడు. విజేతగా నిలుస్తే వచ్చే ప్రైజ్ మనీని పేద రైతులకు ఉపయోగిస్తానని పలుమార్లు చెప్పాడు. ఇప్పుడా విషయంపై సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ప్రశాంత్ కూడా రియాక్ట్ అయ్యాడు. రైతుల పేరుతో గెలిచి.. అమ్మాయిలతో ఎంజాయ్ అందరూ అనుకున్నట్లే ప్రశాంత్ విజేతగా నిలిచాడు.. రోజులు గడుస్తున్నా అతను ముందుగా చెప్పినట్లు ప్రైజ్ మనీ నుంచి రైతులకు సాయం చేసినట్లు కనిపించలేదు. అంతేకాకుండా పలు టీవీ కార్యక్రమాలలో పాల్గొంటూ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. బిగ్‌బాస్ స్నేహితులతో పార్టీలలో కనిపిస్తున్నాడు. పలు షాప్స్ ఓపెనింగ్స్‌కు అతిథిగా వెళ్తున్నాడు... ఇలా నిత్యం బిజీగా మారిపోయిన పల్లవి ప్రశాంత్.. రైతులకు తన ప్రైజ్ మనీ ఇస్తానని ఇచ్చిన మాట మరిచిపోయాడంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. కొందరైతే ఏకంగా రైతుల పేరుతో గెలిచి వారికి ఇచ్చిన మాటను తప్పడమే కాకుండా అమ్మాయిలతో బుల్లితెరపై బాగానే ఎంజాయ్ చేస్తున్నావ్ అంటూ చెప్పుకొస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు సాయం చేసే ఆలోచన ఉంటే ఎప్పుడో చేసేవాడు.. ఆ డబ్బు కూడా అతనికి చేరడమే కాకుండా ఖర్చు కూడా అయిపోయి ఉంటుంది. ఆ డబ్బు గురించి ఇక అందరూ మరిచిపోండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం రైతులకు ఇవ్వాల్సిన అవసరం లేదని.. అతను కూడా పేదరికంతో ఉన్నాడని అతని భవిష్యత్ కోసం ఆ డబ్బు ఉపయోగించుకోవాలని తెలుపుతున్నారు. వాస్తవంగా అమర్దీప్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ప్రశాంత్‌కు రైతుబిడ్డ అనే సింపతీ ఎక్కువగా ఉపయోగపడటంతో విజేతగా నిలిచాడు. ఇప్పుడు అదే ట్యాగ్‌లైన్ ప్రశాంత్‌కు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ రియాక్షన్ తాజాగా ఈ విషయంపై ప్రశాంత్ ఇలా రియాక్ట్ అయ్యాడు. 'ప్రాణం పోయిన ఇచ్చిన మాట మరువను. నేను ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నిరూపేద రైతు కుటుంబాల కోసం ఇచ్చిన మాట ప్రకారం బిగ్‌బాస్ ప్రైజ్ మనీతో త్వరలో మీ ముందుకు వస్తాను.' అని ప్రశాంత్ చెప్పాడు. ప్రశాంత్‌కు వచ్చేది ఎంత బిగ్‌బాస్ విజేతకు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ అని ప్రకటించారు. కానీ ప్రిన్స్ యావర్ రూ.15 లక్షల సూట్‌కేసు తీసుకోవడంతో రైతుబిడ్డకు రూ.35 లక్షలు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ టాక్స్, జీఎస్టీ పోగా అతడి చేతికి దాదాపు రూ.17 లక్షలు మాత్రమే అందనున్నట్లు తెలుస్తోంది. మరీ ఈరేంజ్‌లో కోతలు ఉంటాయా? అంటే నిజంగానే ఉంటుందట. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ వీజే సన్నీ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టాడు. తనకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ ఇవ్వాల్సిందని, కానీ ఇందులో దాదాపు రూ.27 లక్షల వరకు ప్రభుత్వానికే వెళ్లిపోయిందన్నాడు. ట్యాక్స్ కట్ చేసుకున్న తర్వాతే మిగిలిన డబ్బును తనకు ఇచ్చారన్నాడు. ఇప్పుడు ప్రశాంత్ ఇచ్చిన మాట ప్రకారం ప్రైజ్ మనీ పంచితే.. ఆయనకు అదనంగా వచ్చిన మారుతి బ్రెజా కారు, రూ. 15 లక్షల విలువ చేసే వజ్రాభరణం మిగిలినట్లు అవుతుంది. ప్రశాంత్‌కు బిగ్‌బాస్ నుంచి ఒక వారానికి రూ. లక్ష రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. అంటే 15 వారాలకు సుమారుగా రూ.15 లక్షలు ఈ రూపంలో దక్కినట్లు అని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
పల్లవి ప్రశాంత్‌తో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన బర్రెలక్క!
పల్లవి ప్రశాంత్, బర్రెలక్క (శిరీష).. ఇటీవలి కాలంలో వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో మార్మోగిపోయాయి. ఒకరేమో బిగ్‌బాస్ హౌస్‌లోకి రైతుబిడ్డగా అడుగుపెట్టి సెలబ్రిటీలను వెనక్కు నెట్టి షో విజేతగా నిలిచాడు. కానీ బయటకు వచ్చాక తెలిసీతెలియక చేసిన హంగామాతో జైలుపాలై అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. మరొకరేమో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగి గళాన్ని గట్టిగా వినిపిస్తూ పోటీ చేసింది. అయితే జనాల్లో తిరగడానికంటే కూడా సోషల్ మీడియా ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యతిచ్చి ఓటమి చవి చూసింది. అప్పుడు ప్రశాంత్‌కు సపోర్ట్ ప్రశాంత్.. బర్రెలక్క చుట్టాలేం కాదు. కానీ బిగ్‌బాస్ 7లో ఒక సామాన్యుడు అడుగుపెట్టాడని తెలిసి సపోర్ట్ చేసింది. ఇంకేముంది పలకరిస్తే చాలు తప్పుడు వరుసలు అంటగట్టేసే సమాజం వీరిద్దరికీ ఏదో ఉందని ముడిపెట్టింది. ప్రశాంత్, శిరీష పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట ప్రచారం జరిగింది. కొందరైతే ఓ అడుగు ముందుకేసి వీరి పెళ్లయిపోయినట్లు మార్ఫింగ్ ఫోటోలు కూడా వదిలారు. యూట్యూబ్‌లో పెళ్లి చేశారు తాజాగా ఈ వ్యవహారంపై స్పందించింది బర్రెలక్క. ఆమె మాట్లాడుతూ.. 'నేను బిగ్‌బాస్ షో అసలు చూడను. అయితే ఏడో సీజన్లో ఒక రైతుబిడ్డ వెళ్లాడని తెలిసి రెండు, మూడు ఎపిసోడ్లు చూశాను. ఎమ్మెల్యేగా పోటీ చేసే హడావుడిలో పడి దాన్ని పక్కనపెట్టేశాను. మళ్లీ గ్రాండ్ ఫినాలే రోజు చూశాను. ఎప్పుడూ అతడికి ఫోన్ చేయలేదు. అలాంటిది.. నాకు తెలియకుండానే పల్లవి ప్రశాంత్ అన్నతో యూట్యూబ్‌లో నా పెళ్లి చేసేశారు. నా పెళ్లికి పెద్ద పెద్ద అతిథులు కూడా వచ్చారట. ఆ సంగతే నాకు తెలీదు. ఎవరి ఇజ్జత్ పోతే ఏంటి? వ్యూస్ కోసం ఇంతలా బరితెగిస్తారా? ఎవరు మట్టిలో కలిస్తే ఏంటి? ఎవరి ఇజ్జత్ పోతే ఏంటి? ఎవరి జీవితం నాశనమైతే ఏంటి? మాకు వ్యూస్ కావాలంతే అన్నట్లుగా ఫోటోలు మార్ఫింగ్ చేసి మరీ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. చాలా వీడియోలలో నేను పల్లవి ప్రశాంత్‌ను అన్న అని పిలిచాను. ఎవరైనా అన్నను పెళ్లి చేసుకుంటారా? అతడితో వివాహం జరిగినట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది శిరీష. చదవండి: హీరోయిన్-డైరెక్టర్ మధ్య మాటల యుద్ధం.. అసలేం జరుగుతోంది? విజయకాంత్ కోసం ఆ పని చేస్తానని వాగ్ధానం.. అది గుర్తుపెట్టుకుని.. -
బిగ్‌బాస్ 7 విన్నర్ ప్రశాంత్ అరెస్ట్‌పై స్కిట్.. ముఖం మాడ్చుకున్న శివాజీ!
బిగ్‌బాస్ 7 షో దాదాపు నెలన్నర క్రితమే అయిపోయింది. రైతుబిడ్డ అని చెప్పుకొన్న పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఫైనల్ తర్వాత హైదరాబాద్ రోడ్లపై నానా రచ్చ చేశాడు. అతడి అభిమానులైతే.. ఆర్టీసీ బస్సులతో పాటు పలువురు కార్లని కూడా ధ్వంసం చేశారు. దీంతో ప్రశాంత్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇంత సీరియస్ విషయాన్ని ఇప్పుడు కామెడీ చేసి పడేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బిగ్‌బాస్ 7వపై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా శివాజీ ఆటతీరు, షోలో అమ్మాయిలపై చేసిన వల్గర్ కామెంట్స్.. షో చూడాలనే ఆసక్తిని పూర్తిగా చంపేశాయి. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా శివాజీ బుర్ర ఇంకా అలానే ఉండిపోయింది. అమర్, శోభాపై పిచ్చిపిచ్చి కామెంట్స్ చేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) సరే ఇదంతా పక్కనబెడితే శివాజీ ఈ మధ్య ఓ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేశాడు. ఓటీటీలో అది ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దాని ప్రమోషన్స్ కోసం ప్రముఖ కామెడీ షోకి వచ్చాడు. అయితే చాలా కాంట్రవర్సీ అయిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌ని ఇందులో స్కిట్‌గా వేశారు. పాపం అంత సీరియస్ విషయాన్ని పూర్తిగా కామెడీ చేసి పడేశారు. స్కిట్ చూస్తున్న టైంలో శివాజీ ముఖమైతే పూర్తిగా మాడిపోయింది. ఏదో తెచ్చిపెట్టుకున్నట్లు కాస్త నవ్వాడు అంతే! తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇదంతా ఉంది. అయితే బిగ్‌బాస్ షోలోకి రాకముందు శివాజీపై కొందరి వరకు కాస్త మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ షోలో పార్టిసిపేట్ చేశాడో.. తన ప్రవర్తనతో ఉన్న ఆ కాస్త పరువు కూడా పోగొట్టుకున్నాడు! ఇప్పుడు అదే శివాజీకి దోస్త్ అయిన ప్రశాంత్ అరెస్టుపై స్కిట్ వేసి.. శివాజీని సైలెంట్ అయిపోయేలా చేసేపడేశారు. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) -
బిగ్‌బాస్ ఫేమ్ సందీప్ హీరోగా ‘షార్ట్ కట్’
కొరియోగ్రాఫర్ ‘ఆట’ సందీప్ హీరోగా నటించిన చిత్రం ‘షార్ట్ కట్’. విజయానికి అడ్డదారులుండవు అనేది ట్యాగ్‌లైన్. రామకృష్ణ కంచి దర్శకత్వంలో షర్మిల కంచి సమర్పణలో తోట రంగారావు, పున్నపు రజనీకాంత్ నిర్మించారు. హైదరాబాద్‌లో ఈ చిత్రం పోస్టర్ విడుదల, షో రీల్ వేడుక జరిగింది. రామకృష్ణ కంచి మాట్లాడుతూ– ‘‘25 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉంటూ చాలా శాఖల్లో పని చేశాను. ఆ అనుభవంతో ‘షార్ట్ కట్’ తీశా. ప్రస్తుతం యువత డ్రగ్స్‌కు అలవాటుపడి తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు? ఈ దందా వెనక జరుగుతున్న చీకటి కోణాలు ఏంటి? అనేది ఈ చిత్రంలో చూపించాం’’ అన్నారు. ‘‘డార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది’’ అన్నారు ‘ఆట’ సందీప్. ‘‘ఈ సినిమాను కేవలం డబ్బు కోసమే కాకుండా సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని నిర్మించాం’’ అన్నారు తోట రంగారావు. ‘ నామీద మీరు చూపించే అభిమానం సందీప్ అన్న సినిమా ‘షార్ట్ కట్’పై కూడా చూపించాలని కోరుకుంటున్నాను’ అన్నారు ‘బిగ్ బాస్ 7’ విజేత పల్లవి ప్రశాంత్. -
పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై మొదటిసారి రియాక్ట్ అయిన అమర్ దీప్
బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్‌ను రైతుబిడ్డ అనే ట్యాగ్‌లైన్‌తో ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ గెలుచుకుంటే రన్నర్‌గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్‌లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్‌ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. అంతేకాకుండా అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను కూడా కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పోలీసుల సూచనలు పాటించకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేయడం వల్లే ఈ గొడవకు కారణమని పోలీసులు అయన్ను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు కూడా పంపించారు. ఆపై ప్రశాంత్ బెయిల్ మీద విడుదలయ్యాడు. తాజాగా అమర్ మొదటిసారి బిగ్ బాస్ గురించి రియాక్ట్ అయ్యాడు. 'హౌస్ నుంచి నేను బయటకు రాగానే ఏం జరుగుతుందో అనేది నాకేం అర్థం కాలేదు. అప్పుడు నా మైండ్ బ్లాంక్‌గా ఉంది. అక్కడితోనే ఆ గొడవ ముగిసిపోయింది. బిగ్ బాస్ వల్ల నాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా అభిమానుల ప్రేమ దొరికింది. అన్నింటికి మించి నా అన్న రవితేజ సినిమాలో ఛాన్స్ దక్కింది. బిగ్ బాస్ విన్నర్ కంటే నాకు రవితేజ సినిమా అవకాశం దక్కడమే గొప్ప విజయం. ఈ షో ద్వారా నాకు కావాల్సిన ఆదరణ దక్కింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా నన్ను గుర్తిస్తారు.. ఇవన్నీ కూడా బిగ్ బాస్ ద్వారా వచ్చిన అచీవ్మెంట్స్ అని నేను భావిస్తాను. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అనేది మిస్ అండర్స్టాండింగ్ వల్లే జరిగింది. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు.. కానీ కొందరు ఫ్యాన్స్ చేస్తున్న పనుల వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదరైతాయి. ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉండటం సహజమే.. ఇదీ ఎప్పుడూ ఉండేదే.. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నా అభిమాన హీరోను ఎవరైనా ఒక మాట అంటే గొడవపడే వాళ్లం... కొంత ఆలోచన శక్తి వచ్చాక అవన్నీ వదిలేసి అందరం కలిసి ప్రతి హీరో సినిమా చూసేవాళ్లం.. ఒకరి కోసం తిట్టుకోవడం, గొడవ పడటం లేకుండా అందరూ కలిసి ఆనందంగా ఉండండి.' అని అమర్ అన్నాడు. -
బిగ్ బాస్ అమర్‌పై శివాజీ చెత్త వ్యాఖ్యలు.. ఇవి దేనికి సంకేతం..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 ముగిసిపోయి చాలా రోజులే అయింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఆపై బెయిల్ మీద విడుదల ఇలా పలురకాల వివాదాలతో ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ సీజన్ గురించి వార్తలు వస్తునే ఉన్నాయి. ఈ సీజన్లో రన్నర్‌గా ఆమర్ దీప్ ఉంటే టాప్-3లో శివాజీ ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన బిగ్ బాస్ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ జర్నీలో బాగా ఇబ్బంది పడిన సందర్భం ఎంటి..? అని శివాజీకి ప్రశ్న ఎదురైంది. హౌస్‌లో మాదిరే ఇంటర్వ్యూలో కూడా అమర్ పట్ల ఉన్న కోపాన్ని తన వ్యాఖ్యలతో శివాజీ ఇలా చెప్పాడు. 'ప్రశాంత్, యావర్ విషయంలో నేను స్టాండ్ తీసుకున్న సందర్భాల్లో చాలా సార్లు ఇబ్బంది పడ్డాను. ప్రశాంత్ కెప్టెన్ బ్యాడ్జ్ లాక్కున్నారు. అతను సరిగ్గా హౌస్‌ను హ్యాండిల్ చేయలేకున్నాడు అని అందరూ ఓట్లు వేయడంతో అతని బ్యాడ్జ్‌ను బిగ్ బాస్ తీసుకున్నాడు. ఒక కామన్ మ్యాన్ కెప్టెన్ అయితే సెలబ్రిటీలకు నచ్చట్లేదా అని కోపం వచ్చింది. హౌస్‌లో కొందరు యావర్‌తో గొడవలు పెట్టుకున్నప్పుడు కోపం వచ్చింది. ఫైనల్‌గా నేను ఒకరిని కొట్టేద్దామని అనుకున్న సందర్భం కూడా వచ్చింది. మూడు వారాలుగా బిగ్ బాస్‌లో ప్రశాంత్‌ను మానశికంగా కొందరు టార్చర్ చేశారు. ఆ సమయంలో ప్రశాంత్‌ను అమర్ రెచ్చగొడుతున్నాడు. నేను పక్కనే ఉన్నాను.. నేను వాడి పక్కన ఉంటే ఎవరినీ లెక్క చేయడు. 14 వారంలో అమర్, ప్రశాంత్ మధ్య భారీగా గొడవ జరుగుతుంది. ఆ సందర్భంలో ఆమర్‌ను నాలుగు పీకి వెళ్లిపోదాం అనిపించింది. ప్రశాంత్ భుజం మీద చెయి వేసి అమర్ తోసుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో కోపం కట్టలు తెంచ్చుకుంది. గేమ్‌కు బౌండ్ అయి అగ్రిమెంట్లో సంతకం చేశాను కాబట్టి అమర్‌ను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో నా రక్తం మరిగిపోయింది.' అంటూ అమర్‌పై మరోసారి ఇంటర్వ్యూలో శివాజీ రెచ్చిపోయాడు. బిగ్ బాస్ అనేది ఒక గేమ్.. ఒక్కొసారి మాటల వల్ల అదుపు తప్పుతుంటారు. అది సహజం అని అందరికీ తెలుసు.. ఆ తర్వాత మళ్లీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అదీ హౌస్ వరకే పరిమితం. అయినా ప్రశాంత్, అమర్ ఇద్దరూ ఎన్ని గొడవలు పడినా మళ్లీ బ్రదర్స్ మాదిరి ఒకటిగా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ -7 ముగిసి పోయిన చాప్టర్.. బయటకు వచ్చాక కూడా ఇలా ఒకరిపై విషం చిమ్మడం ఎందుకు శివాజీ.. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేసి ఏం చెప్పదలుచుకుంటున్నారు. అయినా ప్రశాంత్ కెప్టెన్సీ నచ్చలేదని మీరు కూడా చెప్పారు కదా.. అప్పుడే మరిచిపోతే ఎలా శివాజీ.. అమర్‌ను నువ్వు రెచ్చగొట్టలేదా మానసిక వేదనకు గురి చేయలేదా అంటూ శివాజీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హౌస్‌లో ఇలాంటి మాటలు మాట్లాడే బయట జనాన్ని రెచ్చగొట్టి అమర మీద దాడి చేయించావు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అమర్ ఇంటికి వెళ్లి దాడి చేయండి అని ఇలా పరోక్షంగా మళ్లీ రెచ్చగొడుతున్నావా అంటూ శివాజీపై విరుచుకుపడుతున్నారు. అమర్‌పై చేసిన వ్యాఖ్యల వీడియో కింద ఎక్కువ మంది శివాజీని ఏకిపారేసిన కామెంట్లే కనిపిస్తున్నాయి. -
హీరోగా పల్లవి ప్రశాంత్.. లీక్ చేసిన సింగర్ భోలె
సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది ఎంతో ఈజీగా ఫేమస్ అయిపోతున్నారు. తమలో ఉన్న టాలెంట్‌ను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఆ టాలెంట్‌తో నెట్టింట చెలరేగి పోతున్నారు. అలా జనాలకు పరిచయమైన వ్యక్తి పల్లవి ప్రశాంత్. అన్నా.. మళ్లొచ్చిన అంటూ వీడియోలు చేసుకునే ఇతడు రైతుబిడ్డగా ఫేమస్ అయ్యాడు. రైతు కష్టాలు చెప్తూ, పొలం పని చేస్తూ తీసిన వీడియోలు ఎంతో పాపులర్ అయ్యాయి. కేసులో ఇరుక్కున్న రైతుబిడ్డ అంతే కాదు కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లోనూ అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. తన ఆటతో, మాటతో ప్రేక్షకులను మెప్పించి.. బిగ్‌బాస్ 7 టైటిల్ విజేతగా నిలిచాడు. కానీ విజయానందంలో పోలీసులు చెప్పిన మాట వినకుండా రభస జరుగుతున్న చోటే ర్యాలీ చేసి జైలుపాలయ్యాడు. తర్వాత భోలె షావళి చొరవ తీసుకుని లాయర్‌ను మాట్లాడి మరీ ఈ కేసు నుంచి ప్రశాంత్‌ను బయటకు తీసుకువచ్చాడు. అయితే ప్రశాంత్‌కు హీరోగా అవకాశాలు వచ్చాయని చెప్తున్నాడు సింగర్ భోలె. హీరోగా సినిమా ఛాన్సులు తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'ప్రశాంత్‌కు సినిమా అవకాశాలు వచ్చాయి. మధ్యలో ఈ పోలీస్ కేసు లాంటిది లేకపోయుంటే ఈపాటికే కొన్ని సినిమాలకు సంతకం చేసేవాడు. తనకు చాలా ఆఫర్స్ వచ్చాయి. కొందరు లక్షల విలువ చేసే గిఫ్ట్స్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. రైతుబిడ్డ హీరోగా చేస్తాడా? అని కొందరు నా దగ్గరకు వచ్చి అడిగారు. అతడి సినిమాకు నేను సంగీతం ఇవ్వాలని కూడా చెప్పారు. తప్పకుండా చేస్తానన్నాను. కాకపోతే ఇంతలోనే ఈ రచ్చ అంతా జరిగింది. నిజంగా ఆ సమయంలో మేము అండగా లేకపోయుంటే తను డిప్రెషన్లోకి వెళ్లిపోయేవాడు. బిగ్‌బాస్‌కు వెళ్లకపోయినా బాగుండు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు. బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉంటే బాగుండేదని బాధపడ్డాడు. ప్రశాంతే ఈ విషయాలను నాతో స్వయంగా చెప్పాడు. కానీ బయటకు వచ్చాక జనం తనమీద పెట్టుకున్న నమ్మకం చూసి సంతోషించాడు. నన్ను కూడా చాలామంది హీరోగా అడుగుతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణించాలన్నది నా కల. ఇటు హీరోగా కూడా చేస్తా. ఆల్‌రౌండర్‌గా ఎంటర్టైన్మెంట్ అందిస్తాను' అంటున్నాడు భోలె షావళి. NOTE: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ►ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 ►మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఆసక్తికర ట్వీట్ చేసిన ఉపాసన.. భర్తపై ఎంత ప్రేమో.. -
Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్
బిగ్‌బాస్ షోపై చాలా ఏళ్ల నుంచి వ్యతిరేకత వస్తూనే ఉంది. కానీ ఈసారి అది రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ దెబ్బకు మరింత ముదిరిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫినాలే తర్వాత గొడవ, కార్లు-బస్సుల ధ్వంసం, విజేత అరెస్ట్.. ఇప్పుడు ఏకంగా నిర్వాహకులకు పోలీసులు నోటీసులు జారీ చేసేంతవరకు పరిస్థితి వచ్చింది. దీంతో షో ఆర్గనైజర్.. అనుహ్య నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు అది అందరినీ షాకయ్యేలా చేస్తోంది. హిందీలో చాన్నాళ్ల నుంచి ఉంది కానీ తెలుగులో మాత్రం గత ఏడేళ్లుగా బిగ్‌బాస్ ప్రసారమవుతోంది. ఎన్టీఆర్, నాని తొలి రెండు సీజన్లను హోస్ట్ చేయగా.. ఆ తర్వాత మాత్రం నాగార్జునే వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. పలువురు సెలబ్రిటీలని హౌసులో 100 రోజుల పాటు ఉంచి, పలు పోటీలు పెట్టి.. వీటన్నింటిలో గెలిచిన వాడిని విజేతగా ప్రకటించడం ఆనవాయితీ. ఈసారి అలా కామన్‌మ్యాన్, రైతుబిడ్డ ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ విజేతగా నిలిచాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'మంగళవారం' సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే) రైతుబిడ్డ పేరు చెప్పుకొని ప్రశాంత్ ఎలా ఆడాడు? ఏంటనే విషయం పక్కనబెడితే.. ఫినాలే జరుగుతుండగానే అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఇతడి ఫ్యాన్స్ చాలామంది గుమిగూడిపోయారు. దీంతో ర్యాలీ లాంటివి ఏం వద్దని ముందే పోలీసులు, ప్రశాంత్‌ని హెచ్చరించారు. దీన్ని లెక్కచేయకుండా అభిమానుల దగ్గరకు ప్రశాంత్ వచ్చాడు. దీంతో పలువురు కంటెస్టెంట్స్ కార్లు, పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సు అద్దాల్ని.. వీళ్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్‌ని అరెస్ట్ చేసి చంచల్ గుడ జైల్లో పెట్టారు. ఈ మధ్య బెయిల్ మీద కూడా విడుదలయ్యాడు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు.. షో నిర్వాహకులకు నోటీసులు కూడా పంపారు. అయితే ఈ తలనొప్పులకు తట్టుకోలేకపోతున్న ఆర్గనైజర్స్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారట. ఇకపై రాబోయే సీజన్స్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరైనా సరే ర్యాలీలు లాంటివి చేయకూడదట. దీన్నే అగ్రిమెంట్‌లోనూ పొందుపరచనున్నారట. మరి ఇది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా రైతుబిడ్డ దెబ్బకు 'బిగ్‌బాస్' తలకు బొప్పి కట్టింది! (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న 'బిగ్‌బాస్' మానస్.. రేటు ఎంతో తెలుసా?) -
బిగ్ బాస్ నిర్వాహకులకు షాక్.. అసలేం జరిగిందంటే?
పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్‌తో బిగ్‌బాస్ నిర్వాహకులకు పోలీసులు షాకిచ్చారు. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది బిగ్‌బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆర్టీసీ బస్సులతో పాటు, కంటెస్టెంట్స్ కార్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. తాజాగా ఈ ఘటనలపై యాజమాన్యం ఎండమోల్‌షైన్‌కు నోటీసులు జారీ చేశారు. అభిమానులు భారీగా వస్తారని తెలిసినా ముందస్తుగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై నమోదైన రెండు కేసుల్లో ఇప్పటివరకు 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బిగ్‌బాస్-7 విజేత పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని సైతం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పీఎస్‌కు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. -
Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?
'బిగ్‌బాస్ 7' ఫేమ్ పల్లవి ప్రశాంత్.. షోలో గెలిచిన తర్వాత చాలా హడావుడి చేశాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాజాగా బెయిల్‌పై బయటకొచ్చాడు. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కి వచ్చి వెళ్లాలని కండీషన్ పెట్టిన పోలీసులు.. కొన్నాళ్లకు ఇంటర్వ్యూలు లాంటివి ఏం ఇవ్వకూడదని కూడా చెప్పారు. ఇదంతా పక్కనబెడితే ఈ రైతుబిడ్డ.. కొందరిపై రివేంజ్ తీర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో 'బిగ్‌బాస్ 7' షోలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్.. ఎలాగైతేనేం విజయం సాధించాడు. అయితే డిసెంబరు 17న ఫినాలే అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ఇతడి ఫ్యాన్స్ చాలామంది వచ్చి చేరారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు.. ప్రశాంత్‌ని వేరే రూట్ నుంచి వెళ్లిపోమని చెప్పారు. కానీ మనోడు పోలీసులు మాట కూడా లెక్క చేయకుండా.. తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయారు. పలువురి కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలు కూడా ధ్వంసం చేశారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ప్రశాంత్‌ని అతడి ఊరికెళ్లి మరీ అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల విధించగా.. చంచల్ గూడా జైల్లో పెట్టారు. నాలుగు రోజుల తర్వాత ఇతడికి బెయిల్ రావడంతో తిరిగి ఊరికివెళ్లిపోయాడు. ఇదంతా పక్కనబెడితే.. ఫినాలే అయిపోయిన తర్వాత ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించగా, తన ఊరికొస్తే ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పినట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. (ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో తమ్ముడు.. అమ్మాయి ఎవరంటే?) తీరా సదరు యూట్యూబర్స్.. ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం అతడి ఊరికి వెళ్లగా, చాలాసేపు వెయిట్ చేయించి తమని నిర్ధాక్షిణ్యంగా వెళ్లిపోమన్నాడని కొందరు ఇన్ స్టాలో స్టోరీలు పెట్టారు. అయితే తాను అలసిపోవడం వల్లే ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోయినని ప్రశాంత్ తీరిగ్గా వీడియో పోస్ట్ చేశాడు గానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్రశాంత్ అసలు రంగు ఏంటో అందరికీ తెలిసిపోయింది. అయితే తన ఇమేజ్ డ్యామేజ్ చేసిన సదరు యూట్యూబర్స్‌పై ప్రశాంత్ ఇప్పుడు పరువు నష్టం దావా వేయాలని అనుకుంటున్నాడట. ఇందులో ఎంత నిజముందనేది పక్కనబెడితే.. ఇది జరిగే పనేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్.. ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయి, బెయిల్‌పై బయటకొచ్చాడు. ఇలాంటి టైంలో పరువు నష్టం దావా లాంటి కొత్త తలనొప్పులు తెచ్చుకుంటాడా? అనేది చూడాలి. మరి ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్) -
బిగ్‌బాస్ గొడవలో మరో ముగ్గురి అరెస్టు
హైదరాబాద్: బిగ్‌బాస్ గొడవలో జూబ్లీహిల్స్ పోలీసులు ఆదివారం మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 17న అన్నపూర్ణ స్టూడియోస్‌లో బిగ్‌బాస్ ఫైనల్స్ అనంతరం విజేత ప్రశాంత్, రన్నరప్ అమర్‌దీప్‌చౌదరి అభిమానులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడి బస్సులు, కార్లను ధ్వంసం చేసి పోలీసులపై రాళ్లు రువ్వి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అతడి సోదరుడు మహావీరంలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా శనివారం వీరిద్దరూ బెయిల్‌పై వచ్చారు. అలాగే ఈ విధ్వంసానికి పాల్పడిన 12 మందిని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్‌కు తరలించారు. తాజాగా సరూర్‌నగర్‌కు చెందిన హరినాథ్‌రెడ్డి, యూసుఫ్‌గూడలకు చెందిన ఎం. సుధాకర్‌లను ఆదివారం రిమాండ్‌కు తరలించారు. పవన్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
Pallavi Prashanth: చంచల్ గూడ జైలు నుంచి బయటకొచ్చిన రైతుబిడ్డ
బిగ్‌బాస్ 7 విజేత ప్రశాంత్.. చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. నాంపల్లి కోర్టు ఇతడికి శుక్రవారం బెయిల్ మంజూరు చేయగా.. తాజాగా జైలు నుంచి బయటకొచ్చాడు. ఈ కేసులో భాగంగా ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసుల ముందు హాజరు కావాలని నాంపల్లి కోర్టు.. ప్రశాంత్‌ని ఆదేశించింది. అసలు ఈ గొడవేంటి? ప్రశాంత్‌ని ఎందుకు జైల్లో పెట్టారు? (ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!) తెలంగాణలోని ఓ పల్లెటూరులో వ్యవసాయం చేసుకునే ప్రశాంత్.. తనని తాను రైతుబిడ్డగా చెప్పుకొన్నాడు. అలా ఇన్ స్టాలో వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసారి బిగ్‌బాస్ షోలో కామన్‌మ్యాన్ అనే ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 105 రోజుల పాటు హౌసులో ఉండి విజేతగా నిలిచాడు. అయితే ఫినాలేలో విజయం సాధించిన తర్వాత షో నిర్వహించిన అన్నపూర్ణ స్టూడియోస్ బయట చాలా గొడవ జరిగింది. అమర్, అశ్విని, గీతూతో పాటు పలువురు కార్లని ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. అయితే షోలో విజేతగా నిలిచిన తర్వాత ప్రశాంత్.. ఫ్యాన్స్‌ని కలిసేందుకు ప్రయత్నించగా తొలుత పోలీసులు వద్దని వారించారు. కానీ పోలీసుల మాటలని లెక్కచేయకుండా, పంపేచేసిన సరే తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయారు. వీరంగం సృష్టించాడు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యుడిగా ప్రశాంత్ పై సుమోటాగా కేసు నమోదు చేశారు. రీసెంట్‌గానే ప్రశాంత్‌తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల పాటు జైల్లో ఉన్న ఇతడు తాజాగా బెయిల్‌పై బయటకొచ్చాడు. ఇతడిని చూసేందుకు జైలు దగ్గరకు కూడా అభిమానులు చాలామంది వచ్చారు. (ఇదీ చదవండి: 'సలార్' మూవీకి రివ్యూ ఇచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి) -
పేరు మార్చుకున్న 'బిగ్ బాస్' విన్నర్ పల్లవి ప్రశాంత్
బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్ టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్‌కు ఉపశమనం లభించింది. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్‌ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్‌ను ఏ-2గా పేర్కొంటూ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నేడు (డిసెంబర్ 23) చంచల్ గూడ జైలు నుంచి ఆయన విడుదల కావచ్చు. తాజాగా పల్లవి ప్రశాంత్ ఇన్‌స్టాలో తన పేరు మారింది. అందులో తన పేరు, బయోను మార్పు చేశారు. MALLA OCHINA, SPY Team Winner అని కొత్తగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేర్చుకున్నాడు. ప్రశాంత్ సూచన మేరకు అతని మరో సోదరుడు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తన విజయంలో SPY బ్యాచ్ పాత్ర ఎంతగానో ఉందని ప్రశాంత్ గుర్తించినట్లు ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ వల్ల ప్రశాంత్ ఇన్‌స్టాగ్రామ్‌కు భారీగా ఫాలోవర్లు పెరిగారు. ప్రస్తుతం ప్రశాంత్‌ను 1 మిలియన్‌కు పైగానే ఫాలోవర్లు అనుసరిస్తూ ఉండటం విశేషం. ప్రశాంత్‌కు అండగా నిలబడిన భోలే చంచల్‌గూడ జైలు నుంచి పల్లవి ప్రశాంత్ నేడు విడుదల కానున్నాడు. ప్రశాంత్ కోసం అండగా భోలే మాత్రమే నిలబడ్డాడు. హౌస్‌లో కూడా ఆయన ప్రశాంత్ కోసమే బిగ్ బాస్‌కు వచ్చానని చెప్పాడు. బెయిల్ వచ్చిన సందర్భంగా భోలే మాట్లాడుతూ.. రైతుబిడ్డకి న్యాయం జరిగిందని తెలిపాడు. 15 వేల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీల నిబంధనతో బెయిల్ మంజూరు చేయడం జరిగిందని తెలిపాడు. ప్రశాంత్ అరెస్ట్ అయిన 48 గంటల్లోనే బెయిల్ వచ్చేలా చేసిన అడ్వకేట్లకు ధన్యవాదాలు తెలిపాడు. అంతే కాకుండా నిష్పక్షపాతంగా తీర్పు ఇచ్చిన జడ్జీగారికి పాదాభివందనం తెలిపాడు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు బెయిల్
బిగ్‌బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్‌కు ఊరట లభించింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అదే విధంగా రూ. 15 వేల చొప్పున రెండు షూరిటీలు కాగా బిగ్ బాస్ టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. షో విన్నర్‌గా నిలిచిన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఆయన అభిమానులు అత్యుత్సాహంతో కార్లు, బస్సుల అద్దాలు పగులగొట్టారు. దీంతో పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని తేల్చారు. ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్‌ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్‌ను చేర్చారు. డిసెంబర్ 20న పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రశాంత్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. నేడు విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు.. బిగ్‌బాస్ విన్నర్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చదవండి: అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక -
పల్లవి ప్రశాంత్ బెయిల్ పై హైకోర్టులో కీలక వాదనలు
-
అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక
బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7 ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద దుమారమే రేగింది. ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమర్ కారుపై ఒక వర్గం ఫ్యాన్స్ దాడి చేశారు. అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. తాజాగా ఈ విషయంపై ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రియాంక రియాక్ట్ అయింది. అభిమానులు ఎవరైనా కానీ ఇలా దాడి చేయడం చాలా దారుణమని ఆమె ఇలా తెలిపింది. 'ఫ్యాన్స్ పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడటం చాలా దారుణం. మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వ్యతిరేకించండి.. అందులో తప్పులేదు కానీ ఇలా దాడి చేయడం చాలా హేయం. ఎవరమైనా ఎంతో కష్టపడి ఒక వస్తువును కొంటాము. కానీ ఇలా కొన్ని క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్ కాదు. దాడి సమయంలో కారులోపల మహిళలు ఉన్నారనే ఆలోచన కూడా లేకుంటే ఎలా..? హౌస్‌లో గేమ్ పరంగా మాత్రమే మాలో గొడవలు ఉన్నాయి. టాస్క్ ముగియగానే పల్లవి ప్రశాంత్,యావర్,శివాజీ,అమర్ ఇలా అందరం చాలా బాగా కలిసే ఉండే వాళ్లం. మాలో ఎలాంటి గొడవలు లేవు.' ముఖ్యంగా చివరి 4 వారాల్లో ప్రశాంత్‌తో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. వాడు నిజంగానే భూమి బిడ్డ అని ఆమె తెలిపింది. కానీ ఆ ఇంటర్వ్యూ జరిగిన సమయానికి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కాలేదు.. దీంతో ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ అరెస్ట్‌పై ఆమెకు ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాలేదు.