'బిగ్‌బాస్ 7' రెండో వారం నామినేషన్స్.. లిస్టులో తొమ్మిది మంది! | Bigg Boss 7 Telugu 2nd Week Nominations Contestants Full List - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Nominations: 2వ వారం నామినేషన్స్‌లో కొత్తగా ఆ ముగ్గురు

Published Tue, Sep 12 2023 5:13 PM | Last Updated on Tue, Sep 12 2023 5:52 PM

Bigg Boss 7 Telugu 2nd Week Nominations Full List - Sakshi

'ఉల్టా పల్టా' అనే ట్యాగ్ లైన్‌తో బిగ్‌బాస్ 7వ సీజన్.. గత వారం మొదలైంది. ఇప్పటికే ఓ వీకెండ్ కూడా పూర్తయింది. అయినా సరే షోలో పెద్దగా జోష్ కనిపించట్లేదు. ఇలాంటి టైంలో ఈ సోమవారం నామినేషన్స్ ఒక్కసారిగా హీట్ పెంచాయి. మంగళవారం కూడా నామినేషన్స్ హంగామా కొనసాగనుంది. అయితే ఎపిసోడ్ రావడానికి ముందే నామినేషన్స్ లో ఉన్నవాళ్ల లిస్ట్ ఒకటి బయటకొచ్చింది.

సెప్టెంబరు 3న ప్రారంభమైన 'బిగ్‌బాస్ 7'లోకి 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. ప్రియాంక, శివాజీ, ప్రిన్స్ యవర్, శోభాశెట్టి, దామిని, షకీలా, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ, శుభశ్రీ, రతిక, ఆట సందీప్, గౌతమ్ కృష్ణ, అమర్‪‌దీప్.. హౌసు లోపలికి వచ్చారు. అయితే తొలివారం తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోయింది. 

(ఇదీ చదవండి: ప్రశాంత్, శివాజీని ఉతికారేసిన 'బిగ్‌బాస్' కంటెస్టెంట్స్)

ఇకపోతే తాజాగా సోమవారం నామినేషన్స్ జరగ్గా..  శివాజీని అమర్‌దీప్, ప్రియాంక, శోభాశెట్టి, దామిని నామినేట్ చేశారు. ప్రశాంత్‌ని గౌతమ్, అమర్‌దీప్, షకీలా, తేజ, దామిని, ప్రియాంక నామినేట్ చేశారు. అలానే పవర్ అస్త్ర సొంతం చేసుకున్న సందీప్.. ప్రిన్స్‌ని నేరుగా నామినేట్ చేశాడు.

మంగళవారం మాత్రం రతికని గౌతమ్, శోభాశెట్టిని శివాజీ నామినేట్ చేశాడు. వీళ్లతో పాటు గౌతమ్, అమర్‌దీప్, టేస్టీ తేజ, షకీలా కూడా ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. గతవారంతో పోల్చి చూస్తే.. నామినేషన్స్‌లోకి శివాజీ, అమర్‌దీప్, తేజ కొత్తగా వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా దాదాపు 9 మంది ఉన్నారు. మరి ఈసారి ఎవరి వికెట్ పడుతుందో చూడాలి.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ హౌస్‌లో గలీజ్‌ పురాణం.. బయటపడ్డ శివాజీ క్యారెక్టర్‌!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement