బిగ్బాస్ ముద్దుబిడ్డ రతిక పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఓసారి ఎలిమినేట్ అయి బయటకెళ్లి వచ్చినా ఇంకా బుర్ర పనిచేయట్లేదు. ఏకంగా తమ్ముడికే వెన్నుపోటు పొడిచి పారేసింది. రతికకు తోడు యవర్ కూడా అలానే మెంటలెక్కినట్లు బిహేవ్ చేశాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 73 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
టాప్-10 ప్లేసుల కోసం గొడవ
నామినేషన్స్ పూర్తి కావడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఇకపోతే ఇప్పటివరకు 10 వారాలు పూర్తయ్యాయి కదా.. ఓవరాల్ ఫెర్ఫార్మెన్స్ చూసుకుని టాప్-10లో ఎవరు ఏ ప్లేసులో నిలబడాలో డిసైడ్ చేసుకోవాలని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టేశాడు. దీంతో మొత్తం గొడవ గొడవ అవుతుందనుకుంటే చాలా సాదాసీదా గొడవలే జరిగాయి.
(ఇదీ చదవండి: తెలుగు యంగ్ హీరోకి గాయం.. పట్టుజారి అలా పడిపోవడంతో!)
ఏ కంటెస్టెంట్ ఏ స్థానంలో?
- 1 శివాజీ
- 2 యావర్
- 3 ప్రశాంత్
- 4 ప్రియాంక
- 5 శోభాశెట్టి
- 6 అమర్‌దీప్
- 7 గౌతమ్
- 8 అర్జున్
- 9 అశ్విని
- 10 రతిక
శోభా ఫస్ట్ టైమ్ ఏడుపు
ఈసారి బిగ్‌బాస్ సీజన్‌లోకి వచ్చిన అమ్మాయిల్లో కాస్తోకూస్తో బెటర్ అంటే శోభా-ప్రియాంకనే. చాలామంది వీళ్లని తిడతారు గానీ ఇలాంటోళ్లు లేకపోతే అస్సలు మజా ఉండదు. అయితే ఇన్నాళ్ల గొడవలు, అరుపులతో హౌస్ మొత్తాన్ని గడగడలాడించిన శోభా.. అర్జున్ మాటలకు కన్నీళ్లు పెట్టుకుంది. టాప్-10లో శోభా ఏడో స్థానానికి సూట్ అవుతుందని చెప్పిన అర్జున్.. ప్రతిసారీ శోభాకు అదృష్టం కలిసొచ్చిందని కారణం చెప్పాడు. బయట కాస్త గంభీరంగా కనిపించిన శోభా.. బాత్రూంలోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంది. అమర్-ప్రియాంకతో దీని గురించి మాట్లాడుతూ తెగ బాధపడిపోయింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)
రతిక వెన్నుపోటు
ఆట తప్ప అన్నీ చేస్తున్న రతిక ఓసారి ఎలిమినేట్ అయింది. పిచ్చి కారణాలతో రీఎంట్రీ పేరు చెప్పి ఈమెని మళ్లీ హౌసులోకి తీసుకొచ్చారు. అయినా సరే ఆడకుండా అలానే బండి లాక్కుని వస్తోంది. తాజాగా టాప్-10లో ప్రశాంత్ గురించి మాట్లాడుతూ.. తొలి నాలుగు వారాల్లో నీ గేమ్ కనిపించలేదు, సొంతంగా గేమ్ ఆడలేవు, బిగ్బాస్ రూల్స్ అర్థం కావు, నువ్వు ఆడుతున్నావా? ఒకరి హెల్ప్‌తో(శివాజీని ఉద్దేశించి) గ్రూపులో ఆడుతున్నావా? అనేది కనిపించట్లేదని రతిక చెప్పింది. అలా శివాజీ గ్రూపులో కలిసిపోయిన రతిక.. అదే గ్రూప్‌లో పల్లవి ప్రశాంత్‌కి వెన్నుపోటు పొడిచేసింది.
ఇక రతిక అన్నేసి మాటలు అనేసరికి రైతుబిడ్డ ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోలేదు. 'నీ వెనకాల తిరిగా అన్నావ్, మా అమ్మ-నాన్నని తిట్టావ్, నన్ను గుండు గొరిగిస్తా అన్నావ్.. అయినాసరే హౌసుకి ఫస్ట్ కెప్టెన్ అయ్యా. నేను కెప్టెన్ అవ్వాలని అన్న(శివాజీ) లెటర్ త్యాగం చేసిండు. అర్థమైందా అక్కా' అని రతికకి ప్రశాంత్ వేరే లెవల్లో కౌంటర్ వేశాడు. దీంతో బిగ్‌బాస్ ముద్డుబిడ్డ ఆమె ముఖం మాడిపోయింది.
(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా)
యావర్‌కి నిజంగా పిచ్చే
ఇక టాప్-10లో యావర్ ఎక్కడుండాలో అనేది అశ్విని చెప్పడానికి ట్రై చేస్తుంటే.. ఆమెతో యావర్ గొడవ పెట్టుకున్నాడు. ఒకానొక దశలో మాటామాటా పెరిగి ఇద్దరు గట్టిగా అరుచుకున్నారు. అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా అని అశ్విని కోప్పడితే.. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదని యావర్ అన్నాడు. ఈ మొత్తం వ్యవహారం చూస్తే.. ఏం లేనిదానికి యవర్, అశ్వినితో గొడవ పెట్టుకున్నాడు. దీంతో యావర్‌కి నిజంగా పిచ్చి పట్టిందా అని డౌట్ వచ్చింది.
అర్జున్ కే ఎవిక్షన్ పాస్
అయితే టాప్-10లో అందరూ నిలబడిన తర్వాత బిగ్‍బాస్ మళ్లీ ఫిట్టింగ్ పెట్టాడు. ఈ తతంగం అంతా కూడా ఎవిక్షన్ పాస్ గురించి అని చెప్పి.. చివరి ఐదు స్థానాల్లో నిలబడిన వాళ్లకు పోటీ ఉంటుందని, అందులో విజేతగా నిలబడిన వాళ్లకు ఎవిక్షన్ పాస్ దక్కుతుందని చెప్పాడు. ఇందులో అమరదీప్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక పోటీపడగా.. అర్జున్ పాస్ గెలుచుకున్నాడు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. అయితే శివాజీ.. కాస్త ఆడమ్మా అని రతికకి గైడెన్స్ ఇచ్చినా సరే సొంత గ్రూప్ మీదకే ఈ పిల్ల తిరగబడటం కాస్త వెరైటీగా అనిపించింది.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' షోలో వివాదం.. లేడీ కంటెస్టెంట్‌పై పోలీస్ కేసు)
Comments
Please login to add a commentAdd a comment