బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్‍కు ఉపశమనం లభించింది. బిగ్ బాస్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్‌ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్‌ను ఏ-2గా పేర్కొంటూ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నేడు (డిసెంబర్ 23) చంచల్ గూడ జైలు నుంచి ఆయన విడుదల కావచ్చు.
తాజాగా పల్లవి ప్రశాంత్ ఇన్‌స్టాలో తన పేరు మారింది. అందులో తన పేరు, బయోను మార్పు చేశారు. MALLA OCHINA, SPY Team Winner అని కొత్తగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేర్చుకున్నాడు. ప్రశాంత్ సూచన మేరకు అతని మరో సోదరుడు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తన విజయంలో SPY బ్యాచ్ పాత్ర ఎంతగానో ఉందని ప్రశాంత్ గుర్తించినట్లు ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ వల్ల ప్రశాంత్ ఇన్‌స్టాగ్రామ్‌కు భారీగా ఫాలోవర్లు పెరిగారు. ప్రస్తుతం ప్రశాంత్‌ను 1 మిలియన్‌కు పైగానే ఫాలోవర్లు అనుసరిస్తూ ఉండటం విశేషం.
ప్రశాంత్‌కు అండగా నిలబడిన భోలే
చంచల్‌గూడ జైలు నుంచి పల్లవి ప్రశాంత్ నేడు విడుదల కానున్నాడు. ప్రశాంత్ కోసం అండగా భోలే మాత్రమే నిలబడ్డాడు. హౌస్‌లో కూడా ఆయన ప్రశాంత్ కోసమే బిగ్ బాస్‌కు వచ్చానని చెప్పాడు. బెయిల్ వచ్చిన సందర్భంగా భోలే మాట్లాడుతూ.. రైతుబిడ్డకి న్యాయం జరిగిందని తెలిపాడు. 15 వేల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీల నిబంధనతో బెయిల్ మంజూరు చేయడం జరిగిందని తెలిపాడు. ప్రశాంత్ అరెస్ట్ అయిన 48 గంటల్లోనే బెయిల్ వచ్చేలా చేసిన అడ్వకేట్లకు ధన్యవాదాలు తెలిపాడు. అంతే కాకుండా నిష్పక్షపాతంగా తీర్పు ఇచ్చిన జడ్జీగారికి పాదాభివందనం తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment