రాహుల్‌ గురించి రతికనే చెప్పింది.. బిగ్‌ బాస్‌ విన్నర్‌ అతనే గ్యారెంటీ: దామిని | Damini Bhatla Comments On Rathika Rose And Rahul Sipligunj | Sakshi
Sakshi News home page

Damini Bhatla: రతికతో ఏం జరిగిందో రాహుల్‌ చెప్పాడు.. బిగ్‌ బాస్‌ విన్నర్‌ అతనే గ్యారెంటీ: దామిని భట్ల

Published Fri, Nov 3 2023 1:14 PM | Last Updated on Sat, Nov 4 2023 6:50 PM

Damini Bhatla Comments On Rathika Rose And Rahul Sipligunj - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-7లో సింగర్స్‌ వెళ్లడం సహజం అలాగే ఈసారి కూడా దామిని భట్ల వెళ్లారు. గతంలో రాహుల్‌ సిప్లిగంజ్‌ టైటిల్‌ విన్నర్‌ అయితే.. గీతా మాధురి టాప్‌ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు. కానీ ఈ సీజన్‌లో సింగర్‌ దామిని భట్ల కేవలం మూడు వారాలు మాత్రమే హౌస్‌లో ఉ‍న్నారు. ఉన్న కొద్దిరోజులే అయినా ఆటలో తన ప్రత్యేకతను చాటుకుంది. అందరిలా కాకుండా తనదైన స్టైల్లో గేమ్‌ ప్లే చేసింది. ఓట్ల కోసం నటించకుండా తనకు ఏదైతే నచ్చిందో ఆ పని మాత్రమే హౌస్‌లో చేసేది.. బహుశా ఇది ప్రేక్షకులకు అంతగా కనెక్ట్‌ కాలేదనిపిస్తుంది. ఆమెలోని నెగటివ్‌ను మాత్రమే ప్రేక్షకులకు చూపించిన బిగ్‌ బాస్‌.. దామినిలోని పాజిటివ్‌ను మాత్రం తెరపైకి చూపించలేదనే విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యలో బిగ్‌ బాస్‌ గురించి పలు వ్యాఖ్యలు చేశారు.

బిగ్‌ బాస్‌లో నిలబడాలంటే కంటెంట్‌ ఇవ్వాలి. అప్పుడప్పుడు ఇతరులపైన సీరియస్‌ అవ్వాలి.  హౌస్‌లో వారికి  చాలామందికి పీఆర్‌ టీమ్‌ ఉంది. అలాగే నేను కూడా పీఆర్‌ టీమ్‌ను ఏర్పాటు చేసుకునే బిగ్‌ బాస్‌లోకి వెళ్లాను. కానీ... నేను హౌస్‌లోకి వెళ్లే ముందు వారికి ఒక సూచన ఇచ్చా... నన్ను మాత్రమే హైప్‌ చేయండి. అందుకోసం ఎదుటివారిని కించపరిచేలా ఎలాంటి ప్రమోషన్‌ చేయకండి అని గట్టిగా చెప్పాను. అందులో తేడా వస్తే సహించనని కూడా చెప్పాను. కానీ నా లక్‌ బాగాలేదు.. ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చేశాను.' అని దామిని చెప్పింది.

రాహుల్‌తో ప్రేమ గురించి రతికనే చెప్పింది: దామిని
బిగ్‌ బాస్‌ నుంచి నేను బయటికి రాగానే రాహుల్‌ సిప్లిగంజ్‌- రతికా రోజ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయిని తెలిసింది. అప్పుడు నేను చాలా షాక్‌ అయ్యాను. అదే సమయంలో నాకు రాహుల్‌ కాల్‌ చేసి ఎక్కడున్నావ్‌ అని ప్రశ్నించాడు... ఇంటి వద్దనే ఉన్నానని చెప్పి లోకేషన్‌ షేర్‌ చేస్తే ఇంటికి వచ్చేశాడు. అప్పుడు ఇద్దరం రతిక టాపిక్‌ గురించి చర్చించాము. ఆమె గురించి వాడు చెప్పాల్సిన మాటలు చెప్పాడు. ఒకసైడ్‌ మాత్రమే విన్న నేను తప్పు ఎవరిదని జడ్జ్‌ చేయలేను. 

బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన మొదటి మూడు రోజుల్లోనే నా వద్ద రాహుల్‌ టాపిక్‌ రతక తెచ్చింది. తనకు ఎక్స్‌ బాయ్‌ ఫ్రెండ్‌ అనే అర్థం వచ్చేలా ఆ సమయంలో క్లియర్‌గా చెప్పింది. ఇద్దరూ ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా నిజమే ఉంటుందిలే అని నేను కూడా పెద్దగా సాగతీయలేదు. అని దామిని తెలిపింది. 

బిగ్‌ బాస్‌ విన్నర్‌ అతనే
రతికా రోజ్‌ను  రీ ఎంట్రీ ద్వారా తీసుకోవాలని బిగ్‌ బాస్‌ అనుకున్నాడు.. అందుకే ఉల్టాపుల్టా పేరుతో ఎక్కువ ఓట్లు వచ్చిన తమను పక్కన పెట్టి రతికను తీసుకున్నారని దామిని తెలిపింది. తనకు నయని పావని, పూజా, శోభ, ప్రియాంక, అమర్‌, సందీప్‌ ఓట్లు వేశారని చెప్పుకొచ్చింది. కానీ ఉల్టాపుల్టా పేరుతో ఆ అవకాశం దక్కలేదని చెప్పింది. శివాజీ వయసు రిత్యా చాలా అనుభం వుంది. ఆయన మైండ్‌తో ఫెయిర్‌ గేమ్‌ ఆడుతున్నాడు. కానీ బిగ్‌ బాస్‌ సీజన్‌ విన్నర్‌ మాత్రం పల్లవి ప్రశాంత్‌ కావడం గ్యారెంటీ అని ఆమె తెలిపింది.

అతనొక కామన్‌ మ్యాన్‌గా గుర్తింపు ఉంది. అతను చాలా మంచి వ్యక్తి నామినేషన్‌లో మాత్రమే అలా రెచ్చిపోతాడు... ఆ ఒక్క విషయంలో ప్రశాంత్‌ అంటే తనకు ఇష్టం లేదని దామిని చెప్పింది.  ప్రశాంత్‌ను ఎప్పుడూ ఎవరూ చులకనగా చూడలేదు. వాడు పూర్తిగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మొదట్లో అడ్జెస్ట్‌ కావడానికి సమయం పట్టింది. వాడికి ఫస్ట్‌ వారంలో ఏసీ కూడా సెట్‌ కాలేదు. దాంతో జ్వరం కూడా వచ్చింది. ఆ సమయంలో వాడిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాం అని ఆమె చెప్పింది. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్స్‌, వారి కుటుంబ సభ్యల గురించి కొందరు పీఆర్‌ టీమ్‌ వారు బూతులతో కామెంట్లు చేస్తున్నారు. ఇదీ ఏ మాత్రం మంచిది కాదని దామిని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement