
మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ సీజన్-7 ముగియనుంది. చివరి వారంలో హౌస్‌లో ఇంకా ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. దీంతో వంద రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ షో విజేత ఎవరో ఆదివారం తేలిపోనుంది. ఈ నేపథ్యంలో చివరి వారంలో ఫైనలిస్టుల జర్నీ గురించి బిగ్‌బాస్ ఆడియన్స్‌కు పరిచయం చేస్తున్నారు.
మొత్తంగా ఈ వారాన్ని ఎమోషనల్ ఎపిసోడ్‌గా మార్చేసిన బిగ్‌బాస్.. మొదటి రోజు అమర్, అర్జున్‌ని వీడియోలను చూపించిన ఏడిపించేశారు. రెండో రోజు శివాజీతో స్టార్ట్ చేసి.. చివరీకీ ప్రియాంక ఎమోషనల్ జర్నీతో ముగించాడు బిగ్‌బాస్. అలా ఫైనలిస్టులైన వారిలో ఇంకా పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ జర్నీ మూడో రోజు ఆడియన్స్‌కు చూపించనున్నారు. తాజాగా ప్రిన్స్ యావర్ జర్నీకి సంబంధించిన ప్రోమో రిలీజైంది. అయితే యావర్ పట్టుదల అద్భుతమని బిగ్‌బాస్ కొనియాడారు. దీంతో యావర్ ఫుల్ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నాడు.
మిడ్ వీక్‌లో ఎవరు అవుట్?
అయితే ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్న సంగతి తెలిసిందే. మరీ వారం మధ్యలో హౌస్ నుంచి ఎవరు బయటికొస్తారు? టాప్-5 లో ఎవరెవరు నిలుస్తారు అనే విషయంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఆ ఒక్కరు ఎవరన్న విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికైతే పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌దీప్ టాప్-5లో నిలుస్తారని తెలుస్తోంది. మరో వైపు అర్జున్, ప్రియాంక, ప్రిన్స్ యావర్‌లో ఎవరో ఒకరు బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరీ మిడ్ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment