Priyanka Jain
-
సిక్స్ ప్యాక్‌తో కండలవీరుడుగా బిగ్‌బాస్ బ్యూటీ ప్రియుడు (ఫోటోలు)
-
మెక్సికోలో తంగలాన్ భామ చిల్.. బాలిలో బిగ్‌బాస్ బ్యూటీ!
మెక్సికోలో చిల్ అవుతోన్న తంగలాన్ బ్యూటీ..లైగర్ భామ అనన్య పాండే గ్లామరస్ లుక్..బేబీ జాన్ మూడ్‌లోనే కీర్తి సురేశ్..బాలిలో ఎంజాయ్ చేస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ విష్ణు ప్రియ..ఆజ్ కీ రాత్ అంటోన్న బిగ్‌బాస్ భామ ప్రియాంక జైన్.. View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
బిగ్‌బాస్ దివి స్టన్నింగ్ పిక్స్.. ప్రియుడితో ప్రియాంక జైన్ చిల్!
బీచ్‌లో శ్రియా శరణ్ పోజులు..బిగ్‌బాస్ దివి స్టన్నింగ్ పిక్స్..ప్రియుడితో ప్రియాంక జైన్ చిల్..థాయ్‌లాండ్ ట్రిప్ ఫుల్‌గా ఆస్వాదిస్తోన్న ఆండ్రియా..షూట్లో బిజీ బిజీగా సన్ని లియోన్.. View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) -
తిరుమల ప్రాంక్ వీడియోపై స్పందించిన ప్రియాంక, శివ
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ క్షమాపణలు చెప్పింది. కొద్దిరోజుల క్రితం బుల్లితెర నటుడు శివకుమార్, ప్రయాంక ఇద్దరూ తిరుమలకు వెళ్లారు. అలిపిరి నడక మార్గం ద్వారా కొండపైకి వెళ్లే క్రమంలో ఏడో మైలురాయి వద్ద చిరుతపులి కనిపించింటూ ఇద్దరూ కలిసి ఒక ప్రాంక్ వీడియో తీయడం ఆపై తమ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. శ్రీవారి దర్శనం కోసం నడక మార్గంలో వెళ్తుండగా చిరుత పులి దాడి అంటూ వీడియో అప్లోడ్ చేశారు. అయితే, అది భక్తులను భయాందోళలకు గురి చేసేలా ఉండటంతో చాలామంది నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు కూడా టీటీడీ సిద్ధమైంది. ఈ క్రమంలో వారిద్దరూ క్షమాపణలు చెప్పారు.'మేము షేర్ చేసిన వీడియోపై చాలామంది శ్రీవారి భక్తులు అభ్యంతరం తెలిపారు. మేము తెలియకనే ఈ తప్పు చేశాం. మీ మనోభావాలను గాయపరిచినట్లయితే మీలో ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాము. ఉద్దేశపూర్వకంగా అయితే వీడియో చేయలేదు. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేశాం. అయితే, ఇలా అవుతుంది అని మేము ఏమాత్రం ఊహించలేదు. ఇంతమందిని ఈ వీడియో హర్ట్ చేస్తుంది అంటే అసలు చేసేవాళ్లమే కాదు. తిరుమల దేవస్థానం ప్రతిష్టను మేము తక్కువ చేయాలని అనుకోలేదు. భక్తులలో భయం కలగేలా చేసి వారి మనోభావాలను కించపరిచేలా వంటి పొరపాట్లు మేము చేయం. తెలియకుండా జరిగిన ఈ తప్పును మీరందరూ క్షమిస్తారని ఆశిస్తున్నాం. మమ్మల్ని విశ్వసించండి. మరోసారి ఈ తప్పు జరగదు.' అని వారు ఒక వీడియోతో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
తిరుమల మెట్ల మార్గంలో ప్రాంక్ వీడియో
-
అమ్మలా ప్రేమను పంచాడు, నెత్తిన పెట్టుకున్నాడు: విష్ణుప్రియ లవ్‌స్టోరీ
అవినాష్‌ను తక్కువ అంచనా వేసిన నబీల్, ప్రేరణకు దిమ్మతిరిగి బొమ్మ కనబడింది. ఇచ్చిన రెండు గేమ్స్‌లోనూ అతడే గెలిచి విన్నరయ్యాడు. కంటెండరవ్వాలనుకున్న నబీల్ రేసులోనే లేకుండా పోయాడు. అటు విష్ణుప్రియ... తన మాజీ ప్రియుడిని గుర్తు చేసుకుంది. తన ప్రేమ కహానీని పృథ్వీతో పంచుకుంది. అదేంటో నేటి (నవంబర్ 27) ఎపిసోడ హైలైట్స్‌లో చదివేయండి..తక్కువ అంచనా వేశారుటికెట్ టు ఫినాలే కోసం హౌస్‌మేట్స్‌తో గేమ్స్ ఆడించేందుకు మానస్, ప్రియాంక జైన్ బిగ్‌బాస్ ఇంట్లోకి వచ్చారు. వీళ్లు ప్రేరణ, నబీల్ను గేమ్ ఆడేందుకు సెలక్ట్ చేశారు. అయితే ఈ రోజు బ్రెయిన్ గేమ్‌లో నలుగురు ఆడే ఛాన్స్ ఉందంటూ మరో ఇద్దర్ని ఎంపిక చేయమన్నాడు బిగ్‌బాస్. దీంతో ప్రేరణ, నబీల్.. ఐక్యూ అంతగా లేదు, బ్రెయిన్ గేమ్ ఆడలేరంటూ అవినాష్, పృథ్వీని సెలక్ట్ చేశారు.సుడోకు గేమ్అలా ఈ నలుగురికి సుడోకు గేమ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో ముందుగా నబీల్ గంట కొట్టి గెలిచేసినంత బిల్డప్ ఇచ్చాడు. తీరా చూస్తే అన్నీ తప్పులతడకగానే ఉంది. ఏ ఒక్కరూ సుడోకు పూర్తి చేయకపోవడంతో బిగ్‌బాస్ క్లూ ఇచ్చాడు. ఆ క్లూ అందుకుని అవినాష్ చకచకా సుడోకు పూర్తి చేసి గంట కొట్టాడు. తర్వాత ప్రేరణ, పృథ్వీ, నబీల్ గేమ్ కంప్లీట్ చేశారు. వీళ్లందరికీ బిగ్‌బాస్ కొన్ని మూటలు ఇచ్చాడు. అందులో అవినాష్‌కు 8 బాల్స్, ప్రేరణకు 6, పృథ్వీకి 5, నబీల్‌కు 4 బంతులు ఉన్నాయి.అవినాష్ గెలుపుపై నబీల్ డౌట్అవినాష్ గెలుపుపై నబీల్ అనుమానపడ్డాడు. తేజ, నువ్వేమైనా సాయం చేశావా? అని అడిగాడు. ఎవరూ సాయం చేయలేదని హౌస్మేట్స్ అందరూ క్లారిటీ ఇచ్చారు. అంతా అయిపోయాక నబీల్.. నువ్వు ఆడలేవని అనలేదు, ఎవరైనా సాయం చేశారనిపించి అడిగానంతే.. నీకు కోపం వస్తే అప్పుడే తిట్టాల్సిందంటూ అవినాష్‌కు సారీ చెప్పాడు. తర్వాత హౌస్మేట్స్ అందరూ కలిసి కామెడీ స్కిట్‌తో కడుపుబ్బా నవ్వించారు.మళ్లీ గెలిచేసిన అవినాష్అనంతరం పృథ్వీ, ప్రేరణ, అవినాష్, నబీల్.. వారు పొందిన బంతులతో నేర్పుగా సాగు- స్కోర్ పొందు అని మరో గేమ్ ఆడారు. ఈ టాస్క్‌లో అవినాష్ అందరికంటే ఎక్కువగా 43 పరుగులు చేసి గెలిచాడు. పృథ్వీ, ప్రేరణ.. 30 పరుగులు చేయగా, నబీల్ 24 పరుగులు చేశాడు. చివర్లో రెండు బంతుల్ని ఎవరికైనా ఇవ్వొచ్చు అని మానస్, ప్రియాంకకు బిగ్‌బాస్ ఛాన్స్ ఇచ్చాడు. కానీ వాళ్లు అందుకు అంగీకరించలేదు.విష్ణుప్రియ బ్రేకప్ స్టోరీరెండు టాస్కులు గెలిచిన అవినాష్‌కు కంటెండర్ బ్యాడ్జ్ ఇచ్చారు. నబీల్‌కు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి టికెట్ టు ఫినాలే రేసులో నుంచి తొలగించారు. చివర్లో విష్ణు, మానస్ కలిసి జరీజరీ పంచె కట్టి.. పాటకు ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. మాజీ బాయ్‌ఫ్రెండ్ గుర్తురావడంతో అర్ధరాత్రి పృథ్వీపక్కన చేరి ముచ్చట్లు పెట్టింది విష్ణు. కలలో తనకు మాజీ బాయ్‌ఫ్రెండ్ వచ్చాడంది. బ్రేకప్ నువ్వు చెప్పావా? అని పృథ్వీ అడగ్గా.. అవును, నేనే బ్రేకప్ చెప్పానంది. తల్లి స్థానమిచ్చా..తెలీకుండా రెండు తప్పులు చేశాడు. నా మంచి కోసమే చేశాడు. నాకు తెలిస్తే భరించలేనని చెప్పలేదు. తీరా తెలిశాక నేను నిజంగా భరించలేకపోయాను. నాకోసమే కొన్ని పనులు చేసినా అవి నాకస్సలు నచ్చలేదు. అవి నా ముఖంపై చెప్పేంత ధైర్యం లేని వ్యక్తితో ఉండకూడదనుకున్నాను, బ్రేకప్ చెప్పాను. కానీ అతడికి నా తల్లి స్థానమిచ్చాను.నెత్తిన పెట్టుకుని చూసుకున్నాడుకాబట్టి తనను చూడకుండా ఉండలేకపోతున్నాను. అతడు నా బలం. తనను హత్తుకుంటే మా అమ్మను హత్తుకున్నట్లే ఉంటుంది. నన్ను నెత్తిమీద పెట్టుకుని చూసుకున్నాడు. అమ్మలాగా స్వచ్ఛంగా ప్రేమించాడు అంటూ అతడి జ్ఞాపకాలను పృథ్వీతో పంచుకుంది. అయితే అతడెవరనేది మాత్రం బయటపెట్టలేదు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వివాదంలో తెలుగు బిగ్‌బాస్ బ్యూటీ.. పవిత్రమైన ప్రదేశంలో ప్రియుడితో అలా!
తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-7 టాప్-5లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. గతేడాది సీజన్లో టాప్-5లో చోటు దక్కించుకుంది. అంతేకాదు బుల్లితెర నటుడు శివకుమార్‌తో ప్రేమాయణం సాగిస్తోంది.అయితే తన యూట్యూబ్ ఛానెల్ నెవర్ ఎండింగ్ టేల్స్ ద్వారా వీడియోలు పోస్ట్ చేస్తోన్నసంగతి తెలిసిందే. అలా చాలాసార్లు తన ప్రియుడితో ఫ్రాంక్ వీడియోలు చేసింది. అయితే అందులో తిరుమల అలిపిరి నడక మార్గంలోనూ ఓ ఫ్రాంక్ వీడియో చేశారు ప్రియాంకజైన్, శివకుమార్. దీంతో పవిత్రమైన నడకదారి మార్గంలో అలాంటి వీడియోలు చేయడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. కేవలం వ్యూస్ కోసం కక్కుర్తిపడి తిరుమల ప్రతిష్టను దెబ్బతీస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశాయ అని నామస్మరణ చేయాల్సిన చోట వీళ్లకు రీల్స్ పిచ్చి ఏంటని సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు.అసలేం జరిగిందంటే..తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే ఏడో మైలు రాయి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మధ్యలో తన ప్రియుడితో కలిసి రీల్స్ చేసింది ప్రియాంక జైన్. చిరుత వచ్చిందని.. ఫేక్ ఆడియో పెట్టి అక్కడ నుంచి పరుగులు తీశారు. దీన్ని.. తిరుపతి దారిలో మామీద చిరుత ఎటాక్? అంటూ షాకింగ్ అయిన ఫొటోలతో వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశారు. కానీ చివరికీ చిరుత లేదు.. అంతా ఫ్రాంక్ అంటూ తమ పైత్యాన్ని ప్రదర్శించింది ప్రియాంక జైన్. పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి చిల్లర పనులేంటని నెటిజన్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. అయితే ఈ వీడియోను ప్రస్తుతం తన ఛానెల్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది.సీరియల్స్‌తోనే ఫేమస్..జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ ద్వారా పాపులరిటీ తెచ్చుకుంది. అలా బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్‌ను అభిమానులకు పరిచయం చేసింది. గత కొన్నేళ్లుగా వీరద్దరు సహజీవనం చేస్తోన్న సంగతి తెలిసిందే. -
బేబీ బంప్‌తో ప్రణీత.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలతో రహస్య!
ప్రీ వెడ్డింగ్ ఫొటోల్ని ఇప్పుడు బయటపెట్టిన రహస్య గోరఖ్రాధాకృష్ణ వేషధారణంలో బిగ్ బాస్ ప్రియాంక జైన్సెల్ఫీ వీడియోతో మత్తెక్కించేలా సిమ్రాన్ చౌదరిబీచ్ ఒడ్డున ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానాబేబీ బంప్‌తో హీరోయిన్ ప్రణీత సుభాష్ ఫొటోషూట్పుస్తకం చదువుతూ మరింత అందంగా జ్యోతి రాయ్ View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Doulath sulthana (@inayasulthanaofficial) View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) View this post on Instagram A post shared by Nandita Swetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by Amy Jackson (@iamamyjackson) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Rahasya Kiran (@rahasya_kiran) -
బిగ్ బాస్ బ్యూటీ కృష్ణాష్టమి సందడి మామూలుగా లేదుగా! (ఫోటోలు)
-
బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
కిల్లింగ్ ఔట్ఫిట్తో 'ప్రియాంక జైన్' వీడియో వైరల్
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-7 టాప్-5లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ ద్వారా పాపులరిటీ తెచ్చుకుంది. అలా బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ వల్ల తనకు మంచి పేరు కూడా వచ్చింది. తన ప్రవర్తనుకు కూడా తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు.ప్రియాంక జైన్.. ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ అచ్చం తెలుగమ్మాయిలా టాలీవుడ్ ప్రేక్షకులను బుల్లితెరపై అలరిస్తోంది. అయితే, తాజాగా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఆమె ఒక వీడియో షేర్ చేసింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక ఈసారి తన అందంతో తోటి నటీమణులకు సవాల్ విసిరింది. నీటిలో తడిసిన తన గ్లామర్‌తో కుర్ర కారులో హీట్ పెంచింది. ఒక ఆర్టిస్ట్‌గా ఉన్నందున తనలోని భిన్నమైన షేడ్స్‌ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఆమె తెలిపింది. ఇప్పటికే బిగ్ బాస్ నుంచి పాపులర్ అయిన అషు రెడ్డి, అరియాన వంటి స్టార్స్ సోషల్ మీడియాలో తమ అందాలతో ఫిదా చేస్తున్న విషయం తెలిసింది. ఇప్పుడు ప్రియాంక జైన్ విడుదల చేసిన వీడియో వారిని తలదన్నేలా ఉందని చెప్పవచ్చు. ఆమె ఇచ్చిన కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ప్రియాంకలో ఇంత టాలెంట్ ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
కుందనపు బొమ్మలా ప్రియాంకా జైన్ ఫొటోలు
-
హైదరాబాద్‌లో ల్యాండ్ కొన్న 'బిగ్ బాస్' ప్రియాంక
బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్‌తో గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అంతకు ముందు పలు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ప్రస్తుతం షోలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ బిజీగా ఉంది. తన బాయ్ ఫ్రెండ్‌తో హైదరాబాద్‌లోనే కలిసి ఉంటున్న ప్రియాంక ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. తాము ఇక్కడ భూమి కొనుగోలు చేసినట్లు శుభవార్త చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటా.. ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్)ప్రస్తుతం హైదరాబాద్‌లోని అద్దె ఫ్లాట్‌లో ఉంటున్న ప్రియాంక-శివ్.. తొలుత కొత్త ఫ్లాట్ తీసుకోవాలని అనుకున్నారు. టోకెన్ అమౌంట్ కూడా ఇచ్చేశారు. కానీ ఫ్లాట్ తీసుకోవడం తనకు ఇష్టం లేదని, ల్యాండ్ కొని ఇల్లు కట్టుకుంటే వచ్చే మజా వేరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శివ్ అసలు విషయం చెప్పాడు. జనవరి నుంచి ల్యాండ్ కోసం తిరుగుతుండగా ఎప్పుడో ఓ సమస్య వచ్చేదని ప్రియాంక చెప్పుకొచ్చింది.ల్యాండ్ బాగుంటే రేటు నచ్చడం లేదని, అన్ని బాగుంటే పేపర్స్ సరిగా ఉండట్లేదని ప్రియాంక-శివ్ చెప్పారు. ఏప్రిల్ 10న ల్యాండ్ ఓకే చేసి, 23వ తేదీని రిజిస్టర్ చేసినట్లు చెప్పారు. ఆ విజువల్స్ కూడా చూపించారు. అయితే హైదరాబాద్‌లో ల్యాండ్ కొనడం అంత ఈజీ కాదని చెప్పాడు. మొత్తానికి తన కల నెరవేరిందని శివ్ చెప్పగా.. ప్రియాంక ఫుల్ హ్యాపీగా కనిపించింది. ప్రస్తుతానితి ముహుర్తాలు లేవని, త్వరలో ఇంటి అప్డేట్స్ చెబుతామని ప్రియాంక-శివ్ చెప్పారు.(ఇదీ చదవండి:కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్ ) -
Priyanka Jain HD Photos: తొలిసారి గ్లామర్ లుక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ 'ప్రియాంక' (ఫోటోలు)
-
ప్రియుడితో ప్రియాంక పెళ్లి.. ఏకిపారేస్తున్న నెటిజన్లు (ఫొటోలు)
-
ఫ్యాన్స్‌కు షాకిచ్చిన బిగ్‌బాస్ ప్రియాంక.. సడన్‌గా ప్రియుడితో పెళ్లి!
బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్-7 టాప్-5లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ ప్రియాంక జైన్. జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ ద్వారా పాపులరిటీ తెచ్చుకుంది. అలా బుల్లితెర నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండగానే తన ప్రియుడు, బుల్లితెర నటుడు శివకుమార్‌ను అభిమానులకు పరిచయం చేసింది. హౌస్ నుంచి బయటకు రాగానే గుడ్‌న్యూస్ ఉంటుందని హింట్ కూడా ఇచ్చింది. దీంతో శివకుమార్‌ను త్వరలోనే పెళ్లి చేసుకోనుందని ఫ్యాన్స్ భావించారు. అయితే ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అప్డేట్స్ ఇస్తూ ఉండే ప్రియాంక సడన్‌గా తన అభిమానులకు దిమ్మదిరిగే షాకిచ్చింది. ఎలాంటి హడావుడి లేకుండా తన ప్రియుడిని పెళ్లాడింది. దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేస్తూ.. మా పెళ్లి అయిపోయింది అంటూ ప్రకటించారు. రియల్లీ సారీ మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం అంటూ ప్రకటించాడు శివకుమార్. త్వరలోనే తమ పెళ్లి వీడియో కూడా రిలీజ్ చేస్తామని వెల్లడించారు. తీరా చూస్తే ఇదంతా షూటింగ్ కోసమే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా మా ఇంటి పండుగ అనే షూటింగ్ జరిగింది. ఇందులో ప్రియాంక, శివ కుమార్‌కు పెళ్లి జరిగింది. దానికి సంబంధించిన ప్రోమో వీడియో కూడా రిలీజైంది. -
బిగ్‌బాస్ ప్రియాంకతో సహజీవనం, పెళ్లి.. బాయ్‌ఫ్రెండ్ సమాధానమిదే
బిగ్‌బాస్ 7 ఫేమ్ ప్రియాంక సహజీవనం చేస్తోంది. ఈమె గురించి పరిచయమున్న వాళ్లకు ఈ విషయం తెలుసు. ఎందుకంటే ఈ షో జరుగుతున్న టైంలోనే ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ హౌసులోకి వచ్చాడు. బయటకు రాగానే పెళ్లి చేసుకుందామని ఆమెతో చెప్పుకొచ్చాడు. ఇదంతా జరిగి దాదాపు మూడు నెలలు కావొస్తోంది. దీంతో చాలామంది ప్రియాంకని పెళ్లెప్పుడు? అని అడుగుతున్నారు. తాజాగా దీనిపై ఈమె ప్రియుడు స్పందించాడు. మ్యారేజ్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. కర్ణాటకలో పుట్టి పెరిగిన ప్రియాంక.. తెలుగులో పలు సీరియల్స్‌లో హీరోయిన్గా చేసింది. 'జానకి కలగనలేదు' సీరియల్‌తో అనే సీరియల్‌తో కాస్త పాపులారిటీ తెచ్చుకుంది. ఈమెకు సీరియల్ నటుడు శివకుమార్‌తో ప్రేమలో ఉంది. ఇంకా చెప్పాలంటే వీళ్లిద్దరూ చాన్నాళ్ల నుంచి లివ్ ఇన్ రిలేషన్షిప్(సహజీవనం)లో ఉన్నారు. గతేడాది బిగ్‌బాస్ షో వల్ల తెలుగు ప్రేక్షకులకు ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ పెళ్లెప్పుడు? పెళ్లెప్పుడు? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు వీటిపై ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ పూర్తి స్పష్టత ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: పెళ్లి అయిపోయిందిగా సినిమాలు మానేస్తారా? క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు) 'పెళ్లి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందులోనూ ప్రియాంక గ్రాండ్‌గా కొన్నిరోజుల పాటు పెళ్లి చేసుకోవాలి అనుకుంటోంది. అంత గ్రాండ్‌గా చేసుకోవాలంటే డబ్బులు కావాలి. అందుకే ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. పెళ్లి అవ్వకుండా ఎలా జీవిస్తున్నారు? మీ పేరెంట్స్ ఏం అనట్లేదా? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మేం వాళ్ల అంగీకారంతోనే కలిసి ఉంటున్నాం. అయితే ఈ కామెంట్స్‌కి చెక్ పెట్టేందుకు ఒకానొక టైంలో రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోవాలని ఆలోచన ఒకటి వచ్చింది. కానీ తర్వాత దాన్ని విరమించుకున్నాం' అని ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ శివ చెప్పుకొచ్చాడు. దీనిబట్టి చూసుకుంటే ప్రియాంక-శివకుమార్ ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం కష్టమే అనిపిస్తుంది. బాగా డబ్బులు సంపాదించాలి అంటున్నారంటే మరో రెండు మూడేళ్ల తర్వాత పెళ్లి ఉండొచ్చని ఈ జంట క్లారిటీ ఇస్తున్నట్లే. (ఇదీ చదవండి: 12 ఏళ్ల క్రితం వివాదం.. ఇప్పుడు సారీ చెప్పిన యంగ్ హీరోయిన్) -
తీవ్ర రక్తస్రావం.. పరీక్షిస్తే క్యాన్సర్..
-
తల్లికి క్యాన్సర్.. తీవ్ర రక్తస్రావం.. ఏడ్చేసిన ప్రియాంక
జానకి కలగనలేదు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రియాంక జైన్. ఈ సీరియల్ అయిపోగానే తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్లో అడుగుపెట్టింది. ఈ షో ద్వారా తాను పొట్టిపిల్లను కాదు గట్టిపిల్లను అని నిరూపించుకుంది. ప్రియుడు శివకుమార్‌తో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ త్వరలోనే అతడిని పెళ్లాడనున్నట్లు కూడా వెల్లడించింది. ప్రియాంక ఇంట పెళ్లిబాజాలు మోగడం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఓ విషాద వార్తను పంచుకుందీ బ్యూటీ. తన తల్లికి క్యాన్సర్ ఉందని చెప్తూ ఏడ్చేసింది. ఈ మేరకు ఓ వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసింది. 20 రోజుల పాటు రక్తస్రావం.. ప్రియాంక మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ నుంచి బయటకు రాగానే జీవితం చాలా సంతోషంగా ఉండబోతుందనుకున్నాను. ఇంతలోనే అమ్మ ఇలా ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. అమ్మకు నెలసరిలో ఎక్కువ రక్తం పోతోంది. వరుసగా 15-20 రోజులు బ్లీడింగ్ అవుతోంది. ఎప్పుడు పడితే అప్పుడు పీరియడ్స్ అవుతున్నాయి. వయసు పైబడేటప్పుడు ఇలాంటి మార్పులు సహజమే అనుకుంది. ఈ మధ్య పరీక్షలు చేయిస్తే తనకు క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్‌లో ఉందని తేలింది. నేను బిగ్‌బాస్ షోలో ఉన్న సమయంలోనే తనకు నెలసరిలో సమస్య మొదలైంది. గర్భాశయం తొలగింపు కానీ అమ్మ నన్ను సపోర్ట్ చేయాలని, బిగ్‌బాస్‌లో నన్ను చూడాలని ఏ ఆస్పత్రికి వెళ్లలేదు. అసలు నేను బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉండుంటే బాగుండేదనిపిస్తోంది. తనకు లాపొరోస్కోపిక్ సర్జరీ చేయనున్నారు. తన గర్భాశయాన్ని తీసేస్తామన్నారు. దానివల్ల క్యాన్సర్ ఆగిపోయే ఛాన్స్ ఉందని వైద్యులు చెప్తున్నారు' అంటూ ఏడ్చేసింది. ఆమెకు రక్తం తక్కువగా ఉండటంతో బ్లడ్ బ్యాంక్‌లో రక్తాన్ని సేకరించి ఆమెకు ఎక్కించారు. అనంతరం ఆమె తల్లిని ఆపరేషన్‌కు తీసుకెళ్లగా ప్రియాంక కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. తర్వాత ఆపరేషన్ విజయవంతమైందని చెప్పడంతో సంతోషించింది నటి. ఆమె కోలుకున్న తర్వాత డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకొచ్చింది. శరీరంలో ఏదైనా మార్పులు జరుగుతున్నప్పుడు వెంటనే గుర్తించి ఆస్పత్రికి వెళ్లమని సూచించింది ప్రియాంక. తమలాగా ఈ తప్పు ఎవరూ చేయొద్దని కోరింది. చదవండి: విడాకుల తర్వాత కరీనాతో డేటింగ్.. ఆ హీరోయిన్ ఇచ్చిన సలహా.. -
Priyanka Jain- Shivakumar: తాజ్‌మహల్ ముందు ప్రియాంకకు ప్రపోజ్ చేసిన నటుడు (ఫోటోలు)
-
ఆ బ్యాడ్‌న్యూస్ ఇదేనా? ప్రియాంకకు దూరంగా..
సీరియల్ నటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియాంక జైన్. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ద్వారా అభిమానులకు మరింత దగ్గరైంది. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి ఓసారి ప్రియుడు శివకుమార్ వచ్చినప్పుడు ఎమోషనలైంది నటి. పెళ్లి చేసుకుందాం.. ఇప్పుడే, ఇక్కడే! అంటూ అతడిని క్షణం కూడా వదల్లేకపోయింది. అటు శివకుమార్ నీకో గుడ్‌న్యూస్, బ్యాడ్‌న్యూస్ రెండూ చెప్తానన్నాడు. షో అయిపోయాక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని ఆ శుభవార్తను బయటపెట్టాడు. తాజాగా అతడు అమెరికా షిఫ్ట్ కాబోతున్నానంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. వీసా కోసం తిప్పలు అతడు చెప్తానన్న బ్యాడ్ న్యూస్ ఇదేనా? ప్రియాంకను వదిలి దూరంగా వెళ్లిపోతున్నాడా? అని అభిమానులు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఇక తన యూట్యూబ్ వీడియోలో వీసా పొందడానికి ఢిల్లీ వెళ్లి ఎన్ని తిప్పలు పడ్డాడో వివరించాడు. శివకుమార్ మాట్లాడుతూ.. యూఎస్ ఎంబసీ ముందు వీడియోలు తీస్తే ఫోన్లు లాగేసుకుంటారట. అందుకని అక్కడ వీడియో చేయలేకపోయాను. కానీ మొదటి ప్రయత్నంలోనే వీసా వచ్చేసింది. ప్రియాంక కాళ్లు మొక్కి మరీ వెళ్లాను. ప్రియాంకతో పాటు అమ్మ ఆశీర్వాదం వల్లే వీసా వచ్చింది. 20 సెకన్లలోనే ఇంటర్వ్యూ అయిపోయింది. త్వరలోనే ఒక సర్ప్రైజ్ ఆమె న్యూయార్క్ ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు? అని అడిగింది. నేను తెలుగు ఇండస్ట్రీలో పని చేస్తున్నాను. ఈ మధ్యే సీరియల్ అయిపోయింది. రెండు నెలలుగా ఖాళీగా ఉంటున్నాను. ఈ సమయంలో న్యూయార్క్ వెళ్లి రావాలనుకుంటున్నాను అని చెప్పాను. వార్షిక జీతం, ఎవరెవరు వెళ్తున్నారని అడిగింది. అన్నింటికీ సమాధానాలు చెప్పాను. చివరకు వీసా అప్రూవ్ అని చెప్పడంతో సంతోషమేసింది. త్వరలోనే ఒక సర్ప్రైజ్ ఉండబోతుంది' అని చెప్పుకొచ్చాడు. అసలు శివకుమార్ అమెరికాకు వెకేషన్ వెళ్తున్నాడా? లేదంటే అక్కడే సెటిల్ అయ్యే ఆలోచనలున్నాయా? ఏంటనేది వీడియోలో స్పష్టంగా చెప్పలేదు. చదవండి: భర్తకు నళిని విడాకులు.. ఆ తర్వాత కూడా నాన్న కొట్టేవాడన్న నటి కూతురు -
ఆపరేషన్ థియేటర్లో బిగ్‌బాస్ ప్రియాంక.. ఏమైందంటే?
సీరియల్ ద్వారా బోలెడంత ఫేమ్ సంపాదించుకుంది ప్రియాంక జైన్. తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్ ద్వారా జనాల్లో మరింత గుర్తింపు తెచ్చుకుంది. తన ఆటతో, మాటలతో టాప్ 5లో చోటు దక్కించుకుంది. త్వరలోనే తన ప్రియుడు, నటుడు శివకుమార్‌ను పెళ్లాడబోతున్నట్లు వెల్లడించింది. తాజాగా ఈ సీరియల్ నటి ఆస్పత్రిపాలైంది. ఆమెకు ఆపరేషన్ జరిగిందంటూ శివకుమార్ యూట్యూబ్‌లో ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఏడో తరగతిలో సైట్.. 'ప్రియాంక బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు నేను కంటి ఆపరేషన్ చేయించుకున్నాను. కళ్లు ఎర్రబడిపోయి, నొప్పితో విలవిల్లాడిపోయాను. లాసిక్ సర్జరీ చేశాక దాదాపు 8-10 గంటల పాటు కళ్లు తెరవలేము. ఇప్పుడు ప్రియాంక కూడా అదే సర్జరీ చేయించుకుంటోంది' అని చెప్పాడు. ప్రియాంక మాట్లాడుతూ.. 'నాకు ఏడో తరగతిలో సైట్ వచ్చింది. అప్పటినుంచే కళ్లద్దాలు పెట్టుకుంటున్నాను. దాదాపు 15 ఏళ్లుగా కళ్లజోడు పెట్టుకుంటూనే ఉన్నాను. ప్రతిరోజూ ఇవి ధరించడం వల్ల ఇరిటేషన్ వస్తోంది. అందుకే సర్జరీ చేయించుకుందామనుకుంటున్నాను' అని చెప్పింది. కంటి ఆపరేషన్ సక్సెస్ తర్వాత తను ఆస్పత్రికి వెళ్లిన మొదటి రోజు నుంచి ఏమేం జరిగిందో వివరంగా వీడియోలో చూపించారు. శివకుమార్ ఆమె గురించి భయపడుతున్నా ప్రియాంక మాత్రం ఎంతో ధైర్యంగా సర్జరీకి ముందడుగు వేసింది. చివరకు ఆస్పత్రిలో తన కంటి ఆపరేషన్ ఎలా చేశారన్నది కూడా వీడియోలో క్లియర్‌గా చూపించారు. మొత్తానికి కొన్నేళ్లుగా కంటి సమస్యతో బాధపడుతున్న ప్రియాంకకు ఎట్టకేలకు దాన్నుంచి విముక్తి లభించింది. ఈ సర్జరీ విజయవంతమైందని, ఇక కళ్లజోడుతో తనకు పని లేదని సంతోషం వ్యక్తం చేసింది ప్రియాంక. చదవండి: ఒకప్పుడు జేబు నిండా నోట్ల కట్టలు.. చివరకు కారు డిక్కీలో తెలుగు కమెడియన్ శవం -
గుడ్‌న్యూస్ చెప్పిన బిగ్‌బాస్ బ్యూటీ..
తెలుగు బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే మూడు ముళ్లబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పింది. గత కొన్నేళ్లుగా నటుడు శివకుమార్‌తో ప్రేమలో మునిగి తేలుతోందీ నటి. ఇటీవల బిగ్‌బాస్ హౌస్‌లో తాను శివకుమార్‌తో ప్రేమలో ఉన్న విషయాన్ని ధ్రువీకరించింది. అంతేకాదు, అతడు హౌస్‌లోకి రాగానే పెళ్లెప్పుడు చేసుకుందాం.. బిగ్‌బాస్ అయిపోగానే భార్యాభర్తలుగా కొత్త జర్నీ మొదలుపెడదాం అంటూ ఎమోషనలైంది. అప్పుడే పెళ్లి అటు శివకుమార్ సైతం.. ప్రియురాలిని ముద్దులతో ముంచెత్తి ఆప్యాయంగా హత్తుకున్నాడు. బిగ్‌బాస్ 7లో టాప్ 5కి చేరుకున్న ప్రియాంక తాజాగా తన పెళ్లి గురించి యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. త్వరలోనే మూహూర్తం ఫిక్స్ చేసి ఆ పెళ్లి తేదీ కూడా సోషల్ మీడియాలో వెల్లడిస్తామని తెలిపింది. అలాగే తన పెళ్లి గురించి చాలా ఆలోచనలు ఉన్నాయని, అవన్నీ మరో వీడియోలో చెప్తానంది. శోభా పెళ్లి కూడా అప్పుడే! ఇకపోతే బిగ్‌బాస్ హౌస్‌లో ఓ టాస్క్‌లో భాగంగా తన జుట్టు కత్తిరించుకున్న ప్రియాంక.. తన హెయిర్ ఇంకాస్త పొడుగ్గా అయిన తర్వాతే వివాహం చేసుకుంటానంది. పనిలో పనిగా మరో సీక్రెట్ కూడా బయటపెట్టింది. తన బెస్ట్ ఫ్రెండ్, బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ శోభా కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని సీక్రెట్ రివీల్ చేసింది. దీంతో అభిమానులు వీరిద్దరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదవండి: నాకోసం ఎవరూ ముందుకు రాలే.. దుస్తులు కొనుక్కునే స్థోమత లేక.. -
అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక
బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7 ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద దుమారమే రేగింది. ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమర్ కారుపై ఒక వర్గం ఫ్యాన్స్ దాడి చేశారు. అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. తాజాగా ఈ విషయంపై ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రియాంక రియాక్ట్ అయింది. అభిమానులు ఎవరైనా కానీ ఇలా దాడి చేయడం చాలా దారుణమని ఆమె ఇలా తెలిపింది. 'ఫ్యాన్స్ పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడటం చాలా దారుణం. మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వ్యతిరేకించండి.. అందులో తప్పులేదు కానీ ఇలా దాడి చేయడం చాలా హేయం. ఎవరమైనా ఎంతో కష్టపడి ఒక వస్తువును కొంటాము. కానీ ఇలా కొన్ని క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్ కాదు. దాడి సమయంలో కారులోపల మహిళలు ఉన్నారనే ఆలోచన కూడా లేకుంటే ఎలా..? హౌస్‌లో గేమ్ పరంగా మాత్రమే మాలో గొడవలు ఉన్నాయి. టాస్క్ ముగియగానే పల్లవి ప్రశాంత్,యావర్,శివాజీ,అమర్ ఇలా అందరం చాలా బాగా కలిసే ఉండే వాళ్లం. మాలో ఎలాంటి గొడవలు లేవు.' ముఖ్యంగా చివరి 4 వారాల్లో ప్రశాంత్‌తో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. వాడు నిజంగానే భూమి బిడ్డ అని ఆమె తెలిపింది. కానీ ఆ ఇంటర్వ్యూ జరిగిన సమయానికి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కాలేదు.. దీంతో ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ అరెస్ట్‌పై ఆమెకు ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాలేదు. -
Priyanka Jain: బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో టాప్ 5లో నిలబడ్డ ఏకైక లేడీ కంటెస్టెంట్ (ఫోటోలు)
-
Bigg Boss 7: ప్రియాంక ఎలిమినేట్.. మొత్తం రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బిగ్‌బాస్ 7వ సీజన్లో షాకింగ్ ఎలిమినేషన్. ఒక్కో దశని దాటుకుంటూ ఫినాలే వరకు వచ్చిన ప్రియాంక.. చిట్టచివరిది అయిన ఆదివారం ఎపిసోడ్లో ఫస్ట్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌గా నిలిచింది. కప్ కొట్టలేకపోవచ్చు, ఓట్లు విషయంలో మిగతా వారికంటే వెనకబడిపోయి ఉండొచ్చు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలామంది మనసులు గెలిచింది. దీనికి తోడు మంచి రెమ్యునరేషన్‌తో బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చింది. ఎలిమినేషన్‌కి రీజన్ బిగ్‌బాస్ 7 హౌసులోకి తొలి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంకపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఎందుకంటే సీరియల్ నటిగా అందరికీ తెలిసిన ఈమె.. కప్ కొట్టడం, ఫినాలే వీక్ రావడం సంగతి అటుంచితే కొన్ని వారాలు ఉంటే గ్రేట్ అనుకున్నారు. అలాంటిది తొలి పవరస్త్ర కోసమే చివరివరకు వచ్చి ఓడిపోయింది. అక్కడి నుంచి మొదలుపెడితే దాదాపు చాలా గేమ్స్‌లో చివరివరకు వచ్చి బోల్తా కొట్టింది. ఒకటి రెండుసార్లు మినహా దాదాపు సీజన్ అంతా కూడా చాలా డిగ్నిఫైడ్‌గా ఆడింది. అమ్మాయి కావడం, పెద్దగా ఫేమ్ లేకపోవడంతో ఈమె ఓట్లు పడలేదు. (ఇదీ చదవండి: Bigg Boss 7: అర్జున్ అంత సంపాదించాడా? 10 వారాల్లోనే..) ఈ క్రమంలోనే ఫినాలే టాప్-6లో అడుగుపెట్టిన వన్ అండ్ ఓన్లీ లేడీ కంటెస్టెంట్‌గా ప్రియాంక నిలిచింది. కానీ ఓటింగ్ విషయంలో బలమైన కంటెస్టెంట్స్ ఈమె కంటే ముందు ఉండటం ఈమెకు పెద్ద మైనస్ అయిందని చెప్పొచ్చు. ఈ సీజన్లో పాల్గొన్న అమ్మాయిలందరితో పోలిస్తే ప్రియాంక ది బెస్ట్ ఫెర్ఫార్మర్ అని చెప్పొచ్చు. చాలామంది ఒప్పుకొన్న ఒప్పుకోకపోయినా శివాజీ కంటే ప్రియాంక చాలా బెటర్! రెమ్యునరేషన్ ఎన్ని లక్షలు? సీరియల్ నటిగా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక.. బిగ్‌బాస్ షోతో మరింత ఫేమ్, క్రేజ్ తెచ్చుకుంది. ఈమెకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇకపోతే సీజన్ అంతా అంటే 15 వారాల పాటు హౌసులో ఉన్న ప్రియాంక.. వారానికి రూ.2.5 లక్షల రెమ్యునరేషన్ మాట్లాడుకుందట. అంటే మొత్తంగా రూ.37.5 లక్షలు ఈమె సంపాదించినట్లు తెలుస్తోంది. ఇంత మొత్తం డబ్బులు అంటే ప్రియాంక ఆర్థికంగానూ కాస్త కుదురుకున్నట్లే! (ఇదీ చదవండి: Bigg Boss 7 Grand Finale: అది ఫేక్ న్యూస్) -
Bigg Boss 7: ఆమె ఎలిమినేట్.. ఈసారి కూడా లేడీ విన్నర్ లేనట్లే!
ఇప్పటివరకు బిగ్‌బాస్ ఆరు సీజన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తోంది. మొత్తంగా అన్నింట్లోనూ అబ్బాయిలే విజేతలుగా నిలిచారు. ఓటీటీ షోలో బిందుమాధవి గెలిచినా సరే అది రెగ్యులర్ సీజన్ కేటగిరీలోకి రాదు. అయితే ఈసారైనా లేడీ కంటెస్టెంట్‌కి నిరాశే ఎదురైంది. ఫినాలే వరకు వచ్చి, టాప్-6లో నిలిచిన వన్ అండ్ ఓన్లీ అమ్మాయి కూడా ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఏంటి సంగతి? (ఇదీ చదవండి: ఉచితంగా 'సలార్' టికెట్స్.. తెలుగు యంగ్ హీరో బంపరాఫర్) ప్రియాంక ఎలిమినేట్! సీరియల్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక జైన్.. తొలి కంటెస్టెంట్‌గా ఈ సీజన్లో అడుగుపెట్టింది. హైట్ తక్కువగా ఉన్నాసరే తొలివారం నుంచి అబ్బాయిలకు టఫ్ ఫైట్ ఇచ్చింది. చాపకింద నీరులా ఒక్కో గేమ్ గెలుస్తూ చివరివరకు వచ్చేసింది. ఈసారి ఫినాలే వీక్‌లో అడుగుపెట్టిన ఏకైక లేడీ కంటెస్టెంట్‌గా నిలిచింది. అయితే చివరి ఆరుగురిలో ఓట్లు తక్కువ వచ్చిన కారణంగా తొలుత అర్జున్ బయటకెళ్లిపోగా, తాజాగా ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. పొట్టిపిల్ల కాదు గట్టిపిల్ల సీజన్ మొదలైనప్పటి నుంచి ప్రియాంక మీద ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. అయితేనేం ఒక్కో వారం మిగిలిన కంటెస్టెంట్స్‌ని దాటుకుంటూ ఫైనల్ వరకు వచ్చేసింది. టాప్-6లో ఈమె కంటే ఓటింగ్ పరంగా బలమైన కంటెస్టెంట్స్ ప్రశాంత్, అమర్, శివాజీ ఉండటం ఈమెకు కలిసిరాలేదని చెప్పొచ్చు. ఏదేమైనా ఫినాలే వరకు వచ్చినప్పుడే ప్రియాంక గెలిచేసింది. కాకపోతే ట్రోఫీ కూడా గెలుచుకుని ఉంటే వేరే లెవల్ ఉండేది. అయితే ప్రియాంక ఎలిమినేషన్ పై ఆదివారం ఎపిసోడ్లో పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్: ప్రశాంత్‌కు బంపరాఫర్ ఇచ్చిన శ్రీముఖి) -
ముష్టి బ్యాచ్.. ముష్టినాయాళ్లు.. వంకరబుద్ధి పోనిచ్చుకోని శివాజీ
బిగ్‌బాస్ 7 ఫినాలే దగ్గరపడుతోంది. ఇప్పుడు కూడా హౌస్మేట్స్.. వారిలో వారే కొట్టుకోకుండా కాస్త కలిసిమెలిసి ఉండేందుకు సరదా టాస్కులిచ్చాడు బిగ్‌బాస్. ఒకరి కోసం మరొకరు ఆడాలంటూ వారి మధ్య బంధాన్ని బలపర్చేందుకు ప్రయత్నించాడు. మరి ఎవరు ఎవరికోసం ఆడారు? ఏలియన్స్ ఇంట్లో ఎందుకు దూరాయి? ఈ విషయాలన్నీ తాజా ఎపిసోడ్ (డిసెంబర్ 14) హైలైట్స్‌లో చూసేద్దాం.. మీ ఇంటి వంట.. ఈ వారం నామినేషన్ల గోల లేదు, పెద్దగా టాస్కులు కూడా లేకపోవడంతో హౌస్మేట్స్ విశ్రాంతి తీసుకుంటున్నారు. బద్ధకస్తులుగా మారిపోయిన కంటెస్టెంట్లను హుషారెత్తించేందుకు బిగ్‌బాస్ మరోసారి హాచీ ఏలియన్స్‌ను రంగంలోకి దింపాడు. ఈ హాచీ.. కంటెస్టెంట్ల కోసం ఇంటి నుంచి ఫుడ్ వచ్చిందని, తమను సంతోషపరిస్తేనే ఆ ఆహారం ఇస్తామని చెప్పింది. అయితే మీ ఫుడ్ కోసం తోటి ఇంటిసభ్యులు ఆ ఆహారాన్ని సంపాదించాల్సి ఉంటుందని మెలిక పెట్టింది. శివాజీ కోసం ఆడి గెలిచిన ప్రియాంక మొదటగా అర్జున్ ఇంటి నుంచి రాగిముద్ద-మటన్ కూర వచ్చింది. ఈ ఫుడ్ కోసం యావర్ షేక్ బాల్ షేక్ గేమ్ ఆడి గెలిచాడు. తనకోసం ఆడి గెలిచిన యావర్‌కు తన చేతితో ఇంటి ఫుడ్‌ను తినిపించాడు అర్జున్. శివాజీ కోసం ఇంటి నుంచి చికెన్ కర్రీ వచ్చింది. దీనికోసం ప్రియాంక బ్యాలెన్స్ ది బాల్స్ గేమ్ ఆడి గెలిచి చికెన్ కూర శివాజీకి దక్కేలా చేసింది. ఆ తర్వాత అమర్‌దీప్‌కు రొయ్యల బిర్యానీ వచ్చింది. దీని కోసం శివాజీ బెలూన్ల టాస్క్ ఆడి గెలవడంతో అమర్ రొయ్యల బిర్యానీని ఇతరులతో షేర్ చేసుకుంటూ కడుపునిండా ఆరగించాడు. గంట ఎపిసోడ్లో ఎవరెంత కనిపిస్తారు? తర్వాత కొందరు గ్రహాంతరవాసుల్లాగా మాస్కులు పెట్టుకుని ఇంట్లోకి వచ్చి అందరినీ ఓ ఆటాడుకుని వెళ్లిపోయారు. అనంతరం బిగ్‌బాస్.. మీ 14 వారాల జర్నీలో మీ ఓవరాల్ పర్ఫామెన్స్ ఆధారంగా 60 నిమిషాల ఎపిసోడ్లో మీరు ఎంతసేపు కనిపించడానికి అర్హులో చెప్పాలంటూ కొన్ని బోర్డులు ఇచ్చాడు. ముందుగా అర్జున్.. 10 నిమిషాల బోర్డు తన మెడలో వేసుకున్నాడు. ఫౌల్స్ ఆడుతూ, దొంగతనాలు చేస్తూ, తిట్లు తింటూ అమర్ 20 నిమిషాలు కనబడతాడని అనుకుంటున్నట్లు చెప్పాడు. శివాజీకి 15, ప్రియాంకకు 7, ప్రిన్స్ యావర్‌కు 5, ప్రశాంత్‌కు 3 నిమిషాల బోర్డులు ఇచ్చాడు. అమర్‌ను చులకనగా చూస్తున్న శివాజీ శివాజీ.. ఎవరికీ తక్కువ నిమిషాల బోర్డు ఇవ్వబుద్ధి కావట్లేదంటూనే అమర్ మెడలో 3 నిమిషాల బోర్డు వేసి క్లాస్ పీకాడు. నువ్వు ఈ 2 వారాలే ఆడావు.. అంతకుముందు ఏమీ ఆడలేదంటూ మరోసారి తనను టార్గెట్ చేశాడు. కొన్నిసార్లు నువ్వు నెగెటివ్ కంటెంట్ కోసం ప్రయత్నించావు, అసలు గేమ్ ఆడలేదు అని అన్నాడు. 3 నిమిషాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నా, నేను గేమ్ ఆడానన్నా.. అని అమర్ డిఫెండ్ చేసుకుంటుంటే.. నేను 5 వేసుకున్నప్పుడు నీకు 3 నిమిషాలు వేస్తే రోగమా? అని తిట్టాడు శివాజీ. అంతేకాదు.. అర్జున్‌కు 7 ఇచ్చి అమర్ కంటే నువ్వు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలవన్నాడు. ముష్టి బ్యాచ్ ప్రియాంకకు 10 ఇచ్చి మిగిలిన 15, 20 నిమిషాల బోర్డులు ప్రిన్స్, ప్రశాంత్ చేతిలో పెట్టి ఇద్దరూ తమకు నచ్చినవి వేసుకోమని ఆఫర్ ఇచ్చాడు. తర్వాత అందరూ ఈ బోర్డుల ప్రక్రియను ఒకరి తర్వాత ఒకరు పూర్తి చేశారు. కాగా ఫినాలే దగ్గరపడుతున్నప్పటికీ టైం దొరికినప్పుడల్లా అమర్ మీద విషం కక్కుతూనే ఉన్నాడు శివాజీ. వేస్ట్ ఫెలో, దొంగ, వెధవ, పనికిమాలినోడు, పిచ్చి పోహా.. ఇలా ఎన్నో మాటలన్నాడు. తాజా ఎపిసోడ్‌లోనూ స్పా(శోభ, ప్రియాంక, అమర్) బ్యాచ్‌ను ఉద్దేశిస్తూ ముష్టి బ్యాచ్.. ముష్టినాయాళ్లు.. అంటూ తన స్పై బ్యాచ్ దగ్గర చులకనగా మాట్లాడాడు. వాళ్ల ముందేమో పద్ధతిగా, పెద్దాయనలా ప్రవర్తిస్తూ పక్కకు రాగానే ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ మరోసారి తన వంకరబుద్ధి బయటపెట్టుకున్నాడు శివాజీ. చదవండి: నటుడు కన్నుమూత.. గురువు మరణం కలిచివేసిందంటూ భారతీరాజా పోస్ట్.. -
మీరు స్లమ్ అనుకున్నా సరే.. ఇదే నా ఇల్లు: బిగ్ బాస్ ప్రియాంక
ప్రియాంక జైన్ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. ముంబైలో పుట్టి పెరిగినప్పటికీ అచ్చం తెలుగమ్మాయిలా టాలీవుడ్ ప్రేక్షకులను బుల్లితెరపై అలరిస్తోంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-7లో ఏకంగా గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుంది. ప్రస్తుతం టాప్-5 ప్లేస్ కోసం పోటీపడుతోంది. తెరపై మనకు కనిపిస్తున్న ప్రియాంక రియల్ లైఫ్ గురించి వింటే ఎవరికైనా కన్నీళ్లు రావాల్సిందే. ఇంతకు ప్రియాంక ప్రయాణం ఎలా మొదలైంది. ముంబైలో ఉండాల్సిన ప్రియాంక.. హైదరాబాద్ ప్రియాంకగా ఎలా మారింది? అనే వివరాలు తెలుసుకుందాం. ప్రియాంక జైన్ బుల్లితెరపై 'జానకి కలగనలేదు' సీరియల్‌తోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత మౌనరాగం సీరియల్లో కనిపించింది. అదే సమయంలో బుల్లితెర నటుడు శివ కుమార్‌తో ఆమె ప్రేమలో పడింది. చాలా ఏళ్లుగా వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు. అమ్ములుగా ప్రియాంక జైన్.. అంకిత్‌గా శివ కుమార్ ప్రేక్షకులను అలరించారు. అయితే ముంబైకి చెందిన ప్రియాంక తన చిన్నప్పుడు ఒక చిన్న ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఉండేది. ముంబైలోని ఓ స్లమ్ ఏరియాలో ఉండేవారు. రోడ్డు పక్కనే ఉన్న చాలా చిన్న ఇంట్లో తన బాల్యంలో ఉన్న ఇంటికి సంబంధించిన ఓ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఇంట్లోనే తిరుగుతూ తాను పెరిగిన వాతావరణం, ఇంటిని అభిమానులకు పరిచయం చేసింది. అంతే కాకుండా తాను పడ్డ ఇబ్బందులన్నింటినీ వివరిస్తూ ఎమోషనలైంది. తన చిన్నప్పుడే తాతయ్య, అమ్మమ్మ చనిపోయారంటూ తలుచుకుని కంటతడి పెట్టుకుంది. మా అమ్మా, నాన్నది లవ్ మ్యారేజ్ అని.. లేచిపోయి పెళ్లి చేసుకున్నారని ప్రియాంక తెలిపింది. ప్రస్తుతం దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చాడంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. ఆ స్థాయి నుంచి తాను ఇక్కడ ఉన్నానంటే.. అమ్మా, నాన్న వల్లేనంటూ ఎమోషనలైంది. జీవితంలో ఎవరూ అధైర్య పడవద్దని సూచించింది. బాగా చదువుకుని జీవితంలో పైకి రావాలని తెలిపింది. నా తల్లిదండ్రుల సహకారం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని పేర్కొంది. అయితే ప్రియాంక ఇంటిని చూసిన శివకుమార్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు. ఇలాంటి ఇంటి నుంచి ప్రియాంక వచ్చిందంటే ఏం చెప్పాలో అర్థం కావటం లేదన్నారు. ఆమెతో పోల్చుకుంటే ఆ దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చాడని అన్నాడు. ఈ వీడియోలో ప్రియాంక ఇంటిని చూసిన ఫ్యాన్స్ తప్పకుండా ఆశ్చర్యానికి గురవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. -
బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆ ముగ్గురిలో ఎవరు?
మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ సీజన్-7 ముగియనుంది. చివరి వారంలో హౌస్‌లో ఇంకా ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. దీంతో వంద రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ షో విజేత ఎవరో ఆదివారం తేలిపోనుంది. ఈ నేపథ్యంలో చివరి వారంలో ఫైనలిస్టుల జర్నీ గురించి బిగ్‌బాస్ ఆడియన్స్‌కు పరిచయం చేస్తున్నారు. మొత్తంగా ఈ వారాన్ని ఎమోషనల్ ఎపిసోడ్‌గా మార్చేసిన బిగ్‌బాస్.. మొదటి రోజు అమర్, అర్జున్‌ని వీడియోలను చూపించిన ఏడిపించేశారు. రెండో రోజు శివాజీతో స్టార్ట్ చేసి.. చివరీకీ ప్రియాంక ఎమోషనల్ జర్నీతో ముగించాడు బిగ్‌బాస్. అలా ఫైనలిస్టులైన వారిలో ఇంకా పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ జర్నీ మూడో రోజు ఆడియన్స్‌కు చూపించనున్నారు. తాజాగా ప్రిన్స్ యావర్ జర్నీకి సంబంధించిన ప్రోమో రిలీజైంది. అయితే యావర్ పట్టుదల అద్భుతమని బిగ్‌బాస్ కొనియాడారు. దీంతో యావర్ ఫుల్ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నాడు. మిడ్ వీక్‌లో ఎవరు అవుట్? అయితే ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్న సంగతి తెలిసిందే. మరీ వారం మధ్యలో హౌస్ నుంచి ఎవరు బయటికొస్తారు? టాప్-5 లో ఎవరెవరు నిలుస్తారు అనే విషయంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఆ ఒక్కరు ఎవరన్న విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికైతే పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్దీప్ టాప్-5లో నిలుస్తారని తెలుస్తోంది. మరో వైపు అర్జున్, ప్రియాంక, ప్రిన్స్ యావర్‌లో ఎవరో ఒకరు బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరీ మిడ్ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
ప్రియాంకని ఏడిపించేసిన బిగ్‌బాస్..
-
Bigg Boss 7: శివాజీ బయటపడలేదు.. ప్రియాంక మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయింది!
బిగ్‌బాస్ మరోసారి ఏడిపించేశాడు. అవును ప్రియాంక, తనని తాను కంట్రోల్ చేసుకోలేనంతగా ఎమోషనల్ చేశాడు. అయితే శివాజీ మాత్రం పెద్దగా బయటపడలేదు. మరోవైపు ఓ గొడవ వల్ల విడిపోయిన అర్జున్-యావర్ మళ్లీ ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే యావర్ బోరున ఏడ్చేయడం కంటతడి పెట్టించింది. ఇంతకీ మంగళవారం ఏం జరిగిందనేది Day 100 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. శివాజీకి ఓ రేంజు ఎలివేషన్ సోమవారం ఎపిసోడ్లో జర్నీ వీడియోలతో అమర్, అర్జున్‌ని ఎమోషనల్ చేసిన బిగ్‌బాస్.. మంగళవారం ఎపిసోడ్‌ని శివాజీతో స్టార్ట్ చేశాడు. ఇతడి బిగ్‌బాస్ జ్ఞాపకాల్ని.. 'బుక్ ఆఫ్ మెమొరీస్'లో పొందుపరిచి శివాజీని సర్ప్రైజ్ చేశాడు. అనంతరం దాదాపు 17 నిమిషాల వీడియోని ప్లే చేసి మరీ శివాజీకి ఓ రేంజు ఎలివేషన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ క్రమంలోనే శివాజీ.. 25 ఏళ్ల ఇండస్ట్రీ కెరీర్ ఓ ఎత్తు.. బిగ్‌బాస్ జర్నీ ఓ ఎత్తు.. ఇక్కడి నుంచి ఎంతో కొంత నేర్చుకుని వెళ్తాం. అదైతే సత్యం బిగ్‌బాస్.. కప్పు గెలుస్తామా? లేదా అనేది పక్కనబెడితే.. చివరివారం వరకు వచ్చిన ఆరుగురు మాత్రం ప్రేక్షకుల హృదయాల్ని గెలిచారని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!) ప్రియాంక గట్టిపిల్ల శివాజీ తర్వాత ప్రియాంకని పిలిచిన బిగ్‌బాస్.. ఈమెకి సంబంధించిన ఫొటోలని డిస్ప్లే చేశారు. అయితే మిగతా ఫొటోల సంగతేమో గానీ తన బాయ్‌ఫ్రెండ్ శివతో ఉన్న పిక్ చూసిన తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇక ప్రియాంక గురించి ఎలివేషన్స్ ఇచ్చిన బిగ్‌బాస్.. సింపుల్ ప్రియాంకగా ఉండే మీరు.. శివంగి ప్రియాంకగా నామినేషన్స్‌లో మీరు ఎంత బలమైన కంటెస్టెంట్ అనేది మీరు ఎలాంటివారో తెలిసింది. పొట్టి పిల్ల కాదు గట్టిపిల్ల.. మీరు 100 శాతం ఇస్తూ వచ్చారు. మీ పట్టుదలే మిమ్మల్ని జీవితంలో మొదటి స్థానంలో నిలుపుతుందని కోరుకుంటూ మీ ప్రయాణం చూద్దాం అని దాదాపు 15 నిమిషాల వీడియోని ప్లే చేశాడు. అయితే ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా ప్రియాంక ఎమోషనల్ అవుతూ, ఆనంద బాష్పలతో కనిపించింది. మరోవైపు గతంలో ఓసారి నామినేషన్స్ సందర్భంగా ఇక యావర్‌తో మాట్లాడనని చెప్పిన అర్జున్.. తన జర్నీ వీడియోలో ఇద్దరం కలిసున్న సీన్స్ భలే ఉన్నాయని చెప్పాడు. దీంతో యావర్, అర్జున్‌ని హగ్ చేసుకుని గట్టిగా ఏడ్చేశాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. ఈరోజు ఎపిసోడ్ గురించి మీకు రాసి చెబితే ఆ ఫీల్ క్యారీ చేయలేం. కాబట్టి కుదిరితే ఫుల్ వీడియో చూడండి. (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) -
ప్రియాంక అమ్మ ఇప్పటికీ పెళ్లిళ్లకు వెళ్లి పనులు చేస్తుంది: శివ
ప్రియాంక జైన్‌గా కంటే ఇప్పుడు బిగ్ బాస్ ప్రియాంక అనే పేరుతోనే ఆమెకు మంచి గుర్తింపు ఉంది. బుల్లితెరపై 'జానకి కలగనలేదు' సీరియల్‌తో ఆమె వెలుగులోకి వచ్చింది. అదే విదంగా బుల్లితెర నటుడు శివ కుమార్‌తో ఆమె ప్రేమలో పడిన విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు. మౌనరాగం సీరియల్లో కలిసి నటించారు. అమ్ములుగా ప్రియాంక జైన్.. అంకిత్‌గా శివ కుమార్‌లు కనిపించారు. కెమెరా ముందే నటనతో జీవించిన వీళ్లు.. కెమెరా వెనుక కూడా రొమాంటిక్ జోడీగా మారారు. ఈ క్రమంలో ప్రియాంకకు బిగ్ బాస్‌లోకి ఎంట్రీ అవకాశం రావడంతో ఆమెకు మరింత గుర్తింపు దక్కింది. ప్రస్తుతం ఆమె టాప్-5 కంటెస్టెంట్‌గా ఆమె ఉన్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ప్రియాంక ఎక్కడా బ్యాలెన్స్ తప్పలేదని చెప్పవచ్చు. గేమ్‌లో తన హుందాతనాన్ని, సంస్కారాన్ని కోల్పోకుండా ఉండటం వల్ల టాప్-5 వరకు వచ్చింది. ఈ క్రమంలో కొందరు యాంటీ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడం కూడా జరిగింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక కుటుంబం గురించి శివ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రియాంక బిగ్ బాస్‌లో ఉండగా తన ఇంటికి సంబంధించిన హోమ్ టూర్ వీడియో ఒకటి భారీగా వైరల్ అయింది. ఆ వీడియోను చాలా రోజుల క్రితమే ఆమె యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన వారందరూ ప్రియాంక ఇంత పేదరికాన్ని చూసి ఈ స్థాయికి వచ్చిందా..? అని కొందరు ప్రశంసించారు. దీనిని జీర్ణించుకోలేని కొందరూ అదంతా ఓట్ల కోసం సింపతీ అనే విమర్శలు చేయడం ప్రారంభించారు. ఈ విషయంపై శివ ఇలా సమాధానం చెప్పాడు. 'ఆ వీడియో పోస్ట్ చేసే సమయానికి ప్రియాంకకు బిగ్ బాస్ ఆఫర్ రాలేదు. నిజానికి ఆమె అక్కడే జన్మించింది. ప్రియాంక నాన్నగారిని వ్యాపారం పరంగా ఆయన స్నేహితుడు మోసం చేయడంతో ఆర్థికంగా భారీగా నష్టపోయారు. ఆ సమయంలో ఆ ఇల్లు అమ్మేసి ప్రస్తుతం బెంగళూరులో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. దానికి రూ. 15 వేలు రెంట్ అవుతుంది.. ఆ డబ్బు కూడా ప్రియాంకనే చెల్లిస్తుంది. ప్రియాంక అమ్మగారు ఇప్పుడు కూడా పెళ్లికూతురికి మేకప్ చేయడం.. మెహందీ పెట్టడం వంటివి చేస్తున్నారు. ఆమె నాన్నగారు ఒక చిన్న మొబైల్ షాప్ పెట్టుకుని కొనసాగుతున్నాడు. చాలా పూర్ ఫ్యామిలీ నుంచి ఇంత దూరం ఆమె వచ్చింది. అలాంటి వ్యక్తిపై కూడా ఇలాంటి దారుణమైన ట్రోల్స్ చేయడం ఏంటి..? గేమ్‌లో భాగంగా వారు కొద్దిసేపు అరుచుకుంటారు.. మళ్లీ కలిసిపోతారు. అంతే గానీ బయట కొందరు పనిగట్టుకుని ఆమెను ఇంతలా ట్రోల్ చేయడం ఏంటి..? ట్రోల్ చేసే వారిలో ఎవరికైనా అన్యాయం చేసిందా అని ఆయన వ్యాఖ్యానించారు. ఆమెను ఎందరు ట్రోల్ చేసినా నేను ఆమెకు తోడుగా ఉంటూనే వాటిని ఎదుర్కుంటాను. అని ఆయన అన్నారు. రేపటి రోజున 'శివాజీ' కూడా స్టార్ మా బ్యాచ్‌నే ప్రియాంక, శోభ, అమర్ దీప్‌ను చాలా మంది 'స్టార్ మా బ్యాచ్' అంటూ ట్రోల్ చేస్తూన్నారని శివ తెలిపాడు. ఈ వ్యాఖ్యలు మొదట చేసింది శివాజీ గారే అంటూ ఆయన చెప్పాడు. బిగ్ బాస్ కూడా 'స్టార్ మా' ఛానెల్లోనే వస్తుంది. రేపొద్దున బిగ్ బాస్ పూర్తి అయ్యాక వీరందరూ బయటకు వస్తారు... అప్పుడు శివాజీ, పల్లవి ప్రశాంత్ వంటి వారితో పాటు అందరూ కూడా 'స్టార్ మా బ్యాచ్'నే అవుతారు. ఎందుకంటే వారందరూ కూడా 'స్టార్ మా' ఛానెల్ కోసం పనిచేశారు. అందులో తప్పేముంది..? ఇలాంటి విషయం లేని ట్రోల్స్ చేయడం ఎందుకు..? అని శివ ప్రశ్నించాడు. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
Bigg Boss 7: ప్రియాంకని ఒప్పించడానికి నాగ్ ప్రయత్నం.. శివాజీకి చెప్పడానికి నో ధైర్యం!
బిగ్‌బాస్ 7వ సీజన్లో మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఈ వారం ఓ మాదిరి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. కాకపోతే శివాజీ మీద నాగ్ ప్రేమ ఎంత ఉందనేది మరోసారి బయటపడింది. ప్రియాంకని అయితే నాగ్ పదే పదే ఓ విషయం ఒప్పించేందుకు తెగ ప్రయత్నించాడు. అమర్‌కి ఓ సర్ప్రైజ్ కూడా ఇచ్చాడు. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 90 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. బయటపడ్డ ప్రియాంక ఆవేదన టికెట్ టూ ఫినాలే రేసులో గెలిచిన అర్జున్.. ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి శనివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. వీకెండ్ కాబట్టి స్టేజీపైకి వచ్చిన నాగార్జున.. శుక్రవారం ఏం జరిగిందో చూశాడు. ఆ తర్వాత ప్రస్తుతానికి వచ్చేశాడు. ఫినాలే రేసు మొదటి రౌండులోనే ఎలిమినేట్ అయిపోయిన శోభా-శివాజీ నిలబెట్టి.. ఒకరి గేమ్ గురించి మరొకరు చెప్పాలని అన్నాడు. ఈ డిస్కషన్లో వీళ్లిద్దరూ అమర్‌కి పాయింట్స్ ఇవ్వడంపై నాగ్ కౌంటర్స్ వేశాడు. (ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?) అమర్ అలుగుతాడని, బ్లాక్ మెయిల్ చేస్తాడని నవ్వుతూనే నిజాలు చెప్పేశాడు. ఆ వెంటనే.. ప్రియాంక చెప్పమ్మా అని ఆమెని నిలబెట్టాడు. దీన్ని నిజమేనని ఒప్పుకొన్న ప్రియాంక.. అది చాలా పెయిన్ఫుల్, ఆల్రెడీ ఓడిపోయినా బాధ ఓవైపు ఉంటే.. మళ్లీ మళ్లీ అమర్ పాయింట్స్ ఇవ్వమని చెబుతుంటే చాలా బాధగా అనిపించింది ప్రియాంక తన ఆవేదన బయటపెట్టింది. ప్రియాంకని ఒప్పించే ప్రయత్నం ప్రియాంకని నిలబెట్టి మాట్లాడిన నాగ్.. గతవారమే అనుకున్నాం కదా ఒంటరిగా గేమ్ ఆడమని.. కానీ నువ్వు ఏం చేశావ్? అని అమర్‌కి గౌతమ్ ద్వారా పాయింట్లు ఇచ్చిన విషయం గురించి మాట్లాడాడు. అయితే ఈ మొత్తం డిస్కషన్లో ప్రియాంకది గ్రూప్ గేమ్ అని ఒప్పించాలని నాగ్ చాలా ప్రయత్నించాడు. కానీ ఈ విషయంలో ఫెయిలయ్యాడు. ఆ తర్వాత గౌతమ్‌తోనూ నాగ్.. ప్రియాంకది తప్పని చెప్పించాడు. ప్రియాంక.. నువ్వు ఎంత సమర్ధించుకున్నాసరే నీది గ్రూప్ గేమ్ అని మాకు అనిపించిందని నాగ్ అన్నాడు. కానీ ఇలానే గతంలో శివాజీ బ్యాచ్‌గా ఆడినప్పుడు మాత్రం నాగ్ కనీసం పల్లెత్తు మాట కూడా అనలేకపోయాడు. దీనిబట్టి శివాజీపై నాగ్ ప్రేమ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కు హెల్త్ ఇష్యూ.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన సుకుమార్) అమర్‌కి సర్ప్రైజ్.. ప్రశాంత్‌కి షాక్ ఈ వారం 'టికెట్ టూ ఫినాలే' అర్జున్ గెలిచిన కారణంగా.. ఎవిక్షన్ పాస్ 14వ వారం కాదు, ఈ వారమే ఉపయోగించాలని ప్రశాంత్‌కి నాగ్ కండీషన్ పెట్టాడు. దాని గురించి తర్వాత చెబుతానని అన్నాడు. కానీ శనివారం ఎపిసోడ్లో కారణం లాంటిది ఏం చెప్పలేదు. మరోవైపు అమర్ మాట్లాడుతూ.. ఒక్కసారి మీరు నన్ను కెప్టెన్ అని పిలిస్తే వినాలని ఉందని నాగార్జునని రిక్వెస్ట్ చేశాడు. ఇది జరిగిన నాగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. టికెట్ టూ ఫినాలే పోటీలో 1200 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన కారణంగా.. వచ్చే వారం కెప్టెన్ అయ్యావ్ అమర్ అని నాగ్ చెప్పాడు. శివాజీ, అర్జున్.. డిప్యూటీస్ అని నాగ్ ఆదేశించాడు. శివాజీతో గౌతమ్ గొడవ ఇక 'బీబీ లైబ్రరీ' అని ఓ గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా కొన్ని పేర్లు రాసున్న బుక్... మరొకరికి ఇవ్వాల్సి ఉంటుందని నాగ్ చెప్పాడు. మిగతా వాళ్ల విషయంలో పెద్దగా ఇబ్బంది కాలేదు కానీ.. 'ప్రతిదానికి నేనే రైట్ అని అనుకోకుండా ఎలా ఉండాలి?' అనే బుక్ మాత్రం గౌతమ్.. శివాజీకి ఇచ్చాడు. దీన్ని తీసుకోలేకపోయిన శివాజీ.. 'కుళ్లు, కుట్ర, కుతంత్రం నుంచి విముక్తి పొందడం ఎలా?' అని పుస్తకాన్ని.. రిటర్న్‌లో గౌతమ్‌కి ఇచ్చాడు. దీంతో గొడవ మొదలైంది. ఇద్దరూ నీది తప్పంటే నీది తప్పు అని నామినేషన్స్‌లో వాదించుకున్నట్లు హోస్ట్ నాగార్జున ముందే గొడవపడ్డారు. అంతా విన్న నాగార్జున.. ఎప్పటిలానే శివాజీకి సపోర్ట్ చేశాడు. గౌతమ్దే తప్పన్నట్లు తీర్పు ఇచ్చాడు. ఫినాలే అస్త్ర గెలుచుకున్న కారణంగా అర్జున్.. ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి సేవ్ అయిపోయినట్లు నాగ్ ప్రకటించాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. అయితే శనివారం అంతా కూడా నవ్వుతూనే సీరియల్ బ్యాచ్ గురించి నాగార్జున నిజాలు చెప్పాడు. ఇలానే శివాజీ బిహేవియర్ గురించి కూడా నిజాలు చెబితే బాగుండేది అనిపించింది. (ఇదీ చదవండి: ఆ సమస్యతో బాధపడుతున్న అమర్.. లోపల ట్రీట్మెంట్ లేదు!) -
Bigg Boss 7: మాటలు జారిన అమర్.. ప్రియాంక తప్పు చేయకపోయినా సరే అలా!
బిగ్‌బాస్ ప్రస్తుత సీజన్లో ఫినాలేలో తొలి స్థానం కోసం మంచి పోటీ నడుస్తోంది. మంగళవారం ఓ మూడు గేమ్స్ జరగ్గా.. తాజాగా మరో రెండు గేమ్స్ జరిగాయి. ఇందులో SPY(శివాజీ, ప్రశాంత్, యావర్) బ్యాచ్‌కి షాక్ తగిలింది. మరోవైపు సీరియల్ బ్యాచ్ లో ప్రియాంకని ఒంటరి చేసేశారు. శోభా-అమర్ కలిసి ఈమెపై మానసికంగా దాడి చేశారు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో అసలేం జరిగిందనేది Day 87 హైలెైట్స్లో ఇప్పుడు చూద్దాం. ఓ దాంట్లో టాప్.. మరో దానిలో ఫెయిల్ సోమవారం మూడు గేమ్స్ జరగ్గా.. రెండింటిలో అర్జున్ విజయం సాధించాడు. తాజాగా బుధవారం పెట్టిన గేమ్స్‌లోనూ అర్జున్ చాలా స్మార్ట్‌గా వ్యవహరించాడు. 'టికెట్ టూ ఫినాలే' కోసం 'ఎత్తరా జెండా' అని పెట్టిన నాలుగో గేమ్‌లో ప్రశాంత్, యావర్ తొలి రెండు స్థానాల్లో నిలవగా.. అర్జున్ మూడో స్థానం సంపాదించాడు. ఇక 'గెస్ చేయ్ గురూ' అని పెట్టిన ఐదో గేమ్‌లో.. వినిపించే సౌండ్స్ బట్టి, అవేంటనేవి వరసగా పలకపై రాయాల్సి ఉంటుంది. ఇందులో అర్జున్ 31 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. ఇదే పోటీలో సరిగా ఆడని కారణం.. ప్రశాంత్, యావర్ మధ్యలో ఔట్ అయిపోయారు. అలా స్పై బ్యాచ్ ఎదురుదెబ్బ తగిలింది (ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!) ప్రియాంక పాయింట్స్ దానం ఇక ఐదు గేమ్స్ పూర్తయిన తర్వాత చివరి స్థానంలో ప్రియాంక ఉన్న కారణంగా.. 'టికెట్ టూ ఫినాలే' రేసు నుంచి ఆమెని బిగ్‌బాస్ తప్పించాడు. అయితే ఆమె దగ్గరున్న వాటిలో సగం పాయింట్స్ వేరొకరికి ఇచ్చేయాల్సి ఉంటుంది చెప్పగా.. 125 పాయింట్లని గౌతమ్‌కి ఇచ్చేసింది. దీంతో ఓవరాల్ పొజిషన్లో గౌతమ్... మూడో స్థానానికి చేరుకున్నాడు. అయితే ఆ పాయింట్లు తనకు ఇస్తుందనుకున్న అమర్.. ప్రియాంకపై అలిగాడు. మాటలు జారిన అమర్ ప్రియాంక ఎలిమినేట్ అయిపోయి, తన పాయింట్లు గౌతమ్‌కి ఇచ్చేయడాన్ని అమర్ తీసుకోలేకపోయాడు. ఆమె తప్పు చేసిందని అన్నాడు. అది తన గేమ్, తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని శోభా.. పరిస్థితి వివరించడానికి చూసింది. కానీ అమర్ తీసుకోలేకపోయాడు. కాసేపటి తర్వాత ప్రియాంకతో మాట్లాడుతూ.. నాకు ఇవ్వాలనిపించలేదా? అని అమర్.. డైరెక్ట్‌గా ఆమెనే అడిగాడు. ప్రియాంక, అమర్‌కి పరిస్థితి అర్థమయ్యేలా చెప్పడానికి చూస్తుంటే.. 'వెధవని అయిపోయింది నేనేగా' అని అమర్ మాట జారాడు. ఏం చెప్పాలనుకుంటున్నావ్, క్లియర్‌గా చెప్పి వెళ్లు అని ప్రియాంక.. తిరిగి మాట్లాడుతుండగానే అమర్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. (ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..) అమర్ ఇలా తయారయ్యాడేంటి? ప్రియాంకపై ఏది పడితే మాట్లాడేసిన అమర్.. 'అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, మన అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు' అని తనలో తానే ఏదేదో మాట్లాడేసుకున్నాడు. 'పిచ్చ నా కొడకా, ఇప్పుడైనా నీకు కళ్లు తెరుచుకుంటే బాగుపడతావ్' అని తనని తానే తిట్టుకున్నాడు. మరోచోట.. ప్రియాంక, గౌతమ్‌తో మాట్లాడుతూ.. వాళ్లకు వాళ్లకే గ్రాటిట్యూడ్ ఉంటుంది, మాకు ఉండదా అని శోభా-అమర్‌ని ఉద్దేశిస్తూ తన మనసులో మాట బయటపెట్టింది. ఇదంతా జరిగిన కాసేపటి తర్వాత అమర్ దగ్గరకొచ్చిన ప్రియాంక.. చేసిన దానికి క్షమాపణలు చెప్పింది. తప్పయిపోయింది, ప్లీజ్ క్షమించు అని బతిమాలాడుకుంది. అయినా సరే అమర్.. శాంతించలేదు. దీంతో మిగతా వాళ్లతో ఈ విషయం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక్కడ ఓ విషయం మాత్రం వింతగా అనిపించింది. ఎందుకంటే అమర్.. మరీ స్వార్థపరుడిలా ప్రవర్తించాడా అనే సందేహం వచ్చింది. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం ప్రియాంక ఏం చేయాలో కూడా అమరే డిసైడ్ చేస్తాడా? ఆమెకు స్వాతంత్రం లేదా అనిపించింది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: 'సలార్' స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. అదీ మ్యాటర్!) -
Bigg Boss 7: సీరియల్ బ్యాచ్ కొట్లాట.. చివరకొచ్చేసరికి ఇలా తయారయ్యేంట్రా!
బిగ్‌బాస్ గత సీజన్స్ మాటేమో గానీ ఈసారి మాత్రం బ్యాచ్‌ల గోల ఎక్కువైంది. అంతెందుకు రీసెంట్ వీకెండ్ ఎపిసోడ్లో స్వయంగా హోస్ట్ నాగార్జున ఒప్పుకొన్నాడు. చుక్క బ్యాచ్, ముక్క బ్యాచ్ అని చెప్పుకొచ్చాడు. ఇందులో శివాజీ ఆధ్వర్యంలోని ముక్క బ్యాచ్ బాగానే ఉంది. చుక్క బ్యాచ్ అధ్వానంగా తయారైంది. బయటవాళ్లతో కాదు వీళ్లలో వీళ్లే గొడవపడి ఆ తప్పు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంతకీ ఏం జరుగుతోంది? (ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!) ప్రస్తుత సీజన్లో సీరియల్ బ్యాచ్ సభ్యులైన అమర్, ప్రియాంక, శోభా.. ప్రారంభం నుంచి ఒక్కటిగా ఆడుతున్నారు. మరోవైపు శివాజీ, ప్రశాంత్, యావర్.. ఓ బ్యాచ్‌గా ఆడుతున్నారు. నామినేషన్స్ దగ్గర నుంచి గేమ్స్ వరకు పోటీ అంతా వీళ్ల మధ్య ఉంటోంది. శివాజీ బ్యాచ్‌తో పోలిస్తే సీరియల్ బ్యాచ్ కొన్ని విషయాల్లో బెటర్. కానీ ఇప్పుడు వీళ్లే తమ నిల్చున్న కొమ్మ తామే నరుక్కుంటున్నట్లు అనిపిస్తోంది. తాజాగా 'టికెట్ టూ ఫినాలే' కోసం పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శోభా, శివాజీ ఇప్పటికే తక్కువ పాయింట్లు సాధించిన కారణంగా గేమ్ నుంచి సైడ్ అయిపోయారు. అమర్, ప్రశాంత్, అర్జున్, గౌతమ్, యావర్, ప్రియాంక.. ఇలా దాదాపుగా అబ్బాయిలే ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక కూడా తక్కువ పాయింట్లు ఉన్న కారణంగా గేమ్ నుంచి సైడ్ అవ్వాలి. దీంతో ఆమె తన సగం పాయింట్లని వేరొకరికి ఇవ్వాలని చెప్పగా, గౌతమ్‌కి ఇచ్చేసింది. (ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..) 12వ వారం ప్రియాంక కెప్టెన్ కావడానికి గౌతమ్ సాయం చేశాడు. ఇప్పుడు పాయింట్స్ ఇచ్చి అతడి రుణం తీర్చుకుంది. అయితే పాయింట్స్ ఇవ్వడానికి తాను కనిపించలేదా అని అమర్ హర్ట్ అయిపోయారు. దీంతో శోభా-అమర్ ఒక్కటైపోయారు. ప్రియాంకని వేరు చేసి చూస్తున్నారు. ఇన్నాళ్లు ఒక్కటిగా ఉంటూ వచ్చిన సీరియల్ బ్యాచ్.. శివాజీని అన్ని విషయాల్లోనూ ఎదుర్కొంటూ వచ్చారు. ఇప్పుడు చివరకొచ్చేసరికి వీళ్లలో వీళ్లు కొట్లాడుకుని.. శివాజీ బ్యాచ్ కి హెల్ప్ అయ్యేలా ఉన్నారనిపిస్తుంది. ఒకవేళ ఇలానే జరిగితే మాత్రం.. తెలియకుండానే శివాజీ బ్యాచ్ కి హెల్ప్ చేసినట్లు అవుతుంది. గేమ్‌లో ఉన్న ఆ కాస్త మజా కూడా పోవడం గ్యారంటీ. అయితే ఈ గొడవలో ప్రియాంక కాస్త ఆలోచనతో వ్యవహరించినట్లు అనిపించింది. అమర్ మాత్రం ప్రతిదానికి అలుగుతూ తనపై ఉన్న సింపతీని కాస్త నెగిటివిటీ చేసుకునేలా కనిపిస్తున్నాడు. మరోవైపు అతడికి సపోర్ట్ చేస్తున్న శోభా కూడా తెలియకుండానే మరింత నెగిటివీ తెచ్చుకుంటోందనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు) -
Bigg Boss 7: శివాజీ తెలివిలేని పని.. ప్రియాంక ప్రాణం మీదకొచ్చింది!
బిగ్‌బాస్ 7వ సీజన్లో శివాజీ ఉన్నాడంటే ఉన్నాడంతే. ఓ టాస్క్ సరిగా ఆడలేడు, గేమ్‌లో గెలవలేడు. పోనీ సంచాలక్ బాధ్యత అయినా సరిగా చేశాడా? అంటే అది లేదు. తాజాగా శివాజీ పెట్టిన నిర్ణయం.. ప్రియాంక ప్రాణాల మీదకు తెచ్చింది. మరోవైపు 'టికెట్ టూ ఫినాలే' కోసం ఆల్రెడీ పోటీ మొదలైంది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 86 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. శివాజీ సోది ముచ్చట నామినేషన్స్ పూర్తవడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే అర్జున్, గౌతమ్ తనని నామినేట్ చేయడాన్ని శివాజీ తీసుకోలేకపోయాడు. పొద్దుపొద్దునే ప్రశాంత్‌తో మాట్లాడుతూ.. మొన్నే వెళ్లిపోవాల్సిందిరా, ఎందుకురా ఈ మెంటల్ టార్చర్ అని గౌతమ్‌ని ఉద్దేశించి అన్నాడు. అలానే తన విషయంలో అర్జున్‌ది 100 శాతం పిచ్చి స్ట్రాటజీ అని, నన్ను పంపించేయండ్రా బాబు అని మాట్లాడాడు. ఇది జరిగిన కాసేపటి తర్వాత ప్రియాంకతోనూ మాట్లాడుతూ.. వెళ్లిపోయినా బాగుండేది, పిల్లలు బాగా గుర్తొస్తున్నారని శివాజీ చెప్పుకొచ్చాడు. అయితే ఇవన్నీ కూడా సోది ముచ్చట్లలానే అనిపించాయి. టికెట్ టూ ఫినాలే షురూ 13వ వారం వచ్చేసింది. అంటే ఫినాలే జరగడానికి రెండు వారాలు కూడా లేదు. దీంతో బిగ్‌బాస్.. తన గేమ్ షురూ చేశాడు. 'టికెట్ టూ ఫినాలే' మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా పలు గేమ్స్ పెడతారని, వీటన్నింటిలో గెలిచి ఎక్కువ పాయింట్స్ సంపాదించిన హౌస్‌మేట్.. ఇకపై కేవలం ఇంటి సభ్యునిగా ఉండకుండా నేరుగా ఫినాలే వారానికి చేరుకుంటారు. మొట్టమొదటి ఫైనలిస్ట్ అవుతారని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చేశాడు. అర్జున్ దూకుడు.. అమర్ అదృష్టం 'టిక్ టాక్ టిక్' అని తొలి గేమ్‌లో భాగంగా.. బాణం వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఆ బాణం టచ్ అయితే ఔట్ అయినట్లు కాదు, ఫ్లాట్ ఫామ్ పైనుంచి కింద పడితే ఔట్ అయినట్లు అని బిగ్‌బాస్ తొలుత చెప్పాడు. కాసేపటి తర్వాత బాణానికి కాలు తగిలినా సరే ఫౌల్(ఔట్) అని ట్విస్ట్ ఇచ్చాడు. ఇందులో ప్రశాంత్, గౌతమ్, శోభా, శివాజీ, యావర్, అమర్, ప్రియాంక వరసగా ఎలిమినేట్ అయిపోయారు. చివరగా మిగిలిన అర్జున్ విజేతగా నిలిచాడు. పూలని సేకరించే రెండో టాస్క్‌లో తక్కువ పూలు ఉన్న కారణంగా శివాజీ, ప్రియాంక ఎలిమినేట్ అయిపోయారు. ఇలా రెండు గేమ్స్‌తో మొదటి లెవల్ పూర్తయింది. పాయింట్ల ప్రకారం చివర్లో ఉన్న శివాజీ, శోభా ఎలిమినేట్ అయిపోయారు. వాళ్లు పాయింట్స్ వేరొకరికి ఇవ్వాలని చెప్పగా.. అమర్‌కి ఇచ్చేశారు. అలా మనోడికి లక్ కలిసొచ్చింది. తలతిక్క సంచాలక్స్.. గేమ్ డిస్ట్రబ్ ఇక చివరగా 'గాలం వేయ్ బుట్టలో పడేయ్' అనే టాస్క్ పెట్టారు. దీనికి శివాజీ, శోభా సంచాలక్స్గా వ్యవహరించారు. అయితే రింగ్‌తో బంతిని బయటకు లాగిన తర్వాత ఎవరైనా సరే దాన్ని తీసేసుకోవచ్చని ఓ పిచ్చి రూల్ పెట్టారు. ఈ పోటీ అర్జున్.. బంతిని ఫస్ట్ ఫస్ట్ లాగేసి ఎక్కువ పాయింట్స్ సంపాదించాడు. అయితే ప్రియాంక మూడుసార్లు బంతిని బయటకు లాగినప్పటికీ ప్రశాంత్, యావర్, అమర్.. ఈమె దగ్గర నుంచి లాగేసుకున్నారు. చివర్లో అమర్ అయితే ఈమెని ఎలా పడితే అలా లాగేశాడు. బయటకు చెప్పలేదు గానీ ప్రియాంకకు దెబ్బలు గట్టిగానే తగిలినట్లు అనిపించాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. శివాజీకి గ్రూప్ గేమ్స్ అంటే ప్రశాంత్-యావర్ తో ఏదే మేనేజ్ చేసి ఆడేస్తాడు. కానీ ఒంటరిగా ఆడాలనేసరికి దొరికిపోయాడు. తాజాగా రెండు గేమ్స్ లోనూ ఓడిపోయి.. టికెట్ టూ ఫినాలే రేస్ నుంచి తప్పించారు. పోనీ అది కాదని సంచాలక్ బాధ్యతలు ఇస్తే, అందులోనూ ఎక్కడలేని పిచ్చి రూల్స్ అన్ని పెట్టి.. ప్రియాంక విజయావకాశాల్ని దెబ్బతీసేశాడు చేశాడు. 13వ వారంలో శివాజీ తీరు వల్ల అతడొక్కడే కాదు.. మొత్తం గేమ్ తీరే దెబ్బతింటోంది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. -
ఆ ఒక్కరు తప్ప అందరూ నామినేషన్స్‌లో, ఎవరెవరంటే?
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో ఎనిమిది మంది మిగిలారు. వీరిలో ఎవరు టాప్ 5కి చేరతారు? ఎవరు ఫినాలేలో అడుగుపెట్టకుండానే తిరిగి వెళ్లిపోతారు? అనేది ఆసక్తికరంగా మారింది. నిన్న డబుల్ ఎలిమినేషన్‌తో అశ్విని, రతిక ఇద్దరినీ పంపించేశారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడే ఛాన్స్ ఉన్నప్పటికీ రైతుబిడ్డ ఎవరికీ ఇవ్వడానికి మొగ్గుచూపలేదు. దీంతొ ఇద్దరమ్మాయిలు వెళ్లిపోయారు. తాజాగా మరో ఒకర్ని ఇంటికి పంపించేందుకు నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. నామినేట్ చేయాలనుకునే ఇద్దరి ముఖంపై పెయింట్ వేయాలని చెప్పాడు. ప్రియాంక మాట్లాడుతూ.. మీరు నా గేమ్ చూసి చాలాసార్లు ప్రోత్సహించారు. దానికన్నా ఎక్కువ నాపై నెగెటివిటీ పెట్టుకున్నారు. నన్ను నెగెటివ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు అంటూ శివాజీని నామినేట్ చేసింది. అర్జున్, గౌతమ్ సైతం అతడిని నామినేట్ చేశారు. ఇక సోఫాజీని నామినేట్ చేసినందుకో ఏమో కానీ ప్రిన్స్ యావర్, ప్రశాంత్.. సీరియల్ బ్యాచ్‌ను నామినేట్ చేశారు. కానీ అమర్‌ను మాత్రం ఎవరూ నామినేట్ చేయకపోవడం విశేషం. దీంతో ఈ వారం అమర్ మినహా మిగతా ఏడుగురూ నామినేషన్లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎవర్ని ఏ కారణాలతో నామినేట్ చేశారు? టికెట్ టు ఫినాలే దక్కించుకునేదెవరు? అనేది రానున్న ఎపిసోడ్స్‌లో తెలియనుంది. చదవండి: తెలుగులో స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్.. కానీ అలా చేశారు -
ముసలి వెంట్రుక ఎంతపని చేసింది? వంకరబుద్ధి పోనిచ్చుకోని శివాజీ!
బిగ్‌బాస్ హౌస్‌లో బీబీ మ్యాన్షన్ టాస్క్ జరుగుతోంది. బిగ్‌బాస్ భార్య హత్య జరిగిందని, చంపిందెరో కనుక్కోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ హత్య కేసును ఛేదించే బాధ్యతను పోలీస్ ఇన్వెస్టిగేటర్లయిన అమర్, అర్జున్‌లకు అప్పగించాడు. దీంతో హౌస్‌లో ఉన్న అందరినీ విచారిస్తున్నారు. మరి వీరు హంతకులను పట్టుకున్నారా? లేదా? అనేది తాజా (నవంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.. అమర్ మీద అదేపనిగా అక్కసు.. శివాజీ టాస్క్‌లో కూడా అమర్ మీద అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నాడు. పోలీస్ గెటప్‌లో ఉన్న అమర్‌ను 420, జామకాయలు అమ్ముకునేవాడివి, వీడికెవడ్రా పోలీస్ డ్రెస్ ఇచ్చింది అంటూ హేళన చేస్తూ మాట్లాడాడు. అమర్ మాత్రం ఎంతో సహనంతో అతడికి గౌరవమిచ్చి మాట్లాడటం విశేషం. ఇక అర్జున్.. ప్రశాంత్‌ను ఎవరు చంపారో తెలుసుకుంటే హౌస్‌లో జరుగుతున్న హత్యలకు కారకుడిని పట్టుకున్నట్లే అన్నాడు. దీంతో అమర్.. శివాజీనే అని చెప్పాడు. ఆయన అందరినీ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు అసలు గుట్టు బయటపెట్టాడు. హంతకుడిని పట్టించిన ముసలి వెంట్రుక ఇంతలో శివాజీకి మరో మర్డర్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో భాగంగా అద్దంపై క్రైయింగ్ బేబి అశ్విని గెటౌట్ అని రాయడంతో ఆమె చనిపోయి దెయ్యంగా మారింది. అయితే శివాజీ మీద రతిక అనుమానపడటంతో.. ఏయ్ పిచ్చా, ఏం చేస్తున్నవ్.. అని అరిచి కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అద్దం మీద ఏ పేస్ట్‌తో శివాజీ రాశాడో దాన్ని వెతికి తీసుకొస్తాడు అమర్. దానికి ఒక వెంట్రుక అంటుకుని ఉంటుంది. అది ముసలి వెంట్రుకలా ఉంది, తెల్లబడింది అని శివాజీపై అనుమాం వ్యక్తం చేస్తారు. హంతకుడు శివాజీనే అని శోభా, గౌతమ్, ప్రియాంకలు కూడా ఫిక్సయిపోతారు. ఫెయిలైన శివాజీ అనంతరం గౌతమ్‌ను చంపాలని టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఐయామ్ డెడ్ అని ఉన్న స్టిక్కర్ గౌతమ్‌కు అంటించాలన్నాడు. అయితే శివాజీయే ఇదంతా చేస్తున్నాడని మరోసారి పసిగట్టేశాడు అమర్. కానీ శివాజీ ఆ స్టిక్కర్‌ను గౌతమ్‌ను అంటించకపోవడంతో ఈ సీక్రెట్ టాస్క్‌లో ఫెయిలయ్యాడు. అలా ఆ టాస్క్ ప్రియాంకకు బదిలీ అయింది. ఎంతో అలవోకగా టాస్క్ పూర్తి చేసింది ప్రియాంక. ఇన్వెస్టిగేటర్లు మొదట రతికపై అనుమానంతో ఆమెను జైల్లో వేశారు. తర్వాత శివాజీపై అనుమానం బలపడటంతో రతికను వదిలేసి అతడిని జైల్లో బంధించారు. మరి హంతకుడు ఇతడేనని ఈసారైనా గట్టి నిర్ణయంతో ఉంటారా? మళ్లీ అతడిని వదిలేస్తారా? అనేది చూడాలి! చదవండి: ఓటీటీలో హిట్ సినిమాలు, హారర్ సిరీస్.. ఏవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే? -
అప్పుడు అమర్ చేసిందే ఇప్పుడు గౌతమ్ చేశాడు.. తప్పేముంది?
బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్‌లో జరిగిన రభస మామూలుగా లేదు. ఒక్కొక్కరు వీర లెవల్లో పోరాడారు. చివర్లో అమర్, ప్రియాంక ఇద్దరూ మిగలగా అంతిమంగా ప్రియాంక కెప్టెన్సీ సాధించింది. అందుకు గౌతమ్ కృష్ణ ఎంతగానో సాయపడ్డాడు. గేమ్‌లో కూడా అందరిముందే ప్రియాంకకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి మరీ ఆడాడు. కానీ అమర్.. తనను అందరూ టార్గెట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఎమోషనల్ అయిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ప్రవర్తన కొంతమందికి చికాకు తెప్పించగా ఎక్కువమందికి బాధ కలిగించింది. చేసిన సాయం అప్పుడే మర్చిపోయిన రతిక అయితే అమర్ బాధకు ప్రధాన కారణం గౌతమ్ కాదు రతిక. గతవారం జరిగిన బేబీ టాస్క్‌లో అమర్‌ను తనకోసం ఆగిపోమని వేడుకుంది. ఈ వారం తనకు చాలా అవసరమంటూ, తనను నిరూపించుకునే అవకాశం ఇవ్వమని బతిమాలుకుంది. దీంతో ఆమె కోసం వెనకడుగు వేశాడు. ఆమెను గెలిపించి తాను ఓడిపోయాడు. అందుకు కనీసం కృతజ్ఞత చూపించకుండా రతిక నిన్నటి బ్రిస్క్ టాస్కులో అమర్‌ను టార్గెట్ చేసింది. అతడిని ఓడించేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ప్రియాంక కోసం ఆడటం తప్పా? అటు గౌతమ్ కూడా అమర్ అమర్చిన బ్రిస్క్ మీదకు బాల్స్ విసిరాడు. అందుకు కారణం.. అతడి మీద ఏదో పగ, ప్రతీకారాలు ఉన్నాయని కాదు. తన చెల్లిగా భావించిన ప్రియాంక గెలవాలని తాపత్రయపడ్డాడు. ఆమె కెప్టెన్ అవడం కోసం అమర్‌ను ఆటలో నుంచి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అందరి ముందే ప్రియాంకకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి మరీ గేమ్ ఆడాడు! కానీ చాలామంది దీన్ని తప్పుపడుతున్నారు. అమర్ అంత ఏడుస్తుంటే జాలి చూపించట్లేదు అని ఫీలవుతున్నారు. అతడు బాధపడుతున్నాడని అప్పటికప్పుడు ప్రియాంకను ఓడించాలని ఎందుకనుకుంటాడు? తన చెల్లిని గెలిపించాలనుకున్నాడు, అదే చేశాడు. శోభ కోసం అమర్.. ప్రియాంక కోసం గౌతమ్ నిజానికి గతంలో కెప్టెన్సీ టాస్క్‌లో శోభా కోసం అమర్ వీరోచిత పోరాటం చేసి ఆమెను గెలిపించాడు. అప్పుడు అమర్‌ను ఆకాశానికెత్తేశారు. ఇప్పుడు ప్రియాంక కోసం పోరాడిన గౌతమ్‌ను మాత్రం నిందిస్తున్నారు. ఒకానొక సమయంలో డాక్టర్ బాబు ఎలిమినేట్ అవ్వాలని అతడికి వ్యతిరేకంగా ఓట్ వేశాడు అమర్. అలాంటప్పుడు గౌతమ్.. అమర్‌కు సపోర్ట్ చేయకపోవడంలో తప్పేముంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చదవండి: అల్లాడిపోతున్నాడంటూ అతడికి స్టేజీపై ముద్దు పెట్టిన స్టార్ హీరో, వీడియో వైరల్ -
Bigg Boss 7: అమర్దీప్ది ఓవరాక్షనా? నిజమైనా ఎమోషనా?
బిగ్‌బాస్ గేమ్ ఈ రోజు ఎందుకో చాలా అంటే చాలా ఆసక్తిగా అనిపించింది. బహుశా శివాజీ గ్యాంగ్ లేకపోవడం వల్ల కావచ్చు. అలానే అమర్దీప్ అయితే హౌస్ అంతా గాయిగత్తర చేశాడు. పిచ్చిపట్టిన వాడిలా అరుస్తూ బీభత్సం సృష్టించాడు. మరోవైపు ప్రియాంకని చూస్తే నిజంగా హేట్సాఫ్ అనిపించింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది Day 75 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. శివాజీ బ్లాక్మెయిల్ ఎవిక్షన్ పాస్ చివరి రౌండ్లో నిర్ణయం తీసుకునే దగ్గర గురువారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. శోభా తన అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే.. శివాజీ తన వాళ్లకు రాకపోతే బాగోదు అన్నంత రేంజులో బ్లాక్మెయిల్ చేశాడు. సంచాలక్స్ ఒక్క మాట అనుకుని యావర్.. ఎవిక్షన్ పాస్ విజేత అని ప్రకటించడంతో శివాజీ చల్లబడ్డాడు. మంచి డెసిషన్ తీసుకున్నారని పుడింగిలా పనికిమాలిన కామెంట్ చేశాడు. దీంతో శోభా ట్రిగ్గర్ అయిపోయింది. నియమాల ప్రకారం అన్నప్పుడు ఒకవేళ నేను గానీ, ప్రశాంత్ గానీ తప్పు నిర్ణయం తీసుకుంటే.. పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉంటానని శోభాశెట్టి చెప్పింది. దీంతో శివాజీ అతి చేశాడు. నువ్వు సంచాలక్‌గా ఉన్న ప్రతిసారీ 90 శాతం వాదనలు, గొడవలు, డిస్కషన్, మనస్పర్థలు జరిగాయి కాబట్టే నేను చెబుతున్నానని శివాజీ అన్నాడు. మూడుసార్లు సంచాలక్‌గా ఇబ్బందిపడ్డావ్ శోభా, ఇది నిజం, అందుకే నేను నిన్ను అలెర్ట్ చేశానని శివాజీ నీతికబర్లు చెప్పాడు. ఇక్కడంతా గమనిస్తే శోభాదే తప్పు అని తను అనుకునేలా శివాజీ బ్లాక్మెయిల్ చేశాడనిపించింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) ప్లేటు తిప్పేసిన శివాజీ ఇక యావర్ ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. దీంతో దాన్ని నచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే శోభాతో అంతా గొడవపడ్డ శివాజీ.. మళ్లీ ప్లేట్ తిప్పేశాడు. నేను గెలవలేదని ఫైట్ చేశానని అనుకున్నారా మీరేమైనా అని శోభానే శివాజీ నైస్‌గా అడిగాడు. అరిచినప్పుడేమో అరిచేసి, ఇప్పుడేమో నంగనాచిలా మాటలు చెప్పి శోభాని ఏమార్చడానికి శివాజీ ట్రై చేశాడు. నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని నేను ఫైట్ చేశానని నీతికబుర్లు చెప్పాడు. దీంతో నా అనుకున్న ఫ్రెండ్స్ అందరూ బాల్కానీలో తనని వదిలేసి మీటింగ్ పెట్టిరని, తాను అందరికీ శత్రువు అయిపోయానని శోభా తెగ బాధపడిపోయింది. ప్రియాంక నువ్వు సూపర్ ఎవిక్షన్ పాస్ తంతు పూర్తయిన తర్వాత కొత్త కెప్టెన్ కోసం రెండు లెవల్స్‌లో టాస్కులు జరుగుతాయని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. ఇందులో అందరూ పోటీదారులే అని అన్నాడు. తొలుత ఇటుకులు తెచ్చే టాస్క్ పెట్టగా అందరూ చాలా పోటీపోటీగా గేమ్ ఆడారు. కాకపోతే ప్రతి దశలోనూ తక్కువ ఇటుకులు తెచ్చిన కారణంగా రతిక, గౌతమ్, అశ్విని, శోభాశెట్టి వరసగా ఎలిమినేట్ అయ్యారు. వీళ్లందరూ గేమ్ ఎలా ఆడాలో తెలియక, కిందపడిపోయి, అరుస్తూ ఆటపై సరిగా కాన్సట్రేషన్ చేయలేకపోయారు. అమ్మాయిల్లో ప్రియాంక ఒక్కతే సైలెంట్ గా తనపని తాను చేసుకుని నెక్స్ట్ రౌండ్‌కి అర్హత సాధించింది. ఈమెతో పాటు అమర్, ప్రశాంత్, అర్జున్.. ఫైనల్ టాప్-4కి క్వాలిఫై అయ్యారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) అమర్ పిచ్చిపట్టినట్లు ప్రవర్తన ఈ గేమ్ లో భాగంగా నలుగురు పోటీదారులు ఇటుకులతో టవర్ కట్టాలి. బజర్ మోగిన తర్వాత మిగిలిన వాళ్లు వాటిని పడగొట్టడానికి ట్రై చేయాలి. ఇందులో ప్రశాంత్, అర్జున్ వరసగా ఔట్ అయిపోయారు. చివరకు అమర్, ప్రియాంక మిగలగా.. అమ్మాయి అయిన ప్రియాంక చాలా చక్కగా అస్సలు సౌండ్ చేయకుండా గేమ్ ఫినిష్ చేసింది. అమర్ మాత్రం కెప్టెన్సీ కోసం రెచ్చిపోయాడు. అరుస్తూ, ఏడుస్తూ, భయపెడుతూ స్ట్రాటజీలన్నీ ఉపయోగించాడు కానీ వర్కౌట్ కాలేదు. ప్రియాంక గెలిచింది. దీంతో కిందపడి కొట్టేసుకున్నాడు. అయితే అది కోపంతో వచ్చిన బాధే కానీ ఎవరిపై కోపం ఏం లేదని అమర్ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ప్రియాంక-అమర్ మనస్పర్థలు అయితే తాను కెప్టెన్ అయినట్లు కలగన్నాను కానీ తాను ఏది అనుకుంటే అది జరగదని అమర్దీప్ తెగ బాధపడిపోయాడు. అమర్ దగ్గరకొచ్చిన ప్రియాంక.. నువ్వు గెలిస్తే నేను అంతే సంతోషపడుతున్నాను, కానీ నీ దగ్గర నుంచి మాత్రం అలాంటి రెస్పాన్ రావట్లేదని అమరదీప్తో ఖరాఖండీగా చెప్పేసింది. దీంతో ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య మనస్పర్థలు బయటపడ్డాయి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియాంక దగ్గర నుంచి అమర్ ఎలా ఆడాలో తెలుసుకోవాలి. కానీ మనోడు అది చేయకుండా ఏడుస్తూ కనిపించాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా రివ్యూ) -
బిగ్ బాస్ టాప్-5 ఎవరంటే..? ఫైనల్ లిస్ట్ ఇదేనా..?
బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ చాలా గ్రాండ్, కలర్ఫుల్గా సాగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. అలానే దీపావళి పండగ సెలబ్రేషన్స్ జరిగాయి. 11 మంది కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులు స్టేజీపైకి వచ్చి టాప్-5 ఎవరో కూడా చెప్పుకొచ్చారు. ఈసారి టాప్- 5లో శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక, గౌతమ్ ఉంటారని.. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా అభిప్రాయపడ్డారు. అమ్మాయిలలో ప్రియాంక మాత్రమే టాప్ ఫైవ్ రేసులో ఉంది. ► మొదట అమర్ దీప్ కోసం ఆయన అమ్మగారు వచ్చారు.. అమర్ స్నేహితుడు అయిన మానస్ కూడా స్టేజీపైన కనిపించాడు. వారి ప్రకారం టాప్ ఫైవ్ మెంబర్స్ ఎవరు అనేది తేల్చేశారు. ► భోలే షావలి కోసం ఆయన స్నేహితులు వచ్చారు. వారిలో బిగ్ బాస్ వల్ల గుర్తింపు తెచ్చుకున్న నటుడు సయ్యద్ సోహెల్ ఉన్నాడు. మరో ఫ్రెండ్ మదీన్ వచ్చాడు. ► అశ్విని కోసం ఆమె తండ్రి శ్రీనివాస్, వారి కుటుంబ స్నేహితుడు తేజ వచ్చాడు. వారి ప్రకారం టాప్ ఫైవ్‌లో ఉండేది వీళ్లే.. ► అర్జున్ కోసం ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు వచ్చాడు.. ఆయన ప్రకారం టాప్ ఫైవ్ ఉండేది వీళ్లే.. ► గౌతమ్ కుటుంబ స్నేహితుల ప్రకారం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీరే.. ► పల్లవి ప్రశాంత్ కోసం ఆయన అమ్మగారితో పాటు సోదరి కూడా వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్‌లో ఉండేది వీళ్లే.. ► ప్రియాంక జైన్ కోసం ఆమె అమ్మగారితో పాటు ప్రముఖ నటి ప్రగతి కూడా వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ వీళ్లే ► రతికా రోజు కోసం ఆమె అమ్మగారితో పాటు యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ భాను వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ ► శోభ కుటుంబ సభ్యుల ప్రకారం టాప్ ఫైవ్‌లో ఉండేది వీళ్లే.. ► శివాజీ కోసం ఆయన సతీమణితో పాటు వారి కుమారుడు రిక్కీ వచ్చాడు.. వారి ప్రకారం టాప్ ఫైవ్ ► యావర్ కోసం ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ లిస్ట్ ఇదే -
హగ్గులు-కిస్సులతో ఊపిరాడనివ్వలేదు.. ఆ ఇద్దరి గురించి ప్రియాంకకు వార్నింగ్!
బిగ్‌బాస్ షో మిగతా రోజులు ఎలా ఉన్నాగానీ 'ఫ్యామిలీ వీక్' ఉన్నప్పుడు మాత్రం అందరినీ ఒక్కటి చేస్తుంది. ప్రస్తుతం ఏడో సీజన్లో అదే నడుస్తోంది. మంగళవారం ఎపిసోడ్లో అర్జున్ భార్య, శివాజీ కొడుకు, అశ్విని తల్లి వచ్చి ఎమోషనల్ చేశారు. ఇప్పుడు మరో ముగ్గురి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి నవ్వించారు, ఏడిపించారు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 66 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. అమ్మ ప్రేమలో గౌతమ్ అశ్విని తల్లి వచ్చి వెళ్లడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం నిద్రలేవడంతో బుధవారం ఎపిసోడ్ మొదలైంది. కాసేపటి తర్వాత గౌతమ్ తల్లి.. పంచెని హౌసులోకి పంపింది. కానీ గౌతమ్.. అది తన కోసమే అని గుర్తుపట్టలేకపోయాడు. కొంతసేపటి తర్వాత 'కన్నయ్యా' అనే పిలుపుతో అమ్మ ఎక్కడుందా అని హౌస్ అంతా తిరిగేశాడు. హౌసులోకి రాగానే ఆమెని పట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. అందరినీ పలకరించిన తర్వాత కొడుకుతో చాలా మాట్లాడింది. (ఇదీ చదవండి: రష్మిక ఫేక్ వీడియో.. విజయ్ దేవరకొండ పోస్ట్ వైరల్!) 'సూపర్ ఆడుతున్నావ్.. కరెక్ట్ గానే ఆడుతున్నావ్.. కానీ అక్కడక్కడా ఆలోచిస్తున్నావ్.. మాటలు కొంచెం రాకుండా చూడు.. ఏదైనా పాయింట్ అనుకుంటే దాన్నే స్ట్రాంగ్‌గా పట్టుకో, వివరణ వద్దు.. ఎక్సప్లెనేషన్ వల్ల డీవియేషన్ వస్తుంది. ఏమైద్దో అని భయం వద్దు, అమ్మ ఎప్పుడు అండగా ఉంటుంది' అని గౌతమ్ కి అతడి తల్లి ధైర్యం నింపింది. అమ్మని అందరూ మిస్ అవుతున్నారు కదా అని హౌసులోని ప్రతిఒక్కరికీ గౌతమ్ తల్లి గోరుముద్దలు తినిపించింది. ఈ సీన్ చూడటానికి చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. ఆ తర్వాత.. 'అమ్మ.. అమ్మ..' అనే పాట ప్లే చేయగా.. గౌతమ్, తల్లితో కలిసి డ్యాన్స్ చేశాడు. అయితే ఈ పాట ప్లే అవుతున్నంతసేపు శోభా, యవర్.. తల్లి గుర్తొచ్చి ఎమోషనల్ అయ్యారు. ఈ పాట వల్లో, తల్లి అనే ఎమోషనల్ వల్లనో ఏమో గానీ చూస్తున్న మీరు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం గ్యారంటీ. హగ్స్-ముద్దులతో ప్రియాంక గౌతమ్ తల్లి వెళ్లిపోయిన తర్వాత కాసేపటికి ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ శివ కుమార్ వచ్చాడు. రోజా ఫ్లవర్ తీసుకొచ్చి, మోకాళ్లపై వంగి మరీ ప్రియాంకకు ప్రపోజ్ చేశాడు. హగ్గులు, నుదుటిపై ముద్దులతో రెచ్చిపోయాడు. దీంతో పక్కనే ఉన్న అర్జున్.. ఏమైనా అడ్డుపెట్టాలా? అని చిన్నగా సెటైర్ వేశాడు. కాకపోతే ఈ కామెంట్ ని పట్టించుకునేంత మూడ్‌లో ఈ ప్రేమజంట లేదు. ఇన్నాళ్ల విరహవేదన వల్లో ఏమో గానీ ఒకరికి ఒకరు అతుక్కుపోయారు. కాస్త గ్యాప్ ఇచ్చి హౌస్మేట్స్ అందరిని ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ తెగ పొగిడేశాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'టైగర్ నాగేశ్వరరావు'.. అనుకున్న టైమ్ కంటే ముందే?) హౌసులో గొడవ జరిగితే అప్పుడు దాన్ని తెగే దాకా లాగడం నచ్చట్లేదని, ఆ విషయం కాస్త చూసుకోమని ప్రియాంకకు ఆమె బాయ్‌ఫ్రెండ్ సలహా ఇచ్చాడు. ఫ్రెండ్స్, బెస్ట్‌ఫ్రెండ్స్ ఎవరు అవసరమే లేదు నీకు అని.. అమరదీప్, శోభా గురించే ఇన్ డైరెక్ట్‌గా చెప్పాడు. కిచెన్ లోనే ఉండిపోతున్నావ్, బయటకు రా అని కూడా చెప్పాడు. 'బయటకొచ్చాక నాతో గొడవ పడతావా?' అని ప్రియాంక గోముగా అడిగేసరికి.. బాయ్‌ఫ్రెండ్ ఐస్ అయిపోయాడు. నువ్వు ఏం చెబుతావో అదే వింటానని అనేశాడు. మరి పెళ్లెప్పుడు అని ప్రియాంక అతడిని అడగ్గా.. బయటకొచ్చాక చేసుకుందాం అన్నాడు. ఇప్పుడే చేసుకుందామని ప్రియాంక.. తన విరహావేదనని అంతా బయటపెట్టేసింది. వెళ్తూ వెళ్తూ కూడా కొంతమందితో మాత్రం చూసుకుని ఉండు అని.. శోభా, అమర్ గురించి ప్రియాంక బాయ్‌ఫ్రెండ్ చెప్పాడు. ఆ తర్వాత భోలె భార్య కూడా వచ్చింది. కాకపోతే యోగ క్షేమాలు మాట్లాడి హౌస్ నుంచి బయటకెళ్లిపోయింది. ఇకపోతే ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ అంటే మాత్రం ప్రియాంక-ఆమె బాయ్‌ఫ్రెండ్‌దే. గౌతమ్ తల్లి ఎమోషన్‌తో అందరితో కన్నీళ్లు పెట్టిస్తే.. ప్రియాంక ప్రియుడు మాత్రం హౌస్ మొత్తాన్ని రొమాంటిక్‌గా మార్చేశాడు. ఇక ప్రియాంక-బాయ్‌ఫ్రెండ్ పెళ్లి డిస్కషన్ చూసిన తర్వాత.. హౌస్ నుంచి బయటకెళ్లగానే ప్రియాంక పెళ్లి చేసుకోవడం గ్యారంటీ అని క్లారిటీ వచ్చేసింది. అలా బుధవారం ఎపిసోడ్ పూర్తయింది. మరి గురువారం ఎపిసోడ్లో ఎలాంటి ఎమోషన్స్ బయటకొస్తాయో తెలియాలంటే వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: భూటాన్‌లో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న సమంత) -
బిగ్ బాస్ హౌస్‌లో లవ్ బర్డ్స్.. ఇక్కడే పెళ్లి చేసుకుందామన్న ప్రియాంక!
బిగ్ బాస్ హౌస్‌లో రోజు రోజుకు మరింత ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటి వరకు నామినేషన్స్, గేమ్ టాస్కులతో బిజీగా ఉండే కంటెస్టెంట్స్ ఈ వారంలో కంటతడి పెట్టిస్తున్నారు. ఎప్పుడు హాట్ హాట్‌గా సాగే బిగ్ బాస్ హౌస్.. ఇప్పుడు ఫుల్ ఎమోషనల్‌గా మారింది. మంగళవారం ఒక్క రోజే ముగ్గురు కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను హౌస్‌కు రప్పించి సర్ప్రైజ్ ఇచ్చారు. శివాజీ, అంబటి అర్జున్, అశ్వినికి ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు ఇంట్లోకి ప్రవేశించారు. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు రిలీజ్ కాగా.. సేమ్ సీన్ రిపీట్ అయింది. (ఇది చదవండి: మరోసారి తెరపైకి స్టార్ కపుల్ విడాకుల రూమర్స్.. అసలేం జరుగుతోంది!) రెండో రోజు కూడా హౌస్‌ను ఫుల్ ఎమోషనల్‌గా మార్చేశారు. తాజాగా రిలీజైన ప్రోమోలో ప్రియాంక జైన్ ప్రియుడిని హౌస్‌లో తీసుకొచ్చారు బిగ్ బాస్. హౌస్‌లో అడుగుపెట్టిన మౌనరాగం సీరియల్ ఫేమ్ శివకుమార్ తన ప్రియురాలికి గులాబీ పువ్వుతో మరోసారి ప్రపోజ్ చేశారు. దీంతో చాలా రోజుల తర్వాత ప్రియుడిని చూసిన ప్రియాంక తన ప్రేమతో అతన్ని కౌగిలించుకుంది. ఆ తర్వాత ఎలా ఉన్నావ్ అంటూ.. తన ప్రియుడిని అడిగింది. నేను ఇలా ఉన్నా అనడంతో.. ఒకరినొకరు చాలా మిస్సవుతున్నామంటూ ఎమోషనలయ్యారు. శివతో మాట్లాడుతూ..'మరీ పెళ్లెప్పుడు అని ప్రియాంక ప్రేమగా అడగడంతో.. నువ్వు బయటకొచ్చిన వెంటనే చేసుకుందాం అన్నాడు. కాదు.. ఇప్పుడే చేసుకుందాం ప్రియాంక అంటూ శివను గట్టిగా మరోసారి కౌగిలించుకుంది. ఆ తర్వాత ఈ జంట దగ్గరకు వచ్చిన శోభా శెట్టి బిగ్ బాస్ ఇచ్చిన సమయం అయిపోయిందని చెబుతుంది. ఇక్కడే ఉండిపోవచ్చా అని బిగ్ బాస్‌ను శోభ అడుగుతుంది. ఆ తర్వాత అందరూ కలిసి శివకుమార్‌కు గుడ్ బై చెప్పడంతో ప్రోమో ముగిసింది. కాగా.. జానకి కలగనలేదు సీరియల్ నటి ప్రియాంక జైన్.. బుల్లితెర నటుడు శివ కుమార్‌లు చాలా ఏళ్లుగా రిలేషన్లో ఉన్నారు. జానకి కలగనలేదు సీరియల్లో నటించిన ప్రియాంక జైన్.. నటుడు శివ కుమార్‌లు చాలా ఏళ్లుగా రిలేషన్లో ఉన్నారు. మౌనరాగం సీరియల్లో వీళ్లిద్దరూ కలిసి నటించారు. అమ్ములుగా ప్రియాంక జైన్.. అంకిత్‌గా శివ కుమార్‌లు పాత్రలు పోషించారు. కెమెరా ముందే నటనతో జీవించిన వీళ్లు.. కెమెరా వెనుక కూడా రొమాంటిక్ జోడీగా మారారు. (ఇది చదవండి: 'ఆయన లేకుండా తొలిసారి ఇలా'.. మంజుల ఎమోషనల్ పోస్ట్!) -
నలిగిపోయిన అశ్విని, ఇచ్చిపడేసిన రతిక.. సీరియల్ బ్యాచ్ సేఫ్
నామినేషన్స్ అంటే డైరెక్ట్‌గా బయటకు పంపించేయరురా.. ఇదొక ప్రక్రియ మాత్రమే.. జనాలకు నచ్చితే ఉంటాం, లేదంటే పోతాం.. అంటూ నీతులు వల్లవేస్తుంటాడు శివాజీ. కానీ తనదాకా వచ్చేసరికి మాత్రం ఎవరైనా నామినేట్ చేస్తే చాలు తోక తొక్కిన తాచులా లేస్తుంటాడు. అవతలి వారి గొంతు పెగలనియ్యకుండా ఏది పడితే అది అనేస్తాడు. ఈరోజు కూడా అదే జరిగింది. తనను నామినేట్ చేయడంతో అతడి అహం దెబ్బ తింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి (నవంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి.. కత్తులు దూసిన కంటెస్టెంట్లు వాళ్లూ వీళ్లు చెప్తే కాదు, శివాజీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలంటూ గౌతమ్‌కు సలహాలిచ్చాడు అర్జున్. తాను కూడా సరైన సమయం కోసం వేచి చూస్తున్నానన్నాడు. అనంతరం బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియ గురించి వెల్లడించాడు. ఈసారి నామినేషన్స్ బిగ్‌బాస్ మహారాజ్యంలో జరుగుతాయని, ఈ రాజ్యంలో శోభ, ప్రియాంక, అశ్విని, రతికలను రాజమాతలుగా ప్రకటించాడు. శంఖారావం వచ్చిన ప్రతిసారి ఇద్దరు కంటెస్టెంట్లు కత్తులను బయటకు తీసి మిగతా ప్రజల్లో ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పాలి. ఆ ఇద్దరిలో ఎవరి నామినేషన్ సబబు అనిపిస్తే వారిని రాజమాతలు నేరుగా నామినేట్ చేస్తారు. రాజకీయాలు జరిగాయన్న భోలె మొదట అమర్, అర్జున్ కత్తులు అందుకున్నారు. అమర్ మాట్లాడుతూ.. భోలె షావళిని టీమ్ నుంచి వెళ్లగొడుతుంటే తనను తాను సమర్థించుకోలేకపోయాడన్నాడు. దీనికి భోలె స్పందిస్తూ అక్కడ రాజకీయాలు జరిగాయని, అందుకే ఆ గ్రూపు నుంచి బయటకు రావడానికి సంకోచించలేదన్నాడు. అర్జున్ మాట్లాడుతూ.. చెప్పుడు మాటలు విని గౌతమ్ శివాజీ మీద అసత్య ఆరోపణలు చేశాడంటూ డాక్డర్బాబును నామినేట్ చేశాడు. అమర్, అర్జున్‌లలో రాజమాతలు అమర్ చెప్పిన పాయింట్ ఎక్కువ సమ్మతంగా అనిపించడంతో అతడి ప్రకారం భోలెను డైరెక్ట్‌గా నామినేట్ చేశారు. జీవితాలతో ఆడుకోకూడదు.. సోది మొదలుపెట్టిన భోలె ప్రిన్స్.. అమర్‌ను, ప్రశాంత్.. గౌతమ్‌ను నామినేట్ చేసేందుకు రెడీ అయ్యారు. రాజమాతలు..ప్రశాంత్‌కు మద్దతుగా నిలబడి గౌతమ్‌ను నామినేట్ చేశారు. తర్వాత భోలె షావళి.. అమర్ నన్ను వీక్ అనడం నచ్చలేదంటూ నామినేట్ చేశాడు. కానీ అది సూటిగా చెప్పకుండా జీవితాలతో ఆడుకోకూడదు.. అదీ ఇదీ అని ఏదేదో సోది చెప్పాడు. ఇంతలో రాజమాత ప్రియాంకకు రోషం పొడుచొక్కింది. అమర్ నిన్ను వీక్ అనలేదు, బిగ్‌బాస్ అన్నాడంటూ అతడి తరపున లాయర్లా వాదించింది. ఊరుకో అని అశ్విని నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఆమె మీదకు గయ్యిమని లేచింది. శివాజీని అడ్డంగా బుక్ చేసిన గౌతమ్ గౌతమ్.. శివాజీ ఎవరినో కొట్టేసి పోతానన్నాడు. నాగ్ దాని గురించి అడిగితే తనను తాను కొట్టుకుని పోతానని మాట మార్చాడని చెప్పాడు. రాజమాతలు గౌతమ్‌కు మద్దతుగా నిలిచి శివాజీని నేరుగా నామినేషన్లోకి పంపించారు. ఇది సహించలేకపోయిన శివాజీ.. వాడి పాయింట్స్ మీకు కరెక్ట్‌గా అనిపించాయా? నేను తప్పుడు నా బిడ్డనైతే నన్ను ఎలిమినేట్ చేయండి అని ఆగ్రహించాడు. ఇంతలో ప్రియాంక, శోభ.. అశ్విని గొడవపడ్డారు. తనను అసలు మాట్లాడనివ్వట్లేదని, గడ్డిపోచ కన్నా హీనంగా చూస్తున్నారని బాధపడింది అశ్విని. కాళ్లు మొక్కిన అశ్విని నువ్వొక్కదానివి గ్రేట్.. ఇక్కడ కూర్చున్న మేమంతా వేస్టా? అని ప్రియాంకతో వాదిస్తూ ఏడ్చింది. మధ్యలో శోభ గట్టిగట్టిగా అరవడంతో.. మేమిద్దరం మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావని ఆమెపై ఫైర్ అయింది. కానీ వాళ్లముందు అశ్విని నిలబడగలదా? అశ్విని ఒక్కమాట అంటే ప్రియాంక, శోభ నాలుగు మాటలంటూ తనను డామినేట్ చేశారు. వారితో అరిచే ఓపిక లేక ఏడుస్తూ ఇద్దరి కాళ్లు మొక్కింది. దీంతో ఆ సీరియల్ నటులిద్దరూ ఇదంతా ఓవర్ యాక్షన్ అని తిట్టిపోశారు. అనంతరం శివాజీ, ప్రిన్స్ కత్తులు పట్టుకుని నిలబడ్డారు. మొదటగా శివాజీ.. గోనెసంచి గేమ్‌లో అమర్ నా చేయి పట్టుకుని లాగడంతో చేయంతా నొప్పి పుట్టిందంటూ నామినేట్ చేశాడు. అమర్‌ను టార్గెట్ చేసిన ఆ ఇద్దరు నిజానికి ఈ శివాజీయే అమర్ వల్ల చేయి బాగైందని కూడా సంతోషించాడు. ఇప్పుడు అమర్‌ను టార్గెట్ చేస్తూనే పైకి మాత్రం ఇతరత్రా కారణాలు చెప్పుకొచ్చాడు. ప్రిన్స్ యావర్ సైతం మరోసారి అమర్‌ను నామినేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. కానీ ఇద్దరూ ఒకరినే నామినేట్ చేసేందుకు వీల్లేదన్నాడు బిగ్‌బాస్. ఎవరో ఒకరిని నామినేట్ చేయకపోతే నువ్వే నామినేట్ అవుతావని హెచ్చరించాడు. దీంతో యావర్ తనకు తానుగా నామినేట్ అయ్యేందుకు రెడీ అయ్యాడు. అటు రాజమాతలు కూడా యావర్‌నే నామినేట్ చేశారు. ఈరోజు చాలామంది అమర్‌ను నామినేట్ చేసేందుకు ప్రయత్నించినా రాజమాతలు మాత్రం విశ్వప్రయత్నాలు చేసి అతడిని కాపాడారుజ. బలైన రతిక అనంతరం అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. రాజమాతలు చర్చించుకుని వారిలో ఒకరు నామినేట్ అవ్వాలన్నారు. రతిక, అశ్విని.. ప్రియాంకను నామినేట్ చేయగా ప్రియాంక, శోభ.. రతికను నామినేట్ చేశారు. ప్రియాంక, రతికకు టై అవడంతో నామినేషన్ బాధ్యతను కెప్టెన్‌కు అప్పగించాడు బిగ్‌బాస్. శోభకు మరో ఆప్షనే లేదు, ప్రియాంకను సేవ్ చేసి రతికను నామినేట్ చేసింది. కానీ ఈ క్రమంలో పెద్ద యుద్ధమే నడిచింది. నువ్వు నాకు ఆఫ్ట్రాల్ అంటూ శోభకు ఇచ్చిపడేసింది రతిక.ఈ వారం భోలె షావళి, శివాజీ, గౌతమ్, ప్రిన్స్ యావర్, రతిక రోజ్ నామినేషన్లో ఉన్నారు. చదవండి: జూన్‌లో పెళ్లి.. త్వరలో తండ్రి కాబోతున్న హీరో.. -
బిగ్‌బాస్: కన్నీళ్లతో ప్రియాంక, శోభల కాళ్లు మొక్కిన అశ్విని..
బిగ్‌బాస్ షో నుంచి మరొకరిని బయటకు పంపించేందుకు అవసరమైన నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అయితే ఈసారి దీన్ని వినూత్నంగా ప్లాన్ చేశాడు బిగ్‌బాస్. ఇంట్లోని ఆడవాళ్లను రాజమాతలుగా ప్రకటించాడు. మిగతా ఇంటిసభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పి అందుకు తగ్గ కారణాలు చెప్పాల్సి ఉంటుంది. రాజమాతలకు ఆ కారణం సరైనది అనిపిస్తేనే నామినేషన్ జరుగుతుంది. అమర్‌ను వెనకేసుకొచ్చిన ప్రియాంక ముందుగా గౌతమ్ మాట్లాడుతూ.. నా క్యారెక్టర్, డాక్టర్ వృత్తి గురించి శివాజీ అలా మాట్లాడటం నచ్చలేదంటూ సోఫాజీని నామినేట్ చేశాడు. తర్వాత భోలె షావళి.. నీకు నవ్వు వీక్ అయి బయటకు వచ్చావని అన్నావంటూ అమర్‌ను నామినేట్ చేశాడు. ఇంతలో రాజమాత ప్రియాంక మధ్యలో కలగజేసుకుంటూ అమర్.. నిన్ను వీక్ అనలేదని వెనకేసుకొచ్చింది. నువ్వు విషయాన్ని కప్పిపుచ్చుతున్నావ్.. మధ్యలో ఎందుకొస్తున్నావు? ఒర్రొద్దు అని అడిగాడు. నువ్వు చాలా గ్రేటు.. ఇక్కడ కూర్చున్నవాళ్లందరం వేస్ట్. వదిలెయ్ ప్రియాంక అంటూ ఆమెను కూల్ చేసేందుకు అశ్విని ప్రయత్నించగా నేను అతడితో మాట్లాడుతున్నాను అంటూ రెచ్చిపోయింది ప్రియాంక. ప్రతిసారి నా నోరెత్తితే చాలు ప్రాబ్లమైపోతుంది ఇక్కడ.. ఇప్పుడేంటి నువ్వు చాలా గ్రేటు.. ఇక్కడ కూర్చున్నవాళ్లందరం వేస్ట్.. కనీసం నా పెదవి కూడా విప్పనివ్వడం లేదు. ఇంకేం చేయాలి? అని ఏడుస్తూ ప్రియాంక, శోభల కాళ్లు మొక్కింది. నామినేషన్స్‌లో రతిక ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ ప్రియాంక, శోభ హెచ్చరించినా అశ్విని ఆవేశం, బాధ చల్లారలేదు.. కాగా రాజమాతలుగా లేడీ కంటెస్టెంట్లను పెట్టింది వారిని నామినేషన్స్ నుంచి కాపాడటానికే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ చివర్లో ఏదో ట్విస్ట్ ఉండేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఈవారం నామినేషన్స్ లిస్టులో రతిక పేరు కూడా ఉందట! రతికతో పాటు ప్రిన్స్ యావర్, శివాజీ, గౌతమ్, భోలె షావళి నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం. చదవండి: అడ్డంగా దొరికిపోయిన తేజ.. ఆన్సర్ చెప్పమంటే నీళ్లు నములుతున్నాడే -
భయపెడితే భయపడతారనుకున్నావా?.. పక్కకెళ్లి ఆడుకో.. హౌస్‌లో మాటల యుద్ధం!
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ తొమ్మిదో వారం హాట్‌హాట్‌గా కొనసాగుతోంది. ఈ వారంలో ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో హౌస్‌లో టాస్కుల పర్వం మొదలైంది. కెప్టెన్సీ కంటెండర్ రేసు మొదలెట్టేశాడు బిగ్‌బాస్. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఓ గేమ్ ఇచ్చాడు. దీని కోసం ఇంటిసభ్యులను రెండు టీమ్‌లుగా విభజించాడు. వీరసింహాలు టీమ్‌లో యావర్, గౌతమ్, భోలె, తేజ, శోభా, రతిక ఉండగా.. మిగిలినవారంతా గర్జించే పులులు టీమ్‌లో ఉన్నారు. (ఇది చదవండి: వాడో వేస్ట్‌గాడు, ఐటం రాజా.. అమర్‌పై మళ్లీ విషం కక్కిన శివాజీ) మొదట బాల్స్ టాస్కు పెట్టిన బిగ్ బాస్.. దాని ఫలితాలను మాత్రం ప్రకటించలేదు. తర్వాత పవర్ బాక్స్ చాలెంజ్ ఇచ్చాడు. ఇది గెలిచిన టీమ్‌కు ఒక స్పెషల్ పవర్ లభిస్తుందని చెప్పాడు. మొదట జంపింగ్ జపాంగ్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో వీరసింహాలు టీమ్ గెలవడంతో.. అవతలి టీమ్‌లోని ఒకరిని గేమ్ నుంచి తొలగించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో అందరూ చర్చించుకుని పల్లవి ప్రశాంత్‌ను గేమ్ నుంచి తొలగించారు. తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ మరో ఛాలెంజ్‌తో ఎపిసోడ్ మొదలైంది. అమర్దీప్, కెప్టెన్ గౌతమ్ పరుగుత్తుకెంటూ వెళ్లి ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. అయితే ఈ టాస్క్ విషయంలో రతికా, అమర్ దీప్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎందుకు కింద పడేశావ్ అంటూ అమర్‌ను రతికా ప్రశ్నించగా.. నా ఇష్టం ఇది నా స్ట్రాటజీ అంటూ మాట్లాడాడు. ఆ తర్వాత ప్రతిసారి వెధవ పని చేయడం నీకు అలవాటు అనడంతో.. నువ్వు చేసే పనులతో నన్ను పోల్చొద్దు అని అమర్ కౌంటరిచ్చాడు. దీంతో రతికా కోపంతో మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనికి అమర్ సైతం నువ్వు కూడా అంటూ రెచ్చిపోయాడు. భయపెడితే భయపడతారనుకున్నావా? పక్కకెళ్లి ఆడుకో.. వచ్చి నా బ్యాగ్ లాగడం కాదు.. నీ బ్యాగ్ లాగినవాళ్ల దగ్గరికి వెళ్లి లాగు అంటూ ఇచ్చిపడేశాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ ఇచ్చిన బ్రేక్ ఫాస్ట్ ఛాలెంజ్‌లో అమర్, శోభా తలపడగా.. ఇందులో అమర్ విన్ అయ్యాడు. దీంతో ప్రోమో ముగిసింది. మరీ ఫైనల్‌గా ఏ టీమ్ కెప్టెన్సీ కంటెండర్ నిలిచిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుంది. (ఇది చదవండి: కింగ్ ఖాన్ బర్త్ డే.. సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్!) -
బూతులు బిగ్ బాస్‌లోనే కాదు.. బయట మరీ దారుణం..ఆమెను రేప్ చేస్తారంటూ
బిగ్‌బాస్ సీజన్ 7లో ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది. ఈసారి ఆటలోని కంటెస్టెంట్లు అదుపు తప్పి బూతులు మాట్లాడటం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా గేమ్స్, టాస్కులు, నామినేషన్లలో హీట్ సంభాషణలు పెరిగి నాలుకలు అదుపు తప్పుతుంటయ్… అది సహజమే గతంలో కూడా ఉండేవి కానీ వాటిని టెలికాస్ట్ చేసే వాళ్లు కాదు. ప్రస్తుతం ప్రోగ్రామ్‌పై బజ్ క్రియేట్ చేసేందకు ఇవన్నీ తప్పడం లేదని తెలుస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఇలా ఉంటే బయట వారి ఫ్యాన్స్ చేసే భూతుల రచ్చ తారా స్థాయికి చేరింది. తను అభిమానించే వ్యక్తి గెలుపు కోసం మరో ఇంటి ఆడబిడ్డపై బూతులతో దాడిచేస్తారా..?ముఖ్యంగా హౌస్‌లోని లేడీ కంటెస్టెంట్లు శోభ, ప్రియాంకలతో పాటు ఎలిమినేట్ అయిన రతికా రోజ్‌ను మాటలతో చెప్పలేని భూతు పదాలతో దాడిచేస్తున్నారు. ఆటలో వారికి నచ్చిన స్ట్రాటజీ ఉపయోగించి ముందుకు వెళ్తున్నారు. నచ్చకుంటే ఓటు వేయకండి అని ప్రచారం చేయడంలో ఎలాంటి తప్పులేదు. కానీ అసభ్య పదాలతో వినకూడని మాటలతో వారిద్దరిపై ఎదురు దాడి జరుగుతుంది. రేప్ కూడా చేస్తారు అంటూ కామెంట్లు బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్లలో ఒకరిపై (పేరు తెలపడం లేదు) రేప్ కూడా చేస్తారు.. ఏం చేస్తారో చెప్పండి అంటూ ఒక మహిళ తనకు నచ్చిన కంటెస్టెంట్‌ను వెనుకేసుకొస్తూ.. సోషల్ మీడియాలో కామెంట్ చేసి వీడియో షేర్ చేసింది. ఇంతటి ఉన్మాదం ఎందుకు...? ఎవరి కోసం..? భోలే చెప్పినట్లు ఎర్రగడ్డలో చేర్పించాల్సింది శోభను కాదు... ఇలాంటి సిగ్గుమాలిన కామెంట్లు చేసే వారందరిని అక్కడ వైద్యం కోసం చేర్పించాలి. అలాగే అమర్దీప్, సందీప్ కుటుంబ సభ్యులపై కూడా ఇలాంటి దాడే జరుగుతుంది. ఒకరి గెలుపు కోసం ఇంతటి నీచానికి పాల్పడటం ఎంత వరకు కరెక్ట్ అని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి చెత్త పనులు మొదట ప్రారంభించేది హౌస్‌లోని కంటెస్టెంట్ల పీఆర్ టీమ్ వారే... వారికి నచ్చని వారిపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకుంటారు. బూతులు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతారు. వాటికి కనెక్ట్ అయిన కొందరు కామన్ ఫ్యాన్స్ షేర్ చేస్తుంటారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: మాటలు మార్చి దొరికిపోయిన రైతుబిడ్డ.. ఫ్రూప్స్‌తో సహా మొత్తం!) నామినేషన్ల సమయంలో సింగర్ భోలే బూతుల ధారను తాజాగా నాగార్జున కూడా తప్పుబట్టారు. ప్రశాంత్ మీకు బరాబర్ చేసిండు.. అంటూ ఒక బీప్ మాట ఏదో వేసుకున్నాడు భోలే. ఆ సమయంలో ప్రియాంక, శోభాశెట్టి సక్సెస్‌ఫుల్‌గా వాటిని తిప్పికొట్టారు కూడా. ఇలాంటి భాషను, ఈ బూతుల్ని సహించేది లేదంటూ తీవ్ర స్థాయిలో తిరగబడ్డారు. చివరకు తన తప్పును తెలుసుకుని సారీ చెప్పి తలవంచాల్సి వచ్చింది. దీంతో సహజంగానే ట్రోలర్లు రెండువైపులా చేరిపోయారు. మాయాస్త్రం టాస్కులో కూడా అమర్ వర్సెస్ ప్రశాంత్… అమర్ బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి, వాడు రీజన్ లేకుండా నన్ను తీసేశాడు.. వాడి వల్ల నా గేమ్ నాశనం అయిందటూ వినరాని పరుష వ్యాఖ్య చేశాడు. ఈ పదం వాడినప్పుడు కూడా ప్రియాంకే సాక్షి… అప్పుడు కూడా అమర్‌ను 'నోరు జాగ్రత్త' అని హెచ్చరించింది. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) శోభాశెట్టిని, ప్రియాంకలను తిట్టడంతో పాటు. అమర్ దీప్ అమ్మగారిని, అతని భార్యను కూడా భూతులు తిట్టడం అధికం అయింది. సోషల్ మీడియాలో భూతుల దాడి తట్టుకోలేక అమర్ తల్లి కన్నీరు పెట్టింది. ముఖ్యంగా ప్రశాంత్ పీఆర్ టీమ్ ఇతర కంటెస్టెంట్లపై బూతు పదాలతో ఎక్కువగా దాడి చేస్తున్నారనేది మెజారిటీగా వినిపిస్తోంది. మరోవైపు సందీప్ భార్య జ్యోతి పరిస్థితి అదే. బిగ్‌బాస్‌లో ఉండాలంటే ఆయా కంటెస్టెంట్ల సోషల్ మీడియా బ్యాచులు సైట్లనూ మేనేజ్ చేయాలాల్సిందేనా అనే అపవాదు కనిపిస్తుంది. గతంలో ఏ సీజన్లో కూడా పీఆర్ టీమ్ ప్రభావం అంతగా లేదు. కానీ ఈ సీజన్లో మాత్రం దాదాపు చాలా మందికి పీఆర్ టీమ్ ఉంది. ఎప్పుడూ లేని విధంగా వారు బూతులు క్రియేట్ చేయడం చాలా బాధకారం. ఇవన్నీ చూస్తున్న కామన్ ప్రేక్షకులు కూడా షో నుంచి దూరం అవుతున్నారు. గత సీజన్‌ను తిరస్కరించినట్టుగానే ఈ సీజన్‌కు కూడా చాలామంది దూరమైపోయారు. -
అమర్దీప్ మీద కేకలేసిన శోభ, కేక్ కోసం ఫైటింగ్!
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు గులాబీపురం, జిలేబిపురం అనే గ్రామస్థులుగా విడిపోయారు. వీరిలో ఏ గ్రూపు గ్రహాంతరవాసులను మెప్పిస్తుందో ఆ గ్రూపులోని వారు కెప్టెన్సీకి పోటీపడతారు. ఇప్పటికే ఓ టాస్కులో జిలేబిపురం గెలిచింది. మరి తాజా(అక్టోబర్ 19) ఎపిసోడ్లో ఎవరు గెలిచారు? అనేది చూసేద్దాం.. మళ్లీ బుసలు కొట్టిన మోనిత గులాబీపురం, జిలేబిపురం గ్రామప్రజలుగా కంటెస్టెంట్లు జీవించేస్తున్నారు. ఇక తేజ అయితే పెళ్లి రోజు, తొలి రాత్రి అంటూ శోభా శెట్టితో సరసాలాడాడు. మిగతావారు కూడా ఏమీ తక్కువ తినలేదు. ఎవరికి వారు తమ టాలెంట్ చూపించారు. ఇంతలో అండర్ వాటర్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో అమర్-సందీప్ బాగానే కష్టపడ్డారు. కానీ చివరకు జిలేబిపురాన్ని గెలిపించాడు సందీప్. దీంతో శోభాలో ఉన్న మోనిత ఒక్కసారిగా నిద్రలేచింది. గెలుస్తానన్న నమ్మకం లేకపోతే వెళ్లకూడదు.. ప్రతీది ఓడిపోతున్నాం అంటూ అమర్దీప్ మీద అరిచేసింది. బోణీ కొట్టిన గులాబీపురం.. తర్వాత స్పేస్ షిప్ ఛాలెంజ్‌లో ప్రశాంత్, గౌతమ్ పోటీపడ్డారు. ఈసారి టాస్కులో గౌతమ్.. గులాబీపురాన్ని గెలిపించాడు. దీంతో మొదటి బోణీ కొట్టడంతో గులాబీపురం గ్రామస్తుల ముఖాలు వికసించిపోయాయి. అయితే జిలేబీపురానికి చెందిన ప్రియాంక డల్‌గా కూర్చోవడంతో ఆమె దగ్గరకు వెళ్లిన అమర్.. మాకొచ్చింది ఒకటేలే.. సల్లబడు అన్నాడు. సల్లబడు ఏంటి? ఓవర్‌గా మాట్లాడకు అని ఫైర్ అయింది. నేను సరదాగా అన్నానంటూ అమర్ చెప్పినా తను పట్టించుకోలేదు. అలిగి వెళ్లిపోయింది. తర్వాత ప్రియాంక దగ్గరకు వెళ్లిన అమర్ సారీ చెప్పాడు. మొన్నటివరకు శివాజీ, ప్రశాంత్‌తో గొడవపడ్డ అమర్దీప్ ఈరోజు తన స్నేహితులిద్దరితోనూ మాటలు పడాల్సి వచ్చింది. శోభా పేరు పచ్చబొట్టు వేయించుకోమన్న బిగ్‌బాస్ ఇదిలా ఉంటే కిచెన్‌లో టాటూ గురించి కబుర్లు చెప్పుకున్నారు తేజ, శోభ, పూజా మూర్తి. ఇది విన్న బిగ్‌బాస్ పచ్చబొట్టు వేయించుకోవచ్చుగా అని తేజకు సలహా ఇచ్చాడు. సరదాగా అన్నాడేమో అని లైట్ తీసుకునేలోపే పదేపదే పచ్చబొట్టు విషయాన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. శోభ పేరు టాటూ వేయించుకోవాలని, ఏ డిజైన్ కావాలో సెలక్ట్ చేసుకో అని ఓ పేపర్ కూడా పంపించాడు. అసలే పెళ్లి కావాల్సినవాడిని, ఈ పచ్చబొట్టు నా వల్ల కాదంటూ బిగ్‌బాస్‌కు మొర పెట్టుకున్నాడు తేజ. బయటకు వెళ్లాక (పెళ్లికి) అవకాశముందని చెప్తే వేయించుకుంటానని తేజ అనగా వేయించుకో అని ఆటపట్టించింది శోభ. అమర్ మీద పడ్డ శోభ రాత్రి తేజ కోసం బిగ్‌బాస్ ఓ కేక్ పంపించాడు. దానిపై శోభ అని రాసి ఉంది. ఇది ముగింపు కాదు, ముందుంది ముసళ్ల పండగ అంటూ ఓ లేఖ సైతం పంపాడు. తనకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో అని జుట్టు పీక్కున్నాడు తేజ. ఇంతలో అమర్.. కేక్‌ను ఎంతసేపు చూస్తూ కూర్చోవాలని ఓ ముక్క లటుక్కున తినేశాడు. అప్పుడు తేజ, శోభ.. ఇద్దరూ అమర్ మీద అరిచారు. కేక్ మీద నా పేరుంది.. ఎలా తిన్నావని ఆగ్రహించింది శోభ. శోభకు ఐ లవ్ యూ చెప్పిన తేజ చాలా సేపు తల గోక్కున్న తర్వాత తేజ కేక్ కట్ చేసి అందరికీ తలా ఓ ముక్క ఇచ్చాడు. అంతా అయిపోయాక శోభను గార్డెన్‌కు పిలిచాడు. కేక్ ఎందుకు పంపించాడు? దానిపై నీ పేరు ఎందుకు రాశాడు? అంటూ ప్రశ్నల చిట్టా చదివాడు తేజ. ఏదో చెబుతావనుకుంటే సోది చెప్తున్నావంటూ శోభా కోపంగా లేచింది. దీంతో తేజ సడన్‌గా ఐ లవ్ యూ చెప్పడంతో థూ అని ఊసేసి ముందుకు వెళ్లిపోయింది శోభ. మొత్తానికి తేజ-శోభ లవ్ ట్రాక్ కోసం బిగ్‌బాస్ గట్టిగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. చదవండి: ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ట్విటర్ రివ్యూ -
నా కుమారుడిని అలా చేస్తారనుకోలేదు.. ఏడ్చేసిన భోలె షావళి తల్లి
వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత కొత్త జనాభాతో హౌస్ కళకళలాడిపోయింది. అటు నామినేషన్స్ కూడా మరింత వాడివేడిగా జరిగాయి. ఈ వారం జరిగిన నామినేషన్స్ అయితే పీక్స్‌కు వెళ్లిపోయాయి! భోలె షావళి బూతులు మాట్లాడటం.. అతడిని ప్రియాంక, శోభ ఎడాపెడా వాయించేయడం తెలిసిందే! ఈ క్రమంలో ప్రియాంక అతడిని థూ అని చీదరించుకుంది. నా కొడుకుది ఎంతో మంచి గుణం తాజాగా ఈ నామినేషన్స్ రచ్చపై భోలె షావళి తల్లి, సోదరి స్పందించారు. ముందుగా ఆమె తల్లి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'అంత మంచి మనసున్నవాడు, పది మందికి అన్నం పెట్టే వాడిని హౌస్‌లో అలా చేస్తారనుకోలేదు. నా కొడుకును ప్రియాంక థూ అని ఎందుకు అన్నదో అర్థం కావట్లేదు. నా కొడుకు నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడు. ఎక్కడికి వెళ్లినా నా కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటాడు. ఎంతో మంచి గుణం వాడిది. అతడితో హౌస్‌లో ఎవరూ మాట్లాడట్లేదు. తను కలుపుకుపోదామని చూస్తున్నా వాళ్లు దూరం పెడుతున్నారు' అంటూ ఏడ్చేసింది. సీరియల్ బ్యాచ్ టార్గెట్ చేస్తోంది భోలె చెల్లి మాట్లాడుతూ.. 'మా అన్నయ్య అందరినీ ప్రేమిస్తాడు. కానీ తన మంచితనాన్ని ఓర్వలేకపోతున్నారు. తనకు అతిగా మాట్లాడే అలవాటు లేదు. తనకు నటించడం రాదు. సీరియల్ బ్యాచ్ మా అన్నయ్యను కావాలని టార్గెట్ చేస్తున్నారు. ప్రియాంక థూ.. అనేంత తప్పు తనేం చేశాడు. శోభా శెట్టి తన మీద పడి అరిచేస్తోంది. అంత అవసరం లేదు. ఆ ఎపిసోడ్ చూస్తుంటే మా రక్తం ఉడికిపోయింది. కానీ ఏం చేయలేకపోయాం. శోభా, ప్రియాంక.. హౌస్‌లో మొదటి నుంచి ఆటిట్యూడ్ చూపిస్తున్నారు. ఓవరాక్షన్ చేస్తున్నారు. సీరియల్స్‌లో నటించినందుకు వారికి ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ థూ అని ఊసేంత తప్పు మా అన్నయ్య ఏమీ చేయలేదు. తను ఏం మాట్లాడినా తప్పులాగే చూస్తున్నారు. వాళ్లెంత ఛీ కొట్టినా మా అన్నయ్య మాత్రం కూల్‌గానే మాట్లాడాడు' అని ఫైర్ అయింది. చదవండి: యంగ్ టైగర్‌కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక జాబితాలో చోటు! -
'నీలాంటోళ్లను చాలామందిని చూసినా'.. ప్రియాంకపై భోలె షావలి ఫైర్!
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హౌస్‌లో ఆరోవారం నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మొదటిరోజే ఏడుగురు నామినేషన్స్ ప్రక్రియను పూర్తి చేశారు. మిగిలిన వారు ఈ రోజు జరిగే ఎపిసోడ్లో నామినేట్ చేయనున్నారు. తాజాగా ఈ రోజుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. ప్రోమోలో శోభాశెట్టి మాట్లాడుతూ..'తేజ నువ్వు పనిష్మెంట్ అనేది చాలా సిల్లీగా తీసుకుంటున్నావ్. ఈరోజు కూడా వెళ్తా. నేను వీఐపీ గదిలోనే ఉంటా. అది నా ఇష్టం' అని చెప్పింది. దీనికి టేస్టీ తేజ రిప్లై ఇస్తూ.. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ బ్రో అని చెప్పాడు. ప్రతిదీ నీకు ఫన్.. కానీ మాకే సీరియస్‌గా అనిపిస్తోందని చెప్పింది శోభాశెట్టి. (ఇది చదవండి: ఇకపై అన్నీ ఆనంద క్షణాలే..: రాశీ ఖన్నా) ఆ తర్వాత ప్రియాంక జైన్, శోభాశెట్టిని ఉద్దేశించి.. 'మీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తోందిరా? ఆడపిల్లలు.. మీకు మంచి భవిష్యత్తు ఉంది అని భోలె షావలి కాస్తా వెటకారంగా' అన్నారు. దీనికి కోపం తెచ్చుకున్న ప్రియాంక జైన్.. 'ఆడపిల్ల అంటూ నటించినవ్ కదా.. ఇంతసేపు కనిపిస్తోంది' అంటూ భోలే షావలిపై మండిపడింది. ఆ తర్వాత నీలాంటోళ్లను చాలామందిని చూసినా అని భోలె షావలి అనడంతో.. కోపంతో ప్రియాంక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత షావలి అరే ఎంత మంచిగా ఉన్నా నేను' అంటాడు. కానీ ప్రియాంక్ మాట్లాడుతూ..'నువ్వు నటించావ్' అంటుంది. ఆ తర్వాత శోభాశెట్టి మాట్లాడుతూ.. 'పక్కన ఆడపిల్ల ఉన్నప్పుడు కంట్రోల్ యువర్ టంగ్ అంటూ భోలె షావలికి వార్నింగ్ ఇస్తుంది'. అనంతరం తూ.. అని ప్రియాంక జైన్ అనడంతో.. నేను అదే తిరిగి అంటే నీ బతుకు ఏం కావాలా? అంటాడు భోలె షావలి. ఆ తర్వాత శోభాశెట్టి అతన్ని నామినేట్ చేస్తూ కుండ పగలగొడుతుంది. ఇక టేస్టీ తేజ శోభాశెట్టితో మాట్లాడుతూ.. రూమ్‌లో ఉన్న వాళ్లందరు నామినేట్ చేయడం ఒక ఎత్తు.. నువ్వు నా కుండ పగలగొట్టడం ఒక ఎత్తు అంటూ అక్కడి నుంచి వెళ్లి పోవడంతో ప్రోమో ముగిసింది. హౌస్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నామినేషన్స్ ప్రక్రియ మరింత హీటెక్కినట్లు కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు సీరియస్‌గా విమర్శలు చేసుకుంటూ మరింత ఆసక్తికరంగా మార్చేశారు. ప్రోమో చూస్తే ఓవరాల్‌గా ఈ రోజు ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగనున్నట్లు కనిపిస్తోంది. ఈ వారం నామినేషన్స్ లో భాగంగా సోమవారం కేవలం ఏడుగురు మాత్రమే తమ తమ నామినేషన్స్ పూర్తి చేశారు. మిగిలిన వాళ్లు మంగళవారం నామినేషన్ ప్రక్రియని పూర్తి చేయనున్నారు. (ఇది చదవండి: నయని ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ అగ్రిమెంట్ గుట్టు విప్పిన అర్జున్ కల్యాణ్) -
అమర్ దీప్ బ్యాక్‌గ్రౌండ్ తెలుసా.. అనంతపూర్ నుంచి లండన్ ఆపై..
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అమర్దీప్ చౌదరి మెగాస్టార్ లెక్క.. సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైన అమర్ ఆ గుర్తింపుతో బిగ్‌బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్ టైటిల్ విన్నర్‌గా ఆట బరిలోకి దిగిన అమర్‌లో గెలవాలనే తపన, కోరిక ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే తన ఆటలో రాణిస్తున్నాడు. ఐదు వారాలుగా ఎలిమినేషన్లో లిస్ట్‌లో ఉన్నా... ప్రేక్షకుల ఓట్లతో సేవ్ అవుతూ తన సత్తాను చాటుతున్నాడు. ప్రతి గేమ్‌లోనూ పట్టువదలకుండా ఆడుతూ ప్రత్యర్థులకు తనదైన స్టైల్లో సమాధానం ఇస్తున్నాడు. కానీ బిగ్‌బాస్ లైవ్ చూస్తున్న వారు మాత్రం అమర్‌కు అన్యాయం జరుగుతుందని కామెంట్లు చేస్తున్నారు. హౌస్‌లో ఆయన చేస్తున్న మంచి పనులను చాలా వరకు ప్రసారం కావడం లేదని చెప్పుకొస్తున్నారు. కేవలం అమర్ తప్పుల్ని మాత్రమే బయటి ప్రపంచానికి చూపుతున్నారనే విమర్శలు అమర్ ఫ్యాన్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: పెళ్లై నెల కాలేదు.. భర్తతో కాకుండా మరొకరితో హనిమూన్ ఎంజాయ్) తాజాగా పల్లవి ప్రశాంత్ అభిమానులు కొందరు అమర్ తల్లి రూప, అతని భార్య తేజస్వని గౌడల పట్ల అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారని ఆయన అమ్మగారు కన్నీరు పెట్టిన విషయం తెలిసందే. బిగ్‌బాస్‌ను ఎంటర్టైన్మెంట్ షోగా మాత్రమే చూడండి. కంటెస్టెంట్ల కుటుంబాలకు చెందిన వ్యక్తులను భూతులతో తిట్టడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదని పలువురు తెలుపుతున్నారు. అనంతపురం నుంచి లండన్‌కు అమర్ దీప్ 1990 నవంబర్ 8వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో జన్మించాడు. ఆయన తండ్రి అమీర్ బాషా. కూచిపూడి డ్యాన్సర్, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి కూడా.. అమర్ తల్లి పేరు రూపా.. ఆమె కూడా కూచిపూడి నృత్యకారిణి. గతంలో ఆమె బీజేపీలో క్రీయాశీలకంగా పనిచేశారు. అలా అనంతపురం ప్రాంతంలో ప్రముఖంగా గుర్తింపు పొందారు. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చదివిన అమర్.. మాస్టర్స్ చదివేందుకు లండన్ వెళ్లి 2016లో పూర్తి చేసి తిరిగొచ్చాడు. తర్వాత కేరళలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆయన ఉద్యోగం చేసి సినిమాలపైన మక్కువతో హైదరాబాద్ వచ్చేశాడు. (ఇదీ చదవండి: ప్రముఖ ఓటీటీలోకి వచ్చేస్తున్న బెస్ట్ హర్రర్ తెలుగు సినిమా) అలా తన జాబ్‌ను పక్కన పెట్టి లెక్కలేనన్ని షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలో నటించాడు. వాటిలో నా పబ్ జీ వైఫ్, డేట్, లవ్ యు జిందగీ,గర్ల్‌ఫ్రెండ్ పిజ్జా vs గోంగూర, మంగమ్మ గారి మనవడు, గర్ల్ ఫ్రెండ్ ఊరెళితే, సూపర్ మచ్చి, రాజు గారి కిడ్నాప్ వంటివి మంచి గుర్తింపు తెచ్చాయి. మొదటిసారి 2017లో 'ఉయ్యాల జంపాలా' అనే సీరియల్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు అమర్. ఆ తర్వాత 'సిరి సిరి మువ్వలు' అశ్విన్ అనే ప్రధాన పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రియాంక జైన్‌తో కలిసి 'జానకి కలగనలేదు' సీరియల్‌తో మరింత పాపులర్ అయ్యాడు. కృష్ణార్జున్ యుద్ధం, శైలజా రెడ్డి అల్లుడు వంటి సినిమాల్లో కూడా ఆమర్ మెరిశాడు. కన్నడ బ్యూటీతో ప్రేమ పెళ్లి ఇక సీరియల్ నటి, కన్నడ బ్యూటీ అయిన తేజస్వని గౌడను ఆమర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని అమర్ తల్లి రూపతో చెప్పి ఆపై అందరీ అంగీకారంతో కొన్ని రోజుల క్రితమే పెళ్లి చేసుకున్నాడు. ఆమర్కు హీరో రవితేజ అంటే చెప్పలేనంత అభిమానం. రవితేజ స్టైల్‌నే అమర్ కూడా అనుసరిస్తూ ఉంటాడు. -
'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఒకేసారి ఇద్దరు ఔట్!
'బిగ్‌బాస్ 7' షో ఐదోవారం వీకెండ్‌కి వచ్చేసింది. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరా అనేది సస్పెన్స్‌గా మారిపోయింది. అదే టైంలో ఆరుగురు కొత్తవాళ్లు కూడా హౌసులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. సరిగ్గా ఇలాంటి టైంలో బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. అందరూ అనుకున్నట్లు కాకుండా డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. విచిత్రం ఏంటంటే ఆ ఇద్దరు అమ్మాయిలేనట. ఇంతకీ ఏంటి విషయం? ఏంటి విషయం? బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రస్తుతం టెలికాస్ట్ అవుతుంది. గత నాలుగు వారాల్లో వరసగా కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికని ఎలిమినేట్ చేసి పంపేశారు. ఐదోవారం మాత్రం పవరస్త్ర గెలుచుకున్న శోభా, సందీప్, ప్రశాంత్ తప్పితే అందరూ నామినేట్ అయ్యారు. వాళ్లకు వచ్చిన ఓటింగ్‌లో శుక్రవారం వరకు చూసుకుంటే శివాజీ టాప్‌లో ఉన్నాడు. ప్రియాంక చివర్లో ఉంది. దీంతో ఈసారి ప్రియాంక ఎలిమినేట్ అని అందరూ అనుకున్నారు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లోకి వెళ్లొచ్చాక నా భార్యకి అలాంటి మెసేజులు: హీరో వరుణ్ సందేశ్) డబుల్ ధమాకా అయితే ఈ ఆదివారం సర్ ప్రైజ్ ఉందని హౌసులో ఉన్నవాళ్లందరికీ నాగ్ చెప్పాడు. ఆరుగురు కొత్త కంటెస్టెంట్స్ అని బయట అందరికీ తెలిసిపోయింది. అలానే వాళ్ల పేర్లు కూడా లీక అయ్యాయి. అర్జున్ అంబటి, కెవ్వు కార్తీక్, పూజామూర్తి, నయని పావని, అశ్విని శ్రీ, భోళే షావలే.. వీళ్లని తెలుస్తోంది. ఇలా కొత్తగా ఆరుగురు వస్తున్నారని.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లే హౌసులో ఉండే అర్హత లేని ముగ్గురు పేర్లు చెప్పమని నాగ్ చెప్పడం మీరు ప్రోమోలో చూడొచ్చు. ఆ ఇద్దరు పక్కానా? నాగ్ ఇచ్చిన టాస్కులో భాగంగా కంటెస్టెంట్ అందరూ తమకు అనిపించిన తలో ముగ్గురి పేర్లు చెప్పారు. ఇందులో భాగంగా తేజ, ప్రియాంక, శుభశ్రీ ఫైనల్ అయ్యారని.. వీళ్లలో తేజ సేవ్ కాగా శుభశ్రీ-ప్రియాంక ఒకేసారి ఎలిమినేట్ అయ్యారని అంటున్నారు. అలానే ప్రియాంకని పూర్తిగా బయటకు పంపేయకుండా సీక్రెట్ రూంలో ఉంచారని సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే శనివారం ఎపిసోడ్ పూర్తి కావాల్సి ఉంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'జవాన్'.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!) -
'బిగ్‌బాస్ 7' ఎలిమినేషన్లో ట్విస్ట్.. ఐదోవారమూ అమ్మాయే!
బిగ్‌బాస్ తెలుగులో ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావడం లేదు. ఎందుకంటే గేమ్స్ గురించి పక్కనబెడితే ఇప్పటివరకు నాలుగు వారాల్లో నలుగురు లేడీ కంటెస్టెంట్స్ బయటకెళ్లిపోయారు. ఇప్పుడు ఐదోవారం కూడా టాప్ కంటెస్టెంట్ అనుకున్న ఆమెనే ఎలిమినేట్ కానుందనే న్యూస్ హాట్ టాపిక్ అవుతుంది. ఇంతకీ ఎవరామె? ఏంటి సంగతి? ఆ బ్యాచ్‌పై నెగిటివిటీ సాధారణంగా బయట పరిచయమున్నా సరే బిగ్‌బాస్ హౌసులోకి వచ్చిన తర్వాత ఎవరి గేమ్ వాళ్లే ఆడుతుంటారు. ఈసారి మాత్రం కలిసి వర్క్ చేసిన కొందరు సీరియల్ ఆర్టిస్టులు షోలో అడుగుపెట్టారు. తొలి ఎపిసోడ్ నుంచి గ్రూప్‌గానే ఆడుతున్నారు. ఇతర కంటెస్టెంట్స్ నుంచి ఇదే కంప్లైంట్ వచ్చినా సరే తాము సింగిల్‌గానే ఆడుతున్నామని చెప్పుకొచ్చారు. కానీ ప్రేక్షకుల్లో కాస్త నెగిటివిటీ వచ్చింది. (ఇదీ చదవండి: సర్జరీ వికటించి ప్రముఖ నటి కన్నుమూత) ప్రియాంక ఔట్? గత మూడు నాలుగు వారాల్లో పవరస్త్ర గెలుచుకున్న సందీప్, శోభాశెట్టి, ప్రశాంత్ తప్ప మిగిలిన ఏడుగురు ఈ వారం నామినేట్ అయ్యారు. ఈ జాబితాలో ఓట్ల శాతం వారం మొత్తం పైకి కిందకు జరిగింది. శుక్రవారానికి వచ్చేసరికి శివాజీ టాప్‌లోనే ఉన్నాడు. తర్వాత స్థానాల్లో గౌతమ్, యవర్, శుభశ్రీ, టేస్టీ తేజ ఉన్నట్లు తెలుస్తోంది. చివరి రెండు స్థానాల్లో అమరదీప్, ప్రియాంక ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వారం నామినేషన్స్ తర్వాత తేజని దిగువన ఉన్నారు. కానీ కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న క్రమంలోనే తేజకు ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో అమరదీప్, ప్రియాంకని వెనక్కి నెట్టి ఐదో స్థానానికి వచ్చేశాడు. దీంతో చివరి స్థానంలోని ప్రియాంకనే ఈసారి ఎలిమినేట్ కాబోతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: 'మంత్ ఆఫ్ మధు' రివ్యూ) -
పాపం గౌతమ్.. కష్టమంతా వృథా! బిగ్‌బాస్ ప్లాన్ అదేనా?
బిగ్‌బాస్ ఇంట్లో మూడో హౌస్‌మేట్‌గా ప్రమోషన్ పొందేందుకు కంటెస్టెంట్లు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో చిత్రవిచిత్ర టాస్క్లుపెడుతున్నాడు బిగ్‌బాస్. ఇప్పటికే పవరస్త్ర కోసం సెలక్ట్ చేసిన ముగ్గురికే కాకుండా వారిని ఛాలెంజ్ చేసిన వారికి సైతం టాస్కులు ఇచ్చాడు. ఇంతకీ హౌస్‌లో తాజా ఎపిసోడ్లో (సెప్టెంబర్ 21) ఏమేం జరిగిందో చూసేద్దాం.. చికెన్ ముక్కల్ని లాగించిన శోభా మూడో పవరాస్త్ర కోసం బిగ్‌బాస్.. ప్రిన్స్ యావర్, అమర్దీప్, శోభా శెట్టిని సెలక్ట్ చేశారు. ఇప్పటికే బిగ్‌బాస్ ఇచ్చిన టాస్కులో గెలిచి తాను కంటెండర్‌గా పోటీ చేసేందుకు అర్హుడినేనని నిరూపించుకున్నాడు ప్రిన్స్. ఈరోజు మిగతా ఇద్దరి వంతు వచ్చింది. మొదటగా శోభా శెట్టిని పిలిచాడు బిగ్‌బాస్. అసలు కారమే అలవాటు లేని తన ముందు అత్యంత కారమైన చికెన్ ముక్కలు పెట్టి వీలైనన్ని ఎక్కువ తినాలని టాస్క్ ఇచ్చాడు. ఎంతో కారంగా ఉన్నా సరే 27 ముక్కల్ని లాగించేసింది శోభా. గౌతమ్ కదా విన్నర్? ఇక ఆమె కంటెండర్‌గా పోటీ చేయడాన్ని ఛాలెంజ్ చేసిన పల్లవి ప్రశాంత్, శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణలకు సేమ్ టాస్క్ ఇచ్చాడు. తక్కువ సమయంలో 28 చికెన్ పీసులు తినాలని చెప్తూ సందీప్‌ను సంచాలకుడిగా నియమించాడు. గౌతమ్ 28 తినేసి బెల్ కొట్టాడు. అయితే అప్పటివరకు సైలెంట్‌గా ఉన్న సంచాలక్.. తర్వాత మాత్రం ఒక పీస్ కొద్దిగా వదిలేశావంటూ ఒక నెంబర్ తగ్గించి 27 పీసులే తిన్నట్లు పేర్కొన్నాడు. శోభా శెట్టి కంటే ఎక్కువ తినలేకపోవడంతో బిగ్‌బాస్ ఆమెనే కంటెండర్‌గా ఎంపిక చేశాడు. గుండు గీయించుకునేందుకు భయపడ్డ అమర్ ఇక శివాజీ పవరాస్త్రను కొట్టేసిన అమర్దీప్.. చివరకు దాన్ని వెనక్కు ఇచ్చేశాడు. అనంతరం అసలు సిసలైన ఫిట్టింగ్ పెట్టాడు బిగ్‌బాస్. అమర్‌దీప్‌ను గుండు గీయించుకోవాలన్నాడు. లేదంటే అతడిని ఛాలెంజ్ చేసిన ప్రియాంక బేబీకట్ చేయించుకోవాలన్నాడు. తను గుండు గీయించుకోవడమా? నెవర్.. ఆ ఊహే భయంకరంగా ఉందన్నట్లుగా వణికిపోయాడు అమర్. ఓపక్క ఏడుస్తూనే అమ్మాయిలకు ఇలాంటి హెయిర్‌కట్ అంటే మామూలు విషయం కాదంటూ హెయిర్‌కట్‌కు రెడీ అయిపోయింది ప్రియాంక. అప్పటిదాకా కన్నీళ్లు.. అద్దంలో చూసుకున్నాక.. అప్పటివరకు కన్నీళ్లు పెట్టుకున్న ఆమె తర్వాత మాత్రం.. గతంలో ఇలా చిన్నగా హెయిర్‌కట్ చేయించుకోవాలనుకున్నాను. క్యూట్‌గా ఉన్నాను అంటూ మురిసిపోయింది. ఇదంతా చూస్తుంటే ఈసారి పవరాస్త్రను బిగ్‌బాస్ ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మాయిలకే ఇవ్వాలని ఫిక్సయిపోయినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే ప్రిన్స్‌ను ఓడించి శోభా, ప్రియాంకలలో ఎవరైనా ఒకరు పవరాస్త్ర గెలుచుకుని మూడో హౌస్‌మేట్‌గా ప్రమోషన్ పొందుతారా? లేదా? అనేది చూడాలి. చదవండి: ఆ వ్యాధి వల్ల సినిమాలు, ఊరు వదిలేసి వెళ్లిపోయా: మమతా -
అమర్‌ను గుండు గీయించుకోమన్న బిగ్‌బాస్.. ఛాన్స్ ఉందా?
బిగ్‌బాస్ ఇంట్లో ప్రస్తుతం 12 మంది ఉన్నారు. వీరంతా కంటెస్టెంట్లే అయినప్పటికీ ఓ ఇద్దరు మాత్రం హౌస్‌మేట్స్‌గా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే! సందీప్, శివాజీ పవరాస్త్ర దక్కించుకోగా తాజాగా మూడో పవరాస్త్ర కోసం పోటీ జరుగుతోంది. ఇందుకోసం బిగ్‌బాస్ నేరుగా ముగ్గురిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేసుకున్నాడు. అమర్దీప్ చౌదరి, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌ను పవరాస్త్ర కోసం పోటీపడే కంటెండర్లుగా ఎంపిక చేశాడు. సత్తా చాటిన ప్రిన్స్ ఈ ఎంపికతో అందరూ ఏకీభవించారా? లేదా? తెలుసుకునేందుకు మిగతా కంటెస్టెంట్ల అభిప్రాయం అడిగాడు. ఈ క్రమంలో చాలామంది ప్రిన్స్ యావర్ ఇంటిసభ్యుడిగా ఉండేందుకు అనర్హుడు అని చెప్పాడు. దీంతో ప్రిన్స్ తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో అతడు విజయం సాధించి కంటెండర్‌గా నిలబడ్డాడు. తర్వాత శోభాకు అత్యంత కారంగా ఉండే చికెన్ తినాలని ఓ టాస్క్ ఇచ్చాడు. ఏడుస్తూనే టాస్క్ పూర్తి చేసేసింది శోభా. ఇక మిగిలిందల్లా అమర్దీప్. ఇక్కడ బిగ్‌బాస్ పెద్ద ఫిట్టింగే పెట్టాడు. అతడికి జుట్టంటే చాలా ఇష్టం. ఓసారి రవితేజ అతడి నెత్తిన చేయేసి తన జుట్టులానే ఉందని చెప్పాడట. అందుకని దాన్ని తీసేయడానికి అస్సలు ఇష్టపడడు. అలాంటి ఇప్పుడేకంగా బిగ్‌బాస్ గుండు గీయించుకోవాలని చెప్పాడు. దీనికి ససేమీరా కుదరదని చెప్పేశాడు. దీంతో జుట్టు కత్తిరించుకునేందుకు ప్రియాంక జైన్ రెడీ అయింది. అన్నట్లుగా తన హెయిర్ కట్ చేసుకుంది. అలా ఆమె కంటెండర్‌గా నిలిచింది. మరి ప్రియాంక, శోభా, ప్రిన్స్.. ఈ ముగ్గురిలో ఎవరు పవరాస్త్ర గెలుచుకుంటారో చూడాలి! చదవండి: 6 ఏళ్ల తర్వాత సడన్‌గా ఫోటోలు లీక్.. అంటే ముందే ప్లాన్.. ఇలాంటి పనులు చేసేముందు ఆలోచించాలి.. రాహుల్ ఫైర్ -
ఫైర్ మీదున్న అమర్.. రెండో వారం నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?
సండే ఫండే అంటాడు నాగార్జున.. కానీ ప్రేక్షకులకు మాత్రం అసలైన ఫండే మండేనే అంటుంటారు. ఎందుకంటే అప్పుడే కదా అసలైన కార్చిచ్చు రగిలేది! నామినేషన్స్ ప్రక్రియతో హౌస్‌లో మంట రగిల్చేందుకు రెడీ అయ్యాడు బిగ్‌బాస్. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. కంటెస్టెంట్లు తాము నామినేట్ చేయాలనుకున్నవారిని పిట్లో నిలబెట్టి అందుకు గల కారణాలు చెప్పి బజర్ నొక్కాల్సి ఉంటుంది. బజర్ నొక్కినప్పుడు పిట్లో పైన ఉన్న బకెట్‌లోని రంగు వారిపై పడుతుంది. నామినేషన్స్ డే కావడంతో హౌస్మేట్స్ ఫన్ వదిలి ఫైర్ మీదున్నారు. ఆట సందీప్ తనను టార్గెట్ చేస్తున్నాడని ఫీలయ్యాడు ప్రిన్స్ యావర్. శివాజీ ఎవరినీ మాట్లాడనివ్వట్లేదంటూ అతడిపై గరమైంది ప్రియాంక జైన్. బిగ్‌బాస్ మాట తప్ప ఎవరి మాటా వినను అని శివాజీ బదులివ్వగా.. నాతో అలా మాట్లాడకు అని హెచ్చరించింది ప్రియాంక. అటు అమర్దీప్.. మరోసారి పల్లవి ప్రశాంత్‌ను మధ్యలోకి లాక్కొచ్చాడు. ప్రశాంత్ వేటాడటానికి వచ్చాడంటే నేనేమైనా పేకాడేందుకు వచ్చానా? అని శివాజీ సెటైర్ల మీద విరుచుకుపడ్డాడు. ఇకపోతే పవర్ అస్త్ర గెలుచుకున్న ఆట సందీప్ ఇంటిసభ్యుల్లో ఒకరిని నేరుగా నామినేషన్స్‌కు పంపించవచ్చని ఆఫర్ ఇచ్చాడు బిగ్‌బాస్. మరి అతడు ఎవరిని నామినేట్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ వారం శివాజీ, శోభ, తేజ, రతిక, ప్రిన్స్ యావర్, షకీలా.. నామినేషన్స్‌లో ఉన్నారంటూ ప్రచారం నడుస్తోంది. మరి వీరిలో ఎవరు నామినేషన్స్‌లో ఉన్నారనే విషయంపై క్లారిటీ రావాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! చదవండి: డ్రగ్స్‌కు బానిసయ్యా, మా నాన్నను నోటికొచ్చింది తిట్టా.. ఇంట్లో నుంచి గెంటేశాడు: జైలర్ హీరో -
హౌసులో కొత్త గొడవలు.. లవ్‌బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?
'బిగ్‌బాస్ 7' సీజన్ మొదలవడానికి ముందు హోస్ట్ నాగార్జున.. ఈసారి అలా కాదు ఇలా, ఇలా కాదు అని ఏదేదో చెప్పారు. 'ఉల్టా పల్టా' ఉండబోతుందన్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్నది చూస్తుంటే.. సేమ్ రొటీన్ స్టఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఓవైపు లవర్స్ మధ్య సమస్యలు, మరోవైపు కొత్త గొడవలు పుట్టుకొస్తున్నాయి. ఇంతకీ హౌసులో ఏం జరుగుతోంది? లవర్స్- మనస్పర్థలు బిగ్‌బాస్‌లో ఏ సీజన్ తీసుకున్నా సరే.. దాన్ని ప్రేమ అనొచ్చే లేదో తెలీదు గానీ కొందరైతే జంటలు అవుతుంటారు. అలా ఈ సీజన్ లో డాక్టర్-లాయర్ జంట ఒకటి ఉంది. అదే గౌతమ్-శుభశ్రీ జోడీ. వచ్చిన తొలిరోజు నుంచి కలిసి కనిపిస్తూ వచ్చారు. తాజాగా వీళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయేమో అనిపిస్తుంది. తేజతో శుభశ్రీ డ్యాన్స్ చేస్తుండగా.. గౌతమ్ కాస్త డల్ అయిపోయాడు. ఆ తర్వాత వీళ్ల మధ్య జరిగిన సంభాషణ కూడా స్పర్థలు వచ్చినట్లు హింట్ ఇచ్చేస్తోంది. (ఇదీ చదవండి: హిట్ కొట్టినా... 'ఆదిపురుష్'ని దాటలేకపోయిన 'జవాన్') రతిక వార్నింగ్ ఇమ్యూనిటీ టాస్క్‌లో సందీప్, ప్రియాంక జైన్ గెలిచారు. మరోవైపు బిగ్‌బాస్‌ని ఇంప్రెస్ చేసిన శివాజీ, రతిక కూడా ఫైనల్ పోరుకు అర్హత సాధించారు. ఇక్కడే మరో ట్విస్ట్ వచ్చి పడింది. వీళ్ల నలుగురిలో ఎవరికి అర్హత లేదో చెప్పమని బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. దీంతో పలువురు రతిక పేరు చెప్పారు. ఈ క్రమంలోనే దామిని, రతిక మధ్య గొడవ జరిగింది. నోరు అదుపులో పెట్టుకో అని దామినికి రతిక వార్నింగ్ ఇచ్చింది. టార్గెట్ ఆమెనే అయితే ప్రస్తుతం హౌసులో పరిస్థితి అంతా చూస్తుంటే దాదాపు చాలామంది రతికనే టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది ఓ విధంగా ఆమెకు ప్లస్ కావొచ్చు కూడా. కానీ ఎవరికీ అది అర్థం కావడం లేదేమో అనిపిస్తుంది. మరోవైపు సింక్‌లో ప్లేట్లు కడగకుండా పెట్టేస్తున్నారని ప్రియాంక గట్టిగా అరిచింది. దీనిపై దామిని రియాక్ట్ కాగా.. అప్పుడు ప్రియాంక-దామిని మాటమాట అనుకున్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలో రిలీజైన సూపర్‌హిట్ సినిమా.. కానీ?) -
'బిగ్‌బాస్ 7' Day-3 హైలైట్స్.. టాస్క్‌లో గెలిచిన ఇద్దరు!
'బిగ్‌బాస్ 7' సీజన్లో నామినేషన్స్ గొడవ అయిపోయింది. ఒకరిని ఒకరి నామినేట్ చేసుకోవడం అనే తంతు ముగిసింగి. మొత్తంగా 8 మంది లిస్టులో ఉన్నారు. ఇకపోతే బిగ్ బాస్.. 14 మంది కంటెస్టెంట్స్‌కి తొలి టాస్క్ ఇచ్చి, ఓ గేమ్ పెట్టేశాడు. ఇందులో అందరూ కండబలంతో ఆడితే.. ఓ ఇద్దరు మాత్రం బుద్ది బలంతో ఆడి, విజయం సాధించారు. ఇంతకీ మూడో రోజు హౌసులో ఏమేం జరిగింది? బిగ్‌బాస్ Day-3 హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7'లో తొలివారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?) ఫస్ట్ టాస్క్ నిద్ర లేవడంతో మూడో రోజు ఎపిసోడ్ ప్రారంభమైంది. 14 మంది కూర్చున్న తర్వాత.. బిగ్‌బాస్ మరోసారి అందరికీ గీతోపదేశం చేశాడు. ఇంట్లో ఉన్నంత మాత్రాన ఇంటి సభ్యులు కాదని, కంటెస్టెంట్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. 'ఫేస్ ద బీస్ట్' అనే గేమ్‌లో గెలిచిన వాళ్లకు హౌసులో కన్ఫర్మేషన్తోపాటు ఐదు వారాల ఇమ్యూనిటీ పొందే అవకాశం దక్కుతుందని చెప్పాడు. గెలిచిన వాళ్లు.. నామినేషన్, ఎలిమినేషన్ నుంచి కూడా సేవ్ అవుతారని బిగ్‌బాస్ చెప్పుకొచ్చాడు. తేజకి షకీలా ముద్దు ఇకపోతే తేజని అందరూ కలిసి ముస్తాబు చేశారు. శుభశ్రీ అతడికి బ్రష్‌తో బుగ్గపై లిప్‌స్టిక్ పెట్టేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే అతడు.. తన బుగ్గపై కూడా ఎవరైనా ముద్దు పెడితే బాగుంటుందని ఫన్నీగా అన్నాడు. పక్కనే ఉన్న షకీలా.. తేజ బుగ్గపై ముద్దు పెట్టింది. ఇది అయిపోయిన తర్వాత 'ఫేస్ ద బీస్ట్' టాస్క్ మొదలైంది. ఈ గేమ్‌లో భాగంగా రింగ్‌లో ఎక్కువసేపు ఉన్నవాళ్లు గెలుస్తారని బిగ్‌బాస్ చెప్పాడు. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజేనా!?) కొందరు మాత్రమే బయట వర్షం పడుతుండటం వల్ల లాన్లో కాకుండా ఇన్‌డోర్‌లో 'ఫేస్ ద బీస్ట్' గేమ్ నిర్వహించారు. 14 మందిలో దాదాపు అందరూ చేతులెత్తేశారు. ఆట సందీప్ , ప్రియాంక, శోభాశెట్టి, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజ.. మిగతా వారి కంటే ఎక్కువ సేపు రింగ్‌లో ఉండి ఫైట్ చేశారు. ఫలితంగా అబ్బాయిల్లో ఎక్కువసేపు ఉన్న ఆట సందీప్, అమ్మాయిల్లో ప్రియాంక టాప్‌లో నిలిచి.. తర్వాత స్టేజీకి అర్హత సాధించారు. వీళ్లిద్దరి మధ్య విన్నర్ ఎవరనేది తర్వాత టాస్కులో తెలుస్తుంది. బుద్దిబలంతో గెలిచారు అయితే ఈ గేమ్ జరుగుతున్నంతసేపు ఆట సందీప్, ప్రియాంక పెద్దగా ఎనర్జీ వేస్ట్ చేసుకోలేదు. ఏ మాత్రం అరవకపోయినప్పటికీ, అందరినీ ఎంకరేజ్ చేశారు. వచ్చినప్పటి నుంచి కండలు చూపిస్తూ ఎక్స్పోజ్ చేసిన ప్రిన్స్.. ఈ గేమ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 32 సెకన్లు మాత్రమే మ్యాట్‌పై ఉండగలిగాడు. దీన్నిబట్టి కండలు ఉంటే సరిపోదని అతడికి అర్థమైందనుకుంటా! తర్వాత టాస్కుల్లో అతడు ఈ విషయం గుర్తుపెట్టుకుంటే బెటర్. ప్రశాంత్, గౌతమ్ ఏడుపు ఈ గేమ్‌లో భాగంగా ఆట సందీప్ (1 min 49 సెకన్లు) తో టాప్‌లో నిలవగా, తర్వాత స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. అయితే గెలవలేకపోయినందుకు ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరోవైపు గౌతమ్ కూడా తనకు ఇల్లు గుర్తొస్తుందని ఎమోషనల్ అయ్యాడు. ఆ వెంటనే.. ఎలాగైనా సరే ఆడి తీరాల్సిందే, స్ట్రాంగ్‌గా ఉండాల్సిందే అని తనకు తానే చెప్పుకున్నాడు. అలా మూడో రోజు పూర్తయింది. (ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకే ఇంట్లో కలిసుంటున్నారా!?) -
అమ్మాయిగా మారి షాకిచ్చిన సీరియల్ హీరో.. ప్రియురాలి కోసమే!
బిగ్‌బాస్ రియాల్టీ షో ఏడో సీజన్ ప్రారంభమైంది. 14 మంది హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే వీరిలో ఎక్కువ వరకు సీరియల్ నటీనటులే ఉండడం గమనార్హం. వాళ్లంతా పక్కా ప్లాన్‌తో హౌస్‌లోకి వచ్చారు. హౌస్‌లో వాళ్లు ఆడే ఆటకు తగ్గట్లు బయట ప్రమోషన్స్ కూడా ఉండాలని ముందే ఫిక్సయినట్లు తెలుస్తుంది. ఇది ప్రతీ సీజన్లో కంటెస్టెంట్స్ చేసే పనే. అయితే ఈ సారి మాత్రం ప్రమోషన్స్ కాస్త వెరైటీగా అనిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌లోకి వెళ్లే ముందే వైరల్ అయ్యే వీడియోలను కొన్నింటిని షూట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా బయటకు వదులుతున్నారు. తాజాగా బిగ్‌బాస్-7 తొలి కంటెస్టెంట్ ప్రియాంక జైన్ సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రియుడితో కలిసి ఫ్రాంక్ వీడియో 'జానకి కలగనలేదు'సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ప్రియాంక జైన్. అంతకు ముందు పలు సినిమాలలో నటించింది. కానీ ఆమెకు తగిన గుర్తింపు రాలేదు. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన తర్వాతే తను కెరీర్ గాడిన పడింది. వరుసగా సీరియల్స్‌తో స్టార్ నటిగా గుర్తుంపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడం కోసమే బిగ్‌బాస్‌లోకి వెళ్లింది. అంతకు ముందు ఆమె ప్రియుడు, మౌనరాగం సీరియల్ హీరో శివ కుమార్‌తో కలిసి ఓ ప్రాంక్ వీడియో చేసింది. అందులో శివకుమార్ లేడి గెటప్‌లో కనిపించడం గమనార్హం. ప్రియాంక కోసమే తన గెడ్డం తీసేసి అమ్మాయి గెటప్ వేశానని శివకుమార్ చెప్పారు. (చదవండి: నాగార్జునకు రైతు బిడ్డ గిఫ్ట్.. అదేంటో తెలుసా?) వీడియోలో ఏం ఉంది? ప్రియాంకకు తెలియకుండా ఓ మేకప్ ఆర్టిస్టును పిలుచుకొని అమ్మాయిగా గెటప్ వేసుకున్నాడు శివకుమార్. అనంతరం జానకి కలగనలేదు సీరియల్ నటుడితో కలిసి ప్రియాంక ఇంటికి వెళ్లాడు. తనని తాను ఇందుమతిగా పరిచయం చేసుకొని ఇంట్లోకి వెళ్లాడు. అయితే గెటప్ అయితే మారింది కానీ.. గొంతు మాత్రం అలానే ఉండడంతో ప్రియాంక ముందుగానే అతన్ని పసిగట్టింది. అయినప్పటికీ అతనికి ఆ విషయం చెప్పలేదు. కాసేపయ్యాక నేను ఎప్పుడో గుర్తుపట్టానని చెప్పడంతో శివ కుమార్ తెల్లముఖం వేశాడు. తాను ఫ్రాంక్ చేద్దామనుకుంటే.. ప్రియాంకనే తనను ఫ్రాంక్ చేసిందని శివ చెప్పుకొచ్చాడు. ఎలా గుర్తుపట్టింది? శివ కుమార్ లేడీ గెటప్ అయితే వేసుకున్నాడు కానీ.. చేతికి ఉన్న ఉంగరాలు, రాఖీ తీసేయ్యలేదు. అలాగే గొంతు మార్చి మాట్లాడడంలోనూ విఫలం అయ్యాడు. దీంతో పరిచయం చేసుకున్న కాసేపటికే ప్రియాంక గుర్తుపట్టేసింది. అయితే ఆ విషయం అతనికి చెప్పకుండా.. చివర్లో చెప్పి షాకిచ్చింది. ప్రియాంక బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత ఈ వీడియోని వదిలారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. -
'బిగ్‌బాస్ 7'లో తొలిరోజే గొడవ? నామినేషన్లలో ఉన్నది వీళ్లే!
'బిగ్‌బాస్ 7' అసలు గేమ్ మొదలైంది. 14 మంది కంటెస్టెంట్స్‌ని ఆదివారం లోపలికి పంపించిన నాగార్జున.. హౌస్‌కి లాక్ వేసేశాడు. అలా ఆదివారం ఎపిసోడ్‌కి ఎండ్ పడింది. ఇకపోతే సోమవారం నామినేషన్స్ షురూ అయ్యాయి. హౌసులో ఫస్ట్ లవ్ ట్రాక్ కూడా మొదలైపోయింది. టేస్టీ తేజ అప్పుడే ఇద్దరి మధ్య పుల్ల పెట్టేశాడు. వీటితో పాటు తొలిరోజు ఇంకా ఏమేం జరిగాయనేది.. ఇప్పుడు Day-1 హైలైట్స్‌లో డీటైల్‌గా చూద్దాం. టాస్క్ ఇచ్చిన పొలిశెట్టి మూవీ ప్రమోషన్లో భాగంగా హౌసులోకి వెళ్లిన హీరో నవీన్ పొలిశెట్టిని సీక్రెట్ రూంలో పెట్టి బిగ్‌బాస్ లాక్ చేశాడు. హౌసులోని అమ్మాయిలందరూ కలిసి అతడిని బయటకు తీసుకొచ్చారు. అందరూ తమని తాము పరిచయం చేసుకున్నారు. అనంతరం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాలోని 'లేడీ లక్' పాటని గుర్తు చేసిన నవీన్.. హౌసులో అబ్బాయిలు, అమ్మాయిల్లో నచ్చినవాళ్లకు బ్యాండ్ కట్టాలని టాస్క్ ఇచ్చాడు. బ్యాండ్ కట్టేశారు దీంతో ఆట సందీప్-ప్రియాంక జైన్‌కు, గౌతమ్ కృష్ణ- దామినికి, అమరదీప్ - శోభాశెట్టికి, పల్లవి ప్రశాంత్- రతికకి, శివాజీ-శుభశ్రీకి, ప్రిన్స్ యవర్ - కిరణ్ రాథోడ్‌కి, టేస్టీ తేజ- షకీలాకి బ్యాండ్ కట్టారు. ఆ తర్వాత లేడీ లక్ పాటకు అందరితో కలిసి డ్యాన్స్ చేసిన నవీన్.. హౌసు నుంచి బయటకొచ్చేశాడు. నాగ్ ఇచ్చిన సంకెళ్ల టాస్కులో భాగంగా గౌతమ్ కృష్ణ.. తన చేతికి ఉన్న హ్యాండ్ కఫ్ని శుభశ్రీకి వేశాడు. కాసేపటి తర్వాత అందరితో మాట్లాడిన బిగ్‌బాస్.. హౌసులో ఎన్నో కొత్త విషయాలు, ఆశ్చర్యపరిచేవి ఎన్నో రెడీగా ఉన్నాయని చెప్పారు. హౌసులో ఉన్నంత మాత్రాన హౌజ్‌మేట్స్ అయినట్లు కాదని క్లారిటీ ఇచ్చాడు. పులిహోర షురూ బిగ్ బాస్ అంటేనే పులిహోర కంపల్సరీ. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్, రతికకు బ్యాండ్ కట్టాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య మాటలు కలిశాయి. ఈ క్రమంలోనే అసలు బిగ్ బాస్ హౌసులోకి ఎందుకు రావాలనుకున్నావ్ అని ప్రశాంత్‌ని రతిక అడిగింది. 'ఫస్ట్ టైమ్ బిగ్‌బాస్ లోకి రావాలని అనిపించి ఓ వీడియో పెట్టాను. కానీ అందరూ తిట్టడంతో డిలీట్ చేశాను. అప్పుడే షోలోకి ఎలాగైనా రావాలని ఫిక్స్ అయ్యాను' అని ప్రశాంత్, రతికతో చెప్పాడు. శోభాశెట్టి ఏడుపు రాత్రి ఒంటి గంటకు లైట్ ఆపు చేయడంతో అందరూ నిద్రపోవడానికి రెడీ అయ్యారు. కానీ మంచిగా పడుకోవడానికి రెడీ అవుతున్న సందీప్, శివాజీ, పల్లవి ప్రశాంత్‌ని.. రతిక, టాస్క్ పేరు చెప్పి భయపెట్టింది. దీంతో వాళ్లు నిద్రపోలేదు. మిగిలిన వాళ్లందరికీ బెడ్స్ లేకపోవడంతో కిచెన్‌లో మాట్లాడుతూ టైమ్ పాస్ చేశారు. మరోవైపు శోభాశెట్టి ఏడుపు మొదలుపెట్టేసింది. 'వీక్ అవ్వకూడదు.. వీక్ అవ్వకూడదు బీ స్ట్రాంగ్' అని తనకు తానే చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. రతిక టాస్క్ తిప్పలు సోమవారం ఉదయం 10:15 గంటలకు కంటెస్టెంట్స్ అందరూ నిద్రలేచారు. 'భోళా శంకర్'లోని జాం జాం జజ్జనక పాటకు స్టెప్పులేసి బిగ్ బాస్‌కి గుడ్ మార్నింగ్ చెప్పారు. ఆ తర్వాత శివాజీకి పెళ్లయిందా? లేదా? అనే టాపిక్ పైన డిస్కషన్ పెట్టారు. తనకు పెళ్లి కాలేదని, బ్యాచిలర్ అని శివాజీ చెప్పాడు. నాగార్జున ఇచ్చిన బ్రోకన్ హార్ట్ టాస్క్ పూర్తి చేసేందుకు రతిక తిప్పలు పడింది. అమరదీప్-ప్రియాంక మధ్య గొడవ పెట్టమని.. శోభాశెట్టికి చెప్పగా ఆమె నో చెప్పింది. గెలిస్తే పర్లేదు లేదంటే తను నామినేట్ అయిపోతాను కదా అని భయపడింది. ఈ టాస్క్ వల్ల నీకు అడ్వాంటేజ్ దక్కుతుంది కదా అని రతికతో శోభాశెట్టి డిస్కషన్ పెట్టింది. రతికతో పల్లవి ప్రశాంత్ టాస్క్ పూర్తి చేసేందుకు రతిక.. పల్లవి ప్రశాంత్ దగ్గరకు వెళ్లింది. దీంతో 'నీకోసం ఏ రిస్క్ అయినా సరే చేస్తా' అని మనోడు రతికతో అన్నాడు. ఆమె అలా నవ్వుతూ ఉండిపోయింది. మరోవైపు టేస్టీ తేజ-షకీలా మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. అసలు వ్యాంప్ తరహా సినిమాలు ఎందుకు చేశారు? అని షకీలాని టేస్టీ తేజ అడగ్గా.. అలాంటి క్యారెక్టర్స్ వచ్చాయని, అవే ఒప్పుకున్నానని షకీలా సమాధానమిచ్చింది. ఈ క్రమంలోనే షకీలా, కిరణ్ రాథోడ్.. ఇద్దరికీ(వేర్వేరుగా) పెళ్లి కాలేదనే విషయం బయటపడింది. గొడవకి తేజ రెడీ టాస్క్ చేయమని.. రతిక టేస్టీ తేజని కూడా బతిమాలాడింది. కానీ అతడు కనీసం పేర్లు కూడా చెప్పొద్దని ఆమెతో అన్నాడు. ఫైనల్‌గా ఒప్పుకున్నాడు. మరోవైపు బ్రోకన్ హార్ట్ ఫస్ట్ తీసుకుంది శోభాశెట్టి. దీంతో ఇది తీసుకున్నందుకు తను కచ్చితంగా నామినేషన్స్‌లో ఉంటానని భయపడిపోయింది. పుల్లపెట్టిన టేస్టీ తేజ టేస్టీ తేజ.. ప్రిన్స్ యవర్-గౌతమ్ కృష్ణ మధ్య పుల్ల పెట్టేశాడు. ఉదయం జిమ్ చేసే సమయంలో ఒకరిని ఒకరు ఇమిటేట్ చేసుకోవడం గురించి ప్రిన్స్ చెప్పింది గౌతమ్ దగ్గరికి వెళ్లి చెప్పాడు. కానీ గౌతమ్ మాత్రం ప్రిన్స్‌తో మాట్లాడటానికి నో చెప్పాడు. ఈ క్రమంలోనే ఎవరివైపు నిలబడతావ్ అని గౌతమ్, శుభశ్రీని అడిగాడు. ఆమె.. నీవైపే అని గౌతమ్‌తో చెప్పుకొచ్చింది. నామినేషన్స్ షురూ సోమవారం సాయంత్రం 6 గంటలకు తొలివారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. యాక్టివిటీ ఏరియాని నరకంలా డిజైన్ చేశారు. బిగ్ బాస్ కూడా వాయిస్ మార్చి మాట్లాడాడు. యాక్టివిటీ ఏరియాకి వెళ్లి.. అక్కడ వేలాడదీసిన ఫొటొల్లో ఎవరిదైతే చింపి, నరకపు వోల్కనోలో వేస్తారో వాళ్లు నామినేట్ అయినట్లు. మొదటగా వెళ్లిన శివాజీ.. దామిని, గౌతమ్ కృష్ణని నామినేట్ చేశాడు. అయితే అతడు చెప్పిన కారణాలు బిగ్‌బాస్‌కి నచ్చలేదు. అది అయిపోయిన తర్వాత శివాజీ.. దామిని, గౌతమ్ కృష్ణతో మాట్లాడాడు. తర్వాత యాక్టివిటీ రూంలోకి వెళ్లిన ప్రియాంక జైన్.. పల్లవి ప్రశాంత్, రతికని నామినేట్ చేసింది. తనతో వాళ్లిద్దరూ పెద్దగా కలవకపోవడం వల్లే నామినేట్ చేశానని కారణం చెప్పింది. దీనికి ప్రశాంత్, రతిక ఇద్దరూ ఒప్పుకోలేదు. సరికదా ఈ విషయమై ప్రియాంకతో యాక్టివిటీ ఏరియా నుంచి బయటకొచ్చిన తర్వాత డిస్కషన్ పెట్టారు. అలా సోమవారం ఎపిసోడ్ ఎండ్ పూర్తయింది. -
ప్రియాంక జైన్(ఐదో స్థానం)
పేదింట పుట్టిన ప్రియాంక జైన్ స్వయంకృషితో పైకి ఎదిగిన అమ్మాయి. బెంగళూరులో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈ బ్యూటీ మొదట సినిమాలు చేసింది. 2015లో తమిళంలో రంగి తరంగ చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ మరుసటి ఏడాది గోలిసోడా మూవీతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది. 2018లో చల్తే చల్తే సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. కానీ సినిమాలు తనకు పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో బుల్లితెరపై తన లక్ పరీక్షించుకుంది. తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ సీరియల్ స్టార్‌గా వెలుగు వెలుగుతోంది. మౌనరాగంలో తనతో పాటు నటించిన శివకుమార్‌తో ప్రేమలో ఉందీ బ్యూటీ. ఇటీవలే ఆమె నటించిన 'జానకి కలగనలేదు' సీరియల్‌కు శుభం కార్డు పడటంతో బిగ్‌బాస్ 7లో అడుగుపెట్టింది. ఎప్పుడూ చలాకీగా కనిపించే ప్రియాంక ఇక్కడ కూడా తన చరిష్మా చూపిస్తుందా? లేదంటే వెనకబడిపోతుందా? అనేది చూడాలి.. -
'బిగ్‌బాస్ 7' హౌసులోకి వచ్చిన కంటెస్టెంట్స్ వీళ్లే
తెలుగు రియాలిటీ షో పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే పేరు 'బిగ్‌బాస్'. ఇప్పటివరకు ఆరు సీజన్లు పూర్తి కాగా, తాజాగా ఆదివారం ఏడో సీజన్ అట్టహాసంగా మొదలైంది. కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్‌గా వచ్చారు. తనదైన మార్క్ చమత్కారాలతో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌ని ఎంటర్టైనింగ్గా నడిపించారు. స్టార్ మాలో ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి జరిగిన ఈ షోకి ఎవరెవరు వచ్చారు? లాంచ్ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇకపోతే 'తార్ మార్ తక్కర్ మార్' సాంగ్‌తో హౌస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున.. ఈ సీజన్ అంతా కూడా ఎవరి ఊహకు అందని విధంగా ఉల్టా పల్టాగా సాగబోతుందని చెప్పి ఆశ్చర్యపరిచారు. ఇక హౌసులోకి తొలి కంటెస్టెంటుగా 'జానకి కలగనలేదు' సీరియల్ నటి ప్రియాంక జైన్ హౌసులోకి అడుగుపెట్టింది. తొలి కంటెస్టెంట్ ప్రియాంక జైన్ బిగ్ బాస్ 7వ సీజన్లో తొలి కంటెస్టెంట్‌గా 'జానకి కలగనలేదు' సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ ఎంట్రీ ఇచ్చింది. తప్పకుండా ఈసారి గెలిచే.. హౌస్ నుంచి బయటకు వెళ్తానని శపథం చేసింది. ఈమె స్వతహాగా యూట్యూబర్ కావడంతో స్వయంగా బిగ్ బాస్ హౌస్ అంతా తిరిగి తిరిగి చూపించింది. అయితే ఈసారి హౌసులో మూడు బెడ్ రూమ్స్ ఉన్నాయి. ఫర్నిచర్, హౌసులో ఉండే అర్హత కూడా మీరే సంపాదించుకోవాలి అని నాగార్జున ప్రియాంకతో చెప్పుకొచ్చారు. ఎవరీ ప్రియాంక? పేదింట పుట్టిన ప్రియాంక జైన్ స్వయంకృషితో పైకి ఎదిగిన అమ్మాయి. బెంగళూరులో చదువు పూర్తి చేసిన ఈ బ్యూటీ మొదట సినిమాలు చేసింది. 2015లో తమిళంలో రంగి తరంగ చిత్రంతో అరంగేట్రం చేసింది. ఆ మరుసటి ఏడాది గోలిసోడా మూవీతో కన్నడలో ఎంట్రీ ఇచ్చింది. 2018లో చల్తే చల్తే సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. కానీ సినిమాలు తనకు పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో బుల్లితెరపై తన లక్ పరీక్షించుకుంది. తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ సీరియల్ స్టార్‌గా వెలుగు వెలుగుతోంది. మౌనరాగంలో తనతో పాటు నటించిన శివకుమార్‌తో ప్రేమలో ఉందీ బ్యూటీ. ప్రస్తుతం తను నటిస్తున్న ఓ సీరియల్‌కు శుభం కార్డు పడటంతో బిగ్‌బాస్ 7లో అడుగుపెట్టింది. మరి ప్రియాంక ఇక్కడ కూడా ఓ వెలుగు వెలుగుతుందా? లేదంటే వెనకబడిపోతుందా? అనేది చూడాలి.. ఫస్ట్ టాస్క్ ఇచ్చేసిన నాగ్ హాలోగ్రామ్ ద్వారా హౌసు లోపలికి వెళ్లిన నాగార్జున.. ప్రియాంకని యాక్టివిటీ రూమ్ దగ్గరకు రమ్మని చెప్పిన హౌస్ట్ నాగార్జున. వీకెండ్ మాత్రమే కాదు ఇకపై ప్రతి క్షణం హౌసులో ఎక్కడైనా ఎప్పుడైనా కనిపిస్తానని చెప్పారు. అలానే ఓ సూట్ కేసు చూపించి, ఎవరికీ కనిపించకుండా దాన్ని దాచేయమని నాగ్.. ప్రియాంకతో చెప్పారు. ఒకవేళ ఎవరికైనా అది దొరికితే అందులో ఉన్న పవర్ వాళ్లకు దక్కుతుందని నాగ్ చెప్పారు. దీంతో జైలు వాష్ రూమ్ లోని కమోడ్ వెనక ప్రియాంక ఆ సూట్ కేసుని దాచిపెట్టింది. రెండో కంటెస్టెంట్‌గా హీరో శివాజీ బిగ్ బాస్ హౌసులోకి రెండో కంటెస్టెంట్ గా ప్రముఖ హీరో శివాజీ ప్రవేశించారు. పలు తెలుగు సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. చాలారోజుల నుంచి సినిమాల్లో నటించట్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌసులోకి రావడం ఆసక్తికరంగా మారింది. ఎవరీ శివాజీ? బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరించే స్థాయి నుంచి సినిమా హీరోగా మారాడు శివాజీ. హీరో ఫ్రెండ్ పాత్రలు చేసే స్థాయి నుంచి హీరో రేంజ్‌కు ఎదిగాడు. అతడు నటించిన తొలి సినిమా సీతారాముల కళ్యాణం చూతము రారండీ. కానీ ఫస్ట్ రిలీజైంది మాత్రం మాస్టర్. ఈ సినిమాకుగానూ అతడు రూ.15 వేలు అందుకున్నాడు. అందరు కుర్రాళ్లలాగే ఆ డబ్బుతో అమ్మకు బంగారం కొనిచ్చాడు శివాజి. మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, అదిరిందయ్యా చంద్ర, టాటా బిర్లా మధ్యలో లైలా, సత్యభామ, మా ఆయన చంటిపిల్లాడు.. ఇలా ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. నితన్కు జయం, దిల్, సంబరం సినిమాల్లో వాయిస్ ఓవర్ ఇచ్చాడు. 2018లో వచ్చిన గ్యాంగ్స్టర్స్ అనే వెబ్ సిరీస్‌లో చివరిసారిగా కనిపించాడు. రాజకీయాల్లో ప్రవేశించాక సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు. ఇన్నాళ్లకు బిగ్‌బాస్‌తో అలరించేందుకు రెడీ అయ్యాడు. అమ్మ గుర్తొచ్చి ఎమోషనల్ నటుడిగా తన తొలి చెక్ నాగార్జున చేతుల మీదుగా తీసుకున్నానని శివాజీ అప్పటి రోజులని గుర్తుచేసుకున్నారు. అలానే నాగ్ సినిమా వచ్చిన ప్రతిసారి గ్లామర్ విషయంలో తనకు తిట్లు పడతుంటాయని అన్నారు. ఇకపోతే కోడిపిల్లల్ని పెంచి, సంక్రాంతికి వాటిని అమ్మి తమని పోషించేదని శివాజీ గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమెకు గోల్డ్ చైన్ కొనిచ్చాని శివాజీ చెప్పుకొచ్చాడు. మూడో కంటెస్టెంట్‌గా సింగర్ దామిని తెలుగులో పలు సినిమాల్లో పాటలు పాడి గాయనిగా గుర్తింపు తెచ్చుకున్న దామిని.. మూడో కంటెస్టెంట్ గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చింది. బ్లాస్ట్ బేబీ పాటతో ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఎవరీ దామిని? పచ్చబొట్టేసిన.. పిల్లగాడా నీతో.. పాటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది దామిని. ఈమె పుట్టి పెరిగింది రాజమండ్రిలో అయినా తర్వాతి కాలంలో తన కుటుంబం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయింది. దామిని సోదరి మౌనిమ సైతం సింగర్‌గా రాణిస్తోంది. ఈమె బాహుబలి: ద కన్‌క్లూజన్‌లో పాటలు ఆలపించింది. కాగా దామిని.. 2011లో పాడుతా తీయగా ప్రోగ్రామ్‌లో రెండో స్థానంలో నిలిచింది. తన గాత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమెకు సినిమాలో పాడే అవకాశాలు వచ్చాయి. అయితే సినిమా పాటలే కాకుండా సొంతంగా ఆల్బమ్స్ కూడా చేస్తోంది దామిని. స్టేజీ షోల ద్వారా సైతం తన గాత్రంతో సంగీతప్రియులను ఉర్రూతలూగిస్తోంది. నాలుగో కంటెస్టెంట్‌గా ప్రిన్స్ యావర్ బిగ్ బాస్ హౌసులోకి నాలుగో కంటెస్టెంట్‌గా మోడల్ ప్రిన్స్ యావర్ ఎంట్రీ ఇచ్చాడు. 'బ్యాడ్ బాయ్' పాటకు స్టెప్పులేస్తూ ఆకట్టుకున్నాడు. ఎవరీ ప్రిన్స్ యావర్? ఇతడి బాడీ చూస్తే మీకీపాటికే అర్థమైపోయుంటుంది మోడల్ అని! ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఇతడు మోడలింగ్‌లో ఇప్పటికే సత్తా చాటాడు. కానీ తెలుగువారికి మాత్రం పెద్దగా పరిచయం లేడు. ఆ మధ్య తెలుగులో ఓ సీరియల్లో నటించినట్లు తెలుస్తోంది. ఏదైనా ఉద్యోగం చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది. ఇంత మంచి అవకాశాన్ని వదులుకునేందుకు ఎవరు మాత్రం ఇఇష్టపడతారు. అందుకే వెంటనే ఓకే చేశాడు. ఇప్పుడిప్పుడే తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఐదో కంటెస్టెంట్‌గా నటి శుభశ్రీ బిగ్ బాస్ హౌసులోకి ఐదో కంటెస్టెంట్‌గా యూట్యూబర్ శుభశ్రీ ప్రవేశించింది. ట్రెండింగ్ సాంగ్ 'సమ్మోహనుడా' స్టెప్పులేసి, గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎవరీ శుభశ్రీ? శుభశ్రీ రాయగురు ప్రొఫెషనల్‌గా లాయర్.. కానీ సినిమాలు చేస్తుంది. తెలుగు రాదు, కానీ తెలివి మాత్రం చాలా ఉందంటోంది శుభశ్రీ. ఒడిశాలో పుట్టిపెరిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది. ఐదుగురికి ఫస్ట్ టాస్క్ పెట్టిన నాగ్ తొలి కంటెస్టెంట్ ప్రియాంకకు ఇచ్చిన సూట్ కేసులో ఉన్న క్యాష్ తీసుకుని హౌసు నుంచి వెళ్లిపోమని ఆమెకు నాగ్ ఆఫర్ ఇచ్చారు. కానీ ఆమె నో చెప్పి క్యాన్సిల్ చేసుకుంది. మిగతా నలుగురు కంటెస్టెంట్స్ కూడా ఆ సూట్ కేసుని తీసుకుని బయటకెళ్లిపోవడానికి ససేమిరా అన్నారు. తొలుత రూ.20 లక్షలు, ఆ తర్వాత రూ.25 లక్షలు, అనంతరం రూ.30 లక్షలు అని హోస్ట్ నాగ్ ఆఫర్ చేసినా సరే అందరూ నో అంటే నో అని చెప్పేశారు. ఆరో కంటెస్టెంట్‌గా షకీలా బిగ్ బాస్ హౌసులోకి ఆరో కంటెస్టెంట్‌గా నటి షకీలా ఎంట్రీ ఇచ్చింది. బోల్డ్ క్యారెక్టర్స్ కి పెట్టింది పేరు అయినా ఈమె తన గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ఒకప్పుడు షకీలా అని ఇప్పుడు షకీ అమ్మ అని చెప్పుకొచ్చింది. అలానే ఈమె చూసుకుంటున్న ఇద్దరు ట్రాన్స్‌జెండర్స్‌ని(తంగం & షాషా) నాగ్ స్టేజీపైకి పిలిచారు. ఎవరీ షకీలా? బోల్డ్ క్యారెక్టర్లకు పెట్టింది పేరు షకీల. వెండితెరపై బోల్డ్‌గా కనిపించే ఆమె నిజ జీవితంలోనూ అలాగే ఉంటారనుకుంటే పొరపాటే! రియల్ లైఫ్‌లో చాలా సాఫ్ట్‌గా కనిపించే ఆమె 18 ఏళ్లకే నటించడం మొదలుపెట్టింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించిన ఆమె గతంలోనూ బిగ్‌బాస్ షోలో పాల్గొంది. ఏడో కంటెస్టెంట్‌గా కొరియోగ్రాఫర్ ఆట సందీప్ బిగ్ బాస్ హౌసులోకి ఏడో కంటెస్టెంట్‌గా కొరియోగ్రాఫర్ ఆట సందీప్ ఎంట్రీ ఇచ్చారు. 'దళపతి' పాటకు స్టెప్పులేసి తన గ్రాండ్ ఎంట్రీని చాటుకున్నారు. ఇకపోతే ఈ మధ్య 'నీతోనే డ్యాన్స్' షోలో సందీప్ విజేతగా నిలవడం విశేషం. ఎవరీ సందీప్? టాలీవుడ్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ పేరు తెలియనివారు ఉండరు. కొరియోగ్రాఫర్, డ్యాన్సర్‌గా ఈయన చాలామందికి సుపరిచితం. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఆట' ఫస్ట్ సీజన్లో విజేతగా నిలిచి ఫేమ్ సంపాదించాడు. అప్పటినుంచి ఈయన పేరు ఆట సందీప్‌గా స్థిరపడిపోయింది. ఆయన భార్య జ్యోతిరాజ్ కూడా డ్యాన్సరే! అయితే ఆట సందీప్‌కు తాను చెప్పింది తప్పితే ఎదుటివాళ్లు చెప్పేది వినడానికి ఇష్టపడడు, అసలు వినిపించుకోడు. ఇటీవలే అతడు తన భార్యతో కలిసి నీతోనే డ్యాన్స్ కప్ గెలిచాడు. అయితే ఈ షో జరిగినన్ని రోజులు గేమ్ అమర్ దీప్ ఫ్యాన్స్ వర్సెస్ ఆట సందీప్ ఫ్యాన్స్ అన్నట్లుగా నడిచింది. మరి బిగ్‌బాస్‌లోనూ వీరి మధ్య వార్ జరుగుతుందా? ఆట సందీప్ తన కోపాన్ని నిగ్రహించుకుని ఎక్కువ వారాలు కొనసాగుతాడా? అన్నది చూడాలి! ఎనిమిదో కంటెస్టెంట్‌గా నటి శోభాశెట్టి బిగ్ బాస్ హౌసులోకి ఎనిమిదో కంటెస్టెంట్‌గా కార్తీకదీపం ఫేమ్ మోనిత అలియాస్ శోభాశెట్టి ఎంట్రీ ఇచ్చింది. జిమ్మిక్కి పొన్ను పాటకి మంచి స్టెప్పులేసి ఆకట్టుకుంది. అయితే శోభాశెట్టితో మాట్లాడిన హోస్ట్ నాగార్జున.. హౌసులో ఎవరైనా సరే బ్యూటీఫుల్ అని చెబితే శోభాకు వీకెండ్ లో పనిష్మెంట్ ఇస్తానని చెప్పారు. ఎవరీ శోభాశెట్టి? శోభా శెట్టి అంటే గుర్తుపడతారో లేదో కానీ కార్తీకదీపం మోనిత అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. డాక్టర్‌బాబును దక్కించుకునేందుకు ఎన్నో కుట్రలు పన్నిన అందమైన విలనే మోనిత అలియాస్ శోభా శెట్టి. ఈమె స్వస్థలం కర్ణాటక అయినా అచ్చ తెలుగింటి అమ్మాయిగా సీరియల్లో నటించి విశేష అభిమానులను దక్కించుకుంది. ఇంత పాపులారిటీ ఉన్న చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడింది. ఇంటి నుంచి స్కూలుకు వెళ్లాలంటే కూడా కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేదట! ఈ క్రమంలో తన చెప్పులు తెగిపోతే కుట్టించుకోవడానికి కూడా డబ్బుల్లేక సేఫ్టీ పిన్ సాయంతో దాన్ని నెట్టుకొచ్చేదట. కొన్నిసార్లయితే కాళ్లకు చెప్పులు లేకుండానే స్కూలుకు నడిచి వెళ్లింది. నటనపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కన్నడలో అంజనీపుత్ర సినిమాలో చిన్న పాత్రలో నటించింది. తెలుగు సీరియల్లో మోనిత పాత్రతో లక్షలాది మంది ప్రేక్షకులకు చేరువైంది. మరి బిగ్‌బాస్ షోతో వారి మనసులు కూడా దోచుకుంటుందేమో చూడాలి! తొమ్మిదో కంటెస్టెంట్‌గా టేస్టీ తేజ ఫుడ్ వీడియోలతో పాపులర్ అయిన టేస్టీ తేజ.. బిగ్ బాస్ హౌసులోకి తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఫుడ్ వ్లాగర్ టేస్టీ తేజ వచ్చాడు. తన గురించి చెబుతూ ఫన్ క్రియేట్ చేశాడు. ఈసారి హౌసులో ఇతడు మంచి కామెడీ జనరేట్ చేస్తాడని ఏవీ చూస్తేనే అర్థమైపోయింది. ఇకపోతే టేస్టీ తేజ.. థర్మల్ ఇంజినీరింగ్‌లో ఎమ్.టెక్ చేశాడు. ఎవరీ టేస్టీ తేజ? టేస్టీ తేజ.. పేరుకు తగ్గట్లే ఉంటుంది అతడి వ్యవహారం. యూట్యూబ్‌లో ఎప్పుడు చూసినా ఫుడ్ వీడియోలు చేస్తూ ఉంటాడు. తరచూ సెలబ్రిటీలను కలుస్తూ ఉంటాడు. సినిమా వాళ్లను కలుస్తాడు అంటే ఏదైనా ఇంటర్వ్యూలు చేస్తాడో, రీల్స్ చేస్తాడో అనుకునేరు... తనదైన స్టైల్లో సెలబ్రిటీలతో కలిసి మంచి విందు భోజనం చేస్తూ కబుర్లాడతాడు. పనిలో పనిగా భోజనం చేస్తూనే సినిమా ప్రమోషన్స్ చేస్తాడు. మొదట్లో జబర్దస్త్ షోలోనూ మెరిసిన ఇతడు ప్రస్తుతం మాత్రం యూట్యూబ్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. బిగ్‌బాస్ షోతో జనాలకు మరింత దగ్గరవ్వాలనుకుంటున్న ఇతడు ఏడో సీజన్లో పాల్గొన్నాడు. మరి అతడి కల ఎంతమేరకు నెరవేరుతుందో చూడాలి! పదో కంటెస్టెంట్‌గా నటి రతిక బిగ్ బాస్ హౌసులోకి యువ నటి రతిక.. పదో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసిన ఈమె.. తనకు గుర్తింపు రాలేదని అందుకే హౌసులోకి వచ్చానని చెప్పుకొచ్చింది. ఎవరీ రతిక? రతిక రోజ్ అచ్చ తెలుగమ్మాయి. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీపరిశ్రమలో అడుగుపెట్టింది. ముందుగా మోడలింగ్ చేసిన ఈ బ్యూటీ నటనపై ఆసక్తితో సినీపరిశ్రమలో అడుగుపెట్టింది. అడపాదడపా సినిమాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ పాత్రల్లో నటించలేదు. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది మూవీలో ఓ పాత్రలో నటించింది. నేను స్టూడెంట్ సర్ చిత్రంలో పోలీసాఫీసర్‌గా మెప్పించింది. తనకంటూ ఫేమ్ రావాలని బిగ్‌బాస్ 7లో అడుగుపెట్టి అందరినీ సర్ప్రైజ్ చేసింది. మరి ఈ అమ్మడు ఈ షో ద్వారా ఏ రేంజ్లో క్లిక్ అవుతుందో చూడాలి! స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ 'ఖుషి' ప్రమోషన్ లో భాగంగా హీరో విజయ్ దేవరకొండ.. బిగ్ బాస్ హౌసులోకి స్పెషల్ ఎంట్రీ ఇచ్చాడు. హోస్ట్ నాగ్ తో ఫన్ జనరేట్ చేశాడు. ఇక హీరోయిన్ సమంత ఎక్కడా అని నాగ్, విజయ్ దేవరకొండని అడగ్గా ఆమె అమెరికాలో ఉందని, త్వరలో తిరిగొస్తుందని చెప్పాడు. అలానే సీజన్ ప్రారంభమైన తొలిరోజే ఓ స్టార్.. హౌసులోకి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఫర్నిచర్ టాస్క్.. రూమ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇకపోతే హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన తొలి పదిమంది కంటెస్టెంట్స్ మధ్య.. గెస్టుగా వచ్చిన విజయ్ దేవరకొండ పర్యవేక్షణలో ఓ టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా 7 నిమిషాల్లో స్టోర్ రూమ్ నుంచి ఫర్నిచర్.. బయట మార్క్ చేసిన ప్లేసులో పెడితే అవన్నీ కంటెస్టెంట్స్ కి చెందుతాయని నాగార్జున అన్నారు. అనంతరం వీళ్లలో బాగా కష్టపడిన శుభశ్రీకి డీలక్స్ రూమ్, ఆట సందీప్ కి స్టాండర్డ్ రూమ్ ఇచ్చారు. పదకొండో కంటెస్టెంట్‌గా హీరో గౌతమ్ బిగ్ బాస్ హౌసులోకి పదకొండో కంటెస్టెంట్‌గా డాక్టర్ గౌతమ్ కృష్ణ ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో 'ఆకాశ వీధుల్లో' అనే సినిమాలో హీరోగా నటించాడు. ఎంట్రీతోనే చేతికి బేడీలు వేసి, ఓ టాస్క్ కూడా ఇతడికి నాగార్జున ఇచ్చాడు. ఎవరీ గౌతమ్? డాక్టర్ గౌతమ్ కృష్ణ బిగ్‌బాస్ షోలో 11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్‌కు చిన్నప్పటి నుంచే రైటర్, డైరెక్టర్ కావాలని ఉండేదట. అయితే తన పేరెంట్స్‌కు మాత్రం సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒకరకమైన భయం. దీంతో వారికోసం చదువుపై దృష్టిపెట్టాడు. అలా డాక్టరయ్యాడు. అతడికి ఉన్న ఆసక్తి మేరకు హీరోగానూ మారాడు. ఆకాశవీధుల్లో సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. తాజాగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన అతడు డాక్టర్‌ను కాబట్టి అందరికీ పనికొస్తాను, తనను నామినేట్ చేయొద్దు అంటున్నాడు. మరి ఈ డాక్టర్ బాబు హౌస్‌లో ఎన్నాళ్లు ఉంటాడో చూడాలి! పన్నెండో కంటెస్టెంట్‌గా కిరణ్ రాథోడ్ పలు దక్షిణాది సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ రాథోడ్.. పన్నెండో కంటెస్టెంట్ గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చింది. తనకు బాగా పేరు తెచ్చిన 'జెమిని' సినిమాలోని పాటకు స్టెప్పులేసి అదరగొట్టేసింది. ఎవరీ కిరణ్ రాథోడ్? కిరణ్ రాథోడ్.. ఈమె బాలీవుడ్ నటి రవీనా టండన్ కజిన్ కూడా! హిందీలో 'యాది' సినిమాతో ప్రయాణం మొదలుపెట్టింది. ఆ మరుసటి ఏడాది నువ్వులేక నేను లేను చిత్రంతో తెలుగులో, జెమిని సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీకి రజనీకాంత్ బాబా సినిమాలో అవకాశం వచ్చింది. కానీ అప్పటికే జెమిని మూవీకి సంతకం చేయడంతో ఈ ఛాన్స్ వదిలేసుకుంది. 2016లో భాజా భజంత్రీలు(డబ్బింగ్) సినిమాలో చివరిసారిగా కనిపించిన ఈమె ప్రస్తుతం రీఎంట్రీకి రెడీ అయింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లియో సినిమాలో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఇంతలో కిరణ్ రాథోడ్ బిగ్‌బాస్ 7లో అడుగుపెట్టింది. మరి తన రీఎంట్రీకి బిగ్‌బాస్ 7 ఎలా ఉపయోగపడుతుందో చూడాలి! పదమూడో కంటెస్టెంట్‌గా పల్లవి ప్రశాంత్ గత కొన్నిరోజుల నుంచి అనుకున్నట్లుగానే యువరైతు, యూట్యూబర్ పల్లవి ప్రశాంత్.. బిగ్ బాస్ హౌసులోకి పదమూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. తన గురించి ఎమోషనల్ అయ్యాడు. ఎవరీ పల్లవి ప్రశాంత్? వ్యవసాయం అంటేనే ముఖం చాటేస్తున్న ఈ రోజుల్లో ఓ యువకుడు మాత్రం దాన్నే నమ్ముకున్నాడు. ఎంత కష్టమొచ్చినా, నష్టమొచ్చినా వ్యవసాయాన్ని వదిలిపెట్టేది లేదని భీష్మించుకుని కూర్చున్నాడు. అతడే యువ రైతు పల్లవి ప్రశాంత్.. తను చేసే ప్రతి పనిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. రైతు బిడ్డను అన్నా.. అంటూ ప్రతిసారి ఎమోషనల్ వీడియోలు చేస్తుంటాడు పల్లవి ప్రశాంత్. బిగ్‌బాస్‌కు వెళ్లాలనేది తన కల అని నిత్యం చెప్తూ ఉండే ఇతడు ఎట్టకేలకు ఆ కోరిక నెరవేర్చుకున్నాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టాడు. షోలో పార్టిసిపేట్ చేయాలన్న కల నెరవేర్చుకున్నాడు, అక్కడివరకు బానే ఉంది.. కానీ హౌస్‌లో కూడా సింపథీ ప్లాన్ వర్కవుట్ చేయాలనుకుంటే మాత్రం కష్టమే.. మరి ఇతడి గేమ్ ఎలా ఉండబోతుందో రానున్న రోజుల్లో తేలనుంది. పద్నాలుగో కంటెస్టెంట్‌గా అమర్దీప్ బిగ్ బాస్ హౌసులోకి పద్నాలుగో కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు అమర్ దీప్ ఎంట్రీ ఇచ్చాడు. 'పూనకాలు లోడింగ్' పాటకు సూపర్ స్టెప్పులేసి ఆకట్టుకున్నాడు. ఎవరీ అమర్దీప్? తెలుగబ్బాయి అమర్దీప్. విదేశాల్లో చదువుకున్న ఇతడికి సినిమాలపై ఆసక్తి ఉండేది. మొదట పరిణయం అనే షార్ట్ ఫిలిం చేయగా అది బాగా క్లిక్ అయింది. దీంతో ఆఫర్స్ వచ్చాయి. యూట్యూబ్‌లో వెబ్ సిరీస్ చేశాడు. అక్కడి నుంచి సినిమాలు, సీరియల్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ వర్క్ చేశాడు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేశాడు. జనాల్లో పాపులారిటీ పెరగడంతో సీరియల్ హీరోగా మారాడు. అప్పుడప్పుడూ షోలలోనూ కనిపిస్తూ సందడి చేస్తున్నాడు. రాజుగారి కిడ్నాప్, అభిలాష, ఐరావతం, ప్రేమదేశం సినిమాలు కూడా చేశాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరాడు అమర్దీప్. అయితే బిగ్‌బాస్ ప్రేక్షకులకు మాత్రం ఐదో సీజన్లోనే ఇతడు దగ్గరయ్యాడు. అప్పుడు మానస్‌కు సపోర్ట్ చేసేందుకు బిగ్‌బాస్ స్టేజీపైకి వచ్చాడు అమర్. తన మాటలతో, ప్రవర్తనతో అందరినీ బుట్టలో వేసుకున్నాడు. ఇతడు నెక్స్ట్ సీజన్లో రావడం ఖాయం అనుకున్నారంతా! కానీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని ఇప్పుడు షోలో అడుగుపెట్టాడు బుల్లితెర హీరో. గతేడాది నటి తేజస్వినిని పెళ్లి చేసుకున్న అమర్ భార్యతో కలిసి షోలో పాల్గొంటాడునుకున్నారు. కానీ చివరకు ఒక్కడే వచ్చేశాడు. ఇక పదిహేనో కంటెస్టెంట్ అనే నాగ్ చెప్పేసరికి హీరో నవీన్ పొలిశెట్టి వచ్చాడు. అతడిని హౌసులోకి పంపిన తర్వాత గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్‌ని ముగించేశారు. సోమవారం ఎపిసోడ్ లో హౌస్‌మేట్స్‌తో అతడు చేసే ఎంటర్ టైన్మెంట్ చూపించనున్నారు. ఇప్పటివరకు 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే వచ్చారు. దాదాపు సోషల్ మీడియాలో వినిపించిన వాళ్లే హౌసులోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే గత సీజన్ 20 మంది.. లాంచ్ ఎపిసోడ్లో వచ్చారు. మరి ఈసారి ఆ నంబర్ తగ్గించారా? లేకపోతే మిగిలిన వాళ్లని వారం వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌసులోకి పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.